Posts: 13,923
Threads: 277
Likes Received: 22,865 in 11,162 posts
Likes Given: 2,685
Joined: Nov 2018
Reputation:
454
తర్వాత ఆ ఛాయ యవనప్రతినిథి భార్యని, ఆవిడ ద్వారా రాణిగారినీ ఆశ్రయించి వాళ్ళ ద్వారా చక్రవర్తిని దర్శించుకుని తన బాధ చెప్పుకుంటుంది. వర్ణాంతర వివాహాల గురించి చక్రవర్తితో చిన్న చర్చ జరుపుతుంది కూడా. కానీ చివరికి చక్రవర్తి మాటలతో తాను చేసినది తప్పేనని భావించి ఛాయ ఆత్మహత్య చేసుకుంటుంది.
ఆవిషయం తెలియగానే నిరాకులుడి అహం దెబ్బతింటుంది. కోపం వస్తుంది. ఆ కోపంలో నుంచి అతని పగ అంతా బయటకి వస్తుంది. నిద్రలో నుంచి మెలకువ వచ్చినట్లయ్యి మూడువేల ఏళ్ళ నాటి తన లక్ష్యం కళ్ళ ముందు నిలుస్తుంది. ఇక అతను అవంతీ రాజ్యం విడిచిపెట్టడం, అంతవరకూ భారతదేశాన్ని వదిలి వెళ్ళని వాడు అపుడు ప్రయాణం మొదలుపెట్టి సింధు నదిని దాటి ఖురాసాను దేశాధిపతిని కలవడం, చక్రవర్తికి వ్యతిరేకంగా యుద్ధానికి వచ్చేందుకు అతనిని పురికొల్పి, అతనికోసం లక్ష సైన్యాన్ని సమీకరించేందుకు ప్రయత్నించడం ఇవన్నీ జరుగుతాయి.
సైన్య సమీకరణతో పాటు దానికి సమాంతరంగా వేదసంస్కృతిని నాశనం చేసేందుకూ ప్రయత్నాలు చేస్తాడు నిరాకులుడు. అందుకు తన శిష్యులయిన పారగీతుడు, ప్రోథెరో, త్రయ్యరు, స్మితుడు, రాజసూనుడు, రూకుడు, వైలసనుడు, స్తయినుడు, మక్షిమల్లుడు – వీళ్ళందరినీ నియోగిస్తాడు. వారిలో వారికి కొన్ని భేదాభిప్రాయాలున్నా మొత్తం మీద వారందరూ ఒకటే.
సరే వీళ్ళందరూ చివరికి చక్రవర్తి చేత బంధింపబడతారు. చివరి సన్నివేశంలో చక్రవర్తికీ, ఆ పండితులకీ మధ్య జరిగే సంభాషణ ఆసక్తికరంగా వుంటుంది.
“వాలిని రాముడు చెట్టు చాటునుంచి చంపడం ఏమిటి? అది న్యాయం కాదు.” అంటాడు ఒకడు.
దానికి చక్రవర్తి – “అయ్యో పిచ్చివాడా, అసలు కోతులకి రాజ్యాలేమిటి? యుద్ధాలేమిటి? అవి మాట్లాడటం ఏమిటి? అవన్నీ వదిలిపెట్టి ఈ చెట్టు చాటు నుంచి చంపడం ఒక్కటీ పట్టుకుంటావే! అసలవేవీ నమ్మదగినవి కాదు, వదిలేయ”మంటాడు. కానీ ఆ పండితులు మళ్ళీ దానికీ ఒప్పుకోరు.
“అది కాదు, అసలు రావణుడు, హిరణ్యకశిపుడు యవనులు. విభీషణుడు, ప్రహ్లాదుడు భారతీయులు. అందుకే వ్యాస వాల్మీకులు అలా కల్పించి వ్రాశారు.” అంటాడు మరొకడు.
“సరే, మీ కల్పనలేవో మీరు చేస్తున్నారు కదా! అలాగే వాళ్ళ కల్పనలేవో వాళ్ళు చేయకూడదా!” అంటాడు చక్రవర్తి.
“వాళ్ళ తర్వాత మేము పుట్టాం. కాబట్టి వాళ్ళు రాసినది తప్పనడానికి మాకు హక్కుంది.” అని ఆ ప్రశ్నకి సమాధానం చెప్తాడు వైలనసుడు.
దానితో చక్రవర్తికి బుర్ర తిరిగి “నాకు అయోమయంగా వుంది. మీకు చదువు లేదు. ప్రపంచ జ్ఞానం లేదు. సామాన్యమానవ జ్ఞానం లేదు. తర్కవాసన లేదు. మిమ్మల్ని ఇంత మంది పండితులని ఎలా అనుకుంటున్నారు?” అని నివ్వెరపోతాడు.
Posts: 13,923
Threads: 277
Likes Received: 22,865 in 11,162 posts
Likes Given: 2,685
Joined: Nov 2018
Reputation:
454
అదీ సంగతి. ఇలాంటి వాదనలమీద, కుతర్కాల మీద విశ్వనాథ నవలలన్నిటిలో ఉన్నట్లే ఈ నవలలోనూ వ్యాఖ్యానాలున్నాయి. ఒకచోట మంత్రి అంటాడు చక్రవర్తితో – “సర్వపదార్థములకు సర్వజ్యోతిస్సులకు నాధారభూతమైన ఒక మహాచైతన్యమున్నదని మేము విశ్వసింతుము. కాని ఈ సూర్య చంద్రాదులను విశ్వసించము – అను నొక పెడవాదమున్నది. గ్రామవాసులును, పట్టణవాసులును ‘మేము శాలివాహన చక్రవర్తినే మన్నింతుము, తక్కిన అధికారులను మన్నింపము’ అనగా వారి జన్మలకు వారికి నొక్కసారియైన చక్రవర్తి దర్శనము కలుగదు. చక్రవర్తి తదితరులైన అధికారుల ద్వారా పాలించును. చక్రవర్తి యొక్క చక్రవర్తిత్వము వారికా అధికారులందు కనిపించును. సేవింప వలసినది ఆ అధికారులనే. మంత్రులును, సేనాపతులును, చక్రవర్తి కంటె కించిదూనులే కాని చక్రవర్తి వంటివారే. ప్రధానమైనది రాజాధికారము కాని వ్యక్తి కాదు.”
ఇంకా నవలలో అక్కడక్కడా చక్రవర్తి కూడా ఇలాంటి మంచి మాటలు బోలెడన్ని చెప్తారు. ఒక రెండు సందర్భాలలో ఆయన చెప్పిన రెండు విషయాలు మాత్రం క్రింద ఉదాహరణగా చూపిస్తున్నాను. రెండూ రెండు ఆణిముత్యాలు.
1) “వ్యక్తి ధర్మము వేరు. జాతి ధర్మము వేరు. దేశ ధర్మము వేరు. వివేకరహితులు మూడు ధర్మములను కలిపి మూడింటికి ముప్పు తెత్తురు. జాతి ధర్మము సరిగా నర్థము చేసికొననిచో అన్ని జాతులొకటే యన్న సిద్ధాంతము ప్రబలును, ఒక్కొక్క జాతి యందున్న విశేష లక్షణములు నశించును. సర్వదేశములు నొక్కటియే యనినచో ఆ సిద్ధాంతమధికముగా నున్న దేశము వెనుకబడును. ఆ సిద్ధాంతము లేని దేశము విజృంభించును. ఇతర దేశముల నది లొంగ దీయును. వ్యక్తి ధర్మమును పాటించినచో మానవ జీవితమే వృథాయగును. మానవుడు బ్రదుక నక్కరలేదు. ఎవడును తన కోసము తాను బ్రదుక నక్కరలేదు. దేశము కొరకు బ్రదుక వలయును. వ్యక్తి ధర్మము లేనిచో దేశధర్మము మాత్రమెందులకు? దేశధర్మము, జాతిధర్మమును గూడ లేనిచో మానవ ధర్మమని యొక్కడున్నదందుము. ఆ ధర్మమేమి? తినుటయు, తిరుగుటయు, ఈర్ష్యామాత్సర్యములు లేకుండుటయు మొదలైన ధర్మములా? నిజమునకవి యోగి ధర్మములు. ఇప్పుడు యోగము లేని యోగిజనులు పుట్టుచుందురు. ఊరకే సంఖ్య మాత్రము పెరుగుచుండును. అందరకు నన్నముకావలయును. పండింపవలయును, వృత్తులు చేయవలయును. ఇంక యోగమేమున్నది? కౌపీన రక్షణార్థమయం పటాటోపః అన్నట్లుండును. పటాటోపమనగా సంసారము. సంసారమనగా దేశము, రాజ్యము, వృత్తులు, పంటలు చాలకపోవుటలు, యెదుటివాని వద్దనుండి గ్రహించుటలు, వాడెదిరించుటలు, యుద్ధములు, నీతులు – మరల నంతయు బలిసియే పోయెను. ఏ ధర్మము నక్కర లేదు. సర్వ ధర్మములు నచ్చటనే యున్నవి! ప్రతారకులు, భిన్న ధర్మములను ప్రచారము చేసి, నిత్యమై భద్రమైన స్థితిని పాడు చేసి, స్వలాభ పరాయణులగుచున్నారు. ఒక్కొక్కప్పుడు వారి స్వలాభ పరాయణత్వములో, వారి సిద్ధాంతములలోని యవివేకము వారికి గోచరించుట లేదు. లోకక్షేమము కొరకే చేయుచున్నామని వారి తాత్పర్యము. భిన్నధర్మముల విజ్ఞానమును వివిచ్యమానముగా తెలిసికొనలేని మనుష్యులు చరించు అపమార్గమునకు లెక్కయేమి?”
2) “భయము భక్తియు నని రెండున్నవి. భయమే వృద్ధి పొందగా భక్తి యగును. భయములో నొక దోషమున్నది. ఆ దోషము పోయినంతనే యది భక్తి యగును. ఆ దోషమేమనగా మనకేదో యపకారము జరుగునన్న భావము. అదే భయము. అపకారము జరుగునన్న భావమెందుకు పుట్టును? తాను న్యాయముగా ప్రవర్తింపనపుడు పుట్టును. న్యాయముగా ప్రవర్తించును! భయము పోయినది! సత్ప్రవర్తన వృద్ధి పొందుచున్నది. దాని పేరు భక్తి.”
*****
Posts: 13,923
Threads: 277
Likes Received: 22,865 in 11,162 posts
Likes Given: 2,685
Joined: Nov 2018
Reputation:
454
రాజు గారు
ఈ పుస్తకాలు అన్నీ మీ e-books కలెక్షన్ లో పెట్టగలరు.
Posts: 13,923
Threads: 277
Likes Received: 22,865 in 11,162 posts
Likes Given: 2,685
Joined: Nov 2018
Reputation:
454
బాగా ఆస్తిపాస్తులు ఉన్న ఒక వృద్ధ వితంతువు. ఆమెకు యుక్తవయసు వచ్చిన ఓ మనవరాలు. ఒక ఆఫీసులో గుమస్తా ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడూ, ఆమే ప్రేమించుకున్నారు. ఆమె నాయనమ్మ(అమ్మమ్మ?) దగ్గర పెళ్లి మాట తెచ్చింది. ఏ కొద్దిపాటి ఆస్తీ లేని ఓ గుమస్తాకు మనవరాలిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె మొదట్లో ఒప్పుకోలేదు. కానీ తర్వాత తర్వాత మెత్తబడింది. వారి పెళ్ళికి ఒప్పుకుంటూనే ఒక షరతు పెట్టింది. రెండేళ్లలో(ఒక ఏడాదిలోనేనా?) తనకు పండంటి ముని మనవణ్ణి (మునిమనవరాలినా?) ఇస్తేనే నా ఆస్తి నీకు దక్కుతుందని మనవరాలితో చెప్పింది. ఆమేరకు విల్లు కూడా రాయించింది.
పెళ్లయిపోయింది. అప్పటినుంచీ ఆ అబ్బాయిలో(బహుశా అమ్మాయిలో కూడానా?) ఆస్తికి సంబంధించిన టెన్షన్ మొదలైపోయింది. గడువులోపల తాము ఆ వృద్ధురాలి షరతు నెరవేరిస్తేనే ఆస్తి దక్కుతుంది. వాళ్ళిద్దరూ కలసుకున్నప్పుడల్లా ఆస్తి గురించిన టెన్షన్ దే పై చేయి కావడం ప్రారంభించింది. ఇంకేముంది? వారిద్దరి మధ్య శారీరకమైన కలయిక అసాధ్యమైపోతూ వచ్చింది. తమ మధ్య ఆ సంబంధం కలగడానికి వారు చేయని ప్రయత్నం లేదు. హానీమూన్ కు సరే, ఎలాగూ వెడతారు. ఆ తర్వాత కూడా శృంగారోద్దీపనకు సాయపడుతుందనుకునే ప్రతి ప్రదేశానికీ వెళ్లారు. ప్రతి చిట్కానూ ఉపయోగించారు. ఫలితం శూన్యం.
ఈలోపల రోజులు, మాసాలూ గడిచిపోతున్నాయి. టెన్షన్ ఇంకా ఇంకా పెరిగిపోతోంది. అలా ఉండగా ఒక రోజున వారి ఇంటికి ఓ అతిథి వచ్చాడు. ఏం జరిగిందో తెలియదు. ఆమె గర్భవతి అయింది. మగపిల్లవాడిని(లేక ఆడపిల్లనా?) ప్రసవించింది. ఉయ్యాలలో వేసినప్పుడో, నామకరణం చేసినప్పుడో గుర్తులేదు కానీ స్నేహితులను, బంధువులనూ పిలిచి వేడుక జరుపుకున్నారు.
అయితే పసివాడిలో(లేదా పసిదానిలో) తండ్రి పోలికలు మచ్చుకైనా కనిపించడం లేదని వచ్చినవాళ్లు గుస గుసలాడుకున్నారు.
ఆ దంపతులలో మాత్రం కొండంత బరువు దిగిపోయినట్టు పెద్ద రిలీఫ్. మొత్తానికి గడువులోపల తాము వృద్ధురాలి కోరిక తీర్చారు. అంతకంటే ముఖ్యంగా, ఆస్తి దక్కింది!
ప్రేమ గొప్పదే, అంతకన్నా డబ్బు గొప్పదని చెప్పడం కథకుడి ఉద్దేశమైనట్టు తెలిసిపోతూనే ఉంది. కథనం ఎంతో హాస్యాన్ని, ఉత్కంఠనూ పండిస్తూ సాగిపోతుంది. దానిని అలా ఉంచుదాం. ఇందులో మనకు కావలసిన ఒక ముఖ్యమైన వివరం ఉంది: అది, మన పురాణ, ఇతిహాస, ధర్మశాస్త్ర ప్రసిద్ధమైన ‘నియోగం’! ఇక్కడ మనవరాలు, ఆమె భర్తా కలసి సంతానం కన్నది ‘నియోగ పద్ధతి’లోనే. కాకపోతే అది రహస్య నియోగం. అది కూడా ఆస్తి కోసం.
Posts: 13,923
Threads: 277
Likes Received: 22,865 in 11,162 posts
Likes Given: 2,685
Joined: Nov 2018
Reputation:
454
ఆ మాటతో పాండురాజుకు కోపం వచ్చింది. ‘శత్రువుల నైనా క్షమించి విడిచిపెడతారు కానీ, మృగాలు కనిపిస్తే రాజులు చంపకుండా వదలరు. నమ్మించి చంపినా, మాయాబలంతో చంపినా తప్పవుతుంది కానీ; ఇలా చంపడం తప్పుకాదు. పూర్వం అగస్త్యముని మృగమాంసంతో నిత్యశ్రాద్ధం చేస్తూ, మృగాలను చంపడం రాజులకు దోషం కాదని నిర్ణయించాడు. ఇందుకు నన్ను ఎలా నిందిస్తావు?’ అన్నాడు.
బాణపు నొప్పితో గిల గిల లాడిపోతున్న ఆ మృగం,‘సర్వప్రాణులకు సాధారణమైన, ఇష్టమైన రతిసుఖాన్ని అనుభవిస్తున్న సమయంలో నిరపరాధులమైన మమ్మల్ని చంపావు కనుక, నువ్వు కూడా ఇలాగే నీ భార్యతో సంగమించేటప్పుడు మరణిస్తావు. నీ భార్య కూడా నిన్ను అనుసరిస్తుంది’ అని శపించాడు. ఆ తర్వాత ఆ మృగదంపతులు కన్ను మూశారు.
ఇక్కడ రెండు కారణాల చేత కథకుడికి చేతులెత్తి మొక్కుతున్నాను. మొదటిది, రతిసౌఖ్యాన్ని అనుభవిస్తున్న, ప్రసవిస్తున్న, రోగంతో బాధపడుతున్న మృగాలను; కేవలం ఆహారం కోసమే వేటాడే ఎరుకలు కూడా చంపరని అనడం. రాజులకు వేట కర్తవ్యం అంటూనే కథకుడు ఎరుకలను వారికంటే ఉన్నతులుగా చూపిస్తున్నాడు. కేవలం వినోదం కోసం వేటాడే రాజుల తీరును గర్హిస్తున్నాడు. తిరుమల రామచంద్రగారు ‘హంపీ నుంచి హరప్పా దాక’ అనే స్వీయచరిత్రలో వినోదం కోసం జంతువులను చిత్రహింస పెట్టడంలోని అమానుషత్వాన్ని ప్రత్యక్షసాక్ష్యంతో చిత్రిస్తారు.
ఇక రెండవది, అంతకంటే ఆశ్చర్యచకితం చేసేది,‘సర్వప్రాణులకు సాధారణమైన, ఇష్టమైన రతిసుఖాన్ని అనుభవిస్తున్న సమయంలో…(సర్వప్రాణులకు సాధారణంబయి ఇష్టంబగు సుఖావసరంబున నున్న మమ్ము…) అనే మాట మృగంతో అనిపించడం! విశేషమేమిటంటే, ఇదే మాటను కథకుడు మరి కొన్ని సందర్భాలలో మరికొందరి నోట అనిపిస్తాడు. తనకు కొడుకులను ఇమ్మని కుంతిని అడిగిన సందర్భంలోనే పాండురాజు ధర్మబద్ధమైన ఒక పురాణ కథ చెబుతాను విన మంటూ,‘పూర్వం స్త్రీలు పురుషుని అధీనంలో ఉండకుండా స్వతంత్రంగా సంచరిస్తూ అఖిల ప్రాణి సాధారణంబైన ధర్మంబున తమ తమ వర్ణాలలో ఋతుకాలం తప్పకుండా స్వపురుషులతోనూ, పరపురుషులతోనూ సంబంధం పెట్టుకునే వారని అంటాడు. ఆ తర్వాత దానిని ఎలా నిషేధించారో వివరిస్తూ ఒక కథ చెబుతాడు.
అదేమిటంటే, ఉద్దాలకుడనే ముని ఉండేవాడు. అతని భార్య గొప్ప సాధ్వి. వారికి శ్వేతకేతు డనే కొడుకు. అతను తపస్సంపన్నుడు. అలా ఉండగా, అతని తల్లి ఋతుమతి అయింది. అప్పుడు ఒక వృద్ధవిప్రుడు వారింటికి అతిథిగా వచ్చాడు. కొడుకులు లేని ఆ విప్రుడు కొడుకుకోసం ఉద్దాలకుని భార్య పొందు కోరాడు. దాంతో శ్వేతకేతుకు కోపం వచ్చింది. ఇది ధర్మవిరుద్ధమనీ, ఇకనుంచీ స్త్రీలు పరపురుషులతో సంబంధం పెట్టుకోడానికి వీల్లేదనీ, పెట్టుకుంటే సకలపాపాలూ చుట్టుకుంటాయనీ, మనుషులందరికీ ఈ విధమైన కట్టడి చేస్తున్నాననీ ప్రకటించాడు.
Posts: 13,923
Threads: 277
Likes Received: 22,865 in 11,162 posts
Likes Given: 2,685
Joined: Nov 2018
Reputation:
454
మరో సందర్భం చూద్దాం. తన కొడుకు విచిత్రవీర్యుడు మరణించిన తర్వాత కురువంశానికి నువ్వు ఒక్కడివే మిగిలావు కనుక రాజ్యపాలన చేపట్టి, వివాహం చేసుకుని, సంతానం కనమని భీష్ముడితో సత్యవతి అంటుంది. అందుకు నిరాకరించిన భీష్ముడు,‘దేవరన్యాయం’తో, అంటే నియోగ పద్ధతిలో విచిత్రవీర్యుని భార్యలకు సంతానం కలిగించే మార్గం ఉందని అంటూ దీర్ఘతముడనే ముని గురించి చెబుతాడు.
మమత అనే స్త్రీకి ఉతథ్యుడనే ముని వల్ల కలిగినవాడు దీర్ఘతముడు. అతను తల్లి కడుపులో ఉన్నప్పుడు బృహస్పతి వారి ఇంటికి అతిథిగా వచ్చాడు. అతడు ‘దేవరన్యాయం’తో మమత పొందు కోరాడు. కడుపులో ఉన్న దీర్ఘతముడు కోపించి, ఇది ధర్మవిరుద్ధమంటూ అడ్డుచెప్పాడు. అందుకు ఆగ్రహించిన బృహస్పతి ‘సర్వభూతేప్సితమైన’ ఈ కార్యంలో నాకు అడ్డు చెప్పావు కనుక పుట్టుగుడ్డివి కమ్మని శపించాడు. అందుకే అతనికి దీర్ఘతముడనే పేరు వచ్చింది.
విచిత్రం ఏమిటంటే, తన తల్లిని బృహస్పతి కాంక్షించడం ధర్మవిరుద్ధమని అడ్డుచెప్పిన ఈ దీర్ఘతముడే సంతానం లేని బలి అనే రాజు కోరిన మీదట అతని భార్యకు ‘దేవరన్యాయం’తో సంతానం ఇస్తాడు. సరే, అది వేరే కథ. ‘మామతేయుడు’, అంటే మమత కుమారుడు అనిపించుకున్న దీర్ఘతముడు మాతృస్వామ్య వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండచ్చని కోశాంబీ అంటారు.
ప్రకృతి సహజమైన లైంగిక సుఖాన్ని ‘సర్వప్రాణులకు సాధారణమైన, ఇష్టమైన సుఖావసరం’గా,‘అఖిలప్రాణి సాధారణంబైన ధర్మం’గా,‘సర్వభూతేప్సితమైన’, అంటే అన్ని ప్రాణులూ ఇష్టపడే కార్యంగా మహాభారత కథకుడు చెప్పడం నాకు ఎంతో అపురూపంగానూ, ఊహల్లో ఒకవిధమైన తాజాదనాన్ని నింపేదిగానూ అనిపిస్తుంది. ఈ చిత్రణ ప్రకృతి అంత సహజంగానూ, సూక్ష్మంగానూ ఉంది. మన పూర్వులు మనిషి సహజాతాలుగా ఆహార, నిద్రా, భయాలతో కలిపి మైథునాన్ని కూడా చెప్పడంలోనూ ఈ ప్రకృతిసహజత్వమే ఉన్నట్టుంది.
కాలగతిలో జరిగింది ఏమిటంటే, లైంగిక సుఖాన్ని ఒక అవసరమైన సుఖంగా, సర్వప్రాణిధర్మంగా గుర్తించడం కూడా మరచిపోయే స్థాయికి ఆ మాట నిషిద్ధపదాల జాబితాలో అట్టడుగుకు చేరిపోవడం. సమాజం, కట్టుబాటు, నీతి, న్యాయం లాంటి అనేకానేక పొరల మాటున ‘లైంగిక సుఖం’ గురించిన మౌలిక భావన మటుమాయమైపోయింది. లైంగిక సుఖం అనే మాట చుట్టూ రకరకాల మందమైన పొరలు చుట్టుకుంటూ పోయిన అనుభవంనుంచి చూసినప్పుడు;‘సర్వప్రాణి సాధారణమైన, ఇష్టమైన సుఖావసరం’గా,‘అఖిలప్రాణి సాధారణ ధర్మం’గా,‘సర్వభూతేప్సిత కార్యం’గా చెబుతున్న మన పూర్వులు లైంగిక సుఖాన్ని ప్రకృతికి అతి దగ్గరగా, ప్రకృతిలో భాగంగా; ఎటువంటి ఆచ్ఛాదనలూ లేని ఒక వినిర్మల, స్వచ్ఛ, పవిత్రధర్మంగా చూశారా అనిపిస్తుంది.
Posts: 13,923
Threads: 277
Likes Received: 22,865 in 11,162 posts
Likes Given: 2,685
Joined: Nov 2018
Reputation:
454
తరువాత చనిపోయిన ఆ మృగదంపతులను చూసి పాండురాజు బాధపడ్డాడు. అతనిలో పశ్చాత్తాపంతోపాటు వైరాగ్యమూ కలిగింది. ఎంత గొప్ప కులంలో పుట్టినా కర్మఫలం అనుభవించక తప్పదనుకున్నాడు. ఇక అన్ని బంధాలనూ విడిచిపెట్టి మునివృత్తిని స్వీకరించి, అన్ని ప్రాణులనూ సమబుద్ధితో చూస్తూ, హింసకు దూరంగా శేషజీవితాన్ని గడపాలనుకున్నాడు. కుంతి, మాద్రులకు తన నిర్ణయాన్ని చెప్పి, వారిని హస్తినాపురానికి వెళ్లిపొమ్మని కోరాడు. మేము చావనైనా చస్తాము కానీ మిమ్మల్ని విడిచి వెళ్ళమని వారు చెప్పారు. అయితే నాతోనే ఉండండని వారికి చెప్పి, తమ దగ్గర ఉన్న అమూల్య మణిహారాలను, ఏనుగులను, గుర్రాలను, గోవులను, ధనధాన్యాలను బ్రాహ్మణులకు దానం చేశాడు. ఇంకా మిగిలినవాటిని ధృతరాష్ట్రునికి పంపేశాడు.
ఆ తర్వాత, తనలానే తపస్వులుగా మారిన భార్యలిద్దరితో కలసి ఉత్తరదిశగా ప్రయాణం ప్రారంభించాడు. హిమాలయాలను కూడా దాటి, దేవతలు, సిద్ధులు నివసించే గంధమాదన పర్వతం మీద కొంత కాలం ఉండి, అక్కడినుంచి మరింత ముందుకు వెళ్ళి శతశృంగం అనే ప్రదేశానికి చేరుకుని తపస్సు ప్రారంభించాడు.
ఆ శతశృంగం కూడా ఎందరో దేవతలు, సిద్ధులు, యక్షులు నివసించే ప్రదేశం. స్వర్గానికి వెళ్ళే మార్గం అక్కడికి దగ్గరలోనే ఉంది. దివ్యవిమానం మీద వచ్చిపోయే దేవగణాలతో ఆ మార్గం కోలాహలంగా ఉంటుంది. అక్కడి ఉత్తరభాగంలో పాండురాజు తపస్సు చేసుకుంటూ ఉండగా ఓ రోజున వేలాదిమంది మునులు ఆ స్వర్గమార్గంలో పై లోకాలకు వెడుతూ కనిపించారు.
‘ఎక్కడికి వెడుతున్నా’రని పాండురాజు వారిని అడిగాడు.
‘ఈ రోజు అమావాస్య. ఎక్కడెక్కడి ఋషిగణాలు, పితృదేవతలు బ్రహ్మను సేవించుకోడానికి ఈ రోజున బ్రహ్మలోకానికి వెడుతుంటారు. మేము కూడా అక్కడికే వెడుతున్నా’మని వారు చెప్పారు.
అప్పుడు భార్యలిద్దరితో కలసి పాండురాజు వారి వెనక బయలుదేరాడు. మిట్టపల్లాలతో నిండిన ఆ మార్గంలో వాళ్ళు అతి కష్టం మీద నడుస్తున్నారు. మునులు వెనుదిరిగి చూశారు. కుంతి, మాద్రుల కష్టాన్ని గమనించారు.
Posts: 13,923
Threads: 277
Likes Received: 22,865 in 11,162 posts
Likes Given: 2,685
Joined: Nov 2018
Reputation:
454
‘వీళ్ళు అతి కోమలులు. కొండలు, గుహలతో నిండిన ఈ క్లిష్టమైన మార్గంలో వీళ్ళు రాలేరు. కనుక ఇక్కడ ఆగిపొండి. పైగా ఇవి దేవతలు వెళ్ళే దారులు’ అని పాండురాజుకు చెప్పారు.
‘మునులైనా సరే, సంతానం లేనివారు స్వర్గద్వారాన్ని చేరుకోలేరని విన్నాను. పుత్రులు లేని వారికి స్వర్గం లభించదని వేదం చెబుతోంది. నేను కొడుకులు లేని వాణ్ణి. ఏం చేయగలను?’ అని పాండురాజు మునులతో నిస్పృహగా అన్నాడు.
మునులకు అతని మీద జాలి కలిగింది. యోగదృష్టితో జరగబోయేది చూశారు. ‘నువ్వు పుత్రులు లేనివాడివి కావు. దైవకారణంతో నీకు యమ, వాయు, ఇంద్ర, అశ్వినీ దేవతల వరం వల్ల కొడుకులు కలుగుతారు. నీకు అక్షయలోకాలు సిద్ధిస్తాయి. కనుక సంతానం కోసం ప్రయత్నించు’ అని ముందుకు సాగిపోయారు.
ఆగిపోయిన పాండురాజు ఆలోచనలో పడ్డాడు. ‘మనిషి పుడుతూనే దేవ, ఋషి, పితృ, మనుష్యరుణాలనే నాలుగు రుణాలతో పుడతాడు. ఆ రుణాలను తీర్చుకుంటే తప్ప పుణ్యలోకాలు లభించవు. నేను మొదటి మూడు రుణాలనుంచీ బయటపడ్డాను. చనిపోతే అన్ని రుణాలూ తీరిపోతాయి కానీ; శ్రాద్ధాలతోనూ, సంతానంతోనూ తీరే పితృరుణం చనిపోయినా తీరదు. అదెలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. మృగశాపం వల్ల నాకు సంతానం కలిగే అవకాశం లేదు’ అనుకుని దుఃఖించాడు.
Posts: 13,923
Threads: 277
Likes Received: 22,865 in 11,162 posts
Likes Given: 2,685
Joined: Nov 2018
Reputation:
454
ఒక రోజున కుంతితో ఏకాంతంగా మాట్లాడుతూ తన బాధంతా చెప్పి,‘ఇతరమైనవేవీ ఆలోచించకుండా ధర్మబద్ధంగా నాకు సంతానం ఇచ్చే వేరొక మార్గం చూడ’ మని కోరాడు. పన్నెండు రకాల పుత్రుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు:
1. ఔరసుడు: తన వర్ణానికే చెందిన భార్య వల్ల తనకు కలిగిన కొడుకు ఔరసుడు.
2. క్షేత్రజుడు: తనకు సంతానం లేనప్పుడు నియోగ పద్ధతిలో అర్హుడైన వేరొక పురుషుని ద్వారా తన భార్యకు కలిగే కొడుకు క్షేత్రజుడు.
3. దత్తుడు: వేరొకరి కొడుకును శాస్త్రోక్తంగా దత్తత చేసుకుంటే అతడు దత్తుడు.
4. కృత్రిముడు: తల్లిదండ్రులు లేని అనాధను చేరదీస్తే అతడు కృత్రిముడు.
5. గూఢజుడు: తన భార్యకు పరపురుషుని వల్ల రహస్యంగా కలిగిన కొడుకు గూఢజుడు.
6. అపవిద్ధుడు: తల్లిదండ్రులు విడిచి పెట్టేసినప్పుడు దగ్గరకు తీసి పెంచితే అతడు అపవిద్ధుడు.
7. కానీనుడు: పుట్టింట్లో ఉన్నప్పుడు పెళ్లి కాకుండా కొడుకును కంటే అతడు కానీనుడు.
8. సహోఢుఢు: గర్భవతి అని తెలిసో తెలియకో ఒకామెను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకు కలిగే కొడుకు భర్తకు సహోఢుఢు.
9. క్రీతుడు: ఇంకొకరి కొడుకును కొనుక్కుంటే అతడు క్రీతుడు.
10. పౌనర్భవుడు: భార్యా, భర్తలు విడిపోయినప్పుడు; లేదా భర్త మరణించినప్పుడు భార్యకు ఆ తర్వాత మరొకరి సంబంధంవల్ల కొడుకు పుడితే అతడు ఆమె అసలు భర్తకు పౌనర్భవుడు.
11. స్వయందత్తుడు: తల్లిదండ్రులు లేనివాడు, లేదా తల్లిదండ్రులు వదిలేసినవాడు తనంతట తాను ఇంకొకరికి అమ్ముడుపోతే అతడు స్వయందత్తుడు.
12. జ్ఞాతుడు: అన్నకో, తమ్ముడికో పుట్టినవాడు వరసకు తనకు కూడా కొడుకే. అటువంటివాడు జ్ఞాతుడు.
Posts: 13,923
Threads: 277
Likes Received: 22,865 in 11,162 posts
Likes Given: 2,685
Joined: Nov 2018
Reputation:
454
పన్నెండో రకం పుత్రుడి విషయంలో తేడాలున్నట్టున్నాయి. వర్ణసాంకర్యం వల్ల కలిగిన కొడుకును పారశవుడిగా, పన్నెండో పుత్రుడిగా మనుధర్మశాస్త్రం చెబుతోంది. మొదటి ఆరు రకాల పుత్రులూ బంధువులు, దాయాదులూ అవుతారనీ; చివరి ఆరు రకాల పుత్రులూ బంధువులు మాత్రమే అవుతారనీ పాండురాజు అంటాడు.
దాయాదులకు ఆస్తిలో వాటా ఉంటుంది. పాండురాజు ఇంకో మాట కూడా అంటాడు…బంధువులు, దాయాదులు అయిన కొడుకులందరూ ఔరసునికి ఏమాత్రం తక్కువ కారు. వాళ్లలో క్షేత్రజుడు మరింత శ్రేష్ఠుడు. అందులోనూ దేవరన్యాయంతో పుట్టినవాడు ఇంకా శ్రేష్ఠుడు. కనుక నా నియోగంతో ధర్మమార్గంలో క్షేత్రజులను కనవలసిందని కుంతిని కోరాడు.
Posts: 13,923
Threads: 277
Likes Received: 22,865 in 11,162 posts
Likes Given: 2,685
Joined: Nov 2018
Reputation:
454
మ్యాన్ bro
మిమ్మల్ని ఇక్కడ చూసినందుకు సంతోషంగా ఉంది.
ఎలా ఉన్నారు.
Hyd vellali అన్నారు
Posts: 13,923
Threads: 277
Likes Received: 22,865 in 11,162 posts
Likes Given: 2,685
Joined: Nov 2018
Reputation:
454
కిషన్ భాయ్
ఈ కథ నేను చదవలేదు.