Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

పాణిగ్రహణం

Showing only the posts of SivaSai: 341 of 820 posts. Show all posts

Part - 39



సూర్య తొందరగా రెడీ అయి విశి ని పికప్ చేసుకోవడానికి వెళతాడు. విశి ఇంకా రాలేదని ఫోన్ చేస్తాడు. లిఫ్ట్ చేసి చెప్పండి సార్.

ఇంకా రాలేదు ఏంటి... నేను వెయిట్ చేస్తున్నా. టైం చూసి ఇంకా టైం ఉంది కదా సార్..  అప్పుడే వచ్చారా... మీకు అభ్యంతరం లేకపోతే మా ఫ్లాట్ కి రండి.

పర్వాలేదా.. పరవాలేదు. మీరే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. నువ్వు ఉన్నచోట నాకు ఇబ్బంది ఏమంటుంది. సూర్యకి ఆ ఫ్లాట్ చూడగానే ఒక నిమిషం కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.

చిన్నప్పుడు చూసినప్పుడు బుట్టబొమ్మ లాగా పట్టు పరికిణి వేసుకుని నగలు పెట్టుకుని ముద్దు ముద్దుగా మాట్లాడిన విశి ఎక్కడ.. ఈ రోజు తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక సింగిల్ బెడ్ రూమ్ పోర్షన్ లోఉంటున్న విశి ఎక్కడ ...

ఏంటి సార్ అలా చూస్తున్నారు.  ఇల్లు చిన్నగా ఉందన.. ఇల్లు చిన్నదా పెద్దదా అన్నది కాదు. ఎంత ఒద్దికగా ఉన్నది అన్నది ఇంపార్టెంట్.

కూర్చోండి సార్ అని అమ్మ అని పిలుస్తుంది. భానుమతి వచ్చి ఎవరమ్మా.. మా కాలేజ్ లెక్చరర్ దేవా సార్.మా అమ్మ అని పరిచయం చేస్తుంది.

సూర్య భానుమతిని చూసి నమస్కారం అండీ అంటాడు. నమస్కారం బాబు..కూర్చో..  మా అమ్మాయి ఏమైనా తప్పు చేసిందా.

ఎందుకలా అడుగుతున్నారు. చిన్నప్పుడు విశి ఏదైనా అల్లరి పని చేస్తే కాలేజ్లో మాస్టర్ ఇంటికి వచ్చి మరి మా వారికి కంప్లైంట్ ఇచ్చేవారు.

అలాగే మీరు కూడా వచ్చారా అని భయంగా అడుగుతుంది..భానుమతి అడిగిన దానికి చిన్నగా నవ్వుతూ.. అలాగ ఏమీ లేదండి.

నేను వెళ్లే దారి ఇటే.. అందుకే విశిష్టని కూడా తీసుకువెళదామని వచ్చాను. అవునా ఇంక నేను ఏదో అనుకుని భయపడ్డాను.
కాఫీ తీసుకు వస్తాను అని కిచెన్లోకి వెళుతున్న భానుమతిని చూస్తూ ఉంటుంది. డోంట్ వర్రీ..అమ్మ తొందరలోనే క్యూర్ అవుతారు.

నాకున్న ఒకే ఒక్క బంధం ఆశ.. మా అమ్మే... విశిని దగ్గరికి తీసుకుని నేనున్నాను కదా.. నీకోసం ఒక పెద్ద కుటుంబమే ఉంది అని ధైర్యం చెప్పాలని ఉంటుంది.

కానీ ఆ పని చేస్తే అంతే.. ఒకటి కొట్టడమే కాదు.. ఇక నా ముఖం కూడా చూడదు. కంట్రోల్స్ సూర్య అనుకుంటూ..
మరి నువ్వు కాలేజీకి వెళ్లిన తర్వాత అమ్మని ఎవరు చూసుకుంటారు.

చూసుకోవడానికి ఎవరుంటారు సార్... బయట లాక్ చేసుకుని వచ్చేస్తాను. అమ్మ లోపలే ఉంటుంది.  నాన్నగారు గుర్తుకు వచ్చారంటే బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ దొరకడం కష్టం కదా..

అదే నిజమేలే.. మరి నీకు చుట్టుపక్కల ఫ్లాట్స్ వాళ్ళు పరిచయం అవలేదా.. నాలాంటి వాళ్ళని చూస్తే జాలి పడతారు గాని స్నేహం చేయడానికి ఒప్పుకోరు కదా...

నిన్ను చూసి జాలి పడడం ఏంట్రా...  నీలాంటి బంగారంతో స్నేహం చేయాలి అంటే పెట్టి పుట్టిండాలి..

ఏంటి సార్ ఏది మాట్లాడుతున్న ఒక నిమిషం ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు.  ఏమైంది నా ఫ్రెండ్ హౌస్ ఉంది.

పై ఫ్లాట్ ఖాళీయే...అక్కడకి షిఫ్ట్ అవుతారా అని అడుగుతాడు.  అమ్మో ఇండివిడ్యువల్ హౌస్  అంటే రెంట్ ఎక్కువ ఏమో..

నథింగ్.. వాళ్లకి ఎవరైనా ఫ్యామిలీ  ఉంటే చెప్పమని నన్ను రిక్వెస్ట్ చేశారు. పైగా ఆంటీ అమ్మతో కలిసి పోతారు.  సో నీకు భయం కూడా ఉండదు.
మీరంతాగా చెబుతున్నారు అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి రెంట్ కనుక్కోండి. మనకు అంతా ఓకే అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాము.

అదేంటి ఇల్లు చూడవ..  మీరు చెప్పారు  అంటే అంత బాగానే ఉంటుంది. ఆ గుడ్డి నమ్మకమే వద్దు.  ఎవరు చెప్పినా సరే.. క్రాస్ చెక్ చేసుకో.

ఎప్పుడైనా మోసం తియ్యటి మాటలతోనే మొదలవుతుంది. నేను ఆంటీ కి చెబుతాను.
ఈ వీకెండ్ వెళ్లి చూద్దాం . సరే సార్..

అమ్మ మేము కాలేజ్ కి వెళుతున్నాము. ఒక్క నిమిషం ఉండవే..  అబ్బాయిని కాఫీ తాగనివ్వు.  తీసుకో బాబు అని ఇస్తారు.

థాంక్యూ ఆంటీ అని కాఫీ తాగి చాలా బాగుంది. ఈమధ్య కాలంలో తాగిన బెస్ట్ కాఫీ . మావారు కూడా ఇలాగే అంటారు. నా చేతి వంట అంటే ఎంత ఇష్టమో.

పొలానికి కావలసిన కొనడానికి వెళ్లి ఇంకా రాలేదు. రోజు ఎదురు చూస్తున్నాను.  తప్పకుండా వస్తారు.  వచ్చి ఆకలిగా ఉంది. నీ చేతి వంట తినాలి అని అడుగుతారు.

  ఆ మాటకి విశికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. భానుమతి చూడకుండా పక్కకు తిరిగి తుడుచుకుని.. సరే అమ్మ ఇంకా మేము బయలుదేరుతాము.

వెళ్లేటప్పుడు మళ్ళీ తల్లికి వంద జాగ్రత్తలు చెప్పి బయట లాక్ చేసుకుని వస్తుంది. అది అంతా చూస్తున్న సూర్యకి చాలా బాధగా ఉంది.

ఒక ఆడపిల్ల ఇంత స్ట్రగుల్ ఫేస్ చేయాలంటే మాటలు కాదు. తండ్రి లేడు అన్న విషయం తల్లికి తెలియదు. తెలిసిన అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అని విశి ని చూస్తాడు.

ఏంటి సార్ అలా చూస్తున్నారు అని నవ్వితే. ఎలా విశి ఇంత నవ్వుతూ ఉండగలుగుతున్నావు.

అలవాటైపోయింది సార్.. నాన్న దూరమయ్యాక ప్రతిదానికి భయపడే దానిని.. ఏడ్చేదాన్ని..కానీ బాధను తీర్చే వాళ్ళు లేరు. ఏడిస్తే వచ్చే కన్నీళ్లు తుడిచే వాళ్ళు లేరు.

ఒకపక్క అమ్మ మెంటల్ కండిషన్. మాటకు ముందు నాన్నని..  తర్వాత నాన్నని గుర్తు చేస్తూ ఉంటే ఇంకా నరకంగా ఉండేది.

నేనే వీక్ అయిపోతే ఇంకా అమ్మ పరిస్థితి ఏమిటి ? అందుకే రాయిలాగా మారడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నంలోనే ఇంకా ఉన్నాను.

చిన్నప్పటినుంచి  చుట్టూ మంచిని చూడడమే అలవాటయింది కదా..  రాయిలాగా అవ్వడానికి ఇంకా టైం పడుతుంది.

అవసరం రాదు.   ఏమంటున్నారు..  అదే నీకు పరిచయం చేస్తాను అన్న ఫ్యామిలీ..  నీకు మళ్ళీ ఇంకొక కొత్త ఫ్యామిలీ లాగానే...

కాబట్టి నువ్వు రాయిలాగా మారవలసిన అవసరం లేదు. పువ్వు..  పువ్వు లాగా ఉంటేనే అందం. పువ్వు...  రాయిలాగా మారాలి అనుకున్నా...
రాయి పువ్వులాగా మారాలి అనుకున్నా అది ప్రకృతికే విరుద్ధం.

మీరు ఏదేదో చెబుతున్నారు సార్.   ముందు ముందు అర్థమవుతుందిలే..  పదా అని కాలేజ్ కి తీసుకువెళ్తాడు.

బైక్ దిగి థాంక్యూ అని వెళ్ళిపోతుంది. వెళుతున్న విశి ని చూస్తూ నవ్వుతూ ఉంటాడు.  పక్కనే ఎవరో చూస్తున్నట్టు అనిపించి చూస్తే శ్రీకర్ చేతులు కట్టుకుని సీరియస్ గా చూస్తూ ఉంటాడు.

ఏరా వచ్చి ఎంతసేపు అయింది.  ఒక ఫోన్ కూడా చేయలేదు. శ్రీకర్ అలాగే చూస్తూఉంటే... అంటే పొద్దున్న నాన్నతో మాట్లాడి విశిని పికప్ చేసుకోవాలి అన్న కంగారులో అంటే..

పో బావ మా చెల్లి ఓకే చెప్పక ముందే నన్ను మర్చిపోయావు...ఇంకా ఓకే చెబితే నా పని ఇంకా అంతేనేమో.

అలా ఎందుకు వదిలేస్తారు రా..  నిన్ను నీ బుజ్జి పప్పీ తో ఇంకా టైట్ చేస్తాను కదా.. నువ్వు చేయకపోయినా నేను చేసుకుంటాను.

ఎక్స్క్యూజ్ ని అని హస్కీ గా వాయిస్ వినపడుతుంది. ఈవిడెంటి ఇప్పుడొచ్చింది అని శ్రీకర్ మెల్లిగా సూర్య చెవిలో అంటే..
నువ్వు మాట్లాడకు.. అని చెప్పండి మేడం.

హు.. హు.. ఎన్నిసార్లు చెప్పాను మేడం వద్దు. సరళ అని పిలవండి అని.. ఓకే ఓకే చెప్పండి సరళ గారు..

మా ఇల్లు ఇక్కడికి దూరం. అయితే మేమేం చేయాలి.. స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తో రాగలరు.. అయితే ఏంటి... నేను లెక్చరర్ ని కదా నన్ను ఎవరు అలా తీసుకురారు.

మీరు క్లారిటీగా చెబితే బెటర్ అని సూర్య కొంచెం సీరియస్ గా అంటాడు. ఏమీ లేదు దేవాగారు..  రోజు మీరు నన్ను పికప్ చేసుకోవచ్చు కదా..

మీ బైక్ మీద వెనకాల నేను కూర్చుంటే..  లెక్చరర్స్ ఇద్దరూ కలిసి వస్తే చూశావాళ్ళకి కూడా బాగుంటుంది. అదే ఒక లెక్చరర్... స్టూడెంట్ కలిసి వస్తే.. ఇంకా ఆపుతారా అని కొంచెం గట్టిగానే అంటాడు. 

సూర్య వాయిస్ కి సరళ కొంచెం జంకుతుంది. ఏంటి మేడం...  మీరు చదువుకున్నారు.. ఒక లెక్చరర్ అయ్యుండి... ఇంత చీప్ గా ఎలా ఆలోచిస్తున్నారు.

ఒక స్టూడెంట్ లెక్చరర్ కలిసి వస్తే అలా తప్పుగా అనుకోవడమేనా..   నేను వచ్చే దారిలోనే.. విశిష్ట వస్తుంది. గుడ్ స్టూడెంట్.. బాగా చదువుతుంది అన్న సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టే లిఫ్ట్ ఇచ్చాను.  అందులో మీకు ఏం తప్పు కనిపించింది.

మీరు ఒక లెక్చరర్ అని ఇన్ని రోజులు ఒక గౌరవం ఇచ్చాను. ఆ గౌరవం కాపాడుకుంటే మీకే మంచిది.  మీరు ప్రవర్తించే తీరుకి మీ వెనకాల ఎలా మాట్లాడుకుంటున్నారో అన్నది చూసుకోండి.

పద బావ అనే శ్రీకర్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఏంటి బావ మరి అంత స్ట్రాంగ్ డోస్ ఇచ్చావు.   లేకపోతే ఏమిటిరా...  ఒక ఆడ,  మగ కలిసి వస్తే వాళ్ళిద్దరి మధ్యన ఇంకా రూమర్స్ స్ప్రెడ్ చేయడమేనా..

అది ఏ యూజ్లెస్ స్టూడెంట్ స్ప్రెడ్ చేసాడో అంటే వాడికి పని పాట లేదు అనుకోవచ్చు.  కానీ ఆవిడ ఒక గౌరవమైన పొజిషన్లో ఉంది.. మాట్లాడే విధానం బాగుందా..

సరే బావ కూల్.  ఇంకా ఆవిడ నీ జోలికి రాదు.  అసలు ముందు ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేసినందుకు ప్రిన్సిపల్ ని అనాలి.  చెబుతాను వీళ్ళ పని. బావ ఈ విషయం అంకుల్ దాకా వెళితే బాగోదు.

మనం ఇక్కడ ఉండేది కొన్ని రోజులే కదా... మనం వెళ్ళిపోయినా తరువాత వేరే లెక్చరర్స్ రావచ్చు లేదా ఇంకొక స్టూడెంట్ ని ఇబ్బంది పెట్టవచ్చు.

ఫస్ట్ అఫ్ ఆల్ లెక్చరర్స్ బిహేవియర్ కూడా కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసేకే జాబ్ ఇమ్మనాలి..  లేకపోతే నాట్ అలోడ్ బోర్డు పెట్టేయాలి.

సరే నువ్వు ఛార్జ్ తీసుకున్నాక అలాగే చేద్దాము.  ప్రస్తుతానికి కూల్ అవ్వు బావ..  ఈరోజు స్టూడెంట్స్ తో గేమ్స్ ఆడించాలి.

ఈ గొడవలో పడి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ సండే విశి, అంటీ మీ పై పోర్షన్ లోకి షిఫ్ట్ అవుతారు.

అది ఫ్యామిలీ ఉండేటట్టుగా కాదు కదా..  మనం సరదాగా టైం స్పెండ్ చేయడానికి పెంట్ హౌస్ లాగా వేయించాము. నో ప్రాబ్లం వాళ్ళు ఉండేది ఇద్దరే కాబట్టి.. మేనేజ్ చేసుకుంటారు.

ఫస్ట్ అఫ్ ఆల్.. అంటీ కి కంపెనీ కావాలి. తన మైండ్ డైవర్ట్ అవ్వాలి. ఇంట్లో పెట్టి లాక్ చేసుకుని రావడం అంటే ఎందుకో కరెక్ట్ గా లేదు.

ఇటు విశి కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే నేను ఈ రెండు రోజుల్లో ఏమన్నా ఆల్టరేషన్ ఉంటే చేయిపిస్తాను.

విశి కొత్త ఇంటి ప్రయాణం......
[+] 8 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

Part - 40



గౌతమ్ ఆఫీస్ కి రాగానే పీఏ టెన్షన్ గా ఎదురొస్తాడు. ఏమైంది అంత టెన్షన్ గా ఉన్నావు. సార్ మనకి వి. జె. స్ గ్రూప్ నుంచి కాల్ వచ్చింది.

ఆ కంపెనీ నుంచా అని గౌతమ్ ఆనందంతో అడుగుతాడు. అవును సార్... మనం ఇచ్చిన కొటేషన్ నచ్చిందంట.
ఓకే చేశారు.

మాట్లాడడానికి రమ్మంటున్నారు. ఎప్పుడో ఆరు నెలల ముందు ఇచ్చిన కొటేషన్ ఇప్పుడు ఓకే చెప్పారా.. చాలా పెద్ద కంపెనీ కదా సర్..

టైం తీసుకుంటారు కదా.. మరి ఇంత గుడ్ న్యూస్ ని ఎందుకు అంత టెన్షన్ గా చెబుతున్నావు. మీతో పాటు హిమగారిని కూడా తీసుకురమ్మన్నారు.

నడిచేవాడు ఆగి ఏమంటున్నావు. అవును సార్.. ఆర్కిటెక్చర్ తో కూడా మాట్లాడతారంట. హిమగారి స్కిల్స్ వాళ్లే పర్సనల్గా టెస్ట్ చేసి అప్పుడు మనకి ఓకే చేస్తామన్నారు.

క్యాబిన్ డోర్ తీసి లోపలికి వెళ్లి కూర్చొని గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు.  ఏమైంది సార్.. హిమ నలుగురిలో ఫ్రీగా చెప్పలేదు.

విక్రమ్ సార్ గురించి విన్నాను.  ఆయన ఎంత మంచివారో.. అంత స్ట్రిక్ట్ గా ఉంటారు.  అవును సార్.. ఆయన సింహం లాంటివారు..

ఏదైనా తేడా వస్తే సింహ పంజా  విసిరినట్టు.. మన కంపెనీ మీద కూడా పంజా విసురుతారు. మన వర్క్ అంతా క్లియర్గా ఉంది కదా సార్..

హిమగారిని మోటివేట్ చేయండి.. కాన్ఫిడెంట్గా చెబితే చాలు. ఆ కంపెనీతో మనం టైప్ అయ్యాము అంటే ఇంక మనకి తిరిగే ఉండదు.

నువ్వు వెళ్ళు నేను ఆలోచిస్తాను అని పంపించేస్తాడు. గౌతమ్ కాసేపు ఆలోచించి హిమకి ఫోన్ చేస్తాడు. చెప్పు డార్లింగ్.. ఒకసారి ఆఫీస్ కి రా..

నేను బ్యూటీ పార్లర్ లో ఉన్నాను.. ఏదైనా ఇంపార్టెంటా.. ఫోన్లో చెప్పు.  ఇది సీరియస్ మేటర్. నువ్వు తర్వాత అయినా మెరుగులు దిద్దుకోవచ్చగాని ముందు రా అని ఫోన్ పెట్టేస్తాడు. చాలా విసుగ్గా ఉంటుంది.

విశి చేయజారినప్పటి నుంచి ఆఫర్స్ తగ్గిపోతున్నాయి. ఆఫీసులో ఉన్న ఆర్కిటెక్చర్స్ బెస్ట్ వర్క్ ఇస్తున్న సరే ప్రీవియస్ వర్క్ తో కంపేర్ చేసి..  ఇంకా బెస్ట్ వర్క్ కావాలి అని చెప్పి హోల్డ్ లో పెట్టేస్తున్నారు.

విశి వర్క్ ఇవ్వడం లేదు. ఇప్పుడు విక్రమ్ సార్ డైరెక్ట్ గా ఆర్కిటెక్చర్ తో మాట్లాడతాను అంటున్నారు.  హిమతో మాట్లాడితే.. ఆ వర్కు హిమ చేయలేదు అన్న విషయం తెలిసిపోతుంది.

మోసం చేసాము అని తెలిస్తే విక్రమ్ సార్ అక్కడే ప్రాణాలు ఉండగానే గొయ్యి తీసి కప్పెట్టేస్తారు. ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయట పడాలి అని తల పట్టుకుంటాడు.

హిమ డోర్ తీసుకుని వచ్చి హాయ్ డార్లింగ్ ఏమైంది అని వయ్యారంగా నిలబడుతుంది . తైస్ వర్క్ ఉండే ఫ్రాక్ వేసుకుని..  హై హీల్స్ వేసుకుని.. హెయిర్ లీవ్ చేసుకుని ఉంటుంది.

చూడగానే చిరాకు వస్తుంది. ఏంటి హిమ.. ఈ డ్రెస్..ఆఫీస్ కి కదా వచ్చేది. కొంచెం మంచి డ్రెస్ వేసుకుని రావచ్చు కదా..
ఓ.. కంఆన్ గౌతమ్. ఇది లేటెస్ట్ ట్రెండ్.. మనం వేసుకునే డ్రెస్సింగ్ బట్టే మన వైపు చూస్తారు. ఎంత ఫాలోయింగ్ పెరుగుతుందో తెలుసా అని హెయిర్ ని వెనక్కి వేసుకుంటుంది.
నువ్వేంటి ఇంత చిరాగ్గా ఉన్నావు..  ఏదైనా ప్రాబ్లమా అని అక్కడ చైర్ లో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ ఉంటుంది.

గౌతమ్ కి ఒక్కసారిగా విశి గుర్తుకు వస్తుంది. కాలేజీలో జాయిన్ అయిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ చుడీదార్సే వేసుకునేది.

పొడుగు జడని అందంగా అల్లుకుని చక్కటి చిరునవ్వుతో మాట్లాడేది.  ఎప్పుడైనా డ్రెస్సింగ్ గురించి మాట్లాడితే.. మన స్కిల్స్, బిహేవియర్ ని బట్టి ఎదుట వాళ్ళు గుర్తించాలి కానీ వేసుకునే బట్టలను బట్టి విలువ కాదు అని సున్నితంగా చెప్పేది.

అంతే..  అన్ని ఉన్న ఆకు అణిగిమనిగి ఉంటుంది.  ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.  అన్నట్టుగా..

స్కిల్స్ ఉన్న విశి ఓద్దికగా ఉంది కానీ హిమ అని హిమ వైపు చూస్తాడు.. ఏమైంది గౌతమ్ అలా చూస్తున్నావు.. చూపు తిప్పుకోలేకుండా ఉన్నానా..  అని కళ్ళు ఎగరేస్తుంది.

నెక్స్ట్ టైం ఆఫీసుకి వచ్చేటప్పుడు కొంచెం ప్రొపెర్ గా రెడీ అవ్వు.  నన్ను కంట్రోల్ చేయాలి అనుకుంటున్నావా... గౌతమ్ కళ్ళు మూసుకుని ఒకసారి బ్రీతింగ్ తీసుకుని వదిలి..

లేచి నిలబడి హిమ వెనకాల నుంచి చేతులు వేసి.. నీ పేరు మీద ఉన్న వర్క్ అంతా చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. ఎవరైనా నీతో మాట్లాడాలి అనుకుంటే ... నీ వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా అంతే డిగ్నిఫైడ్ గా ఉండాలి.

అఫీషియల్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు డ్రెస్సింగ్ చాలా హుందాగా ఉండాలి.  ఇలా పబ్ కి వెళ్ళినట్టుగా వస్తే బాగోదు కదా..

ఇప్పుడు ఏం చెప్పాలనుకుని నన్ను పిలిపించావు అని చేతి గోళ్లు చూసుకుంటూ అడుగుతుంది. హేమ కేర్ లెస్నెస్ కి కోపం వస్తున్న..  కంట్రోల్ చేసుకుని మనకి వి.జె. స్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది.

ఏం కంపెనీ అని అడిగితే..  హిమ అని కొంచెం గట్టిగా అంటాడు.  వాట్  అని చూస్తుంది. కంట్రోల్ కంట్రోల్ అనుకుంటూ కుర్చీలో ఉన్న హిమని కుర్చీతో పాటు తన వైపుకు తిప్పుకొని..

వి. జె. స్ కంపెనీ అంటే మాటలనుకుంటున్నావా... విక్రమ్ జై సింహా.. మన బిజినెస్ సర్కిల్లో మారు మ్రోగే పేరు. అయినా ఒక రోల్ మోడల్.

వాళ్లకి లేని కంపెనీ అంటూ లేదు.  ఇప్పుడు విక్రమ్ సన్ కూడా బిజినెస్ ఫీల్డ్ లోకి వచ్చాడు. అతను ఎలా ఉంటాడో అన్నది ఎవరికీ తెలియదు.

ప్రస్తుతానికి అతని బ్యాక్.. విక్రమ్ సార్ వాళ్ళు ఫ్రెంటు ఉండి కంపెనీస్ రన్ చేస్తున్నారు. ఆ కంపెనీతో మనం టై అప్ అయ్యాము అంటే మనకి తిరిగే లేదు.

కాల్ వస్తే మరి నువ్వు వెళ్లొచ్చు కదా... వాళ్ళు ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టారు.  నాతో పాటు నువ్వు కూడా రావాలి. నేనెందుకు అని డౌట్ గా అడుగుతుంది.

డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ తో కూడా మాట్లాడతారంట... నిన్ను టెస్ట్ చేసి అప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ ఓకే చేస్తామన్నారు.

నాకేమీ తెలియదు కదా.. మరి ఇప్పుడు ఎలా అని కొంచెం కంగారుగా అడుగుతుంది.  అదే నాకు అర్థం కావడం లేదు. విక్రమ్ సార్ మోసాన్ని అసలు ఒప్పుకోరు.

ఒక పని చేద్దాం... విశిష్ట కి అమౌంట్ ఎక్కువ ఆఫర్ చెయ్యి. కాల్ లో ఉండమను..  ప్రాబ్లమ్ సాల్వ్.. అది నువ్వు అనుకున్నంత ఈజీ అనుకుంటున్నావా..

కమాన్ గౌతమ్.. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఏదైనా ఈజీనే.. విక్రమ్ సార్ కి దొరికాము అంటే ఇక అంతే... మనం యూత్...  ఆయన సీనియర్.

అప్పటి వాళ్ళకి ఇప్పుడు టెక్నాలజీ ఎలా తెలుస్తుంది. అనవసరంగా నువ్వు భయపడుతున్నావు కానీ.. ఆ విశిష్ట తో మాట్లాడి ఫైనాలైజ్  చెయ్యి.

ఇంత చిన్న దానికి కూడా భయపడిపోయి..  నా టైం వేస్ట్ చేస్తే ఎలా... ఫ్రెండ్స్ తో  పార్టీ ఉంది బాయ్ అని వెళ్ళిపోతుంది.

వెళుతున్న హిమని చూస్తూ అనవసరంగా విశిని వదిలేసుకున్నానా అనుకుంటాడు.  నో..  నో...
విశిలాంటి వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది అయినా దొరుకుతారు కానీ నేను ఎదగాలి అంటే హిమ ఫాదర్ సపోర్ట్ కావాలి.

హాయ్ విశి నీతో మాట్లాడాలి.  ఈవినింగ్ కాలేజ్ అయిన తర్వాత కలుస్తాను అని మెసేజ్ చేస్తాడు. నాకెందుకు మెసేజ్ చేశాడు అని పక్కనే ఉన్న భవ్యతో అంటుంది.

వీడికి మళ్ళీ నీతో ఏదో పని పడి ఉంటుంది.  అందుకనే ఈ స్వీట్ డైలాగ్స్ మొదలుపెట్టాడు. చూద్దాం అని సైలెంట్ గా క్లాస్ వింటుంది.

భవ్య వెంటనే ఆ మెసేజ్ సూర్యకి పాస్ చేస్తుంది. అది చూసి సూర్యా నవ్వుకుంటూ ఆల్రెడీ లైన్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాడు.  చెబుతాను అని.. మీ ఫ్రీ టైం లో కలుస్తాను అని మెసేజ్ చేస్తాడు.

ఫ్రీ టైం లో గ్రౌండ్ లో కలుస్తారు.ఏంటి సార్ రమ్మన్నారు అంట అని అడిగితే... ఏమిటి ఆ గౌతమ్ గాడు మళ్ళీ మెసేజ్ చేశాడా.. ఓ భవ్య చెప్పిందా...తెలిసిందిలే...  నువ్వు చెప్పలేదు కదా..

క్లాసులో ఉండగా మెసేజ్ వచ్చింది. అప్పుడు ఎలా చెబుతాను.  క్లాస్ వినాలి కదా..  ఇప్పుడే కదా కలిసాము.. దీనికే మీరు అలిగితే ఎలా సార్..

ఇట్స్ ఓకే..  ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైం మాత్రం ఏ టైం లో వచ్చిన నాకు వెంటనే మెసేజ్ చేయాలి. అర్థమైందా..

తప్పకుండా..  భవ్య కన్నా ముందు మీకే చెబుతాను సరేనా.. భవ్య సీరియస్గా చూస్తూ ఉంటుంది. శ్రీకర్ భవ్యతో ఎందుకు అలా చూస్తున్నావు.

చూశారా సార్..  ఫస్ట్ నేను దాని బెష్టి ని.. నన్ను పక్కన పెట్టి మరీ దేవసార్ కి చెబుతాను అంటుంది.  దీన్ని నేను ఒప్పుకోను.

నువ్వు దీనికే ఇంత ఫీల్ అవుతున్నావు.  పొద్దున్న  విశి ని పికప్ చేసుకోవాలని నాకు ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాడు.  మరి నేనెంత ఫీల్ అవ్వాలి.

అవునా... అవును అని తల ఊపుతాడు . నాకెందుకో వీళ్ళిద్దరి మధ్యన సంథింగ్ సంథింగ్ అనిపిస్తుంది సార్.. మనసులో వాడికి ఆల్రెడీ సంథింగ్ ఎప్పుడో జరిగిపోయింది. ఇంక నీ ఫ్రెండ్ కే క్లారిటీ రావాలి అనుకొని.. ఎందుకనిపించింది.

ఆ గౌతమ్ గాడు ప్రపోజ్ చేసిన సరే విశి ఏ రోజు ఇంత ఫ్రీగా మాట్లాడలేదు.  నా చెయ్యి వదల్లేదు.. గౌతమ్ తో ఎప్పుడు మాట్లాడినా నేను పక్కనే ఉండాలి.

అలాంటిదే ఇప్పుడు నేను పక్కనే లేకపోయినా దేవాసార్ తో ఫ్రీగా మాట్లాడుతుంది.. చొరవ చూపిస్తుంది అంటే దీని అర్థం ఏమిటి సార్..

నువ్వు అన్నట్టే వాళ్ళిద్దరి మధ్యనే ఏదైనా సంథింగ్ సంథింగ్ ఏమో చూద్దాం..

గౌతమ్ నీ కలుస్తావా విశి..  అదే అర్థం కావడం లేదు. కలువు కానీ నేను చెప్పినట్టేగా చెయ్యి...

సూర్య ఏం చెప్పబోతున్నాడు..

కథ కొనసాగుతుంది...
[+] 9 users Like SivaSai's post
Like Reply

Part - 41



గౌతమ్ ని కలువు కాకపోతే నేను చెప్పినట్టేగా చెయ్ అని ఏం చేయాలో చెబుతాడు.. అది విని భవ్య నోరు వదిలేస్తుంది.

శ్రీకర్.. భవ్యని చూసి  నోరు మూసుకో. లేదంటే ఈగలు దూరతాయి.  అదేంటి సార్ ఒక బిజినెస్ మ్యాన్ లాగా అంత పర్ఫెక్ట్ ప్లాన్ చెబుతున్నారు.

ఏదో వాడికి తోచింది చెప్పాడు.  మీకు బయట ప్రపంచం తెలియక మీకు అలా అనిపిస్తుంది అంతే. నిజంగా అంతేనా అని అనుమానం గా అడుగుతుంది.

నీకేమైనా అనిపిస్తుందా ఏమిటి.. నాకెందుకో అనుమానంగా ఉంది.   నీకు  ఆన్సర్స్ కన్నా క్యూస్షన్స్ ఎక్కువగా తెలుసు అనుకుంట కదా..

సార్ అని రాగం తీస్తే.. తీసింది చాలు కానీ క్లోజ్ చెయ్ అమ్మ.
విశి గౌతమ్ కి మెసేజ్ చేస్తుంది. ఆఫ్టర్ నా రెస్టారెంట్ వర్క్ ఫినిష్ అయిన తర్వాత కలుస్తాను.  అప్పుడు దాకా నాకు ఖాళీ లేదు అని.

ఆ మెసేజ్ చూసిన గౌతమ్ కి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. ఒకప్పుడు నా కాల్ కోసం.. నా మెసేజ్ కోసం ఆత్రంగా ఎదురుచూసిన ఈ  విశిష్ట ఈరోజు నాకే టైం ఇస్తుంది.

ఒక్కసారి ఈ విశిష్టతో నా పని అయ్యి..  వి.  జె. స్ కంపెనీతో టై అప్ అవ్వాలి. అప్పుడు చెబుతాను. ఎక్కడ జాబ్ రాకుండా చేసి ఆ రెస్టారెంట్ లోనే టేబుల్స్ తుడుచుకుంటూ..  వచ్చే వాళ్ళకి వెళ్లే వాళ్లకి వంగి వంగి సలాం చేసేటట్టు చేస్తాను.

ఓకే విశిష్ట.. నువ్వు ఎలాగంటే అలాగే చేద్దాం అని రిప్లై ఇస్తాడు. అది చూసి విశిష్ట నవ్వుకుని.. సార్ మీరు చెప్పినట్టుగానే పంపించాడు.

అలా.ఎలా గెస్ చేశారు.  దీన్నే కామన్ సెన్స్ అంటారు.  ప్రతిదీ ఎమోషనల్ తో కాదు మైండ్ తో కూడా ఆలోచించాలి.

సాయంత్రం రెస్టారెంట్ వర్క్ ఫినిషింగ్ అయ్యేటప్పటికి వైభవ్ వస్తాడు వైభవ్ చూసుకుంటాడు సరేనా..అతనికి నేను ఫస్ట్  శాలరీ ఇవ్వలేను కదా... అని ఇబ్బంది పడితే..

డోంట్ వర్రీ అదంతా గౌతమ్ ఇస్తాడు. నేను చెప్పింది చెప్పినట్టుగా చేయి చాలు. సెల్ఫ్ గా వర్క్ స్టార్ట్  చేయాలి అనుకున్నప్పుడు.... స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవ్వాలి.

అవన్నీ వైభవ్ కి తెలుసు.  నీ వర్క్ నువ్వు చేసుకో ఓకేనా..  థాంక్యూ సార్ అని వెళ్ళిపోతుంది.

విశి, భవ్య వెళ్ళిపోయిన తర్వాత శ్రీకర్ వచ్చి మా చెల్లిని ఒక మెట్టెక్కిచ్చావన్నమాట. ఇంకా పూర్తిగా ఎక్కలేదు. కొంతమందికి వర్క్ వచ్చు ఎలా ఎక్స్పోజ్ అవ్వాలో తెలియదు.

మరి కొంతమందికి ఎక్స్పోజ్ అవ్వడం తెలుసు కానీ వర్క్ తెలియదు.  వీళ్ళిద్దరూ అదే కోవా...  నీకు రెండు వచ్చు కదా.. అలా అని అన్ని మనకే తెలుసు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా అని ఇద్దరు స్టాఫ్ రూమ్ కి వెళ్ళిపోతారు.

సూర్య ఇచ్చిన వార్నింగ్ కే సరళ కొంచెం పద్ధతిగా మాట్లాడడం మొదలు పెడుతుంది కానీ మనసులో మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

సమయం వచ్చినప్పుడు సూర్యుని ఎలాగైనా దెబ్బ తీయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.
సూర్య వైభవ్ కి మెసేజ్ చేస్తాడు..ఈవినింగ్ రెస్టారెంట్ కి వచ్చేయ్ నీ జాబ్ స్టార్ట్ అయింది అని..

భవ్యకి కూడా ఏం మాట్లాడతారో..  ఏం జరుగుతుందో తెలుసుకోవాలని విశి తో పాటే వెళ్తుంది. విశి రెస్టారెంట్ వర్క్ ఫినిష్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చేటప్పటికి..

గౌతమ్ పార్కింగ్ ఏరియాలో వెయిట్ చేస్తూ ఉంటాడు.
విశి కామ్ గా వెళ్ళిపోతూ ఉంటే విశిష్ట అని పిలుస్తాడు. వెనక్కి తిరిగి చూసి హలో మిస్టర్ గౌతమ్ అని విష్ చేస్తుంది.

మిస్టర్ గౌతమ్ అని ఆశ్చర్యంగా చూస్తే...  ప్రొఫెషనల్ ఫీల్డ్ కు సంబంధించిన వర్క్ మాట్లాడుకుంటున్నప్పుడు మన ప్రొఫెషనల్ గానే ఉండాలి కదా మిస్టర్.

ఓకే...  ప్రొఫెషనల్ గానే మాట్లాడుకుందాం. నాకు నీ వర్క్ కావాలి. డబల్ అమౌంట్ ఇస్తాను.  చేతులు కట్టుకొని చూస్తూ ఉంటుంది.

ఏమయింది..   బిజినెస్ డీల్ చేసే పద్ధతి ఇదేనా.... ఎక్కడపడితే అక్కడ బిజినెస్ గురించి మాట్లాడతారా.. కాన్ఫరెన్స్ రూమ్ బుక్ చేయాలి.. బిజినెస్ చేసే వాళ్లతో పొలైట్ గా మాట్లాడాలి అన్న మినిమం కామన్ సెన్స్ కూడా నీకు లేదా అని అడుగుతుంది.

వాట్ అని గట్టిగా అరుస్తాడు. మిస్టర్ గౌతమ్ మీకు నాతో కలిసి వర్క్ చేయాలి అంటే ప్రొఫెషనల్ గానే డీల్ చేయండి. ఇలా వచ్చి నా టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. నాకు చాలా వర్క్ ఉంది.

ఓకే మిస్ విశిష్ట అని వత్తి పలుకుతాడు . చెప్పండి మిస్టర్ గౌతమ్ అనగానే..  మీరు ఇప్పుడు ఫ్రీ అయితే మన బిజినెస్ గురించి మాట్లాడుకుందాం.

టైం చూసుకుని మీకు నా పిఏ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను. మీరు టైం ప్లేస్ అన్నీ కన్ఫర్మ్ గా ఫైనల్ చేసి ఇన్ఫామ్ చేయండి. ఆ టైం మాకు ఓకే అయితే తప్పకుండా కలుస్తాను.

బట్ నాకు డే టైం అయితే ఖాళీఉండదు. మాక్సిమం ఈ టైం అయితే ఓకే..  ప్లేస్ కూడా ఇక్కడైతేనే నాకు కంఫర్ట్ గా ఉంటుంది అని వైభవ్ నెంబర్ ఫార్వర్డ్ చేసి ఇక నేను వెళ్తాను అని వెళ్ళిపోతుంది.

వెళుతున్న విశిష్టని నోరు వదిలేసి చూస్తూ.. ఇది విశిష్ట ఏనా..  మనీ కోసం ఎంత హార్డ్ వర్క్ ఇచ్చిన చేసేది.. అలాంటిది ఇప్పుడు మనీ కన్నా ప్రొఫెషనల్గా డీల్ చేద్దాం అని నాకే సవాల్ విసురుతుంది.

పైగా టైము ప్లేస్ నన్ను డిసైడ్ చేయమని... నాకు ఇలాగే కావాలి అని క్లియర్ గా చెబుతుంది.. అసలు ఏం జరుగుతుంది అని వెళుతున్న విశిష్ట నే చూస్తూ ఉంటాడు.

భవ్య విశి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వావ్ సూపర్ బేబీ.. ఏం జలక్ ఇచ్చావు వాడికి అని గట్టిగా బుగ్గ పైన ముద్దు పెడుతుంది.

ఇది దూరం నుంచి చూస్తున్న సూర్యకి కోపం వస్తుంది.  స్పీడ్ గా వాళ్ళ దగ్గరికి వచ్చి ఇది పబ్లిక్ ప్లేస్ ఎక్కడ పెడతే అక్కడ అలా ముద్దులు పెట్టకూడదు.

భవ్య వెంటనే..  మేమిద్దరం అమ్మాయిలమే.. నేనేమీ  అబ్బాయికి పెట్టలేదు కదా.. ఏదేమైనా సరే అలా పెట్టకూడదు.

విశి.. రా..ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను.  అమ్మ వెయిట్ చేస్తూ ఉంటారు అని బైక్ స్టార్ట్ చేస్తాడు. భవ్యకి బాయ్ చెప్పి సూర్య బైకు ఎక్కుతుంది.

వెళుతున్న ఇద్దరినీ చూస్తూ ఉంటే..  శ్రీకర్ వచ్చి ఏమైంది అలా చూస్తున్నావు..నో డౌట్ సర్. దేవా సార్ కి సంథింగ్ సంథింగ్ జరిగింది.

సరేలే నువ్వు ఇప్పుడు ఒక  ఐన్స్టీన్  వి. ఈ చీకటిలో ఒక కొత్త విషయం కనిపెట్టావు. నేనెప్పుడూ కనిపెడుతూనే ఉంటాను. సరే అని చెప్పి వెళ్ళిపోతుంది.

శ్రీకర్ సూర్య వెనకాల వెళతాడు. విశిని డ్రాప్ చేసి జాగ్రత్త..  ఆ గౌతమ్ ఇప్పుడు ఏమి కాల్స్ చేసినా లిఫ్ట్ చేయకు. రేపు మార్నింగ్ వరకు బ్లాక్ చేసేయ్.. అర్థమైందా..

ఓకే సార్. నేను ఏది చెప్పినా. ఊ..కొడతావా.. అవును సార్.. మొన్నే. కదా చెప్పాను.  ఎవరు ఏది చెప్పిన గుడ్డిగా ఫాలో అవ్వద్దు అని చేతులు రెండు కట్టుకుని బైక్ మీద కూర్చుని అడిగితే...

మీరు అన్నది నిజమే సార్. అది మిగిలిన వాళ్ళ విషయంలో..  మీ విషయంలో కాదు.  ఏమిటి నాపైన అంత నమ్మకం.

తెలియదు. మీ మాట.. మీ భరోసా చూస్తూ ఉంటే నాకు మా నాన్న గుర్తొస్తారు.  నేను మా నాన్న తర్వాత అంత కంఫర్ట్ గా ఫీల్ అయింది మీ దగ్గరే.. బాయ్ సార్ అని వెళ్ళిపోతుంది.

వెళుతున్న విశి ని చూస్తూ తల వెనకాల రబ్ చేసుకుంటూ ఉంటాడు.  శ్రీకర్ వచ్చి సైట్ కొట్టింది చాలు గానీ ఇంకా వెళదామా..

ఒరేయ్  క్యూటి ఏముందో తెలుసా..  అంకుల్ తర్వాత నా దగ్గరే అంత కంఫర్ట్ ఫీల్ అవుతుంది అంట.వాళ్ళ నాన్నగారి దగ్గరఎంత భరోసా ఉందో... నా దగ్గర అంత భరోసా ఉందంట.. ఇది చాలు కదా..

ఇప్పుడు నువ్వు గాలిలో తేలుతూ ఉంటావు కానీ వైభవ్ ఎక్కడున్నావని ఫోన్ చేస్తాడు. ఏం బావ..మీ అన్నగారు గాలిలో తేలుతున్నారు.

ఆ బైక్ తమరు వేసుకొస్తే మీ అన్నగారిని నేను తీసుకోవస్తాను.. అంతలా మా వదిన ఏమి ఇచ్చింది. మాటల్లో చెప్పలేని అనుభూతినిలే..  నువ్వు రారా ..

ఫైవ్ మినిట్స్ అని వైభవ్ వస్తాడు.  ఏంటి అన్నయ్య రెస్టారెంట్ కి రమ్మని నన్ను వదిలేసి వచ్చేసారు. సూర్య ఏమీ పలకకపోతే..  మీ అన్నగారిని ఏమీ కదపకు.  నన్ను కూడా వదిలేస్తున్నాడు.

నువ్వు రా బావ అని వెనకాల ఎక్కించుకుంటాడు.  బైక్ మీద కూర్చుని శ్రీకర్ భుజం మీద చెయ్యి వేసి విశి  మాటలే తలుచుకుంటూ మురిసిపోతూఉంటాడు.

సూర్య కళ్లలో ఆమె మాట తిరుగుతుంటాయి..  “మా నాన్నగారి తర్వాత మీ దగ్గరే నాకు భరోసా...” ఆ మాట తలచుకుంటే మనసు గాలిలో తేలిపోతూ...  నీ చెంతనుండి నాలో ఊపిరి గా మార్చుకుంటాను.

చేతులు రెండు చాచి.. తల వెనక్కి వాల్చి.. ఆ గాలిలో విశి స్పర్శను ఫీల్ అవుతూ..  గాలిలో తేలుతూ ఉంటాడు. దేవా సార్ అని విశి పిలుస్తున్నట్టు అనిపించి చేతులు నార్మల్గా పెట్టుకుని పక్కకి చూస్తాడు.

వైభవ్ బైక్ మీద తను వైపుకు కూర్చుని సార్ చేతులు చాపకండి.  ప్రమాదం.. ఓకే అని చేతులు నార్మల్గా పెడతాడు.

ఓకే ఏంటి బావ..  ఏమైంది..  మళ్ళీ పక్కకి చూస్తే వైభవ్ బైక్ మీద విశి ఉండదు. ఏమీ లేదులే... శ్రీకర్ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే సడన్ గా విశి సూర్య వెనకాల కూర్చుని గట్టిగా హగ్ చేసుకున్నట్టుగా ఫీల్ అవుతాడు.

ఉలిక్కిపడి వెనక్కి తిరిగి నువ్వేంటి ఇక్కడ..  మీకోసమే వచ్చాను సార్.  ఇలా బాగుంది కదా.. బాగుంది కానీ..
ఇక్కడ శ్రీకర్ వైభవ్ ఇద్దరూ ఉన్నారు.

చూస్తే బాగోదు వెళ్ళిపో.  ఎక్కడికి వెళ్లిపోమంటున్నావు బావ. ఎవరు చూస్తే బాగోదు. ఈ గాలిలో మాటలు సరిగ్గా వినపడటం లేదు.

సూర్య బాబు కాస్త కంట్రోల్?‍♂️?‍♂️
[+] 9 users Like SivaSai's post
Like Reply

Part - 42



శ్రీకర సూర్య ని డ్రాప్ చేస్తాడు సరే. గుడ్ నైట్ రా.. అదేంటి బావ నిన్ను డ్రాప్ చేస్తే లోపలికి రా అని కూడా పిలవకుండా గుడ్ నైట్.. ఇంటికి పో.అంటున్నావు.

నువ్వే కదరా ఎప్పుడు రమ్మన్న..  నేను రాను..వస్తే సౌమ్యని కేలుకుతాను. మా మామయ్య చూస్తే హర్ట్ అవుతాడు. బ్లా.. బ్లా.. చెప్పేవాడివి.

అప్పుడప్పుడు పిల్లగాలి వీస్తూ ఉంటుంది కదా..  నీకేం బాబు.  నువ్వే బానే సెట్ చేసుకుంటున్నావు.  మాకు అప్పుడప్పుడే టైం దొరుకుతుంది అని బైక్ దిగుతాడు.

ఒరేయ్ రావాలి అనుకుంటే..  డైరెక్ట్గా రా అంతేగాని ఈ కహానిలన్నీ అవసరమా... ఆంటీ కి మెసేజ్ చేసి వచ్చేయ్ అని వెళ్ళిపోతాడు.

వైభవ్ వచ్చి మీ ఇద్దరి పనే బాగుంది. నా చుక్క ఎక్కడుందో.. నీ చుక్క నీ పక్కనే ఉంది రా బామ్మర్ది..  గుర్తించు...విజిల్ వేసుకుంటూ లోపలికి వెళ్తాడు.

శ్రీకర్ వెళ్లేటప్పటికీ సూర్య రూమ్ కి వెళ్ళిపోతాడు. హాల్లో సౌమ్య పూజితతో మాట్లాడుతూ ఉంటుంది. నైల్స్ చూపిస్తూ చెబుతూ ఉంటే.. పూజిత ఇంట్రెస్టింగ్ గా వింటూ ఉంటుంది.

శ్రీకర్ వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చుని ఏం చెప్పుకుంటున్నారు  అని అడుగుతాడు.  ఒరేయ్ ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకునేటప్పుడు ఏం చెప్పకుంటున్నారు అని అడగకూడదు.

అవునా పోనీ మీకు తెలిసిన నిజం ఏమిటి అంటాడు. ఏంటి అతి తెలివితేటలా... శ్రీకర్ కి ఒక్కసారిగా పొలమారుతూ ఉంటే.. ఆంటీ వాటర్ ఉండు తెస్తున్న అని కంగారుగా పూజిత వెళుతుంది.

సౌమ్య  వైపుకు తిరిగి ఏం చేస్తున్నావే నా బుజ్జి పప్పీ.. నోరు వదిలేసి..  ఇప్పటిదాకా దగ్గుతూ ఉన్నావు కదా..నీతో మాట్లాడాలని ఆక్ట్ చేశాను అని నాలిక బయటపెడతాడు.

శ్రీకర్ చేసిన పనికి సిగ్గుతో తల దించుకుంటుంది. అయ్యో డాక్టర్ పాపా నువ్వు అలా సిగ్గుపడకు.  నా హార్మోన్స్ అన్ని కూచిపూడి, భరతనాట్యం ఆడేస్తున్నాయి.

అప్పుడు కాళ్లకున్న గజ్జలు తీసేయ్ అని వాయిస్ వినపడుతుంది.  ఇది ఎక్కడినుండి వచ్చిందని చూస్తే వెనకాల భరత్ సీరియస్గా చూస్తూ ఉంటాడు.

మావయ్య మీరు ఇంకా పడుకోలేదా.. ఇంత రాత్రి దాకా మెలకువగా ఉంటే మీ ఆరోగ్యం ఏం కావాలి. చేసిన ఓవరాక్షన్ చాలు గానీ..

ఏంటి నా కూతురుకి ఏదో కహానీలు చెబుతున్నట్టు ఉన్నావు. ఊరుకో మావయ్య.  నీ కూతురికి కహానీలు చెప్పే అంత ధైర్యం ఉందా..

వెనక సింహం లాంటి విక్రమ్ అంకుల్...  ఇటు పక్కన పులిలాంటి నువ్వు ఉండగా కహానీలు చెబితే కుదురుతుందా.. అందుకే నిజాలే చెబుతున్నాను.

అవునా ఏమిటో ఆ నిజాలు.. కూర్చో మావయ్య పక్కన కూర్చోబెట్టుకుని.. ఒక కాలు సోఫాలో మడత పెట్టి కూర్చుని మీకు ఒక సీక్రెట్ చెబుతాను .

సరే చెప్పు. ఎవరికి చెప్పకూడదు.  ముందు నువ్వు చెప్పు.
చెప్పాలో చెప్పకూడదు నేను డిసైడ్ అవుతాను. అలా అంటే కుదరదు మావయ్య.

సీక్రెట్ అంటే సీక్రెట్ ... ష్.. అని  తల పట్టుకొని సరే చెప్పు. మన సూర్య లవ్ లో పడ్డాడు.  మా చెల్లెలు సూపర్ ఉంటుంది తెలుసా..  అవని ఆంటీకి ఎదురొస్తుంది.

ఎంత లక్కీ ఫెలోస్ మావయ్య మీరందరును...ఆ మాటకి పైనుంచి కిందకి చూస్తూ ఉంటే...ప్రామిస్ మావయ్య అని కంఠం దగ్గర పట్టుకుంటాడు.

ఒరేయ్ నీ వేషాలు నా దగ్గర కాదు.  సూర్య లవ్ లో పడ్డాడు అన్న విషయం ఇంట్లో అందరికీ తెలుసు అందుకనే అది పెద్ద సీక్రెట్ గా చెబుతున్నావు.

సూర్యకి సంబంధించింది ఏ విషయమైనా నువ్వు బయటికి రానివ్వవు అని నాకు తెలుసు. నువ్వు చాలా ఇంటలిజెంట్ మావయ్య అని బుగ్గలు పట్టుకుని లాగుతాడు.

సౌమ్య పుసుక్కున  నవ్వుతుంది. భరత్ శ్రీకర్ చేతుల మీద ఒక్కటేసి.. ఇలాంటి వేషాలు వేస్తేనే వాయించేది. సూర్య పెళ్లి అయ్యేదాకా కుదురుగా ఉండండి.

మావయ్య నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావా... థాంక్యూ..
థాంక్యూ.. దేనికి రా గ్రీన్ సిగ్నల్. మరి దేనికి కుదురుగా ఉండమన్నావు.

నీకు అర్థం అయిన విషయమే...నన్ను కన్ఫ్యూజ్ చేయకు మావయ్య.  క్లియర్ గా చెప్పేసావు అనుకో.. ఏదో నా బుజ్జి పప్పీ తో కొన్ని రోజులు అలా..  అలా...

అదే తగ్గించుకోమనేది . సౌమ్య నువ్వు రూమ్ లోకి వెళ్లి చదువుకో. సరే నాన్న అని  లోపలికి వెళ్ళిపోతుంది. వెళుతున్న సౌమ్య ని నీరసంగా చూస్తాడు.

పూజిత వాటర్ తీసుకొచ్చి ఇదిగో తాగు.  థాంక్స్ ఆంటీ అని నీరసంగా పుచ్చుకుంటాడు. ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదరా... ఇంతలోనే అంత నీరసం వచ్చింది. ఏమైంది..

ఏమీ లేదు పూజిత. ఇప్పుడే ఒక కొత్త రకం జ్వరం వచ్చింది.  అందుకే సడన్గా నీరసబడిపోయాడు. అవునా అని టెంపరేచర్ చూస్తుంది.

అదేంటి బాడీ చల్లగానే ఉంది. ఇది పైకి కనిపించేది కాదులే. వయసులో వచ్చే ఒక దోమ కుట్టేది. అంటే..  ప్రేమ జ్వరమా..

ఎవరు ఆ అమ్మాయి.. చెప్పు..  చెప్పు.. ఈ పూజిత ఆంటీ ఒకటి.  ఆనందం వచ్చిన కోపం వచ్చిన ఇమ్మీడియేట్ గా చూపించేస్తది.

సమయం వచ్చినప్పుడు అందరికన్నా ముందు మీకే చూపిస్తాను. మర్చిపోకూడదు అని వేలు చూపిస్తూ అడుగుతుంది.

నేను మర్చిపోయిన మీరు మర్చిపోనివ్వరు కదా.. నాకు తెలుసు కదా అని సాగదీసుకుంటూ చెప్పి.. నేను సూర్య దగ్గరికి వెళుతున్నాను.  తినేసి వెళ్ళండి రా..

ఆకలిగా లేదు అని రెండు స్టెప్స్ కలిపి ఎక్కుతూ వెళతాడు.  వెళుతున్న శ్రీకర్ ని చూసి భరత్ నవ్వుకుంటాడు.

ఏంటి అన్నయ్య మీలో మీరే నవ్వుకుంటున్నారు.  మనం ఈ వయసులో ఎంత అల్లరి చేసామో..  వీళ్లు అంత కన్నా ఎక్కువ చేస్తున్నారు.

మీకే అన్నయ్య ఆడపిల్ల తండ్రి.  అదృష్టవంతులు. సౌమ్య కుదురుగా ఉంటుంది.  మేమే అబ్బాయిలను కన్నవాళ్ళము.

అమ్మో  టెన్షన్ తో సచ్చిపోతున్నాము.  వైభవ్ వచ్చి.. వాట్ మా..  ఏదో చచ్చిపోతున్నాం టెన్షన్ అంటున్నావు. చూసావా అన్నయ్య..  ఇది కొడుకులు కన్నా తల్లులు వరస.

నువ్వు...  సౌమ్య లోపలికి వెళ్లు అనగానే ఎందుకు ఏమిటి అని అడగకుండా వెళ్ళిపోయింది.  అదే నా కొడుకు చూడు సగం సగం విని ఏమైంది అని అడుగుతున్నాడు.

అంతా బాబు వరస. ఎందుకమ్మా అంత గరంగరంగా ఉన్నావు. ఇప్పుడు నాన్నని నన్ను కలిసి బ్యాటింగ్ ఆడుతున్నావు అని గెడ్డం పట్టుకుని అడుగుతాడు.

ఏమీ లేదు సుపుత్ర.. ఇప్పుడు దాకా తమరు ఏరాచకార్యాలు వెలగబెట్టారో తెలుసుకోవచ్చా.. నేను వెలగబెట్టిన రాచకార్యాలు చెబితే నువ్వు షాక్ తో బిగుసుకుపోతావు.

ముందు చెప్పరా అని నీరసంగా అడుగుతుంది.  నీ కొడుకు జాబ్ లో జాయిన్ అయ్యాడు. మన కంపెనీలో నా.. అది కూడా ఒక షాకింగ్ న్యూస్ ఏనా..

నో.. మన కంపెనీలో అయితే నా టాలెంట్ తో వచ్చిందని నమ్మవు.  అందుకే బయట కంపెనీలు ట్రై చేశాను. వచ్చేసింది. ఎవర్రా నీకు జాబ్ ఇచ్చినా అమాయక పక్షి..

అమాయక పక్షి కాదు మస్తు టాలెంట్ ఉన్న పక్షి.  ద గ్రేట్ విశిష్ట సూర్య దేవాన్ష్.. ఏమిటి మీ వదిన నీకు జాబ్ ఇచ్చిందా.. ఇది ఎప్పుడు జరిగింది.

నిజంగానే మీ వదిన అమాయకురాలు రా... లేకపోతే నీకు ఎలా జాబ్ ఇస్తుంది.  ఇదిగో తెచ్చుకున్న నీతో తంటానే... తెచ్చుకోకపోయినా తంటానే.. 

ఎలా అమ్మ నువ్వు నన్ను నమ్మేది. అది జన్మలో జరగని పని అని వినయ్ వస్తాడు. చూడండి నాన్న నేను జాబ్ తెచ్చుకున్నాను అమ్మ నమ్మడం లేదు అని పక్కనే కూర్చుని కాళ్లు వినయ్ మీదేసి హగ్ చేసుకుని కూర్చుంటాడు.

మీ అమ్మే కాదురా ఎవ్వరం నమ్మలేము. అందుకే నేను ఏదైనా పెద్దమ్మకే చెబుతాను. పెద్దమ్మ...  పెద్దమ్మ అని అరుస్తూ ఉంటాడు.

ఎందుకురా అలా అరుస్తున్నావు అని అవని వస్తే...చూడు పెద్దమ్మ నాకు జాబు వచ్చిందంటే.. మెచ్చుకోవడం మానేసి ఎగతాళి చేస్తున్నారు.

ఎవరు... నా కొడుకుని ఎగతాళి చేసింది. నా బంగారు కొండ నీకు జాబ్ వచ్చిందా ఉండు స్వీట్ తెచ్చి నోట్లో పెడతాను. అందుకే పెద్దమ్మ నువ్వంటే నాకిష్టం.

అక్క అనవసరంగా స్వీట్ వేస్ట్ చేయకు. నీ ముద్దుల కొడుకుకి ఎక్కడ జాబ్ వచ్చిందో కనుక్కో.  ఎక్కడ వచ్చిందన్నది ఇంపార్టెంట్ కాదు పూజిత..

వచ్చిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. పెద్దమ్మ నీ దగ్గర ఉన్న టాలెంట్ కి అసలు మాటల్లో చెప్పలేను అనుకో.. పద మనిద్దరం స్వీట్ తెచ్చుకుందాం..

సూర్య, శ్రీకర్ విక్రమ్ వెళతారు.  ఏంట్రా తోడు దొంగలు ఇద్దరు కూడబల్కొని వచ్చారు. నాన్న..  అంకుల్.. అనుకుంటు ఇద్దరూ చెరో వైపున హగ్ చేసుకుంటారు.

మేటర్ ఏంటి.. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కారణం.. విశి లో వచ్చిన మార్పు. ఏం జరిగిందో.. గౌతమ్ తో ఎలా మాట్లాడిందో మొత్తం చెబుతాడు.

పరవాలేదు బానే ట్రైనింగ్ ఇస్తున్నావు. అంకుల్ వాడు హ్యాపీనెస్ కి మెయిన్ రీజన్ అది కాదు.  మీకు ఏదేదో చెబుతున్నాడు. నువ్వు నోరు ముయ్యి రా..  వెనకనుంచి లాగుతూ ఉంటాడు.

ఏ..  నా కోడలు ఏమైనా ఐ లవ్ యు చెప్పిందా.. ఏమిటి.. అంతకుమించి అని  శ్రీకర్ చెయ్యి పైకి పెడతాడు .ఏమిటో అని విక్రమ్ కూడా అలాగే అడిగితే..

మీ మీద నాకు చాలా భరోసా నమ్మకం ఉంది దేవా సార్. మా నాన్న తర్వాత మీ దగ్గరే నేను అంత కంఫర్ట్ గా ఉండగలను అని చెప్పింది.

అది విన్న దగ్గర్నుంచి మన సూర్య బాబు బైక్ మీద కాకుండా గాలిలో వచ్చాడు.. బైక్ మీద అన్ని కలవరింత మాటలే.. వినలేకపోయాను అనుకో.

ఒరేయ్ నీకు ఏమి వినిపించలేదు అన్నావు కదరా.. చూసారా అంకుల్..  నేను చెప్పానా అబ్బా.. ఇరికించేసాడు అనుకుని అది కాదు నాన్న అని గారాలుపోతూ ఉంటే..

ఒరేయ్ వేసిన వేషాలు చాలుగాని. ఆ గౌతమ్ కి చాలా మంట పెట్టాను. మళ్ళీ రేపొద్దున్న తగులుకుంటాడు. బి కేర్ఫుల్..

అందుకే కదా మన వైభవ్ ని పిఏగా పెట్టాను.  ఇది ఎప్పుడు చేశారు.  మరి నీ కోడలికి ఫుల్ సెక్యూరిటీ ఉండాలి కదా...

కాలేజీలో ఉన్నంత సేపు నేను చూసుకుంటూఉంటాను. అఫ్కోర్స్ ఇంటికెళ్లే వరకు చూసుకుంటాను అనుకో....బట్ నేను డైరెక్ట్ గా రావడం కన్నా వెనకాల ఉండడమే బెటర్ అనిపించి వైభవ్ని ముందుకి తీసుకోవచ్చాను.

విక్రమ్ సమాధానం...

కథ కొనసాగుతుంది.....
[+] 9 users Like SivaSai's post
Like Reply

Part - 43



నీ ప్లాన్ బాగానే ఉంది.  గౌతమ్ మన గ్రిప్ లోకి పూర్తిగా వచ్చేవరకు జాగ్రత్తగా ఉండు.  ఇంకొక టూ డేస్ లో వాడు నా ముందుకి రావాలి.

కాబట్టి ఎలాగైనా  విశిని ఇబ్బంది పెట్టడానికి..  తన వర్క్ కోసం ప్రెషర్ ఇవ్వడానికి చూస్తాడు.. నాకు అనుమానం వచ్చింది అందుకే ఇల్లు కూడా షిఫ్ట్ చేస్తున్నాను. ఎక్కడికీ..

వీడి పై పోర్షన్ లోకి. ఆంటీ కి కూడా మైండ్ ఫ్రెష్నెస్ కావాలి.  అంకుల్ ఆలోచనల దగ్గరే ఆగిపోయారు. విశికి హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది.

సో ఇక్కడ అనుకో..  సేఫ్టీ కి సేఫ్టీ..  ఆంటీకి కంపెనీ ఇవ్వడానికి ఉంటారు.   ప్లాన్ బాగానే ఉంది.. వైభవ్ కూడా కొంచెం దారిలో పడతాడు.

బాబాయ్ కి టెన్షన్ తగ్గుతుంది. మీరు అనుకున్నంత వేస్ట్ గాడు కాదు నాన్న..అల్లరి చేస్తాడు గాని రెస్పాన్సిబిలిటీ కూడా అలాగే ఉంటుంది.

నా పిల్లల గురించి నాకు తెలియదా.  ఏదో మేము ఆ భయమైనా చూపించకపోతే మీరు ఇంకా ఎగురుతారు.
కిందేదో హడావిడి చేస్తున్నట్టున్నారు.  అవని, వైభవ్ కలిసి పదండి.

కిందకి వెళ్ళేటప్పటికి పూజిత గరంగరం గా చూస్తూ ఉంటుంది.  విద్య... నువ్వు ఆగు పూజిత.. చూడు వాళ్ళిద్దరూ.

అసలు ఏమైనా అర్థం ఉందా.. ఎవరైనా ఫస్ట్ మంత్ శాలరీ తీసుకున్నాక పార్టీ చేసుకుంటారు.  జాబ్ కన్ఫర్మ్ కూడా అవ్వకముందే పార్టీ చేసుకుంటున్నా తల్లి కొడుకులు వీళ్ళిద్దరే అయ్యిఉంటారు.

సూర్య వినయ్ పక్కన కూర్చుని ఏం జరుగుతుంది బాబాయ్.  పిన్ని ఎందుకు అంతగా కోపంగా ఉంది. నువ్వు నన్ను కదపక రా బాబు.

ఇప్పుడు నేను మాట్లాడడం చూసిందంటే కొడుకు మీద కోపం నామీదకి షిఫ్ట్ అవుతుంది.  నాకు అవసరమా అని లిప్స్ కదిలి కదలకుండా చెబుతూ ఉంటాడు.

మేటర్ తెలిస్తే పిన్నిని కూల్ చేయొచ్చు కదా..  అదేదో మీ పిన్ని నే అడుగు. ఏమైంది పిన్ని... ఎవరైనా ఏమైనా అన్నారా.. నాకు చెప్పు. నేను చూసుకుంటాను.

మీ పిన్నిని అనే ధైర్యం ఎవరికి ఉంది రా అని వినయ్ నాలుక కరుచుకుంటాడు.  పూజిత కోపంగా చూస్తూ ఉంటే సారీ అని లిప్ మూమెంట్ ఇస్తాడు. మీ పని తర్వాత చెబుతాను అని కళ్ళతోనే వార్నింగ్ ఇస్తుంది.

నాకు చెప్పు పిన్ని అని భుజం మీద చెయ్యవేస్తే.. ఒక్కసారి కిచెన్లోకి చూడు రా..  ఏమైంది..  అక్కడ అమ్మ వైభవ్ ఏదో హడావిడి చేస్తున్నారు.

వైభవ్ కి ఇష్టమైన స్వీట్ ప్రిపేర్ చేస్తుంది..వావ్ అవునా.. వావ్ ఏమిటి.. ఎందుకో అడగవా... నువ్వు అడగకపోయినా చెబుతావు కదా పూజిత...అందుకే సూర్య వెయిట్ చేస్తున్నాడు అని వినయ్ సమాధానం చెబుతాడు .

మీరు అంటే... నాకు వర్క్ ఉంది అని ఫోన్లో తలదూర్చుతాడు.  ఈ మొగుడు పెళ్ళాలు చిలిపి తగాదాలకి అందరూ ముసిముసిగా నవ్వుకుంటూఉంటారు.

నువ్వు చెప్పు పిన్ని... బాబాయ్ మాటలు పట్టించుకోకు. జాబు వచ్చింది అన్నాడు అంతే  వెంటనే చేయడానికి వెళ్ళిపోయింది.

ఎవరైనా ఫస్ట్ మంత్ శాలరీ వచ్చిన తర్వాత చేసుకుంటారు పోనీ జాబ్ కన్ఫర్మ్ అయ్యింది అన్నాక చేసుకున్న అదొక అర్థం.

వీళ్ళిద్దరి హడావిడి చూస్తూ ఉంటే...  కూల్ పిన్ని. మనవాడు జాబ్లో జాయిన్ అయ్యాడు అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా..

హ్యాపీ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోని.  రేపు ఏదైనా తోక జాడిచ్చాడు అనుకో... ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నాను ఇప్పుడు జాబ్ మానేశాను అంటే అందరి ముందు  పరువు పోతుంది కదా అని సైలెంట్ గా పని చేసుకుంటాడు.

నువ్వు అన్నది కూడా నిజమే సూర్య... వినయ్ విక్రమ్ తో వీడు ఈ తరాన్ని హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ఎంపైర్ కి అసలైన కింగ్ వచ్చాడు.

కొడుకు గురించి నలుగురు చెబుతూ ఉంటే మనసులో గర్వంగా అనిపిస్తుంది కానీ పైకి మాత్రం చూపించకుండా... మన పిల్లలందరూ టాలెంట్ ఉన్నవాళ్లే ..  ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం అంతే...

లలిత సూర్యని పిలిచి మనవరాలను ఎప్పుడూ పరిచయం చేస్తావు. మాకు చూడాలని ఉంది రా.. కళ్యాణ్.. ఈ ఆత్రమే తగ్గించుకుంటే మంచిది.

ఆ అమ్మాయి సెటిల్ అవ్వాలి. గోల్ రీచ్ అవ్వాలి . ఇంకా చాలా ఉన్నాయి.  అవన్నీ అవ్వకుండా మన సూర్య ఓపెన్ అవ్వడు.

సూర్య ఎవరు అన్నది చెప్పమని మేము అడగడం లేదు. మాకు పరిచయం చెయ్యి అంటున్నాము.  ఏదో ఒక రోజు గుడికి తీసుకురారా..

అప్పుడు మేము చూస్తాము. ఏమంటావు మాధవి..నువ్వు అన్నది నిజమే వదిన..  వీళ్ళకి కంగారు లేకపోవచ్చు కానీ మన ఇంటికి రాబోయే కోడలు గురించి మనమే కదా చూసుకోవలసినది.

రమేష్..  కళ్యాణ్ తో ఎందుకు బావ నీకు దురద.   లేడీస్ ఎలాగైనా పడతారు. వాళ్ళు ఫిక్స్ అయ్యారు అంటే చూడాల్సిందే. మాట్లాడాలిసిందే..

మధ్యలో దూరావు అనుకో.. నిన్ను పుష్పాన్ని చేస్తారు.. నీతో పాటు నేను పుష్పం అవ్వాలి. ఇప్పుడు నువ్వు నాతోపాటు పుష్పం అవుతావు అని బాధ లేక నేను పుష్పం అవుతున్నానని బాధ..

ఏదైనా బాధ బాదే కదా బావ. వైభవ్ బౌల్స్ లో స్వీట్ పట్టుకుని వచ్చి..  రండి రండి అందరూ ఈ తీపి టేస్ట్ చూసి.. నాకు కంగ్రాట్స్ చెప్పండి.

అడిగి కంగ్రాట్స్ చెప్పించుకోకూడదు రా తింగర సన్నాసి.. అమ్మ నువ్వు ఇంత హ్యాపీ మూడ్లో కూడా నన్ను తిడుతున్నావు. ఇలాగైతే నేను హర్ట్ అవుతాను.

విక్రమ్ కంగ్రాట్స్ రా.. మీ అన్నయ్య కన్నా నువ్వే బెటర్ పొజిషన్ లో ఉన్నావు. థాంక్స్ పెదనాన్న.  నా టాలెంట్ ని గుర్తించేది మీరు, పెద్దమ్మే..

ఆ మాటకి నవ్వుతూ నీకు తెలియని విషయం చెప్పనా.. మా అందరికన్నా ముందు గుర్తించిందే మీ అమ్మ.  ఏదో అందరి ముందు పొగిడితే దిష్టి తగులుతుంది అని అమ్మ బాధ అని అవని అంటుంది.

కావాలంటే చూడు స్వీట్ ఇంకా తినకుండా స్పూన్ ని అలాగే పట్టుకుని కూర్చుంది. వైభవ్ పక్కన కూర్చొని అవునా అమ్మ..  నా కోసమేనా..

అంత లేదులే గాని పట్టు అని స్పూన్ నోట్లో పెడుతుంది. ఇదేమి తల్లి ప్రేమో..  రాక్షసి ప్రేమను మించిపోతుంది. ఒరేయ్ సుపుత్ర నేను కూడా ఒక స్పూన్ పెడతాను రారా.. లేకపోతే జీవితాంతం నువ్వు, మీ అమ్మ నన్ను దెప్పుతూనేఉంటారు.

అందరూ నవ్వులు సరదాలతో ఆ రాత్రి వెళ్ళిపోతుంది. విశి ఫ్లాట్ కి వెళ్లి మెడ చుట్టూ చేతులు వేసి  ఏం చేశావు అమ్మ అని అడిగితే..

ఏముంది ఖాళీయే... పని అయిపోయిన దగ్గర నుంచి నాన్నగారి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను..  అవునా...
అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి.  చెప్పురా..

మనం ఇల్లు మారుతున్నాము.  ఈ ఇల్లు బాగానే ఉంది కదా..  ఎందుకు. అది నాకు తెలిసిన వాళ్ళ హౌస్.. కాలేజ్ కి దగ్గరగా ఉంటుంది అని అక్కడకి షిఫ్ట్ అవుతున్నాను.

సరేలే ఏరోజు.. ఈ సండే వెళ్లి చూసి వద్దాము.  నీకు నచ్చింది అంటే షిఫ్ట్ అయిపోదాము.  నాకు నచ్చడం ఏముంది. నీకు కాలేజ్ కి ఇబ్బంది లేకుండా ఉంటే చాలు..

స్నానం చేసి రా..  భోజనం చేద్దాము. అలాగే అమ్మ అని ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది. స్నానం చేసి వచ్చి తల్లి చేత గోరుముద్దలు తిని మంచం పైన వాలి...

ఈరోజు నాకు చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది.  ఆ గౌతమ్ కి గట్టిగా సమాధానం చెప్పాను. దీనికి అంతటికీ కారణం దేవా సార్.. థాంక్యూ సార్..  మీరు ఇస్తున్న సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనిది.

దేవా గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది. గౌతమ్ ఇంటికి వెళ్లి మందు బాటిల్ పుచ్చుకుంటాడు. విశిష్ట ఆ కాన్ఫిడెన్స్ ఏమిటి..

నాకే ఎదురు చెబుతున్నావు.  భరించలేకపోతున్నాను. నువ్వు నా ముందు ఎప్పుడూ అణిగిమణిగి ఉండాలి. నా చూపు కోసం నా పిలుపు కోసం నువ్వు పిచ్చిదానిలాగా ఎదురు చూస్తూ ఉండాలి.

నీకు డబ్బులు ఎంత అవసరమో నాకు తెలుసు. అలాంటిది నాతో బిజినెస్ డీల్ చేస్తాను అని చెబుతున్నావా..

నేను వర్క్ ఇవ్వకపోతే మీ మదర్ కి ట్రీట్మెంట్ కి కూడా దిక్కులేదు.  అసలు ముందు మీ మదర్ ట్రీట్మెంట్ ఆపేస్తే.. అప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడతావు.

నువ్వు ఎలా చెప్పినా వింటాను గౌతమ్ అని ప్రాదేయపడతావు.  రేపే మీ మదర్ కి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ తో మాట్లాడతాను.

నిన్ను ఎలాగైనా నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకొని..నీ అందం టాలెంట్ నా కోసము మాత్రమే ఉపయోగపడేలాగా చేసుకుంటాను. అలా చేసుకోకపోతే నేను గౌతమ్ నే కాదు అని బాటిల్ మొత్తం ఖాళీ చేస్తాడు.

మత్తుగా తూలుతూ ఉంటే..  హిమ అక్కడికి వచ్చి వాట్ గౌతమ్..  ఈ టైం లో ఇంత డ్రింక్ చేస్తున్నావు. నువ్వేంటి ఇక్కడ అని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే...

డాడీ, నేను ఇద్దరమూ వచ్చాము.. నాకు నిన్ను చూడాలనిపించింది అని అడిగితే వెంటనే తీసుకోవచ్చారు. సో స్వీట్ కదా..

ఆ మాటకి గట్టిగా నవ్వుతూ మీ డాడీ స్వీట్ కాదు విలన్. తాగి న మైకంలో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా.. నిజమే మీ డాడీ నా పాలిట పెద్ద విలన్..

గౌతమ్ మా డాడి గురించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఓ మై డియర్ స్వీట్ హార్ట్..  విలన్ అంటే ఇంత అందమైన బొమ్మని ఎదురుగుండా ఉంచి టెస్ట్ చెయ్యనివ్వడం లేదు.

మరి విలన్ అవునా కాదా చెప్పు అని నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకి లాక్కుంటాడు. ఓ గౌతమ్ మా డాడీ ఏది చేసినా మన ఫ్యూచర్ బాగుండాలి అనే..

ఆ విశి తో మాట్లాడేవా..  ఎంతవరకు వచ్చింది వర్క్. ఎప్పుడు ఇస్తానంది. ఈ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చావా.. ఫోన్లో అడిగి ఉంటే చెప్పేవాడిని కదా...

హిమ సమాధానం....
[+] 8 users Like SivaSai's post
Like Reply

Part - 44



విశి తో మాట్లాడావా.. వర్క్ ఎప్పుడు ఇస్తానంది. మనం విక్రమ్ సార్ ని కలవాలి కదా... ఎప్పుడు వెళదాము. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చావా...

హిమని వదిలి సోఫాలో కూలబడతాడు. నో..  నా ఉద్దేశ్యం అది కాదు.  నిన్ను చూడాలనే వచ్చాను. బట్ ఎలాగా కలిసాము కదా అని బిజినెస్ విషయం మాట్లాడుతున్నాను. నాకు నీ తర్వాతే ఏదైనా సరే...

హిమని వళ్ళోకి లాక్కుని..  అందుకే బేబీ నువ్వంటే నాకంత ఇష్టం. ఆ విశి కి ఒళ్ళు అంతా పొగరే..టాలెంట్ ఉన్న వాళ్లకి పొగరు ఎక్కువ ఉంటుంది.

అలా ఎందుకు అనుకుంటున్నావు నాకు టాలెంట్ ఉంది.. అందము ఆస్తి అన్ని ఉన్నాయి.  కానీ నేను అణుకువగా ఉండడం లేదా..

ఆ విశిలాంటి వాళ్ళు ఎక్కడో కొంత మంది ఉంటారు. అందరినీ అలా చూడకూడదు.  నువ్వు అన్నది కూడా నిజమే బేబీ అని బుగ్గ నిమురుతూ ఉంటాడు.

తాగిన మైకంలో  హిమ.. విశిలాగా కనపడుతూ ఉంటే ఎలాగైనా విశిని  సొంతం చేసుకోవాలి అన్న ఆలోచనతో ఉండి దగ్గరగా వెళ్లి పెదవులు అందుకోబోతాడు.

గౌతమ్ ఏం చేస్తున్నా నువ్వు స్పీడ్ గా ఒళ్ళో నుంచి లెగుస్తుంది.  ఏమైంది బేబీ ఇప్పుడు దాకా బానే కోపరేట్ చేస్తావు కదా.. ఇవన్నీ పెళ్లయిన తర్వాత..

ఇలాంటివి తెలిస్తే డాడీ కోప్పడతారు. నువ్వు రాంగ్ మూడ్ లో ఉన్నావు మళ్ళీ కలుద్దాం బాయ్ అని వెళ్ళిపోతుంది. వెళుతున్న హిమని చూసి తల పట్టుకుంటూ..

ఛ అనుకొని...  నా వర్క్ అయ్యే వరకు హిమతో జాగ్రత్తగా ఉండాలి.  నేను నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి అంటే హిమని లైన్ లో పెట్టుకోవడమే...

ఎప్పుడైనా నా చేయి జారిపోతుంది అనిపిస్తే లొంగ దీసుకోవడమే.  ప్రస్తుతానికి మాత్రం గుడ్ బాయ్ లాగానే ఉండాలి అని మంచం మీద పడతాడు .

వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి వెళదామా అంటే సరే అని చెప్పి బయలుదేరుతారు. ఏమైంది బేబీ అంత సైలెంటుగా ఉన్నావు అని హిమా ఫాదర్ అయిన రమేష్ అడుగుతాడు.

నథింగ్ డాడ్.. ఈ డాడీ తో కాక ఇంకెవరితో షేర్ చేసుకుంటావు.. కమాన్ బేబీ . ఎనీ ప్రాబ్లం..  విశిష్ట కి నిజం తెలిసింది.

విశిష్ట.. ఎవరు..  అదే గౌతమ్ కాలేజ్ లో లవ్ చేశాను అని చెప్పి వర్క్ చేయిపిస్తున్నాడు కదా. ఆ వర్క్ తోనే నేను ఫేమస్ అయ్యింది .

ఓ థట్ గర్ల్.. హ్మ్.. గౌతమ్ చీట్ చేశాడని తెలిసిన దగ్గరనుంచి దూరంగా ఉంటుంది. ఈ అమ్మాయి కాకపోతే ఇంకొకళ్ళు ఇస్తారు.

తన కోసమే చూడాల్సిన అవసరం ఏముంది బేబీ. నో డాడ్ తన వర్క్ లో స్పార్క్ ఉంటుంది. దానితోనే నాకు ఒక క్రేజ్ వచ్చింది..

ఆ స్పార్క్ వేరే చోట దొరుకుతుంది అన్న హోప్ లేదు. వి.జె.స్ కంపెనీతో మాకు మీటింగ్ ఉంది.  ఆ మీటింగ్లో డైరెక్ట్గా విక్రమ్ నన్ను ఇంటర్వ్యూ చేస్తాను అన్నారు.

ప్రీవియస్ వర్క్ గురించి అడిగితే నేను దొరికిపోతాను. దొరకకుండా ఉండాలి అంటే ఆ విశిష్ట నాకు ఆ వర్క్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి హౌ టు హ్యాండిల్ అన్నది చెప్పాలి.

బట్ ఇప్పుడు దాకా ఈ గౌతమ్ ఏమీ చేయకుండా బాటిల్ ఎత్తాడు. గౌతమ్ వల్ల కాకపోతే నేనున్నాను కదా.. డైరెక్ట్ గా నేనే హ్యాండిల్ చేస్తాను.  ఎంత మని కావాలన్నా ఇచ్చేద్దాము .

మనం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే కరెక్ట్ గా ఉండదు. ఇది గౌతమే హేండిల్ చేయాలి. మన సపోర్టు లేకపోతే గౌతమ్ నథింగ్.

సపోర్ట్ కోసం ఏమైనా చేస్తాడు..సపోర్టుతో పాటు ఆ విశిష్ట వర్కు కూడా చాలా ఇంపార్టెంట్.. ఎప్పుడైతే విశిష్ట స్టాప్ చేసిందో అప్పటినుంచి గౌతమ్ కి వచ్చే ప్రాజెక్ట్ కూడా తగ్గిపోయాయి.

వాళ్ళు ఆఫీసులో ఉన్న అర్క్ టెక్చర్స్ అంతా క్వాలిటీ ఇవ్వలేకపోతున్నారు.  సో కాంపిటీషన్ పెరుగుతుంది. ఒక అమ్మాయినే హ్యాండిల్ చేయలేని వాడు రేపు మనతో కలిసి ఎలా ట్రావెల్ చేయగలుగుతాడు కాబట్టి పడనివ్వండి..

నువ్వేమీ అడ్వాన్స్ అవలేదు కదా బేబీ.. అలాంటి వాడితో అడ్వాన్స్ అవడమా..  నాకు ఎంతవరకు ఉపయోగపడతాడో అంతవరకే నొక్కుతున్నాను.

అడ్వాన్స్ తీసుకోవాలని చాలా తాపత్రయ పడుతున్నాడు. బట్ ఇక్కడ ఉన్నది ఎవరు... హిమ. హేమతో గేమ్స్ ఆడడం అంటే వాడు చావు వాడు కోరుకున్నట్టే..

బట్ కేర్ఫుల్ బేబీ.  ఇలాంటి వేస్ట్ గాళ్ళు ఎలాంటి పనులు చేయడానికి అయినా వెనకడుగు వేయరు. నేను కూడా రేపు ఫోన్ చేసి గౌతమ్ కి ప్రెషర్ ఇస్తాను.

ఉదయమే గౌతమ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే బద్దకంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటే...హలో గౌతమ్ నేను రమేష్ ని మాట్లాడుతున్నాను.

వెంటనే నిద్రమత్తు మొత్తం ఎగిరిపోయి చెప్పండి అంకుల్.. ఏమిటి ఇంకా లెగలేదా..  రాత్రి తాగింది దిగలేదా.. అలాంటిదేమీ లేదు.  దేనికో ఫోన్ చేశారు.

రేపే అనుకుంటా మీకు వి. జె. స్. కంపెనీతో మీటింగ్. అవును అంకుల్. మరి ఎంత వరకు వచ్చింది నీ ప్రోసెస్. రేపు అమ్మాయి  పేరుకి ఏదయిన డామేజ్ జరిగితే మాత్రం నేను అసలు ఊరుకోను.

నాకు నా బేబీ తరువాతే ఎవరైనా... నా బేబీ నిన్ను ఇష్టపడింది అన్న ఒకే ఒక్క రీజన్ తో నా రేంజ్ కి సరిపోకపోయినా మీ మ్యారేజ్ కి ఒప్పుకున్నాను.

అది కూడా నువ్వు నాకు ప్రామిస్ చేసావు  అనే.. నా కూతురి  ని వరల్డ్ లోనే టాప్ అర్క్ టెక్చర్ గా నిలబెడతాను అని..  ఇప్పుడు దాకా నువ్వు ఏం చేసావో నాకు కనపడటం లేదు.

అదేంటి అంకుల్ అలా మాట్లాడుతారు. లాస్ట్ టైమే కదా హిమా వర్క్ ని ఎగ్జిబిషన్ పెట్టి స్టాల్ ఓపెన్ చేశాను.   అది నా కూతురు కోసం చేసావా..  నీ బిజినెస్ ఎస్టాబ్లిష్ కోసం చేసావో తెలియనంత ఫుల్ ని కాదు.

రేపు ప్రోగ్రాం మాత్రం సక్సెస్ అవ్వాలి. ఇది చెబుదామనే ఫోన్ చేశానని పెట్టేస్తాడు.  నైల్ పాలిష్ వేసుకుంటున్న హిమ.. ఏమంటున్నాడు డాడ్.

  ఏదో పిచ్చివాగుడు  వాగుతున్నాడు. అయినా వాడిని నువ్వెలా లైక్ చేశావు బేబీ.  కమాన్ డాడ్.. నా గురించి తెలిసి కూడా మీరు ఎలా అనుకుంటున్నారు.

ఒకసారి అనుకోకుండా వాడి దగ్గర కన్స్ట్రక్షన్స్ సంబంధించిన ప్రింట్స్ చూశాను.  చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది.

వాడే చేశాడు ఏమో...మనకి బాగా యూస్ అవుతాడు అనుకున్నాను. బట్ మాటల్లో పెట్టిన తర్వాత గాని తెలియలేదు వాడు గర్ల్ ఫ్రెండ్ వర్క్ అని .

సో మన స్టేటస్ చూపించేటప్పటికి ఆటోమేటిక్ టర్న్ అయ్యాడు. నేను వాడుతున్నాను. జాగ్రత్త బేబీ.  రేపు మన కన్నా ఇంకా బాగా యూస్ అయ్యే వాళ్ళు దొరికితే నిన్ను వదిలేస్తాడు కూడా..  వాడికి అంత సీన్ లేదు. ఎప్పుడో నా గ్రిప్ లోకి వచ్చాడు.

గౌతమ్ ఫోన్ పెట్టేసి తల పట్టుకు కూర్చుంటాడు.  విశిష్ట నువ్వు నాకు ఈ రోజు ఎలాగైనా దొరకాలి అని... హాయ్ విశిష్ట.. ఈరోజు ఈవినింగ్ కలుద్దాము.

నీ వర్క్ అవ్వగానే అక్కడే మీట్ అవుదాము. క్యాబిన్ కూడా బుక్ చేశాను అని  మెసేజ్ చేస్తాడు. మెసేజ్ రిసీవ్ అయినట్టుగా ఉండదు.  బ్లాక్ అయినట్టుగా చూపిస్తూ ఉంటే విశిష్ట అని పళ్ళు నూరుతూ..

వైభవ్ నెంబర్ కి మెసేజ్ చేస్తాడు. వైభవ్ అది చూసి పర్వాలేదు గురుడు నాకు మెసేజ్ చేశాడు అనుకుని ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి.

మేడం ఫ్రీగా ఉన్నారా లేదో కనుక్కొని చెబుతాను అని రివర్స్ మెసేజ్ పెడతాడు. అది చూసి గౌతమ్ ఫ్రస్టేషన్ పీక్ లోకి వెళుతుంది.

ఇంకా వర్క్ స్టార్ట్ చేయకుండానే వీళ్ళంత బిల్డప్ ఇస్తున్నారు అసలు స్టార్ట్ చేస్తే ఇంకా దొరుకుతుందా.. ఈ లోపే నా గ్రిప్ లోకి తెచ్చుకోవాలి అనుకుని ఓకే అని పెడతాడు.

ఫైవ్ మినిట్స్ తర్వాత వైభవ్... మేడం నైట్ షార్ప్ ఎయిట్ కి కలుద్దాం అన్నారు. లేట్ అవుతే మాత్రం మేడం దొరకరు అని పెడితే.. నేను 7:30 కే అక్కడే ఉంటాను అని పెడతాడు.

ఓకే.. ఆల్ ద బెస్ట్ అని మెసేజ్ చేస్తే..  నాకు ఆల్ ద బెస్ట్ పెడతారు ఏంట్రా.. ఇది నేను నీకు ఇచ్చే ప్రాజెక్ట్.. మీకు చెప్పాలి..

  చూద్దాం అని గౌతమ్ సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు.  ఈ విషయం తెలిసిన సూర్య అలర్ట్ గా ఉంటాడు.
నైట్ విశి వర్క్ ఫినిష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకోనేటప్పటికీ వైభవ్ వస్తాడు.  హాయ్ బాబి అంటే.. బాబీ నా... పోనీ వదిన.

హలో మనం ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు ప్రొఫెషనల్ గా మాట్లాడుకోవాలి.  మన వర్క్ అయిపోయిన తర్వాత ఎలా పిలుచుకున్న పర్వాలేదు కదా..

నువ్వు చాలా ఫన్నీగా మాట్లాడతావో తెలుసా? దేవాసార్ ప్రొఫెషనల్ గా మాట్లాడతారు.  మీ ఇద్దరికీ ఎలా రిలేషన్ ఉందో అర్థం కావడం లేదు.


దేవా సార్ నాకు బ్రదర్ లే.. అవునా ఎప్పుడూ చెప్పలేదు. ముందు ముందు ఇంకా తెలుసుకోవాల్సింది ఉందలే బాబి. అదిగో..ఇంకా మన ప్రొఫెషనల్ గా స్టార్ట్ అవ్వలేదు.

నిన్ను చూస్తుంటే మా చిన్నప్పుడు తప్పిపోయిన మా బాబీ లాగా కనిపిస్తున్నావు.  అవునా మీ బాబి తప్పు పోయిందా అని బాధగా అడుగుతుంది.

అవును బాబి చాలా క్యూట్గా చబ్బీ గా ఉండేది. ఎక్కడ తప్పిపోయింది. అన్నవరంలో. అన్నవరంలోనా అని కొంచెం దిగులుగా మాట్లాడుతుంది.

నీకేమైంది బాబి.. ఒక్కసారిగా అలా డల్ అయిపోయావు. అన్నవరం అనగానే నాకు మా నాన్న గుర్తొస్తారు. మా నాన్నగారు ఉన్నన్ని రోజులు నా ప్రతి పుట్టినరోజుకి అన్నవరం తీసుకు వెళ్లేవారు.

ఇప్పుడు మాత్రం ఏమైంది బాబి నేను తీసుకువెళతాను కదా.. సూర్య మాస్క్ తో వస్తాడు.  మీరేంటి సార్ ఇలాగా..  లైట్ గా కోల్డ్ చేసింది.

ఏమిటి మీ ఇద్దరూ డిస్కషన్.  ఆ గౌతమ్ వచ్చినట్టున్నాడు.  ఇంకా 10 మినిట్స్ టైం ఉంది అన్నయ్య..

సోరి సార్ మీ పెయిన్ నాకు  తెలియలేదు.  దేని గురించి.. మీ బాబీ తప్పిపోయారు అంట కదా..  బాబి అని వైభవ్ వైపు చూస్తే వైభవ్ నాలిక కరుచుకుంటాడు.

బాబి నాకు...  మా అన్నయ్యకి మరదలు అవుతుంది అవునా అంటే సరే తర్వాత మాట్లాడుకుందాం ముందు మీరు ఇద్దరు వెళ్లండి అని పంపిస్తాడు.

ఈ బాబీ మరదలు గోల ఎక్కడికి తీసుకు వెళుతుందో ??

కథ కొనసాగుతుంది...
[+] 8 users Like SivaSai's post
Like Reply

Part - 45



విశిష్ట వైభవ్ వెళ్లేసరికి గౌతమ్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇద్దరు క్యాబిన్లోకి రాగానే హాయ్ విశిష్ట.. చాలా లేట్ అయినట్టుంది.

కస్టమర్స్ ని మీట్ అయ్యేటప్పుడు టైం మెయింటైన్ చేయాలనుకుంట..అని సెటైర్ వేస్తాడు. వెంటనే వైభవ్ మీకిచ్చిన టైం స్టార్ట్ అవ్వడానికి ఇంకా టూ మినిట్స్ ఉంది సార్.. ముందే వచ్చి మా టైం వేస్ట్ చేసుకోలేం కదా..

చూడండి మిస్టర్ పిఏ అంటే..  ఐ యాం వైభవ్..  అదేలే ఏదో ఒకటి.  మీరు ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు.  నేను ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నాను.

  మీరు ముందుగా వచ్చి మా కోసం వెయిట్ చేయాలి. అవునా..  సరే మేడం మనం బయలుదేరాదామా..  గౌతమ్ కంగారుగా ఎక్కడికి..

మీరే కదా ముందు వచ్చి వెయిట్ చేయాలి అన్నారు.  సో ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని రేపు పెట్టుకుందాము.  రేపు మీ కన్నా ముందు మేము వస్తాము అప్పుడు సరిపోతుంది కదా...

వైభవ్ చెబుతున్న సమాధానాలకి గౌతమ్ కి ఫ్రస్టేషన్ పీక్ లోకి వెళ్ళిపోతుంది.  కానీ  అవసరం తనది కాబట్టి...
  విశిష్ట నీతో మాట్లాడాలని వచ్చాను.  కూర్చుందామా...

  సరే అని ముగ్గురు కూర్చుంటారు.  వర్క్ నీతో డిస్కస్ చేసేటప్పుడు కూడా పీఏ కావాలా.. తప్పకుండా నాకు వర్క్ మాత్రమే తెలుసు కానీ నా పిఏ కి ఎదుటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసు.

నో డౌట్... విశిష్టని ఎవరో వెనక ఉండి నడిపిస్తున్నారు.. లేకపోతే ఈ మబ్బుకి అంత ధైర్యం కూడానా..  అందులోనూ నాకు ఎదురు చెప్పడమా అని చూస్తూ ఉంటాడు.

వైభవ్ కి గౌతమ్ చూపు చిరాకు వచ్చి హలో సార్ వర్కు గురించి డిస్కస్ చేసుకుంటే మేము బయలుదేరుతాము.. మా టైం వేస్ట్ చేయకండి..

గౌతమ్ ప్రొఫెషనల్ గా మాట్లాడుకుందాం అని స్టార్ట్ చేస్తాడు. విశి చేతులు కట్టుకొని కూర్చుని వింటూ ఉంటుంది.

మాకు రేపు వి.జే. స్. కంపెనీతో మీటింగ్ ఉంది.. ఆర్కిటెక్చర్ తో మాట్లాడాలి అని క్లియర్ గా చెప్పారు. ఈ వర్క్ అంతా  హిమ చేస్తున్నట్టుగా ఎక్స్పోజ్ అయింది. అక్కడ డీల్ చెయ్యాలి.

వైభవ్ కి మ్యాటర్ అర్థమయ్యి చేసుకోండి సార్..  దానికి మా మేడం ఏం చేయాలి.  నువ్వు పిఏవి..  పిఏ లాగా ఉండు.

పూర్తిగా నేను చెప్పిన తర్వాత అప్పుడు మీ మేడం మాట్లాడతారు అని విశి వైపు చూస్తూ... రేపు మేము ఇంకా వర్క్ ఎక్స్పోజ్ చేయాల్సింది ఉంది.

సో నాకు నువ్వు వర్క్ ఇవ్వడంతో పాటు రేపు హిమని గైడ్ చేయాలి.  మీరు అక్కడ మీటింగ్ లో ఉంటే నేనేలా గైడ్ చేస్తాను.

కమాన్ విశి ఏ కాలంలో ఉన్నావు.  ఇప్పుడు టెక్నాలజీ ఎంత హై లెవెల్ లో ఉంది. కొంచెం అర్థమైయేటట్టు చెబుతావా..

ఫోన్ టచ్ లో ఉండు..  పొడ్స్ కనెక్షన్ లో ఉంటుంది. సో అక్కడ వాళ్ళు అడిగేది అన్నీ కూడా నీకు ఇక్కడ అర్థమవుతూ ఉంటాయి కదా...

నువ్వు చెబుతూ ఉంటే హిమ అక్కడ ప్రెసెంట్ చేస్తుంది ఏమంటావు..  అది చీటింగ్ కాదా..  దాన్ని తెలివితేటలు అంటారు. చీటింగ్ అంటే మోసం చేయడం...

సూర్య ఇదంతా ఫోన్లో వింటూనే ఉంటాడు. నేను చెప్పేది నువ్వు సైలెంట్ గా విను వైభవ్ అని ఏం చేయాలో మొత్తం చెబుతాడు.

నా వల్ల అనే లోపు..  మా మేడం ఒప్పుకుంటారు అని టక్కని చెబుతాడు. విశి ఆశ్చర్యంగా వైభవ్ వైపు చూస్తే కళ్లు అర్పుతాడు.
కాకపోతే మొత్తం బిజినెస్ డీల్ అంతా ఈ రోజే మాట్లాడుకుని ప్రైస్ కూడా ఫైనలైజ్ చేసుకుందాము.ఆ మాటకి గౌతమ్ హ్యాపీగా ఫీల్ అయ్యి..

ఎప్పుడు ఇచ్చినట్టుగానే ఇచ్చేస్తాను.. కాకపోతే ఈసారి ముందే ఇస్తాను. ఏమంటారు.. హలో ప్రైసు ఎంత అన్నది మేము డిసైడ్ చేస్తాము.

అది మీకు ఓకే అయితే ఫైనలైజ్ అవుతుంది. ఈ విషయాలన్నీ నేను హ్యాండిల్ చేస్తాను.  మేడం ఎప్పుడూ ఈసార్ మీకు ఎంత అమౌంట్ పే చేస్తున్నారు...

నా వర్క్ అంత సాటిస్ఫాక్షన్ గా లేదు అని అమౌంట్ ఇలా ఇస్తున్నారు అని ఫోన్లో డీటెయిల్స్ చూపిస్తుంది.ది. ఓ మై గాడ్ మీ వర్క్ ని ఇంత చీప్ గా కొట్టేశారా...

ఒకసారి వర్క్ చేసి ఇస్తేనే మినిమం 2 లాక్స్ ఛార్జ్ చేస్తారు...  అలాంటిది మీరు ఒక్కొక్క వర్క్ కి 10000 ఇస్తున్నారా..

సుమారుగా  ఇప్పటిదాకా మీరు మా మేడం కి ఒక ఫిఫ్టీ లాక్స్ అయినా ఇవ్వాలి అనుకుంటా కదా ...
ఆ మాటకి విశి ఆశ్చర్యంగా చూస్తే...  గౌతమ్ కి చెమటలు పడతాయి.  చూడు మిస్టర్ జరిగిపోయిన వర్క్ గురించి ఇప్పుడు డిస్కషన్ అనవసరం.  ప్రజెంట్ జరిగేది మాట్లాడుకుందాం ...

మీరు చెబుతున్నది చాలా పెద్దది. వర్క్ ఇవ్వడంతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం.. ఎట్ ద సేమ్ టైం అక్కడ క్యూస్షన్స్ కి మా మేడం ఆన్సర్ చేయడం..

సో దీనికి అంతటికి అని ఆలోచించి...  టెన్ లాక్స్ పే చేయాల్సిందే.. ఏమిటి అంత అమౌంటా..  చూడు విశి నీ దగ్గరికి వచ్చాను కదా అని ఇష్టం వచ్చినట్టుగా అడిగితే... నీకు ఎవరు వర్క్ ఇవ్వరు.

నో ప్రాబ్లం సార్..  మా మేడంకి వర్క్ ఎలా వస్తుందా అన్నది మా  ప్రాబ్లెమ్.. మీకు ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవ్వడం లేకపోతే లేదు..

ఇందులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏమీ లేదు ఏమంటారు మేడం..  అంతే అని.. సరే గౌతమ్ మేము బయలుదేరుతాము..

ఏ విషయమో డిసైడ్ అయ్యి.. మెసేజ్ పెట్టు వెళదామా వైభవ్ అనగానే..  ఎందుకు విశి అంత కంగారు.. డీల్ మాట్లాడుకునేటప్పుడు ఓపికగా ఉండాలి.

అంత అమౌంట్ ఒకేసారి అంటే నా వల్ల అవ్వదు అని ఎస్కేప్ అవ్వడానికి చూస్తాడు. మా మేడంకి కూడ అంత వర్క్ ఒకేసారి ఇవ్వాలి అన్నా కష్టమే...

ఏంటి విశి నువ్వు మాట్లాడకుండా అంత నీ పి.. ఎ.. నే మాట్లాడుతున్నాడు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు...

నాతో పెట్టుకుంటే నీకే ఇబ్బంది.. మీ మదర్ ట్రీట్మెంట్ కి కూడా నీకు మనీ కావాలి అన్ని ఆలోచించుకో..  చూడు గౌతమ్..మన బిజినెస్ డీల్ మాట్లాడుకుంటున్నప్పుడు బిజినెస్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం.

అంతేగాని ఫ్యామిలీ విషయాలు... పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికి అయితే నీ దగ్గర చాలా టైం ఉండొచ్చు కానీ నా దగ్గర లేదు.

నా టైం వేస్ట్ చేసే పనులు ఏది నేను చెయ్యను అని ఈసారి స్పీడ్ గా లేస్తుంది. వెంటనే గౌతమ్ లేచి హేయ్..కూల్ కూల్ కూర్చో..

సరే ఒప్పుకుంటాను.  అమౌంట్ కూడా ఇప్పుడే క్రెడిట్ చేసేయండి అని వైభవ్ అంటే... నువ్వేంటి ప్రతి దానికి కంగారు పెడుతున్నావు...

లేదు సర్ ప్రొఫెషనల్ గా ఉంటున్నాను.  అలాగే మేము అయితే వర్క్ ఆ టైం కి ప్రొవైడ్ చేస్తాం. మీరు  ఆ టైమ్ కి అక్కడ ఫెయిల్ అయిన ఐ మీన్ మీరు కాంటాక్ట్ లోకి రాకపోయినా.. మీ మీటింగ్ క్యాన్సిల్ అయిన... ఏం జరిగినా మాకు ఎటువంటి సంబంధం లేదు.

మనీ కూడా రిఫండ్ ఇవ్వము. ఇవన్నీ మీకు ఓకే అయితే అగ్రిమెంట్ మీద సైన్ చేసి అమౌంట్ మాకు ట్రాన్స్ఫర్ చేసేయండి.

అదేంటి అలా చెబుతున్నారు. మా వర్క్ అయ్యే వరకు మాతో ఉండాలి కదా..  హలో సార్ మీతో అంత టైం స్పెండ్ చేయడానికి  మాకు కుదరదు.

ఇంకా మిగిలిన ప్రాజెక్ట్ ఉన్నాయి.. మీరు పర్టికులర్గా మీ మీటింగ్ టైం చెప్పండి. ఆ టైం మాత్రమే మీకు ఇస్తాము. అంతేగాని రోజు మొత్తం ఇవ్వాలి లేకపోతే నెలలు ఇవ్వాలి అంటే దానికి సపరేట్గా చార్జ్ ఉంటుంది.  మీకు ఓకే అంటే చెప్పండి...

గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు. విక్రమ్ సార్ టైం ఇచ్చారు అంటే ఆయన టైం ఫాలో అవుతారు.  సో అనవసరంగా వీళ్ళకి ఎగస్ట్రా మని ఇవ్వడం ఎందుకు..

ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చేసాను..  నో ప్రాబ్లం.. మాది టైమ్ అంటే టైమే..  ఏ టైం సార్.. 10:30 టు 11:30 అని చెబుతాడు.

ఓకే..  ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయండి..  అగ్రిమెంట్ ఎందుకు.. ఏమో రేపు మీరు మనీ ఇచ్చాను మాకు కావాల్సినట్టుగా చేయాలి అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు అనుకోండి... మా మేడం అసలే సెన్సిటివ్.. అందుకే ముందు జాగ్రత్త...

మనీ నీ అకౌంట్ కా లేక విశిష్ట అకౌంట్ కా.. మనీ విషయం అంత మా మేడం  హ్యాండిల్ చేస్తారు.. నేను జస్ట్ పి ఎ ని మాత్రమే..

అగ్రిమెంట్ మీద సైన్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాడు.  మాకు ప్రొఫెషనల్ గానే ఉండాలి. రేపు ఏమాత్రం తేడా వచ్చినా అసలు బాగోదు.

మీరు ఇచ్చిన టైం కి మేము కాంటాక్ట్ లోకి వస్తాము. మీరు మిస్ చేస్తే మాకు ఏమీ సంబంధం లేదు అని మేడం వెళదామా..

సరే బాయ్ అని చెప్పి వెళ్ళబోతుంటే విశి అని పిలుస్తాడు...  కాల్ మీ విశిష్ట.. అదే విశిష్ట.. చెప్పండి మిస్టర్ గౌతమ్..

నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి... ప్లీజ్  విశిష్ట ఒక ఫైవ్ మినిట్స్ నాకు టైం ఇవ్వు.. సరే బయట లాన్ లో కూర్చుందాం. పదండి.

లేదు ఇక్కడే మాట్లాడుకుందాం.. సారీ మిస్టర్ గౌతమ్..  తెలియని వాళ్ళతో ఇలా క్యాబిన్లో ఉండడం ఒక అమ్మాయిగా నాకు సేఫ్టీ కాదు.

మీకు అంతగా మాట్లాడాలి అనుకుంటే ఓపెన్ ప్లేస్ లోనే మనిద్దరం సెపరేట్గా నిలబడి మాట్లాడుకుందాం. అది మీకు ఓకే అయితేనే..

సరే నీకు ఎలా కంఫర్ట్ అంటే అలాగే మాట్లాడుకుందాం అని పళ్ళునూరుతూ వెళతాడు.  పరవాలేదు బాబీ...  మీరు బానే హేండిల్ చేస్తున్నారు.

ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను.. పదా వాడు ఏమి సోది చెప్పాలనుకుంటున్నాడో విందాం అని వచ్చి చెప్పండి మిస్టర్ గౌతమ్...

గౌతమ్ ఏం చెప్పబోతున్నాడు.....
[+] 10 users Like SivaSai's post
Like Reply

Part - 46



బాబీ ఒక్క నిమిషం. ఏమిటి వైభవ్... నీ ఫోన్ ఆన్ లో ఉంచవా ప్లీజ్.. ఎందుకు.. నువ్విచ్చే కోటింగ్ ఏంటో నాకు వినాలని ఉంది.

పర్సనల్గా మాట్లాడాలి అంటే దగ్గరలో ఉండలేను కదా.. ప్లీజ్ ప్లీజ్ మెలికలు తిరుగుతూఉంటాడు.

సరే అని ఫోన్ ఆన్ చేసి గౌతమ్ దగ్గరకి వెళుతుంది.
చెప్పండి మిస్టర్ గౌతమ్ ఏం మాట్లాడాలి... ప్లీజ్ విశిష్ట మనం ఒకప్పటి లవర్స్ లాగా మాట్లాడుకుందాం..

ఇంకా ఆపుతావా అని చేతితో చూపిస్తుంది.. ఇక్కడ వైభవ్ ఫోన్ స్పీకర్లు ఉంచుతాడు. మనిద్దరం లవర్స్ మా ఎప్పుడు..  అలా అంటావేంటి విశి ఎంత గాఢంగా ప్రేమించుకున్నాము..

అవునా..  సరే నాకు ఇష్టమైన పువ్వు ఏది అని అడుగుతుంది. ఆ మాటకి తడబడుతూ ఆడవాళ్ళకి ఎక్కువ రోజ్ సే కదా ఇష్టం అని చెప్పి రెడ్ రోజ్ అంటాడు.

రాంగ్ ఆన్సర్.. పోనీ నాకు ఇష్టమైన కలర్...  పింక్.  రాంగ్ ఆన్సర్.. చూసావా ఒక పువ్వు..  రంగులోనే.
నాకేం ఇష్టమో నీకు తెలియదు. అలాంటిది మన ఇద్దరం లవర్స్ అని చెబుతున్నావు.

అవి తెలియనంత మాత్రాన లవర్స్ మీ కాదా...  ఇంకా నీకు లవర్స్ అని నమ్మకం  ఉంది కదా.
  సరే మనిద్దరం కలిసి వెళ్ళిన మొదటి డేట్ ఎప్పుడు.. ఎక్కడ..

ఆ మాటకి గౌతమ్ నీళ్లు నములుతూ ఉంటాడు.  లేదు కదా..  పోనీ నువ్వు కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనిద్దరం పర్సనల్గా కలిసింది ఎప్పుడు ? అది..   లేదు కదా...

ఇప్పటికీ కూడా మనం లవర్స్ అని నీకు అనిపిస్తుందా...
ఐ యాం సారీ విశి..  నేను ఇప్పుడు తెలుసుకుంటాను. నీకు ఇష్టమైన కలర్..  ఫుడ్..

అలాగే డేట్ కి తీసుకువెళ్తాను.  వీకెండ్ పర్సనల్గా మీట్ అవుతాను. ఇంకా ఆపుతావా... అడిగిన తర్వాత చేసేదాన్ని ప్రేమ అనరు. అడగకుండా చేసేదానినే ప్రేమ అంటారు.

ఇన్ని రోజుల్లో నీకు అనిపించినది.. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడేటప్పటికీ ఎందుకనిపిస్తుంది. ప్రతిసారి నువ్వు మా అమ్మ పేరు చెప్పి నన్ను ఎమోషనల్ గా లాక్ చేసి నాతో నీ వర్క్ చేయించుకునే వాడివి.

ఇప్పుడు నా వర్క్ కి ఉన్న వాల్యూ ఏమిటో తెలుసుకుని నేను స్ట్రాంగ్ గా నిలబడేటప్పటికీ కాళ్ళ బేరానికి వస్తున్నావు.

నిజంగా నువ్వు నన్ను ప్రేమించే ఉంటే హిమతో పెళ్లికి ఎంత ఒప్పుకుంటావు. హిమంటే నాకు ఇష్టం లేదు.  పెద్దవాళ్ల ఫోర్స్ కి ఒప్పుకోవాల్సి వచ్చింది.

ఆ మాటకి గట్టిగా నవ్వుతుంది. నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. గౌతమ్ అలాగే చూస్తూ ఉంటే..  సోరి అని కష్టంగా నవ్వు ఆపుకుంటూ..

నేను ఏమన్నా నీ కళ్ళకి ఒక త్రీ ఇయర్స్ బేబీగా కనిపిస్తున్నానా..  ఏది చెప్పినా నమ్మడానికి... స్టాల్ జరిగిన రోజు నువ్వు చెప్పిన ఏ మాట నేను మర్చిపోలేదు.

నా రేంజ్ ఏంటో నా లైఫ్ ఏంటో అన్నది చూపించావు. జస్ట్ నీ వరకు మాత్రమే వర్క్ చేయాలి.. నీకోసమే నేనుండాలి.  కానీ బయట ప్రపంచానికే మాత్రం నీ భార్యగా మాత్రం హిమ ఉండాలి.

  అప్పుడు నన్ను ఏమంటారో తెలుసా.. ఆ పిలుపుకి ఎలాంటి విలువ ఉంటుందో తెలుసా..  నీకు ఒక సిస్టర్ ఉండి.. ఆ అమ్మాయికి కూడా నీలాంటి వాడే ఇలాంటి ఆఫర్ ఇస్తే అర్థమవుతుంది.

ఒకరకంగా నేను నీకు థాంక్స్ చెప్పాలి..  ఎందుకో తెలుసా...  ఆరోజు నువ్వు అలా మాట్లాడకపోయి ఉండి ఉంటే...

నేను అలాగే నీకోసం వర్క్ చేస్తూ నాలో నిజంగానే టాలెంట్ లేదేమో అని అలాగే ఉండిపోయేదాన్ని..

మనిద్దరి మధ్యన అసలు ప్రేమే లేదు.  ప్రేమ ఉండి ఉంటే నువ్వు నన్ను మోసం చేయడానికి చూసేవాడివి కాదు. నువ్వు నాకు దూరం అయితే ఆ పెయిన్ తట్టుకోలేక నేను నరకం చూసేదాన్ని...

బట్ నువ్వు నన్ను మోసం చేశావు అన్న బాధ తప్ప... నిన్ను మిస్ అవుతున్నానే అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు.

అలాంటప్పుడు మన మధ్యన ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది. జస్ట్ ఒక బిజినెస్ డీల్ మాత్రమే..  నువ్వు నాకు మనీ ఆఫర్ చేశావు. దానికి తగ్గట్టుగా నా వర్క్ నీకు ఇస్తూన్నాను.

థట్స్ ఇట్.. ఇంకేమైనా మాట్లాడాలా.. ఇది నువ్వు కాదు.  నువ్వేంటో నాకు తెలుసు కదా నీతో ఎవరో మాట్లాడిస్తున్నారు ...

బిజినెస్ పరంగా దెబ్బతీయ లేక పర్సనల్గా దెబ్బతీయడానికి నిన్ను వాడుకుంటున్నారు.  ఎవరో చెప్పు...   భుజాలు పట్టుకుని కుదిపేస్తూ ఉంటాడు.

మిస్టర్ గౌతమ్ మీరు దూరంగా ఉండండి. ఇలా మిస్ బిహేవ్ చేశారంటే  అరిచి అందరినీ పిలుస్తాను. పిలువు విశి...

నా ప్రియురాలు  నన్ను వద్దని వెళ్ళిపోతుంది.. అందరూ కలిసి నచ్చచెప్పండి అని నేనే చెబుతాను.  నువ్వు చెప్పగానే అందరూ నమ్ముతారు అనుకుంటున్నావా...

పిచ్చి.. విశి..  ఎవరు ఏడుస్తూ మాట్లాడుతారో వాళ్ళది నిజం అనుకునే మాయలోకం..

వీళ్ళ సంభాషణ వింటుంటే..  సూర్యకి కోపం వస్తుంది. అక్కడున్న స్టాప్ కి చెప్పి... అక్కడ ఒక అమ్మాయిని హెరాస్ చేస్తున్నారు..  చూడండి అని పంపిస్తాడు..

స్టాఫ్ వచ్చి.. హలో మిస్టర్ అమ్మాయిని వదలండి..   తను నా లవర్..  కాదు భయ్యా..  ఇతను ఏడిపిస్తున్నాడు. మాకు విశిష్ట గురించి బాగా తెలుసు. మాతో పాటు వర్క్ చేస్తుంది.  మీరు మర్యాదగా వదిలితే మంచిది. లేదు అంటే సెక్యూరిటీ ఆఫీసర్లని పిలుస్తాను.


ఆలోచించుకో.. విశి అని వెళ్ళిపోతాడు. థాంక్స్ భయ్యా... జాగ్రత్త విశి అని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే ముగ్గురు అక్కడికి వస్తారు.  సూర్య మాత్రం చాలా కోపంగా ఉంటాడు.

వాళ్ళ ముగ్గురిని చూడగానే కన్నీళ్లు తుడుచుకుని.. హాయ్ సార్ అంటుంది. సూర్య మాత్రం సీరియస్ గానే  ఉంటాడు.
ఏమైంది.. సార్ అంతా కోపంగా ఉన్నారు. ఏమీ లేదు బాబి.. ఏదో వర్క్ టెన్షన్.. అవునా...  వైభవ్ నీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వు..

  ఎందుకు బాబి..  పంపించు.. సరే అని సెండ్ చేస్తాడు.
వెంటనే అకౌంట్కి 1 లాక్ పంపిస్తుంది. ఎందుకు బాబి ఇంత అమౌంట్ పంపించారు.

ఈరోజు నీ వల్లే నాకు అంత అమౌంట్ వచ్చింది. ఫుల్ అమౌంట్ ఇవ్వలేను కదా.. అందులో టెన్ పర్సెంట్ ఇస్తున్నాను.

ఎవ్రీ టైం నా వర్క్ లో 10% నీకే..  సాలరీ కన్నా ఇదే బాగుంది కదా అని శ్రీకర్ అక్కడ వాతావరణాన్ని తేలిక చేస్తాడు.

సూర్య కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. విశిలో ఉన్న ఆ స్వచ్ఛతే సూర్య ని ఎప్పుడూ లాగుతూ ఉంటుంది.

బాబీ రేపు మరి 10:30 టు 11:30 అంటే...  మరి కాలేజీలో ఉంటావు కదా.. ఎలా.. మాది లాస్ట్ సెం కదా... సెల్ఫ్ వర్క్ ఎక్కువ ఉంటుంది.

సో ఆ టైం మేనేజ్ చేస్తాను. మరి నన్ను ఆలో చేయరు కదా.. నువ్వు హ్యాండిల్ చేసుకుంటావా..  సూర్య వైపు చూస్తుంది.

  నాకు రేపు అర్జెంట్ వర్క్ ఉంది.  లేకపోతే నేను విశికి తోడుగా  ఉండేవాడిని.  శ్రీకర్ నువ్వు హ్యాండిల్ చేయి. వర్క్ అయ్యే వరకు అక్కడే ఉండు..

సరే బావ.  విశి ముగ్గురిని అలాగే చూస్తూ ఉంటే.. ఏమైంది బాబీ అలా చూస్తున్నావు..  ఏమీ లేదు.. మీరెవరో... నేనెవరో...

కానీ పరిచయమైనప్పటి నుంచి మీ ముగ్గురు నన్ను చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు. అది ఏమిటో అన్నది అర్థం కావడం లేదు అలా అని ఈ బంధాన్ని నేను తప్పుపట్టను.

ఎందుకంటే కలిసిన రోజు నుంచి కూడా మీ ముగ్గురు నాతో చాలా స్వచ్ఛంగా ఉన్నారు. థాంక్యూ ..

ఇదిగో బాబి.. థాంక్యూ అని చెప్పి మన మధ్యన దూరాన్ని పెంచకు. చెప్పాను కదా నువ్వు  తప్పిపోయిన మా బాబీ లాగా కనిపిస్తున్నావు.

  శ్రీకర్ వెంటనే... అవును విశి నిన్ను చూస్తుంటే మా చెల్లె గుర్తుకు వస్తుంది. ఏమంటావు బావ అని కన్ను కొడతాడు. సూర్య ఏమి సమాధానం చెప్పాలో తెలియక..

సరే ఇప్పటికే లేట్ అయింది. అమ్మ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు పదా అని చెయ్యి పట్టుకుని తీసుకు వెళ్లిపోతాడు.

చూసావా బావ మనిద్దరం అలా చెబుతూ ఉంటే అన్నయ్యకి ఎంత కోపం వస్తుందో... కానీ బయటపడడం లేదు.

విశి ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు.  బైక్ దిగి బాయ్ సార్ అంటే..  అలాగే చూస్తూ ఉంటాడు. నాతో ఏమైనా చెప్పాలా.. జాగ్రత్త..

అలాంటి ఎదవలు పట్టుకున్నప్పుడు వదులు వదులు అని కాదు...  చేతులు పట్టుకుంటే..  కాళ్లు ఉన్నాయి కదా...
సెంటర్ పాయింట్ లో ఒక కిక్ ఇచ్చామంటే వాడే మూసుకుని కూర్చుంటాడు..

మన చుట్టూ ఆస్తమాను జనం ఉండరు కదా.. అని బైక్ ని రివర్స్ చేసుకుని వెళ్ళిపోతాడు.  వెళ్ళుతున్న సూర్యనే చూస్తూ ఉండిపోతుంది.

ఇంటికి వెళ్లిన సూర్య కి కోపం తగ్గదు. వెళ్లి  షవర్ కింద నిలబడతాడు. ఆ చన్నీళ్లలో తడిసి తడిసి కాసేపటికి శాంతిస్తాడు.

డ్రెస్ చేంజ్ చేసుకుని విక్రమ్ దగ్గరకి వెళతాడు. విక్రమ్ చేస్తున్న వర్క్ ని పక్కన పెట్టి.. ఏమైందిరా అంత డిస్టర్బ్డ్ గా ఉన్నావు..

రేపు నేను ఆఫీస్ కి వస్తాను.. ఏమంటున్నావు రా..  అవును వస్తాను.. నా కోడల్ని వాడు ఏమైనా చేశాడా..  జరిగింది చెబుతాడు.

వాడికి ట్రీట్మెంట్ మామూలుగా ఇవ్వడం లేదు కదా.. మన ఇంటి ఆడవాళ్ళ జోలికి వస్తే ఏం జరుగుతుందో వాడికి రేపు మనం చూపిద్దాము.

నువ్వు ఎవరో తెలిస్తే ప్రాబ్లం కదా..  వాడికి నేను కనిపించను.. కానీ వాడి వెనక ఒక తోక ఉంటుంది కదా దానికి ఇస్తాను..

అర్థమయింది...  రాంగ్ రూట్లో వెళ్ళి గొప్పవాడు అవ్వాలి అనుకున్నా గౌతమ్ కి రేపటి నుంచే కటింగ్ పడుతుందన్నమాట..

ఉంచుకున్నది పోయే...  కట్టుకున్నది పోయే అన్నట్టుగా  ఉంటుంది గౌతమ్ పరిస్థితి..

వైభవ్ సంతోషంగా పెదనాన్న అనుకుంటూ పరిగెత్తుకొస్తాడు. ఏమైందిరా..  నాది ఈ ఒక్కరోజు శాలరీ ఎంతో తెలుసా.. వన్ లాక్ అంటాడు.

అవునా అంత అమౌంట్ ఎలా రా..  బాబీకి ఈరోజు కాంట్రాక్టులో 10 లాక్స్ వచ్చాయి. తను ప్రతి వర్క్ లో నాకు 10% ఇస్తుంది.

చెప్పాను కదా.. నా కొడుకులు టాలెంటెడ్ అని.. కాకపోతే నీలో ఇంకా చిన్నపిల్లాడి లక్షణాలు ఉన్నాయి.  చూస్తూ ఉండు మీ వదినతో కలిసి నువ్వు ఒక టాప్ బిజినెస్ మాన్ అయిపోతావు.

గౌతమ్ రేపటి నీ పరిస్థితి ???

కథ కొనసాగుతుంది...
[+] 11 users Like SivaSai's post
Like Reply

(19-04-2026, 09:25 AM)ash.enigma Wrote:  Weekend late aa Sivagaru?

Noo

10 minutes
[+] 1 user Likes SivaSai's post
Like Reply

Part - 47



వెరీ గుడ్ వైభవ్..  వెళ్లి విషయం మీ అమ్మకు చెప్పు.. సంతోషిస్తుంది. లేదులే పెదనాన్న..  ఏదో ఒక కౌంటర్ వేస్తుంది.

అదే నీకు తెలిసింది. వెళ్లి చెప్పి చూడు...  సరే బాయ్ అని పూజిత దగ్గరికి వెళతాడు. అమ్మ అని పిలిస్తే.. ఏంట్రా ఈ టైంలో వచ్చావు.

తన అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాడు.  వన్ లాక్ అని అయోమయంగా చూస్తూ ఉంటే..  థిస్ ఇస్ మై ఫస్ట్ సాలరీ అంటాడు.

వినయ్ చూస్తున్న ఫైల్ పక్కన పెట్టి ఇంత అమౌంట్ ఎలా వచ్చింది..  మీకు అన్ని అనుమానాలే..  నా కొడుకుకి టాలెంట్ ఉంది వచ్చింది.

కొడుకుని వెనకేసుకురావడం కాదు.. ఎలా వచ్చింది?  షార్ట్ పీరియడ్ లో అంత ఎక్కువ అమౌంట్ అంటే ఆలోచించవా...  ఎలా వచ్చింది రా..

జరిగింది మొత్తం చెబుతాడు. వెరీ గుడ్.. మీ వదినని బాగా ప్రొటెక్ట్ చేస్తున్నావురా..  సీతకి లక్ష్మణుడు లాగా తోడు ఉంటున్నావు అన్నమాట...

ఏమో అవన్నీ నాకు తెలియదు కానీ.. బాబీతో ఉంటే భలే బాగుంటుంది..  చాలా ఇన్నోసెంట్..
అందరూ మంచివాళ్లే తన దృష్టిలో.. ఎలా బ్రతుకుద్దో ఏమిటో అనిపిస్తుంది.  సూర్య ఉండగా ఆ భయం లేదులే...

అమ్మ అని పిలిస్తే.. ఏంట్రా..  నువ్వు హ్యాపీయేనా అని అడుగుతాడు. ఒరేయ్ పిచ్చి సన్నాసి.. నువ్వు ఎంత అమౌంట్ సంపాదించావు అన్నది పెద్ద విషయం కాదు.

బాధ్యతతో ఉన్నావా లేదా అన్నదే నాకు కావాలి. నీకు బాధ్యత తెలిసింది అంటే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు.

నువ్వు  విశి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నావు.. ప్రొటెక్ట్ చేస్తున్నావు. అంతకుమించి నాకు కావాల్సిందేముంటుంది అని చెంప పైన చేయి వేస్తుంది.

తల్లిని హగ్ చేసుకుని థాంక్యూ మా అంటాడు.  సరే వెళ్లి రెస్ట్ తీసుకో..  అలసిపోయినట్టున్నావు.

గౌతమ్ ఇంటికి వెళ్లి విస్కీ తాగుతూ విశి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది... నా చెయ్యి జారిపోతున్నావా..

అలా జరగనివ్వను. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు..  నీ వెనక ఉండి నడిపించేది ఎవరు... ఆజ్ఞాత వ్యక్తిని తొందరగా కనిపెట్టాలి లేకపోతే నాకు చాలా ప్రమాదం.

సూర్యుడు అందరికీ ఒకేలాగా శుభోదయం చెబుతాడు. కొంతమందికి ఉత్సాహంగా.. కొంత మందికి టెన్షన్ గా మొదలవుతుంది.

గౌతమ్ ఆఫీస్ కి బయలుదేరే ముందే వైభవ్ కి మెసేజ్ చేస్తాడు. మాకు గుర్తు ఉంది సార్. మీరు ఆ టైం కల్లా మేడమ్ కి కాల్ చేయండి.. అని మెసేజ్ చేస్తాడు.

హిమకీ కాల్ చేస్తే.. వెయిట్ బేబీ రెడీ అవుతున్నాను. కమాన్ హిమా..   ఇంకా రెడీ అయ్యే దగ్గరే ఉన్నావా.. మనం వెళ్లేదే గ్రేట్ జైసింహ కంపెనీకి..

అలాంటప్పుడు ఎంత గ్రాండ్ లుక్ తో ఉండాలి. ఉండాల్సింది గ్రాండ్ లుక్కుతో కాదు ప్రొఫెషనల్ గా మాట్లాడడం..

డోంట్ వర్రీ ఐ కెన్ హండిల్.  ఇంతకీ ఆ విశిష్ట ని లైన్ లో పెట్టావా.. హ టెన్ లాక్స్ తీసుకుంది.  వాట్ అంత అమౌంట్ ఎందుకిచ్చావు.. నీకు మనీ ఏమన్నా ఫ్రీగా వస్తున్నాయా..

ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు ఆఫీస్ కి వస్తే ఇద్దరం కలిసి డైరెక్ట్ గా వెళదాము.  నో బేబీ ఆఫీస్ కొచ్చి అక్కడికి వెళ్ళేటప్పటికి నాకు టైం సరిపోదు. నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తాను..

సరే నీవు గౌతమ్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ నుంచి డైరెక్ట్ గా వి.జె. స్.. కి వెళతాడు 10 అవుతున్న సరే హిమ జాడ కనిపించదు.

గౌతమ్ కి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది.  ఇంకా రాలేదేంటి ఫోన్లు మీద ఫోన్లు చేస్తూ ఉంటాడు.  రింగ్ అవుతున్న లిఫ్ట్ చేయదు.

ఇంకొక పది నిమిషాలు ఉంది అనగా కారు దిగుతుంది. ఏమిటి  హిమ.. ఇంత లేటుగా వస్తే ఎలాగా..  ఇంకా టెన్ మినిట్స్ టైం ఉంది కదా.. ఎందుకు అంత టెన్షన్ గౌతమ్..

మనం ప్రజెంటేషన్ స్టార్ట్ చేయాల్సిన టైం అది.  ముందుగా వచ్చి అన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా..   చేసుకోవాల్సిందంతా ఆ విశిష్ట..

నేను కాదు..  జస్ట్ నేను యాజ్ టీజ్ గా ప్రజెంటేషన్  ఇస్తాను అంతే కదా...

అది తెలియాలి అన్నా నువ్వు విశి ని కాంటాక్ట్ చేయాలి కదా.. కమాన్ ప్రతి ఒక్కరినే నేను బెగ్ చేయాల్సిన అవసరం లేదు.

అవన్నీ చూసుకోవాల్సిందే నువ్వు పద టైం అవుతుంది.  ఇంతకన్నా మంచి డ్రెస్ లేదా.. ఈ డ్రెస్ కి ఏమైంది.మనం వచ్చింది అఫీషియల్ మీటింగ్ కి..

ఏ బిజినెస్ సూటో.. చుడీదార్  ఆర్ శారీ వేసుకోకుండా.. ఈ స్లీవ్ లెస్ టాప్..  టైట్  జీన్స్ దేనికి.. నా డ్రెస్సింగ్ ఎలా ఉండాలో నేను డిసైడ్ చేసుకుంటాను.  నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు..

ఇంకా ఆర్గ్యు పెరిగితే మొదటికే మోసం వస్తుందని సరే పద.. బేబీ అని.. తన చేతితో గౌతమ్ చేతి  వేళ్ళని లాక్ చేస్తుంది.

హిమ అఫీషియల్ గా ఉండు.. మనం వచ్చింది ఎక్కడికో తెలుసా..  ఇది మన పర్సనల్ క్యాబిన్ కాదు..  ఈరోజు నువ్వు చాలా క్యూట్ గా హ్యాండ్సమ్ గా ఉన్నావు బేబీ..

గౌతమ్ కి ఆ కాంప్లిమెంట్ కి ఎక్కడికో తేలుతూ..  సరే సరే మనం తర్వాత మాట్లాడుకుందాం..  ఏదైనా క్వశ్చన్ చేస్తే తడబడకు అర్థమైందా..

  నో ప్రాబ్లం బేబీ.. నేను చూసుకుంటాను కదా.. ఇద్దరు మీటింగ్ జరిగే ప్లేస్ కి వెళతారు.  వెళ్లేముందే విశికి కాల్ చేసి లైన్లో పెడతారు..

విశి కాలేజ్ ఓపెన్ ప్లేస్ లో కూర్చుంటుంది.  శ్రీకర్ కొంచెం దూరంగా కూర్చుని విశి మీదే ఫోకస్ పెడతాడు.

గౌతమ్ హిమా క్యాబిన్లోనికి వెళ్లగానే  అక్కడున్న అసిస్టెంట్ వాళ్ళు కూర్చోవలసిన ప్లేస్ చూపిస్తాడు. థాంక్యూ అని కూర్చుంటే...

హిమ కాలు మీద కాలేసుకుని.. మీ విక్రమ్ సార్ ఎప్పుడు వస్తారు..  టైం పంచ్వాలిటీ లేదా అనగానే.. గౌతమ్.. హిమ చేయి పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు.  సైలెంట్ గా ఉండు..

కమాన్ బేబీ..  వర్కు ప్రొఫెషనల్ గా ఉండాలి. మనకి ప్రతి మినిట్ క్యాలిక్యులేటడ్ ఏ కదా... ఇది ఫోన్లో వింటున్న విశి అబ్బో అని పెదవి విరుస్తుంది.

అసిస్టెంట్ హిమ వైపు చూసి ఒక నవ్వు నవ్వి మా సార్ వస్తున్నారు.  మీ ప్రజెంటేషన్ అంత రెడీ గానే ఉంది కదా.. మీరు ఏ మాత్రం తడబడిన ఇక్కడతో మీ డీల్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత మీదే బాధ్యత..

అందులో మీరు అనుమాన పడాల్సిన అవసరమే లేదు. నా గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియదు అనుకుంటా..  ఐ యాం  గ్రేట్ వరల్డ్ వైడ్ ఫేమస్ అర్క్ టెక్చర్.

ఈ మధ్యన వర్క్ మొత్తం స్టాల్ కింద కూడా పెట్టాము. మీరు చూడలేదా..  చూసాము.. అది చూసే మీకు ఈ ఆఫర్ ఇచ్చాము.

అసిస్టెంట్ కి మెసేజ్ వస్తుంది.  అది చూసి విక్రమ్ సార్ వస్తున్నారు. బి అలెర్ట్..  నో ప్రాబ్లం అని అంతే పొగరుగా చెబుతుంది.

గౌతమ్ పక్కననుంచి నువ్వు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నావు.  తగ్గించుకో అని స్లోగా చెబుతాడు.

విక్రమ్, శ్రీ లోపలికి వస్తారు.   గుడ్ మార్నింగ్ సార్  అని చెప్పగానే.. గుడ్ మార్నింగ్ ఆనంద్..  మనతో మీటింగ్ అరేంజ్ చేసిన వాళ్ళు వచ్చారా..

ఎస్సార్ మేము వచ్చాము అని గౌతమ్ నిలబడి చెబుతూ షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం ముందుకి చెయ్యి చాపుతాడు విక్రమ్,  శ్రీ ఇద్దరు కూర్చుని కాలు మీద కాలు వేసుకుని చూస్తూ..  అది మన టై అప్ అయిన తర్వాత ఇస్తాము ..

ఇక మీ వర్క్ స్టార్ట్ చేస్తారా.. ఎస్ సార్.. షీ ఇస్ హిమ..  మా కంపెనీలో బెస్ట్ ఆర్కిటెక్చర్.. ఇప్పటివరకు చేసిన వర్క్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ.. ఫర్దర్ వర్క్ కూడా మీకు చూపిస్తాము.

సూర్.. ఏదైనా సరే మీకు ఇచ్చిన టైమ్ లోపే ఫినిష్ అవ్వాలి.. ఆనంద్ అనగానే..  ఎస్సార్ అని.. ఎక్స్క్యూజ్ మీ ఇద్దరి మొబైల్స్ మాకు  ఇవ్వండి.

మీరు వెళ్లే ముందు ఇస్తాము..  వాట్ ఇదేమిటి అని హేమ గట్టిగా మాట్లాడుతుంది. నా ముందు ఎవరైనా వాయిస్ రైస్ చేస్తే నాకు అస్సలు నచ్చదు.

నీ వర్క్ మొత్తం పెన్ డ్రైవ్ లో ఉంది  కదా.. అది అక్కడ మా సిస్టంకి కనెక్ట్ చేస్తే సరిపోతుంది కదా.. ఇక మిగిలిన గాడ్జెట్స్ తో మీకేం పని.

బట్ ఇది మా పర్సనల్.. ఎదుటి వాళ్ల పర్సనల్స్ ని టచ్ చేసే అంత చీప్ మెంటాలిటీ మా కంపెనీలో ఎవరికీ లేదు.  ఇది మీకు నచ్చకపోతే ఇమీడియట్గా ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు..

గౌతమ్ కి చాలా టెన్షన్ వస్తుంది.  ఇప్పుడు ఏమి చేయాలి.. ఫోన్ లేకపోతే హిమ ఎలా చెప్పగలుగుతుంది అని ఫుల్ గా ఏసి ఉన్నా సరే పట్టిన   చెమటలు   తుడుచుకుంటూ ఉంటాడు.

ఏంటి మిస్టర్ మీ ఆర్కిటెక్చర్ కి గాడ్జెట్స్ లేకపోతే చెప్పే టాలెంట్ లేదా.. అంత డిపెండెడా అని  శ్రీ వెటకారంగా అడుగుతాడు..

నో సార్ అలా ఏమీ లేదు. ఒక్కసారిగా మీరు అన్ని  ఇమ్మనేటప్పటికీ అని తడబడుతూ ఉంటే.. మాకు సెల్ఫ్ టాలెంట్ కావాలి.

గూగుల్ సర్చ్ చేసి.. ఎక్సక్ట్రా ఎక్సట్రా యాప్స్ సెట్ చేసి సబ్జెక్టు మాకు వద్దు. మీరు చెప్పగలరా లేదా అది మాత్రమే క్లియర్ గా చెప్పండి..

అసలే మీ అర్క్ టెక్చర్ టాలెంట్ తో ఎగ్జిబిషన్ స్టాల్ ఏవేవో పెట్టినట్టున్నారు.  అలాంటిది ఈమాత్రం కూడా చెప్పలేదా.. సో సాడ్ ..

హిమకి పౌరుషం వచ్చి ఎందుకు చెప్పలేను..  నా టాలెంట్ ని మీరు అనుమానిస్తున్నారు. ఫోన్,  లాప్టాప్ ఇస్తుంది అవి వీళ్ళకి కొంచెం దూరంగా పెడతారు.

పర్వాలేదు దగ్గర్లోనే  ఉన్నాయి.బ్లూటూత్ కనెక్షన్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు అనుకొని పెన్ డ్రైవ్ తీసుకుని వెళ్లి కనెక్ట్ చేస్తోంది.

హిమ టాలెంట్ కి గౌతమ్ సినిమా......
[+] 7 users Like SivaSai's post
Like Reply

Part - 48



పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి బ్లూటూత్ ఆన్ చేస్తుంది. చెప్పండి మిస్ అని విక్రమ్  వాయిస్ గంభీరంగా వస్తుంది. ఒక్క నిమిషం కంగారుపడుతుంది.

అటు పక్క నుంచి.. విశి నేను రెడీ అని చెబుతోంది. ఓకే అని ప్రీవియస్ ప్రాజెక్ట్  ఎక్సప్లయిన్ చేయడం స్టార్ట్ చేస్తుంది.

కంటిన్యూ చేస్తూ ఉంటే.. విక్రమ్ స్టాప్  అనగానే ఏమైంది సార్ అని గౌతమ్ కంగారుగా అడుగుతాడు.. ప్రీవియస్ వర్క్ గురించి అవసరం లేదు.

ప్రెసెంట్ మీరు మాతో కోలాబరేషన్ అవ్వాలనుకున్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి అనగానే.. ఓకే అని హిమవైపు చూస్తాడు. తప్పకుండా సార్.. ప్రెసెంట్ ప్రాజెక్టు గురించే   చెబుతాము అని విశి కి హిట్ ఇస్తుంది..

విశి చెప్పడం స్టార్ట్ చేయగానే..  గౌతమ్ ఫోన్ రింగ్ అవుతుంది.  విక్రమ్ కోపంగా చూస్తాడు. శ్రీ వెంటనే ఇలాంటి మీటింగ్స్ లో ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలి అన్న విషయం కూడా తెలియదా..

ఆనంద్ అనగానే...  ఎస్ ఆర్ అని ఇద్దరు ఫోన్స్ తీసుకుని... గౌతమ్ దగ్గరకు వచ్చి సైలెంట్ లో పెట్టండి అని ఇస్తాడు
దానికి కన్న ఏరోప్లేన్ మోడ్ లో పెట్టండి.  అది అయితే ఇంకా ప్రాబ్లం ఉండదు అనగానే.. సార్ అని గౌతమ్ బిక్క మొహం వేస్తాడు.

ప్లీజ్ కానివ్వండి..  గౌతమ్.. 

సైలెంట్ లో పెడితే సరిపోతుంది కదా సార్..  ఇక్కడ నువ్వు డిసైడ్ చేస్తే మేము వినడం కాదు. మేము డిసైడ్ చేస్తే నువ్వు వినాలి.

క్యారీ ఆన్ అనగానే ఇక తప్పక గౌతమ్ అతి తెలివితేటలు చూపిస్తూ గౌతమ్ ఫోన్ లో ఏరోప్లేన్ మోడ్ లో పెట్టి..  హిమ ఫోన్ సైలెంట్ లో పెట్టి ఇస్తాడు.

హలో మిస్టర్ గౌతమ్ అనగానే చూసుకోలేదు అని ఏరోప్లేన్ మోడ్ లో పెడతాడు రెండు ఫోన్స్ దూరంగా పెట్టగానే విశి చెబుతున్న  వాయిస్ ఏమీ రాక హిమకి ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటుంది.

చెప్పండి మిస్ అనగానే... గౌతమ్ వైపు చూస్తుంది.  గౌతమ్ తల పట్టుకుంటాడు.  అటు పక్కనుంచి విశి ఎంత చెప్పడానికి ట్రై చేస్తున్నా సిగ్నల్స్ దొరకవు.

ఏమయింది వీళ్ళకి సడన్ గా..  నాకెందుకులే...  నాకు ఇచ్చిన టైం వరకు ఆన్లైన్ లో ఉంటాను. తర్వాత వాళ్ళ ఇష్టం..

ఫోన్ ఆన్ లోనే ఉంచి వర్క్ చేసుకుంటూ ఉంటుంది
శ్రీకర్ వచ్చి ఏమైంది.. ఏమో సార్ వాళ్ళు  సడన్ గా రెస్పాండ్ అవ్వడం లేదు.

నాకిచ్చిన టైం వరకు వెయిట్ చేస్తాను. తర్వాత మనకు సంబంధం లేదు..

హిమ  స్క్రీన్ వైపు..  గౌతమ్ వైపు చూస్తూ ఉంటే... ఏంటి మిస్ ఏమీ చెప్పరేంటి... ఇందాక టైం పంచువాలిటీ  గురించి మా ఆనంద్ కేదో చెప్పినట్టున్నారు..  ఇప్పుడేంటి మా టైం వేస్ట్ చేస్తున్నారు.

అది సార్..  ఇంతకీ మీకు తెలుసా లేక మా ముందు.. నో సర్ ఇవంతా నేను డిజైన్ చేసినదే..   మరి ఇంకేంటి నీ వర్క్ మీరు చెప్పలేకపోతున్నారు.

మీలాంటి పెద్ద వాళ్ళని చూసేటప్పటికి కొంచెం నేర్వోస్ గా అనిపిస్తుంది.  ఇంకొక రోజు ప్లాన్ చేసుకుందామా అని భయంగా అడుగుతుంది.

వాట్ మిస్టర్ గౌతమ్..  నీ అర్క్ టెక్చర్ బిహేవియర్ ఇలాగుంది మీరు మాతో కొలాబరేట్ అవ్వడానికి ఎన్ని నెలలు నుంచి ట్రై చేస్తే ఇప్పటికీ మీకు ఛాన్స్ వచ్చింది.

మళ్ళీ అంటే ఏమో చెప్పలేం అని కమాన్.. శ్రీ బయలుదేరదాం..  ప్లీజ్ సార్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము.

హిమ టెన్షన్ పడకు.. స్క్రీన్ మీద చూసి ఎక్స్ప్లెయిన్ చెయ్.. ఓకే ఓకే అని స్క్రీన్ వైపు చూస్తుంది. అక్కడ కనిపిస్తున్న డిజైన్ చూసి హిమకి ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కాదు..

ఏదైతే అది అయ్యింది ఎక్కడో ఒకచోట స్టార్ట్ చేద్దాము అని..  డిజైన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది.  సార్ ఇది మొత్తం ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్.

ఇక్కడ సెల్లార్ పార్కింగ్ వస్తుంది. ఫస్ట్ టూ ఫ్లోర్స్ కమర్షియల్ బ్లాక్స్ సెట్ చేసాము.   పైన రెస్టారెంట్స్.. బెస్ట్ ఎమినిటీస్ తో పాటు పార్టీస్ చేసుకునేటట్టుగా డిజైన్ చేశాము అని చెప్పి ఓకేనా అని గౌతమ్ వైపు చూస్తుంది.

గౌతమ్ కి అర్థమైపోతుంది.  ఈ ప్రాజెక్టు వచ్చినట్టే అని.. ఏమీ మాట్లాడలేక చూస్తాడు. శ్రీ వెంటనే.. టెర్రస్ పైన మాకు స్విమ్మింగ్ పూల్ కూడా కావాలి.

ఇక్కడ అరేంజ్ చేస్తున్నాము  పైన చూపిస్తుంది.  అంత పైకి  వాటర్ ఎలా వెళతాయి అని అడిగితే.. ఏముంది సార్..  డ్రమ్స్ తో  వాటర్ పైకి తీసుకెళ్లి.. ఫిల్ చేస్తారు.

అంతే గౌతమ్ కి ఫ్యూస్ లు ఎగిరిపోయి లోపల నుంచి కాలిపోతున్న వాసన బయటికి కొడుతూ ఉంటుంది. హిమ టాలెంట్ కి.. మిగిలిన వాళ్ళకి వస్తున్న నువ్వునీ కష్టంగా ఆపుకుంటారు.

విక్రమ్..  మిస్ మీరు బాగా టాలెంటెడ్ అనుకుంటా...   విక్రమ్ పొగడగానే ఆకాశంలో తేలిపోతూ ఉంటుంది. ఆ పొగడ్తలో ఉన్న వెటకారం గౌతమ్ కి అర్థమవుతుంది..

మాకు ఈ ప్రాజెక్టులో ఇంకొక బెస్ట్ ఆప్షన్ కూడా కావాలి.  చెప్పండి సార్.. ఏదైనా సరే చిట్టుక్కున చేసేస్తాను. కొంతమంది కస్టమర్స్ కి సెల్లార్లో, ఫస్ట్ ఫ్లోర్ లోను స్విమ్మింగ్ పూల్ కావాలి అంటారు.

వాటర్ తో అక్కడ ఎంజాయ్ చేస్తాము అని..  అప్పుడు ఈ ప్లాన్ లో ఏమైనా మార్పు చేయగలరా..  గౌతమ్ కంగారుగా సార్ మేము ఆలోచించి డిజైన్ చేసి ఇస్తాము..

దీనికి ఆలోచించాల్సిన అవసరం ఏముంది గౌతమ్..  నేను చెబుతాను కదా అని ఈ ప్లేస్ లో పెట్టొచ్చు అని ఒక చోట మార్క్ చేసి చూపిస్తుంది.

అక్కడ ఎలా కుదురుతుంది మిస్.. అక్కడ పిల్లర్స్ ఉన్నాయి కదా.. ఏముంది సార్.. ఈ పిల్లర్స్ తీసి పక్కనపెట్టి ఇక్కడ స్విమ్మింగ్ ఫుల్ సెట్ చేస్తే సరిపోతుంది.

సేమ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలా చేయడమే అనగానే..  గౌతమ్ తల పట్టుకుంటాడు. అయిపోయింది ఈరోజుతో నా కెరియర్ మొత్తం క్లోజ్ అయిపోయింది.

ఈ తింగరిది చెప్పినా విధానానికి విక్రమ్ సార్ కి అర్థమైపోయిఉంటుంది. ఈ ప్రాజెక్టు చేసింది హిమ కాదు అని.. ఇప్పుడు ఆ పాయింట్ అడిగితే నేను ఏం చెప్పాలి.

ఓరి భగవంతుడా...  దీనికి ఎన్నిసార్లు చెప్పాను.. ఏమైనా జరగొచ్చు.. విశి తో ఒక్కసారి ప్రాజెక్టు గురించి మాట్లాడుఅంటే లెక్క చేయలేదు.

బ్యూటీ మీద పెట్టిన ఫోకస్ ప్రాజెక్ట్ మీద పెట్టలేదు...  వాట్ మిస్టర్ గౌతమ్ ఇదేనా మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లనేషన్ అని విక్రమ్ కోపంగా అడుగుతాడు.

అది సార్.. ఈ మిస్ మీ కంపెనీలో చాలా బెస్ట్అర్క్ టెక్చర్ అని చెప్పారు. అంటే మిగిలిన వాళ్ళు వర్కింగ్ ఎంత వరెస్ట్ గా ఉంటుందో..

ఇలాంటి ప్రాజెక్ట్ పుచ్చుకొని మా దగ్గరికి వచ్చారా..  మిస్టర్ ఆనంద్ అనగానే.. చెప్పండి సార్..  స్టాల్స్  ఈ అమ్మాయే కదా పెట్టింది.

బాగా ఎక్స్పోజ్ చేసింది.  అవార్డ్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ బ్లా.. బ్లా..  అని చెప్పారు. పిల్లర్స్ తీస్తే ఏం జరుగుతుందో కూడా తెలియని అమ్మాయికి అవార్డ్స్ ఎలా వచ్చాయి..  సంథింగ్ ఫిషీ..

అసలు ఏం జరిగిందో అన్నది ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి నాకు సబ్మిట్ చేయండి. వీళ్ళు గనక నన్ను చీట్ చేయడానికి ట్రై చేశారని తెలిస్తే మాత్రం..

గౌతమ్ వైపు ఫింగర్ చూపిస్తూ నీ కంపెనీ మీద నువ్వు హోప్స్ వదిలేసుకో...  రోడ్డు మీదకు తీసుకోవచ్చేస్తాను. నాకు మోసం అన్న...  అబద్ధం అన్నా పరమ చిరాకు.

కమాన్ శ్రీ అని విక్రమ్ కోపంగా వెళ్ళిపోతాడు. ఏమైంది గౌతమ్ నేను బాగానే చెప్పాను కదా అని హిమ వస్తే.. అది చెప్పడం అంటారా..

పిల్లర్స్ లేకపోతే బిల్డింగ్ ఏమవుతుంది అన్నది చిన్నపిల్లల కైనా తెలుస్తుంది.. అలాంటిది  నీకు తెలియలేదా..  న్యూ టెక్నాలజీతో కన్స్ట్రక్ట్ చేస్తాము.

టెక్నాలజీని వాడుకోవాలి.   పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ కట్టే టెక్నాలజీ రాలేదు.  వచ్చినప్పుడు నువ్వు సెపరేట్గా కట్టు..

ఈసారి ప్రిపేర్ అయి వద్దాము..  నీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తారని అనుకుంటున్నావా.. ఇన్వెస్టిగేషన్ చేయించమంటున్నారు.

అది చేస్తే కనుక మనం చేసిన ఫ్రాడ్ బయట పడుతుంది.. అప్పుడు మన పరిస్థితి ఏమిటో నీకు అర్థం అవుతుందా.. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశావు కదా..  పిల్లర్స్ లేకపోతే ఏమవుతుంది అన్నది కూడా నీకు తెలియదా..

ఏమో.. నేను ఏ రోజు కాలేజీకి వెళ్లాను.. సర్టిఫికెట్ కొనడమే కదా.. ఫస్ట్ నుంచి నీకు చెబుతున్నాను. ఈ కంపెనీకి వస్తున్నాము అంటే మనం ప్రొఫెషనల్ గా ఉండాలి..

అట్లీస్ట్ మినిమం అయినా తెలుసుకోవాలి అని..  కానీ నువ్వు ఏం చేసావో తెలుసా నన్ను నడిరోడ్డు మీదకు తీసుకువస్తున్నావు.

కమాన్ గౌతమ్.. ప్రతిదాన్ని భూతద్దంలో చూసి నాతో ఆర్గ్యు చేయకు. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. ఈ కంపెనీ లేకపోతే మనకి ఇంకా ఏ కంపెనీలు లేవా ఏమిటి..

విక్రమ్ సార్ తో పెట్టుకుంటే ఏమవుతుందో వెళ్లి మీ నాన్న ని అడుగు అని సీరియస్ గా బయటికి వెళ్లిపోతాడు. హే గౌతమ్ ఆగు నేను వస్తున్నా అని వెనకాలే వెళుతుంది.

కానీ అప్పటికే గౌతమ్ వెళ్ళిపోతాడు. ఛ.. వీడు ఇలా చేసాడు ఏంటి.. నిజంగా నేను అంత పెద్ద మిస్టేక్ చేశానా.. నా టాలెంట్ వీళ్ళకి అర్థం కాలేదా లేక నన్ను రీచ్ అవ్వలేకపోతున్నారా...

నిన్నే రీచ్ అవ్వలేకపోతున్నారు. ఎవరు అని చూస్తుంది.. ఐ యాం సూర్య సన్నాఫ్ విక్రమ్..  సూర్య ని చూడగానే ఫ్లాట్ అయిపోతుంది.

ఆరడుగుల అందగాడు..  షార్ప్ లుక్ తో విక్రమ్ కి ప్రింట్ లాగా కనిపిస్తాడు.  నిన్ను చూస్తూ ఉంటే  విక్రమ్ సార్ కి జిరాక్స్ కాపీ లాగా ఉన్నావు. సో హ్యాండ్సం..

థాంక్యూ మిస్ బ్యూటీ.. ఇలా పబ్లిక్ లో మాట్లాడడం కరెక్ట్ కాదు.. మనిద్దరం  క్యాబిన్ లో కూర్చుని మాట్లాడుకుందాం..

తప్పకుండా సూర్య అని తిప్పుకుంటూ వెళుతుంది..

సూర్య ప్లాన్...

కథ కొనసాగుతుంది......
[+] 8 users Like SivaSai's post
Like Reply

(20-04-2026, 08:41 AM)Reddy 211993 Wrote:  Eagerly waiting for your update

15 minutes
[+] 1 user Likes SivaSai's post
Like Reply

Part - 49



సూర్య క్యాబిన్ లోనికి వెళ్లి కం మిస్..  ఐ యాం హిమ.. నైస్ నేమ్.  మీలాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉంది. థాంక్యూ అని.. హెయిర్ ని చెవి వెనకాలకి పెట్టుకుంటూ  మెలికలు తిరుగుతూ ఉంటుంది.

కూర్చొ.. అలా నిలబడితే ఎలా... కాళ్లు నొప్పులు వస్తాయి కదా..  నీకు లేడీస్ విషయంలో చాలా సాఫ్ట్ కార్నర్ అనుకుంట.. అందరూ విషయంలో ఉండదు. నీలాంటి మోస్ట్ టాలెంటెడ్ విత్ బ్యూటీ  లో మాత్రమే..

జ్యూస్ తెప్పించి తీసుకో అని ఇస్తాడు. థాంక్యూ అని కాలు మీద కాలేసుకుని సిప్ చేస్తూ ఉంటే.. మీ ప్రాజెక్టు ఓకే అయ్యిందా..

మీ డాడీ కి నా వర్క్ సాటిస్ఫాక్షన్ గా లేదు.  అవునా.. ఏది నాకు ఎక్స్ప్లెయిన్ చేయి..  విక్రమ్ వాళ్ళకి చెప్పినట్టుగానే చెబుతుంది.

వాట్ ఏ టాలెంట్.. పిల్లర్స్ లేకుండా కన్స్ట్రక్షన్..ఇలా గనక కన్స్ట్రక్షన్  స్టార్ట్ చేస్తే అసలు వరల్డ్ లోనే ద బెస్ట్ అని నీకు క్యూ కట్టడంలో ఆశ్చర్యమే లేదు.

ఇన్ని రోజులు ఈ టాలెంట్ ని ఎక్కడ పెట్టేశావు అని పొగుడుతూ ఉంటే..  రియల్లీ నీకు నా వర్క్ నచ్చిందా..
నీకు అంత డౌట్ ఎందుకు వచ్చింది.

మరి మీ డాడీ నీకే నచ్చలేదు.  గౌతమ్ కూడా సీరియస్ అయ్యాడు.  కమాన్.. మనం న్యూ జనరేషన్. ఇప్పుడు టెక్నాలజీ తగ్గట్టుగా ఉండాలి. ఇన్నోవేటివ్ గా వెళ్ళినప్పుడే ట్రెండ్స్ సృష్టించగలం.

మే బి గౌతమ్ కి వర్క్ గురించి ఐడియా ఉండి ఉండకపోవచ్చు. టెక్నాలజీ తెలియని వాళ్ళ  కెరియర్ ఎక్కువ రోజులు ఉండదు.

ఏం చేస్తాం చెప్పు.  ఓకే..  మళ్లీ మనం మీట్ అవుదాము.. నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఎప్పుడు కలుద్దాం అని లేచి నిలబడి దగ్గరికి వస్తూ ఉంటే..నీలాంటి బ్యూటీ ని కలవాలి అని నాకు ఉంటుంది కదా..

టైం ఫిక్స్ చేసి నేను మెసేజ్ చేస్తాను..  మరి నెంబర్ ఇవ్వవా..  నీ నెంబర్ నా దగ్గర ఉంటే చాలు కదా అని చూపిస్తాడు.

నాకు తెలియకుండా నా నెంబర్ నీ దగ్గరకి ఎలా ఎక్సైట్మెంట్  అవుతూ ఉంటే...చెప్పాను కదా.. టాలెంటెడ్ విత్ బ్యూటీ ని ఎవరు వదులుకోరు.  టచ్ లో ఉండు బేబీ.. బాయ్ అని వెళ్ళిపోతాడు.

వెళుతున్న సూర్య ని చూస్తూ ఇలాంటి వాడిని గ్రిప్ లో పెట్టుకుంటే నా లైఫ్ తిరిగిపోద్ది.  నాకున్న అందానికి.. ఇమేజ్కి.. ఇలాంటి వాడే సూట్ అవుతాడు. ఆ గౌతమ్  వేస్ట్.. కాకపోతే ఇప్పుడే వాడిని గెంట కూడదు.

కొన్ని రోజుల సూర్యతో  ట్రావెల్ చేసిన తర్వాత అప్పుడు... పక్కన పెట్టాలి. నువ్వు ఎంత లక్కీ హిమ. ఇప్పటివరకు గౌతమ్ ఉపయోగపడ్డాడు..  ఇప్పటినుంచి ఈ సూర్య..

ఈ విషయం వెంటనే డాడీతో షేర్ చేసుకోవాలి అని ఊపుకుంటూ వెళ్ళిపోతుంది..

విశి ఫోన్ పెట్టేసి.. వాళ్ళు లైన్ లోకి రాలేదు.  మీరు టైం వేస్ట్ చేసుకుని నాకోసం ఉన్నందుకు థాంక్యూ.  కమాన్ విశి..  చెప్పాను కదా నిన్ను చూస్తే మా చెల్లె గుర్తుకు వస్తుందని..

ఎప్పుడూ ఇల్లు షిఫ్ట్ అవుతున్నావు.. ఆ విషయం మీకు తెలుసా..  తెలుసు.. నిన్న దేవా చెప్పాడు.  ఓ అవునా.. రేపు వస్తాము.

గుడ్..  అమ్మకి అక్కడ అంతా చాలా బాగుంటుంది. చూస్తూ ఉండు మంచి ఫ్రెండ్స్ కూడా దొరుకుతారు... అంతా దేవా సార్ చేస్తున్న సాయమే..

ఇందులో సాయం అనే పెద్ద పెద్ద మాటలు ఎందుకు.  ఉంది..  చెప్పాడు.. అది నీకు యూస్ అవుతుంది అంతే.  ప్రతిదాన్ని ఎమోషనల్ గా తీసుకోకూడదు విశి..

ఒక్కొక్కసారి మన ఎమోషన్స్ మనల్ని వీక్ చేసేస్తాయి. మీరన్నది నిజమే సార్. కానీ వదల లేకపోతున్నాను.. ఎన్నిసార్లు ట్రై చేస్తున్న మళ్లీ అవే ముందుకి వస్తున్నాయి.

ఈసారి నుంచి ఆ ప్రాబ్లం ఉండదు డోంట్ వర్రీ..
సరే ఇక నేను వెళ్తాను ఏదైనా అవసరం ఉంటే కాల్ చెయ్ అని వెళ్ళిపోతాడు.
విశి అన్ని ప్యాక్ చేసుకుని భవ్య దగ్గరికి వెళుతుంది. అయిందా మీ మీటింగ్ అని వెటకారంగా అడిగితే..   వాళ్ళే ఎందుకో కట్ చేసారు.

అవునా నీకు మాత్రం మనీ సేవ్ అయినాయి కదా... మళ్లీ వస్తే మళ్లీ అమౌంట్ అడుగు..  అవన్నీ కూడా వైభవ్ చూసుకుంటున్నాడు.

మరి మాకు పార్టీ లేదా..  ఎందుకు లేదు. రేపు  షిఫ్ట్ అవుతున్నాము కదా.. నువ్వు రా..  అంతా అయిపోయిన తర్వాత అక్కడే పార్టీ చేసుకుందాం.

ఇంతకీ ప్లేస్ ఎక్కడ... లొకేషన్ చూపిస్తుంది. ఇది కొంచెం కాస్ట్లీ ఏరియా అనుకుంట..  నాకు అదే డౌట్ వచ్చింది. బట్ దేవా సార్ చెప్పడం.. వాళ్ళకి కలిసి పోయి ఉంటే చాలు. రెంట్ తో సంబంధం లేదు అన్నారంట..

నా బడ్జెట్ లోనే వస్తుంది.. అవునా అంత ఫ్రెండ్లీగా ఉండే వాళ్లు కూడా ఉన్నారా అని డౌట్ గా అడుగుతుంది. ఎందుకే అంత డౌటు పడుతున్నావు.

అలా ఏమీ లేదు అంత స్పెసిఫిక్ గా దేవా సార్ నీ విషయంలో ఫోకస్లుగా ఉంటే అనుమానం వస్తుంది. నీ అనుమానాలు అన్ని తీసుకువెళ్లి నీ బ్యాగ్ లో పెట్టుకో.

సార్ చాలా మంచి మనిషి. నా ఇబ్బందులు చూసి ఒక మనిషిగా సాయం చేస్తున్నారు. దానికి నువ్వు తోకలు తగిలించకు అర్థం అయిందా..

నేను తోకలు తగిలిస్తున్నానో లేక తగిలించిన తోక నీకు అర్థం కావడం లేదో చూద్దాం..

సరే నేను రేపు డైరెక్ట్ గా కొత్త ఇంటి దగ్గరికి వచ్చేస్తాను. ఏదైనా అవసరం ఉంటే కాల్ చెయ్. ఫ్లాట్ కి వస్తాను.. అవసరం లేదు..

నేను అమ్మే కదా.. లగేజ్ కూడా పెద్దగా లేదు. క్యాబ్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. స్కూటీ నేర్చుకోవే అంటే అమ్మో భయం అంటావు.

ఇప్పుడు ఎంత యూస్ అయ్యేది.. చూద్దాం అవసరమైతే అప్పుడే నేర్చుకోవచ్చు.. ఎప్పుడో ఒకప్పుడు దేవా సారే నీ భయాన్ని పోగొట్టి నేర్పిస్తారు ఏమో.. ఇంకా ఆపుతావా...

హిమా వెళ్లడం చూసి సూర్య నవ్వుకుంటూ విక్రమ్ దగ్గరకి వెళ్తాడు. ఏరా ఫేస్  వేలిగిపోతుంది. ఆ అమ్మాయి నీ ట్రాప్ లో పడిందా..

ఇలాంటి బ్రెయిన్లెస్ గర్ల్స్ కాస్త పొగిడితే చాలు అలా పడుంటారు.  అదే విశిని నువ్వు పొగిడినా సరే చిన్న స్మైల్ ఇచ్చే ఏదో మీ అభిమానం అని తప్పుకుంటుంది.

అబ్బో మా అమ్మాయి గురించి బాగానే చెబుతున్నావే అని శ్రీ అంటే..  అవును అంకుల్.  రేపు వస్తుంది కదా మీకే అర్థమవుతుంది.

ఇలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో ఉన్నారా అనిపిస్తుంది.. అమ్మని చూస్తే ఎలాంటి ప్లజంట్ ఫీలింగ్ వస్తుందో.. విశి ని చూసిన అలాగే వస్తుంది.

సో ఫ్యూచర్లో కూడా నీకు ప్రాబ్లం లేదు అంటావు. మా బావ మా చెల్లి తో హ్యాపీగా ఉన్నట్టు.. నువ్వు మా అమ్మాయితో ఉంటాను అంటున్నావు అంతే కదా..

మీకు అర్థం అయ్యాక మళ్ళీ ఇంక నేను చెప్పేది ఏముంది... 
ఎంతైనా మీ బాబు కొడుకుల ఇద్దరు అదృష్టవంతులు రా... మీరు మాత్రం కాదా.. నేహా ఆంటీ ఎంత క్యూట్ గా ఉంటారు.  మీరు ఇంకా లవ్ బర్డ్స్ కదా.

అవునా.. నీకు అలా కనిపించిందా.. ఒరేయ్ కళ్ళకు కనపడేవన్నీ నిజాలు కాదురా..  కళ్ళకు కనపడనవి కూడా చూడాలి.  అప్పుడే తెలుస్తుంది.. లవ్ బర్డ్స్ అవునో... కాదో..

అవునా ఒక్కసారి ఆంటీ కి ఫోన్ చేసి అడగనా..  ఎందుకురా ప్రశాంతంగా సాగిపోతున్న నా సంసారంలో చిచ్చుపెట్టడానికి కాకపోతే...

వీడు అలాగే మాట్లాడతాడు గాని నెక్స్ట్ స్టెప్ ఏంటి సూర్య...  వెయిట్ చేద్దాం.. ఆ గౌతమ్ గాడు ప్లాన్ ఏంటో తెలుస్తుంది కదా..

ఈ లోపు ఈ హిమ వెళ్లి వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది. నా నెంబర్ తెలియదు కదా... ఒక 2 డేస్ లో మన ఆఫీస్ ముందు వెయిట్ చేసినా ఆశ్చర్య పడక్కర్లేదు.

నేను వెళతాను అని సూర్య బయటకి వచ్చేస్తాడు.  వీడిని చూస్తుంటే చాలా ప్రౌడ్ గా ఉంది బావ.  దేనికి రా..  నువ్వు అవని విషయంలో నిలబడిందానీ కన్నా వీడు ఇంకా ఎక్కువ నిలబడుతున్నాడు.

మీ మామగారు ఈ మధ్యన ఫోన్ ఏమీ చేయడం లేదా...  మొన్నే మాట్లాడారు.  భువనగిరి వెళ్లిపోయారు కదా ప్రశాంతంగా ఉంది అని చెబుతున్నారు.

ఇక్కడ ఆయన బిజినెస్ కూడా మనమే హ్యాండిల్ చేస్తున్నాము కదా..  సో ఆయన రిలాక్స్డ్ గా ఉన్నారు. మన కంపెనీలో కలిపేయమని చెబుతున్నారు.

బట్ అది కరెక్ట్ కాదు కదా.. ఆయనకి అవని తో పాటు శిల్ప కూడా ఉంది. ఎంత కాదు అనుకున్న ఇద్దరు ఆయన కూతురులే..

రేపు ఏ విషయంలో కూడా వాళ్ళ మధ్యన ఈ ప్రాపర్టీస్ గురించి చీప్ డిస్కషన్ రాకూడదు. నువ్వన్నది నిజమేలే.. ఇంతకీ ఆ శిల్పా ఉదయ్ ఎలాగున్నారు..

హ్మ్..  బాగానే ఉన్నారు.  అక్కడ విలేజ్ లైఫ్ చాలా బాగుంది.  ఊర్లో గౌరవం పేరు పలుకబడి అంతా బానే సంపాదించారు.

దివ్యని కూడా చాలా పద్ధతిగా పెంచుతున్నారు. నాకే ఆశ్చర్యమేస్తుంది.  శిల్పలో ఎంత మార్పు.. కూతురు విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటుందో చూస్తూ ఉంటే ఆశ్చర్యమేస్తుంది..

కొన్ని కొన్ని దెబ్బలు మనుషుల్లో మార్పు తీసుకువస్తాయి.  అది కొంతమంది మంచిగా తీసుకొని ముందుకు వెళితే ఇదిగో శిల్ప ఫ్యామిలీ లాగా హ్యాపీగా ఉంటారు.

లేదు అనుకుంటే.. మీ భార్గవి అత్త లాగ పైకి పోతారు.  ఛీ..  ఛీ..  ఆ మనిషి నాకు అత్తయ్య ఏంట్రా.. ఎంత కాదనుకున్నా.. మీ మామగారి భార్య ఏ కదా..

ఇంకా టాపిక్ వదిలేయ్ రా బాబు.. ఎక్కడికో వెళ్ళిపోతావు..  సరే ఇంటికి వెళ్ళావా.  వెళ్ళాలి. అసలే నా కొడుకు తొందరగా వచ్చి పై పోర్షన్ మొత్తం చూడమన్నాడు.

రెండు రోజుల నుంచి అదే పనిలో ఉన్నాడు. ఒకసారి ఫైనల్ గా చూసి ఏమైనా ఉంటే చెప్పమన్నాడు. అది గనక మిస్ చేశాను అనుకో..  రేపు అమ్మ కొడుకులిద్దరూ కలిసి నన్ను వాయించేస్తారు.

విశిష్ట నూతన గృహప్రవేశం.....
[+] 8 users Like SivaSai's post
Like Reply

Part - 50



హిమ ఎగురుకుంటూ ఇంటికి వెళ్లి డాడ్ డాడ్ అని అరుస్తూ ఉంటుంది.  ఏమైంది బేబీ అంతలా అరుస్తున్నావు అని విస్కీ సిప్ చేస్తూ అడిగితే..  మీకు హ్యాపీ న్యూస్.

చెప్పాను అంటే ఎగిరిగంతులు వేస్తారు.  అవునా అంతా ఏముంది అని రమేష్ అక్కడ సోఫాలో కూర్చొని అడుగుతాడు.

ఈరోజు వి. జె. స్ కంపెనీకి వెళ్లాం కదా.. ప్రాజెక్ట్ ఓకే అయ్యిందా... లేదు డాడీ.. నా ప్రజెంటేషన్ ఆ విక్రమ్ కి నచ్చలేదు.
మరి ఇంకేం హ్యాపీ న్యూస్.  వాళ్ళ అబ్బాయి సూర్య.. నువ్వు కలిసావా అని ఆశ్చర్యంగా అడిగితే... తనే వచ్చి నాతో మాట్లాడాడు తెలుసా అని పొగరుగా హెయిర్ ని వెనక్కి వేసుకుంటూ చెబుతుంది.

ఏమంటున్నావ్ బేబీ..  అవును నా ప్రెసెంటేషన్ ఆ విక్రమ్ కి నచ్చక గౌతమ్ కూడా సీరియస్గా వెళ్ళిపోయాడు..బట్ ఆ సూర్యకి నా ప్రజెంటేషన్ బాగా నచ్చింది.

నాతో కలిసి ట్రావెల్ చేస్తాను అన్నాడు.రేపు ఫ్యూచర్లో ఇన్నోవేటివ్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాడు.. సూర్య నాకు తెగ నచ్చేసాడు అనుకో..

అందానికి అందం. ఆస్తికి ఆస్తి.. పొగరికి పొగరు.. ఎలాగైనా నేను సూర్యని పెళ్లి చేసుకుంటాను.

నువ్వు నిజమే చెబుతున్నావా బేబీ... మీకెందుకు ఆ డౌట్ వచ్చింది.  సూర్య విక్రమ్ కన్నా డేంజర్ అంటారు.  ఇప్పుడు వరకు  విక్రమ్ కొడుకుని  ఎవరు చూడలేదు.

అఫీషియల్ గా ఏ మీటింగ్స్ లో కూడా తను కనిపించలేదు.  అలాంటిది  నీతో మాట్లాడాడు... నీ టాలెంట్ కి ఇంప్రెస్ అయ్యాడు అంటే కొంచెం ఆశ్చర్యమే కదా..

మీ ఉద్దేశం ఏమిటి నాకు టాలెంట్ లేదనా అని కోపంగా అడుగుతుంది. నో బేబీ..  సూర్య నిన్ను కలిశాడు అంటేనే ఆశ్చర్యంగా ఉంది.

నువ్వు అన్నట్టుగానే ఆ ఫ్యామిలీతో రిలేషన్ ఏర్పడితే మన కన్నా లక్కీ పర్సన్స్ ఎవరూ ఉండరు. మన స్టేటస్ ఇంతకీ డబల్ పెరుగుతుంది. డబల్ ఏంటి అది ఊహించిన కూడా ఊహించలేనిది.

మరి ఆ గౌతమ్ ని ఏం చేస్తావు.. వేస్ట్ డాడ్..  వాడికి వర్క్ రాదు. ఎక్స్పోజ్ అవ్వడమూ రాదు.  నిజంగా వాడి దగ్గర అంత టాలెంట్ ఉండి ఉంటే..  ఆ విశిష్ట ని చేయి జారనిచ్చేవాడే కాదు..

అప్పుడే వాడిని పక్కకి గెంటెయ్యకు.  సూర్య నీకు పూర్తిగా కమిట్ అయ్యాడు అన్న నమ్మకం వచ్చిన తర్వాతే..  వాడిని తీసిపాడేయ్ లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఐ నో డాడ్ ..

ఆ గౌతమ్ కి కూడా మన సపోర్టు కావాలి కాబట్టి అంత తొందరగా మన గ్రిప్ లో నుంచి బయటికి వెళ్ళడు.  చూద్దాం..  ఏదేమైనా నీ కూతురు చాలా లక్కీ డాడ్..

అప్పుడు గౌతమ్..  ఇప్పుడు సూర్య... నీ కూతురు వరల్డ్ వైడ్  ఫేమస్ అవుతుంది.

ఇంక మన కంపెనీకి వచ్చే ఇన్వెస్టర్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటారు.  ఆ మాటకి రమేష్ పొగరుగా నవ్వుకుంటూ నా కూతుర్ని అలా పెంచాను.

మరో రోజు ఉదయం ఫ్రెష్ గా మొదలవుతుంది.  విశి తొందరగా లేచి ఫ్రెష్ అయ్యి లగేజ్ అంతా ప్యాక్ చేస్తుంది. భానుమతి కూడా హెల్ప్ చేస్తుంది.

ఈ లోపు సూర్య ఫోన్ చేస్తే చెప్పండి సార్..  అంతా రెడీయేనా అని అడుగుతాడు. అంతా రెడీ సర్.  క్యాబ్ బుక్ చేసుకుని రావడమే.

అవసరం లేదు నేను వస్తున్నాను.  మీ బైక్ మీద ముగ్గురం వెళ్లలేము కదా సార్..  ఏమిటి జోకా..  లేదు సార్.. నిజమే చెబుతున్నాను.

నాకు తెలుసు బైక్ మీద ముగ్గురం వెళ్లలేము అని.. నేను కారు తీసుకొస్తున్నాను.  మీకు కారు ఎక్కడిది సార్..  అన్ని ఫోన్ లోనే చెప్పాలా అక్కడికి వచ్చాక అయినా చెప్పవచ్చా..

వచ్చాక మాట్లాడుకుందాం.. గుడ్ మొత్తం ప్యాక్ చేసి ఉంచారా.. అవ్వకపోయినా పరవాలేదు నేను వచ్చి చేస్తాను.

ఎక్కువ టెన్షన్ తీసుకోకు.  నో ప్రాబ్లం సార్ అయిపోయింది.. సరే అని సూర్య బయలుదేరడానికి రెడీ అయ్యి..  విక్రమ్ దగ్గరికి వెళ్లి నాన్న..

విశి ని ఈరోజు షిఫ్ట్ చేస్తున్నాను.   నా కోడలతో ఈ ఇంట గృహప్రవేశం చేయించకుండా... ఆ ఇంట గృహప్రవేశం చేయిపిస్తున్నావా..

అక్కడ కూతురుగానే కదా..  నో ప్రాబ్లం వెళతాను వెయిట్ చేస్తూ ఉంటుంది..  అవని..  ఒక నిమిషం ఉండరా అని చీర తీసుకొచ్చేస్తుంది. ఇది ఎందుకమ్మా. మన ఇంటికొస్తే  ఇక్కడ ఇచ్చేదాన్ని..

అక్కడికి నేను తీసుకొచ్చి ఇస్తే తెలిసిపోతుంది కదా అందుకే నువ్వే ఇవ్వు..   నేను ఎలా ఇస్తానమ్మా.. ఇందులో ఇబ్బంది పడడానికి ఏముంది.

అమ్మ ఈ చీర ఇచ్చింది. చీర కట్టుకుని కొత్త ఇంట్లో పాలు పొంగించితే మంచిది అని చెప్పు. విశికి సెంటిమెంట్స్ ఎక్కువే కదా..

కాదనదు.  తను ఒప్పుకుంటుందో లేదో కాస్ట్లీ అని ఫీల్ అవుతుందేమో..  అందుకే రా నేను కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకోలేదు. లేకపోతే నాకు కాబోయే కోడలికి తీసుకునే చీర ఏ రేంజ్ లో ఉంటుందో మీ నాన్నని అడుగు.

ఇప్పుడు టైమ్ లేదు..  వచ్చాక క్లియర్గా అడుగుతాను ఇప్పుడు నాకు టైం అవుతుంది..  చీర తీసుకొని బయటకొస్తే వైభవ్ రెడీగా ఉంటాడు.

వెళదామా అన్నయ్య..  నువ్వు ఎక్కడికి రా..  అరే మా బాబి ఇల్లు షిఫ్ట్ అవుతుంటే ఈ లక్ష్మణుడు తోడు లేకుండా ఉంటుందా..

  మేమిద్దరం బిజినెస్ లోనే కాదు ఏ పనిలోనైనా పార్టనర్సమే.. లలిత ఒక్క నిమిషం ఆగిరా అని ప్రసాదం తీసుకొచ్చి ఇస్తుంది.

ఇదేమిటి నానమ్మ..  గుడికి వెళ్లి అమ్మాయి పేరు మీద పూజ చేయిపించాను రా.. పట్టుకువెళ్లి కుంకుమ ఇవ్వు.. అమ్మాయికి అంత మంచే జరుగుతుంది.

ఇవన్నీ పట్టికెళ్తే ఖచ్చితంగా తనకు అనుమానం వస్తుంది. రాకుండా నేను మేనేజ్ చేస్తాను కదా అన్నయ్య.. పద పద ఇప్పటికే బాబీ వెయిట్ చేస్తూ ఉంటుంది.

సౌమ్య వచ్చి ఆల్ ద బెస్ట్ బావ.  తొందరగా అక్కని మన ఇంటికి తీసుకువచ్చేయాలి.  చిన్న స్మైల్ ఇస్తాడు.  చందు కనపడటం లేదు..  రావడం లేదా.

ఎందుకు రావడం లేదు. అది నిన్నే వచ్చి వెళ్ళింది. నువ్వు ఫుల్ బిజీగా ఉండి తెలియడం లేదు .. చందు వైభవ్ నీ బాగా మిస్ అవుతుంది.

నిన్న ఒకటికి పది సార్లు అడిగింది అనుకో...   దేనికి నాతో గొడవ పడడానికా..  నీకు అదే అర్థమవుతుంది. సరే బయలుదేరండి.

లేడీస్ ఎదురు వచ్చి ఆల్ ద బెస్ట్  చెప్పి పంపిస్తారు. సూర్య కార్  తీస్తూఉంటే ఏమిటన్నయ్య బైక్ మానేసి కార్ స్టార్ట్ చేస్తున్నావు.

మీ బాబిని షిఫ్ట్ చేయాలి కదా బైక్ మీద ఎలా కుదురుతుంది.  ఇద్దరకి చెరో బైకు ఉంది కదా.. ఒక బైక్ మీద నువ్వు బాబిని తీసుకురా..

నా బైక్ మీద  ఆంటీ ని తీసుకు వస్తాను. ఆంటీకి కొత్త వాళ్ళతో అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సరే పద మరి కారు ఎక్కడిది అంటే ఏం చెబుతావు.

ఒరేయ్ నువ్వు, విశి క్యూస్షన్ బ్యాంక్ ఏమన్నా మింగేసారా? ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతానే ఉంటారు. ముందుగా ప్రిపేర్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. పద పద ఇప్పటికే లేట్ అయింది.

ఇద్దరూ విశి ఫ్లాట్ కి చేరుకుంటారు.  అప్పటికే విశి రెడీగా ఉంటుంది.  రెడీ నా..  ఎప్పుడో సార్ బయలుదేరాదామా..
లగేజ్ తీస్తూ ఉంటే ఇవి ఇక్కడే ఉంచే ప్యాకర్స్ వస్తున్నారు.

వాళ్ళు తీసుకొస్తారు..  ఎంతో లేదు కదా..  చూడు విశి మేమున్నాం కదా..  ఇద్దరు జెంట్స్ ఉండి కూడా లేడీస్ ఇలా కష్టపడితే బాగోదేమో...

ప్యాకర్స్ వచ్చి లగేజ్ మొత్తం తీసుకువెళ్లి మినీ ట్రక్ లో పెడతారు. అడ్రస్ చెప్పగానే  ట్రక్ వెళ్ళిపోతుంది. ఇంకా మనం బయలుదేరదామా..  సరే అని రా అమ్మ..

మీ నాన్నగారికి ఫోన్ చేసావా అమ్ములు. చేశాను ముందు మనిద్దరిని వెళ్ళమన్నారు.  నాన్నగారు వెనకాల వస్తాను అన్నారు..

అవని ఇచ్చిన చీర ఎలా ఇవ్వాలో అర్థం కాక సూర్య తల పట్టుకుంటాడు. వైభవ్..  నేను ఇచ్చేయనా..   లేదు ఇది నేనే ఇవ్వాలి. ఫస్ట్ గిఫ్ట్..  సరే నువ్వు గనక ఆలస్యం చేస్తే నేనే ఇచ్చేస్తాను.

ఏంటి సార్ ఆలోచిస్తున్నారు.  అది చీర అమ్మ నీకు ఇమ్మంది అని ఇబ్బందిగా చెబుతాడు. చీర నాకెందుకు. అది ఇల్లు షిఫ్ట్ అవుతున్నావు కదా పాలు పొంగించేటప్పుడు చీర కట్టుకుంటే మంచిదంట..

పూజ చేయిపిచ్చి తీసుకువచ్చి ఇచ్చింది.  కట్టుకో అని ఇస్తాడు.  అది అని ఇబ్బంది పడుతూ ఉంటే..  కట్టుకో బాబి మా పెద్దమ్మ చేయి చాలా సెంటిమెంట్. ఏది జరిగిన సరే మా పెద్దమ్మ చేతితో జరగాల్సిందే...

సరే అని కట్టుకొని వస్తుంది. ఎలా ఉన్నాను సార్ అని అడిగితే.. మొదటిసారి  చీరలో   చూడగానే.. సూర్య గుండె లయతప్పుతుంది. అబ్బా చంపేస్తున్నావే..

ముందు మా అమ్మ ని అనాలి. ఈ టైంలో నీతో చీర కట్టించి నా సహనానికి పరీక్ష పెడుతుంది. అన్నయ్య.. మరీ ఎక్కువగా చూడకు. బాబీకి దిష్టి తగులుతుంది..

వైభవ్ వైపు ఒక లుక్ ఇస్తే ఎస్ అని కళ్ళు ఆర్పుతాడు..
బాగున్నావు అని మెరిసే కళ్ళతో కష్టంగా చెబుతాడు. అక్కడే ఉంటే ఏమి జరుగుతుందో అన్న కంగారుతో..
  సరే పదండి ఇప్పటికే లేట్ అవుతుంది అని  నలుగురు కారులో స్టార్ట్ అవుతారు.

కార్ స్టార్ట్ అయిన కొంచెం సేపటికి సార్ అని పిలుస్తుంది.. చెప్పు విశి..  ఒక విషయం అడుగుతాను నిజం చెబుతారా.. నీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా..

అలా అని కాదు. మరి ఎందుకు అంత అనుమానం అడుగు..  మీరు తీసుకు వెళ్ళుతున్న ఆ ప్లేస్ చాలా కాస్ట్లీ ఏరియా కదా..

అవును. మరి మనకు అంత తక్కువ రెంట్ కి ఎలా ఇస్తున్నారు.  చెప్పాను కదా..  వాళ్లకి ఫ్యామిలీ కావాలి. రెంట్ కాదు.

వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి.  ఎంత డబ్బులు ఉన్నా సరే అంత తక్కువకి ఎలా ఇస్తారు. చూశాక నీకే అర్థమవుతుంది కదా..

కార్ ఎక్కడిది సార్ అని ఇంకొక క్వశ్చన్ అడుగుతుంది. సూర్య విశిని చూస్తే..  వైభవ్ వచ్చే నవ్వుని కష్టంగా ఆపుకుంటాడు.

మా ఫ్రెండ్ ది తీసుకోవచ్చాను.  అవునా అడగగానే ఇచ్చాడు అంటే మీకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట..

అది మన బిహేవియర్ మీదే ఉంటుంది.  నువ్వు మంచిగా ఉంటావు కాబట్టే కదా మేమందరం  హెల్ప్ చేస్తున్నాము...

సూర్య విశి తో గృహప్రవేశం.....
[+] 8 users Like SivaSai's post
Like Reply

Part - 51


సార్ అని విశి మళ్ళీ పిలవగానే సడన్ బ్రేక్ వేస్తాడు. ఏమైంది...  ఇల్లు వచ్చేసింది.. అవునా...బాబి అని వైభవ్ పిలుస్తాడు.

చెప్పు వైభవ్..  కుడికాలు ముందు పెట్టి దిగండి..ఇదేమన్నా అత్తారిల్లా కుడికాలు ముందు పెట్టి దిగడానికి...

ఏదైతే ఏమిటి వాతావరణం బాగుంది..  ఇల్లు చూస్తే శుభ సూచకంగా ఉంది..నీకు అంతా మంచే జరగాలి అని ఈ లక్ష్మణుడి బాధ.

అయ్యో ఎందుకు అంత పెద్ద మాటలు... కుడికాలే కదా పెడతాను అని దిగుతుంది. సూర్య వైభవ్ వైపు కోపంగా చూస్తూ ఉంటే.. ఏమైంది అన్నయ్య అలా చూస్తున్నావు.

  ఇప్పుడు నీకు ఇంత డ్రామాటిక్ అవసరమా.. అవసరమే నువ్వు ఎలాగా వదినతో ర్యాంపో పెంచుకోవడం లేదు. నేనైనా పెంచుకుంటే..  ఫ్యూచర్లో  మా ఇద్దరి మధ్యన  స్ట్రాంగ్ కలెక్షన్ ఉంటుంది.  కాబట్టి ఎవ్వరు నన్ను ఏమీ అనలేరు.

ఎలా ఉంది  నా లాజిక్.. నీ మొఖం లాగానే ఉంది. థాంక్యూ అన్నయ్య.. నిన్ను పొగడలేదు కదరా..  నా మొఖం ఎప్పుడూ అందంగా ఉంటుంది.

పెద్దమ్మ చెబుతుంది..  నిన్ను మించిన అందగాడు ఎవరూ లేరు రా అని.. సూర్య తల పట్టుకుంటాడు. విశి, భానుమతి  కార్ దిగి ఇల్లు చూస్తూ ఉంటారు.

అమ్మో ఇల్లు చాలా పెద్దగా ఉంది అని సార్ అని పిలుస్తుంది.  వస్తున్న అని కారు దిగుతాడు. ఏమైంది.. ఇల్లు చాలా పెద్దగా ఉంది.  నిజంగా మనకి తక్కువకి ఎందుకిచ్చుంటారు అని షర్టు పట్టుకుని లాగుతూ అడుగుతుంది.

విశి చేసే పనికి చిన్నగా నవ్వుకుంటూ దగ్గరకు రా చెబుతాను..   చెప్పండి అని జరిగితే..  సీక్రెట్ అంటాడు. సీక్రెట్..  అవును సీక్రెట్ ఎవరికి చెప్పకు అని ముందుకు నడుస్తాడు.

మీరు ఏమీ చెప్పలేదు కదా.. అదే సీక్రెట్. రా.. ఆంటీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు..
లోపలకి వెళ్ళేటప్పుడికి శ్రీకర్ ఎదురు వచ్చి వెల్కమ్ వెల్కమ్ అంటే.. మీరేంటి సార్ ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగితే.. నేను ఇక్కడ పెయింగ్ గెస్ట్ కింద ఉంటున్నాను.. అవునా భలే సర్ప్రైజ్ గా ఉంది.

ఉండు అమ్మ వాళ్ళని పిలుస్తాను అని నాలిక కరుచుకుంటాడు.  అమ్మ అంటే.. అదే ఆంటీ వాళ్ళ అబ్బాయి యూఎస్ లో ఉన్నాడు.

వీళ్ళకి.. వాళ్ళ అబ్బాయిని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అని నేను అమ్మ నాన్న అని పిలుస్తున్నాను అని కవర్ చేస్తాడు.

మీరు చాలా మంచి వాళ్ళు సార్..  నా మంచితనం ఏమిటో నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది.
అమ్మ అని పిలిస్తే నేహా, సురభి వస్తారు.

అమ్మ, నాన్నమ్మ అని పరిచయం చేస్తాడు.  లోపలికి రండి అమ్మ.. అక్కడే ఆగిపోయారేంటి..కుడికాలు ముందు పెట్టు రా తల్లి..

అలాగే ఆంటీ అని వస్తుంది. మీ ఇల్లు చాలా బాగుంది.  ఏమీ చూడకుండానే చెప్పేస్తున్నావు..  అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది.

అలాగే రాగానే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కనిపించింది. బాగున్నట్టే కదా.. నువ్వు అచ్చు మా సూర్యా లాగానే ఆలోచిస్తున్నావు.

సూర్య నా..  సూర్య అంటే ఎవరు మీ అబ్బాయా.. ఏరా సూర్య అంటే ఎవరో తెలియదంటుంది ఏంటి అని సురభి అడిగితే..

సూర్య ఇక్కడ లేడు కదా నానమ్మ ఎలా తెలుస్తుంది.   నువ్వు మమ్మల్ని అందరినీ చూస్తున్నావ్ గానీ.  నా ఫ్రెండ్ దేవాని చూడడం లేదు..  వైభవ్ ని చూడడం లేదు..

దేవ నా.. ఇంకా ఎవరో అనుకున్నాను.  కూర్చోవయ్యా  థాంక్స్ మామ్మగారు..
భానుమతిని పరిచయం చేస్తుంది. ఒకరికొకరు ప్రతి నమస్కారాలు చేసుకున్న తర్వాత.. ఆంటీ టైం అవుతుంది పోర్షన్ లోకి వెళదామా.

అలాగేనమ్మా..ఇప్పుడే వెళదాము ఉండు...పాలు పొంగించడానికి కావాల్సిన అన్ని తీసుకొస్తాను. అయ్యో ఆంటీ అన్ని నేను తెచ్చాను.

అరే ఈ కాలం పిల్లలకి ఇవి కూడా తెలుసా..  మా అమ్మాయికి అన్నీ తెలుసండి. వాళ్ళ నాన్నగారు చిన్నప్పటినుంచి ప్రతిదీ నేర్పించేవారు.

దేని విలువ ఏమిటో చెప్పేవారు..అందుకే ఏ పండక్కి అయినా సరే అమ్మాయి అన్ని పద్ధతిగా చేస్తుంది.  అవునా అయితే మాకు ఇంట్లో ఆడపిల్లలేని లోటు తీరిపోతుందన్నమాట..

శ్రీ, వాసు కూడా వస్తే వాళ్లని కూడా పరిచయం చేస్తారు.. శ్రీకర్ సార్ మీకు ఈ అంకుల్ కి చాలా దగ్గర ఫీచర్స్ ఉన్నాయి.

అవునా... చూసిన వాళ్ళందరూ అలాగే అంటారు అమ్మ..
వీడిని చూస్తే అచ్చు మీ మనవడని చూసినట్టే ఉంది అంటారు. ఏం చేస్తాం చెప్పు వాడు అమెరికాలో కూర్చున్నాడు అని సురభి అంటే..

వెనకాల నిలబడి నమస్కారం చేస్తారు.  సరే పదండి టైం అవుతుంది అని పోర్షన్ లోనికి తీసుకు వెళతారు. ఆంటీ అని పిలిస్తే చెప్పు అని నేహా అడుగుతుంది.

మీరు చూస్తే చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు.  మీ ఇల్లు కూడా మంచి ప్లేస్ లో ఉంది.  మాకు ఎందుకు తక్కువకి ఇస్తున్నారో తెలుసుకోవచ్చా..

సూర్య అది విని ఉఫ్.  అనుకుంటూ ఈ పాయింట్ మాత్రం వదలడం లేదు.  యాక్చువల్ గా మాకు రెంటుకి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ గురించి శ్రీకర్ మొత్తం చెప్పాడు.

అది వినగానే ఒక ఆడపిల్ల తల్లి కోసం ఇంత ఫైట్ చేస్తుంది అని ముచ్చట వేసింది. మా అత్తయ్య మావయ్య గారు ఇద్దరు డాక్టర్స్.

సో ఏ విధంగా చూసినా నీకు ఉపయోగపడుతుంది కదా.. మాకు ఆడపిల్లలు లేరు.  నీలాంటి అమ్మాయిని చూస్తూ ఉంటే ఆడపిల్లలు లేని లోటు తీరుతుంది అని రెంట్ కూడా వద్దు అన్నాము.

కానీ నీకు చాలా అభిమానం ఎక్కువ..  ఫ్రీగా అయితే ఒప్పుకోవు అన్నారని ఏదో నామమాత్రానికి 1000 చెప్పాను అంతే ..
హమ్మయ్య ఇంక మనల్ని  ఈ ప్రశ్న వదిలేస్తుంది రా బాబు అనుకుంటారు.  పైకి వెళ్లి చూసేటప్పటికి ప్లేస్ అంతా కూడా చాలా ప్లసెంట్ గా అనిపిస్తుంది.

ఓపెన్ ప్లేస్ ఎక్కువ వచ్చి మొక్కలు పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చుట్టూ గాలి కూడా బాగా వస్తూ ఉంటుంది..

గుమ్మానికి కూడా పువ్వులు కట్టి ఉంటాయి. ఇవన్నీ మీరే చేశారా..  శ్రీకర్ ఖాళీగానే ఉన్నాడు కదా..  మీరు వచ్చేలోపు చేశాడు.

శ్రీ.. వాసుతో చూసావా నాన్న. మనిద్దరం కూడా చేయ్యి వేసాము కదా.. మనిద్దరినీ పక్కన పెట్టేసి ఒక్క కొడుకు గొప్పలే చెప్పుకుంటుంది చూడు..

ఒరేయ్ గట్టిగా మాట్లాడకు.  ఆ మాట నీ పెళ్ళాం... నా పెళ్ళాం వింటే ఇక మనకి రాత్రికి ఫుడ్ కట్ చేసేస్తారు. ఎందుకు చెప్పు పొగిడింది మనవాడినే కదా అనుకోని సర్దుకుపోవాలి..
ఎలా ఉండే మీరు ఎలా అయిపోయారు.  అనుభవాలు అన్నీ అలాగే నేర్పిస్తాయి లేరా..  ముందు జరిగేది చూడు..
వైభవ్ బాబి అని పిలిస్తే.. చెప్పు.. నువ్వు  దేవుడి ఫోటో పట్టుకుని అమ్మ చేతికి ఇంకో ఫోటో ఇచ్చి కుడికాలు పెట్టి లోపలికి రా..

నేను లోపలి నుంచి ఫొటోస్ తీస్తాను.. ఈ కుడికాలు సెంటిమెంట్ ఏంటి. కారు దిగేటప్పుడు అలాగే అన్నావు.. ఇప్పుడు అలాగే అంటున్నావు..

ఏదైనా నీకు మంచి జరగాలని బాబీ ఈ లక్ష్మణ్...  నాకు అర్థమైంది ఇంకా ఆపేయవా ఆ డైలాగ్ ప్లీజ్..
బాగా అయింది ఎదవకి..  పొద్దున్నుంచి నన్ను చావదొబ్బేస్తున్నాడు అని వెనకనుంచి సూర్యా వెక్కిరిస్తాడు..

భానుమతి చేతికి దేవుడు ఫోటో ఇచ్చి..  విశి వాళ్ళ నాన్నగారి ఫోటో కొట్టుకుంటుంది.  భానుమతి ముందు వెళుతుంది. విశి అడుగుపెట్టే టైంకి సూర్య వచ్చి పక్కన నిలబడతాడు.

ఇద్దరూ కలిసి లోపలికి అడుగుపెడతారు.  వైభవ్ ఫొటోస్ తీస్తాడు...

సూర్యకి గాలిలో తేలిపోతున్న ఫీలింగ్ వస్తుంది.  విశి నే మైమరుపుగా చూస్తూ లోపలికి వెళతాడు.. అది చూసిన శ్రీ ఈ ప్రేమ మాయ ఏమిటో గాని ఎలాంటి వాడినైనా లొంగదీస్తుంది..

అప్పుడు నేను..  ఇప్పుడు వీడు... ఏరా నీ లవ్ మేటర్ ఎంతవరకు వచ్చింది అని కొడుకుని అడిగితే...మా మామగారు ఇండైరెక్టుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

అవునా..  భరత్ ఒప్పుకున్నాడా...పైకి అంత స్ట్రిక్ట్ గా కనిపిస్తాడు. నా కొడుకు లాంటి అల్లుడు రావాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకునిఉండాలి.

ప్రతి అమ్మ ఫీలింగ్ ఇదే అనుకుంటా  కదా నాన్న..  ఒరేయ్ మీ అమ్మ ఇటే చూస్తుంది..  మనం కూడా లోపలికి వెళ్దాం పద అని వెనకాలే వెళతారు.
స్టవ్ పెట్టే ప్లేసులో ముగ్గు వేసి స్టవ్ పెట్టి పాల గిన్నె కి బొట్లు పెడుతుంది. పాలు పొంగించి పాయసం చేస్తుంది..

విశి చేసే ప్రతి పనిని అందరూ శ్రద్ధగా చూస్తూ ఉంటారు..
అచ్చు అవని లాగానే ఉంది కదండీ అని నేహా అంటే.. అవును.  అందుకే సూర్య అంతలా పడిపోయాడు..

దేవుడి దగ్గర పెట్టి..  అందరికీ బౌల్స్ లో పెట్టి ఇస్తుంది.
సారీ సారీ లేట్ అయ్యాను అని భవ్య కంగారుగా వస్తుంది.
లెహంగాలో వచ్చిన భవ్యాని చూసి వైభవ్ నోరు వదిలేస్తాడు.

రా భవ్య.. ఇప్పుడే పాలు పొంగించడం అయ్యింది.. నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది.

వైభవ్ బాబు ఏమిటి నీ పరిస్థితి....
[+] 8 users Like SivaSai's post
Like Reply

Part - 52



విశి భవ్యని అందరికీ పరిచయం చేస్తుంది. కలివిడిగా అందరితో కలిసి కబుర్లు చెబుతున్న భవ్య వైపే వైభవ్ చూపు ఉంటుంది. కళ్ళల్లో మెరుపులు మెరుస్తాయి..

ఇప్పటివరకు ఈ అమ్మాయి మీద  ఫోకస్ పెట్టలేదు కానీ... నా యాక్టివ్ నెస్ కి సరిపోయే జోడి...
బాబీ సైలెంట్ అయితే ఈ భవ్య తుఫానులాగా ఉంది..అప్పుడు ఇల్లంతా సందడే సందడి...

ఎలాగైనా భవ్యతో మాటలు కలపాలి.  ఫ్రెండ్షిప్ స్టార్ చేయాలి ఎలా అని ఆలోచిస్తూ ఉంటే...  విశి  అందరికీ టీ పెట్టి  కప్పులో పోసి తేస్తూ ఉంటే అరే బాబీ... నేను ఇస్తాను కదా.. ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు ఇలాగ ఇవ్వు.

ఆ ట్రే  పట్టికెళ్ళి అందరికీ ఇస్తాడు. భవ్య టి తీసుకో అని మెలికలు తిరిగితూ  ఇస్తాడు. సోరి.. నాకు టీ అలవాటు లేదు.  అవునా అని నా డల్ గా అని..

కాఫీ, జ్యూస్ అంటే..  ఇట్స్ ఓకే ఇప్పుడు ఏమి అవసరం లేదు. శ్రీకర్ డౌటుగా చూస్తూ వీడేంటి భవ్యతో పులిహార కలుపుతున్నాడు... లేక ఇంకేదైనా స్టెప్ తీసుకుంటున్నాడా..

సూర్య నాకు అదే డౌట్ గా ఉంది..  భవ్య వచ్చినప్పుడు వీడి ఫేసులో  రకరకాల ఫీలింగ్స్ కనబడుతున్నాయి..

సరేమ్మ.. మీరు సర్దుకుంటారేమో మేము వెళ్తాము..
ఆంటీ లంచ్ టైం కి మాత్రం ఇక్కడికే వచ్చేసేయండి.. అందరూ ఇక్కడే భోజనాలు చేయాలి.

అది మేము చెప్పాలి.  నువ్వు సర్దుకుంటూ వంట కూడా చేస్తావా..  మేమే చేసి  తీసుకొస్తాము.  లేదు ఆంటీ..  ఎంతసేపు...

ఎక్కువ వెరైటీలు చేయను.  ప్లీజ్ ఫస్ట్ డే కదా.
  నలుగురు భోజనం చేస్తే ఇంటికి మంచిది.  నీకు చాలా సెంటిమెంట్స్ ఎక్కువ అనుకుంటా..

నాన్నగారు చెప్పారు అంటుంది.. సరే నీ సెంటిమెంట్స్  కాదనడం ఎందుకు..  ఇక్కడే మేము వంట చేస్తాము.
మీరు సర్దుకోండి.

అయ్యో మీరు చేస్తే...   చూడు విశి నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే మా అమ్మాయికిందే  లెక్క..  కాబట్టి ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవు.

నువ్వు భవ్య లగేజ్ సర్దుకోండి..  మేము వంట చేసేస్తాము.. మరి మేమేం చేయాలి ఆంటీ అని వైభవ్ అడిగితే..

మీ పని ఏమి లేదు.. కిందకి వెళ్లి కబుర్లు చెప్పుకోండి. నో ఆంటీ.  కిచెన్లో మీకు  హెల్ప్ చేస్తాము.  లేదు అంటే బాబీకి హెల్ప్ చేస్తాను ఏమంటావు భవ్య..

భవ్య వైభవ్ ని పైనుంచి కిందకి చూస్తూ వీడేంటి... వచ్చినప్పుడు నుంచి.. తెగ పులిహార కలుపుతున్నాడు..

అయ్యో వైభవ్ లేడీస్ సర్దుకునే చోట నువ్వు ఏం చేయగలవు చెప్పు.. ఆంటీ వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలేమో చెయ్.

నువ్వు రా విశి అని లో రూమ్ లోకి తీసుకు వెళ్ళిపోతుంది.

ఏరా ఉల్లిపాయలు కట్ చేస్తావా.. మీరే కట్ చేసుకోండి.  నేను కిందకి వెళతాను..  అదేంటిరా ఇప్పటివరకు కిచెన్లో హెల్ప్ చేస్తానన్నావు కదా..

ఏదో మాట వరసకి అంటాము..  మేము అలా అన్నప్పుడు మీరు అయ్యో వద్దులేరా..  మీరు ఎందుకు... ఇంతమంది ఉన్నాం కదా అనాలి..

అంతేగాని ఉల్లిపాయలు కట్ చేస్తావా.. క్యారెట్ పీల్ చేస్తావా అని పనులు పురమాయించుకోకూడదు.

ఎక్కడో బాగా కాలిన వాసన వస్తున్నట్టుంది అని శ్రీకర్ అంటే..  నీ షర్టు కాలింది ఏమో చూసుకో బావ అని కిందకి వెళ్ళిపోతాడు.

వెళుతున్న వైభవ్ ని చూస్తూ అందరిలాగానే భవ్య కూడా అనుకుంటున్నాడెమో...
సర్లే వదిలేయ్.. ఆ టాపిక్.. మనం కూడా వెళ్దాం పద అని జెంట్స్ అందరూ కిందకి వెళ్ళిపోతారు. ఇక్కడ వీళ్ళ సర్దుకోవడం అవుతుంది. వంట అయిపోతుంది.

అందరూ భోజనం చేసి రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడి వాళ్లు అక్కడ సర్దుకుంటారు.  సూర్య.. విశిని పిలిచి రెస్టారెంట్లో వర్క్ కంటిన్యూ చేస్తావా..

అదే అర్థం కావడం లేదు.  మనీ ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి.  అంత హార్డ్ వర్క్ అవసరమా అనిపిస్తుంది. అలాగని నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రాకపోతే పరిస్థితి ఏమిటి అని కూడా భయం వేస్తుంది.

డోంట్ వర్రీ బాబీ, నేను ఉండగా నీకు ఆ ప్రాబ్లం ఉండదు. నువ్వు ఏమంటావు అన్నయ్య..  నువ్వు కాస్త మూసుకో.. ప్రస్తుతానికి  నీ దగ్గర మనీ ఉన్నాయి కదా..

రెస్టారెంట్ లో చేసే వర్క్ టైం లో ఇంటికి వచ్చి నీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి యూస్ చెయ్. శ్రీనివాస్ అంకుల్ ఇంకా కొంచెం ఫోకస్ పెడతానన్నారు.

బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నీ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్న స్కిల్స్ సరిపోతాయి అనుకుంటే ఎదగడం కష్టం.

ఎప్పటికప్పుడు మనల్ని మనం పదును పెట్టుకుంటూ ఉండాలి. అర్థమైందా.. అర్థమయింది సార్..  ఇక్కడి నుంచి  కాలేజ్ కి వెళ్లడం కూడా కొంచెం దూరం కదా..

ఎలా వెళతావు.. అదేంటి సార్ డ్రాప్ చేస్తానన్నారు..  ఇప్పుడు ఎలా వెళ్తావు అని అడుగుతున్నారు ఏంటి అని మనసులో అనుకుంటూ  బస్సు కి వెళ్ళిపోతాను.

ఈ ట్రాఫిక్ లో నువ్వు బస్సులు పట్టుకుని కాలేజీకి వెళ్లి మళ్లీ వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది.. టు వీలర్ నేర్పిస్తాను..  నేర్చుకో..

ఆ మాటకి భవ్య నవ్వుతూ ఏం మాట్లాడుతున్నారు  సార్.. మీరు టు వీలర్ ఇస్తే ఇక్కడి నుంచి కాలేజ్ వరకు తోసుకువెళుతుంది కానీ మా మేడం ఎక్కదు.

చాలా భయం.  విశి కోపంగా చూస్తుంది. నువ్వు కోపంగా చూసినా అదే నిజం. ఎన్నిసార్లు నేను నేర్పించడానికి ట్రై చేసాను.  అసలు ఒక్కసారి అయినా వచ్చావా..

అమ్మో భయం నావల్ల కాదు అనడమే... నో ప్రాబ్లం నేను నేర్పిస్తాను కదా.. విశి రోజు కాలేజీ నుంచి రాగానే డ్రైవింగ్ నేర్చుకోవాలి...

  సా... ర్...  సార్ అని రాగం తీసిన సరే వదిలేది లేదు.  ఫస్ట్ టు వీలర్ నేర్చుకో తర్వాత ఫోర్ వీలర్ నేర్పిస్తాను.
సరే  విశి ఇక నేను బయలుదేరుతాను...వీకెండ్ కదా అందరు వెయిట్ చేస్తూ ఉంటారు. వైభవ్..  నేను డ్రాప్ చేయనా..

థాంక్యూ..  బట్ అవసరం లేదు.  మరి ఎలా వచ్చారు.  నాకు టూవీలర్ వచ్చు..  రానిది దానికి...

సూర్య దగ్గరకు వచ్చి దేవా సార్ మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా..  ఆ మాటకి వైభవ్ గుండెల్లో బాంబు పేలుతుంది.

  గుండె మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటాడు.  వైభవ్ పరిస్థితి చూశి శ్రీకర్ నవ్వుని కష్టంగా ఆపుకుంటూ ఉంటాడు.  నవ్వు ఆపుకోవడం వలన బుగ్గలు పొంగి పక్కకి తిరిగి పోతాడు.

వైభవ్ సూర్య చేతిని గట్టిగా పట్టుకుంటాడు.  ఏమైందిరా...  తల అడ్డంగా ఊపుతాడు.. అలా అడ్డంగా ఊపితే నాకేం అర్థం అవుతుంది. నోటితో చెప్పు.

  అయ్యో అన్నయ్య అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెడతాడు. వీడు ఎప్పుడు ఇంతే.. నువ్వు పిలువు భవ్య. నేను వద్దంటానా..

నాకు ఎలాగు ఓన్ సిస్టర్స్ లేరు.  సో నో ప్రాబ్లం..  థాంక్యూ అన్నయ్య.  మీ బ్రదర్ కదా వైభవ్... వైభవ్ అ..  అనగానే హలో హలో అని ఫోన్ వస్తున్నట్టుగా వెళ్ళిపోతాడు.

శ్రీకర్ ఇంకా ఆగలేక గట్టిగా నవ్వుతాడు. ఎందుకు సార్  అలా నవ్వుతున్నారని విశి అడిగితే.. ఏమీ లేదులే కొన్ని కొన్ని చెప్పలేము.  

భవ్య బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. సూర్యకి వెళ్ళాలని ఉండదు కానీ ఇంకా ఎక్కువ సేపు ఉండడానికి అవకాశం లేక..

సరే విశి నేను వెళతాను.  ఏదైనా అవసరం ఉంటే వెంటనే ఒక ఫోన్ చెయ్యి.  అర్జెంట్ అనుకుంటే శ్రీకర్ కిందే ఉంటాడు. పిలువు అర్థమైందా.. ఒక్కదానివే బయటికి ఎక్కడికి వెళ్ళకు.

అలాగే సార్..  నాకు ఏమైనా చెప్పాలా ఒక్క నిమిషం అని కిచెన్ లోకి వెళ్లి బాక్స్ తీసుకువచ్చి ఇస్తుంది. ఏమిటది.. అదే ఇప్పుడు చేసిన స్వీట్. ఆంటీ వాళ్ళకి తీసుకువెళ్ళండి.

సరే అనే ఆ బాక్స్ తీసుకుని బాయ్ చెప్పి...  వైభవ్ అని పిలిస్తే..  వస్తున్న అని నీరసంగా వస్తాడు. అదేంటి వైభవ్ ఇప్పుడు దాకా మంచి యాక్టీవ్ గా ఉన్నావు.

అంతలోనే  డల్ అయిపోయావు.  ఏమైంది అని విశి కంగారుగా అడిగితే..  పిల్లగాలి పైత్యం చేసిందిలే..  అర్థం కాలేదు సార్..

వాడికి అర్థమైందిలే కానీ మీరు వెళ్ళండి బావ..  విశికి ఏదైనా అవసరమైతే నేను చూసుకుంటాను అని పంపిస్తాడు.

స్టార్ట్ అయిన తర్వాత కారులో డల్లగా కూర్చున్న వైభవ్ ని చూసి ఏమైందిరా అంత డల్ అయ్యావు..  నీతో మాట్లాడను అన్నయ్య.

ఇప్పుడు నేనేం చేశాను రా..  ఎన్నిసార్లు సైగ చేశాను.. అయినా అర్థంచేసుకోకుండా..  పిలువు..  నో ప్రాబ్లం అని చెబుతావా..

ఇప్పుడు నీకేమైంది రా..  నన్ను అన్నయ్య అని పిలుస్తే...  అక్కడతో ఆగకుండా నన్ను కూడా అన్నయ్య వరుసలోకి కలిపేయడానికి ట్రై చేసింది.  నేను ఎంత హర్ట్ అయ్యానో నీకేం తెలుసు...

ఇప్పుడు పిలిస్తే ఏమైందిరా.. ఇది మరీ బాగుంది.. నిన్ను బాబి...  అన్నయ్య అని పిలిస్తే ఎంత చండాలంగా ఉంటుంది.

మా ఇద్దరిదీ వేరు..  ఇది కూడా అంతే అని మెలికలు తిరుగుతాడు.  ఒరేయ్ నువ్వు సిగ్గుపడకురా... సిగ్గు కూడా సిగ్గుపడి పారిపోతుంది.  మనకు సూట్ అయ్యే పనులు మాత్రమే చేయాలి..

ఎందుకో అన్నయ్య భవ్య మొదటి చూపులోనే నచ్చేసింది. అందర్నీ ఫ్లట్ చేసినట్టుగా భవ్యాని కూడా చేయాలి అనుకుంటున్నావా..

నో... నో.. అందరూ వేరు.. భవ్య వేరు..  తనని చూడగానే నా కళ్ళు ఫ్లేడ్లైట్ లాగా వెలిగిపోయాయి.

ఎప్పటినుంచో చూస్తున్న నా పార్ట్నర్ లాగా అనిపించింది. నీది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే.. నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు అన్నయ్య. కొన్ని కొన్ని అలాగే తెలిసిపోతాయి.

సరే..  ఇప్పుడు ఏమి మాట్లాడుకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నీ గుండె పైన చెయ్యి వేసుకుని ఆలోచించు..
ఎవరు కనిపిస్తున్నారో చూసి చెప్పు.  సరే అని కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటాడు.

  భవ్య కనిపిస్తుంది. పొద్దుటి నుంచి చూసిన ఆ లెహంగాలోనే చెంగుచెంగున పరిగెత్తుకుంటూ  దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆ రూపం దగ్గరికి వచ్చే కొలది మారిపోతూ ఉంటుంది..

మారిన రూపం కనిపించగానే నో అని గట్టిగా అరుస్తాడు. సూర్య సడన్ బ్రేక్ వేసి ఏమైంది రా..

వైభవ్ సమాధానం...

కథ కొనసాగుతుంది........
[+] 9 users Like SivaSai's post
Like Reply

Part - 53



నో అని గట్టిగా అరుస్తాడు.  సూర్య సడన్ బ్రేక్ వేసి ఏమైందిరా.. ఎందుకు అలా అరిచావు... అలాగే షాక్ లో   ఉండిపోతాడు.

ఒరేయ్ వైభవ్..  నిన్నే అడిగేది.. దీనికి నేనొప్పుకోను ఒప్పుకోను అని అరుస్తూ ఉంటాడు.  చెంప మీద  ఒక్కటి పీకుతాడు..

వైభవ్ చెంప మీద చెయ్యి వేసుకుని ఎందుకు కొట్టావు అన్నయ్య... అసలు ఒప్పుకోను ఒప్పుకోను అని అరుస్తున్నావు.  ఇప్పుడు నిన్ను ఒప్పుకోమని ఎవరు మాట్లాడారు.

ఏమైందిరా..  నువ్వు చెప్పిన కాన్సెప్ట్ రాంగ్ కాన్సెప్ట్..దేని గురించి...అదే గుండె పైన చెయ్యి వేసుకుని వినమన్నావు కదా..

వింటే రాంగ్ ఆన్సర్ వచ్చింది.  సరిగ్గా చెప్పు చావు..  కళ్ళు మూసుకుని గుండెపైన చెయ్యవేసుకుని చూశాను.  ముందు భవ్య లేడి పిల్లలాగా పరిగెత్తుకుంటూ వచ్చింది.  దగ్గరికి వస్తున్నా కొలది అని సూర్య వైపు చూస్తాడు.

హ..  వస్తున్నకొలది  ఆ రూపం మారిపోయింది.. మారిపోవడమేంట్రా తిక్క సన్నాసి. ఏం మాట్లాడుతున్నావు.

అవును..  మారిపోయి చందులాగా కనిపించింది అని బేర్ మంటాడు. సూర్య తల కొట్టుకుంటూ మేము ముందు నుంచి చెప్పేది అదే..  నీకు తెలియకుండానే  చందుతో ప్రేమలో ఉన్నావు.

మధ్యలో  వచ్చినవి అన్ని ఫ్లయింగ్ క్లౌడ్స్ లాంటివి. నేనొప్పుకోను అన్నయ్య.. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం.

ఈరోజు నుంచి నేను చందుతో అస్సలు కాంటాక్ట్ లో ఉండను. దానితో మాట్లాడను.. చూడను... అప్పుడు ఎలా లవ్లో పడతాను. దాన్ని కూడా అట్రాక్షన్ అని తేల్చేస్తాను.. చూద్దాం అని సూర్య కార్ స్టార్ చేస్తాడు.

ఇద్దరూ ఇంటికి చేరుకునేటప్పటికి రాజ్ ఫ్యామిలీ అక్కడే ఉంటుంది. సూర్య వైభవ్ వైపు చూస్తే.. నేను ఏమి చూడడం లేదు. నాకు ఎవ్వరూ కనపడటం లేదు అని రూమ్ కి వెళుతూ ఉంటే..

వైభవ్ అని నివి పిలుస్తుంది. చెప్పు అత్తయ్య అని ఎవరిని చూడకుండా వచ్చి నివి పక్కన కూర్చుంటాడు.  ఏంట్రా తల అలా కిందకి వాల్చేసావు.

ఒంట్లో బాగోలేదా అని తలపైన మెడ పైన చెయ్యి పెట్టి చూస్తుంది.  బాగానే ఉన్నాను..  ఎందుకు పిలిచావు.. ఏదైనా పని ఉందా..

మీ అత్తయ్యకి ఏ పని లేకపోతే నిన్ను పిలవదా అని రాజ్ అడిగితే..  నేను అలా అనలేదు మావయ్య. రూమ్ కి వెళుతున్న వాడిని పనిగట్టుకుని పిలిచింది అంటే పని ఉందేమో అని అడిగాను.

మీరు దానికి లేనిపోని తోకలు తగిలించి.. నాకు అత్తయ్యకి  గొడవలు పెట్టకండి. అలా చెప్పరా మీ మావయ్యకి.. లేకపోతే ప్రతిదానికి వెటకారాలే..

సూర్య మొఖం వెలుగుతుంది.  నీ మొఖం వాడిపోయింది  ఏమిటి..  చందు వైభవ్ వైపు చూస్తుంది. నిజంగానే.. చాలా డల్ గా కనిపిస్తాడు.

ఏమైంది వీడికి.. ఎప్పుడు పళ్ళు అన్ని బయట పెడతాడు.. ఇప్పుడు మాత్రం ఏదో మిస్ అయ్యినట్టుగా ఉన్నాడు.. చందు మనసు ఆగక..

ఏమైందిరా.. ఆలా ఉన్నావు... ఎలా ఉన్నాను... ఏదో నువ్వు కోరుకున్నది నీ దగ్గరకి రాకుండా..  నువ్వు వద్దనుకున్నది నీ దగ్గరకి వస్తుంది అన్న విషాదంలో ఉన్నట్టున్నావు..

చందు చెప్పిన దానికి వైభవ్ కి ఫ్యూస్ లు ఎగిరిపోయి షాక్ కొట్టిన కాకిలాగా చందు వైఫై చూస్తూ ఉంటాడు. ఏంట్రా అలా చూస్తున్నావు.

దీనికి  మనసులో ఫీలింగ్స్ తెలుసుకునే టెక్నిక్ ఏమైనా తెలుసా లేకపోతే ఒక రాయి వేసిందా...

భవ్య రూపం కనుమరుగై.. చందు రూపం కనపడింది.. అన్నయ్య ఏమో నా ప్రేమ గమ్యం చందు అంటున్నాడు. నా మనసేమో ఒప్పుకోవడం లేదు.  ఇదేమో నా మనసును చదివేస్తుంది. హౌ...

ఏంట్రా అలా చూస్తున్నావు. ఏమీ లేదు. ఫ్రెష్ అయ్యి  వస్తాను. రూమ్ లోకి వెళతాడు.  వైభవ్ లో కనిపిస్తున్న కన్ఫ్యూషన్ ని సూర్య గమనిస్తూ ఉంటారు..

గదిలోకి వెళ్లిన వైభవ్ బాల్కనీలోకి వెళ్లి టెన్షన్ గా పాకెట్స్ లో చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు..

వైభవ్ చెవుల్లో చందు స్వరం మెల్లగా వినిపిస్తూ ఉంటుంది..
మనసు దాచుకోవచ్చు రా… కానీ ఆ దాచుకున్న మనసే మనల్ని బయటపెడుతుంది.

నువ్వు కోరుకున్నది దూరంగా కనిపిస్తుంది…
కానీ నీ గమ్యం నువ్వు ఊహించని దగ్గర ఉంది.

ఒక్క క్షణం…
గది లోపల చల్లని గాలి వీచినట్టు, వైభవ్ వెన్నులో వణుకు పరిగెత్తింది.
అతని కళ్ళలో భవ్య ముఖం ఒక క్షణం మెరిసి మాయమై, మళ్లీ చందు రూపం స్పష్టంగా కనబడింది.

చందూ… నువ్వు ఇది ఎందుకు చెబుతున్నావు... నేను ఫీల్ అవుతున్నది నీకు ఎలా తెలుసు..
వైభవ్ స్వరం వణికిపోయింది.

చందు మాత్రం సడలకుండా, కళ్ళల్లోకి సూటిగా చూస్తూ..
ఎందుకంటే నువ్వు అనుకుంటున్నది నేను వినకపోయినా,
నీ మనసు మాత్రం గట్టిగా చెబుతుంది అది నేను మాత్రమే వినగలను .

నువ్వు ఎవరి కోసం ఎదురుచూస్తున్నావో నాకు తెలుసు…
నీ గమ్యం ఎక్కడుందో కూడా.
నా గమ్యం నీకు తెలుసా..

వైభవ్ ఆశ్చర్యంతో వెనక్కి ఒక అడుగు వేసాడు.
తెలుసు అనే కదా చెబుతున్నాను..
అదే … ఎలా తెలుసుకున్నావ్?

చందు చిన్నగా నవ్వి..
నువ్వు ఆలోచించని చోటే సమాధానం ఉంటుంది రా…
ఇప్పటివరకు నువ్వు తప్పుగా చూస్తున్నావ్ అనుకో.
నేనేమీ తప్పుగా చూడలేదు. పోని మనసుపెట్టి ఆలోచించలేదు అనుకో...

వైభవ్ గుండె గట్టిగా కొట్టుకుంటూ..
ఇది నిజంగా చందు నా?
లేక నా మనసే ఇలా ఆటలాడుతుందా?
అని లోలోపల ప్రశ్నించుకుంటూ చందు వైపు చూశాడు.

అక్కడ ఎవ్వరూ లేరు.  అంటే.. ఇప్పటివరకు చందు నా ఎదురుగా నిలబడి మాట్లాడినట్టుగా అనిపించింది..

ఆ.. అని గట్టిగా అరుస్తూ జుట్టు పీక్కుంటాడు.  లేదు ఇదంతా అబద్ధం. చందు నా మనసులో లేదు.  వీళ్ళందరూ అస్తమానం అలా చెప్పడం వల్ల నాకు అలా అనిపిస్తుంది అంతే ...

ఒరేయ్ వైభవ్ నువ్వు టెంప్ట్ అవ్వకు..  ఇదంతా భ్రమ అంతే...  ఫ్రెష్ అయ్యి వెళతాడు.  ఈసారి తేటగా ఉన్న మొఖం చూసి ఏదో కంక్లూషన్ లోకి వచ్చినట్టు ఉన్నావు అని చందు అడిగితే..  అవును.

ఇంతకీ అత్తయ్య దేనికి పిలిచావు..  ఇప్పుడు ప్రశాంతంగా కనబడుతున్నావు. టెన్షన్ తీరిందా.. మనకి టెన్షన్స్ ఏముంటాయి..

ఒక్క నిమిషం.. నివి బ్యాగ్ లో నుంచి కుంకుమ, తాడు తీసి..  వైభవ్ నుదుటన బొట్టు... పెట్టి.. తాడు చేతికి కడుతుంది.

ఇదేమిటి అత్తయ్య..  నువ్వు జాబ్ లో జాయిన్ అయ్యావు కదా..  అది కూడా విశి దగ్గర.. సో నువ్వు బాగుంటే  విశి కూడా బాగుంటుంది.

మీరిద్దరూ బాగుండాలి అని  తీసుకువచ్చాము.  గుడికి మావయ్య కూడా వచ్చారా.. మీ మావయ్యకి అంత ఖాళీ ఎక్కడ ఉంది.

నేను చందు వెళ్లాము. నీ గురించి దండం పెట్టుకొని... 108 ప్రదక్షిణాలు  చేసి తెచ్చింది. వై భవ్ చందు వంక చూస్తాడు...
చందు మాత్రం సౌమ్యతో కబుర్లు చెబుతూ ఉంటుంది..ఇది నా గురించి నిజంగానే పూజ చేసిందా.. ఎందుకని.. ఎప్పుడు చూసినా నాతో గొడవ పడుతూ ఉంటుంది కదా.. నాపైన అంత కన్సోల్ ఎందుకు..  ఒకవేళ బాబీ  గురించి చేసి ఉంటుందా..

బాబీ గురించి అయితే బాబీకి ఇమ్మని చెబుతారు గాని నాకు ఎందుకు ఇచ్చారు. బాబోయ్ ఎక్కువ ఆలోచించకూడదు. ఆలోచిస్తే నా జుట్టు నేనే పీక్కునేటట్టు ఉన్నాను..

ఈ టాపిక్ నుంచి డైవర్ట్ అవ్వాలి..  థాంక్యూ అత్తయ్య సైడ్ హాగ్ ఇచ్చి..  అమ్మ ఆకలేస్తుంది మాకు ఏమైనా ఫుడ్ పెట్టేది.. ఉందా..

  అక్కడ బానే మేసావు కదరా..  అంతలోనే ఆకలేస్తుందా అని సూర్య అంటాడు.  నీకే..  నువ్వు కబుర్లు చెబుతూ ఉన్నావు.  మేము చాలా పనులు చేశాము..

అవునవును నేను చూస్తూనే ఉన్నాను కదా.. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులే అన్నయ్య..  అమ్మ..  ఇదిగో అని బాక్స్ ఇస్తాడు.

ఏంట్రా..  విశి నీకిమ్మని చెప్పింది. స్వీట్ తనే చేసింది... అవునా.. కోడలి చేతి మొదటి స్వీట్.  అందరికీ పెడతాను అని స్పూన్ తో అందరికీ పెడుతుంది.

ప్రసాదంలాగా పెట్టావు పెద్దమ్మ..  మన ఇంటిలో ఇంతమంది ఉన్న విషయం విశికి తెలిసి ఉండకపోవచ్చు..  లేకపోతె ఇంక ఎక్కువే ఇచ్చేది.

అది మాత్రం నిజం పెద్దమ్మ.. బాబీ కూడా ఇద్దరికీ చెయ్యాలి అంటే నలుగురికి సరిపడా ఫుడ్ రెడీ చేస్తుంది. ఇంత ఎందుకు అంటే..

తినాలి అనుకుంటే.. లేకపోతే ఏదైనా ఒక ఐటెం బాగా ఇష్టపడితే అది కావాలి అనుకుంటే.. అది లేకపోతే నాకేదోలాగా ఉంటుంది.

ఫుడ్డు మిగిలితే ఎవరికైనా ఇవ్వచ్చు కానీ అలా తుడిచి పెట్టలేను అని చెబుతుంది.

ఊరిలో పెరుగు వచ్చిన అమ్మాయి కదా... కొన్ని ఫాలో అవుతారులే..

గౌతమ్ ఇంటికి వచ్చి ఒక ఫుల్ బాటిల్ తాగుతూ.. విశి గురించి.. హిమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు.  అనవసరంగా విశి ని దూరం చేసుకున్నానా..

ఈ హిమ ఏదో పొడిచేస్తుంది అనుకుంటే.. ఈరోజు ఫుల్లుగా డామేజ్ చేసి పెట్టింది . రెడీ అయి ఉన్న ప్రాజెక్ట్ ని ఒకసారి చెక్ చెయ్ అంటే అంత అవసరం లేదు అని బిల్డప్ ఇచ్చింది.

విశి కి నేను ప్రయారిటీ ఇచ్చి తీసుకువెళ్లి ఉంటే..ఈపాటికి నాకు ప్రాజెక్ట్ ఓకే అయ్యేది.

హిమ ఫాదర్ వల్ల నాకు బెనిఫిట్స్ ఉంటాయి..  అనుకుంటే  వాళ్ళు నన్ను వాడుతున్నట్టు ఉన్నారు. నా వలన పాపులర్ అయ్యింది కానీ నాకు ఉపయోగపడింది ఏమి లేదు.

వీళ్ళని అవాయిడ్ చేసి..  విశిని దారిలోకి తెచ్చుకోవాలా.. ఒకవేళ అలా చేస్తే ఫ్యూచర్లో నాకేమీ నష్టం ఉండదు కదా..
రమేష్ ఏదైనా చేస్తాడా..

అసలు విశి నా మాట వింటుందా? ఎందుకు వినదు..  వాళ్ళ మదర్ ట్రీట్మెంట్ చేయి పిస్తాను అని చెబుతాను. పెళ్లి చేసుకుందాం.. నీకు సొసైటీలో ఒక గుర్తింపు ఇస్తాను అని చెబితే చచ్చినట్టు వింటుంది.

విశి మదర్ కి ట్రీట్ చేసే డాక్టర్ తో మాట్లాడాలి. ఆ డాక్టర్ని నా గ్రిప్ లో పెట్టుకొని.. అప్పుడు విశితో గేమ్స్ స్టార్ట్  చేయాలి... ఒరేయ్ గౌతమ్ నీ తెలివితేటలు ముందు ఎవరైనా బలాదూర్ రా అని మంచం పైన వాలిపోతాడు.

బాబు గౌతమ్ ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నావు.....
[+] 5 users Like SivaSai's post
Like Reply

Part - 54



విశి ని ఎలా గ్రిప్ లో పెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.  పొద్దున్నే తొందరగా రెడీ అయి భానుమతిని ట్రీట్ చేసే హాస్పిటల్ కి వెళ్తాడు.

కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికి వెళితే.. చెప్పండి..  ఏం ప్రాబ్లం మీద వచ్చారు. నాకు ఏం ప్రాబ్లం లేదు. మీ నుంచి ఒక హెల్ప్ కావాలి.  క్యారీ ఆన్ అన్నట్టుగా డాక్టర్ చూస్తాడు.

థాంక్యూ అని కూర్చుని.. మీరు భానుమతి అనే ఒక పేషెంట్ ని ట్రీట్ చేస్తున్నారు కదా. ఎస్.. అయితే నేను చెప్పినట్టుగా చేస్తే  మీరు కోరినంత అమౌంట్ ఇస్తాను.

ఏం మాట్లాడుతున్నారు అని డౌట్ గా చూస్తాడు. నథింగ్..  నేను.. భానుమతి గారి అమ్మాయి...  విశిష్ట తో లవ్ లో ఉన్నాను.

ఈ మధ్యన చిన్న డిస్టర్బెన్స్ వచ్చాయి. ఆడవాళ్లు కదా అలకలు చూపిస్తున్నారు..  ఎంత బ్రతిమాలుతున్న  బెట్టు చేస్తుంది.

విశిష్ట నా... ఆ అమ్మాయి అలాంటిది కాదే..  చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఆడవాళ్ళు ఎలాంటి అలకలైనా చూపించేది ఒక ప్రేమించిన వాడి దగ్గరే కదా..

మీరన్నది కూడా నిజమేలే..  దానికి ఇప్పుడు నేనేం చేయాలి. ఏమీ లేదు నేను విశికి కాల్ చేసి నేను చెప్పినట్టు వినకపోతే మీ మదర్ ట్రీట్మెంట్ ఆపించేస్తాను.

ఆ డాక్టర్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతాను ప్లీజ్ డాక్టర్ ఈ ఒక్క హెల్ప్ చేయండి.
చెయ్యొచ్చు కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మనీ ప్రాబ్లమా.. నేను ఇస్తాను. మీకు విశిష్ట అంటే చాలా ప్రేమ అనుకుంట..
అయ్యో మామూల ప్రేమ కాదు.. తనకోసం ఏదైనా చేయాలి అన్నంత ప్రేమ. అవునా మరి ఇన్ని రోజులు భానుమతి గారి ట్రీట్మెంట్  జరుగుతున్నప్పుడు.. ఎప్పుడు రాలేదే..

అది నీళ్లు నములుతూ..  అంటే.. నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేశాను.  అటు ఇటు పరిగెత్తలేక..  విశిష్ట వాళ్ళ మదర్ ని హ్యాండిల్ చేస్తూ ఉంటే పై వర్క్ నేను హ్యాండిల్ చేసేవాడిని..

ఓ అవునా కానీ మీ టాపిక్ ఎప్పుడో తీసుకురాలేదే.. మీరు డాక్టర్ గా కాకుండా ఒక లాయర్ గా క్యూస్షన్స్ వేస్తున్నారు.  కమాన్ మిస్టర్...  గౌతమ్.

ఓకే మిస్టేక్ గౌతమ్..  మీరెవరో ఏమిటో తెలియకుండా మీరు చెప్పేది నిజమని నేను ఎలా నమ్మాలి. విశిష్ట నేను ఒకే కాలేజీలో చదువుకున్నాము. నేను ఎంబీఏ  లో ఉండగా తను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యింది.

చాలా ఇంకా ఏమైనా కావాలా అని ప్రెస్టేట్ అవుతూ కంట్రోల్ చేసుకుంటూ చెబుతాడు. ఎందుకు మిస్టర్ గౌతమ్ అంత ప్రెస్టేట్ అవుతారు.

ఒక ఆడపిల్ల లైఫ్ కి సంబంధించింది. మీరు అలా ప్రెస్టేట్ అవ్వకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా..

ఇంకా ఏం ప్రశ్నలు ఉన్నాయి డాక్టర్..  ఇద్దరూ ఒకే కాలేజ్ అయినంత మాత్రాన లవర్స్ అని గ్యారెంటీ ఏమిటి.. మీ ఇద్దరు కలిసి దిగిన ఫొటోస్ ఉన్నాయా..

సేఫ్టీ పర్పస్ గా మేము అలా దిగలేదు.  సేఫ్టీ అంటే పబ్లిక్ కి ఇవ్వకపోవడం అంతేగాని మీ పర్సనల్ గా ఉంటాయిగా... ఓకే ఇద్దరూ కలిసి వెళ్లిన ప్లేసెస్ అంటే..  బయటకు వెళితే ఆడపిల్ల  అల్లరిపాలు  అవుతుంది అని ఎప్పుడూ తీసుకు వెళ్ళలేదు.

కమాన్ మిస్టర్ గౌతమ్ మీరు ఏ కాలంలో ఉన్నారు.  అన్ని తలా తోకాలేని సమాధానాలు చెబుతున్నారు.  నాకెందుకో ఇంకా నమ్మకం కలగడం లేదు.

ఓకే..  నేను తన  అకౌంట్ కి ఎప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాను.  ఆ డీటెయిల్స్ చూపిస్తాను అని అకౌంట్ కి పంపిన డీటెయిల్స్ చూపిస్తాడు.

ఇది కొద్దిగా నమ్మేటట్టుగా ఉంది. బట్ నేను హెల్ప్ చేయలేను.  వై...  డాక్టర్..  ఇప్పుడు దాకా చాలా క్యూస్షన్స్ అడిగి లాస్ట్ లో ఇలా చెబుతున్నారు.

మీ ఎమోషన్ చూస్తే చేయాలని ఉన్న నా వల్ల కాదయ్యా..  అదే దేనికి.. ఎందుకంటే.. భానుమతి గారికి ఇప్పుడు నేను ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు.

వాట్ అని అరుస్తూ లేచి నిల్చుంటాడు.  ఎస్ అని డాక్టర్ కూల్ గా చెబుతాడు.  ఈ విషయం రాగానే చెప్పొచ్చు కదా..

ఏదో లవ్ స్టోరీ చెబుతున్నావు. ప్రెసెంట్ పేషెంట్స్ కూడా నాకు లేరు. కాస్త రిలాక్సేషన్ ఉంటుంది అని వింటున్నాను. మీ రిలాక్సేషన్ కోసం నా టైమంతా వేస్ట్ చేసారా.. నేనేమైనా నిన్ను రమ్మన్నానా ఏమిటి...

పోనీ ఆ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఎవరు అన్నది తెలుసా.. తెలియదు అన్నట్టుగా పెదవి ఇరుస్తాడు..
గౌతమ్ కి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. నేను నీకు ఒక సజెషన్ ఇస్తాను ఫాలో అవుతావా..  చెప్పండి అని నీరసంగా అంటాడు.

నీ వల్ల తప్పు జరిగి ఉంటే..  నీకు అమ్మాయి కావాలి అనుకుంటే..  సిగ్గుపడకుండా మొహమాట పడకుండా అందరిలోనూ వెళ్లి కాళ్లు పట్టేసుకో..

ఛి ఛి అలా చేస్తే ఈ గౌతమ్ వేల్యూ పడిపోతుంది. అయితే నీది ప్రేమ కాదన్నమాట. లేదు లేదు నాది ప్రేమే..  ప్రేమ ఉన్నచోట ప్రైడ్ ఉండదు బాబు.

వెళ్ళు..   నీకు అమ్మాయి కావాలి అంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. ఇంక నాకు పేషెంట్స్ వచ్చే టైం అయ్యింది.
గౌతమ్ బయటికి వచ్చి కారు దగ్గర నిలబడి ఉంటాడు. అబ్బా విశిష్ట ఎంత టార్చర్ పెడుతున్నావు. నాకు తెలియని ఆ కొత్త డాక్టర్ ఎవరు.. ఎలా తెలుసుకోవాలి..

విశిష్ట ఉదయమే లేచి కాలేజ్ కి రెడీ అవుతుంది. ప్రతిరోజు చెప్పినట్టే గానే ఆరోజు కూడా భానుమతికి జాగ్రత్తలు చెబుతూఉంటే..

నేహ వచ్చి అంత అవసరం లేదు. నేనున్నాను కదా..  నా దగ్గర ఉంటారు. అది కాదు ఆంటీ..  చూడు నువ్వు ప్రశాంతంగా కాలేజ్ కి వెళ్లి నీ వర్క్ నువ్వు చేసుకుని రా..

అమ్మ మాత్రం ఎంతసేపని ఇక్కడ ఉండిపోతారు. అత్తయ్య నేను ఫ్రీ గానే ఉంటున్నాము.  సో మా ముగ్గురికి కాస్త కాలక్షేపం అవుతుంది.

రండి భానుమతి గారు అని... అబ్బో చాల లాంగ్ అయిపోయింది. భాను అని పిలుస్తాను.. భానుమతి కూడా నవ్వుతూ మీరు ఎలా పిలిచినా నాకు బాగుంది.

ఇన్ని రోజులు ఒక్కదాన్నే ఉండి బోర్ కొట్టేసింది.  ఈయనేమో ఇంకా రాలేదు.. వచ్చేస్తానన్నారు. మా వారికి ఫోన్ చేసి చెప్పారు..

అవునా మా వారు మీకు తెలుసా..  చాలా బాగా తెలుసు. రండి. నువ్వు వెళ్ళు అని విశిని పంపించి భానుని తీసుకొని వెళతారు.

విశి ఫ్లాట్ నుంచి బయటికి వస్తూ దేవా సార్ వస్తారా లేక నేను బస్సుకి వెళ్లాలా.. అయినా ఆయనే కదా నన్ను కాలేజీకి తీసుకువెళ్లి తీసుకు వస్తానని మాట ఇచ్చారు.

ఇప్పుడు నన్ను ఇలా మధ్యలో వదిలేస్తారా... ఇలా వదిలేస్తే నేను ఇంకా దేవా సార్ తో మాట్లాడను అని తనలో తానే మాట్లాడుకుంటూ గేట్ తీస్తుంది.

అక్కడ సూర్య బైక్ మీద కూర్చుని చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా విశి ముఖంలో నవ్వు వస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్లి మీరు వచ్చారా.. రారేమో అనుకున్నాను.

అలా ఎందుకు అనుకున్నావు. నిన్న మీరే కదా.. ట్రాన్స్పోర్ట్ ఉంది.. స్కూటీ నేర్చుకో అని ఏదేదో చెప్పారు.  ఈరోజు రారేమో అని కంగారు పడ్డాను..

బైక్ స్టార్ట్ చేసేవాడు ఆగి ఒక విషయం అడుగుతాను. కరెక్ట్ గా సమాధానం చెప్పు. అడగండి సార్.. నేను స్టడీస్ లో టాపర్ని.

ఇది స్టడీస్ కు సంబంధించినది కాదులే కానీ..  ఇప్పుడు నువ్వు కంగారు పడింది నేను రానేమో అన..  లేక బస్ కి వెళ్ళాలి అనా..

విశి వెంటనే కళ్ళల్లో నీళ్లు తిప్పేస్తూ బస్సుకి వెళ్లడం నాకేమైనా కొత్త.. నాన్నగారు నాకు దూరమైనప్పటి నుంచి రోజు బస్సులోనే వెళ్లి వస్తున్నాను.

ఒక్కొక్కసారి నడిచి కూడా వెళ్లేదాన్ని..  అలాంటిది బస్సులో వెళ్లడానికి ఎందుకు నేను ఇబ్బంది పడతాను. మీరు ఇలా మాట్లాడితే అసలు మీతో నేను ఎప్పుడూ మాట్లాడను అని మోచేతితో కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది.

చిన్నపిల్లలాగా ఏడుస్తూ చెబుతున్న విశి ని చూసి సూర్యకి నవ్వు వస్తుంది. ముద్దు ముద్దుగా అనిపిస్తుంది. ఉఫ్.. అనుకుని చంపేస్తున్నావే పిల్ల అనుకుంటూ..

సరే సరే నేను ఏదో క్యాజువల్గా అడిగాను. దానికి కూడా ఇంత ఏడుపా.. వేలు చూపిస్తూ..  ఇంకొకసారి నన్ను ఇలా క్వశ్చన్ చేశారు అంటే..

  సోరి క్యూటి  ఇంకా ఎప్పుడు నిన్ను క్వశ్చన్ చేయను సరేనా..  ఈ.. క్యూటి ఏమిటి..  ఒక్కసారి ఉండు అని బైక్ మిర్రర్ లో విశి ఫేస్ ని చూపిస్తాడు.

ఏడ్చి కళ్ళు ఉబ్బి ఉంటాయి.. ఇప్పుడు నీ ఫేస్ చిన్నపిల్లల్లాగా లేదా... క్యాజువల్ గా ఒక క్వశ్చన్ అడిగితే అలా ఏడుస్తారా..  ఎవరైనా..

ఏమో సర్  ఎవరు ఎలా అడిగినా..  ఏమి చేసినా ధైర్యంగా ఉండగలను కానీ మీరు నన్ను అనుమానిస్తున్నట్టుగా మాట్లాడితే ఎందుకో తట్టుకోలేకపోతున్నాను.

సూర్య మనసులో అదే ప్రేమ.  కానీ నీకు తెలియడం లేదు.  నీకు తగిలిన ఎదురు దెబ్బలకి ప్రేమంటేనే భయపడుతున్నావు ..
ఆ భయాన్ని మెల్లిమెల్లిగా తీసివేస్తాను అనుకుంటూ.. ఇంకా కాలేజ్ కి స్టార్ట్ అవుదామా. ఇప్పటికే లేట్ అయింది.  సరే అని బైక్ ఎక్కుతుంది.

రోజు నువ్వు ఈవినింగ్ స్కూటీ నేర్చుకోవాలి.  తప్పదా సార్..  తప్పదు. అన్ని నీ సెల్ఫ్ గా చేసుకుంటున్నావు కదా..  అంత ధైర్యవంతురాలువి..

ఎందుకు ఈ విషయంలో భయపడుతున్నావు. వేరేగా ఏమీ కాదు సార్. రోజు చాలా యాక్సిడెంట్లు అవుతాయి అని వింటున్నాము కదా..

అలా నాకు ఏదైనా అవుతే అమ్మ పరిస్థితి ఏమిటి అని అంతే..  ఒక్కసారిగా సూర్య గుండె దడదడ లాడుతుంది.
  ఏం మాట్లాడుతున్నావ్ అని కొంచెం కోపంగా అంటాడు.

ఏమైంది సార్..  ఏమీ లేదు పిచ్చిపిచ్చిగా ఆలోచించకు.  ప్రతి దాంట్లో ప్రమాదాలు ఉంటాయి. అలా అని ఇంట్లో తలుపులేసుకుని కూర్చుంటావా..

అలా కూర్చున్నా సరే పైనుంచి వెళ్లే  ఏ విమానమో వచ్చి కూలితే అప్పుడు ఏం చేస్తావు..

విశి సమాధానం.....
[+] 7 users Like SivaSai's post
Like Reply

Part - 55



ప్రతి దాంట్లో ప్రమాదాలు ఉంటాయి. అలా అని ఇంట్లో తలుపులేసుకుని కూర్చుంటావా..
అలా కూర్చున్నా సరే పైనుంచి వెళ్లే  ఏ విమానమో వచ్చి కూలితే అప్పుడు ఏం చేస్తావు..
ఏం మాట్లాడేవే విశి..
మీరు చెప్పేది నిజమే. నాన్న ఉన్నప్పుడు నేను అంతే ధైర్యంగా టేకటీసీగా ఉండేదాన్ని.. నాన్నతో పాటు నా బలం కూడా వెళ్ళిపోయింది. అమ్మని చూస్తే బలహీనతే గుర్తుకు వస్తుంది.

ఏం చేయాలి  చెప్పండి..
ప్రతి ఒక్కరికి భయాలు ఉంటాయి, కానీ వాటిని ఎదుర్కోవడమే మనం బ్రతికున్నామనేది గుర్తు చేస్తుంది.
మీ నాన్నని నువ్వు ఎంతగా ప్రేమించావో, ఆయన నిన్ను ఎంత ధైర్యంగా తీర్చిదిద్దాడో, అదే ఆయన నిజమైన గుర్తు.
ఇప్పుడాయన లేరని నువ్వు బలహీనంగా అనిపించుకోవడం అంటే ఆయన నేర్పిన ధైర్యాన్ని మరిచిపోవడమే అవుతుంది.
అప్పుడు నువ్వు మీ నాన్నకి ఇచ్చిన విలువ ఏమిటి..
నీ బలహీనతలో నీ కన్నీళ్ళలో మీ నాన్నని దూరం చేసుకుంటావా చెప్పు..

విశి మెల్లగా.. లేదు ఎప్పటికీ దూరం చేసుకోను.  నాన్న నా ఊపిరి..
అమ్మని చూస్తే నీకు బలహీనతే గుర్తుకువస్తుంది అన్నావు కదా… కానీ అది అబద్ధం.. అదే అమ్మ నీ బలం..

ఎలాగో తెలుసా..
ఈరోజు నీ సొంత కాళ్ళ మీద నిలబడి ధైర్యంగా అడుగులు వేస్తున్నావు దానికి కారణం అమ్మ కాదా... అమ్మని బాగా చూసుకోవాలి...

అమ్మకి ట్రీట్మెంట్ చేయించాలి. అమ్మని  ఇంకా గొప్పగా చూసుకోవాలి అన్న నీ మనోధైర్యాన్నికి అసలు కారణం ఎవ్వరు..

నువ్వు నిలబడితే, ఆమెకు కూడా ఆత్మస్థైర్యం వస్తుంది.
నువ్వు నవ్వితే అమ్మ కళ్ళు ఆనందంతో పొంగుతాయి  ఇంతకన్నా మన ధైర్యం,  బలం కావాలా..
ఎవరో ఒకరు మొదట ముందడుగు వేయాలి. ఆ అడుగు నువ్వే వేయి..

ఒక క్షణం నిశ్శబ్దం. ఆత్మీయంగా, గుండె లోతుల్లోకి దిగి వెళ్లే మాటలా గాలి మధ్య ఆగిపోతుంది.
నీకు సమస్య ఎదురైనప్పుడల్లా దానికి సమాధానం కూడా దొరుకుతూనే ఉంది. ఆ విధంగా నీ అడుగులు పడే విధంగా మీ నాన్న నీకు ధైర్యాన్ని నింపి వెళ్లారు..
భయం తలుపు తడితే, ధైర్యం తలుపు తెరుస్తుంది.
అదే మీ నాన్న నీలో వదిలిన బహుమతి.

ఆ బహుమతిని వదిలేసి ఎందుకు నీలో నువ్వే భయపడుతూ కూర్చుంటావు.  నేను చెప్పానని కాదు కానీ వంటరిగా కూర్చుని ఆలోచించు.

నీ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది. బైక్ ఆపుతాడు.. ఏమైంది సార్.. కాలేజీ వచ్చింది.  మీ మాటల్లో పడి నేను చూసుకోలేదు.  థాంక్యూ...
బైక్ దిగి వెళుతున్న విశినే చూస్తూ ఉంటాడు.  నాలుగు అడుగులు వేసిన విశి వెనక్కి వచ్చి సార్..  స్కూటీ డ్రైవింగ్ ప్రాక్టీస్ కి ఎక్కడికి రమ్మంటారు..

సూర్యా పెదవులపై గర్వంతో కూడిన చిన్న చిరునవ్వు వస్తుంది. సాయంత్రం నేనే తీసుకువెళ్తాను గో అని పంపిస్తాడు.

వాళ్ళిద్దరిని అలా చూసినా సరళకి మాత్రం పిచ్చ కోపం వస్తుంది. నేను దగ్గరికి వెళితే లెక్చరర్ ఎలా ఉండాలి అని నాకు క్లాస్ తీసుకున్నాడు.

కానీ ఇతను మాత్రం స్టూడెంట్ తో రొమాన్స్ చేస్తున్నాడు చెబుతాను అని దగ్గరకి వెళ్ళి హలో గుడ్ మార్నింగ్ సార్..  గుడ్ మార్నింగ్ అని సీరియస్గా చెబుతాడు.

అదేంటి సార్ నేను నవ్వుతూ విష్ చేస్తే మీరు అంత సీరియస్గా చెబుతున్నారు.  మీరు ఒక్క విశిష్ట తోనే నవ్వుతూ మాట్లాడతారా..

సూర్య బైక్ దిగి మీ ప్రాబ్లం ఏమిటి అని అడుగుతాడు.  నా ప్రాబ్లం ఏముంది.. మీరు ఎలా ఉన్న అమ్మాయిలతో నవ్వుతూ మాట్లాడతారా అని అడుగుతున్నాను.

  లెక్చరర్ లెక్చరర్ మధ్యన అయితే ప్రాబ్లం ఉంటుంది కానీ స్టూడెంట్ లెక్చరర్ మధ్య ప్రాబ్లం ఉండదు అని నాకు ఇప్పుడే తెలిసింది..

మీకు స్పెట్స్ ఉన్నట్టు ఉన్నాయి.  ఉన్నాయి.. ఎందుకు.. అవి మళ్లీ ఒకసారి టెస్ట్ చేయించుకుని అప్పుడు యూస్ చేయండి. ఆ స్పెడ్స్ పవర్ తగ్గినట్టు ఉంది. అందుకే మీకు అన్ని చెడుగానే కనబడుతున్నాయి.

చూడండి మిస్ సరళ మీరు ఒక లెక్చరర్ అని ఇప్పటివరకు చాలా రెస్పెక్ట్ ఇచ్చాను.  బట్ మీ బిహేవియర్ ఇలాగే ఉంటే తర్వాత ఏమి జరుగుతుందో అన్నది మీ ఆలోచనకు కూడా అందదు.

అర్థమైంది అనుకుంటా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళుతున్న సూర్యని చూస్తూ  నిన్ను చూసిన మొదటి రోజే నీపై మనసు పడ్డాను కానీ నీకు ఆ విశిష్ట కావాల్సి వచ్చిందా..

ఎలాగైనా నిన్ను దక్కించుకుని తీరుతాను అక్కడ నుండి క్లాస్ కి వెళ్ళిపోతుంది..

శ్రీకర్ బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళతాడు.  నా సౌమ్య బేబీ ఎక్కడ ఉంది అని కళ్ళతో వెతుకుతూ ఉంటే.. భరత్ టీవీ చూస్తూ కనిపిస్తాడు.

అబ్బా మా మామయ్య ఇంకా ఆఫీస్ కి వెళ్లలేదా అని పక్కనే కూర్చుని ఏంటి మావయ్య ఆఫీస్ కి వెళ్లలేదా.. వాచ్ వైపు చూసి శ్రీకర్ వైపు చూస్తాడు.

ఇంకా  టైం ఉందా.. నువ్వేంటి ఇలా వచ్చావు.  సూర్య ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఆ.. వాడికంటే చాలా పనులు ఉన్నాయి.  అందుకే వెళ్ళిపోయాడు.

నేను ఖాళీయే కదా ఒకసారి నిన్ను చూసి వెళదామని వచ్చాను.. నా బుజ్జి పప్పీ కనపడదే అనుకుంటూ  దిక్కులు చూస్తూ ఉంటాడు. నన్ను చూడ్డానికి వచ్చి దిక్కులు చూస్తావు ఎందుకో...

ఐ ఎక్సర్సైజ్ మావయ్య..  ఈ మధ్యన ఒక లేడీ డాక్టర్ చెప్పింది. కళ్ళకి ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తే చూపు అంత బాగుంటుంది అని.. చెప్పిన డాక్టర్ ఎవరో తెలుసుకోవచ్చా..

ఏంటి మావయ్య నేను ఎప్పుడూ ఇంటికి వచ్చిన.. పోలీసోడు..  దొంగని అడిగినట్టు అన్ని క్యూస్షన్స్ అడుగుతావు.

నువ్వు సరిగ్గా సమాధానం చెబితే నాది ఒక్క క్వశ్చన్ తోనే ఆగిపోతుంది.  నువ్వు వంకరగా చెబుతుఉంటే..  నాకు రావలసిన సమాధానం వచ్చే వరకు అడుగుతూనే ఉంటాను.

నీకు కావలసిన సమాధానం చెబితే నాకు కావాల్సింది ఇస్తావా.. నువ్వు చెబితేనే కదా అది నాకు కావాల్సింది అవునో కాదో తెలుస్తుంది.

అందుకే మావయ్య మిమ్మల్ని.. అని పళ్ళునూరితే.. ఇక్కడ ఆడపిల్ల తండ్రులం.. మా జాగ్రత్తలో మేము ఉండాలి కదా.. అదే కదా మీ పొగరు.

జాగ్రత్త అని చెప్పి తాళాలు వేస్తున్నారు. సరే..  డైరెక్ట్ గానే చెబుతున్నాను. నేను నా బుజ్జి పప్పీ కోసం వచ్చాను. ఎక్కడా కనపడడం లేదు.

సౌమ్య కాలేజీకి వెళ్లే టైంలో నీకేం పని. భరత్ షర్ట్ చివరన పట్టుకుని లాగుతూ ఇలా అడిగితే ఎలా చెబుతాం మావయ్య..


నువ్వు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా...ఏదో నా బుజ్జి పప్పీ ని బైక్ మీద ఎక్కించుకుని అలా అలా తిప్పుతూ కాలేజ్ దగ్గర డ్రాప్ చేద్దామని..

ఎప్పుడు.. సాయంత్రానికా..  నో మావయ్య ఫస్ట్ పిరియడ్ స్టార్ట్ అవ్వకముందే డ్రాప్ చేస్తాను అని అమాయకంగా ఫేస్ పెట్టి చెబుతాడు.

ఒరేయ్ నీ వేషాలు నా దగ్గర కాదు. మేము ఇవన్నీ చూసే వచ్చాము.  మరి అత్తయ్యని బైక్ ఎక్కించుకుని నువ్వు తిప్పినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలాగే ఫీలయ్యారా..

ఎవరు.. మీ అత్తయ్య..  తనకి పెళ్లి అయిన తర్వాత కూడా భయపడడం పోలేదు.. అలాంటిది పెళ్లికి ముందు బైక్ మీద తిరగడం అంత సీన్ ఏమి లేదు.

అందుకే మావయ్య..  మీరు మిస్ అయినవి కూడా మేమే ఎంజాయ్ చేద్దాం అని నా ఫిలాసఫీ. అంత వద్దు గాని ఒక చిన్న బెట్ వేసుకుందాం రా..

చెప్పు మామయ్య..  ఇప్పుడు నా కూతురు నువ్వు అడగగానే నీతో వస్తే రేపే మీ పెళ్లి చేసేస్తాను..  నిజమా మావయ్య అని భుజాలు పట్టుకుని ఊపేస్తూ ఉంటాడు.

ఒరేయ్ ఊపింది చాలు కానీ రెండోది కూడా చెబుతాను విను..  సరే చెప్పు..  చెప్పు.. చాలా ఆత్రంగా ఉందే..  మరింత మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు వదులుకుంటానా ఏమిటి...

అలా కాకుండా నా కూతురు నాతోపాటు వచ్చింది అనుకో నేను ఎప్పుడు పెళ్లి చేస్తే అప్పుడే చేసుకోవాలి.. ఏమంటావు..

ఎప్పుడు పెళ్లి చేయడం అంటే..  దానికి ఏదో ఒక పిరియడ్ చెప్పాలి కదా..   సింపుల్ ఇప్పుడు సౌమ్య హౌస్ సర్జన్ చేస్తోంది కాబట్టి ఇంకా పీజీ ఫినిష్ చేసి... స్పెషలైజేషన్ అన్ని లెక్కేసుకుంటే ఇంకొక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పట్టొచ్చు.

అప్పుడికి నేను రిటైర్ అయిపోతాను. అంత వీకా.. మావయ్య నువ్వు అవమానిస్తున్నావు..  నువ్వే కదరా రిటైర్ అయిపోతాను అంటున్నావు.

4 ఇయర్స్ కి వీక్ అయిపోతే నా కూతురు లైఫ్ ఏం కావాలి చెప్పు.. నువ్వు మరీ అంత అనుమానం పడాల్సిన అవసరం లేదు కానీ టైం వేస్ట్ అవుతుంది అని నా బాధ..

ప్రేమలో వెయిటింగ్ కూడా ఉండాలి . చిన్నప్పుడు నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాను కదా.. దానికి ప్రపోజ్ చేసి ఒప్పించడానికి తల ప్రాణం తోకకు వచ్చింది.

ఎంత భయపెడితే ఒప్పుకుందో నీకేం తెలుసు... ఒరేయ్ ప్రేమతో ఒప్పించకుండా భయపెట్టి ఎమోషనల్ గా లాక్ చేసి ఒప్పించావా? అయితే ఈ లవ్ క్యాన్సిల్..

ఇదిగో మావయ్య దానికి అసలే భయమెక్కువ.. ఏది డైరెక్ట్గా చెప్పదు. ఏదో మా తిప్పల మేము పడి నా బుజ్జి పప్పీ  నోటితో చెప్పించుకున్నాను.

నువ్వు లేనిపోని మెలికలు వేయకు. మనవళ్ళని ఎత్తుకోవడానికి లేట్ అయిపోతుంది..  ఆ విషయంలో నువ్వు డౌట్ పడాల్సిన అవసరం లేదు అల్లుడు..

సౌమ్య రెడీ అయి వస్తుంది. విద్య  శ్రీకర్ కి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది.  థాంక్యూ అత్తయ్య.  నువ్వు మంచి అత్తయ్యవి..

మావయ్య చూడు..  వచ్చినప్పుడు నుంచి నా మీద సెటైర్లు వేయడమే తప్ప వాటర్ అయినా తాగుతావా అని అడగలేదు..

అడగను ఏం చేస్తావు..  విద్య కంగారుగా ఏమిటండీ అలా మాట్లాడుతారు.  ఇక్కడ ఆడపిల్ల తండ్రులం. మేము ఇలాగే మాట్లాడతాం.

ఏమంటారు అల్లుడుగారు అని సాగదీస్తే..  ఏమంటాను.. మావయ్య గారు ఎలా చెబితే అలా ఊ కొడతాము.. సౌమ్యవైపు తిరిగి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు.

సౌమ్య భయంగా భరత్ వైపు చూసి నాన్న వెళదామా.. నాతోనే వస్తావా అని భరత్ ఏమీ తెలియనట్టుగా అడుగుతాడు.

సౌమ్య సమాధానం.....
[+] 8 users Like SivaSai's post
Like Reply

Part - 56

చందును కూడా పికప్ చేసుకోవాలి. చందు ఎందుకు అని శ్రీకర్ అడిగితే.. మా కాలేజ్లో వాళ్ళ ఫ్రెండ్స్ కలవాలి అంది. వెళ్లేటప్పుడు పికప్ చేసుకోమంది.

దానికి కారు ఉంది కదా మళ్లీ నీతో రావడం ఏమిటి అని అరుస్తూ ఉంటాడు.  సౌమ్య అయోమయంగా శ్రీకర్ వైపు చూస్తూ చందు నాతో వస్తే నీకేంటి ప్రాబ్లం..

ప్రాబ్లం నాకు కాక ఇంకా ఎవరికి..
ఏమైంది అలా అరుస్తున్నావు.. ఒంట్లో బాగోలేదా అని చెయ్యి పట్టుకుని చూస్తోంది. ఇది మబ్బు అని తెలుసు గాని..  మరి ఇంత మబ్బు అనుకోలేదు అని భరత్ వైపు చూస్తాడు.

భరత్ కళ్ళ ఎగరేస్తే... ప్లీజ్ మామ అని కళ్ళతోనే రిక్వెస్ట్ చేస్తాడు. నాకేంటి అని సైగ చేస్తే.. ఏం కావాలో అడుగు అని అలాగే మాట్లాడతాడు.

అమ్మ సౌమ్య వెళ్ళి నాకు కాఫీ తీసుకురా తల్లి... అలాగే నాన్న అని వెళుతుంది. ఏమడిగినా ఇస్తావా.. ఇవ్వక చస్తానా..

సరే నా కూతుర్ని నీతో పంపిస్తాను గాని సేఫ్ గా కాలేజీలో ఉండాలి. అంతేకాదు మీ పెళ్లి కూడా నేను ఎప్పుడు చెబితే అప్పుడే..

మరి అన్ని సంవత్సరాలు పెట్టకు మామ..  ఎప్పుడు పెట్టాలో నేను ఆలోచిస్తాను కానీ బైక్ మీద వెళుతున్నాం కదా అని అడ్వాన్స్ అయ్యావు అనుకో..

ఇక పెళ్లయ్యే వరకు నా కూతురు నీకు కనిపించదు. అర్థమవుతుందా..  అర్థం అవ్వక.. ఏం చేస్తాను.. ఏదో దూరం నుంచి చూసుకుంటూ అయినా టిఫిన్స్ కానిస్తాను..

ఒరేయ్ నాతోనే ఇలా మాట్లాడుతున్నావా.. నీతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడతాను.  సౌమ్య కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది.

నిన్ను శ్రీకర్ తీసుకువెళ్తాడు వెళ్ళమ్మా.. మరి చందు..  వైభవ్ కి చెప్తాను.  చందుని తీసుకువస్తాడు లే..  సరే నాన్న..

  వెళదామా అని శ్రీకర్ వైపు చూస్తోంది. ఓకే పద అని ఉషారుగా లెగిస్తే.. చెప్పింది అర్థమైంది అనుకుంటా.. మీరు మామయ్యలు కాదు యమకింకరులు.. భరత్ కి  ఒక్కడికే వినబడేలాగా చెబుతాడు.  భరత్ కాలర్ ఎగరెస్తాడు.

  మీ కాలంలో అల్లుడ్ని బ్రతిమాలికొనేవారు..  మా టైం వచ్చేటప్పటికి మేము మామగారిని బ్రతిమాలు కోవలసి వస్తుంది. ఏమి చేస్తాం విధి రాత..

దీనినే సైకిల్ అంటారు బాబు.. ఒకప్పుడు అబ్బాయిలు తండ్రులు కాలర్ ఎగరేసేవారు..  ఇప్పుడు అమ్మాయిల తండ్రులు కాలర్ ఎగరేస్తున్నాము..

మాకు టైం రావాలి కదా.. ఎప్పుడు వచ్చిన మీదే పై చెయ్యి  కదా..  అప్పుడు అల్లుడు హోదా.. ఇప్పుడు మామగారు హోదా..

నువ్వు పదవే అని సౌమ్య చేయి పట్టుకుని తీసుకువెళతాడు.  సౌమ్య కంగారుగా ఏం చేస్తున్నావు.. నాన్న చూస్తున్నారు..

అబ్బా మావయ్యకు అన్ని తెలుసులే గాని రా అని బైక్ స్టార్ట్ చేస్తాడు. సౌమ్య నవ్వుతూ ఒక సైడ్ కి కూర్చుంటే  బైక్ రైస్ చేస్తూ ఉంటాడే గానీ ముందుకు కదపడు..

అదేంటి వెళ్ళవే..  నా బైక్ కి ఇలా కూర్చుంటే నచ్చలేదు.. చిన్నగా నవ్వుకుంటూ సరే అని టూ సైడ్స్ కి కూర్చుంటుంది.

ఇప్పుడు నచ్చింది అని అదే రైసులో ముందుకు దూకిస్తాడు. శ్రీకర్ని గట్టిగా పట్టుకుంటుంది.  అది చూసిన భరత్ నా అల్లుడు మరి టూమచ్ స్పీడ్ లో ఉన్నాడు..

విద్య.. ఇద్దరు బైక్ మీద వెళ్లడం చూసి అదేంటి అమ్మాయిని అలా పంపించారు.  వెళితే తప్పు ఏముంది.. పెళ్లి కావలసిన అమ్మాయి అలా వెళ్లొచ్చా..

అందరూ ఏమనుకుంటారు..  ఏమనుకుంటారు.. కాబోయే వాడితో వెళ్ళింది అనుకుంటారు. అయినా సరే అలా వెళ్లకూడదు .

నీకంటే నా మీద నమ్మకం లేక నా బైక్ ఎక్కలేదు. నా కూతురికి నా అల్లుడు మీద నమ్మకం ఉంది కాబట్టి బైక్ ఎక్కింది.

నమ్మకం లేదని నేనెప్పుడూ చెప్పాను.  మరి ఎందుకే... పెళ్లికి ముందు ఎన్నిసార్లు అడిగిన బైక్ ఎక్కలేదు. అది జాగ్రత్త.  అదే...  నమ్మకం లేనప్పుడు వచ్చేదే ఆ జాగ్రత్త.

ఇప్పుడు ఏమంటారు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తారా.. వెళ్ళు ఉపయోగం ఏముంది చెప్పు.. నా బండిని ఇలా నడుపుకొని వెళ్లాల్సిందే...
అంత కష్టం ఏమొచ్చిందో మీకు అని కళ్ళల్లో నీళ్లు తిప్పబోతుంది..  ఇంకొక్కసారి ఆ కళ్ళనుంచి  చుక్క డ్రాప్ అయినా కారింది అనుకో..

నీకు మినీ స్కర్ట్ వేసి స్పోర్ట్స్ బైక్ నీ చేతికిచ్చి డ్రైవ్ చేయిపిస్తాను అర్థమైందా.. టక్కన ఆపేస్తుంది. ఈ మనిషి చేసిన చేస్తాడు అని నోటిలో గోనుక్కుంటూ ఉంటే ఎక్కువ గోనుక్కోకు కచ్చితంగా చేస్తాను .

నేను మనసులో కూడా అనుకోకూడదా.. ఇలారా అని చేయి చూపిస్తాడు.  వచ్చి పక్కనే నిలబడితే..  నీలో బాగా నచ్చేదేమిటో తెలుసా..

పెళ్లికి ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు.. అదే అమాయకత్వం.  అప్పుడు ఇప్పుడు రోజులు మారాయి.  నా కూతురు గురించి నాకు జాగ్రత్త ఉండదా ? ఎక్కువ ఆలోచించకు. అర్థమయిందా..

భరత్ వైపు అలాగే చూస్తూ ఉంటే..  ఏంటి మిని స్కర్ట్ వేయిపిస్తానేమో అనుకుంటున్నావా..  అసలు వేయిపించెను.

మన పెళ్లయిన కొత్తలోనే వేయిపించలేదు ఇప్పుడు ఎందుకు ఏయిపిస్తానే తింగరి... నువ్వు నీలాగా ఉంటేనే నీకు అందం. నాకు ఆనందం సరేనా..

అలాగే అని తల ఊపుతుంది.  కాస్త నవ్వచ్చు బంగారం. ఏదో సరదాగా టీస్ చేసాను.  నాకు తెలుసు మీరు టీస్ చేశారని..

మరి తెలిసి కూడా భయపడితే ఏలాగే..  ఏమో మొదటి నుంచే అదే అలా అలవాటు అయిపోయింది.   నీకది అలవాటైపోయింది. నాకు ఇది అలవాటైపోయింది ..

వెళ్లొస్తాను అని చెంప మీద చెయ్యి వేసి వైభవ్ అని పిలుస్తాడు.  ఎస్ మావయ్య అని ఎగురుకుంటూ వస్తే.. నువ్వు చందుని తీసుకుని సౌమ్య కాలేజ్ కి వెళ్ళు.

నేనా..  ఆ పిల్ల రాక్షసినా..  నో అని అరుస్తాడు. వైభవ్ అరుపులకి ఇద్దరూ చెవులు మూసుకుంటారు..

వైభవ్ వెళతాడా...

కథ కొనసాగుతుంది...
[+] 8 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)