Thread Rating:
  • 244 Vote(s) - 2.77 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

*Important* ✍( ͡ಠ ͜ʖ ͡ಠ) అన్ని తెలుగు స్టోరీ త్రెడ్స్ లింక్స్ ( పాఠకుల కోసం ) ✍( ͡ಥ ͜ʖ ͡ಥ)Running

Showing only the posts of sarit11: 219 of 840 posts. Show all posts
#21

ధన్యవాదాలు మిత్రులారా .
దాదాపుగా మొదటి పేజీ మొత్తం అయిపోయినట్టే.
మిగిలిన 1 తీరికగా పెడతాను..

పేజీ నెంబర్ -2
ఇందులో 4 దారాలను కాపీ చేయాలి.
ఇందులోవి ఇంకా ఏమైనా పెట్టి ఉంటే తెలుపగలరు.

[Image: Replies-2.jpg]






 horseride  Cheeta    
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22

(18-11-2018, 09:11 PM)Okyes? Wrote:  సరిత్ భాయ్ తెలుగు సెక్షన్ 100 దారాలు పూర్తికరించిన వేళలో
Congratulations......అభినందనలు

గిరీశం బాబాయ్

థాంక్యూ .
నా ఒక్కడివలన ఎలా సాధ్యం అవుతుంది.
మిత్రులందరి సహకారం వలన ఇది ఇంత త్వరగా సాధ్యపడింది.

అలాగే ఇంగ్లీషు, హిందీ సెక్షన్లను కూడా ముందుకు తీసుకెళ్లాలి.

 horseride  Cheeta    
Like Reply
#23

(21-11-2018, 09:47 PM)Lakshmi Wrote:     బావగారూ...
Xossip లో తొలితరం రచయిత్రి.. అసంపూర్ణం అయినా అద్భుతమైన కథల్ని అందించిన కావ్య గారి కథల్ని ఇక్కడ అందిస్తే బాగుంటుంది...
పిడిఎఫ్ లా కాకుండా.. వారిపేరుతోనే వేరే దారాలు తెరిచి పోస్ట్ చేస్తే బాగుంటుంది....
మీకు వీలు కాకపోతే పిడిఎఫ్ లు నాకు పంపినా నేనైనా వాటిని పోస్ట్ చేస్తాను


మరదలా లక్ష్మి

అలా ఏ ఒక్క కథ కూడా  మిస్ కాకూడదు అని దారాల ఇండెక్స్ పెడుతున్నాను వరుసగా.
అన్ని కథలూ వస్తాయి , మన మిత్రులు భుజం కలిపి నడుస్తున్నారు.
దేని పని దానిదే. పి‌డి‌ఎఫ్ , text  రెండూ వస్తాయి.

 horseride  Cheeta    
Like Reply
#24

మిత్రులారా

రెండవ లిస్టులో మరొక నాలుగు కథలు మిగిలి పోయినాయి.

1. 11 Nights with 11 Heroins!!!!!!!!
2. తెలుగు సెక్స్ కథలు Huge Collection
3. ఖర్కోటఖుడు
4. సన్నీ గాడి శృంగార నిధి యాత్ర  

పేజీ - 3
నాకు ఈ పేజీలోని కథలు రెండు మాత్రమే ఇక్కడ పెట్టినట్టు కనిపించాయి .
నేను ఏవైనా మిస్ అయిఉంటే తెలుపగలరు.
[Image: list-3.jpg]

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#25

(27-11-2018, 07:14 AM)stories1968 Wrote:  [Image: Ds4q-Jc-FXQAAy-H5v.jpg]

భయ్యా stories1968 (బొమ్మల బ్రహ్మ)

బొమ్మలు పెట్టడం వచ్చేసిందిగా .
ఇక మీ సృష్టిని ఇక్కడ కొనసాగించండి.

Note:- మామూలుగా నైతే మీ పోస్టును రిప్లై అని నొక్కగానే Quote లో బొమ్మ పెద్దగానే వచ్చింది ,
కానీ నేను ఆ బొమ్మని click చేస్తే అది సెలెక్ట్ అవుతుంది, నాలుగు మూలలకి చిన్న డబ్బాలు (square-స్క్వేర్)లు వస్తాయి.

వాటిని cursor తో పట్టుకుని లోనికి లాగితే బొమ్మ పైన వచ్చినట్టు ఇలా చిన్నగా వస్తుంది.

ఒక సారి ప్రయత్నించి చూడగలరు.

 horseride  Cheeta    
Like Reply
#26

(27-11-2018, 07:18 AM)stories1968 Wrote:  వందనాలు సరిత్ చాల ఇబ్బంది పడినాను అప్లోడ్ కాకా 
[Image: Di-Ctw1-HU8-AAv9-YT.jpg]

ఇది కూడా మరొక ఉదాహరణగా చూపెడుతున్నాను.

reply .

click big image . ( మూలలకు చిన్న square లు వస్తాయి)

వాటిని పట్టుకుని , లోనికి లాగితే బొమ్మ ఇలా చిన్నగా అవుతుంది.

 horseride  Cheeta    
Like Reply
#27

(23-11-2018, 09:09 PM)Raju Wrote:  సరిత్ భయ్యా.. ఒక ఇంగ్లీష్ కథ

INDIAN HOUSEWIFE : I HAD TO DO IT

(writer name... xossind)

అనే కథ దొరుకుతుందా...

లక్ష్మి గారు అనువాదం చేస్తానన్నారు...
(once  I have suggested  her )
ఇప్పుడు నా దగ్గర ఆ కథ లేదు

Raju భాయ్

ఈ కథ పోస్టు చేయడం మొదలు పెట్టాను.
ఇంగ్లీష్  సెక్షన్ చూడగలవు.

 horseride  Cheeta    
Like Reply
#28

వికటకవి గారు నాకు పంపించారు.


చేదు నిజం ( చిన్న కథ)
రచన - గోపాల్


అనగనగా ఒక ఊరు... ఆ ఊరిలో ఒక బ్యాంకు బ్రాంచ్....
ఉదయం 11 గం...

ఆ బ్రాంచ్ లో స్టాఫ్ ని తక్కువగా పోస్ట్ చేయడంతో, ఇందు గలదండు లేడని సందేహము వలదు అన్నట్లు... బ్రాంచ్ మేనేజర్.. అటు కౌంటర్ ల లోకి ఇటు మేనేజర్ కేబిన్ లోకి పరుగులెత్తుతున్న టైం.

మేనేజర్ కేబిన్లో కూర్చుని వుండగా ఒక పెద్దమనిషి.... సుమారుగా 65 – 70 సంవత్సరాలు వుంటాయి, దీనమైన ముఖ కవకవలికలతో కేబిన్ లోకి వచ్చాడు. అతని దీనమైన ముఖం చూడగానే మేనేజర్ కి అనిపించింది, ఇతనేదో అప్పు అడగటానికే వస్తున్నాడని. రిలాక్స్డ్ గా కుర్చీ లో వెనుకకు చేరగిల బడుతూ అడిగాడు “ఎం కావాలండి”

"మీతో ఒక పది నిముషాలు మాట్లాడాలండి.,

చెప్పండి

"సార్, నా ఫిక్స్డ్ డిపాజిట్లు మీ బ్యాంకు లో 20 లక్షల వరకు వున్నాయండి."
రిలాక్స్డ్ పోసిషన్ లోనించి సర్దుకొని నిటారుగా కూర్చున్నాడు మేనేజర్.

"చెప్పండి"

పెద్దాయన చెప్పడం కొనసాగించాడు “ నేను గత 15 సంవత్సరాలుగా మీ బ్యాంకు లోనే ఖాతా మైంటైన్ చేన్స్తున్నానండి. నేను ఉద్యోగం చేసే రోజుల నించి, నా శాలరీ ఎకౌంటు ఇక్కడే ఉండేది. అప్పుడు ఇంటికి, బండికి ఋణం కూడా మీ దగ్గరే తీసుకున్నాను. అవన్నీ రిటైర్మెంట్ ముందే తీర్చేసాననుకోండి. తరువాత, నా రిటైర్మెంట్ లో వచ్చిన డబ్బులు ఇప్పుడు మీ దగ్గరే ఫిక్స్డ్ డిపాజిట్ గా వేసాను.”

"చాలా సంతోషం " అన్నాడు మేనేజర్.

నాకు నా భార్యకు జరుగుబాటు ఈ డిపాజిట్ ల మీద వచ్చే వడ్డినే. అయితే, నేను రిటైర్ అయినప్పుడు మీరు 9% వడ్డీ ఇచ్చే వారు. ఇప్పుడు వడ్డీ ఏమో 6.50-7% మాత్రమె ఇస్తున్నారు. ఇంతకు ముందు నెలకు 15,000 వచ్చేవడ్డీ, ఇప్పుడు 10,000 మాత్రమే వస్తున్నది. బయట ధరలేమో ఈ అయిదారేళ్ళలో దరిదాపు రెట్టింపు అయినాయి. మా రోగాలు చూస్తె పెరిగేవి తప్పితే తరిగేవి కాదు. చాలా కష్టంగా ఉందండి.

మేనేజర్ కూడా ఆయన పరిస్థితి కి విచారం వ్యక్తం చేసాడు.

15 సంవత్సరాల నించి మీ దగ్గరే ఎకౌంటు వుంది. లాయల్ కస్టమర్ గా గుర్తించి ఏమైనా extra వడ్డీ ఇవ్వ గలిగితే నాకు ఎంతో వుపయోగమవుతుంది.” అన్నాడాయన.

మేనేజర్ కు ఎం చెప్పాలో అర్థం కాలేదు.

“చూడండి. ఈ వడ్డీ రేట్లు హెడ్ ఆఫీస్ లెవెల్ లో ఫిక్స్ అవుతాయి. అంతకంటే ఎక్కువగా ఇచ్చె పవర్స్ మా దగ్గర వుండవు.” అన్నాడు.

"పోనీ హెడ్ ఆఫీస్ తో మీరే మాట్లాడండి సార్ "

"వాళ్ళు కూడా ఎక్కువ వడ్డీ ఇచ్చే పరిస్థితి వుండదండి. ఎందుకంటే, ఈ రోజుల్లో బ్యాంకు profit margin చాలా తగ్గిపోయింది. దానినే NIM అంటాము. అది బాగా తగ్గిపోయింది. హెడ్ ఆఫీస్ కూడా ఏమి చేయలేదు. అయినా మా ఒక్క బ్యాంకే కాదండి, అన్ని బ్యాంకు లు వడ్డీ రేట్లు తగ్గించేస్తున్నాయి."

“అయితే ఏమి అవకాశం లేదంటారా ... “ నిరాశగా అడిగాడు పెద్దాయన.

ఎం చెప్పాలో తెలియక మౌనం వహించాడు మేనేజర్.

ఇంతలో ఒక నడివయస్సు జంట మేనేజర్ కేబిన్ లోకి వచ్చారు.

“కూర్చోండి “ అన్నాడు మేనేజర్.

“సార్. మేము మీ దగ్గర హౌసింగ్ లోన్ తీసుకున్నమండి, ఇంకా ఐదేళ్ళు వుంది లోన్ తీరడానికి. కాని కొంత డబ్బు అనుకోకుండా వచ్చింది, ఇప్పుడే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాము.” అంది ఆడమనిషి.

"తప్పకుండా. ఎంత కట్టాల్సి వస్తుందో చూసి చెప్తాను. ఒక్క పది నిముషాలు వెయిట్ చేయగలరా..."

“చూడండి. గత 15 ఏళ్లుగా, క్రమం తప్పకుండా.. ప్రతి నెల 5 తారీకు ఠంచనుగా మా EMI కడుతున్నమండి. కావాలంటే మా అకౌంట్ చూసుకోండి. ...కనుక, ఎమైనా వడ్డీ మినహాయించ గలరేమో చూసి ఆ బెనిఫిట్ మాకు ఇవ్వాలి.” అన్నదావిడ.

మేనేజర్ ఒక నిట్టూర్పు విడిచాడు. ఇదే ప్రశ్న చాలా సార్లు ఎదుర్కొన్నవాడిలాగా.

“చూడండి మేడం, మీరు చెప్తున్నది కరెక్టే. కాని బ్యాంకు వైపు నుంచి ఆలోచించండి. 20 సంవత్సరాలు మీ ఇంటి ఋణం వుంటుంది అని, ఆ మేరకు బ్యాంకు కు ఆదాయం వస్తుందని అంచనా వేసి మీకు ఇంత తక్కువ రేటుకి ఋణం ఇచ్చాము. కాని ఇప్పుడు మీరు 15 సంవత్సరాలకే ఎకౌంటు క్లోజ్ చేస్తున్నారు. మరి ఈ ఇదు సంవత్సరాల ఆదాయం బ్యాంకు కి లాస్ కదండీ. అందుకనే, pre-payment పెనాల్టీ వేస్తుంటాము,”

"అయ్యో అదేమిటండి,మేము concession గురించి మాటాడు తుంటే, మీరు పెనాల్టి అంటున్నారు."

బ్యాంకు ప్రాఫిట్ margins బాగా తగ్గి పోయినాయండి. అందుకే ఎలాంటి concessions ఇచ్చే పరిస్థితుల్లో బ్యాంకు లేదు. మీరింతగా అడుగుతున్నారు గనుక, హెడ్ ఆఫీస్ కి మీ పెనాల్టి waive చేయమని సిఫార్సు చేస్తాను.

ఆవిడకి బాగా కోపం వచ్చింది “ ఇంత లోన్ కట్టిన వాళ్లకి ఆ కాస్త కట్టడం కష్టం కాదులెండి, అయినా, మాకు కొంత concession ఇస్తే, పద్ధతి గా మేము ఋణం చెల్లించిన విధానాన్ని గుర్తించారని ఒక సంతృప్తి. పోన్లెండి ఎంత కట్టలో చెప్పండి కట్టేస్తాం.”

ఇంతలో డెస్క్ ఆఫీసర్ హడావిడిగా కేబిన్ లోకి వచ్చాడు

"సార్, ఆ చౌదరి గారు వస్తున్నారు."

మేనేజర్ “ఒక్క నిమిషం” అంటూ పర్మిషన్ అడుగుతున్న కవళికలు పెడుతూ, హడావిడిగా హాల్ లోకి వెళ్ళాడు. అప్పుడే వస్తున్న ఆ సదరు చౌదరి ని తోడ్కొని కేబిన్ లోకి వచ్చాడు.

“నిన్న మా ఇంటికి వచ్చారంట” అధికారికంగా అడిగాడు చౌదరి.

"అవునండి, వారం రోజుల నించి మిమ్మల్ని కలుద్దామని ప్రయత్నం, మీరు దొరకటంలేదు."

"చెప్పాను కదా, ఎప్పుడు కలవాలో నేనే చెప్తానని, ఇంత లోనే అలా హడావిడి పడితే ఎలా..."

"పై నించి వొత్తిడి.... "గొణిగాడు మేనేజర్.

“మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి “ చౌదరి అన్నాడు, తన విషయాలు వేరే వాళ్లు వినడం ఇష్టం లేదన్నట్టు మొహం పెడుతూ.

అర్థమయింది అన్నట్లు తలూపి, ఆ పెద్ద మనిషి ని, ఆ నడివయస్సు జంట ని, కాస్సేపు కేబిన్ బయట వెయిట్ చేయమని రిక్వెస్ట్ చేసాడు మేనేజర్.

వాళ్ళు లేచి బయటకు వచ్చి కూర్చున్నారు.

"అందరూ సమాన మంటారు, కాని పెద్ద కస్టమర్ వస్తే, మిగతా వాళ్ళు పట్టనే పట్టరు వీళ్ళకి" తన అసహనాన్ని వ్యక్తం చేసింది ఆవిడ.

“పోన్లెండి, ఎంత పెద్ద కస్టమర్ కాకపోతే, మేనేజర్ అంతగా విలువ ఇస్తాడు, వాళ్లకి బ్యాంకు బిజినెస్ పెంచాల్సిన బాధ్యత ఉంటుందిగా..." అన్నాడు పెద్దాయన.

కేబిన్ డోర్ క్లోజ్ అయిన వెంటనే చౌదరి తన కోపాన్ని చాలా తీవ్రంగా వ్యక్తం చేసాడు.

“ ఇలా నాకు చెప్పకుండా ఇంటికి వస్తే మాత్రం కుదరదండి. ఎన్నిసార్లు చెప్పాను నేనే బ్యాంకు కి వస్తానని.”

"కరెక్టే అనుకోండి, కాని ఒక కోటి NPA ( Non performing Assets)ఎకౌంటు. ఈ నెలాఖరు లోపు క్లోజ్ చేయించమని మా సర్కిల్ ఆఫీస్ వాళ్ళు షంటుతున్నారు. రోజుకి కనీసం 4,5 ఫోన్లు వస్తున్నాయండి నాకు, మా బాస్ దగ్గరనించి."

"అయితే, మీ కనిపిస్తే క్లోజ్ చేసేస్తామా.... మా దగ్గర డబ్బులు ఉండొద్దా...."

“అయినా.. లోన్ తీసుకున్న ఆరు నెలలకే ఎకౌంటు NPA అయిపొయింది. NPA అయి ఇప్పటికి సంవత్సరం. మొదటి మూడు నెలల వడ్డీ తప్పితే మీరు ఎకౌంటు లో జమ వేసిందే లేదు.” అన్నాడు మేనేజర్.

“గవర్నమెంట్ చెప్తున్న రూల్ ప్రకారమే లోన్ ఇచ్చారుగా. ఇంకెందుకు ఇవన్ని అంటారు. కొత్తగా పెట్టె యూనిట్ లకి లోన్ ఇవ్వమనేగా చెప్తోంది గవర్నమెంట్. ఎదో బిజినెస్ బాగా నడుస్తుంది అనుకున్నాం, అలా జరగలేదు.... ఎం చేస్తాం,” నింపాదిగా జేబు లో నించి వక్కపొడి పొట్లం తీసి నోట్లో వేసుకుంటూ అన్నాడు చౌదరి.

"పోన్లెండి... ఇప్పుడు ఆ చర్చ ఎందుకు... ఎప్పుడు క్లోజ్ చేస్తారు ఎకౌంటు. "

“ఎంత ఋణం మాఫీ చేస్తారు.” ఈ విషయాలలో పండి పోయిన వాడుగా అడిగాడు చౌదరి.

“వడ్డీ పూర్తి గా మాఫీ చేస్తాము. తీసుకున్న అసలు కట్టేయండి”. అన్నాడు మేనేజర్,
ఇట్లాంటి NPA కస్టమర్ తో మాట్లాడాల్సి రావడం ఎ జన్మలో చేసుకున్న పాపమో అనుకుంటూ.

పెద్దగా నవ్వాడు చౌదరి. "NPA అకౌంట్స్ లో ఈ రోజుల్లో ఎవడన్నా వడ్డీ గురించి మాట్లాడుతున్నాడా. అసలు లో ఎంత మాఫీ అవుతుందో చెప్పవయ్య సారూ. "

మేనేజర్ ఓపిగ్గా చెప్పడం మొదలు పెట్టాడు. "చూడండి. బ్యాంకు profit margins ఈ రోజుల్లో బాగా తగ్గి పోయాయి. వడ్డీ మాఫీ చేయడమే చాలా కష్టం. ఇంక అసలు లో కూడా తగ్గించడమంటే... not possible."

చౌదరి చిద్విలాసంగా ఒక నవ్వు నవ్వి చెప్పడం మొదలెట్టాడు. “ చూడండి సారూ, మీ ఒక్క బ్యాంకు లోనే కాదు, నేను దరిదాపు పది బ్యాంకులతో వ్యవహారాలూ నడుపుతాను. నాకు ఈ రూల్స్ అన్ని తెలుసు. అయినా ఈ లోన్ మా బావమరిది పేరొతో పెట్టిన యూనిట్ కి తీసుకున్నాను. వాడు ఇంట్లో ఖాళి గానే ఉంటున్నాడు. ఎందుకు బావా, డబ్బులు తిరిగి కట్టడం. కావాలంటే కేసు వేస్కోమను, తేలేటప్పటికి 10 ఏళ్ళు పడుతుంది అంటున్నాడు. నేనే... అలా... కాదురా... దేనికైనా... ఒక న్యాయం వుంటుంది. మనం ఎంత కట్టగలమో చూసి మిగతాది బ్యాంకు మాఫీ చేస్తుంది... లేకపోతే వాళ్లకి మొత్తం నష్టం కదా అని చెప్పాను. నా బలవంతం మీద, ఎదో ఎకౌంటు సెటిల్ చేసుకోడానికి ఒప్పుకున్నాడు. కాబట్టి, మీరింక ఎక్కువ తిరకాసు పెట్టకుండా... ఎంత మాఫీ చేస్తారో చెప్పండి.” అన్నాడు చౌదరి

5% వరకు అసలు మాఫీ చేయమని నేను హెడ్ ఆఫీస్ తో మాట్లాడుతాను."

“సారూ. ఆఖరుగా ఒక్కటే మాట. మా ఆడిటర్ కి మీ రూల్స్ అన్ని బాగా తెలుసు. ఈ కండిషన్ లో వున్న ఎకౌంటు కి 30% అసలు అండ్ పూర్తీ వడ్డీ మాఫీ చేస్తారని చెప్పాడు. అందుకు ఏమన్నా ఒకే అంటే చెప్పండి. ఒక రెండు నెలలలో ఎకౌంటు క్లోజ్ చేస్తాను. మీ హెడ్ ఆఫీస్ తో మాట్లాడి చెప్పండి. “ అని లేచి ఒక కరచాలనం ఇచ్చి వెళ్ళిపోయాడు. మేనేజర్ కు ఇంకా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.

వెంటనే మేనేజర్ తన బాస్ కి రింగ్ చేసి విషయం చెప్పాడు.

“వెరీ గుడ్. మంచి ప్రపోసల్. వెంటనే సెటిల్ చేసేయి. ౩౦% అంటే బ్రాంచ్ మేనేజర్ కే పవర్ ఉందిగా మాఫీ చేయడానికి.
“అవును సార్. సర్, అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ సార్"

"చెప్పు"

"నా దగ్గరకి మన లాయల్ కస్టమర్లు ఇద్దరు వచ్చారు. ఒకరేమో 15 ఏళ్ల నుంచి మన దగ్గరే డిపాజిట్ లు వున్నాయి. పాపం, పెద్ద వయసాయన, వడ్డీ ఏమైనా ఎక్కువ ఇవ్వగలమా అని అడుగు తున్నాడు సార్.
0.50% అదనంగా ఇస్తే మనకి సంవత్సరానికి 10000/- అవుతుంది. కాని ఆయనకీ బాగా ఉపయోగ పడుతుంది. ఇంకొకరేమో 15 ఏళ్ల నించి రెగ్యులర్ గా లోన్ EMI కడుతున్నారు. వడ్డీలో concession
అడుగుతున్నారు. 0.25% అంటే 25000/- అవుతుందండి."

"ఎం మాట్లాడు తన్నావయ్య నువ్వు.... రూల్స్ ఆ మాత్రం తెలియదా నీకు.... rules will not permit."

"తెలుసు సార్, కానీ ఎందుకో ఈ విషయం చెప్పాలనిపించింది. ఓకే సార్, అదే చెప్తాను వాళ్లకి. వుంటాను సార్."

గోడకి తగిలించి వున్న ఫోటో లోని శ్రీ కృష్ణుడు పునరాలోచానాలో పడ్డాడు.... తను ప్రవచించిన వాక్యం “ధర్మం ఎప్పుడైనా జయిస్తుంది” ని సవరించాలా... వొద్దా... అని.

 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply
#29

Testing to upload pics from mediafire.


[Image: c95pva3y6p7m80i4g.jpg]

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#30

Try this to upload pics

https://imgadult.com/

 horseride  Cheeta    
Like Reply
#31

(10-12-2018, 06:29 PM)SRohit1045 Wrote:  హ్మ్మ్..... హ్మ్మ్......  హై  అండి   సరిత్ గారు.....  ప్లీస్ అండి మిగతా రచయితలకు  ఇ సైట్ గురించి   తీలిసేలా  ఏదైనా  cheyandi plz...   Youtube   లో యాడ్   gani..... Inka edaina .... Please andi.... Please.... Nenu  request mathrame chesthunnanu..... Please.... Andi.... Please.... 

మిత్రమా SRohit1045

మీకు వీలైతే మీరుకూడా చేయవచ్చు youtube , reddit , quora , twitter , facebook వీటిల్లో మన సైట్ కు ఒక పేజీ తెరిస్తే ఎలా ఉంటుంది.


ఆలోచించండి.
https://www.youtube.com/watch?v=4slrePTgNiE

https://www.youtube.com/watch?v=RW0HrUrVPi0

https://www.youtube.com/watch?v=x4Fj1lrrMys

https://www.youtube.com/watch?v=lmtdqvD3rqM

https://www.youtube.com/watch?v=JgFTP8XrdbA



[Image: 5c0e9e55263f6.jpg]


==============
[Image: 5c0e9e77422f8.jpg]

ఇలా ఉన్నాయి . మనం కూడా మన సైట్ గురించి రిప్లయ్ ఇవ్వొచ్చు.
Like Reply
#32

(18-12-2018, 10:42 PM)Abhiram143 Wrote:  ee katha perento evaraina cheppandi
full story vunte dayachesi upload cheyyandi

Dear Abhiram143

ఈ కథ అరుంధతి .మన మిత్రుడు bigcock4rmompussy వ్రాశాడు.
21st December 2013  నాడు  xossip లో.  

[Image: arndti.jpg]

 horseride  Cheeta    
Like Reply
#33

(31-12-2018, 12:00 PM)pastispresent Wrote:  Nenu sarith gari peru endhuku mention cheyaledhante ippudu porn sites kaani sex sites kaani anni ban chesthunnaru government vaallu, ilanti site gurinchi chepthu aayana peru palakaristhe adhi manchidhikaadhani cheppateldhu.......

em anukokandi sarith garu.....

అలా చెప్పక పోవడమే చాలా మంచిది మిత్రమా.

ఇక మన మిత్రుడు ~rp గారు చెప్పినట్టు , ఇక అలా వేరే దగ్గర మన సైటు గురించి పెట్టకపోతేనే మంచిదేమో ఆలోచించండి.
అందరం కలిస్తేనే ఈ సైటు ఇలా మంచి కంటెంటుతో  వృద్ది చెందింది.

ఒక్కడే ఏమి చెయ్యలేడు మిత్రమా.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#34

stories 1968 గారి ఒకానొక అద్భుతమైన చిత్రానికి వీరి మాట
22nd February 2017

Quote:Originally Posted by malathirasagna
ఈ అనంత ప్రకృతి లో కెల్లా అత్యంత సుందర రమణీయ దృశ్యము ' స్త్రీ పురుష సంగమ'మే. చిత్రం లోని ఆవిడ కాలి బొటన వ్రేలు, మధ్య వేలు ముడివేసుకున్న విషయం గమనిస్తే ఆమె ఏలాటి స్వర్గతీరాలలో విహరిస్తుందో తెలియుచున్నది. " స్టోరీస్ " గారూ మీ బొమ్మలు చాలా బావుంటాయి ... ఇదైతే మరీనూ . కృతజ్ఞతలు

kamal kishan
బాగుందండీ మీ మాట, ప్రతి మాటా అమృతమే
ఈ అనంత ప్రకృతి లో - ఈ స్టేట్మెంట్ correct 'ఇది అనంత ప్రకృతే' అందులో అత్యంత సుందర రమణీయం
స్త్రీ పురుష అనంగం, సంగమం, సమాగం - మీనింగ్ ఒకటే కానీ స్త్రీ పురుష అనంగం అంటే కాలి మధ్య వేలి నరం వెనుకనుండి పాకి ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర అండం కి ముందు orgasm కి వెళ్ళుతుంది. అలా అండం విడుదల అయ్యి తన orgasm అదే స్వర్గ తీరాలలో విహరిస్తునది అని
చాలా correct.

 horseride  Cheeta    
Like Reply
#35

(11-02-2019, 05:31 AM)stories1968 Wrote:  లోకంబులు లోకేశులు, లోకస్థులు దెగినతుది నలోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వండు, నేకాకృతి వెలుగు నతనినే సేవింతున్


లోకాలు,లోకాలనేలినవారు,లోకాల్లో నివసించేవారు
 అంతానాశనమయ్యాక గొప్పచీకటి ఆవరించినప్పుడు 
ఎవరైతే ఒకేరూపంతో వెలుగులు విరజిమ్ముతూ 
ఉంటాడోఅతనినే నేనుసేవిస్తాను.
అ ఒక్కడు సరిత్ 

[Image: Dw-Wl-Pj3-Uc-AA7uet-1.jpg]

(11-02-2019, 05:36 AM)stories1968 Wrote:  దిక్కులు కాలముతో నేదిక్కున లేకుండు గలుగు దిక్కుల మొదలై
దిక్కుగల లేని వారికి దిక్కెయ్యది యదియ నాకు దిక్కు మహాత్మా!

కాలముతో పాటు దిక్కులూ 
ఎక్కడి కెళ్ళినా ఉంటూనే వుంటాయి. 
ఈ దిక్కులు మొదలైనప్పుడు 
ఏదిక్కూ లేనివారికి ఎవరు
 దిక్కయ్యారో వారే నాకుదిక్కు
[Image: 26166683-391936901248943-5443977426140617468-n.jpg]
xossip మూసి వేసినప్పుడు ఎవరు దిక్కు ఆయనారు
వారికే ఈ పూజలు

Stories భాయ్


ఇంతలా పొగిడితే తట్టుకోవడం కష్టం.
మరీ పూజలు కూడా అంటే ఎలా భాయ్.

 horseride  Cheeta    
Like Reply
#36

22nd March 2017 నాడు
xossip లో నా దారంలో passionateman45plus భాయ్ quote చేసి పెట్టినపోస్టు.

ఇప్పుడు ఈ మరదలు  మాధురి పాటిల్ ఎక్కడ ఉందో మరి.




Quote:Originally Posted by madhuripatil000
హాయ్ బావలు .... నేను మొదలుపెట్టిన అరటిపండు కైవారం కథని మధ్యలోనే, నేను నా నెంబర్ పోస్ట్ చేశా అని అడ్మిన్ గడు నా ఎకౌంటు బ్లాక్ చేయడం వల్ల పూర్తి చేయలేకపోయా

ఆడి సుల్లి కోసి చేతిలో పెట్టాలి బావలు ... మనం
.. ఐన మన తెలుగు వాళ్ళకి ఆత్మా గౌరవం లోపించింది లేకపోతె ఎవడో ఇంగ్లీష్ పూకు గడు స్టార్ట్ చేసిన XOSSIP సైటులో మన వాళ్ళు ఇంతమంది రావడం రాయడం ఏంటి ?
మనవలన వాడికి క్లిక్ కి ౦.02$ చొప్పున వాడు సంపాదిస్తూ .... నా లాంటి బ్రతకలేక పడుపువ్రుత్తిని నమ్ముకున్న వాళ్ళమీద వీడి పెత్తనం చేయడం ఏంటి ?
నాలాంటి పడుపు వృత్తిలో ఉన్న దానికి ఇంటర్నెట్ knowledge ఉండడమే కష్టం ఉన్నా కూడా టైం దొరకడమే కష్టం ఇన్ని బరిస్తూ ఏదో రాద్దాం అని పనిలో పని గా నాకు ఎఅదో క్లైంట్ దొరక్కపోదు అని రాయడం మొదలెట్టి మన తెలుగు వాళ్లతో అనుభందం ఏర్పరుచుకునే టైం లోనే వాడు నన్ను బ్లాక్ చేసాడు ....

ఇంట జరిగాక వీడి మీద ఆడరపడ్డం ఏంటి తెలుగు వాళ్ళమైన మనం మూసుకుని కూర్చోడం ఏంటి ....

అన్ని భాషలకు తల్లి సంస్కృతం .... అలంటి తల్లి భాష ని ఉచ్చారణ లో 80% కలిగి ఉన్నది మన ఏకైక తెలుగు బాష .... అలంటి మనకి అవమానం జరిగితే ఊరుకోవడానికి నేను మీలా లేవలేని మడ్డని లేపడానికి కథలు చదివే రకం కాదు పూకులో దమ్మున్న ఆడదాన్ని .....

తెలుగు వాళ్ళలో దమ్మున్న మగాడు ఉంటె ఒక వారం లో మన తెలుగు వాళ్ళ కోసమే కేవలం మన తెలుగు వాళ్ళ కోసమే ఒక వెబ్ సైట్ తెరిచి ఇక్కడ పోస్ట్ చేయండి .... లేదంటే ... మగాడు పుట్టని తండ్రికి కొడుకు గ మారి రాజ్యాన్ని ఏలిన రుద్రమదేవి లా .... మన తెలుగు తల్లి కడుపునా మగాడే పుట్టలేదు అని .... నేను వెబ్ సైట్ స్టార్ట్ చేస్తా...

ఒరేయ్ అడ్మిన్ గా ఈ రిప్లై చూసాక ఈ ఎకౌంటు కూడా బ్లాక్ చేస్తావ్ అది నాకు తెలుసు .... (వాడికి తెలుగు రాదు బావలు కాని వాడు కార్చే మొడ్డ రసం చుక్కలు నాకి వాడికోసం పని చేసే పూకు నాకోడుకులున్నారు ) వాళ్ళకి చెప్తున్నా ....

 horseride  Cheeta    
Like Reply
#37

పులిమ్రుగ్గు – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

[Image: TMqXGIRw_o.jpg]

ఇది పురాణవైర గ్రంథమాలలో ఎనిమిదవ నవల.
ఏడవ నవల ‘అమృతవల్లి’ కాణ్వాయన వంశీయుడైన వాసుదేవుడు మగధ రాజ్యాధిపతి అవడంతో ముగుస్తుంది. ఆ వాసుదేవుడి మునిమనుమడైన సురావు ప్రస్తుతం మగధ రాజ్యానికి రాజు. (వాసుదేవుడి కొడుకు భూమిమిత్రుడు, అతని కొడుకు నారాయణుడు, అతని కొడుకు సురావు.)

ఈ నవల శ్రీముఖుడు అనే క్షత్రియుడూ, తోహారు అనే కిరాతుడూ అడవిలో చేసే ఒక అన్వేషణ తో మొదలవుతుంది. అన్వేషణ దేనికోసం? ఒక పులిమానిసి కోసం. అవును, ముందుభాగం పులిగాను, వెనుక భాగం మనిషిగాను వున్న వ్యక్తి కోసం వాళ్ళిద్దరూ అన్వేషిస్తూ వుంటారు. తోహారు ఆ అడవిలో అణువణువూ తెలిసినవాడు. అందువలన రాజులు అడవిలో వేటకు వచ్చినపుడు అతని సహాయం తీసుకుంటూ వుంటారు. ఇక శ్రీముఖుడు మగధ రాజ సేనాధిపతి.

నిజానికి ఆ అడవిలో అసలు పులులే లేవు. అటువంటి చోట పులి అడుగులు గుర్తించిన తోహారు, అది కూడా ముందు భాగంలో మాత్రం పులి పాదాల గుర్తులు వుండి, వెనుక భాగంలో, అంటే సరిగా పులి వెనుక కాలి గుర్తులు ఉండవలసినంత దూరంలో మనిషి పాదాల గుర్తులు కనబడడంతో ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని శ్రీముఖునితో చెప్తాడు. అపుడు వాళ్ళు ఇద్దరూ దానిని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. మొదటి పదిహేను పేజీలూ అడవిని గురించిన వర్ణనా, వివరాలూ, వాళ్ళిద్దరి ప్రయాణం – అదంతా చదువుతుంటే చాలా బాగుంటుంది.
ఇద్దరూ అడవిలో చాలా లోపలికి ప్రయాణించి పులిమనిషి కాలి గుర్తులు కనబడిన ఒక చెరువు దగ్గరకి చేరి, దాని ఒడ్డున వున్న చెట్టు మీద మాటు వేస్తారు. అర్ధరాత్రి ప్రాంతంలో పులి వస్తుంది. చీకట్లో స్పష్టంగా కనబడదు కానీ అక్కడ రెండు చెట్ల మధ్యలో దాచి ఉంచుకున్న ఒక మొద్దు మీదికి ఎక్కి దానిని నీళ్ళలోకి తోయడం, ముందు చేతులతో పడవని తోసినట్లుగా ఆ మొద్దుని తోసుకుంటూ నీళ్ళలో వెళ్ళడం కనిపిస్తుంది. శ్రీముఖుడు సాహసించి నీళ్ళల్లోకి దిగుతాడు. తోహారుని అక్కడే వేచివుండమని చెప్పి ఆ పులికి తెలియకుండా పూర్తిగా నీళ్ళలో వుండి ఈదుతూ దానికి కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ రాత్రంతా దానిని అనుసరిస్తాడు.


 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#38

తెలతెలవారుతూన్న సమయంలో పులికి అనుమానం వచ్చిందేమోననిపిస్తుంది. ముందురోజంతా అడవిలో పులి కోసం తిరిగి, రాత్రంతా నీళ్ళలో మునిగి వుండి ఈదుకుంటూ వచ్చిన శ్రీముఖుడు అలసిపోయి చెరువు మధ్యలో నున్న ఒక రాయి మీద కొంచెం విశ్రమిస్తాడు. అది పులి గమనించిందేమోననిపిస్తుంది. అతడు చిన్న మాయ చేసి ఆ రాయి మీది నుంచి నీళ్ళ లోకి జారి మళ్ళీ కొంచెం చీకటిగా వున్న చోటికి తప్పుకుంటాడు. పులి వెనక్కి వచ్చి ఆ రాయిచుట్టూ తిరుగుతూ పరిశీలించడం దూరం నుంచి కనిపిస్తుంది. అది.. అలా చేయడం.. పులి ప్రవర్తన కాదు! మనిషి ప్రవర్తన!! శ్రీముఖుడు ఆశ్చర్యపోతాడు. చివరికి పులి ఒక ఒడ్డు చేరి ఆ పడవ కొయ్యను రెండు రాళ్ళ మధ్యకు తోసి గట్టెక్కుతుంది. ఒక రాయి చాటు చేసుకుని శ్రీముఖుడు దూరం నుంచి గమనిస్తాడు.

అప్పటికి కొంత వెలుతురు వస్తుంది కనుక, పులి పడవకొయ్య దిగి గట్టు మీదికి చేరగానే శ్రీముఖుడికి అర్ధం అవుతుంది. దానికి ముందు భాగం కంటే వెనుక భాగం ఎత్తుగా వుంది. వెనుకవి పులి కాళ్ళు కావు. అది పూర్తిగా పులి కాదు! అది ఒక గుహలో ప్రవేశిస్తుంది. శ్రీముఖుడు సాహసించి గుహ దగ్గరికి చేరతాడు. లోపలినుంచి “ఎవరు నీవు?” అన్న ప్రశ్న వినిపిస్తుంది. కొద్దిగా చీకటిగా వున్న ఆ గుహలోకి చూస్తే రకరకాల రంగులతో వేసి వున్న ఒక ముగ్గు, దానిపై పడుకుని వున్న ఒక పురుషుడు కనిపిస్తారు. అతనితో శ్రీముఖుడు వివరంగా కథ అంతా చెప్తాడు.

పూర్వం యయాతి సంతానంలో ఒకడైన బలి మహారాజు తన ఆరుగురు కొడుకులకూ రాజ్యాన్ని పంచి యిచ్చాడు. అవే ఆయా రాజ కుమారుల పేర్లతో ఏర్పడిన అంగవంగాంధ్రాది రాజ్యాలు. మగధ మాత్రం బలి అధికారంలో వుండి వుంటుంది. బహుశా అపుడు అతనికి రాజధానిగా వుండిన ప్రాంతం బలిమఠం. అక్కడ ఒక పర్వతం, శిథిలమైన కోట వున్నాయి. ఆ బలిమఠ పర్వతం దగ్గర తన స్నేహితుడైన తోహారుకి పులిమనిషి కాలి గుర్తులు కనిపించాయనీ, దానిని వెతికేందుకు తామిద్దరమూ బలిమఠ పర్వతం దగ్గరికి బయలుదేరామనీ, అయితే ఎందుకో గాని తన కాళ్ళు కొంచెం ప్రక్కకి దారి తీశాయనీ, అక్కడ ఒక చెరువు దగ్గర పులిమనిషి గుర్తులు కనిపిస్తే మాటు వేశామనీ, ఆ పులిని వెంబడించి ఇక్కడి వరకూ వచ్చాననీ చెప్తాడు. ఆ పులి ఏమయిందో మీకు తెలుసా అని అడుగుతాడు.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#39

ఇదంతా కట్టుకథ అంటూ ఆ పురుషుడు కొట్టి పారేస్తాడు. “నాకు ఆకలిగా వుంది, తినడానికి ఏమైనా పెట్ట”మని శ్రీముఖుడు అడిగితే, “అక్కడ పళ్ళు వున్నాయి తీసుకో”మని చెప్తాడు ఆ పురుషుడు. అయితే ఆ పళ్ళు తింటే తనకు శిష్యుడై పోవలసి ఉంటుందనీ, స్వాతంత్ర్యాన్ని కోల్పోయి తానేం చెప్తే అది చేయవలసి వస్తుందనీ హెచ్చరిస్తాడు. అయితే ఫలాలు ఆరగించినంత మాత్రాన అలా అయిపోతుందన్న భయం తనకేమీ లేదంటూ శ్రీముఖుడు ఆ ఫలాలు ఆరగిస్తాడు.

వాళ్ళిద్దరి మధ్యా సుదీర్ఘమైన సంభాషణ జరుగుతుంది. ఆ మాటల్లో పతంజలి మహర్షి ప్రస్తావన కూడా వస్తుంది. పతంజలి మహర్షి అప్పటికి మూడు వందల ఎనభై ఏళ్ళకి పూర్వపు వాడనీ, ఆయన ఎప్పుడు పుట్టాడో తెలియకపోయినా శుంగ వంశపు రాజులలో ప్రధముడైన పుష్యమిత్రుని కాలంలో జీవించి ఉన్నాడన్న మాట నిజమనీ, ఆయన వ్యాకరణానికి మహాభాష్యం వ్రాశాడనీ, యోగశాస్త్రానికి సూత్రాలు నిర్మించాడనీ అంటాడు శ్రీముఖుడు. సరే, ఇంతకీ ఎంత మాట్లాడినా పులి ఏమయిందో, ఈ పురుషుడు ఎవరో మాత్రం శ్రీముఖుడికి అర్థం కాదు. ఆతర్వాత కాసేపటికి ఆ పురుషుడు స్నానం చేసి వస్తానంటూ వాగు వద్దకు వెళ్ళగానే శ్రీముఖుడు గుహని క్షుణ్ణంగా పరిశీలించడానికి పూనుకుంటాడు. తనకు అలా పరీక్షించే అవకాశం ఇచ్చేందుకే ఆ పురుషుడు అలా వెళ్ళాడని కూడా శ్రీముఖుడు అర్థం చేసుకుంటాడు.

అంతకు మునుపు ఆ పురుషుడు పడుకుని వున్న ముగ్గులో కనబడిన రంగు రంగుల పొడులు ఆ గుహలో ఇంకా కనిపిస్తాయి. ఆ ముగ్గు మీద కాలు పడినపుడు, ఆ పొడులని చేతులతో తాకినపుడు తన శరీరం జలదరించడం, జివ్వుమన్నట్లుగా అనిపించడం, ఏదో మార్పు జరుగుతున్నట్లు తోచడం – వీటన్నిటి తోనూ అతనికి అర్ధం అవుతుంది – పులి ఎక్కడికీ పోలేదు. ఈ పురుషుడే పులి. ఆ రంగు రంగుల పొడులన్నిటినీ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ముగ్గులా వేసి దానిలో పడుకుని అతడు పులి అవుతున్నాడనీ, తర్వాత ఆ ముగ్గునంతటినీ కలగలిపి అందులో పడి దొర్లితే తిరిగి మనిషి అవుతున్నాడనీ అర్ధమవుతుంది.

అంతేకాదు. ఆ గుహలో ఆ రంగు పొడులే కాక అయిదు కత్తులు కూడా కనిపిస్తాయి. అవి అక్కడ ఎందుకున్నాయో అర్థం కాదు. సరే, ఆ పురుషుడు వెనక్కి రాగానే వాడిని శిక్షించి, భయపెట్టి విషయాలన్నీ తెలుసు కోవాలనుకుని ఆ గుహలోనే కూర్చుంటాడు శ్రీముఖుడు. ఆ సమయంలో రకరకాల ఆలోచనలు చేస్తాడు. మనిషి పులి అవడం ఏమిటి? దీన్ని ఎలా నమ్మడం అన్న విషయం దగ్గర మొదలయ్యి రకరకాలుగా సాగే ఆ ఆలోచనలు ఆసక్తికరంగా వుంటాయి.
వాటిలో కొన్ని:

“.. విశ్వసించెడి వారి హృదయములో, మనస్సులో విశ్వసించుట యన్న ఒక సనాతన పదార్థముండును. విశ్వసించని వాని గుండెలో, మనస్సులో ఆ సనాతన పదార్థముండదు. విశ్వసించుట అనునది ఆలోచనా జనితమైన బహుపూర్వ పరమేశ్వర భావనిష్ఠమైన యొక సంస్కార విశేషము! ఎవడు తన వెనుకటి జన్మల యందు బహు పశు జన్మలెత్తునో వాని హృదయములో, వాని మనస్సులో విశ్వాసమన్నది ఉదయించదు. విశ్వాసమనగా పండిన తర్కభావము. తర్కమనగా సామంజస్యము కల ఇతర పరిస్థితులను సంయోజన పరచి వాని నుండి ఒక మహార్థమును బుద్ధికి భాసింప చేసికొనుట! విశ్వాస రహితుడు విషయములను వినును, చూచును, పొసగించుకొనలేడు. ఒకనికి పాము కరచినది. అది విషము. విషము ద్రవ్యము. దానికి విరుగుడై ఇంకొక పృథివీ పదార్థము చేతనే అది పరిహరింపబడ వలయును కాని, మరి ఇంకొక దాని చేత పరిహిరింప బడరాదనుట ఈ సృష్టి యందున్న భిన్న పదార్థములయు, భిన్న భావములయు నైక్యము నెరుగలేకుండుట!

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#40

‘మనస్సులో నున్న భావము శబ్దముగా నెట్లు వచ్చినది?’ ఈ యొక్క దానికి చక్కగా నాస్తికులమనుకొనువారు సమాధానము చెప్పినచో, వాని యందు నాస్తికత మిగలదు. నాభి నుండి శబ్దోదయము కలుగుట ఏమి? అది – గాలి హృదయము వరకు, కంఠము వరకు వచ్చుట ఏమి? నాలుక, దవడలు, అంగిలి, దంతములు, పెదవులు, వీనిచేత నాపబడి, కొట్టబడి శబ్దము వెలివరచబడుట ఏమి? ఆ భావమీ శబ్దముగా నవతరించుటకు, ఈ జంతువుల యొక్క శరీరము లోని యవయవముల యొక్క సన్నివేశక్రమము హేతువగుట ఏమి? భావమునకు శబ్దమునకు సంబంధము లేదు. అది ఇదిగా మార్పు పొందినది. మార్పు పొందుటకీ జంతు శరీర యంత్రము నిర్మింప బడినది.

ఇట్లే – అదృశ్యము లైనవి సమాహితములైనవియు నైనవానిని, యంత్రముల ద్వారా మరియొక రూపమునకు మరలింపవచ్చును.”

సరే, శ్రీముఖుడు ఇలా ఆలోచించుకుంటూ వుండగా ఆ పురుషుడు మళ్ళీ గుహలోకి వస్తాడు. అప్పుడు విషయాలన్నీ చెప్తాడు. శ్రీముఖుడి మనసులోని ఆలోచనలని, ఉద్దేశ్యాలని కూడా చెప్పి శ్రీముఖుడిని ఆశ్చర్యపరుస్తాడు. ముందు అతని పూర్వుల చరిత్ర చెప్తాడు. “నీవు శాతకర్ణివి. అనగా ఆంధ్రుడివి. మీ పూర్వులలో ఒకనికి సంతానములేదు. ఒకనాడతనికి స్వప్నములో ఒక దేవత తోచి యిట్లనెను. ‘రేపుదయమున నీవు అడవికి పొమ్ము. అచట నొక సింహము మీద నొక బాలుడు కనిపించును. ఆ సింహమును చంపి యా బాలుని తెచ్చి పెంచుకొనుము. నీ వంశము తామరతంపరగా వృద్ధి పొందు’నని. అతడు మరునాడు కాంతారమున కేగగా కలలోనన్నట్లే కనిపించెను. ఆ సింహమునతడు బాణముతో కొట్టెను. ఆ సింహమొక గంధర్వుడై “రాజా! నా పేరు శాతుడు. నేనొక గంధర్వుడను. నా భార్య పేరు శుక్తిమతి. ఆమె చనిపోయెను. ఈ పిల్లవానిని నీకోసమే తెచ్చుచుంటినని చెప్పి అంతర్హితుడయ్యెను. నాటి నుండి మీ ఆంధ్రులు సింహధ్వజులు.” అని.

చెప్పి “ఇది కాణ్వాయనుల రాజ్యం నశించే కాలం, మీ పూర్వుడికి సింహం కనబడి కొడుకుని ఇస్తే, నీకు పులి కనబడి రాజ్యాన్ని ఇస్తోంది.” అంటాడు.
ఇక ఆ తర్వాత శ్రీముఖుని చరిత్రనీ, భవిష్యత్తునీ కూడా చెప్తాడు. “ప్రతిష్టాన నగరమున, ధాన్యకటకమున మీ ఆంధ్ర రాజులు వున్నారు. వారు భోగపరాయణులై, బలహీనులై వున్నారు. అసమర్ధమైన వైదిక మార్గంలో వున్నారు. వారికీ, నీకూ పడలేదు. నీవూ రాజవంశం వాడివే. నీకూ, ఇప్పుడు రాజుగా వున్నవాడికీ తాతల కాలం నుండీ రాజ్యం మీది అధికారం గురించి వివాదం వుంది. మీ తాత సాధువు అవడం వలన అప్పుడు వాళ్ళది పైచేయి అయింది. నువ్వు వాళ్ళతో పేచీ పడి నగరం విడిచి మగధ చేరావు. ఇక్కడ సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మహాసేనానివీ, మంత్రివీ కూడా అయ్యావు. ఇపుడు రాజు సురావుకి నువ్వు ఎంత చెప్తే అంత. అతనికి నలుగురు రాణులు. ఆ నలుగురూ అతని నాల్గు ప్రాణాలు తీస్తున్నారు. మిగిలిన ఒక్క ప్రాణాన్నీ తీయడానికి నువ్వు సంకోచిస్తున్నావు. నీ చేతి మీదగా కాకుండా ఇంకెలాగయినా ఆ ప్రాణం పోతే ఇక నీకు తిరుగులేదు. సదానీరా నదీ ప్రదేశము నుండి భారతమున కొసవరకు ప్రాచ్యక దేశమనబడే ప్రాంతమంతా నీ అధీనంలోకి తెచ్చుకుని తర్వాత మళ్ళీ మగధములకు వచ్చి పశ్చిమ దిశకు విజృంభించవచ్చు. నిన్ను భారతదేశ చక్రవర్తిగా మన్నించని వాడుండడు.”

ఇదంతా చెప్పి ఇక్కడ ఆంధ్రుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తాడు. ఆంధ్రుల గురించి కాబట్టి అవి మనం చెప్పుకోవాలి. తప్పదు.
“ఆంధ్రులు కుత్సితులు! న్యాయమైన యూహ చేయని వారు! వారి వివేకము గొప్పదే కాని, వారి మనస్సు కుటిలమైనది! వారు పరాక్రమవంతులే కాని, తమ పరాక్రమము నుపయోగించు కొనుట వారికి తెలియదు! .. ఆంధ్రులు ఆత్మద్రోహులు! సంఘ ద్రోహులు! వేద ధర్మద్రోహులు! అని నారాయణుని (అంటే సురావు తండ్రి) యూహ! అతని యూహయే కాదు. భారతదేశమునందలి సర్వప్రాంతముల వారు మీ యాంధ్రులను గురించి యట్లే యనుకొనెదరు. దానికి తగినట్లు మీరు ప్రవర్తింతురు. ఏ ఇతర దేశములో నైనను వట్టి ఎడారిలో నొక దర్భమోడు లేచినచో అది మహావృక్షమని మన్నింతురు. మీ ఆంధ్రులు మహావృక్షములను దర్భమోడులని చెప్పుదురు. మీ జాతి లక్షణమది! మీ జాతి యన్నచో నాకెంతయో అభిమానము! మీది నాకిష్టమైన జాతి! నా కభిమతమైన జాతి!”
ఇంతకీ ఇదంతా చెప్పిన ఆ పురుషుడు ఎవరు? అది కూడా చెప్తాడు. అతను “జయద్రధుడు”. అతనే శ్రీముఖుని చిన్నతనంలో అతనికి ఖడ్గవిద్య నేర్పిన గురువు. ఆ విషయం అతను గుర్తు చేశాక శ్రీముఖుడు కూడా అతనిని గుర్తుపడతాడు. సురావుని చంపి శ్రీముఖుడిని చక్రవర్తిని చేస్తానని జయద్రథుడు అతనికి చెప్తాడు.

ఇక్కడ కొంచెం ఆగి కొంతకాలం క్రితం ఆంధ్రదేశం లో జరిగిన కథ చెప్పుకోవాలి. ఆంధ్ర రాజు చంద్రశేఖర శాతకర్ణికి ఒకసారి వేటకి వెళ్ళినపుడు ఒక కల వస్తుంది. ఆ కలలో ఎవరో “రేపు నీకు వేటకు వెళ్ళినపుడు ఒక యోధుడు కనబడతాడు. అతన్ని జయించ లేవు. బ్రతిమాలుకుని బయటపడతావు.” అని చెప్తారు. ఆ మర్నాడు అతను వేటకు వెళ్ళినపుడు అలాగే జరుగుతుంది.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)