Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

పాణిగ్రహణం

Showing only the posts of SivaSai: 341 of 820 posts. Show all posts

Part - 117


గదిలోకి వచ్చిన విక్రమ్ నిలబడిపోతాడు. అప్పుడు దాకా... ఉన్న చిరాకు పోయి ముఖంలో చిరునవ్వు వస్తుంది.

భార్య గారి బంగిమ చూసి గుండె పైన చేయి వేసి రబ్ చేసుకుంటూ చంపేస్తున్నావే బాబు.. రోజు రోజుకి నీ పిచ్చిలో పడిపోతున్నాను. 

లాప్టాప్ బ్యాగ్ ని పక్కన పెట్టి కోట్ రిమూవ్ చేసి మెల్లిగా వెనకాల వెళ్లి చూస్తూ ఉంటాడు. మెత్తటి పలచటి చీరలో.. ఒక కాలు కుర్చీ మీద పెట్టి ఒక కాలు నేల మీద పెట్టి జుట్టు అంతా ముందుకు వేసుకుని టవల్తో తుడుస్తూఉంటుంది.

పైట మొత్తం ముందుకు పడి అందమైన నెలవంక కనువిందు చేస్తూఉంటుంది. బంగారు గనులు నింపుకున్న ఎద సంపదని పట్టి ఉంచిన రవిక .. ఆ తడికి కొద్దికొద్దిగా అక్కడక్కడ తడిచి విక్రమ్ ని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది.

ఇక నేను ఆగలేను అన్నట్టుగా మెల్లిగా చేతులు రెండు నెలవంక పైకి చేర్చి గట్టిగా పట్టుకుంటాడు. అవని ఉలిక్కిపడి అరవబోతుంటే నోటిమీద చెయ్యి వేస్తాడు.

జుట్టుని  వెనక్కి వేసి భర్త వైపు చూసి నోటిమీద చెయ్యి తీయండి అన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తుంది. తీస్తాను కానీ అరవకు అని మెల్లిగా చేయి తీస్తాడు.

చెయ్యి తీసి రెండు చేతులతో గట్టిగా వెనక నుండి హత్తుకుని ఏమిటి మేడం గారు ఇంటికి వచ్చేటప్పటికి ఇలా టెంప్ట్ చేసే పొజిషన్లో ఉన్నారు అని మెడ పైన చిన్న పంటిగాటు ఇచ్చి లిక్ చేస్తూఉంటాడు.

విక్రమ్ పనులకి ఆ మాయలో పడిపోతు... విక్రమ్ చేతులు మీద చేతులు వేసి.. మెడని వెనక్కి  భుజం పైకి వాల్చి ఎంతసేపయింది వచ్చి అంటుంది.

జస్ట్ ఇప్పుడే ఎవరూ లేరేంటి ..  షాపింగ్ కి వెళ్లారు అంటుంది. మరి నువ్వు వెళ్లలేదే.. మీరు వచ్చే టైం అయింది కదా...

అందుకని ఎవరూ లేరు అని ఇలాంటి రొమాంటిక్ సీన్ క్రియేట్ చేసావా చేతులను మెల్లిగా పైకి తీసుకువెళుతూ అడుగుతాడు.

వెంటనే చేతులను గట్టిగా పట్టుకొని మీరు ఏదేదో ఊహించుకోకండి. కిచెన్లో పిండి మీద పడితే చిరాకుగా అనిపించి హెడ్ బాత్ చేశాను.

ఈ లోపు మీరు వచ్చారు అంతే అని భర్త వైపుకు తిరిగి మెడ చుట్టూ దండలాగా చేతులు వేసి ఏమిటి రాగానే మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు ఏమిటి సంగతి.

నిజం చెప్పనా... వచ్చేటప్పటికి చాలా చిరాకుగా ఉంది. కానీ నిన్నే ఇలా చూడగానే నా మూడ్ మొత్తం మారిపోయింది.

భార్య అలక ను భర్త బుజ్జగించడంలోనూ..  భర్త చిరాకుని భార్య కౌగిలిలో తీరిపోతుంది కదా...  అలాగే నా చిరాకు కూడా నిన్ను చూడగానే అలా గాలిలోకి వెళ్ళిపోతుంది అంటూ ఆ పెదవుల పైన చిన్నగా కిస్ చేస్తాడు.

అబ్బో మా వారు రొమాంటిక్ మూడ్లోనే కాదు మంచి కవిత్వం కూడా చెబుతున్నారే అని మీసాలు పట్టుకుని లాగుతుంది.

ఇదిగో ఇప్పుడు ఇలాంటి పనులు చేసావు అనుకో.
  నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాను. తర్వాత నా వల్ల కాదు.

అందరూ వచ్చే టైం అయ్యింది అన్నా సరే నేను వదలను అర్థమయిందా... వదలమని నేనేమీ అనలేదే అంటుంది.  ఓహో మేడం గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్నమాట..

అయితే నేనెందుకు ఆగుతాను అని మంచం దగ్గరికి తీసుకువెళ్తాడు.  నేను ఏదో సరదాగా అన్నాను. ఇప్పుడు నా వల్ల కాదు అని జారిపోబోతుంది.

నీకు ఇంకా అంత ఛాన్స్ లేదు బంగారం. ఒక్కసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత  దానికి పూర్తిగా న్యాయం చేయాల్సిందే.. లేకపోతే నాకు మాట వచ్చేయదు అని అల్లుకుపోతాడు.

నో..  నో..  అంటూనే విక్రమ్ ప్రేమకి కరిగిపోతూ..  ప్రేమగా తనని తాను అర్పించుకుంటూ ఒకరిలో ఒకరు కరిగిపోతారు.

సరససృంగార సయ్యాటలాడి ... అలసి సేదతీరుతున్న దేవేరిని చూసి నవ్వుకుంటూ నుదుటన ముద్దు పెట్టి బంగారం అంటాడు.

చెప్పండి అంటే..  కలిసి జలకాలాడదామా అంటాడు. కళ్ళు మెల్లిగా పైకెత్తి ఇప్పుడు వరకు జరిగింది చాలదా... మళ్ళీ ఇప్పుడు ఇంకొక రొమాంటిక్ సీనా అంటుంది.

నీతో ఎన్ని సీన్స్ అయినా మళ్లీ కొత్త కొత్తగానే ఉంటుంది బంగారం అని వాష్ రూమ్ లోకి తీసుకువెళ్లి... తానే స్వయంగా స్నానం చేపించి విక్రమ్ కూడా స్నానం చేసి భార్యకి దగ్గరుండి చీర కడతాడు.

ఏమైంది ఈ రోజు మీకు..  ఏం అవ్వాలి.  భార్యకి సేవ చేయాలి అంటే ఏదైనా జరగాలా ఏమిటి.
చేయాలి అనిపించింది చేశాను అంతే.

అందరూ వచ్చే టైం అయింది కదా పద అని కిందకి తీసుకువెళతాడు.  అవని కిచెన్ లోనికి వెళ్లి డిన్నర్ ప్రిపరేషన్ చూస్తూ ఉంటే...

కావలసినవి అందిస్తూ కబుర్లు చెబుతూ ఒక అందమైన సంధ్యవేళ ని  అద్భుతంగా మార్చుతాడు. మెల్లిగా ఒక్కొక్కళ్ళు ఇంటికి చేరుతూ ఉంటారు.

లేడీస్ షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చేస్తారు.  లలిత కరుణతో ఇదేమిటి వీళ్ళు ఇంకా రాలేదు.  పొద్దున్న మనకన్నా ముందే వెళ్లారు కదా...

నా కొడుకుకి ఓపిక ఎక్కువలే వదిన. అందుకే నా కోడలు అడిగింది ఏది కాదనకుండా కొంటున్నాడు.  తిప్పుతున్నాడు.

మీ అన్నయ్య ఉన్నారే... ఒక్క రోజు కూడా షాపింగ్ కి తీసుకు వెళ్లలేదు.. ఏదైనా కావాల్సింది దగ్గరుండి కొనిపెట్టింది లేదు.

నా కొడుకు లాగా ప్రేమగా చూసుకోవాలి అంటే పెట్టి పుట్టు ఉండాలే అంటుంది. ఆ మాట విన్న పార్ధు కళ్యాణ్ తో ఈ ఆడవాళ్ళకి మనం ఎన్ని చేసినా సరే ఆఫ్ట్రాల్ రా...

అదే కొడుకు ఒక చాక్లెట్ తెచ్చి ఇవ్వమను..  ఆహా నా కొడుకు కాబట్టి తెచ్చాడు. వాడంతా సూపర్ ఎవరూ ఉండరు అన్నంత డబ్బా కొట్టుకుంటారు.

ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఏమి కొనకుండా చూడకుండానే వీళ్ళకి అన్నీ అమీరాయ...  మరి ఆ మాటేదో చెల్లమ్మతో చెప్పొచ్చు కదా..

ఏరా నేనెలా ప్రశాంతంగా ఉంటే నీకు నచ్చలేదా అంటాడు.. ఏమైంది... నేను అలా చెప్పాను అనుకో ముక్కు చీదుతూ పెళ్ళానికి ఆ మాత్రం చేయలేరా..  నేను మీకు అంతా పనికి రాకుండాపోయానా అని ఏడుస్తూ....

అందులో కూడా కొడుకు గొప్పతనం చెప్పి... ఉన్న ఈ జుట్టును కూడా పీక కొడుకు చేతిలో పెడుతుంది. మనకు అవసరమా... ఊ అంటే పోయే అంటాడు.

ఆ మాటకి నవ్వుతూ అమ్మలు అందరూ అంతేనేమో... ఇది మాత్రం నిజం రా.. కొడుకు మాత్రం కృష్ణుడి లాగా అల్లరి చేస్తూ గంతులేస్తూ ఉండాలి.

అదే భర్త దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం శ్రీరామచంద్రుడి లాగా ఉండాలి అంటారు.  మనకు ఒక న్యాయం... కొడుకు కి ఒక న్యాయం. ఇది ఎక్కడి దారుణం రా ఈ ఆడవాళ్ళతో..

మరి ఏ న్యాయం కావాలి.. ఆ.. వచ్చేసిందిరా మనం ఎంత స్లోగా మాట్లాడుకున్న కొడుకు టాపిక్ వచ్చేటప్పటికి బెల్లం వాసన చీమలకు తెలిసినట్టుగా ఈ ఆడవాళ్లకు తెలిసిపోతుంది అనే స్లోగా అని... దేనికి కరుణా అంటాడు.

మీరేదో న్యాయం కావాలి.. దారుణం అని ఏవేవో పెద్దపెద్ద మాటలు అంటున్నారు కదా దాని గురించి అంటుంది.  అయ్యో వాటి మీనింగ్ కూడా నాకు తెలీదు ఏరా కళ్యాణ్.. నీకేమైనా తెలుసా....

కళ్యాణ్, రమేష్ వస్తున్న నవ్వని ఆపుకుంటూ నన్ను ఇన్వాల్వ్ చేయకండి మాస్టారు. నాకు ఏమీ తెలియదు అని కళ్యాణ్ ఎస్కైప్ అయిపోతాడు.

ఒరేయ్ నువ్వు, నీ కొడుకు కన్నా దారుణంగా ఉన్నావు రా...  నీ కొడుకు నా కొడుకుని బుక్ చేస్తే నువ్వు నన్ను బుక్ చేసేస్తున్నావు.

మేము పెళ్ళాలు వస్తుంటే పసిగట్టి సైలెంట్ అయిపోతాము. బాబు కొడుకులిద్దరూ అది పసికట్టకపోతే.. మాదా తప్పు అంటాడు.

ఎలా పసిగడతారురా.. ఆ విషయం తర్వాత చెబుతాను గాని ముందు మా చెల్లికి జవాబు చెప్పు.

అయ్యో కరుణ నిన్ను షాపింగ్ కి తీసుకువెళ్లాలి అనుకున్నాను...  ఆ విషయమే కళ్యాణ్ తో మాట్లాడుతున్నాను.

ఏరా అంటే.. అవునా అంటాడు.  ఒరేయ్ అని బిక్కమొహం వేస్తే సరే సరే అని.. అవును చెల్లమ్మ.  నీకు ఏదో డైమండ్ సెట్స్ తీసుకోవాలి అంట.

దాని గురించే..  షాప్స్ ఎక్కడ బాగుంటాయా అని అడుగుతుంటే నాకేం తెలుస్తది రా అది ఆడవాళ్ళకి అయితే బాగా తెలుస్తది అన్నాను అని కొన్ని కొడతాడు.

నిజమా అనే మెరిసే కళ్ళతో  అడిగితే...  కక్కలేక మింగలేక అవును బంగారం రేపు రెడీ అయిపో..
వెళదాము.

లలిత మాధవి మూతి తిప్పుతూ... మీరు ఉన్నారు... ఇండియాలోనే ఉండి కూడా ఎప్పుడైనా అలా తీసుకెళ్ళారా.. అన్నయ్యగారిని చూడండి అంటుంది.

పార్థు వెంటనే అదేంటి చెల్లెమ్మ...  కళ్యాణ్,  రమేష్ మీ ఇద్దరికీ ఏమి తీసుకోలేదా.. మరి నాతో ఏంటి మేము ఆల్రెడీ కొనేశాము అని చెప్పారే అని కళ్యాణ్ వైపు తిరిగి కన్ను కొడతాడు.

ఈసారి వీడు ఇరికించేసాడు కదా అని బావ వైపు  చూసి... పెళ్లాలతో ఒకేసారి  రేపు మేము ఎవ్వరం ఆఫీస్ కి వెళ్లడం లేదు.  ఓన్లీ పెళ్ళాల షాపింగ్ అని కోరసుగా అంటారు.

ఈ సౌండ్ బాగుంది అని ముగ్గురు వెళ్ళిపోతారు. మనలో మనకి యూనిటీ లేకపోతే ఈ ఆడవాళ్ళ ఆడేసుకుంటారు అని కళ్యాణ్ ఫీల్ అవుతాడు.

దీన్ని బట్టి ఏం అర్థమైందంటే మనలో మనం ఇరికించుకోకూడదు అని  అంటూ ఉండగానే రాజ్ వచ్చి పక్కన కూలబడి వాటర్ అంటాడు.

అవని వెంటనే జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. థాంక్యూ సిస్టర్ రాగానే చల్లటి జ్యూస్ ఇచ్చావు. జ్యూస్ తాగి హమ్మయ్య అనుకుంటాడు.

ఏరా మొఖం అలవాడిపోయింది. లంచ్ చేయలేదా... నీ కోడలు లంచ్ చేసే అంత టైం కూడా ఇచ్చిందా... నా నోటి దురదకి పొద్దున్నుంచి సాయంత్రం దాకా అన్ని షాపులు తిప్పి నాకు ఏమీ నచ్చలేదు అని ఇంటికి తీసుకు వచ్చింది అంటాడు.

మీ ముఖం ఏంటి నాన్న అలా వెలవెలబోతుంది. నా నోటి దూల కి రేపు మీ అమ్మ బిల్లు వేస్తుంది లే అంటాడు.  మీరేం వాగారు.

నిన్ను పొగిడాను అది మీ అమ్మకి నచ్చలేదు అని పిటింగ్ పెడతాడు.  నన్ను పొగిడితే ఎందుకు నచ్చలేదు.. కావలిస్తే వెళ్లి అడుగు...

రాజ్ బాబు నీకు అవసరమా ??
[+] 9 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

Part - 118


నన్ను పొగిడితే అమ్మకి ఇష్టమే కదా.. ఏమోరా నిన్ను పొగిడాను అని అలిగి లోపలికి వెళ్ళిపోయింది.  నీకన్నా నా కోడలే బెటర్ అంట.

అవునా ఏ విషయంలో..  ఏమో వెళ్లి కనుక్కో అని పంపిస్తాడు.  అమ్మ అమ్మ అరుచుకుంటూ గదిలోకి వెళతాడు.

అక్కడ లేడీస్ బ్యాచ్ అంతా కూర్చుని  నివి షాపింగ్ చేసినవి చూస్తూ ఉంటారు.  ఏమైందిరా అలా కాకిలాగా అరుస్తున్నావు.

ఎందుకమ్మా నామీద నీకు అంత కోపం అని మేడచుట్టూ చేతులు వేసి ఉయ్యాలఊగుతూ ఉంటాడు. ఒరేయ్ నువ్వు ఏమన్నా చంటిబిడ్డవు అనుకుంటున్నావా..  ఉయ్యాల లాగా ఊగుతున్నావు.

నువ్వు ఎందుకు నా మీద కోపంగా ఉన్నావో అది చెప్పు. నేను నీ మీద కోపంగా ఉండటం ఏంట్రా..  ఎవరు అన్నారు..  ఎవరు అంటే ఏమిటి అది నిజం కదా...

అందుకే నేను వచ్చినప్పుడు నుంచి నువ్వు నా మీద చిరాకు పడుతున్నావు.  పచ్చకామెర్లోడికి ఊరంతా పచ్చగా ఉంది అని..

నువ్వు ఆ మూడ్ లో వచ్చి నేను కోపంగా ఉన్నాను అంటే నేనేం చెప్పగలను రా అంటుంది. లేదమ్మా ఎందుకు అలిగావో చెప్పు..  నా బంగారు తల్లివి కదా..  బుజ్జివి కదా అని బ్రతిమాలుతూ ఉంటే వెనక వచ్చిన జెంట్స్ బ్యాచ్ అది చూసి అబ్బో అనుకుంటారు.

పార్ధు కళ్యాణ్ వైపు చూసి కన్నుకొట్టి ఏమీ లేదురా..  రేపొద్దున్న లేడీస్ అందర్నీ తీసుకుని జెంట్స్ అందరూ జువెలరీ షాప్ కి వెళ్తున్నాము  కదా...

అక్కడ నువ్వు నివికి ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటావా..  మీ అమ్మకు ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటావా అన్న డౌటు వచ్చింది.

నేను సింపుల్ గా ఎవరికైనా అమ్మ కన్నా పెళ్ళామే ఎక్కువ కదా... నివియే ఎక్కువ అన్నాను.  అందుకే మీ అమ్మ అలక.

ఇప్పుడు చెప్పరా ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటావో అని ఇరికించి...  అబ్బా? అనుకుంటాడు.
నివి, కరుణ ఇద్దరూ రాజ్ వైపు చూస్తారు.

ఈ షాపింగ్ ఏమీ తెలియని రాజ్ బుర్రగోక్కుంటూ మళ్లీ ఈ షాపింగ్ గొడవ ఎందుకు వచ్చింది.  ఈ రోజు నివి షాపింగ్ అయిపోయింది కదా..

వెంటనే నివి అయ్యో రాజ్ ఈరోజు ఓన్లీ చీరల షాపింగ్ మాత్రమే అయ్యింది. జువెలరీ అవ్వలేదు. అయితే నీ దగ్గర చాలా ఉంటాయి కదా..  అలాగే మమ్మీ దగ్గర కూడా ఉంటాయి కదా..

మళ్లీ కొత్తగా కొనుక్కోవడం దేనికి. కరుణ కోపంగా.. నివికి కొత్త బట్టలు ఏమీ లేక కొనుక్కుందా..  అయినా పెళ్ళాం వచ్చేటటికి తల్లి అల్లం అయిపోయినట్టుంది అని ముక్కు చీదుతుంది.

అమ్మ నువ్వు ఏదేదో కొత్త కొత్త డైలాగులు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకు.  రేపు జ్యువెలరీ షాపింగ్ ఏ కదా దగ్గరుండి నేనే సెలెక్ట్ చేసి కొంటాను. సరేనా..

సరే అని కాంప్రమైజ్ అవుతుంటే..  ఒరేయ్ మీ అమ్మకి కొనడం కాదు  ఇక్కడ టాపిక్కు. వాళ్ళిద్దరిలో ఎవరికీ ఇంట్రెస్ట్ గా ఎక్కువ పెట్టి కొంటావు అనేదే టాపిక్ అంటారు.


ప్లీజ్ నాన్న..  మీరు ఎందుకు నన్ను ఇరికించే ప్రోగ్రాం పెట్టుకున్నారు. నాకెందుకొచ్చిన గొడవ ముందు జాగ్రత్తగా చెప్పాను.

ఒక్కసారి ఆ లేడీస్ ఇద్దరిని కాంప్రమైజ్ చేసి బయటికి రా అని చెప్పి వెళ్ళిపోతాడు.  వెళుతున్న పార్ధుని చూసి కళ్యాణ్ నవ్వుకుంటూ వెళ్లి ఏరా ఎందుకు అంత దారుణంగా ఇరికించావు.

లేకపోతే నాకన్నా కొడుకే గ్రేట్ అంట..  సూపర్, కేక అని చెప్పింది కదా..  ఇప్పుడు కొడుకు తెలివి ఏ పాటిదో తెలుస్తుంది.

భోజనం చేయకపోయినా పరవాలేదు.  పొట్ట ఫుల్ గా ఉంది అంటాడు. నీలో చాలా శాడిజం ఉందిరా.. అప్పుడప్పుడు చూపించాలి రా..

లేకపోతే పెళ్ళాలకి మన విలువ తెలియదు కదా అని భుజం మీద చేయి వేసి విజిల్ వేసుకుంటూ తీసుకువెళ్తాడు.

ఇటు తల్లిని, అటు కాబోయే భార్యని కాంప్రమైజ్ చేసి నీరసంగా బయటకి వస్తాడు. నీరసంగా బయటికి వచ్చిన కొడుకుని చూసి ఏరా అప్పుడే అయిపోయిందా.

మీరు చాలా దుర్మార్గులు నాన్న అంటాడు.  దేనికో అంటూ బనానా తింటు.. తింటావా అని అడుగుతాడు. పెట్టాల్సిన మంట అంట పెట్టి తింటావా అని ఇప్పుడు అడుగుతున్నారా.

అలసిపోయి ఇంటికి వచ్చిన కొడుక్కి జ్యూస్ ఇవ్వడం మానేసి ఇంకా ఇరికించి మీరు పండగ చేసుకుంటున్నారా... అలాంటిదేమీ లేదు రా..

రేపు షాపింగ్ లో మేము ఒక్కళ్ళమే ఇరుక్కుంటే ఎలాగా అని నిన్ను ఇరికించాను అంతే అంటాడు. ఈరోజు నేను ఇరుక్కుంది చాల్లేదా..

మీ అమ్మ దృష్టిలో నువ్వు చాలా సూపర్ రా..  అందుకనే ఎలా మేనేజ్ చేస్తావో రేపు చూద్దాం అని. నాన్న అని గట్టిగా అరిస్తే...

డిన్నర్ చేద్దాం రా.. అని కొడుకుని తీసుకువెళ్లి దగ్గరుండి మరీ వడ్డిస్తాడు.  ఇరికించేది మీరే..  ప్యాంపెరింగ్ చూపించేది మీరేనా.. రేపటి నుంచి ఓదార్చేది కూడా నేనే రా సుపుత్ర.

విక్రమ్ కూడా రాజ్ పక్కన కూర్చుని ఓదార్పు యాత్రలు ఎక్కడ వరకు వచ్చాయి. ఇంకా మొదలవలేదులే.. ముందు ముందు మొదలవుతాయి అని పార్ధు అంటారు.

మీరిద్దరూ నా శ్రేయోభిలాషులు కాదు..  యమకింకరులు  అని ఆకలి మీద ఉండి గబగబా భోంచేసి గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతాడు.

వెళుతున్న రాజ్ ని చూసి నవ్వుతూ మరీ ఎక్కువ ఏడిపిస్తున్నట్టున్నారు అంకుల్. ఇప్పుడు ఇలాగుంటేనే..  రేపు గుర్తొచ్చినప్పుడు సరదాగా ఉంటుంది.

బిజినెస్ బిజినెస్ అని పరుగులు పెట్టి వాడితో చాలా మిస్ అయిపోయాను.  ఇప్పుడైనా సరదాలు తీర్చుకోకపోతే ఎలా అని పడుకోవడానికి వెళతారు.

అందరూ రెస్ట్ తీసుకోవడానికి ఎవరి గదిలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు.

సూర్యోదయం మొదలవ్వగానే నిశ్చితార్థం ఏర్పాట్లు మొదలవుతాయి. డెకరేషన్స్ స్టార్ట్ చేస్తారు.  వినయ్ నీ దగ్గరుండి చూసుకోమని విక్రమ్, భరత్ ఆఫీస్ కి వెళ్ళిపోతారు.

మిగిలిన జెంట్స్ మొత్తం లేడీస్ షాపింగ్ కి ఇరుక్కుని తీసుకుని వెళతారు.  అవని  నాకు చాలా ఉన్నాయి.  వద్దు.  ఇంటి దగ్గర ఏదైనా అవసరం ఉంటే చూసుకుంటాను అని ఆగిపోతుంది.

ఈవెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడ ఏమి సర్దాలో అన్ని చూస్తూ ఉంటారు. వినయ్ వాళ్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు.

ఇందిరా అవని అవన్నీ చూస్తూ ఉంటారు. ఇందిరా గారు కాసేపు చూసి రెస్ట్ తీసుకుంటాను అని గదిలోనికి వెళ్ళిపోతే.. అవని విక్రమ్ ఫోన్ చేశాడు అని గదిలోనికి వెళుతుంది.

ఒక లేడీ వాయిస్ గట్టిగా వినపడుతూ ఉంటే ఆ వాయిస్ వచ్చిన వైపు వినయ్.. చెవులు పెడతాడు.  ఈ గొంతు ఎక్కడో విన్నట్టు ఉందే అనుకుంటూ మెల్లిగా ఆ గొంతు వినిపించిన వైపుకి అడుగులు వేస్తాడు.

చుడీదార్ వేసుకున్న ఒక అమ్మాయి..  ఒక అబ్బాయిని వంచి మరీ గుద్దుతూ ఉంటుంది. వెనక నుండి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది.

ఈ స్ట్రక్చర్ చాలా దగ్గరగా చూసినట్టు గుర్తే...అనుకుంటు ఇంకా దగ్గరికి వెళతాడు. ఈ పూజిత తో పెట్టుకుంటే పూజకు పనికి రాకుండా అయిపోతావ్ రా ఇడియట్ అని పీకుతూ ఉంటుంది.

ఓర్నీ..  మొన్న రోడ్డు మీద కొట్టింది ఈ అమ్మాయి ఏ కదా.. హలో మిస్ ఎప్పుడు చూసినా ఎవరినో ఒకరిని కొడుతూనే ఉంటారా..

నేను ఎవరిని కొడితే నీకేంటి రా అని వెనక్కి తిరుగుతుంది. దెబ్బలు తింటున్న అబ్బాయి... హమ్మాయ్య అనుకుని ఎస్కేప్ అయిపోతాడు.

పారిపోతున్న వాడిని ఒరేయ్ అని పిలుస్తుంది. అక్కోయ్ తెస్తాను. లేట్ చేసావంటే తోలు తీస్తాను అంటుంది. నీకా ఛాన్స్ ఇవ్వనక్క అని పరుగందుకుంటాడు.

వినయ్ దగ్గరకొచ్చి మీ తమ్ముడా..  ఏమి తీసుకురావాలి.. తమ్ముడా ఏమన్నానా..  ఇక్కడ స్టాఫ్ అని..  ఇంతకీ నువ్వేంటి గన్నయ్య ఇక్కడున్నావు... 

ఇదిగో గన్నయ్య అని పిలిచావంటే ఊరుకోను. పోని అబ్బాయి అంటుంది. నా పేరు వినయ్ అని చెప్పాను కదా..

ఏదో ఒకటిలే గాని..  ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటుంది. ఇది.. అని చెప్పబోతుంటే... ఇక్కడ జాబ్ చేస్తున్నావా..

ఏం జాబ్ చేస్తున్నావు అని అడుగుతుంది.  అది... అనే లోపు.. ఈ ఇంటి దగ్గర అంత మెయింటైన్ చేస్తావా.. లైక్ సూపర్వైజర్ అంటుంది.

ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడవేంటి అబ్బాయి... నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని అంటాడు.

నేనెప్పుడో గ్యాప్ ఇచ్చాను నువ్వు సమాధానం చెప్పడంలో లేట్ చేస్తే నాదా తప్పు అంటుంది. తప్పంతా పక్కన వాళ్ళది. నువ్వు మాత్రం సత్య హరిశ్చంద్రుడికి ఓన్ సిస్టర్ కదా...

ఆ విషయం నీకు అర్థమైనట్టుగా ఇంకెవరికి అర్థం కావడం లేదు అబ్బాయ్.. ఇంతకీ ఏం చేస్తావో అంటే చెప్పడం లేదు అంటుంది. 

వినయ్ ఒక్క నిమిషం ఆలోచించి నువ్వు అనుకున్నదే అంటాడు.  సూపర్వైజర్ ఆ.. చూశావా.. నేను ఎంత తెలివైనదానినో...  నువ్వు చెప్పకుండానే నేను కనిపెట్టేసాను అంటుంది.

అవును.. మీలాంటి తెలివైన వాళ్ళ వల్లే మన దేశం ఇంత డెవలప్ అయ్యింది అంటాడు.  నీ ఉద్దేశం ఏమిటి అబ్బాయి...

అదే...  ప్రశ్న నువ్వే వేసి సమాధానం నువ్వే చెప్పేస్తున్నావు కదా..  దీనివల్ల పక్కన వాళ్ళ ఎనర్జీ వేస్ట్ అవ్వదు. వాళ్ళు వేరే వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అన్నదే నా ఉద్దేశం అంటాడు.

పరవాలేదు అబ్బాయ్ కలిసింది రెండుసార్లు అయినా నా గురించి బాగానే అర్థం చేసుకున్న కీప్ ఇట్ అప్ అంటుంది. బాగానే కీప్ ఇట్ అప్ లే నేను..

ఇంతకీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు.  అయ్యో ఈవెంట్ ఆర్గనైజేషన్ మాదే అంటుంది. నువ్వు చూస్తే జస్ట్ ఇప్పుడే స్టడీస్ కంప్లీట్ అయినట్టున్నావు.

ఈ ఆర్గనైజేషన్ ఎప్పటినుంచో ఉన్నట్టుంది. ఒరేయ్ మొద్దు ఇది మా నాన్నగారు రన్ చేస్తారు.  ఆయనకి కొంచెం హెల్త్ బాగోలేదని నేను వచ్చాను అంటుంది.

ముద్దా  అంటాడు.  ముద్దు కాదురా మొద్దు.. ఏమోలే నాకు ముద్దు అని వినిపించింది అంటాడు. వినిపిస్తుంది.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చక్కగా పని చేసుకో.

లేకపోతే  నీ మక్కీలు కూడా కైమా కింద విరగ్గొడతాను.  లేదు అంటే ఈ ఇంటి ఓనర్ కి చెబుతాను అంటుంది. చెబితే మాత్రం నాకేమన్నా భయమా అంటాడు.

వినయ్ ? పూజిత ...
[+] 13 users Like SivaSai's post
Like Reply

Part - 119


ఇంటి ఓనర్ కి చెప్తే నాకేమన్నా భయమా.. ఏంటి అబ్బాయి భయం లేదు అంటావు అంతేనా అంటుంది. అస్సలు లేదు నేను ఎంత చెబితే అంతే అంటాడు.

అబ్బో అంత పెద్ద ఉద్యోగం ఇక్కడెం వెలగ పెడుతున్నావు ఏంటి.. ఏదైనా వెలగబెడతాను నీకేంటి అమ్మాయి ఇబ్బంది అంటాడు.

నా పేరు అమ్మాయి కాదు పూజిత. నువ్వు మాత్రం నన్ను ఇష్టమొచ్చినట్టు పిలవవచ్చు గాని నిన్ను మాత్రం అమ్మాయి అనకూడదా?

ఎప్పుడైతే నువ్వు నన్ను చక్కగా పిలుస్తావో అప్పుడే నేను పిలుస్తాను అప్పుడు దాకా నువ్వు అమ్మాయివి అంతే.  నీతో ఈ వర్క్ అంత దగ్గరుండి చేయించమని విక్రమ్ సార్ మరీ మరీ చెప్పి వెళ్లారు.

కాబట్టి పదా అని లాక్కునివెళతాడు.  ఇదిగో అబ్బాయి నాకు తెలుసు ఎలా చేయాలో నువ్వు చెప్పనవసరం లేదు. అబ్బో నువ్వు అంత పుడింగివ... పుడింగ అంటే..అదే ఎవరు చెప్పకుండా నీ అంతటి నువ్వే చేసేస్తావా అంటాడు.

ఏం చూస్తావా... చూడాలనే కదా నా ఆత్రం కూడా అంటాడు.  ఏం చూడాలని అని వెనక్కి బెండై అడుగుతుంది.

నువ్వు ఏది చూపిస్తే అదే పాపా అని ముందుకు వస్తాడు.  ఇదిగో నిలబడి మాట్లాడు. నువ్వు వెనక్కి బెండ్ అయ్యావు కదా వినపడుతుందో లేదో అని నేను ముందుకు వచ్చాను అంటాడు.

అబ్బో నీ దగ్గర చాలా సేఖలు ఉన్నాయే..  ముందు ముందు ఇంకా చూపిస్తానులే గాని పద పద లేట్ అయింది అంటే విక్రమ్ సారు కోప్పడతారు అంటాడు.

పూజితతో దగ్గర ఉండి డెకరేట్ చేపిస్తూ ఉంటాడు. ఇదిగో అబ్బాయి ఇది మా స్టాఫ్ వచ్చి చేస్తారు.  నేనే చేయాల్సిన అవసరం లేదు. నేను ఆర్డర్ వేయ్యాలి. వాళ్ళు చేస్తారు అంటుంది.

అదే కదా పాప ఇప్పుడు నేను చేసేది కూడా..  నేను ఆర్డర్ వేస్తున్నాను.  నువ్వు చేస్తున్నావు. నేను నా కంపెనీ ఎండి ని.  నా కింద వర్కర్స్ ఉంటారు.

అంతేగాని నీ కింద నేను వర్కర్ ని కాదు అర్థమైందా అని కణతల మీద పెట్టి పొడిచి చూపిస్తుంది. ఆ వేలును పట్టుకుని అర్థమైంది కాబట్టే కదా దగ్గరుండి చేయిపిస్తున్నాను .

ఏం అర్థమైందిరా మగడ..  చెప్పిందే చెబుతున్నావ్ గాని నేను చెప్పింది అర్థం చేసుకోవడం లేదు.  ఇంత జిడ్డు లాగా తగిలావ్ ఏమిటి.

నేను జిడ్డు కాదు స్మార్ట్ అందుకే నీతో దగ్గరుండి చేయిపిస్తున్నాను.  అసలే మా నివి కి చాలా పర్టికులర్ గా ఉండాలి.

హలో నువ్వు ఇక్కడ సూపర్వైజర్ మాత్రమే. అయితే... మరి నివి అంటావేమిటి. నివేదిత మామ్ అనాలి అని నొక్కి చెబుతోంది.

మరి మిమ్మల్ని ఏమని పిలవాలో అంటాడు. కాల్ మీ పూజిత మేమ్ అంటుంది.  గాడిద గుడ్డేం కాదు అంటాడు. చూడు అమ్మాయి...

ఇక్కడ నువ్వు పని చేయడానికి వచ్చావు.  నేను పని చేయడానికి వచ్చాను.  మనిద్దరి మధ్య ఈ వాదన అవసరమా..

వినయ్ అని అవని పిలుచుకుంటూ వస్తుంది.  చెప్పు వదిన...  వర్క్ ఎంతవరకు వచ్చింది.  మీ అన్నయ్య ఇప్పుడే కాల్ చేశారు.

ఇదిగో దగ్గరుండి మరీ చేయిపిస్తున్నాను. సరే జ్యూస్ ఏమన్నా పంపించమంటావా..  వద్దు వదిన అంటాడు. సరే ఏదైనా అవసరమైతే పిలువు.

సరే అని అనగానే అవని వెళ్ళిపోతుంది.  పూజిత ఇద్దరి వంక ఆశ్చర్యంగా చూస్తూ.. నువ్వేంటి వదిన అన్నయ్య అంటున్నావు. అయ్యో తెలిసిపోయిందా అని నాలిక కరుచుకుని అంటే..  మేడంకి అందర్నీ మన అనుకుని కలుపుకుంటారు.

నన్ను సొంత మరదిలాగా చూసుకుంటారు. అందుకే అన్నయ్య అని చెబుతారు. ఓ అవునా కానీ నువ్వు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావే...

వదినతో మీరు అండి అని మాట్లాడతారా...  వదిన అంటే ఎవరు..  తల్లితో సమానం. ఇలాంటి చచ్చిపుచ్చు డౌట్లతోనే అందరిని చితక్కొట్టేస్తున్నావ్. కానీ...  కానీ అంటాడు.

నువ్వు మాత్రం నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు అంటుంది. కన్ఫ్యూజన్ లేదు. ఏమీ లేదు వర్క్ చేయడం రాకపోతే ఇలాగే మాటలతో గెంటేస్తారు అని రెచ్చగొడతాడు.

యు మిస్టర్..  నా వర్క్ కి ఇప్పటిదాకా పేరు పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు తెలుసా అంటుంది.  అందుకే కదా నేను పెడుతున్నాను.

నీకు ఒళ్లంతా గోరోజనమే అంటే..  కాదు వెటకారం అంటాడు. రెండిటికి పెద్ద తేడా లేదులే అని పళ్ళునురుతు డెకరేషన్ చేస్తూ ఉంటుంది.

వినయ్ కి పూజిత తో టైం స్పెండ్ చేస్తుంటే బాగా నచ్చుతుంది. ఏ అమ్మాయి  లో లేని సంథింగ్ టాలెంట్ పూజితలో కనిపిస్తూ ఉంటే అట్రాక్ట్ అవుతూ ఉంటాడు.

ఏడిపించి, విసిగించి  పూజిత కి హెల్ప్ చేస్తూ డెకరేషన్ చాలా వరకు ఫినిష్ చేస్తారు.  ఇదిగో అబ్బాయి చాలా వరకు అయిపోయింది.

చిన్న చిన్న టచ్చింగ్స్ మాత్రమే ఉన్నాయి. అవి రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చి చూస్తాము.  వీటిని మాత్రం నువ్వు చెడగొట్టనివ్వకుండా జాగ్రత్తగా చూడు.  లేకపోతే నాకు మాట వచ్చేస్తది అంటది.

నీకు మాట వస్తే నాకు వచ్చినట్టే కదా అమ్మాయి అంటాడు. నాకు వస్తే నీకెందుకు వస్తది అని కోపంగా అడుగుతుంది. అరె నీకు ముక్కు మీద కోపం ఉంటుందే అమ్మాయి.

నేను అన్నది ఇద్దరం కలిసి చేశాము కదా...అలాంటప్పుడు తేడా వస్తే ఇద్దరి పేర్లు వస్తాయి కదా అది చెబుతున్నాను. దీనికి కూడా కోపమేనా...

ఓకే ఓకే అలా చెబితే పరవాలేదు. మరి ఎలా అనుకున్నావ్ ఏమిటి అంటాడు. నేను ఎలాగా అనుకోలేదు కానీ మహాప్రభో...

నన్ను వదిలేస్తే నేను ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి మంచం ఎక్కేయాలి. ఇప్పటికే నా బుర్ర తినేసావు. హీటెక్కిపోయింది అంటుంది.

అవునా చల్లార్చడానికి ఐస్ ఏమైనా పెట్టమంటావా.. నువ్వు ఏమి పెట్టాల్సిన అవసరం లేదు కానీ నన్ను వదిలేస్తే ఇంటికి వెళ్లి వేడివేడిగా కాఫీ తాగుతాను అంటుంది.

కాఫీకి మీ ఇంటి వరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది. మా ఇంట్లో తాగచ్చు అంటాడు. ఇప్పుడు మళ్ళీ మీ ఇంటికి వెళతావా ఏమిటి...

నేను ఇక్కడే  ఉంటాను కాబట్టి ఇదే నా ఇల్లు అంటాడు. అబ్బో ఓనర్ అయినట్టే చెబుతున్నావు అంటుంది. ఒకరకంగా అలాగే అనుకో అని మెయిడ్ కి సైగ చేస్తాడు.

వెంటనే మెయిడ్ కాఫీ తేస్తుంది.  అదేంటి ఎప్పుడు చెప్పావు. ఎప్పుడు చెబితే ఏమిటి.. నీకు ఫ్రెష్ గా స్ట్రాంగ్ గా కాఫీ వచ్చింది కదా మంచి అరోమా వస్తుంది తాగేయ్ అంటాడు.

అబ్బో పర్వాలేదే... నీకు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉంది.  నీకు గుర్తించడానికి ఇంత టైం పట్టింది అంతే అంటాడు.

సరే సరే నేను బయలుదేరతాను అని కాఫీ కప్పు అక్కడ పెట్టి బయలుదేరుతుంది. ఇదిగో అమ్మాయి అంటాడు.  ఏంటి... రేపు వచ్చేటప్పుడు చక్కగా చీర కట్టుకుని రా అంటాడు.

ఇదిగో అబ్బాయి..  ఫంక్షన్ నాది కాదు.  ఇక్కడ మేము ఆర్గనైజ్ చేస్తున్నాం అంతే అంటుంది. ఆర్గనైజ్ చేసిన సరే పెళ్లీడుకొచ్చిన పిల్లవు కదా...

చీర కట్టుకుని వచ్చావ్ అనుకో అందరికీ కన్నులు విందుగా ఉంటుంది. ఎవరికి కన్నులు విందుగా ఉండాలి. ఈ బొమ్మ ఎవరికీ నచ్చితే వాళ్లకే అంటాడు.

ఆ మాటకి నేను ఎవరికీ నచ్చాలో నాకు తెలుసులే గాని నువ్వు మూసుకో అబ్బాయి అని స్కూటీ స్టార్ట్ చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది.

వెళుతున్న పూజత ని చూస్తూ తల వెనకాల చేయవేసి రబ్ చేసుకుంటు..  ఒరేయ్ వినయ్ నువ్వు కూడా చెడిపోతున్నావురా.. నీకు పెళ్లిఈడు వచ్చేసింది అని మెలికలు తిరుగుతూ ఉంటాడు.

జైలు గదిలో ఉన్న భార్గవి దగ్గరికి కానిస్టేబుల్ వచ్చి జైలర్ పిలుస్తున్నారు అని తీసుకువెళుతుంది.  ఈ టైంలో ఏమిటా అని ఆలోచిస్తూ జైలర్ గదిలోకి వెళుతుంది.

అక్కడ జైలర్ తో పాటు ధనుంజయ్ కూడా ఉంటాడు. మళ్ళీ కూతురు వి ఏ గొప్పలు చెప్పడానికి వచ్చారు.  చ్చా నా జీవితం అనుకుంటూ వెళ్లి చెప్పండి అంటుంది.


చూడు భార్గవి నిన్ను బెయిల్ మీద బయటకు తీసుకు వెళ్ళడానికి ఈసార్ వచ్చారు.  ఆయనకి నాకు ఏమిటి సంబంధం అని తీసుకువెళుతున్నారు అని అడుగుతుంది.

ధనుంజయ్ సూటిగా భార్గవి వైపు చూస్తాడు. ఇప్పుడైనా నేను భార్య అని చెప్పాలి కదా.. చెప్పకుండా మీరు ఎలా తప్పించుకుంటారు మనసులో అనుకుంటూ నవ్వుతుంది.

భార్గవి ఆలోచన అర్ధమైన ధనుంజయ్ నవ్వుతూ మనిద్దరి మధ్యన ఉన్న సంబంధం చెప్పనా అంటాడు. చెప్పమనే కదా...  ఓనర్ కి పనిమనిషికి ఉన్న సంబంధం.

ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే నా శరీర అవసరాలు తీర్చిన ఒక ప్రాణం ఉన్న బొమ్మవి చాలా అంటాడు. ఆ మాటకి కోపంతో పాటు బాధ కూడా తన్నుకొస్తుంది.

ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఏడుపు గొంతుతో అడుగుతుంది.  నువ్వే కదా మనిద్దరి మధ్యన ఉన్న సంబంధం చెప్పమన్నావు.

నీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలి భార్గవి అంటాడు. ఏమిటి నీ కూతురు నీళ్లు పోసుకుందా... నీ నోటి మాట వల్ల అదే జరిగితే అంతకన్నా మహాభాగ్యం ఏముంది.

అది నాకు గుడ్ న్యూస్ కానీ నీకు కాదు కదా..  నీకు మాత్రమే గుడ్ న్యూస్ అని చెబుతున్నాను.  ఇక్కడే చెప్పనా బెయిల్ వచ్చిన తర్వాత కారులో వెళుతూ చెప్పనా అంటాడు.

జైలర్ ముందు పరువు పోగొట్టుకోవడం ఎందుకులే అని బయటికి వెళ్లాక చెప్పండిలే అంటుంది.   భార్గవి భయానికి పొగరుగా నవ్వుకుంటూ సంతకం చేసి బయటికి తీసుకువెళతాడు.

కారు దగ్గరికి తీసుకెళ్లి ఎక్కుఅని...  కార్ ఎక్కిన తర్వాత స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి స్వీట్ ఇస్తాడు.  ఇప్పుడు ఈ స్వీట్ దేనికి...  నేను బయటకు వచ్చినందుకా..

కాదు ఇప్పుడు నేను చెప్పబోయే గుడ్ న్యూస్ కి.  స్వీట్ చేత్తో పట్టుకొని  ధనుంజయ్ వైపు చూస్తుంది. చేతితో ఎంతసేపని పట్టుకుంటావ్.

నోట్లో పెట్టుకో.  ముందా న్యూస్ ఏంటో చెప్పండి. అప్పుడు పెట్టుకోవాలో లేదో ఆలోచిస్తాను  అబ్బో భార్గవికి కూడా భయం మొదలయ్యిందే అంటాడు. ఇది భయం కాదు ముందు జాగ్రత్త అంటుంది.

సరే చెబుతాను చెవులు రెండు రెక్కరించి విను అని నీ కూతురికి పెళ్లి అయిపోయింది.

భార్గవి రియాక్షన్...
[+] 12 users Like SivaSai's post
Like Reply

Part - 120


శిల్ప పెళ్లయిపోయింది అన్న వార్త వినగానే భార్గవి బిగుసుకుపోతుంది.  చలనం లేని బొమ్మలాగా చూస్తూ ఉండిపోతుంది.  భార్గవి..  భార్గవి అని పిలిచిన పలకదు.

కళ్ళ ముందు చిటికెలు వేసిన  స్పృహలోకి రాదు. ధనుంజయ్ కి విసుగు వచ్చి వాటర్ బాటిల్ లోని  వాటర్ తీసుకొని తలపై నుంచి పోస్తాడు.

వర్షం..  వర్షం... అని అరుస్తుంది. ఇప్పుడు స్పృహలోకి వచ్చావా..  అది వర్షం కాదులే. ఎవరైనా నీళ్ళు ఇలా పోస్తారా అని కోపంగా అరుస్తుంది.

నా ముందు నోరు లేచింది అంటే మాట్లాడటానికి నాలిక లేకుండా కట్ చేసేస్తాను. ఎన్నిసార్లు పిలిచినా పలకకపోతే నిన్ను ఇంకా ఎలా పిలవాలి.

చెయ్యి పట్టుకుని కదపవచ్చు. చి చి నీలాంటి ఆడదాన్ని తాకాలి అంటే  అసహ్యంగా ఉంటుంది.  ఇలాంటి ఆడదానితో ఎలా కాపురం చేసారో.. నువ్వు సూర్పణక అని తెలియక..

మిమ్మల్ని అంటే...  ఇంకా ఆపేయ్ నీతో మాట్లాడటమే ఇష్టం లేదు అంటే మళ్ళీ గొడవ పడడమా ఇంపాసిబుల్ అంటాడు.

శిల్ప కి ఎవరితో పెళ్లి అయిందో తెలుసుకోవా... గొడవలో నుంచి బయటకు వచ్చి ఎవరితో అన్ని టెన్షన్ గా అడుగుతుంది.

నీకు బాగా ఇష్టమైన వాళ్లతోనే. నాకు ఇష్టమైన వాళ్ళ అని ఆలోచిస్తుంది.  ఏంటి నీ పదునైన బుర్రకి తట్టలేదా...  నిజంగానే తట్టడం లేదండి. ఎవరు  చెప్పండి ప్లీజ్..

స్వీట్ తిను చెబుతాను. స్వీట్ తింటే గాని చెప్పాడు అని అర్థమయ్యి కష్టంగా స్వీటు తింటుంది.  ఇప్పుడు చెప్పండి అంటే వాటర్ తాగుతావా అంటాడు.

నాకు వాటర్ అవసరం లేదు చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తుంది.  ఇంకెవరు మీ ముద్దుల మేనల్లుడు ఉదయ్ తో అంటాడు.

ఉదయ్ తో అనగానే చాలా కోపం వచ్చేస్తుంది. మీకు అంతకన్నా గొప్పవాడు దొరకలేదా.. వాడే ఒక వేస్ట్ గాడు. అలాంటి వాడితో నా బంగారు తల్లి పెళ్లి చేస్తారా.

అసలు మీకు మనసు ఎలా వచ్చింది. కన్న తండ్రి అయ్యి మీరు అని చొక్కా పట్టుకోపోతుంది. ఏయ్ దూరంగా ఉండు నన్ను టచ్ చేసావంటే మాత్రం నీకు మర్యాదగా ఉండదు.

ఇంకేం మర్యాద.  నన్ను జైల్లో పెట్టించారు.  నా కూతురి జీవితాన్ని నాశనం చేశారు. ఇంకా మీకు మర్యాద ఇవ్వాలా.. మరి నువ్వు అవని విషయంలో చేసింది ఏమిటి..

అవని అంటే నాకు సవతి కూతురు కాబట్టి నేను సాధించవచ్చు కానీ మీకు శిల్ప కన్న కూతురే కదా.. మీరు ఎలా చెయ్యగలిగారు.

సవతి కూతురు అని విరక్తిగా నవ్వి..  నీకు సవతి కూతురేమో గానీ నాకు కాదు కదా అంటాడు. అదే నేను చెబుతున్నాను.

ఇద్దరూ మీ కూతుర్లే కదా ఎందుకంత పక్షపాతం. పక్షపాతం చూపించింది నేను కాదు..  నువ్వు చూపించి నీ కూతురి జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు.

నేను సరైన దారిలో పెడుతున్నాను అంటాడు. ఏమిటి ఆ పోరంబోకుడికి ఇచ్చి పెళ్లి చేయడమా సరైన దారిలో పెట్టడం.

మరి నీ పెంపకంలో పెరిగిన నీ కూతురు ఏమిటి అది ఇంకా పెద్ద పోరంబోకు కాదా అంటాడు. ఏవండీ అని గట్టిగా అరుస్తుంది.

నిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటాయి.  ఇంతకీ నీ బంగారు తల్లి సంసారాన్ని చూస్తావా అంటాడు.  ఆ మాటకి ఇంకా ఏమి చేశారు.

చూడు..  చూస్తే నీకే తెలుస్తుంది కదా అని ఫోన్లో వీడియో ఆన్ చేసి చూపిస్తాడు. అందులో పొద్దుటే లెగడం దగ్గర నుంచి పొలం పనులు చేయడం. చేతులు మంటపెట్టడం రుద్దుకోవడం.

ఉదయ్ దగ్గరుండి అన్నం తినిపించడం అన్ని చూసి కంటతడి పెట్టుకుంటుంది.  నా చిట్టి తల్లికి ఎన్ని కష్టాలు వచ్చాయి.

మీ వల్లనే అది జైలుకు వెళ్ళింది.  ఇప్పుడు ఆ ఎదమని పెళ్లి చేసుకుంది. మరి ఆ ఎదవకే నా బంగారు తల్లిని బలి చేయాలి అనుకున్నావు. అప్పుడు గుర్తుకు రాలేదా వాడొక పోరంబోకు.  వేస్ట్ గాడు అని.

అందుకని మీరు ఇప్పుడు శిల్ప జీవితంతో ఆడుకుంటున్నారా..  ఎవరు ఎవరితో ఆడుకున్నారు.  ఆ మాట అంటానికైనా కొంచెం అయినా మనస్సాక్షి అన్నది ఉండాలి.

నీ కూతురికి పెళ్లి అవుతుందనే నువ్వు అనుకుంటున్నావా... పోనీ భవిష్యత్తు అంటూ ఉందని అనుకుంటున్నావా..

మీరు శిల్పని జైల్లో పెట్టించకుండా..  విక్రమ్ కి దూరం చేయకుండా ఉండి ఉంటే అది మహారాణి లాగా ఉండేది. మీ కూతురు సంతోషం కోసం నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు.

నేను కాదే నువ్వే నాశనం చేసావు.  ఆరోజు పెళ్లి పెట్టుకుని కూడా అది బయటకు వెళితే కవర్ చేసావు కానీ ఇలా వెళ్ళింది అన్న ఒక్క మాట చెప్పావా.

చెప్పి ఉంటే ఏమో ఏమి జరిగేదో అంటాడు.  ఏం జరిగేది వెళ్లి దాన్ని తీసుకొద్దురా.. తీసుకువచ్చే వాడినేమో..  రెండు పీకి అయినా పెళ్లి పీటల మీద కూర్చోబెట్టే వాడిని ఏమో...


తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించే వాడిని ఏమో అంటాడు.  తండ్రిగా అని వెటకారంగా నవ్వి.... ఎంత బాగా నిర్వర్తించావో చూస్తానే ఉన్నాను కదా..

అప్పుడు అవనినీ పట్టించుకోలేదు.  అల్లుడు డబ్బున్న వాడు.. సమాజంలో మంచి పలుకుబడి ఉన్నవాడు అని అర్థమై.. ఇప్పుడు అవని నా కూతురు..  నా ప్రాణం అని చెబుతున్నావు.

శిల్పాలో నీకు ఇప్పుడు తప్పు కనిపించేటప్పటికి.
  దగ్గరికి తీసుకుంటే అల్లుడు ఎక్కడ అసహ్యించుకుంటాడో..  నీ పరువు ఎక్కడ పోతుందో అని శిల్ప ని దూరం పెడుతున్నావు.

నీ గురించి నాకు తెలవదా అంటుంది. భార్గవి అన్నమాటకి ధనుంజయ్ కు ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది.  భార్గవి ఇలా మాట్లాడినప్పుడు అవని అనుకోవడంలో తప్పులేదు కదా అనుకుని...

అవునే నిజంగానే తండ్రిగా నా బాధ్యతని మరిచిపోయాను.  అవని విషయంలో నేను ఫెయిల్ అయ్యాను ఏమోగానీ శిల్ప విషయంలో ఫెయిల్ అవ్వను.

గట్టిగా నవ్వుతూ ఫెయిల్ అవ్వకపోవడం ఏంటి ఎప్పుడో ఫెయిల్ అయ్యారు కదా అని కళ్ళు మూతలుపడుతూ ఉంటాయి.

ఇదేమిటి మగతగా ఉంది అంటే..  ఆ మాటకి ధనుంజయ్ నవ్వుతూ శిల్ప పెళ్లి విషయం తెలియగానే స్పృహ తప్పి పడిపోతావ్ అనుకున్నాను. పరవాలేదు ఇంతసేపు ఆగావంటే గడ్డిప్రాణానివే పదా అని కార్ స్టార్ట్ చేస్తాడు. ఏం కలిపారు మీరు అని మాట్లాడుతూనే పడుకుండిపోతుంది.

ధనుంజయ్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు గానీ భార్గవి అన్న మాటే మెదులుతూ ఉంటుంది. విక్రమ్ స్టేటస్ చూసి అవనినీ నా కూతురు అనుకుంటున్నాను అని అవిని ఆలోచిస్తే.. అన్న ఊహ రాగానే గుండెల్లో సన్నగా నెప్పి మొదలవుతుంది.

నేను ఎంత మూర్ఖుడిని. అందరికన్నా ఎక్కువ ప్రాణం పెట్టుకున్న భార్య ఎలా చనిపోయిందో తెలియదు. ఆ భార్య ప్రతిరూపమైన నా కూతురు ఎలాంటి కష్టాలు పడిందో తెలియదు.

సంపాదించి ఏం చేసినట్టు నేను.  పోనీ ఇది సరిగ్గా లేకపోయినా శిల్ప నడవడిక బాగున్న కొంతలో కొంతైనా మనశాంతి ఉండేది.

అది ఇంకా బరితెగించింది.  ఎవరికోసం నేను బతుకుతున్నానో నాకే తెలియకుండా చేశారు.  ఈ జన్మలో నాకు మనశ్శాంతి దొరుకుతుందా..

అవని నన్ను తండ్రిగా ఒప్పుకుంటుందా అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు.  ఆ ఆలోచనలకి అంత ఉండదు. కారే కన్నీరుకి ఆవిరి ఉండదు.

జైసింహ మాన్షన్...

షాపింగ్ కి వెళ్ళిన బ్యాచ్ అంతా ఇంటికి చేరుతారు.  జెంట్స్ మొత్తం అలసిపోయి సోఫాలో కూలపడితే...  లేడీస్ మాత్రం బూస్ట్ తాగినంత ఎనర్జీతో చిందులు తొక్కుకుంటూ వస్తారు.

లేడీస్ మొఖాలు వెలిగిపోతూ ఉంటాయి. వాళ్ల అలసట చూసి అవని అందరికీ స్నాక్స్ జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. అవి చూడగానే అందరూ థాంక్స్ బంగారం అంటే చిన్న చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

జెంట్స్ బ్యాచ్ ని హాల్లోనే వదిలేసి లేడీస్ బ్యాచ్ అంతా గదిలోకి వెళ్ళుతూ  అవనినీ లాక్కుని వెళ్ళిపోతారు. అక్కడ మళ్ళీ కొన్నవన్నీ ఎగ్జిబిషన్ పెట్టి చూపిస్తూ పెట్టుకొని మరీ మురిసిపోతూ ఉంటారు.

విక్రమ్, భరత్ ఆఫీస్ నుంచి వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని అయిపోయిందా షాపింగ్. అయ్యిందిరా అని నీరసంగా అంటారు.

ఏమైంది అంత నీరసంగా ఉన్నారు. ఒక్క లేడీని తీసుకుని షాపింగ్ కి వెళితేనే గంటలు గంటలు పడుతుంది.  అలాంటిది వీళ్ళందర్నీ తీసుకునే వెళ్ళితే...

పాపం షాప్ అతని పరిస్థితి ఏమిటి..  ఏం జరిగిందేంటి అని విక్రమ్ నవ్వుతాడు. ఏం జరిగిందని అడుగుతావేంటి బావ. అసలు మీ చెల్లికి ఇంత షాపింగ్ పిచ్చేంటి..

ఆ డిజైన్ లో కూడా ఎన్ని వంకలు పెట్టిందో తెలుసా..  అయ్యబాబోయ్..  కష్టమైసేడ్  చేయించుకోవాలి. అది కూడా తన సెల్ఫ్  డ్రాయింగ్ వేసి .

విక్రమ్ వెంటనే అవునా..  మా చెల్లెలో అంత టాలెంట్ ఉందా... రేయ్.. భరత్..  రేపటి నుంచి నివితో జువెలరీ డిజైన్స్ డ్రా చేయించు.

మన జ్యువెలరీ మేకింగ్ దాంట్లో ఇంప్లిమెంట్ చేద్దాము.  అలాగే బావ అంటాడు.  ఒరేయ్ నేను ఇంత ఎమోషనల్ గా చెబితే అందులో మీ చెల్లి టాలెంట్ ని వెతుకుతున్నావా..

నువ్వే కదరా చెప్పింది... నా బాధ నీకు అర్థం కావడం లేదు కానీ నీ చెల్లి టాలెంట్ కి మురిసిపోతున్నావా..  దుర్మార్గుడా..  గట్టిగా నవ్వుతూ బాగా కాలినట్టు ఉంది కదా మా తమ్ముడికి అని భరత్ అంటాడు.

కాలడం కాదురా...  అసలు ముందు మా నాన్నని అనాలి అంటాడు. ఆ మాటకి స్నాక్స్ తింటున్న పార్ధు గారు నేనేం చేశాను రా...

చేసిందంతా చేసి ఏం చేశానని అడుగుతారా? నిన్న మీరు ఏసినా నిప్పు ఈరోజు మంటయి నన్ను ఎంత తగులుకుందో మీకేం తెలుసు అనే బేర్ మంటాడు.

ఒరేయ్ ఆడపిల్లలాగా ఏడుస్తావ్ ఎందుకు.. వాళ్లెక్కడ ఏడుస్తున్నారు.. మనతో ఏడిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది బావ అని వినయ్ వచ్చి పక్కన కూర్చుని అడుగుతాడు.

ఇంకా నువ్వు రాలేదేంట అనుకున్నాను చిన్న బామ్మర్ది వచ్చావా...

జువెలరీ షాప్ లో రాజ్ పడిన ఇబ్బందులు గుర్తొచ్చి మిగిలిన జెంట్స్ అందరూ పొట్ట పట్టుకుని మరి నవ్వుతారు.

ఎందుకు నాన్న మీరు అలా నవ్వుతున్నారు అని వినయ్ అడిగితే.. నేను చెప్పలేను రా అది తలుచుకుంటుంటే ఇప్పటికి నవ్వు ఆగడం లేదు. చూడు కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి.

అబ్బా మీరు చెప్పిన నవ్వండి లేదా నవ్వైనా చెప్పండి అంతేకానీ చెప్పలేము అంటారు..  చెప్పమని అంటారు. ఇలాగైతే మాకు ఎలా తెలుస్తుంది నాన్న.  అక్కడ ఏం జరిగిందో అని ఆత్రం ఆగలేక ముందుకు వంగుని మరి అడుగుతాడు.

రాజ్ పరిస్థితి??

కథ కొనసాగుతుంది...
[+] 11 users Like SivaSai's post
Like Reply

Part - 121


కళ్యాణ్ నవ్వుతూ అసలు జువెలరీ షాప్ లో ఏం జరిగిందో తెలుసా అని వేలుతో తిప్పుతూ ఉంటారు.  ఏం చేస్తున్నారు.. ఫ్లాష్ ప్యాక్ ఓపెన్ చేస్తున్నాను.

అన్ని జంటలు సరదాగా షాప్ లోపలికి వెళ్తారు. వెళ్లే ముందే జెంట్స్ ఫిక్స్ అయిపోతారు. లేడీస్ ఏది అడిగినా సరే.. బాగుంది..  సూపర్ అని చెప్పాలి అని.

వెళ్లి కూర్చోగానే... జువెలరీ షాప్ ఓనర్స్ వచ్చారు కాబట్టి అన్ని లేటెస్ట్ డిజైన్స్...  కష్టమైస్ ఐటమ్స్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారు.

మాధవి,  లలిత సెలక్షన్ తొందరగానే అయిపోతుంది.  ఇంకా కరుణ, నివి మాత్రమే మిగులుతారు. లలితా నివితో తొందరగా అవ్వని నివి.

ఎన్ని చూసిన నీ దగ్గర ఉన్న మోడల్స్ లాగానే కనిపిస్తాయి
ఏదో నిన్న సరదాగా ఏడిపించాము అని ఇంట్రెస్ట్ గా తీసుకువచ్చారు.

మరి బోర్ కొట్టించుకోకూడదు.  అమ్మ అలా ఎలా తీసుకుంటాము..  తీసుకునే ఐటమ్ లో ప్రతిదీ చెక్ చేయాలి కదా.

నీ దగ్గర ఏ ఐటం లేదు చెప్పు. అప్పుడు చూడొచ్చు అని రాజ్ అంటాడు.  అదే ఆలోచిస్తున్నాను రాజ్. ఏది చూసిన నా దగ్గర ఉన్నట్టే ఉంది.

ఈ మాత్రం దానికి షాపింగ్ ఎందుకు.. వెళ్ళిపోదామా.. లేదు... లేదు నువ్వు ఇంత ప్రేమగా కొంటాను అంటే వెళ్ళిపోతే ఫీలవుతావు అని రాజ్ ఎమోషన్స్ కూడా తనే చెప్పేస్తుంది.

నా ఫీలింగ్స్ కూడా నువ్వే చెప్పేస్తున్నావా అంటే.. నువ్వు నేను వేరు కాదు కదా.  అందుకే నీ మనసులో ఉన్నది నేను చెప్పేస్తున్నాను.

పార్ధు భార్యని ఉడికించాలని చూసావా కరుణ.. నా కోడలు అప్పుడే నా కొడుకుని ఎంత బాగా అర్థం చేసుకుందో...

వాడి ఫీలింగ్స్ కూడా నా కోడలే చెప్పేస్తుంది.  మన పెళ్లి అయ్యి ఇన్ని సంవత్సరాలైనా నీకు నా ఫీలింగ్స్ గాని.
నా కొడుకు ఫీలింగ్స్ కానీ తెలుసాయా...  అని మెల్లిగా మంట పెడతాడు.

అవునా..  ఇప్పుడు మీ బాబు కొడుకులి ఇద్దరు ఫీలింగ్స్ నేను బయట పెడతాను కదా అని ... లేటెస్ట్ మోడల్స్ ఇంకా చూపించమని అడుగుతుంది.

అనవసరంగా నా పెళ్ళాన్ని కదిపిన ఏమిటి అని డౌట్ గా.. కళ్యాణ్,  రమేష్ వైపు చూస్తాడు.  ఇద్దరు కొట్టేలాగా చూస్తారు.

బయట ఏం చెప్పుకున్నాము..  లోపలికి వచ్చాక ఏం చేస్తున్నావు అన్నట్టుగా కళ్ళతోనే ఉరుముతారు.  సోరి ఏదో నా కొడుకుని ఏడిపించుదాం అనుకున్నాను. ఏడ్చినట్టుంది...  నీ ఎదవ తెలివితేటలు.

నీతో పాటు అందరిని ఇరికించావు కదరా అని తల పట్టుకుంటారు. కరుణ  డిజైన్స్ చూస్తూ ఉంటే లేడీస్ మళ్లీ మొదటి నుంచి చూస్తూ ఉంటారు.

ఫైనల్ గా నాలుగు సెట్స్ ఓకే చేస్తారు. హమ్మయ్య అనుకుని టైం చూసేటప్పటికి లంచ్ టైం దాటిపోతుంది.  అయ్యబాబోయ్ మనం వచ్చి అప్పుడే నాలుగు గంటలు అయింది.

ఇంకా వీళ్ళది అవ్వలేదా అని..  లలిత ఇందాకే మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా మళ్ళీ ఏమి సెలెక్ట్ చేస్తున్నారు అని కళ్యాణ్ అడుగుతాడు.

అయ్యో ఇందాక చూసిందానికన్నా ఈ మోడల్స్ ఇంకా బాగున్నాయండి.  చూడండి మీరే..  ఏది పెట్టుకుంటే బాగుందో చెప్పండి అని పెట్టుకుని చూపిస్తుంది.

ఏది పెట్టుకున్నా నువ్వు చాలా అందంగా ఉన్నావు లలిత. ఆ సెట్ కే అందం వచ్చింది. అబ్బా...  ఎప్పుడూ చెప్పే డైలాగే కదా..  కొత్తగా ఏదైనా చెప్పండి అంటుంది. కొత్తగా నా అని బుగ్గ మీద వేలుతో ట్యాప్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు.

రమేష్ మాధవి తో అబ్బబ్బబ్బా ఈ సెట్టు పెట్టుకుంటే నీ అందం 10 సంవత్సరాలు కిందకి వెళ్ళిపోయింది లల్లి.  మళ్లీ మన పెళ్లి టైంలో ఉన్నా పెళ్లికూతురు లాగా కనిపిస్తున్నావు.

ఆ మాటకి మురిసిపోతూ..  చాల్లే అండి మీ సంబరం. ఎప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడతారు.  ఇంతకీ రెండిట్లో ఏది బాగుంది అని అడుగుతుంది.

రెండు సూపర్ ఉన్నాయి.  నీకు ఏది బాగుంది అంటే చెప్పలేకపోతున్నాను అంటాడు.  అవునా అయితే రెండు తీసేసుకుంటాను అని రెండిటిని కి ఆర్డర్ పెట్టేస్తుంది.

రమేష్ కక్కలేక మింగలేక.  సరే నీ ఇష్టం నీ కన్నా నా అని తల ఊపుతాడు.

పార్ధుకి ఇద్దరూ గట్టిగా వార్నింగ్ ఇస్తారు.  నీ కొడుకు ని కేలకకు.  అలాగే నీ భార్యని కేలకకు అని.  సరే రా నేను ఎందుకు కదుపుతాను. మౌనంగా ఉంటాను చూడండి అని నోటి మీద వేలు వేసుకుంటాడు.

కరుణ నాలుగు సెట్స్ సెలెక్ట్ చేసి ఏది బాగుంది అనగానే..  కళ్ళతో చెబుతూ ఉంటాడు. నోరు మాత్రం ఇప్పడు.  అరే అడుగుతుంటే మాట్లాడరేమిటి..

నేను ఏమి మాట్లాడదలచుకోలేదు కరుణ అని వెంటనే నోటి మీద వేలు వేసుకుంటాడు. ఏమైంది మీకు ఇప్పటిదాకా బానే ఉన్నారు కదా..

నాకన్నా బాగా నీ కొడుకు అయితే సెలెక్ట్ చేస్తాడని.. అక్కడ చూడు కోడలికి ఎంత బాగా సెలెక్ట్ చేస్తున్నాడు. వాడికున్న బుద్ధి మీకు లేదు.

చూడండి కాబోయే పెళ్ళానికి ఎంత బాగా చూస్తున్నాడో.. మీరు ఉన్నారు పెళ్లి ఇన్ని సంవత్సరాలైనా ఏమైనా సెలెక్ట్ చేశారా అంటుంది.

ఒసేయ్ పిచ్చి మాలోకమా.. మొగుడు ఎప్పుడైనా సెలెక్ట్ చేస్తాడు.  ఇక్కడ నీ కొడుకు నీకు సెలెక్ట్ చేయడంలోనే ఉంది అంటాడు.

ఏముంది.. నీకు ఎక్కువ రేటు పెట్టి సెలెక్ట్ చేస్తాడా.
  లేకపోతే పెళ్ళానికి ఎక్కువ రేటు పెట్టి సెలెక్ట్ చేస్తాడా..  అసలు ఇద్దరు డిజైన్లో ఎవరిది బ్రెస్ట్ డిజైన్ సెలెక్ట్ చేస్తాడు. అది ఇంపార్టెంట్.

అందులో ఏముంది ఎవరు ఏది తీసుకున్న ఇద్దరం మార్చుకుంటాం కదా.. మార్చుకోవడం వేరు.. ఇది నాది అనుకోవడం వేరు.

నాది ఎంత బాగుందో.. సెలెక్ట్ చేసింది నా కొడుకే అని నువ్వు చెప్పుకుంటే ఆ గర్వమే వేరు కదా అని అమాయకుడైన రాజ్ ని ఇరికించి మహదానంద పడిపోతాడు.

కళ్యాణ్, రమేష్ ఇద్దరూ ఉతికేసేలాగా చూస్తారు. పార్ధు వాళ్ళని చూసి నాలిక బయటపెట్టి మళ్లీ కామ్ గా
పెళ్ళాన్ని చూస్తాడు.

కరుణ ఆలోచిస్తుంటే..  ఏమిటే..  ఆలోచిస్తున్నావ్ వెళ్ళు అంటాడు. బాగోదు లేండి.  కొత్తజంట కదా.. వాళ్ళ ఎంజాయ్మెంట్ ని నేను ఎందుకు డిస్టర్బ్ చేయడం.

అయ్యో అందుకే నిన్ను పిచ్చమాలోకం అనేది. కొత్తజంట అంటే వాళ్ళిద్దరూ సపరేట్గా వచ్చినప్పుడు మాత్రమే. ఇప్పుడు వేరు.. వెళ్ళు వెళ్ళు అని పెళ్ళాన్ని రెచ్చగొట్టి పంపిస్తాడు.

కరుణ వెళ్ళగానే కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఒరేయ్ నువ్వు ఇంత శాడిస్ట్ అని అనుకోలేదురా..  ఎవరికైనా కోడలకి అత్తగారు సాధింపు ఉంటుంది.

కానీ నీకు కొడుకు పైన సాధించే జబ్బు ఏంట్రా.. అబ్బా అది సాధించడం కాదురా.. చిన్నప్పుడు నుంచి వీళ్ళు మనల్ని ఎంత టార్చర్ పెట్టి ఉంటారు.

కాలేజ్ కి వెళ్లడానికి... డ్రెస్సులు దగ్గర,  స్పోర్ట్స్ బైక్ అని కారు దగ్గర మామూలుగా చూపించలేదు కదా..  అవన్నీ నేను తీర్చుకోకుండా నా కోడలు చేతిలో ఎలా పెట్టగలను అంటాడు.

ఆ మాటకి రమేష్ అంటే నువ్వు టార్చర్ పెట్టి వదిలిన తర్వాత నివి టార్చర్ పెట్టాలన నీ ఉద్దేశం. కరెక్ట్ బ్రో బాగా గెస్ చేశావు అంటాడు.

ఇంత దారుణంగా తయారయ్యావ్ నువ్వు..  దారుణం కాదు.... ఇట్స్ ఫన్ ఎంజాయ్మెంట్. మీరు కూడా ఎంజాయ్ చేయండి.

నీ కొడుకు పెళ్లి అప్పుడు కూడా నువ్వు ఇలాగే చెయ్యి. ఆ ఎంజాయ్మెంట్ లో ఉన్న కిక్కే వేరబ్బా అంటాడు.  నీకు ఒక దండం రా స్వామి.. పాపం రాజ్ అని జాలిగా చూస్తారు.

ఇవేమీ తెలియని రాజ్..  నివి సెలెక్ట్ చేస్తూ ఉంటే... ఏది సెలెక్ట్ చేయాలా అర్థం కాక వాటి వైపు, నివి వైపు చూస్తూ ఉంటాడు.

రాజ్ అంటూ కరుణ రాగానే చెప్పమ్మా .. వీటిల్లో ఏది బాగుందో చూడరా అంటుంది.  అందులో రెండు చూసి ఇవి రెండూ నీకు చాలా బాగుంటాయి అంటాడు.

ఆ మాటకి నివి..  రాజ్ అని గట్టిగా అంటుంది.  ఏమైంది నివి... ఆంటీ చూపించగానే వెంటనే చెప్పేసావు. ఎప్పటినుంచో నేను అడుగుతుంటే..నాకు మాత్రం సెలెక్ట్ చేయడం లేదు.

నేను తీసుకోవడం నీకు ఇష్టం లేదా అని అలుగుతుంది. ఆ మాట నేనెప్పుడు అన్నాను.  అనక్కర్లేదు నీ చేతల్లోనే తెలుస్తుంది.

నాకేమీ అవసరం లేదు. వెళ్ళిపోదాం అంటుంది. అయ్యో నివి అలా ఫీల్ అవ్వకు.  నువ్వు సెలక్షన్ బాగా చేస్తావు కదా అందుకే నేను చూస్తూ ఉన్నాను అంటాడు.

అవునా అనగానే.. కరుణ కోపంగా అంటే ఏంట్రా... నాకు సెలక్షన్ రాదన నీ ఉద్దేశం అంటుంది. ఆ మాట నేను అనలేదు కదా...

ఇప్పుడు నువ్వు అన్న మాటకి అర్థం అదే కదా.. ఏమిటో మీ ఇద్దరికీ నేను మాట్లాడే మాటల్లో ఎన్నో అర్థాలు కనిపిస్తాయి. నాకే నేను మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా అర్థం కూడా కనపడడంలేదు అంటాడు.

రాజ్ ని మధ్యలో కూర్చోబెట్టి ఇటు తల్లి, అటు కాబోయే పెళ్ళాం కూర్చుని షాప్ లో ఉన్న డిజైన్స్ మొత్తం తీయించుతారు.

ఏది చూసినా రాజ్ బాగోలేదు అంటే ఛి ఛి నీకు అసలు టేస్ట్ తెలియడం లేదు అంటారు.  బాగుంది అని చెబితే అయ్యో రాజ్ నువ్వు ఓల్డ్ మోడల్ సెలెక్ట్ చేస్తున్నావ్ అంటున్నారు.

వీళ్ళతో ఎలారా దేవుడా అని తల పట్టుకుంటాడు.  ఫైనల్ గా ఒక పది పీసెస్ అక్కడ పెడతారు. వీటిల్లో వీళ్ళకి సెలెక్ట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది అని గబగబా పైకి లేచి నుంచి నివి నీకు ఇది బాగుంది. అమ్మ నీకు ఇది బాగుందని రెండు సెట్స్ చేతుల్లో పెడతాడు.

అందులో నివి కి తీసుకుంది 50 లాక్స్ ఉంటే కరుణకి తీసుకుంది 48 లాక్స్ ఉంటుంది. ప్రైస్ ట్యాగ్ చూడగానే కరుణ కోపంగా ఏరా నీకు కాబోయే పెళ్ళానికి ఏమో 50 లక్షలు పెట్టి తీసుకున్నావా.. నాకేమో 48 లక్షలా...

అమ్మ డిజైన్ బాగుండడం ఇంపార్టెంట్.. 2 లక్షలు దగ్గర ఏముందమ్మా అని పోనీ ఇద్దరూ మార్చుకోండి అంటాడు.  నివి నోనో నాకిది చాలా బాగా నచ్చింది.

అందులో ఫస్ట్ టైం నువ్వు సెలెక్ట్ చేసావు. థాంక్యూ రాజ్.. ఆంటీ కన్నా నాకు ఎక్కువ ప్రైస్ పెట్టు మరీ తీసుకున్నావు అంటుంది.

ఆ మాటకి రాజ్ భయంగా తల్లి వైపు చూస్తాడు.  కరుణ ఏడుపు ముఖంతో అప్పుడే పెళ్ళాం పార్టీలోకి మారిపోయావ్ ఏంట్రా...

మీ నాన్న ఇప్పటికీ మా అమ్మ మా అమ్మ అంటారు.   నువ్వు ఇప్పటి నుంచే  మా ఆవిడ మా ఆవిడ అంటున్నావ్.

నేనేనా ఎవరికి అక్కర్లేనిది.  నాకేమీ అవసరం లేదు అని అక్కడ పెట్టేస్తుంది. అయ్యో అమ్మ అని చెప్పి నివి నీది కూడా అక్కడ పెట్టేసేయ్ అని చెప్పి...ఈ సారి వేరేవి సెలెక్ట్ చేస్తాడు.

అందులో కరుణ ది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. నివిది తక్కువ కాస్ట్ ఉంటుంది. అది చూడగానే కరుణ హ్యాపీగా ఫీల్ అవుతే నివి అదేంటి రాజ్..  నువ్వెలా చేస్తావని అనుకోలేదు.

ఇప్పుడు ఏం చేశాను అంటాడు.  ఆంటీ ని హ్యాపీగా ఉంచడం కోసం నాకు ఇలా చీప్ గా తీసుకుంటావని అనుకోలేదు.

ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్లి అయ్యాక ఇంకా ఎలా ఉంటావో అని ముక్కుచీదుతూ ఉంటుంది.
  ఈసారి జుట్టు పీక్కోవడం ఒకటే మిగులుతుంది.

రాజ్ బాబు పెళ్ళాం తల్లితో ఒకేసారి షాపింగా ???
[+] 8 users Like SivaSai's post
Like Reply

Part - 122


ఇద్దరికీ సర్ది చెప్పేటప్పటికి రాజ్ తలప్రాణం తోకకోస్తుంది.  పార్ధు.. కొడుకు ఫీలింగ్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. రాజ్ ఇంక లాభం లేదు అనుకుని మేనేజర్ దగ్గరికి వెళ్లి చేయవలసింది అంతా చెబుతాడు.

సార్ అంటే..  ప్లీజ్ అంటాడు. సరే అని చెప్పి ఒక ఫోర్ సెట్స్ తెచ్చే అన్ని ఈక్వల్ ప్రైస్ చెప్తాడు. అప్పుడు ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయి చెరోఒకటి తీసుకుంటారు.

హమ్మయ్య అని గుండెల పైన చెయ్యి వేసుకుని బయటికి తీసుకు వస్తాడు.  అదిరా జరిగింది. అదేంటి ఈక్వల్ ప్రైస్ సెట్స్ తొందరగా మ్యాచ్ అవ్వవు కదా...

అక్కడ అంత సీన్ లేదమ్మా.. ఏదైనా సరే ఆ ప్రైసే చెప్పమన్నాను మిగిలింది మనీ క్రెడిట్ చేస్తానని చెప్పాను. అప్పుడే ఎంత డెవలప్ అయిపోయావు అని రాజ్ భుజం పైన పార్ధు తడతాడు .

మీరు చెయ్యి తీయండి నాన్న. అసలు ఇదంతా మీ వల్లే వచ్చింది. ఇది మరీ బాగుందిరా..ఇద్దరు ఆడవాళ్ళని హ్యాండిల్ చేయలేకపోతే ఎలా..

అవునా ఇప్పుడు దాకా మీరు హ్యాండిల్ చేశారు కదా అని ఏదేమైనా సరే విక్కీ నువ్వు మాత్రం చాలా లక్కీ అంటాడు. ఎందుకు అని నవ్వుతూ అడిగితే..  అసలు మా చెల్లి ఇది కావాలి అని ఇన్ని రోజుల్లో నిన్ను అడిగిందా..

అత్తయ్య ఏది ఇస్తే అదే నవ్వుతూ తీసుకుంటుంది.  నువ్వు బలవంతంగా తీసుకెళ్లి షాపింగ్ చేస్తే అది కూడా నీకు నచ్చిందే తీసుకుంటుంది.

ఇంట్లో లేడీస్ ప్రెషర్ లేకపోతే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా..  అందుకే అంటున్నా నువ్వు చాలా లక్కీ అని. వినయ్ వెంటనే బావ నోరు కంట్రోల్లో పెట్టుకో.

చెల్లి బయటికి వచ్చింది అంటే మళ్ళీ నీ పని అవుట్. అది నిజమేలే..  నాకెందుకు వచ్చిన గొడవ.  నేను వెళ్లి రెస్ట్ తీసుకోవాలి అని గదిలోకి పరిగెడతాడు.

వెళుతున్న రాజ్ ని చూసి నవ్వుకుంటు విక్రమ్ ఆలోచిస్తూ నిజంగా నేను చాలా లక్కీ..  అసలు ఏమీ అడగకుండా ఎలా ఉంటుంది నా పెళ్ళాం అనుకుని అవని కోసం వెతుకుతూ ఉంటాడు.

వదిన లేడీస్ బ్యాచ్ తో ఉంది అని వినయ్ అంటే..  నేను అడగలేదు కదా.. నువ్వు వెతుకుతున్నావు కదా... అలిసిపోతావేమో అని చెప్పాను అని అల్లరిగా అంటాడు.

నీకు అల్లరి ఎక్కువవుతుంది.  వాటికి కళ్ళెం వేస్తాను.. అప్పుడే వద్దు అన్నయ్య. రాజ్ బావని చూసాక కూడా తొందర పడితే అంతకన్నా తప్పులేదు. 

భార్గవి మెల్లిగా కళ్ళు తెరుస్తూమూస్తూ ఉంటుంది. మత్తుకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కష్టంగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది.

ఎక్కడున్నాను నేను అనే తల పట్టుకుని మెల్లిగా లేచి చూస్తూ ఉంటుంది.  ఆ గది అంతా కొత్తగా ఉంటుంది. ఇది మా ఇల్లు కాదే..  నన్ను ఎక్కడికి తీసుకువచ్చారు అని మెల్లిగా లేచి బయటకి వస్తుంది.

బయట ఇద్దరు ఆడవాళ్లు ఉంటారు. తలుపు చప్పుడికి వెనక్కి తిరిగి లేచావా అంటారు.  ఎవరు మీరు..  నేను ఎక్కడ ఉన్నాను.

ఎక్కడ ఉన్నావో తెలియనంత మత్తులో ఉన్నావా.. అంత మత్తెక్కిచ్చారా అని ఎగతాళిగా మాట్లాడుతారు.  ఆ మాటలు అర్థం కాక ఏం మాట్లాడుతున్నారు మీరు.

ఇప్పుడు నీతో మాట్లాడే అంత టైం లేదు.  వాళ్ళు వచ్చే టైం అయ్యింది. వెళ్లి రెడీ అవ్వు అంటుంది. ఎవరు వస్తున్నారు.

ఎవరో చెబితే గాని రెడీ అవ్వవా.. నువ్వు ఇలా విసగిస్తే నాలుగు పీకైనా రెడీ చేయించమన్నారు. మా వారే చెప్పుంటారు.. ఎంతైనా నేనంటే ప్రేమే.

ఏదో కోపంలో అలా ప్రవర్తించారు కానీ నన్ను వదిలి ఆయన ఎక్కడ ఉండగలరు. సరే ఇప్పుడే రెడీ అవుతాను అని లోపలికి వెళుతుంటే...  ఒక్క నిమిషం ఆగు అని కవర్ చేతికి ఇస్తారు.

ఏమిటిది.. రెడీ అవ్వడానికి చీర అవసరం లేదా.. ఆ చీర కవరు పట్టుకుని తన భర్తకి తన మీద ఎంత ప్రేమ అని మురిసిపోతూ స్నానానికి వెళుతుంది..

స్నానం చేసి వచ్చి  కవర్లో  చీర తీసి బిగుసుకుపోతుంది. ఆ చీర పట్టుకుని అలాగే నిలబడిపోతుంది.  బయట నుంచి ఆడవాళ్ళు ఇద్దరు తలుపుకొడుతూ..

ఎంతసేపు.. తొందరగా రెడీ అవ్వు  అంటే.. స్పృహలోకి వచ్చి వస్తున్న అని ఇప్పిన చీరనే ఒంటికి చుట్టుకుని మెల్లిగా తలుపు తీస్తుంది.

అదేమిటి ఇంకా ఈ బట్టల్లోనే ఉన్నావు. రెడీ అవ్వు అంటే.. నాకు ఆ చీర వద్దు.  ఇంకొక చీర ఉంటే ఇస్తారా అంటుంది.

ఓహో మహారాణి గారు దిగి వచ్చారు అని షాప్ తెచ్చి ఇక్కడ పెడతాము.  ఏమనుకుంటున్నావ్ నీ గురించి నువ్వు.

నీకు ఇచ్చిందే ఆ ఒక్క చీర అదే కట్టుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఒంటి మీద ఉన్న చీర కూడా ఉండదు అని ఆ చీర పట్టుకుని లాగుతారు.

ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు. మాకు చెప్పిన పని చేయడం వరకే మా డ్యూటీ అని చెప్పి ఒంటి మీద ఉన్న చీరను లాగేస్తూ ఉంటే గబుక్కున తలుపువేస్తోంది.

కానీ చీర ఆడవాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది.  భార్గవి వెంటనే టవల్ కప్పుకుని ఆ చీర ను పట్టుకును చూస్తూ ఉంటుంది. 


రాత్రి భోజనాలు అయిన తర్వాత విక్రమ్ గదిలోకి వెళ్లి అవని కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అందరికీ అన్ని చక్కబెట్టి పాల గ్లాసు తీసుకుని గదిలోకి వస్తుంది.

అయ్యాయా మేడంగారు పనులన్నీ..  ఎందుకో మావారు అలకపాన్పు ఎక్కారు అంటుంది. చెయ్య పట్టుకుని దగ్గరకి లాక్కుంటాడు.  అయ్యో ఉండండి పాలు ఉన్నాయి.

భార్యగారి మురిపాల ముందు ఈ పాలు ఎంతలే అంటాడు.  ఏమైందో మా శ్రీవారికి..  ఇలా రా కూర్చో అని పాల గ్లాసు చేతిలోంచి తీసుకుంటాడు.  చెప్పండి అంటుంది.

అవని రెండు చేతులను తన చేతిలోకి తీసుకొని చేతిలో వైపు చూస్తాడు.  చేతులకు బంగారం మట్టి గాజులు కలిపి వేసుకుంటుంది.  నిండుగా కనపడతాయి.

ఆ చేతులు పైన ముద్దు పెడతాడు. నవ్వుతూ ఏమైందండీ అంటుంది.  మెడ వైపు చూస్తాడు సూత్రాలు తాడు నల్లపూసలు తప్ప ఇంకే అలంకరణ ఉండదు.

భార్య ముఖం చూస్తూ ఉంటే ప్రపంచంలోనే సంతోషమంతా తన దగ్గరే ఉందా అనిపిస్తుంది.  అవని అని ప్రేమగా పిలుస్తాడు.

చెప్పండి. నేనొక విషయం అడుగుతాను.  సూటిగా సమాధానం చెబుతావా అంటాడు. మీరు అడగడం నేను చెప్పకపోవడం. అది ఎప్పుడైనా ఉందా.. ప్లీజ్ బంగారం అంటాడు సరే అడగండి అంటుంది.

ఈరోజు అందరూ షాపింగ్ కి వెళ్ళారు కదా నువ్వు ఎందుకు వెళ్ళలేదు . మీరు రాలేదుగా అంటుంది.  నీకు నచ్చింది తీసుకోవడానికి ఏమైంది.

మీకు నచ్చంది ఏదైనా సరే నాకు నచ్చదు.  ఇప్పటికే నేను పెట్టుకొని బంగారమే చాలా ఉంది.  మరి చీరలైనా తీసుకోవచ్చు కదా..

ఒకసారి ఇలా రండి అని క్లోసట్ దగ్గరికి తీసుకు వెళ్లి ఓపెన్ చేస్తుంది. చూడండి ఎన్ని చీరలు ఉన్నాయో..  ఇవన్నీ కట్టేటప్పటికీ మన పిల్లలు పెళ్లికి కూడా వచ్చేస్తారు.

నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని ఏంటి అమ్మాయి గారికి పిల్లలు మీదకి మనసు మళ్ళింది. నేను మాట వరసకి చెప్పాను స్వామి.

దాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవద్దు.  అరే నేను అసలే పక్క బిజినెస్ మాన్ ని. ఎలాంటి పరిస్థితులను అయినా సరే నాకు అనుకూలంగా మార్చుకోవాలి. లేకపోతే నేను బిజినెస్ మాన్ ఎలా అవుతాను చెప్పు అని రెండు చేతులతో లిఫ్ట్ చేస్తాడు.

మెడ చుట్టూ చేతులు వేసి అంటే పిల్లల మీదకి మీకు గాలి మళ్లీందా..  ఏమో ఎవరికి తెలుసు అని మంచం మీద పడుకోబెడతాడు.

పక్కనే పడుకొని ముంగురులను సవరిస్తూ బాగా అలసిపోతున్నావు.  సర్వెంట్స్ ఉన్నారు కదా కూర్చుని వాళ్లతో చేయిపించు.

మన వాళ్ళకే నా చేతులతో చేస్తేనే నాకు తృప్తి.  చిన్నప్పటినుంచి నేను మిస్సయిన ప్రతి రిలేషన్ ని ఎమోషన్ ని ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్నాను.

ప్లీజ్ మీరు అడ్డుపడొద్దు. నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి. కానీ ఈ మధ్యన కొద్దిగా అలసటగా కనిపిస్తున్నావు.  వర్క్ తగ్గించుకో అంటాడు.

సరే సరే నివి పెళ్లి అయిన తర్వాత అంతా ఖాళీయే కదా.. అప్పుడు ఫుల్ గా రెస్ట్ తీసుకుంటాను అంటుంది.  నివి పెళ్లయితే ఖాళీ ఎలా అవుతావు..

ఇంకా వినయ్ భరత్ లేరా.. అరే వాళ్ళిద్దరికీ సంబంధాలు చూసారా.. నాకు ఎవరూ చెప్పలేదే... హలో మేడం గారు ఉన్నారు అన్నాను.. చూశారు అని చెప్పలేదు కదా..

ఎవరి పెళ్లి భాజా ఎప్పుడు మోగుతుందో ఎవరికి తెలుసు.. వినయ్ పెళ్లి అయితే నాకు తోటి కోడలు వస్తుందన్నమాట..  భరత్ అన్నయ్యకి  పెళ్లయితే మరదలు వస్తుంది.

మన ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది కదా అని సంబరంగా చెబుతుంది. అవని ఫేసు చూస్తూ ఉంటే కల్మషం లేని పసిపాప నవ్వులాగా ఉంటుంది.

అందరినీ తన వాళ్లే అనుకుంటుంది. ఇంత మంచి మనసున్న బంగారం..  భార్యగా రావడం నిజంగానే నేను చాలా లక్కీ అని పెదవులు అందుకుంటాడు.

భర్త ప్రేమలో ఆ రాత్రిని మరో మధురమైన రాత్రిగా మలుచుకుంటారు.

భార్గవి కి మరో దారి లేక ఆ చీర కట్టుకుంటుంది. బయట ఉన్న ఇద్దరు ఆడవాళ్లు అయ్యిందా అని అరుస్తారు. మెల్లిగా తలుపుతీస్తుంది.

పరవాలేదు ఈ వయసులో కూడా కత్తిలాగా ఉన్నావు. ఏమిటా మాటలు..  సరిగ్గా మాట్లాడండి అంటే అబ్బో నీలాంటి వాళ్లకు కూడానా...

అటు తిరుగు జడ వేస్తాము అని వాళ్లే జడ వేసి తల నిండా పువ్వులు పెడతారు.  ఇప్పుడు ఇవన్నీ ఏమిటి అంటే ఏమీ తెలియనట్టే అడుగుతున్నావు.

ఇవన్నీ నీకు అలవాటే కదా మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నావ్ అని బుగ్గ మీద పొడుస్తారు. నాకు అలవాట అని భయంగా చూస్తోంది.

ఏమిటి ఆ చూపు..  ఒకసారి నిన్ను నువ్వు అద్దంలో  చూసుకో...

భార్గవి అద్దంలో చూసుకోని బిగుసకుపోతుంది. ఆ రూపం చూడగానే వెంటనే అవని గుర్తుకు వస్తుంది.

కర్మ....

కథ కొనసాగుతుంది..
[+] 12 users Like SivaSai's post
Like Reply

Oka Thrilling Ghost Story Undi Readers Kavali Ante Post Chestanu


With Admin Permission 



Ghost Stories Post Cheya Choo Ledo Naku Teliyadu Admin Permission isthe Compulsory Post Chestanu
[+] 2 users Like SivaSai's post
Like Reply

Part - 123


భార్గవి తన రూపాన్ని చూసుకుని వణికిపోతూ ఉంటుంది. ఆడవాళ్ళు ఇద్దరూ వచ్చి ఈ వయసులో కూడా ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నావ్.. ఏమిటి నీ సీక్రెట్..

ప్లీజ్ మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు దయచేసి చెప్పండి అంటూ అడిగితే..  ఏమీ తెలియనట్టుగా భలే యాక్ట్ చేస్తున్నావే...

నీకు ఇవి అలవాటే కదా.. మీరు ఏం మాట్లాడుతున్నారు.  ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు అని అలా జరగడానికి వీల్లేదని మనసులో అనుకుంటూ వాళ్ళ వైపు చూస్తుంది.

తెలియకపోవడానికి ఏముంది ఇప్పుడు నలుగురు కస్టమర్స్ వస్తారు. వాళ్లకి మందు సప్లై చేయాలి.  తర్వాత చిందు,  విందు అన్ని అంటే నేను అలాంటి దాన్ని కాదు.

అవన్నీ మాకు తెలియదు. మా వల్ల ధనుంజయ్ సార్ కి లాభం వచ్చింది.  అందుకే నిన్ను మాకు అప్పచెప్పారు.. కాబట్టి నువ్వు మాకు నచ్చిన విధంగా ఉండాల్సిందే అని చెబుతారు.  ఆ మాటలకి బుర్ర తిరుగుతూ ఉంటుంది.

తన అరేంజ్ చేసిన మనుషులతో ఆరోజు అవని కి కూడా ఈ విధంగానే చెప్పేస్తుంది.  ఇదంతా  విక్రమ్ పనా అని విక్రమ్ తలుచుకోగానే వణికి పోతుంది.

విక్రమ్ పనిష్మెంట్ ఇస్తే ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పటికి కొద్దిగా అవగాహన లోకి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి తలుచుకుంటే మాత్రం వెన్నుల్లో వణుకుపుడుతుంది.

మెల్లిగా వాళ్లని మీతో ఈ పని చేపిస్తుంది ఎవరు.. ఇంకెవరూ ధనుంజయ్ సారు అని చెబుతారు. ఏంటి మావారా..  ఆయన నీ భర్త.. ఏవమ్మో ఏం మాట్లాడుతున్నావు.

ఆయనకు ఉన్నది ఒకే భార్య. ఒకే కూతురు.. అవునవును ఆ భార్యను నేనే అని గుండెలపైన చేతులతో కొట్టుకుంటూ చెబుతుంది.

చాలు చాల్లే అమ్మ.  నువ్వు నీ అవతారం చూసుకున్నావా..  ఆయన భార్య పేరు రజిత. కూతురి పేరు అవని. మాకు తెలియదు అనుకుంటున్నావా?

కస్టమర్స్ వచ్చే టైం అయింది పద పద అనే లాక్కునివెళుతూ ఉంటారు. ప్లీజ్ నేను అలాంటి దాన్ని కాదు.  ఒక్కసారి మీరు ధనుంజయ్ గారితో మాట్లాడండి అంటే ఇక్కడే ఉన్నారు.

ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తూ ఇక్కడే ఉండి నేను బాధపడుతుంటే చూస్తున్నారా.. నువ్వు ఏమన్నా స్పెషల్ ఆ ఏమిటి అని వెటకారంగా మాట్లాడతారు.

ఒక్కసారి ధనుంజయ్ గారిని రమ్మను.  నేనేంటో మీకే తెలుస్తుందని ఉక్రోషంగా ఉంటుంది. చింత చచ్చిన పులుపు చావలేదంటే ఇదేనేమో..

నీ జీవితం ఇక్కడికి వచ్చిన సరే ఇంకా ధనుంజయ్ గారితో మాట్లాడాలి అంటున్నావు. సరే నీ ముచ్చట ఎందుకు కాదంటాము.  పిలుచుకోస్తాము అని వెళ్లి ధనుంజయ్ ని పిలుచుకొస్తారు.

ఏమిటీ ఇంకా రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావ్. స్పీడ్ గా భర్త దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి చెయ్యి పట్టుకోపోతుంది. వెంటనే ధనుంజయ్ ఒక అడుగు వెనక్కి వేసి ఎన్నిసార్లు చెప్పాను నన్ను ముట్టుకోవద్దని.

సరే సరే మిమ్మల్ని నేను ముట్టుకోను. కానీ ఏమిటి ఇదంతా..  నువ్వు చేసిందే.  నీకు ఇలాంటివి ఇష్టం కదా. మాటలు మర్యాదగా రానివ్వండి.

ఏ ఆడదైనా ఇలాంటి నీచపు పనులకు ఒప్పుకుంటుందా.. ఓహో హంతకురాలమైన నువ్వే ఒప్పుకోలేవు.. అలాంటిది విలువైన వజ్రానికి పుట్టిన నా బంగారు తల్లి ఎలా ఒప్పుకుంటుంది.

ఆ నీచపు పని చేసిందే కాకుండా అది మళ్ళీ నేను చేయించాను అన్నట్టుగా నా కూతురు ముందు ఎందుకు ప్రవర్తించారు చెప్పు అని గట్టిగా అరుస్తాడు.

ఆ మాటకి భయంగా భర్త వైపు చూసి ఈ విషయం మీకు ఎలా తెలుసు. నాకు ఎలా తెలుసు అన్నది పక్కన పెట్టు.  అసలు ఎలా చేయగలిగారు.

అప్పుడు నీ కూతురు కనపడలేదా... ఎన్ని కష్టాలు పెట్టావు అయినా ఓర్చుకుంది. అంతటితోనే మనసు శాంతించలేదా..

ఒక సర్వెంట్ కి ఉన్న జాలి దయ కూడా నీకు లేదు అంటే.. నీది ఎంత రాక్షసి జాతో అర్థమవుతుంది. రాక్షసులతో కూడా నిన్ను పోల్చకూడదు. అవి అయినా కొంచెమైనా విశ్వాసంతో ఉంటాయి.

నీది అంతకన్నా  నీచాతి నీచమైన జన్మ. ఎందుకు పుట్టాను అని నువ్వు ఏడ్చేలాగా చెయ్యకపోతే నేను అవనికి తండ్రినే కాదు.

ఇదంతా అబద్ధం అండి. అవని తో నేను ఎందుకు అలా ప్రవర్తిస్తాను.  మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇప్పటికీ నీ తప్పును ఒప్పుకోలేకపోతున్నావు కదా..

పోనీ ఈ చీరైనా గుర్తుందా లేకపోతే అది కూడా గుర్తు లేనట్టుగా నటిస్తున్నావా అంటే... టెన్షన్ గా ఒక రకమైన భయంతో భర్తను చూస్తూ ఉంటుంది.

నీ జీవితం ఇంకా ఇక్కడే అనుభవించు అని చెప్పి ధనుంజయ్ వెళ్ళిపోతాడు.  వెనకాల పరిగెడుతూ ప్లీజ్ అండి నేను చేసినది తప్పే..  ఒప్పుకుంటాను.

ఇంత భయంకరమైన శిక్ష నాకు వెయ్యొద్దు. మీ కాళ్లు పట్టుకుంటాను.  నువ్వు కాళ్లు పట్టుకున్న ప్రాణాలు తీసుకుంటాను అన్నా కనికరించను.

నీ మీద జాలి చూపిస్తే విక్రమ్ ఎప్పటికీ నా కూతుర్ని కలవనివ్వడు. ఇదంతా విక్రమ్ చెబితే మీరు చేస్తున్నారా..  నిన్న గాక మొన్న వచ్చిన విక్రమ్ మాటకి ఇచ్చిన విలువ నాకు ఇవ్వరా..

విక్రమ్ కి విలువలు ఉన్నాయి. నీకేమన్నాయి హంతకురాలు అన్న బిరుదు తప్ప.  జరిగిందేదో జరిగిపోయింది అండి.

అవని సంగతి వదిలేయండి. మీకు ఇంకొక కూతురు ఉంది నేను ఉన్నాను సరిపోతుంది కదా..  మనం సంతోషంగా ఉందామండి.

అవని సంగతి విక్రమ్ చూసుకుంటాడు కదా.. ఛీ... ఛీ.. ఇంత జరిగినా నువ్వు మారవు కదా అని ఆడవాళ్ళు ఇద్దరి వైపు చూసి దీని సంగతి ఇంక మీరు చూసుకోండి అని ఒక తోపు తోసి వెళ్ళిపోతాడు.

భర్త వెనకాల వెళ్లబోతుంటే ఆడవాళ్ళు ఇద్దరు వచ్చి చేరో పక్కన పట్టుకుని లోపలికి లాక్కుని వెళ్ళిపోతారు.

జై సింహ మాన్షన్ నిశ్చితార్థ వేడుకకి అందంగా అలంకరించబడుతుంది.

నివి బాపుబొమ్మ లాగా అందంగా ముస్తాబవుతుంది. వినయ్ మాత్రం గుమ్మం దగ్గరే నిలబడి బయటికి  చూస్తూ ఉంటాడు.

ఈ పిల్ల ఏంటి  ఇంకా రాలేదు. చీర కట్టుకుని వస్తుందా లేకపోతే నిన్నటిలాగ డ్రెస్ వేసుకుంటుందా.  డ్రెస్ వేసుకున్న పరవాలేదు ఆ లౌడ్ స్పీకర్ జీన్స్ వేసుకోకుండా ఉంటే చాలు.

డెకరేట్ చేసిన వాళ్ల దగ్గరికి వెళ్లి మీ పూజిత మేడం ఇంకా రాలేదేంటి.  మేడమ్ అవసరం ఇంకా లేదు కదా సార్ అందుకే రాలేదు అని చెబుతారు.

అవసరం లేదు ఏంటి ఏదైనా తేడా వస్తే ఎవరిది రెస్పాన్సిబులిటీ.. ఎక్కడ ఉన్నా రమ్మనండి అని కొంచెం కోపాన్ని నటిస్తూ చెబుతాడు.

సార్ ఏదైనా తేడాగా అనిపిస్తే మాకు చెప్పండి సార్. మేము సరిచేస్తాము.  లేదు లేదు నిన్నంతా మీ పూజిత మేడమే కదా దగ్గరుండి మరీ చేపించారు.

మరి అలాంటప్పుడు ఇప్పుడు కూడా చూసుకోవాల్సింది ఆవిడే కదా..  ఇంత పెద్ద కాంట్రాక్ట్ ని అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే ఎలా...

ప్లీజ్ సార్ మీరు కొంచెం కూల్ గా ఉండండి మేడంకి మేము కాల్ చేస్తాము అని చెప్పి పక్కకు వెళ్లి ఫోన్ చేస్తారు.  ఇదంతా చూస్తున్న భరత్... ఒరేయ్ వినయ్ నిజం చెప్పరా...

ఈ డెకరేషన్ లో తేడానా లేకపోతే పిల్ల మీద బెంగన..  పిచ్చి బావ నేను రాజ్ బావ ని చూసాక కూడా అలాంటి పిచ్చి పనులు చేస్తానా ఏమిటి.

నిన్ను చూస్తుంటే మాత్రం నాకు అదే డౌట్ కొడుతుంది రా... అబ్బా అలాంటిదేమీ లేదు బావ. ఆ పూజిత నన్ను చాలా ఆడుకుంది..

అందుకనే నేను సీరియస్గా వార్నింగ్ ఇద్దామని. మనమేంటో చూపిద్దామని. నిజమా నమ్మాలంటావ్.. నమ్ము బావ నీ దగ్గర నేనెప్పుడైనా అబద్ధం చెప్పానా.. అవునవును ఈ మధ్యన కొంతమంది మరీ నిజాలు ఎక్కువ చెబుతున్నారు లే.. పదా అని తీసుకువెళ్తాడు.

అవని పట్టుచీర కట్టుకొని రెడీ అవుతుంది.  అవనికి మ్యాచింగ్ గా విక్రమ్ కూడా రెడీ అవుతాడు.  వెళుతున్న అవనినీ  ఆపేస్తాడు.

ఏమైందండీ అని ఆడిగితే పైనుంచి కిందకి చూస్తాడు. చిలకాకుపచ్చ పట్టు చీర కట్టుకుని ఉంటుంది. దానికి రాణి పింక్ బోర్డర్ వస్తుంది. చీర పర్ఫెక్ట్ అంటాడు.

చిన్నగా నవ్వుతుంది. కానీ ఏదో లోటు బంగారం అంటాడు.  ఏంటే చీర సరిగ్గా కట్టుకోలేదా అని అద్దం ముందు నుంచునిచూస్తూ ఉంటే..

చీర బాగానే కట్టుకున్నావు మరి ఆ చీరకు తగ్గట్టుగా మెడలో కూడా పెట్టుకోవాలి కదా.. అబ్బా నాకు అంత ఎక్కువ గోల్డ్ పెట్టుకుంటే ఏంటో ఇబ్బందిగా అనిపిస్తుంది.

మొదటి నుంచి నాకు అలవాటు లేదు కదా... పెళ్లికి ముందు నువ్వు ఏమిటి అన్నది నాకు అనవసరం.  పెళ్లయిన తర్వాత నువ్వు మిస్సెస్ అవని విక్రమ్.

నీతోనే నా గౌరవం ఉంటుంది.  కాబట్టి దానికి తగ్గట్టుగా రెడీ అవ్వు. లేదుఅంటే అందరూ  గ్రేట్ బిజినెస్మేన్ అయిన విక్రమ్ గారు వాళ్ళ ఆవిడకి కనీసం చిన్న నెక్లెస్ కూడా కొనలేదే అని నన్నే అనుకుంటారు.

అయ్యబాబోయ్ నేను గోల్డ్ పెట్టుకోకపోతే జనం ఇన్ని రకాలుగా మావారిని అనుకుంటారా..  చాలు చాల్లే అండి మీరు చెప్పేది అని చిన్నగా కసురుకుంటూ..

విక్రమ్ ఇచ్చిన సెట్ పెట్టుకుంటూ ఉంటుంది.  వెయిట్ నేను పెడతాను ఉండు అని చెప్పి మెడలో పెట్టి... నడుముకి వడ్డాణం పెడతాడు.

ఏమండోయ్ పెళ్లికూతురు నివి. నేను కాదు. నా కళ్ళకి నువ్వు ఎప్పుడూ పెళ్ళికూతురు లాగానే కనిపిస్తావు అని కాటుక తీసి అరి పాదంలో దిష్టి చుక్క పెడతాడు.  ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నావు.

పద వెళదామని చెయ్యి పట్టుకుని తీసుకువెళతాడు. అవని బయటకు వచ్చిన తర్వాత నివి దగ్గరికి వెళతాను అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది..

పరిగెడుతున్న భార్యని జాగ్రత్త అంటూనే ఉంటాడు ఈ లోపు నివి దగ్గరికి వెళ్ళిపోతుంది.

భార్య హడావిడికి నవ్వుకుంటూ ఫంక్షన్ దగ్గరికి వెళ్లి ఇంకా ఏమైనా తేడా ఉన్నాయా అని చెక్ చేస్తూ ఉంటాడు. ఎక్స్క్యూజ్మీ సార్ అన్న వాయిస్ వినపడి ఎస్ అని వెనక్కి తిరుగుతాడు.

ఐ యాం పూజిత. ఈ ఎంగేజ్మెంట్ డెకరేషన్ కాంట్రాక్ట్ మాదే సార్. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి సరిచేస్తాను.  అదే అబ్జర్వ్ చేస్తున్నాను అని చూసి పర్ఫెక్ట్ అంటాడు.

పూజిత??
[+] 9 users Like SivaSai's post
Like Reply

Part - 124


విక్రమ్ మెచ్చుకునేటప్పటికీ పూజిత ముఖం వెలిగిపోతుంది. థాంక్యూ సార్ మీకు నచ్చింది అంటే ఇంకా ఎవరికీ వంకలు దొరకవు అని వినయ్ ని చూస్తూ అంటుంది.

అమ్మని ఎంత మాట అన్నావే అని పైనుంచి కిందకి చూస్తూ ఉంటాడు. సింపుల్ గా ఉండే చీర కట్టుకొని తలలో ఒక రోజ్ పెట్టుకుంటుంది.

చేతికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకుంటుంది. మెడలో సింపుల్ గా ఉండే గోల్డ్ చైన్ పెట్టుకుంటుంది. పరవాలేదు పాపకి కొంచెం టేస్ట్ ఉంది అని దగ్గరికి వెళ్ళి గుడ్ అంటాడు.

థాంక్యూ సార్ అని సాగదీస్తుంది. డెకరేషన్కే కాదు చెప్పినట్టుగా పద్ధతిగా చీర కట్టుకొచ్చినందుకు.  అయ్యో ఇది మీరు చెప్పారని కట్టుకోలేదు సార్.

పద్ధతులు కొన్ని ఫాలో అవ్వాలి కదా.. పరిస్థితులు బట్టి రెడీ అవుతాను అంటుంది.  నేను కట్టుకోమంటే కట్టుకున్నావని నేనేమీ అనలేదే.. బాగున్నావు అని చెప్పాను.

ఏమిటి నేను కట్టుకోమంటే కట్టుకున్నందుకు థాంక్స్ చెప్తాను అని ఏమన్నా కలలు కంటున్నావా.. అయ్యో సార్ నాకు పగటి కలలు కనడం  అస్సలు రాదు.

ఎందుకంటే నేను అసలు ఖాళీగానే ఉండను కదా..
అమ్మాయి గారు రాత్రులు ఖాళీగా ఉంటారు అన్నమాట.
ఏ టైం కి ఫ్రీనో...

ఏ టైం అంటే ఏం చెబుతాను సార్. రాత్రి 9:00 నుంచి ఖాళీ. ఆ టైంలో మేడం గారికి ఫోన్ చేస్తే మాట్లాడడానికి అవైలబుల్ గా ఉంటాను అని చెబుతున్నారా.

బిజినెస్ విషయాలన్నీ ఈవినింగ్ సిక్స్ కే క్లోజ్ చేసేస్తాను.  నైన్ తర్వాత అంత నా పర్సనల్ అంటుంది. నేను అనేది కూడా అదే అమ్మాయి.

నీ పర్సనల్ 9 తర్వాత అయితే ఖాళీ అప్పుడే మాట్లాడతాను అంటున్నావ్ అంతే కదా.. ఇదిగో అబ్బాయి మర్యాదగా చెబుతున్నాను.. ఆ టైంలో ఏమైనా ఫోన్ చేసి విసిగిచ్చావు అనుకో..

నా సంగతి నీకు అస్సలు తెలీయదు. ఆ సంగతి చూడడానికైనా నేను ఫోన్ చేస్తాను అమ్మాయి.  లిఫ్ట్ చేయలేదు అంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చి మీ నాన్నతో మీటింగ్ పెడతాను.

మీ అమ్మాయి నన్ను ఇంటికి రమ్మంది అని చెబుతాను అర్థమైందా.. అవును నువ్వు చెప్పగానే మా నాన్న నమ్మేస్తారు.

మరి అక్కడ ఉంది ఎవరు అనుకుంటున్నావు మా నాన్న అని జడ తిప్పుతూఅంటుంది.  అవునా సరే అయితే ఈరోజు సాయంత్రం డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతాను. నమ్ముతారో లేదో చూద్దాం అని కళ్ళుఎగరేస్తాడు.

నువ్వు వచ్చినప్పుడు సంగతి కదా అని అంటుంది. చూద్దాం అది కూడా...

నిశ్చితార్థం దగ్గర అన్ని సిద్ధం చేసి నివి, రాజ్ ఇద్దర్నీ కూర్చోబెడతారు.  పెద్దవాళ్లందరూ అక్షంతలు వేసిన తరువాత ఉంగరాలు మార్చుకుంటారు.

పూజిత నిశ్చితార్థాన్ని చూస్తూ ఉంటే వినయ్ పక్కన నిలబడి ఏంటమ్మాయ్ అలా చూస్తున్నావు.నీకు కూడా పెళ్లి మీదకి గాలి మళ్లీందా.

ఇదిగో అబ్బాయి చూసినంత మాత్రాన పెళ్లి మీదకు గాలి మళ్లీనట్టు కాదులే అంటుంది. అవునా తమరికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్న అబ్బాయి కావాలో..

నీలాగా మాత్రం కాదు. ఏ నాకేం తక్కువ.. అన్ని ఎక్కువే అందుకే వద్దు అంటున్న. నీకు కొంచెం వెటకారం ఎక్కువ అంటే..  థాంక్యూ అంటుంది.

ఎందుకు.. నాలో ఉన్న క్వాలిటీ చెప్పినందుకు. నిన్ను చేసుకునేవాడు ఎవడో కానీ చుక్కలు కనపడతాయి. ఒక స్మైల్ ఇచ్చి థాంక్యూ అంటుంది.

ఖర్మరా బాబు అని తలకొట్టుకుంటాడు. మరి గట్టిగా కొట్టుకోకు బొప్పి కట్టిందనుకో ఎవరు కొట్టారా అని అందరూ నిన్నే చూస్తారు.

నన్ను ఎవరైనా అలా చూడడం నీకు ఇష్టం లేదా.. మధ్యలో నా ఇష్టంతో సంబంధం ఏముంది.  మీ సార్ పిలిచారు అనుకో... ఆ బొప్పి కట్టిన తలతో వెలితే చండాలంగా ఉంటుంది.

మా సార్ కి తెలుసులే ఎప్పుడు నన్ను పిలవాలో అనేటప్పటికి.. విక్రం వినయ్ అని పిలుస్తాడు.  వస్తున్న అన్నయ్య అని పరిగెడతాడు.

అదేంటి నలుగురిలో కూడా అన్నయ్యనే పిలుస్తున్నాడు. ఈ మనిషికి కొంచెం కూడా రెస్పెక్ట్ తెలియడం లేదు.  రాజ్ ఉంగరం పెట్టిన తర్వాత ఏనుగు ఎక్కినట్టుగా సంబరపడిపోతాడు.

శ్రీ పక్కకు వచ్చి ఒరేయ్ ఎక్కువ సంబరపడిపోకు. ఇది ఆరంభం మాత్రమే అంటాడు. నేనేమి సంబర పడడం లేదు. నార్మల్గానే ఉన్నాను.

నీ ఫేస్ లో కనపడుతుంది రా..  కొంత మంది దాయాలి అనుకున్న దాయిలేరు. అది అంతే. అందులో నువ్వు ఫస్ట్ అంటాడు.

ఒరేయ్ మా నాన్న అయిపోయాడు.  ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా. మేము ఎవ్వరం ఆడుకోవడం లేదురా.. నువ్విచ్చిన లూప్స్ తోనే దొరికిపోతున్నావు. నా కర్మ అంటాడు.

అరే అప్పుడే అనుకోకు ముందుంది అసలు పండగ. ప్లీజ్ రా కాసేపైనా నన్ను సంతోషంగా ఉండనివ్వండి.  నువ్వు దిగితే మా నాన్న ఎక్కుతాడు.  ఎందుకు చెప్పండి అంటే ఎంజాయ్ ఆల్ ద బెస్ట్ రా మామ అని చెప్పి నవ్వుతాడు.

ఫంక్షన్  చాలా గ్రాండ్ గా  జరుగుతుంది. వచ్చిన గెస్ట్లందరూ భోంచేసిన తరువాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకేసారి కూర్చుంటారు.

విక్రమ్ కూర్చుని అవని కోసం చూస్తూ ఉంటే.. ఏంటి బావ మా చెల్లి కోసమా అని భరత్ అడుగుతాడు.  అవును రా ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది.

కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ వేరులే బావ. అవని ఇంట్లో తిరుగుతూ ఉంటే మంచి సందడిగా ఉంటుంది కదా.. అవును ఒక్క నిమిషం కనిపించకపోయినా ఎవరికి ఏమి తోయడం లేదు.

ఇది నిజమే బావ అంటాడు. అవని స్వీట్స్ పుచ్చుకొని వస్తూ ఉంటుంది అది చూసినా లలిత నువ్వెందుకు బంగారం తెస్తున్నావు.  సర్వెంట్స్ ఉన్నారు కదా..

మన పని మనం చేసుకోవడంలో తప్పేముందిలే అత్తయ్య అని చెబుతూ.. ముందుకి తూలుతుంది..ఏ అవని జాగ్రత్త అని అందరూ ఒక్కసారిగా అరుస్తారు.

విక్రమ్ స్పీడ్ గా లేచి దగ్గరికి వెళతాడు. అవనినీ గట్టిగా పట్టుకొని ఏమైంది. ఏమీ లేదు కొంచెం అలసటగా ఉంది అంతే అంటుంది.

అందుకే చెప్పాను రెస్ట్ తీసుకో. ఇంతమంది సర్వెంట్స్ ఉన్న అన్ని నువ్వే చేయాలి అంటావు అని చేతిలో ఉన్న స్వీట్స్ తీసుకుంటాడు. వెంటనే ఒక సర్వెంట్ వచ్చే స్వీట్స్ ప్లేట్ తీసుకుంటుంది.

సరే పద అనగానే.. కళ్ళు తిరిగినట్టుగా అనిపించి విక్రమ్ మీద పడిపోతుంది.  అవని ఏమైంది అని బుగ్గల మీద కంగారుగా తడుతూఉంటాడు.

నిశ్చితార్థానికి వచ్చిన ధనుంజయ్ కూడా కంగారు పడుతూ ఉంటాడు.  అవనికి ఏమైందా ఏమిటో.. లక్ష్మీదేవి లాగా కళకళలాడుతూ ఉంది.

ఎంతమంది పాపిష్టి కళ్ళు పడ్డాయో.. దిష్టి తగిలి ఉంటుంది నా చిట్టి తల్లికి అని కంగారు పడిపోతూ ఉంటాడు.   

సురభి వెంటనే దగ్గరికి వచ్చి విక్రమ్ ముందు గదిలో పడుకోబెట్టు. సరే ఆంటీ రండి అని గబగబా గదిలోకి తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెడతాడు.

అందరూ బయటికి వెళ్ళండి.  నేను ఒకసారి చెక్ చేస్తాను. విక్రమ్ లేదు నేను ఇక్కడే ఉంటాను.  ప్లీజ్ ఆంటీ అంటాడు. ప్లీజ్ విక్రమ్ తనకి కొంచెం గాలి ఆడని.  ఏమైందో నేను చూస్తే ఒక క్లారిటీ వస్తుంది కదా..

సరే నేను కొంచెం దూరంలో నిలబడతాను అంటాడు. విక్రమ్..  అవనికి ఏమీ కాలేదు.  నేనున్నాను కదా..  ప్లీజ్ బయటికి వెళ్ళు అని బలవంతంగా బయటకు పంపిస్తుంది.

అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు.  విక్రమ్ మాత్రం తలుపుకి జారాబడినట్టుగానే నిలబడతాడు.  15 నిమిషాలకి సురభి మెల్లిగా తలుపు తీసుకుని బయటకి వస్తుంది. అందరూ సురభి ఏమి చెబుతుందా అని చూస్తూ ఉంటారు.

సురభి విక్రమ్ ముందుకు వచ్చి విచారంగా ముఖంపెట్టి విక్రమ్ అంటుంది. చెప్పండి ఆంటీ ఏమైంది అని కంగారుగా అడిగితే..  నువ్వు ఇంత పని చేస్తావ్ అనుకోలేదు అని భుజం మీద చేయి వేస్తుంది.

ఆ మాటకి అందరూ ఆశ్చర్యపోతారు. విక్రమ్ కూడా ఆశ్చర్యంగా నేనేమి చేశాను ఆంటీ. నువ్వు చేయబట్టే కదా మా అమ్మాయి అలా పడిపోయింది ఇదంతా నీ తప్పే కదా..

ప్లీజ్ ఆంటీ సరిగ్గా చెప్పండి నాకు చాలా టెన్షన్ గా ఉంది అంటే అప్పుడే ఇంత టెన్షన్ పడితే ఎలా...  ఇంకా ఎనిమిది నెలలు టెన్షన్ పడాలి కదా అంటుంది.

ఎనిమిది  నెలలు టెన్షన్ పడడమేమిటి అని లలిత కి, మాధవికి స్ట్రైక్ అయి సురభి అని అరుస్తారు. అబ్బా అరవకండే బాబు.

నిజమా..  ఇంత గుడ్ న్యూస్ ని ఇలా భయపెట్టి చెప్పడం.. కాసేపైనా అల్లుడిని ఆడుకోవాలి కదా అంటుంది.  జెంట్స్ మాత్రం తింగరి చూపులు చూస్తూ.. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు ఏమైనా వివరంగా చెప్పగలరా..

లలిత కళ్యాణ్ దగ్గరికి వెళ్లి అయ్యో సార్ మీరు తాతయ్య అయిపోతున్నారు. అత్తయ్య గారు మీకు ముని మనవడో, మనవరాలో వచ్చేస్తుంది అని గట్టిగా అరుస్తుంది.


విక్రమ్ అది వినగానే ఒక నిమిషం ఏమీ మాట్లాడలేక పోతాడు. అందరూ విక్రమ్ ని చుట్టుముట్టి కంగ్రాట్స్ అని చెబుతూఉంటే ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది.

ఆంటీ అని పిలుస్తాడు.  చెప్పు విక్రమ్.. అవని ఎలా ఉంది అని మాట కూడ తీసుకొని అడుగుతాడు.. ప్రస్తుతానికి బాగానే ఉంది.

రెండో నెలలోకి అడుగుపెట్టింది.  రేపు హాస్పిటల్ కి తీసుకురా..  ప్రాపర్ గా అన్ని టెస్టులు చేసి మెడిసిన్స్ ఇస్తాను. అలాగే తనకి రెస్ట్ చాలా అవసరం.

లేత నెలలు కదా.. వెంటనే లలిత నా కోడల్ని కాలు కింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటాను అంటుంది.  మాధవి కూడా అవును మా అమ్మాయి కాలు కందనివ్వకుండా డెలివరీ చేస్తాను అంటుంది.

అది విన్న ధనుంజయ్ కు మాత్రం ఆనందంతో గుండె పొంగిపోతూఉంటుంది.  నా చిట్టి తల్లి మరో బంగారు తల్లికి తల్లి కాబోతుందా..

ఎంత శుభవార్త కానీ దగ్గరికి తీసుకోలేకపోతున్నానే అని బాధపడతాడు. పోనీలే ఇప్పటికైనా నా బంగారు తల్లి జీవితంలోకి వెలుగులు వస్తున్నాయి అని సంబరంగా చూస్తూఉంటాడు.

పడుకుని ఉన్నా అవని నీ అందరూ ఒకసారి చూసి బయటికి వెళ్ళిపోతారు.  విక్రమ్ మాత్రం అవని పక్కన పడుకుని పొట్ట మీద అంటి అంటకుండా చేతివేళ్ళను వేసి టచ్ చేస్తూ ఉంటాడు.

తల్లిదండ్రులుగా మారబోతున్న అవని, విక్రమ్ కి కంగ్రాట్స్ ??

కథ కొనసాగుతుంది...
[+] 11 users Like SivaSai's post
Like Reply

Part - 125


విక్రమ్ అవనినీ చూస్తూ పొట్ట మీద చెయ్యి వేస్తూ అమ్మో మళ్లీ నా చెయ్యి బరువు పడిపోతుంది ఏమో అని తీసేస్తూ ఉంటాడు.

స్పృహలోకి రాని అవనినీ చూస్తూ అబ్బా ఎంతసేపు పడుకుంటావు బంగారం.  ఈ హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలి నీతో అని చూస్తూ ఉంటే.. మత్తుగా నిద్రపోతున్నావు.

ముందు ఒంటి మీద ఉన్న ఈ హెవీ ఐటమ్స్ అన్ని తీసేయాలి అని అవని డిస్టర్బ్ అవ్వకుండా మెడలోవి, నడుముకు పెట్టిన వడ్డానం తీసివేసి చీర కూడా మెల్లిగా తీసేస్తాడు.  ఫ్రీగా ఉండే మ్యాక్సీ వేస్తాడు.

అయినా అవని స్పృహలోకి రాదు . నా బంగారం ఎప్పుడూ ఇంతసేపు పడుకుంది లేదు. ఈరోజు ఇంత హ్యాపీ న్యూస్ షేర్ చేసుకోవాలి అంటే మాత్రం మత్తుగా నిద్రపోతున్నావు.

ఇలాగైతే ఎలా అమ్మ..  వాట్ బేబీ అని తనలో తాను ఏదేదో మాట్లాడేసుకుంటూ ఉంటాడు.  మెల్లిగా అవని కదులుతూ ఉంటుంది.

కనురెప్పలు తెరవడానికి అవస్తపడుతూ మెల్లిగా తెరుస్తుంది. ఏవండీ అని మెల్లిగా పిలుస్తూ ఉంటే.. నేను ఇక్కడే ఉన్నాను బంగారం అని పక్కన కూర్చుంటాడు.

ఏమయింది నాకు ఇంత నీరసంగా అనిపిస్తుంది.. ఉండదా మరి నీరసం.  అసలు నువ్వు చేసిన పనికి నీకు గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలి.

నేనేం చేశాను అండి. చేసిందంతా చేసి ఏం చేశానని అడుగుతున్నావా.. లేచి సరిగా కూర్చో అని కూర్చోబెట్టి ముందు ఈ జ్యూస్ తాగు అని జ్యూస్ గ్లాస్ నోటి దగ్గర పెడతాడు.

ఎంత నీరసంగా ఉన్నావో.. ఇప్పటివరకు నీ ఒక్కదాని వరకే తిన్నావు, తాగావు.  ఇప్పటినుంచి ఇద్దరు ఫుడ్డు తినాలి. అమ్మో అంత తింటే ఇంకా నా పొట్ట పట్టదండి.

పొట్ట పడుతుంది బంగారం. ఎందుకంటే ఇప్పుడు నీ పొట్టలో ఇంకొక బుజ్జి బేబీ ఉంది కాబట్టి.. బేబీ కోసం తినాలి అంటాడు.

ఏమిటి మీరు అనేది అని షాక్ అవుతుంది.  నీ బాడీలో వచ్చిన చేంజెస్ కూడా పట్టించుకోనంత బిజీగా తిరుగుతున్నావు అమ్మ.

నుదుటిన ముద్దు పెట్టి కంగ్రాట్స్ అమ్మగా మారబోతున్న నా బంగారు భార్యామణికి అంటాడు.  ఏం చెబుతున్నారండి అని కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉంటే భర్త చంపల మీద చేతులు వేసి అడుగుతుంది.

నువ్వు విన్నదే నేను చెప్పింది. మనమిద్దరం ప్రమోట్ అయ్యాము తల్లిదండ్రులుగా మారబోతున్నాము. థాంక్యూ థాంక్యూ మై డియర్ భార్యామణి.

ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు. చెప్పు నీకు ఏం కావాలి అని విక్రమ్ కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు కారుతూ ఉంటే అవి తుడుచుకుంటూ అడుగుతాడు.

అవని తన నుదుటిని విక్రమ్ నుదుటికి జతచేసి ఇంతకన్నా మంచి గిఫ్ట్ ఇంకా నా జీవితంలో ఏమంటుంది అండి.  థాంక్యూ థాంక్యూ అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

హలో ఈ టైం లో నువ్వు ఇంత ఎమోషనల్ అవ్వకూడదు. టేక్ రెస్ట్. ఆంటీ మరీ మరీ చెప్పారు నీకు రెస్ట్ చాలా ఇంపార్టెంట్ అని.

లలితకి ఫోన్ చేసి అవనికి స్పృహ వచ్చింది అని చెబుతాడు.  వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లోపలికి వస్తారు.

లేడీస్ అందరూ అవని చుట్టూ చేరి బంగారం ఎంత గుడ్ న్యూస్ చెప్పావో తెలుసా..

మన జై సింహ ఫ్యామిలీ కి మరో తరం వారసుడు రాబోతున్నాడు.

ఇందిరా గారు అవని చుట్టూ మెటికలు విరిచి మెడలోని చంద్రహారం అవని మెడలో వేస్తారు. అమ్మమ్మ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు.

ఇది నా ముచ్చట. కాదనకు ముని మనవడిని చూసే భాగ్యాన్ని ఇస్తున్నావు. పక్కన ఉన్న నివి మనవడు అని ఫిక్స్ అయిపోయావా..  మనవరాలు అయితే..

ఆ మాటకి నవ్వుతూ మనవడైనా మనవరాలైనా ఎవరైనా సరే ఈ జై సింహ వారసులే.  కాబట్టి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు.  అల్లరి పిల్ల అంటారు.

అందరూ నవ్వుల మధ్యన అవని మొఖం వెలిగిపోతూ ఉంటుంది. అది చూసిన ధనుంజయ్ సంతోషంతో కళ్ళు నీళ్ళు తుడుచుకుంటాడు.

కళ్యాణ్..  అది చూసి ధనుంజయ్ దగ్గరికి వెళ్లి మీ అమ్మాయి దగ్గరికి ఇప్పటికి కూడా వెళ్లరా.. వెళ్లాలని ఉంది కానీ ధైర్యం సరిపోవడం లేదు.

నా చిట్టి తల్లి పడిన కష్టాలకి భగవంతుడికి  జాలి కలిగినట్టుంది. అందుకే మీలాంటి గొప్ప మనసున్న ఇంటికి కోడలిగా కాదు కాదు కూతురిగా వచ్చింది.

ఆ మాటకి కళ్యాణ్ ధనుంజయ భుజం మీద తట్టి అంతా మంచే జరుగుతుంది.  అవని తొందరలోనే మిమ్మల్ని ఒప్పుకుంటుంది.

ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను అని ఈ విషయం వెంటనే అమ్మానాన్నలకి చెప్పాలి నేను వెళ్లి వస్తాను అని సెలవు తీసుకుని ఇంటికి పరుగు పెడతాడు.

ధనుంజయ్ ఇంటికి స్పీడ్ గా వెళ్లి అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటాడు. ఏమైందిరా అంతలా అరుస్తున్నావు.  నీ మొఖం ఏమిటి వెలిగిపోతుంది ఏం జరిగింది.

అవని అని ఆనందంతో మాటరానట్టుగా అయిపోతాడు. ఏమైందిరా అవని బానే ఉందా అంటే..  తల ఊపుతాడు. మరి ఏమిట్రా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు.

నిన్ను చూస్తే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. అవని నిన్ను తండ్రిగా ఒప్పుకుందా అని ఆనందంగా అడుగుతారు.

ఆ మాటకి కొంచెం నిరాశ వచ్చి అంత అదృష్టం ఈ పేద తండ్రికి లేదులే అమ్మ అని అంతకన్నా గొప్ప విషయం అవని తల్లి కాబోతుంది.

నా రజిత మళ్ళీ తిరిగి రాబోతుంది అని సంతోషంగా చెబుతాడు. ఎంత మంచి వార్త చెప్పావురా.. అవని తల్లి కాబోతుందా..  ఇంతకన్నా గొప్ప విషయం ఇంకా ఏముంటుంది.

వెంటనే వెళదాము.  ఇప్పుడు నేను అక్కడి నుండే వస్తున్నానమ్మా. కొద్దిగా నీరసంగా ఉంది.  డాక్టర్ రెస్ట్ తీసుకోవాలని మరీ మరీ చెప్పారు.

అవని అత్తింటివారైతే అవని కాలు కింద పెట్టనివ్వడం లేదు.  నిజంగా నా కూతురు చాలా అదృష్టవంతురాలు అమ్మ. అలాంటి అత్తింటి వారు దొరికినందుకు.

రేపు అన్ని గుళ్లలో అవని,విక్రమ్ పేరు మీద అర్చన చేయిపించు. అష్టోత్తరం అన్నదానాలు ఏదైతే ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు చేయించు.

నా తల్లి క్షేమంగా ఉండేటట్టుగా హోమాలు చేయించు. ఇంకా అని ఆ కంగారు పడుతుంటే..  ఒరేయ్ అంత కంగారు పడకు.

ఇలా కూర్చో అని సర్వెంట్ తో వాటర్ తెప్పించి ముందు మంచినీళ్లు తాగు అని పట్టిస్తారు.  నాకు ఈ సంతోషాన్ని అందరితో పంచుకోవాలని ఉంది అమ్మ.

ముఖ్యంగా అవనినీ దగ్గరికి తీసుకొని నా చేతులతో నోరు తీపిచేయాలని ఉంది కానీ ఈ అదృష్టం నాకు లేదు కదా అని బాధపడతాడు.

వెంటనే కళ్ళు తుడుచుకుని లేదు లేదు నేను ఇప్పుడు బాధపడకూడదు. సంతోషించాల్సిన విషయం. నేను తాతని కాబోతున్నాను.

అవనికి దూరం చేసిన ప్రతి అచ్చట ముచ్చట వచ్చే వారసులకి అందిస్తాను.  రేపు గుడిలో పూజలు అయిన తర్వాత బంగారు షాప్ కి వెళదాం అమ్మ.

అన్ని రకాలు ఆర్డర్ ఇవ్వండి.  నువ్వు ఇంత కంగారు పడకురా.. అమ్మాయి ఇంకా రెండో నెలలోనే ఉంది అన్నావు.

  డెలివరీ అయ్యాక అప్పుడు తీసుకుందాము. ముందే అలా కొనకూడదు.  అవునా నా కాళ్లు , చేయి ఆడడం లేదమ్మా..

ఏదైనా కన్నతల్లి ఉండి ఉంటే ఈ టైంలో వాళ్లు ప్రతి అవసరం చూస్తారు కదా..  తండ్రిగా ఉన్న నేను లేనట్టే. అవని ఎవరిని అడుగుతుంది అమ్మ.

ఆ మాటకి నవ్వుతూ అందరి ప్రేమలను కలిపి ఇవ్వగలిగే వాడే అవని భర్త. విక్రమ్ ఉండగా అవనికి ఆ లోటు ఉంటుందా...

లలితా మాధవి ఎంత అపురూపంగా అవనినీ చూసుకుంటున్నారు.  మాధవి దత్తత తీసుకుంది అంటే మాట వరసకి కాదు కదా..

ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావు. ఇంకా కూతురు విషయంలో అంత భయపడితే ఎలా.. తండ్రిని కదా..  పెళ్ళికి ముందు ఎలాగో పట్టించుకోలేకపోయాను.

ఇప్పుడైనా పట్టించుకుంటే వచ్చే జన్మలోనైనా నన్ను తండ్రిగా ఒప్పుకుంటుందేమో అన్న చిన్న ఆశ.  లేదమ్మా.. నేను కొడుకుగా పుట్టే నా బంగారు తల్లి రుణం తీర్చుకుంటాను.


రజిత ఫోటో దగ్గరికి వెళ్లి వచ్చేస్తున్నావా రజిత నాకోసం. ఇంత మంచి విషయం విన్న దగ్గరి నుంచి ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వద్దామా.. నీకు ఈ విషయం చెబుదామా అని ఎదురు చూస్తున్నాను.

అసలు నేను ఏం మాట్లాడుతున్నానో..  ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు.  నా ప్రతి పనిలోనూ అండగా నిలబడు అని ఫోటోని తడుముతూ మాట్లాడుతూ ఉంటాడు.

కొడుకు ఎమోషన్స్ చూసిన పెద్దవాళ్ళిద్దరూ కంటతడి పెట్టుకుంటారు. ఎలా ఉండాల్సిన ఇల్లు ఎలా అయిపోయింది.

ఏది చేసినా అది ఒక ఇల్లాలు వల్లే అవుతుంది. ఇల్లు నిలబడాలి అన్న ఇల్లాలే.. ఇల్లు కూలబడాలి అన్న ఇల్లాలే కదా అని సత్యవతి గారు బాధపడతారు.

శేషగిరి.. సత్యవతి వైపు చూసి ఇప్పుడు బాధపడడం వలన ఉపయోగం ఏమీ లేదు. ముందు నుండే మనం భార్గవి మీద ఒక కన్ను వేసి ఉండి ఉంటే అవని విషయంలో వీడు దోషగా మిగిలేవాడు కాదు.

కొంత తప్పు మనది కూడా ఉంది. అవును మీరు అన్నది కూడా నిజమే.  అయినా జరిగిపోయినవి తలుచుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. నేను ఒక్కసారి లలితకి ఫోన్ చేసి వస్తాను అని గదిలోకి వెళతారు.

  అవని జ్యూస్ తాగి గ్లాస్ పక్కన పెట్టడానికి కొద్దిగా ఒంగుంటుంది. వెంటనే విక్రమ్ అవని అని గట్టిగా అరుస్తాడు.

అవని ఉలిక్కిపడి ఏమైందండీ.. ఏం చేస్తున్నావ్ నువ్వు అని కంగారుగా దగ్గరికి వస్తాడు.  నేనేం చేశాను అని చుట్టూ చూస్తూ ఉంటుంది.

ఏం చేశాను అంటావేమిటి అసలు కిందకి ఎందుకు బెండయ్యావు. ఇప్పుడు ఏమైంది.  గ్లాస్ పెట్టడానికి కొద్దిగా బెండ్ అయ్యాను అంతే కదా..

గ్లాస్ పెట్టడానికైనా నువ్వు బెండ్ అవ్వకు. ఏం చేయను మరి.. ఈ గ్లాస్ నీ ఒలంపిక్ జ్యోతి లాగా పట్టుకొని కూర్చొనా..

అబ్బో మేడం గారి అమ్మ అవుతుంటే వెటకారాలు కూడా వచ్చేస్తున్నాయి.. ఇప్పుడు మీకు అలా అనిపించిందా...

విక్రమ్ ప్రేమ ❤️❤️
[+] 10 users Like SivaSai's post
Like Reply

Part - 126


గ్లాస్ పెట్టడానికి ముందుకి వంగుంటున్న భార్యని ఆపి నేనున్నాను కదా భార్యామణి అని గ్లాస్ అందుకుంటాడు. సరే ఇప్పుడంటే మీరు ఉన్నారు తరవాత...

హలో మేడం మేమేమీ ఆలోచించకుండా ఉండం. ఆల్రెడీ ఇద్దరు సర్వెంట్స్ అండ్ ఒక నర్సు నీకోసం ఎప్పుడూ నీ చుట్టూనే ఉంటారు.

బాబోయ్ అలా ఉంటే నాకు ఊపిరాడినట్టు ఉంటది అండి. నేను బాగానే ఉన్నాను కదా అని లేచి నుంచుంటుంది. అవని అని గట్టిగా అంటాడు.

ఉలుక్కుబడి ఏమైందండీ. ఎందుకు నువ్వు నిలబడ్డావు కూర్చో అని  గబగబా కూర్చోబెడతాడు.  ప్లీజ్ అండి మీరు అలా అరవొద్దు.  నాకు టెన్షన్ వస్తుంది.

నేను అరవకూడదు అంటే నువ్వు కదలకూడదు అంటాడు. కదలకుండా ఎంతసేపని ఇలా కూర్చుంటాము.  కాళ్లు తిమ్మిర్లు ఎక్కుతాయి. అప్పుడు పడుకో.  పడుకొని స్ట్రెచబుల్ చేసుకో అంటాడు.

అవని మాట్లాడబోతుంటే ఇప్పటికే ఎక్కువ మాట్లాడేసావు మాట్లాడకు అని పడుకోబెట్టి కాళ్ళ కింద పిల్లో పెడతాడు. ఏం చేస్తున్నారు. నువ్వు ఈరోజు నుంచి ఇలాగే పడుకో.

కాళ్ళునొప్పులు ఏమైనా ఉన్నాయా..  తల తిరుగుతుందా..  భర్త ప్రేమకు ఏం మాట్లాడాలో కూడా అర్థంకాక చెయ్యి అందిస్తుంది.

ఏమైందిరా అని చెయ్యి పట్టుకుంటే కూర్చోండి అని పక్కన కూర్చోబెట్టుకుని ఒళ్లో తల పెట్టుకుంటుంది.  తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఏమైనా కావాలా.. మీ ప్రేమ ఎప్పుడూ ఇలాగే కావాలి.

పిచ్చిదానా నా ప్రేమ నీకు కాకపోతే ఇంకెవరికి.నువ్వు ఆరోగ్యంగా ఉంటే నాకు అంతే చాలు. మీరు నా పక్కన ఉండగా నాకు ఎటువంటి భయం లేదు.

మాధవి వచ్చి తలుపు కొడుతుంది.  రా.. అత్త అంటే లోపలికి వచ్చి జ్యూస్ గ్లాస్ ఇస్తుంది. అమ్మ ఇప్పుడే ఒక జ్యూస్ తాగాను.

పరవాలేదు ఇది దానిమ్మ జ్యూస్.  బ్లడ్ బాగా పడుతుంది. పుట్టే బేబీ ఆ పింక్ కలర్ లో పుడుతుంది తాగు అంటుంది. కష్టం అమ్మ అంటే...

విక్రమ్ మా గ్లాస్ అందుకుని నేను పట్టిస్తానులే అత్తయ్య. గ్లాస్ విక్రమ్ చేతికిస్తూ జ్యూస్ తాగిన  తర్వాత నాకు మెసేజ్ చెయ్యి. సరే అత్తయ్య అనగానే మాధవి వెళ్ళిపోతుంది.

ప్లీజ్ అండి ఇప్పుడే కదా జ్యూస్ తాగాను.ఒక గంట కూడా అవ్వలేదు. జ్యూసే కదా..  ఎంతసేపు..  మెల్లిగా సిప్ చేసుకుంటూ తాగు.  నేను కబుర్లు చెబుతూ ఉంటాను. ఇక ఏమీ చేయలేక మెల్లిగా జ్యూస్ తాగుతూ ఉంటుంది.

హమ్మయ్య అయిపోయింది అని గ్లాస్ ఇస్తుంది.  గుడ్ గర్ల్ అని మూతి తుడుస్తాడు.  మెల్లిగా లేచి నిలబడుతుంది. మళ్ళీ ఎక్కడికి.. వాష్ రూమ్ కి వెళ్ళాలి.

నేనున్నాను కదా.. తీసుకువెళతాను.. ఎన్నిసార్లు చెప్పాను కదలకు అని ఎత్తుకుంటాడు.  నాలుగడుగులే నేను వేసేది. అయినా సరే అని తీసుకువెళ్లి వాష్ రూమ్ లో వదులుతాడు.

అవ్వగానే చెప్పు నేనే వచ్చి తీసుకువెళ్తాను. నువ్వు నడవద్దు అంటాడు. వాకింగ్ ఉంటే మంచిదండి. అది రేపు ఆంటీ చెప్పిన తర్వాత ఆలోచిద్దాం. ముందు రెస్ట్ తీసుకో.

ఇక ఎంత చెప్పినా విక్రమ్ వినడని ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది. వెంటనే విక్రమ్ ఎత్తుకుని మంచం మీద పడుకోబెడతాడు.

ధనుంజయ్ ఇంటి నుంచి బయటకు బయలుదేరుతూ అమ్మ నేను వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది.  నా గురించి ఎదురు చూడొద్దు అని కార్ స్టార్ట్ చేస్తాడు.

ధనుంజయ్ భార్గవి ఉన్న ప్లేస్ కి వెళతాడు. లోపలికి వెళ్ళగానే ఇద్దరు ఆడవాళ్లు ఎదురు వచ్చి గుడ్ ఈవెనింగ్ సార్  అని చెబుతారు.

ఏం చేస్తుంది.. లోపల గదిలో ఒక మూలకి కూర్చునిఉంది. సరే అని లోపలికి వెళ్తాడు.  భయంగా ఒక మూలకి కూర్చుని బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంటుంది.

అక్కడ కుర్చీ లాక్కొని కూర్చుని ఏమైంది భార్గవి. అంతలా భయపడుతున్నావు. నిన్ను ఎవరేమన్నారు అంటాడు. ఏడుపు మొఖంతో ధనుంజయ్ ని చూస్తూ ఎందుకండి నన్ను ఇంత టార్చర్ పెడుతున్నారు.

ఈ టార్చర్ కన్నా జైల్లో ఉండడమే బెటర్. నన్ను జైలుకు పంపించేయండి.  ఎందుకు జైల్లో ఉంటే మూడు పూటల శుభ్రంగా భోంచేసి హాయిగా రెస్ట్ తీసుకుందామన..

జైల్లో రెస్టా అని విరక్తిగా నవ్వుతూ..  రెస్ట్ అనే పదం మర్చిపోయి చాలా రోజులైంది. కాకపోతే ఈ టార్చర్ మాత్రం నా వల్ల కాదు.

ప్రశాంతంగా తినలేకపోతున్నాను కంటి నిండా నిద్రపోలేక పోతున్నాను.  నిద్ర వస్తున్న సరే కళ్ళు ముయ్యలేకపోతున్నాను. ఇంతకన్నా నాకు విషమిచ్చి చంపేయండి.

అలా చంపేస్తే ఈజీగా చిటుక్కున వెళ్ళిపోతావు కదా.. దాని వల్ల ఎవరికి ఉపయోగం చెప్పు.  నువ్వు చేసిన పాపాలకి ఈ జన్మలోనే ఇక్కడే శిక్ష అనుభవించావు అనుకో..

మరుజన్మలో అయినా విశ్వాసం ఉన్న జంతువుగా అయినా పుడతావు. లేకపోతే చెట్టుకి, గాలికి సంబంధం లేకుండా ఎక్కడో ప్రేతాత్మ రూపంలో  ఏలాడుతూ ఉంటావు.

నీకు అవసరమా అంటాడు.  ప్లీజ్ అండి అంటే... నువ్వు నా ప్రేమని అర్థం చేసుకోవడం లేదు.  నీ మీద ఎంతో ప్రేమతో నీ తప్పులను సరిజేయాలని నేను అనుకుంటే..  నువ్వేమో వద్దు అంటున్నావు.  ఇలాగైతే ఎలా చెప్పు.

నిజంగా నా మీద ప్రేమ ఉంటే మీ ఎదురుగుండా ఉంచి ఎలాంటి పనిష్మెంట్ అయిన ఇవ్వండి. ఇలాంటి పనిష్మెంట్ మాత్రం వద్దు.

అరే నా ఇంటిలో అంతమంది ఉంటేనే నా కూతురికి ఇంతకన్నా భయంకరమైన నరకం చూపించావు కదా..  మరి నువ్వెందుకు భార్గవి అంత భయపడుతున్నావు.

ఏమీ మాట్లాడలేక చూస్తుంది.  ఏమైంది భార్గవి ఏదో ఒకటి మాట్లాడు. నీ మాటలు వినాలనే వచ్చాను.  నీ ఏడుపు చూడాలనే కదా లేట్ అయినా సరే ఇంత దూరం వచ్చింది.

నేను ఏడిస్తే మీకు ఆనందంగా ఉందా..  నా కూతురు ఏడుపు చూసి నువ్వు నీ కూతురు ఇంతకన్నా శునకానందం పొందారు కదా...

తలదించుకుని ఆ రోజు నేను చేసింది తప్పే ఒప్పుకుంటాను. చెంప మీద లాగిపెట్టు కొట్టి వయసుకు వచ్చిన ఆడపిల్లని నలుగురు పోరంబోకులు దగ్గరికి పంపిస్తావా..

వాళ్ళకి ముందుపోయి తరవాత సుఖపెట్టు అని చెబుతావా.. అసలు ఆడదానివేనా నువ్వు అని కళ్ళు ఎర్ర చేస్తాడు.

ధనుంజయ్ కోపానికి వణికిపోతు అప్పుడు నేను చేసింది తప్పైతే ఇప్పుడు మీరు చేసేది కూడా అదే కదా..  నేను ఎలా వచ్చిన వాళ్ళకి మందు పోస్తాను.

దీనినే కర్మ అంటారు.  మనం ఏదైతే చేస్తామో తిరిగి 100 రెట్లు వెనక్కి వస్తుందంట.  ఇప్పుడు నీ దగ్గరికి వస్తే మాత్రం తీసుకోలేకపోతున్నావు.

నీకు ఒక గుడ్ న్యూస్ చెబుదామని వచ్చాను. బట్ నువ్వు నన్ను మాత్రం డిసప్పాయింట్ చేసావు. నా జీవితానికి ఇంకా గుడ్ న్యూస్ లు కూడా ఉన్నాయా అంటుంది.

అరెరే ఎందుకులేవు. వెయిట్ అని చెప్పి వీడియో ఆన్ చేసి చూపిస్తాడు. శిల్ప వంట చేస్తూ.. గిన్నెలు కడుగుతూ ఉదయ్ కి వడ్డిస్తూ ఉంటుంది.

నాలుగు రోజుల్లోనే ఇంత మార్పా అంటుంది.  మనిషి అన్నాక మార్పు సహజం అది ఇప్పుడిప్పుడే మనిషిలాగ మారుతుంది.

ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది.  ఇంకేమున్నాయి అన్నట్టుగా చూస్తే... ఈ గుడ్ న్యూస్ మాత్రం నీకు డైజెస్ట్ అవ్వదు. ఆకలేస్తుంది అంటున్నావు కదా నీ కడుపు నిండిపోతుంది. అవని తల్లి కాబోతుంది.

అవని తల్లి కాబోతుందా అని మెల్లిగా అంటుంది. నా బంగారు తల్లి ఇంకొక బుజ్జి పాపాయికి తల్లి కాబోతుంది. త్వరలో నా రజిని నా దగ్గరికి వచ్చేస్తుంది.

అందుకే నీకోసం స్పెషల్ స్వీట్స్ తెచ్చాను అని చెప్పి చిటిక వేస్తాడు. ఒక లేడీ స్పీడ్ బాక్స్ తీసుకుని వస్తుంది. నీకు ఎంతో ఇష్టమైన కాజు బర్ఫీ తిను అని ఓపెన్ చేస్తాడు.

మౌనంగా ఉన్న భార్గవి నోరు తెరిచి స్వీట్స్ ఒక దాని తర్వాత ఒకటి కుక్కుతాడు.  అవి తినలేక ఉక్కరిబిక్కిరి అవుతుంది.

కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా కారిపోతాయి.  అరే భార్గవి నీకు ఆనందభాష్పాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇది మీకు అలా కనిపించాయా.

మరి ఇంకా ఎలా కనిపించాలి. నువ్వు కూడా అవని విషయంలో ఇలాగే చేసేదానివి కదా.. నా బంగారు తల్లి బాధపడుతున్న సరే దానిని మార్చి చూపించేదానివి.

అచ్చు ఇలాగే చేసేదానివి కదా.. నీ లాగానే బాగా యాక్ట్ చేస్తున్నానా లేక ఇంకా కొంచెం నేను ట్రైనింగ్ అవ్వనా అంటాడు.

ధనుంజయ్ వెటకారాలకి కళ్ళు మూసుకుని మీరు చెప్పాల్సిన రెండు గుడ్ న్యూస్ లు అయిపోయినాయి కదా ఇంకా వెళ్ళండి .

ఇదేమన్నా నీ జైలు గది అనుకుంటున్నావా.. టైం అవ్వగానే వెళ్ళిపోవడానికి.  ఇది నా ప్లేస్. నాకు నచ్చినంతసేపు ఉంటా..

నచ్చినంత సేపు నీకు సంతోషకరమైన విషయాలు చెబుతాను.  అవి విని నీకు కళ్లనుంచి ఆనందభాష్పాలు కారుతూఉండాలి.

అది చూసి ఈరోజు నేను ప్రశాంతంగా పడుకోవాలి.  మీరు ఇంత శాడిస్ట్ అవుతారని అనుకోలేదు. సహవాస దోషం ఏం చేస్తాం చెప్పు.

కడుపుతో ఉన్న అమ్మాయిలు ఏం తింటారు భార్గవి. గన్నేరుపప్పు అంటుంది.  అది నీ కూతురికి ఇస్తాలే గాని...
రేపు నా చేతులతో నేనే స్వయంగా డ్రైఫ్రూట్ లడ్డుస్ చేసి పట్టుకెళ్తాను అని వెళ్ళిపోతాడు.

వెళుతున్న ధనుంజయ్ ని కోపంగా చూస్తూ నేలని కొడుతూఉంటుంది. నేను ఎలాంటి జీవితాన్ని ఊహించుకుంటే ఎక్కడికి వచ్చాను.

ఆ రజిత కూతుర్ని ఎక్కడ ఉంచాలి అంటే ఎక్కడ వెలుగుతుంది.  అవనికి ఉన్న తెలివితేటల్లో సగం అయిన నా కూతురికి ఉండి ఉంటే... దాని భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉండేది.

ఒక్కరోజు అది చేసిన పని వల్ల ఈరోజు ఇద్దరం సఫర్ అవుతున్నాము అని తల పట్టుకుంటుంది.

వినయ్, భరత్, నివి ముగ్గురు షాపింగ్ చేసి వస్తారు. వీళ్ళు షాపింగ్ పూర్తి చేసుకునే వచ్చేటప్పటికి రాజ్ టీవీ చూస్తూ ఉంటాడు.

నివి కోపంగా వెళ్లి రాజ్ ఏం చేస్తున్నారు.  నేనేం చేస్తున్నాను అంటాడు.  మేమందరం అలిసిపోయి వస్తే మీరు కూల్ గా టీవీ చూస్తున్నారా.. మీరు అలిసిపోవడానికి నేను టీవీ చూడ్డానికి ఏమిటి సంబంధం అంటాడు.

రాజ్??

కథ కొనసాగుతుంది..
[+] 12 users Like SivaSai's post
Like Reply

Part - 127


రాజ్ నివి  వైపు చూస్తూ మీరు షాపింగ్ చేసి అలసిపోతే దానికి నేనేం చేయగలను. ఏమీ చేయలేరు ఇలా టీవీ చూడడం తప్ప.

నాకు తెలియక అడుగుతాను. ఈరోజు మార్నింగ్ మనకు ఎంగేజ్మెంట్ అయ్యింది.  ఆఫ్టర్నూన్ అవని గుడ్ న్యూస్ చెప్పింది.

మేము రెస్ట్ తీసుకున్నాము.  జరిగింది మన ఫంక్షన్ ఏ కదా.. నువ్వెందుకు అలసిపోలేదు. షాపింగ్ కి ఎప్పుడు వెళ్ళిపోయావు.

షాపింగ్ అంటే ఎనర్జీ అలాగే వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు షాపింగ్ చేయాల్సింది ఏమున్నాయి.  మన ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా...

షాపింగ్ చేయాలి అంటే ఇంక మన పనేనా.. ఇంక దేని మీద వెళ్ళావు.. రాబోయే ఈ ఇంటి ప్రిన్స్ గురించి వెళ్లాను. ఆ మాటకి నోరు వదిలేసి చూస్తాడు.

ఏమైంది అంటే..  నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావడం లేదు నివి. దేనికి..  లేకపోతే ఏమనాలి.  న్యూస్ తెలిసింది ఇప్పుడే..  ఇంకా హాస్పిటల్ కి వెళ్ళలేదు.  చెకప్ అవ్వలేదు. ఎవరు పుడతారో తెలీదు.

ఇప్పుడు నుంచే షాపింగ్ చేస్తే వాళ్లు పుట్టేటప్పటికీ అవి పాతవి అయిపోతాయి కదా... ఆ మాటకి నవ్వుతూ అందుకే అన్ని ఆ టైంకి వచ్చేటట్టుగా కష్టమైజ్డ్ ఆర్డర్ ఇచ్చి వచ్చాను అంటుంది.

నివి చెప్పిన దానికి రాజ్ చూస్తూ ఉంటే.. భరత్ పక్కకు వచ్చి ఏంటి బ్రో ఫ్యూచర్ కనపడుతుందా.. బాగా అంటాడు.  అప్పుడే ఏమైంది ముందుంది ఇంకా..

ఎలా బ్రో ఈ ఆడవాళ్లు ఇంత భయంకరంగా షాపింగ్ చేయగలుగుతారు. అది కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి...

అందుకే కదా మన జెంట్స్ షాప్స్  తక్కువ ఉంటే... లేడీస్ షాపులు ఎక్కువ ఉన్నాయి...  ఏమో మీకు చిన్నప్పటినుంచి అలవాటైపోయి పెద్ద తేడాలు తెలియడం లేదు గానీ నాకు మాత్రం ప్రతి నిమిషం షాక్ ఇస్తూనే ఉంది.

  అప్పుడే కంగారు పడకు రేపు హాస్పిటల్ పని అయిన తర్వాత మళ్ళీ మొదలు పెడుతుంది. అందుకే నాకు ఆఫీస్ వర్క్ ఉందని జంప్ అయిపోతున్నాను.

పెళ్లి రేపు అన్నవరకు నేను అసలు కనపడనుగా..  ఒక నవ్వు నవ్వుతాడు.  ఏంటి బ్రో ఆ నవ్వుకి అర్థం..  ఏముంది బావ నువ్వు అనుకున్నది కాదు మా చెల్లి అనుకున్నదే జరుగుతుంది అని భరత్ బావ ఉద్దేశము  అని వినయ్ అంటాడు.

ఒరేయ్ బామ్మర్ది... మీరు బామ్మర్దులు కాదురా పూర్వజన్మలో నేను మీకు రుణపడిపోయి ఉండుంటాను.. అందుకే ఈ జన్మలో ఇలా సాధించుకు తింటున్నారు.  పో బావ నువ్వు ప్రెస్టేషన్లో అన్ని నిజాలే చెప్పేస్తున్నావు.

అవని డైట్ మొత్తం మార్చేస్తారు.  మెలకువగా ఉన్నంత సేపు ఏదో ఒకటి పట్టిస్తూనే ఉంటారు.  అవని పడుకోవడమే బెస్ట్ అనుకుని కళ్ళు మూసుకుని పడుకుంటుంది.

సూర్యోదయం అవ్వగానే విక్రమ్ అవనినీ  లేపుతూఉంటాడు.  ప్లీజ్ అండి కాసేపు పడుకుంటాను మగతగా అనిపిస్తుంది.

మెల్లిగా లేపి కొద్దిగా వాటర్ పట్టించి ఫ్రెష్ అయ్యిరా హాస్పిటల్ కి వెళ్ళాలి. టైం చూసి ఇప్పుడు ఇంకా ఆరే అయిందండి.

ఇంత పొద్దుటే హాస్పిటల్ అంటే కష్టమండి.  ఆంటీ తో నేను ఆల్రెడీ మాట్లాడాను.  తీసుకొచ్చేయమన్నారు. తల కొట్టుకుంటూ మరీ ఇంత కంగారు అయితే ఎలాగండి.

ఆ.. నీకు అలాగే ఉంటుంది. నిన్న కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నా గుండె ఆగినంత పని అయింది. నీ హెల్త్ విషయంలో నేను ఎటువంటి నిర్లక్ష్యం చెయ్యను.

పద పదా అని వాష్రూమ్ లోనికి తీసుకువెళ్తాడు.  ఫ్రెష్ అయ్యి వచ్చిన తరువాత చీర కట్టుకుంటూ ఉంటే... ఎందుకు మ్యాక్సీ వేసుకో... కంఫర్ట్ గా ఉంటుంది.

ఆ మాటకి కోపంగా చూస్తూ నాకు చీర కూడా బానే ఉంటుంది.  మ్యాక్సీ వేసుకుని ఎలా బయటకు వస్తాను. ఈ టైంలో ఆ ఫార్మాలిటీ అవసరం లేదు.

అప్పుడే అలాంటివి వేసుకోనక్కర్లేదండి. ఎప్పుడు వేసుకోవాలి నాకు తెలుసు కదా సరేనా బంగారం అంటుంది.

ఆ మాటకి కాంప్రమైజ్ అవుతూ..  సరే కాకపోతే బాగా లైట్ వెయిట్ ఉన్నాయి కట్టుకో.  లేకపోతే లోపల బేబీ ఇబ్బంది పడిపోతుంది.

ఇప్పుడు వరకు మీరు చెప్పింది నా కోసం కాదా..  బేబీ కోసమా.. నీకోసమే కాకపోతే బేబీకి కూడా గాలి ఆడటం ఇంపార్టెంట్ కదా.

ఒక పని చేయండి ఒక ఫ్యాన్ తీసుకురండి. అది మింగుతాను.  లోపల తిరుగుతూ ఉంటుంది గాలి బాగా వేస్తుంది.

చూసావా నా బేబీ పొట్టలోకి రాగానే నీకు కూడా తెలివితేటలు పెరిగిపోతున్నాయి. పొట్ట మీద చెయ్యి వేసి బేబీ నువ్వు చాలా గ్రేట్ బంగారం . మీ అమ్మ బుర్ర కూడా పెంచుతున్నావు అంటాడు.

విక్రమ్ అన్నదానికి కోపంగా చూస్తూ ఉంటే అరేయ్ ఎక్కువ కోపం తెచ్చుకోకు భార్యామణి..బేబీకి మంచిది కాదు అంటాడు.

నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా.. ఏం కావాలి అంటే.. హాస్పిటల్ పని అయిన తర్వాత మీరు ఆఫీస్ కి వెళ్ళిపోండి.

ఆ మాటకి నేనేం చేశాను. ఏం చేశారా నిన్నటి నుంచి నన్ను సతాయిస్తున్నారు. ఎక్కడ సతాయించాను. తిను..  జాగ్రత్తగా ఉండు..  కంఫర్ట్ గా ఉండే బట్టలు వేసుకో అని చెప్పడం కూడా నిన్ను సతాయించడమేనా..

అది మీకు తెలియడం లేదు. మీరు బేబీని మోయండి. అప్పుడు తెలుస్తుంది. ఆ మాటకి నవ్వుతూ భగవంతుడు ఆ వరం...  ఆ అదృష్టం మీ ఆడవాళ్లకు మాత్రమే ఇచ్చాడు.

అందుకే ఆ ఫీల్ ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు ఎలాంటి ఇబ్బంది పడుతున్నావో తెలియక నేను కంగారు పడుతున్నాను అంటాడు.

ఆ మాటకి భర్త నడుం చుట్టూ చేతులు వేసి నేను బాగానే ఉన్నాను.  ఏదైనా ఇబ్బంది ఉంటే అందరికన్నా ముందు మీకే చెబుతాను.

మీకన్నా నాకు ఎవరూ ముఖ్యం కాదు కదా అంటుంది. ఆ మాటకి నుదుటిన ముద్దు పెట్టుకుని గుడ్ అలా అన్నావు బాగుంది పద అంటాడు.

కిందకి రాగానే మాధవి,  లలిత హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసి డ్రైఫ్రూట్ మిల్క్ షేక్ రెడీగా పెడతారు. అవి రెండూ చూసి అత్తమ్మ అంటుంది.

తినాలి అమ్మ తప్పదురా అని కూర్చోబెట్టి తినిపించి మిల్క్ షేక్ తాగిస్తారు.  హాస్పిటల్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే బ్యాగ్ లో నాలుగు రకాల జ్యూసులు ప్యాక్ చేసి పెట్టి విక్రమ్ చేతికి ఇస్తారు.

విక్రమ్ అవని నీ జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకువెళ్లి కారులో కూర్చోబెడతాడు. కార్ స్టార్ట్ చేసిన తర్వాత అవని కబుర్లు చెబుతూ ఉంటుంది.

చెబుతూ పక్కకి చూడగానే సైకిల్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆశ్చర్యంగా చూస్తూ ఏమండీ సైకిల్ లో ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందా..

దేనికి.. కారు కన్నా సైకిలే స్పీడ్ గా వెళుతుందండి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది.  సైకిల్ స్పీడ్ గా వెళ్లడం కాదు. మనమే స్లోగా వెళుతున్నాము.

ఏమిటి అని స్పీడోమీటర్ చూసి మనం 30 లో వెళ్తున్నామండీ. అవును స్పీడుగా వెళితే నువ్వు, బేబీ ఇబ్బంది పడతారు.

ఆ మాటకి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మరీ ఇంత స్లోగా వెళ్ళినా మీ బేబీ అలిసిపోతుందండి.  జర్నీ అంత సేపు చేయాలంటే కష్టం కదా..

ఇది నిజమే.. ఈసారి నుంచి వెళ్లాలి అంటే క్యారవాన్  తీసుకుని వెళ్దాము. అదైతే నువ్వు పడుకోవచ్చు బేబీ కూడా కంఫర్ట్ గా ఉంటుంది .

ఏమండీ కొంచెం స్పీడ్ గా వెళ్లరా వామిటింగ్ వచ్చేటట్టు ఉంది. వెంటనే కవర్స్ తీసి ఇస్తాడు.  దేనికి అంటే వాంటింగ్ వస్తుంది అన్నావు కదా అని చేతికి ఇస్తాడు.

కారు స్మెల్ వస్తుందండి. స్మెల్ వస్తే ఇంకొక కారు వస్తుంది నువ్వు మాత్రం ఇబ్బంది పడకు అని కొద్దిగా స్పీడ్ పెంచుతాడు.

భర్త ప్రేమని ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాక విక్రమ్ ని చూస్తూ ఉంటుంది. ఏమైందిరా అలా చూస్తున్నావు. మీరు ముందే నాకు ఎందుకు పరిచయం అవలేదా అని ఆలోచిస్తున్నాను.

నిజంగా మనకు పుట్టే బేబీ మాత్రం చాలా లక్కీ అని విక్రమ్ భుజం పైన తలవాల్చుతుంది.  ఆ మాటకి బేబీ కాదు నేను లక్కీ.

నేను లక్కీ కాబట్టే నీలాంటి అపురూపమైన వజ్రం నా జీవితంలోనికి వచ్చింది.  మరి ఆ వజ్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా..

మెల్లిగా కబుర్లు చెబుతూ అరగంటలో రావాల్సిన ప్లేస్ కి గంటలో వస్తారు. సురభి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇద్దరూ లోపలికి వెళ్ళగానే ఏంటి విక్రమ్ ఇంత లేటు అయ్యింది ఎప్పుడో బయలుదేరారు అన్నారు.

అలా అడగండి ఆంటీ.. కారు 30లో పెట్టి తీసుకువచ్చారు. ఏదైనా అంటే బేబీ ఇబ్బంది పడిపోతుంది అంటున్నారు అని కంప్లైంట్ చేస్తుంది.

ఆ మాటకి నవ్వుతూ విక్రమ్ ఇప్పుడినుంచి కేర్ తీసుకుంటున్నాడా..  ఇప్పటినుంచి ఏంటి... నిన్నటి నుంచి మొదలైంది. 

అవని అలాగే చెబుతుంది.  నిన్న మనం అందరం ఎంత భయపడ్డాము..  పడుకుంది ఏం తెలుసు తనకి మన టెన్షన్.

ఆ మాటకి ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. సురభి వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ప్రేమకి నవ్వుకుంటూ సరే సరేలే విక్రమ్..

నువ్వు వెయిట్ చెయ్.  అవనినీ  టెస్ట్ చేస్తాను.  నేను వస్తాను అంటాడు.  విక్రమ్ నువ్వు ఇక్కడే ఉండు.  ఇది ఆడవాళ్ళకి చేసేది.

నువ్వు ఉంటే నేను, నర్స్, అవని ముగ్గురం ఇబ్బంది పడాలి.  నీ భార్యని జాగ్రత్తగా తీసుకొచ్చి నీకు అప్పచెబుతాను సరేనా..

రా అవని అని లోపలికి తీసుకువెళుతుంది.  వెళ్తున్నా అవని వెనక్కి తిరిగి నాలుక బయటపెట్టి వెక్కిరిస్తుంది. అవనినీ  చూస్తూ నవ్వుకుంటూ రా చూస్తాను అని కళ్ళతోనే చెబుతాడు.

సురభి చేయవలసిన అన్ని టెస్టులు చేసి తీసుకువస్తుంది.  ఆ అరగంట విక్రమ్ కి యుగాలు గడిచినట్టుగా అనిపిస్తుంది.

రాగానే పట్టుకుని కుర్చీలో కూర్చోబెడతాడు. ఆంటీ ఎలా ఉంది. హెల్త్ అంతా ఓకే కదా..  ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు కదా అని అడుగుతాడు.

వెయిట్ విక్రమ్ ఎందుకంత కంగారు పడిపోతున్నావు.  అన్ని టెస్టులు చేశాను.  బాగుంది ఎగైన్ ఇద్దరికీ కంగ్రాట్స్.
కాకపోతే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.

ఏమిటా విషయం...
[+] 11 users Like SivaSai's post
Like Reply

Part - 128


అవని, లోపల బేబీ హెల్త్ అంతా బాగుంది. కాకపోతే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏదైనా ప్రాబ్లమా అని కంగారు పడతాడు.

ప్రాబ్లం ఏమీ లేదు.  లేత నెలలు కదా.. కొంచెం టెన్షన్ పడకుండా హెల్త్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టాలి. ప్రొపెర్ డైట్ తీసుకోవాలి.

అవని..  నువ్వు చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తూ ఉండు. వాకింగ్ కంపల్సరీ చేయి. అలాగే ఒక యోగా ట్రయనర్ ని అరేంజ్ చెయ్ విక్రమ్.

తనతో రోజు యోగా చేయిపిస్తే డెలివరీ టైం లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే థాంక్యూ ఆంటీ అంటాడు. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ..  విక్రమ్ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.

చెప్పండి అంటీ.. నువ్వు ఎక్కువ కంగారు పడకు.  నువ్వు కంగారుపడి అవని నీ టెన్షన్ పెట్టకు అర్థం అయిందా అంటుంది.

ఆంటీ అని చిరుకోపంగా పిలిస్తే...నిజమే చెబుతున్నాను విక్రమ్..ఆడవాళ్ళ బాడీలో జరిగే మార్పులు మీకు అర్థం కాక... నువ్వు కంగారు పడుతున్నావు.

బట్ అవని బాగుంది.  ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఇంట్లో ముగ్గురు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్లు చూసుకుంటారు.

నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే..  అవని టైం టు టైం ప్రాపర్ డైట్ తీసుకోవడం ప్లస్ మార్నింగ్ యోగా చేయడం. ఇవి రెండు మాత్రం కంపల్సరీ చేపించు అర్థమైందా...

ఓకే థాంక్యూ అని చెప్పి వెళదామా అంటాడు.. సరే అని థాంక్స్ చెప్పి అవని కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు అర్థమైందా శ్రీవారు వాకింగ్ ఎంత ఇంపార్టెంటో..

ఆంటీ చెప్పాక నీకు ఛాన్స్ ఇస్తున్నాను లేకపోతే అసలు ఇచ్చేవాడిని కాదు. విక్రమ్ చేతిని తన చేతితో చుట్టేసి ఎందుకండీ అంత భయం.. నేను బాగానే ఉన్నాను.

ఏం బాగుండడమో ఏమో..  నిన్న ఎంత టెన్షన్ పడ్డామో.. ఇప్పటికి ఆ విషయం గుర్తుకు వస్తే చెమటలు పట్టేస్తున్నాయి.

ద గ్రేట్ బిజినెస్ టైకోన్ విక్రమ్ జై సింహ గారు ఇంత భయపడుతున్నారా...  నేను ఎంత స్ట్రాంగ్ పర్సన్స్ అయినా ఫ్యామిలీ దగ్గరికి వచ్చేటప్పటికి  వీక్ అయిపోతాను. ముఖ్యంగా నీ విషయంలో...

విక్రమ్ ని డైవర్ట్ చేయడానికి పొట్ట మీద చేతులు వేసి ఆకలి అంటుంది..అవునా చాలాసేపు అయింది కదా బయలుదేరి రా అని కార్ లో కూర్చోబెట్టి లలిత ఇచ్చిన జ్యూస్ బాటిల్ ఇస్తాడు.

నాకు కారం కారంగా తినాలని ఉంది. నో ఫస్ట్ నువ్వు జ్యూస్ తాగు.  ఇంటికి వెళ్ళాక చేయిపిస్తాను. అయ్యో శ్రీవారు మనం ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది కదా...

ఎందుకు... ఎందుకు అంటారు ఏమిటి.. మనం వెళ్ళేది 30 లో..  ఆ స్పీడ్ లో వెళ్ళేటప్పటికి లోపల బేబీ ఆకలితో కేర్ కేర్ అంటుందేమో...

బాగానే టీస్ చేస్తున్నావే.. ఆంటీ చెప్పారు కదా పరవాలేదు.  ఎంతవరకు మాక్సిమం స్పీడ్ లో వెళ్ళాలో అంతవరకు వెళతాను అని కార్ స్టార్ చేస్తాడు.

ఇద్దరు ఇంటికి వెళ్ళేటప్పటికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. లోపలికి రాగానే అవనినీ చుట్టుముట్టి డాక్టర్ ఏమన్నారు అంతా బాగానే ఉందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూఉంటారు.

విక్రమ్ లోపలికి వచ్చి అరే ముందు కూర్చొనివ్వండి అని అందరినీ జరిపి సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడు అడగండి. అవని విక్రమ్ ని చూస్తూ ఆంటీ ఏం చెప్పారో కూడా మీరే చెప్పండి.

అందరూ విక్రమ్ వైపు చూస్తే... సురభి చెప్పిన జాగ్రత్తలు అన్నీ చెబితే.. లలిత మాధవి ఇద్దరు భుజాల మీద వేసుకొని మేము చూసుకుంటాము.

నువ్వు టెన్షన్ పడకుండా ఆఫీసుకు వెళ్ళిపో.. ఎవ్రీ మినిట్ నీకు అప్డేట్స్ ఇస్తాము. లేదమ్మా ముఖ్యమైన వర్కు ఉన్నప్పుడు వెళతాను.

మీ ఇద్దరిని అవని  మాయ చేసేస్తుంది.  డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు. ఆంటీ పర్వాలేదు అని చెప్పిన తర్వాత అప్పుడు వెళతాను. 

విక్రమ్ ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే  మార్చాడు అని అందరికీ తెలుసు. అందుకే అందరూ సరే నీ ఇష్టం అంటారు.

ధనుంజయ్ కూతురు కోసం డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. సత్యవతి వచ్చి ఒరేయ్ మేము చేస్తాము నువ్వు తప్పుకో అంటే లేదమ్మా నా కూతురు కోసం నేనే ప్రిపేర్ చేస్తాను అని మొత్తం అన్ని నీట్ గా చేసి ప్యాక్ చేస్తాడు.

అవనికి ఇంకా ఏమి ఇష్టము అని అడిగితే ఒక నవ్వు నవ్వి  ఊరుకుంటారు. ఆ నవ్వుకి అర్థం తెలిసిన ధనుంజయ్ ఒక నిమిషం సైలెంట్ అయిపోయి అప్పుడు తెలియకపోతే ఏమైంది లే అమ్మ.

ఇప్పుడు వెళతాము కదా అన్ని తెలుసుకుని చేసి పంపిద్దాము. నీ కూతురు తీసుకుంటుందనేనా..  నా ప్రయత్నం నేను చేస్తాను. తర్వాత భగవంతుడు దయ అని మొత్తం చేసి బయలుదేరదామా అంటాడు.

ముందు నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యిరా.. ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అని రూమ్ కి వెళ్లి తొందరగా రెడీ అయి వస్తాడు.

వెళదామా అంటే శేషగిరి కొడుకుని చూసి నవ్వుతూ కూతురి దగ్గరికి వెళ్లడానికి ఎంత తొందరగా ఉన్నావు రా.. మరి ఉండదా ఏమిటి? అసలే కడుపుతో ఉంది.

ఈరోజు హాస్పిటల్ కి కూడా వెళ్లి ఉంటారు. డాక్టర్ ఏం చెప్పారు ఏమిటో తెలియదు కదా.. సరే సరే పదండి అని ముగ్గురు విక్రమ్ ఇంటికి వెళతారు.

వీళ్ళ ముగ్గురు వెళ్లేటప్పటికి అందరూ అవనినీ చుట్టుముట్టి హాస్పిటల్ విషయాలు అడుగుతూ ఉంటారు. విక్రమ్ చెప్పింది ప్రతిదీ ధనుంజయ్ వింటాడు.

వెంటనే బెస్ట్ యోగ ట్రైనర్ ఎవరున్నారో వెతకాలి అని పిఏ కి మెసేజ్ చేస్తాడు. సత్యవతి మనవరాల దగ్గరికి వచ్చి బాగున్నావా అమ్మ అంటుంది.

లలిత.. పెద్దమ్మ రండి అని లేచి అవని పక్కన ప్లేసు చూపిస్తారు. సత్యవతి కూర్చుని ఇందిరా గారికి నమస్కారం చేస్తారు.

ఇందిరా కూడా నమస్కారం చేసి చిన్న నవ్వు నవ్వుతారు. అందరి ముఖాలలో వెలుగు స్పష్టంగా కనపడుతూ ఉంటుంది.

చెయ్యి పట్టుకుని డాక్టర్ ఏమన్నారమ్మా అంటే అంతా బాగుందన్నారు అని సింపుల్గా చెబుతుంది. కూతురు తన వైపు చూస్తుందేమో అన్న ఆశతో ధనుంజయ్ అవని వైపే చూస్తూ ఉంటాడు.

కళ్యాణ్ ధనుంజయ్ ని కదిపి ఇంకేంటి విశేషాలు అని అడిగితే.. ఏమన్నాయండి మామూలే అని బలవంతంగా నవ్వుతాడు.

సత్యవతి వెంటనే డ్రై ఫ్రూట్స్ బాక్స్ తీసుకుని నోరు తీపి చేసుకోమ్మ అని నోటి దగ్గర పెడుతుంది. ఇవి... అని సత్యవైపు  వైపు చూస్తుంది.

ఇవా మీ నాన్న స్వయంగా తన చేతులతో చేశాడు. ఎప్పుడు  కిచెన్ లోకి రాని నా కొడుకుకు తన కూతురు కడుపుతో ఉందని ఎంతో ప్రేమతో చేశాడు తినమ్మా అని నోటి దగ్గరకి పెడుతుంది.

అవని వెంటనే సత్యవతి గారి చేతిని పట్టుకొని ఆపేస్తుంది. ఏమైందమ్మా.. క్షమించండి నానమ్మ అని తలదించుకుంటుంది.

ఆ మాటకి ధనుంజయ్ కి నీరసం వస్తుంది.  మనవరాలని ఎలాగైనా ఒప్పించాలని అదేంటమ్మా అలా అంటావు మొట్టమొదటిసారి పుట్టింటి నుంచి స్వీట్ తీసుకుని వస్తే తినకపోతే ఎలా..

మీకు అంతకు ముందు చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను.  నాకు పుట్టిల్లు అంటూ ఏమీ లేదు. నాకు పుట్టినిల్లు అయినా మెట్టినిల్లు అయినా అంతా ఈ ఇల్లే..

సరే అలాగే.. నువ్వు అనుకున్నట్టుగానే.. ఏదో ఇంటికి వచ్చిన చుట్టాలు నీకోసం తెచ్చారు అనుకోని తిను తల్లి అంటుంది.

ఈ టైంలో బయట వాళ్ళని ఎవరిని నమ్మలేను . ఆ మాటకి సత్యవతి మాట తడబడుతూ ఏమంటున్నావు అవని.

మీరు నన్ను ఎలాగ అనుకున్నా పరవాలేదు. నాకు ఇప్పుడు నా కడుపులోని బిడ్డ చాలా ముఖ్యం.  ఇందులో ఏమీ కలిపారో ఏమిటో తెలియదు కదా..

తిని బిడ్డకు ఏదైనా హాని జరిగితే.. సత్యవతి చేతిలో ఉన్న లడ్డు జారిపోతుంది. ధనుంజయ్ మాటరాని వాడిలాగా కూతురు వైపే చూస్తూ ఉంటాడు.

ఈ నిమిషమే ప్రాణం పోతే బాగుండును అనిపిస్తుంది. కన్నీళ్ళతో కూతురినే చూస్తూ ఉంటాడు. శేషగిరి కి కూడా బాధగా అనిపించి ఎందుకు అలా చేస్తాడమ్మా.

వాడు నీకు తండ్రి.  తెలియక తప్పు చేశాడు. దానికి పశ్చాత్తాపంతో రోజు కుమిలిపోతున్నాడు. మీ అబ్బాయి కనుక ఏది జరిగిన కడుపులో పెట్టుకోగలుగుతున్నారు.

అలాగే రేపు పుట్టబోయే బిడ్డ గురించి కూడా నేను జాగ్రత్తగా ఉండాలి కదా అంతేగాని మిమ్మల్ని ఎవ్వరిని నేను తప్పు పట్టడం లేదు.

నీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి తాతయ్య అంటుంది ఆ మాటకి ఏమి మాట్లాడలేకపోతారు.  ఆఖరి ప్రయత్నంగా సత్యవతి అది కాదమ్మా.. ఇవి ఆరోగ్యానికి మంచిది బలం.

పోనీ నేను తిని చూపించనా అని నోటి దగ్గర పెట్టుకుంటుంది.  వెంటనే ఆ చేతిని పట్టుకుని ఆపేసి ప్లీజ్ నానమ్మ ఇలాంటి టైంలో ఎవరు ప్రయోగాలు చేయవద్దు.

మీకు ఏదైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. నీకు ఎందుకు తల్లి అంత భయం. ఆ సార్, మేడం గురించి నాకు బాగా తెలుసు.

భార్య, కూతుర్ని రక్షించుకోవడానికి.. వాళ్ల కోసం ఎంతవరకు అయినా చేయగలరు. ఏమైనా చేస్తారు. దయచేసి నన్ను అర్థం చేసుకో నానమ్మ.

సత్యవతి కూడా ఇంకా కామ్ అయిపోతుంది.  వాతావరణమంతా వేడివేడిగా ఉంది అని వినయ్ తేలిక చేయడానికి...

అమ్మ అని పిలుస్తాడు. ఏంట్రా అని విసుగ్గా అంటే..  మనకి వేడిగా అనిపిస్తే..  ఫ్యాన్స్ వేసుకుంటాం ఏసీలు వేసుకుంటాం.

మరి లోపల బేబీ ఏం చేస్తుందమ్మా వేడిగా అనిపిస్తే ఎలా..
ఆ మాటకి అందరూ వినయ్ వైపు చూస్తారు. అదేం ప్రశ్న రా అని కళ్యాణ్ అడిగితే..

ఏం నాన్న డౌట్లు రాకూడదా? చిన్నపిల్లోడిని అడుగుతున్నాను తీర్చాలి కదా... నివి వినయ్ దగ్గరకు వచ్చి ఒరేయ్ చిన్నన్నయ్య.. ఇలాంటి గొప్ప గొప్ప డౌట్ లన్ని రాజ్ కి రావాలి.

అలాంటిది నీకు వచ్చింది ఏంట్రా.. సావాస దోషమా.. రాజ్ కోపంగా ఏది జరిగిన వచ్చి నా దగ్గర ఆగితే గాని నీకు ప్రశాంతంగా ఉండదా.

అయ్యో ఇప్పుడు నేను ఏమన్నానండి.  మీలాంటి మహానుభావులకే కదా ఇంత తెలివైన డౌట్స్ వస్తాయి. అలాంటిది అన్నయ్యకు వచ్చేటప్పటికి అడిగాను అది కూడా నా తప్ప అండి అని అమాయకంగా ఫేస్ పెడితే..

వెంటనే పార్ధు లేదమ్మా నీది అసలు తప్పే కాదు.  అది అర్థం చేసుకోలేని నా కొడుకుది తప్పు.

ఏంటి రాజ్ నీ పరిస్థితి ??

కథ కొనసాగుతుంది...
[+] 11 users Like SivaSai's post
Like Reply

Part - 129


పార్ధు కౌంటర్ కి రాజ్ పళ్ళు నూరుతూఉంటే... కరుణ కోపంంగా ఏంటిండి మీరు... అస్తమాను నా కొడుకుని అనడం తప్ప ఇంకేమి రాదా...

ఆలా అడుగు మమ్మీ...  ఏమిటోయ్ నీ కొడుకుని వేనేకేసుకుని వస్తున్నావు. మీరు మీ కోడలి సపోర్ట్ అయ్యేతే నేను నా కొడుకు పార్టీ..

వాతావరణం తేలిక అయ్యింది అని అర్ధం అయ్యాక... విక్రమ్ అవని రెస్ట్ తీసుకుంటుందని చెప్పి రూమ్ లోకి తీసుకువెళ్తాడు.

ఒక నిమిషం అందరూ సైలెంట్ గా ఉంటారు. లలిత భోజనానికి రండి పెద్దమ్మ గారు అని చెప్పి ముగ్గురిని పిలుస్తుంది.

వెంటనే ధనుంజయ్ నాకు కొంచెం పని ఉందమ్మా. మళ్లీ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాము అని తల్లిదండ్రులు వైపు చూస్తాడు.

వాళ్లు కూడా బయలుదేరుతామని ముగ్గురు బయటికి వెళ్లిపోతారు. వెళుతున్న  వాళ్ళని చూస్తూ ఉండిపోతారు. ఆడపిల్లగా అవని బాధ అర్థం అవుతుంటే అవనికి చెప్పలేకపోతున్నాము.

ఇటు ధనుంజయ్ ని ఓదార్చలేక పోతున్నాము. అవని ఆవేదన తీరేది ఎప్పుడో..  ఈ తండ్రి బాధ తీరేది ఎప్పుడో అని కళ్యాణ్ అంటాడు.

ఆ మాటకి ఇందిరా గారు అవని... వాళ్ల మీద పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయింది.  ఆ నమ్మకం తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ తనే తండ్రిని ఒప్పుకుంటుంది. అది వచ్చే వారసులైన చేయాలి అమ్మ... అంత మంచే జరగాలని కోరుకుందాం.

గదిలోకి వెళ్లిన అవని  సైలెంట్ గా ఉంటే విక్రమ్ ఏమైంది భార్యామణికి అంత మౌనంగా ఉంది.  ఏమీ లేదు అని తలుపుతుంది.

పక్కన కూర్చుని భుజం చుట్టూ చేయి వేసుకొని దగ్గరకి లాక్కుంటాడు అవని విక్రం గుండెలపై తలవాల్చి చుట్టూ చేతులు వేసి మౌనంగా కళ్ళు మూసుకుంటుంది.

అవని నీ డిస్ట్రబ్ చేయకుండా కాసేపు అలాగే ఉంచుతాడు.  ఎంతసేపటికి అవని మౌనంలో మార్పు రాకపోతే మెల్లిగా అవని అని పిలుస్తాడు.

హ..  అని మాత్రమే ఉంటుంది. రేయ్.. ఇటు చూడు... అవని కళ్ళల్లో నుంచి నీళ్లు ఊబుకుతూ ఉంటాయి. అవి విక్రమ్ కి చూపించడం ఇష్టం లేక ఇంకా తలన కిందకి దించి గట్టిగా పట్టుకుంటుంది.

అవని పట్టులో ఉన్న తేడా అర్థమయ్యి మెల్లిగా చేతులు విడిపించి గెడ్డం కింద చెయ్యి పెట్టి పైకి లేపుతాడు.  ఆ కళ్ళు సంద్రాన్ని మరిపిస్తూ ఉంటే చూడలేక వెంటనే గట్టిగా కౌగిలించుకుంటాడు .

భర్త కౌగిలిలో కాస్త ఓదార్పు పొందిన తరువాత మెల్లిగా సర్దుకుని నేను బాగానే ఉన్నాను అంటుంది. కానీ ఆ మాట జీరబోతూ ఉంటుంది.

ఒరేయ్ ఇటు చూడరా అని భార్య ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు ఎందుకు ఇంత బాధ.. ఎందుకు వాళ్ళు అస్తమాను వస్తారు.

నా ఆనందం రెట్టింపు అవుతుంది అన్న ప్రతిసారి వీళ్లు కనపడి బాధని గుర్తు చేస్తున్నారు.  వీళ్ళకి నా పైన ఎందుకు అంత కక్ష.

నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను కదా..  వాళ్ళ విషయంలో కానీ..  వాళ్లకు సంబంధించిన ఆస్తులు విషయంలో కానీ నేను ఎటువంటి హక్కు కావాలి అని కూడా అడగడం లేదు కదా...

బలవంతంగా ఆ సారే కంపెనీ నాకు అప్పచెప్పారు. అది నాకు ఇష్టం లేకపోయినా ఎంప్లాయిస్ ఇబ్బంది పడకూడదు అని ఒప్పుకున్నాను.

అది ఒప్పుకున్నంత మాత్రాన ఆ మనిషిని ఒప్పుకుంటాననా..  ఎందుకు ఇలాంటి గేమ్స్ ప్లే చేస్తున్నారు అర్థం కావడం లేదు.

అవని కన్నీళ్లు తుడిచి ఆ మనిషి మారాడేమో..  మారినా సరే నాకు వద్దండి. జీవిత కాలానికి సరిపడే బాధని వాళ్లతో ఉన్నప్పుడు అనుభవించేసాను.

ఏ జన్మలోనో ఎంతో కొంత పుణ్యం చేసుకునే ఉండి ఉంటాను. అందుకే ఆ భగవంతుడు కరుణించి ఇలాంటి అందమైన కుటుంబాన్ని నాకు వరంగా ఇచ్చాడు.

ఈ కుటుంబం పైన గాని, రేపు వచ్చే వారసుల పైన గాని వాళ్ల నీడ పడడం కూడా నాకు ఇష్టం లేదు.  దయచేసి వాళ్ళని మన ఇంటికి రానివ్వదు.  ఒకవేళ వచ్చిన నాతో ఎటువంటి సంబంధం వద్దు.

సరే సరే అవన్నీ నేను చూసుకుంటాను..  నువ్వు ఎమోషనల్ అవ్వద్దు.  అది నీకు, కడుపులో ఉన్న బేబీకి ఇద్దరికీ మంచిది కాదు.  రెస్ట్ తీసుకో అని బలవంతంగా పడుకోబెట్టి జో కొడుతూ ఉంటాడు.

ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆఫీసు విషయమో.. మనీకి సంబంధించిందో ఇంకొకటి ఇంకొకటి అయితే చిటికి వేసిన విధంగా సాల్వ్ చేసేవాడు.

కానీ ఇది గాయపడిన మనసుకు సంబంధించిన విషయం. కూతురు విషయంలో ఒక తండ్రి నిర్లక్ష్యానికి సంబంధించినది.

ఎలా సరిదిద్ద కలడు. ఆ గాయపడిన మనసు కుదుటపడి పరిస్థితిని ఒప్పుకోవాలి కానీ ఇందులో బలవంతం చెయ్యలేము కదా ఎలా దీని పరిష్కరించాలి..

కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది అంటారు. చూద్దాం ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో అని ఆలోచిస్తూ అవని నీ చూస్తాడు.

  అవని నిద్రపోవడం చూసి మెల్లిగా లేచి దుప్పటి కప్పి ఏసి అడ్జస్ట్ చేసి హాల్లోకి వస్తాడు.  విక్రమ్ ని చూసిన లలిత ఏరా అవని ఏం చేస్తుంది.

పడుకుంది అంటాడు.  నువ్వేంటి రా అంత ముభావంగా  ఉన్నావు. ఏమీ లేదు అమ్మ.  ఏమీ లేకపోతేనే నీ ఫేస్ ఇలాగుందా..  ఏమైందిరా అని కళ్యాణ్ అడిగితే... ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావడం లేదు.

అవని వాళ్ళని ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు.  ఇంటికే రానివ్వద్దు అంటుంది. ఆ ధనుంజయ్ ఏమో  కూతురి కోసం అల్లాడిపోతున్నాడు.


రావద్దు అని చెప్పలేము. వస్తే అవని బాధ చూడలేకపోతున్నాను ఎలా అని కణతల మీద వేలుతో రుద్దుకుంటూ ఉంటాడు.  నువ్వు ఎక్కువ ఆలోచించకు. కొన్ని సమస్యలను కాలానికి వదిలేయడమే మంచిది.

సరే ఇప్పటికే చాలా లేట్ అయింది. భోజనం చెయ్ విక్రమ్. ఆకలిగా లేదమ్మా అంటాడు.  ఆకలి ఎందుకు వేయదు. నువ్వు తింటేనే అవనినీ ఓపిగ్గా హ్యాండిల్ చేయగలుగుతావు రా అని తీసుకువెళ్లి బలవంతంగా అన్నం తినిపిస్తారు.

భోంచేసిన తర్వాత నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను.  వెళ్లి అవని పక్కన పడుకుని బుగ్గ మీద చెయ్యి వేసి నిమురుతూ ఉంటాడు.

నీకు డెలివరీ అయ్యే వరకు ఎటువంటి బాధలు నీ దరిదాపుల్లోకి రానివ్వను. నువ్వు సెట్ అయ్యావు అనుకున్నాక ఆఫీస్ కి వెళదాం అనుకున్నాను.

ఈరోజు పరిస్థితిని చూస్తూ ఉంటే  నీతోనే ఉండడం మంచిది అని అర్థమయింది.  దానికి తగ్గట్టుగా నా వర్క్ ప్లాన్ చేసుకుంటాను అని ఫిక్స్ అవుతాడు.

సాయంత్రానికి మెల్లిగా కళ్ళు తెరిచిన అవని పక్కనే విక్రమ్ నిద్రపోతూ కనిపిస్తాడు. టైమ్ ఎంతయిందా అని చూసి అమ్మో ఇంతసేపు పడుకున్నానా అని ఉలిక్కిపడి లేస్తుంది.

అవని కదులుతున్నప్పుడే మెలుకు వచ్చిన విక్రమ్ ఏయ్ అవని ఏంటి ఆ కంగారు.   ఎంతసేపు పడుకున్నానో చూశారా..  మీరైనా లేపచ్చు కదా..  కింద అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారు.

అవును అమ్మ, నాన్నమ్మ నీ మీద చాలా కోపంగా ఉన్నారు.  కంగారుపడుతూ ఏం చేశానని.. నావల్ల ఏమైనా తప్పు జరిగిందా..

చాలా పెద్ద తప్పే జరిగింది కదా.. సరిగ్గా చెప్పండి నాకు కంగారుగా ఉంది. నువ్వు ఉన్న కండిషన్ ఏమిటి.. నువ్వు చేస్తున్న పనులు ఏమిటి అంటాడు..

ఆ మాటకి అర్థం కాక చూస్తూ ఉంటే కడుపుతో ఉన్నావు కదా..  మరి అలా ఏడవచ్చా..  లేనిపోని ఎమోషన్స్ అన్నిటిని పోగేసుకుంటే బేబీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది నీకు అర్థమవుతుందా..

అందుకే అమ్మ  నాన్నమ్మ చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు నిన్ను అడిగితే ఏమని చెబుతావు. అవని కొంచెం రిలాక్స్ అయ్యి మీరు అన్నది కూడా నిజమేనండి.

ఎవరి గురించో ఆలోచించి నేను డిస్టర్బ్ అయి బేబీని ఇబ్బంది పెడుతున్నాను. ఈ నిమిషం నుంచి వాళ్ల గురించి అసలు ఆలోచించను.  బాధపడను.

నాకు నా బేబీయే ముఖ్యం. అత్తమ్మకి నేను చెబుతాను అని మంచం దిగుతుంది.  విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ సరే పద కిందకి.

మేడం గారు భోజనం కూడా చేయకుండా నిద్రపోయారు. లోపల నా బేబీకి ఎంత ఆకలేస్తుందో ఏమిటో అంటాడు. అవునా.. మీ బేబీకి ఆకలేసి అమ్మ అమ్మ అని నన్ను లేపింది.

అవును నా బేబీ యాక్టివ్ గా ఉంటది కాబట్టి ఈ లేజీ మమ్మీ ని లేపింది.  లేకపోతే ఇంకా పడుకునేదానివి.  అంటే ఏమిటి నేను లేజీనా..  మరి కాదా అసలు ఎంత నిద్రపోతున్నావో చూసుకుంటున్నావా...

ఏమోనండీ ఊరికే నిద్ర వచ్చేస్తుంది. అలసటగా అనిపిస్తుంది. అందుకే మరి హెల్తీ డైట్ తీసుకోమనేది. నువ్వు కేవలం నీ హెల్త్ మీద బేబీ హెల్త్ మీద మాత్రమే ఫోకస్ పెట్టు. అర్థమైందా అని కిందికి తీసుకువెళతాడు.

అవని నీ చూసిన మాధవి లేచావా అని స్నాక్స్ చేసి తీసుకొచ్చి ఇస్తుంది. సారీ అమ్మ నిద్ర పట్టేసింది అంటే తల మీద చెయ్యి వేసి ఈ టైంలో అలాగే ఉంటుంది.

నువ్వు ప్రతి దానికి ఫీల్ అవ్వకు. అమ్మకు ఎవరైనా సోరి చెప్తారా. ముందు తిను తర్వాత జ్యూస్ తాగు.  ఫ్రూట్స్ కూడా బాగా తిను.

ఇంకేమైనా తినాలి అనిపిస్తే చెప్పు. అమ్మ అని పిలుస్తుంది. ఏంట్రా అంటే.. ఇప్పుడు వాక్కాయలు దొరుకుతాయి కదా.. వాక్కాయలో ఉప్పు కారం వేసుకుని తింటే భలే ఉంటుంది కదా..

బాగుంటుంది కానీ.. ఈ టైంలో వద్దులేరా అంటుంది.  ప్లీజ్ అమ్మ అంటే.. కొంచెం పులుపు ఉంటుంది కదా..  మళ్లీ అందులో ఉప్పు,కారం.

గ్యాస్ ఏమైనా ఫామ్ అయింది అనుకో విక్రమ్ మనిద్దరిని చంపేస్తాడు. కానీ నాకు తినాలని ఉందమ్మా అని గారాలు పోతుంది.

వీళ్లిద్దరి కాన్వర్జేషన్ అర్థం కాక దూరం నుంచి చూస్తున్న విక్రమ్ ఏం చేస్తున్నారు అని దగ్గరికి వచ్చి ఏమైంది  అత్తయ్య..

ఏం కావాలి అంటే ఏమీ లేదురా..  ఆడవాళ్ళ విషయం పరవాలేదు చెప్పు. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదే...

నా కూతురుకి ఏదో తినాలి అనిపిస్తుంది అంట.  అది అడుగుతుంది అంటుంది.  ఏం తినాలి అనిపిస్తుంది అవని..

మరి అడిగాక కోప్పడరు కదా.. నేను కోప్పడే అంత భయంకరమైన ఐటమా.. అబ్బా కాదండి సి విటమిన్ ఎక్కువ ఉంటుంది అంటుంది. అవునా ఇంతకీ ఏమిటో.. ఏం తినాలి అనుకుంటుందో చెబుతుంది.

విక్రమ్ సమాధానం...
[+] 11 users Like SivaSai's post
Like Reply

Part - 130


విక్రమ్ అవని వైపు చూస్తూ ఏం తినాలి అనిపిస్తుంది. చెప్పాక మాత్రం కోప్పడకూడదు.  సరేలే  చెప్పు.
వాక్కాయలు కావాలి.

ఏం కాయలు అని కొంచెం సీరియస్గా అడుగుతాడు. వాక్కాయలు అండి అని ఏడుపు ముఖంతో అంటుంది. అవి ఎంత పుల్లగా వగరుగా ఉంటాయో తెలుసా.. తెలుసు నాకు అదే కావాలి అంటుంది.

ఒరేయ్ మనవడా ఈ టైంలో ఆడవాళ్ళకి ఇలాగే ఉంటుంది.  తినాలనిపించింది కొంచెం అయినా సరే తినాలి లేకపోతే  పుట్టబోయే బిడ్డ అలుగుతాడు.

ఏంటి నానమ్మ మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు.  నేను కూడా ఆడదాన్నే కదా... అపర్ణ వాటి సంగతి ఏమిటో చూడు  ఆల్రెడీ చెప్పడం అయిపోయింది అత్తయ్య. వచ్చేస్తున్నాయి అంటుంది.

ఎప్పుడు పురనాయించేసావమ్మా అంటే మాధవి తో చెబుతున్నప్పుడే ఉంటుంది. సర్వెంట్ బుట్టతో తెచ్చి అక్కడ పెట్టగానే అత్తయ్య ఇన్న అంటే...

నీకు ఎన్ని తినాలనిపిస్తే అన్ని తిను. మిగిలిన వాటితో ఏదో ఒకటి చేద్దాంలే అంటుంది. ఎక్కువ తినొద్దు ఒక నాలుగు కాయలు తిను చాలు అని విక్రమ్ అంటాడు.

నాలుగు కాయలు ఏమూలకి వస్తాయండి. ఒక్కొక్క పంటికి ఒక్కొక్క కాయ వేసుకున్న 32 కాయలు కావాలి అంటుంది.

మాధవి ఉప్పు కారం కలిపి ప్లేటు తెచ్చి పెడుతుంది. శుభ్రంగా కాయలన్నీ కడిగి ఇంకొక ప్లేట్లో పెడతారు. వాటిని చూడగానే అవనికి నోట్లో లాలాజలం ఊరిపోతూ ఉంటుంది.

గబగబా తీసుకొని తింటూ ఉంటుంది. ఒక పక్కన తింటూనే అబ్బా పుల్లగా ఉంది అని కళ్ళుమూస్తూ ఉంటుంది.

అవని తినే విధానం చూసే అందరూ టెంప్ట్ అయ్యి దగ్గరకు వచ్చి  తీసుకుంటారు. విక్రమ్ ఒక కాయ నోట్లో వేసుకుని బాబోయ్ ఇంత పుల్లగా ఉంటే ఎలా తినగలుగుతున్నావు నీకు నోరుపులుపు రావడం లేదా...


లేదండి ఇలా తినండి ఇంకా బాగుంటది అంటే ఒక నమస్కారం చేసి నువ్వు తిను.  నావల్ల కాదు కడుపుతో ఉంటే ఇన్ని వేరియేషన్సా..

అప్పుడే ఏం చూసావు..  ముందు ముందు ఇంకా ఉంటాయి అని కళ్యాణ్ అంటే..  ఎక్స్పీరియన్సా..  చాలా.
మీరు ముగ్గురు..  మా చెల్లికి ఒక్కడు.

మొత్తం నలుగురు. మేము ఎంత ఎంజాయ్ చేసాము అనుకుంటున్నావు. ఎందుకులే బావ విక్రమ్ కి చెప్పడం. మనం అంటే ఫుడీస్ కాబట్టి వాళ్లతో పాటు ఎంజాయ్ చేసాము.

మన విక్కీ బాబు డైట్ డైట్ అంటాడు కదా..  అని రమేష్ అనగానే.. మావయ్య అంటాడు. ప్రెగ్నెంట్ లేడీస్ ఫుడ్ బలే వెరైటీగా ఉంటుంది ఎంజాయ్ చేయి అని చెప్పి నవ్వుతారు.

అందరి నవ్వులు సరదాలు మధ్యన అవని తేలిక పడుతుంది. మరునాడు ఉదయం అవని నిద్రలేచేటప్పటికి యోగా ట్రైనర్ రెడీగా ఉంటుంది.

అప్పుడే అరేంజ్ చేసేసారా.. చెప్పాను కదా నీ విషయంలో ఏది లేట్ చెయ్యను అని.. మరీ ఇంత తొందరగానా నాకు బద్ధకంగా ఉంది.

ఆ బద్దకాన్ని వదిలించడానికే ఈ మేడం వచ్చారు వేకప్ అని చెబుతాడు. కష్టంగా లేచి బయటకి వస్తుంది.
అవని తో పాటు నివి కూడా స్టార్ట్ చేస్తుంది.

నీకెందుకు నివి అంటే ఫిట్నెస్ కోసం వదిన.  పెళ్లి దగ్గరలో ఉంది కదా.. నివి నువ్వు చాలా గ్రేట్. ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్ గా ఉంటావు.  థాంక్యూ.. థాంక్యూ.. వదిన.

ఇంతకీ మా అన్నయ్య ఎక్కడ.. హో రాజ్ గురించా.. ఆయనకు ఒళ్ళంతా బద్ధకమే. అప్పుడే ఎందుకు లెగుస్తారు.

అలా అనకు.. రాజ్ అన్నయ్య చాలా యాక్టివ్. నేను బెంగళూరులో ఉండగా చూశాను కదా.. అప్పుడు ఎంత డ్రామా ప్లే చేశారు అనుకుంటున్నావు.

నవ్వుతూ మేము అలా ప్లే చేసాం కాబట్టే నువ్వు ఓపెన్ అయ్యావు లేకపోతే ఇంకా సాగదిద్దువు కదా అని విక్రమ్ అంటాడు.

ఓ మీరు కూడా ఇక్కడే ఉన్నారా.. నీ వెనకాల లేకపోతే ఇలాగే కబుర్లు చెబుతూ టైంపాస్ చేస్తావు. అందుకే నేను నీ యోగ అయ్యేదాకా ఇక్కడే ఉంటాను.

ఇది చీటింగ్ నేనొప్పుకోను అంటుంది.  నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పదు బంగారం కానీ కానీ అంటాడు. కష్టంగా యోగ మొదలు పెడుతుంది.

వన్ అవర్ చేయిపించిన తర్వాత ఈరోజుకి చాలు మేడం. రేపు ఇంకా కొన్ని యాడ్ చేద్దాం..వన్ అవర్ చాలా అని నోరు వదిలేస్తుంది.

హెల్త్ ఇంపార్టెంట్ కదా తప్పదు. ఈవినింగ్ వాకింగ్ చేయండి అని చెప్పి ట్రైనర్ వెళ్ళిపోతారు. ట్రైనర్ వెళ్లగానే హమ్మయ్య అనుకుని రిలాక్స్ అవుతుంది.

వెంటనే క్యారేట్, బీట్రూట్ జ్యూస్ రెడీ అవుతుంది. అది చూసి అత్తయ్య అని బిక్కమొహం వేస్తుంది. తప్పదు బంగారం తాగేసి వెళ్లి స్నానం చేసి రా..

అప్పుడు వేడివేడిగా బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తాము అని గ్లాస్ చేతిలో పెడుతుంది.  నేను తాగుతాను మీరు వెళ్ళండి అత్తయ్య.

నీ హెల్త్ డైట్ విషయంలో ఎవ్వరం నెగ్లెట్ చేయము. నువ్వు తాగేసి గ్లాస్ ఇస్తే నేను వెళ్తాను అంటుంది.  సర్వెంట్స్ ఉన్నారు కదా అత్తయ్య వాళ్ళకి ఇస్తాను.

నీ పనులు మొత్తం మేమే చేస్తాం తల్లి కానీ అంటుంది.  ఆ జ్యూస్ తాగి ఇప్పుడు హ్యాపీ నా.. నువ్వు బంగారానివే అని చెప్పి మెటికలు విరిచి వెళతారు.

తాగితే బంగారం.. తాగకపోతే తాగేదాకా వదలరు.  ఏమిటో అనుకుని రూమ్లోకి వెళుతుంది.   రూమ్ చూసి ఏంటి ఇలా మారిపోయింది. నేను మా గదిలోకే వచ్చానా అని చుట్టూ చూస్తూ ఉంటుంది.

నచ్చిందా అని అడుగుతాడు. అదేంటి. కర్టన్ కలర్స్ అన్ని మార్చేశారు. రూమ్ లో కూడా డిఫరెంట్ స్మెల్ వస్తుంది.  ఏం చేశారు.

కర్టెన్స్ అన్ని లైట్ కలర్స్ కి మార్చాను బంగారం. నీ కళ్ళకి ప్రజెంట్ గా కనపడాలి కదా.. అలాగే స్మెల్ కూడా బాగుంటే నువ్వు రిలాక్స్డ్ అవుతావని.

అత్తింటి వారు చూపిస్తున్న ప్రేమకి ఫిదా అవుతూ విక్రమ్ ని గట్టిగా కౌగిలించుకొని నా విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నారండి.

ఇప్పుడే అత్తమ్మ జ్యూస్ ఇచ్చారు.  మీరేమో నా మనసు ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలని ప్రతి నిమిషం ఆరాటపడుతున్నారు.

థాంక్యూ.. థాంక్యూ.. గట్టిగా ముద్దు  పెడుతుంది.  బంగారం నువ్వు ఇలా టెంప్ట్ చేసావంటే చాలా కష్టం.. అసలు నీకు లేత నెలలు.

ఆంటీ కొన్ని రోజులు దూరంగా ఉండమన్నారు. నువ్వు ఇలా చేస్తే ఎలా చెప్పు అని చుట్టూ చేతులు వేస్తాడు.  నవ్వుతూ అయితే మీకు ఇంకొక గట్టి పరీక్ష అంటుంది

నాకేనా నీకు కాదా అని ముక్కు పట్టుకుని లాగుతాడు. నవ్వుతూ నాదారి వేరులే..  ఏదైనా ఒకటే.. ఎవరి బాడీలో అయినా హార్మోన్స్ అలాగే మారుతూ ఉంటాయి.

కాకపోతే మగవాళ్ళం బయట పడతాము.  మీ ఆడవాళ్లు బయటపడరు అంతే అంటాడు. అబ్బో మా ఆడవాళ్ళ గురించి బాగా రీసెర్చ్ చేసినట్టున్నారే..

బయట లేడీస్ మీద ఎందుకు... రీసెర్చ్ చేయడానికి  నువ్వు ఉన్నావు కదా.. నాకు తెలియదా ఏమిటి అంటాడు.

వెళ్లి స్నానం చేసిరా మళ్ళీ టిఫిన్ లేట్ అవుతుంది అని వాష్ రూమ్లోకి పంపిస్తాడు.  నీళ్లు కూడా సెట్ చేస్తాడు. ఇంతకుమించి వేడి చేయకు. అలాగే చన్నీళ్లు చేయకు అని సెట్ చేసి వస్తాడు.

స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి లైట్ వెయిట్ సారీ తీసి ఉంచుతాడు. నేను తీసుకుంటాను కదా.. ఏంటి తీసుకునేది..

నువ్వు కట్టే చీరలు వెయిట్ ఎక్కువ అయిపోతున్నాయి. అందుకే ఈ లైట్ వెయిట్ సారీస్ కట్టుకో అంటాడు.  ఇవి ఇప్పుడు తెప్పించారు.

నా దగ్గర లేవు కదా.. నీ మొగుడు సో స్మార్ట్ బంగారం. అందుకే అన్నీ తెప్పించి రెడీగా పెట్టాడు. అబ్బో అని చుట్టూ మెటికలు విరిచి అయితే రేపు ఎవరు పుడతారో వాళ్లకి కూడా ఇప్పుడు నుంచే తెచ్చి పెడతారా..

ఆ విషయంలో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. బేబీ రూమ్ కూడా రెడీ అయిపోతుంది. చీర కట్టుకుంటూనే అమ్మో బేబీ ని సెపరేట్ రూమ్ లోన..

నేను పడుకోబెట్టను.  నా పక్కనే పడుకుంటుంది. అయ్యో ఇండివిడ్యువాలిటీ అలవాటు అవ్వాలి బంగారం.  సెపరేట్ బెడ్ ఉండాలి.

ఏమో అవన్నీ నాకు తెలియదు.  బేబీ ఎప్పుడు నాతోనే ఉండాలి. నేను మా అమ్మ దగ్గర మిస్ అయిన ప్రతి ఫీలింగ్ ని కూడా నేను నా బేబీకి ఇవ్వాలి.

సరే సరే నీకు ఎలా నచ్చితే అలా చేద్దాం సరేనా..  నువ్వు మాత్రం ఎమోషనల్ అవ్వకు. అవని చీర కట్టుకున్న తరువాత విక్రమ్ జడ వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు.

అబ్బా జడ మీ వల్ల కాదండి. ట్రై చేస్తున్నాను కదా ఎలా వచ్చినా వెయ్యినివి. ఒక ఫోర్ డేస్ వేసాను అనుకో.. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.

ఇదేమన్నా నేర్చుకోలేనిదా.. ఎంతమంది హెయిర్ స్టైలిష్ లు అబ్బాయిలు ఉండడం లేదు అని కూర్చోబెట్టి మెల్లిగా చిక్కు తీసి వచ్చిన విధంగా జడ వేస్తాడు.

పాపిట్లో కుంకుమ పెట్టి పర్ఫెక్ట్ అంటాడు. సరే అని లేచి నిలబడుతుంటే.. వెయిట్ అని చెప్పి తలలో పువ్వులు కూడా పెడతాడు.

ఎందుకు నన్ను చీర లైట్ వెయిట్ కట్టుకోమన్నారు....
మీరు మాత్రం నన్ను హెవీగా రెడీ చేస్తున్నారు. నవ్వుతూ పువ్వులు ఎక్కువ కాదు బంగారం తక్కువే పెట్టుకో.

ఇలా రెడీ అవుతే కొంచెం ముద్దుగుమ్మ లాగా ఉంటావు. పద అని తీసుకువెళతాడు .  అవని నార్మల్గా నడుస్తూ ఉంటే నువ్వు అంత స్పీడ్ గా ఎందుకు నడుస్తున్నావ్ మెల్లిగా నడువు అని కసురుకుంటాడు.

ఇప్పుడు నేను స్పీడ్ గా ఎక్కడ నడిచాను.  రోజు నడిచినట్టే కదా.. ఆ స్పీడే తగ్గించమని.. ఆంటీ వాకింగ్ చేయమన్నారు గాని పరిగెత్తమనలేదు.  స్లో అంటాడు.

విక్రమ్ ఏం చెప్పినా వినడు అని అడుగులో అడుగు వేసుకుంటూ వస్తూ ఉంటుంది.  ఏం చేస్తున్నావు.. మీరే కదా స్లోగా నడవమన్నారు.

ఇలా నడిస్తే సరిపోతుందా.. ఏమిటి వెటకారమా..కాదు మమకారం నచ్చిందా.. మరీ ఎక్కువ అవుతుంది కానీ కొంచెం స్పీడ్ పెంచు అని చెప్పి నాతోపాటు కలిసే అడుగులు వెయ్యి అని చేయి పట్టుకుంటాడు.  సరే అని విక్రమ్ చేయి పట్టుకుని నడుస్తుంది.

విక్రమ్ ప్రేమ అవని పాట్లు??

కథ కొనసాగుతుంది...
[+] 11 users Like SivaSai's post
Like Reply

Part - 131


అవని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి బ్రేక్ ఫాస్ట్ పెడతారు.  అత్తయ్య నాకు కారంగా కావాలి.మార్నింగ్ టైం కారం వద్దు. లంచ్ లోకి కారంగా చేసి పెడతాను.

చికెన్ చేయండి అత్తయ్య అంటుంది. ఏమిటి చికెన్ మీదకి లాగుతుందా.. హా తినాలి అనిపిస్తుంది. విక్రమ్.. వినయ్, భరత్ కి ఆఫీస్ వర్క్ అంత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు

ఎమర్జెన్సీ అయితే మాత్రం చెప్పండి. వస్తాను. లేదంటే నేను ఇంటి దగ్గర నుంచి హ్యాండిల్ చేస్తాను. షూర్ అన్నయ్య మేము చూసుకుంటాం కదా అని ఇద్దరు ఆఫీస్ కి వెళ్ళిపోతారు.

ఆఫీస్ కి వెళ్లి వర్క్ లో బిజీ అయిపోతారు. టు అవర్స్ వర్క్ చేసిన తర్వాత వినయ్ రిలాక్స్ అవుతూ ఉంటే పూజిత గుర్తొస్తుంది.

ఈ మేడమ్ ఏం చేస్తుంది. మళ్ళీ ఎవరినైనా రోడ్డుమీద పెట్టి కొడుతుందా..  ఫోన్ చేద్దాం.  చేస్తే పోలా అనుకుని ఫోన్ చేస్తాడు.

అవతల నుంచి స్వీట్ వాయిస్ వినపడుతుంది. హలో సర్ వాట్ డు యు వాంట్ అడుగుతుంటే.. ఆ వాయిస్ కి మెల్ట్ అవుతూ మీరే కావాలి అంటాడు.

హలో మిస్టర్ ఎవరు మాట్లాడేది. ఎవరైతే ఏమిటి..  మీరు అడిగారు నేను సమాధానం చెప్పాను. ఇప్పుడు ఇలా అడిగితే ఎలా మిస్ అంటాడు.

నా ఎదురుగా వచ్చి అడుగు అప్పుడు చెబుతాను.  ఆహా..  నేను మీ ఎదురుగుండా వస్తే నా మక్కెలు ఇరగదీయ్యడానికా...

పరవాలేదు నా గురించి బాగానే తెలుసుకున్నావు.  తెలుసుకున్నాను కాబట్టే ఫోన్లో మాట్లాడుతున్నాను.  మొన్న చీర కట్టుకున్నారు కదా కత్తి లాగా ఉన్నారు.

మిస్టర్ మాటలు సరిగ్గా రానివ్వి. నేను చీర కట్టుకుంటే నీకెందుకు..  అయినా ఏదో నీకోసం కట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నావు.

నాకోసమే కదా కట్టుకున్నావు అంటాడు.  నువ్వు ఎవరో తెలియనప్పుడు నీకోసం ఎందుకు కట్టుకుంటాను మిస్టర్. ఇంతలోనే నన్ను మర్చిపోయా... టూ మచ్ బాడ్ అమ్మాయ్...

ఓ నువ్వా అబ్బాయ్..  ఏమిటి ఖాళీగా ఉన్నావా...
  ఫోన్ చేసి మరీ సతాయిస్తున్నావు. నువ్వు ఖాళీగా ఉండి ఉంటావు కదా అని ఫోన్ చేశాను.

దానికి తగ్గట్టుగానే సమాధానం చెప్పావు కదా.. హలో ఇది నా బిజినెస్ వర్క్.  ఎవరితో అయినా ఇలాగే మాట్లాడతాను.

నాతో మాట్లాడింది మిగిలిన వాళ్ళతో మాట్లాడింది ఒక్కటేనా..  నేను చెప్పింది కస్టమర్స్ గురించి అంటుంది. అయితే నేను కస్టమర్ ని కాదు కదా..

నాతో స్పెషల్ గా మాట్లాడతావా.. ఏముంది నీలో అంత స్పెషల్ మాట్లాడడానికి అని సాగదీస్తుంది. స్పెషల్ ఉంది కాబట్టే కదా కొట్టి మాట్లాడే అమ్మాయి... ఇంత స్మూత్ గా మాట్లాడుతుంది.

ఇప్పుడు దాకా నేను అబ్బాయిలాగా బిహేవ్ చేశానా..  కాదు రౌడీ పిల్లవి. ప్రస్తుత రోజుల్లో రౌడీలాగా ఉంటేనే మన జోలికి ఎవ్వరూ రారు అబ్బాయ్..

అవునవును నీ జోలికి రావాలి అంటే నేనే భయపడతా..  నీకు మిగిలిన వాళ్ళు ఒక లెక్క. నీలో ఏముంది స్పెషల్ అంటే మాత్రం చెప్పడం లేదు అంటుంది.

స్పెషల్ ఏమిటో నీ మనసుని అడుగు. తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు. ఏ ఆఫీస్ లో వర్క్ లేదా..  మీ బాస్ ఏమీ అనడం లేదా...

మా బాస్ నాకు టైం ఇచ్చారులే నీతో మాట్లాడమని. ఓహో ఇది కూడా పర్మిషన్ అడిగి ఫోన్ చేసావా... ఏదైతే ఏమిటి నీతో ఫోన్ మాట్లాడుతున్నాను కదా..

అది ఎంజాయ్ చేయడం మానేసి... ఎలా చేసావ్..  పర్మిషన్ ఇచ్చారా..  ఎందుకు చేసావ్ ఇలాంటి అనవసరమైన విషయాలు ఎందుకు అమ్మాయ్...

నువ్వు ఖాళీగా ఉన్నావేమో గాని నేను ఖాళీగా లేను అబ్బాయ్..  బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ వైపు చూసి నవ్వుకుంటూ ఉంటాడు.

తన ముందు ఎవరో ఉన్నట్టు అనిపించి తల పైకెత్తి చూడగానే భరత్ కుర్చీలో కూర్చుని, ఒక చెయ్యి బుగ్గ కింద చెయ్యి పెట్టుకుని.. మరొక చేతితో టేబుల్ పైన దరువేస్తూ ఏంటి బావ సంగతి.

ఏముంది ఏమీ లేదు అనే దబాయిస్తాడు..  అబ్బో నీ మాటలోనే తెలుస్తుంది గాని ఎక్కడ వరకు వచ్చింది. నువ్వు అనుకున్నంత ఏమీ లేదు బావ.

జస్ట్ రౌడీ పిల్ల.. ఏదో ఆట పట్టిద్దామని కాల్ చేశాను అంతే అంటాడు.  ఆట పట్టిద్దామనా లేకపోతే ఆడుకుందామన.. నేనేం ఆడుకుంటాను..

నేను ఏమైనా చిన్నపిల్లడినా..  చిన్నపిల్లల ఆడే ఆటల గురించి నేను ఎక్కడ అన్నాను బావ.  ఆడుకోవడంలో చాలా రకాలు ఉంటాయి.

మన వయసులో అంటే రొమాన్స్ ఆట ఆడుకోవచ్చు.
  ప్రేమ ఆట ఆడుకోవచ్చు ఇంకా ముందుకు వెళితే... సౌండ్ వచ్చేలాగా ఒక నమస్కారం పెట్టి తమరెందుకు వచ్చారో చెప్పలేదు అంటాడు.

ఎందుకు బావ అంత ఫ్రస్టేషన్..  నీకు హెల్ప్ చేద్దామని నేను చూస్తూ ఉంటే..  నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు కానీ ముందు తమరి సంగతి చూసుకోండి.

ఇంతకీ మొన్న ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి జాయిన్ అయ్యిందా... భరత్ దిక్కులు చూస్తూ ఏ అమ్మాయి అంటాడు.

నువ్వు దిక్కులు చూస్తున్న అమ్మాయి.. తెలిసిపోయిందా.. నువ్వు నా దగ్గర సీక్రెట్ మైంటైన్ చేయలేవులే గాని... నువ్వే నా కన్నా స్పీడ్ గా ఉన్నావ్.

మాది ఇంకా చూపుల దగ్గరే ఆగిపోయింది. తను చూపుల దగ్గర ఆపేస్తే ఏమైంది నువ్వు ముందుకు తీసుకువెళ్ళు బావ..

ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కావడం లేదు రా... ఆ అమ్మాయి మరీ కామ్ గా ఉంది. ఇంతకీ అమ్మాయి పేరు ఏమిటో.. విద్య.

నైస్ పేరుకు తగ్గా చదవన్నమాట. చదువు తప్ప ఇంకా బయట ప్రపంచంతో సంబంధం ఉండడం లేదు
ఎలా లైన్లో పెట్టాలో అర్థం కావడం లేదు అని తల పట్టుకుంటాడు.

వినయ్  కాల్ చేసే విద్యని పిలుస్తాడు.  ఒరేయ్ ఇప్పుడు అమ్మాయిని ఎందుకురా.. ఒకసారి మా చెల్లి ఎలా ఉంటుందో చూడాలి బావ.

మీ చెల్లికే బానే ఉంటుంది కానీ నా తిప్పలే.. ఎక్స్క్యూజ్మీ అన్న స్వీట్ వాయిస్ వినపడుతుంది. ఎస్ కమిన్ అని వినయ్ గంభీరంగా అంటాడు.

భరత్..  నన్ను ఇరికించేస్తున్నావ్ కదరా అని ఏమీ తెలియనట్టుగా ఫోన్ చూస్తూ ఉంటాడు. లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ పిలిచారంట .

ఎస్ మిస్ విద్య. మీరు చేస్తున్న ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది దాని డీటెయిల్స్ ఏంటి అంటే...  టక టక గ్యాప్ ఇవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.

ఓకే నైస్ అని..  మిస్ విద్యా అంటే చెప్పండి సార్. ఏమీ లేదు ఇది లేడీస్ మ్యాటర్.  జస్ట్ స్మాల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటాడు.

నేనా అని భయంగా అంటే.. పరవాలేదు మీరు నాకు సిస్టర్ లాంటివారే.. అయితే అడగండి సార్. ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ డ్రెస్సెస్ ఏం వచ్చాయి.

ఏమైనా ఐడియా ఉందా.. నేను ఒకరికి గిఫ్ట్ గా ఇవ్వాలి. అయ్యో నాకు తెలియదు సార్. అవన్నీ మా అమ్మే కొంటుంది. అవునా నైస్ వెళ్ళమ్మా అని పంపించి భరత్ వైపు చూస్తాడు.  నేను చెప్పానా అంటాడు భరత్ .

నువ్వు చాలా కష్టపడాలి బావ మా చెల్లిని ట్రాక్ లోకి తీసుకు రావడానికి..  అదే కదా నా బాధ. ఎలా చెబుదామన్నా ఏమీ అర్థం కాదు.

ఒక్క స్టడీస్ ప్రాజెక్ట్ సంబంధించింది అయితే ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ అంతా విద్య బుర్రలోని ఉంటుంది. ఒక పని చెయ్ వాళ్ళ మదర్ ని లైన్లో పెట్టు..

ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావురా అంటే నేను అన్నది వాళ్ళ మదర్ సైడ్ నుంచి నరుక్కురా ఆవిడ ఒప్పుకుంటే ఆటోమేటిక్గా విద్య ఒప్పుకుంటుంది.

అప్పుడు అది పెద్దవాళ్ళు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుంది రా.. ఓహో తమరికి లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అన్న కోరిక ఉంది కదు.

ఇలాగైతే నా పెళ్లయిపోయి నా పిల్లలు కూడా పెళ్లికి వచ్చేస్తారేమో... ఏంట్రా సెటైరా.. కాదు ఫ్యాక్ట్. మీ ఇద్దరు విషయంలో రెండే ఆప్షన్లు.

ఒకటి నువ్వు వాళ్ళ మదర్తో మాట్లాడి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడం. లేదు అంటే విద్యకు అర్థమయ్యే విధంగా నీ ప్రేమని చెప్పి లవ్ మ్యారేజ్ చేసుకోవడం.

రెండిట్లో ఏది ఈజీనో అది ఫాలో అవ్వు. లేదు అంటే నీ వయసు మనసు రెండు వేస్ట్ అయిపోతాయి బావ.

భరత్ నిర్ణయం...

భరత్ ? విద్య...
[+] 8 users Like SivaSai's post
Like Reply

Part - 132


వినయ్ చెప్పిన విధానానికి భరత్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బావ తెగ చించుతున్నావు. నువ్వు చెప్పినదే ఆలోచిస్తున్నాను.

ఫస్ట్ నా ట్రైల్ నేను వేస్తాను. వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు ఆలోచిద్దాంలే. నీ ఇష్టం.  చెప్పాల్సింది చెప్పాను. నువ్వేం చేస్తున్నావు ప్రొసీడ్ అవుతున్నావా.

నా రౌడీ పిల్లని కొన్ని రోజులు ఆడుకోవాలి బావ. ఎలాగైనా లైన్ లోకి వచ్చేస్తది. అది దేశముదురు కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు.

మనం పరవాలేదు. రాజ్ బావ గురించి ఆలోచిస్తే బాధేస్తుంది. నిజమే మరి ఇంత అమాయకుడు అనుకోలేదు.

యూఎస్ లో ఉన్నాడు. ఫాస్ట్ గా ఉంటాడు లేడీస్ ని ఒక రేంజ్ లో హ్యాండిల్ చేస్తాడు అనుకున్న.  కానీ మన నివి దగ్గర మాత్రం బొక్కబోర్లా పడుతున్నాడు.

అవును బావ బిజినెస్ లో అన్నయ్యతో సమానంగా వెళుతున్నాడు కానీ లేడీస్ ని హ్యాండిల్ చేయడం అస్సలు రావడం లేదు.

మనం చాలా బెటర్. ఏమో నా పరిస్థితి అయితే నాకు ఏమీ అర్థం కావడం లేదు వినయ్ . నీ పిల్ల ఏదో ఒకటి మాట్లాడుతుంది. నా పిల్ల ఏమీ మాట్లాడదు.

ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఐడియా..  నీ పిల్ల నెంబర్ ఇవ్వు బావ అంటాడు.  ఎందుకు. నాకు చాలా పని ఉంది అని నెంబర్ తీసుకుని వెళ్ళిపోతాడు.

ఒకసారి మనం శిల్ప,  ఉదయ్ దగ్గరికి వెళదాం రండి..

పనులు చేయడం మొదలుపెట్టి అప్పటికే 15 రోజులు దాటుతుంది. శిల్పకి ఆలోచించుకోనే టైం లేకుండా మెదడు శరీరం రెండు అలసిపోతూ ఉంటాయి.

పొద్దున్నే ఎప్పుడో లేచి రాత్రి చీకటి పడ్డాక పడుకోవడం. సోషల్ యాక్టివిటీస్ లో లేకపోవడం. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకపోవడంతో ఒక రకమైన ప్రశాంతమైన జీవితంలో ఉంది.

మెల్లి మెల్లిగా ఆ పనులకి అలవాటు పడుతూ వచ్చిన రోజు చూపించిన పొగరు కూడా తగ్గి మనుషుల విలువ మెల్లిగా తెలుసుకుంటూ ఉంది.

పొలంలో  జల్లిన విత్తనాలు చిన్నగా మొలక వచ్చేటప్పటికి అవి చూసి ఆనందంతో ఉదయ్ అని పిలుస్తుంది. చెప్పు శిల్ప అంటే...

మనం వేసిన విత్తనాలు చూడు చిన్నగా మొలక వచ్చింది అని సంతోషంగా చెబుతుంది.  ఉదయ్ శిల్ప వైపు చూస్తాడు.  ఆ ముఖంలో ఎప్పుడూ కనపడిని సంతోషం కనబడుతూఉంటుంది.

అవును అంటాడు. అవును అని అంత సింపుల్ గా అంటావేమిటి. ఇది మన హార్డ్ వర్క్ అంటుంది. ఆ మాటకి నవ్వుతూ హార్డ్ వర్క్ విలువ నీకు తెలుస్తుందా...

ఇప్పుడిప్పుడే... చూస్తూ ఉంటే మనసుకి ఎంత హాయిగా ఉందో తెలుసా.. డాడీ దగ్గర ఎంత మనీ తీసుకుని పార్టీస్ చేసుకున్న సరే ఈ ఆనందం ముందు అవన్నీ నథింగ్ అనిపిస్తున్నాయి.

అందుకేనేమో అవని ఎప్పుడూ చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఉండేది. కష్టపడేది కదా అందుకే ఆ విలువ బాగా తెలిసేది. నువ్వు అవని గురించి ఆలోచిస్తున్నావా...

చెప్పాను కదా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఆ సంతోషం ముందు ఏది కనిపించడం లేదు.  అవని ఊహ తెలిసే వయసు నుంచి కష్టపడుతూనే ఉంది.

తన కష్టాన్ని చూసి మనం వెకిలిగా నవ్వుకునేవాళ్ళం.  ఎగతాళి చేసేవాళ్ళం.  ఆఖరికి మమ్మీ కడుపు నిండా ఫుడ్ కూడా పెట్టేది కాదు.

మనం ఎంత ఫుడ్ వేస్ట్ చేసేవాళ్ళం. ఆ వేస్ట్ చేసింది దాంట్లో సగం అవనికి పెట్టిన సరిపోయేది కానీ..  మమ్మీ అలాంటి మంచి పనులు చేయలేదు.

ఆవిడని చూస్తూ పెరిగిన మనకి ఎక్కడి నుండి వస్తాయి. నువ్వు అన్నది కూడా నిజమే శిల్ప. మన పేరెంట్స్ సరిగ్గా ఉండి ఉంటే ఈరోజు మన పరిస్థితి ఇలా ఉండేది కాదు.

మీ మమ్మీకి తోడు మా డాడీ, మా మమ్మీ. ముగ్గురికి ముగ్గురు తోడు దొంగలు లాగ మావయ్య ఆస్తినంతా కొట్టేసి...

అవనినీ రోడ్డు మీద నిలబెట్టి నిన్ను ప్రిన్స్ చేయాలి అనుకున్నారు. కానీ భగవంతుడు అనే వాడు చూస్తూ ఉంటాడు కదా...

అవని కష్టపడే తత్వానికి విక్రమ్ లాంటి వ్యక్తి భర్తగా వచ్చాడు. మన పరిస్థితి ఇలా ఉంది అంటాడు. అవును నువ్వు అన్నది కూడా నిజమే.

మమ్మీ ఫస్ట్ నుంచి మంచిగా ఉండి ఉంటే నేను కూడా అలాగే ఉండేదాన్నేమో. అట్లీస్ట్ అక్కచెల్లెలు లాగా అయినా పెరిగే వాళ్ళము కదా..

మంచి చెడు తెలుసుకునేదాన్ని. ఈరోజు నా జీవితం నేను కోరుకున్నట్టుగా మలుచుకునేదాన్ని ఉదయ్  అలా చూస్తూ ఉంటే తప్పుడు దారిలో కాదు సరైన దారిలో వెళ్లి అంటుంది.

ఇంకా మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా అంటే ఒక నవ్వు నవ్వి పద పనిచేసుకుందాం అంటుంది. ముందుకు వెళుతున్న శిల్ప ని చూస్తూ ఉంటాడు.

మా బంధం ఏమిటి..  ఈ పెళ్లిని ఒప్పుకోవాలా.
ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు అలా అని ద్వేషము లేదు. శిల్పా తప్పుడు దారిలోకి వెళ్ళింది అని తప్పుపట్టడానికి నేనేమీ శ్రీ రామచంద్రుడిని కాదు కదా..

నేను తిరగాల్సిన తిరుగళ్లన్నీ తిరిగాను. అలాంటప్పుడు శిల్ప పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకోవడం కూడా నా మూర్ఖత్వమే.

మెల్లిగా శిల్ప మనసు మార్చి ఇద్దరం భార్యాభర్తలుగా ప్రయాణం మొదలుపెట్టాలి. ఇప్పటినుంచి మాత్రం ఒకరినొకరి మోసం చేసుకోకుండా నిజాయితీగా ఉంటే చాలు అనుకుని శిల్ప వెనకాలే వెళతాడు.

రోజులు ముందుకు సాగుతూ ఉన్నాయి. కొంతమందికి సంతోషంతో.. కొంతమందిలో మార్పురావడంతో...రెండు జంటలు ప్రేమాయణంతో.  ఒక జంట పెళ్లి టైం దగ్గర పడడంతో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు.

అవనికి మూడో నెల వస్తుంది. డాక్టర్ చెక్ చేసి అంతా బానే ఉంది పరవాలేదు ఇలాగే డైట్ మెయింటైన్ చేయాలి అని సజెస్ట్ చేస్తారు.

ఓకే థాంక్యూ చెప్పి ఇంటికి తీసుకువస్తాడు. నేను బాగానే ఉన్నాను. బానే ఫుడ్ తీసుకుంటున్నాను. మీరు ఆఫీస్ కి వెళ్ళండి. లేదు నా బేబీని చూసిన తర్వాత అంటాడు.

అప్పుడు మాత్రం ఎందుకు.. మీ బేబీని ఎవరు ఆడిస్తారు డైపర్ ఎవరు మార్చుతారు.  అప్పుడు కూడా ఉండిపోండి.  గుడ్ ఐడియా.

నాకు ఇప్పుడు దాకా రాలేదు.  చూసావా ఎలాగైనా నా బేబీ చాలా గ్రేట్ అంటాడు. ఏదైనా సరే బేబీ అకౌంటు ఏనా... నాకు బుర్ర లేదా..

బుర్ర ఉంది కానీ వాడటం అన్నది నా బేబీ వచ్చిన తర్వాతే స్టార్ట్ అయింది. అందుకే నా బేబీ గ్రేట్. అబ్బో ఇప్పుడు నుంచే పుట్టబోయే బేబీ ని నెత్తిన పెట్టుకుంటే  వచ్చే బేబీ ఇంకా ఆడించేస్తుంది.

అప్పుడు గ్రేడ్ లయన్ విక్రమ్ జై సింహా గారు వాళ్ళ పిల్లలు చేతుల్లో డాల్ అంటారు.  ఆ మాటకి నవ్వుతూ అయ్యేది నా పిల్లలకే కదా...

అందులో ఉండే ఆనందమే వేరు. చిన్నప్పుడు నేను  చాలా అల్లరి చేసేవాడిని. ఆఫీస్ కి వెళ్ళిన  డాడీని, తాతయ్యని ఇంటికి వచ్చేదాకా బాగా పేజీ పెట్టేవాడిని.

ఒక్కోసారి ఇంపార్టెంట్ మీటింగ్లోనే వెనక్కి వచ్చేసేవాళ్ళు అంట. ఎప్పుడు నాన్న అంటారు నీకు ఇంతకుమించి ఏడిపించేవాడు పుట్టాలిరా..

అప్పుడే నా రివెంజ్ తీరుతుంది అని. నేను మాత్రం ఎంజాయ్ చేస్తాను పిల్లల్లో పిల్లలుగా కలిసిపోవాలి.
పెద్దవాళ్ళో పెద్దవాళ్లగా కలిసిపోవాలి.

అప్పుడే మన స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఎప్పటికీ యంగ్ గా కనిపిస్తాము. ఓహో తమరు అందం సీక్రెట్ ఇదా అంటుంది. నీకు కావాలా..

ఎందుకులే ఆ అందం మందం మాదిరిగా మీరే పెంచుకోండి అని మూతి తిప్పుతుంది. అరె.. నా భార్యామణికి కూడా జలస్ వస్తుందా...

నాకెందుకు.. చూసావా నీలో ఉన్న కొత్త వేరియేషన్ కూడా నా బేబీ వల్లే బయటకు వచ్చింది. మీకో నమస్కారం. మీ బేబీ కో నమస్కారం. నన్ను వదిలేయండి.

మీ బేబీ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను. అరే అలా ఎలా వదిలేస్తాను. ఎంజాయ్ చెయ్. ఇప్పుడు నుంచి నా బేబీ టాలెంట్ను గుర్తించావు అనుకో.. 

పుట్టిన తర్వాత ఎలా ఉండాలో..  ఇంకా ఎలా డెవలప్ అవ్వాలో తెలుస్తుంది అంటాడు.  ఇంకా అంటే ఇంకా నా ఆలోచించి చెబుతాను.

మీరు ఆలోచిస్తూ ఉండండి. నాకు పని ఉంది అంటుంది ఏం పని. అబ్బా ఏదో ఒకటి ఉంటుందిలే.  హ.. మర్చిపోయాను బంగారం అంటాడు.  మళ్ళీ ఏం గుర్తొచ్చింది  నీ కోసం జీకే బుక్స్ తెచ్చాను.

సీరియస్గా చూస్తూ ఏం తెచ్చారు అంటుంది. జనరల్ నాలెడ్జ్ బుక్స్. ఇప్పుడు నాకు అది ఏమైనా తక్కువ  ఉందా.

ఇప్పుడున్న దానికన్న ఇంకా పెంచుకొవడానికి.  నీ ఐక్యూ ఎంత బాగుంటే బేబీకి అంత మంచిది. ఇప్పటినుంచి ఆలోచిస్తూ ఉంటుంది. షార్ప్ గా ఉంటుంది.

తల కొట్టుకుంటూ ప్లీజ్ అండి కావాలి అంటే అమ్మమ్మ గారి దగ్గర కూర్చుని భగవద్గీత, రామాయణం వింటాను సరేనా. అవి విను.  ఇది చదువు.

రోజు నిన్ను నేను అడుగుతాను. ఆ కొషన్స్కి సమాధానం చెప్పాలి అంటే బిక్క మొహం వేసుకుని చూస్తుంది. ఏమైందిరా అంటాడు.  ఏం అవ్వాలా....

మన బేబీ పుట్టడంతోనే బిజినెస్ స్టార్ట్ చేసేస్తారు ఏమో అని భయంగా ఉందండి.  అది ఇంకా మంచిది కదా..
హ్యాపీగా నేను రిలాక్స్ అయిపోయి మనం ట్రిప్స్ మీద ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేయొచ్చు అంటాడు.

నా బుర్ర ఇప్పటికే వేడెక్కిపోయింది. నేను అమ్మమ్మ గారి దగ్గరికి వెళుతున్నాను అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వెళుతున్న అవనినీ చూసి నవ్వుకుంటూ నిన్ను ఎప్పుడూ ఇలాగే బిజీగా ఉంచాలి.

నీ బుర్రకి ఏది ఆలోచించుకునే టైము ఇవ్వకూడదు. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నువ్వు ప్రశాంతంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను.

అవని ఇందిరాగారి దగ్గరికి వెళ్లి అమ్మమ్మ గారు అని పిలుస్తుంది. రా తల్లి అక్కడే ఆగిపోయావే.. లోపలికి వచ్చి ఏం చేస్తున్నారు.

ఇప్పుడే రామాయణం తీసి చదువుతున్నాను. నాకు వినాలని ఉంది. పైకి చదువుతారా.. అంతకన్నానా..  రా తల్లి అని కూర్చోబెట్టి రామాయణం చదువుతూ ఉంటారు.

అది వింటూనే అవని అక్కడే నిద్రపోతుంది.  పడుకున్నా అవనినీ జో కొడుతూ రామాయణం చదువుతూఉంటారు.

ఆనందనిలయం??

కథ కొనసాగుతుంది...
[+] 13 users Like SivaSai's post
Like Reply

Part - 133


విక్రమ్ ఇందిర దగ్గరికి వస్తాడు.  పడుకుని ఉన్న అవనినీ చూసి నిద్రపోయిందా. ఆహా మగతగా ఉన్నట్టుంది. నువ్వు జో కొడుతున్నావా గ్రానీ.

తప్పేముందిరా.. ఈ టైం లో కడుపుతో ఉన్న ఆడవాళ్లు అంటే గర్భగుడిలోని అమ్మ వారితో సమానం. కడుపుతో ఉన్నవాళ్ళకి సేవ చేస్తే సాక్షాత్తు అమ్మవారికి సేవ చేసినట్టే. మరి ఆ భాగ్యాన్ని నేనెందుకు వదులుకుంటాను.

ఆ మాటకు విక్రమ్ ఇందిరాగారిని హగ్ చేసుకుని థాంక్స్ గ్రాని అంటాడు.  ఎందుకురా. అవనినీ  ఇంత బాగా అర్థం చేసుకుని సపోర్ట్ గా నిలబడ్డావు చూడు.  అందుకు.

ఒరేయ్..  పెళ్లికి ముందు ఎవరు ఏమిటి అన్నది మనకి అనవసరం. పెళ్లిళ్లు స్వర్గాన్ని నిర్ణయించబడతాయి అంటారు.

మీ ఇద్దరికీ ఎప్పుడో భగవంతుడు రాసి పెట్టాడు.  అందుకే భార్యాభర్తలు అయ్యారు.  మరి నీ భార్య మన కుటుంబంలో మనిషే కదా..

మన కుటుంబానికి సంబంధించిన వాళ్లని నేను ప్రేమగా చూసుకోకపోతే  ఎవరు చూసుకుంటారు. నేను ప్రవర్తించే విధానాన్ని బట్టి కదా నా తర్వాత తరం ఫాలో అవుతుంది.

ప్రతిదీ నోటితో చెప్పాల్సిన అవసరం లేదు విక్రమ్. మన చేతులతో కూడా కొన్ని కొన్ని నేర్పించవచ్చు. అవును గ్రానీ నువ్వు చెప్పింది అక్షర సత్యం.

మాధవి అవనినీ వెతుక్కుంటూ ఇందిరా గదిలోకి వచ్చి ఇక్కడ పడుకుందా అమ్మ. ఏమైంది తల్లి. ఎప్పుడో తింది. కాస్త ఫ్రూట్స్ తింటుంది కదా అని తీసుకువచ్చాను.

ఇందిర అమ్మ అవని లేగుమ్మా అని మెల్లిగా లేపుతారు. మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే ఇది నా గది కాదే అనుకుంటూ ఇందిరాగారి వైపు చూస్తుంది.

చట్టుక్కున  లేస్తూఉంటే... మెల్లిగా అంటారు.  సోరి అమ్మమ్మగారు..  మీరు రామాయణం చదువుతూ ఉంటే తెలియకుండానే నిద్ర పట్టేసింది.

నువ్వు నిద్రపోతే ఏమైంది కడుపులో ఉన్న బిడ్డ వింటుంది కదా..  అది చాలు.  మేము చదువుతూ ఉంటాము.  నువ్వు నిద్ర పోయినా మాకు ఇబ్బంది లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు.

మాధవి ఇదిగో అని చేతికి ఇస్తుంది.  ఆకలిగా లేదు అమ్మ. ఆకలి ఉన్న లేకపోయినా కొంచెం కొంచెం తింటూ ఉండు అని మెల్లిగా తినిపిస్తూ ఉంటారు. 

నివి, లలిత కూడా అక్కడికి వస్తారు.  వదిన నువ్వు బాగానే ఉన్నావు కదా. హా బానే ఉన్నాను ఏమైంది నివి.. మనం షాపింగ్ కి వెళ్దాము.

లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి అంట. కాల్ చేశారు.  ఆఫ్టర్నూన్ నుంచి వెళదామా అనగానే.. అందరూ ఒకేసారి వద్దు అంటారు.

ఆ మాటకి ఏమైంది అంటే..  అవని బయట తిరగకూడదు. అందులోనే ముఖ్యంగా నీతో అని లలిత అంటుంది.

అమ్మ అంటే... అవును తల్లి తమ షాపింగ్ ఎలా ఉంటుందో మా అందరికీ ఎక్స్పీరియన్స్ ఏ కదా.. అసలే అవని కడుపుతో ఉంది.

నీతో పాటు తిరిగింది అంటే అలసిపోతుంది.  కావాలి అంటే ఆ షాప్ కి ఫోన్ చేసి ఆ డిజైన్స్ అన్ని ఇంటికి తేప్పించుకో లేదు అంటే ఎవరినైనా తోడు తీసుకువెళ్ళు.

రాజ్ లేరమ్మ. వర్క్ ఉంది అని చెప్పి కలవడం కష్టమన్నారు. ఆల్రెడీ రాజ్ కి కాల్ చేసావా.. ఉమ్..
  తల ఊపుతుంది.

అయితే మీ అన్నయ్యలనో,  బావనో తీసుకువెళ్ళు. వాళ్ళు రారమ్మా. ఎవరు వచ్చినా రాకపోయినా అవని మాత్రం రాదు.

సరే నేను నాన్నని, మావయ్యని తీసుకువెళ్తాను. హమ్మయ్య అని మాధవి అంటే..  ఏమైంది అత్తయ్య.. మమ్మల్ని ఎక్కడ రమ్మంటావా అని భయపడ్డాను.

థాంక్స్...  వాళ్ళిద్దర్నీ తీసుకువెళ్ళు.  అసలే ఈ మధ్యన మీ మావయ్యకి ఎక్సర్సైజ్ లేక ఒళ్ళు పెంచుతున్నారు. నాతో తిరిగితే ఎక్సర్సైజ్ఆ..  అత్తయ్య.

డౌటా...  ఎంత వాకింగ్ చేపిస్తావు నువ్వు? అట్లీస్ట్ ఒక కేజీ తగ్గిన తగ్గినట్టే కదా తీసుకువెళ్ళు.  థాంక్యూ అత్తయ్య. నీకోసం మావయ్యను తీసుకు వెళుతున్నాను అంటుంది.

అందరూ రమేష్,  కళ్యాణ్ ని ఊహించుకుని జాలి పడతారు. సాయంత్రం తొందరగా రండి అని నివి మెసేజ్ చేస్తుంది.

ఏమైంది అని కాల్ చేస్తే.. తొందరగా రండి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.  బావమరుదులిద్దరూ ఊపుకుంటూ సాయంత్రం తొందరగా వచ్చేస్తారు.

నివి రెడీ అయ్యి ఉంటుంది. వాళ్ళు లోపలికి వస్తూ ఏమైంది నివి తొందరగా రమ్మన్నావు. పదండి...  పదండి మళ్ళీ లేట్ అవుతే కష్టం.  ట్రాఫిక్ లో ఇరుకుంటాము.

  ఎక్కడికి వెళ్ళేది..  దేనికి అని ఇద్దరు అయోమయంగా చూస్తూ ఉంటే షాపింగ్ కి నాన్న అంటుంది. అంతే ఇద్దరూ మొఖాలు  వేలాడేసుకుని ఇప్పుడు షాపింగ్ ఏంట్రా  లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయంట.

అత్తయ్యతో అంటే మావయ్యని, నాన్నని తీసుకువెళ్ళు.  ఈ మధ్య ఎక్సర్సైజు లేక వెయిట్ పెరుగుతున్నారు.  హెల్త్ ఇబ్బంది అవుతుంది.

నీతో వస్తే కొంచెం ఎక్సర్సైజ్ అయినా చేసినట్టు ఉంటుంది అని చెప్పింది నాన్న. మీకోసం.. మీ ఆరోగ్యం కోసం అని నేను ఆగాను లేకపోతే ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని అంటుంది.

కళ్యాణ్ కూతురు తల మీద చెయ్యి వేసి..  నా ఆరోగ్యం పైన నీకు ఎంత శ్రద్ధ తల్లి. మా ఆరోగ్యాల కోసం నువ్వు షాపింగ్ కి వెళ్లకుండా త్యాగం చేసావా.

పోనీలే అమ్మ.  ఇంత త్యాగం చేసినందుకు నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని కార్డు ఇస్తారు.  దేనికి నాన్న... నీకు నచ్చనివి ఎంత కాస్ట్ అయినా సరే కొనుక్కో. సరేనా..

మేము ఇంటి దగ్గరే వాకింగ్ చేస్తాం కదా బావ. రమేష్ వెంటనే  అవును బావ అంటాడు. లేదు లేదు మీరిద్దరూ నాతో రావాల్సిందే లేకపోతే అత్తయ్య అమ్మ ఫీలవుతారు అని చెప్పి లాక్కెళ్ళిపోతుంది.

వెళ్తున్న వాళ్ళని చూసి చూసావా వదిన..  నీ కూతురు ఎంత ముదురో.. మనిద్దరం ఫీల్ అవుతాం అని తీసుకువెళ్లిందంట.. అంతేగాని దానికి అవసరమై కాదు.

బ్రతక నేర్చిన తెలివి ఉంటే చాలు...  ఎక్కడైనా కొట్టుకు వచ్చేస్తారు. మనకు అది లేకే కదా మన మొగుళ్ళతో ఇన్ని తంటాలు పడుతున్నాము అంటుంది.

సరిగ్గా చెప్పావు వదిన. ఎలాగైనా మనం నివి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. అది ట్రైనింగ్ తీసుకుంటే రాదు వదిన జన్మతా వచ్చేయాలి. మన తర్వాత అవని.  ముగ్గురికి ముగ్గురం సరిపోయాము.

ఇదంతా చూసిన విక్రమ్ నవ్వుకుంటూ దగ్గరకు వచ్చి మీరిద్దరూ ఎక్కడికి వెళ్లాలో చెప్పండి.  నేను తీసుకువెళ్తాను. ప్రస్తుతం అవసరం లేదు రా..

  కరుణ ఆంటీ,పార్ధు అంకుల్ వస్తే అందరం కలిసి ఒకేసారి షాపింగ్ కి వెళ్దాము.  ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి అంటే కష్టం కదా అంటే గుడ్ డెసిషన్ అయితే అందరికీ కలిపి ప్లాన్ చేస్తాను.

ఆఫీస్ నుంచి వచ్చిన భరత్, వినయ్ దగ్గరికి వచ్చి ఏంటి ముగ్గురు గూడుబుఠాణి  చేస్తున్నారు.  ఎనీ సీరియస్ అంటే...  మాధవి అవున్రా ఇప్పుడు దాకా సీరియస్ డిస్కషన్ అయింది.

మీరు రావడమే ఆలస్యమైంది అని నీరసంగా చెబుతుంది. ఏమైంది అత్తయ్య అంత సీరియస్ డిస్కషన్ ఏం జరిగింది. మీ చెల్లి షాపింగ్ అంటుంది.

వెంటనే ఎక్కడ నివి అని కంగారుగా వెతుకుతాడు. ఆల్రెడీ మీ నాన్నని, మావయ్యని తీసుకుని వెళ్ళిపోయింది ఈసారి వాళ్ళిద్దరూ బుక్కయ్యారా.

లేకపోతే మేము బుక్ అయ్యేవాళ్ళం అంటుంది. ఎందుకు అత్తయ్య మావయ్య మీద పగపట్టేసావు. ఊరుకోరా నేనెందుకు పగ పడతాను.

కాస్త చేంజ్ ఉంటుందని వెళ్ళమన్నాను అంతే కదా వదినా...  అంతే. ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారు. హాయిగా కూర్చుని కాలు మీద కాలేసుకుని.. ఉప్పరి మీటింగ్లే కదా..

అందుకనే షాపింగ్ కి వెళ్తే కాస్త లోకజ్ఞానం తెలుస్తుంది అని.. రా వదిన అని లలిత వెళ్ళిపోతుంది.  వెళుతున్న లలిత, మాధవిని చూసి నాన్నకి మావయ్యకి లోకజ్ఞానం కావాలంట.. మరి వీళ్ళకేం కావాలో అని వినయ్ భరత్ ఒకరినొకరు చూసుకుని పెదవి విరుస్తారు.

ధనుంజయ్ అవని దగ్గరికి రాకపోయినా ఎప్పటి విషయాలు అప్పుడు కళ్యాణ్ చెబుతూ ఉంటాడు.  అది విని కూతురు సంతోషంగానే ఉంది అని తృప్తిపడతాడు.

ఒకసారి భార్గవిని కలిసి వద్దాము అని భార్గవిని ఉంచిన  ప్లేస్ కి వెళతాడు. గదిలోకి వెళ్లి భార్గవి భార్గవి అని పిలుస్తూ ఉంటాడు.

మెల్లిగా తలెత్తి ఇక్కడ అంటుంది. అరే.. కనిపించలేదు.  ఇక్కడే ఉన్నావా... అదేంటి భార్గవి. ఇలా చిక్కిపోయావు.  నీకు ఇక్కడ సదుపాయాలు సరిగ్గా ఉండడం లేదా జైల్లో ఫుడ్డే బాగా పడినట్టుంది.

సరిగ్గా తినకపోతే ఎలా భార్గవి. ఎంత గ్లామర్ మెయింటైన్ చేసేదానివి. ఇప్పుడు చూడు 40 లో 60 లాగా కనిపిస్తున్నావు.

ఇలా ఉంటే నాకు ఎలా చూడాలనిపిస్తుంది ఎందుకండీ ఇంత టార్చర్ పెడుతున్నారు అని కన్నీళ్ళతో అడుగుతుంది.

టార్చర్ ఎక్కడ పెట్టాను. నేను కొట్టానా.. తిట్టానా.. ఆఖరికి నువ్వు ఉన్న దరిదాపుల్లో కూడా నేను ఉండటం లేదు కదా.
ఎలా టార్చర్ పెట్టగలను.

టైం కి ఫుడ్ పెడుతున్నాను. చల్లటి గాలి వస్తుందని కిటికీలు తెరిచి ఉంచుతున్నాను. నీకు ఇబ్బంది లేకుండా ఉండాలని ఫుల్ గా సెక్యూరిటీ పెట్టాను.

మనుషులని మాయ చేయడం ఈజీ కదా.. అందుకని కుక్కల్ని కాపలాగా పెట్టాను.  ఇంకా ఏమిటి నిన్ను టార్చర్ పెట్టింది.

మనిషిని కొట్టనవసరం లేదు...  తిట్టినవసరం లేదు..
సైలెంట్ గా చేసే పనిలో వల్ల కూడా టార్చర్ చేయవచ్చు అంటుంది.

ఓ...  ఎక్స్పీరియన్సా.... ఒక రకంగా అలాంటిదే.  ఫుడ్ పెడుతున్న పెడుతున్న అంటున్నారు. ఏం పెడుతున్నారు.. 
అలా అంటావ్ ఏంటి భార్గవి.

  స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్లాను కదా.. నీకు టైం కి ఫుడ్ పెట్టమని.  వెంటనే లేడీస్ ఇద్దరినీ పిలుస్తాడు. ఏంటి మీరు భార్గవి కి టైం కి భోజనం పెట్టడం లేదా...

చూడండి ఎలా చిక్కిపోయిందో.. అసలే భార్గవి అందం లేకపోతే ఉండలేదాయే...   అయ్యో సార్ మేము పెడుతున్నాము. మేడమ్ గారే అసలు తినడం లేదు.

కావాలంటే  మీ ముందే తెచ్చి పెడతాము చూడండి అని ప్లేట్ తీసుకువచ్చి భార్గవి ముందు పెడతారు. వెంటనే ధనుంజయ్,  మిగిలిన ఇద్దరు లేడీస్ మాస్క్ వేసుకుంటారు.

భార్గవి ముక్కుకి చీర కొంగు అడ్డుపెట్టుకొని ఇలాంటి భోజనం ఎవరు తినగలరండి. ఎంత పాచిపోయిన వాసన వస్తుంది. ఇది తింటే లోపల పేగులు మాడిపోతాయి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటుంది.

ధనుంజయ్ సమాధానం...
[+] 10 users Like SivaSai's post
Like Reply

Part - 134


ఇలాంటి ఫుడ్ తింటే నేను ఇప్పుడే చచ్చిపోతాను. అదేంటి భార్గవి అలా అంటావు. గత కొన్ని సంవత్సరాలగా అవనికి ఇలాంటి ఫుడ్డేగా పెట్టేదానివి.

మరి నా కూతురు ప్రాణాలుతో ఉంది కదా.. ఓ..నా కూతురంటే దేవత కాబట్టి ప్రాణాలతో ఉంది. నువ్వు రాక్షసి కన్నా హీన జాతి కాబట్టి ప్రాణాలు పోతాయిఅంటున్నావ్ అంతే కదా...

నేను పెట్టిన అవని ఎప్పుడూ తినలేదు. మరి ఎలాగా తిండి తినకుండా ఉండేది అని పిడికిలి బిగించి కోపంగా అంటాడు.

ధనుంజయ్ కోపాన్ని చూసి భయపడుతూ ఎక్కువ మంచినీళ్లు తాగేది అని భయంగా చెబుతుంది. ఇంకా అంటాడు.

పార్ట్ టైం జాబ్ చేసుకునేది. వచ్చిన డబ్బులతోనే తన బుక్స్, బట్టలు, ఫుడ్డు అన్ని చూసుకునేది. మరి నువ్వేం చేసేదానివి..

నా కూతురు అంత కష్టపడుతుంటే ఎంజాయ్ చేసేదానివా..  నా కూతురు సొమ్ముతో నువ్వు సుఖపడుతూ నా కూతుర్ని కష్టాలు పాలుచేసావా...

ఛి ఛి నేను అవని డబ్బులు ముట్టుకోవడమేమిటి.. దానికి వచ్చే డబ్బులు నేను ఒక సర్వెంట్ కి ఇచ్చే అంత జీవితం ఉండదు.

ఆ మాటకి నవ్వుతూ అసలు ఇవ్వడానికి నువ్వెవరు..  ఈ ఆస్తి మొత్తం నా కూతురుది. అంటే నా కూతురి విసిరేసే ఎంగిలి మీద బతికినదానివి నువ్వు.

ఇన్ని కోట్ల ఆస్తికి వారసురాలు అయినా సరే తన ఆత్మ అభిమానం వదులుకోకుండా కష్టపడింది. అందుకే భగవంతుడు అంతమంచి జీవితాన్ని నా కూతురికి ఇచ్చాడు.

మరి నువ్వు,  నీ కూతురు పరిస్థితి ఏమిటి అంటాడు
  కోపంగా చూస్తూ ఆస్తి మొత్తం అవనిదే అయితే నేను, శిల్ప ఎవరు...

ఏమో ఎవరికీ తెలీసు.. ఆ మాటకి నవ్వుతూ ప్రపంచం మొత్తానికి తెలుసు నేను మాత్రమే మీ భార్యను అని. ఇంకా నువ్వు ఆ పిచ్చి భ్రమలోనే ఉన్నావా..

ఓ నీకు అసలు విషయం తెలియదు కదా.... చెబుతాను.. ఓ కాదు కాదు చూపిస్తాను. అని పిఏ కి కాల్ చేసి ఏమి చేయాలో చెబుతాడు.

ఏమి చేస్తున్నారు మీరు అంటే.. నీకు చూపించాలి కదా వెయిట్ అంటాడు.  ఈ లోపు పి ఎ పెన్ డ్రైవ్, లాప్టాప్ తీసుకునివస్తాడు.

ధనుంజయ్ వాటిని తీసుకుని కనెక్ట్ చేసి భార్గవి ముందు పెడతాడు. యాన్యువల్ డే రోజున జరిగిన ప్రోగ్రాం. పొద్దుటి నుంచి శిల్ప పనిచేస్తున్నది మొత్తం కనపడుతుంది.

అది చూడగానే భార్గవి నా కూతురు ఇలా ఉండడానికి వీలులేదు అని అరుస్తుంది. జస్ట్ వెయిట్... తర్వాత జోకర్ డ్రెస్ వేసుకుని అందరికీ వెల్కమ్ చెప్పడం అవని ఫ్యామిలీని రిసీవ్ చేసుకోవడం.

ధనుంజయ్ అందరూ ముందు రజిత ఒక్కతే భార్య,  అవని మాత్రమే వారసురాలు అని అనౌన్స్ చేయడం అన్నీ వస్తూఉంటాయి.  శిల్ప అందరికీ సర్వీస్ చేయడం చూసి నీరుగారిపోతుంది .

వీడియో మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరివి అంటాడు. ఎందుకు చేశారు ఇలాగా.. నువ్వు చేసిన దానికి పనిష్మెంట్.

నువ్వు చేసిన తప్పులకి నీ ముద్దుల కూతురు అనుభవిస్తుంది. శిల్ప మీకు కూడా కూతురే ఆ విషయం మర్చిపోతున్నారు.

ఏ రోజో మర్చిపోయాను.  ఉంచుకున్నదానికి పుట్టిన దానిని వారసురాలు అని చెప్పుకోవడానికి నేనేమన్నా రోడ్డుమీద పోయేవాడిని అనుకుంటున్నావా... 

నాకంటూ సొసైటీలో ఒక పరువు ప్రెస్టేజ్ ఉన్నాయి. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా..  కట్టుకున్న భార్యని అలాంటి నీచపు మాటలు మాట్లాడడానికి మీకు మనసు ఎలా వచ్చింది..

సహవాసదోషం భార్గవి. నా కూతుర్ని కూతురు కాదు అని నువ్వు క్రియేట్ చేయలేదా.. ఇది కూడా అంతే. దీన్ని బట్టి ఏం అర్థమైంది నీకు.

ఏమి మాట్లాడలేక చూస్తే.. మనం ఏదైతే ఇస్తామో దానికి 100 రెట్లు వెనక్కి తిరిగి వస్తుంది అంటారు. అంటే నువ్వు మంచి చేశావు అనుకో ఆ మంచే నీకు శ్రీరామరక్షలాగా కాపు కాస్తుంది.

అదే ఎదుటివారిని నాశనం చేయాలి అనుకున్నావు అనుకో ఇదిగో నువ్వు ఉన్న పొజిషన్లో ఉంటారు. నీ కూతురు చేసిన దానికి  అక్కడ ఏ పూటకా ఆ పూట కష్టపడితేనే భోజనం దొరికే పరిస్థితుల్లో ఉంది అంటాడు.

కాపలాగా పెట్టిన లేడీస్ ఇద్దరినీ పిలిచి ఈరోజు నుంచి భార్గవి తో మొత్తం పనులన్నీ చేయించండి. ఇదే భోజనం పెట్టండి.

తింటే తింటుంది లేకపోతే చస్తే చస్తుంది. ఒకవేళ చచ్చిపోతే జస్ట్ నాకు మెసేజ్ చేసి డొనేషన్ కి ఇచ్చేయండి. మరి నేను వెళ్ళనా భార్గవి.

ఉండమంటే మాత్రం ఉంటారా .. నీలో నచ్చింది ఇదే.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న సరే సెన్సాఫ్ హ్యూమన్ వదలవు కదా..

సరే సాయంత్రం అయిపోయింది కదా చల్లటి గాలి వస్తూ ఉంటుంది. కిటికీలు తెరిచి పెట్టండి అని చెబుతాడు.  కిటికీలు తెరవకపోయినా పరవాలేదు.

ఉక్కగా ఉన్న ఇబ్బందే లేదు.  ప్లీజ్ కిటికీలు తేరవద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది.  అదేమిటి భార్గవి గాలి లేకపోతే ఎలా ఉంటావు.

మీరు కిటికీలు తెరిస్తే దోమలు వచ్చి బాగా కుడుతున్నాయి నేను ఆ బాధ భరించలేకపోతున్నాను. ఊరుకో భార్గవి. ఏమిటా మాటలు ఆ ప్రాణి ఎంత ఉంటుంది.

చిన్నగా... మనం చూస్తేనే బెదిరిపోయి పారిపోయే అంత చిన్నగా ఉంటుంది. అంత చిన్నజీవి ఏదో తన ఆకలి కోసం నీ ఒంటిలో నుంచి ఒక చుక్క రక్తం తీసుకుంటే ఎందుకు అంత బాధ పడుతున్నావు.

ఇలా నువ్వు రక్తం దానం చేస్తూ ఉంటే కొన్ని కొన్ని పాపాలు పోతాయి భార్గవి. నేను నీ మంచి కోసం చేస్తూ ఉంటే నీకు అది అస్సలు అర్థం కావడం లేదు.

ఎప్పటికి నన్ను అర్థం చేసుకుంటావో ఏమిటో అంటూ వెళ్ళిపోతాడు. వెళుతున్న ధనుంజయ్ ని చూస్తూ.. ఈ నరకం కన్నా ఒక్కసారిగా చచ్చిపోవడమే మేలు అనుకుంటుంది.

ఆ చావడానికి కూడా తనకి అవకాశం ఉండదు. చావు కూడా ధనుంజయ్ కంట్రోల్లోనే ఉంటుంది. 

మాధవి, లలిత కంగారుగా చూస్తూ ఉంటారు. వినయ్ భరత్ వచ్చి ఏమైంది. మీరిద్దరూ కాలుకాలిన పిల్లిలాగా తిరుగుతున్నారు.

ఒరేయ్ మీ నాన్న, మావయ్యని తీసుకుని నివి వెళ్లి చాలాసేపయింది.  ఇంకా రాలేదు. సెక్యూరిటీని కూడా తీసుకుని వెళ్ళలేదు.

ఎక్కడ తిరుగుతున్నారో ఏమిటో... అయ్యో పిచ్చమ్మ మన నివి పాప షాపింగ్ అంటే అంత తొందరగా అవుతుందా.. షాప్ కట్టేసిన సరే మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఓపెన్ చేపిస్తుంది.

మరి ఇప్పుడు ఎలా రా.. వాళ్ళని పంపించక ముందు ఆలోచించాల్సింది..  ఏదో  అనేసాములే..
హ.. హ... షాపింగ్ విషయంలో మనం నివి  సీరియస్ గానే తీసుకుంటుంది.

ఆ విషయం ఎలా మర్చిపోయారు మీరు ఇద్దరు...ఆ నిమిషం మమ్మల్ని మేము సేవ్ చేసుకోవడం ఒక్కటే ఆలోచించాము రా..

అందుకని మమ్మల్ని బుక్ చేశారా అని నీరసంగా వచ్చి కూలబడతారు.  వచ్చేసారా అని గబగబా మంచినీళ్లు చేతికి ఇస్తారు.

ఆకలేస్తుంది అని ఇద్దరు పొట్ట పట్టుకుంటారు. నివి మాత్రం మంచి ఉత్సాహంగా వస్తుంది . డ్రైవర్ లగేజ్ మొత్తం లోపల పెట్టి వెళ్ళిపోతాడు.

అదేంటి  ఏమీ తినలేదా..  అయ్యో మమ్మీ అసలు టైం ఎక్కడుందని. నాన్న మావయ్య అలసిపోయారని వచ్చేసాను కానీ లేకపోతే ఇంకా నాలుగు షాపులు ఉన్నాయి.

వినయ్ భరత్ అమ్మలవైపు మేము చెప్పామా అన్నట్టుగా చూస్తారు. ఏం కొన్నావు నివి ఇంత లేట్ అయింది
రండమ్మా చూపిస్తాను అనగానే.. లలిత మాధవి అటు అడుగులు వేస్తూ ఉంటారు.

ముందు మాకు ఏదైనా పెట్టి అప్పుడు మీరు ఎంతసేపైనా చూసుకోండి. మీరు చూస్తూ ఉండండి అత్తయ్య నేను వడ్డిస్తాను అని వస్తుంది.

మాధవి లలిత నివి దగ్గర కూర్చుంటారు. అవని ఇద్దరికీ వడ్డిస్తూ ఉంటే... ఇద్దరూ భోజనం చేసి ఉత్సాహాన్ని తెచ్చుకుని హమ్మయ్య నీ చేతితో వడ్డిస్తే ఆకలి లేనివాళ్ళైనా సరే భోంచేయాల్సిందేనమ్మా అని కోడలని మెచ్చుకుని ఇద్దరు  ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లి మంచాలు ఎక్కేస్తారు.

అవని అత్తయ్య మీకేమైనా కావాలా.. ఏమీ వద్దు. నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో. సరే అని పాలు పుచ్చుకొని గదిలోకి వెళ్ళిపోతుంది.

అవనినీ చూసిన విక్రమ్..  ఏంటి భార్యామణి పనులు చెక్కబెట్టేసావా మావయ్య వాళ్ళు ఇప్పుడే వచ్చారు వాళ్లకి భోజనం వడ్డించి మీకు పాలు తీసుకొని వచ్చాను.

  అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు.  నివి షాపింగ్ చేసి వచ్చింది కదా... చూస్తున్నారు.   ఆడవాళ్ళకి ఇంత షాపింగ్ పిచ్చి ఏమిటి..

ఎన్ని ఉన్నా ఇంకా అంటారు. ఎలా అంటాడు. ఏమో నాకేం తెలుసు.  అదే నాకు డౌట్..
  
దేనికి అంటే అసలు నువ్వు కొత్తవి కొనుక్కోవాలి..  అలా అలంకరించుకోవాలి అని ఎప్పుడూ ఆలోచించవేంటి.. సింపుల్ గా ఉంటావు.

నేను ఏది తెస్తే అది బాగుంది అంటావు.  ఎలా అని చెయ్యి పట్టుకుని  దగ్గరికి లాక్కుంటాడు.  విక్రమ్ మెడ చుట్టూ చేతిలో వేసి నాకు ఊహ తెలిసినప్పుడు నుంచి ఉన్నదాంట్లోనే అడ్జస్ట్ అవ్వడం అలవాటైపోయింది.

అందుకే ఏది కొత్తవి చూసిన ఆశ కలగదు.  ఎప్పుడూ నేను కడుపునిండా తిని ఒంటినిండా బట్ట ఉంటే చాలు అనుకునేదాన్ని.

అందుకే మిగిలిన విషయాల మీద అంత ఆసక్తి ఎప్పుడూ లేదు అంటుంది.  అవని నుదుటిన ముద్దు పెట్టి ఎలా భరించావే ఆ  వయస్సులో..
వింటూ ఉంటే నాకు ప్రాణం తరుక్కుపోతుంది. భగవంతుడికి కూడా నా కష్టాలు చూసి జాలి వేసి ఉంటుంది.

మిమ్మల్ని  భర్తగా ఇచ్చాడు.  ఇప్పుడు బంగారం లాంటి వరాన్ని ఇచ్చాడు అని పొట్ట మీద చేయి వేసుకుంటుంది. ఒక మాట చెప్పనా అవని..  నీలాంటి భార్య దొరికితే ఏ మగాడి లైఫ్ అయినా సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది.

వాడంత అదృష్టవంతుడు ఈ భూమి మీదే ఉండడు. అబ్బో ఏమిటో మావారు నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నారు. నిజాలు చెప్పినప్పుడు ఒప్పుకోవాలి..

పొగిడినప్పుడు ఆ పొగడ్తలని ఎంజాయ్ చేయాలి అని పాలు తాగు అంటాడు. అబ్బా వద్దండి. ఇప్పటికే చాలా అనీజీగా అనిపిస్తుంది.

డాక్టర్ దగ్గరికి వెళదామా అని కంగారుపడతాడు. అంత అవసరం లేదు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది.  సరే రా.. పడుకో..

మధురం మధురం ప్రణయం మధురం ❤️❤️

కథ కొనసాగుతుంది...
[+] 13 users Like SivaSai's post
Like Reply

Part - 135

అవని మంచం దగ్గరికి వెళ్ళుతూ ఒక్క నిమిషం అని వెనక్కి వచ్చి పాల గ్లాస్ తీసుకుని విక్రమ్ కి ఇచ్చి తాగండి అంటుంది.

హలో మేడం నీరసంగా ఉంది నువ్వు..  నేను కాదు..అబ్బా మీరు తాగితే నాకు బలం వచ్చేస్తుంది తాగండి అంటుంది.

నవ్వుకుంటూ పాలు తాగి  ఇప్పుడు హ్యాపీనా..చాలా.. సరే.. రా..   విక్రమ్ గుండెల పైన పడుకోబెట్టుకుని మెల్లిగా జో కొడుతూ ఉంటాడు.

విక్రమ్ నడుం చుట్టూ చేతులు వేసి గుండెల పైన పడుకుని ప్రపంచంలో ఇంతకన్నా సెక్యూర్డ్  ప్లేస్ ఇంకేం ఉంటుంది అని ప్రశాంతంగా నిద్రపోతుంది.

నిద్రపోతున్న అవనినీ చూసి ఎన్ని కష్టాలు అనుభవించావే..  కానీ ఆ కష్టాలు తాలూకు బాధ ఎక్కడా కనపడనివ్వవు.

పెదవుల పైన ఎప్పుడు చెరగని చిరునవ్వే ఉంటుంది.  ఏ జన్మలోనో నేను గట్టిగానే పుణ్యం చేసుకునేఉంటాను..  అందుకే  చెరగని ఈ దరహాసం నా సొంతమైంది. నుదుటిని ముద్దు పెట్టుకుని మెల్లిగా కళ్ళు మూసుకుంటాడు.

వినయ్ పడుకోవడానికి వెళ్లి ఇంతకీ నా రౌడి బేబీ ఏం చేస్తుంది అనుకుంటూ ఫోన్ చేస్తాడు. అటు పక్కనుంచి మత్తుగా హలో అంటే..  ఏంటి రౌడీ బేబీ అప్పుడే పడుకున్నావా..

ఒరేయ్ ఇప్పుడు టైం ఎంత అయింది రా. జస్ట్ 10:30 ఏ కదా.. ఈ టైంకి మనిషి అన్న వాడు ఎవడైనా పడుకుంటాడు.

ఎవరో అన్నట్టున్నారు తొమ్మిది తర్వాత పర్సనల్ కాల్ సే మాట్లాడతాను అని.  అందుకే చేశాను రౌడీ బేబీ అంటాడు.  ఇంకొకసారి నన్ను రౌడీ బేబీ అన్నావ్ అనుకో..

మరి ఏమనాల అమ్మాయ్..   ఇదిగో అబ్బాయ్ ముందు నీ అడ్రస్ చెప్పు. అక్కడ పంచాయతీ పెడతాను. ఏమని పెడతావ్ పంచాయితీ.

మీ అబ్బాయి నాకు రోజు ఫోన్ చేసి విసిగిస్తున్నాడనా.. విసిగించడం గురించి ఎవరైనా పంచాయతీ పెడతారా.. మరి ఇంకేమని చెబుతావు.

మీ అబ్బాయి నాకు కడుపు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు అని చెబుతాను. ఆ మాటకి గట్టిగా పులమారుతుంది. 

ఏయ్.. రౌడీ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు. ఇంకొకసారి నన్ను అలా పిలిచేవనుకో నీ అడ్రస్ కనుక్కొని వచ్చి మరి పంచాయతీ పెడతాను.

అప్పుడు మీ వాళ్లకు నువ్వే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.  ఏమంటావ్. అమ్మ తల్లి నీకు ఒక దండం. నువ్వు ఆ పని మాత్రం చేయకు.

ఎవరి నుంచైనా ఎస్కేప్ అవ్వగలును గాని..  మా గ్రానీ, మా అన్నయ్య ఫుట్బాల్ ఆడేసుకుంటారు. అబ్బో అబ్బాయికి చాలా భయముందే ..

నేను గుడ్ బాయ్ కదా..  పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. మరి నాకు ఇవ్వవే.. నువ్వు నా కన్నా చిన్నదానివి. పైగా నా లవర్ వి కదా..

ఆ మాటకి పూజిత బ్లష్ అవుతూ నీ లవర్నని ఎప్పుడు చెప్పాను. నువ్వు నాకు ఏమి ప్రపోజ్ చేయలేదు. నేను ఒప్పుకోలేదే.. ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదు అమ్మాయ్.

ఒక అబ్బాయి ఈ టైంలో ఫోన్ చేసి విసగిస్తున్న.. ఒకపక్క విసుక్కుంటూ   స్మూత్ గా జవాబులు చెబుతున్నారంటే అర్థం ఏమిటి అంటాడు.

ఏమో అబ్బా ఇలాంటి క్యూస్షన్స్ కి నేను ఎప్పుడూ ఆన్సర్స్ రాయలేదు అంటుంది. అందుకే ఇప్పుడు రాయి.. డిస్టెన్స్ లో పాస్ అవుతావు.

ప్రెసెంట్ డేస్ లో డిస్టెన్షన్ ఏ మూలకి రావడం లేదు కదా.. పోనీ 100% తెచ్చుకో. నేను కోపరేట్ చేస్తాను కదా.. చేస్తావు..  చేస్తావు.. ముందు మీ ఇంట్లో చెప్పు.

అప్పుడు వాళ్ళు చేప్తే  మనం తెచ్చుకుందాం. నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని పెట్టేస్తుంది . పూజిత ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకున్నందుకు వినయ్ గదిలోనే డాన్స్ చేస్తూ ఉంటాడు.

వావ్ రౌడీ బేబీ..  నాకు తెలుసు ఎప్పుడో నువ్వు లైన్ లోకి వచ్చేసావు అని.. ఇప్పుడు దాకా బెట్టు చేసావు కదా.. ఎంతైనా మీ ఆడవాళ్లు మహా ముదురులే అని పిల్లోని పట్టుకుని దొర్లుతూ ఉంటాడు.

భరత్ విద్య కి ఫోన్ చేస్తాడు. విద్య కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంటుంది.  అబ్బా విద్య ఇది ఆఫీస్ కాదు.

కానీ మీరు నాకు బాస్ కదా. ఉఫ్.. ఈ టైం లో ఎందుకు ఫోన్ చేశానో చెప్పుకో అంటాడు.

ఆలోచించి.. హ సార్ మీరు ప్రాజెక్టు డీటెయిల్స్ గురించి కదా..  ఒక్క నిమిషం సార్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాను. విద్య అంటాడు.  ఏమైంది సార్..

చదువు,జాబ్, శాలరీ ఇది కాకుండా ఒక మనిషికి మాట్లాడుకోవడానికి ఏమీ ఉండవా అంటే ఇంకేముంటాయి సార్.

నీ ఏజ్ ఎంత. 23 అంటే... ఈ వయసులో అమ్మాయిలు ఏం ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారు సార్ అంటే. నా పిల్లకి నివితో ట్రైనింగ్ ఇప్పించాలి.  అప్పుడుగాని లైన్లోకి రాదు.

అదే కాకుండా లైఫ్ లో చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, లవర్, లవ్ చేసుకోవడం డేటింగ్.. ఎక్సట్రా.. ఎక్సట్రా.. అయ్యో లవ్వా అంటుంది..

అదేదో భూతమా.. అన్నంత షాకింగ్ అడిగావ్ ఏమిటి. మేము అలా చేయకూడదు కదండీ. ఎందుకని.. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలండి.

అలా లవ్ గివ్వు అని తిరిగితే కెరియర్ తో పాటు జీవితం కూడా నాశనం అయిపోతుంది. ఇలా అని ఎవరు చెప్పారు. మా అమ్మ అంటుంది.

మా అత్తగారు బానే ట్రైనింగ్ ఇచ్చారు అనుకుని అది ఎవరైనా అబ్బాయిలు చీట్ చేస్తారేమో అని అమ్మ భయంతో చెప్పింది.

అవునా..  లవ్ చేయడం తప్పు కాదా.. తప్పే కాదు అంటాడు.  ఇంతకీ లవ్ చేసి ఏం చేయాలండి.. లవ్ చేసి ఏం చేయాలా...  అదేం ప్రశ్న...

ఇప్పుడు మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాం అనుకోండి.  క్యూస్షన్స్ కి ఆన్సర్స్ రాస్తాము. తెలియకపోతే ఎలా తెలుసుకోవాలి ఆలోచిస్తాం కదా..

అలాగే లవ్ చేశాక ఏం చేయాలి అంటున్నా అంటుంది. అలాంటిదే మాటల్లో చెప్పరు. చేతల్లోనే చూపించాలి. అవునా సరే అయితే నేను ఇది ఎలా చూపిస్తారో మా అమ్మని అడుగుతాను.

అది అమ్మని అడిగేది కాదు. ఎవరిని అడగాలి. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తే వాళ్ళని ఓపిగ్గా చెబుతాడు. అయ్యో సార్ నేను ఎవరిని లవ్ చేయలేదు కదా.

ఇప్పుడు చెయ్యి. ఎవరిని చేయాలి సార్. ఫోన్ ని తలకేసి కొట్టుకుంటూ ఎవరినో అయితే నీకెందుకు చెబుతాను విద్య నన్నే అంటాడు.

అమ్మో మీరు నా బాస్ కదా.. బాస్ ని లవ్ చేయొచ్చా.
నువ్వు ఈ మధ్యన వెబ్ సిరీస్ ఏమి చూడడం లేదు అనుకుంటా..

ఎక్కువ బాస్లు ఎంప్లాయిస్ కే పడుతున్నారు.  సెలబ్రిటీస్ కూడా అంతే అంటాడు. ఏమో సరే అలాంటివి నాకు పెద్ద తెలియదు.

అందుకే చదువుతో పాటు ప్రపంచాన్ని కూడా చూడు.  నీకు కొన్ని లింక్స్ పెడతాను. అది చూడు కొంచెం లోకజ్ఞానం తెలుస్తుంది.  అమ్మో అమ్మ కోప్పడుతుంది నేను చూడను.

ఇది బాసుగా నా ఆర్డర్. చూసి రేపు దాని రివ్యూ చెప్పు.  ఇలాంటివి ఎవరైనా చెబుతారా. నేను చెబుతున్నాను కదా చూడు అని కమాండ్ గా చెబుతాడు.

సరే సార్ అని ఏడుపు వాయిస్ తో చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.  అమ్మ... నీతో ఇలా ఉండకపోతే నువ్వు దారిలోకి వస్తావా.. ఇలా ఏమీ తెలియని దాని పెళ్లి చేసుకుంటే రేపు శోభనం దగ్గర కూడా ఎలిమెంటరీ క్లాస్ నుంచి మొదలు పెట్టాలి.

అమ్మో ఇప్పటికే వయసు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది.

ఉదయం అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా అవనికి కడుపులో తిప్పినట్టు అయ్యి స్పీడ్ గా లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి వాంటింగ్ చేసుకుంటుంది.

విక్రమ్ కంగారుగా వచ్చి ఏమైంది అని  చెవులు మూస్తాడు. లలిత మాధవి వచ్చి విక్రమ్ ను పక్కకులాగి... చెరో వైపున పట్టుకుంటారు.

వామిటింగ్ అయ్యిన తర్వాత ముఖం కడిగి ఎలా ఉందిరా అంటే కొంచెం నీరసంగా ఉంది అత్తయ్య. ఇటు రా అని మెల్లిగా తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోపెట్టి వేడిగా పాలు తెమ్మని చెబుతారు.

విక్రమ్ కంగారుగా హాస్పిటల్ కి వెళదామా అమ్మ. ఈ టైం లో ఇలాగే ఉంటుందిరా..  ఏంటి వామిటింగ్స్ చేసుకోవడమా..

కళ్యాణ్ నవ్వుతూ ఒరేయ్ ఇంకా చాలా ఉంటాయి. నువ్వు ఇలా బెంబేలు పడిపోతే చాలా కష్టం. అమ్మ,  అత్తయ్య కూడా ఇలాగే సఫర్ అయ్యారా.. 

ఏ ఆడవాళ్ళైనా ఇలాగే సఫర్ అవుతారు.  ఏరా ఏదైనా స్మెల్ పడలేదా..  అవును మామయ్యగారు..  బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద ఏదో అర్థం కాలేదు.

సరే అన్ని చెక్ చేద్దాము. టేబుల్ మొత్తం ఒకసారి క్లీన్ చేసేయండి. ఏమి ఉంచకండి. మాధవి...  నేను చెక్ చేసి క్లీన్ చేయిస్తాను అన్నయ్య అని వెళ్లి ఒక్కొక్క ఐటమ్ చెక్ చేస్తూ ఉంటుంది.

పాలు తాగి ఇప్పుడు కొంచెం పర్వాలేదు అత్తయ్య.  గదిలోకి వెళ్లి రెస్ట్ తీసుకోమ్మా అని విక్రమ్ పైకి తీసుకువెళ్ళు అని పంపిస్తుంది.

మెల్లిగా నడుస్తూ ఉంటే ఒక్క నిమిషం అని ఎత్తుకుంటాడు.  అయ్యో అందరూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఏమీ అనుకోరు కానీ నువ్వు మూసుకొ... అని గదిలోకి తీసుకువెళ్తాడు .

నివి పెళ్లి పనులు దగ్గరైతే వచ్చేసాయి. అవని ఇబ్బంది పడకుండా చూసుకోండి అని ఇందిరాగారు గట్టిగా చెప్తారు. మనం ఎంత చెప్పినా అవని పని చేయకుండా ఉండదమ్మా.

నువ్వే గట్టిగా చెప్పు.  నీ దగ్గర కట్టేసుకో అని మాధవి అంటే.. ఆ మాటకి నవ్వుతూ అవని రెస్ట్ తీసుకునేటట్టుగా నేను చూసుకుంటాను కదా..

అయినా విక్రమ్ ఏమీ వదలడు.  అది నిజమేలే భార్యని చంటిబిడ్డలాగా చూస్తున్నాడు.  ఇక రేపు పుట్టబోయే బిడ్డను ఇంకా ఎంత అపురూపంగా పెంచుకుంటాడో..   వాడిది అంతా వాళ్ళ తాతవరస వచ్చిందిలే అని ముసిముసిగా నవ్వుకుంటారు.

మనవళ్ళు ముగ్గురు ఇందిరాగారి చుట్టూ చేరి ఏంటి గ్రాని తాత గుర్తొచ్చారా.. ఆనాటి రొమాన్స్ గుర్తొచ్చిందా అని ఏడిపిస్తూ ఉంటారు.

వాళ్ళ అల్లరికీ  అందరు నవ్వుకుంటారు.   విక్రమ్ కిందకి వచ్చి గుడ్ న్యూస్ అంటాడు.  ఏంట్రా అంటే...  నేహా కన్సీవ్ అయిందంట...  ఇప్పుడే శ్రీ కాల్ చేసి చెప్పాడు.

కుటుంబం రియాక్షన్??
[+] 9 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)