Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

పాణిగ్రహణం

Showing only the posts of SivaSai: 341 of 820 posts. Show all posts
#41

Sorry Friends Late Gaa Update Istundakuu

Morning Nuchi Traveling Lo Unna Nizamabad To My Village

400 Km Traveling Ki 7-8 Hours Vellachu Kani Hyderabad Outside Roads Full Traffic 14 Hours Lo Reach Ayyanu 


Update Istunnanu.......
[+] 3 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42

Part - 35


  సత్యవతి గారు కంగారుగా ఏమైంది బంగారం అని అడుగుతారు. నాకు బ్రతకాలని లేదు నానమ్మ చచ్చిపోవాలనిపిస్తుంది.

అమ్మతోపాటు నేను కూడా వెళ్ళిపోయి ఉంటే ఈ రోజుఈ నరకం ఉండేది కాదు కదా అని ఏడుస్తుంది. ఆ మాటలకు సత్యవతి గారి గుండె తరుక్కుపోతుంది.

అవని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని మా అమ్మవు కదూ ఏడవకు ఏం జరిగిందో నాకు చెప్పు తల్లి అని కళ్ళు తుడుస్తారు.

దానితో శిల్ప పెళ్లి చూపులు ముందు భార్గవి తనతో చెప్పిన విషయాలన్నీ చెప్పి ఈరోజు ఏమీ తెలియనట్టు మీ ముందు నా మీద కోప్పడుతున్నారు.
నేనేం తప్పు చేశాను అని ఏడుస్తుంది.  సత్యవతికి ఆ నిమిషము  కొడుకు,కోడలపైన చాలా కోపం వస్తుంది. వీడెందుకు ఇలా తయారయ్యాడు.

అసలు కూతురు అంటే ఇంత చిన్న చూపా అని బాధపడుతూ మా అమ్మవి కదా..ఏడవకు తల్లి అని చెప్పి కళ్ళు తుడుస్తారు.

అవని అలా ఏడుస్తూనే వాళ్ళ నానమ్మ వొళ్ళో పడుకుని నిద్రపోతుంది. అవని పడుకున్న తర్వాత సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పి రూమ్ దగ్గరికి వేసి ఎవరితోనూ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతుంది.

శేషగిరి గారు అది చూసి ఏం జరిగింది అని ఆలోచిస్తూ భార్య వెనకాల వెళ్లి ఏమైంది సత్యా అని అడుగుతారు. దానికి సత్యవతి గారు కన్నీళ్లు పెట్టుకుంటూ ఎందుకండి వీడు ఇలా తయారయ్యాడు.

రజిత ఉన్నప్పుడు అవిని నీ  కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నాడు. రజితతో పాటే కూతురు మీద ప్రేమ కూడా పోయినట్టుంది అని బాధపడుతూ జరిగిందంతా చెబుతుంది.

అది విన్న తర్వాత శేషగిరికి కూడా చాలా కోపం వస్తుంది. ఏమీ చేయలేక బాధపడతారు. వీళ్ళ బాధలో వీళ్ళు ఉండగానే పెళ్లిరోజు వచ్చేస్తుంది.

పెళ్లి పనుల్లో గాని,పెళ్లి దగ్గర గాని ఎక్కడ అవిని కనిపించదు.  భార్గవి ముందే వెళ్లి హెచ్చరిస్తుంది. నిన్ను ఎక్కడ మీ నాన్నగారు కనపడద్దు అని చెప్పారు అని.

అవని గదిలో నుండి అసలు బయటికి రాదు.తిన్నావా అని అడిగే వాళ్ళు కూడా ఉండరు.సత్యవతి గారు గుర్తుపెట్టుకుని  ఫుడ్ పంపిస్తూ ఉంటారు.

కానీ అవిని కి ఏమి తినాలనిపించక ఫుడ్డు మొత్తం అలాగే ఉండిపోతుంది. ధనుంజయ్ మాత్రం కూతురు కోసం చూస్తూ ఉంటాడు.

ఇలాగైనా నలుగురిలోకి వస్తుందేమో అని. భార్గవిని అడుగుతాడు అవిని ఏది అని. దానికి భార్గవి ముసలి కన్నీరు కారుస్తూ నేను బ్రతిమాలానండి ఎంత చెప్పినా రాను అంది.

ఇంకా బలవంతం చేస్తే చేయి కోసుకుంటానని బెదిరించింది అని చెబుతుంది. దానికి ధనుంజయ్ కి కోపం వచ్చి ఎందుకు అవని ఇంత మొండగా బిహేవ్ చేస్తుంది.

నేను వెళ్లి అడుగుతాను అని చెప్పేసి సీరియస్గా వెళుతూ ఉంటాడు.  అవని గదిలోకి వెళుతున్న ధనుంజయ్ ని చూసి భార్గవి కి టెన్షన్ వస్తుంది.

వెంటనే వాళ్ళ అన్నయ్య సునీల్ కి సైగా చేస్తుంది. వెంటనే సునీల్ బావ అని పిలుస్తారు. వెళ్లేవాడు వెనక్కి తిరిగి ఏమైంది సునీల్ అంటే.. మండపం దగ్గర కావలసిన పువ్వు లు వచ్చాయో లేదో అడుగుదామని పిలిచాను అంటాడు.

దానితో మనకి పనేముంది. అది ఆర్గనైజేషన్ వాళ్లకు ఇచ్చేసాము కదా అంటే... నిజమే కదా బావ మర్చిపోయాను.

మేనకోడలు పెళ్లి అనేటప్పటికీ కాళ్లు చేతులు ఆడడం లేదు. అందుకే ఏదో మాట్లాడేశాను అని చెప్పి చెమటలు పడుతున్నట్టుగా సడన్గా కుర్చీలో కూర్చుని పోతాడు.

ఏమైంది అని  గబగబా కిందికి వస్తాడు. కొంచెం బీపీ డౌన్ అయినట్టుంది అని భార్యని పిలిచే కొంచెం మజ్జిగ తీసుకురా అని చెబుతాడు.

వెంటనే బిందు కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లి మజ్జిగ తీసుకువచ్చేస్తుంది. అది తాగి ధనుంజయ్ చేయబట్టుకుని బావ నాకు కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది నువ్వు నా పక్కనే కూర్చో అని చెప్పి ఆపేస్తాడు. 

భార్గవి కళ్ళు వోత్తుకుంటూ మేనకోడలు అంటే ఎంత ప్రేమ మా అన్నయ్యకి అని చెప్పి మీరు పక్కన ఉండండి. అన్నయ్యకి కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెబుతుంది.

అవిని దగ్గరికి వెళ్లే విషయం మర్చిపోయి సునీల్ చెయ్యి పట్టుకుని కూర్చోండిపోతాడు. ఇదంతా చూస్తున్న సత్యవతి, శేషగిరి గారు మాత్రం ఏమీ మాట్లాడరు.

అసలు వీళ్ళ విషయంలో కలగ చేసుకోవడానికి కూడా మనసు అంగీకరించదు. సునీల్ కాసేపు అయిన తర్వాత బావ ఇప్పుడు నేను బానే ఉన్నాను.

మనం మండపం దగ్గరికి వెళ్దాం పద.అక్కడ ఉండి అన్ని పనులు చూసుకుంటే నాకు కొంచెం రిలాక్స్డ్ గా అనిపిస్తుంది అని ధనుంజయ్ ని ఆలోచించుకోనివ్వకుండా అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతాను .

హమ్మయ్య అని బిందు, భార్గవి గుండెల పైన చేయి వేసుకుంటారు.  భార్గవికి తనని ఎవరు చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది.

అక్కడ సత్యవతి గారు సూటిగా చూస్తూ కనిపిస్తుంది. భార్గవి కంగారుపడుతూ అదేంటి అత్తయ్య గారు అలాగా చూస్తున్నారు అంటే....

ఏమీ లేదు అమ్మ మీ అందరి పెర్ఫార్మన్స్ చూస్తున్నాను అంతే అని చెప్పి వెళ్ళిపోతారు. ఏంటో ఈవిడ ఇలా మాట్లాడుతుంది అని....

ఇప్పుడు అవన్ని ఆలోచించే టైం లేదులే అని కూతురు గదిలోనికి వెళుతుంది. గదిలోనికి వెళ్లేటప్పుడు గది అంతా ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. నగలు  చీర అన్ని అక్కడే ఉంటాయి.

వాష్ రూమ్ లో ఉందా అని డౌట్ వచ్చి బాత్రూంలో కూడా చూస్తారు. కానీ అది కూడా వెక్కిరిస్తూ ఉంటుంది.

ఇది ఎక్కడికి వెళ్లిందా అని చూస్తూ ఉంటే..నగల కింద ఒక పేపర్ కనిపిస్తుంది.అనుమానంగా అది తీసి చూస్తోంది.

దానిమీద ఉన్న చేతురాత శిల్ప ది.ఇక అనుమానంగా అనిపించి చదువుతూ ఉంటుంది. అమ్మ నాకు మోడలింగ్ ఆడిషన్స్ కి ఇప్పుడే కాల్ వచ్చింది.

నేను పెళ్లి టైం కల్లా వచ్చేస్తాను. అప్పుడు దాకా మేనేజ్ చేయి అని రాసి ఉంటుంది. ఆ లెటర్ చూడగానే భార్గవికి టెన్షన్ తో చెమటలు పడతాయి.

చేతిలో ఉన్న పేపరు కింద పడిపోతుంది. గుండెల్లో రాయి పడుతుంది.  ఇప్పుడు ఇలా చేసింది ఏంటి...ఈ విషయం గనుక ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఇంకేమైనా ఉందా...

నేను ఎంతో తెలివిగా ప్లాన్ చేసి ఇంత మంచి సంబంధాన్ని సెట్ చేస్తే... ఇది ఇప్పుడెలా చేసింది అని ఆలోచిస్తూ ఉంటుంది.

అప్పుడే బిందు లోపలికి వస్తుంది.  ఏంటి వదిన ఇంకా శిల్ప రెడీ అవ్వలేదా...మండపానికి వెళ్లాలి కదా అని అడుగుతుంది.

దానికి  జరిగింది అంతా  చెబుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం వదినా అంటే... అదే అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది.

ఇద్దరికీ ఒకేసారి ఒకే ఆలోచన వస్తుంది. వెంటనే భార్గవి అవని గదిలోనికి వెళ్లి అవని అని ప్రేమగా పిలుస్తుంది. ఎప్పుడూ లేనిది ఇంత ప్రేమగా పిలిచేటప్పటికీ అవిని కి ఆశ్చర్యమేస్తుంది.

ఏమైంది పిన్ని నాతో ఏమైనా పని ఉందా అని అడుగుతుంది. ఆ మాటకి భార్గవికి కోపం వచ్చినా సరే ఇప్పుడు అవసరం తనది కాబట్టి నవ్వుతూ పక్కనొచ్చి కూర్చుని ఏంమ్మ భోజనం చేయలేదా అని అడుగుతుంది.

అయోమయంగా భార్గవి వైపు చూస్తుంది. మీ నాన్నగారు అలా చెప్పారని నీతో మాట్లాడను గాని నీ మీద నాకు ఏమైనా కోపమా చెప్పు తల్లి అని ఎంతో ప్రేమని చూపిస్తూ మాట్లాడుతుంది.

ఇంతకీ విషయం ఏంటి పిన్ని అని తల కిందకి దించుకుని అడుగుతుంది. ఇంకా తన నాటకం అవని కి అర్థం అయిపోయింది అని తెలుసుకుని....

ఏమీ లేదు అవని నువ్వు కొంచెంసేపు శిల్ప ప్లేస్ లో కూర్చోవాలి అని చావు కబురు చల్లగా చెబుతుంది.  దానికి అవని ఆశ్చర్యంగా నువ్వేం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా పిన్ని అంటే...

నాకన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళింది. తను వచ్చేదాకా శిల్ప ప్లేస్ లో ఉండాలి.

ఎలాగో మేలు మూసుగు వేస్తాం కాబట్టి పెళ్లికూతురు గెటప్ లో ఉన్నది ఎవరు అన్నది తెలియదు.  ఈలోపు శిల్ప పెళ్లి టైం కల్లా శిల్ప వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు అని చెబుతుంది.

ఆ మాటలకి అవిని కి దుఃఖం పొంగుకొస్తుంది. నేనేమైనా బొమ్మను అనుకుంటున్నారా...వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు అని....

నేను ఈ పని చేయలేను పిన్ని అని చెబుతుంది.  ఇది నా కోసం కాదు చేసేది.మీ నాన్నగారు కోసం. ఆయన పరువు పోకుండా ఉండడం కోసం అని చెబుతుంది.

దానికి అవిని విరక్తిగానవ్వుతూ ఏ రోజైనా నన్ను కూతురుగా చూశారా...ఈరోజు నేను ఆయన పరువు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి అని అడుగుతుంది.

దానికి భార్గవి కోపంగా అంటే ఏంటి నీ ఉద్దేశం మేము ఎప్పుడూ నిన్ను కూతురుగా చూడలేదన్న అని అడుగుతుంది.

ఆ విషయం మీకే తెలియాలి. నేను మాత్రం ఈ పని చేయలేను అని చెబుతుంది. దానికి భార్గవి... నాకు నా కూతురు కంటే ఏది ముఖ్యం కాదు.

ఈ పని చేయకపోతే పెళ్లి ఆపేస్తాను అంటుంది.  అంటే ఏం చేస్తావని అనుమానంగా చూస్తుంది. ఏం చేస్తానని అనా నీ అనుమానం  అనగానే అవని అవును అన్నట్టుగా తల ఊపుతుంది.

ఏముంది పెద్దవాళ్ళు ఇద్దరిలో ఎవరో ఒకరిని పైకి పంపించేస్తాను. అప్పుడు పెళ్లి ఆగిపోతుంది కదా అని రాక్షసంగా చెబుతుంది.

ఆ మాటలకి అవనికి చాలా భయమేస్తుంది.  ఎందుకు పిన్ని ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు.  నీ ఇష్టం మీ నానమ్మ తాతయ్య ప్రాణాలు అయితే నీ చేతుల్లో ఉన్నాయి.

వాళ్లు కావాలి అనుకుంటే రెడీ అవ్వు. నేను ఏమి పెళ్లి పీటలు ఎక్కమనడం లేదు కదా...అప్పుడు దాకా శిల్ప ప్లేస్ లో ఉండమంటున్నాము.

మీ నాన్నగారికి అన్ని విషయాలు తెలుసు. ఆయనే నాకు చెప్పి పంపించారు అని చెప్పి రెడీ అవుదాగాని పదా అని ఎవరూ చూడకుండా అవని నీ శిల్ప గదిలోకి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతుంది.

అవని నీ బలవంతంగా పెళ్లికూతురు లాగా రెడీ చేసి మేలు ముసుగు వేస్తారు. అక్కడికి ఉదయ్ వచ్చి అత్తయ్య అంతా రెడీయేనా అని అడుగుతాడు.

అంతా రెడీయే అని చెప్పి అవి నేను కిందకి తీసుకు వస్తారు పెళ్ళికూతురు మారింది అన్న విషయం బిందు భార్గవి ఉదయ్ కి మాత్రమే తెలుసు.

కన్నీళ్ళతో అవని కళ్యాణ మండపానికి వెళుతుంది.
శిల్పకి భార్గవి ఉదయ్ ఫోన్ ట్రై చేస్తూ ఉంటారు కానీ ఫోను ఎంతకీ కలవడం లేదు.
Like Reply
#43

Part - 36


శిల్ప ఫోన్ కి ఎంత ట్రై చేస్తున్నా సరే నాట్ రీచబుల్ అని వస్తుంది.  ఏంటిది అసలు ఎక్కడికి వెళ్ళింది నీకు తెలుసా అని అడిగితే... అది అది అని నాంచుతూ ఉంటాడు.

నీకు కూడా ఈ విషయం తెలుసా అని కోప్పడుతుంది. అంత కోపం వద్దు అత్త పెళ్లి టైం కల్లా వస్తాను అని చెప్పి వెళ్ళింది.

ఎవరు తీసుకెళ్లారు మన వాళ్ళైతే పాటకి ఇంట్లో తెలిసిపోయేది కదా అని అనుమానంతో చూస్తుంది. అది అత్తయ్య ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు అతను తీసుకెళ్లాడు అని చెప్తే.. బాయ్ ఫ్రెండ్స్ ఆ... అనుకుంటూ టెన్షన్ గా తిరుగుతూ ఉంటుంది.

పెళ్లి టైం దగ్గరకొస్తున్న సరే శిల్ప జాడ ఉండదు. అవిని కి కూడా చాలా టెన్షన్ గా అనిపిస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి...

సత్యవతి గారిని పిలిచి నిజం  చెబితే నన్ను ప్రాబ్లం లో నుంచి బయట పడిస్తోంది. ఎలా నానమ్మ ని పిలవాలి అని చూస్తుంది.

అవిని నీ  రెడీ చేయడానికి ఒక బ్యూటిషన్ వస్తుంది. వెంటనే అవని ఆ బ్యూటిషన్ని పిలిచి మా నానమ్మ బయట ఉన్నారు.  ఒకసారి పిలవండి అని చెబుతుంది.

అమ్మాయి సరే అని బయటికి వెళుతు ఉంటే  బిందు ఎదురు వస్తుంది. ఎక్కడికి అమ్మాయి..... పెళ్లికూతురుని రెడీ చేయకుండా అని అడిగితే....

వాళ్ల నాన్నమ్మ గారిని పిలవమన్నారు అండి. అందుకనే చెబుదామని వెళుతున్నాను  అని చెబుతుంది.

నేను చెప్పాను వస్తారు అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి పోతుంది. ఆ ఆశ కూడ అడుగంటి పోయింది అని బాధపడుతుంది.

బ్యూటిషన్ పైపైన టచ్ చేసి పెళ్ళికూతురికి మేకప్ అంత అవసరం లేదండి అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. వెంటనే అవిని,  బిందు చేతులు పట్టుకుని ప్లీజ్ అత్తయ్య  నన్ను కాపాడండి అని ప్రాధేయపడుతుంది.

బిందు అవిని వైపు చూస్తూ చూడు అవిని ఇప్పుడు ఎవరిము ఏమి చేయలేము.  శిల్ప వస్తే సరే... లేదు అంటే పెళ్లి పీటలు కూడా ఎక్కాల్సి వస్తుంది అని ఇంకొక బాంబు తీసుకొచ్చి ఒడిలో పెడుతుంది.

దానికి అవని బిగిసిపోయి ఏంటి అత్తయ్య నువ్వు మాట్లాడేది అంటే.. నేను నిజమే చెబుతున్నాను. శిల్ప ఫోన్ కలవడం లేదు.

మీ పిన్ని, ఉదయ్ ట్రై చేస్తున్నారు అని చెబుతుంది. నేను పెళ్లి పీటల మీద కూర్చుంటే ఎలా...  అతని నా మెడ లో తాళి కట్టేస్తాడు కదా అంటే....

అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు రెండు కుటుంబాలు పరుగు నీ చేతుల్లోనే ఉందని ఎమోషనల్ గా లాక్ చేసేస్తుంది.

అవిని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. శిల్ప వచ్చాయాలని ప్రేయర్ చేస్తూ  ఉంటుంది.  కానీ శిల్ప వచ్చే సూచనలు ఎక్కడ కనపడవు.

భార్గవి పెళ్ళికూతురు గదిలోనికి వదిన  పెళ్ళికూతురుని తీసుకుని వెళ్దాం. అక్కడ పెళ్ళికొడుకుతో వరపూజ అయిపోయింది అని చెబుతోంది.

అవిని భార్గవి కాళ్ళ మీద పడి ప్లీజ్ పిన్ని నా జీవితాన్ని నాశనం చేయకు.  రేపు వాళ్ళకి తెలిస్తే మన గురించి చాలా తప్పుగా అనుకుంటారు.

అవన్నీ నేను చూసుకుంటాను. ఇప్పుడు నువ్వు మంచిగా పీటల మీద కూర్చో.  లేకపోతే నేను చెప్పిన పని కచ్చితంగా చేస్తాను అని బెదిరించి బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి పీటల మీద కూర్చోబెడుతుంది.

మేలు ముసుగులో నుంచే విక్రమ్ ని చూస్తుంది. పెళ్ళికొడుకు కి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుంది.  అవిని ఆలోచనలో ఉండగానే మెడలో తాళి పడిపోతుంది.

తాళి కడుతున్న సమయంలోనే అవని కన్నీళ్లు వచ్చి విక్రమ్ పాదాలపై పడతాయి. పెళ్లయి తర్వాత కూడా అవని విక్రమ్ కి చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆ అవకాశం రాకుండా అయిపోతుంది.

పెళ్లికూతురు మౌనవ్రతం లో  ఉంది అని చెప్పి అవిని నీ మాట్లాడకుండా చేసేస్తారు.  శోభనం రోజున దంపతుల పూజ చేయించిన తర్వాత అమ్మాయికి చీర మార్చి తీసుకొని వస్తాము అని వెళుతారు.

అక్కడ శిల్ప ఉంటుంది. శిల్పా ఆల్రెడీ శోభనపు చీర కట్టుకుని ఉంటుంది. శిల్ప నీ చూడగానే ఆశ్చర్యపోతోంది. ఎక్కడికి వెళ్లావు శిల్ప నువ్వు.

ఇప్పుడు నేను గదిలో ఆయనకి ఏమని చెప్పాలి అని కోపంగా అడుగుతుంది. అప్పటికే భార్గవి తలుపు లాక్ చేసేసి ఏంటి నా కూతురు మీద నోరు లెగుస్తుంది అని కోప్పడుతుంది.

అవని ఆశ్చర్యంగా నువ్వు ఏం అంటున్నావు పిన్ని ఇప్పుడు గదిలో నేను కదా ఆయనకి సమాధానం చెప్పాల్సింది అనే బాధగా మాట్లాడుతుంది.

అసలు నిన్ను గదిలోకి ఎవరు పంపిస్తున్నారు అని వెటకారంగా మాట్లాడుతుంది.  ఆ మాటలకి  అవని షాక్ లోకి వెళ్లిపోతుంది. ఏమి మాట్లాడుతున్నావు పిన్ని అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంది.

నేను నిజమే చెబుతున్నాను ఆ గదిలోకి  నిన్ను ఎవరు పంపిస్తున్నారు.  ఆ గదిలోకి వెళ్ళేది శిల్ప అని చెబుతుంది. పిన్ని అని గట్టిగా అరుస్తుంది.

ఏయ్ ఎందుకలా అరుస్తున్నావు. ఇప్పుడు ఏం జరిగిందని.. అందరి దృష్టిలో శిల్పకే కదా పెళ్లి అయింది అని చిరాకుగా మాట్లాడుతుంది.

కానీ తాళి పడింది నా మెడలో. ఏది ఏమైనా అతను నా భర్త నేను విక్రమ్ గారి భార్యని. నేనే బయటకు వెళ్లి అన్ని నిజాలు చెప్పేస్తా...

ఏదైతే అది జరుగుతుంది అని కోపంగా బయటికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది.  వెంటనే బిందు, భార్గవి చెరో వైపు చేయబట్టుకొని వెనక్కి లాగి భార్గవి అవిని చెంప మీద గట్టిగా కొడుతుంది .

చెంప పైన చెయ్యి వేసుకుని కన్నీళ్ళతో భార్గవి వైపు చూస్తోంది. అక్కడ  ఉన్న అందరిని చూస్తుంటే చాలా  అసహ్యం వేస్తూ ఉంటుంది. కోపం బాధతో చూస్తూ ఉంటుంది.

ఏంటి నువ్వు వెళ్లి చెప్పగానే అందరూ నమ్మేస్తారు అనుకుంటున్నావా పోనీ నువ్వు అనుకున్నట్టే నమ్మారే అనుకో  దానిని చెడగొట్టలేం అనుకుంటున్నావా అని నవ్వుతారు.

అవిని అయోమయంగా చూస్తూ ఉంటే ఇంకా నీ బుర్రకు అర్థం కావడం లేదు  కదా...ఇంత చేసిన వాళ్ళము అది చేయలేము అనుకుంటున్నావా అని రేయ్ ఉదయ్ అని పిలుస్తుంది.

ఉదయ్ కూడా ఆ గదిలోనే ఉంటాడు. భార్గవి పిలవగానే అవని ముందుకే వచ్చి నుంచూంటాడు. ఉదయ్ ని అక్కడే చూడగానే అవని భయంతో వణుకుతుంది.

వీటితో ఎఫైర్ ఉంది అని అందరికీ చెబుతాను.  వాడిని వదిలించుకోవడానికి శిల్ప ని మాయం చేసి ఆ ప్లేస్ లో వచ్చి కూర్చున్నావు అని కూడా చెబుతాము అని చాలా క్రూరంగా నవ్వుతూ చెబుతుంది.

అవని ప్రపంచమంతా స్తంభించబోయినట్టు బిగుసుకుపోయి వాళ్ళ నలుగురు వంక చూస్తూ ఉంటుంది. ఏంటి నమ్మవా అని చెప్పి కొన్ని ఫొటోస్ తీసి అవిని ముందు పెడుతుంది.

వాళ్ళిద్దరూ  చాలా క్లోజ్ గా ఉన్నట్టు ఉంటాయి అవి చూడగానే అవని ఏడుస్తూ ఇదంతా అబద్ధం  అని అరుస్తుంది.

అది అబద్ధమని మాకు తెలుసు కానీ చూసేవాళ్ళకే  తెలియదు కదా...  పైగా మీ నాన్నగారు కూడా నిన్ను ఎలా వదిలించుకోవాలని చూస్తున్నారు. ఈ వంకన నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు.

ఇప్పుడు ఆలోచించుకుని సరైన నిర్ణయం చెప్పు అని అక్కడున్న ఆపిల్ తీసుకుని తింటూ ఉంటుంది.  అవని భార్గవి వైపు చూస్తూ ఇప్పుడు నీది పై చేయి కావచ్చు.

ఏదో ఒక రోజు నా భర్త నిజం తెలుసుకుని నాకోసం వస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది.  మీరు చేసిన దుర్మార్గాలన్నీ నా భర్త బయటపడతాడు అని కోపంగా చెబుతోంది.

దానికి భార్గవి నవ్వుతూ పగటి కలలు కంటున్నావా.... ముసుగులో ఉన్నది ఎవరో విక్రమ్ కి తెలియదు.  శోభనం గదిలో మాత్రమే ముసుగు తీసి చూస్తారు.

అక్కడ ఉన్న శిల్ప నే తన భార్య అనుకుంటాడు ఇంకా ఎలా తెలుస్తుంది అని నవ్వుతుంది. దానికి అవని కూడా నవ్వుతూ అదే చూద్దాం పిన్ని ఇక్కడ ఏమి జరిగింది అన్నది నేను ఎవరికీ చెప్పను..

అది పూర్తిగా మీ నోటితోనే మీరే చెబుతారు. ఉదయ్ ని ఇక్కడి నుండి పక్కకు వెళ్ళమను అని కోపంగా చెప్పి ఉదయ్ వంక చూస్తుంది.

ఉదయ్ కి ఆ నిమిషం అవని కోపం చూస్తే ఒక అడుగు వెనక్కి వేస్తాడు.  ఇంకా అక్కడ ఉండకుండా వచ్చిన దారిలోనే బయటికి వెళ్ళిపోతాడు.

మేలు మూసుకుని శిల్ప చేతికేస్తూ తాళి కట్టిన ఆడది శోభనపు గదిలోకి వెళితే భార్య  అంటారు. తాళికట్టకుండా వెళుతున్న ఆడదాన్ని ఏమంటారు అని చేతిలో పెడుతుంది.

భార్గవి ఏదో అనే లోపు సత్యవతి గారు తలుపు కొడుతూ  ఇంకా ఎంతసేపు అమ్మాయి రెడీ చేసేది అని అడుగుతారు.
తీసుకొస్తున్న అత్తయ్య గారు అని చెప్పి నీ సంగతి తర్వాత చూస్తాను అని బిందుకు సైగ చేసి శిల్పని తీసుకుని వెళ్ళిపోతుంది.

బిందు అవని బయటికి రాకుండా కాపలా ఉంటుంది అవని నవ్వుతూ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నేను ఎక్కడికి వెళ్ళను  అని చెప్పి మంచం మీద పడుకుంటుంది.
అవని ధైర్యం చూసి బిందు కి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది
విక్రమ్ గది నుండి స్పీడుగా బయటకు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అది చూసిన భార్గవి షాక్ అవుతుంది.

నిజంగా అవని చెప్పినట్టు విక్రమ్ కి ఏమైనా అనుమానం వచ్చిందా అని ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటుంది. తెల్లారిగానే భర్త దగ్గరికి వెళ్లి మనం విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడే వద్దామా అని....

ఇంట్లో ఎవరూ లేకుండా చేసి ఉదయ్ తో ఈరోజు అవని జీవితం నాశనం అయిపోవాలి . ఇంట్లో ఎవరూ లేకుండా చేశాను అని చెప్పి బయటికి వెళ్లిపోతుంది.

ఇవేమీ తెలియని అవిని గదిలోనే ఉండిపోతుంది. మంచి నిద్రలో ఉన్న అవని గది తలుపు శబ్దానికి వెళ్లి తలుపు తీస్తుంది.

ఉదయ్ వంకరగా నవ్వుతూ కనిపిస్తాడు. ఏంటి అని చిరాగ్గా అడిగితే...  అవిని నీ తోసుకుని గదిలోకి వచ్చేస్తాడు.

అతని చర్యకు అవని బిగిసిపోయి చూస్తుంది.  వెంటనే తేరుకుని ఏం చేస్తున్నావ్వు అంటే...ఏముంది అవని నీ మీద ఎప్పటినుంచో నాకు మనసుంది.

ఈరోజు అది తీర్చేసుకుందామని వచ్చాను అని వంకరగా మాట్లాడుతూ దగ్గరకు వస్తూ ఉంటాడు.  పిచ్చిపిచ్చిగా మాట్లాడావంటే గట్టిగా అరుస్తాను అని బెదిరిస్తుంది.

నువ్వు అరిస్తే ఎవరైనా వస్తారు అనుకుంటున్నావా..ఇంట్లో ఎవరూ లేరు అందుకే కదా.... మేము ఇలా ప్లాన్ చేసింది అని చెప్పి

ఆవిని చున్ని పట్టుకుంటాడు. అవని కి అర్థం అవుతుంది వీళ్లంతా కలిసి తన జీవితం నాశనం చేయడానికి చూస్తున్నారని...

కోపంతో అక్కడ చేతికి దొరికేనా వస్తువుతో తలపై గట్టిగా కొడుతుంది. నాలుగైదు సార్లు కొట్టేతప్పటికీ ఉదయ్ కళ్ళు తిరిగి పడిపోతాడు.

వెంటనే తనవి ఒక నాలుగు జతలు బ్యాగ్ లో పెట్టుకొని  బయటకు పెరగెత్తుతుంది. వెళుతు వాళ్ళ నాన్నమ్మ గదిలో ఒక లెటర్ రాసి పెట్టేసి వెళ్ళిపోతుంది.

ఇది జరిగింది అని ఉదయ్ భయంగా విక్రమ్ వైపు చూసి చెబుతాడు.

విక్రమ్ కి కోపంతో కళ్ళు ఎర్రబడి పోతాయి. పిడికిలి గట్టిగా బిగిస్తాడు.  చేతి నరాలు పొంగిపోయి పైకి పచ్చగా కనబడుతూ ఉంటాయి.

చూసావాళ్ళకి ఒక కాల యముడి లాగా కనిపిస్తాడు.  విక్రమ్ ని అలా చూడగానే ఉదయ్ కి పైప్రాణాలు పైకే పోతాయి.

భరత్, వినయ్ కి కూడా విక్రమ్ ని అలా చూడగానే చాలా భయమేస్తుంది. భరత్ ధైర్యం చేసి బావ అని విక్రమ్ చేయి పట్టుకుంటారు.

విక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు...
ఉదయ్ పరిస్థితి ఏమిటి...
కథ కొనసాగుతుంది...
Like Reply
#44

Next Update Is Coming
[+] 2 users Like SivaSai's post
Like Reply
#45

(11-01-2026, 10:13 PM)SivaSai Wrote:  
Next Update Is Coming

Sorry Internet Problem Gaa Undi

Repu Morning Post Chestanu
[+] 1 user Likes SivaSai's post
Like Reply
#46

Part - 37


భరత్ మెల్లిగా విక్రమ్ చేతి మీద చేయి వేసి బావ అని పిలుస్తాడు. విక్రమ్ చాలా కోపంగా ఉంటాడు. ఆ కళ్ళు అగ్నిగోళాలని తలపిస్తూ ఉంటాయి.

బావ కొంచెం కోపం తగ్గించుకో అసలు విషయం మనకి తెలిసింది కదా ఇప్పుడు ఏం చేయాలి అన్నది ఆలోచిద్దాం అని నచ్చచెబుతాడు.

దానికి విక్రమ్ భరత్ వైపు చూస్తూ మొత్తం అంతా రికార్డ్ అయింది కదా అని అడుగుతాడు. ఎవరీ పాయింట్ రికార్డు అయింది బావ అని చెప్పగానే... ఉదయ్ కి టెన్షన్తో చెమటలు పట్టేస్తాయి.

ఉదయ్ వైపు తిరిగి ఆరోజు శిల్ప ని తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు. దానికి భయంగా ఆ వ్యక్తి పేరు  క్రిష్.  Xxx రిసార్ట్ కి వెళ్ళారు అక్కడ క్రిష్ ఫ్రెండ్ కి సంబంధించిన మోడల్స్ షూట్ జరుగుతుంది.

శిల్ప అందులో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళింది అని చెబుతాడు. విక్రమ్ భరత్ వైపు తిరిగి ఆ డేట్ లో ఉన్న ప్రతి సిసి ఫొటోస్ నాకు కావాలి.

అవన్నీ ఇమ్మీడియేట్ గా అరేంజ్ చెయ్ అని చెబుతాడు. సరే బావ.  నేను నీకు పర్సనల్గా  తెస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు.

ఇదంతా మాకు చెప్పినట్టుగా నువ్వు ఎక్కడైనా బయట పెట్టావా అనుకో బతికుండగానే నరకం చూపిస్తాను. ఈరోజు నీకు చూపించండి జస్ట్ శాంపుల్ మాత్రమే అని చెబుతాడు.

దానికి ఉదయ్ భయంగా నేను ఎక్కడా చెప్పను అని విక్రమ్ కాళ్లు పట్టుకుంటాడు. చిరాగ్గా కాళ్లు వెనక్కి తీసుకుని మీలాంటి వాళ్ళని చూస్తుంటేనే అసహ్యమేస్తుంది.

నా భార్య పైన చెయ్యి వేసిన నీ చేతిని ఇక్కడే విరిచేయాలని ఉంది కానీ...  ఇంకా మీకు టైం ఉంది.  ఆ రోజు మాత్రం మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు.

గాడ్స్ కి సైగ చేసి ఎక్కడినుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేయండి అని చెప్పి తమ్ముడిని తీసుకుని వెళ్ళిపోతాడు.

ఉదయ్ ని తీసుకుని గాడ్స్  ధనుంజయ్ ఇంటి దగ్గరలో వదిలేసి వెళ్లిపోతారు.  ఉదయ్ భయంగా చుట్టూ చూస్తూ మెల్లిగా కుంటుకుంటూ నడుస్తూ ఉంటాడు.

విక్రమ్ గురించి ఉదయ్ కి బాగా తెలుసు. అంత తొందరగా తనని క్షమించడు. ఇప్పుడు ఏం చేస్తాడో అని టెన్షన్తో చెమటలు తుడుచుకుంటూ అడుగులు వేస్తూ ఉంటాడు.

కరెక్ట్ గా మలుపు దగ్గరికి వచ్చేటప్పటికి ఎదురుగుండా ఒక మినీ ట్రక్ వచ్చి గుద్దేసి వెళ్లిపోతుంది. ఉదయ్ ఒక ఎగురు ఎగిరి పక్కనున్న డివైడర్ ని కొట్టుకుని పడిపోతాడు.

ఉదయ్ పడిపోగానే అక్కడ ఉన్న గాడ్స్ వెంటనే విక్రమ్ కి మెసేజ్ చేస్తాడు.  ఇప్పుడు అసలైన ఆట ఉంది.

నేను నిజం తెలుసుకుని అన్నీ బయటపెడతాను అని నా భార్య మీకు ధైర్యంగా సవాలు విసిరింది. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి కదా....

అవిని నీ తలుచూకుంటూ ఎంత నమ్మకమే నామీద నీకు. మనిద్దరం కలిసి ఉన్నది రెండు రోజులే అయినా నా ప్రభావం నీ మీద ఇంత ఉంది అని నేను నమ్మలేకపోతున్నాను.

తాళి కట్టిన భర్తగా నా మీద నువ్వు ఊహించలేనంత ప్రేమను పెంచుకున్నావు.  ఆ ప్రేమే నన్ను నీ వైపు నడిపించి నిజాలన్నీ బయట పెట్టే లాగా చేస్తుంది.

తొందరలోనే ఈ గేమ్ కి చెక్ పెడతాను మై డియర్ వైఫ్ అనుకుంటాడు. సునీల్ కి ఎవరో అన్నోన్ పర్సన్ ఫోన్ చేసి మీ అబ్బాయికి యాక్సిడెంట్  అయ్యి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు అని చెబుతాడు.

వెంటనే సునీల్ బయలుదేరి కొడుకు దగ్గరికి వస్తాడు. రోడ్డు మీద అచేతనంగా పడి ఉన్న ఉదయ్ ని చూడగానే గుండె తరుక్కుపోతుంది.

వెంటనే అంబులెన్స్ కి కాల్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు.  ఉదయ్ ని చెక్ చేసిన డాక్టర్స్ వచ్చి తలకి చాలా గట్టిగా దెబ్బ తగిలింది.

ఇమ్మీడియేట్గా ఆపరేషన్ చేయాలి.  50 లాక్స్ అరేంజ్ చేసుకోండి అని చెబుతాడు.  దానికి అన్ని ఇప్పుడే అరేంజ్ చేస్తాను. మీరు ఆపరేషన్ కి రెడీ చేసుకోండి అని వెంటనే భార్గవికి కాల్ చేస్తాడు.

మంచి నిద్రలో ఉన్న భార్గవి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటన్న ఈ టైం లో ఫోన్ చేశావు అని అడుగుతుంది. వెంటనే 50 లక్షలు తీసుకుని హాస్పిటల్ కి రా అని చెబుతాడు.

దెబ్బకి నిద్రమత్తు అంతా ఎగిరిపోయి ఏంటి అన్నయ్య నువ్వు మాట్లాడేది....  ఉదయ్ కి యాక్సిడెంట్ అయింది. 50 లాక్స్ అర్జెంటుగా కట్టాలి.

బావని అడిగి డబ్బులు తీసుకుని రా అని చెబుతాడు. దానికి భార్గవి ఆలోచిస్తూ ఇప్పుడు ఏం డబ్బులు అడిగితే ఇస్తారా అయినా వాడు పోతే నాకేంటి నొప్పి...

నన్ను బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళలో ఒకడు తగ్గినట్టే కదా అనుకుంటూ.. నేను ఇప్పుడే వెళ్లి ఆయన్ని లేపుతాను అని చెప్పి తలుపు దగ్గరికి వెళ్లి కూడా డోర్ కొట్టకుండా వెనక్కి వస్తుంది.

సునీల్ కి కాల్ చేసి అన్నయ్య ఎంత లేపుతున్న లెగుస్తలేదు.  పొద్దున్నే మాట్లాడదాము నేను ఇప్పుడే హాస్పిటల్ కి వస్తున్నాను అని చెప్పి బిందు దగ్గరికి వెళ్లి విషయం చెప్పి బిందుని తీసుకుని హాస్పిటల్ కి వెళుతుంది.

కారులో అంతా బిందు ఏడుస్తూనే ఉంటుంది.  ఏంటి వదిన ఇలాగ అయింది.  నా కొడుకు ఎవరికి అన్యాయం చేశాడు అని ఏడుస్తూ ఉంటుంది.

(ఎవరు చేసిన పాపం వాళ్ళకి తెలియదంటే ఇదేనేమో )
భార్గవి బిందుని ఊరుకో పెడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ టైం లో బయటికి ఎందుకు వెళ్లాడు...ఏం జరిగి ఉంటుంది అని.

హాస్పిటల్ కి వెళ్ళగానే ముందు సునీల్ ని అడుగుతుంది ఏమైంది అంటే...  కాల్ రావడం యాక్సిడెంట్ ప్లేస్ కి వెళ్లడం అన్నీ చెబుతాడు.

ఉదయ్ ని అసలు ఎవరు గుర్తుపట్టారు. ఎవరైనా ప్లాన్ ప్రకారం చేస్తున్నారా ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటుంది.
తన ఆలోచనలో ఉండగానే తెల్లారిపోతుంది.

సునీల్ వైపూ చూస్తూ అన్నయ్య ప్రస్తుతానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమను.నేను ఇంటికి వెళ్ళగానే ఆయనతో మాట్లాడి మని అరేంజ్ చేస్తాను అని చెప్పి ఇంటికి వెళుతుంది.

బయట నుంచి వస్తున్న భార్గవిని చూసి సత్యవతిగా రాగు అని గట్టిగా అరుస్తారు. ఏమైంది అత్తయ్య అని అమాయకంగా గా అడుగుతుంది.

రాత్రంతా ఎక్కడికి వెళ్లావు అని కోపంగా అడుగుతారు. దానికి భార్గవి అసలు విషయం మర్చిపోయి ఆవేశంగా అత్తయ్య అని అరుస్తుంది.

రాత్రంతా బయట తిరిగి వచ్చిన నిన్ను కోపంగా అడిగితే నా మీద అరుస్తున్నావు ఇదేనా ధనుంజయ్ మీ భార్యాభర్తల నిర్వాకం.

భర్త ఇంట్లో ఉన్నప్పుడు రాత్రులు భార్య రోడ్లు పట్టుకుని తిరుగుతుంటే అర్థమేంటి అని కోప్పడతారు. దానికి ధనుంజయ్ కోపంగా భార్గవి చంప మీద కొట్టి ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు.

భార్గవి ఆశ్చర్యంగా ధనుంజయ్ వైపు చూస్తూ మీరేనా నన్ను కొట్టింది అని అడుగుతుంది. కనబడడం లేదా అని కల్లూరుముతు ఎక్కడికి వెళ్లావు రాత్రంతా అని అరుస్తాడు.

దానికి భార్గవి ఒక అడుగు వెనక్కి వేసి ఉదయ్ కి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అక్కడికి వెళ్లాను.

50 లాక్స్ ట్రీట్మెంట్ కి కావాలి అని మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. రాత్రి జరిగితే ఇప్పుడు దాకా నువ్వు చెప్పలేదా నాకు అని అనుమానంగా అడుగుతాడు.

ఏంటండీ మరి అంత అలా అనుమానిస్తున్నారు. నేను చెప్పేదంతా నిజమే.  రాత్రి మీరు నిద్రపోతూ ఉన్నారని లేపడం ఎందుకని అని నేనే వెళ్ళాను అని చెబుతుంది.

అవునా అని సునీల్ కి ఫోన్ చేస్తాడు. సునీల్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బావ అనగానే... ఎక్కడున్నావ్ సునీల్ అనే అడుగుతాడు.

సర్వెంట్స్ క్వార్టర్స్ లోనే ఉన్నాను అని చెబుతాడు మరి  ఉదయ్ అనగానే బాధతో ఉదయ్ తను చేసిన తప్పుకి తన ముఖం చూపించలేక తిరుపతి పాదయాత్ర చేస్తున్నాడు అని చెబుతాడు.

మరి మీ చెల్లి ఏంటి ఉదయ్ కి యాక్సిడెంట్ అయింది 50 లక్షలు కావాలి అని అడుగుతుంది అని అడుగుతాడు. లేదు బావ అస్సలు మేము ఏమి అడగలేదు.

నీకు అబద్దం చెబుతుంది. నేను బిందు ఇప్పుడే వస్తున్నాము అని ఇంట్లో కి వస్తాడు. భార్గవి అది అంత విని సునీల్ తో ఏమిటి అన్నయ్య అలా మాట్లాడుతున్నావు.

రాత్రి ఫోన్ చేసావు కదా అని ఫోన్ ఓపెన్ చేసి కాల్ లిస్ట్ చూడండి అని భర్త తో అంటుంది. ఎక్కడ కూడ ఫోన్ వచ్చినట్టు ఉండదు

అంత సైలెంట్ వర్క్ జరిగిపోతుంది. భార్గవి భర్త చెయ్యి పట్టుకుని నేను నిజమే చెబుతున్నాను. నన్ను నమ్మండి అని ఏడుస్తుంది.

ఎందుకు చెల్లమ్మ బావ కి దొరికిపోయాక కూడ నిజం దాస్తావు అనగానే ఏమి నిజం అన్నయ్య అని భయంగా అడుగుతుంది
నా నోటితో ఎలా చెప్పగలను అని బావ నన్ను క్షమించు. నా చెల్లికి చాలా అఫైర్స్ ఉన్నాయి అన్ని తెలిసిన నేను మాట్లాడలేదు అని చెబుతాడు.

అన్నయ్య అని గట్టిగ అరుస్తుంది. ఎంత దుర్మార్గురాలు అయినా క్యారెక్టర్ మీద నింద పడడం తట్టుకోలేకపోతుంది.
ధనుంజయ్ అసహ్యంగా  చూస్తూ నీ మొఖం చూడాలి అన్న చిరాగ్గా ఉంది.

నా కంటికి కనపడకు. సునీల్ వైపు తిరిగి నీ చెల్లిని కూడ క్వార్టర్స్ లో ఉంచు అని రూమ్ కి వెళ్లి తలుపు వేసుకుంటాడు.

సత్యవతి కోడలి వంక చూస్తూ ఛీ పాపిష్టిదనా ఎంత సిగ్గుమాలిన పని చేసావు అని జుట్టు పట్టుకుని బయటకు గెంటెస్తుంది.

భార్గవి ఏడుస్తూ సర్వంట్ క్వార్టర్స్ లో కి వెళ్ళుతుంది. సత్యవతి గారు రూమ్ లోనికి వెళ్లి తలుపు వేసుకొని విక్రమ్ కి కాల్ చేస్తోంది.

చెప్పండి బామ్మగారు అనగానే... బాబు నువ్వు చెప్పినట్టే చేసాను. భార్గవి సునీల్ తో కలిసి వెళ్లింది అని చెబుతారు.
ఇప్పుడు ఏమి చేయాలి అనగానే మనం ఏమి చేయక్కరలేదు.

భార్గవి గొడవపడుతూ నిజాలు అన్ని కక్కడమే అవి నీ కొడుకు వినాలి అని ఫోన్ పెట్టేస్తాడు.
[+] 14 users Like SivaSai's post
Like Reply
#47

Part - 38


విక్రమ్ ఉదయ్ కి వార్నింగ్ ఇచ్చిన తర్వాత వినయ్ తీసుకుని మాన్షన్ కి వెళ్ళిపోతాడు. విక్రమ్ వెళ్ళేటప్పటికి లలిత గారు హాల్లోనే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటారు.

విక్రమ్ ని చూడగానే వెళ్లి హత్తుకుని నా కోడలు ఎలా ఉంది నాన్న అని అడుగుతారు. విక్రమ్ నవ్వుతూ ఎలా ఉన్నావ్ అని నన్ను అడగడం మానేసి...

అవని ఎలా ఉంది అని అడుగుతున్నావా అంటే... నీ గురించి నాకు తెలుసు రా...నువ్వు బానే ఉంటావు. ఒంటరిగా ఉంటుంది తన గురించి కదా నా బెంగ అంతా అనగానే...

ఐ లవ్ యు మమ్మీ.  నీలాంటి అత్తగారు ఉంటే ఏ కోడలు అయిపోయిన బిందాస్ అని చెప్పి ఫ్రెష్ అయి వస్తాను బాగా ఆకలిగా ఉంది అని చెప్పి రూమ్ కి వెళ్ళిపోతాడు.

వినయ్ కూడా రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయి వస్తాడు. విక్రమ్
తొందరగా ఫ్రెష్ అయ్యి వచ్చి వాళ్ళ అమ్మ చేతి గోరుముద్దలు తింటూ... శిల్ప పనిష్మెంట్లు ఎంతవరకు వచ్చినాయి మామ్ అని అడుగుతాడు.

నువ్వు చెప్పినట్టుగానే వన్ బై వన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. కక్కలేక మింగలేక అమ్మ కూతురు ఇద్దరు విలవిల్లాడుతున్నారు .

ఎప్పుడు నాన్న దీనికి ఫుల్ స్టాప్ పెట్టేది అని అడుగుతారు. తొందర్లోనే దీనికి శుభం కార్డు పలుకుతున్నాను.

రేపు ఇచ్చే ట్విస్ట్ తో శిల్ప భూమి కింద కాళ్లు కదులుతాయి అని చెప్పి భోజనం కంప్లీట్ చేస్తాడు.  సరే నాన్న వెళ్లి రెస్ట్ తీసుకో అని కొడుకులు ఇద్దరికీ దిష్టి తీస్తారు.

మేము ఇంకా చిన్నపిల్లల మా  అమ్మ అంటే..
మీరు ఎంత ఎదిగినా సరే నా పిల్లలు నాకు ఎప్పుడూ చిన్న పిల్లలే.

ఇంకా వెళ్లి పడుకో నాన్న అని చెప్పి లలిత గారు కూడా పడుకోవడానికి వెళ్తారు.

విక్రమ్ కూడా తన రూమ్ కి వెళ్ళిపోయి మంచం మీద వాలుతాడు.  పొద్దున్ననుంచి ఒకటే పరుగులు మీద ఉన్నాడు. అలసటగా అనిపించి కళ్ళు మూసుకుంటాడు.

మూసుకున్న కనురెప్పల వెనకాల అవని రూపం కనబడుతుంది.  అవనికి ఫోన్ చేయడం మర్చిపోయాను అనుకుని  వెంటనే ఫోన్ చేస్తాడు.

విక్రమ్ ఫోన్ కోసమే చూస్తున్నాట్టుగా కూర్చున్నా అవని ఒక్కరింగికే లిఫ్ట్ చేసి వెళ్లిపోయారా అని అడుగుతుంది. ఏంటి నువ్వు ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు.

అది నిద్ర రాలేదు అని చెబుతుంది. అవునా అని ఇప్పుడే ఇంటికి వచ్చాను అని చెప్తాడు. అదేంటి ఫ్లైట్ ఎప్పుడో వెళ్లిపోయింది కదా..  ఇంత లేట్ ఎందుకు అయింది.

మధ్యలో ఏమైనా ఇబ్బంది అయిందా అని కంగారుగా అడుగుతుంది.  దానికి విక్రమ్ ఎందుకు అంత కంగారు పడుతున్నావు.

నేను ఎయిర్పోర్ట్ నుంచి ఆఫీస్ కి వెళ్ళాను.  అందుకే లేట్ అయింది. నీకు ఫోన్ చేయడం కుదరలేదు అని చెప్పి డిన్నర్ చేసావా అని అడుగుతాడు.

హ అని మెల్లిగా చెబుతోంది ఓయ్ ఒకసారి వీడియో ఆన్ చెయ్ అని చెప్పి వీడియో కాల్ చేస్తాడు. వెంటనే అవిని కంగారుగా ఇప్పుడు వీడియో కాల్ ఎందుకు...

మామూలుగా మాట్లాడండి చాలు అంటే... ఎందుకు అంత కంగారు పడుతున్నావు. రూమ్ లో నేను ఒక్కడినే ఉన్నాను మాట్లాడు అని చెబుతాడు..

అప్పుడు అవిని కొంచెం రిలాక్స్ అయి విక్రమ్ వైపు చూస్తుంది. చాలా అలసటగా కనిపిస్తాడు. ఈరోజు మీకు వర్క్ చాలా ఎక్కువ అయిపోయినట్టుంది అని అడుగుతుంది.

ఎందుకు అనిపించింది అని తిరిగి క్వశ్చన్ చేస్తాడు.  మీ ముఖం చాలా వాడిపోయి ఉంది.  హైదరాబాద్ వెళ్ళినప్పుడు నుంచి పరుగులు పెడుతునే ఉన్నట్టున్నారు అని అడుగుతుంది.

హ్మ్...కొంచెం ఇంపార్టెంట్ వర్క్. ఇప్పుడు ఆ వర్క్ ఫినిష్ అయిపోయింది.రిలాక్స్డ్ గానే ఉన్నాను అని చెప్తాడు.  సరే పడుకోండి గుడ్ నైట్ అని చెప్తుంది.

గుడ్ నైట్ అవని ఎక్కువ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. విక్రమ్ చూసిన ఆనందంతో అవిని కూడా పీస్ ఫుల్ గా నిద్రపోతుంది

నెక్స్ట్ డే మార్నింగ్ విక్రమ్ లేచి జిమ్  ఫినిష్ చేసుకుని కిందకి వస్తాడు.  విక్రమ్ ని చూసిన శిల్ప హమ్మయ్య విక్రమ్ వచ్చాడు.

ఎలాగైనా విక్రమ్ తో మాట్లాడాలి అనుకుని గబగబా విక్రమ్ వైపుకు వెళుతూ ఉంటుంది. మాధవి గారు శిల్ప ను చూసి ఎక్కడికి శిల్పా అంత స్పీడ్ గా వెళుతున్నావు అని అడుగుతారు.

అబ్బా ఈవిడ  చూశారా అనుకొని... అదేమీ లేదు పిన్ని గారు,  విక్రమ్ గారు ఇప్పుడే కనిపించారు. ఏమైనా కావాలేమో అని అడుగుదామని వెళుతున్నాను అంటే...

విక్రమ్ కి ఏమన్నా కావలిస్తే మేము చూస్తాము గాని...నీకు అమ్మ ఏం చెప్పింది.  ఈ దోషం పోయే వరకు నిన్ను విక్రమ్ కి ఎదురు పడద్దని చెప్పింది కదా...

పెద్దవాళ్ల మాట అంటే అసలు లెక్క లేదా..మీ అమ్మ ఇదే నేర్పించిందా అని కోప్పడతారు. వెంటనే శిల్ప కోపంతో ప్రతిదానికి మా అమ్మని అంటారు ఎందుకు..

భర్తతో మాట్లాడడానికి కూడా అందరి పర్మిషన్ కావాలా అంటూ ముసలి కన్నీరు కారుస్తూ ఉంటుంది ఇలాగైనా విక్రమ్ పట్టించుకుంటాడేమో అని చిన్న ఆశ.

విక్రమ్ మాధవి వైపు తిరిగి అత్త ఈ రోజు లంచ్ కి ఒక ఇంపార్టెంట్ గెస్ట్ వస్తున్నారు.  మంచి డిషెస్ అన్నీ రెడీ చేయండి.  నాకు వర్క్ ఉంది అని చెప్పి స్టడీ రూమ్ కి వెళ్ళిపోతాడు.

వెళుతున్న విక్రమ్ వైపు శిల్పా అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి శిల్ప  అంతలా ఏడ్చిన విక్రమ్ పట్టించుకోలేదని ఆలోచిస్తున్నావా...

విక్రమ్ పెద్దవాళ్ల మాటకి విలువస్తాడు. మా అమ్మ చెప్పింది కదా దోషం పోయేవరకు మాట్లాడకూడదని... అందుకే పెద్ద వాళ్ల మాటకి కట్టుబడి ఉన్నాడు.

నీకేమో అలాంటివి ఏమీ లేవు.  ఏం చేస్తాము మా కర్మ నీలాంటి దాన్ని మా ఇంటి కోడలుగా తెచ్చుకున్నందుకు వెళ్లి నీ పని చూసుకో అని విసుగ్గా కిచెన్ లోకి వెళ్ళిపోతారు.

శిల్ప పుట్టినప్పటినుంచి గారాభంగా పెరుగడం వల్ల ఏరోజు ఒక మాట కూడా ఎవరు అనింది లేదు. ఈ మాన్షన్ కి వచ్చినప్పుడు నుంచి ప్రతిరోజు ఛీత్కారాలు , అవమానాలు కడుపునిండా తిండి కూడా లేదు.

ఇవన్నీ ఆలోచించి ఇంకా దుఃఖం తన్నుకోస్తూ ఉంటే గదిలోకి వెళ్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. రెండుసార్లు ఫోన్ రింగ్ అయి కట్ అయిపోతుంది.

మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది.  ఫోన్ ఎప్పుడు చేతిలోనే ఉంటుంది కదా అని మళ్ళీ చేస్తుంది. కట్ అయిపోయే ముందు లిఫ్ట్ చేసి చెప్పు బేబీ అనగానే...

ఏం చెప్పాలి మామ్ నువ్వు ఏం చెప్పి నన్ను ఇక్కడకి పంపించావు. ఇక్కడ ఏం జరుగుతుంది.  ప్రతి నిమిషం నాకు అవమానాలే.

విక్రమ్ అయితే నా వైపు అసలు చూడనే చూడడు.  ఏదైనా మాట్లాడదామంటే దోషం మాట్లాడకూడదు అని ఆపేస్తున్నారు. ఇంకా విక్రమ్ నా వైపు కి ఎలా తిప్పుకోవాలి అని ఏడుస్తూ అడుగుతుంది.

భార్గవి అసలే చిరాకులో ఉంది ఇప్పుడు శిల్ప ఏడుపుతో విసుగు వచ్చి...  బేబీ ప్రతిదానికి ఏడవడం కాదు.  ఇన్ని రోజులైంది.   ఇంట్లో వాళ్ళని నీ వైపుకు తిప్పుకోలేకపోయావు.

అసలు నువ్వు నా కూతురువేనా అని కోపంగా అడుగుతుంది. ఏంటి మామ్ నువ్వు కూడా నా మీద అరుస్తున్నావా అంటే...

లేకపోతే ఏంటి బేబీ.  మా పెళ్లయిన నెలలోపే మీ డాడీని నా వైపుకు తిప్పుకున్నాను. నేను ఏది చెబితే అది వినేటట్టు చేశాను.

అలాంటిది కొత్తగా పెళ్లయిన నువ్వు నీ భర్తని నీ వైపుకు తిప్పుకోలేకపోతున్నావు. నాతో ఏదైనా మాట్లాడితేనే కదా నా వైపు తిప్పుకునేది అని అడిగితే...

నువ్వు అందర్నీ అబ్జర్వ్ చెయ్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్నెస్ ఉంటది. ఆ వీక్నెస్ తో నీ వైపుకు తిప్పుకోవాలి బేబీ అని చెబుతుంది. ఓకే మా నేను ఆ ప్రయత్నంలోనే ఉంటానని ఫోన్ పెట్టేస్తుంది.

తల్లి కూతుర్లు మాట్లాడుకున్న ప్రతి మాట రికార్డ్ అయిపోతుంది. అదంతా విన్న విక్రమ్ పరవాలేదు తల్లి కూతుర్లు బానే ప్లాన్ వేస్తున్నారు.

ఈ రోజు నేను ఇచ్చే ట్విస్టుతో నీ కూతురు పరిస్థితి ఏంటో భార్గవి అని నవ్వుకుంటాడు. నవ్వుకుంటున్న కొడుకుని చూసి ఏంటి విక్రమ్ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని కళ్యాణ్ గారు అడుగుతారు.

ఏమీ లేదు డాడ్...హనుమంతుడు ముందు కొప్పిగొంతులు అన్నట్టుగా మన ముందే తల్లి కూతుర్లు ఇద్దరు డాన్స్ చేస్తున్నారు. వాళ్లు పాట్లు చూసి నవ్వు వస్తుంది అని చెబుతాడు.

ఉదయ్ పరిస్థితి ఎలా ఉంది విక్రమ్ అని అడుగుతాడు. అప్పుడే వినయ్ మీకు చెప్పేసాడా అంటే.. హ..అదంతా విన్నాక నిజంగా చాలా బాధ అనిపించింది రా..

అందరూ ఆడవాళ్లే కదరా..  అవిని నీ అంత దారుణంగా ఎలా హింసించారు అని బాధపడతారు.  రమేష్ గారు కూడా బాధపడుతూ విక్రమ్ వైపు చూసి తొందరగా నా కూతుర్ని తీసుకొచ్చాయి.

ఇన్ని రోజులు తల్లిదండ్రులు లోటు తీర్చలేకపోయినా.. ఇప్పుడు నుండి మాత్రం ఆ లోటు పూర్తిగా మేము తీర్చేస్తాము అని చాలా ఎమోషనల్ గా చెబుతారు.

విక్రమ్ మాత్రం సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు.  ఏమైంది విక్రమ్ సీరియస్ గా ఉన్నావంటే.. నథింగ్ డాడ్. ఈరోజు మధ్యాహ్నం జరిగే సినిమా గురించి అని చెబుతాడు.

అంటే..... అయోమయంగా అడుగుతారు.  వెయిట్ అండ్ వాచ్. ముందే చెప్పేస్తే ట్విస్ట్ ఏముంటుంది అని చెప్పి మీరు లంచ్ టైం కి అందరూ ఇంట్లోనే ఉండండి. ఎక్కడికి వెళ్లదు అని గట్టిగా చెబుతాడు.

మేమెందుకు ఆ సినిమా మిస్ అయిపోతాము అని చెప్పి అందరూ ఇంట్లో ఉండే వర్క్ చూసుకుంటూ ఉంటారు. శిల్ప తో పని అంతా చేపిస్తూ లలిత, మాధవి గెస్ట్ కోసమని వెరైటీస్ రెడీ చేస్తూ ఉంటారు.

ఇదే మంచి టైము. ముందు వీళ్ళిద్దరితో మాటలు కలపాలి అనుకుని... అత్తయ్య గారు అని చాలా స్వీట్ గా పిలుస్తుంది.

ఆ మాటకి లలిత గారికి విసుగు వచ్చి ఏంటమ్మా కోడలు గాని కోడలు పిల్ల అని అడుగుతారు.  ఆ మాటకి బిత్తర చూపులతో అదేం పిలుపు అత్తయ్య గారు అంటే...

అదే ఇంకా పూర్తిగా దోషం పోలేదు కదా.. అందుకే అలా పిలిచాను ఏంటి విషయం అని అడుగుతారు.

శిల్ప ఏమి చెబుతుంది...

కథ కొనసాగుతుంది....

ప్లీజ్ గివ్ మీ రేటింగ్స్
Like Reply
#48

Next 3 Days Double Dhamaka
[+] 3 users Like SivaSai's post
Like Reply
#49

ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం

Konchem E Story Ni Kuda Support Cheyandi Friends
[+] 3 users Like SivaSai's post
Like Reply
#50

Part - 39


  లలిత వెటకారానికి ఒళ్ళు మండుతున్న ఏమి మాట్లాడలేని పొజిషన్.. పైకి నవ్వుతూ అత్తయ్య గారు ఈరోజు ఎవరో గెస్ట్ అన్నారు ఎవరు అని అడుగుతుంది.

దానికి లలిత తెలీదమ్మా అబ్బాయి చాల ఇంపార్టెంట్ వ్యక్తి అని మాత్రమే చెప్పాడు. అయినా నీకెందుకు ఆ విషయాలు అని అడిగితే...

ఇంపార్టెంట్ గెస్ట్ అన్నారు కదా..  నేను కూడా నీట్ గా రెడీ అవుదామని చెబుతుంది.  దానికి మాధవి నవ్వుతూ నువ్వు ఎలా రెడీ అయిన ముసుగు తీయకూడదు కదా శిల్ప.

అప్పుడే నిన్ను ఇంటి కోడలు ఎవ్వరికే పరిచయం చేయలేము. కాబట్టి నువ్వు ఎలా రెడీ అయిన ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి... ఎక్కువ ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకో సరేనా అని చెప్పి...

వదినా ఈ చికెన్ ఫ్రై సంగతి చూడు అని చెబుతుంది. వదిన మరదలు వంక పళ్ళు నూరుకుంటూ చూసి... ఒక్కసారి విక్రమ్ తో నా లైఫ్ స్టార్ట్ అవ్వని అప్పుడు చెబుతాను ఒక్కొక్కళ్ళ పని.

ఈ మాధవిని ముందు ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి అని మనసులో కుతంత్రాలు రచించుకుంటూ పైకి నవ్వుతూ అలాగే పిన్ని గారు అనే సాగదీస్తూ పని చేసుకుంటూ ఉంటుంది.

దీనికి ఒళ్ళంతా గోరోజనమే కదా వదినా అని సైగ చేస్తుంది. అవునవును ఈరోజు ఏదో మంచి మూవీ ఉంది అంటున్నాడు అప్పుడు తెలుస్తుంది.

దీని గోరోజనం  అని వదిన మరదలు ఇద్దరు గుసగుసగా మాట్లాడుకుంటారు. వాళ్లు గుసగుసలు ఏమీ అర్థం కాక ఒకసారి  ముసలి దాని వైపు నుంచి నరుక్కు వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ...

అత్తయ్య గారు మామ్మగారికి జ్యూస్ పట్టుకెళ్ళి ఇవ్వనా అని అడుగుతుంది.  దానికి లలిత గారు పైనుంచి కిందకి చూస్తూ ఏంటో... ఈరోజు నువ్వు మరీ అతిగా మర్యాదలు చేస్తున్నట్టు కనిపిస్తుంది అని అడుగుతారు.

దానికి శిల్ప నవ్వుతూ అలాంటిదేమీ లేదు అత్తయ్య గారు...  రోజు రోజుకి పనులు నేర్చుకుంటున్నాను కదా... అందుకే మర్యాదలు కూడా జాగ్రత్తగా చేద్దామని... తీసుకు వెళ్ళమంటారా  అని అమాయకంగా అడుగుతుంది.

నువ్వు పట్టుకెళ్తానంటే వద్దంటానా వెళ్ళు వెళ్ళు అని పంపిస్తారు. జ్యూస్ తీసుకుని ఇందిరా గారి దగ్గరికి వెళ్లి మా మామ్మగారు అని పిలుస్తుంది.

రామాయణం చదువుతున్న ఇందిరా గారు శిల్ప వైపు చూసి ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు అనుకుని రామ్మ అని నవ్వుతారు.

మీరు టిఫిన్ చేసి చాలాసేపు అయింది కదా జ్యూస్ తాగండి అని ఇస్తుంది. ఇది ఎందుకు నన్ను ఈ రోజు ఇలా కాక పడుతుంది.

సరే చెప్తాను అనుకొని...అమ్మ కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి.  ఆ ఆయిల్ తో మసాజ్ చెయ్ తల్లి అని చెబుతారు.

దానికి శిల్ప నేనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. నీకు సేవలు చేయడం అంటే ఇష్టం ఉండదు కదా...సర్లే వెళ్ళమ్మ నేను విక్రమ్ కి చెప్తే ఎవరైనా పురమాయిస్తాడు అని బాధగా మాట్లాడుతారు.

దానికి శిల్ప అయ్యో ఈమాత్రం దానికి విక్రమ్ గారు దాకా ఎందుకు.. నేను నొక్కుతాను మామ్మగారు అని చెప్పి పడుకుంటారా రాస్తాను అని అడుగుతుంది.

సరే అమ్మ అని చెప్పి పడుకుని కాళ్లు శిల్ప ఓళ్లో పెడతారు.
శిల్ప ఇంకా ఏమీ చేయలేక ఆయిల్ రాస్తూ కాళ్ళు నొక్కుతూ ఉంటుంది.

ఒక గంట నొక్కించుకున్న తర్వాత చాల్లే ఇప్పటికి..కాళ్ళు నొప్పులు తగ్గినట్టు ఉన్నాయి. మళ్లీ అనిపిస్తే నీకు చెప్తాను తల్లి నేను కాసేపు పడుకుంటాను అని చెప్పి బయటికి పంపించేస్తుంది.

ఛ.. ఎంతసేపు నొక్కినా బాగా చేశావన్న మాట మాత్రం ఈ ముసలిది అనడం లేదు. ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ కిచెన్లోకి వెళుతుంది.

లలిత గారు శిల్ప వైపు కోపంగా చూసి ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు.  ఇక్కడ పని తప్పించుకోవడానికి వేషాలు వేస్తున్నావా...

గెస్ట్ వస్తున్నారు. పనుంది అని చెప్పాను కదా అని అరుస్తారు.   దానికి శిల్ప మామ్మగారికి కాళ్లు నొక్కుతూ కూర్చున్నాను.  అందుకే లేట్ అయింది.

అయినా సర్వెంట్స్ ఉన్నారు కదా అత్తయ్య గారు అంటే.. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుర్రలోకి ఎక్కదా... వంట పని  ఎప్పుడు ఇంటి ఇల్లాలే చేయాలి అని ఎన్నిసార్లు అత్తయ్య గారు చెప్పి ఉంటారు.

విసుగ్గా ఏంటి వదిన.. అసలు ఈ అమ్మాయికి ఏమీ అర్థం కాదు.  వీళ్ళ అమ్మ అసలు ఎలా పెంచింది.  పెళ్లిచూపులు అప్పుడు మాత్రం మా అమ్మాయికి అన్ని పనులు వచ్చు అని వాయిగొడతారు.

ఇప్పుడు చూస్తే మనం చెప్పిన పనిని చేయదు. తన సొంతంగానూ రాదు. అబద్ధాలు చెప్పి, మోసం చేసి మన ఇంటికి పంపించారు.  ఛి ఛి...

మన నివి చూడు అన్ని పనులు ఎంత బాగా చక్కబెడుతుంది అని రుసరసలాడుతూ ఉంటారు.. ఆ మాటలకే చాలా బాధ అనిపిస్తుంది.

ఉక్రోషముతో మేమేమీ మోసం చేయలేదు అత్తయ్య గారు అని అంటుంది. అవునా నిజంగా మోసం చేయలేదా అని శిల్ప వైపు తిరిగి సూటిగా అడుగుతారు.

ఆ మాటకి తడబడుతూ మేమేం మోసం చేసాము చెప్పండి అని అడుగుతుంది.
( ఇంకా వీళ్ళు చేసింది ఎవరికైనా తెలియదు అన్న భ్రమలో ఉన్నారు తల్లి కూతుర్లు )

నీ మాట తడబాటిలోనే తెలుస్తుంది శిల్ప మీరు మోసం చేశారో లేదో అన్నది.  ఇప్పుడైనా నీతో మాట్లాడే అంత టైం మాకు లేదు అని చెప్పి వంటలో బిజీ అయిపోతారు.

శిల్ప ఆ నిమిషానికి హమ్మయ్య అనుకుని మోసం చేసాము అంటున్నారు. కొంపతీసి పెళ్లికూతురు మారిందన్న విషయం తెలిసిపోయిందా ఏమిటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది .

విక్రమ్ స్టడీ రూమ్ నుంచి కిందకు వచ్చి అమ్మ లంచ్ ప్రిపేర్ అయిపోయిందా నా ఫ్రెండ్ వచ్చే టైం అయింది అని చెబుతాడు.

అయిపోయింది నాన్న  నీ ఫ్రెండ్ రావడమే లేటు అని చెబుతారు శిల్ప ను కూడా రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి రమ్మని పంపిస్తారు.

విక్రమ్ ఫోన్ కి మెసేజ్ వస్తుంది  గెస్ట్ వచ్చాడు లోపలికి తీసుకు వస్తున్నాము అని.. ఓకే అని వెయిట్ చేస్తూ ఉంటాడు.  సెక్యూరిటీ లోపలికి తీసుకువచ్చి వెళ్ళిపోతారు.

విక్రమ  ఆ గెస్ట్ కి ఎదురుగా వెళ్లి హాయ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి తీసుకొచ్చి సోఫాలో కూర్చో పెడతాడు.

హాయ్ సార్ మీరు మరీ ఇలా ఎదురొచ్చి రిసీవ్ చేసుకుంటూ ఉంటే చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది.

మీలాంటి గొప్ప వాళ్ళు మాలాంటి వాళ్ళని ఇన్వైట్ చేయడమే ఎక్కువ... అదే కాకుండా దగ్గరుండి మరీ రిసీవ్ చేసుకుంటున్నారు అని చాలా అత్యుత్సాహం ని చూపిస్తాడు.

దానికి విక్రమ్ నవ్వుతూ ఇందులో ఏముంది.. మేమే ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేసినప్పుడు,  గెస్ట్ ని అంతే సాదరంగా రిసీవ్ చేసుకోవాలి కదా అని కూర్చోండి అని చెబుతాడు.

ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తారు.  పేరుపేరునా అందరిని పరిచయం చేస్తాడు. పెద్ద వారైనా ఇందిరాగారి కాళ్ళకి నమస్కారం చేసి కూర్చుంటాడు.

విక్రమ్ నివి కి సైగ చేస్తాడు. ఎక్స్క్యూజ్మీ అని నివి శిల్ప దగ్గరికి వెళ్లి శిల్ప అని పిలుస్తుంది. శిల్ప నివి వైపు చూస్తూ వదిన అని పిలవాలి కదా..  శిల్ప అంటావేంటి అని కొంచెం కోపంగానే అడుగుతుంది.

మీ దోషం పోయేదాకా అలా వరుసలు పెట్టి పిలువకూడదు కానీ..  గెస్ట్ వచ్చారు నిన్నే పరిచయం చేయాలంట రమ్మంటున్నారు అని చెబుతోంది.

దానికే శిల్ప గర్వంగా నివి వైపు చూసి మూసుగువేసుకొని నివి వెనకాలే వెళుతుంది.  శిల్ప హాల్ లోకి వచ్చి విక్రమ్ వైపు వెళ్లబోతుంది.

వెంటనే లలిత గారు శిల్పా ఇటు రా అని పిలుస్తారు.. ఆ పేరుకి గెస్ట్ అనుకోకుండా శిల్ప వైపు చూస్తాడు. విక్రమ్ మాత్రం గెస్ట్ వైపే చూస్తూ ఉంటాడు.

శిల్ప వెళ్లి లలిత పక్కన నిలబడుతుంది. అక్కడ కూర్చోవడానికి కూడా ఎగస్ట్రా ఇంకొక చైర్ కూడా ఉండదు.
లలిత గారు గెస్ట్ వైపు తిరిగి తిను మాకు కావలసిన అమ్మాయి శిల్ప అని పరిచయం చేస్తారు.

ఆ మాటకి శిల్ప చిరాకుగా లలిత గారిని చూస్తూ.. గెస్ట్ వైపు తిరిగి న.. మ...స్కా..రం అంటూ మాట నోటులోనే ఆగిపోతుంది.

విక్రమ్ కన్నింగ్ నవ్వుకుంటూ డాడ్. ఇతని పేరు క్రిష్. మోడలింగ్ ఏజెన్సీ ఉంది ఫర్దర్ గా మన ప్రోడక్ట్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ వీళ్లతోనే చేపిద్దాం అనుకుంటున్నాను అని చెబుతూ..  శిల్ప వైపు చూడమని సైగ చేస్తాడు.

కళ్యాణ్,రమేష్ వారగా శిల్ప వైపు చూస్తారు.  అప్పటికే శిల్ప వణుకుతూ ఉంటుంది. ఓహో ఇదేనా సినిమా అంటే అనుకొని అలాగే విక్రమ్. ఒకసారి వాళ్ళ కోడ్స్ తో వచ్చి కంపెనీలో కలవమని చెప్పు ఫైనల్ చేద్దాము అని చెబుతారు.

మాధవి శిల్ప వైపు తిరిగి గెస్ట్ వచ్చి ఇంతసేపు అయింది కదా..  వెళ్లి జ్యూస్ తీసుకురా అని చెప్పి పంపిస్తారు. వెళుతున్న శిల్ప వైపే క్రిష్ చూస్తూ ఉంటాడు.

ఏమైంది క్రిష్ అమ్మాయి వైపే అలా చూస్తున్నావు అని మాధవి అడిగితే... ఏమీ లేదు అంటీ.. ఈ పేరు విన్నట్టుంటే చూస్తున్నాను.

అలాగే అవుట్ లుక్ చూస్తూ ఉంటే ఎక్కడో చూశాను అన్న ఫీలింగ్ వస్తుంది అంతే అని చెబుతాడు. అవునా తను మాకు కావలసిన వాళ్ళ అమ్మాయి.

కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది అని చెబుతారు. దానికి మరి మూసుగు ఎందుకు వేసుకుంది అని అడిగితే..  ఫేస్ మీద కొద్దిగా ఎలర్జీ వచ్చింది అది ఎవరికి కనపడకుండా ఉండడానికి అలా వేసుకుంది అంతే అని చెబుతారు.

అవునా అని వస్తున్న శిల్ప వైపే చూస్తూ ఉంటాడు.  శిల్పకు అప్పటికే చాలా టెన్షన్ వస్తూ ఉంటుంది.  క్రిష్ నన్ను గుర్తుపట్టాడు అంటే..  ఇంక అంతే సంగతులు అనుకుంటూ ట్రై లో ఉన్న జ్యూస్ తో క్రిష్ కి ఎదురుగుండా నిలబడుతుంది.
Like Reply
#51

Part - 40


శిల్ప జ్యూస్ తీసుకువచ్చి క్రిష్ ముందు నిలబడుతుంది. చేతులు వణుకుతూ ఉంటాయి. మాట్లాడితే ఎక్కడ తన గొంతు గుర్తుపడతాడు ఏమో అని సైలెంట్ గా ఇస్తుంది.

క్రిష్ అనుమానం గా చూస్తూ గ్లాస్ తీసుకోవడానికి చెయ్యి ముందుకు పెడతాడు. తొందరగా తీసుకుంటే వెళ్ళిపోవాలి అని శిల్ప ఒక పాదం ఎత్తుతుంది. 

క్రిష్ బ్యాక్ సైడ్ కి ఉన్నా స్టాండ్ ఫ్యాన్ ఆన్ అవుతుంది. ఆ ఫ్యాన్ గాలి శిల్ప ఫేస్ కి తగేలేలాగా  సెట్ చేస్తారు. వినయ్ ఫ్యాన్ దగ్గర ఉండి శిల్ప ఫేస్ కి తగేలేలాగా  చేస్తాడు.

అంతే శిల్ప ఫేస్ మీద ఉన్నా ముసుగు ఎగిరిపోతుంది. చెయ్యి ముందుకు పెట్టిన క్రిష్ శిల్ప ఫేస్ చూసి ఒక్క నిమిషం ఆశ్చర్యపోతాడు.

ఆశ్చర్యంగా శిల్పా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. దానికి శిల్పా టెన్షన్గా క్రిష్ వైపు విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది.

విక్రమ్ మాత్రం సూటిగా శిల్ప వైపే చూస్తూ ఉంటాడు. ఏం చెప్పాలో తెలియక చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది. నిన్నే శిల్పా అడిగేది ఇక్కడున్నావు ఏంటి అని చెయ్యి పట్టుకుని  కదుపుతాడు.

లలిత వెంటనే నీకు శిల్ప తెలుసా బాబు అని అడుగుతుంది. నాకెందుకు తెలియదు ఆంటీ. తనకి మోడలింగ్ చేయాలని ఇంట్రెస్ట్ కదా..అప్పటి నుంచి నాతో టచ్ లోనే ఉంది.

రీసెంట్ గానే సెలెక్ట్ కూడా అయ్యింది. నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్ కూడా ఉంది.  ఏం శిల్పా చెప్పలేదా అని అడుగుతూ...నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అంటే సమాధానం చెప్పవేంటి అని మళ్ళీ అడుగుతాడు.

దాంతో శిల్ప మనస్సులో అయిపోయింది ఈరోజు తో నా జీవితం క్లోజ్ అయిపోయింది.  ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.

అప్పుడే ధనుంజయ్ ఫ్యామిలీ కూడా లోపలికి ఎంటర్ అవుతారు. భార్గవి వెంటనే శిల్ప దగ్గరికి వెళ్లి అమ్మ శిల్ప అని పిలుస్తుంది.
శిల్ప ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఫ్యామిలీ మొత్తం కనపడుతుంది. ఇక అరిపాదాల నుంచి నడి నెత్తి వరకు చెమట కారిపోతూ ఉంటుంది.

మామ్ నువ్వేంటి ఇప్పుడు ఎక్కడ అని తడబడుతూ అడుగుతుంది. అదేంటి శిల్ప అలా తడబడుతున్నావు.. నువ్వు ముసుగు కూడా తీసేసావు.

మీ అత్తయ్య గారు మన ఫ్యామిలీ మొత్తాన్ని లంచ్ కి ఇన్వైట్ చేశారు అందుకే వచ్చాము అని చెబుతారు.

క్రిష్ ఎవరో అన్నది శిల్పకి తప్ప ధనుంజయ్ ఫ్యామిలీకి తెలియదు. అందుకే భార్గవి తన ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది.

సెలక్షన్స్ ఎప్పుడు జరిగాయి  క్రిష్ అని లలిత అడుగుతుంది దానికి క్రిష్ చెప్పిన డేట్ వినగానే అంటే ఆరోజు మా విక్రమ్ పెళ్లి కదా అంతేనా అన్నయ్యగారు అని ధనుంజయ్ తిరిగి అడుగుతుంది.

అవునమ్మా కానీ మీరు ఏమి అడుగుతున్నారు దేని గురించి అన్నది నాకేమీ అర్థం కావడం లేదు అని అయోమయంగా చెబుతారు.

అప్పుడే కంగారు పడతారు ఎందుకు అన్నయ్యగారు కూర్చోండి అని.. ఈ అబ్బాయికి మీ శిల్ప బాగా తెలుసు అంట అని నొక్కి చెబుతుంది.

ఆ మాట తీరికి ధనుంజయ్ కి ఇబ్బందిగా అనిపిస్తుంది. భార్గవి కోపంగా ఏంటండీ వదినగారు మీరు మాట్లాడే విధానం అంటే...

ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారు భార్గవి కూర్చోండి చెబుతాం కదా అని... ధనుంజయ్ వైపు తిరిగి మీ చిన్నమ్మాయికి మోడలింగ్ అంటే ఇష్టం ఆ విషయం మీకు తెలుసా అని అడుగుతారు.

దానికి ధనుంజయ్ ఆశ్చర్యపోతూ భార్గవి వైపు చూస్తాడు.
భార్గవి తడబడుతూ ఇదంతా అబద్ధం మా అమ్మాయి కాలేజ్, ఇల్లు తప్ప బయట ప్రపంచమే తెలియదు అని  బొకాయిస్తుంది.

క్రిష్ కి మాత్రం అంతా గందరగోళంగా ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కానీ... సంథింగ్ ఫిషీ అని సైలెంట్ గా జరిగేది చూస్తూ ఉంటాడు.

అంత కోపం వద్దు భార్గవి అని టీవీ ఆన్ చేస్తారు. అప్పటికే రికార్డ్ అయిన వీడియో కనెక్ట్ చేసి ఉంచుతారు. అది కరెక్ట్ గా విక్రమ్ పెళ్లి రోజు డేట్.

అక్కడ శిల్ప థైస్ వరకు ఉన్న ఒక స్లీవ్ లెస్ డీప్ నెక్ ఫ్రాక్ వేసుకునే ఉంటుంది. అది చూడగానే ధనుంజయ్ అసహ్యంగా ఫేస్ పక్కకు తిప్పుకుంటాడు.

ఇక్కడ విక్రమ్ ఫ్యామిలీ లో ఉన్న జెంట్స్ కూడా తల పక్కకి తిప్పుకుంటారు. శిల్పా క్రిష్ తో చాలా క్లోజ్ గా ఉంటుంది. అలాగే క్రిష్ ఫ్రెండ్ తో కూడా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది.

సెలక్షన్స్ అయిపోయిన తర్వాత శిల్ప డ్రింక్ చేస్తూ క్రిష్ ఫ్రెండ్ తో రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అది చూడగానే ధనుంజయ్ కి తట్టుకోలేనంత కోపం వచ్చి స్పీడ్ గా లెగిసి శిల్ప చెంప మీద గట్టిగా కొడతాడు.

ఆ ఫోర్స్ కి శిల్పా నేలని ముద్దాడుతుంది. వెంటనే భార్గవి ఏంటండీ మీరు అని వెళ్లి శిల్పని గట్టిగా పట్టుకుని బేబీ బేబీ అని పిలుస్తూ ఉంటుంది..

మామ్ అని భార్గవిని గట్టిగా హగ్ చేసుకుని భయంగా అందరినీ చూస్తూ ఉంటుంది. వెంటనే కళ్యాణ్ ధనుంజయ్ ముందుకు వెళ్లి ఇప్పుడు శిల్ప ని కొట్టడం కాదు.

ఆరోజు పెళ్లి కదా.. అక్కడ శిల్ప లేదు అంటే..పెళ్లి పీటల మీద ఉన్నది ఎవరు? ధనుంజయ్ గారు అని సూటిగా అడుగుతాడు.

అంతే ఆ మాటకి భార్గవి గుండెల్లో విమానాలే దూసుకు వెళుతూ ఉంటాయి.   ధనుంజయ్ భార్గవి వైపు చూసి జబ్బ పట్టుకుని పైకి లేపి  నిజం చెప్పు భార్గవి.

ఆరోజు పెళ్లి పీటల మీద కూర్చుంది ఎవరు? అని భార్గవిని కూడా రెండు పీకుతాడు. భార్గవి రెండు చెంపలపై రెండు చేతుల్ని పెట్టుకుని అందరి వంక భయంగా చూస్తూ... అత్తగారు అయితే సేవ్ చేస్తారేమో అని ఆవిడ వైపు అడుగులు వేయబోతుంది.

వెంటనే సత్యవతి గారు నువ్వు అక్కడే ఆగు. నిజం చెబితే నీకు నీ కూతురికి మంచిది. లేకపోతే నాలుగు పీకు అయిన నిజాలు చెప్పించాల్సి వస్తుంది.

ఎలాగు నిజం చెప్పక తప్పదు. దెబ్బలైనా తప్పించుకుంటే మీకే మంచిది అని కటువుగా మాట్లాడుతారు. ఇంక తప్పించుకునే దారి లేదని అర్థమయ్యి అవని అని చెప్పి తలదించుకుంటుంది.

ధనుంజయ్ కోపం, ఆశ్చర్యంతో ఆరోజు అవని పెళ్లికొప్పుకోలేదని చెప్పావు కదా.. మరి ఎలాగా పీటల మీద కూర్చుంది అని గట్టిగా అడుగుతాడు.

ఏం చెప్పాలో తెలియక అది అది అని నాన్చుతూ ఉంటుంది. నా సహనాన్ని పరీక్షించవద్దు భార్గవి నిజం చెప్పు అని గట్టిగా అరుస్తారు.

నేనే బ్రతిమాలి కూర్చోబెట్టాను అండి ఇంటి పరువు పోకూడదు అని అమాయకంగా చెబుతుంది.  మరి అలాంటప్పుడు తాళిపడిన అవని యే కదా విక్రమ్ భార్య గా ఉండాలి కానీ..

ఆ స్థానంలోకి శిల్ప ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది అని ఇంకొక రౌండ్ వేస్తారు.  ప్లీజ్ అండి కొట్టకండి.  అందరి ముందు అని అడిగితే...

నువ్వు చేసిన పనికి అందరిలోనూ నా ఇంటి పరువు పోలేదా అని అసహ్యంగా చూస్తాడు. అప్పటికి భార్గవి ఏమి చెప్పకుండా తలదించుకునే ఉంటుంది.

వెంటనే ఇంకొక వీడియో ఆన్ అవుతుంది. ఉదయ్ పెళ్ళిలో జరిగింది మొత్తం చెబుతూ ఉన్న వీడియో. అది చూడగానే భార్గవి, శిల్ప భయంతో వణుకుపోతూ ఒకళ్ళని ఒకళ్ళు గట్టిగా పట్టుకుంటారు.

ఇది అంతా అబద్ధం అవిని నీ నేను ఏమి చేయలేదు అని భయంగా చెబుతూ ఉంటుంది. అప్పుడే బిందు లోపలికి వస్తూ ఎందుకు భార్గవి అబద్ధం చెబుతున్నావు.

ఆరోజు నేను ఉదయ్ కూడా అక్కడే ఉన్నాము కదా.. మనము  ఈ ఫొటోస్ చూపించి భయపెట్టలేదా అని  ఫొటోస్ ధనుంజయ్ చేతికి ఇస్తుంది.

ఆ ఫొటోస్ లో అవని ఉదయతో చాలా క్లోజ్ గా ఉన్నట్టు ఉండి చాలా అసహ్యంగా ఉంటాయి. భార్గవి వైపు కోపంగా చూస్తూ తప్పు చేసింది నీ కూతురైతే...

అవిని మీద ఎందుకింత పెద్ద నింద మోపావు.  నీకు అసలు మనసు ఎలా వచ్చింది అని కోపం తట్టుకోలేక  నడుముకు ఉన్న బెల్టు తీసి మరీ కొడతాడు.

ఆ దెబ్బలు తట్టుకోలేక ప్లీజ్ అండి కొట్టొద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. కొట్టడం కాదే నిన్ను చంపేయాలి.  నాకు నా కూతురు మధ్యన ఇంత దూరం తీసుకో వస్తావా అని అక్కడున్న సోఫాలో కూర్చుని బాధపడతారు.

ఇప్పుడు బాధపడడం వల్ల ఉపయోగం ఏముంది ధనుంజయ్ అని శేషగిరి గారు అంటారు.  నాన్న అని బాధగా అనగానే... నాన్ననే మాట్లాడుతున్నాను.

ఏ రోజైనా అవిని కీ దగ్గరగా ఉన్నావా... నీ పెళ్ళాం ఏది చెబితే అది గంగిరెద్దులాగా తల ఊపావు.  అంతేగాని అవని దగ్గర కూర్చుని ఏం కావాలి, ఏంటి అని మాట్లాడావా...

శిల్పతో ఉన్నట్టుగా అవిని తో ఏ రోజు అయినా ఉన్నావా ధనుంజయ్ అని కోపంతో అడుగుతారు. ప్లీజ్ నాన్న ఇంకా నన్ను మీరు చంపకండి అని బాధపడతాడు.

దానికి శేషగిరి గారు విరక్తిగా నవ్వుతూ ఇప్పుడేమిట్రా ఎప్పుడైతే నీ కూతురుకి చాలీచాలని భోజనం పెట్టావో, నీ ఇంటిలోనే నీ కూతురికి రక్షణ లేదో, ఆరోజే ఒక తండ్రిగా చచ్చిపోయావు.

ఇదిగో నీ కూతురు వెళ్లే ముందు రాసిన ఉత్తరం అని చెప్పి ధనుంజయ చేతిలో పెడతారు.  అవని రాసిన అక్షరాలు వెంట ధనుంజయ్ కళ్ళు పరుగుపెడుతూ ఉంటాయి.

తాతయ్య నేను ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఇన్ని రోజులు నేనంటే ఇష్టం లేకపోయినా ఏదో భరిస్తున్నారు అనుకున్నాను.

కానీ ఈ భార్యాభర్తలు ఇద్దరికీ శిల్ప జీవితం బాగుంటే చాలు. దానికోసం నా జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకడుగు వేయరు అని ఈ రోజే అర్థమయింది.

ఇక్కడ ఉంటే శాశ్వతంగా నన్ను నేను కోల్పోవాల్సి వస్తుంది. దానికి కన్న ఒక అనాధగా బ్రతకడమే మంచిది. ఎలాగో అనాధగానే ఉన్నాను కాబట్టి.. అనాధనే అవుతాను సెలవు అని రాసి ఉంటుంది.

ఆ ఉత్తరం కూడా చాలా స్పీడ్ గా రాసినట్టుగా కన్నీళ్లు పడినట్టుగా ఉంటుంది.
ఆ ఉత్తరం చదివిన ధనుంజయ్ ఒక రకమైన షాక్ లో ఉండిపోతాడు.
Like Reply
#52

Part - 41


ఆ ఉత్తరం చదివిన ధనుంజయ్ చాలాసేపటి వరకు మనిషి కాలేకపోతాడు. తనంతట తానుగా రియలైజ్ అవ్వాలని ఎవరు కదపకుండా చూస్తూ ఉంటారు.

ఎంతసేపైనా ధనుంజయ్ ఆ ఉత్తరాన్ని పదే పదే చదువుతూఉంటాడు. సత్యవతి గారికి మనసు వొప్పక ధనుంజయ్ భుజం మీద చేయి వేసి కదుపుతారు.

మనలోకంలోకి వచ్చిన ధనుంజయ్ సత్యవతి గారి నడుం చుట్టూ చేతులు వేసి అమ్మా అని బోరున ఏడుస్తాడు. ఇప్పుడు ఏడవడం వల్ల ఉపయోగమేముంది ధనుంజయ్ అని ఊరుకో పెడతారు.

నాకు తెలియకుండా చాలా పెద్ద తప్పు జరిగి పోయింది. అవని జీవితంలో నన్ను క్షమిస్తుందా అని అడుగుతాడు.
శిల్ప వైపు తిరిగి నువ్వు ఎలాగో చెడిపోయావు కదా రాక్షసి.

అవని జీవితాన్ని కూడా ఎందుకు నాశనం చేయాలనిచూసావు అని కోపంగా అడుగుతారు. జరిగిందంతా చూసాక ఇంకా శిల్ప కూడా తన రియాలిటీ లోకి వచ్చేస్తుంది.

ఏంటి డాడీ మీరు నా మీద కోప్పడుతున్నారు. మీరు అవని మీద ఫోకస్ పెట్టకపోతే అది నాదా తప్పు.  నాకా అవకాశం ఉంది నేను యూస్ చేసుకున్నాను అని పొగరుగా చెబుతుంది.

శిల్ప మాట తిరుకి ధనుంజయ్ చాలా ఆశ్చర్యపోతాడు. ఎప్పుడూ తన ముందు అణిగి మణిగి,పద్ధతిగా మాట్లాడే శిల్ప నా అని.

ఇన్ని రోజులు నా ముందు నటించావా అని అడుగుతాడు. నటించాల్సిన అవసరం నాకేముంది నాకు కావాల్సిన దాన్ని కోసం ఒక స్టెప్ తగ్గి ఉన్నాను అంతే.

దానికోసం అవిని నీ యూస్ చేసుకున్నాను అంతే కదా మామ్ అని భార్గవి వైపు తిరుగుతుంది. అప్పటికే భార్గవికి ఒళ్లంతా చెమటలు పట్టేసి కూతురు వైపు దీనంగా చూస్తుంది.

దీనికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఇన్నాళ్లు జాగ్రత్తగా చేసుకువచ్చినదంతా ఒక రోజుతో నాశనంచేసేసింది.  ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది.

నువ్వు ఏమి మాట్లాడుతున్నావో అర్థమవుతుందా.. ఎప్పుడు డాడీ ముందు పద్ధతిగా ఉండేదానివి. ఒక్క నీ మోడలింగ్ ఫీల్డ్ మీద ఉన్నా ఇంటరెస్ట్ తో ఆ రోజు బయటికి వెళ్లావు.

నాకు ముందే తెలిస్తే వెళ్లనివ్వను అని చెప్పకుండా వెళ్ళావు.  అది ఒక్కటే నీ తప్పు. అంతేగాని నువ్వు అవని నీ ఎప్పుడూ తక్కువ చేసే బిహేవ్ చేయలేదు కదా..

ఎందుకు ఇప్పుడు అవని నీ ఎక్కువ చేసి నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు అని ఇంకా కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

ధనుంజయ్ కి చిరాకు వచ్చి ఇంకా ఆపు భార్గవి నీ నాటకాలు. ఇంత జరిగినా సరే నీ కూతుర్ని వెనకేసుకొచ్చి అవని నీ తప్పు పట్టడానికి చూస్తున్నావు.

ఏంటి డాడీ ఇందాకటి నుంచి చూస్తున్నాను నేనేం తప్పు చేశాను అని మాట్లాడుతున్నారు. అయినా తప్పంతా మీరు చేసే నన్ను అంటారేంటి అని కోపంగా అరుస్తుంది.

నేనేం తప్పు చేశాను అని ఆశ్చర్యంగా అడుగుతాడు. మీరేమీ తప్పు చేయలేదా అని అంతే సీరియస్ గా అడుగుతుంది. నేనేం తప్పు చేయలేదు అని చెబుతాడు.

అవునా ... మన ఇంట్లో అవని బెడ్ రూమ్ ఎలా ఉంటుంది.. నా బెడ్ రూమ్ ఎలా ఉంటుంది. అవని ఎలాంటి ఫుడ్డు తింటుంది...  నేను ఎలాంటి ఫుడ్డు తింటాను.

అవని ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటుంది.. నేను ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటాను. అట్లీస్ట్ అవని నీ ఏ ఫంక్షన్ కైనా  మీరు తీసుకు వెళ్లారా..  పోనీ ఎవరికైనా మీకు అవిని  అనే ఇంకొక కూతురు ఉంది అన్న విషయం తెలుసా అని చాలా పొగరు గా అడుగుతుంది.

ఆ మాటలకి ధనుంజయ్ బిగుసుకుపోయి ఏమి చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉండిపోతాడు.  ఏంటి డాడీ నేను అడిగిన దానికి మీ దగ్గర సమాధానం లేదు కదా...

ఇప్పుడు అర్థమైంది కదా ఎవరు అవిని విషయంలో తప్పు చేశారో.. తప్పంతా మీరు చేసి  నన్నంటారేంటి...

ధనుంజయ్ విరక్తిగా  అవును నిజంగానే నేను తప్పు చేశాను. మీ అమ్మ మాటలే ఎప్పుడూ వింటూ అవే నిజాలనుకుని నా కూతురికి దూరమైపోయాను.

కానీ మీరిద్దరూ మేక తోలు కప్పుకున్న తోడేళ్లు అని తెలుసుకోలేకపోయాను. ఎందుకు భార్గవి ఇలా చేశావు నీకు ఏం తక్కువగా జరిగిందా ఆ ఇంట్లో అని బాధగా అడుగుతాడు.

ఆ ఇంట్లో భార్గవికి ఏం తక్కువైందో నేను చెబుతాను కదా ధనంజయ్ గారు అని విక్రమ్ వాయిస్ వినపడుతుంది.

ఇంకొక వీడియో ఆన్ చేస్తాడు.  అది ఉదయ్ హాస్పిటల్లో ఎడ్మిట్ చేసిన తర్వాత భార్గవి ని సర్వెంట్ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు.. సునీల్ దంపతులకి భార్గవ్ కి మధ్యన జరిగిన గొడవ కి సంబంధించిన వీడియో.

భార్గవి క్వార్టర్స్ లోకి వెళ్లగానే అన్నయ్య అని గట్టిగా అరుస్తుంది.  ఎందుకు అలా అరుస్తూన్నావు భార్గవి అని సునీల్ కోపంగా అడుగుతాడు.

నువ్వు చేసింది ఏమిటి ఉదయ్ హాస్పిటల్ లో ఉన్నాడు. డబ్బులు కావాలనే కదా నాకు చెప్పావు. అయినా నేను కూడా హాస్పిటల్ నుంచే కదా వచ్చాను.

మరి మీ బావ ముందు ఎందుకు అలా మాట్లాడావు అని కోపంగా అడుగుతుంది. నేను నిజమే కదా చెప్పాను అని చాలా కేర్లెస్ గా మాట్లాడుతాడు.

నువ్వు మాట్లాడే విధానం అసలు బాగోలేదు.  నాకు కోపం తెప్పించకు అని అరుస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావు రజితని చంపినట్టుగా మమ్మల్ని చంపుతావా అని రెచ్చగొడతాడు.

ఆ మాటలకి భార్గవి వంకరగా నవ్వుతూ నీకు ఇంకా రజిత చావు గుర్తుందా...గుర్తుండి కూడా నాతో పెట్టుకుంటున్నావా అని అడుగుతుంది.

అన్ని గుర్తున్నాయి. మమ్మల్ని బావ నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తుంటే..  నాకెందుకు అని ఊరుకున్నావు కదా..అప్పుడే అర్థమైంది నీ అవసరం తీరిపోతే మమ్మల్ని కూడా అలాగే చేస్తావని.

అన్నీ తెలిసి కూడా నాతో పెట్టుకున్నావు అంటే మిమ్మల్ని ఏం చేయాలి అని అంటుంది.  నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు.

ఏమన్నా చేస్తే ముందు బావ దగ్గరికి వెళ్లి రజిత ని నువ్వే మెట్లు పైనుంచి తోసేసావని చెబుతాను. తర్వాత అవని నీ  ప్రేమగా చూసుకుంటున్న వంకతో  బావ జీవితంలోకి ఎలా వెళ్లావో కూడా అర్థమయ్యే విధంగా చెబుతాను.

రజిత మీద ఉన్న కోపంతో అవిని నీ ఎలా పని మనిషిని చేసావో కూడా అన్ని వివరంగా చెబుతాను అని అనగానే... భార్గవి గట్టిగా నవ్వుతూ నువ్వు చెబితే మాత్రం మా ఆయన నమ్ముతాడని అనుకుంటున్నావా...

ఆయన్ని ఎక్కడ నొక్కాలో కూడా నాకు బాగా తెలుసు. మగవాడికి ఆడదాని అవసరం ఉన్నంతవరకు ఆడదాని చేతిలో కీలుబొమ్మే.

రెండే రెండు రోజుల్లో మీ బావే వచ్చి నన్ను తీసుకువెళ్తాడు అని పొగరుగా చెప్పి వెళ్లి మంచం మీద పడుకుంటుంది.
వీడియో చూడగానే భార్గవి టెన్షన్తో బిగిసిపోతుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది.

ధనుంజయ్ మాత్రం కోపంతో ఊగిపోతూ ఉంటాడు బెల్ట్ తో ఇంకొక రౌండ్ భార్గవిని వేసి ఎందుకు రజితని చంపావు అని రక్తం వచ్చేలాగా కొడుతూ ఉంటాడు.

శిల్ప కూడా ఆ దెబ్బలు చూసి స్తంభం చాటుకి వెళ్లి దాక్కుంటుంది.  భార్గవి ఆ దెబ్బలని తట్టుకోలేక నేనే చంపాను అయితే ఏంటి అని గట్టిగా అరుస్తుంది.

ధనుంజయ్ కొట్టడం ఆపి ఎందుకు చేసావు అని అరుస్తాడు. రజిత మీద ఉన్న అసుయతో చేశాను.

ఎప్పుడు ఊరు వచ్చిన కారులోనే వచ్చేది.  అందరికీ అన్ని రకాలు తీసుకోవచ్చేది.అవన్నీ చూడగానే నాకు సొంతం చేసుకోవాలి అనిపించింది.

అనుకోని అవకాశంగా అవని పుట్టినరోజు వచ్చింది. మా అమ్మ, అన్నయ్య సలహాతోనే రజితని మెట్ల పైనుంచి తోసేసాను..

అసలు అవిని నీ కూడా తోసేద్దాం అనుకున్నాను కానీ... అది లేకపోతే నీ జీవితంలోకి రావడం కష్టమని దాన్ని ప్రాణాలతో ఉంచాను.

అనుకున్నట్టుగానే నీ జీవితంలోకి వచ్చాను. కానీ ఎక్కడా కూడా అవని నీ కూతురుగా చెప్పడం నాకు ఇష్టం లేదు.

అందుకే నీకే అవని రావడం ఇష్టం లేదు అని చిన్నప్పటి నుంచి నూరు పోసి దాన్ని గదిలో నుంచి బయటికి రానివ్వలేదు..

ఎక్కడికి వెళ్లినా ధనుంజయ్ కి ఒక్కతే కూతురు అది శిల్ప అని మాత్రమే తెలిసేలాగా చేశాను. చిన్నప్పటినుండి అవని నీ ఒక నార్మల్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజీలో చదువుకునేటట్టుగా చేశాను.

ఎక్కడ కూడా ఒక తండ్రిగా మీ సంతకం కానీ, మీ పేరు గాని లేకుండా అనాధ కింద క్రియేట్ చేశాను.నీ కింగ్డమ్ కి మొత్తానికి ఏకైక వారసురాలు శిల్ప అని జనం అనుకునే లాగా చేశాను.

ఆఖరికి ఈ పెళ్లి విషయంలో కూడా శిల్పకి విక్రమ్ తో పెళ్లి చేయాలని మీ కోరిక. పెద్ద వాళ్ళు ముందు కావాలని అడుగుతారు. ఇష్టం లేదని చెప్పమన్నారు అని చెప్పాను. అందుకే అవని ఆ రోజు అలా చెప్పింది.

ఈ శిల్ప చేసిన తింగరి పని వల్ల ఆ తాళి అవని మెడలో పడింది.  శోభనం రోజు రాత్రి అవని నీ మేమే బెదిరించాము.

ఆరోజు కూడా అదంతా మీరే చేయమన్నట్టుగా చేశాను.  అందుకే అవిని కీ మీ మీద పూర్తిగా విరక్తి వచ్చేసింది. ఎప్పటికైనా ఎదురు తిరుగుతుందేమో అన్న అనుమానం తోనే ఉదయ్ తో అవిని జీవితం నాశనం చేయాలి అనుకున్నాను.

అది తప్పించుకుని పారిపోయింది. ఎలాగో పారిపోయింది కదా అని బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది అన్నట్టుగా క్రియేట్ చేశాను.
ఆ ఉదయ్ గాడు సరిగ్గా ప్లాన్ చేయక దొరికిపోయాడు.
అవిని కోసం మీరు తాపత్రయపడడం నాకు అస్సలు నచ్చలేదు. ఏదైనా చేయాలి అనుకునే లోపు నా ప్లాన్లు అన్ని రివర్స్ అయిపోయినాయి అని ఆవేశంలో తనకు తెలియకుండానే అన్ని నిజాలు చెప్పేస్తుంది.

భార్గవి చెబుతున్న నిజాలు వింటున్న అందరికీ  అసహ్యం జుగుప్సా కలుగుతాయి.  భార్గవి లో ఒక సైకో కనపడుతుంది.

ఒంటిపైనున్న రక్తం తుడుచుకుంటూ అక్కడున్న సోఫాలో కూర్చుని ఇప్పుడు మీరు వెళ్లి అవినికి నిజాలు చెబితే మాత్రం మిమ్మల్ని నమ్ముతుంది అనుకుంటున్నారా అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు.
Like Reply
#53

Part - 42


మీరు ఇప్పుడు అవిని దగ్గరకెళ్ళి ఇవన్నీ నిజాలు. నాకు తెలియకుండా జరిగిపోయినాయి.నన్ను క్షమించు అనగానే నమ్మేసి మీ వెనకాల వస్తుందనుకుంటున్నారా అని చాలా కృయల్ గా నవ్వుతుంది.

అంటే ఏంటి నీ ఉద్దేశం అని ధనుంజయ్ అనుమానంగా అడుగుతాడు. నా ఉద్దేశం ఏమిటంటే.. మీరు వెళ్లి కాళ్ల పట్టుకుని బ్రతిమాలిన సరే అవని మీతో రాదు.

అంతలాగ మీ మీద విరక్తి,అసహ్యం వచ్చేసాయి. ఇప్పుడు మీరు వెళ్లి అడిగినా సరే శిల్ప కోసమే ఇంకొక నాటకం అనుకుంటుంది తప్ప.. నిజంగా మీరు తన కోసమే వచ్చారు అని మాత్రం అనుకోదు.

బయట జనాలందరికీ కూడా పెళ్లి జరిగింది శిల్పతోనే అని తెలుసు కాబట్టి.. శిల్పతో కాంప్రమైజ్ అయ్యి కాపురం చేసుకోమనండి.

కాదు,  లేదు అని అవనినీ తీసుకువచ్చి విక్రమ్ కి భార్యను చెయ్యాలి అనుకుంటే... జనం ఛీ అంటారు. చెల్లి మొగుడితో అక్క కులుకుతుంది అంటారు.

ఆ రోజు అవని శిల్పను అన్నమాట అవని విషయంలోనే అవుతుంది. తాళి లేకుండా ఒక మగాడి గదిలోకి వెళ్లిన ఆడదాన్ని ఏమంటారు అని అడిగింది.

ఇప్పుడు అది తాళిపడిన సరే... చెల్లెలి మొగుడు గదిలోకి వెళ్లింది అని అవని గురించి అందరూ నీచంగా మాట్లాడుకుంటారు.

నీ కూతురు గురించి జనం అందరూ అంత గొప్పగా మాట్లాడుకోవాలి అనుకుంటే.. ఎక్కడ ఉన్న వెతికి తీసుకువచ్చి  జై సింహా ఇంటి కోడలుగా చెయ్యి.

కాదు,  కాదు . నా అల్లుడికి ఉంపుడుకత్తే ని చెయ్యి అని అసహ్యంగా మాట్లాడుతుంది.

ఇంకా ఆపు అని విక్రమ్ గట్టిగా అరుస్తాడు.  విక్రమ్ ఫేస్ చూసిన అందరికీ చాలా భయం వేస్తుంది. కోపంతో ముఖమంతా ఎర్రగా కందిపోతుంది. పిడికిలి బిగించి ఉండడం మీద నరాలన్నీ ఉబ్బిపోయి ఉంటాయి.

నువ్వు ఏం మాట్లాడినా ఇక్కడ వింటూ కూర్చుంటారు అనుకుంటున్నావా అని అక్కడ సింగిల్ సీటర్ చైర్ లో కూర్చుని కాలు మీద కాలేసుకుని ఒక చేతిని సోఫా పైన పెట్టి , మరొక చేతి ఇండెక్స్ ఫింగర్ తో సోఫా హ్యాండిల్ ని కొడుతూ ఉంటాడు.

విక్రమ్ వాయిస్ లో ఉన్న బేస్ కి అప్పుడు వరకు అడ్డు అదుపు లేకుండా వాగుతున్న నోటికి జిప్పు వేసి, తనకు తెలియకుండానే లెగిసి నిలబడుతుంది.

ఏంటి ఇప్పుడు చెప్పు అవిని గురించి ఏంటో తప్పుడు కూతలు కుస్తున్నావు. అవిని యే నా భార్య అని నాకు ఎప్పుడో తెలుసు.

ఇన్ని రోజులు ఆగింది నీ నోటితో నిజాలు చెప్పించాలి అని ఇంకా అంటూ... ధనుంజయ్ వైపు చూసి ఇలాంటి పెద్దమనిషి కళ్ళు తెరవాలని...

లోకం దృష్టిలో శిల్ప నా భార్య అని చెబుతున్నావు కదా..  ఏ లోకం దృష్టిలో అని టీవీ ఆన్ చేస్తాడు.

ఇప్పుడు దాకా భార్గవి మాట్లాడిన ప్రతి మాట కూడా లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది. అలాగే న్యూస్ మళ్లీ రిపీటెడ్ గా వేస్తూనే ఉన్నారు.

లోపల ఒక గదిలో సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు.వాళ్ళు కూడా బయటకు వచ్చి నిలబడి చూస్తూ ఉంటారు.

అవన్నీ అలా చూడగానే భార్గవి నో అని గట్టిగా అరుస్తూ.. ఇదంతా అబద్ధం.  నేను ఒక్కదాన్నే ధనుంజయ్ భార్యని. శిల్ప ఒక్కతే ధనుంజయ్ కూతురు అని పిచ్చి పట్టిన దానిలాగా గట్టిగ అరుస్తూ ఉంటుంది.

విక్రమ్ సెక్యూరిటీ ఆఫీసర్లు వైపు తిరిగి నా పెళ్లి విషయంలో తన చేసిన చీటింగ్ మీద కేసు పెడుతున్నాను. ఈ తల్లి కూతుర్నిద్దరినీ అరెస్ట్ చేయండి.

నా భార్య ని బెదిరించి మానసికంగా హింసించి నా నుంచి దూరం చేసి ఎక్కడికో పారిపోయేటట్టుగా చేసినందుకు కూడా కేసు ఫైల్ చేయండి.

మిగిలిన విషయాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని ధనుంజయ్ వైపు చూస్తాడు.

ధనుంజయ్ ఒక్క నిమిషం భార్గవి వైపు చూసి సెక్యూరిటీ ఆఫీసర్లు వైపు తిరిగి నా భార్యను హత్య చేసినందుకు ఈ భార్గవిని,  తనకి సహాయం చేసినందుకు వాళ్ళ అన్నయ్య మీద కేస్ పెడుతున్నాను.  తీసుకువెళ్లండి అని కళ్ళు మూసుకుంటాడు.

భార్గవి స్పీడ్ గా ధనుంజయ్ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని...ఏవండీ నేను తెలియక ఏదో తప్పు చేశాను కానీ...

పెళ్లయిన దగ్గర నుంచి మీ విషయంలో నేను ఎంత జాగ్రత్తగా ఉన్నాను.. మీతో నేను ఎంత ప్రేమగా ఉన్నాను. పెద్దవాళ్ళని ఎంత మర్యాదగా చూసుకున్నాను.

ఎక్కడా కూడా మీ గౌరవానికి భంగం రానివ్వలేదు. అత్తయ్య గారు, మావయ్య గారు మీరైనా చెప్పండి అని సత్యవతి గారి దగ్గర కూడా వెళ్లి చేతులు పట్టుకుని బ్రతిమాలుతుంది.

ఆరోజు అవిని కూడా మిమ్మల్ని ఇలాగే బ్రతిమాలి ఉంటుంది కదా భార్గవి అని అడుగుతారు. కానీ మీరందరూ ఏం చేశారు...

ఆ ఉదయ్ గాడితో నా మనవరాలు జీవితం నాశనం చేయించాలి అనుకున్నావు. నువ్వు ఆడదానివే కదా..నీకు ఒక కూతురు ఉంది కదా..

మరి అవిని కూడా అలాంటి ఆడపిల్ల అని తెలియలేదా లేకపోతే నీ కూతురు ఎలాగు చెడు తిరుగుళ్ళు తిరుగుతుంది కాబట్టి అవిని కూడా అలాగే అనుకున్నావా అని కోపంగా అడుగుతారు.

శిల్పకి ఆ మాటలకి చాలా కోపం వస్తుంది. నానమ్మ అని అరుస్తుంది. ఛీ నోరు ముయ్. ఎవరే నీకు నానమ్మ. వావివరసలు తెలియకుండా పెరిగావు.

అక్క మొగుడిని కోరుకున్నావు. ఎంత నీచమో తెలుసా అది.  అక్క మొగుడు అంటే తండ్రితో సమానం. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా మీ తల్లి కూతుళ్ళకి అని కోప్పడతారు.

లోకంలో ఎంతమంది అక్క మొగుడ్ని పెళ్లి చేసుకోవడం లేదు.  అలాఅని వాళ్లందరికీ వావివరుసలు లేనట్టా అని తిక్కవాగుడు వాగుతుంది.

అక్క మొగుణ్ణి పెళ్లి చేసుకున్నారు కానీ పెళ్లి చేసుకోకుండా అక్క స్థానంలోకి వెళ్ళాలి అని ఏ ఆడది కోరుకోదు.

అక్కడ పరిస్థితులను బట్టి...అక్క లేకపోతే పిల్లల కోసమో, వాళ్లకున్న కారణాలతో మెడలో తాళి పడిన తర్వాతే అక్క మొగుడిని తన భర్తని చేసుకున్నారు.

అంతేగాని నీలాగా బరి తగ్గించలేదు. నా పిచ్చి గానీ మీ అమ్మ దగ్గర లేని సంస్కారం నీకు ఎక్కడి నుంచి వస్తుంది. సెక్యూరిటీ ఆఫీసర్లు వైపు తిరిగి అర్జెంటుగా బయటకు తీసుకువెళ్ళిపోండి. వీళ్ళని చూస్తుంటే కంపరం గా ఉంది.

భార్గవికై పూర్తిగా అర్థం అయిపోయింది. ఇంక తను ఏమి చేసినా మళ్లీ ఆ ఇంట్లో తన స్థానం తనకి రాదు అని.

సెక్యూరిటీ ఆఫీసర్లు భార్గవి, శిల్ప దగ్గరకు వచ్చి మీరు మర్యాదగా మాతో పాటు వస్తే బాగుంటుంది. లేదు అంటే మా పద్ధతిలో మేము తీసుకువెళ్లాల్సి వస్తుంది.

మీరు పూర్తి ఆధారాలతో దొరికిపోయారు. అది కూడా మీరు పూర్తి స్పృహలో ఉండి మీ అంతట మీరు చెప్పిన నిజాలే కాబట్టి..  మాకు సహకరించండి అని చాలా పొలైట్ గా చెప్పినట్టుగా వార్నింగ్ ఇస్తారు.

భార్గవి వెళుతూ విక్రమ్ వైపుకు తిరిగి ఇక్కడితో అంతా అయిపోయింది అనుకుంటున్నారేమో... నేను పగబడితే ఎలా ఉంటుందో అవిని జీవితం చూసి తెలుసుకోండి. ముందు ముందు ఇంకా నరకం చూపిస్తాను అని ఆవేశంగా మాట్లాడుతుంది.

ఆ మాటలు వింటున్న విక్రమ్ గట్టిగా నవ్వుతూ ఇంత జరిగినా విక్రమ్ అంటే ఏంటో నువ్వు తెలుసుకోలేక పోతున్నావు. నిజంగా నీ మీద జాలి వేస్తుంది భార్గవి.

అవిని వెనకాల అప్పుడు ఎవరూ లేకపోవచ్చు కానీ.. ఇప్పుడు అవిని ముందు నేను ఉన్నాను. వెనకాల నా కుటుంబం మొత్తం ఉంది.

అవని నీ తాకాలి అంటే ఈ సింహాన్ని దాటి వెళ్లాలి.  నీకు అంత ధైర్యం ఉందా అని కన్నెర్ర చేస్తాడు.  విక్రమ్ కోపాన్ని చూసి భార్గవి ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది.ధనంజయ్ కి మాత్రం తల తీసేసినట్టు ఉంటుంది.

నిజమే కదా..  విక్రమ్ పూనుకున్న తర్వాతే నిజ నిజాలు అన్నీ బయటకు వచ్చాయి. ఈ కుటుంబం మొత్తం అవినీ కోసం ఎదురు చూస్తుంది.

తండ్రిగా నేనేమి చేశాను.  22 ఏళ్లు నా ఎదురుగుండా పెరిగిన నా కూతురు గురించి నేను తెలుసుకోలేకపోయాను.

బయట వ్యక్తి వచ్చి చెప్పేవరుకు గుడ్డివాడిగా ఉన్నాను అంటే.. నేను ఎంత ఫెయిల్యూర్ ఫాదర్నో అర్థం అవుతుంది అని కుమిలిపోతూ ఉంటాడు.

భార్గవి, శిల్ప ని సెక్యూరిటీ ఆఫీసర్లు తీసుకువెళ్లిన తర్వాత క్రిష్ కూడా వెళ్ళిపోతాడు.

ధనుంజయ్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లి నమస్కారం చేసి నావల్ల చాలా పెద్ద తప్పే జరిగి..మీ కుటుంబం కూడా ఇబ్బంది పడింది.  నన్ను క్షమించండి.

నా కూతురు ఎక్కడ ఉన్నా సరే నేను వెతికి తీసుకు వస్తాను. మా మీద కోపాన్ని అవిని మీద చూపించవద్దు.  అది నిజంగానే అమాయకురాలు అని బాధగా మాట్లాడతాడు.

ఎవరిమీదో కోపాన్ని మా ఇంటి మహాలక్ష్మి మీద మేము చూపించం ధనుంజయ్ అని ఇందిరా గారు గట్టిగా చెబుతారు.

మాకు ఎప్పుడైతే నిజం తెలిసిందో అప్పుడే అవనినీ మేము కోడలుగా అంగీకరించాము.  అందుకే దోషం పేరు చెప్పి శిల్ప ని  మేము ఎవరికీ పరిచయం చేయలేదు .

అవని ఎప్పుడైతే ఇంటికి వస్తుందో ఆరోజు అందరికీ పరిచయం చేస్తాము అని గంభీరంగా చెబుతారు. ఆ మాటలకి ధనుంజయ్ సంతోషంగా తప్పకుండా అత్తయ్య గారు  అవిని ఎక్కడ ఉన్న వెతికి తీసుకు వస్తాను అని చెబుతాడు.

దానికి ఇందిరా గారు ఇంకా మీ కూతురు ఎక్కడ ఉందో నువ్వు తెలుసుకునే దగ్గరే ఉన్నావు కానీ... మా విక్రమ్ తన భార్య ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు. తనని కలిసే వచ్చాడు అని చెబుతారు.

నిజమా అల్లుడుగారు అని ఆనందంతో అడుగుతాడు. విక్రమ్ తనకుడి అరచేతిని ముందుకు పెట్టి ఆపండి.. నేను మీకు అల్లుడిని కాదు..ఎప్పుడైతే నా భార్య మిమ్మల్ని తండ్రిగా అంగీకరిస్తుందో ఆరోజు మీరు నన్ను అల్లుడుగారు అని పిలవండి.

అప్పుడు దాకా మనం ఓన్లీ తెలిసిన వాళ్ళము మాత్రమే అని నొక్కి చెప్పి...  నానమ్మ నేను ఈవెనింగ్ ఫ్లైట్ కి వెళుతున్నాను అని చెబుతాడు.

మంచిది ఎల్లుండి ఉదయం పదింటికల్లా అమ్మాయి గృహప్రవేశం చేయాలి అని చెబుతారు.  తప్పకుండా అని రూమ్ లోకి వెళ్ళిపోతాడు.

రూమ్ కి వెళుతున్న విక్రమ్ మనసులో నువ్వు కోరుకున్నట్టుగానే నీ భర్త అందరి తప్పులకి శిక్ష వేసి నీకోసం వస్తున్నాడు. నాకు ఏం సమాధానం చెబుతావో చూస్తాను అని కన్నింగ్ గా నవ్వుకుంటూ రూమ్ కి వెళ్ళిపోతాడు..

అక్కడ అవనికి ఆగకుండా పులమారుతూ ఉంటుంది.

ఇప్పుడు అవని పరిస్థితి ఏమిటి....

కథ కొనసాగుతుంది...
Like Reply
#54

.
[+] 8 users Like SivaSai's post
Like Reply
#55

(13-01-2026, 05:59 PM)k3vv3 Wrote:  42భాగం రెండు సార్లు పోస్టు చేసారు.

బహుశ 43వ భాగం ఆఖరిది అయి ఉండాలి! అనుకున్నాను, కానీ ఇంకా చాలా కథ ఉన్నట్లుంది Dodgy

రెండో మలుపేమో!

మంచి కథను ఇస్తున్నారు ఇక్కడి మితృలకు, అభినందనలు

Sorry Chusukoledu

Part - 43 Kadu Next Day Vastundi
[+] 2 users Like SivaSai's post
Like Reply
#56

(14-01-2026, 07:56 AM)ash.enigma Wrote:  Sure.. mega climax aa? Heart horseride
Noooo....


Inka Chala Undiii............     Blush Blush
[+] 4 users Like SivaSai's post
Like Reply
#57

Part - 43


అవిని కి ఆగకుండా ఎక్కళ్ళు వస్తువుంటాయి. ఏంటి సడన్గా ఇలాగా..  వాటర్ తాగి కొంచెం స్థిమిత పడి హమ్మయ్య అనుకుంటుంది.

విక్రమ్ గారు ఎలా ఉన్నారో ? ఫోన్ చేస్తే... వద్దులే పక్కన శిల్ప ఉంటుంది  కదా...  అలా అనుకోగానే  మనసు అంత చాలా భారంగా  మారిపోతుంది.

విక్రమ్ గారు శిల్పనే భార్య అనుకుంటున్నారా... నాకు పెట్టిన రింగ్ అండ్ నల్ల పూసలు ఇవ్వాల్లేదు కదా..
అవి ఏవి అని శిల్ప ని అడగలేదా అనుకుంటూ..

అయ్యిన నా పిచ్చి గాని ఆ ధనుంజయ్ ఫ్యామిలీ తిమ్మిని బమ్మిని చేసి అయినా సరే శిల్ప ని ఆయనకి భార్యని చేసేస్తారు.

ఇంక నా జీవితం ఇంతే నా అని దిగులుగా కూర్చుంటుంది.
మరి నువ్వు ఎందుకు నిజం చెప్పలేదు అని తన అంతరాత్మ ప్రశ్నిస్తుంది.

చెబితే నమ్ముతారా...నువ్వు చెబితేనే కదా నమ్ముతారో నమ్మరో  అనేది తెలిసేది. ఏమి చెప్పకుండా నీలో నువ్వే మదనపడితే అర్థం ఏముంటుంది...

ఇప్పటికే వాళ్ళిద్దరూ లైఫ్ స్టార్ట్ చేసేసి ఉంటారు కదా... చెప్పడం వల్ల విక్రమ్ గారు ఎలా రిసీవ్ చేసుకుంటారు..
నాకు దగ్గరవుతారా...శిల్ప ని దూరం చేసుకోగలుగుతారా... అని ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది.

దేనికి తన దగ్గర సమాధానం ఉండదు . ఆలోచించి ఆలోచిస్తూనే పడుకుండిపోతుంది. సూర్యుడు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పిన సరే నిద్రమత్తు వదలదు. మంచి డీప్ స్లీప్ లో ఉన్నగా ఫోన్ రింగ్ అవుతుంది.

  ఈ టైం లో ఎవరు ఫోన్ అనుకోని లిఫ్ట్ చేసి మత్తుగా హలో అంటుంది. నేను శ్రీ ని మాట్లాడుతున్నాను అనగానే.. చెప్పండి అన్నయ్య.

తొందరగా హాస్పిటల్ కి రా...విక్రమ్ కి యాక్సిడెంట్ అయ్యింది అని కంగారుగా చెబుతాడు.  అంతే నిద్ర మత్తు అంత ఎగిరిపోయి ఏం మాట్లాడుతున్నారన్నయ్య మీరు అని ఏడుపు గొంతుతో అడుగుతుంది.

నేను నిజమే చెబుతున్నాను హాస్పిటల్ అడ్రస్ లొకేషన్ షేర్ చేస్తున్నాను అర్జెంటుగా రా ని ఫోన్ పెట్టేస్తాడు. అవని స్పీడ్ గా నేహా దగ్గరికి వెళ్లి సీనియర్,  సీనియర్ అంటూ  కంగారుగా పిలుస్తుంది.

ఏమైంది అవని... నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు అనగానే... తొందరగా పదండి సీనియర్.
హాస్పిటల్ కి వెళ్లాలి ఏడుస్తూ బయటకు పరుగు పెడుతుంది.
ఆగు అవని వస్తున్నాను అని నేహా ఫ్లాట్ లాక్ చేసి అవని వెనకాల పరుగు పెడుతుంది.

అవని పిచ్చిదానిలా రోడ్డు మీదకి వచ్చి పరుగు పెడుతూ ఉంటుంది. నేహా స్పీడ్ గా వచ్చి నీకేమైనా పిచ్చా అని పట్టుకుని... ఏ హాస్పిటల్  అని అడుగుతుంది.

వెంటనే ఫోన్ తీసుకొని శ్రీ పంపిన లొకేషన్ చూపిస్తుంది. అటుగా వెళుతున్న ఆటో ని ఆపి ఇద్దరు ఎక్కుతారు. ఏమైంది అని నేహా ఎన్ని సార్లు అడిగిన అవని ఏమి మాట్లాడదు.

నేహా కూడ సైలెంట్ అయ్యిపోతుంది. అరగంట లో హాస్పిటల్ కి చేరతారు. ఆటో ఆగగానే అవని స్పీడ్ గా లోపలికి వెళ్ళిపోతుంది.

ఏమైంది అవనికి. నాకు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు అనుకుంటూ పే చేసి లోపలికి వెళ్ళుతుంది. నేహా లోపలికి వెళ్ళేటప్పటికి అవని శ్రీ చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది.
శ్రీ గారు ఇక్కడ ఉన్నారు ఏమిటి.. విక్రమ్ గారు ఎక్కడ అని ఆలోచిస్తూ దగ్గరికి వెళ్లుతుంది. అవని ఏడుస్తూ ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్య. ఆక్సిడెంట్ ఎప్పుడు అయ్యింది అనగానే..

రాత్రి చెల్లమ్మ అని చాలా దీనంగా చెబుతాడు. రాత్రి అయ్యితే ఇప్పుడు దాక నాకు ఎందుకు చెప్పలేదు అని అరుస్తుంది.

నేహా అవని వైపు వింతగా చూస్తూ దీనికిమైనా పిచ్చా...
అతనికి ఆక్సిడెంట్ అయ్యితే దీనికి ఎందుకు చెప్పాలి అని అయోమయంగా జరిగేదాన్ని చూస్తుంది.

రాత్రి విక్రమ్ వైఫ్ తో వచ్చాడు. ఇద్దరికీ ఏదో గొడవ జరిగింది. విక్రమ్ కోపంగా బయటకు వెళ్ళాడు. ఇలా అయ్యింది అని చెప్పగానే శిల్ప ఇక్కడే ఉందా అని టెన్షన్ పడుతుంది.

ఆ అమ్మాయి ఏది అని తడబడుతు అడుగుతుంది. హ్మ్ ఆ అమ్మాయి కుంచెం తిక్కలిది అనుకుంటా భర్త కి ఇలా ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది.

హైదరాబాద్ నుంచి బామ్మగారు ఒకేటే ఫోన్లు. అప్పుడు అనుమానంగా చుట్టూ చూస్తూ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవ్వరు లేరు ఏమిటీ  అన్నయ్య అని అడుగుతుంది.

బామ్మగారికి. సెంటిమెంట్స్ ఎక్కువ కదా. విక్రమ్ కి ఇలా అవ్వగానే పూజ జరిపిస్తున్నారు. అందరూ అక్కడే ఉండాలి అంట.
పెళ్లి అయ్యాక  విక్రమ్ తన వైఫ్ కి రింగ్ పెట్టాడు అంట.అది చాలా పవర్ఫుల్.  విక్రమ్ భార్య తన రింగ్ ఉన్న చేతితో విక్రమ్ కుడి చేతిలో చెయ్యి వేసి గట్టిగా హోల్డ్ చేసి పట్టుకోమని చెప్పారు.

ఆ విషయం తెలిసినప్పుడు నుంచి ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. నాకు ఏమి చేయాలో తెలియక నీకు కాల్ చేసాను. చాలా టెన్షన్ గా ఉంది ఏమి జరు.. అంటూ ఉండగానే రూమ్ ఎక్కడ అన్నయ్య అని అడుగుతుంది.

అక్కడ అని చూపించాగానే పరుగున వెళుతుంది. వెనక నేహా కూడ వెళుతు ఉంటే నువ్వు ఎక్కడికి అని చెయ్యి పట్టుకొని ఆపుతాడు.

సీరియస్గా  ఒక్క లుక్ ఇస్తుంది. సారీ మిస్. మీరు కూర్చోండి అని సీట్ ఆఫర్ చేస్తాడు. అస్సలు ఇక్కడ ఏమి జరుగుతుంది.
కూల్ నేహా. అంత లోకకల్యాణమే జరుగుతుంది. అదే అవని కళ్యాణం అంటాడు. చేతులు రెండు కట్టుకుని అర్ధం కాలేదు అంటుంది.

పైనుంచి కిందకి ఒకసారి చూసి అవని కి పెళ్లి అయ్యింది అని తెలుసు కదా మరి ఆమె భర్త ఎవ్వరు అని అడుగుతాడు.

నాకు తెలీయదు అని చెబుతుంది. మీది నిజంగా మట్టిబుర్రే. ఒక పెళ్లి అయ్యిన అమ్మాయి ఎవరి కోసం పరుగు పెడుతుంది అనగానే.. భర్త కోసం అని అంటే విక్రమ్ గారు అవని భర్త అని ఆశ్చర్యంగా  అడుగుతుంది.

అమ్మయ్య ఇప్పటికైనా అర్థం అయ్యినందుకు థాంక్స్.. ఇప్పుడైనా కూర్చుంటారా అని కూర్చుంటాడు. ఎందుకు మీరు ఫ్లాట్ తీసుకున్నారు. అవని దగ్గరికి వచ్చి మాట్లాడొచ్చు కదా...

అవని గురించి అన్ని తెలుసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా... నిన్న ఏం న్యూస్ ఛానల్ చూడలేదా మీరిద్దరూ అని అడుగుతాడు.

అవిని కి టివి చూసే ఇంట్రెస్ట్ ఉండదు. నాకు వర్క్ ఉండి బయటకు వెళ్లాను అందుకే ఏమీ చూడలేదు అని న్యూస్ ఏంటి అని అడుగుతుంది.

చెప్పడం ఎందుకు చూపిస్తాను అని ఛానల్ ఓపెన్ చేసి ఇస్తాడు. అంతా చూసి ఏమిటి ఇంత జరిగిందా అని ఆశ్చర్య పోతుంది.

ఇప్పుడు అవిని యే చెప్పాలి అన్నది మా విక్రమ్ ప్లాన్. అందుకే ఇంత డ్రామా అంటాడు.  విక్రమ్ గారికి నిజంగానే ఏమీ అవ్వలేదా అని చాలా ఆనందంగా అడుగుతుంది.

పాపం కదా అవని అనగానే.. అవని ఎందుకు పాపం,  ఇంత ఫైట్ చేసిన మా విక్రమ్ ని పాపం అనుకోవాలి . పెళ్ళాం కోసం ఇంత నమ్మకంతో ఫైట్ చేస్తారా అంటాడు.

అది నిజమే. విక్రమ్ గారు అడవిని ఏలే సింహం అయితే ఇది తాబేలు కన్నా దారుణం. విక్రమ్ గారు ఆడే ఆటలో ఇది ఎలా బకరా అవుతుందో అని మనసులో అనుకుంటూ..
అవని మీద మనసులోనే జాలిని చూపిస్తుంది.

శ్రీ చూపించిన రూములోకి అవిని పరిగెత్తుకుంటూ వెళుతుంది. రూమ్ డోర్ ఓపెన్ చేయ గానే విక్రమ్ కి ఫుల్ ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టేసి ఉంచుతారు.

బి. పి. , హార్ట్ బీట్ అన్ని చాలా స్లో గా ఉంటాయి. అవిని ఏడుస్తూ విక్రమ్ దగ్గరికి వెళ్లి మీరు ఆరోజు పెట్టినప్పుడు నుంచి నేను అసలే తీయలేదు కదా..

చేతికున్న గ్లౌస్ తీసేసి శ్రీ చెప్పినట్టుగా తన చేతిని విక్రమ్ కుడి చేతులో పెట్టి గట్టిగా పట్టుకుంటుంది. నేను పక్కనే ఉన్నాను. నా చేతిని మీ చేతితో కలిపి పట్టుకున్నాను వినిపిస్తుందా అంటూ ఏడుస్తూ అడుగుతుంది.

విక్రమ్ అవని చేతిని గట్టిగా పట్టుకుంటాడు.  సంతోషంగా తలపైకి ఎత్తి చూస్తుంది. బీపీ హార్ట్ బీట్ అన్ని నార్మల్ గా వస్తూ ఉంటాయి.

డాక్టర్ డాక్టర్ అని పిలుస్తుంది. వెంటనే ఒక డాక్టర్ వచ్చి ఏమైంది మేడం అని అడగగానే... విక్రమ్ గారు కదులుతున్నారు చెక్ చేయండి అని చెబుతుంది.

డాక్టర్ చెక్ చేసి వావ్ వాట్ ఏ మిరాకిల్. వదిలేసుకున్న విక్రమ్ గారిలో చలనం వచ్చింది. ఏం చేశారు మేడం మీరు అనగానే..

అవని సంతోషంతో నేనేమీ చేయలేదు డాక్టర్. చేయ పట్టుకుని కూర్చున్నాను అంతే అని అమాయకంగా చెబుతుంది.

మీరు అలాగే పట్టుకొని కూర్చోండి. కొంచెం సేపటిలో ఆయనకి మేలుకువ రావచ్చు.  నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను.  ఏదైనా అవసరమైతే పిలవండి అని బయటికి వెళ్లి శ్రీ కి ఓకే అని థంబ్ ఫింగర్ చూపిస్తాడు.

డాక్టర్ బయటికి వెళుతూ మీరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం అని చెప్పి మరి వెళ్తాడు.

అవని విక్రమ్ చేయని గట్టిగా పట్టుకుని ఇంకొక చేతితో నుదురు మీద పెట్టి విక్రమ్ గారు నా మాటలు మీకు వినిపిస్తున్నాయా... నేను చెప్పేది నిజమని మీరు నమ్ముతారా అని అడుగుతుంది.

మీరు తాళి కట్టింది నాకే. శిల్ప కి కాదు. ఆరోజు ఉంగరం పెట్టింది కూడా నాకే. అందుకే ఆ చేతితో మిమ్మల్ని పట్టుకోగానే మీలో ఆ వైబ్రేషన్స్ వచ్చాయి అని అమాయకముగా,ఎమోషనల్ గా చెబుతుంది.

ఆ ధనుంజయ్ ఫ్యామిలీ చేసిన మోసం వలన నేను అజ్ఞాతంలోకి  రావాల్సి వచ్చింది. కానీ మీకు దూరంగా వస్తుంటే నా ప్రాణం పోయినట్టే ఉంది.

మిమ్మల్ని ఇక్కడ చూడగానే నేను ఎంత సంతోష పడ్డానో నాకే తెలుసు . మీ పక్కనే శిల్ప ని ఊహించుకోలేకపోయాను.

కానీ ఏ హక్కుతో మీ ముందుకు రావాలో అర్థం కాలేదు. జరిగింది చెపితే మీరు అర్థం చేసుకోకుండా మోసం చేశాను అంటే నేను తట్టుకోలేను.

నాకంటే ఎక్కువగా ప్రేమించేది మిమల్నే . రెండు రోజులకే నా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు.

మీకు ఏమన్నా అయితే అంతకముందే నా ప్రాణం నా నుండి దూరంగా వెళ్లిపోతుంది ఇది నిజం విక్రమ్ గారు అని ఆ చేతిని నుదుటిపైన పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది.
[+] 14 users Like SivaSai's post
Like Reply
#58

Part - 44


అవని ఏడుస్తూ విక్రమ్ చేతిని నుదుటిని అంటించుకుంటుంది. విక్రమ్ కి చాలా కష్టంగా ఉంటుంది. నిన్ను ఎటు వెళ్ళనివ్వకుండా లాక్ చేసేయాలి అనుకుని కళ్ళు మెల్లిగా కదూపుతూ ఉంటాడు.

అవని చూడడం లేదు అని చేతిని ఇంక కుంచెం కదుపుతాడు. అవని కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూస్తోంది.
డాక్టర్  డాక్టర్  అని అరుస్తూ ఉంటుంది.

బయట ఉన్న డాక్టర్ తల కొట్టుకుని, కంగారుగా లోపలికి వచ్చి ఏమైంది మేడం అని అడుగుతాడు. డాక్టర్ చూడండి విక్రమ్ గారు కళ్ళు కదుపుతున్నారు.

మీ మాటలు కి బాగా రెస్పాండ్ అవ్వుతున్నారు. అలాగే ట్రై చేయండి అని బయటికి వచ్చి శ్రీ పక్కన కూర్చొని మరి ఇంత అమయికురాలు  ఏమిటీ రా...

ఇలా ఉంటే వాడు బాగా అడేసుకుంటాడు రా పాపం రా అని జాలిగా అంటాడు. అంటే మీరు డాక్టర్ కాదా అని నేహా అడిగితే...

డాక్టర్ కోట్  వేసుకున్న వాళ్ళు అంత డాక్టర్స్ ఆ ఏమిటి అంటూ శ్రీ వైపు చూసి నీ మేడం కూడ ఆ బాపతే నా అని అడుగుతాడు.

నీకు దండం రా స్వామి కాసేపు నోరు మూసుకో అని నేహా కి ఒక తింగరి స్మైల్ ఇస్తాడు.  నేహా వాళ్ళిద్దర్నీ చూసి తల విదల్చుకుని సైలెంట్ గా కూర్చుంటుంది.

అవని విక్రమ్ ఫేస్ దగ్గరగా వచ్చి నా మాట వినిపిస్తుందా అని క్రాక్ వాయిస్ తో అడుగుతుంది.

విక్రమ్ కనురెప్పలు ఆటుఇటు కదుపుతూ స్లో వాయిస్ తో ఎవరు అని అడుగుతూ చేతిని గట్టిగ పట్టుకుంటాడు.

ఏమని చెప్పాలో తెలియక నేను అండి అని ఏడుస్తూ చెబుతుంది. నేను అంటే అని ముక్కలుముక్కలుగా అడుగుతాడు.

మీ భార్య ని అని చెప్పి మనసులో మాత్రం పేరు చెప్పకపోవడమే బేటర్. తరువాత కష్టం అవుతుంది అనుకుంటూ నుదురు మీద వేసిన చేతిని చెంప మీద కి తీసుకు వస్తుంది.

విక్రమ్ మనసులో నీ చావు తెలివి తేటలు నాకు తెలుసు. భార్య అంటే శిల్ప అనుకుంటాను. తరువాత నువ్వు వెళ్లిపోవచ్చు నీ ఆలోచిస్తున్నావు కదా... ఇక్కడ ఉన్నది విక్రమ్.

నీ అంతట నువ్వే అన్ని చెప్పుతావు చూస్తా ఉండు అనుకుని .. నా భార్యవా...మగతగా అడుగుతాడు. అవునండి అని చెబుతోంది.

కొంచెం దగ్గరికి రా  అని చెయ్యి పట్టుకుని లాగుతాడు. అబ్బా. ఈ మనిషికి దెబ్బలు తగిలినా సరే ఎక్కడి నుంచి ఇంత బలం వస్తుంది అనుకుంటు ఇంకా దగ్గరికి వెళుతుంది.

ఒకరి ఊపిరి ఒకరికి తగిలే అంత దగ్గరగా ఉంటారు. అవని మాత్రం టెన్షన్ గా విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది. కానీ విక్రమ్ కి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది.

నా భార్యామణివే కదా అని ముద్దు ముద్దుగా అడుగుతాడు. అవును అండి అనగానే ఒక ముద్దు పెట్టు అని అడుగుతాడు.

ఏమిటి ముద్ద అని  నోరు వదిలేస్తుంది. ఎంతసేపటికి అవని లో స్పందన రాదు.  ఓ నా భార్యవి కాదా కలవరింతలుగా అడుగుతూ ఉంటాడు.

బిపి,,పల్స్ రేట్ మళ్లీ డౌన్ అవుతూ ఉంటాయి. అవి చూడగానే అవిని కంగారుగా డాక్టర్ అని మళ్ళీ అరుస్తూ ఉంటుంది.

మళ్ళీ ఏం జరిగిందో ఏంటో అని డాక్టర్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు. ఏమైంది మేడమ్ అని అడగగానే బీపీ డౌన్ అవుతుంది చూడండి అని కంగారుగా చెబుతుంది.

వెంటనే విక్రమ్ ని చెక్ చేస్తూ ఆయన ఎందుకో డిసప్పాయింట్ అవుతున్నారు. మీరు ఏమైనా రాంగ్ గా మాట్లాడారా...మోటివేషన్ ఇవ్వలేదా అని అడుగుతాడు.

దానికి అవిని ఏమని చెప్పాలో తెలియక అది అని నసుగుతు ఉంటుంది. చూడండి మేడం, విక్రమ్ బ్రతకాలి అనుకుంటే మోటివేట్ చేయండి. 

ఇంతకు మించి ఏమీ లేదు అని చెప్పి... బయటకు వెళ్ళిపోయి చైర్ లో కూర్చుని వీళ్ళిద్దరిని కలపడం ఏమో కానీ.. మనకు తెలియని డాక్టర్ వృత్తిలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది రా అని శ్రీ తో అంటూ ఉంటాడు.

నేహా కాఫీ తీసుకొచ్చి ఇచ్చి తాగుతూ ఉండండి అని చెప్తుంది థాంక్యూ మిస్ అనగానే..  ఇంతకీ ఎంతవరకు వచ్చింది ఆ డ్రామా అని అడుగుతుంది.

ఇంకా దారిలోనే ఉంది. మీ ఫ్రెండ్ మరి తాబేలు అనుకుంటా ... అనగానే నవ్వుతూ అది అందరిలాంటి అమ్మాయి కాదు అని చెబుతుంది.

అర్థమైంది అందుకే మా విక్రమ్ పట్టువదలని విక్రమార్కుడు లాగా ప్రయత్నిస్తూఉన్నాడు అని చెబుతాడు.  శ్రీ మధ్యలో కూర్చొని నేను ఒకడిని ఉన్నా...

మీరిద్దరూ గుర్తిస్తున్నారా అని అడుగుతాడు.  ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంట్రా.. అసలే తల పగిలిపోతుంది. ముందు కాఫీ తాగినవ్వు అని చెప్పి సైలెంట్ గా కాఫీ తాగుతూ ఉంటాడు.

అవిని కి ఏం చేయాలో తెలియక విక్రమ్ దగ్గరగా వెళ్లి నేను మీ భార్యనే నండి. మీ చేతులతో మీరు తాళి కట్టిన మీ ఇల్లాలిని. నన్ను నమ్మండి అని చెప్పి నుదుటిపైన ముద్దు పెట్టుకుంటుంది.

పల్స్ రేటు కొంచెం నార్మల్ అవుతూఉంటుంది. హమ్మయ్య అనుకుని విక్రమ్ గారు మీరు తొందరగానే బాగుఅయిపోతారు  అని చాలా సంతోషంగా చెబుతుంది.

భార్య ఎప్పుడూ నుదుటిపైన కాదు పెట్టాల్సింది ముద్దు అని మగతగా చెబుతూ ఉంటాడు. మరి ఎక్కడ పెట్టాలి అండి అని అమాయకంగా అడుగుతూ ఉంటే..

దేవుడా దీనికి అన్ని నేర్పించేటప్పటికి నా పని అయిపోతుంది అనుకుని లిప్స్ పైన పెట్టాలి భార్యామణి అని చెబుతాడు.

ఏంటి లిప్స్ పైన అని ఆశ్చర్య పోతుంది. ఇలాగే వదిలేస్తే మళ్లీ ఊహల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి పల్స్ రేట్ మళ్ళీ డౌన్ చేస్తాడు. అది పడిపోతూ ఉంటుంటే లేదు లేదు ఇస్తాను అని చెప్పి లిప్స్ పైన అంటి అంటక పెదాలను ఉంచుతుంది.

ఇంతకు మించి అవిని ముందుకు వెళ్లలేదని అర్థం అయ్యే విక్రమే గట్టిగా కిస్ చేస్తాడు. అవిని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ పైకి లెగవాలని చూస్తూ ఉంటే.. రెండు చేతులతో బంధించి తన పైకి గట్టిగా లాక్కుంటాడు  ???.

అవిని కి ఊపిరి ఆడడం లేదు అనిపించినప్పుడు వదిలి కళ్ళు తెరుస్తాడు. విక్రమ్ అమాయకంగా ముఖం పెట్టి అరే అవని గారు మీరేంటి ఇక్కడ...

నా భార్య ఏది... ఇప్పుడే కదా కిస్ చేసింది.  ఎక్కడికి వెళ్ళింది.  అయినా నా భార్య ఉండాల్సిన ప్లేస్ లో మీరు ఉన్నారు ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు.

అవిని కి ఏం చెప్పాలో తెలియక దుఃఖం పొంగిపొర్లిపోతూ ఉంటుంది.  ఏడుపు నీ ఉగ్గ బట్టుకొని విక్రమ్ వైపు బేలగా చూస్తూ ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటుంది.

అవని ఏడుపును చూస్తూ ఉంటే విక్రమ్ కి కూడా చాలా కష్టంగా ఉంటుంది.  కానీ ఇప్పుడు తను తగ్గితే అవని నోటి నుంచి నిజాలు రావు అని చెప్పండి అవని గారు అంటూ బ్రీతింగ్ తీసుకోవడానికి కష్టపడుతూ ఉంటాడు.

అవని వెంటనే విక్రమ్ చాతి పైన చెయ్యి వేసి రుద్దుతూ మీరు ఆవేశపడకండి అంటూ కంగారుపడుతూ ఉంటుంది.. నేను అడిగిన దానికి మీరు ఇంకా సమాధానం చెప్పలేదు అని...

ఉంగరం చూసి అదేంటి ఇది నా భార్య కి నేను పెట్టిన ఉంగరం కదా... మీ దగ్గరికి ఎలా వచ్చింది మెడలో ని నల్లపూసలు చైన్ కూడా పైకి లాగి ఇది కూడా నేను నా భార్యకి వేసింది మీ మెడలోకి ఎలా వచ్చింది అడుగుతాడు.

అవిని పొద్దుటి నుంచి పడుతున్న కంగారులో నల్లపూసలు లోపలికి వేసుకోవడం మర్చిపోతుంది.  అది ఇప్పుడు విక్రమ్ కళ్ళల్లో పడుతుంది.

ఏం చెప్పాలో తెలియక అవిని టెన్షన్ పడుతూ ఉంటే ఇక విక్రమ్ లాభం లేదు అని పల్స్ రేట్ మళ్లీ డౌన్ చేస్తూ బ్రీతింగ్ ఇబ్బందిగా తీసుకుంటూ ఉంటాడు.

నిజం మాత్రమే చెప్పు అవని అని చాలా కష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. అవని ఇక నిజం చెప్పక తప్పదు అని కన్నీళ్ళతో విక్రమ్ వైపు చూస్తూ మీరు తాళి కట్టింది నాకే అని తడబడుతూ చెబుతుంది.

వాట్ ఏమంటున్నావ్ అవని నీకు నేను తాళి కడితే నా భార్య గా అక్కడ ఉన్నది ఎవరు.. పెళ్లి అయినప్పటి నుంచి నాతోనే ఉంది కదా...మధ్యలో ఎలా మారుతారు అని ఏమీ తెలియనట్టుగా అడుగుతాడు.

అవని ఇంకా జరిగిందంతా చెప్పక తప్పదు అని వాళ్ల పెళ్లి రోజు నుంచి శోభనం రోజు వరకు జరిగిందంతా చెప్పి తలదించుకుంటుంది.

ఇందులో నీ తప్పు ఏముంది అని తలదించుకుంటున్నావు అవని అని తన చేతికున్న ఆ మిషన్స్,  ఛాతి  పైన ఉన్న మిషన్స్ అన్ని తీసేస్తూ ఉంటాడు.

అయ్యయ్యో మీరు ఇవన్నీ ఇలా తీసేస్తున్నారేంటి.అసలు మీకు దెబ్బలు తగిలాయి. ఆ పల్స్ కూడా పడిపోతూ ఉంది.  ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే ఎలాగా అని కంగారు పడుతుంది.

నీ నోటితో నిజాలు చెప్పించడానికి నేను ఆడిన నాటకం ఇదంతా అని చెబుతాడు. అంటే అని అయోమయంగా అడుగుతూ... మీకు ఇవన్నీ ముందే తెలుసా ఆనందం, భయం అన్ని రకాల ఎమోషన్స్ కలిపిన ఎక్స్ప్రెషన్స్తో అడుగుతుంది.

వెంటనే సంతోషంతో విక్రమ్ ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. విక్రమ్ కూడా అవని చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటాడు. 

ఇద్దరూ ఎంతసేపు అలా ఉన్నారో వాళ్లకే తెలియదు ఒకళ్ళది తన దగ్గరికి తన బంధం చేరుతుందో లేదో తెలియని భయం.

మరి ఒకరిది తన బంధం తన దగ్గరికి వచ్చింది అన్న ఆనందం. అవిని వెంటనే ఉలిక్కిపడి దూరం జరిగి క్షమించండి అని తలదించుకుంటుంది.

ఎందుకు అని అడుగుతాడు. మీకు ఈ నిజం ఎప్పుడూ తెలిసింది అంటే...  శిల్పతో లైఫ్ స్టార్ట్ చేశాక, చేయకముందా అని అడుగుతూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది.

అవని మానసిక పరిస్థితి అర్థం అయ్యి విక్రమ్ చాలా ఓపికగా అవని వైపు చూస్తూ.. చూపులు వేలుతో అవని గెడ్డాన్ని పైకి లేపి నువ్వు ఏమనుకుంటున్నావు అని కళ్ళల్లో కళ్ళు పెట్టే సూటిగా అడుగుతాడు.
[+] 13 users Like SivaSai's post
Like Reply
#59

Part - 45


అవిని కి ఏం సమాధానం చెప్పాలో తెలియక భయంతో కళ్ళు రెపరెపలాడిస్తూ ఉంటుంది. చెప్పు అవని నిన్నే అడుగుతున్నాను.

అది... అది... శోభనం రాత్రి అనుకుంటున్నా అని చెప్పి కళ్ళు వాల్చేస్తుంది. హ్మ్ పరవాలేదు బానే అర్థమైంది కదా...

మరి ఎప్పుడు తెలిసింది అని ఎందుకు అడిగావు అని సూటిగా అడుగుతాడు. మీ మీద అనుమానం కాదు ఆ కుటుంబం మీద లేని నమ్మకం.

క్షమించు అని ఎందుకు అడిగావు మళ్ళీ ప్రశ్న ఇస్తాడు. మీరు కనపడగానే నిజం చెప్పనందుకు. నా కోసమే వచ్చారు అనుకోలేదు.

అవని చెబుతుంది అన్న మాటేగాని కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతుఉన్నాయి. హుష్.. ఎందుకు ఏడుస్తున్నావు. మీరు వస్తారు అని నా నమ్మకం నిజం అయ్యినందుకు.

నువ్వు నా మీద అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు రాకుండా ఎలా ఉంటాను అంటూ దగ్గరికి తీసుకుంటాడు.
విక్రమ్ గుండెల మీద తల వాల్చి ఇది అంత నిజమే కదా..
నేను ఏమి కల కనడం లేదు కదా అని గట్టిగ పట్టుకుంటుంది.

హ్మ్  నీ అనుమానం తీరాలి అంటే ఒక పని చేయాలి భార్యమణి. ఏమిటా ఆ పని అంటూ ఇంక గట్టిగ పట్టుకుటుంది.

తన కోసం ఎంత ఎలా ఎదురు చూస్తూ ఉందొ ఆ పట్టులోనే విక్రమ్ కి అర్ధం అవుతుంది. అవని నుదరు మీద కిస్ చేసి ఇందాక కిస్ సరిగ్గా ఇవ్వలేదు.

ఇప్పుడు ఫీల్ అవ్వుతు ఇవ్వు. అప్పుడు అర్ధం అవుతుంది కల కాదు అని చెబుతూ ఇంక తనలోనికి లాక్కు ఉంటాడు. ఆ మాటలకూ అవని సిగ్గులమొగ్గ అవుతుంది.

కాసేపు భర్త సహచర్యంలో  గడిపి తల ఎత్తి మరి మన ఇంట్లో నన్ను ఒప్పుకుంటారా అని భయంగా అడుగుతుంది. నువ్వే అంటున్నావుగా మన ఇల్లు అని. ఇంక డౌట్ ఎందుకు.

ఈవెనింగ్ హైదరాబాద్ వెళ్లుతున్నాము. రేపు మార్నింగ్ 10కి నీ ఆఫీషీయల్  గృహప్రవేశం అని చెబుతాడు. ఇంకొక విషయం అనగానే... చెప్పు అన్నట్టు చూస్తాడు.

పెళ్లి విషయం మాట్లాడుకుంటున్నప్పుడు రెండు కుటుంబాలు మధ్యన కట్న కానుకల విషయాలు వచ్చి ఉండొచ్చు. కానీ నేను ఒక అనాధ ని.  నా వైపు నుంచి ఎటువంటి లాంచనాలు ఉండవు. ఉండబోవు.

నన్ను నా లాగానే స్వీకరించాలి అని చెబుతూ విక్రమ్ కళ్లలోకి చూస్తుంది. అవని మనసు ఎంత గాయపడింది అన్నది విక్రమ్ కి అర్థమయింది.

అవని మాటలు వింటూ ముందుకు పడిన కురులను చెవి వెనక్కి పెడుతూ  ఇంకా ఏమైనా కండిషన్స్ ఉన్నా యా అడుగుతాడు నేను సీరియస్ గానే చెబుతున్నాను అని చెబుతోంది.

మన పెళ్ళికి ముందు ఎలాంటి మాటలు జరిగాయో నాకు అనవసరం. పెళ్లి తర్వాత మనం ఏమిటి అన్నదే ముఖ్యం.
నీ భర్త  గురించి నువ్వు ఏమనుకుంటున్నావు.

ఒకరు ఇచ్చే కట్న కానుకులు మీద ఆధారపడి ఉన్నాడు అనుకున్నావా అని అడుగుతాడు.  నా ఉద్దేశ్యం అది కాదు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థంకావడం లేదు అంటూ చేతులు పిసికుతూఉంటుంది.

అవని నీ తన గుండెలికి హత్తుకుని నువ్వు ఏమి టెన్షన్ పడకు అర్థమయిందా చాలా మృదువుగా చెబుతాడు.

హ్మ్ కానీ ఆ ఫ్యామిలీ ఊరుకుంటుందా..  అందరి దృష్టిలో మీకు శిల్పకే కదా పెళ్లి జరిగింది  అంటూ విక్రమ్ ని ఇంకా కరుచుకుపోయి అడుగుతుంది .

అవని భయం అర్థం అయినా విక్రమ్ ఫోన్ ఓపెన్ చేసి నిన్న జరిగిన న్యూస్ అంతా చూపిస్తాడు. న్యూస్ చూడగానే అవని ఆనందపడుతుంది.తర్వాత తన తల్లిని కూడా చంపేశారు అని తెలుసుకుని చాలా బాధపడుతుంది.

నీ కంటిలో ఇంకా ఈ కన్నీరు ఎప్పుడూ రాకూడదు. నీకోసం మన కుటుంబం మొత్తం ఎదురుచూస్తూఉంది. ఇంకా అత్తయ్య, మావయ్య అయితే  తన కూతురు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తీసుకు వస్తానా అని గంటకొకసారి ఫోన్ చేస్తూనే అన్నారు.

ఇంకా ఏడుపు ప్రోగ్రాం అయిపోతే మనం హైదరాబాద్ బయలుదేరవచ్చు అని వాతావరణాన్ని తేలికచేస్తాడు.
అవని నవ్వుతూ సరే వెంటనే బయలుదేరాదామని.. అయ్యో  మా సీనియర్ కి చెప్పాలి.   ఇందాక నుంచి బయటే వెయిట్ చేస్తుంది అని కంగారుపడుతుంది.

నువ్వు ఏమి టెన్షన్ పడక్కర్లేదు తనతో పాటు శ్రీ,రాజ్ ఉన్నారు అని చెబుతాడు. శ్రీ అన్నయ్య అయితే నాకు తెలుసు మరి రాజ్ ఎవరు అని అడుగుతుంది.

ఇందాకటి నుంచి డాక్టర్ డాక్టర్  అని పిలుస్తున్నావు కదా.. అతడే అని చెబుతాడు. అంటే అతను డాక్టర్ కాదా... ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి అని అడుగుతుంది.

ప్రస్తుతానికైతే ఇంతమందే అయినా  నిన్ను మాయ చేసి నీతో నిజం చెప్పించడానికి నేను ఒక్కడినే చాలు. కానీ నీ ఎమోషన్ కూడా బయటకు తీసుకు రావాలని ఇంత డ్రామా ఆడింది అని చెబుతాడు.

వెళదామా ఈ హాస్పిటల్ లో ఉండాలి అంటే చిరాకు వచ్చేస్తుంది అని బెడ్ నుంచి లెగుస్తాడు. సరే అని చెప్పి అవిని కూడా లెగుస్తుంది.

అవని భుజం చుట్టూ చెయ్యవేసి రూమ్ లో నుంచి బయటికి వస్తాడు. వాళ్ళిద్దరినీ అలా చూడగానే అక్కడ ఉన్న ముగ్గురికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది.

నేహా మాత్రం సింహం చేతిలో కుందేలు పిల్లలాగా ఉంది కదా అని అడుగుతుంది. ఆ మాటకి శ్రీ, రాజ్ ఇద్దరూ కూడా నేహా వైపు ఒక చూపు చూసి మళ్ళీ విక్రమ్ వైపు చూస్తారు.

ఇప్పుడు నేను ఏమన్నానని మీ ఇద్దరి అలా చూస్తున్నారు అని అడుగుతుంది. మేము లోపల అనుకున్నాము  నువ్వు పైకి అన్నావు అందుకే చూశాము.

విక్రమ్ వీళ్లు దగ్గరికి వచ్చి ఏంటి మీ ముగ్గురు గుసగుసలు. ఇంకా వెళదామా అనగానే... మేమెప్పుడో రెడీ అని శ్రీ,రాజ్ ఇద్దరు చెబుతారు.

అవని వెళ్లి నేహా ని గట్టిగ హాగ్ చేసుకుని థాంక్యూ సీనియర్. ఆ రోజు మీరు ఆదుకోపోయి ఉంటే నేను ఏమి అయ్యిపోయిదాన్ని అనగానే... నీది మంచి మనసు కాబట్టే అంత మంచే జరిగింది.

నేను చేసింది ఏమి లేదు అని చెప్పి విక్రమ్ నీ చూస్తూ అవని చాలా కష్టాలు పడింది. చదువు కోసం పార్ట్ టైమ్ జాబ్ చేసింది. చాలా సార్లు పస్తులు కూడ ఉంది.

మాకు తెలిస్తే కోప్పడుతాము అని వర్క్ ఉంది అని లైబ్రరీ కి వెళ్లిపోయేది. వయస్సు కి మించి కష్టపడింది. మీ వల్ల తనకి అన్ని సంతోషాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను.

వాళ్లిద్దరి స్నేహం చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అలాగే అవని పడిన కష్టాలు కూడ చాలా భాదగా అనిపిస్తాయి.

విక్రమ్ అవని చేతిని గట్టిగ పట్టుకొని ఇంక తన లైఫ్ లో ఎటువంటి కష్టాలు రావు. ఇది నా ప్రామిస్ అని నువ్వు మాతో పాటు హైదరాబాద్ రా...

వన్ వీక్ తరువాత వర్క్ లో జాయిన్ అవ్వచ్చు అని అవని తో హైదరాబాద్ ప్రయాణం మొదలుపెడతాడు.
హైదరాబాద్ చేరాక గెస్ట్ హౌస్ కి చేరతారు.

గెస్ట్ హౌస్ కి వెళ్ళాక అందరూ ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ కి వెళ్ళిపోతారు.

అవని నేహా తో వెళుతు ఉంటే విక్రమ్ చెయ్యి పట్టుకుని రూమ్ లోనికి  తీసుకువెళ్లి డోర్ లాక్ చేస్తాడు.

ఏమిటీ మీరు చేసింది. నేహా ఏమి అనుకుంటుంది అని విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ ఇంటెన్షన్ చూపులు తట్టుకోలేక కళ్ళు కిందకి వాల్చేస్తోంది.

దగ్గరగా వచ్చి అవని నీ వెనక నుండి హత్తుకుని ఇప్పుడు చెప్పు ఏదో చెబుతున్నావు అని అడుగుతాడు.

పాపకి ఇంకేం మాటలు వస్తాయి. బాబు గారు హత్తుకుంటే. అందులో మొదటిసారి భార్య అనే హక్కుతో ఆమె. భర్త అనే అధికారంతో అతను ఉన్నారు. 

మౌనాన్ని ఆశ్రయించిన అవని తనకు తెలియకుండానే తన తలని వెనక్కి వాడ్చి విక్రమ్ హృదయం పైన పెడుతుంది.

ఈ స్థానం ఎప్పటికీ నాదే. నాకు ప్రశాంతత దొరికే స్థానం కూడా అదే అని తనకే తెలియని ఒక అలోకేకమైన ఆనందంతో కన్నులు మూసుకుంటుంది.

దేవేరి మనసు అర్థమయిన విక్రమ్ చిన్న చిరునవ్వుతో ఇంకా గట్టిగా చుట్టుకుని... ఎప్పటికీ నా హృదయ సామ్రాజ్య దేవి నీవే.

ఇది మన పాణిగ్రహణం సమయంలోను మాట ఇచ్చాను ఇప్పుడు మాట ఇస్తున్నాను అని అవిని చెవిలో చెబుతూ తన పెదాలతో భార్య చెవిపై రాస్తూ ఉంటాడు.

ఆ రాపిడికి తట్టుకోలేక విక్రమ్ చేతులను గట్టిగా పట్టుకుని ప్లీజ్ అండి అని... చాలా కష్టంగా ఉంది అని చెబుతూ బుగ్గల్లో మందారాలను పూయిస్తుంది.

ఓయ్ నువ్వలా సిగ్గుపడితే ఇక్కడ నాకు చాలా కష్టంగా ఉంది. మన సృష్టి కార్యానికి ఇంకొంచెం టైం ఉంది.

రేపు మన ఇంటికి వెళ్లిన తర్వాత.. పెద్దలు సమక్షంలో అన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత..  అప్పుడు నా దేవేరి ని పూర్తిగా నా సొంతం చేసుకుంటాను అని ఇంకా దగ్గరికి లాక్కుంటూ చెబుతాడు.

ఆ మాటలకి వెంటనే విక్రం వైపుకు తిరిగే గట్టిగా కోగలించుకుంటుంది. సంతోషంతో తన కళ్ళనుండి ఆనంద భాష్పాలు కారుతూ ఉంటాయి.

అవిని ముఖాన్ని చేతిలోకి తీసుకుని ఇప్పుడు ఇవి ఎందుకు వస్తున్నాయని తుడుస్తాడు. ఇది బాధతో వచ్చినవి కాదు.  ఆనందంతో వచ్చినవి.

నా జీవితంలో కూడా సంతోషమానేది ఉంటుంది అని ఇప్పటిదాకా తెలియలేదు. నా కోసం నా మనిషి  అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు అని...నాకోసం ఒక కుటుంబం ఏర్పడుతుందని ఊహించలేదు.

మీకు తెలియదండి నేను పడిన ఇబ్బంది ఊహ తెలిసినప్పటి నుంచి పస్తులు ఉన్నాను. గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నాను కదా వాళ్లు ఒక పూట పెట్టే భోజనం తోనే రోజు మొత్తం ఉండేదాన్ని.

వయసుకు వచ్చిన తర్వాత ఇంటిలోను,బయట కూడా నన్ను నేను రక్షించుకోవడానికి చాలా కష్టపడి వలసివచ్చేది .

సరిగ్గా నిద్రపోయే దాన్ని కాదు.  చిన్నా అలికేడైనా సరే భయంతో లెగిసి కూర్చునేదాన్ని.ఆ సమయంలో నేనున్నాను అని ధైర్యం చెప్పే మనిషి నా పక్కన ఉంటే బాగుండును అని అనిపించేది.

నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని నాకు ఒక రూల్ పాస్ చేశారు. అమ్మ అవసరమైన సమయంలో కూడా ఒంటరిగానే ఉన్నాను.  నాన్న ధైర్యం చెప్పే సమయం లో కూడా ఒంటరిగానే ఉన్నాను.

కానీ ఈరోజు నా కోసం నా కుటుంబం ఉంది. ఆ భరోసానే ఎంతో ధైర్యంగా ఉంది. ఇది ఎప్పటికీ నాకు ఇలాగే ఉంటుంది కదా అని గద్గద స్వరంతో అడుగుతూ విక్రమ్ ని కరుచుకుపోతుంది.

అవని బాధలు వింటుంటే విక్రమ్ కి మనసు మెలిపడుతుంది. అవని ఇన్ని కష్టాలు పడడానికి కారణమైన వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది.
[+] 16 users Like SivaSai's post
Like Reply
#60

Part - 46


   

విక్రమ్ అవని నీ గట్టిగా కొగిలించుకుని ఇది అంత నిజమే. ఇంక నీ అనుమానం తీరాలి అంటే  నిన్ను ఒక పని చేయమన్నాను. అది అర్జెంటుగా చేసేయ్.

అప్పుడు నీ అనుమానం తీరుపోతుంది. నేను కూడ ఫుల్ కుష్ అయ్యిపోతాను. ఏమి అంటావు అని ఐ బ్లింక్ చేస్తాడు.

బాబోయ్ మీ మాటలు వింటుంటే ఇన్ని రోజులు చూసింది మిమ్మల్నేనా  అనిపిస్తుంది అంటూ సిగ్గుతో  మెలికలు తిరుగుతూంది.

అవని సిగ్గు చూసి విక్రమ్ అందంగా  నవ్వేస్తాడు. ఆ రాత్రి ఒకరికొకరు దూరంగా ఉంటూ దగ్గరై చేతులు పెనవిసుకొని ఒకే మంచం మీద పడుకుంటారు.

ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యినందుకు ఇద్దరు చాలా ప్రశాంతంగా పడుకుంటారు. ఉదయం అలారం సౌండ్ కి విక్రమ్ కి మెలకువ వస్తుంది.

మత్తుగా కళ్ళు తెరుస్తూఉంటాడు. ఎప్పుడు ఒకరిఒకరు దగ్గరగా వచ్చి పడుకున్నారో తెలియదు. అవని విక్రమ్ హృదయం పై పడుకుంటే... అవని చుట్టూ చేతలు బిగించి పడుకుంటాడు.

అలా చూసుకోగానే  విక్రమ్ పెదువుల పై నవ్వు వచ్చి చేరుతుంది. ఈ రోజు బాగుంది. పెళ్ళి అయ్యిన ఇన్ని రోజులకి నా పెళ్ళాం తో ఇలా పడుకున్నాను.

ప్రతిరోజు ఇలాంటి రోజే రావాలి. ఉంటుంది కూడ అనుకుంటూ అవని నుదిటి పైన ముద్దు పెట్టుకుని గుడ్ మార్నింగ్ భార్యమణి ?అని చెబుతాడు.

అవని ఇంక దగ్గరికి అంటూ జరిగి గుడ్ మార్నింగ్ అని చెబుతోంది. గుడ్ మార్నింగ్ చెప్పి ఎవరూ పడుకోరు. లెగిస్తే మనం బయలుదేరొచ్చు అని చెబుతాడు.

హ్మ్  గుడ్ మార్నింగ్ అంటూ మళ్ళీ హగ్ చేసుకుంటుంది. ఓయ్ ఏంటి ఈ నిద్ర అని అడుగుతాడు.నిద్రలోనైతేనే కదా మీరు నాకు ఇంత దగ్గరగా ఉంటారు కాసేపు పడుకోండి అని కళ్ళు మూసుకుంటుంది.

ఇంకేం అనిపిస్తుంది దగ్గరికి లాక్కుంటూ అడుగుతాడు. రోజు ఇలాగే పట్టుకుని పడుకుంటారు.రోజు మార్నింగ్ నాకు గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేస్తారు.

అవునా ఇలా కూడా ముద్దు పెడతానేమో లిప్స్ పైన ఒక పెక్ ఇస్తాడు. అంతే  నిద్రమత్తు వదిలి ఉలిక్కిపడి లెగుస్తుంది.

హే ఏమైంది అంత అలా కంగారు పడుతున్నావ్ అంటే.. ఏమీ లేదు అని మంచం దిగబోతుంది. చేయి పట్టుకుని లాగుతాడు. మళ్ళీ వెళ్ళీ విక్రం మీద పడుతుంది.

అవినీ కళ్ళల్లో చూస్తూ ఏంటి రోజు ఇలాగే కలలోకి వచ్చే వాడిన అని అడుగుతాడు.ఇలాగే ముద్దు పెట్టుకునే వాడిన అని మళ్ళీ కిస్ చేస్తాడు.

ప్లీజ్ అంటే వదలండి రెడీ అవ్వాలి కదా అనే సిగ్గుతో కళ్ళు వాల్చేచేస్తుంది . ఇప్పుడు నేను ఏమన్నానని నువ్వు అంతలా సిగ్గుపడుతున్నావు.

నేనేం చేసే వాడిని అని అడుగుతున్నాను అది కూడా తప్పేనా అని చిరుకోపంగా అడుగుతాడు. మీకు అన్నీ తెలిసి అడిగితే నేనేమీ చెప్పగలను అంటే....

నీ నోటితో వింటే నాకు బాగుంటుంది కదా చెప్పు ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమాలతూ ఉంటాడు.

నేను ఇంటిలో నుంచి వచ్చేసిన తర్వాత నుంచి ప్రతి రోజు ఇదే కల గుడ్ మార్నింగ్ చెబుతుంది. ఇది కల అనుకున్నాను కానీ అది నిజమై నా ముందుకు వచ్చింది అని అర్థమైంది అని చెబుతుంది.

ఇప్పటినుండి నీకు అలాంటి కలలతో అవసరం లేదు. ప్రతిరోజు అదే శుభోదయం అవుతుంది మై డియర్ భార్యామణి అని చెప్పి...తొందరగా ఫ్రెష్ అవ్వు. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి వదులుతాడు.

అవని ఫ్రెష్ అయ్యి సింపుల్ గా ఉండే చీర కట్టుకొని ధైర్యంగా తన భర్త వేసిన నల్లపూసలు బయటకు వేసుకుని నుదుటన కుంకుమ పెట్టుకుని రెడీ అవుతుంది.  మెడ. మాత్రం బోసిగా అనిపించి బాధగా చూసుకుంటుంది.

విక్రమ్ కూడా రెడీ అయి,అయిపోయిందా అవని అంటూ అవిని వెనకాల నుంచి అద్దంలో చూస్తాడు. తనని తాను అద్దంలో చూసుకుంటున్న ఈ లోకంలో లేని అవినినీ కదుపుతూ  ఏమైంది అని అడుగుతాడు.

ఏమీ లేదు అన్నట్టుగా తల ఊపుతుంది. అవని ముఖం చాలా బాధగా కనిపిస్తుంది.  తన వైపుకు తిప్పుకొని ఏమైందిరా అని అడుగుతాడు.

దానికి అవని కళ్ళనీళ్ళతో అందరూ బలవంతంగా నేను ఇవ్వను అన్న నా మెడలో నుంచి తాళిని తీసేసుకున్నారు.
తాళి కోసం వాళ్లతో గొడవ పడుతున్నాను అని ఆ ఉదయ్ గాడు నా చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించాడు.

ఆ నిమిషం నన్ను నేను కాపాడుకోవడానికి వేరే గత్యంతరం లేక తాళిని ఇవ్వాల్సి వచ్చింది.  దాని బదులు వాళ్ళు నా ప్రాణం తీసుకున్న నాకు ఆ రోజు అంత బాధ అనిపించేది కాదు.

కానీ ఆడదానికి ఎంతో విలువైన మానం, తాళిని లాక్కొవాలని చూసారు  అని ఏడుస్తూ ఉంటే... ఉష్
నీకు ఎన్నిసార్లు చెప్పాను.

ప్రతిదానికి ఏడవద్దు.నేను పక్కనుండగా కూడా నువ్వు ఏడిస్తే మన ప్రేమకి అర్థం ఏముంటుంది చెప్పు. నీ మెడలోకి ఆ తాళి కూడా వచ్చి చేరుతుంది.

మన పెళ్లి రోజున నువ్వెవరో మనవాళ్ళకి తెలియకుండా నేను తాళి కట్టాను. అందరి సమక్షంలో నువ్వెవరో తెలిసే గర్వంగా నీ మెడలో  తాళి నీ వేస్తాను సరేనా అని చెప్పి కళ్ళు తుడిచి కిందకి తీసుకు వెళ్తాడు.

కింద శ్రీ, రాజ్, నేహా రెడీగా ఉంటారు. వెళదామా అనగానే  మేమెప్పుడో రెడీ.  మీ ఇద్దరి కోసం వెయిటింగ్ పదండి అని చెప్పి అందరూ బయలుదేరుతారు.

ధనుంజయ్ వాళ్ళమ్మ గారి దగ్గరికి వెళ్లి అమ్మ రెడీ అయ్యారా,తొందరగా వెళదాం. ఈ పాటికి అవని వాళ్ళు వచ్చేసి ఉంటారు అని కంగారు పెడుతూ ఉంటాడు.

శేషగిరి గారు కొడుకు వైపు చూసి నువ్వు రావడం అవసరమా అడుగుతారు. దానికి అదేంటి నాన్న అలాగంటారు..  నా కూతురు దగ్గరికి వెళ్లకూడదా అని బాధగా మాట్లాడుతాడు.

ఏ ముఖం పెట్టుకుని వెళతావు రా నువ్వు... అన్ని నిజాలు తెలుసాయి కాబట్టి నా కూతురు నా కూతురు అంటున్నావు . అదే తెలియక పోయి ఉంటే ఏం చేసేవాడివి.

అదే మాయలో ఉంటే  దాని గొంతు కోసేవాడివి కదా అని అడుగుతారు. నాన్న అని బాధగాచూస్తాడు. నేను నిజమే కదరా మాట్లాడుతుంది.  ఇప్పుడు అదే ప్రశ్న నా మనవరాలు అడిగితే ఏం సమాధానం చెబుతావు అని అడుగుతారు.

ఆ ప్రశ్నకు సమాధానం లేక మౌనాన్ని ఆశ్రయిస్తాడు. మాకే నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావే..ఇంకా ఆ చిట్టి తల్లి కళ్ళల్లోకి చూసి నువ్వు ఏమి సమాధానం చెప్పగలవు రా.. అందుకే వద్దు అంటున్నాము సదా సత్యవతి అని భార్య వైపు తిరుగుతారు.

వెళుతున్న తల్లిదండ్రుల్ని ఆపి మీరు అన్న ప్రతి మాట నిజమే నాన్న. ఇలాగే దూరంగా ఇంకా ఎప్పటికీ పూడ్చలేని అగాధమే అవుతుంది.

నా కూతురు నన్ను అసహ్యించుకున్న పర్వాలేదు. నేను నా కూతురికి దగ్గరగానే ఉంటాను. తిడుతుందా.. తిట్టని. అసహ్యించుకుంటుందా...అసహ్యించుకొని.

ఇన్నాళ్లు నా కూతురికి నాకే తెలియకుండా ఇచ్చిన బాధని నేను తెలిసి తీసుకుంటాను పదండి అని ముందుకే కదులుతాడు.

భార్యాభర్తలిద్దరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని కొడుకు వెనకాల వెళ్లి కారులో కూర్చుంటారు. అవిని నీ ఎప్పుడెప్పుడు చూడాలా అని ధనుంజయ్ కార్ జై సింహ మాన్షన్ వైపు పరుగులు పెడుతుంది.

మాన్షన్ మొత్తం కొత్తజంట కోసం ఎదురు చూస్తూ పువ్వులతో అందంగా అలంకరించి, రంగురంగుల ముగ్గులతో ముస్తాబయి  ఆ ఇంటి మహాలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంది.

ధనుంజయ్ వాళ్లు కూడా వచ్చే ఎదురు చూస్తూ ఉంటారు. విక్రమ్ కారు మాన్షన్ లోనికి ఎంటర్ అవుతుంది. ఆడపడుచు గా నివి హారతి పళ్ళెంతో రెడీగా ఉంటుంది.

కారు ఆగగానే అందరూ దిగుతారు కానీ అవని మాత్రం దిగదు చాలా టెన్షన్ గా నేర్వోస్ ఫీల్ అవుతూ ఉంటుంది.

అవిని ఫీలింగ్స్ ఏంటో అర్థం అయినా విక్రమ్ అవని వైపుకు వచ్చి కార్ డోర్ తీసి చెయ్యి ఇస్తాడు.

అవిని భయంగా విక్రమ్ వైపు చూస్తుంది. నేనున్నాను అన్నట్టుగా కళ్ళు ఆర్పుతాడు. ఆ భరోసాతో ధైర్యంగా విక్రమ్ చేతిలో చేయి వేసి  కారు దిగుతుంది.

అవిని కారు దిగి విక్రమ్ తో నడుస్తూన్న దారంతా మెత్తని పువ్వుల బాట పరుచుకుని ఉంటుంది. వాళ్ళిద్దరి పైన పూల వర్షం కురుస్తూ ఉంటుంది.

అదంతా ఆశ్చర్యంగా చూస్తూ విక్రమ్ వైపు చూస్తుంది. ఏంటి అన్నట్టుగా కళ్ళు ఎగరేస్తాడు. ఏమీ లేదు అని తల అడ్డంగా ఊపి విక్రంతో పాటు కలిసి అడుగులు వేస్తుంది.

గుమ్మం దగ్గరికి రాగానే ఆగండి అన్న పిలుపు గంభీరంగా వినిపిస్తుంది. ఆ పిలుపుకి అవని భయపడి విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది.

ఇందిరా గారు అక్కడికి వచ్చి నివి వైపు చూసి ఇప్పుడైనా మీ అన్న, వదినని ఒకరి పేర్లు ఒకళ్ళు చెప్పుకుని లోపలికి రమ్మని చెప్పు అని చెబుతూ అవని వైపు చూస్తారు.

అవని ఇంకా టెన్షన్తో చూస్తూ ఉంటే...మాధవి అక్కడికి వచ్చి అమ్మ అప్పుడే నా కూతుర్ని భయపెట్టదు అని చెప్పి నువ్వు చెప్పరా తల్లి నీకు నేనున్నాను కదా..

అమ్మే కాదు, అన్నయ్య, నాన్న కూడా ఉన్నారు అని భరత్ రమేష్ కూడా అక్కడికి వస్తారు. అవని ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే ఎందుకంత అలా ఆశ్చర్యపోతున్నావు.

మేము ఎప్పుడో డిసైడ్ అయిపోయాము. నువ్వు రాగానే నీకు ఎటువంటి అభ్యంతరము లేదు అనుకుంటే.. నా కూతురుగా దత్తత తీసుకోవాలని.

అందుకు అమ్మ కూడా ఒప్పుకుంది అని.. ముందు పేర్లు చెప్పుకొని లోపలికి రండి.తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని కంగారు పెడతారు.

అబ్బా నేను ఎంత సేపు హారతి పళ్లెం పట్టుకుని నుంచోవాలి. తొందరగా పేర్లు చెప్పి రండి వదిన. పొద్దున్నుంచి ఫుడ్ కూడా పెట్టకుండా నీకోసమే వెయిటింగ్. ఆకలేసేస్తుంది అని.
.
విక్రమ్ నవ్వుతూ విక్రమ్ అనే నేను నా భార్య అవనితో కలిసి ఇంటికి వచ్చాను. లోపలికి రానిస్తావా చెల్లెమ్మ అని కొంచెం డ్రామాటిక్గా చెబుతాడు.

అందరూ ఓ అని అరుస్తూ ఇప్పుడు నువ్వు చెప్పు అని అవిని వైపు తిరుగుతారు.

అవని సిగ్గుపడుతూ అవని అనే నేను నా భర్త అయినా విక్రమ్ జై సింహ గారి తో కలిసి వచ్చాను. మమ్మలిని లోపలికి రానివ్వండి ఆడపడుచు గారు అని చెబుతుంది.

నివి రియాక్షన్ ఏమిటి...

కథ కొనసాగుతుంది....
[+] 17 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)