Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

పాణిగ్రహణం

Showing only the posts of SivaSai: 341 of 820 posts. Show all posts
#81

(28-01-2026, 03:37 AM)ash.enigma Wrote:  enti bro.. nee timing ippude choostunna.
You almost always post at midnight. Is it because nee daily works anni poorthi cheskuni, then you spend some time on this story?

Thanks a ton for burning midnight oil for us!!
Heart Heart Heart Heart Heart

And the story rocks.
The sweet little side story b/w Neha and Sri.. try to make it a little meatier!!
Neha though wants to not make her parents unhappy, she's still a girl with feelings!!
Try to explore that angle to come up with some romantic episodes b/w those love birds!!

All in all a wonderful story!!
Great guns!!

Yes Bro........   

E Hyderabad Traffic Nuchi Bayata Padatam Antha Easy Kaduu


Office Nuchi 7:30 P.M Ki Start Aethi Naa Room Ki Reach Ayyaedi 10:15 P.M Inka Freshup Food Complete Chesete AA Time Avtundi


Sri And Neha Love Part Undi Vastundi Next Updates Lo Untayi
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82

Part - 65


భయంతో బిగుసుకుపోయినా అవిని నీ చూసి ఏమయింది అని అడుగుతాడు. ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్ గా ఉంది అని చెబితే...

ఒక్క నిమిషం అని విండో వైపుకి కూర్చోబెడతాడు. ఫ్లైట్ పైకి వెళ్ళేటప్పుడు విండో లోంచి కిందికి చూడు. వ్యూ ఎంత బాగుంటుందో...

ఉహు..నాకు కళ్ళు తిరుగుతాయి అంటే...ప్రతిదానికి భయపడితే అడుగు ముందుకు వెయ్యలేవు. పక్కన నేను ఉంటే భయమే ఉండదు అని అంటావు కదా.. నీ పక్కన నేను ఉన్నప్పుడు కూడా భయపడితే అర్థం లేదు.

భయాన్ని వదిలేసి అడుగు ముందుకు వెయ్యి. ఆ విజయం ఎంత కిక్కిస్తుందో చూడు. మొదటి అడుగు వేసే ఎవరికైనా సరే భయం ఉంటుంది.

అంతెందుకు చిన్న బేబీస్ కూడా ఫస్ట్ అడిగేసినప్పుడు ముందుకు పడతారు. అలా అని వాళ్ళు అడుగులు వేయడం మానేస్తారా...

మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టే.. వాళ్ళ నడక నేర్చుకోగలుగుతారు. అలాగే ఏ పనైనా అంతే ఫస్ట్ భయమనిపిస్తుంది. ఆ భయాన్ని పక్కనపెట్టి ముందుకు చూడు.

    చెవుల్లో కాటన్ పెట్టి... ఇప్పుడు ప్రశాంతంగా వ్యూని చూస్తూ ఉండు అని చెబుతాడు. విక్రమ్ మాటలకు కొంచెం ధైర్యం తెచ్చుకుని..  విక్రమ్ చేతిని తన చేతి వేళ్ళతో బంధించి చూస్తూ ఉంటుంది.

ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు... కొంచెం ఆ సౌండ్స్ కి దడదడలాడుతూ ఉంటుంది కానీ....ఆకాశంలోకి ఎగిరేటప్పటికీ అవనిలో ఉన్న భయం కూడా పక్కకి వెళ్లిపోయి సంతోషంతో విక్రమ్ వైపు చూస్తూ చాలా బాగుంది అని చెబుతుంది.

ఆ మాటలకి నవ్వుతూ నేను చెప్పాను కదా....  ఫస్ట్ భయాన్ని వదిలేస్తే అంతా బాగుంటుందని అంటే..మీరు ఎప్పుడు బాగానే చెబుతారు కానీ.. అడుగు వేసేటప్పుడు నాకు కొద్దిగా భయం ఉంటుంది కదా అని వ్యూని చూస్తూ భర్త భుజం పైన తల పెట్టుకుంటుంది.

అవని తలపైన చేతితో నిమురుతూ జర్నీ అలసట తెలియకుండా కబుర్లు చెబుతూ ఉంటాడు. అవిని కూడా ఆ జర్నీని బాగా ఎంజాయ్ చేస్తుంది.

తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇల్లు, చదువు తప్ప ప్రపంచం తెలియదు.  ఫస్ట్ టైం బెంగళూరు పెళ్లయిన తర్వాత వెళ్లడమే...

ఇప్పుడు భర్తతో కలిసి ఫ్లైట్లో వెళుతూ ఉంటే తన ఆనందానికి అవధులు లేకుండా ఉంటుంది. విండోలో నుంచి కిందకి చూస్తూ ఏమండీ...

అసలు ఏమీ కనపడటం లేదు.  అన్ని చాలా చిన్నచిన్నగా ఉన్నాయి అని ఆశ్చర్యంగా చూస్తూ చెబుతుంది. చిన్నపిల్లలాగా సంతోష పడుతున్న భార్య ఆనందాన్ని చూసి మురిసిపోతూ ఉంటాడు.

కొన్ని గంటలు జర్నీ తర్వాత స్విస్లో దిగుతారు. ఎయిర్పోర్ట్ బయటికి వచ్చి అబ్బా  ఈ చలి చాలా చలిగా ఉందండి అని  చేతులు రబ్ చేసుకుంటూ చెబుతోంది.

చలిగా ఉంటే భర్తను హత్తుకుపోవాలి గాని.. చేతులు రబ్ చేసుకుంటే ఎలా అని అడుగుతాడు.  అయ్యో మీరేం చేస్తున్నారు మనం బయట ఉన్నాము అని ఇబ్బందిగా చుట్టూ చూస్తూ చెబుతోంది.

ఇక్కడ ఇవన్నీ కామన్నే..  ప్రతిదానికి ఇబ్బందిపడకు. అయినా మనం ఎవరు అనేది ఇక్కడ ఎవ్వరికీ తెలియదు.

ఎంత తెలియకపోతే మాత్రం మరి ఇలాగా అని సిగ్గుపడుతుంది.  ఓయ్...  నేను ఏమీ చేయలేదు కదా.. అటు చూడు అని ఒక జంటను చూపిస్తాడు.

వాళ్ళిద్దరూ హగ్ చేసుకుని లిప్ కిస్ ఇచ్చుకుంటూ ఉంటే.. నోరు వదిలేసి చూస్తుంది. ఏమైంది బంగారం అలా చూస్తున్నావు.

మరీ పబ్లిక్ లో ఇలా ఎలా అంటే.. నువ్వు అసలు మూవీస్ చూడవా అంటే లేదుగా అనే పెదవి విరుస్తుంది.

మన తెలుగు మూవీస్ లో ఇంకా స్ట్రాంగ్ గా కిస్ చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ ఇలాంటివి అన్ని మామూలే.

ఏంటి మన తెలుగు మూవీస్ లోనా...  అందరూ చూస్తారు కదండీ ఇబ్బందిగా అనిపించదా అని అమాయకంగా అడుగుతుంది.

అది ప్రొఫెషన్ అంతే..ఇంకా వాటి గురించి మాట్లాడకు. పద  నీకు చాలా మూవీస్ చూపించాలి. కొత్త కొత్త రుచులను అలవాటు చేయాలి కదా అని అక్కడ వాళ్ళ కోసం ఉన్న విల్లాకి తీసుకువెళ్లిపోతాడు.


ఆ విల్ల చూడగానే అవని ఆశ్చర్యపోతూ ఇక్కడ మనకి ఉందా అని అడుగుతుంది.  హ్మ్...అంటాడు.

చాలా బాగుందండి ప్లేస్ అని మొత్తం తిరుగుతూ చూస్తూ ఉంటుంది. ముందు వెళ్లి ఫ్రెష్ అవ్వు. ఏమైనా తిన్నాక... నీకు అప్పటికి ఓపిక ఉంటే అన్నీ చూద్దువు గాని పద అని రూమ్ కి తీసుకువెళ్తాడు.

ఫ్రెష్ అయ్యి లైట్ ట్ ఫుడ్ తిని కాసేపు రెస్ట్ తీసుకుంటారు.
అవని చాలా మత్తుగా నిద్రపోతూ ఉంటుంది. విక్రమ్ కి మెలకువ వచ్చినా సరే.. భార్య నిద్ర మొహాన్ని చూసి ఇంకా దగ్గరికి లాక్కుని హత్తుకుని పడుకుంటాడు.

ఎంతసేపైనా నిద్ర లేవడం లేదని విసుగు వచ్చి అవిని బుగ్గ పైన కొరుకుతాడు. చురుక్కుమనడంతో  స్... అంటూ బుగ్గ మీద చెయ్యి వేసి రుద్దుకుంటూ మగతగా కళ్ళు విప్పుతూ ఏంటండీ ఇలాగా అని ముద్దు ముద్దుగా అడుగుతూ ఉంటుంది.

మనం వచ్చింది ఎందుకు నువ్వు ఇలా నిద్రపోవడానికా... అబ్బా జర్నీ వల్ల అలసటగా అనిపించి నిద్ర పట్టేసింది. ఆమాత్రం దానికే ఇలా చేస్తారా అని చిరుకోపంగా అడుగుతూ... గ్లాస్ విండో లో నుంచి బయటికి చూస్తూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తుంది.

ఏమైంది అలా చూస్తున్నావు అని అడిగితే... ఎక్సైట్మెంట్గా మంచు కురుస్తుందండి.... భర్త కౌగిలిలో నుంచి విడిపించుకుని బయటకి పరిగెడుతుంది.

హేయ్... జాగ్రత్త నేను వస్తున్నాను ఆగు అని నవ్వుతూ అవని వెనకాలే వెళతాడు. ఆ మంచు నీ బాల్స్ లాగా చేసి, ఎగరవేస్తూ   ఆడుకుంటూ ఉంటుంది.

విక్రమ్ ని చూసి మీరు రండి ఆడుదురు గాని...నువ్వు ఆడు నేను చూస్తూ ఉంటాను అని చెబుతాడు.

దానికి అవని నడుం మీద చేతులు వేసుకొని ఇంత దూరం వచ్చింది  మీరు.... నేను ఆడుతూ ఉంటే మీరు చూస్తూ ఉండడానికా అని విక్రమ్ డైలాగులు విక్రమ్కే  అప్పజెప్పి చెయ్యి పట్టుకుని ముందుకు లాగుతుంది.

పర్వాలేదే... నా భార్యమణి కి కూడా సెటైర్స్  వేయడం వచ్చే అని అక్కడున్న ఐస్ ని బాల్ లాగా చేసి అవిని మీదకి విసురుతాడు.

ఆ బాల్ వచ్చి సూటుగా అవని గుండెలని తాకుతుంది. అబ్బా... అంటూ మీరు కావాలనే విసిరారుకదా చెబుతాను ఉండండి మీ పని అని....

తను కూడా ఐస్ ని బాల్ లాగా చేసి విక్రమ్ మీదకి విసురుతుంది. విక్రమ్ పక్కకి తప్పుకుంటూ నన్ను నువ్వు ఔట్ చేస్తే నువ్వు అడిగింది ఇస్తాను అవని అని మళ్ళీ ఐస్ బాల్ లాగా చేసి గురు చూసి అవని నడుం మీద కొడతాడు.

అవిని ఎన్నిసార్లు ట్రై చేసినా విక్రమ్ తప్పుకుంటూనే ఉంటాడు.  బిక్క మొహం వేసుకుని మీరు గురుచూసి కొడితే నేను అవుట్ అయిపోతున్నాను కానీ... నాకు మాత్రం మీరు దొరకడం లేదు.

ఒక్కసారి దొరికిపోవచ్చు కదా విక్రమ్ గారు అని గారంగా అడుగుతుంది. భార్య ముద్దు ముద్దు మాటలకి మెల్ట్ అవుతూనే...

అబ్బా అవని అలా దొరికితే ఇంక గేమ్ లో మజా ఏమంటుంది. ఏదైనా సాధించుకున్నప్పుడే ఆ గేమ్ లో ఒక ఆనందం ఉంటుంది.

ట్రై చెయ్.  అంతగా నీ వల్ల కాకపోతే నువ్వు ఓడిపోతున్నావు అనిపిస్తే... నేనే దొరుకుతాను అంటాడు. నో... నో...నేనేమీ అలసిపోవడం లేదని మళ్లీ ఐస్ తీసుకుని విసురుతూ ఉంటుంది.


అలా చాలాసేపు ఇద్దరు ఐస్ లో ఆడుతూఉంటారు.  అవని కి అలుపువస్తుంది అన్నప్పుడు... వెనకాల కి వచ్చి గట్టిగా హత్తుకొని...బాగుందా ఆట అని అడుగుతాడు.

చాలా బాగుంది ఫస్ట్ టైం తెలుసా..  ఇలా ఐస్ లో కూర్చుని ఆడుకోవడం. చిన్నప్పటి నుంచి నేను అసలు ఆడుకుందే లేదు.  పని.... పని అయిపోతే చదువుకోవడం అంతే...

కానీ ఈరోజు ఇంత ఐస్ లో ఆడుతూ ఉంటే చిన్నపిల్లని అయిపోయినట్టే అనిపిస్తుంది అని వెనక్కి తిరిగి గట్టిగా విక్రమ్ ని హత్తుకుంటుంది.

ఎమోషనల్ అవుతున్న అవనినీ గట్టిగా కౌగిలించుకొని డైవర్ట్ చేస్తూ ఓయ్ బంగారం....  ఈ మంచు లో ఆడి... ఆడి... చాలా చలిగా ఉంది. లోపలికి వెళ్తే హీటర్ పెట్టాలి అని చెవిలో హాస్కిగా అంటాడు.

ఆ మాటలకి అవిని సిగ్గుపడుతూ... మీకు అసలు సిగ్గే పెట్టలేదు దేవుడు అని... ఆ విక్రమ్ ని వదిలించుకొని లోపలికి పరుగుపెడుతుంది.

వెళుతున్నా అవినినీ చూసి నవ్వుకుంటూ నీ మనసులో ఎటువంటి బాధనిరానివ్వను. నీ చిన్నతనంలో నువ్వు మిస్ అయిపోయిన ప్రతిదీ నీ దగ్గరికి చేర్చుతాను.

నువ్వు బంగారమే నా భార్యమణి. నీ పెదవుల పైన చిరునవ్వు అలా మెరుస్తూ ఉంటే...ఎంతటి టెన్షన్ అయినా సరే గాలిలోకి ఎగిరిపోతోంది.

అవినినీ చూస్తూ విక్రమ్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు. కిచెన్లో అవని ఫుడ్డు రీ హీట్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావ్ అని అడిగితే.....

ఫుడ్ వేడి చేస్తున్నాను. చాలాసేపు అయింది కదా...ఆకలి వేయడం లేదా అంటే... ఎందుకు వేయడం లేదు.. కానీ నా భార్యమని కోపరేట్ చేయడం లేదు అని అమాయకంగా అంటాడు.

వస్తున్న నవ్వని పెదవి కింద దాచి అబ్బో ఏం కోపరేట్ చేయడం లేదంట అని అడుగుతుంది. మరి నా ఆకలి తీర్చకుండా ఫుడ్ హీట్ చేస్తూ కూర్చుంటుంది.

కోపరేట్ చేయడం లేదనే కదా అర్థం...  హ్మ్... చాలా పెద్ద కష్టమే వచ్చింది మా ఆయనకి. ఇప్పుడు ఏం చేయాలి అదే అమాయకమైన ఫేస్తో అడుగుతుంది.

ఇప్పుడు మా ఆవిడ లైన్ లోకి వచ్చింది.  ముందు భర్త గారి వంటి ఆకలి తీర్చి.. అప్పుడు కడుపు ఆకలి గురించి ఆలోచించాలి అని దగ్గరికి లాక్కుని పెదవులు అందుకుంటాడు.

విక్రమ్ ఇస్తున్న ముద్దుకి.. భర్త మైకంలో పడిపోయి చేతులను విక్రమ్ తలలోనికి పోనిచ్చి ఆ ముద్దుకి సహకరిస్తూ ఉంటుంది.

ఈ చలిగాలికి... ఆ ముద్దు మైకానికి ఒంటిలో వేడి రాజుకుంటూ ఉంటుంటే... మెల్లిగా భార్యని ఎత్తుకొని ఆ ముద్దు నీ కంటిన్యూ చేస్తూనే బెడ్ రూమ్లోనికి తీసుకు వెళ్లిపోతాడు.

❤️❤️❤️❤️
[+] 10 users Like SivaSai's post
Like Reply
#83

Part - 66


గదిలోకి తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెట్టి ముద్దు మురిపాలలో భార్యని ఉయ్యాల ఊగించి సేదతీర్చుతాడు.

భర్త ప్రేమకి మురిసిపోతూ అతని చేతలకి సిగ్గులమొగ్గ అవుతుంది. తనివితీరని దాహానికి కాసేపు విశ్రాంతినిచ్చి.. భార్యా సమేతంగా సరిగంగా స్నానం చేసి..ఫుడ్డు తన చేతులతో తానే తినిపిస్తాడు.

అవనికి ఏ విషయంలో కూడ ఆలోచన రాకుండా తన ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాడు.

చుడీదార్స్, చీరలు మాత్రమే కట్టుకునే అవిని చేత జీన్స్ దగ్గర్నుంచి మినీ ఫ్రాక్స్ దాకా వేపిస్తాడు. ఆ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు మాత్రం అవని ఇబ్బందులు ఆ పరమాత్ముడికే ఎరుక...

జీన్స్ వేసుకున్నప్పుడైనా కష్టంగా నైనా సరే కొంచెం ముందుకు వస్తుంది కానీ..  ఫ్రాక్ వేసుకొన్నప్పుడు కాళ్లు కనపడకుండా టవల్ కట్టేస్తోంది.

అది చూసిన విక్రమ్ తల కొట్టుకుంటు వెళ్లి టవల్ తీసేసి అద్దం  ముందు నుంచి పెట్టి నేను చూడనిది ఏమైనా ఉందా ...

అది వేరు ఇది వేరే అండి అని మెలికలు తిరుగుతూ ఉంటుంది. ఏం వేరు  భార్యమణి... అప్పుడైనా,ఇప్పుడైనా చూసేది నేనే కదా అని కొంటెగా అంటాడు.

ఈ గౌన్లో ఎలా ఉన్నావో తెలుసా? అచ్చు బుట్ట బొమ్మలాగా ఉన్నావు.  నాకు ఒక డ్రీమ్ ఉండేది . నా ప్రేయసి తో ఇలా పబ్ కి వెళ్లి ఎంజాయ్ చేయాలి అని...

బట్ పెళ్ళికి ముందు ఎవరూ నాకు నచ్చలేదు. పెళ్లయిన తర్వాత నా భార్య నా ప్రేయసి కదా... అంటే ఏమిటి మీ ఉద్దేశం.. ఇప్పుడు నన్ను మీరు ఇలా పబ్ కి తీసుకువెళతారా... అని కంగారుగా అడుగుతుంది.

అవని కంగారు చూసి నవ్వుకుంటూ... నీకు అంత సీన్ లేదు. మన పబ్ డాన్స్ మొత్తం ఇక్కడే చేస్తాము. నా భార్యామణిని ఇలాగ ఎవరికైనా చూపిస్తానా...

దిష్టి తగలదు అని నడుము మీద చేయి వేసి నొక్కుతాడు.
అబ్బా ఏంటండీ మీరు అని సిగ్గుపడుతూ తలదించుకుంటుంది.

హేయ్.. అవని నాకు చెర్రీస్  ఇష్టము అని నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు.  చెర్రీ సా..ఇప్పుడు వాటి విషయం ఎందుకు వచ్చిందండి.

ఫ్రిజ్లో ఉన్నయేమో చూసి వస్తాను అంటే...అయ్యో భార్యామణి అని నుదుటిమీద కొట్టి ఆ చెర్రీస్ నీ బుగ్గల్లోనే ఉన్నాయి. చూడు అంటూ అద్దం వైపుకి తిప్పుతాడు.

అవినికి అప్పటికే సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కిపోతాయి. చూసావా నాకు ఏది ఇష్టమో నీకే బాగా తెలుసు అని భార్యని టీజ్ చేస్తూ ఉంటాడు.

అవని ఇంకా సిగ్గుతో ముడిచుకుపోతుంది.  విక్రమ్ ని హత్తుకుంటుంది. రా.. అని చెప్పి తీసుకుని ఒక రూమ్ లోకి తీసుకువెళతాడు.

ఆ రూమ్ మొత్తం డిమ్ లైట్స్ పెట్టి ఉంటాయి. ఒక పక్కన వోడ్కా బాటిల్,  గ్లాసెస్, లైట్ మ్యూజిక్ అరేంజ్ చేస్తాడు.

అవి చూసి పబ్ అంటే ఇలాగే ఉంటుందా అని అడుగుతుంది.  అది ఇంకా గందరగోళంగా ఉంటుంది కానీ.. మనది రొమాన్స్ పబ్ అని చెప్పి మ్యూజిక్ తగ్గట్టుగా అవిని తో డాన్స్ చేపిస్తూ ఉంటాడు.    

ముందు బిడియంగా అనిపించినా.. తర్వాత మెల్లిగా విక్రమ్ తో అడుగులు కదుపుతుంది. ప్రతిధ్రిల్ ని భార్యకి పరిచయం చేస్తూ... లోకం ఎలా ఉంటుందో అన్నది మెల్లిగా చూపిస్తూ ఉంటాడు.

మనం ఒకసారి శ్రీ దగ్గరికి వెళ్దాం. రెండు వేరువేరే టైమింగ్స్ లో జరుగుతున్నదని గుర్తించగలరు.


నైట్ అంతా పడుకోకుండా ఆలోచించి పొద్దుటే వాళ్ళ మదర్ కి కాల్ చేస్తాడు.

శ్రీ నుంచి కాల్ చూసిన వాళ్ళ అమ్మగారు చెప్పరా అనగానే.. అమ్మ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు.  నేను ఒక అమ్మాయి డీటెయిల్స్ పంపిస్తున్నాను.

ఈ సంబంధం ఎలాగైనా కుదర్చాలి.ఎందుకంటే తనే మీకు కాబోయే కోడలు. ఇది మాత్రం ఫిక్స్.

ఒరేయ్ కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడరా.. అలా తల తోక లేకుండా చెబితే నాకేం అర్థం అవుతుంది అంటే.. నువ్వు అసలు డాక్టర్ ఎలా అయ్యావు అమ్మ.

ఇంత వివరంగా చెబుతున్నా సరే ఏమీ అర్థం కాలేదంటావు.
నేను ఎలాగోలాగా డాక్టర్ అయ్యాను కానీ.. సరిగ్గా చెప్పు అనగానే... అవని, నేహా ఫ్రెండ్షిప్ మొత్తం చెప్పి, నేహా తనతో అన్న విషయాలు మొత్తం చెబుతాడు. 

ఇప్పుడు అర్థమైంది కదా అనగానే... అర్థమైంది బాబు.. నేహ క్యారెక్టర్ మాకు నచ్చింది.  నేహా పేరెంట్స్ కూడా ఆత్మ అభిమానం ఎక్కువ అని అర్థమవుతుంది.

మీ డాడీ తో కలిసి టైం చూసుకుని వెళ్లి మాట్లాడివస్తాము సరేనా అంటే... మీరు ఎప్పుడో టైం చూసుకోవడం కాదు. ఈరోజే వెళ్లండి అంటే...

ఒరేయ్ మాకు కొన్ని ఆపరేషన్ ఉన్నాయి రా.. అప్పటికప్పుడు చెప్తే డాక్టర్స్ కి ఎలా కుదురుతుంది అనుకుంటున్నావురా...

అదంతా నాకు తెలియదు మమ్మీ. మీరిద్దరూ అర్జెంటుగా వెళ్లి మాట్లాడండి.  లేకపోతే ఏదైనా సంబంధం కుదిరింది అనుకో ఆయన మాట తప్పరు. నా పిల్ల నాకు దక్కదు.

ఇంతలో అక్కడికే శ్రీ నాన్నగారు వచ్చి.. ఏమైంది నీ కొడుకు ఏదో టెన్షన్ పెడుతున్నట్టు ఉన్నాడు అనగానే...
శ్రీ చెప్పిన మ్యాటర్ మొత్తం చెబుతారు.

నీ కొడుకుకి ఏదో వచ్చినా తట్టుకోవడం కష్టమే. ఫోన్ ఒకసారి ఇటుఇవ్వి అని ఒరేయ్ శ్రీ ఈరోజు మాకు ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి.

రేపు వెళ్లి మాట్లాడి ఫైనల్ చేసి నీకు కాల్ చేస్తాను సరేనా అని చెబుతారు.  ప్లీజ్ డాడీ... ఆయన మొహమాటానికి మీ సంబంధానికి మేము సరిపోము. వద్దు అని చెబితే.. అలాగే మీ ఇష్టం అని చెప్పి వచ్చేయకండి. ఎలాగోలాగా ఒప్పించండి .

ఒరేయ్ ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు.నువ్వు నోరు మూసుకొని ఫోన్ పెట్టేయ్.

కొడుకుని విసుక్కుంటూ ఫోన్ పెట్టేస్తారు. ఫోన్ పెట్టేసిన తర్వాత శ్రీ అమ్మగారు అయిన సురభి..ఎందుకండీ వాడితో అలా  మాట్లాడుతున్నారు.

రేపు మనం వెళుతున్న విషయం చెప్పచ్చు కదా అంటే.. నీ కొడుకు ఏమైనా ప్రేమించానని ముందే మనకి చెప్పాడా... విక్రమ్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాడు.

అక్కడ కూడా వాళ్ళతో మాట్లాడి సెట్ చేసి ఉంచాడు. రేపు ఎదో ఫార్మాలిటీకి అంతే.. కాసేపైనా నీ కొడుకుని టెన్షన్ పడని పద హాస్పిటల్కి అని బయలుదేరుతారు.

ఒక నిమిషం వాసు అని భర్త వెనకాలే వెళుతుంది. చెప్పు అనగానే.. వాడంటే చిన్న పిల్లోడు.మీరు కూడా ఎందుకు వాడితో సరి సమానంగా గొడవ వేసుకుంటారు.

వాడు చిన్నపిల్లోడా ఈపాటికి పెళ్లి అయ్యి ఉంటే నలుగురు పిల్లలు వేసుకుని తిరిగేవాడు. పైగా నన్ను ఏమంటున్నాడు...

మాట్లాడడం రాదని వెక్కిరిస్తాడా.... అబ్బా వాడు అలా అనలేదండి. ఏదో టెన్షన్ తో అమ్మాయి ఎక్కడ తప్పిపోతుందా అన్న కంగారుతో ఏదో మాట్లాడేశాడు.

మీరు ఆ మాటలు పట్టించుకుంటే ఎలాగా అంటే..నువ్వు అలాగే వాడిని వెనకేసుకుని రా..వాడు నా మాట అసలు లెక్క చేయడంలేదు.

ఈ ఒక్క రోజుకి వాడికి తల్లిగా కాకుండా నా భార్యగా ఉండి నా గౌరవాన్ని కాపాడు. అర్థమైందా అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు.

మీ ఇద్దరి మధ్యన నేను నలిగిపోతున్నాను అని తల కొట్టుకుంటూ.. రేపు నాతోపాటు నా కోడలు కూడా జాయిన్ అవుతుందనుకుంటా నవ్వుతూ ఉంటుంది.

నా కోడలేమి నీలాగా కాదు. అప్పుడే నీ కొడుకుని కంట్రోల్ లో పెట్టేసుకుంది. పోనీలే ఇలాగైనా నిజాలు ఒప్పుకున్నారు అని అంటుంది.

ఏమి నిజాలు అంటే.. మీ భార్య అమాయకురాలు అని.. అబ్బో ఎటు వచ్చినా సరే నీకు అనుకూలంగా మార్చేసుకుంటావు అని నవ్వుతాడు.

ఆ నవ్వులతో శృతి కలిపి సురభి కూడ నవ్వుతూ హాస్పిటల్ కి రీచ్ అవుతారు .

శ్రీమాత్రం టెన్షన్..తో అసలు మా డాడీ వెళ్లి ఏం మాట్లాడతారు.  మాట్లాడటం వచ్చా...వెళ్లి మాట్లాడితే... ఏదో ఆపరేషన్ చేసినట్టుగా మాట్లాడతారా ఏమిటి అని టెన్షన్ తో గోళ్లు కొరికేసుకుంటూ ఉంటాడు...

ఇందులో కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తే ఎవరు అని వెళ్లి చూస్తాడు. అక్కడ నేహా రెడీ అయ్యి చేతుల్లో బౌల్స్ తో ఉంటుంది.

నేహాని అలా చూడగానే శ్రీ బాబు క్లౌడ్స్ మధ్యన విహరిస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచిన పలకడం లేదని... కళ్ళ ముందు చేతితో ఊపుతూ శ్రీ గారు అని గట్టిగా అరుస్తుంది.

నేహా చేతికి ఉన్న గాజులు సౌండ్ కి డిస్టర్బ్ అయ్యి హా.. చెప్పు అంటాడు.  ఎక్కడ ఉన్నారు సార్.  ఇందాకటి నుంచి పిలుస్తూ ఉంటే..

ఏదో పరిజ్ఞానంగా ఆలోచిస్తున్నారు.మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టు ఉన్నాను అని ఇబ్బందిగా చెబుతుంది. అయ్యో నేహా నువ్వు డిస్టర్బ్ చేయడమేంటి...

నీ గురించి ఆలోచిస్తుంటేను అని మాట జారి నాలిక కరుచుకుంటాడు. నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అయోమయంగా చూస్తూ అడుగుతుంది.

అదే నైట్ జర్నీ చేసి వచ్చాము కదా.. అలసటతో నిద్ర పట్టిందా లేదా అని ఆలోచిస్తున్నాను అంతే అని..
ఇంతకీ ఆ బౌల్స్ ఏంటి అని టాపిక్ చేంజ్ చేస్తాడు.

ఓ అదా.. మీకోసమని బ్రేక్ ఫాస్ట్ చేసి తీసుకు వచ్చాను. అలాగే మీకు లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను సార్.బాక్స్ ఇదిగో అని చెప్పి ఇచ్చి నేను ఆఫీస్ కి బయలుదేరుతున్నాను అని చెబుతోంది  .

ఒక్క నిమిషం నేహా అని పిలుస్తాడు.  చెప్పండి సార్ అనగానే..ఆఫీస్ కి ఎలా వెళుతున్నావు అని అడుగుతాడు.

క్యాబ్ బుక్ చేసుకుంటున్నాను అని చెబుతోంది.  నేను ఆఫీస్కే కదా వెళ్లేది. డ్రాప్ చేస్తాను అంటే... వద్దు సార్. ఎవరైనా చూస్తే బాగోదు అని ఇబ్బందిగా చెబుతుంది.

ఇందులో అంత ఇబ్బంది పడేది ఏముంది అంటే.. కొన్ని కొన్ని పరిచయాలు ఒకచోట ఉంటేనే బాగుంటాయి.  అది క్రాస్ చేస్తే అందరమూ ఇబ్బంది పడాల్సి వస్తుంది.

మీతో పాటు కారులో వస్తే ఎవరైనా నా గురించి తప్పుగా అనుకోని రూమర్స్ స్ప్రెడ్ చేస్తే చాలా కష్టం కదా..అది నాకు అసలు ఇష్టం లేదు.నన్ను ఇలాగే ఉండనివ్వండి సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది.

వెళుతున్న నేహాన్ని చూస్తూ గుండెలపై రబ్ చేసుకుంటూ నచ్చేస్తున్నావే పిల్ల అని నవ్వుకుంటాడు.

కథ కొనసాగుతుంది..
Like Reply
#84

Part - 67


ధనుంజయ్ జైలుకి వెళతాడు. ఒకసారి భార్గవిని కలిసి రావాలి అని. భర్త తన కోసం వచ్చాడని  ఆనందంతో మురిసి తబ్బెబ్బైపోతుంది.

నాకు తెలుసండి మీరు తప్పకుండా వస్తారు.ఏదో కోపంలో అనేశారు కానీ...నేను లేకుండా మీరు ఉండలేరు.  ఒక గర్వంతో కూడిన నవ్వు పెదాలపైకి వస్తుంది.

మిమ్మల్ని ఎలాగైనా ఒప్పించి నేను, శిల్ప బయటికి వచ్చేస్తాము. అప్పుడు చూపిస్తాను నా హంగామా మళ్లీ.

విక్రమ్,  అవినిలని విడదీసి శాశ్వతంగా అవనినీ నా పనిమనిషిని చేసుకుంటాను అని పగటి కలలు కంటూ ముఖంలో బాధని చూపిస్తూ భర్త ముందుకు వెళుతుంది.

భార్గవినే చూస్తూన్న ధనుంజయ్ ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఉండదు. అది చూసిన భార్గవి ఏంటి ఈయన గారి ముఖంలో ఎటువంటి ఫీలింగు కనపడటం లేదు.

ఏదైనా చూపిస్తే నేను లోకువగా తీసుకుంటానని ఆలోచిస్తున్నారా.. అందుకే వాటిని బయటికి కనపడనివ్వకుండా చేస్తున్నారా అని ఆలోచిస్తూ...

భర్త దగ్గరికి వెళుతుంది. ఏవండి ఎలా ఉన్నారండి అని కన్నీళ్ళతో అడుగుతుంది. అయినా ఏమీ మాట్లాడకుండా చూస్తూనే ఉంటాడు.

ఏమిటండి ఇలా చిక్కపోయారు. నా మీద బెంగ పెట్టుకున్నారా. నేను లేకపోతే మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరుంటారు అండి.

ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా.. నేను ఉంటేనే మీరు బాగుంటారు అని.  మీకోసమైనా సరే నన్ను, శిల్పని ఇంటికి తీసుకువెళ్ళండి.

ఈసారి చాలా బుద్ధిగా ఉంటాము. జాగ్రత్తగా, మీకు అనుకూలంగా నడుచుకుంటాను. అవిని నీ సొంత బిడ్డలాగా చూసుకుంటాను అని ముసలి కన్నీరు కారుస్తుంది.

ప్యాంటు జేబులో రెండు చేతులు పెట్టుకొని ఇంకా అని అడుగుతాడు. ఆ మాటకు అయోమయంగా చూస్తూ ఇంకా ఏమిటి అని అడుగుతుంది.

అదే ఏదో కథ చెబుతున్నావు కదా..తర్వాత ఏమిటి అని అడుగుతున్నాను. నేను కథ చెప్పడం ఏమిటండి.నిజమే చెబుతున్నాను అంటే...

ఆ మాటలకి గట్టిగా నవ్వుతూ నువ్వు నిజం చెబుతున్న అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే మిస్ భార్గవి అంటాడు.

మిస్ ఏంటండీ..నేను మిస్సెస్ ధనుంజయ్ అని కోపంగా అంటుంది. అది పోయి చాలా రోజులైంది..

ఆ మాటలకే కోపం వస్తున్నా సరే ఇప్పుడు అది సరైన సమయం కాదు అని.. కంట్రోల్ చేసుకుంటూ నేను మీ మిస్సెస్ ని కాకపోతే..మరి మా కోసం ఎందుకు వచ్చినట్టు అని అడుగుతుంది.

ఎందుకో వచ్చానో నీకు చెప్పాలి కదా...అసలు నన్ను చెప్పనివ్వకుండా వచ్చిన దగ్గరనుంచి నువ్వే మాట్లాడుతుంటే..  కథ బాగుంది అన్నట్టుగా విన్నాను  అంతే అని చెప్పి...

ఫోన్ ఓపెన్ చేసి చేతికి ఇస్తాడు. ఏమిటండి అంటే చూడు నీకే తెలుస్తుంది అని చెబుతాడు.  

ఏముంటుందా అన్న అనుమానంతో ఫోన్ ఓపెన్ చేసి చూస్తున్న భార్గవికి కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టు అనిపిస్తుంది.

అందులో తన కూరిపోతే బాగున్నట్టుగా అనిపిస్తుంది. నో ఇలా జరగడానికి వీల్లేదు అని అరుస్తుంది.అదేంటి ఇప్పుడే అవిని నీ సొంత కూతురు లాగా చూసుకుంటాను అన్నావు.

మరి ఫొటోస్ చూడగానే ఎందుకు అలా పిచ్చదానిలాగా అరుస్తున్నావు అని వెటకారంగా అడుగుతాడు. వెంటనే తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ..

నేను అదే చెబుతున్నానండి అవిని నీ సొంత కూతురులాగానే చూసుకుంటాను అని. నా చేతులతో నేనే పంపించాలి అనుకున్నాను కానీ...

ముందే వెళ్ళేటప్పటికి అలా అరిచాను అంతే అని కవర్ చేసుకుంటూ ఉంటుంది.. ఆ మాటలకి ధనుంజయ్ నవ్వుతూ పరవాలేదు భార్గవి బాగానే కవర్ చేసుకుంటున్నావు.

నీకి ఫోటోలు ఎందుకు చూపించానో తెలుసా? నా కూతురు సంతోషాన్ని చిన్నప్పటినుంచి దూరం చేసి పైశాచిక ఆనందం పొందావు కదా...

అందుకే అసలు అయినా నా కూతురు సంతోషాన్ని చూపిస్తే ఆ నీ పైశాచికా ఆనందం డబల్ అవుతుందేమో అన్న ఆశతో వచ్చాను. అయిందని అనుకుంటున్నాను అని అంటాడు.

నేను ఎందుకండి పైశాచిక ఆనందం పొందుతాను అని ఎంతో బాధగా అడుగుతుంది.  ఏమి నటిస్తున్నావ్ భార్గవి.. ఇంత జరిగినా...నీ గురించి నాకు పూర్తిగా తెలిసినా సరే..
నువ్వు ఒక అమాయకురాలివి అన్నట్టుగా చూపిస్తావు చూడు.

అక్కడ మాత్రం నిన్ను మెచ్చుకోవాల్సిందే.... నా కూతురు నా అల్లుడుతో కలిసి హనీమూన్ కి వెళ్ళింది తెలుసా... మరి నీ కూతురే ఏం చేస్తుంది అని అడుగుతాడు.

నా...ని.....అని మాట్లాడుతారు ఏంటండీ. ఇద్దరూ మన అమ్మాయిలే అంటే... కాదు అవని ఎప్పటికీ నీ కూతురు కాదు.

అవని కేవలం రజిత ధనుంజయ్ కూతురు మాత్రమే. నీ కూతురు ఒక్క శిల్ప మాత్రమే.  నాకు ఒక డౌటు. శిల్ప నాకు పుట్టిందే నా...

లేకపోతే  డబ్బు మీద ఉన్న ఆశతో ఎవరికైనా కమిట్ అయ్యావా ? అది నా బిడ్డగా చూపిస్తున్నావా అని అడుగుతాడు.  ఆ మాటలు తట్టుకోలేక ఏవండి అని గట్టిగా అరుస్తుంది.

ష్... అరవకు అని నోటి మీద వేలు పెట్టి చూపిస్తాడు ఈసారి భార్గవికి నిజంగానే బాధ వస్తుంది. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతారా..

నేను ఎలాంటిదాన్నో మీకు తెలియదా అని అడుగుతుంది. ఎందుకు భార్గవి నీకు అంత బాధ. నువ్వు అలాంటి దానివి కాబట్టే కదా.. నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేయాలి అనుకున్నావు.

ఏం చేసింది అవని. అంత పగ పెంచుకొని నాశనం చేయాలి అనుకున్నావు. ఏరోజైనా నీకు ఎదురు చెప్పిందా.. తండ్రి అన్న స్వేచ్ఛతో నా దగ్గరికి వచ్చిందా...

ప్రపంచానికి నాకు అవని అనే కూతురు ఉంది అని తెలియకుండా చేశాను అని ఆనందపడుతున్నావు కదా.. త్వరలోనే నీకు ఇంకొక కొత్త గిఫ్ట్ ఇవ్వబోతున్నాను.

వెయిట్ అండ్ వాచ్ అని చెబుతాడు.  ఏం చేయబోతున్నారు అండి అని భయంగా అడుగుతుంది .

అరే జీవితాల్ని నాశనం చేసే భార్గవి కూడా భయపడుతుందా అని వెటకారంగా అడుగుతారు. మిమ్మల్ని అడుగుతున్నాను ఏం చేయబోతున్నారు దయచేసి చెప్పండి అంటే...

చెప్పను చేసేటప్పుడు చూడు తెలుస్తుంది నీకే అని... హ...నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను.

మీ వదిన అదే బిందు కూడా ప్రస్తుతం నా దగ్గరే ఉంది. నా ఇంటి మనిషిగా కాదు.  సర్వెంట్ క్వార్టర్స్ లో ఉండి ఒక పూట ముద్ద పెడతారా అని ఎదురు చూస్తుంది.

బిందు నా ఇంటికి రావడం లోని హస్తమేమీ లేదు కదా అని  సూటిగా అడుగుతాడు. ఉన్న ఏమీ చేయలేరులే అందరూ కోరలు తీసిన పాములే.

వదిన మీ దగ్గర ఉండడం ఏమిటి.. అన్నయ్య, ఉదయ్ ఏమైపోయారు అని వాళ్ల గురించి తెలుసుకోవాలి. వాళ్ల ద్వారా అయినా బయటికి రావాలి అన్న ఆశతో అడుగుతుంది.

తెలిసి అడుగుతున్నావో.... తెలియక అడుగుతున్నావా భార్గవి అంటే...నిజంగానే నాకు తెలియక అడుగుతున్నాను.

వాళ్ళిద్దరూ ఉండగా వదిన మీ దగ్గరికి ఎందుకు చేరుతుంది అని అడుగుతుంది.  భార్గవి కళ్ళల్లో కనపడుతున్న అనుమానానికి...  ధనుంజయ్ కొంచెం ముందుకి వంగి..

మీ అన్నగాడు ఏమో.. ఇదే జైల్లో జెంట్స్ సెక్షన్లో ఉన్నాడు. ఇక నీ ముద్దుల మేనల్లుడు అంటావా.. నా అల్లుడు చేతిలో ఎక్కడో కైమా అవుతూ ఉన్నాడు.

వాడు ప్రాణాలతో ఉంటాడో లేదో కూడా డౌటే..ఒకవేళ ఉన్నా ఎందుకు బతికున్నానా అని వాడి చేతే అనిపిస్తాడు నా అల్లుడు అని గొప్పగా చెబుతారు.

అల్లుడు అని మురిసిపోతున్నారే కానీ.. అతను శిల్ప మొగుడు అంటుంది. ఎలా అయ్యాడు శిల్పకి మొగుడు...

జీలకర్ర బెల్లం పెట్టాడా? తాళి కట్టాడా... లేకపోతే చేతిలో చెయ్యవేసి పాణిగ్రహణం చేసుకున్నాడా ఎలా అయ్యాడు నీ అల్లుడు. నీ కూతురికి మొగుడు అని వెటకారంగా అడుగుతాడు. 

ఆ మాటలకి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటుంది. చూసావా నీకే సమాధానం దొరకడం లేదు.

మొండిగా వాదించి నన్ను మభ్యపెట్టినంత ఈజీ కాదు.. విక్రమ్ తో ఆడుకోవడం అంటే.. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మారు.

ఆఖరి రోజుల్లో అయినా శిక్ష తగ్గి ప్రశాంతంగా చచ్చిపోగలుగుతావు అని చెప్పి బయలుదేరుతాడు.  వెళుతున్న ధనుంజయ్ ని చూసి శిల్పని చూడరా అని అడిగితే....

నీ కూతురుని చూడవలసిన అవసరం నాకు లేదు. ఎన్నిసార్లు చెప్పానండి మన కూతురు అంటుంటే.. నా కూతురు అయితే గనక అవిని లాగా ఎన్ని కష్టాలు పడినా సరే తన ఆత్మఅభిమానాన్ని వదులుకోదు.

అది నాకు పుట్టలేదు కాబట్టే..నీలాగా బరితెగించి ఎవరు పడితే వాళ్లతో తిరుగుతుంది అని అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోతాడు.

ఆ మాటలు విన్న భార్గవి కృంగిపోతోంది. నేను ఎన్ని తప్పులు చేసినా సరే... తప్పుడు మనిషిని అవ్వలేదండి. మిమ్మల్ని తప్ప నేను ఎవరిని తాకలేదు.

అది మీకు తెలిసిన సరే...ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఎంతసేపు అవని, రజిత అంటున్నారే గాని..

నా ప్రేమ మీకు ఎందుకు కనిపించడం లేదు. ఈరోజుల్లో ఎంతమందితో రిలేషన్ మెయింటైన్ చేయడం లేదు. అలాంటి వాళ్ళందరినీ తమ పిల్లలు కాదు అనుకుంటున్నారా...

ఎందుకు మీరు శిల్పని అంత దారుణంగా అసహ్యించుకుంటున్నారు అని బాధపడుతూ వెళుతుంది. అంతేకానీ శిల్ప తప్పుడు మార్గంలోకి వెళ్ళింది. సరిదిద్దాలి అన్న ఆలోచన మాత్రం రావడం లేదు.

ధనుంజయ్ అటు నుంచి అటే ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. తను చేయాలనుకున్న పనులన్నింటినీ స్పీడ్ గా పూర్తి చేస్తూ ఉంటాడు.

సత్యవతి గారు బిందు దగ్గరికి వెళ్తారు. తలుపు కొట్టి లోపలికి రావచ్చా అని అడుగుతారు. రండి పెద్దమ్మ గారు అలా అడుగుతారు ఏంటి.. అని లేచి నుంచి ఉంటుంది.

ఏమో నువ్వు ఏ బిజీలో ఉన్నావు నాకేం తెలుసు అంటే.. ఇంకా ఎందుకు పెద్దమ్మ గారు చచ్చిన పాముని మీద దెబ్బలు కొడతారు.

ఆ మాటలకి నవ్వుతూ మీరందరూ ఒకే కోవకు చెందిన పక్షులు కదా..  భార్గవి బాగానే డైలాగ్స్ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంది అంటే...

ఏమని సమాధానం చెప్పాలో తెలియక బిందు తలవంచుకుంటుంది. ఇప్పుడు తలదించుకోవడం వల్ల ఉపయోగం ఏముందిలే కానీ నేను వచ్చిన విషయం చెబుతాను విను.

నువ్వు నిజంగా మారావో లేదో నాకు తెలియదు గానీ భార్గవి తో మాత్రం చేతులు కలిపి ఉంటే ఇప్పటికైనా బయటికి రా...

లేకపోతే మీ కొడుకుని ప్రాణాలతో కాదు కదా శవం కూడా చూడలేవు. నా మనవడు అలాగే చేసేస్తాడు తర్వాత నీ ఇష్టం అని అంటారు.
[+] 14 users Like SivaSai's post
Like Reply
#85

Part - 68


సత్యవతి గారి మాటలకి బిందు కంగారుగా చూస్తూ.. లేదు పెద్దమ్మగారు నేను మారాను. మీకు ఎక్కడ సాక్ష్యం కావాలన్నా నేను చెబుతాను. నన్ను నమ్మండి అంటుంది.

నువ్వు చెప్పేది నిజమైతే.. అందరికీ మంచిది. ఎప్పుడో ఒకప్పుడు నీ కొడుకు మారితే నీ దగ్గరికి వస్తాడు.ఇక నేను వెళ్తాను అని చెప్పి బయటికి వస్తారు.

వెళుతూ ఉన్న సత్యవతిగారు ఆగి వెనక్కి తిరిగి నీకు ఏమి ఊసుపోకపోతే ఆ గార్డెన్ వర్క్ లాంటివైనా చేసుకోవచ్చు.

అది కూడా నీ ఇష్టం.  సుఖపడిన శరీరం, ప్రాణం ఒక్కసారిగా పని చేయాలంటే అలసటగానే అనిపిస్తుంది. కానీ పనిలో ఉంటేనే మన బుర్ర సరిగ్గా పనిచేస్తుంది.

మనసు ఆధీనంలో ఉంటుంది. నేను చెప్పాల్సింది చెప్పాను ఆ పైన నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతారు.
వెళ్ళిపోతున్న పెద్దావిడని చూస్తూ బిందు సైలెంట్ గా అక్కడ కూర్చుని ఆలోచిస్తూఉంటుంది.

కొంచెం సేపటికి లేచి వెళ్లి గార్డెన్లో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడే వచ్చిన ధనుంజయ్ అది చూసి సైలెంట్ గా లోపలకి వెళ్ళిపోతాడు.

ఆ రోజంతా బిందు పనిచేస్తూనే ఉంటుంది. పనిలో పడి ఆలోచనను కూడా పక్కకి వెళ్ళిపోతాయి. మధ్యాహ్నం భోంచేసి పడుకోగానే నిద్ర పట్టేస్తుంది.

సాయంత్రం లేచిన తర్వాత చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అప్పుడే బిందుకి అర్థమవుతుంది.  పని విలువ, నిద్ర విలువ, భోజనం విలువ.

శ్రీ సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే వాళ్ళ అమ్మగారికి కాల్ చేస్తాడు. ఆ ఫోన్ చూసిన వాసు చూసావా నీ కొడుకు ఎప్పుడైనా మనకి ఫోన్ చేశాడా..

ఏదో వారానికి ఒక రోజు ఫోన్ చేసి..హౌ ఆర్ యు మామ్.. హౌ ఆర్ యు డాడ్.. బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు వాడికి అవసరమని ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు చూడు అని అంటారు.

అబ్బా ఏదో ఒకటి చేస్తున్నాడు కదా అని చెప్పి...లిఫ్ట్ చేసి చెప్పరా అంటే...ఎక్కడున్నారు మమ్మీ అని చాలా స్మూత్ గా అడుగుతాడు.

నీ వాయిస్ కి ఈ మాట తీరు ఏమి సెట్ అవ్వడం లేదు గాని మేటర్ లోకి రా అంటారు.  నువ్వు చాలా ఇంటలిజెంట్ మమ్మీ ఇట్టే కనిపెట్టేస్తావు అంటే...

పొద్దున్నే ఎవరో ఈ బుర్రతో డాక్టర్ ఎలా అయ్యావు అని అడిగారు అని అంటుంది.  అప్పుడు ఏదో అంటాము. అన్ని గుర్తుపెట్టుకుంటే ఎలా...

ఇంతకీ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వెళుతున్నాము. ఏదైనా చెప్పాలా అంటే...

ఏంటి మమ్మీ కొడుకు ఫోన్ చేస్తే ఏమైనా చెప్పాలా అని అడుగుతారా? ఏం చేస్తున్నావు, తిన్నావా ఇంకేంటి సంగతులు అని అడుగుతారు కానీ.... ఒరేయ్ మరి నీ యాక్షన్ ఓవర్గా లేదా...

మమ్మీ అంటూ గారాలుపోతాడు. ఈ వయసులో నువ్వు అలా గారాలు పోతే చూడ్డానికి చాలా చండాలంగా ఉంటుంది గానీ... మ్యాటర్ ఏంటో చెప్పరా బాబు..నిన్ను ఇంకా అడగలేక పోతున్నాను అని తల పట్టుకుంటారు.

రేపు ఎన్నింటికి బయలుదేరుతున్నారు. ఎక్కడికి రా అని తెలిసిన తెలియనట్టుగా అడిగితే... అదేంటి మమ్మీ రేపు మీరు నేహా వాళ్ళ ఊరు వెళ్లాలి కదా...

మర్చిపోయారా... అసలు ఎలా మర్చిపోయారు అని ఆవేశంగా అరుస్తూ ఉంటాడు. ఒరేయ్ ఇప్పుడు దాకా బాగానే మాట్లాడావు కదరా... ఇప్పుడు కాకి లాగా అరుస్తావ్ ఎందుకు...

వెంటనే శ్రీ కూల్ అయ్యి అది కాదు మమ్మీ మీరు హాస్పిటల్ పనిలో బిజీగా ఉంటారు కదా... ఆపరేషన్స్ చేసి, చేసి మీ బ్రెయిన్ అలసిపోయి ఉంటుంది కదా.. గుర్తుంటుందో లేదో అని గుర్తు చేయడానికి ఫోన్ చేశాను అని చెబుతాడు...

వెంటనే వాసు గారు మాకు గుర్తు ఉంది లేరా...నువ్వు బుక్ అయిపోతాను అని చెబుతుంటే నేను మాత్రం ఎందుకు ఆగుతాను..

రేపే వెళ్లి మాట్లాడదాము అని నవ్వుతూ చెబుతారు. డాడ్ అంటే మెలికలు తిరుగుతాడు. ఒరేయ్ నువ్వు అక్కడ మెలికలు తిరగకు.

నాకు సిగ్గుగా ఉంది అంటే.. నేను మెలికలు తిరుగుతున్నట్టు మీకు ఎలా తెలుసు. నేను నీ బాబుని రా...ఆ మాత్రం తెలియకుండానే నిన్ను పెంచాను అంటావా...

రేపు అక్కడికి వెళ్లాక నీకు వీడియో కాల్ చేసి మొత్తం లైవ్ చూపిస్తాను. సరేనా ప్రస్తుతానికి ఫోన్ పెట్టేయరా.. మా బుర్రలు తినకు అని చెప్పి బాయ్ అని ఫోన్ కట్ చేస్తారు.

సురభి నవ్వుతూ ఎందుకు వాసు వాడిని అలా టీస్ చేస్తున్నావు.  ఇప్పుడే కదా నీ కొడుకు దొరికేది.  తర్వాత ఎలాగూ మనకు దొరకడు.కోడలు చేతిలో ఎలాగ బుక్ అయిపోతాడు.

అంత నమ్మకం ఏంటో వచ్చే అమ్మాయి మీద అని అడిగితే.. వాసుగారు నవ్వుతూ నేహా అవినినీ ప్రొటెక్ట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది.

తనకి ఎంత అవకాశం ఉన్నా సరే తన పరిధిలోనే తను ఉన్నది చూడు అది ఇంకా బాగా నచ్చింది. నీ కొడుకు తింగరతనానికి ఆ అమ్మాయి నిదానమే కరెక్ట్.

పో వాసు... నా కొడుకు ఏమి తింగరోడు కాదు అంటే... ఓ... అవునా...ఆ మాట ఏదో నీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పు.

వాసు... అని చిరుకోపంగా చూస్తుంది. చూసావా నీకు కూడా తెలుసు కానీ.. తల్లి మనస్సు కదా ఒప్పుకోలేక పోతుంది.

రేపు అక్కడికి పట్టికెళ్లడానికి ఏమేమి కావాలో చెబితే వెళుతూనే షాపింగ్ చేసి వెళ్ళిపోదామని చెబుతాడు.  సరే అని చెప్పి మొత్తం లిస్ట్ అంతా భర్త చేతికి చేస్తుంది. అవి చూసి మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు.

శ్రీ కి ఆ రాత్రి నిద్ర పట్టక హాల్లోనే తిరుగుతూ ఉంటాడు. ఎంత క్లాక్ వైపు చూస్తున్న దాని టైం కి అది తిరుగుతూ ఉంటుంది.

ఇంక లాభం లేదు అనుకుని  వెళ్లి నేహా ఫ్లాట్ డోర్ కొడతాడు.  ఈ టైంలో ఎవరూ అనుకుంటు వచ్చి డోర్ తీస్తుంది.

ఏంటి సార్ ఈ టైం లో ఏదైనా అవసరమా అని అడిగితే.. ఏం చెప్పాలో తెలియక అది... అది... అంటుంటే పర్వాలేదు చెప్పండి సార్.

తప్పుగా అనుకోవు కదా అంటాడు.  లేదు సార్ అనుకోను చెప్పండి అంటుంది. నువ్వు మళ్ళీ నన్ను సార్ అని పిలుస్తున్నావు.

ఫ్లోలో వచ్చేసింది శ్రీ గారు చెప్పండి అంటే... విక్రమ్ కూడా లేడు కదా నాకు అసలు నిద్ర పట్టడం లేదు అని అంటాడు. ఆ మాటకి శ్రీని డౌట్ గా చూస్తుంటే....

ఏంటి అలా చూస్తున్నావు అని...తను ఏం మాట్లాడాడో అర్థం అయ్యి ఛీ.... ఛీ...ఒక్కడినే ఉంటే నిద్ర పట్టడం లేదు.
అదే నేను చెప్పింది అంటాడు.

ఓ అవునా అయితే ఏం చేయాలి అని అడుగుతుంది. నేహకి కూడా అలాగే ఉంటుంది. ఇన్ని రోజులు అవని తో ఉండి ఒక్కసారిగా ఒంటరిగా ఉండాలి అంటే బోర్ గా అనిపిస్తుంది. కానీ ఆడపిల్లగా తన బయటపడలేక పోతుంది.

అలా సరదాగా వాకింగ్ కి వెళదామా..వస్తావా అని అడుగుతాడు.  నేహకి కూడా అది బానే అనిపించే సరే పదండి శ్రీగారు అని ఫ్లాట్ కి లాక్ వేసి శ్రీ తో కలిసి అడుగులు వేస్తుంది.

శ్రీ నేహా పక్కనే నడుస్తూ రేపటితో మన మధ్యన ఉన్న దూరం అంతా తగ్గిపోతుంది. అప్పుడు ఇలా పక్క పక్కనే నడుస్తూ, నా చేతి వేళ్ళని నీ చేతి వేళ్ళతో పెనువేసి..

నువ్వు నా భుజంపై తల పెట్టుకుని కబుర్లు చెబుతూ నడుచుకుంటూ వెళుతూ ఉంటే అని ఊహాలోకంలోనికి వెళ్ళిపోతాడు.

లిఫ్ట్ ఓపెన్ అయిన శ్రీ లిఫ్ట్ ఎక్కకుండా అలా ఊహా లోకంలోనే ఉండిపోతాడు. శ్రీ గారు ఏమైంది మీకు అని నేహా గట్టిగా పిలుస్తుంది.

అప్పుడు మన లోకంలోనికి వచ్చి.. నాకేమవుతుంది.. ఏమీ అవలేదు అని గబగబా లిఫ్ట్ ఎక్కుతాడు. ఈ మధ్యన ఎందుకు మీరు చాలా పరధ్యానంగా ఉంటున్నారు.

ఒకసారి చెక్ చేపించుకుంటే మంచిదేమో..జస్ట్ ఒక ఫ్రెండ్ గా చెబుతున్నాను అంతే తప్పుగా అనుకోకండి అంటుంది.

అయ్యో నా బంగారం పెళ్లికి ముందే మొగుడి ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్త. ఈ పరధ్యానం అంతా నీవల్లనే వచ్చింది.

ఇది ప్రేమ జబ్బు అంటారు.  నీకు అంటుకున్నాక అది నీకు కూడా తెలుస్తుంది బంగారం అనుకుని అలాగా... అలాగే..
అని చెబుతాడు.

లిఫ్ట్ దిగి ఇద్దరూ మెల్లిగా నడుచుకుంటూ వెళతారు.ఆ చల్లగాలికి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది.  శ్రీకి మాత్రం నేహా నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని నడవాలని కోరిక గట్టిగాఉంటుంది.

ఒకసారి ఇమేజిన్ చేసుకుంటాడు.  నేహా నడుము చుట్టూ చెయ్యవేసి దగ్గరికి లాక్కోవడం...వెంటనే నేహ.. శ్రీ చెంప పైన చేతిముద్ర వేయడం కూడా...

వెంటనే మన లోకంలోకి వచ్చిపడి అమ్మో అప్పుడే ఇలా చేయకూడదు.  చేస్తే ఇంకా అంతే సంగతులు. నామీద బాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది.

నేహ అని పిలుస్తాడు. చెప్పండి శ్రీ గారు అంటే.. పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏమిటి అని అడుగుతాడు.  దేనికి శ్రీగారు అంటే..జస్ట్ ఏదో ఒకటి మాట్లాడాలి కదా..

అందుకే క్యాజువల్ గా అడిగాను. పెళ్లి చేసుకునే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ కావాలి నీకు అని అడుగుతాడు.

ఒక్క నిమిషం మౌనంగా ఉండి అప్పుడు చెబుతుంది. పెళ్లి అంటే నాకు అర్థమైనంత వరకు ఒకరి కోసం ఒకరి ఉండడం. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఒకరి చెయ్యి ఒకళ్ళు వదలకుండా ఉండడం.

మూడో వ్యక్తి అది ఎవరైనా సరే అబ్బాయి తల్లిదండ్రులైన, ఇటు నా తల్లిదండ్రులైనా సరే, ఇంకా ఎవరైనా సరే.. మా బంధం మధ్యలోకి రానివ్వకూడదు.

అంటే నా ఉద్దేశం తొందరగా చెప్పుడు మాటలు విని బంధాన్ని వీక్ చేసుకోకూడదు అని చెబుతుంది. 

మరి చేసుకునే అబ్బాయి విషయంలో...

ఇప్పుడు అది అవసరమా శ్రీ గారు అంటే...ప్లీజ్ నేహా చెప్పు. నేను ఎలాగో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నాకు కొన్ని తెలుసాయి అనుకో...నన్ను నేను మార్చుకునేది ఉంటే మార్చుకోవచ్చు కదా... చెప్పు ప్లీజ్.....ప్లీజ్...
అని అడుగుతాడు.

నేహా ఏమని చెబుతుంది...

కథ కొనసాగుతుంది...
Like Reply
#86

Don't Worry Yesterday Begumpet Air Show Chusi Room Ki Vache Sareki Full Tired Ayyanuu So Update Ivvaledu

Ippudu Update Istunnaaaaaaaa

E Roju Kuda Air Show Undi Ani Talk Unte Compulsory Ga Velthanuu..........................
Like Reply
#87

Part - 69


నేహ ఏమి చెబుతుందా అని శ్రీ చాలా అత్రంగా ఎదురు చూస్తూఉంటాడు.  నేహ ఇబ్బందిగా ఏమి చెప్పాలా అని దిక్కులు చూస్తూ ఉంటే....

ప్లీజ్  నేహ ఒక ఫ్రెండ్ గా అనుకుని చెప్పు.  రేపు వచ్చే అమ్మాయి లైఫ్ నాతో హ్యాపీగా ఉండాలి కదా.. అందుకే నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను.

చెప్పు...చెప్పు... ప్లీజ్... ప్లీజ్... అని అడుగుతాడు. మీరు మరీ అంత ఎక్కువ రిక్వెస్ట్ చేయకండి శ్రీగారు చెబుతాను.

ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆలోచించి కళ్ళు తెరిచి శ్రీ వైపు చూస్తూ ఇది పూర్తిగా నా వైపు నుంచే చెబుతున్నాను.

అందరి అమ్మాయిలు ఇలాగే ఆలోచించాలి అని ఎక్కడా లేదు. పర్వాలేదు నీ వైపు నుంచి చెప్పు.  మిగిలింది నేను అర్థం చేసుకుంటాను అంటాడు.

ఆ మాటకి నవ్వుతూ చూస్తూ మీరు చాలా తెలివైన వాళ్ళు అండి.  థాంక్యూ.. థాంక్యూ.. అని ఉబ్బి తబ్బుబ్బి అయిపోతాడు.

మన టాపిక్ ఏటో  వెళ్ళిపోతుంది అనుకుంటా అని అంటుంది.  ఓకే.. ఓకే... నేనే వెనక్కి వచ్చేస్తున్నాను. ఇప్పుడు చెప్పు ఎలాగా ఉండాలి చేసుకునే వ్యక్తి అని అంటే...

అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే.... ముందు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

అప్పటివరకు ఇద్దరూ రెండు భిన్న వాతావరణంలో పెరిగి వస్తారు. చిన్నప్పటినుండి కలిసి ఉన్న అమ్మానాన్నలు, సిబ్లింగ్స్ తోనే డిస్టబెన్స్ లు వస్తూ ఉంటాయి.

అలాంటిది విభిన్న వాతావరణంలో పెరిగి ఒకే చోటు ఉండేవాళ్ళ మధ్యన కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సహనంగా ఉండి సొల్యూషన్ వైపు అడుగువేయాలి గాని..

నువ్వెంత అంటే నువ్వు ఎంత అని అనుకోకూడదు.  అది నేనైనా.. నన్ను చేసుకునే వ్యక్తి అయినా సరే అని చెబుతుంది.
ఇంకా అని అడుగుతాడు.  ఇంకా అంటే.. ఎంత బిజీగా ఉన్నా సరే... ఒకసారి ఫోన్ చేసి తిన్నావా.. ఏం చేస్తున్నావ్ అని అడిగితే చాలు.

గొడవ జరిగినప్పుడు నువ్వే ముందు సారీ చెప్పాలి అన్న ఇగో కి వెళ్ళకూడదు. భార్యాభర్తలు గా ఇద్దరూ కాదు ఒక్కటే అయినప్పుడు...

అటు పేరెంట్స్, ఇటు పేరెంట్స్ ని కూడా ఈక్వల్ గానే చూడాలి. అప్పుడే కదా భార్యాభర్తల బంధం ఇంకా బలపడుతుంది అంటుంది.

అది ఎలా అంటే... ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు అనుకోండి.  రేపు మీరు చేసుకున్న అమ్మాయి పేరెంట్స్ ని కూడా మీ పేరెంట్స్ లాగా ట్రీట్ చేశారు అనుకోండి.

ఆ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా.. తను కూడా మీ పేరెంట్స్ అలాగే చూస్తుంది కదా.. అప్పుడు మూడు వంతులు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి.

ఫర్ సపోస్ నేను అలాగే ట్రీట్ చేసేను అనుకో.... ఆ అమ్మాయి దాన్ని అలుసుగా తీసుకుంటే అని అనుమానం రైస్ చేస్తాడు.

ఆ మాటకి నవ్వుతూ ఆడవాళ్లకి అనుమానాలు ఎక్కువ అంటారు గాని.. మమ్మల్ని మించిపోయారు మీరు అంటుంది.

అలా కాదు నేహా.. రేపు పెళ్లయ్యాక సంసారం అందంగా సాగిపోవాలి కదా..అందుకే చిన్న చిన్న డిస్టర్బెన్స్ లకి ముందే సొల్యూషన్ దొరికింది అనుకో.. క్లియర్ చేసేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అంటాడు. బిజినెస్ మాన్ అనిపించుకున్నారు.

అందరి అమ్మాయిలు గురించి నాకు తెలియదు గానీ నాలాంటి అమ్మాయి అయితే మాత్రం.. మీ ప్రేమను గాని మీరు ఆ అమ్మాయి తల్లిదండ్రులు విషయంలో తీసుకునే శ్రద్ధని అలుసుగా తీసుకోదు.

ఇంకా అని అడుగుతాడు ఇంకా ఏముంటాయి  శ్రీగారు అంటే... అదే మీ లేడీస్ కి షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా..

రోజు షాపింగ్ కి తీసుకువెళ్లాలా.. అకేషన్ వైస్ గాన.. అని అడుగుతాడు లేదా కార్డు ఇస్తే సరిపోతుందా...

మీరు కార్డు ఇచ్చి కొనుక్కోఅన్న.. అది ఎన్ని లక్షల పెట్టి కొన్నా సరే.. మీరు తెచ్చే రెండు రూపాయల గులాబీకే విలువ ఎక్కువ ఉంటుంది.

మీ చేతితో ఒక గులాబీ. ఒక ఐస్ క్రీము లేదో తనకి ఇష్టమైన చిన్న చిన్న సరదాలు సరే...వంద రూపాయల చీర అయినా సరే..

అది మీ చేతితో తెచ్చిన రోజున ఉన్న సంతోషం తన చేతులతో ఎన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నా సరే ఉండదు. ఇది మాత్రం నేను పక్కా చెప్పగలను.  అది ఎలాంటి అమ్మాయి అయినా సరే అంటుంది.

ఇప్పటికి చాలు కదా ఈ ఇన్ఫర్మేషన్.  రూమ్ కి వెళదామా అంటుంది.  సరే పద.. చాలా లేట్ అయిపోయింది.  ఫ్లాట్ వరకు వచ్చి దింపి తన ఫ్లాట్ కి వెళ్ళిపోతాడు.

ఫ్లాట్లోకి వచ్చిన శ్రీ నేహా చెప్పిన దానికి మురిసిపోతూ నువ్వు ఎంత బంగారమే...  చాలా సింపుల్ సింపుల్ గా ఉన్నాయే చెబుతున్నావు.

నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. నువ్వు చెప్పినట్టే గానే మీ పేరెంట్స్ ని, మా పేరెంట్స్ ని ఈక్వల్ గానే చూస్తాను. ఎందుకో తెలుసా బంగారం నీ మనసు అంత స్వచ్ఛమైనది. ఇక నా పేరెంట్స్ విషయంలో కూడా నాకు ఎటువంటి బెంగా లేదు.

టైమెంతయింది అని చూస్తాడు. అది ఇంకా పదే చూపిస్తూ ఉంటుంది. అబ్బా ఈ గడియారం కూడా ఈరోజు ముందుకి కదలడంలేదు.

కష్టమైనా సరే నిద్రపోవాలి అని అలారం సెట్ చేసుకుని మంచం ఎక్కుతాడు.  నేహ ఊహల్లో తేలుతూ ఎప్పటికో నిద్రపోతాడు.

పొద్దున్నే నాలుగింటికి ఫోన్ మోగుతుంటే వాసు చిరాగ్గా ఈ టైంలో ఎవరు సురభి చూడు అని అంటారు. ఏదైనా ఎమర్జెన్సీ కాల్ ఏమో చూస్తాను అని ఆవిడ కంగారుగా మంచం దిగి ఫోన్ లిఫ్ట్ చేసి..

నిద్రమత్తులోనే హలో అంటారు. హలో మమ్మీ అనగానే.. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఫోన్ వైపు చూసుకొని శ్రీ అంటారు. అంతే వాసుగారి నిద్రమత్తు కూడా ఎగిరిపోయి..

శ్రీ ఏంటి ఈ టైంలో..బాగానే ఉన్నాడా అని కంగారుగా మంచం దిగి స్పీకర్ ఆన్ చెయ్ అంటారు.. మమ్మీ నాకేమైంది. నేను బాగానే ఉన్నాను అని చెబుతాడు.

మరి ఈ టైం లో ఫోన్ ఏంట్రా అంటే...  ఈ టైం లో అంటావేంటి మమ్మీ తెల్లారిపోయింది అంటాడు. సురభి గారు టైం చూసి ఇంక నాలుగే అయింది కదా అంటే...

అదే నెక్స్ట్ డే వచ్చేసింది కదా.. మీరు ఇంకా లేచి ఉండరని లేపుదామని కాల్ చేశాను అని చెబుతాడు. ఆ మాటలకు వాసుగారు పళ్ళునూరుతూ..

ఒరేయ్ ఎదవ... మంచి నిద్ర పాడుచేశావు కదరా... నీ పెళ్లి నా చావుకి వచ్చేటట్టు ఉంది. వెళతామని చెప్పాను కదా అంటే...

మీకు లేట్ అవుతుందేమో అని లేపాను   అంతే డాడీ.గుడ్ మార్నింగ్.  ఎలాగా లేచారు కదా.. రెడీ అయి బయలుదేరిపోండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.

వీడిని ఏ టైం లో కన్నావే బాబు.  నా ప్రాణం తోడేస్తున్నాడు అంటే...నవ్వుకుంటూ పెళ్ళికి ముందు మీరేం చేసారో మరి అంటుంది.

ఆ మాటకి వాసు గారు సిగ్గుపడుతూ...ఆ రోజులే వేరు అంటాడు. కదా..మీకు ఎలాగో మీ అబ్బాయి కూడా అంతే. అదంతా వయసు ప్రభావం అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి అని బాత్రూంలోకి దూరతారు.

వాసుగారు కూడా శ్రీ ఆత్రానికి నవ్వుకుంటూ... పిచ్చఎదవ పెళ్లి అవుతేగానీ వీడికి తెలుసురాదు. హ్యాపీగా బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేయకుండా పెళ్లి పెళ్లి అని ఎగురుతున్నాడు.

సురభి రెడీ అయిన తర్వాత వాసు కూడా రెడీ అయ్యి దేవుడి గదిలో దీపం వెలిగించి..అన్నీ సర్దుకుని బయటికి వస్తారు.

వాసు మరీ బొత్తిగా ఆరే అయ్యింది. ఇక్కడ నుంచి ఒక గంటలో వెళ్ళిపోతాము. మరీ ఏడింటికే వెళితే బాగోదేమో అంటే...

ఆ మాటకి కోపంగా చూస్తూ... ఆ ముక్క నాకు కాదు.  నీ కొడుక్కి చెప్పు అంటున్నంతలోనే. మళ్లీ ఫోన్ రింగ్ అవుతుంది.

మళ్లీ ఎవరు అనుకుంటూనే ఫోన్ చూస్తారు. ఇంకెవరు నీ కొడుకే అయి ఉంటాడు అనగానే.. నిజమే వాసు నీకు ఎలా తెలిసింది.

వాడు ఆత్రం అర్ధం కావడం లేదా..లిఫ్ట్ చెయ్ లేకపోతే అక్కడ ఎదవకి టెన్షన్ తో మోషన్స్ అవుతాయి అంటారు.

అబ్బా వాసు మరీ అంత ప్రెస్టేట్ అవ్వకు అని చెప్పి.. లిఫ్ట్ చేసి చెప్పరా అంటే.. మమ్మీ బయలుదేరారా అంటే.. ఒరేయ్ ఇంకా ఆరే అయింది రా.

ఏడు అయ్యేటప్పటికీ  వెళ్ళిపోతాము. మరీ అంత పొద్దునే వెళ్తే బాగోదు రా అంటే.. వాళ్ళు అలాగే ఏమీ అనుకోరు మమ్మీ.

అయినా పల్లెటూరు అంటే అందరూ ఎర్లీగా లేచిపోతారు కదా.... ఎంత లేచినా సరే వాళ్ళ పనులు వాళ్ళు ఉంటాయి కదరా..

చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే బాగోదు రా.. నా మాట విన రా.. ఏమీ అనుకోరు కానీ మీరు బయలుదేరండి కంగారుపెట్టి కార్ ఎక్కిస్తాడు.

కారు ఎక్కిన వాసు గారు డ్రైవర్ తో నన్ను ఆ ఊరు వెళ్లాక లేపు. అప్పుడు దాకా అసలు లేపొద్దు అని భార్య వైపు తిరిగి.. ఫోన్స్ రెండు సైలెంట్ లో పెట్టి నువ్వు కూడా పడుకో.

లేకపోతే ఐదు నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటాడు అని.  ఇద్దరి ఫోన్లు తీసికుని సైలెంట్ లో పెట్టేసి పడుకుంటారు.
[+] 12 users Like SivaSai's post
Like Reply
#88

Part - 70


సురభి వాసు 7 అయ్యేటప్పటికల్లా నేహా వాళ్ళ ఊరు చేరుకుంటారు. అక్కడ నేహా  నాన్నగారైన శ్రీను గారి అడ్రస్ కనుక్కొని వెళతారు.

వీళ్ళు ఇంటికి వెళ్లేటప్పటికీ  నేహా వాళ్ళ అమ్మగారు అయిన లక్ష్మి గారు ఇల్లంతా శుభ్రం చేయించేసి ముగ్గులతో ముందు అలంకరిస్తారు.

గుమ్మానికి పచ్చని మామిడి తోరణాలు కడతారు. నలుగురు ముత్తయిదువుల్ని పిలిచి ఇల్లంతా హడావుడి చేస్తూ ఉంటారు.

అది చూసిన సురభి గారికి చాలా బాగా అనిపిస్తుంది. ఇల్లంతా ఇలాగా శుభ్రంగా ఉంచారు అంటే... నేహ కూడా ఇంటిని ఇలాగే ఉంచుతుంది  అనుకుంటారు.

వాసుగారికి కూడా ఆ ఎన్విరాన్మెంట్ బాగా నచ్చుతుంది. రోజు హాస్పిటల్సు, మెడిసిన్స్ వాసన మధ్యన ఉన్న వాసు గారికి చాలా ప్లసెంట్ గా అనిపిస్తుంది.

లక్ష్మీగారు కంగారుపడుతూ ఉంటే...సురభిగారు ఆవిడ చేయిపట్టుకుని ఎందుకు మీరు కంగారు పడుతున్నారు. మనం అన్ని ముందే మాట్లాడుకున్నాం కదా... టెన్షన్ పడకండి.

  ఎంతైనా మగ పెళ్లి వారు కదా...అందులోనూ మీరు చాలా పెద్ద వాళ్ళు అంటే...పెద్ద చిన్న అని ఏమి తేడా ఉండదండి.

మన మనస్తత్వాన్ని బట్టి ఏదైనా ఉంటుంది. మాకు అలాంటి పట్టింపులు ఏమీలేవు. అయినా రేపు మీ అమ్మాయి మా ఇంటికి వచ్చేస్తే అది కూడా మీది కాదా... అందరూ సమానమేనండి అని చెబుతారు.

సురభి మాట తీరు లక్ష్మీ గారికి బాగా నచ్చుతుంది.  ఆవిడ మంచితనం ఏంటో కూడా అర్థం అవుతుంది. తన కూతురి అత్తగారిల్లు చాలా గొప్ప మనసు కలది అని ఆవిడ సంతోషపడతారు.

శ్రీను, వాసు గారు కబుర్లో పడతారు..ఇద్దరూ కూడా చాలా ఫ్రీగా కలిసిపోతారు. వాసుగారి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే.. అబ్బా అని తల పట్టుకుంటారు.

ఏమైందండి..ఏదైనా ఎమర్జెన్సీ కాలా అని శ్రీను గారు అడిగితే..  అవునండి చాలా ఎమర్జెన్సీ కాల్. మీ అల్లుడు నుంచే ఈ ఫోను అని చెప్పి..

లిఫ్ట్ చేసి చెప్పరా బాబు అంటే.. నాన్న ఏం చేస్తున్నారు. మాటలు అయిపోయయా... పెళ్లికాయం చేసేసారా అని అడుగుతాడు.

ఒరేయ్ నీ ఆత్రం తగలెయ్య వచ్చి ఎంతసేపు అయింది రా... ఒక్కొక్క పని అవ్వాలి కదా... నీకు నేను అప్డేట్స్ ఇస్తానని చెప్పాను కదా...

ఇంకొకసారి ఫోన్ చేసావు అనుకో.. మొత్తం అన్ని క్యాన్సిల్ చేసేసి.. నీకు పెళ్లి అనే చాప్టర్ లేకుండా క్లోజ్ చేసేస్తాను అర్థం అవుతుందా.. పెట్రా ఫోను అని పెట్టి పెట్టేస్తారు.

శ్రీ ఫోన్ వైపు చూస్తూ నా కంగారు మీకు ఏమి అర్థం కావడం లేదు.  ఏంటో అసలు మీరు మా డాడీ ఏనా అనుకుంటూ...  ఫోన్నే తదేకంగా చూస్తూ ఉంటాడు.

టైం పాస్ ఎలా చేయాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. వర్క్ చేద్దాము అని లాప్టాప్ ఓపెన్ చేస్తాడు.  వర్క్ చేయబుద్ది అవదు.

రాజ్ కి కాల్ చేస్తే అని... రాజ్ నెంబర్ ట్రై చేస్తాడు.  అమ్మో వద్దులే... వీడికి తెలిసింది అంటే గనక... నన్ను ఒక రేంజ్ లో ఆడుకుంటాడు.

ఇప్పుడు ఏం చేయాలి.. విక్రమ్ కి కాల్ చేయనా అని ఆలోచిస్తాడు. అసలే హనీమూన్ మూడ్ లో ఉన్నాడు.  చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి ఒక తన్ను తన్నుతాడు.

ఎవరో ఒకరితో మాట్లాడకపోతే నాకు ఈ టెన్షన్ తగ్గదే ఏం చేయాలబ్బా అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటాడు.

నేహా ఫ్లాట్ కి వెళితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తాడు. మరి ఓవర్గా ఉండదా అని థింక్ చేస్తూ ఉంటాడు.  ఒక పని చేద్దాం...

బయటకి  వెళ్లి నేహా కోసం తనకి ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ అండ్ రోజెస్ తీసుకువస్తాను. నేహ కి మెసేజ్ చేస్తాడు. మీరు ఏమి బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేయొద్దు నేను తీసుకొస్తాను.

ఇంతకీ నేహా కి ఏమి ఇష్టమో అడిగితే బాగుంటుందా.. వద్దులే..నాలుగైదు రకాలు తీసుకువస్తే తనకు నచ్చింది ఏదో ఒకటి తింటుంది అని.. ప్లాట్ లాక్ చేసుకుని బయటికి వెళ్తాడు.  నేహా పెట్టిన మెసేజ్ కూడా చూడడు. 

కిందకి వెళ్లి ఏం ఆర్డర్ ఇవ్వాలో తెలియక..లేడీస్ ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఇష్టపడతారు అనుకుంటా కదా.... బోండా, పూరి, మసాలాదోస ఎందుకైనా మంచిది ఇడ్లీ కూడా ప్యాక్ చేపిస్తాడు.

పక్కనే రోజస్  కనపడితే అందులో నుంచి..ఫస్ట్ రెడ్ రోజ్ తీస్తాడు.  అమ్మో ముందే ఇది ఇచ్చాము అంటే... సీన్ సితార అయిందనుకో వద్దు కష్టం అనుకొని...

ఎల్లో రోజ్ తీసుకుంటాడు. ఇదైతే ఫ్రెండ్షిప్ కి సింబల్ కాబట్టి తను ఏమీ ఫీల్ అవ్వదు అనుకుని అవన్నీ పుచ్చుకొని వెళ్లి నేహా ఫ్లాట్ డోర్ నాక్ చేస్తాడు.

డోర్ తీసిన నేహ ను చూసి శ్రీ కళ్ళు నోరు వదిలేస్తాడు. ఏమైంది శ్రీ గారు అని అడిగితే.. ఆహా ఏమీ లేదు ఈరోజు ఏమిటో చాలా కొత్తగా కనిపిస్తున్నావు అని తదేకంగా చూస్తూ ఉంటాడు.

లోపలికి రండి అని...ఈరోజు ఎందుకో తెలియదు అమ్మ చీర కట్టుకోమంది.  అందుకే కట్టుకున్నాను బాగుందా అని అడుగుతుంది.

చాలా ము... అనబోయి ఆ మాట మింగేసి బాగున్నావు అని చెబుతాడు. థాంక్యూ శ్రీ గారు...

ఈ చీరకి ఈ పువ్వు పెట్టుకుంటే ఇంకా బాగుంటావు అని ఆ రోజ్ ఇస్తాడు.  థాంక్యూ... నాకు ఎల్లో అంటే చాలా ఇష్టం అని ఆ పువ్వు తలలో పెట్టుకుంటుంది.

తను ఇచ్చిన పువ్వు నేహా అలా పెట్టుకోగానే క్లౌడ్స్ మధ్యలోనే ఉంటాడు.  గుండె పైన చెయ్యి వేసి రబ్ చేసుకుంటూ...కూల్ శ్రీ కూల్.

ఇంకా ముందు ముందు చాలా ఉంది అనుకుంటూ డైవర్ట్ అవ్వడానికి... ఇదిగో బ్రేక్ ఫాస్ట్ అని ఇస్తాడు. ఎందుకు శ్రీ గారు ఇన్ని వెరైటీస్ తెచ్చారు.

నేనే ప్రిపేర్ చేసే దాన్ని కదా అంటే... రోజు నువ్వే కదా చేస్తున్నావు. జస్ట్ ఫర్ చేంజ్ అంతే అని ఇస్తాడు. అవన్నీ ఓపెన్ చేసి ఇన్ని రకాలు ఎందుకు.

ఏదో ఒకటి తెస్తే సరిపోతుంది కదా...నీకు ఏమి ఇష్టమో నాకు తెలియదు కదా.. నేను తెచ్చింది నచ్చిన, నచ్చకపోయినా నువ్వు అలా తినడం నాకు ఇష్టం లేదు.

నీకు ఏది ఇష్టమో అదే తిను అని చెబుతాడు. ఒక్క నిమిషం ఆలోచించి రెండు ప్లేట్స్ తీసుకుని అన్ని టిఫిన్స్ ని రెండు ప్లేట్స్ లోనే సర్ది ఒక ప్లేటు శ్రీకి ఇస్తుంది. 

నేహ చేసినదాన్ని చూస్తూ ఉంటాడు. ఏమైంది శ్రీ గారు అంటే... ఏమీ లేదు ఏదో ఒకటి తింటావు. మిగిలినవి అన్ని వేస్ట్ అవుతాయి అనుకున్నాను.

బట్ నువ్వు ఏది వేస్ట్ అవ్వకుండా నీటుగా సర్దేవ్ కదా... చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యపడడానికి ఏముంది.


మా నాన్నగారి వ్యవసాయం చేస్తారు కాబట్టి నాకు ఫుడ్ వాల్యూ బాగా తెలుసు అని చెబుతుంది.  ఓ...ఏం మాట్లాడాలో తెలియక అవిని ఏమైనా ఫోన్ చేసిందా అని అడుగుతాడు.

వాళ్లు వెళ్ళింది హనీమూన్ కి సార్... ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తూ ఉంటారా అని నవ్వుతుంది.  ఆ నవ్వుతో జత కలిపి అది నాకు తెలుసు కానీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంతే అని బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు.

నేహా కాఫీ కలిపి చేతికి ఇస్తుంది. థాంక్యూ అని చెప్పి కాఫీ తాగుతూ ఉంటాడు.  నీకు ఒక విషయం చెప్పనా అంటాడు.

చెప్పండి. నీ చేతి కాఫీ తాగుతూ లైఫ్ లాంగ్ బ్రతికేయొచ్చు తెలుసా.. అంత టేస్టీగా ఉంటుంది అని చెబుతాడు.ఏదో మీ అభిమానం శ్రీ గారు.

లంచ్ మాత్రం నేనే ప్రిపేర్ చేస్తాను. మీరు మాత్రం ఏమీ ఆర్డర్ పెట్టొద్దు అని చెప్పి కిచెన్లోనికి వెళ్ళిపోతుంది. నేహా కిచెన్లో లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే...

అక్కడ గోడకి నిలబడి నేహా కి కబుర్లు చెబుతూ ఉంటాడు. ఆ కబుర్లకి నేహా నవ్వుతూ గబగబా లంచ్ ప్రిపేర్ చేసి ఇద్దరికీ బాక్సులు ప్యాక్ చేసేస్తుంది. 

ఆ బాక్స్ శ్రీ చేతికి ఇచ్చి నేను ఇంకా బయలుదేరుతాను అని చెబుతుంది. ఒకే ఆఫీసులో కలుద్దాము అని శ్రీ కూడా బయటకు వస్తూ ఉంటే..

నేహా ఫోన్ రింగ్ అవుతుంది.  ఫోన్ చూసి అమ్మ ఏమిటీ ఈ టైంలో ఫోన్ చేస్తుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అంతే శ్రీ అడుగుల ఆగిపోయి చెవులు రెక్కరించి మరీ వింటూ ఉంటాడు.

శ్రీ కి ఏమి వినిపించదు. కానీ నేహా ఫేసులో రంగులు మారుతూ ఉంటాయి. అది చూసి శ్రీ గుండెల్లో టెన్షన్ మొదలవుతుంది.

ఏమై ఉంటుందా అని తెగ ఆలోచిస్తూ ఉంటాడు. ఫోన్ పెట్టేసి శ్రీవైపు తిరిగి ఇంకా మీరు వెళ్లలేదా అని అడుగుతుంది.  వెళుతున్న..

ఏమైంది నీ ఫేస్ ఏదో లాగా ఉంది అని ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతాడు.

నేహా ఏమి చెబుతుంది...



కథ కొనసాగుతుంది...
[+] 15 users Like SivaSai's post
Like Reply
#89

Part - 71


నేహా ఏమి చెబుతుందో అని చూస్తూ ఉంటాడు. ఏమీ లేదు శ్రీ గారు అంటే.. పర్వాలేదు చెప్పు అని చేయి పట్టుకుంటాడు.

అక్కడ ఉన్న కుర్చీలో కూర్చొని పెళ్లి కుదిరింది అని చెబుతుంది.  దీనికి ఎందుకు అంత ముభావంగా ఉన్నావు. నీకే పెళ్లి ఇష్టం లేదా అని అడుగుతాడు కానీ..ఎక్కడ ఇష్టం లేదని చెబుతుందో.... అని గుండె టక్ టక్ అని కొట్టుకుంటూఉంటుంది.

నేహా మౌనాన్ని చూస్తుంటే తన గుండె శబ్దం తనకే వినపడుతున్నట్టు ఉంటుంది. చెమటలు పడుతూ ఉంటాయి.

ప్లీజ్ నేహ... నువ్వు అలా సైలెంట్ గా ఉంటే నాకు టెన్షన్గా ఉంది. ప్లీజ్ చెప్పు అని గెడ్డం పట్టుకుని అడుగుతాడు .

నేను కొన్ని రోజులైనా జాబ్ చేసి మా నాన్నగారికి అండగా నిలబడాలి అనుకున్నాను కానీ. ఇలా పెళ్లి కుదిరితే నేను ఎలా నిలబడగలుగుతాను.

ఎంత చెప్పుకున్నా.. ఈ రోజుల్లో అమ్మాయి, అబ్బాయి సమానమే అని చెబుతారు కానీ..పెళ్లయిన తర్వాత అబ్బాయి తన తల్లిదండ్రులకు ఖర్చు పెట్టినంత ఈజీగా ఆడపిల్ల ఖర్చు పెట్టలేదు.

పెళ్లి అయినా కూతురి దగ్గర తీసుకోవాలి అంటే తల్లిదండ్రులకు అభిమానం అడ్డువస్తుంది. ఏదో ఒక టైంలో అల్లుడుగాని, అత్తింటివారు దెబ్బుతారు అన్న భయం అన్నది ఉంటుంది.

ఒక్కొక్కసారి మన పద్ధతులను చూస్తూ ఉంటే కోపమే వస్తుంది. చిన్నప్పటినుండి అబ్బాయిని ఎలా చదివిస్తారో అమ్మాయిని అలాగే చదివిస్తారు.

పైగా ఎక్స్ట్రా బంగారం,  పెళ్లి కోసం కట్నం అన్నీ రెడీ చేస్తారు. ఎంత చదువుకున్నా సరే ఈ కట్నాలు ఇవ్వడం అన్నది పోదు కదా..

మాకు అమ్మాయి చాలు కట్నం ఏమీ వద్దు అంటారు కానీ... ఏమీ పట్టుకెళ్ళకుండా వెళితే ఏదో ఒక టైం లో మాట వస్తుంది కదా...

అందరూ అలా ఉంటారని అనను కానీ... ఇలా కొంతమంది అయినా ఉంటారు కదా... ఆ కొందరులో నాకు వచ్చిన పెళ్ళికొడుకు ఫ్యామిలీ ఉంటే...

నేను ఎలాగా మా వాళ్లకు అండగా నిలబడగలను. అలా అని మా నాన్నగారికి ఎదురు చెప్పలేను. అదే నాకు బాధగా ఉంది అని చెబుతుంది.

నేహా కి వాళ్ళ నాన్నగారి మీద ఉన్న ప్రేమను చూసి శ్రీ అబ్బురపడతాడు. ఎంత ప్రేమ మీ తల్లిదండ్రులు మీద అని మురిసిపోతాడు.


అలా ఎందుకు ఆలోచిస్తున్నావు నిన్ను నిన్నుగా అర్థం చేసుకుని మీ తల్లిదండ్రులను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు వస్తాడేమో...

ఆ మాటలకి నవ్వుతూ అవి చెప్పుకోవడానికి బాగుంటాయి.  ఏ కథలోనే,  సినిమాలోనే జరుగుతాయి. చాలా తక్కువ.

నువ్వు ఉన్నావేమో అంటాడు. అంత అదృష్టం కూడానా... ఏమో ఎవరో చెప్పగలం.  ఈ మాత్రం దానికి ఇంత డల్ అయిపోతావా.

చీరప్ అని చెప్పి..  ఈరోజు నేను డ్రాప్ చేస్తాను పదా అని..  నేహా చెప్పేది కూడా వినిపించుకోకుండా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్లి కార్ ఎక్కిస్తాడు.

కార్ లో మోనంగా కూర్చున్న నేహాని డైవర్ట్ చేయడానికి..
పెళ్ళికొడుకు పేరు ఏమిటి... తెలియదు శ్రీ గారు... అదేంటి.. ఏమి తెలుసుకోకుండానే పెళ్లికి ఒప్పుకున్నావా...

నాన్నగారికి తెలుసు కదా... నాకు ఎలాంటి వాడు వస్తే నేను సంతోషంగా ఉంటాను అన్నది. ఇంకా పనిగట్టుకుని ఏమి అడుగుతాము.

ఆ మాటలికి ఆశ్చర్యముగా చూస్తూ నీ నాలాంటి అమ్మాయి ఈ రోజుల్లో ఉండరు. అందరూ అబ్బాయి ఎత్తు నుంచి కలర్ వరుకు, ఫైనాన్సియల్ స్టేటస్ ఇంకా ఫ్రీడమ్ వరుకు అన్ని ఒకే అయ్యితేనే రెడీ అంటున్నారు.

నువ్వు ఏమిటీ అంటే అంత మా నాన్నగారి ఇష్టం అంటున్నావు. నువ్వు సొమెథింగ్ స్పెషల్ అంటూ...
ఆఫీస్ ముందు ఉన్న బస్టాప్ దగ్గర కార్ ఆపుతాడు.

కార్ దిగి థాంక్స్ చెప్పి ఆఫీసుకి వెళ్ళిపోతుంది. వెళుతున్న నేహాని చూసి నవ్వుకుంటూ వాసుగారికి కాల్ చేస్తాడు.

చెప్పారా సూపుత్ర అనగానే... డాడ్ అంటాడు.  ఇప్పుడే అంటున్నాను.. నీ కొడుకు ఇంకా ఫోన్ చేయలేదు ఏమిటా అని... తెలిసిందిలే...

ఎవరు చెప్పారు.. మా కోడలు పిల్ల... హ.. అవును.
నా పేరు కూడ చెప్పకుండా పెళ్లి కుదిరిచేసారా అని అలకగా అంటాడు.

ఒరేయ్ అమ్మాయి తల్లిదండ్రులు చెప్పకపోతే నేనేం చేస్తానురా... ఇంతకి కోడలు పిల్ల ఏం చెప్పింది అని అడుగుతారు.

వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెబుతాడు. నా కోడలు పిల్ల చాలా మెచ్యూరిటీగా  ఆలోచిస్తుంది రా.. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.

ఈ ఊరిలోనే ఒక 50 ఎకరాలు బిట్ కొని శ్రీను గారికి కౌవులికి ఇద్దాం అనుకుంటున్నాను. యువర్ అమేజింగ్ డాడ్ అని అంటాడు.

మరి ఎక్కువ పొగడకు రా...  నీకు తిక్కరేగిందంటే ఆ పొగడ్తల్లోనే ముంచేస్తావు.  ఇంతకీ నీకు ఎంగేజ్మెంట్ కావాలా లేదా డైరెక్ట్ గా పెళ్లి చేసేయ్మంటావా అంటే..

నో.. నో.. నాకన్ని పద్ధతి ప్రకారం జరగాల్సిందే.. అది విక్రమ్ వచ్చిన తర్వాత పెట్టుకుందాం అని చెబుతాడు. సరే ఏదైనా మీ ఇష్టం అని ఫోన్ పెట్టేస్తారు.

తనకి కేబిన్ కి వెళ్ళిన తర్వాత  ఈ ఆనందాన్ని ఎవరో ఒకరితో షేర్ చేసుకుంటే కానీ తన గ్యాస్ తగ్గదు అని రాజ్ కి ఫోన్ చేస్తాడు.

పడుకున్న రాజ్ నిద్ర మత్తులో హలో అంటే... ఏరా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఎదవ...

పడుకున్నావాడికి ఫోన్ చేసి ఏమి చేస్తున్నావు అని అడుగుతావా... అరుస్తూఉంటే... అబ్బా... నీకో గుడ్ న్యూస్ చెబుదాము అని ఫోన్ చేసాను అని ఉత్సాహంగా
చెబుతాడు.

ఏంట్రోయ్ గుడ్ న్యూస్...కొంపతీసి నీకు పెళ్లి కుదిరిందా ఏమిటి అంటే... అరే.. అంత కరెక్ట్ గా ఎలా గెస్ చేసావు అని అడుగుతాడు.

నీ ఆత్రం చూస్తుంటేనే అర్థం అవుతుంది. పడుకున్నావాడ్ని లేపి మరీ చెబుతుంటే... మా టైమింగ్స్ తెలిసి కూడా చేసావు చూడు..

అక్కడే క్లియర్గా అర్థమైందిలే.  ఇంతకీ నేహా ఒప్పుకుందా అని అడిగితే..లేదురా అంటాడు.  మరి ఎలాగా సెట్ చేసావు అంటే..

ఇటు నుంచి అవ్వదని అర్థమయ్యే అటునుంచి నరుక్కువచ్చాను అంటాడు.  ఎటు నుంచి నరుక్కువచ్చావు అంటే...జరిగింది మొత్తం చెబుతాడు.

దానికి నవ్వుతూ బానే సెట్ చేసావు లే.. పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారు అంటే.. నువ్వు, విక్కీ ఎప్పుడైతే ఉంటారో అప్పుడే పెళ్లి.

విక్కీ కూడా ఫోన్ చేయాలి నువ్వు ఫోన్ పెట్టేయ్. ఒరేయ్ వాడు హనీమూన్ మూడ్ లో ఉన్నాడు. అనవసరంగా డిస్టర్బ్ చేయకు అని రాజ్ అరుస్తూ ఉండగానే ఫోన్ పెట్టేస్తాడు.

ఎదవ ఫోన్ పెట్టేసాడు.  వీడికి మరి ఆత్రం ఎక్కువవుతుంది. విక్కీ చేతులో ఏదో ఒకటి వీడికి మూడిందిలే  అనుకుంటు నా పెళ్ళాం ఎక్కడుందో అనుకుంటూ తలగడ పట్టుకుని పడుకుంటాడు.
 
ఫోన్ రింగ్ అవుతుంటే విక్రమ్ నవ్వుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పరా పెళ్ళికొడకా అంటాడు. అరే అప్పుడే నీకు ఎలా తెలిసింది అంటే..మాకు అన్నీ అలా తెలిసిపోతాయిలే.. కానీ ఏంటి సంగతులు అంటాడు. పెళ్లి కుదిరింది మామ అని గొప్పగా చెబుతాడు.

ఆ విషయం మాకు తెలుసు గాని...  నేహా కి తెలుసా అంటే లేదురా అని డల్ గా చెప్పాడు.   మా మామగారు పెళ్లి కుదిరింది అని చెప్పారు కానీ పెళ్లి కొడుకు పేరు చెప్పలేదు నీరసంగా చెబుతాడు.

హ.. హ... నవ్వుతూ నీ ఆత్రానికి, మీ మామగారు నిదానానికి సరిపోయింది.  హ్మ్.. అవున్రా ఎంగేజ్మెంట్ రోజునే రివిల్ చేసేటట్టు ఉన్నారు అని వాపోతాడు.

ఈ పాటికి తెలిసి ఉంటే అందరికి ఒక పెద్ద ట్రీట్ ఇచ్చేసేవాడిని.   నేహా అడిగితే ఏం చెబుతావు రా అంటే... దేని గురించి బావ.

నాకంటే తెలియదు. మీకు తెలుసు కదా.. ఎందుకు చెప్పలేదు అన్నదే అనుకో ఏమని చెబుతావు...
నీకు తెలిసేమో అనుకున్నాను అని అంటాను.

దానికి ఒరేయ్ మట్టి బుర్ర.. ఆల్రెడీ జరిగిందంతా నీకు చెప్పే ఉంటుంది కదా.. తనకు ఏమీ తెలీదు అని నీకు తెలుసు కదా...

మళ్లీ నీకు తెలిసేమో అనుకున్నాను అంటే.. నమ్ముతుందా నిన్ను ఎలా చూస్తుంది.  మరి ఇప్పుడు ఏం చెప్పాలి బావా అంటే.. అది కూడా మేమే చెబితే ఎలా రా...కొంచెం ఆలోచించు.

పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టారు అంటే...ఏదైనా మీరు వచ్చిన తర్వాతే అని చెబుతారు.  మేము రావడానికి ఇంకొక వారం పడుతుంది రా...

మీరు వచ్చే టైమ్ కి ఎంగేజ్మెంట్ పెట్టేసుకుందాము. ఒకే బై అని ఫోన్ పెట్టేసి భార్యని అల్లుకుపోతాడు.

ఇక్కడ శ్రీ మాత్రం నేహా తో లైఫ్ ఊహించుకుంటూ లైఫ్ అనే డ్రీమ్స్ క్లౌడ్ లో ఎగురుతూ ఉంటాడు.

ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది...
[+] 14 users Like SivaSai's post
Like Reply
#90

Part - 72


విక్రమ్, అవని హనీమూన్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసారు. అవని మొహం కొత్త కళతో మెరిసిపోతూ ఉంటుంది.  అది చాటు నుంచి చూసిన ధనుంజయ్ ముఖం వెలిగిపోతూ ఉంటుంది.

కూతురి ఆనందం చూసి గుడికి వెళ్లి కూతురు, అల్లుడు మీద అర్చన చేపించి అన్నదానాలు చేపిస్తాడు తనకు తెలిసిన అన్ని అనాధశరణాలయాలకి,  వృద్ధాశ్రమాలకి  భారీ మొత్తంలో విరాళాలు ఇస్తాడు.

అది చూసిన సత్యవతి గారు ఒక పక్కన ఆనందపడిన, మరో పక్క బాధపడుతూ నువ్వు ముందే తెలుసుకొని ఉండి ఉంటే మీ మధ్యన ఇంత దూరం వచ్చి ఉండేది కాదు కదా అని బాధపడతారు.

ఇంటికి వచ్చిన అవని నీ లేడీస్ అందరూ చుట్టేస్తారు.  నివి లోపలికి తీసుకెళ్లి వదిన మీ హనీమూన్ ముచ్చట్లు చెప్పు అని టీస్ చేస్తూ ఉంటుంది.

ఆ మాటలకు అవిని సిగ్గుపడుతూ ప్లీజ్ నివి అంటుంది. ఎందుకు వదిన అంత సిగ్గు. మా అన్నయ్య మరి అంతలా చేసుకున్నాడా అని కన్ను కొడుతుంది..

ఆ మాటలకి అవిని నోరుతెరిచి చూస్తుంది.  బాబోయ్ మీ అన్న చెల్లెలు ఉన్నారే...  తక్కువ వాళ్ళు కాదు. అయినా రేపు నీకు పెళ్లి అయితే నీకే తెలుస్తుందిలే.

ముందే రుచి చూస్తే అప్పుడు టేస్ట్ నీకు తెలియదు అని చెప్పి అక్కడి నుంచి తుర్రుమంటుంది. వెళుతున్న అవని నీ చూసి నివి నవ్వుకుంటూ...

నీ సంతోషం ఎప్పుడూ ఇలాగే ఉండాలి వదిన అనుకుని అవని వెనకాలే బయటకు వెళుతుంది. నివి చేయి పట్టుకుని మాధవి లాగి... అవని ఏం చెప్పింది సంతోషంగానే ఉందా...

అత్త నీ కూతురు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు టెన్షన్ పడకు అని చెబుతుంది. ఆ మాటలకి... నాకు తెలుసు నా కూతురు సంతోషంగానే ఉంటుందని.

ఎందుకంటే అక్కడ ఉన్నది నా అల్లుడు కదా అంటుంది. అబ్బో మరి ఎందుకు అడిగినట్టు అని సాగదీస్తుంది.  తల్లిగా ఆత్రం నాది అంతే...  నా అల్లుడు అనుమానించి కాదు అని తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది.

నివి విక్రమ్ దగ్గరికి వెళ్లి డోర్ నాక్ చేస్తుంది. అది చూసి నీకు పర్మిషన్ కావాలా... లోపలికి రా.... వచ్చి వాళ్ళ అన్నయ్యని గట్టిగా హగ్ చేసుకుని... థాంక్స్ అన్నయ్య అంటుంది.

తల మీద చెయ్యి వేసి దేనికి రా... వదిన చాలా సంతోషంగా ఉంది. వదిన లాంటి అమ్మాయిని తీసుకువచ్చినందుకు నీకు థాంక్స్ చెబుతున్నాను.

మన ఇల్లు ఎప్పుడు ఇలా సంతోషంతో ఉంటే అదే చాలు అంటుంది.  తప్పకుండా ఉంటుందిరా..  ఉండేటట్టుగా నేను చూసుకుంటాను కదా..

ఏం చేశారు ఈ పది రోజులు అందరూ అని కబుర్లలో పడతారు. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా...

హ... మర్చిపోయాను.. మన శ్రీకి పెళ్లి కుదిరింది అంటాడు. ఓ... ఎవరా లక్కీ గర్ల్...నేహా అని చెబుతాడు.  వదిన ఫ్రెండ్ నేహా నా... వెరీ నైస్ పెయిర్ అన్నయ్య.

ఇది ఎప్పుడు జరిగింది...బెంగళూరులో ఉన్నప్పుడు నుంచి సైట్ కొడుతున్నాడు.  వాడికి వార్నింగ్ ఇచ్చి నేను ఫ్లైట్ ఎక్కాను.  వచ్చేటప్పటికి సెట్ అయింది అని చెబుతాడు.

ఇది ఎప్పుడు జరిగింది నాకు తెలియలేదే అని అవని అంటే... నువ్వు ఎప్పుడు అబ్జర్వ్ చేసావని. నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా నువ్వు చూసుకోవు.

నీ లోకంలో నువ్వు ఉంటావు. ఇంకా పక్కన వాళ్ళ గురించి నీకేం అర్థం అవుతుంది. వెంటనే నేను సీనియర్ కి కాల్ చేయాలి అని ఫోన్ కోసం చూస్తూ ఉంటుంది.

హలో మేడం కాస్త తట్టుకో అంటాడు.  దేనికి.... మీ సీనియర్ కి విషయాలు ఏమీ తెలియవు. పెద్దలకు తెచ్చిన పెళ్లి గానే ప్రస్తుతానికి నేహా ముందుకు వెళుతుంది.

అదేంటి... నేహా కి పెళ్ళికి ముందు ప్రేమ ఇలాంటివన్నీటికి చాలా దూరం అని చెప్పింది. అందుకే వాడు అటు నుంచి నరుక్కువచ్చాడు అని చెబుతాడు.

ఆ మాటలకి కళ్యాణ్ గారు నవ్వుతూ చాలా కష్టాలు పడుతున్నట్టు ఉన్నాడు బిడ్డ...  పెళ్లి కోసము...


అవునవును వాడు పడడమేకాదు. మమ్మల్ని పరిగెత్తిస్తున్నాడు అన్న మాట వినిపిస్తుంది. ఎవరు అని చూసేటప్పటికి....

అక్కడ సురభి,  వాసు గారు కనిపిస్తారు. అరే వాసు రండి అని కళ్యాణ్ ఎదురు వెళ్లి హగ్ చేసుకుంటాడు. ఎలా ఉన్నావ్ వాసు.  రామ్మా సురభి అని పిలుస్తారు.

లలిత ఎదురు వెళ్లి చేయి పట్టుకుని తీసుకోవస్తుంది.  ఇందిరా గారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి బాగున్నారా పెద్దమ్మ గారు అని అడుగుతుంది..

నేను చాలా బాగున్నాను తల్లి..ఎలా ఉన్నావు... మేము చాలా బాగున్నాము అని చెబుతోంది. మరి వాసు ఏంటి చాలా టెన్షన్ పడుతున్నాడు.

ఆయన అన్ని అలాగే చెబుతారులే పెద్దమ్మ అంటుంది.  కొడుకు ఏం చేశానా ఈవిడకి బాగానే ఉంటుంది. ఏమైందిరా... అసలు మమ్మల్ని పడుకోనివ్వడు..  నుంచోనివ్వడు.

ఆపరేషన్ అంటే ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అది కూడా వాడే లాగేసుకుంటున్నాడు... ఎదవ అని చిరుకోపంగా చెబుతారు.

ఆ మాటలకు సురభి ఏంటండీ మీరు... వాడు చిన్న పిల్లోడు అంటే.. వాడిని ఇంకొకసారి చిన్న పిల్లోడు అని వెనకేసుకొచ్చావ్ అనుకో.. నీకు అసలు మర్యాదగా ఉండదు అని ప్రెస్టేట్ అవుతాడు.

ఆ మాటలకి నవ్వుతూ ఏమయింది వాసు..  మరీ అంత ప్రెస్టేట్ అవుతున్నావు అంటే... వాడికి ఆ టైము,  ఈ టైం అని ఏమీ ఉండడం లేదు.

ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఫోన్ చేసి నా పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి... మీరు ఏం కొన్నారు..ఏం చేశారు? ఎన్నింటికి అని పిచ్చి ప్రశ్నలు వేస్తూ టార్చర్ పెడుతున్నాడు రా అని..


నేహా వాళ్ళ ఊరు వెళ్లే ముందు రోజు ఎన్నింటికి లేపాడో చెబుతాడు.  ఆ మాటలకు అందరూ నవ్వుకుంటూ మన పెద్దలు ఊరికే చెప్పలేదు కదా...

కొత్త పిచ్చోడు పొద్దెరగడు అని అంటే.. ఇది నిజమే అని వాసుగారు కూడా వంతు పాడుతారు.   ఈ శుక్రవారం నిశ్చితార్థం వచ్చింది.  వచ్చే వారమే పెళ్లి అని చెబుతారు.

అదేంట్రా అంత తొందరగా పెట్టిసావు అంటే... నా కొడుకు టార్చర్ కన్నా...ఒక పది రోజులు పడుకోకుండా పెళ్లి పనులు చూసుకోవడం చాలా బెటర్ కళ్యాణ్... నీకు అర్థం కావడం లేదు.

ఆ మాటలకు విక్రమ్ నవ్వుతూ... మీరు ఏం టెన్షన్ పడకండి అంకుల్.  మేమన్నాము కదా మేము చూసుకుంటాము అని చెబుతాడు.

మీరందరూ ఉన్నారనే నా ధైర్యం కూడా..ఇంతకీ రాజ్ ఎప్పుడు వస్తున్నాడు. మే బి ఈరోజు గాని,  రేపు గాని వచ్చేయొచ్చు అని చెబుతాడు.

మీరిద్దరూ ఉంటే వాడిని కాస్త కంట్రోల్లో పెట్టగలుగుతారు. లేకపోతే నాకున్న ఈ కాస్త జుట్టు కూడా వాడే పీకేసేటట్టున్నాడు అని తల మీద చెయ్యి పెట్టుకుని చెబుతారు. ఆ మాటకి అందరూ చాలా గట్టిగా నవ్వుతారు.

సురభి చిరుకోపంగా చాల్లే వాసు మరి ఎక్కువ ఆటపట్టిస్తున్నావు. అవని వైపు తిరిగి అమ్మ అవని..మాకు ఉన్నది ఒక్కడే కొడుకు.

వాడికి చెప్పుకోవడానికి అక్కాచెల్లెళ్ళు ఎవరూ లేరు. నీకు ఇబ్బంది లేదు అనుకుంటే....  మా ఇంటి ఆడపడుచుగా వాడి పెళ్లి అయ్యేవరకు అన్ని పనులు ఆడపడుచు హోదాలో చెయ్యమ్మా అని అడుగుతారు.

ఆ మాటలకు ఒకసారి విక్రమ్ వైపు, ఇందిరాగారి వైపు చూస్తోంది.  ఇద్దరు ప్రశాంతంగా నవ్వుతూ చూస్తూ ఉంటే.. తప్పకుండా పెద్దమ్మ గారు నేను ముందే వచ్చేస్తాను.

16 రోజుల పండగ అయ్యేదాకా అన్ని దగ్గరుండి చూసుకుంటాను సరేనా అని చెబుతోంది.  తప్పకుండా.. అన్ని నీ చేతుల మీదుగా జరిగితే అంతకన్నా సంతోషమా అని అందరికీ మరీ మరీ చెప్పి వెళ్ళిపోతారు.

అందరి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోగా... అవని మిర్రర్ ముందు నిలబడి మెడలో ఉన్న జ్యువలరీ అన్నీ తీసి పక్కన పెట్టి,  సారీ మార్చుకోవడానికి అని భుజం మీద పిన్ని తీయడానికి చేయి వేస్తుంది.

ఇంతలో నడుం మీద  చల్లగా విక్రమ్ చేతులు తగులుతాయి.  ఆ స్పర్శకి ఒక్కసారి ఉలిక్కిపడి తల వెనక్కి తెప్పి ఏంటో శ్రీవారు అని అంటుంది.

భుజం మీద చిన్నగా పంటిగాటు పెట్టి.. ఏంటి మేడం ముందే శ్రీ వాళ్ళ ఇంటికి వెళ్లి పోతావా.. 16 రోజుల పండగ అయ్యేవరకు రావా... అక్కడే ఉండిపోతే నా పరిస్థితి ఏంటి అని అడుగుతు నడుం మీద గట్టిగా నొక్కుతాడు.

స్... అబ్బా... నొప్పిగా ఉంది. చెప్పేముందు మీవైపే చూశాను కదా.. ఇప్పుడు మళ్ళీ నన్ను అంటున్నారు ఏంటి పెదాలు ముడిచి  అలకగా అంటుంది. ముడిచిన పెదాలపై చిన్నగా పెక్ ఇచ్చి...

ప్రతిరోజు పొద్దుట నేనే డ్రాప్ చేస్తాను.  నైట్ నిన్ను తీసుకువచ్చేస్తాను అని చెబుతాడు.  రోజు తిరుగుతారా అంటే...   మనం ఉన్నచోటుకి అది ఏమన్నా దూరమా...

ఆఫీస్ కి వెళ్లే దారిలోనే... రోజు నేను ఎలాగ వచ్చి చూడాల్సిందే కాబట్టి...నిన్ను దింపేసి నేను అలా ఆఫీస్ కి వెళ్ళిపోతాను.

రోజు నైట్ అలా వస్తే బాగోదేమోనండి అని ఇబ్బందిగా అంటే.. అలవాటైపోయావే భార్యామణి.  పక్కన లేకపోతే అస్సలు నిద్ర పట్టడంలేదు అని నడుం మీద వేళ్ళతో నాట్యం చేస్తూఉంటాడు.

ఆ నాట్యానికి చెక్కిలిగింతలు పుట్టి.. ప్లీజ్ అండి... మెలికల తిరుగుతూ నవ్వుతుంది. ఈ నవ్వు చూస్తూ ఉండిపోవచ్చు తెలుసా అని ఎత్తుకుని మంచం మీద వదులుతాడు.

పెళ్లి పనులు మొదలవుతున్నాయి..

కథ కొనసాగుతుంది...
Like Reply
#91

Part - 73


శ్రీ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేస్తాడు.  రాజ్ కూడా హైదరాబాద్ చేరుకుంటాడు. నేహా 2 డేస్ ముందే లీవ్ పెడుతుంది.

అవిని నేహ కి ఫోన్ చేస్తుంది.  హలో సీనియర్ అని పిలుస్తుంది. హాయ్ అవని ఎప్పుడొచ్చారు.  టుడేస్ అయింది అని చెబుతోంది.

ఇంకేంటి సీనియర్ సంగతులు అంటే... నాకు పెళ్లి కుదిరింది అని చెబుతోంది. ఓ... కంగ్రాట్స్... అబ్బాయి ఎవరు?? పెళ్లి ఎప్పుడు??

ఎంగేజ్మెంట్ ఈ ఫ్రైడే కానీ...అబ్బాయి గురించి నాకు ఇంకా ఏమీ తెలియదు అని డల్ గా చెబుతుంది.  అదేంటి అంకుల్ చెప్పలేదా...  లేదు అంత ఎంగేజ్మెంట్ రోజే అని చెప్పారు.

కానీ నాకు ఒకసారి మాట్లాడాలి అనిపిస్తుంది అనగానే..  పక్కనే ఉన్న మాధవి గారు ఫోన్ నుంచి శ్రీ కి కాల్ కలుపుతోంది.

ఈ టైంలో మాధవి ఆంటీ ఏమిటి అనుకుని..  లిఫ్ట్ చేసి హలో అనేలోపు నేహా వాయిస్ వినపడుతూ ఉంటుంది. సైలెంట్ అయిపోయి వింటూ ఉంటాడు.

అవని ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మాధవి ఫోన్ ని ఈ ఫోన్ దగ్గరగా పెడుతుంది. నేహా మాట శ్రీ వినేటట్టుగా సెట్ చేస్తోంది.

ఎందుకు సీనియర్ అంత డల్ గా మాట్లాడుతున్నారు. పోనీ అబ్బాయి నెంబరు అడగకపోయావా అంటే.. అమ్మో నాన్నగారిని అడగడమేనా అంటుంది .

నువ్వు అవునన్నా, కాదన్నా అంకుల్ ఓకే చేసేస్తారు కదా.. మరి ఇంకా స్పెషల్ గా ఏం మాట్లాడాలి. ఎంగేజ్మెంట్ రోజున మాట్లాడితే సరిపోతుంది కదా అని... నేహా మనసులో ఏముందో తెలుసుకోవాలని అడుగుతుంది.

నేహా సైలెంట్ అయిపోతుంది.  ఇక్కడ శ్రీ కి టెన్షన్ తో బీపీ పెరిగిపోతూ ఉంటుంది. స్పీక్ అవుట్ నేహా అని మనసులోనే చెబుతూ ఉంటాడు.

అవని కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. నేహా ఏం చెబుతుందో అని... కాసేపటికి మౌనం వదిలి అలా కాదు అవని.

ఇప్పుడు వరకు నాన్నగారు కష్టపడి నన్ను చదివించారు. నీకు తెలుసు కదా మా పరిస్థితులు ఎలాంటివో.  అలాంటిది జాబు వచ్చినా కొన్ని రోజులకే నేను పెళ్లి చేసుకుంటే ఎలాగా..

వెంటనే అవని...  అందుకని అబ్బాయితో ఇప్పుడు పెళ్లొద్దని చెబుతారా ఏంటి అని అడుగుతుంది.  ఆ మాట వినగానే శ్రీ గుండే ఆగినంత పని అవుతుంది.

అబ్బా అవని పూర్తిగా చెప్పేది విను. అబ్బాయితో మాట్లాడి నా శాలరీలో 50% నాన్నగారికి ఇచ్చేటట్టుగా ఒప్పించాలి.  ముందే మాట్లాడితే మంచిది కదా...

తర్వాత నా సాలరీ మీద కూడా అతని హోప్ పెట్టుకుని ఉంటే ఇబ్బంది కదా అని అంటుంది.  ఆ మాటకి అవని నీ జీతం..  నీ ఇష్టం.

దానికి అబ్బాయి పర్మిషన్ ఎందుకు...  అబ్బాయిలు ఏమన్నా అమ్మాయి పర్మిషన్ అడుగుతున్నారా...  ఏమో అవన్నీ నాకు తెలియదు.

ముందే క్లియర్ చేసేసుకుంటే ఇబ్బంది ఉండదు.  మాటలు అనుకున్నంత ఈజీ కాదు.  చేతల్లోకి వచ్చేటప్పటికి  అమ్మాయి పరిస్థితి.

కొంచెం మనం ఆలోచించుకోవాలి అని చెబుతుంది.  నువ్వు అన్నది కూడా నిజమేలే...  సరే ఏం చేస్తాం. ఎంగేజ్మెంట్ వరకు ఆగుదాం. 

లేదుఅంటే ఈ లోపు నేనేమైనా ట్రై చేయనా..  అబ్బాయి నెంబరు అంటుంది. నీకు ఎలా తెలుస్తుంది అంటే..అంకుల్ తో మాట్లాడి తీసుకుంటాను అని అంటుంది.

అమ్మో వద్దు అది నేను అడిగించాను అని నాన్నగారు కోప్పడతారు. నేను ఏమి అడుగుతానో కూడా నాన్నగారికి తెలుసు.

అందుకే ఎంగేజ్మెంట్ దాకా నాకు అబ్బాయి విషయాలు తెలియనివ్వడం లేదు అని చెబుతుంది.  ఆ మాటలకు అవని నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది.

నిన్ను పూర్తిగా అర్థం చేసుకొని నీకు తోడు నిలబడే వాడే వస్తాడు. టెన్షన్ పడకు అని చెప్పి సరే ఉంటాను సీనియర్ అని ఫోన్ పెట్టేస్తోంది.

మాధవి ఫోన్ తీసుకొని విన్నారు కదా అన్నయ్య అంటుంది.  హా విన్నాను.  మరి ఏ నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతుంది..

నేను ఆల్రెడీ ఎప్పుడో తీసేసుకున్నాను అని వాసుగారికి,  శ్రీ కి మధ్య జరిగిన డిస్కషన్ అంతా చెబుతాడు.  ఆ మాటలు వినగానే అవని సంతోషపడుతూ చాలా మంచి నిర్ణయం అన్నయ్య అని ఫోన్ పెట్టేస్తుంది.

ఏమైంది అని మాధవి అడిగితే జరిగిందంతా చెబుతుంది. నేహకి వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం అనుకుంటా.. ఎక్కువ కంగారు పడుతుంది అని మాధవి అంటే...

ఎందుకు ఉండదు అమ్మ. చిన్నప్పటి నుంచి ప్రతి దానికి కంటి రెప్పలాగా కాచుకున్నారు.  తనకి కావాల్సింది ఏదైనా సరే... ఎంత కష్టమైనా సరే తీసుకొచ్చి అందించేవారు.

తండ్రిగా తన అవసరం ఉన్న ప్రతి చోట నిలబడ్డారు. ఇప్పటికీ నిలబడుతున్నారు. కాకపోతే అది ఎక్స్ప్రెస్ చేయరు అంతే..  అందరికీ  ఆ అదృష్టం ఉండదు.

ఆ మాట చెబుతూ అవని గొంతు జీరబోతుంది.   అవని బాధ అర్థం అయిన మాధవి అవని  భుజం చుట్టూ చెయ్యి వేసి చిన్నగా నొక్కుతారు.

వెంటనే అవని తేరుకొని నేను బాగానే ఉన్నాను అమ్మ అని చెప్పి ఇప్పుడే వస్తాను అనే రూంలోకి వెళుతుంది. అవని బాధ అర్థం అయినా మాధవి కూడా కొంచెం టైం ఇస్తే సరిపోతుంది సైలెంట్ అవుతుంది.

రూమ్ లోనికి వచ్చిన అవని సోఫాలో కూర్చుని కాళ్లు రెండు పైకి పెట్టుకుని కాళ్లు చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుని తల మోకాళ్ళ మీద వాల్చి కూర్చుంటుంది.

తనికి చిన్నప్పటినుండి దక్కని తండ్రి ప్రేమ గుర్తుకు వచ్చి బాధపడుతుంది. ఎందుకు మీరు ఇలా చేశారు.  అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట కదా..

అంత ప్రేమేంచి పెళ్లి చేసుకున్న మీరు కూతురు బాగోగులు పట్టనట్టుగా ఎలా ఉన్నారు.  మనిషికి తన సుఖాలే ముఖ్యమా అని  బాధపడుతూ ఉంటుంది.

ఫోన్ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేసి హలో అంటుంది.  ఏమైంది మా భార్యామణికి అని అటు నుంచి వాయిస్ వినపడుతుంది.

అప్పుడు ఫోన్ చూసి మీరా... మీరు ఈ టైం లో ఏమీటి అడుగుతుంది. ఎందుకో నీతో మాట్లాడాలనిపించి చేశాను. వద్దు అంటే చెప్పు పెట్టేస్తాను అని అంటాడు.

అబ్బా నేను అలా అనలేదండి. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఆ...  ఏమిటి అని అడిగాను అంతే.  నా భార్యతో మాట్లాడుకోవడానికి కూడా టైం చూడాలా...

నాకు మాట్లాడాలనిపించింది. చేశాను ఏం చేస్తున్నావు అని అడుగుతాడు.  ఏమీ లేదు ఖాళీయే. ఒక్కదానివి రూమ్ లో  ఉండిపోకపోతే... అమ్మ వాళ్ళ దగ్గర కూర్చోవచ్చు కదా అని అడుగుతాడు.

ఇప్పుడే పైకి వచ్చాను. ఇప్పుడు దాకా అమ్మ,  అత్తయ్య దగ్గరే ఉన్నాను అని చెబుతుంది.  ఏమైందిరా అని లాలనగా అడుగుతాడు.

ఎందుకో తెలియని బెంగగా అనిపిస్తుంది అని వెక్కుతూ చెబుతుంది. ఎవరేమన్నారు మా బంగారాన్ని,  బుజ్జిని అని ట్యూన్ చేస్తూ ఉంటాడు.

నన్ను ఎవరూ ఏమీ అనలేదు కానీ.. ఏడుపు వస్తుంది అని చెబుతూ కళ్ళు తుడుచుకుంటుంది. రేయ్ బంగారం అని పిలుస్తాడు.  ఆ చెప్పండి అని వెక్కుతూ అంటుంది  .

వెంటనే వీడియో కాల్ చేస్తాడు. కాల్ ఆన్ చేసి భర్తవైపు చూస్తూ ఉంటుంది. ఏడ్చి కళ్ళు ఎర్రగా అయిపోయినా అవని ముఖాన్ని చూసి ఏమైందమ్మా..

నాతో చెప్పు నేను చూసుకుంటాను కదా అంటే...ఏమీ లేదు ఎందుకో ఏడుపు వస్తుంది అంతే. నేహాతో మాట్లాడావా అని అడుగుతాడు.

అవును అంటుంది. ఏం మాట్లాడావు... నేహా వాళ్ళ నాన్నగారి గురించి చెప్పిందంతా చెప్పి... నేను ఎందుకు తండ్రి ప్రేమకి నోచుకోలేదు.

నేనేమీ పాపం చేశాను అండి అని ఏడుస్తుంది.  విక్రమ్ కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఏమని చెప్పి ఊరుకో బెట్టగలడు.

తన చేతుల్లో ఉన్నదైతే... కాలాన్ని వెనక్కి తిప్పి భార్య పడిన కష్టాన్ని మొత్తం చిటికె వేసిన ఈజీగా తీసివేసేవాడు.

ఉఫ్... అనుకుని రేయ్ బంగారం నన్ను చూడు. నా వైపే చూడు అంటాడు. దేనికి అని చూస్తుంది. నా కళ్ళు ఏమి చెబుతున్నాయి అని అడుగుతాడు..

ఆ కళ్ళ వైపే చూస్తూ ఉంటే.. అనంతమైన ప్రేమని నాపైన ఉంది అని చెబుతున్నాయి అని ఒక ట్రాన్సలో చెబుతుంది. ఆ మాటకి నవ్వుకుంటూ కదా...

భగవంతుడు ఒకటి తీసుకుంటే దానికి పదింతలు విలువైంది ఇస్తాడంట..  నీ గతంలో జరిగిన గాయాలు తీయలేకపోవచ్చు కానీ..

ఆ గాయాలు గుర్తుకు రానంత అనంతమైన ప్రేమని నేను ఇవ్వగలను అర్థమవుతుందా అని చెబుతూ ఉంటే... కళ్ళు తుడుచుకొని అర్థమవుతుంది.

నిజంగా నేను చాలా పిచ్చిదాన్ని.  నిలువెత్తు ప్రేమ రూపమైన నా భర్త ఎదురుగుండా ఉంటే...  నువ్వు అవసరం లేదు అన్న మనుషుల గురించి ఆలోచించి..

నేను బాధపడి మిమ్మల్ని బాధ పెడుతున్నాను.  ఇంకెప్పుడు నేను బాధపడను అని కళ్ళు తుడుచుకుంటుంది.

సాయంత్రం త్వరగా వస్తాను.  శ్రీ వాళ్ళ ఇంటికి వెళదాము రెడీ అయి ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసిన విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు .

అప్పుడే అక్కడికి వచ్చిన భరత్...  ఏమైంది బావ అని అడిగితే... అవని,  ధనుంజయ్ గురించి ఆలోచిస్తున్నాను అని చెబుతాడు.  అంత ఆలోచించవలసిన అవసరం ఏముంది అంటే...

భర్తగా నేను ఎంత ప్రేమ చూపించినా.. మనం ఎంత అపురూపంగా చూసుకున్న... ఆడపిల్లకి పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది కదా...

అదే ఈరోజు అవనికి గుర్తొచ్చి బాధపడుతుంది.  ధనుంజయ్ తెలియకుండా చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తపడి... సరిదిద్దుకోవాలి అని ప్రయత్నిస్తున్నాడు.

కానీ అవని మాత్రం అతనిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడం లేదు. రేపు అన్న రోజున వీళ్ళిద్దరి మధ్యన ఏమి జరుగుతుంది అన్నది అర్థం కావడం లేదు.

విక్రమ్ మాటలకి భరత్ ఎక్కువ ఆలోచించకు బావ. ప్రస్తుతం అవని సంతోషంగా ఉంచడం ఒక్కటే మనం చేయవలసింది.

శ్రీ పెళ్ళిలో అవని మిస్ అయిన చిన్నచిన్న ఆనందాలు అన్ని మనం తిరిగి తీసుకోవద్దామని చెబుతాడు.  నేను అదే ప్లాన్ చేస్తున్నాను.

శ్రీ కంగారికి అవనిలో ఉన్న బెంగ అంతా పోవడం ఖాయం అని నవ్వుతాడు. విక్రమ్ నవ్వులో భరత్ కూడా శృతి కలిపి మెయిన్ సగం టెన్షన్ తీరిపోయినట్టే కదా అంటాడు.
[+] 12 users Like SivaSai's post
Like Reply
#92

Part - 74


విక్రమ్ ఇంటికి వచ్చేటప్పటికి అవని రెడీ అయ్యి ఉంటుంది. వెళదామా అని అడిగితే..  ముందు మీరు ఫ్రెష్ అవ్వండి.  కిచెన్లోకి  వెళ్లి స్నాక్స్ జ్యూస్ తీసుకుని పైకి వస్తుంది.

స్నాక్స్ తింటూ జ్యూస్ అవిని నోటి దగ్గర పెడతాడు. నాకు ఇప్పుడు ఏమీ వద్దండి. నేను ఆల్రెడీ తిన్నాను అంటే.. నాకోసం తాగు అని పీక్కుపోయి ఉన్నా మొఖం చూస్తూ పట్టిస్తాడు.

ఇంకేమీ మాట్లాడకుండా జ్యూస్ సగం తాగి. ఇంక చాలు అంటుంది.  మిగిలిన జ్యూస్ విక్రమ్ తాగి పద అని చెప్పి తీసుకువెళతాడు.

కిందికి వచ్చిన జంటను చూసి ఇందిరా గారు జాగ్రత్తగా వెళ్లి రండి అని చెప్పి పంపిస్తారు. ఇద్దరూ శ్రీ ఇంటికి చేరుకుంటారు. అవని మొదటిసారిగా శ్రీ ఇంటికి వస్తుంది.

గుమ్మం దగ్గరే ఇద్దరినీ ఆపేసి సురభి గారు దిష్టి తీసి కుడి కాలు లోపలి పెట్టి రామ్మా అని చెబుతారు.  అవని నవ్వుకుంటూ లోపలికి వచ్చి..

దిష్టి మాకు కాదు పెద్దమ్మ. అన్నయ్యకు  తీయాలి. మీ అన్నగారికి ఎటువంటి దిష్టి ఉండదమ్మా.. తీయాల్సిన అవసరం ఉండదు .

నువ్వు బంగారు బొమ్మవి నీకు తీయాలి అంటారు వాసు గారు. డాడీ అని గట్టిగా అరుస్తాడు. ఏంట్రా నేను ఏమన్నా తప్పు అన్నానా అని ఐబ్రో రైస్ చేస్తారు.

ఆ మాటకి పళ్ళునూరుతూ చూస్తూ... బాల్ మీ కోర్టులో ఉంది అని రెచ్చిపోతున్నారు. తర్వాత నాకు టైం వచ్చినప్పుడు చెబుతాను.

వెళ్ళు వెళ్ళవోయ్ అని చెప్పి రా తల్లి అని సురభికి వాసుకి మధ్యలో అవిని నీ కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతూ ఉంటారు.

పొద్దున్నుంచి ఉన్న దిగినంత వాళ్ల నవ్వుల మధ్యన ఎక్కడికో వెళ్ళిపోతుంది.  ఇంతలో సర్వెంట్స్ జ్యూస్ తీసుకువచ్చి ఇస్తారు.

అమ్మో ఇప్పుడు ఏమీ వద్దు అంటే.. సురభి ఆ గ్లాస్ తీసుకొని... వచ్చి ఇంత సేపు అయింది. తాగకపోతే ఎలాగా....

పెద్దమ్మ వచ్చే ముందే తాగాను. మళ్ళీ అంటే నా పొట్ట పట్టదు అని పొట్ట మీద చేతులు వేసుకుంటుంది. పడుతుందో లేదో డాక్టర్ గా నాకు తెలుసు గానీ.. అమ్మగా ఇస్తున్నాను తాగు అని నోరు దగ్గర పెడతారు.

ఆ మాటకి అవనికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.  చిన్నప్పటినుండి కావాలనుకున్న ప్రేమ విక్రమ్ చెయ్యి పట్టుకున్న దగ్గరనుంచి దొరుకుతున్నాయి.

గ్లాస్ తీసుకుని జ్యూస్ తాగుతూ వాళ్లందర్నీ చూస్తూ ఉంటుంది. అవిని ఎదురుగుండా ఒక గది తలుపు కొద్దిగా తెరిచి ఉంటుంది.

అందులో నుండి ఒక వ్యక్తి అవనినే చూస్తూ ఉంటాడు. అవని నవ్వులు చూసి ఆ వ్యక్తి సంతోషంతో గాలిలో ఎగురుతూ ఉంటాడు.

రాజ్ ఇంకా రాలేదేంటి అని వాసు గారు అడిగితే... వాడు ఆల్రెడీ హైదరాబాదులో ల్యాండ్ అయిపోయాడే.. ఇంకా రాకపోవడం ఏంటి అని విక్రమ్ అనుమానంగా అంటాడు.

ఆ మాటకి శ్రీ ఉడుక్కుంటూ  నాకేం తెలుసు. వాడు ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు.  ఎన్ని ఫోన్లు చేస్తున్న రెస్పాండ్ అవ్వడం లేదు.

నీకే తెలుసు అంటాడు.  నిజంగా నాకు తెలియదు రా బాబు. హైదరాబాద్ చేరిపోయాను అని చెప్పాడు.ఇంకా రాకపోవడం ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా...

గట్టిగ సౌండ్స్ వినపడుతూ ఉంటాయి. ఏంటా ఈ సౌండ్స్ అని చూస్తూ ఉంటే...  బాజాలు వాయించుకుంటూ నలుగురు వస్తూ ఉంటారు.

సురభి వైపు చూస్తూ ఇప్పుడు ఇవి అవసరమా...  అవి పెళ్లికి వాయించుతారు.  నీ కొడుక్కి పెళ్లి కుదిరింది కదా అని.. ఎంగేజ్మెంట్ ముందు నుంచి వాయించుకోరు.

అబ్బా వాసు నేను ఎందుకు అరేంజ్ చేస్తాను. నాకు తెలియదా..  ఎప్పుడు ఏం చేయాలో. మరి ఇది ఎవరు చేసారు అని...

శ్రీ వైపు తిరిగి... ఒరేయ్..  నీ పెళ్ళికి నువ్వే వాయింపుడు మొదలు పెట్టావా అంటే.. అబ్బా నాన్న మీరు అసలే ఆవేశంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు.

వీటి గురించి నాకు ఏమీ తెలియదు అంటాడు. మరి ఇది ఎవరు అరేంజ్మెంట్స్ అని చూస్తూ ఉండగా..  వాళ్ళ నలుగురు మధ్యలో నుంచి రాజ్ బయటకు వస్తాడు.

రాజ్ నువ్వా అంటే... ఎస్ అంకుల్ నేనే అంటాడు.  ఏంట్రా ఈ హడావిడి... మన శ్రీ కి పెళ్లి కుదిరింది కదా... ఈ మాత్రం ధూంధాం లేకపోతే ఎలాగా అంటాడు.

శ్రీ వెళ్లి రాజ్ ని కౌగిలించుకొని ఇంతసేపు పట్టిందా ఇంటికి రావడానికి. వీళ్ళందర్నీ అరేంజ్ చేసి వచ్చేదానికి టైం పట్టింది అయినా పెళ్ళికొడుకు మొహం వాడిపోయి ఉంది.

ఏమైంది అంటే.. సురభి గారు ఏముంది వాసు తిట్లుతో వాడికి చెవులు వాచిపోయి తలనొప్పి వస్తుంది.  పాపం బిడ్డ వచ్చినప్పటి నుంచి ఈయన గొడవే సరిపోతుంది అని వాపోతోంది.

వాసు గారు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ... నిజం చెప్పు సురభి.. నా గోల కి వాడికి తలనొప్పి వస్తుందా... వాడి గోల కి నాకు తలనొప్పి వస్తుందా...

వీడి పెళ్లి అన్నప్పటి నుంచి నన్ను ప్రశాంతంగా ఒక్క పూటైనా పడుకోనిఇచ్చాడా... వాడికి నిద్ర పట్టడం లేదు అని ఎన్ని నిద్రలేని రాత్రులు నాతో చేపించాడు.

నాన్న అని గట్టిగా అరుస్తాడు.  ఇప్పుడు నేను ఏమన్నాను అంటే..  మీరు మాట్లాడే మాట వేరే లాగా ఉంది. నీకు ఎలా అర్థమవుతే అలా తీసుకో.

రాజ్ వైపు తిరిగి వీడు టార్చర్ ఎంత దారుణంగా ఉందో తెలుసా...  అని పెళ్లి అన్న దగ్గరనుంచి నిన్నటిదాకా జరిగినవన్ని వన్ బై వన్ చెబుతూ ఉంటారు.

అది విన్న అందరూ పగలబడి నవ్వుతూ ఉంటే శ్రీ మొఖం ముడుచుకుంటాడు.. సురభి ఇంకా ఆపండి.  అబ్బాయి మీద ఎందుకని చాడీలు చెబుతారు.

కొత్త పెళ్ళికొడుకు మొహం వెలిగిపోతూ ఉండాలి.  మీ వల్ల కరెంటు లేని బల్బులా గా ఉంది అంటుంది.  అదేం పోలికే దరిద్రంగా అని...

కొడుకును అనేటప్పటికి మాత్రం ముందుకు ముందుకు వచ్చేస్తావు.  ఒక కూతురిని కని ఉండుంటే నా వైపు మాట్లాడేది.

ఇప్పుడైనా నాకేమీ ప్రాబ్లం లేదు అని అవిని చుట్టూ చేతులు వేసి నా కూతురు నాకు ఉంది. ఏరా ఈ నాన్నకి నువ్వు సపోర్టు కదా అని అంటారు.

నాన్న అనే మాట వినగానే అవని వాసు గారి వైపు చూస్తుంది. ఏంట్రా అలా చూస్తున్నావు. నువ్వు నా వైపే ఉండాలి.

ఈ నాన్నతోనే ఉంటావు కదా అని అంటారు. హ.. అని తలుపుతుంది.  చూసావా నా వైపు నా కూతురు ఉంది. కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు.

నువ్వు నీ కొడుకు ఏం చేసుకుంటారో చేసుకోండి.  పద బంగారం మీ వదినకి సెలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్ని నేనే చూపిస్తాను అని లోపలికి తీసుకు వెళ్ళిపోతాడు.

వెళుతున్న వాసు అవిని నీ చూసి మిగిలిన వాళ్ళు నవ్వుకుంటారు. వాళ్ళిద్దరూ వెళ్లిన తర్వాత థాంక్స్ ఆంటీ అంటాడు.

దేనికి విక్రమ్... అవని బాధని తీర్చినందుకు... ఆ మాటకి చిరుగోపంగా చూస్తూ..  నువ్వు చెప్పావని కాదు. నాకు అవనినీ చూసినప్పటి నుంచి అనిపిస్తుంది.

నాకు ఇలాంటి కూతురు ఉంటే బాగుంటుంది అని. మేము ఎప్పుడో మా కూతుర్ని చేసేసుకున్నాము. మా కూతురు గురించి మేము కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు అని అంటుంది.

ఆ మాటికి రాజ్ వెంటనే హోల్డన్...ఈ మాట మాధవి ఆంటీ వింటే మీ మీద ఫైటింగ్ కి వస్తారు అంటాడు.  ఏమి ఫైటింగ్ కి రాదు.

ఇద్దరు అమ్మలు, ఇద్దరు నాన్నలు ఉన్నట్టు లెక్క.  ఆ బంగారు తల్లిని దూరం చేసుకోవడానికి మేము ఎవరు సిద్ధంగా లేము అని చెబుతారు.

అప్పటివరకు గదిలో ఉన్న వ్యక్తి బయటకి వస్తాడు. ఆ వ్యక్తిని చూడగానే విక్రమ్ సైలెంట్ అయిపోతాడు.  రాజ్ కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు.

ఆ వ్యక్తి వీళ్ళ దగ్గరికి వచ్చే చేతులెత్తి నమస్కరిస్తాడు.  వెంటనే పైకి లేచి ప్లీజ్ మీరు ఇలా చేయకండి అంటే..లేదు సురభి గారు...

అవని పుట్టినప్పటినుంచి నేను ఇవ్వలేని సంతోషాలు, ధైర్యాన్ని మీరందరూ ఇస్తున్నారు. ఏమిచ్చినా మీ ఎవ్వరి రుణం నేను తీర్చుకోలేను.

విక్రమ్ వైపు తిరిగి  మీకు ఎలా థాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అల్లుడుగారు... అవని ప్రతి సంతోషాన్ని నాకు చూపిస్తున్నారు.

చేతిలోకి నమస్కారం చేయడం తప్ప ఏమీ చేయలేను అని చెప్పి అక్కడ నుండి వడివడిగా వెళ్లిపోతాడు.

ఒక్క నిమిషం అక్కడంతా మౌనం ఆవహిస్తుంది. శ్రీ... ఇలాగ ఉంటే లాభం లేదు అనుకుని... వీళ్ళిద్దరూ గదిలోకి వెళ్లి ఏం చేస్తున్నారు అని అడుగుతాడు.

ఆ మాటకి రాజ్... తండ్రీ కూతుర్లు ఇద్దరు గదిలోకి వెళ్లి ఏం చేస్తే నీకు ఏంట్రా అంటే.. అక్కడికి వెళ్లి చూస్తూ ఉన్నాయని నా పెళ్ళానికి సంబంధించినవి.

కాబట్టి నాకంగారు అంతా.. ఈయన ఏం మెలికలు వేస్తున్నాడో ఏంటో అని ఆ గదిలోకి వెళతాడు. వెళుతున్న శ్రీని చూస్తూ  పాపం నేహా అంటాడు.

దేనికి రా పాపం అంటే వీడు ఆత్రానికి నేహా ఏమైపోతుందో అన్న జాలి నాది అంటాడు.. ఆ మాటకి నెత్తి మీద ఒకటి పీకి అలాంటిదేమీ ఉండదు.

వీడి కంగారుకి, నేహా నిదానానికి సరిపోతుంది. ఇంక తమరే మిగిలారు అంటే..  మనకి అప్పుడే పెళ్లేంటి రా బావ అంటే..

మనకి కాదు.  నీకు.. ఆల్రెడీ మాకు అయిపోయినాయి.  మా లైఫ్ లో మేము ఎంజాయ్ చేస్తున్నాము. నువ్వే ఒంటికాయి  సొంటి కొమ్ములాగా వేలాడుతున్నావు అంటే ..

హ... నువ్వు ఎన్ని అయినా చెబుతావు. అవని లాంటి మెతగగా ఉన్న అమ్మాయి వచ్చింది కాబట్టి.. నీ ఆటలు సాగుతున్నాయి.

ప్రస్తుత కాలంలో అలాంటి అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు.  ఏరా అంటే పోరా అనే టైపులో ఉన్నారు అని చెబుతాడు.

ఏదైనా ఎక్స్పీరియన్స్ అయ్యిందా అంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని చూస్తున్నాను కదా... చాలా దారుణంగా ఉన్నారు రా బాబు ఇలా సింగిల్ గా ఉండడమే సుఖము అంటాడు.
నీకు కరెక్ట్ సోల్మెట్ తగిలే దాకా అలాగే అనిపిస్తుంది. సోల్ మేట ఎవరబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు.

రాజ్ సోల్మెట్ ఎవరయి ఉంటారు....

కథ కొనసాగుతుంది...
Like Reply
#93

Part - 75


ఎవరి ఆలోచనలో వాళ్ళు, సంతోషాల మధ్యన ఉండగానే శ్రీ ఎంగేజ్మెంట్ రోజు వచ్చేసింది. నేహా అవినికి ఫోన్ చేసి ముందే వచ్చేయమని మరీ మరీ చెప్పింది.

ఎంగేజ్మెంట్ శ్రీ తో అని చెప్పకుండా ఆ రోజు పెళ్లి కొడుకు కంటే ముందు మేమే ఉంటాము సరేనా అని నచ్చజెప్పింది. అవని విక్రమ్ తో.. నేహా నా మీద కోప్పడుతుందేమో...

తెలిసి కూడా నేను చెప్పలేదని. అది నువ్వు,  మీ అన్నగాడు తేల్చుకోండి. నాకు ఎటువంటి సంబంధం లేదు అని మంచం మీద పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ చెబుతాడు.

ఆ మాటలకి కోపం వచ్చి నడుం మీద చేతులు వేసుకొని ఏం మాట్లాడుతున్నారు మీరు... ఆ రోజే నేను చెబుతాను అంటే... వద్దు చెప్పకు సర్ప్రైజ్.... తొక్క, తోలు అని ఆపేశారు.

ఈరోజు ఏమో నీ తిప్పలు నువ్వు పడు.  నాకు ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు.  అలా ఎలా మాట్లాడుతారు మీరు.

వెంటనే విక్రమ్ ఒక పక్కకు తిరిగి చెయ్యి సపోర్టు మీద తలని అరచేతిలో  పెట్టుకొని... ఎంటి బంగారం... నామీద అరుస్తున్నావు.

దీన్ని అరవడం అంటారా అరిస్తే ఎలా ఉంటుందో తెలుసా అని అడుగుతుంది.  ఏంటి ఇది అరవడం కాదా... దీనికే నా చెవుల్లో ఉన్న తుప్పంతా ఊడి బయటకొచ్చేసింది.

ఇంకా నువ్వు అనుకున్న రేంజ్ లో అరిస్తే ఇంట్లో ఉన్న డస్ట్ అంత రోడ్డుమీద ఉంటుందేమో.  అలా ఉంటే చాలా బెటర్ కదా అంటాడు.

అంటే ఏంటి మీ ఉద్దేశం నేను అరిస్తే డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుందా అని ఉక్రోషంగా అడుగుతుంది.   అదే కదా నేను చెబుతుంది.

అలా వారానికి ఒకసారి నువ్వు ఇలాగే అరుస్తూ ఉండు. డస్ట్ అంత క్లీన్ అయిపోయి...  సర్వెంట్స్ వర్క్ కూడా తగ్గుతుంది.

వావ్ ఎంతైనా నువ్వు సూపర్ పెళ్ళానివే అంటాడు.  దేనికి అంటే... మీ ఆయనకి ఖర్చులు కలిసొచ్చే విధంగా చేస్తున్నందుకు అంటాడు.

అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అయినా అర్థమవుతుందా అని అడుగుతుంది. ఎందుకు అర్థం అవ్వడం లేదు బంగారం.

ఇలా రా అని కూర్చుని అవని నీ ఒళ్ళు కూర్చోబెట్టుకుని రోజు మన ఇల్లు క్లీన్ చేయడానికి సర్వెంట్స్ కి ఎంత టైం పడుతుంది. ఒకసారి ఎక్స్ట్రా  సర్వంట్స్ ని కూడా అరేంజ్ చేయాలి.

అదే నువ్వు వారానికి ఒకసారి అరుస్తున్నావ్ అనుకో..
మొత్తం అన్ని క్లీన్ అయిపోతాయి. అప్పుడు ఎగస్ట్రా సర్వెంట్స్ పెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉండదు.

అప్పుడు ఆ మనీ అంత సేవింగ్ ఏ కదా అని చెబుతాడు.  తల తోక లేకుండా మాట్లాడుతున్న విక్రమ్ మాటలకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక...

తింగరి చూపులు చూస్తూఉంటుంది. ఏంటి బంగారం అలా చూస్తున్నావ్ అంటే... మీరు ఏం మాట్లాడుతున్నారు మీకైనా తెలుస్తుందా అని అడుగుతుంది.

ఓ మై గాడ్ నాకు తెలియదు అనుకుంటున్నావా.. ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియకపోతే.. ఇంత బిజినెస్ ని ఎలా రన్ చేస్తాను అంటావు అని బుగ్గలు లాగుతాడు.

అవనికి వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు అయినా నేను ఏం మాట్లాడటం మొదలెడితే మీరు ఏం టాపిక్ తీసుకువచ్చారు.

రేపు నేను సీనియర్ కి ఏం చెప్పాలా అని అడిగితే అది వదిలేసి దానికి సంబంధంలేని తిక్క వాగడంతా వాగుతున్నారా...

అసలు మిమ్మల్ని అని విక్రమ్ వైపు తిరిగి మెడ పట్టుకుంటుంది. వెంటనే అవని నడుము మీద చేతులు వేసి దగ్గరికి లాక్కుని పెదాలు అందుకుంటాడు.

కాసేపు గింజుకున్నా కోపం అంతా ఎగిరిపోయి భర్తకి సరెండర్ అయిపోతుంది. అలసిపోయి పడుకున్నా అవని నీ గుండెల పైకి చేర్చుకుని నవ్వుకుంటాడు.

నీకు అసలు దెబ్బలాడడం కూడా రాదు. నేను ఏదో చెబుతూ ఉంటే నిజమే కదా...  నిజమే కదా... అని... నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నావు.

ఇలా అయితే నిన్ను మాయ చేయడం నాకు చాలా ఈజీ.  కానీ నాకు అలా వద్దు. నువ్వు నాతో దెబ్బలాడాలి. ఆర్గ్యు  చెయ్యాలి.

నీకు ఏం సమాధానం చెప్పాలా అని నేను ఆలోచించాలి.  అలా ఉంటేనే నాకు బాగుంటుంది.  ట్రైన్ చేస్తాను నిన్ను అనుకుంటాడు.

తెల్లారికి ముందే అవని లేచి గబగబా రెడీ అవుతుంది. విక్రమ్ ని కూడా తొందర పెడుతుంది. ఇద్దరూ రెడీ అయ్యి కిందకి వస్తారు.

లలిత గారి దగ్గరికి వెళ్లి అత్తయ్య గారు మీరు ఇటు వచ్చేసేయండి.  నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి అటు నుంచి శ్రీ అన్నయ్యతో కలిసి వస్తాము అని చెబుతుంది.

సరే తొందరగా వెళ్ళండి అని చెప్పి లలిత గారి వాళ్ళు కూడా రెడీ అయ్యి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి పెట్టవలసిన గిఫ్ట్స్ అన్ని కూడా జాగ్రత్తగా ప్యాక్ చేస్తారు.

నివి రెడీ అయ్యావా అని లలిత గారు అరుస్తారు. అబ్బా వస్తున్నాను అమ్మ..ఎందుకు అలా అరుస్తావు అని చెప్పి బయటికి వస్తుంది.

నివి ని అలా చూడగానే అందరికీ చాలా తృప్తిగా..కన్నులు పండుగగా అనిపిస్తుంది.  మాధవి గారు వెళ్లి చెవి వెనకాల దిష్టి చుక్క పెట్టి.. చాలా బాగున్నావే లంగా వోనిలో అని అంటుంది.

థాంక్స్ అత్తయ్య అని ఇందిరా గారి దగ్గరికి వెళ్లి ఎలా ఉన్నాను గ్రానీ అని అడుగుతుంది.  పైనుండి కింద వరకు చూస్తారు.

ఎక్కడ స్కిన్ షో చేయకుండా కంచి పట్టు లంగా వోని వేసుకుని... సింపుల్గా మెడలో ఒక చిన్న నెక్లెస్ పెట్టుకుంటుంది. నడుముకు వడ్డాణం పెట్టుకుని చెవులకి మీడియం సైజ్ బుట్టలు పెట్టుకుంటుంది.

మనవరాల చుట్టూ మెటికలు విరిచేసి సింపుల్గా మోడర్న్ మహాలక్ష్మి లాగా ఉన్నావు అనే చెబుతారు. దానికి నివి థాంక్యూ గ్రాని అని బెండై మరీ చెబుతుంది.

నివి చేసిన విధానానికి అందరూ నవ్వుకుని సరే పదండి లేట్ అయిందంటే శ్రీ అలుగుతాడు. వీడి అలకలు తీర్చలేక మళ్ళీ తల ప్రాణం తోకకు వస్తుంది. పదండి అని చెప్పి అందరూ మూడు కారులో బయలుదేరి వెళతారు.

అవని విక్రమ్ శ్రీ ఇంటికి చేరుకుంటారు. శ్రీ, రాజ్, అవని విక్రమ్ నలుగురు ఒక కారులో బయలుదేరుతారు. సురభి వాసు మరొక కారులో వస్తారు.

ఇంపార్టెంట్ చుట్టాలు అందరికీ బస్ ఎరేంజ్ చేస్తారు.  అందరూ వెళుతూ ఉంటారు కానీ...

శ్రీకి,  అవినికి మాత్రం చాలా టెన్షన్ గా ఉంటుంది.  ఒకరికి చెమటలు పడుతూ ఉంటే... ఇంకొకళ్ళు గోళ్ళు కొరికేస్తూ ఉంటారు.

వాళ్ళిద్దరిని అలా చూసిన విక్రమ్ మాత్రం నవ్వుకుంటూ ఉంటాడు.  విక్రమ్ నవ్వు చూసిన అవని కి కోపం బస్సున వస్తుంది.

ఎందుకు నవ్వుతున్నారు మీరు అని కోపంగా అడుగుతుంది. డ్రైవ్ చేస్తున్న రాజ్ వెనక్కితిరిగి ఏమైందిరా అని అడిగితే..

ఒకసారి ఈ అన్నా చెల్లెలు ఇద్దరి మొఖాలు చూడు అని అంటాడు. రాజ్ పక్కన కూర్చున్న శ్రీ టెన్షన్ గా కనిపిస్తాడు. అవని కూడా టెన్షన్ గా ఉంటుంది.

ఏమైంది మీ ఇద్దరికీ..  ఏదైనా ప్రాబ్లం మా అని కొంచెం అనుమానంగా అడుగుతాడు.  ప్రాబ్లం ఏంటి అన్నయ్య.. చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది.

ఏంటా ప్రాబ్లం అంటే.. నాకంటే టెన్షన్ ఉంది శ్రీ అన్నయ్య మీరు కూడా నా అంటే... హ... అవిని... నాక్కూడా చాలా టెన్షన్ గా ఉంది.

నేహా ఎలా రియాక్ట్ అవుతుందో అని అంటాడు. నాది కూడా సేమ్ ప్రాబ్లం అన్నయ్య అని తల పట్టుకుంటుంది.
అసలు మీరిద్దరూ దేని గురించి మాట్లాడుతున్నారో కొంచెం క్లియర్ గా చెబుతారా....

ఏదో మలయాళీ సినిమా చూస్తున్నట్టుగా ఉంది నాకు అని రాజ్ ప్రెస్టేట్ అవుతాడు. వాళ్ల ముగ్గురిని చూసి విక్రమ్ ముసిముసిగా నవ్వుతూ ఉంటే..మీ ఫ్రెండ్ ని అడగండి అన్నయ్య ఏం చేశారో... 

ఏం చేసావురా నువ్వైనా చెప్పు అని రాజ్ అడుగుతాడు. నేనైతే ఏమీ చేయలేదు అని భుజాలు ఎగరేస్తాడు.  మీరు ఏమి చేయలేదా అని మీద మీదికి వెళుతూ ఉంటుంది .

అబ్బా ఆగవే రాక్షసి.  నేను వద్దంటే మాత్రం నువ్వు మానేయాల. నువ్వు చెప్పచ్చు కదా అంటాడు.  మీరు నా భర్త.  మీ మాటకి విలువ ఇచ్చి నేను చెప్పలేదు అంటుంది.

అక్కడ నీ ఫ్రెండ్ కదా అది ఎందుకు ఆలోచించలేదు. ఏమో అదంతా నాకు తెలియదు. ఏదైనా మీ తర్వాతే అని చెప్పి బయటకు చూస్తూ ఉంటుంది.

రాజ్ గట్టిగా హ... అరుస్తూ ఒరేయ్ అసలు మేటర్ ఏంటో చెబుతారా...  కార్ ఇక్కడే ఆపేయనా...  కారుని స్లో చేస్తూ ఉంటాడు.

దానికి వద్దు అని అవని,  శ్రీ ఒకేసారి అరుస్తారు. వాళ్ళిద్దరిని చూసి విక్రమ్ గట్టిగా నవ్వుతూ.. నువ్వు కారుని పోనిస్తూ ఉండు. వాళ్ళిద్దరే చెబుతారు.

శ్రీవైపు తిరిగి నువ్వు చెప్పరా ముందు అంటాడు. దానికి శ్రీ నిట్టూరుస్తూ.. నేనే పెళ్లి కొడుకుని అన్న విషయం నేహా కి తెలియదు రా అంటాడు.

ఏమిటి అని గట్టిగా ఈసారి రాజ్ అరుస్తాడు. నేను నిజమే చెబుతున్నాను. అది ఎలా రా అంటే.. వాళ్ళ నాన్నగారు ఎంగేజ్మెంట్ రోజునే చెబుతాను అన్నారంట.

పోని నువ్వైనా చెప్పొచ్చు కదా అంటే... ఆ సర్ప్రైజ్ని నేను ఎందుకు మిస్ చేయడం అని చెప్పలేదు అంటాడు.  ఓకే సర్ప్రైజ్ బానే ఉంది.

దానికి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు. మీకు తెలిసిన నాకు చెప్పలేదు కదా...  ఇంకా ఎన్ని నిజాలు దాస్తారు నా దగ్గర అని నామీద కోప్పడుతుందేమో  అని భయంగా ఉంది అంటాడు.

ఆ మాటకి పైనుంచి కిందకి చూస్తూ నీకు ఇంకా పెళ్లి అవలేదు కదరా...  అప్పుడే పెళ్ళాంమంటే  ఇంత భయమా అని అడుగుతాడు.

అది భయం కాదురా ప్రేమ అంటాడు. ఏంటో ఈ తొక్కలో ప్రేమ అనుకుని..  సిస్టర్ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే నాది కూడా సేమ్ ప్రాబ్లం అన్నయ్య.

తెలిసి కూడా నేను చెప్పలేదని నా పైన అలుగుతుందేమో అని అంటుంది.  విక్రమ్ వైపుకు తిరిగి వీళ్ళిద్దరినీ ఏ గ్రహాంతర నుంచి తీసుకొచ్చావురా...

ఇంత చిన్నదాని కూడా తెగ టెన్షన్ పడుతున్నారు అని తల కొట్టుకుంటాడు.   నీకు ఇప్పుడు ఏమీ తెలియదు..రేపు నీ సోల్మెట్ తగిలిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నా బాధ అని శ్రీ అంటాడు.

అబ్బా సోల్మెట్..  సోల్మేట్...  అంటున్నారు. రానీ... ఎలా వచ్చినా సరే నా కంట్రోల్లోనే ఉంటుంది. అబ్బా... ఛా... అని విక్రమ్, శ్రీ ఒకేసారి అంటారు. ఈ సౌండ్ ఏంటో చాలా తేడాగా ఉందే...
[+] 13 users Like SivaSai's post
Like Reply
#94

Part - 76


సరదాగా మాట్లాడుకుంటూ అందరూ నేహా ఊరికి వచ్చేస్తారు. వెనకాలే  విక్రమ్ ఫ్యామిలీ కార్లు కూడా వచ్చేస్తాయి. ఒక కారుని భరత్ డ్రైవ్ చేస్తే.. ఇంకో కారుని వినయ్ డ్రైవ్ చేస్తాడు.  ఇంకొక కార్ కి డ్రైవర్ వస్తాడు.

అవని కారు దిగి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. అది చూసిన విక్రమ్... మొగుడు దిగాడో లేదో.. వస్తాడో లేదో అని కూడా లేదు.

చూడు ఎలా వెళ్ళిపోతుందో మీ చెల్లి అంటాడు. నువ్వు ఆగరా బావ..  మా చెల్లి వెళితే వెళ్ళింది. అక్కడ నీచెల్లి ఆలకి ఎలా ఉందో తెలియదు.  నాకు అసలే టెన్షన్ గా ఉంది.  నువ్వు సైలెంట్ గా ఉండు అంటాడు.

రాజ్ మాత్రం ఇద్దర్నీ చూస్తూ సరిపోయింది.  మీ ఇద్దరి గొడవ. ఒకళ్ళేమో పెళ్ళాం పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అని అలక. ఇంకొకళ్ళు కాబోయే పెళ్ళాం ఎక్కడ అలుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు.

ఏదేమైనా సరే మీరిద్దరూ చాలా వీక్ రా అంటాడు.  ఇద్దరూ  రాజ్ వైపు చూస్తూ.. దేంట్లో... పెళ్ళాన్ని కంట్రోల్ చేయడంలో అంటాడు.

ఒరేయ్ నీకు ఇంకా పెళ్లి కుదరలేదు.  పిల్ల దొరకలేదు.  అప్పుడే పెళ్ళాం కంట్రోల్ చేయడం గురించి మాట్లాడుతున్నావా...

పెళ్లి ఎప్పుడు కుదురుతుందా..  పిల్ల ఎప్పుడు దొరుకుతుందా అన్నది మెయిన్ పాయింట్ కాదు బావ. వచ్చేవాళ్లని ఎలాగైనా సరే మన కంట్రోల్ లో పెట్టుకోవడం.

అది ఇంపార్టెంట్.  ఆ విషయంలో నేను మీ ఇద్దరం అంత వీక్ కాదు అంటాడు. అబ్బో చూద్దాం అది కూడా...  నీ డైలాగ్ లు వింటూ ఉంటే ఏదో సినిమాలో విన్నట్టు ఉంది రా..  తర్వాత నిన్ను ఊహించుకోడానికి కూడా మాకు జాలి వేస్తుంది అంటే అంత సీన్ ఏమి లేదు.

సురభి, వాసు వీళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి మీ ముగ్గురు డిస్కషన్. లోపలికి రారా అంటే... అదే చూస్తున్నాం ఆంటీ...

ఎవరూ వచ్చి పిలవలేదు అని. ఇంతలో శ్రీను గారు కంగారుగా వచ్చి క్షమించండి చూసుకోలేదు రండి.. బావగారు రండి...  చెల్లెమ్మ  రండి.. అల్లుడుగారు లోపలికి రండి అని పిలుస్తారు.

ఎందుకు బావగారు అంత కంగారు పడుతున్నారు. మనలో మనకి అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేదు అని భుజం మీద చేయి వేసి పదండి అని రాజ్ వైపు తిరిగి...

రాజ్ నువ్వు ఇక్కడే ఉండి కళ్యాణ్ వాళ్ళు వస్తారు కదా.
వాళ్ళు లోపలకి తీసుకురా... ఈ ప్లేస్ కొత్త ..
మళ్లీ ఇబ్బంది పడతారు.

షుర్  అంకుల్... అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. రాజ్ వెయిట్ చేస్తూ ఉండగానే మూడు కార్లు వచ్చి ఆగుతాయి.

ఒక్కొక్క కారులో నుంచి అందరూ దిగుతూ ఉంటారు. రాజ్ ఎదురు వెళ్లి లోపలికి రండి అంకుల్ అని చెప్పి తీసుకువెళుతూ ఉంటాడు.

లలిత గారు కారువైపు తిరిగి నివి... కారు దిగేటప్పుడు ఆ గిఫ్ట్స్ కూడా తీసుకుని లోపలికి రా అని చెప్పి వెళ్ళిపోతారు.

నివి కారు దిగి... గిఫ్ట్స్ తీస్తూ ఉంటే ఇబ్బందిపడుతూ ఉంటుంది.  ఒక పక్కన లంగా వోని క్యారీ చేయడం.  ఇంకొక పక్కనే గిఫ్ట్స్ కష్టంగా అనిపిస్తూ డ్రైవర్ని పిలుస్తుంది.

డ్రైవర్ వచ్చి ఆ గిఫ్ట్స్ తీసుకుంటాడు. హమ్మయ్య అనుకుని తను సెట్ చేసుకుని... ఆ గిఫ్ట్స్ అన్ని తీసుకుంటుంది.

నేను లోపలికి తీసుకువస్తాను మేడం అంటే....  పర్వాలేదు మన ఇంట్లో పనే కదా అని చెప్పి.... ఆ గిఫ్ట్స్ పట్టుకుని నడుస్తూ ఉంటే...

రాజ్ ఎప్పటినుంచి చూస్తున్నాడో తెలియదు కానీ స్టాట్యూలాగా అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు.  ఎప్పుడు దీన్ని ఇంత పద్ధతిగా చూడక..  లేక నాలో ఏమన్నా హార్మోన్స్ మారుతున్నాయా..


నాకళ్లకి ఏంటి ఇంత అందంగా కనపడుతుంది. ఎప్పుడు చూసినా జీన్స్, స్కట్స్ వేసుకుని కనపడుతుంది.  ఈరోజు ఇంత పద్ధతిగా కనపడుతూ ఉంటే ఆ పిల్ల ఈ పిల్లేనా అనిపిస్తుంది.

నివి క్రాస్ చేసుకుని వెళ్ళిపోయినా సరే అలాగే చూస్తూ ఉంటాడు.  వినయ్ అక్కడికి వచ్చి ఏంట్రా ఇక్కడే నిలబడి పోయావు.

ఇంకా ఎవరినైనా రిసీవ్ చేసుకోవాలా అని కదుపుతాడు.  తర్వాత ఈ లోకంలోకి వచ్చి ఏం అడిగావు అని అడుగుతాడు.  ఎక్కడ ఆలోచిస్తున్నావు నువ్వు.

ఇందాకటి నుంచి నేను మాట్లాడుతూనే ఉంటే ఏదో ఊహాలోకంలో తేలుతున్నావు. నిజంగానే ఊహా లోకంలో తేలుతూనే ఉన్నాను..

అనవసరంగా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు. పైనుంచి కిందకి చూస్తూ ఈ ఊరు రాగానే ఏదైనా గాలి సోకిందా ఏంటి. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావు.

నేనేమీ పిచ్చిపిచ్చిగా మాట్లాడడం లేదు బామ్మర్ది అని బుగ్గ పైన తట్టి లోపలికి వెళతాడు. వెళుతున్న రాజ్ని చూస్తూ బాబోయ్ వీడు ఏంటో... వీడే గోల ఏంటో అనుకుని లోపలికి వెళతాడు.

అవని నేహాని బుజ్జగించి సర్థిచెప్పి హమ్మయ్య అని హాల్లోనికి వస్తుంది. భార్యని చూసి ఏంటి అని కళ్ళు ఎగరేస్తాడు.

మూతి తిప్పుకుంటూ మీతో మాట్లాడను. ఖచ్చి అని లిటిల్ ఫింగర్ చూపిస్తుంది. అబ్బో ఎంతసేపు ఉంటావో నేను చూస్తాను అని కళ్ళతోనే అడుగుతాడు.

అవిని మూతి తిప్పి ఫంక్షన్ దగ్గర ఏమి కావాలో అవి అన్ని సర్దుతూఉంటుంది.  నివి కూడా వచ్చి అవినికి హెల్ప్ చేస్తూ ఉంటుంది.

రాజ్ విక్రమ్ పక్కకి వచ్చి నిలబడి విక్రమ్ భుజం మీద చేయి వేసి మెలికలు తిరుగుతూ నివినే చూస్తూ ఉంటాడు.

అక్కడ నివి అవిని చెప్పినట్టుగా చేస్తూ నవ్వుతూ మాట్లాడుతూ సర్దుతూ ఉంటుంది.  ఒక్కొక్కసారి ఆ ఫ్యాన్ గాలికి ముంగురులు ఎగిరి డిస్టర్బ్ చేస్తూ ఉంటే....

వాటిని సున్నితంగా ముని వేళ్ళతో చెవి వెనకాల కి సర్దుకుంటూ... చెదురుతున్న ఓనీని సర్దుతూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది.

నివి ని అలా చూసిన రాజ్ గుండె స్కిప్ అయ్యి కింద పడిపోతుంది ఏమో అన్నంతగా కంగారు పడిపోతూ ఉంటాడు.

ఎవరి భుజం మీద చెయ్యి వేసాడో కూడా చూడకుండా.. నివి ని చూస్తూ ఇక్కడ తన చొక్కాఅంచుని తానే నలిపేసుకుంటూ ఉంటాడు. 

ఎంతసేపైనా రాజ్ ఏం మాట్లాడడం లేదు ఏంటి అని చూసిన విక్రమ్ కి ఏదో తేడాగా అనిపిస్తుంది. ఏంటి వీడు తెగ మెలికలు తిరుగుతున్నాడు.

ఏమయిందా అని... ఏరా ఏదైనా చీమ దూరిందా ఏంటి ఇందాక నుంచి తెగ డాన్స్ చేస్తున్నావు అంటే...  అవును బావ ఇప్పుడే ప్రేమ చీమ కుట్టి కుట్టనట్టుగా వెళ్ళిపోయింది.

ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు అంటే... అసలు విక్రమ్ మాటలు వినపడితేనే కదా.. ఏంటి బావా నీ గోల అని మళ్లీ నివి మీదే ఫోకస్ పెడతాడు.

ఏంటి... వీడిని ఎంత కదిపినా ఎక్కడో చూస్తున్నాడు అని రాజ్ చూస్తున్నా వైపుకే వారగా చూస్తాడు.  అక్కడ అవని, నివి ఉంటారు.

ఏంటి వీడు వాళ్ళిద్దర్నీ చూస్తున్నాడు. కొంపతీసి వీడు, నివికి ఏమైనా సైట్ కొడుతున్నాడా అని డౌట్ వచ్చి డిప్ప మీద పీకి.. ఏం చేస్తున్నావ్ రా అని అడుగుతాడు.

అప్పుడు స్పృహ లోకి వచ్చి ఎక్కడున్నాం రా మనం అంటాడు.  ఒరేయ్ ఎక్కడున్నావో కూడా తెలియని అంత ఇదిగా మునిగిపోయావా.... నేనేం మునిగిపోలేదు అని ఓ...  ఇది శ్రీ ఎంగేజ్మెంట్ ప్లేస్ కదా సారీ బావా అని ఒక తింగరినవ్వు నవ్వుతాడు.

నవ్వింది చాలుగాని ఏం చేస్తున్నావ్ ఇప్పుడు దాకా అంటే బావ అని గోకుతాడు.  నువ్వు అలా గోక్కు చూసే వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది.

చి... చి... నేను ఆ టైపు కాదు అని చెప్పి మళ్లీ కళ్ళని ఆటోమెటిగ్గా నివికి రాసిచ్చేస్తాడు. అది చూసి విక్రమ్ నవ్వుకుంటూ చూద్దాం ఏం చేస్తారో అని పెళ్ళాన్ని చూస్తూ ఉంటాడు.

అమ్మాయిని తీసుకురండి అని చెప్పగానే...  శ్రీ టెన్షన్ తో నేహా గది వైపే చూస్తూ ఉంటాడు. రాజ్ ఇంకా శ్రీ గురించి పట్టించుకోవడం మానేసి నివి పైనే ఫోకస్ పెడతాడు.

ఇక విక్రమ్ నాకు తప్పదు కదా అని వెళ్లి శ్రీ పక్కన కూర్చుని ఎందుకురా అంత టెన్షన్ పడతావు.  మీ చెల్లి ఎలా రియాక్ట్ అవుతుందో అని..

అంత లేదక్కడ... ఆల్రెడీ మీ చెల్లి కూల్ చేసి వచ్చింది అని చెబుతాడు. నిజమా బావ అంత గుడ్ న్యూస్ ఇంత స్లోగా నా చెప్పేది.

నేను అలిగాను.  ఐ హర్ట్ అంటాడు.  నువ్వు అలిగిన, హర్ట్ అయినా ఇక్కడ ఎవరూ ఏమీ పట్టించుకోరు కానీ నేహా వస్తుంది చూసుకో అంటాడు.

గులాబీ రంగు పట్టు చీర కట్టుకొని ... తల నిండా పూలు పెట్టుకుని తలదించుకునే వస్తున్న నేహా న్ని చూసి ఒక్క క్షణం తన కళ్ళని తన మనసుని నేహా కి రాసి ఇచ్చేస్తాడు.

ఇద్దరినీ పక్కపక్కనే కూర్చోబెట్టి పూజ చేపించి పెద్దవాళ్లు తాంబూలాలు మార్చుకుని ఉంగరాలు మార్చుకోమని ఇద్దరి ముందు పెడతారు. 

నేహా ఎంతసేపైనా తలెత్తదు.  శ్రీకి నేహా ఫేస్ చూడాలి అని ఆరాటం ఎక్కువవుతుంది. ఎలా పిలవాలో అర్థం కాక ఉంగరం పెడుతున్నప్పుడు ఎవరూ చూడకుండా మెల్లిగా అరచేతిలో గోకుతాడు.

ఆ గోకుడికి నేహా కళ్ళు పైకెత్తి చూస్తుంది. ఆ సోయగాల చిన్నదాని చేప కళ్ళలో చిక్కి శ్రీ విలవిల్లాడిపోతూ ఉంటాడు.

నేహా కూడా శ్రీకి ఉంగరం తొడిగి మళ్ళీ కళ్ళను దించేస్తుంది.

తాంబూలాలు అయిపోయిన తర్వాత.. పెళ్లికి కూడా ముహూర్తం పెట్టేస్తారు.  ఒక నెలలో దివ్యమైన ముహూర్తం ఉంది అని చెబుతారు.

ఒక నెల అంటే సరిపోతుంది బావగారు అని శ్రీను గారు మొహమాటంగా అడిగితే.. ఎందుకు సరిపోదండి ఈ రోజుల్లో అన్ని రెడీమేడ్ గా దొరికేస్తున్నాయి.

పెళ్ళికూతురు పెళ్ళికొడుకు రెడీగా ఉంటే చాలు అని వాసుగారు చెబుతారు.  వీళ్ళ మాటలు వింటున్న శ్రీ నెలరోజులు సరిపోతుందా అని అడుగుతున్నారా మామయ్య గారు.

నెల రోజులంటే ఇక్కడ ఎంత కష్టమో మీకు ఏమైనా అర్థమవుతుందా అని మనసులోనే అనుకుంటాడు.  పైకి అంటే అందరూ తనని తుక్కురేగ్గగొడతారు.  ఆ ప్లేస్ లో ముందు వాసు గారే ఉంటారని తెలిసి సైలెంట్ గా చూస్తూ ఉంటాడు.

పాపం మా శ్రీ కష్టాలు ఎవరికీ రాకూడదబ్బా....

కథ కొనసాగుతుంది....
Like Reply
#95

Part - 77


శ్రీ అవస్థ చూసి విక్రమ్ నవ్వుకుంటూ ఉంటాడు.  చెవిలో  మెల్లిగా ఏంట్రా అంత తింగరి చూపులు చూస్తున్నావు అని అడిగితే... బావ అని పట్టుకుంటాడు.

ఒరేయ్ చూసే వాళ్ళకి చండాలంగా ఉంటుంది. ఏమైంది ఇప్పుడు... నీకా బాధ అంటే... చూసావా.. పెళ్లి నెల రోజుల తర్వాత పెట్టారు.

దీని వెనక కుట్ర చేసిందంతా మా నాన్నే అని నాకు చాలా గట్టి నమ్మకం అంటూ వాసు గారి వైపు చూస్తాడు. వాసు గారు కొడుకుని చేసి ఏంట్రా అని కళ్ళు ఎగరేస్తారు.

మళ్ళీ చూడు ఏమీ తెలియనట్టుగా కళ్లు ఎగరేస్తున్నారు అంటే..  ఏడిశావులే ఎదవ. ఆయన కాబట్టి నెల రోజులకు తీసుకువచ్చారు.

అక్కడ మీ మామగారిని చూడు.  వదిలితే ఒక ఆరు నెలలకి పోస్ట్ పోన్ చేసేటట్టు ఉన్నారు అంటే..
అనుమానంగా శ్రీ,  శ్రీను గారి వైపు చూస్తాడు.

ఆయన ఇంకా ఏదో సందిగ్ధంలో ఉండడం చూసి నువ్వు
అన్నది నిజమే.  బాబోయ్...  మా మామగారిని వదిలితే ఎప్పుడో చేసేటట్టు ఉన్నారు.

అలా జరిగినవ్వకూడదు ఏం చేయాలి. నువ్వు మూసుకు కూర్చో.  అక్కడ అంకుల్ మాట్లాడుతున్నారు.  అయినా పెళ్ళికి ముందున్న రోజులు కూడా చాలా బాగుంటాయి రా..

నెలరోజులే కదా ఎంజాయ్ అంటాడు. ఎలా రా.. ఇది కూడా నేనే చెబితే రేపు పెళ్లయ్యాక నిన్ను నేహా ఆడేసుకుంటుంది రా అంటాడు.

అప్పుడు ఏం ఆడుకున్న ఇద్దరం కలిసి ఆడుకుంటాం కానీ... నీకోసం నేహాన్ని 15 రోజులు బెంగళూరులో ఉండేటట్టుగా చేస్తాను.

ఇంతకుమించి నేనేం చెప్పలేను రా అని వెళ్ళిపోతాడు. రాజ్ మాత్రం ఇవీ ఏమి పట్టించుకోకుండా నివి ఎటు వెళుతుంటే అటే కళ్ళని అప్పచెప్పేస్తాడు.

శ్రీ సీరియస్గా ఆలోచిస్తూ రాజ్ వైపు చూస్తాడు. రాజ్ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా... ఎటో చూస్తూ ఉంటే అనుమానం వచ్చి..

రాజ్ పక్కకు వచ్చి ఏరా ఏం చేస్తున్నావు. నా ముందు ఒక అపరంజి బొమ్మ తిరుగుతూ ఉంటే చూస్తున్నాను రా అని మైమరపుగా చెబుతాడు.

ఎవరో అపరంజి బొమ్మ. మాకు చూపిస్తే మేము తరిస్తాం కదా అనగానే....  ఈ లోకంలోకి వచ్చి ఏంట్రా ఏమంటున్నావు ఏమీ తెలియనట్టుగా అడుగుతాడు


నీ ఓవరాక్షన్ ఆపి మేటర్ ఏంటో చెప్పు అంటాడు. నాకే ఇంకా సరిగ్గా తెలియదు. ఇంకా నీకేం చెబుతాను.  పూర్తిగా తెలిశాక ముందు చెప్పేది మీ ఇద్దరికే అంటాడు.

అబ్బో ఈ ఊర్లో ఎవర్రా.. నీ మనసును పరిగెత్తిస్తున్న వాళ్ళు అంటే..  ఎవరో ఒకరు ఉన్నారులే గాని.. నువ్వేంటి అమావాస్య చంద్రుడిలాగా మొహము అలా ఎలాడేసావు.

రాజ్ వైపు తిరిగి ఏరా అసలు నువ్వు ఈ ప్రపంచంలోనే లేవా అంటే...  ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని మేటర్ ఏంటో చెప్పరా బావ.

ఏముంది చెప్పడానికి అక్కడ వాళ్ళిద్దర్నీ చూడు అని తండ్రి మామగారు వైపు చూపిస్తాడు. ఏమైంది వాళ్లిద్దరికి అంటే...  పెళ్లెప్పుడు చేయాలని తెగ డిస్కస్ చేస్తున్నారు.

ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదా అంటే..  అదే తర్జన భర్జన పడుతున్నారు. డాడీ ఏమో నెలకే అంటున్నారు. మా మామగారు ఇంకెప్పుడో అని ఆలోచిస్తున్నారు.

తొందరగా ఏదో ఒకటి తేల్చమని రా..నేను వెళ్ళాలా లేదా ఇక్కడే ఉండి పోవాలా అన్నది చూసుకోవాలి కదా.. లేకపోతే టికెట్స్ వేస్ట్ అవుతాయి అంటాడు.

ఒరేయ్ నా పెళ్లి కన్నా నీకు టికెట్స్ ఇంపార్టెంట్ అంటే అలా కాదురా... ఉండిపోవాల్సి వస్తే ఉండిపోతాను. లేదు అంటే వెళ్ళు వస్తాను అంతే తేడా.

అయినా నాకు ఇక్కడ ఉండడమే ఇష్టం నివిని చూస్తూ అక్కడున్న పూలు పీకుతూ ఉంటాడు. పూల మీదున్న రాజ్ చేతులను తీసి పక్కన పెడుతూ.. మనం ఇంకా ఇక్కడ నుండి వెళ్లలేదు.  నువ్వు ఆ పువ్వులు పీకకు.

ఛీ... నీకు కుళ్ళు రా నన్ను చూసి అంటాడు.  దేనికి అంటే నేను లవ్ లో పడుతున్నానని అంటే...  అబ్బో... యువ్వరం చాలా దూరం వచ్చినట్టే ఉంది.

అంత లేదురా.. ఫస్ట్ స్టెప్ దగ్గరే ఉన్నాను. పిల్ల ఏమో నా వైపు అసలు చూడడం లేదు. ఇంతకీ ఎవరురా అమ్మాయి అంటే...

అప్పుడే చెప్పను అన్నాను కదా... ముందు నేను లైన్లో పెట్టి ఓకే చేయించుకున్నాక. మీ ఇద్దరికే పరిచయం చేస్తాను. ఇంతకీ మాకు తెలిసిన అమ్మాయా లేక కొత్త అమ్మాయా..

ఒక్క నిమిషం ఆలోచించి తెలిసిన అమ్మాయే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.  ఈ ఊర్లో మాకు తెలిసిన అమ్మాయి ఎవరు అబ్బా అని థింక్ చేస్తూ ఉంటాడు.

ఎట్టకేలకు అందరూ నిర్ణయం మీద నెల రోజులకే ముహూర్తం ఫిక్స్ చేస్తారు.  శ్రీ హమ్మయ్య అనుకుంటు నేహా ని చూస్తాడు.

నేహ మాత్రం సైలెంట్ గా ఉంటుంది.  ఏంటి మా మేడం ఇంకా అలాగే ఉన్నారు.  నా మీద కోపమా లేక ఈ పెళ్లి ఇష్టం లేదా... ఎలాగైనా నేహాతో మాట్లాడాలి అని అవినికి సైగ చేస్తాడు.

ఆ సైగ లు చూసి ఏంటన్నయ్య అంటే..  ఒక్కసారి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు.  దగ్గరకు వచ్చి చెప్పు అన్నయ్య అంటే..  నేను ఒకసారి ఎలాగైనా సరే నేహాతో మాట్లాడాలి.

ప్లీజ్ ఏర్పాటు చేయవా అంటే.. అమ్మో ఇక్కడ అంటది. ప్లీజ్ అవని నువ్వు తప్ప నాకు ఇక్కడ ఇంకొక దారి లేదు. ఎందుకో మా మేడం ఫేస్ డల్ గా ఉంది అని చెబుతాడు.

అప్పుడు అవని నేహా ఫేస్ వంక చూస్తుంది. అది నిజంగానే డల్ గా కనిపిస్తుంది. ఒక్క ఐదు నిమిషాలు అని లక్ష్మి గారి దగ్గరికి వెళ్లి ఆంటీ అని పిలుస్తుంది.

చెప్పమ్మా ఏమైనా కావాలా అంటే... అది ఏమీ లేదు  నిశ్చితార్థం అయిపోయింది కదా...  ఒక్క అయిదు నిమిషాలు పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని ఒంటరిగా మాట్లాడుకునేస్తే బాగుంటుందేమో అంటుంది.

అది అని ఇబ్బందిగా చూస్తూ ఉంటే ప్లీజ్ ఆంటీ..  వాళ్లకు కూడా మనస్సు విప్పి మాట్లాడుకోవాలి అని ఉంటుంది కదా...

మీ అంకుల్ ఏమంటారో అని ఇబ్బందిగా చెబుతుంది. నేను అది చూసుకుంటాను అని విక్రమ్ దగ్గరికి వెళుతుంది. ఏవండీ అని పిలుస్తుంది.

అయినా వినిపించుకోన్నట్టుగా కూర్చుంటాడు. మిమ్మల్నే అని దగ్గరికి వెళుతుంది.  నన్నా అనే వేలు తన వైపు పెట్టుకొని చూపిస్తూ అడుగుతాడు.

మిమ్మల్ని కాపోతే ఇంకా ఎవరిని పిలుస్తాను అని అడుగుతుంది.  అంటే...  ఇందాక ఎవరో నాతో మాట్లాడను అన్నారు కదా..అందుకే నన్ను కాదు అనుకున్నానులే...

ఇంతకీ ఎందుకో అని రాగం తీస్తాడు.  ఎంత అలుసైపోయాను మీకు అని పళ్ళు నూరుతూ ఉంటుంది. ఇంత కూడ అలసుఅవ్వలేదులే గాని...

మేటర్ ఏంటి అని అడుగుతాడు.  శ్రీ ఇబ్బంది చెబుతుంది.  దానికి నవ్వుకుంటూ సరే నేను అరేంజ్ చేస్తాను.  వాళ్ళిద్దరికీ రూమ్ సెట్ చేయి అని చెప్పి శ్రీను గారితో మాట్లాడి ఇద్దరినీ ఒక గదిలోకి పంపిస్తారు.

గదిలోకి వెళ్లిన నేహ తలదించుకునే ఉంటుంది.  శ్రీ, నేహా దగ్గరకు వచ్చి నేహా అని గారంగా పిలుస్తాడు.  అయినా తలెత్తదు.

ఏంటి నా పైన కోపమా అని అడుగుతాడు. లేదు అన్నట్టుగా తలపుతుంది.  సిగ్గా అని అడుగుతాడు. కాదు అన్నట్టుగా ఊపుతుంది.

మరి ఇంకేంటి అని అడుగుతాడు. అయినా మౌనంగా ఉంటే.. ఎంతసేపు నిలబడతాం కానీ వచ్చి కూర్చో అని.. పక్కన కూర్చోబెట్టుకుని ఇప్పుడు చెప్పు.

నువ్వు ఏదైనా నోరు తెరిచి చెబితేనే కదా నాకు అర్థం అవుతుంది అని అడుగుతాడు. ఆ మాటకి శ్రీ వైపు చూస్తూ మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది.

ఆ మాటకి గుతుక్కుమంటాడు. అబ్బా ఇప్పుడు ఏం చెప్పాలి అనుకుని.. మీ నాన్నగారు నీతో ఏమీ చెప్పలేదు అన్నావు కదా..  అందుకే నాకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు.

పైగా ఎంగేజ్మెంట్ రోజుని ఇలా చూస్తే నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అయ్యి..  హ్యాపీగా ఫీలవుతావు అనుకున్నాను కానీ ఇలా డల్ గా ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు అని నీరసంగా చెబుతాడు.

నేను డల్ గా ఉంది అందుకు కాదు అంటుంది.  అంటే నన్ను చేసుకోవడం ఇష్టమేనా అని హ్యాపీగా అడుగుతాడు. ఇష్టమే అని తలుపుతుంది.

మరి ఇంకేంటి ప్రాబ్లం అని అడుగుతాడు.  ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ తల దించుకుంటుంది. గెడ్డం కింద వేలు పెట్టి పైకి లేపుతూ.. మీ పేరెంట్స్ గురించా అని అడుగుతాడు.

అవును అన్నట్టుగా తలూపుతుంది..  దానికి ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది.  ఉన్నది మనిద్దరం. మనకు ఉన్నది వాళ్ళ నలుగురు.

పెళ్లయ్యాక నువ్వు జాబ్ చేయడం చేయకపోవడం పూర్తిగా నీ ఇష్టం కాని..  వాళ్ళు బాధ్యత మాత్రం పూర్తిగా నాదే.

నీ శాలరీ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తానన్నా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు.  నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా...  ఈ ఊర్లోనే డాడీ ల్యాండ్ కొంటున్నారు.

అది మొత్తం మీ నాన్నగారు కంట్రోల్లోనే ఉంటుంది అని చెబుతాడు. నిజంగానా అని ఆనందంగా అడుగుతుంది.  నా ప్రాణానికి నేను అబద్ధం చెబుతానా...

ఆ మాటకే నేహ సిగ్గుపడుతుంది.  హమ్మయ్య వచ్చినప్పటి నుంచి ఇప్పటికి నీ ఫేసులో ఒక ఫీలింగ్ చూడగలిగాను.

ఇప్పుడు దాకా చాలా టెన్షన్ వచ్చింది.  ఈ పెళ్లి నీకు ఇష్టమా కాదా అని. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అనుకో.. బట్ నిన్ను వదులుకోవడం అంతకన్నా ఇష్టం లేదు అని చెబుతాడు.

ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ ఈ పెళ్లి కుదురుతుందని మీకు ముందే తెలుసా అని అడుగుతుంది.  దానికి నవ్వుతూ ఎందుకు తెలియదు.

సెట్ చేసిందే మేము అయితే అంటాడు. అంటే..  నిన్ను ఎప్పుడో  ఇష్టపడ్డాను. అవని నువ్వు కలిసి ఉన్నప్పుడే మీ ఇద్దరి బాండింగ్ బాగా నచ్చింది.

అప్పుడు నుంచి నీ మీద ఇష్టం మొదలయింది. ఆ ఇష్టం ప్రేమగా మారి ఇక్కడ వరకు వచ్చింది.

ఇదంతా నాకు తెలియకుండా ఎప్పుడు జరిగింది. ఇది మరీ బాగుంది. నాకు నీ మీద ఇష్టం పెరుగుతూ ఉంటే నీకు ఎలా తెలుస్తుంది.

నీకు నామీద ఇష్టం పెరిగినప్పుడు అది నీకు తెలుస్తుంది. కానీ ఇప్పుడైనా నీకు నామీద ఇష్టం కలిగిందా లేక మీ పెద్దవాళ్లు చూశారని ఒప్పుకుంటున్నావా అని అడుగుతాడు.
[+] 12 users Like SivaSai's post
Like Reply
#96

Part - 78


నేహా సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.  ప్లీజ్ నేనంటే ఇష్టమని చెప్పు అని మనసులో పదే పదే దేవుని తలుచుకుంటూ ఉంటాడు.

నేహా మెల్లిగా నోరు విప్పుతుంది. మీతో నేను ట్రావెల్ చేసినప్పటి నుంచి మీ బిహేవియర్ నచ్చింది అని ఇబ్బందిగా చెబుతుంది.

కానీ ఇది ప్రేమ,  పెళ్లి అలాంటి ఆలోచన కాదు. ఒక వ్యక్తిగా మీరంటే చాలా గౌరవం. మీ ఆలోచనలు బాగున్నాయి. మీరు మీ లైఫ్ పార్టనర్ కి ఇచ్చే  ఇంపార్టెన్స్ కూడా బాగా నచ్చింది.

మీ మాటలను బట్టి నాకు అనిపించేది మీకు వచ్చే అమ్మాయి ఎవరో చాలా అదృష్టవంతురాలు అని అదృష్టవంతురాలు నేనే అవుతానని అనుకోలేదు అని చెబుతోంది.

ఆ మాటలు వినగానే శ్రీ మేఘాలలో తేలిపొమ్మన్నది అని సాంగ్ వేసుకుంటాడు. అంతా చెప్పి నేహా శ్రీ వైపు చూడగానే ఎక్కడో ఊహలోకంలో ఉంటాడు.

ఏంటి ఈయన ఏమి స్పందించడం లేదు. నేను చెప్పింది  అర్థం మయిందా లేదా అనుకొని కళ్ళ ముందు చేతులు ఊపుతూ నేను చెప్పింది వినిపించిందా...

హ.. వినిపించింది థాంక్యూ..  థాంక్యూ.. అని నేహా చేతులు పట్టుకుని ఊపేస్తాడు. డోర్ ఎవరో కొడతా ఉంటే గబగబా నేహా వెళ్లి తలుపు తీస్తుంది.

ఏమైంది అవిని అంటే.. మీరు గదిలోకి వచ్చే చాలాసేపు అయింది. బయట మీ నాన్నగారు కంగారు పడుతున్నారు. వచ్చేస్తున్నామని శ్రీవైపు తిరిగి వెళదామా అంటుంది.

తప్పకుండా బంగారం అని నేహా వెనకాల కాలర్ ఎగరేస్తూ వస్తాడు. శ్రీ ని చూసినా విక్రమ్,  రాజ్ ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకుని పెదవి విరస్తారు.

వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఏంట్రా నా వైపు అలా చూస్తున్నారు అని అడిగితే... నిన్ను చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది రా... చెప్పనా అని రాజ్ అడుగుతాడు.

ఎందుకు ఆలస్యం చెప్పుకో పర్మిషన్ ఇచ్చాను అని వెలిగిపోతున్న ముఖంతో అంటాడు. నిన్ను చూస్తుంటే జాతరలో బలిచ్చే మేకపోతు ని రెడీ చేసినట్టుగా అనిపిస్తుంది అంటాడు.

ఆ మాటకి విక్రమ్ వస్తున్న నువ్వు ఆపుకుంటూఉంటాడు. శ్రీ..  రాజ్ వైపు తిరిగి చండాలంగా అదేం పోలికరా..  ఇంత హ్యాపీగా ఉంటే అంటే...

ఆ మేక కూడా అలాగే అనుకుంటుంది కదరా.. నన్ను ఇంత బాగా రెడీ చేశారు. నాకేమైన ఫంక్షన్ అని. తర్వాత గాని ఆ మేకకు అర్థం కాదు కదా అంటాడు.

అంటే ఏంట్రా నేను బలైపోతున్నానా అని అడుగుతాడు.  నేను అలా అనలేదు కదా.నాకు అది గుర్తొచ్చింది అని చెప్పాను అంతే. నీకు ఎలా కావాలంటే అలా తీసుకో అని విక్రమ్ వైపు తిరిగి కన్ను కొడతాడు.

విక్రమ్ వైపు చూస్తూ ఉంటే చాలా కష్టంగా నవ్వు ఆపుకుంటూ కనిపిస్తాడు..  ఆడికంటే పెళ్లి కాలేదు కాబట్టి ఏదో పిచ్చవాగుడు వాగుతున్నాడు.

నీకు పెళ్లి అయ్యింది కదా నువ్వేమైనా బలి అయ్యావా అంటే.. ఒరేయ్ నేను నీలాగా కాదురా బచ్చా అని బుగ్గ మీద తడతాడు.

ఇందాక నేను ఇదే డైలాగ్ అంటే అబ్బో అన్నారు అని ఉడుక్కుంటూ అంటాడు.  ఇప్పుడు కూడా అదే డైలాగు అంటున్నాము అని ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుని అబ్బో అంటారు.

మీరు ఇద్దరు కలిసి నన్ను బాగానే మోసేస్తున్నారు గాని ఇంకా ఆపండ్రా బాబు అని దండం పెడతాడు. అలారా దారికి అని.. అందరూ అక్కడ నుండి శ్రీను గారి ఫ్యామిలీకి వీడ్కోలు చెప్పి బయలుదేరతారు.

ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్లి పనులు అన్నీ మొదలవుతూ ఉంటాయి. షాపింగ్ కూడా అందరూ సరదాగా చేస్తూ ఉంటారు.

శ్రీ, నేహా ఇద్దరూ బెంగళూరు వెళ్ళిపోతారు. ఆ పదిహేను రోజులు శ్రీ నేహా కి ఇంకా దగ్గరవుతాడు.  ప్రతి ఎమోషన్ ఇద్దరూ షేర్ చేసుకుంటూ తర్వాత లైఫ్ ఎలా స్మూత్ గా వెళ్ళాలి అన్న దాని మీదే ఫోకస్ పెడతారు.

ఆరోజు ఆదివారం అందరూ ఇంట్లోనే ఉంటారు. సత్యవతి గారు ఇందిరాగారికి ఫోన్ చేస్తారు. ఏమిటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అనుకుని చెప్పండి అనగానే..

అందరూ ఇంట్లోనే ఉన్నారా వదినగారు అని అడుగుతుంది.  ఉన్నాము ఏమిటి ఏదైనా ఇంపార్టెంటా.. అంటే కొంచెం ముఖ్యమైన విషయమే.

మేము వస్తున్నాము అని చెప్పి.. ముఖ్యంగా అవని ఇంట్లో ఉండేటట్టుగా చూడండి అని చెబుతారు. సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉంటారు.

అది చూసిన మాధవి ఏమైంది అమ్మ అని అడిగితే.
సత్యవతి గారు ఫోన్ చేశారు.  అందరూ వస్తున్నారంట. అవిని నీ కంపల్సరీగా ఉండమన్నారు. ఏమైవుంటుందా అని ఆలోచిస్తున్నాను అని చెబుతారు.

విక్రమ్ కి ఏమైనా తెలిసేమోనమ్మ అంటే.. ఒకసారి విక్రమ్ ని పిలువు అని చెబుతారు.  విక్రమ్ వచ్చి ఏమైంది నానమ్మ పిలిచావు అని అడిగితే.. జరిగిందంతా చెబుతారు.

ఆ విషయం వింటూ ఆలోచిస్తూ నాకు ఏమీ తెలియదు.  చూద్దాం.. ఎందుకు వస్తున్నారో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.  

సత్యవతి, శేషగిరి గారు, ధనుంజయ్ ముగ్గురు లోపలికి వస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళు శత్రువు అయినా సరే గౌరవించాలి అనే ఉద్దేశంతో లోపలికి రండి అని పిలుస్తారు.

ముగ్గురు వచ్చి కూర్చుని నమస్కారం చేసి ఎలా ఉన్నారు. బాగున్నారా అని అడుగుతారు.  ధనుంజయ్ కళ్ళు మాత్రం అవిని కోసం వెతుకుతూ ఉంటాయి.

అది అర్థమైన విక్రమ్,  నివి ని పిలిచి మీ వదినని పిలువు అని చెబుతాడు. సరే అని నివి గదిలోకి వెళ్లి అన్నయ్య పిలుస్తున్నాడు అని చెబుతోంది.

సరే అని నివి వెనకాలే కిందకి వస్తుంది.  అక్కడ వీళ్ళ ముగ్గురిని చూస్తూ ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది.  విక్రమ్ వారగా అవని నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు.

అవని వచ్చే విక్రమ్ పక్కనే నిలబడి నానమ్మ తాతగారిని పలకరిస్తుంది బాగున్నారా ? బాగున్నాను తల్లి అని చెబుతారు.

ధనుంజయ్ కి ఒక్క నిమిషం బాధగా అనిపించేనా అది కనపడనివ్వకుండా బాగున్నావా అవని అని అడిగితే.. ఊ అని తల ఊపుతుంది.

ఇందిరా గారు అవని తో ఇంటికి వచ్చిన గెస్ట్ లకి ఇంటికోడలే మర్యాద చేయాలి అమ్మ. వెళ్లి జ్యూస్ తీసుకురా అని పంపిస్తారు.

అవని అలాగే అని చెప్పి కిచెన్ లోనికి వెళుతుంది. సర్వెంట్ సాయంతో ముగ్గురికి జ్యూస్ ప్రిపేర్ చేస్తుంది.
జ్యూస్ తీసుకొచ్చి ముగ్గురికి ఇస్తుంది.

అవిని చేతితో ఇచ్చిందని ఆనందంతో జ్యూస్ తీసుకుని తాగుతాడు.  ఎవరు ఏమీ మాట్లాడకుండా ఉండేటప్పటికీ  విక్రమ్ కి విసుగు వచ్చి ఏంటి తాతగారు ఏదైనా ముఖ్య విషయమా అని అడుగుతాడు.

శేషగిరి గారు కొడుకు వైపు చూస్తాడు. ఒక్క నిమిషం ధనుంజయ్ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి లేచి నిలబడి అవిని ముందుకు వచ్చి నుంచుంటాడు.

అవిని ధనుంజయ్ వైపు ఏమిటివి అన్నట్టుగా చూస్తుంది.  విక్రమ్ కి ఎందుకో అనుమానం వచ్చి అవని పక్కకి వచ్చి నిలబడతాడు.

వాటి గురించి తెలుసుకోవడం కోసం అయినా కూతురు మాట్లాడుతుందేమో అని చూసిన ధనుంజయ్ కి నిరాశ ఎదవుతుంది.

ఇంకా తప్పకే ధనుంజయ్ చెబుతాడు.  మనకి సంబంధించిన ఆస్తులు అన్నీ కూడా నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశాను.

ఇకనుండి ఆ కంపెనీ మొత్తం నీ హ్యాండ్ఓవర్ లో లోనే ఉంటుంది అని చెబుతూ పేపర్లు ముందుకి పెడతాడు. ఎందుకు సార్ అని గొంతు తడారి పోతూ ఉంటే అడుగుతుంది.

అది నీ హక్కు కాబట్టి.  పుట్టింటి నుంచి నీకు రావలసినవి అని చెబుతాడు. ఆ మాటకి పేపర్స్ వైపు ధనుంజయ్ వైపు మార్చి మార్చి చూస్తూ గట్టిగా నవ్వుతుంది.

అవని నవ్వుకి అర్థం తెలియక ధనుంజయ్ కూతురు వైపే చూస్తూ ఉంటాడు. కుటుంబ సభ్యులకు కూడా అవని వైపే చూస్తూ ఉంటారు. 

సత్యవతి గారి ముందుకు వచ్చి ఎందుకు అవని అలా నవ్వుతున్నావు. నవ్వక ఏం చేయమంటావు నానమ్మ. పుట్టిల్లు అంట.  అసలు నాకు పుట్టిల్లు ఎక్కడ ఉంది.

అమ్మ అవని అని బాధగా అంటే... నిజమే కదా నానమ్మ. నేను ఆ ఇంట్లో పని చేశాను కాబట్టి నాకు షెల్టర్ ఇచ్చారు. అంతకుమించి ఏ విషయంలో నాకు పుట్టిల్లుగా నిలబడింది.

నా కష్టంలో అండగా ఉందా.. పోనీ నన్ను ముద్దు చేసిందా.. నా విజయంలో పాలుపంచుకుందా..  అవేమీ కాకుండా పైగా నన్ను ఒక నరకంలో తోయడానికి చూశారు. అది పుట్టిల్లు అవుతుందా అని అడుగుతుంది.

అవన్నీ మీ నాన్నకి తెలియకుండా జరిగిపోయినయి అని చెబుతూ ఉంటే చెయ్యి పెట్టి చూపిస్తూ ఇంకా ఆపండి అంటుంది.

మీరు చెప్పే కథలు వినే ఓపిక నాకు లేదు. అసలు నాకు తండ్రి అంటూ ఉంటేనే కదా.. ఏ రోజైతే నా తల్లి దూరమైందో ఆ రోజే ఆ బంధం కూడా పోయింది.

ఏ కన్నతండ్రి కూడా సార్ అని పిలవమని చెప్పరు. అలా చెప్పిన రోజునే ఆ బంధం విలువ పోయినట్టే. ఇంకా ఇప్పుడు కొత్తగా పుట్టిల్లు అని మాట్లాడుతుంటే నవ్వురాక ఏమి వస్తుంది.

అవని అలా అడుగుతూ ఉంటే... సత్యవతి గారికి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంటారు.  ఎమోషనల్ అవుతుంది అని అర్థమై...విక్రమ్ భుజం చుట్టూ చేయవేసి దగ్గరికి లాక్కుంటాడు.

నేను బాగానే ఉన్నాను అండి అని చెప్పి ప్లీజ్ సార్ ఇప్పుడు లేనిపోని కొత్త బంధాలు కల్పించుకొని అనవసరంగా మీ  ఆవిడ, కూతురికి నా మీద ఇంకా కోపాన్ని పెంచకండి. దయచేసి తీసుకుని వెళ్ళండి అని చెబుతుంది.

ధనుంజయ్ పూడుకుపోయిన గొంతుతో ఒక్కసారి నేను చెప్పేది విను అవని.  నాకు వినే ఇంట్రెస్ట్ లేదు అని చెబుతుంది.

విక్రమ్ ధనుంజయ్ వైపు ఒక్కసారి చూసి..  ఒకసారి ఆయన చెప్పేది విను.  పక్కన నేను ఉన్నాను కదా అని చెప్పి.. అక్కడ సోఫాలో కూర్చోబెట్టి... అవిని పక్కనే కూర్చుంటాడు.

ధనుంజయ్ ను కూడా...మీరు కూర్చోండి అని చెప్పి మంచినీళ్లు తెప్పించి అవిని చేత తాగిస్తాడు.

ఇప్పుడు చెప్పండి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అని విక్రమ్ అడుగుతాడు.

ధనుంజయ్ ఏమని చెబుతాడు...

కథ కొనసాగుతుంది...
[+] 15 users Like SivaSai's post
Like Reply
#97

Part - 79


అవిని ముందే కింద మోకాళ్ళ మీద కూర్చుని చెయ్యి పట్టుకోబోతాడు.  వెంటనే చేతులు వెనక్కి తీసుకుంటుంది.

ధనుంజయ్ కూడా ఆ ప్రయత్నం ఆపేసి నేను చెప్పేది పూర్తిగా విను అవని అని. నీ విషయంలో జరిగింది ఏది కూడా నాకు తెలియదు.

నా కళ్ళకి నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాం అనే గుడ్డని కప్పి మాయ చేసారు. అదే నిజమని నమ్మి నిన్ను సరైన దారిలో పెడుతున్నారు అనుకున్నాను కానీ.. నువ్వు నాకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి వస్తుందని అనుకోలేదు.

నా కూతురు భవిష్యత్తు గొప్పగా ఉండాలి అని కలలు కన్నాను. అందుకే నా దగ్గర పెంకిగా ఉన్న పెళ్లయ్యాకైనా వీళ్ళందర్నీ చూసి బాగుంటావని...

ముందు విక్రమ్ సంబంధం నీకోసమే తెచ్చాను కానీ అందరి ముందు నువ్వు వద్దు అని చెప్పావు అనగానే.. చురుగ్గా చూస్తుంది. అదే చెప్పేలాగా చేశారు.

చాలా రోజులు బాధపడ్డాను.  ఎందుకు అవిని ఇలా ప్రవర్తిస్తుందా అని. నేను చేసిన తప్పు నీ దగ్గర కూర్చుని నీతో మనస్పూర్తిగా మాట్లాడకపోవడం.

పెళ్లిరోజున కూడా నీకోసం మొత్తం వెతికాను. ఎక్కడా కనపడలేదు అడిగితే..  అలిగింది రాను అని కరాఖండిగా చెప్పేసింది అని చెప్పారు.

ఇలాగైనా రెడీ అయి నలుగురిలోకి వస్తే నీకు నచ్చిన వాడు కనిపిస్తాడు కదా అని ఆలోచించాను. కానీ అది కూడా నీవల్ల జరగలేదు అన్న కోపం బాగా అన్నీ వచ్చాయి.

తర్వాత పెళ్లి పనుల్లోపడి నీ గురించి ఆలోచించలేదు. అది నిజంగా ముమ్మాటికీ నా తప్పే. నువ్వు ప్రేమించిన వాడితో వెళ్ళిపోయావు అని చెప్పినప్పుడు నిజంగా నాకు నమ్మాలని అనిపించలేదు.

అవని ఎప్పటికీ అలాగా చెయ్యొదు.  అప్పుడే పెళ్లి చేసుకోను అని నాతో ధైర్యంగా మాట్లాడింది. ఎందుకు ఈ విషయంలో ఇలాగా చేస్తోంది అని ఆలోచించాను.

కానీ అక్కడ ఉదయ్ దెబ్బలతో కనపడి.. సర్వెంట్స్ కూడా నిజమే అన్నట్టుగా మాట్లాడితే నమ్మక తప్పలేదు అని కూతురు వైపు చూస్తాడు.

అవని కన్నీళ్ళతో చూస్తూ ఉంటే ఇబ్బందిగా తలదించుకుంటాడు. ఆ నిమిషం నిజంగానే కృంగిపోయాను.

మీ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ ప్రేమకి ప్రతిరూపమైన నువ్వు నాకు దూరంగా వెళ్లిపోయినట్టుగా అనిపించింది.

నానమ్మ తాతయ్య కూడా ఇంకెక్కడు ఉండలేము అని ఊరు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తరువాత ఎందుకో ఒకరోజు భార్గవి..

అత్తయ్య మావయ్య గారిని తీసుకుని రండి.  పెద్ద వాళ్లు ఇంట్లో లేకపోతే బాగోలేదు అని బ్రతిమాలితే నిజంగానే.. నువ్వు లేక అమ్మానాన్న లేక ఇల్లంతా ఏదో వెలితిగానే అనిపించింది.

ఇంకా నేనే ఆగలేక అమ్మ వాళ్ళని తీసుకొద్దామని వెళ్లాను. అవని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మనస్ఫూర్తిగా మాట్లాడు అని అంటే...

అవని గురించి తెలుసుకోవలసింది ఏముంది అని అనుకున్నాను.  కానీ ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటే నా కూతురు తన ఇంట్లోనే ఒక పరాయిదాన్నిలాగా బ్రతికింది అని అర్థం అవ్వగానే... నా గుండెని ఎవరో గుణపంతో పొడిచిన అంత బాధ వచ్చింది.

ప్రతిరోజు మీ అమ్మ నన్ను కన్నీళ్ళతో అడుగుతున్నట్టుగానే అనిపించింది. అవనికి అన్యాయం చేస్తారా...

నీ గురించి అన్ని నిజాలు తెలిసిన తర్వాత. మీ అమ్మ చావుకి కారణమైన వాళ్ళని ఇన్నాళ్లు నెత్తిన పెట్టుకున్నాను అని అర్థం అయిన తర్వాత నేను బ్రతికున్న అనవసరం అనిపించింది అని చెప్పి అవిని వైపు చూస్తాడు.

అయినా అవనిలో ఎటువంటి స్పందన ఉండదు . ధనుంజయ్ వైపు అలాగే చూస్తుంది.  కూతురులో ఎటువంటి స్పందన లేకుంటే చాలా బాధగా అనిపిస్తుంది.

తన చేసిన పనులు వల్లే నమ్మడం లేదు అని కూడా అర్థం అవుతుంది. మన జీవితాలుతో ఆడుకున్న వాళ్ళని జైల్లో పెట్టించాను.

ఈ ఆస్తికి అసలైన హక్కుదారువి నువ్వే. అందుకే మొత్తం ప్రాపర్టీస్ అన్నీ నీ పేరు మీదకి మార్చి.. కంపెనీ కూడా నీకు హ్యాండ్ఓవర్ చేసి  నానమ్మ తాతయ్యని తీసుకుని ఊరు వెళ్లిపోతున్నారు అని చెబుతాడు.

అందరికీ అది విని చాలా బాధగా అనిపిస్తుంది.  విక్రమ్ మాత్రం అవిని నే చూస్తూ ఉంటాడు. అవనిలో ఎటువంటి స్పందన ఉండదు.

ధనుంజయ్ మొత్తం చెప్పే తీసుకో అవని..  పేపర్స్ అని ముందుకు పెడతాడు.  అయినా సరే అవని కదలదు.. సత్యవతి గారు ముందుకు వచ్చి మీ నాన్న అంతలా చెబుతున్న మాట్లాడవేంటి.

ఆవిడ వైపు చూసి కథ బాగుంది అందుకే వింటున్నాను అంటుంది. ఒక్క నిమిషం ధనుంజయ్ ఏమి విన్నాడో అర్థం కాకుండా ఉంటుంది. కథ ఏమిటి అవిని. నేను నిజమే చెబుతున్నాను అని తడబడుతూ అంటాడు.

ఏది నిజం సార్...  ఇంట్లోనే ఉన్నారంట...కానీ ఏం జరుగుతుందో తెలియదంట.. నాతో కూర్చుని మాట్లాడడానికి అసలు టైమే లేదంట...

అసలు విషయం ఏంటో నేను చెప్పనా అనగానే.. అందరూ అవని ఏం చెబుతుందా అని చూస్తారు.  విక్రమ్ మాత్రం అవని మనస్థితిని అంచనా వేస్తూ ఉంటాడు.

ఈయన గారి భార్య కూతురు జైల్లో ఉన్నారు. చేసిన తప్పులకి నా భర్త జైల్లో పెట్టించాడు కానీ అది కూడా ఈయనగారి అకౌంట్ లో వేసుకున్నారు.

వాళ్ళిద్దరూ జైల్లో ఉండడం వల్ల కంపెనీ రేపిటేషన్ ఏదో దెబ్బతిని ఉంటుంది లేదా షేర్స్ అన్ని పడిపోయి ఉండాలి.
వాటిని మళ్లీ నిలబెట్టుకొని భార్యని,కూతురిని జైలు నుంచి విడిపించుకోవడానికి నా భర్త అండ కావాలి.

దానికి  సాకు ఇది అంతా... కంపెనీ నాకు అప్పచెపితే అది నా భర్త ఎలాగు హ్యాండిల్ చేస్తారు కాబట్టి.. మళ్లీ పూర్వ వైభవం వస్తుంది.

తర్వాత మెల్లిగా నన్ను తప్పించి ఆయన కూతురిని అందలం ఎక్కించాలి అని తాపత్రయపడుతున్నారు. అంతే కదా సార్ అని అడుగుతుంది.

అవని చెప్పిన విధానానికి అందరూ షాక్ తో బిగుసుకుపోతారు. సత్యవతి గారి ఇంకా తట్టుకోలేక ఏం మాట్లాడుతున్నావ్ అవని నీకైనా అర్థమవుతుందా...

నాకు బాగానే అర్థం అవుతుంది నానమ్మ. మీరు ఆయన ట్రాప్ లో పడొచ్చు గానీ... నేను పడను.  ఎందుకంటే అనుభవించింది నేను కాబట్టి..

భార్యాభర్తలు ఎలాంటి వాళ్ళో నాకు పూర్తిగా తెలుసు . మీ కొడుకు పైన మీకు నమ్మకం ఉంది అది పూర్తిగా మీ వ్యక్తిగతం కానీ నన్ను నమ్మమని మాత్రం అడగద్దు అంటుంది.

అవని అలా చెబుతూ ఉంటే ధనుంజయ్ తట్టుకోలేక పోతాడు.  మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ నేను నిజమే చెబుతున్నాను. నన్ను నమ్ము అనే అడుగుతాడు.

అవని నమ్మే పరిస్థితుల్లో కాదు కదా... అసలు ధనుంజయ్ వైపు చూడడానికి కూడా ఇష్టపడదు. ఎంత చెప్పినా కూతురు నమ్మడం లేదు అని...

ఆ పేపర్స్ అక్కడ టేబుల్ మీద పెట్టి ఈ ఆస్తి పూర్తి హక్కుదారులువి నువ్వే.  ఈ కంపెనీని ఏమి చేస్తావో అన్నది పూర్తిగా నీ ఇష్టం.

నువ్వు హ్యాండిల్ చేస్తే కంపెనీలో ఉన్న ఉద్యోగస్తులు రోడ్డున పడకుండా ఉంటారు.  లేదు అంటావా పూర్తిగా నీ ఇష్టం అని చెప్పి వెనక్కి తిరుగుతాడు.

వెళుతూ ఒక విషయం అవని.. నీ విషయంలో నేను సరిదిద్దుకోలేను తప్పే చేశాను. నువ్వు నన్ను నమ్మవని కూడా తెలుసు కానీ...

ఎప్పటికైనా నా కూతురు నన్ను నమ్ముతుంది. నాన్న అని ప్రేమగా పిలుస్తుంది అని మాత్రం ఎదురు చూస్తూ ఉంటాను.

రెండు అడుగులు వేయగానే ఆగండి అన్న పిలుపు వినబడుతుంది. ఆ గొంతు వినిపించిన వైపు తిరగగానే విక్రమ్ నిలబడి రెండు చేతులను ప్యాంటు పాకెట్లో పెట్టుకుని చూస్తూ ఉంటాడు.

చెప్పండి అల్లుడుగారు అనగానే...  కాల్ మీ విక్రమ్. ఆ పేపర్స్ చేతిలోకి తీసుకొని మీరు ఈ పేపర్స్ ద్వారా ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మిస్టర్ ధనుంజయ్ అని అడుగుతాడు.

నాకున్నది ఒకే వారసురాలు. అది అవని అని చెప్పడానికి అని సూటిగా బదులుచెబుతాడు. మీరు ఇలా చేస్తే మీ భార్య ఇంకో కూతురు వల్ల ప్రాబ్లం వస్తుంది కదా...

వాళ్లకి, ఆస్తికి ఎటువంటి సంబంధం లేదు.అన్ని విధాలుగా  డాక్యుమెంట్స్ చేపించాను.  ఎట్టి పరిస్థితుల్లోనూ అవనినీ వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి కూడా అవకాశం లేదు అని చెబుతాడు.

అయితే ఈ పేపర్స్లో ఒక చిన్న మార్పు చేయండి అని చెబుతాడు. చెప్పండి ఏం చేయమన్నా చేస్తాను అవని ఒప్పుకుంటే చాలు అంటాడు.

హ్మ్.. అని అందరి వైపు చూస్తాడు. అవిని ఫేసులో అసహనం కనిపిస్తూ ఉన్న మౌనంగా ఉంటుంది. అది విక్రమ్ కి ఇచ్చే విలువ అని అందరికీ తెలుసు.

విక్రమ్ అవినినీ చూస్తూ నేను ఏ నిర్ణయం తీసుకున్న నీకు సమ్మతమేనా అని అడుగుతాడు. మీరు ఏది తీసుకున్నా అది మన మంచికే అని నాకు తెలుసు.

మీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని చెబుతుంది. ఆ మాటలకు విక్రమ్ కి గర్వంతో కూడిన నువ్వు వస్తుంది. తన భార్యకి తన పైన ఉన్న నమ్మకానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది.

ధనుంజయ్ వైపు తిరిగి మీరు కంపెనీ యానివర్స్ డే కి ఫంక్షన్ ఏర్పాటు చేసి ఈ ఆస్తికి, కంపెనీకి అన్నింటికీ సర్వహక్కుదారురాలు అవని అని అనౌన్స్ చేయండి.

అలాగే కంపెనీలో వచ్చే ప్రాఫిట్ మొత్తం లో నుంచి 50% తల్లిదండ్రులు ఆదరణ కోల్పోయి స్వశక్తితో ఎదుగుతున్న పిల్లలకు సపోర్ట్ చేసే విధంగాను,శరణాలయాలకి వెళ్లే విధంగా ప్రిపేర్ చేయించండి.

అలాగే మిగిలిన ప్రాఫిట్ కంపెనీలో ఎప్పటినుంచో జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ల జీతాలు పరంగా షేర్స్ అందేటట్టుగా అరేంజ్ చేయండి.

సింగిల్ మదర్స్ ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలకు సపోర్టుగా వెళ్లేటట్టుగా చూడండి. నామమాత్రంగానే అవని అక్కడ సీఈవోగా తన బాధ్యతలు తీసుకుంటుంది.

ఆ కంపెనీ నుంచి ఒక్క రూపాయి కూడా అవని జీతం గా తీసుకోదు. ఇదంతా మీకు సమ్మతమైతే ఆ పేపర్స్ ని ఆ విధంగా చేయించి అందరి ముందు ఆరోజు అవనికి అందజేయండి అని చెప్పి అవిని వైపు చూస్తాడు.

అవని సమ్మతమే అని కన్నీళ్ళతో విక్రమ్ వైపు చూస్తుంది.
విక్రమ్ చిన్న నవ్వు నవ్వి ధనుంజయ్ వైపు తిరిగి ఆ రోజు జరిగే ప్రతి విషయం కూడా మీ భార్య,కూతురికి తెలిసేటట్టుగా అరేంజ్ చేయండి.  ఇక్కడ జరిగేది ప్రతిదీ వాళ్ళు చూడాలి అని చెబుతాడు.

ధనుంజయ్ సంతోషంగా తప్పకుండా అని చెప్పి అందరికీ నమస్కారం చేసి తల్లిదండ్రులు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
[+] 15 users Like SivaSai's post
Like Reply
#98

Part - 80


అవని ఎవరితోను మాట్లాడకుండా గదిలోనికి వెళ్ళిపోతుంది.  అక్కడ బాల్కనీలో నిలబడి బయటికి చూస్తూ ఉంటుంది.

విక్రమ్ నేను చూసుకుంటాను అని చెప్పి  గదిలోకి వచ్చి అవనినీ వెతుకుతూ ఉంటాడు.  బాల్కనీలో నిలబడిన భార్య దగ్గరకి వెళ్లి వెనక నుండి నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని ఎంటి భార్యమణి ఆలోచిస్తున్నావు.

ఆలోచనలేవో నాకు చెబితే నేను షేర్ చేసుకుంటాను కదా అంటాడు. అయినా మౌనంగానే ఉంటుంది. తన వైపుకు తిప్పుకొని నీ పర్మిషన్ లేకుండా  నీ సమాధానం  కూడ నేనే చెప్పాను అని అలక.

వెంటనే అవని విక్రమ్ నోటి మీద చేయి వేసి ఏం మాట్లాడుతున్నారు మీరు. మీరు చెబితే ఒకటి. నేను చెబితే ఒకటా అని అడుగుతుంది.

మరి ఎందుకు ఈ మౌనం. విక్రమ్ గుండెల పైన తలవాల్చి అదే తెలియడం లేదు. నాకెందుకో ఇది నచ్చడం లేదు. ఆ సార్ ఎందుకు నా జీవితంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు.

నేను సంతోషంగా  ఉన్నాను అని ఆ జంటకి అర్థం అయినట్టు ఉంది. దాన్ని ఎలా చెడగొడదామా అని ప్లాన్లు వేస్తున్నట్టు ఉన్నారు.

అవని పడిన బాధలకి ధనుంజయ్ ఏమి చేసినా తప్పుగానే ఆలోచిస్తుందని అర్థమయ్యి ఇలా రా అని అక్కడ ఉన్న ఉయ్యాలో కూర్చోబెట్టి...

పక్కన కూర్చుని  అతను నీ జీవితంలోకి రావడం నీకు ఇష్టమేనా... అని అడుగుతాడు. అసలు ఇష్టం లేదు అని చెబుతుంది.

నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అవని అంటాడు. చెప్పండి అన్నట్టుగా చూస్తే...  ధనుంజయ్ వాళ్ళ ఆవిడకి విడాకులు ఇచ్చేసాడు.

తనతో గాని తనకు సంబంధించిన ఎటువంటి వ్యవహారంతో గాని సంబంధం లేదు అని పక్క డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేపించి ఆ తల్లి కూతురు ఇద్దరు దగ్గర సంతకాలు తీసుకున్నాడు.

ఆ మాటలు నిజమని మీరు నమ్ముతున్నారా అని అడుగుతుంది. నువ్వెందుకు నమ్మడం లేదు.  అవని మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.

ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు ముగ్గురిని పూర్తిగా చదివాను కాబట్టి. వాళ్లకి ఏదో అవసరం ఉంది ఈ డ్రామా ఆడుతున్నారు అంతే అంటుంది.

ఇంకా ఈ విషయం పొడుగించడం మంచిది కాదు అని విక్రమ్ టాపిక్ కట్ చేస్తూ.... ఇంతకి మీ షాపింగ్ అయిపోయిందా అని అడుగుతాడు.

హ..  అని కొంచెం ముభావంగానే చెబుతుంది. ఓయ్ నేనేమి అడుగుతున్నాను నువ్వేం సమాధానం చెబుతున్నావు.

షాపింగ్ ఎంతవరకు అయింది.  మేడంగారి సారీస్ డిజైన్స్, బోటిక్ పనులు ఉంటాయి కదా... అవి అన్ని అయిపోయినాయా ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా అని అడుగుతాడు.

దానికి అవని నవ్వుతూ అమ్మ,  అత్తయ్య గారు అసలు ఊరుకోవడం లేదు.  నా దగ్గర చాలా చీరలు ఉన్నాయి అని చెప్పినా సరే... పెళ్లి కదా ఉండాలి అని చెప్పి మళ్ళీ మొత్తం డిజైన్ చేపిస్తున్నారు.

ఏం చేసుకుంటాను అన్ని చీరలుని. అక్కడ పెళ్లి జరుగుతుంది బయట వాళ్ళకి కాదు.  మీ అన్నయ్య కం నా బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతాడు.

అలాగే నీ బెస్ట్ సీనియర్ అయినా నేహా కి. అవును అనుకో కానీ ఒక్కసారి ఇన్ని చీరలు అంటే..  నాకే కన్ఫ్యూషన్ గా ఉంది.

ఎప్పుడు ఏం కట్టుకోవాలా అని. నువ్వు ఆ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు.  గైడ్ చేయడానికి నేనున్నాను కదా అంటాడు.

మీకు ఇవి కూడా తెలుసా అంటే.. నా భార్య కోసం నేను అన్ని తెలుసుకున్నాను.  నీ సారి మీదకి మ్యాచింగ్ జువెలరీ దగ్గర నుంచి అన్ని సెట్ చేసే బాధ్యత నాది సరేనా అంటాడు.

ఆ మాటలకి నవ్వుతూ సరే అని విక్రమ్ ని హగ్ చేసుకుంటుంది.  అవని పూర్తిగా డైవర్ట్ అయిందని అర్థం అయ్యాక కాసేపు పిచ్చపాటి మాట్లాడి కిందకి తీసుకు వస్తాడు.

అవనినీ చూసి అందరూ హమ్మయ్య అనుకుంటారు. విక్రమ్ నివిని చూసి నీ షాపింగ్ ఎంతవరకు అయ్యింది. ఆల్మోస్ట్ అయిపోయిందన్నయ్య.

చిన్న చిన్న పనులు ఉన్నాయి. చిన్న అన్నయిని  తీసుకెళ్లమంటే బెట్టు చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇస్తుంది.

దానికి వినయ్ అమ్మో నా వల్ల కాదు. ఆడవాళ్లు షాపింగ్ అంటే ఎంత కష్టమో తెలుసా అన్నయ్య.  చున్ని మ్యాచింగ్ కోసం కూడా ఎన్ని షాపులు తిప్పుతారో.

కలర్ కూడా కొంచెం తేడా రాకూడదు.  డిజైన్ లో చిన్న మార్పు రాకూడదు.   మనం ఎంత కాంప్రమైజ్ అయిపోతాము.

వీళ్ళు చిన్న దాంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వరు. ఈ లేడీస్ ని దృష్టిలో పెట్టుకొని ఆ డిజైనర్స్ ఎన్ని డిజైన్స్ అని చేయగలుగుతారు.  నాకైతే తలపోటు వచ్చేస్తుంది.

నాకైతే ఒక డౌట్ అన్నయ్య అంటాడు. ఏంట్రా అంటే.. ఈ లేడీస్ అందరూ ఉన్న బట్టలతో అడ్జస్ట్ అయ్యి షాపింగ్ మానేస్తే...

మొత్తం షాపింగ్ మాల్స్ అన్ని క్లోజ్ అయిపోతాయేమో. డిజైనర్స్ కి అందరికీ వర్క్ లేకుండా అయిపోతుందేమో కదా అనగానే...

లేడీస్ అందరూ ఒక్కసారి హేయ్.. అంటారు.  చూసావా అన్నయ్య నేను ఒక్క మాటంటేనే ఎలా పడిపోతున్నారో.. ఒక్కసారి వీళ్ళ షెల్ఫ్ లన్ని ఓపెన్ చేసి చూడాలి.

నాకు తెలిసి కట్టనివే చాలా ఉంటాయి అంతేనా నివి. ఇప్పుడు నీకు అవన్నీ అవసరమా అని లలితగారు కోప్పడతారు.

ఇప్పుడు నేను ఏమన్నాను అమ్మ... నేనైతే తీసుకువెళ్లను. నావల్ల కాదు అని చేతులు ఎత్తేస్తాడు.  బావా నువ్వు తీసుకువెళ్లవా అని అడిగితే..

నాకు ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉంది నివి అని ఎస్కేప్ అవ్వడానికి చూస్తాడు.  మరి ఇప్పుడు ఎలా అని విక్రమ్ వైపు చూస్తుంది.

నివి చూపులు అర్థం అయ్యి నేను ఎవరో ఒకరిని సెట్ చేస్తాను అని చెబుతాడు. ఎవరన్నయ్య బకరా అనగానే..  ఎవరో ఒక్కడిలే అని మెసేజ్ చేస్తూ ఉంటాడు.

ఆ మెసేజ్ వెళ్లిన  పది నిమిషాలకి హాయ్ అన్న వాయిస్ వినపడుతుంది.  ఎవరా అని చూస్తే అక్కడ రాజ్ ఉంటాడు.

భరత్, వినయ్ ఒకరి ముఖాల్లు ఒకరు చూసుకుని బకరా వీడేనా ఇప్పుడు అనుకుంటారు. రాజ్ విక్రమ్ దగ్గరకు వచ్చి ఏంట్రా అర్జెంటు పని ఉంది రమ్మని మెసేజ్ చేసావు అని అడుగుతాడు.  కానీ చూపులు మొత్తం నివి పైన పెడతాడు.

నువ్వు ఫ్రీ గానే ఉన్నావా అంటే.. అబ్బో లేదు బావ.  చాలా హెవీ వర్క్ ఉంది అని చెబుతాడు.  అవునా...  నువ్వు ఖాళీగా ఉంటే నివికి షాపింగ్ పని ఉందంట.

నిన్ను తోడిచ్చి పంపిద్దామని మెసేజ్ చేశాను.  సరేలే ఇంకో అరేంజ్మెంట్ ఏదైనా చేస్తాను అని అంటాడు.  విక్రమ్ కౌంట్ చేస్తూ ఉంటాడు. 

వన్, టూ, అని ఈ లోపు రాజ్... బావ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? నివి కన్నా ఏది ఎక్కువ కాదు. మన ఇంటి అమ్మాయిని ఎవరితో పడితేవాళ్లతో ఎలా పంపిస్తాము.

నివి కోసం పనులన్నీ పక్కన పెట్టుకొని నేను తీసుకువెళ్తాను కదా అని ఆవేశంగా అంటాడు.  విక్రమ్ వస్తున్న నవ్విన ఆపుకుంటూ ఉంటాడు.


లలిత మాధవి కొడుకులు వైపు తిరిగి చూడండి అన్నట్టుగా చూస్తారు.  వినయ్ కి, భరత్ కి ఎక్కడో కొడుతూ ఉంటుంది.

వీడేంటి ఇంత ఆవేశపడుతున్నాడు. ఏదో తేడాగా ఉంది అనుకుంటూ... నివి మాత్రం చాలా థాంక్స్ రాజ్ అంటుంది..

అయ్యో నివి మనలో మనకు థాంక్స్ ఎందుకు.  ఎప్పుడు బయలుదేరుదాము. ఫైవ్ మినిట్స్...  ఫ్రెష్ అయ్యి వస్తాను అని గబగబా రూంలోనికి వెళుతుంది.

రాజ్ మాత్రం తెగ మెలికలు తిరుగుతూ ఉంటాడు. ఎవరు చూపులో తనకి తగులుతున్నట్టుగా అనిపించి తల పైకి ఎత్తి చూస్తాడు..

అక్కడ భరత్, వినయ్ తననే సీరియస్గా చూస్తూ ఉంటే...  ఏంట్రా మీరిద్దరూ అలా చూస్తున్నారు.  చూపులతోనే నన్ను భస్మం చేస్తారా ఏంటి.

నిన్ను చూస్తుంటే మాకు ఏదో డౌట్ కొడుతుంది. అది ఏమిటా అని చూస్తున్నాము అంతే అంటారు. ఏ డౌటు...  డౌటు లేదు.  ఏమీ లేదు.

మీ ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి.  ఆఫీస్ కి వెళ్ళారా...  వర్క్ ఏదో ఉంది అన్నారుగా పొండి.ఇంట్లో ఆడపిల్లల్ని వదిలేసి ఆఫీస్ అని కంగారు పడుతున్నారు గా వెళ్ళండి..  వెళ్ళండి అని కసురుకున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు.

రాజ్ మాటలకే లలిత గారు పొంగిపోయి.. మా బాబే... ఆడపిల్ల విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నావు. నువ్వు అమెరికాలో ఉంటున్న సరే...  విక్రమ్ లాగానే ఆలోచిస్తున్నావు.

ఎంతైనా మీరందరూ మంచి ఫ్రెండ్స్ కదా అంటే... మన అనుకున్న వాళ్లు విషయంలో ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి కదా అని లలిత గారికి కూడా సోప్ వేస్తూ  ఉంటాడు.

విక్రమ్ మాత్రం అబ్బో వీడి దగ్గర చాలా కళలే ఉన్నాయే...
భరత్, వినయ్ మెల్లిగా విక్రమ్ పక్కకు చేరి...  బావ వీడేంటి తెగ బిల్డప్ ఇస్తున్నాడు.

అత్తయ్య దగ్గర కూడా మార్కులు కొట్టేయాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. ఏంటి కథ అని భరత్ అడుగుతాడు.

ఆ మాటకి నవ్వుతూ ఏమీ లేదు వాడు నివికి లైన్ వేస్తున్నాడు అని కూల్ గా చెబుతాడు.  నీకు ఈ విషయం ముందే తెలుసా...

మన శ్రీ ఎంగేజ్మెంట్ అప్పటినుంచి ట్రైల్స్ లో ఉన్నాడు.  కానీ మన నివికి అది అర్థం కాలేదు అంతే అంటాడు.

అమ్మ ని ఎంత పని చేస్తున్నాడో...  వీడు నివిని లైన్లో పెట్టడానికి అని.. అమ్మతో మనల్ని తిట్టిస్తున్నాడా అని వినయ్ కోపంగా చూస్తాడు.

వీళ్ళ ముగ్గురు గుసగుసలు అర్థం కాక ఏంటి అన్నట్టు కళ్లు ఎగరేస్తాడు.  అబ్బే ఏమీ లేదు. నిన్ను ఏమని పిలవాలా అని ఆలోచిస్తున్నానని వినయ్ అంటాడు.

కొత్తగా పిలవడానికి ఏముంది..  ఎప్పుడు పిలిచినట్టే రాజ్ అను.  రాజ్ అంటే చాలా...  ఇంకేమైనా తోకలు ఆడ్ చేయాలా అంటే.. ప్రస్తుతానికైతే చాల్లే.

వీళ్ళు పిలుపులు మాటలు ఏంటి చాలా తేడాగా ఉన్నాయి అనుకొని నివి కోసం చూస్తూ ఉంటాడు. నివి రెడీ అయి వచ్చి వెళదామా అని అడుగుతుంది..  అలా చూస్తూ ఉండిపోతాడు.

రాజ్ బాబు అక్కడ మీ బావలు నిన్నే చూస్తున్నారు జాగ్రత్త ...???

కథ కొనసాగుతుంది....
Like Reply
#99

Part - 81


నివి ని చూస్తూ ఉన్న రాజ్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు. తను ప్రపంచం మొత్తం స్తంభించిపోయిందా..  మేమిద్దరమే ఇక్కడ ఉన్నాము అన్న ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.

ఎంతసేపు అయినా రాజ్ లో  కదలికఉండదు.  నివి రాజ్ని ఒకసారి చూసి వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది.

షాపింగ్ అయ్యేటప్పటికి ఏ టైం అవుతుందో అన్నీ చెబుతూ ఉంటుంది.  అయినా రాజ్ లో ఎటువంటి స్పందన ఉండదు.

ఏంటి రాజ్ ఏమి పిలవడం లేదు అని ఒకసారి విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ అది అర్థం చేసుకుని దగ్గరికెళ్ళి రాజ్ వీపు మీద ఒకటి చరుస్తాడు.

ఏమైంది అంటూ చుట్టూ చూసి.. ఎందుకు కొట్టావు బావ అంటే... ఎందుకు కొట్టానో నీకు అర్థం కాలేదా.. ఏం చూస్తున్నావ్ నువ్వు ఇక్కడ అంటాడు.

అప్పుడు తేరుకొని అందరూ నన్నే చూస్తున్నారా అనుకుని...  అంటే ఇంటీరియర్ బాగుందని చూస్తున్నాను బావ.

ఓ...  ఇదే కదా నువ్వు మొదటిసారి వచ్చింది.  ఎవరికి చెప్తున్నావు. వినయ్,  భరత్ పక్కకు వచ్చి షాపింగ్ కి తీసుకు వెళ్తానని మంచి ఊపులో ఉన్నట్టున్నావ్.

  మీకేంటి ఇబ్బంది అని అడుగుతాడు.  మాకు ఏమి ఇబ్బంది లేదు.  వచ్చేటప్పటికి ఎలా ఉంటావో..  ఏమిటో.. ఒక పిక్ తీసుకుంటాము.

మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు అనిపించడం లేదా..  లేదు మేము చాలా తక్కువ చేస్తున్నాము. షాపింగ్ అంటే ఏదో అనుకుని పరిగెడుతున్నావు కదా..  అందుకే పిక్ తీసుకునేది.

షాపింగ్ అంటే ఏముంది..  మాల్ కి వెళ్తాం.  తనకు నచ్చిన సారీస్ తీసుకుంటది. దానిమీద మ్యాచింగ్ యాక్సెసరీస్ తీసుకుంటుంది.  అంతే కదా...

ఓహో.. లేడీస్ షాపింగ్ అంటే అంత సింపుల్ అనుకుంటున్నావా..  ఇప్పుడు దాకా ఎవరిని తీసుకొని వెళ్ళలేదా.

లైక్ ఆంటీని కూడా అంటే..  అబ్బే మా అమ్మ మాతో రాదులే షాపింగ్ కి.  అందుకే నీకు అర్థం కావట్లేదు.  వెళ్ళు...  వెళ్ళు...  వెళితే గాని నీకు అర్థం కాదు.ఎంజాయ్ యువర్ షాపింగ్ ట్రిప్ అని బుగ్గ మీద తడతారు.

ఏమిటి వీళ్ళు ఇలా భయపెడుతున్నారు అని ఒక్క నిమిషం భయపడిన...  నివి వైపు చూసి నా బంగారానికి అంత సీన్ లేదులే. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టదు అని తనకు అనే ధైర్యం చెప్పుకుంటాడు.

విక్రమ్ ఇంకా బయలుదేరండి.  లేట్ అవుతుందని ఇద్దరిని పంపిస్తూ... నివి జాగ్రత్త అని చెబుతాడు. నేనున్నాను కదా బావ. డోంట్ వర్రీ అని చెప్పి విజిలెసుకుంటూ వెళతాడు.

వెళుతున్న రాజ్ ని చూసి నవ్వుకుంటాడు. వినయ్ భరత్ మాత్రం చాలా జాలిగా చూస్తూ ఉంటారు. ఏంట్రా మీ ఇద్దరు చూపులు...

పాపం వీడికి అర్థం కావట్లేదు.  నివి తో షాపింగ్ అంటే ఏదో మంచినీళ్లు తాగినట్టు అనుకుంటున్నాడు.  అది చూపించే చుక్కలకి ఏమైపోతాడో...

అలవాటు పడిని అంటే..  అంతేనంటావా... అంతే కదా... పెళ్లికి ముందు మంచి ఇంట్రెస్ట్ మీద ఉంటారు. ఆ మోజులో వాళ్ళు ఎలా అడిగినా షాపింగ్ కి ఫుల్ గా తిప్పేస్తారు.

చచ్చినట్టు పెళ్లయిన తర్వాత కూడా అలాగే తిప్పకపోతే చుక్కలు చూపిస్తారు. కాబట్టి వాడికి తెలియకుండా వాడే బెండ్ అయిపోతున్నాడు అని నవ్వుతాడు.

వీళ్ళ నవ్వుల మధ్యనుండగానే...  శ్రీ ఫోన్ చేస్తాడు. మధ్యలో వీడు గోల ఏంటి అని.. లిఫ్ట్ చేసి చెప్పరా.. ఏం చేస్తున్నారు రా..

ఇక్కడ పనులు ఉంటే మీరు తాతీయగా కూర్చున్నారా.. రాజ్ కూడా కనపడటం లేదు.  ఏమైపోయాడు.  అయ్యో నీకు తెలియదా...

రాజ్ నివిని  తీసుకొని షాపింగ్ కి వెళ్ళాడు అని చెబుతాడు. ఏంటి అప్పుడే వీడు ఈ పనులు కూడా మొదలుపెట్టాడా... నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు అని బుసలు కొడుతూఉంటాడు.

ఎందుకురా అంత కోపం అంటే..  నా పెళ్లి పనులు ఆపేసి నివిని షాపింగ్ తీసుకెళ్ళాడు.  కోపం రాదా... ఒరేయ్ నువ్వు నేహా ని షాపింగ్ కి తీసుకెళ్తే మేము ఏమైనా అంటామా..

అదే ఇది ఒకటే అలా అవుతుంది. అయినా వాడికి తెలియదా  నివి తో షాపింగ్ అంటే ఎలా ఉంటుందో.. ఇంకా వాడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా..

ఈ రోజు చేస్తాడులే అంటారు. మంచి హుషారుగా వెళ్లినట్టు ఉన్నాడు అంటే... బాగా....

పాపం బిడ్డ. విక్రమ్ ఫోను స్పీకర్లో పెట్టే మాట్లాడుతూ ఉంటాడు.  వినయ్ కూడా మేము ఎన్ని రకాలుగా హింట్ ఇచ్చిన ఎక్కడ ఆగడం లేదు.

అవునులే... ఆ వేడిలో ఉన్నప్పుడు అసలు ఏమీ అర్థం కాదులే. అయినా బావ నా ఎంగేజ్మెంట్ రోజున ఏమన్నాడు...

వచ్చే అమ్మాయిని తన కంట్రోల్లో పెట్టుకుంటానని ఎన్ని ప్రగల్బాలు పలికాడు. అసలు ప్రపోజ్ చేయకముందే బెండ్ అయిపోయాడు.

వాడు బెండయ్యాడో,  బెండు తీస్తాడో ఎవరికి తెలుసురా అని విక్రమ్ అంటాడు.  అంత లేదులే బావ.  చూస్తూ ఉండు..

సాయంత్రం వచ్చేటప్పటికిఎలా ఉంటాడో..  రాగానే మాత్రం ఒక పిక్ తీసి, నాకు వీడియో కాల్ చేయండి.. చూడాల్సిందే అంటాడు.

ఎందుకురా నీకు అంత ఉత్సాహం అంటే..  అది అంతే బావ. అవని నీ తీసుకు వస్తున్నావా అని అడుగుతాడు. నేను ఆఫీస్ కి వెళుతూ దింపేసి వెళతాను. సరే అని ఫోన్ పెట్టేస్తాడు.

అవిని నీ పిలిచి రెడీ అవ్వు.  నిన్ను శ్రీ వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేయాలి. ఆంటీకి ఏదో పని ఉందంట అని చెబుతాడు. సరే అని ఇందిరాగారికి,  లలిత గారరికి  చెప్పి విక్రమ్ తో కలిసి బయలుదేరి వెళుతుంది.

రాజ్ మాత్రం మంచి హుషారుగా తీసుకు వెళుతూ ఉంటాడు. ఎక్కడికి వెళదాం నివి అంటే ఫస్ట్... బంజారాహిల్స్  వెళ్ళనివ్వండి.

అబ్బో నా బంగారానికి మర్యాదలు ఎక్కువే తెలిసే అనుకుని మురిసిపోతూ ఉంటాడు. అక్కడ ఒక ఫేమస్ మాల్ కి తీసుకువెళ్లి సారీస్ చూస్తూ ఉంటుంది.

ఎన్ని చూసినా ఏదీ నచ్చదు.  ఏమైంది నివి...ఏమీ నచ్చడం లేదు.  కలెక్షన్ బానే ఉంది కదా అంటే.. ఇక్కడ ఉన్న కలర్స్ నా దగ్గర చాలా ఉన్నాయి అని చెబుతుంది.

ఒక సారి తీసి నీకు చాలా బాగుంటుంది అంటే.. ఆల్రెడీ కలర్ ఉంది అంటుంది.  ఇంకొకటి తీస్తే ఇది లైట్ అయింది అని చెబుతోంది. ఇంకొక సారి తీస్తే ఇందులో ఉన్న కలరు నాకున్న చీరల్లో మిక్స్ అయింది అని చెబుతుంది.

ఎన్ని చూపించిన ప్రతి దానికి ఏదో ఒక రీసన్ చెపుతూ ఉంటే.. రాజ్ కి అప్పటికే నీరసం వచ్చేస్తుంది. వచ్చి రెండు గంటలు అయింది.

నువ్వు ఒక్క చీర కూడా సెలెక్ట్ చేయలేదు అంటే... అసలు డిజైనర్స్ కి డిజైన్ చేయడమే రావడం లేదండి.  అన్ని రెగ్యులర్ కలర్స్ తో డిజైన్ చేస్తే ఎలాగా అని అడుగుతుంది.

ఆ మాటకి కన్ఫ్యూజ్ అవుతూ ఎక్కడ డిజైన్ చేశారు. అయ్యో ఈ సారి లో ఉన్న ఈ షేడ్ తో నా దగ్గర టాప్ ఉంది అని చెబుతుంది.

టాప్ కి చీర కు సంబంధం ఏముంది అని అర్థం కాకుండా అడిగితే... టాప్స్ వేసుకున్న చీర కట్టుకున్న నేనే కదా మరి. అలాగా వాడిని కలర్ ని ఎలా వాడుతానండి అని అడుగుతుంది.

అంతే ఆ మాటకి రాజ్ కి ఫ్యూస్లు ఎగిరిపోతాయి.. బొమ్మ తిరిగి సినిమా కనపడుతుంది.  వచ్చే ముందు వినయ్, భరత్ తను వంక ఎందుకు అంత జాలిగా చూసారో ఇప్పుడు అర్థమవుతుంది.

పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిప్పి తిప్పి ఒక చీర సెలెక్ట్ చేస్తుంది.  అలాగే ఇంకొక డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తుంది కానీ దాని మీద చున్ని నచ్చలేదు అంటుంది. ఇప్పుడు చున్నీ కోసం ఎక్కడిక తిప్పుతుందో అని వణికిచస్తాడు.

రాజ్ ముఖం చూసి అయ్యో రాజ్ గారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నట్టున్నాను. సారీ అండి.. మీకు ఇబ్బందిగా అనిపిస్తే మీరు వెళ్లిపోండి.

మిగిలిన షాపింగ్ నేను కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాను అంటుంది.  ఆ మాటకి... అయ్యో నివి అలా అంటావేంటి.. మధ్యలో నేను ఎలా వదిలేస్తాను.

నీతో కలిసి షాపింగ్ చేస్తూ ఉంటే నాకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది అని..  కొంచెం ఏదైనా తాగి మళ్ళీ స్టార్ట్ చేద్దాము. సరే అని చెప్పగానే జ్యూస్ సెంటర్ దగ్గర ఆపుతాడు.

జ్యూస్ తాగి ఆ చున్ని మ్యాచింగ్ కూడా తీసుకున్నాక ఇంకా అయిపోయిందా అని అడుగుతాడు.  ఎక్కడ అయిపోయింది...

ఈ సారీ కి మ్యాచ్ అయ్యే విధంగా బ్యాంగిల్స్ తీసుకోవాలి అంటుంది. సరే ఎక్కడ షాప్ అంటే.. ఇక్కడ కాదు బేగంబజార్ అంటుంది.

అంతే కారు సడన్ బ్రేక్ వేసి ఏంటి గాజుల కోసం బేగంబజార్ వెళతావా..  అవేవో ఇక్కడే తీసేసుకోవచ్చు కదా...

అయ్యో రాజ్  గారు మీకు అసలు ఏమీ తెలియడం లేదు. అక్కడ మ్యాచింగ్ చాలా బాగుంటాయి.  అలాగే కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది.

ఇంత టైం వేస్ట్ అవుతుంటే కాస్ట్ గురించి ఆలోచిస్తుందేంటి..  సరదాగా షాపింగ్ అయిన వెంటనే ఎక్కడికైనా సరదాగా తీసుకువెళదాం అనుకుంటే..

మొత్తం అంతా నన్ను ఈ షాపింగ్ మాల్స్ లోనే కూర్చోబెడుతుంది అని తల పట్టుకుంటాడు. ఏమైందండీ తలనొప్పి వస్తుందా... లేదండి..  తలనొప్పి కాదు...  మీకు ఎంత ఓపిక ఇచ్చాడు అని భగవంతుని తలుచుకుంటున్నాను.

మీరు మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు అండి..  మీకు ఇలాగ అర్థమైందా అండి.. పదండి అని చెప్పి కార్  స్టార్ట్ చేస్తాడు..

బేగంబజార్ దగ్గరికి వెళ్ళాక కార్ ఎక్కడ పార్క్ చేయాలో అర్థం కాక చుట్టూ చూస్తూ ఉంటాడు.  ఏమైందండీ అంటే.. కార్ ఎక్కడ పెట్టాలో చూస్తున్నాను.

మీ షాపింగ్ ఇలా ఉంది అనుకుంటే... బైక్ వేసుకోవచ్చే వాళ్ళము. అమ్మో ఎండలో టాన్ అయిపోము అంటుంది. ఒక్కసారి నివి వైపు చూసి ఉఫ్..  అనుకుని రేపు నా ఫ్యూచర్ ఏమిటి అనుకుంటాడు.

తనికి ఎక్కడి నుంచో  మే.. మే..  సౌండ్ వినపడుతూ ఉంటుంది. నో అని గట్టిగా అరుస్తాడు. ఏమైందండీ ఎందుకలా అరిచారు.

అబ్బే ఏమీ లేదు జస్ట్ కార్ పార్క్ చేయడం గురించి ఆలోచిస్తున్నాను అంతే అని కవర్ చేసుకొని.. అక్కడ కొంచెం ప్లేస్ కనిపిస్తే కార్ పార్కింగ్ చేసే వెళదామా అని తీసుకెళ్తాడు.

అయ్యో బిడ్డ... ఎంజాయ్ చేద్దాం అని వచ్చి  షాపింగ్ లో ఇరుక్కుపోయాడు ???
[+] 12 users Like SivaSai's post
Like Reply

Part - 82


కార్ పార్క్ చేసి రాజ్, నివి గాజులు కొనడానికి  బేగం బజార్లో షాప్స్ అన్ని తిరుగుతూ ఉంటారు. ఒక నాలుగు గంటలు తిప్పి రెండు గాజులు సెట్స్ తీసుకొని ఇంకా వెళదామా అని అడుగుతుంది.

అప్పుడే అయిపోయిందా అని చాలా ఆనందంగా అడుగుతాడు. మీ గురించి అని తొందరగా అవ్వగొట్టేసాను లేకపోతే నా...

ఏంటి ఇది తొందరగా అవడంమా అని ఆశ్చర్యంగా చూస్తాడు.  ఏమైందండీ అలా చూస్తున్నారు.ఇంత తొందరగా ఎలా షాపింగ్ చేయగలిగావా అని ఆలోచిస్తున్నాను అంతే అంటాడు.

చెప్పాను కదా... మీ గురించి తొందరగా వచ్చేసాను. లేకపోతే టైం పట్టేది నాకు. మా అమ్మే... ఫ్యూచర్లో నా పరిస్థితి ఏమిటంటావ్  అనుకుంటాడు.

ఇప్పుడంటే తీసుకెళ్ళాను కానీ..పెళ్లి అయ్యాక ఇలా చేస్తే తాటతీసేయను. నీకు అంత సీను ఉందా అని ఇన్నర్ వాయిస్ వినపడుతుంది.

ఈ విషయం బయటికి వచ్చింది  అంటే..  విక్రమ్, శ్రీ నన్ను ఒక రేంజ్ లో ఆడుకుంటారు.  వాళ్ళకి తెలియకుండా పైకి గంభీరంగా ఉండాలి లేకపోతే అటు ఫ్రెండ్స్ దగ్గర పరువు పోయే ఇటు ప్రేమించిన అమ్మాయి కి లోకవాయే అన్నట్టు ఉంటుంది నా పని అనుకుంటూ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు.

ఇద్దరూ ఇంటికి వచ్చేటప్పటికి నైట్ చాలా టైం అయిపోతుంది. కార్ పార్క్ చేసిన తర్వాత... నివి కారు దిగుతూ.. చాలా థాంక్స్ రాజ్ గారు.  ఈరోజు మీ  టైమంతా నాకోసమే స్పెండ్ చేశారు.

ఖచ్చితంగా మనం ఫ్రీ అయిన తర్వాత మీకు ఒక మంచి ట్రీట్ ఇస్తాను అని అంటుంది. ట్రీట్ అన్న మాట వినగానే అప్పుడు వరకు ఉన్న నీరసమంత ఎగిరిపోయి హుషారు వస్తుంది.

సూర్ నివి తప్పకుండా అని హుషారుగా విజిల్ వేసుకుంటూ కారు దిగుతాడు. ఇద్దరు లోపలికి వచ్చేటప్పటికి విక్రమ్,  శ్రీ, వినయ్, భరత్ నలుగురు హాల్లోనే ఉంటారు.

వాళ్ళని చూసి ఏంటన్నయ్య మీరు ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది. లేదమ్మా నువ్వు  ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తున్నాము.

రాజ్ గారికి చాలా ఓపిక అన్నయ్య. ఎక్కడ విసుక్కోకుండా ఎంత ఓపిక తిప్పారు అనుకుంటున్నావు.  అదే వినయ్ అన్నయ్య గాని, బావని గాని తీసుకువెళ్లమంటే నన్ను అసలు  షాపింగ్ కూడా చేసుకొనీఇచ్చేవారు కాదు.

రాజ్ గారికి చాలా ఓపిక. నా షాపింగ్ అంత అయ్యేవరకు వెయిట్ చేశారు. ఎక్కడ కూడ చిన్న మాట కూడా విసుక్కోలేదు.   థాంక్యూ రాజ్ అని చెప్పి రూమ్ లోకి వెళ్లిపోతుంది.

నివి వెళ్లే దాకా అందరూ కామ్ గా ఉండి నివి వెళ్ళాక రాజ్ వైపు తిరుగుతారు. అప్పుడు దాకా నవ్వుతూ ఉన్న రాజ్ ఒక్కసారిగా సోఫాలో కులబడిపోయి కాళ్లు చేతులు వదిలేస్తాడు.

శ్రీ ఒక్క ఉదిటిన రాజ్ మీద కెళ్ళి ఏరా నా పెళ్లి పనులు అంటే..  నేను చేయలేను.  ఎవరు తిరుగుతారు...  అది... ఇది... అనుకుంటు గొంతులు వేశావు.

ఇక్కడ మాత్రం నివి షాపింగ్ కి రోజంతా టైం ఇచ్చావు.  ఇంతకీ షాపింగ్ లో ఆ మహాతల్లి కొనిఉంటే ఒకటి లేక రెండు డ్రెస్సులు ఉంటాయి అంతే కదా అంటాడు.


ఆ విషయం నీకు ఎలా తెలుసురా అని ఆశ్చర్యంగా అడిగితే..  మాకందరికి అది ఎప్పుడో ఎక్స్పీరియన్స్. నువ్వు కొత్త కదా.. నీకు లేటుగా అయింది అంతే అని వెటకారంగా అంటాడు.

ఈ విషయంలో ముందే చెప్పాలి కదా... నువ్వు వెళ్తున్న విషయం నాకు ఏమైనా చెప్పావ.. చెప్పడానికి...

అంతే కోపం గా వినయ్ భరత్ వైపు చూస్తాడు.  నీకు మేము ముందే హింట్ ఇచ్చాము.  నువ్వే పట్టించుకోలేదు. అప్పటికి పిక్ తీసుకుంటాము.  షాపింగ్ నుంచి వచ్చేటప్పటికి ఎలా ఉంటావో...

ఆంటీతో ఎప్పుడైనా వెళ్ళావా అని చాలా రకాలుగా అడిగాము కానీ మేము ఇచ్చిన హింట్స్ పట్టించుకోకుండా నువ్వు క్లౌడ్స్ మధ్యనే ఎగిరి మమ్మల్ని అంటే మేమేం చేస్తాము అని ఇద్దరు భుజాలు ఎగురవేస్తారు.

ఎవరైనా వీటిని హింట్స్ అంటరా... మేమంతే...  మేమంతే...  అంటారు.   నోరు మూయండిరా...  షాపింగ్ కి వెళ్తే ఇలా ఉంటుంది అని చెప్పాలి.

అంతేగాని ఇలాగ చెబుతారా...   అందరి ముందు ఎలా చెబుతాము. పైగా నివి ముందు.  నువ్వే అర్థం చేసుకోవాలి బావా అని వినయ్ రాగం తీస్తాడు.

శ్రీ నువ్వు కూడా నా.... నా చెల్లి షాపింగ్ అవ్వడం ముఖ్యం రా నాకు. మిత్ర ద్రోహి అందుకని  నన్ను బుక్ చేసేసావా. అదేదో నువ్వే వెళ్లాల్సింది కదా..

ఏరా...  నీకు నేను మంచి టైం ఇచ్చాను.  మీ ఇద్దరి మాత్రమే ఉండేటట్టుగా అరేంజ్ చేశాను.  నీ తెలివితేటలతో నివితో షాపింగ్ కంప్లీట్ చేయించడం మానేసి...

నివి వెనకాల బ్యాగులు పుచ్చుకొని తిరిగితే నేనేం చేస్తాను. అయినా శ్రీ ఎంగేజ్మెంట్లో ఏదో అన్నట్టున్నావు  అని శ్రీ వైపు తిరిగి కళ్ళు ఎగరేస్తాడు.

అవున్రా...  నిజమే..  ఏంట్రా అన్నావు...  లైఫ్ పార్ట్నర్ కంట్రోల్ అని...  ఇంకా ఏదేదో అన్నావు ఒకసారి మళ్ళీ చెప్పరా...

ఇప్పుడు అవన్నీ అవసరమా.  నా కాళ్ళు లాగుతున్నాయి..  చిందులు తొక్కుతూ గెస్ట్ రూమ్ కి వెళ్ళిపోతాడు.

వెళుతున్న రాజ్ ను చూసి అందరూ నవ్వుకుంటారు. శ్రీ కూడా రాత్రికి అక్కడే ఉండిపోతాడు. రూమ్ లోకి వెళ్ళినా విక్రమ్ అవినికి డిస్టబెన్స్ అవ్వకుండా మెల్లగా పక్కనచేరి పడుకుంటాడు.

అయిపోయినయా మీ ఫ్రెండ్స్ తో చిట్ చాట్ అని అడుగుతుంది. నువ్వు ఇంకా పడుకోలేదా అంటే... అలవాటైపోయింది అండి.

మీ చెయ్యి తగిలకపోతే నిద్ర రావడం లేదు అని విక్రమ్ వైపు తిరిగే చుట్టూ చేతులు వేసిన కళ్ళు మూసుకుంటుంది.

నీకే కాదు బంగారం నాకు నిద్ర రావడం లేదు.  నీ ప్రెసెన్స్ లేకపోతే అని నుదుటిని ముద్దు పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు.

వీళ్ళందరూ ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే.. అక్కడ గాలి కూడా సరిగ్గా తగలకుండా... ఉక్కపుతకి తన పైట చెంగుతో విసురుకుంటూ.. గది మొత్తం అంటించిన అవని ఫోటోలు చూస్తూ రగిలిపోతూఉంటుంది.

భార్గవి గది మొత్తం అవిని ఫొటోలతో నిండిపోయి ఉంటుంది.  ఆ ఫోటోలు తీయడానికి కుదరకుండా సెట్ చేస్తారు.

వాటిని చింపడానికి రావు... పగలకొట్టడానికి రావు.  ఆ ఫొటోస్ చూస్తూ ఉంటే నిజంగా భార్గవికి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. 

అవని ప్రతి ఫోటోలోనూ నవ్వుతూ, లగ్జరీస్ లైఫ్ కనపడుతూ ఉంటుంది. అవని నవ్వు చూస్తూ ఉంటే కడుపులో రగిలిపోతూ ఉంటుంది.  కానీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి .

ఆ స్థానంలో నా కూతురు ఉండాలి.  శిల్పకి ఉన్న పిచ్చితో... ఆ రోజు చేసిన పిచ్చి పనితో ఉచలు లెక్కపెడుతుంది.

దానితోపాటు నన్ను ఇరికించింది. ఇక్కడ మేము ఏం చేస్తున్నా సరే ఆ విక్రమ్ కి ధనుంజయ్ కి ఇద్దరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది.

ఎవరి సహాయం తీసుకోవాలో కూడా అర్థం కావడం లేదు అని పరిపరివిధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది.తనకి తెలియకుండానే ఒక డిప్రెషన్ మూడ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది.

శిల్ప కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా నన్ను నేను సేవ్ చేసుకోవాలి.  ఇంత జరిగిన మోడల్ పిచ్చి మాత్రం వదలడం లేదు.

ఏ ఫీల్డ్ అయినా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ సాధిస్తామని విషయం మర్చిపోయి అడ్డదారులోనైన సరే వెళ్ళాలి అని ఇక్కడ దాకా వచ్చాను ఆలోచన వదిలేసి ఎలాగైనా మోడల్ అవ్వాలి అన్న పిచ్చ ఆలోచనలతోనే ఉంటుంది..

నాకు ఎవరి హెల్ప్ చేస్తారని ఆలోచిస్తూ ఉంటుంది.  ఒక్కటే దారి నేను మారినట్టుగా నాన్న ముందు యాక్ట్ చేయాలి. నాన్న నమ్మితే చాలు నేను బయటికి  వెళ్ళిపోతాను.

తర్వాత కొన్ని రోజులు నార్మల్ గా ఉండి అప్పుడు మళ్ళీ నా ప్రయత్నాలు నేను చెయ్యాలి. తర్వాత విక్రమ్ ని నా వైపు తిప్పుకోవాలి అని ఆలోచిస్తుంది.

ఈ ఐడియా బాగుంది. రేపే నాన్నకి ఒకసారి కబురు పంపించాలి.  ఉడుకులో చేతితో  విసురుకుంటూ ఇంటిదగ్గర ఉంటే తెలియలేదు గాని..

ఇంత ఉడుకులో చాలా కష్టం . నా వల్ల అసలు కావడం లేదు. ఈ దోమలు, ఉడుకుల మధ్యన ఉండటం చాలా కష్టం.

అవిని ఇంటి చాకిరి అంతా చేస్తూ... ముందురోజు  ఫుడ్డు తింటూ అసలు మినిమం ఫెసిలిటీస్ తో  ఎలా ఉండేది. ఏసీ కూడా ఉండేది కాదు కదా అని అని ఫస్ట్ టైం ఆలోచిస్తుంది.

వెంటనే మళ్ళీ తన మనస్తత్వంలోనికి వచ్చేసి  అది ఎలా పోతే నాకెందుకులే...  ముందు నేను బయటపడాలి. మోడల్ అవ్వాలి అంతే అనుకుని ధనుంజయ్ ని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది.

ఎవరు ఆలోచనలో వాళ్ళు ఉంటు..  కలత నిద్రపోతూ... ఉదయం టైం కి కష్టంగా లెగుస్తారు. ఎక్సర్సైజులు చేసేటప్పుడు కూతుర్ని చూసి.. నా కూతురు ఎలా అయిపోయింది అని భార్గవి బాధపడుతూ శిల్పని పిలుస్తుంది.

ఆ పిలుపు విని తల్లి వైపు చూస్తుంది. ఇలా రా శిల్పా అని బాధగా పిలుస్తుంది.  ఒక్క నిమిషం ఆలోచించి వెంటనే ఒక కన్నింగ్ ఐడియాతో వెళ్లి చెప్పు మామ్ ని కోపంగా అడుగుతుంది.

ఎందుకు శిల్ప నాపై ఇంత కోపంగా ఉన్నావు. చూడు ఎలా చిక్కిపోయావో అని తన తల్లి ప్రేమను అంతా చూపిస్తుంది.

స్టాప్ ఇట్ మామ్.  నీవల్ల కాదా ఇదంతా అని కోపంగా అడుగుతుంది. నేనేం చేశాను శిల్ప.  చేసిందంతా నువ్వు కాదా..

నీ వల్లే ఈరోజు మన ఇద్దరికీ ఇలాంటి పరిస్థితి వచ్చింది.  ఇంకా నీలో మార్పు రాలేదు కదా ఏడుస్తూ అడుగుతుంది.  ఎందుకు శిల్ప అంతల బాధపడుతున్నావు.

నా వల్ల నీకు ఏమి అన్యాయం జరిగింది. నిన్ను అపురూపంగా పెంచుకున్నాను.  అందలం ఎక్కించాను.  దీన్ని అందలం అంటారా మామ్.

శిల్ప అని బాధగా పిలుస్తుంది.  నిజమే కదా మామ్.  నన్ను,  అవని నీ ఒకేలాగా పెంచి ఉండి ఉంటే...ఈరోజు మనకి పరిస్థితి వచ్చేది కాదు కదా...

అవని వాళ్ళ మమ్మీ నీ ఎందుకు చంపేసావు. దానివల్లే కదా డాడ్ నాతో కూడా మాట్లాడటం మానేశారు.  నీకు కాకుండా అవని వాళ్ళ మమ్మీకి పుట్టి ఉంటే అవని లాగా పెరిగేదాన్నేమో కదా...

ఆ మాటలు వినగానే భార్గవికి ఏం మాట్లాడాలో అర్థంకాక... కూతురు ప్రవర్తల్లో వచ్చిన మార్పు ని చూస్తూ ఉండిపోతుంది.

శిల్ప ప్లాన్ ఏమిటి...

కథ కొనసాగుతుంది...
[+] 15 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)