Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

పాణిగ్రహణం

Showing only the posts of SivaSai: 341 of 820 posts. Show all posts

Part - 75



రమేష్ కూతురు వైపు చూస్తూ ఏమని బ్లెస్ చేశారు.. మా ఇంటి ఆడపడుచు తో సమానం. చల్లగా ఉండు అని బ్లెస్ చేశారు.

ఇంటి ఆడపడుచు అంటే అర్థం తెలుసా... నిన్ను ఆ సూర్యకి సిస్టర్ ని చేశారు. నో డాడ్.. నేను వెళ్ళగానే ఆ సూర్య మదర్ ని అత్తయ్య అని పిలిచాను.

పిచ్చిపిల్ల.. నువ్వు అత్తయ్య అని మాత్రమే పిలిచావు కానీ వాళ్ళు నిన్ను తెలివిగా ఆడపడుచును చేశారు. నీకు ముందునుంచి చెబుతున్నాను.

సింహ ఫ్యామిలీ తో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు పైకి కనిపించే అంత అమాయకులు కాదు.
ఇప్పుడు నేను డ్రాప్ అవ్వాలా అని నీరసంగా అడుగుతుంది .

మనది ఏమన్నా బ్లడ్ రిలేషనా... ఏమీ అర్థం కానట్టుగానే నువ్వు ఫాలో అయిపో..

ఆ గౌతమ్ ని ఏం చేయాలి డాడ్. ఇంకొన్ని రోజులకి ఎలాగా తట్ట బుట్ట సర్దేసుకుంటాడు.  అప్పుడు వరకు అలా మెయింటైన్ చెయ్..

సరే డాడ్ నేను డ్రెస్ చేంజ్ చేసుకుని గౌతమ్ దగ్గరికి వెళతాను. ఇప్పుడు ఎందుకురా.. షాపింగ్ పని ఉంది. ఫ్రెండ్స్ బిజీ. సో వాడిని తీసుకువెళతాను.

నాకు సెక్యూరిటీగాను ఉంటాడు.  సర్వీసు చేస్తాడు.
విశి..  సూర్య కి కాల్ చేస్తుంది.  చెప్పు విశి.. సార్ బిజీనా..
పర్వాలేదు..

మీరు ఫ్రీగా ఉంటే నాతో షాపింగ్ కి వస్తారా.. భవ్య ఏమయింది.  గెస్ట్స్ వచ్చారంట.. బిజీ అంటుంది.  నేను ఖాళీగా కనిపించానా..

అయ్యో..  మీరు బ్యాచిలర్ కదా...సండే ఫ్రీగా ఉంటారు అని కాల్ చేసాను.  ప్లీజ్ సార్.. 

హ్మ్.. నువ్వు అంత ముద్దుగా అడిగితే కాదంటానా..  రెడీగా ఉండు వచ్చి పికప్ చేసుకుంటాను. థాంక్యూ సార్.. ఫోన్ పెట్టేసి..

ఏం డ్రెస్  వేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎదురుగుండా కనిపిస్తున్న డ్రెస్ చూసి ఎవరు పెట్టారు అని చుట్టూ చూస్తే అక్కడ భానుమతి చేతులు కట్టుకొని చూస్తూ ఉంటుంది.

నువ్వేంటి అమ్మ..  ఇక్కడ..  ఎప్పుడొచ్చావు.నువ్వు ఫోన్ మాట్లాడుతున్నప్పుడే వచ్చాను.  బయటికి వెళ్లే ప్రోగ్రాం ఉన్నట్టుంది.

షెల్ఫ్ ఓపెన్ చేసి ఇస్త్రీ బట్టలు అన్ని నువ్వు లాగకుండా ఉండాలని నేను ఆ డ్రస్ అక్కడ పెట్టాను. అది వేసుకుని బుద్ధిగా వెళ్లి వచ్చేయ్..

నేనెవరితో వెళుతున్నానో.. ఎక్కడికి వెళుతున్నానో అడగవా...  నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది కానీ రెడీ అవ్వు  అక్కడ మీ దేవా సార్ వచ్చే టైం అయింది.

సారీ అమ్మా.. ఈ మధ్యన నీకు టైం ఇవ్వడం లేదు.  వర్క్ తో సరిపోతుంది. నా గురించే మీ ఆలోచించక్కర్లేదు. నాకు కంపెనీ ఇచ్చే ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు.

మీతో వస్తేనే నాకు బోర్.. అమ్మా..  అవును.. అది తినకు ఇది తినకూడదు..  అటు వెళ్ళకు ఇటు వెళ్ళకు అని చిన్న పిల్లలకి చెప్పినట్టుగా చెప్పి..  నా బుర్ర తినేస్తావు.

నేహా ఆంటీతో నేను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాను..నీ ఏజ్ గ్రూపు వాళ్ళు దొరికేటప్పటికీ నన్ను పక్కన పెట్టేసావు అన్నమాట..

నువ్వు దేవా సార్ తో వెళుతూ నన్ను పక్కన పెట్టలేదా... ఇది అంతే. వామ్మో  ఈ ఇంటికి వచ్చాక మా అమ్మ లో చాలా మార్పు వచ్చింది. కౌంటర్స్ మీద కౌంటర్లు వేస్తుంది.

విశి కి జడవేసి తనలో పువ్వు పెట్టి...  మనసులో ఉన్న మాట ఎదుటి మనిషికి చెప్పాలి. చెప్పకుండా తెలుసుకోవాలి.. అర్థం చేసుకోవాలి అనుకుంటే కష్టం. వాళ్లు కూడా అలాగే అనుకుంటారు కదా.. టైం చూసుకుని నీ మనసులో మాట చెప్పు..

అమ్మ అది  అని సిగ్గుపడుతూ ఉంటే.... నాకు తెలియదు అనుకున్నావా... నేను మీ అమ్మని. నువ్వు ఏ నిమిషంలో ఎలా ఉంటావో అన్నది నాకు బాగా తెలుసు.


సరే బయలుదేరు అని పంపిస్తుంది. నడుస్తూ అమ్మ కూడా గెస్ చేసింది. మీరు గెస్ చేయలేదా లేకపోతే నేనే చెప్పాలని ఎదురుచూస్తున్నారా..

విశి బయటికి వచ్చి నుంచునే లోపు సూర్య వస్తాడు. ఇంత తొందరగా వచ్చేసారా..  మీ ఆడవాళ్లు రెడీ అవ్వడానికి చాలా టైం తీసుకుంటారు కదా... అందుకే నా టైం నీకు తెలియలేదు..

చెప్పు.. ఏం మాల్ కి వెళ్దాము. మాల్ కి వద్దు సార్. అక్కడ అన్ని బ్రాండెడ్ ఉంటాయి. బాధేస్తారు..  లోకల్ స్ట్రీట్ లో చూద్దాం.  బ్రాండెడ్ అయినా క్వాలిటీ ఉంటాయి కదా...

కానీ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అకేషన్ ఏమిటి... చెప్పాను కదా.. వి. జె. స్ కంపెనీ కొటేషన్ వచ్చింది. అది ఓకే అవుతే... ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్లాలి..సో అందు గురించి..

ఒక్క నిమిషం అని ఫోన్ చేసి మాట్లాడి  ఎక్కు అంటాడు. సరే అని మౌనంగా ఎక్కుతుంది. బైకు ఒక షాపింగ్ మాల్ ముందు ఆగుతుంది.

సార్ అంటే..   ఇక్కడ డిస్కౌంట్ ఉందంట.. ఆల్రెడీ ఇది మా ఫ్రెండ్ కి తెలిసినదే..  సో నీ బడ్జెట్లో వస్తాయి రా అని తీసుకువెళ్తాడు.

లోపలికి వెళ్లి చూస్తూ ఉంటుంది.  నచ్చాయా..  ఇక్కడ అన్ని బాగున్నాయి. నాన్న ఉన్నప్పుడైతే ఇలాంటి మాల్ కే వచ్చేదాన్ని..  ఇప్పుడంటే కష్టం కదా..

అది నీ ఆలోచనలో ఉంది. ఏమి కష్టం లేదు. కొన్ని డ్రెస్సెస్ చూడ్డానికి కాస్ట్లీ గా అనిపిస్తాయి కానీ బడ్జెట్ లోనే వస్తాయి రా అని అక్కడ సేల్స్ గర్ల్ ని పిలిచి విశికి సూట్ అయ్యే డ్రెస్సెస్ చూపించమని చెబుతాడు.


సార్ అని షర్టు పట్టుకొని లాగుతుంది.  ఏమైంది..  ముందే మన ప్రైస్ చెప్పేద్దాము.  దానికి తగ్గట్టుగా తీసుకువస్తారు. అవసరం లేదు.

క్లైమాక్స్లో వాళ్ళ డిస్కౌంట్ ఇస్తారు కదా...  వద్దు సార్. మనకి బాగా నచ్చింది మన బడ్జెట్లో రాకపోతే మనసుకు కష్టంగా అనిపిస్తుంది.

ప్లీజ్...  ప్లీజ్ . సరే ఎంత లో చెప్పమంటావు. ఆలోచించి 500 టూ 1000 మధ్యలో తీసుకురామ్మనండి.  ఓకే అని
ఆ ప్రైస్ లో చూపించమని చెబుతాడు.

ఓకే సార్ అని  డ్రెస్సెస్ తీసుకువచ్చి చూపిస్తూ ఉంటుంది. ఏది చూసినా 400, 500, 600 ఉంటాయి.  ఏంటి సార్ ఇంత చీప్ గా ఉన్నాయి.

చెప్పాను కదా కొన్ని చూడ్డానికే ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తాయి. కానీ మన బడ్జెట్ లో వస్తాయి అని. ఇలా చూపిస్తే షాప్ మొత్తం కొనేయాలనిపిస్తుంది.

కొను నిన్ను ఆపేది ఎవరు..   ఈ మాటలు బాగానే ఉంటాయి అని ఒక నాలుగు సెలెక్ట్ చేస్తుంది.. అందులో నుంచి ఒకటి తీయమని సూర్య వైపు చూస్తుంది.

నాలుగు తీసేసుకో.. నీకు ఇవన్నీ సూట్ అవుతాయి. సూట్ అయినంత మాత్రాన అవసరానికి మించి తీసుకున్నది కూడా మంచిది కాదు..

సూర్య మనసులో అయ్యో క్యూటి ఈ మాల్ మనదే..  నువ్వు ఎన్ని తీసుకున్నా ఫ్రీనే  నీకన్నా ఎక్కువ ఏదీకాదు..

అక్కడికి ఆ ఫ్లోర్ మేనేజర్ వచ్చి విష్ చేసి మేడం.. ఈరోజు లక్కీ డ్రిప్ ఉంది.  అందులో  విన్నర్ తీసుకున్న ప్రతిదీ ఫ్రీ.. అవునా అలా కూడా ఉంటుందా. ఈ ఒక్క రోజే  ప్లాన్ చేశాము..
అవునా.. ట్రై చేద్దామా అనుకుని మళ్ళీ వద్దులే... ఎందుకు వచ్చిన తలపోటు అనుకుంటుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు.. పార్టిసిపేట్ చేయొచ్చు కదా..

వద్దు సార్. మనకు వస్తాయా ఏమిటి...  నువ్వు ఏమన్నా డబ్బులు కట్టాలి ఏమిటి.... జస్ట్ నీ పేరు రాసి అందులో వేయడమే..

వస్తే ఓకే.. లేకపోయినా ఓకే... ఏముంది.. అయ్యో సార్. అలా మన నెంబర్ తీసుకుని బయట డేటా సెంటర్ వాళ్లకి అమ్మేస్తారు.

24 గంటలు...  వాళ్లు మీరు అది కొంటారా.. . ఇది కొంటారా మా ఇన్సూరెన్స్ అని బుర్ర తినేస్తారు. మనకు అవసరమా..

ఎలాగో ఈ లక్కీ డ్రిప్ నాకు రాదు.  కొత్త తలపోటు తెచ్చుకోవడం  ఎందుకు...  విశి చెప్పిన దానికి సూర్య నవ్వుతూ.. అన్ని మాల్స్ లో అలా జరగదు.

ఎట్టి పరిస్థితిలను డేటా బయటికి వెళ్ళదు. మీకు ఎలా తెలుసు. చెప్పాను కదా మా ఫ్రెండ్ కి తెలిసినదే అని.. నీకు అలా కాల్స్ వస్తే ఇమ్మీడియేట్గా నాకు ఇంఫార్మ్ చెయ్యి..

వెంటనే ఈ ఫ్లోర్ మేనేజర్ జాబు పోతుంది.. ఎందుకు సర్ మన వల్ల వేరే వాళ్ళు పొట్ట కొట్టడం. భయాలు వదిలి ముందు పార్టిసిపేట్ చెయ్.. తర్వాత చూద్దాం..

అంతేనంటారా...  అంతే..  మీరు ఉన్నారన్న ధైర్యంతో పాల్గొంటున్నాను.   బట్ నాకు ఏదైనా కాల్ చేస్తే మీదే బాధ్యత..

విశి నెంబరు, పేరు రాసి ఇస్తుంది. మొత్తం షాపింగ్ అయ్యి తిరుగుతూ ఉంటే.. అనౌన్స్మెంట్ స్టార్ట్ చేస్తారు. విశిష్ట అన్న పేరు వినిపించగానే..

సార్..  నా పేరే వచ్చింది అని గంతులు వేస్తోంది. చెప్పాను కదా నీకు వస్తుంది అని..  ఎలా..  నువ్వు ఎప్పుడూ లక్కీ గర్ల్ వే అందుకని..

వెంటనే విశి సూర్యని హత్తుకుని.. థాంక్యూ సర్..  మా నాన్న ఉన్నప్పుడు కూడా ఇలాగే చెప్పేవారు. ఆయనతో పాటే నా సంతోషాలు, లక్ అన్ని వెళ్ళిపోయాయి.

  మళ్ళీ మీ రూపంలో అవన్నీ నా దగ్గరికి వచ్చేసాయి. ఎప్పటికీ మీరు నాతో ఇలాగే ఉంటారా..

విశి చుట్టూ చేతులు వేసి తప్పకుండా...  అందుకే కదా నేను వచ్చింది.. సూర్య మాట పూర్తయ్య లోపు బెలూన్స్ పేలతాయి.

విశి పూర్తిగా వినదు.  వెంటనే తేరుకుని దూరం జరిగి..  సోరి..  ఏదో ఎమోషనల్ లో.. కంగారుగా చెబుతూ ఉంటే.. ఇట్స్ ఓకే అని చేతిని ప్రెస్ చేస్తాడు...

ఆ బ్యాగ్స్ తీసుకొని బయటికి వస్తారు.  విశి ముఖం వెలుగుతూ ఉంటుంది. ఏంటి మేడం గారు.. చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఎన్నో రోజుల తర్వాత..

మీకు ఒక విషయం తెలుసా నాన్నతో నేను ఎప్పుడు బయటకు వెళ్లినా ఇలాగే మోటివేట్ చేసేవారు గెలిచినా ఓడిన తర్వాత సంగతి ముందు నువ్వు పార్టిసిపేట్ చేయి..

గెలిస్తే గెలుస్తావు...లేకపోతే లేదు కానీ నీలో ఆడాలి గెలవాలి అనే ఒక స్పిరిట్ పెరుగుతుంది కదా అది ఇంపార్టెంట్ అనేవారు..ఇప్పుడు మీరు కూడా అలాగే చెబుతున్నారు..

సూర్య ఫీలింగ్స్.................
[+] 8 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

Part - 76


గెలిస్తే గెలుస్తావు...లేకపోతే లేదు కానీ నీలో ఆడాలి గెలవాలి అనే ఒక స్పిరిట్ పెరుగుతుంది కదా అది ఇంపార్టెంట్ అనేవారు..ఇప్పుడు మీరు కూడా అలాగే చెబుతున్నారు..

నాన్న అంటే ఒక నమ్మకం ధైర్యం కదా..  నమ్మకం నాన్నతోనే వెళ్ళిపోయింది. ఇదిగో మళ్ళీ మీ రూపంలో తిరిగి వచ్చింది థాంక్యూ దేవా సార్.

సూర్య చిన్న చిరునవ్వుతో...
విశి … నమ్మకం ఎప్పుడూ మనుషుల్లో కాదు, మన లోపలే ఉండాలి.
ఎవరో మనకు నడవమన్నప్పుడు మనం నడుస్తాం..
కానీ ఒకరోజు మనమే మనల్ని నడిపించుకోవాలి.

మీ నాన్న ఇచ్చిన ధైర్యం ఇప్పుడు నీ గుండెలో ఉంది.
అది ఎప్పుడూ పోదు — కేవలం నిశ్శబ్దమై ఉంటుంది..
ఎవరో దాన్ని మళ్లీ గుర్తు చేస్తే… ఇలాగే మెల్లగా మేల్కొంటుంది.

మీ  నాన్న జ్ఞాపకం ఉంచు...
గెలుపు అంటే ఫలితం కాదు, తిరిగి లేచే ధైర్యం.
ఆ ధైర్యం నీవు చూపుతున్నావు.
ఇప్పుడే నువ్వు గెలుస్తున్నావు అంతే..

నీలో ఉన్న ధైర్యాన్ని జస్ట్ నేను గుర్తు చేస్తున్నాను అంతే..

విశి అలాగే చూస్తూ ఉంటే...ఇలా రా అని అక్కడ ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు.

సూర్య మృదువుగా...
నమ్మకం... కొన్నిసార్లు మనిషిలో కాకుండా, మన గుండె ధ్వనిలో దాక్కుంటుంది.
అది మనం మర్చిపోయినా, మన కదలికల్లో ఉంటుంది...
మన చూపుల్లో, మన మాటల్లో... కొద్దిగా నాన్నలాగా.

మీ నాన్న వెళ్లిపోయినా,
ఆ ధైర్యం మాత్రం నీ లోపలే ఉంది..
నీ లోపల ఏదో భయం. నాన్న లేరు. నేను ఒంటరినైపోయాను అని ఏదేదో ఆలోచించి ఆ ధైర్యాన్ని నొక్కి పెట్టేశావు.

ఇప్పుడది మళ్లీ తలెత్తి చూస్తోంది.

గెలవడం కంటే, ఆ ధైర్యాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం.
అది నీలో ఉంది విశి..
అది చాలదు అనిపించవచ్చు...
కానీ ఆ ధైర్యాన్ని నిలబెట్టుకోవడమే.. నిజమైన గెలుపు.

సూర్య చూపు కాసేపు విశి ‌ మీదే ఉంటుంది.  విశి ఆలోచన ఎలా ఉందో చూస్తూ క్యూటి ఓపెన్..

విశి మాత్రం మెల్లగా చూపు తిప్పి సూర్య ని చూస్తు ఉంటుంది..
ఆ చూపులో ఆశ్చర్యం లేదు.. ఒక  నిశ్చింత ఉంది.
ఎంతకాలంగా ఎవరో ఇలా మనసుని తాకే మాటలు చెప్పలేదనిపిస్తుంది.
విశి హృదయం సూర్య ని చూస్తూ ఆలోచనల్లోకి వెళ్ళిపోతుంది.  సూర్య... విశి ని డిస్టర్బ్ చేయకుండా  చూస్తూ ఉంటాడు.
సార్ మాట్లాడినప్పుడు ఎందుకో మనసు నిశ్శబ్దమవుతుంది… సార్ మాటలు తప్ప ఇంక ఏమీ వినిపించవు.

నాన్నలాగే, మాటలకంటే ఎక్కువగా ఏదో భరోసా ఇస్తారు.
ఆ తలంపు రాగానే విశి మనసు తేలిక పడుతుంది చిన్న చిరునవ్వుతో సూర్య వైపు చూస్తూ ఉండిపోతుంది.

అది దేవా సార్ కి కాదు, తన మనసుకే...
అందులో కృతజ్ఞత, గౌరవం, కొద్దిగా తలమునకలైన భావన.

విశి చూపు దేవాపై నిలబడిపోతుంది.
అదే చూపులో ఒక మౌనమైన కృతజ్ఞత మెరిసిపోతుంది.

హలో విశిష్ట ఏం ఆలోచిస్తున్నావు అని చెయ్యి ఊపుతాడు. విశి తేరుకొని నథింగ్ సార్..  మీ మాటలు వింటుంటే  వెయ్యి ఏనుగుల బలం వచ్చేస్తుంది.

నిరాశలో కూరుకుపోతున్న వాళ్లకి మీ మాటలు ఒక వెలుగు రేఖను చూపిస్తాయి. మరి ఎక్కువగా పొగిడేయకు.  అసలే ఆకలేస్తుంది.

ఏమీ తినకుండానే వెళ్ళిపోతాను. ఆ మాటకి నవ్వుతూ ఈరోజు ట్రీట్ నాదే.. తప్పకుండా మేడం..

రండి అని అక్కడే ఉన్నా రెస్టారెంట్ కి  వెళ్లి చెప్పండి సార్.. ఏం ఆర్డర్ ఇవ్వను.  నీవు ఏది ఇచ్చిన నాకు ఒకే.. నో సార్.. ఈరోజు ట్రీట్ నాది.  సో మీరు ఆర్డర్ ఇవ్వాలి.

సరే అనే ప్రాన్స్ బిర్యానీ, ఫిష్ ఫ్రై,  గోంగూర చికెన్ ఆర్డర్ ఇస్తాడు.

సార్ ఈ ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అవునా మన టేస్ట్ లు కూడా ఒకటే అన్నమాట..

ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తారు. పక్కనే ఎవరో ఉన్నట్టు అనిపించి చూస్తే అక్కడ శ్రీకర్, సౌమ్య వైభవ్ ఉంటారు.

మీరు వచ్చి ఎంతసేపు అయింది అని సూర్య అడిగితే..  అదే ఇద్దరు టేస్ట్ లు ఒకటే అని మాటల్లో మునిగిపోయారు కదా.. అప్పుడే వచ్చాము.

మరి పిలవచ్చు కదా..  ఏమో లవ్ బర్డ్స్ కి డిస్టబ్ అవుతుందేమో అని శ్రీకర్ అంటూ ఉంటే..  సూర్య కాలు తొక్కుతాడు.

విశి చూసి ఏమన్నారు సార్..  అదే మా లవ్ బర్డ్స్ కి డిస్టర్బ్ అవుతుంది అని చెబుతున్నాను అంతే కదా సౌమ్య..  అంతే...

వైభవ్ మాత్రం డల్ గా కూర్చుంటాడు. ఏమైంది వైభవ్ అంత డల్ గా ఉన్నావు అని విశి అడిగితే... పో బాబి నేను నీతో మాట్లాడను.

ఇప్పుడు నేనేం చేశాను అని నామీద అలిగావు. మీరిద్దరూ లంచ్ కి వచ్చినప్పుడు నన్ను కూడా పిలవాలి కదా... ఏదో మీరు తిన్నాక మిగిలిన ఒక గుప్పెడు మెతుకులు పెడితే నాకు సరిపోతుంది కదా..

అయ్యో వైభవ్ ఎంత మాట అన్నావు.. ఈ లంచ్ ప్రోగ్రాం అనుకోకుండా జరిగినది. ఆక్చువల్గా నేను డ్రెస్సెస్ తీసుకోవడానికి అని సార్ హెల్ప్ అడిగాను.

అన్నయ్య నీకు డ్రెస్సెస్ కొనే వరకు వచ్చాడా.. లేదు లేదు హెల్ప్ అడిగా.  నేనే మనీ పే చేయాలి. కాని ఏం జరిగిందో తెలుసా..

వెంటనే విశి ఇంటికి వెళ్ళాలేమో.. ఆంటీ వెయిట్ చేస్తూ ఉంటారు కదా..

పరవాలేదులే అన్నయ్య.. బాబీని చెప్పనివ్వి. ఏదో మంచి ఇంట్రెస్టింగ్ విషయం చెబుతున్నట్టుంది. అవును సార్.
ఇది చెబితే సౌమ్యకి కూడా యూస్ అవుతుంది కదా..

అవునా నాకు కూడా యూస్ అయ్యే విషయమా.. అయితే చెప్పు వింటాను.  సౌమ్య...  మావయ్య ఫోన్ చేస్తున్నట్టున్నారు.

ఆల్రెడీ చెప్పాను బావ.  శ్రీకర్ వచ్చి తీసుకు వెళ్ళడం నాన్నకి తెలుసు. నువ్వు చెప్పు..

వావ్ సూపర్ అని చెప్పట్లు కొడుతూ ఒక వాయిస్ వినపడుతుంది. అంతే అప్పుడు దాకా నవ్వుతూ మాట్లాడిన విశి సైలెంట్ అయిపోయి అటు చూస్తోంది.

దగ్గరగా వచ్చి ఏంటి విశి.. రూపాయి... రూపాయి లెక్క వేసుకుని చూసుకునే నువ్వు.. నా దగ్గర 10 లక్షలు అప్పనంగా కొట్టేసి ఎంజాయ్ చేస్తున్నావా అని గౌతమ్ వెటకారంగా మాట్లాడుతాడు.

ఆ మాటకి సూర్యకి చాలా కోపం వస్తుంది. కానీ విశి చెప్పే సమాధానమే ఇంపార్టెంట్ అని చూస్తూ ఉంటాడు.

విశి కోపంగా నీ దగ్గర నేనేమీ కొట్టెయ్యలేదు.  అది బిజినెస్ డీల్. బిజినెస్ డీల్ ప్రకారమే నువ్వు నాకు ఇచ్చావు. అంతేగాని ఎక్స్ట్రా ఏమి ఇవ్వలేదు కదా...

అయినా మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు...  ఎనీమీస్ కాదు.. అలాంటప్పుడు నువ్వు నా పర్సనల్  స్పేస్ లోకి వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదేమో..

పరవాలేదు విశిష్ట.  మాటలు బాగా నేర్చావు. ఈ మాటలు అంతా నీ పక్కన ఉన్న ఈ దేవాని చూసే కదా ఎగురుతున్నావు.

లేదు నాలో ఉన్న ధైర్యం చూసి ఎగురుతున్నాను.
నాలో ఉన్న ధైర్యం నాకే చెందింది.
ఎవరూ నేర్పాల్సిన అవసరం నాకు లేదు.
ఎందుకంటే... నువ్వు దానిని నాలో చంపాలని ప్రయత్నించావు.
కానీ నేను దాన్ని నిలబెట్టుకున్నాను.

గౌతమ్ స్మిర్క్ చేస్తూ....
వావ్… పెద్ద మాటలు చెబుతున్నావు.

విశిష్ట చిన్న స్టెప్ ముందుకి వేస్తూ..
మాటలు కాదు గౌతమ్… సత్యం.
నువ్వు నా మీద చూపిన  దొంగ ప్రేమ, అవమానం, నమ్మకానికి చేసిన ద్రోహం..
అవి నాకు పాఠం నేర్పాయి.
ఇప్పుడు ఎవరి ఎదుట నిలబడాలో, ఎవరి కోసం మౌనంగా ఉండాలో నాకు స్పష్టంగా తెలుసు.

సూర్య సైలెంట్‌గా చూస్తూ ఉంటాడు.. కానీ  ఆ చూపులో గర్వం ఉంటుంది.
మనసులోనే.. ఇదే విశిష్ట...  నేను కోరుకుంది.  నీలో ధైర్యం తెగింపు మొదలవ్వాలి.

అది ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడే అడుగుపడాలి..
విశిష్ట అంత ధైర్యంగా నలుగురిలో సమాధానాలు చెబుతూ ఉంటే గౌతమ్ తట్టుకోలేకపోతాడు. ఎలాగైనా ఆ ధైర్యాన్ని బలహీన పరచాలి అనుకుంటూ..

గౌతమ్ స్మైల్‌తో...  కళ్ళలో కటువుతనంతో..
ఏం విశిష్ట… ఈ ధైర్యం అంతా ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చింది?
పాత రోజుల్లో అయితే నీ శబ్దం కూడా వినిపించేది కాదు.
ఇప్పుడు ఒక్కో మాట కత్తిలా విసుర్తున్నావు.

విశిష్ట సైలెంట్‌గా ఒక నిమిషం చూస్తూ..
ఈ ధైర్యం ఎప్పుడూ నాలోనే ఉంది. అప్పుడు మాట్లాడలేకపోయాను
ఎందుకంటే అప్పుడు నువ్వు నన్ను ఎమోషనల్ గా వీక్ చేసావు.
ఇప్పుడు నేను నా ధైర్యం మీద నిలబడ్డాను.
నా శబ్దం కూడా వినపడలేదు అంటున్నావు కదా అది భయం కాదు గౌతమ్… నిన్ను నమ్మిన పాపమే నన్ను మౌనం చేసింది.

గౌతమ్ దగ్గరకి వస్తూ, వాయిస్ పెంచుతూ..
ఓహ్… ఇప్పుడు నేనో విలన్ అయిపోయానా ?
నీ దగ్గర ఉన్న వాళ్లందరూ హీరోలే కదా...
ముఖ్యంగా ఈ దేవా...

ఎంత దగ్గరయ్యాడు చెప్పు విశిష్ట… నీ డెసిషన్స్ కూడా ఇప్పుడు అతడే తీసుకుంటాడా?

సూర్య కోపంతో ముందుకు రావాలనుకుంటాడు, కానీ ఆగిపోతాడు. విశిష్ట వైపు చూస్తూ... ఉంటాడు.  గౌతమ్ మాట్లాడే మాటలకి మిగిలిన వాళ్ళకి కూడా చిరాకు వస్తూ ఉంటుంది.

వైభవ్ అయితే లేచి కొట్టాలి అన్నంత కోపం వస్తూ ఉన్న సూర్య చూపులకి ఆగిపోతాడు.

విశిష్ట గట్టిగా... కంట్రోల్‌తో..
మాటల్లో తక్కువగా దూషణ, ఎక్కువగా గౌరవం ఉండాలి గౌతమ్.
ఎందుకంటే నీ గతం ఇప్పటికీ నన్ను అవమానించడానికి కాదు..
నువ్వు ఒకప్పుడు సాయం చేశావు  అని గుర్తు చేయడానికి ఉంది.

గౌతమ్ నవ్వి..
సాయం? నేను చేసానా నీకు సాయం?

విశిష్ట కళ్ళలో తడి తళుకుతో, కానీ గట్టిగా...
అవును. చేసావు.
కానీ ఆ సాయం పక్కనే నీ స్వార్థం  కూడా పెరిగింది.
అదే నిన్ను చిన్నవాడిని చేసింది…
అదే నన్ను పెద్దగా మార్చింది.

గౌతమ్ మాట దొరకక, కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఏంటి గౌతమ్ మాట్లాడలేకపోతున్నావా. నా వర్క్ ని అన్యాయంగా తీసుకుని ఏదో దానం చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చావు. కానీ ఆ రోజుల్లో నాకు ఆ డబ్బులే అవసరం అయ్యి  గొప్ప సాయంగానే భావించాను

విశిష్ట ప్రశాంతంగా
ఇంకోసారి నా వ్యక్తిగత స్పేస్ లోకి వస్తే..
అది పాత విశిష్ట కాదు అని నీకే తెలుస్తుంది.

గౌతమ్ వెనక్కి అడుగు వేస్తాడు. సూర్య చిన్న స్మైల్‌తో చూస్తాడు.

గౌతమ్ పరిస్థితి...

విశిష్టాలోఆత్మవిశ్వాసం.............
[+] 8 users Like SivaSai's post
Like Reply

Part - 77



విశిష్ట లో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ కి గౌతమ్ ఆశ్చర్యపోతాడు.  వెనక్కి అడుగు వేస్తూ నీ సంగతి తర్వాత చూస్తాను అని వెళ్ళిపోతాడు...

దేవ వైపు తిరిగి థాంక్యూ సార్...మీరు ఎన్నైనా చెప్పండి కానీ ఈరోజు నేను ఇంత ధైర్యంగా మాట్లాడాను అంటే అది మీ వల్లనే. మీకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా తక్కువే..

వీళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే సూర్య ఒక్కసారే ఓ మై గాడ్ అని చేతితో మొఖాన్ని కప్పుకుంటాడు.  శ్రీకర్ ఏమైందిరా అంటే..

అటు చూడు ఆ హిమ ఇటే వస్తుంది.  ఇక్కడ నన్ను చూసింది అంటే ఇంకా అంతే సంగతులు. సరే నువ్వు ఎస్కేప్ అవ్వు.

విశి ని వైభవ్ డ్రాప్ చేస్తాడు.  వైభవ్ కూడా తెలుసు కదరా...  మీ అన్నదమ్ములు ఇద్దరు నీ అని..  వాడు మాస్క్ పెట్టుకుని తీసుకువెళ్తాడు.

హిమ చూపు ఎంతసేపు నీపైనే ఉంటుంది కానీ మిగిలిన వాళ్ళ మీద ఉండదు కదా.. సరే అనే ఫోన్ వస్తున్నట్టుగా ఒక నిమిషం ఉండి..

విశి..  నాకు అర్జెంటు కాల్ వస్తుంది. నిన్ను వైభవ్ డ్రాప్ చేస్తాడు..  ప్రాబ్లం ఏమీ లేదు కదా..  అయ్యో సార్ మీరు వెళ్ళండి. ఓకే అని స్పీడ్ గా వెళ్ళిపోతాడు.

ఎంత తప్పించుకుని వెళదాము అనుకున్నా హిమ కళ్ళల్లో పడతాడు. సూర్యా.. సూర్య అని ఎగురుతుంది. వైభవ్ అడ్డుగా నిలబడి..

రా బాబీ.. ఇంకా వెళదాము నేను చాలా అలసిపోయాను అని అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతాడు.

సూర్య ఇక తప్పక వెనక్కి తిరిగే హాయ్..నువ్వేంటి ఇక్కడ. అది నేను అడగాలి మీరేంటి... మీలాంటి వాళ్లు కూడా షాపింగ్ కి వస్తారా..

ఏం మేం బట్టలు వేసుకోమా ఏమిటి.. ఆ మాటకి హిమ మెలికలు తిరుగుతూ... నా ఉద్దేశం అది కాదు.  మీకు సపరేటుగా డిజైనర్స్ ఉంటారు కదా.

ఎంతమంది  ఉన్నా ఒక్కొక్కసారి వచ్చి షాపింగ్ చేయాలి అనిపిస్తుంది. నీలాంటి ఫిగర్ ఇలా బయట తిరిగితే చాలా ప్రాబ్లం  కదా....

ఎంత మంది వెంట పడతారో.. డిజైనర్ ని ఇంటికి పిలిపించుకోవచ్చు  కదా.. ఇలా తిరిగితే టాన్ అయ్యిపోవు..

హ..  మాటకి  మురిసిపోతూ..  చెవి వెనక్కి  హెయిర్ తోసుకుంటూ.. పిలిపించుకోవచ్చు కానీ నాకు కూడా ఇలా షాపింగ్ చేయడం అంటేనే ఇష్టం.

చూశారా మనిద్దరి అభిప్రాయాలు కూడా ఒకటే.. అవునవును ఇప్పుడే తెలుస్తుంది.  అని ప్యాంటు పాకెట్లో రెండు చేతులు పెట్టుకుంటాడు.

  షాపింగ్  చేద్దామా అని అడుగుతుంది. ఓ.హిమ  సో సోరి ఇప్పుడే నా షాపింగ్ అవ్వడం... నా లగేజ్ వెళ్లిపోవడం జరిగింది.

ఇంతసేపు నేను బయట ఉన్న ప్రాబ్లం కదా.. నీ కన్నా ఎవరికి బాగా తెలుసు చెప్పు. నెక్స్ట్ టైం చేద్దాం. ఓకే.. యు క్యారీ ఆన్ అని హమ్మయ్య అనుకుని  మెల్లిగా జారుకుంటూ ఉంటే..

సూర్య అని పిలుస్తుంది. అబ్బా.. ఈ జిడ్డు వదిలేటట్టు లేదు అనుకుని చెప్పు హిమా అని కష్టంగా నవ్వుతాడు. ఈ సండే మీరు ఫ్రీ గానే ఉంటారా..

వై... డాడీ మిమ్మల్ని స్పెషల్గా లంచ్ కి ఇన్వైట్ చేశారు. ఆ రోజు మీరు ఫ్రీగా ఉంటే లంచ్ కి పిలుద్దామని.. నా షెడ్యూల్ గురించి నీకు తెలుసు కదా..

నెక్స్ట్ సిక్స్ మంత్స్ వరకు ఫుల్ షెడ్యూల్ లాక్ అయిపోయింది. ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ప్లాన్ చేద్దాం ఓకే.. సిక్స్ మంత్స్ తర్వాత అని ఆశ్చర్యంగా చూస్తోంది.

  మరి..  నా వర్క్ ఎలా ఉంటుందో నీకు తెలియదా.. అసలు ఇప్పుడైనా నాకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయ్యి.. రిలాక్స్ అవుదామని ఒక మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చాను.

బట్ అస్తమానం అంటే బాగోదు కదా... సరేనా బాయ్.. టేక్ కేర్ అని వెళ్ళిపోతాడు.

వెళుతున్న సూర్యనే చూస్తూ ఇంత బిజీ పర్సన్ అంటే ఎంత రాయల్ లైఫ్. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలి గాని..

ఆ గౌతమ్ గాడిని ఎందుకు అని మైమరపుగా చూస్తూ ఉంటుంది. గౌతమ్ లగేజ్ బ్యాగులతో అక్కడికి వచ్చి హిమ అని పిలుస్తాడు. ఏమిటి అని చిరాగ్గా అంటుంది.

లగేజ్ మొత్తం నాకు ఇచ్చేసి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు.  షాపింగ్ వచ్చినప్పుడు నాతో ఉండాలని తెలియదా..

కమాన్ గౌతమ్..  నన్ను వదిలేసి ముందు వెళ్ళింది ఎవరు.. నువ్వు కాదా.. ఆ విశిష్ట కనిపించింది అని సొల్లు కార్చుకుంటూ వెళ్ళావు.  ఇప్పుడు నన్ను అంటున్నావా..

నేను వెళ్ళింది ఎందుకో నీకు తెలియదా...ఎలా వెళ్ళినా సరే వదిలేసి వెళ్ళింది నువ్వు.  ఏదో తెలిసిన ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడుతూ ఉన్నాను. అది కూడా తప్పేనా..

అయినా ఈ మధ్యన నీకు నామీద అనుమానాలు ఎక్కువ అయిపోయాయి. ఇంత అనుమానం మనిషతో కలిసి ట్రావెల్ చేయాలంటే నావల్ల  కాదు.
ఇంటికి వెళ్ళగానే డాడీకి చెప్పేస్తాను.  గౌతమ్ కి నాకు సెట్ అవ్వదు.  బ్రేకప్..  మీ బిజినెస్ విషయాలు మాత్రం మీరిద్దరే హ్యాండిల్ చేసుకోండి. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని ఖచ్చితంగా చెప్పేస్తాను.

తర్వాత మీరిద్దరూ పడండి అని రాని కన్నీళ్లు తుడుచుకుంటూ అడుగులు ముందుకు వేస్తుంది. అరె హిమా ఇప్పుడు నేను ఏమన్నానని అంతా బాధపడుతున్నావు అని చెయ్యి పట్టుకుంటాడు.

ప్లీజ్ గౌతమ్.. నా చెయ్యి వదులు.  ఇలా రా.. వచ్చి కూర్చో.. ఐస్క్రీం తెస్తానుండు అని తీసుకొచ్చి ఎదురుకుండా పెట్టి ఇది తిను.

చల్లబడతావు. నువ్వు ఈ మాల్ లో తప్పిపోతావేమో అని కంగారుగా అడిగాను కానీ నీ మీద అనుమానమా..  నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే..

అంతేనా .. నిజం. నన్ను నమ్ము. ఇంకా ఏమైనా షాపింగ్ ఉందా. లేదు గౌతమ్ ఇప్పటికే నువ్వు నాకోసం చాలా ఖర్చు పెట్టేశావు.  ఇంటికి వెళదాము అని లెగుస్తుంది.

సరే అని బ్యాగ్స్ మోసుకుంటూ వస్తాడు.  పిచ్చి గౌతమ్.. నాకు ఎంతవరకు కావాలో అంతవరకు నిన్ను వాడుకుంటానే ఉంటాను.

ఇలాంటివాడు నాకు సెక్యూరిటీగా వచ్చాడు అంటే నా లెవెల్ ఏ రేంజ్ లో ఉంటుందో నాకే తెలుసు.  తర్వాత ఆ సూర్యని తిప్పుకుంటాను.

బ్యాగ్స్ మోస్తూ.. మీ నాన్న నా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను అన్నాడు అని సైలెంట్ గా ఉంటున్నాను. నా చేత నువ్వు వాచ్మెన్ పని దగ్గర నుంచి సర్వెంట్ పనిదాకా అన్నీ చేయిపిస్తున్నావు.

ఒకసారి వి. జె. స్. కంపెనీతో నా ప్రాజెక్టు ఓకే అవ్వాలి అప్పుడు నిన్ను ఎలా వాడాలో అలా వాడతాను. అది చూసి మీ నాన్న నా కాళ్లు పట్టుకుని బ్రతిమాలాలి.

ఏడవాలి. అప్పుడు..  నాకు చేస్తున్న అవమానాలకి రివేంజ్ తీర్చుకుంటాను.
కార్లో లగేజ్ సర్ది వెళదామా బేబీ అంటే.. హ బేబీ అని సూర్యనే ఊహించుకుంటూ ఉంటుంది.

సూర్య శ్రీకర్ కారులో కూర్చుని వాటర్ బాటిల్ తీసుకుని నెత్తిపై నుంచి పోసుకుంటాడు. సౌమ్య, శ్రీకర్ ఒకేసారి హే బావ అంటే..

అబ్బా.. అదేం జిడ్డు కేసు రా..  ఎంత వదిలించుకుందామంటే అంత పాకంలాగా పట్టుకుంటుంది.
మరి తమరి బ్రాండ్ ఏమిటి.. ఫ్యూచర్ జై సింహ కంపెనీస్ కి సీఈఓ. ద గ్రేట్ విక్రమ్ జై సింహ ముద్దుల గారాల కొడుకువి.

అది చాలదా.. నీ వెంటపడి సొల్లు కార్చడానికి..  నీ ప్లేసులో మన ఇంటి వాచ్మెన్ ఉన్నా సరే దానికి ఓకే. ఈ విషయం ముందే చెప్పుంటే వాచ్మెన్ పెట్టి హ్యాండిల్ చేసే వాడిని కదా..

  వాచ్మెన్ యస్ బాస్ అనగలడు గాని..నీలాగా స్పాంటెన్స్ గా కౌంటర్లు వెయ్యలేడు కదా..

ఛ..  ఈరోజు మొత్తం అంతా నా క్యూటితోనే ఉండాలి అనుకున్నాను. ఈ ఇడియట్స్ ఇద్దరు మూడు స్పాయిల్ చేశారు.

నీ క్యూటి తో టైం స్పెండ్ చేయాలంటే అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళిపోవాలమ్మా.. అప్పుడే కుదురుతుంది. ఇలా లోకల్లో ఉంటే ఎలా కుదురుతుంది.

అందుకే ప్లాన్ చేశాను.  ఏమిటి..  కంపెనీతో  క్యూటి టైప్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక త్రీ డేస్ ఫుల్లుగా రౌండ్స్ వేస్తాము.

హైదరాబాద్ టు వైజాగ్.. అబ్బో మా బావ రొమాంటిక్ ఫెలో అవుతున్నాడా.. నేను అవితే గాని నీ చెల్లి ఓపెన్ అవ్వదు.

సరే.. రెండు జంటలు బైక్స్ మీద వెళదామా.. వద్దు మీకు కావాలి అనుకుంటే ఊటీ వెళ్లండి..ఏంటి బావ అంత మాట అనేసావు అని షర్టు బటన్స్ పట్టుకుని లాగుతూ ఉంటే..

ఆ చేతి మీద ఒకటి కొట్టి.. మీరు ఆల్రెడీ ఓల్డ్ లవర్స్..  మేము ఫ్రెష్ లవర్స్.  మీరు మాతో వస్తే ఎలా చెప్పు. మీరు ఏమో ఎక్స్పీరియన్స్ తో ఏదేదో చెబుతూ... చేస్తూ ఉంటారు.

మేము ఇప్పుడే కదా అడుగులు వేస్తున్నాము. కాబట్టి మీ దారి మీదే.. మా దారి మాదే.  ఆ మాటకి సౌమ్య..  బావ అక్కడ అంత సీను లేదు. మాటలే..

అమ్మని ఎంత మాట అనేసావు.  మొహమాట పడతావు.. బిగుసుకుపోతున్నావు అని చిన్నగా నేను హ్యాండిల్ చేస్తూ ఉంటే.. ఇంక లాభం లేదు..

ఈ శ్రీకర్  అంటే ఏంటో ఇంకా చూపించాల్సిందే..  ఒకప్పుడు పిల్లి లాగా ఉండేదానివి. ఇప్పుడు పులిలాగా మారిపోయావు.

ప్రతిదానికి కౌంటర్లు వేస్తున్నావు ఏమిటి సంగతి.  అయ్యో శ్రీకర్ నువ్వు ఉండగా కూడా నేను పిల్లిలాగా ఉంటే నువ్వు ఫీల్ అవుతావు కదా.. అబ్బా సెంటిమెంట్తో కొట్టమంటే నీ తర్వాతనే..

వైభవ్ విశి ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి సరే బాబీ ఇక నేను వెళతాను. హే వైభవ్ ఒక్క నిమిషం అని బైక్ పట్టుకుంటుంది.

చెప్పు బాబి నాతో  చందు విషయం మాట్లాడావు కదా..  నీకేం అర్థం అయింది..

బైక్ మీద అలాగే కూర్చుని ఒక చేతిని మడిచి.. రెండో చేతితో బుగ్గ మీద టాప్ చేసుకుంటూ..  అర్థమైనట్టు ఉంటుంది అర్థం కానట్టు ఉంటుంది.

అది దెబ్బలాడితే బాగుంటుంది. మౌనంగా ఉంటే చిరాకు వస్తుంది. దీనినే ప్రేమ అంటారు. నిజమా బాబి నీకు ఎలా తెలిసింది. ఈ మధ్యనే ఏదో తెలుస్తూ ఉన్నాయిలే..

ఈ వదిన మరిదిల తెలివి ఎటు వెళుతుందో..

కథ కొనసాగుతుంది................
[+] 9 users Like SivaSai's post
Like Reply

Urgent Work meda ma village ki Vachanu.so update 1Hour lo Vastundi 
[+] 3 users Like SivaSai's post
Like Reply

Part - 78



అది దెబ్బలాడితే బాగుంటుంది. మౌనంగా ఉంటే చిరాకు వస్తుంది. దీనినే ప్రేమ అంటారు. నిజమా బాబి నీకు ఎలా తెలిసింది. ఈ మధ్యనే ఏదో తెలుస్తూ ఉన్నాయిలే..

కానీ బాబి అని డల్ అవుతాడు. మళ్ళీ ఏమైంది.. ఎప్పుడు చూసినా దాన్ని కోప్పడతాను..  చిరాకు పడతాను.. సెటైర్లు వేస్తాను. ఇప్పుడు వెళ్లి ప్రేమ అంటే నన్ను నాలుగు పీకుతుంది ఏమో..

ఇవన్నీ ధైర్యంగా చేసినప్పుడు...నువ్వంటే నాకిష్టం ఐ లవ్ యు అని ఎందుకు చెప్పలేవు.. అప్పుడు దాని మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు కదా..

అందుకే ఎలా పడతే ఆలాగా మాట్లాడేవాడిని. ఇప్పుడు ఏదైనా తేడా వస్తే నేను ఫీల్ అవుతానేమో అని ఆలోచిస్తున్న..

నువ్వు ఫీల్ అవ్వడం కాదు.. మీరిద్దరూ ఎలా డీల్ చేస్తే హ్యాపీగా ఉంటారో అన్నది ఆలోచించు.  తనకంటూ కొన్ని ఇష్టాలు యాంబిషన్స్ ఉంటాయి కదా..

వాటిలో సపోర్టుగా నిలబడు. ఇప్పుడు మీ అన్నయ్య ఉన్నారు చూడు..

ముందు నాకు  ఒక వ్యక్తిగా పరిచయమయ్యారు.  తర్వాత లెక్చరర్ గా తెలుసు. ఇప్పుడు ఫ్రెండ్ అయ్యారు
ఇంకా.. 

హ..  ఇంకా చెప్పు బాబి.  ఏమీ లేదులే కానీ అలా నిలబడు.  ఆటోమేటిక్గా చందు నిన్ను ఇష్టపడుతుంది. ఆల్రెడీ అది నన్ను ఇష్టపడుతుందనే నా అనుమానం.

మరి ఇంకేంటి నీ ప్రాబ్లం. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను అని చెబితే కామెడీ చేశానేమో..  దాన్ని ఆట పట్టిస్తున్నాను అనుకుంటుందేమో..

అప్పుడు నీ ప్రేమలో ఉన్న సిన్సియారిటీ చూపించు.  అదే ఎలా..  అది తెలిస్తే నేనెందుకు ఇలా  నిలబడి ఎదుటి వాళ్ళకి  క్లాస్ ఇస్తాను చెప్పు.

నీది సేమ్ ప్రాబ్లమా.. హ.. అవును అని నీరసంగా అంటుంది.  నో ప్రాబ్లం బాబి. దీని మీద బాగా స్టడీ చేసి మన ఇద్దరం సక్సెస్ కొడదాం.

దాని కన్నా ముందు నాకు రేపు వి. జె. స్. కంపెనీతో మీటింగ్ ఉంది. సో నువ్వు కూడా అటెండ్ అవ్వాలి
  ఏ టైం.  పది కి..  తప్పకుండా వస్తాను.

రిలాక్స్టిగా పడుకో..  ఫ్రెష్ ఫేస్ తో  గుడ్ మార్నింగ్ చెప్పు.
హ్యాపీగా రేపు వర్క్ స్టార్ట్ చేద్దాం. సక్సెస్ కొడదాం.ఓకే బాయ్ అని చెప్పి లోపలికి వెళుతుంది.

పూల మొక్కల మధ్యన కూర్చుని నేహా భానుమతి జోక్స్ వేసుకుంటూ గట్టిగా నవ్వుతూ ఉంటారు.  వాళ్ళిద్దర్నీ అలా చూడగానే చాలా హ్యాపీగా అనిపించి..

వెళ్లి వెనక నుండి భానుమతి మెడచుట్టు చేతులు వేస్తుంది. అరే బంగారు తల్లి వచ్చేసావా...షాపింగ్ అయిపోయిందా.. అయిపోయింది. ఏం చేస్తున్నారు ఇద్దరు.

ఏమీ లేదు ఏదో చిట్.. చాట్ అంతే.. అవునా అని అక్కడే కూర్చుంటుంది ఇంతకీ ఏం కొన్నావు..ఈరోజు షాప్ లో ఏం జరిగిందో తెలుసా అంటీ..

చెప్పు వింటాము అని నేహా అడుగుతుంది ఫస్ట్ డ్రెస్సెస్ తీసుకోవడానికి వెళ్ళామా ? సెలెక్ట్ చేసినప్పుడు ఒక నాలుగు డ్రెస్సెస్ తీసాను కానీ ఒకటి చాలు అని ఫిక్స్ అయ్యాను.

కానీ ఈరోజు లక్కీ డ్రిప్ అంట.. నాకే వచ్చింది. ఎన్ని సెలెక్ట్ చేసుకున్నామో అన్ని ఫ్రీ. అవునా ఏ షాప్ ఏంటి.. షాప్ పేరు చెప్పగానే నేహా కి అర్థమవుతుంది. సూపర్..

నేహా డ్రెస్సుల బ్యాగ్‌ లైన్‌ని చూస్తూ..
విశి, నీ లక్‌కి సెల్యూట్ చెప్పాలి రా! మనమంతా ఎన్ని సార్లు వెళ్లినా ‘కూపన్ ఎక్స్‌పైర్డ్’ అని చెప్పేస్తారు. కానీ నీకు ఆ షాపులో కొన్న వెంటనే లక్కీడ్రిప్.  సో మేము కూడా వచ్చి ఉంటే బాగుండేది.

విశి నవ్వుతూ... అవును ఆంటీ మీరందరూ సెలెక్ట్ చేసుకున్నవి కూడా నా అకౌంట్లో తీసేసుకునే వాళ్ళము. విశి బ్యాగ్స్ లో నుంచి తీసి చూపిస్తూ ఉంటే కలెక్షన్ చాలా బాగుందిరా..
అదంతా మన స్టైల్ మీద డిపెండ్ అవుతుంది.  షాప్ వాళ్లకే అనిపించిందేమో — ఈ గర్ల్‌కి డ్రెస్ గిఫ్ట్ చేస్తే స్టోర్ నేమ్ వైరల్ అవుతుందనే!

నేహా నవ్వుతూ అంతే అయ్యుంటుంది లేకపోతే ఇన్ని డ్రెస్సెస్ ఎందుకు ఇస్తారు.

బానుమతి మైమరచి ఆ లైట్ పింక్ గౌన్ ని పట్టుకుని..
ఇది చూడరా …  మెత్తగా జారిపోతుంది. చాలా సాఫ్ట్ ఫాబ్రిక్ రా! ఇదే వేసుకుంటే  ఏ ఫంక్షన్‌కి  వెళ్లిన అందరూ నీ మీదే ఫోకస్ చేస్తారు.

అప్పుడు అందరూ ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు అని అడుగుతారు..షాప్ నేమ్ చెబుతాను సో వాళ్లకి ఫ్రీ పబ్లిసిటీ.

వావ్ విశి నీకు ఎంత టాలెంట్ ఉంది. సరే అన్ని లోపల పెట్టుకో. భానుమతి నేను తీసుకువెళ్తానులే అని బాగ్స్ తీసుకుని వెళుతుంది.

భానుమతి వెళ్లిన తర్వాత విశి నేహా చేతులు పట్టుకుని థాంక్యూ ఆంటీ అంటుంది.  దేనికి రా.. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మలో చాలా మార్పు వచ్చింది.

హాస్పిటల్ కి తీసుకు వెళ్లిన ఎక్కువ సెషన్స్ అవసరం లేదు అంటున్నారు. ఇదంతా మీ వల్లనే..

నాదేముంది... అత్తయ్య మావయ్య  ఇద్దరు డాక్టర్స్.. వాళ్ళు డైరెక్షన్లో అమ్మకి ఎలా చేస్తే మంచిదో తెలుసుకొని అది ఫాలో అవుతున్నాను అంతే..

సరే వెళ్ళు.  వెళ్లి రెస్ట్ తీసుకో. రేపు నీకు ఇంపార్టెంట్ వర్క్ ఉన్నట్టు ఉంది కదా..  అవును అంటీ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది.

వెంటనే అవనికి కాల్ చేసి చెప్పాలి. మనవాడు చేసిన విషయం చెబితే ఎలా రియాక్ట్ అవుతుందో ఏమిటో అని ఫోన్ చేస్తుంది.

అవని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు నేహా అనగానే..  ఈరోజు తమరి సుపుత్రుడు ఏం చేసాడో తెలుసా.. ఏం చేశాడు అని అనుమానంగా అడుగుతుంది.

అప్పుడే నీకు కాబోయే కోడలికి ఫ్రీ షాపింగ్ చేశాడు.  మీ మాల్ లో ఉన్నవన్ని దోచిపెడుతున్నాడు. అవునా.. ఎప్పుడైనా నీకు ఒక చీరైనా తెచ్చాడా.. అడుగు.

వదిలేస్తే ఇప్పుడే నుంచే జారిపోతారు రేపు పెళ్లి అయ్యాక మనల్ని అస్సలు లెక్క చేయరు. నువ్వు అన్నది కూడా నిజమేలే గట్టిగా అడుగుతాను.

ఫోన్ పెట్టేసి ఆలోచిస్తున్న అవనినీ విక్రమ్ కదిపి ఏంటి శ్రీమతి గారు... ఏదో చించుతున్నారు. ఈరోజు తమరి సుపుత్రుడు ఏం చేశాడో తెలుసా?

నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది. అప్పుడే క్యూటి ని తీసుకుని షాపింగ్ లు అని తిరుగుతున్నాడు అంట.. ఓ. అవునా.. చేస్తున్న వర్క్ పక్కన పెట్టి మరి భార్య ముఖంలో మొఖం పెట్టి  అడుగుతాడు.

మన. మాల్ లోనే ఫ్రీ అని చెప్పి ఇచ్చాడంట. అలా జరిగిందా. ఎప్పుడైనా నాకు ఒక చీరైనా తెచ్చాడా.. అట్లీస్ట్ మీకు ఒక కర్చీఫ్ అయినా కొన్నాడా..

లేదు కదా.. అప్పుడే చూడండి కోడలు అవ్వకముందే అమ్మాయి కొంగ పట్టుకుని తిరుగుతున్నాడు. రేపు పెళ్లయిన తర్వాత అసలు నన్ను పట్టించుకుంటాడా..

అవని మాటలకి విక్రమ్ నవ్వుకుంటూ ఇప్పుడు నా శ్రీమతి ప్రాబ్లం ఏమిటి.. తల్లికి కొనకుండా కాబోయే భార్యకి కొన్నాడు అనా..

ఇది మరీ బాగుంది.  క్యూటి కి కొంటే నాకేంటి ప్రాబ్లం. మరి ఎందుకు ఇంత దారుణంగా ముక్కు చీదుతున్నావు. నిన్ను పట్టించుకోలేదనా లేకపోతే క్యూటి కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు  అనా..

అయ్యో నా బాధ మీకు అర్థం కావడం లేదు.  క్యూటి కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే నేనెందుకు బాధపడతానండి.  ఇప్పుడు నిన్ను పట్టించుకోవడం లేదు అని బాధ పడుతున్నావు అంతేనా.. అంతే కదా..

ఏమి పట్టించుకోలేదు.  రోజు బయటనుంచి రాగానే అమ్మ అని వెతుక్కుంటూ వచ్చి నీ ఒళ్ళు పడుకుని కబుర్లు చెబుతున్నాడు.

దానిని ఏమంటారు.  అలసిపోయి వచ్చాడు కదా.. అలా ఒళ్లో పడుకుని కబుర్లు చెప్తే వాడికి మనసు తేలిక పడుతుంది.  నాకు తృప్తిగా ఉంటుంది.

మరి దానిని ఏమంటారు. మీరు నన్ను మాటలతో మాయ చేస్తున్నారు. లేదు బంగారం ఆలోచించు. నీ కబోర్డ్ ఓపెన్ చేస్తే నీకున్న చీరలు లెక్క పెడితే కట్టని చీరలే ఇంకో సంవత్సరానికి సరిపడగా ఉంటాయి.

మరి క్యూటి పరిస్థితి.. మన పెళ్ళికి ముందు అవని పరిస్థితి.

రేపు మన కంపెనీ తో మీటింగ్ ఉంది. దానికోసం షాపింగ్ కి వెళ్ళి ఉంటారు. తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఏదో ట్రిక్ ప్లే చేసి ఉంటాడు.

అది అర్థం చేసుకోవాలి కానీ ఇలా అలుగుతారా ? ఏమో ఒక్కసారిగా నేహా చెప్పేటప్పటికి కొంచెం జలస్ వచ్చిన మాట నిజమే.

నా కొడుకు ముందు నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనిపించింది. మీరు చెప్పింది విన్నాక నిజమే కదా అనిపిస్తుంది.

నీ కొడుకు ఎప్పుడు మొదటి ఇంపార్టెన్స్ నీకే ఇస్తాడు. కావలిస్తే చూడు..  రాగానే ఈ విషయాలన్నీ చెబుతాడు. సరే వాడు చెప్పేదాకా మీరు అడగకూడదు.

వాడికి మెసేజ్ చేయకూడదు. నా మీద కూడా అనుమానమే..   కొడుకుల దగ్గరకు వచ్చేటప్పటికి.. మీ అమ్మలు మామూలుగా ఆలోచించరే..

అప్పుడు దాకాను నా కొడుకు బంగారం.  మా ఆయన సింగారం అని పొగుడుకుంటూ ఉంటారు..అదే ఇంకొక అమ్మాయి కొడుకు జీవితంలోకి వస్తుంది అనేటప్పటికి ఎంత సెల్ఫిష్ గా తయారవుతారో..

మీరు ఎన్నైనా చెప్పండి. వాడు ముందు నన్నే పట్టించుకోవాలి . నీలో ఈ యాంగిల్ కూడా ఉందా బంగారం. ఇప్పటివరకు చూడనే లేదు..

మరి ఎప్పుడు నువ్వు నా విషయంలో అలా ఫీల్ అవ్వలేదే.. ఎందుకు ఫీల్ అవ్వలేదు. మీరు గుర్తించలేదు అంతే.  అవునా ఎప్పుడు ఫీలయ్యావు చెప్పు.

ఆ జరిగిపోయినయని చెబుతూ కూర్చుంటే  పుణ్యకాలం కాస్తా వెళ్ళిపోతుంది. వెళ్ళదులే గాని చెప్పురా..  నేను చెప్పను.

నన్ను మాటల్లో పెట్టి మాయ చేస్తున్నారు. వాడు రావాలి..
చెప్పాలి. అప్పుడు దాకా మీ ఫోన్ నా చేతికి ఇచ్చేయండి.
నా మీదే అనుమానమా... కొన్ని విషయాల్లో ఎవరిని నమ్మకూడదు..అందులో మీరు వాడికి బాగా సపోర్టు.. అస్సలు నమ్మను.

ఏ భగవాన్.. మా ఆవిడలో అప్పుడే అత్తగారి క్యారెక్టర్ దూరేసింది. ఇక నా కొడుకు పని అంతే..

సూర్య విజిల్ వేసుకుంటూ వస్తూ ఉంటాడు. గదిలోకి వచ్చి అమ్మ అని పిలుస్తాడు. విక్రమ్ చూసావా అని కళ్ళు తిప్పితే.. అప్పుడే ఏమైంది అని కళ్లు ఆర్పుతుంది.

ఇవేమీ తెలియని సూర్య..  విశి తో షాపింగ్ అయినందుకు మంచి హ్యాపీ మూడ్లో వచ్చి అవని పక్కన కూర్చుని భుజం మీద చెయ్యి వేస్తాడు.

సూర్య చెబుతాడా...............
[+] 5 users Like SivaSai's post
Like Reply

Part - 79



సూర్య..  విశి తో షాపింగ్ అయినందుకు మంచి హ్యాపీ మూడ్లో వచ్చి అవని పక్కన కూర్చుని భుజం మీద చెయ్యి వేస్తాడు.

అవని కొడుకు చెంప పైన చెయ్యి వేసి ఏంటి నాన్న..  ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. అవునమ్మా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను.

అవునా.. ఆదివారం ఇంట్లో కూడా ఉండకుండా ఎక్కడికో వెళ్లినట్టున్నావు. విక్రమ్ తల పట్టుకుంటాడు.  ఈ ఆరాలు అడగడం ఏమిటో..

నిజంగా ఈ ఆడవాళ్ళందర్నీని ఏదైనా సీక్రెట్ మిషన్ లో పెడితే.. ఒప్పొనేంట్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేస్తారు అనుకో అనుకుంటూ కొడుకు వైపు జాలిగా చూస్తాడు.

తల్లి భుజం పైన తలవాల్సి తండ్రి వైపు చూస్తాడు.  విక్రమ్ చూపు తేడాగా అనిపించి ఏంటి అని కళ్ళు ఎగరేస్తాడు. అవని వైపు కళ్ళు తిప్పి మళ్లీ సైలెంట్ గా లాప్టాప్ ఓపెన్ చేస్తాడు.

కొంచెం కొంచెం మేటర్ అర్థమవుతూ ఉంటుంది..అమ్మ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ మాటకే అవని మొఖం వెలిగిపోతుంది.

ఏంట్రా చెప్పు. ఈరోజు మార్నింగ్ క్యూటి ఫోన్ చేసింది. అవునా..  దేనికి..  రేపు మన కంపెనీలో ప్రజెంటేషన్ ఉంది కదా..  సో దాని గురించి.

నిన్ను ఎక్స్ప్లెయిన్ చేయమందా? కాదమ్మా..  డ్రెస్ తీసుకోవడం గురించి. ఆడవాళ్ళ డ్రెస్సులు నీకెలా తెలుస్తాయి రా..

ఆ మాటకి విక్రమ్.. ఏ నీ చీరలన్నీ నేను సెలెక్ట్ చేయలేదా.. పెళ్లి అయిన తర్వాత అన్ని నేను సెలెక్ట్ చేసినవే కదా.. అది వేరు.

మనం భార్యాభర్తలం. వాళ్లు రేపు ఫ్యూచర్లో కాబోయే భార్యాభర్తలు. ఇంకా అవలేదు కదా..  మధ్యలో మీరు రాకండి.  నువ్వు చెప్పు నాన్న..

హ్మ్.. వాళ్ల నాన్నగారు ఉన్నన్ని రోజులు ఎక్కువగా సెలక్షన్ మొత్తం అంకుల్ దేనంట..  ప్రెసెంట్ ఆంటీ కండిషన్ తెలుసు కదా నీకు..

క్యూటికి ఒక వెల్విషర్ అంటే ప్రస్తుతం నేనే...అందుకే నా సజెషన్ అడిగింది అని అవని వీక్ పాయింట్ మీద కొడతాడు.

విక్రమ్ కొడుకు వైపు  చూసి సూపర్ రా అని కళ్ళు ఎగరేస్తాడు.  తండ్రి వీక్నెస్ వచ్చేటప్పటికి అవని మంచులాగా కరిగిపోతుంది.

నువ్వన్నది కూడా నిజమేలే.. నువ్వు కాకపోతే ఇంకెవరూ చెబుతారు అని మళ్లీ లాజిక్ గా అడుగుతూ..  మన మాల్ కే తీసుకువెళ్లకపోయావా.  అక్కడైతే క్వాలిటీ బాగుంటుంది.

విక్రమ్ తల పట్టుకుంటాడు. నేను కూడా నీలాగే ఆలోచించానమ్మ. మన మాల్ కే తీసుకు వెళ్లాను. క్యూటి  కూడా నీలాగానే..

జాగ్రత్త.. మొహమాటం.
అవసరం లేకపోతే  కొనడం ఎందుకు అని చెబుతుంది. క్యూటికి నాలుగు డ్రెస్సులు బాగా సూట్ అయ్యాయి. కలెక్షన్ అయిపోతే మళ్ళీ అలాగే రావు కదా..

తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటే... ఎందుకో క్యూట్ ప్లేస్ లో నువ్వే కనిపించావు అమ్మ.  ఎప్పుడూ నాన్న నీ పాస్ట్ గురించి చెబుతూ ఉండేవారు కదా..

అందుకే ఏమి చెయ్యాలా అని ఆలోచించి లక్కీడ్రిప్ ప్లాన్ వేశాను. నేను చేసింది తప్పా అమ్మ అని అమాయకంగా కళ్ళు టపటప కొడుతూ తల్లి చేతులు పట్టుకుంటాడు.

అవని కన్నీళ్లు పెట్టుకుంటూ కొడుకు చెంపలు నిమురుతూ.. లేదు నాన్న నువ్వు కరెక్ట్ గానే చేసావు. ఒక ఆడపిల్ల కష్టం తెలిసి నడుచుకుంటే అది చాలా మంచిది.

ఎప్పుడు క్యూటికి నువ్వు అలాగే అండగా ఉండు అని నుదుటన ముద్దు పెట్టుకుంటుంది.  అది చూసిన విక్రమ్ గుండెల పైన చెయ్యి వేసుకుని

అమ్మని.. పెళ్లి అవ్వకముందే మీ అమ్మని బుట్టలో వేయడం ప్రాక్టీస్ చేస్తున్నావన్నమాట అని మనసులో అనుకుంటాడు.

తండ్రి మాటలు అర్థం అయినట్టుగా ఎస్ డాడీ అని కళ్ళు టపటప కొడతాడు.. అవని కాస్త నాకు పాలు తీసుకు వస్తావా..

ఎందుకో ఆకలిగా అనిపిస్తుంది. అయ్యో ఇప్పుడే తెస్తానండి అని వెళుతుంది. అవని వెళ్ళగానే విక్రమ్ లాప్టాప్ పక్కన పెట్టి కొడుకు చేతిని వెనకకి విరిచి ఒరేయ్ నువ్వు నాకన్నా పెద్ద ముదురు అయిపోయావు.

మీ అమ్మని ఎక్కడ సెంటిమెంటుతో కొడితే పడుతుందో నీకు బాగా తెలుసు. మరి... అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకో తేడా కొట్టింది.

ఫేస్ చూస్తే ఒకలాగా ఉంది.  మాట చూస్తే ఇంకొక లాగా ఉంది.  అప్పుడే గెస్ చేశాను.  ఎలా రా..  క్యూటీ ఇంటికి వెళ్ళగానే షాపింగ్ చేసినవి మొత్తం..

ఆంటీకి, నేహా ఆంటీకి ఇద్దరికీ చూపిస్తుంది . సో నేహా అంటీ ఆ మ్యాటర్ మొత్తం అమ్మకి పోస్ట్ చేస్తారు. అలా ఎలా గెస్ చేసావురా..

సింపుల్.  ఆడవాళ్ళకి ఏదైనా షాపింగ్ చేస్తే ఎగ్జిబిషన్ పెట్టేదాకా అగరు కదా.. మన ఇంట్లో చూడడం లేదూ... అదే స్ట్రైక్ అయింది.

మీ అమ్మ వస్తుంది ఇంకా ఈ టాపిక్ ఆపేసేయ్..

ఇద్దరికీ పాలగ్లాస్ లు ఇస్తే..  అమ్మ  నా వల్ల కాదు. తాగురా పొద్దున్నుంచి షాపింగ్ లో తిరిగి తిరిగి అలిసిపోయి ఉంటావు అని పట్టిస్తూ ఉంటుంది.

ఒళ్ళో పడుకోబెట్టుకుని స్పూన్ తో పట్టించే.. నీ కొడుక్కి. మీరు ఉండండి.  తిరిగి.. తిరిగి కాళ్లు నొప్పులు వస్తూ ఉంటాయి.

కాళ్ళు నొప్పులుకి,  చేతులకి ఏమైనా సంబంధం ఉందా.. మీ నాన్న అలాగే అంటారు కానీ నువ్వు తాగరా.  మాకు లాప్టాప్ నొక్కి నొక్కి వేళ్ళు నొప్పులు వస్తున్నాయి. మాకు పట్టించొచ్చు కదా..

ఆ మాటకి సూర్య నవ్వుతూ... నాన్న జలస్ ఫీల్ అవుతున్నారు అమ్మ. అస్తమానం నిన్ను అంటారు కానీ నీ విషయంలో నాన్నకే ఎక్కువ అసూయ. క్యారీ ఆన్ అని చెప్పి గ్లాస్ తీసుకొని వెళ్ళిపోతాడు.

సూర్య వెళ్ళగానే చెంగు దోపుకుంటూ మీకు అసలు బుద్ధుందా.. పిల్లోడు ముందు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదా..

మీకు పట్టించాలా..  బుల్లిబాబు వి కదా..  ఉయ్యాల కూడా వేయనా అని అడుగుతుంది.  వెంటనే అవని నీ ఒడిలోకి లాక్కుని పాల గ్లాసు నోటి దగ్గర పెడతాడు.

నాకు వద్దు.  మర్యాదగా తాగుతావా.. లేకపోతే నా స్టైల్ లో పట్టించిన.. అమ్మో వద్దులే అని  గ్లాస్ తీసుకుంటుంది. అది గుడ్ గర్ల్ లాగా తాగు.

సరే తాగాను. మీరు ఆకలని నాకు పట్టించారు. నువ్వు తాగితే నా ఆకలి తీరిపోతుంది గాని... ఏమిటే.. నీ కొడుకు ఏది చెప్పినా సరే ఏదో పురాణం విన్నట్టు..

అవునా అవునా అని అంత అమాయకంగా నమ్ముతావు. వాడు చెప్పేది నిజమో అబద్దమో తెలుసుకోవా..

ఆ మాటకి వెనక్కి తిరిగి భర్త మెడ చుట్టూ చేతులు వేసి.. వాడి చెప్పేది నిజమా అబద్దమా అన్నది అనవసరం. కానీ నాకు చెప్పాలి అనుకున్నాడు చూడండి. అదే చాలు.

ప్రేమించిన వాడికి.. పెళ్లి చేసుకున్న వాడికి కూడా కొన్ని పర్సనల్ ఉంటాయి. తల్లికి చెప్పేవి తల్లికి చెప్పాలి.  భార్యకు చెప్పేవి భార్యకి చెప్పాలి.

అప్పుడే సంసారం ప్రశాంతంగా ఉంటుంది. అబ్బో...మరి ఇన్ని తెలిసిన దానివి ఎందుకు వాడి మీద అంత రుసరసలాడేవు.

వాడి పర్సనల్ లైఫ్ అని వదిలేయకుండా...  అరే అలా వదిలేస్తాను వాడు నా కొడుకు అని ఒళ్ళో నుంచి లేచి గ్లాస్ పక్కన పెడుతుంది.

ఏ మాట కా మాట చెప్పుకోవాలి... అప్పుడే అమ్మ క్యారెక్టర్ ఎక్కుతావు. అప్పుడే భార్య క్యారెక్టర్ లోకి దూరుతావు వెంటనే కాబోయే అత్తగారు పోస్టులోకి వెళ్ళిపోతున్నావు.  ఇంత పరాకాయి ప్రవేశం మీ ఆడవాళ్ళకే చెల్లుతుందేమో..

మేము ఎంత పరకాయి ప్రవేశం చేసిన మమ్మల్ని వేలు మీద ఆడించేది మీ మగజాతే కదా...మొత్తం మా మగ జాతినే టార్గెట్ చేసావా..

కాదా..  నేను ఎంత కోపం చూపించిన మంచులాగా కరిగిపోవడానికి కారణం మీరు కాదా...  అంతేనా ఇంక ఏ విషయంలోనూ కరిగిపోవా అని అవని కొంగు పట్టుకుని లాగుతూ ఉంటాడు.

ఇంత వయసొచ్చినా సరే..  మీరు మాత్రం ఇంకా అప్పుడే కొత్తగా పెళ్లయిన కుర్రోడు లాగా ప్రవర్తిస్తాడు అని బుగ్గ మీద పొడుస్తుంది.

పిచ్చి మొహమా..  పెళ్లయి ఇన్నేళ్లయినా సరే బుగ్గ మీద దేనితో పోడవాలో  అర్థం కాదు అని...ఇలా పెదవులతో అని గట్టిగా ముద్దు పెడతాడు.

విక్రమ్ పెట్టిన ముద్దుకి సిగ్గుపడుతూ విక్రమ్ గుండెల్లో తలదాచుకుంటుంది.  హలో మేడం...నీ కొడుకుకి పెళ్లి అవుతే మనవళ్ళు వచ్చేస్తారు. ఇంకా సిగ్గుపడుతూనే ఉంటావా..

మనవళ్లే కాదు.. మునిమానవళ్ళు వచ్చిన సరే నా సిగ్గుపోదు.  మీ కొంటితనము తగ్గదు.

నీలాంటి అణుకువగా ఉన్న అందాలభరిణి భార్యగా వస్తే ఏమగాడైనా ఇలాగే ఉంటాడు.  ఏమో అవన్నీ నాకు తెలియదు. మీరు మాత్రం బంగారం.

శ్రీకర్ ఇంటికి వెళ్లి నేహా కోసం చూస్తూ ఉంటాడు.  శ్రీ అది చూసి ఏంట్రా మీ అమ్మ కోసం చకోరి పక్షులాగా వెతుకుతున్నావు.

ఈరోజు అమ్మ. ఎంత పని చేసిందో తెలుసా..  ఏమి చేసిందేమిటి అని ఫోన్ పక్కన పెట్టి మరీ కొడుకువైపు తిరిగి అడుగుతాడు.

ఏమి చేయడమా..  షాపింగ్ మాటర్ మొత్తం అవని ఆంటీకి పోస్ట్ చేసి..  అవని అంటీ కి,  సూర్యకి మధ్యలో చిన్న నిప్పు స్టార్ట్ చేసింది.

బట్ అక్కడ ఉన్నది ఎవరు ద లయన్ విక్రమ్ అంకుల్.. మొత్తం ఆర్పేశారు అనుకో..

అవని  అమాయకురాలు రా.. ఏది చెప్పినా నమ్ముతుంది. అందరూ మీ అమ్మలాగా గడుసుగా ఉండరు కదా..  నాన్న అని సైగ చేస్తాడు.

అది పట్టించుకోకుండా అసలు మీ అమ్మ ఎంత టార్చర్ పెట్టెదో తెలుసా.. వేలికేస్తే కాలు కేసేది..  కాలుకి వేస్తే వేలుకి వేసేది.

ఎక్కడికైనా వెళదాము అంటే ఎన్ని క్యూస్షన్స్ అడిగేదో..  అబబ్బ అస్సలు నమ్మేది కాదు. ఏదో నా మంచితనంతో మా సంసారం ఇలా సాగిపోతుంది.  లేకపోతే నా..

హ.. లేకపోతే నా.... ఏంట్రా  ఒక్కసారిగా నీ వాయిస్ మారిపోయింది.  మీ అమ్మలాగా మాట్లాడుతున్నావు. అమ్మలాగా మాట్లాడటం కాదు నాన్న అమ్మే వచ్చింది.

ఎక్కడ రా అని భయంగా అడుగుతాడు. మీ వెనకాల..  వెనక్కి తిరిగి...బంగారం నువ్వు ఎప్పుడు వచ్చావు రా..
కూర్చో నిలబడి నిలబడి కాళ్లు నొప్పులు వస్తాయి.

నేహా, శ్రీ ల టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్..
[+] 6 users Like SivaSai's post
Like Reply

Part - 80



నేహాని చూసిన శ్రీ కంగారుగా బంగారం నిలబడి ఉంటే కాళ్లు నొప్పులు వస్తాయి రా.. వచ్చి కూర్చో. పరవాలేదు లేండి..

నేను నిలబడి నీకు మర్యాద ఇస్తాను.. అసలే నా వలన మీరు ఎంతో సఫర్ అవుతున్నారు కదా... ఆ మాట అన్న ఇడియట్ ఎవరు.

హా...అని చూస్తుంది. ఏదో ఫ్లోలో అన్నాను. నీ భయం నీ కొడుక్కి ఉండాలని ఏదో చెప్పాను బంగారం.. అంతేగాని నువ్వు ఎంత సాఫ్ట్  అన్నది నాకు తెలియదా అని బుజ్జగించడం మొదలుపెడతాడు.

తల్లిదండ్రులను చూసిన శ్రీకర్ నవ్వుతూ ఎందుకు నాన్న అమ్మ ని చూడగానే అలాగా కూల్ చేయడానికి చూస్తున్నారు.

ఇప్పుడు దాకా అమ్మ మీద చాలా సెటైర్లు వేశారు కదా.. ఒరేయ్ నువ్వు సైలెంట్ గా మూసుకుని వెళ్ళు. లేదు అంటే నీకు సౌమ్య కి మధ్యన నేను పుల్ల వేస్తాను.
నేనేమైనా మీరు అనుకుంటున్నారా... పుల్ల వేస్తే  భయపడడానికి.. ముందు అమ్మని కూల్ చేసుకుని ప్రోగ్రాం పెట్టండి.
ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు రా అని పెళ్ళాం వైపు చూస్తాడు. నేహా ఇంకా కోపంగా, శ్రీ బుజ్జగించే మోడ్‌లో... పక్కన సోఫా మీద శ్రీకర్ చూస్తూ..  వాసు, సురభి కూడా కూర్చుని కొడుకు ఎలా కూల్ చేస్తాడా అని చూస్తూ ఉంటారు.

బంగారం నిలబడి ఉంటే కాళ్లు నొప్పులు వస్తాయి రా.. వచ్చి కూర్చో. చాలాసేపటి నుంచి చెబుతున్నాను అయినా సరే నువ్వు నిలబడే ఉంటున్నావు.
పరవాలేదు లేండి.. నేను నిలబడి నీకు మర్యాద ఇస్తాను. అసలే నా వలన మీరు ఎంతో సఫర్ అవుతున్నారు కదా...

ఎందుకు బంగారం చెప్పిన డైలాగే మళ్లీ మళ్లీ చెబుతావు అరే తప్పు చేసిన వాడికి సరిదిద్దుకొని అవకాశం ఇవ్వరా..
నా బంగారం కదు... అంటూ మెల్లిగా నేహా చెయ్యి పట్టుకుని... స్మైల్ చేస్తూ దగ్గరవుతాడు

శ్రీకర్ ఆపిల్ తింటూ.. అయ్యో నాన్నా, ఇది ఏదో డామేజ్ కంట్రోల్ ఆపరేషన్ లా కనబడుతోంది. అమ్మను కూల్ చేయడం అంటే ఎక్సమ్ హాల్ లో లాస్ట్ మినిట్స్ లో ఆన్సర్స్ గెస్ చేయడంలా!

చాలు నీ కామెంట్స్... అందరూ భోజనానికి  రండి.. అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాసు కొడుకువైపు చూసి.. ఇంత వయసు వచ్చినా పెళ్ళాన్ని కూల్ చేయడం రాలేదేంటిరా..

నా కడుపున  ఎలా పుట్టావురా..  సారీ డాడ్ నేను అమ్మ కడుపున పుట్టాను.  ఇలాంటి పిచ్చ డైలాగ్స్ కే.. అటు మీ ఆవిడ దగ్గర... ఇటు కొడుకు దగ్గర బకరా అవుతున్నావు.

శ్రీకరర్.... శ్రీ తో.. నాన్న, మీరు గమనించారా, ఇప్పుడు దాకా అమ్మ మీద మీరు ఎన్నో సెటైర్లు వేశారు కదా… ఇప్పుడు ఒక్కసారి కూల్ చేయాలంటే స్వేటింగ్..

ఓరేయ్ నువ్వు సైలెంట్‌గా మూసుకుని వెళ్ళు.. మీ అమ్మ పెట్టే భోజనం తినేసి దుప్పటి ముసుగువేయి.  మీ ఫైటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు కదా...

శత్రువులు ఎక్కడో ఉండరు రా... ఇలా కొడుకు రూపంలో పుట్టి నాన్నల్ని అమ్మ దగ్గర ఇరికించేస్తారు. మీరు డైలాగు రాంగ్ డైరెక్షన్ లో చెబుతున్నారు..

నాకు తెలుసులేవోయ్..  నాకు కూతురు లేదు కదా అందుకే నిన్ను వాడాను. నీకు ఇప్పుడు లంగా వోణి వేస్తే చండాలంగా ఉంటుంది కదా..

నా గొడవ వదిలేయండి..  అక్కడ అమ్మ పళ్ళాలు పగలకొట్టే పోసిషన్ లో ఉంది.  కూల్ చేసుకోండి.

శ్రీకర్ నవ్వుతూ.. లేదు అంటే నేను మామ్ టీమ్ లో జాయిన్ అవుతా… డైరెక్ట్ ట్రాన్స్ఫర్!

శ్రీ కోపంగా... ఒరేయ్... నిన్ను బయటికి గెంటేస్తాను  రా..

శ్రీకర్.. ఫేక్ షాక్ తో చూసి.. వెంటనే నవ్వేస్తూ.. ఎహ్! పర్లేదు... అప్పుడు నా డార్లింగ్ సౌమ్య దగ్గరికి వెళతాను.
ఈ టైంలో ఏమిటి అని అడిగితే...మా నాన్న మా అమ్మని కూల్ చేసే పనిలో ఉన్నాడు. మమ్మల్ని ఎవరినీ ఉండద్దని చెప్పాడు అని చెబుతాను.

అప్పుడు అందరూ ఏదో అనుకుని... నన్ను అక్కడే ఉండనిస్తారు.   హ్యాపీగా నా లవర్ తో డూయిట్లు వేసుకుంటాను. అక్కడ పీస్ఫుల్ అటమోసఫెర్ కూడా బాగుంటుంది.

నేహా స్మైల్ కంట్రోల్ చేసుకుంటూ... అయ్యో నాయనా..
శ్రీకర్ నువ్వు అలా వెళ్ళితే మీ నాన్న పరువు విక్రమ్ అన్నయ్య దగ్గర గోవిందో గోవిందా..

విక్రమ్ అంకుల్ దగ్గర కన్నా భరత్ మావయ్య దగ్గర అయితే ఇంకా గోవింద అనుకుంటా అమ్మ..
శ్రీ ఉడుక్కుంటూ.. ఇదేనా రా.. అమ్మ కొడుకులు ఒకటైపోయి నన్ను ఏడిపిస్తారా...మా ఇద్దరి మధ్య పుల్ల వేసి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు ఏంట్రా..

శ్రీకర్ నవ్వుతూ...కాదు నాన్నా, పుల్ల కాదు.. ఫైర్ స్టార్టర్!

ఇక మాట్లాడింది చాలు కానీ వస్తారా అయ్యో డార్లింగ్ నువ్వు పిలిస్తే రాకుండా ఉంటామా అని శ్రీ బుద్ధిగా వచ్చి కూర్చుంటాడు.

సురభి, వాసు, శ్రీకర్ కూడా నవ్వుకుంటూ వస్తారు. డిన్నర్ టేబుల్ వద్ద..  నేహా సర్వ్ చేస్తూ ఉంటే..  శ్రీ  బాగా ఆలోచించి ఎలా కూల్ చేయాలా అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు.

శ్రీకర్ పక్కన కూర్చుని.. మూవీ మధ్యలో పాపకార్న్ -లెవెల్ రియాక్షన్స్ ఇస్తూ ఉంటాడు.

శ్రీ... నేహా చెయ్యి పట్టుకుంటూ.. బంగారం… ఈరోజు కాళ్లు నొప్పిగా ఉన్నాయ్ కదా, ఇక నువ్వు సర్వ్ చేయకు. నేను చేసేస్తా.

నేహా ఊహించని సన్నివేశంలా.. వస్తున్న  నవ్వునీ ఆపుకుంటూ.. నువ్వే సర్వ్ చేస్తావా? అంత మాట అనేసావ్ ఏమిటి బంగారం నీకెప్పుడూ నేను సర్వ్ చేయలేదా..

హ్మ్.. లేచి వెళ్లి ఫ్యాన్ వెయ్యి అంటే..  స్విచ్ కూడా ఎక్కడుందో గుర్తు పెట్టుకోలేవు.

శ్రీ తింగరిగా నవ్వుతూ.. అవును గుర్తుపెట్టుకోలేను … కానీ నీ హృదయ ద్వారం ఎక్కడుందో నాకు బాగా తెలుసు కదా డార్లింగ్..

శ్రీకర్.... ఒక వింత ఎక్స్ప్రెషన్ పెడుతూ..  అబ్బా! ఈ లైన్ కి ఒక “ఐ రోల్ ” అవార్డు ఇవ్వాలి.

నేహా కొడుతూ వైపు చూసి..  వెటకారంగా  బాబు..
మీ నాన్న మీద జాలి వస్తుందా?

శ్రీకర్....లేదు అమ్మ, సింపతీ కాదు… కామెడీ అప్ప్రెసియేషన్!

ఆ మాటకి అందరూ నవ్వుతారు శ్రీ కోపాన్ని చూపిస్తున్నాను అనుకుంటాడు కానీ ఆ ముఖంలో కోపమే రాదు.

శ్రీ.. చాలు నువ్వూ మధ్యలో దూరకూడదు. నీ టీమ్ ఎవరో క్లియర్ చెయ్యి.

శ్రీకర్.. చూస్తున్నావుగా నాన్న..  నేను న్యూట్రల్ … కానీ కరెంట్లీ ఫుడ్ టీమ్ ఉన్నాను — హోవర్ గివ్స్ మీ ఎక్సట్రా పనీర్ కర్రీ, ఐ ’మ్ ఆన్ థెయర్ సైడ్.

ఒరేయ్ తండ్రి ద్రోహి.. ఫుడ్ కోసం ఇన్ డైరెక్టుగా మీ అమ్మ వైపు తిరిగి పోతున్నావా..

అంతేగా... అంతేగా...

నేహా చిరునవ్వుతో.. కొడుకే కర్రీ వడ్డిస్తుంది. మరి మాకు అని శ్రీ అంటే స్నేహ నవ్వుతూ ప్లేటులో పెట్టి.. చపాతీ తో తినిపిస్తుంది.. వావ్ నిజమైన ప్రేమ టెస్ట్.

శ్రీకర్.. గంభీరంగా  తాత్కాలిక సస్పెన్స్ టోన్ లో... బ్రేకింగ్ న్యూస్! మామ్ ఫీడ్స్ డాడ్! పీస్ ట్రీటి సిగ్నెడ్ అట్ డైనింగ్ టేబుల్!

శ్రీ డ్రామా టోన్ లో నోరు తెరిచి... ఆహా! నా కర్మకు పుణ్యం కలిసిందీ! నా బంగారం కోపాన్ని వదిలి ప్రేమగా తినిపిస్తుంది.తండ్రి వైపు చూసి కళ్ళు ఎగరేస్తాడు.

నేహా.. మొత్తం భోజనం తినిపించను ఏదో ఒక చిన్న ముక్క తినిపిస్తాను అంతే..  తర్వాత మీరే తీసుకు తినాలి.  ఎలాగా మొదలు పెట్టావు కదా కంటిన్యూ చేయొచ్చు కదా... హా అంటే....వద్దులే నేనే తింటాను.

శ్రీకర్. గట్టిగా నవ్వుతూ..  థిస్ హౌస్ ఇస్ ఆఫీషియల్లీ టామ్ & జెర్రీ కేఫ్!

ఇద్దరూ ఫైటింగ్ చేసుకుంటూ కూడా క్యూట్ గా ఉంటారు… నేను మాత్రం రెఫెరీ & ఫుడ్ ఫినిషెర్!

డిన్నర్ ఆల్మోస్ట్ పూర్తయింది — శ్రీ ప్లేట్ పక్కన చేతులు ముడుచుకుని, ఫేస్ - డౌన్ డ్రామా మోడ్ లో కూర్చున్నాడు. నేహా సైలెంట్‌గా చూస్తూ ఉంది.

ఇంకా ఏమైనా వడ్డించమంటారా అంటే వద్దు డార్లింగ్.. మరి ఎందుకు అలా కూర్చున్నారు..

శ్రీ చిన్న గొంతుతో, తాత్కాలిక పశ్చాత్తాప లుక్ తో..
ఏదో సారీ బంగారం… ఎవరు తప్పు చేసినా దేవుడు పనిష్మెంట్ చేసేశాడు.
అదే నువ్వు రోజూ నాకు డైట్ ఫుడ్ పెట్టడం!

నేహా మోడీ లోకి వెళ్ళేది వెనక్కి వచ్చి.. అదిరిపోయే సీరియస్ ఎక్స్ప్రెషన్‌తో ఏమిటి? ఇంత ఎమోషనల్ లైన్ పెట్టి డైట్ జోక్?

శ్రీ అలానే విచారంగా పెట్టి అవును రా… నా జీవితం ఒక పనిష్మెంట్ సీరియల్ అయిపోయింది.
బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్ … లంచ్ లో బ్రౌన్ రైస్ … డిన్నర్ లో చపాతి....
చేతులు రెండు పైకెత్తి.. లార్డ్, ఫర్గివ్ మీ ఫర్ మై సిన్స్.. అండ్ ప్లీజ్ … వన్ బిర్యానీ!”

నేహా సీరియస్ గా చూస్తూ ఉంటే... వాసు తల కొట్టుకుంటూ ఇప్పుడే పెళ్ళాన్ని కూల్ చేశాడు అనుకున్నాను. మళ్ళీ మొదటికి వచ్చాడు వీడిని కాపాడడం కష్టం..

శ్రీకర్.. తండ్రి ఎక్స్ప్రెషన్ కి తల్లి కోపాన్ని చూస్తూ వస్తున్న నవ్వుని కష్టంగా ఆపుకుంటూ.. నాన్నా, నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటే కిచెన్ ప్లేట్ నే ట్రోఫీ గా ఇవ్వాలి.

శ్రీ రియాక్షన్ నేహా ఎక్స్ప్రెషన్......
[+] 7 users Like SivaSai's post
Like Reply

Part - 81



శ్రీకర్.. తండ్రి ఎక్స్ప్రెషన్ కి తల్లి కోపాన్ని చూస్తూ వస్తున్న నవ్వుని కష్టంగా ఆపుకుంటూ.. నాన్నా, నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటే కిచెన్ ప్లేట్ నే ట్రోఫీ గా ఇవ్వాలి.
ఆ మాటకి.. నేహా ముసిముసిగా నవ్వుతూ.. ఏం చెయ్యాలి..  నీ హెల్త్ కోసం నేనే స్ట్రిక్ట్ గా ఉండకపోతే ఈపాటికి పొట్ట ముందుకి వచ్చి మావయ్య గారి కన్నా పెద్దవారు లాగా కనిపిస్తారు అందుకే నా జాగ్రత్తలు..

శ్రీ రాని దుఃఖంతో.. అదే నా కర్మ! నేను నిన్ను ప్రేమించాను… నువ్వు నాకు ఫైబర్ ఇచ్చావు!

శ్రీకర్... తల కొట్టుకుంటూ పక్కనే వంగి గుసగుసగా చెబుతూ..  డాడ్ … ప్లీజ్ స్టాప్ బిఫోర్ షీ గివ్స్ యు ఎక్సట్రా ఫైబర్ విత్ రోలింగ్ పిన్!

అంటే అని అడిగితే..  మీరు వేసిన పిచ్చ సెటైర్ కి అమ్మకి కోపం వస్తే రెండు పీకుతుంది లేదు అంటే ఇంకా డైట్ మార్చి ఫుల్ ఫైబర్ పెడుతుంది అవసరమా..

నేహా.. శ్రీ చేసే డ్రామా కి.. ఆపుకోలేక గట్టిగా నవ్వుతుంది. చాలు చాలు… నీ డ్రామా కి ఫుల్ మర్క్స్!
రేపు బిర్యానీ పెట్టిస్తా — బట్ డైట్ వెర్షన్!

శ్రీ వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతూ.. అబ్బా! అది కూడా ఒకే బంగారం — ప్రేమతో పెట్టిన బిర్యానీ కి క్యాలోరిస్ కౌంట్ ఉండదు.

ఎవరు చెప్పారు..  ఈ ప్రేమికుడు చెబుతున్నాడు ఆ మాటకి నేహా నవ్వుతూ టేబుల్ మీద ఉన్నవన్నీ క్లీన్ చేస్తూ ఉంటుంది.
శ్రీకర్ నిట్టూర్చుతూ.. మిషన్ అమ్మా స్మైల్..  సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్!

శ్రీ గర్వంగా కొడుకు, తండ్రి వైపు చూసి.. ఆపరేషన్ డ్రామా … సాధించాను.
తాతా మనవడు ఒకరినొకరు చూసుకొని ఏమిటో అని పెదవి విరుస్తారు.
నేహా నవ్వి తల ఊపుతూ ప్లేట్ తీసుకుని కిచెన్ వైపు నడుస్తుంది.
శ్రీ మాత్రం ఆ స్మూగ్ ఎక్స్ప్రెషన్ తో కుర్చీలో వెనక్కి వాలి, గెలిచిన మోడ్‌లో.
శ్రీకర్ స్లో క్లాప్స్ కొడుతూ చూస్తున్నాడు.

శ్రీ గర్వంగా చూశావా రా… ఫైనల్లీ పీస్ రిస్టోర్డ్!
మహా యుద్ధం తర్వాత స్మైల్ వచ్చింది..  నేను చెప్పానుగా ఎమోషన్ వర్క్స్ బెటర్ థన్ లాజిక్!

శ్రీకర్... హ్మ్… కానీ మీరు ఎమోషన్ వేయలేదు నాన్నా, ఫుల్ ఆన్ సోప్ అనే నాటకం వేసారు!
నెక్స్ట్ టైం బాక్గ్రౌండ్ మ్యూజిక్
కూడా పెట్టేస్తారా?

శ్రీ.. హాస్యంగా.. దానికోసం నీ శాలరీ మనీతో మ్యూజిక్ సిస్టం కొనిపెట్టాలి రా...

నా డార్లింగ్ ఎప్పుడూ నా డైలాగ్స్ కి క్లీన్ బౌల్ అని కాలర్ ఎగరేస్తాడు.

నేహా వెనక్కి తిరిగి డోర్ వద్ద నిలబడి చిరునవ్వుతో..
హే మిస్టర్ డ్రామా కింగ్…
ఈ స్మైల్ నీ డైలాగ్ వల్ల రాలేదు... నన్ను కూల్ చేయాలని ఏవో పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేసావు చూడు.. ఆ ఫన్నీ టాస్క్ కి నవ్వు వచ్చింది.
లేకపోతే వారం రోజులైనా మీరు కూల్ చేయలేరు.

శ్రీ: అబ్బో అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ.
అంటే నా  పిచ్చి ప్రయత్నాలు వల్లనా?

నేహా నవ్వుతూ వెళ్తూ  పిచ్చ ప్రయత్నాలు కాదు… ఇన్నోసెంట్, ఫులిష్నెస్! అదే క్యూట్ గా ఉంది.
అదిక్కడ ఉంచుకో, అది మాత్రమే నీ “డైట్ ప్లాన్ ”కి పెర్మనెంట్ హప్పినెస్!

శ్రీకర్ చప్పట్లు కొడుతూ..  లేడీస్ అండ్ జెంటలెమెన్, ఎపిసోడ్స్ ఎండ్స్ విత్ …
లవ్ సర్వడ్ హాట్, అండ్ డ్రామా వెల్ - కుక్కడ్..

శ్రీ నవ్వుతూ “బంగారం… ఓ బంగారం…” అని పిలుస్తుంటే, నేహా లైట్‌గా చూసి స్మైల్ ఇస్తుంది.

అప్పుడే కర్రీ ఇవ్వడానికి అని వచ్చిన విశి ఈ ఫ్యామిలీ డ్రామా చూసి చిన్న చిరునవ్వుతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. గార్డెన్ లో కూర్చుని తండ్రిని  గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకుంటుంది.

చాలా హ్యాపీ ఫ్యామిలీ నాన్న.. మీరు ఉండి ఉంటే మనం కూడా ఇలాగే ఉండేవాళ్ళము.  మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను.

పక్కనే ఎవరో కూర్చున్నట్టుగా అనిపించి కళ్ళు తెరిచి చూస్తుంది. శ్రీ ఉంటాడు.  అంకుల్ మీరు ఈ టైంలో.. గుమ్మం వరకు వచ్చి లోపలికి రాలేదేంటిరా..

అలా ఏమీ లేదు.. నాన్న గుర్తొచ్చారా...మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. నీకు నేను నాన్నలాగా కనిపించడం లేదా....

మీ నాన్నగారు ఇచ్చే అంత ప్రేమ నేను ఇవ్వలేకపోవచ్చు కానీ నేను నాన్ననే..  ఒక బిడ్డ బాధేమిటో నాకు తెలుసు.

వస్తున్నా ఏడుపుని ఆపుకుంటూ శ్రీని చూస్తుంది. ఇలా రా తల్లి అని భుజం చుట్టూ చెయ్య వేస్తాడు.  శ్రీ గుండెల్లో ఒదిగిపోతుంది.

పిచ్చి తల్లి నాన్న అంటే ఒక నమ్మకం, భరోసా..  అది నేను ఇవ్వగలను. రక్తం పంచి ఇస్తేనే తండ్రి కాదమ్మా..  ప్రేమను పంచి ఇచ్చే నాలాంటి వాడు కూడా తండ్రే అవుతాడు.

భగవంతుడు నాకు ఒక కొడుకుని ఇచ్చాడు. కూతురు ఉంటే బాగుండు అని ఎన్నోసార్లు అనుకున్నాను.  ఎందుకు ఇవ్వలేదా అనుకునేవాడిని.

విశి ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని ఈ బంగారు తల్లిని పంపించాలి అనుకున్నాడు. అందుకే ఇన్ని రోజులు మమ్మల్ని వెయిట్ చేయిపించాడు.

అంకుల్ మీ అబ్బాయి దూరంగా ఉంటున్నందుకు మీకు బాధ లేదా..  ఆ మాటకి చిన్నగా నవ్వుతూ శ్రీకర్ ఫుల్ ఫీల్ చేస్తున్నాడు కదా..

శ్రీ ఏదేదో చెబుతూ ఉంటే విశి నవ్వుతూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత విశి కి తండ్రి తో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది.  హృదయ భారం తగ్గిన ఫీలింగ్ వస్తుంది.

రేపు నీకు ఇంపార్టెంట్ వర్క్ ఉన్నట్టుంది.  అవును అంకుల్.. విక్రమ్ సార్ ని తలుచుకుంటే చాలా భయమేస్తుంది. ఎందుకురా.

సార్ చాలా స్క్రిప్ట్ అంట కదా. కోపం కూడా ఎక్కువ అంట కదా.. ఏదైనా తప్పుగా చెబితే సీరియస్ అవుతారేమో అని భయం వేస్తుంది.

ఆ మాటకి శ్రీ నవ్వుతూ విక్రమ్ బయట ప్రపంచానికే అలా కనిపిస్తాడు కానీ సో స్వీట్.  నువ్వే చూస్తావు కదా రేపు.. ఒకసారి విక్రమ్ కి దగ్గరయ్యావు అంటే అస్సలు విడిచిపెట్టడు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తాడు.

చుట్టూ ఉండే శత్రువుల గురించి  ఆ కోపాన్ని మెయింటైన్ చేయక తప్పదు. లేకపోతే  ఆ ఎంపైర్ ని నిలబెట్టడం అంటే మాటలా..

విక్రమ్ విషయంలో విశికి ఉన్న భయాలు కూడా మెల్లిగా తీసేస్తాడు.  సరే తల్లి వెళ్లి పడుకో.  రేపు ఫ్రెష్ మార్నింగ్ తో బయటకి రా..

ఏదైనా తేడా వస్తే చూసుకోవడానికి మేమందరం ఉన్నాము కదా..  థాంక్యూ గుడ్ నైట్ అంకుల్. మీతో మాట్లాడితే చాలా రిలీఫ్ గా అనిపించింది.

దేవా సార్ తర్వాత మీ దగ్గరే నేను ఇంత కంఫర్ట్ గా ఫీల్ అయ్యాను. స్టెప్స్ ఎక్కుతూ.. భగవంతుడు నా లైఫ్ లోకి అన్ని మంచి రోజులనే తీసుకువచ్చినట్టు ఉన్నాడు.

అది దేవా సార్ తోనే వచ్చింది. థాంక్యూ దేవా సార్ అనుకుంటూ మంచం పైన వాలుతుంది.  నిద్రలో ఉన్న సూర్య కి ఒకటే పులమారుతూ ఉంటుంది.

విశి విక్రమ్ ని కలిసిన వేళ...

కథ కొనసాగుతుంది.....
[+] 7 users Like SivaSai's post
Like Reply

Part - 82




సూర్య నిద్రలో లేచి కూర్చుంటాడు..ఏమిటి ఇంత దారుణంగా పులమారుతుంది అనుకుని వాటర్ తాగి ఫోన్లో ఉన్న విశి ఫోటో చూస్తూ ఏంటి  క్యూటి..

నువ్వు తలుచుకున్నావా ఏమిటి నిద్రలో కూడా లేచి కూర్చున్నాను అని ఫోన్ లో ఉన్న విశి ఫోటో చూస్తూ కబుర్లు చెబుతూ ఉంటాడు.

ఏమిట్రా ఇంత క్యూట్‌గా నవ్వుతూ చూస్తున్నావు ఫోన్‌లో?
నిద్రలో కూడా మనసు నీ దగ్గరికి పరుగెత్తిందేమో చూడు..

ఫోటో చూస్తూ పక్కగా దుప్పటి మీద వాలుతాడు.

నువ్వు ఈ ఫోటోలో ఇలా ముద్దుగా తల వంచి నవ్వడం ఏమైనా బాగుందా? ఆ స్టిల్ నచ్చే ఫోటో తీసుకున్నాను. అది గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనసు వశం తప్పుతున్నది.
అదే స్టిల్ తో ఇప్పుడు నా ఎదురుగా నిలబడితే..  నేనేమైనా తట్టుకోగలనా?

మెల్లగా ఫోటోకి దగ్గరగా వస్తూ..
చూడూ… నీ డింపుల్ చూశాక నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు.
ఇకా ఈ స్మైల్‌కి రెస్ట్ ఇవ్వు… నాకు డాక్టర్ రాసేస్తాడు  స్మైల్ ఓవర్‌డోస్ అని అర్థమవుతుందా..

కొంచెం సైలెంట్‌గా పడుకుని ఫోన్‌ని ఛాతీ మీద పెట్టుకొని..
చాలా జాలిగా ఉన్నావు రా… నా నిద్రకే కాంపిటీషన్ ఇస్తున్నావు.
నీ గురించి ఆలోచిస్తూ లైఫ్ సీరియస్ కాకుండా.. కామెడీగా మారిపోతోంది.

తన ముక్కు మీద ఫోన్ పడుతుంటే..
అయ్యో! క్యూటి... నువ్వు స్క్రీన్‌ మీద నుంచే కొట్టావా ఏమిటి?
అసలు నేను ఈ ప్రేమని ఫన్‌ ప్యాకేజ్‌గా ఉంచుకోకపోతే పిచ్చివాడినైపోతా..

తొందరగా నీ మనసులో ఉన్న మాట చెప్పేయవే బంగారం..

తిరిగి మెల్లగా ఫోన్‌కి కిస్‌ పెట్టి పక్కకు తిరుగుతాడు.
గుడ్ నైట్ క్యూటి … నువ్వు ఫోటోలో అయినా నవ్వుతూనే ఉండు..
లేదంటే నా కలలో వచ్చి రిప్లై ఇవ్వు.

అలా విశి ఫోటో చూస్తూనే నిద్రలోకి జారుకుంటాడు.

సూర్య ఇంకా నిద్రలోనే, ఫోన్‌ ఛాతీ మీద పడి ఉంటుంది. కిటికీ నుంచి సూర్యకిరణాలు ముఖంపై పడుతుంటాయి. ఫోన్‌ ‘పింగ్ ’ అవుతుంది — కొత్త వాయిస్ మెసేజ్.

ఫోన్‌ ఆటో ప్లే అవుతుంది

విశి  వాయిస్‌లో మెల్లగా నవ్వుతూ..
మిస్టర్ హాఫ్-స్లీప్ రొమాంటిక్..
రాత్రి  ఆ టైంలో నా ఫోటోతో మాట్లాడుతున్నావా?

నేను నీ ఫోటో చూసి హాయిగా నిద్రపోతుంటే,
నువ్వు నా ఫోటోతో ప్రేమ కబురులు చెబుతున్నావా.. క్యూట్ కేసు నువ్వు..

సూర్య కళ్ళు తెరిచి చిరునవ్వుతో ఫోన్‌ చెవికి దగ్గర పెట్టుకుంటాడు..

విశి  వాయిస్  మళ్లీ వినపడుతూ ఉంటుంది..
నువ్వు నిద్రలో కూడా నా గురించి ఆలోచిస్తున్నావంటే,
నిజంగా నేను డ్రీమ్ టాక్స్ వేయాలి
మరి ఏంటి రా..  నా డింపుల్ చూసి ‘స్మైల్ ఓవర్‌డోస్’ అంటావా?
నాకైతే నీ రాత్రి టాక్స్ విన్నాక ‘లవ్ ఓవర్‌డోస్’ అయిపోయింది!”

వాయిస్ నడుస్తుండగా సూర్య సిగ్గుతో నవ్వుతాడు

తరువాతసారి నా ఫోటోతో మాట్లాడాలంటే
వీడియో కాల్ పెట్టు రా పిచ్చోడా!
అప్పుడు నేను కూడా ‘లైవ్ రిప్లై’ ఇస్తాను.


సూర్య చిరునవ్వుతో....
ఏం క్యూటి.. , నువ్వు ఇలా ఒక్క మెసేజ్‌లోనే
మొత్తం ఉదయాన్ని సునామీ చేసేసావు.

ఫోన్‌కి మెల్లగా చూస్తూ..

సరే క్యూటి … ఈ రోజు వర్క్ కి కాదు
నీ వాయిస్‌కి లేట్ అవుతా.

ఫోన్లో రింగ్టోన్ గట్టిగా వస్తూ ఉంటే ఉలిక్కిపడి లెగుస్తాడు. ఏమిటి ఇదంతా నాకల..  ఇంకా క్యూటి నే ఫోన్ చేసి మాట్లాడుతుంది అనుకున్నాను అని తల వెనకాల రబ్ చేసుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పరా..

ఏం బాబు ఇంకా తమరు లెగలేదా..  వర్కౌట్స్ కి రాలేదు అని వైభవ్ అడుగుతాడు. నువ్వు అప్పుడే లేచావా.. ఒకసారి టైం చూసుకోండి. ఈరోజు అసలే బాబీకి పెదనాన్నతో మీటింగ్ ఉంది.

టైం చూసి అప్పుడే సెవెన్ అయిపోయిందా అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. గబగబా రెడీ అయ్యి కిందకి వస్తాడు. ఒరేయ్ టిఫిన్ చేయరా అంటే..

ఇప్పటికే లేట్ అయిపోయింది మామ్..  క్యూటి వెయిట్ చేస్తూ ఉంటుంది నేను తర్వాత ఆఫీస్ లో తింటాను అని పరుగు అందుకుంటాడు.

విశి రెడీ అయ్యి దేవా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
సోరి లేట్ అయ్యానా..  లేదు. వెళదామా అంటుంది. టెన్షన్ పడుతున్నావా..

కొంచెం..  సరే బైక్ ఎక్కు అని స్టార్ట్ చేస్తాడు.. బైక్ ఎక్కిన తర్వాత వెళ్లాల్సిన రూట్ లో కాకుండా వేరే రూట్ లోకి తిప్పుతాడు.

ఎక్కడికి.. ఆ రూట్ మొత్తం  ట్రాఫిక్ జామ్ అయ్యింది. కానీ మ్యాప్ లో ఏమీ చూపించడం లేదు కదా... నా మాట నమ్మవా భలేవారే మిమ్మల్ని కాకపోతే ఎవరిని నమ్ముతాను.

వెళుతూ విశి అని పిలిస్తే..  చెప్పండి సార్...బాగా ఆకలేస్తుంది టిఫిన్ చేద్దామా.. మీరు తినలేదా... లేదు బ్యాచులర్స్ కదా..  ఎక్కడ అవుతుంది.  సరే.

ఒక చోట ఆపుతాడు. టిఫిన్ ఆర్డర్ చేసి నువ్వేం తింటావు.. నేను చేసే వచ్చాను సార్. నేను తింటూ ఉంటే అలా చూస్తూ ఉంటావా..

ఒక  కాఫీ నో,  టీ నో,  జ్యూస్ ఏదో ఒకటి తీసుకో అని జ్యూస్ ఆర్డర్ ఇస్తాడు. విశి కి మాట్లాడే అవకాశం ఇవ్వడు. విశి టైం చూసుకుంటూ ఉంటుంది.

బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాదామా.. హా సార్ అంటుంది. మళ్ళీ స్లోగా తీసుకు వెళుతుంటే.. సార్ కొంచెం స్పీడుగా వెళదామా.

ఏమైంది.. లేట్ అవుతుంది ఏమో అని.. కమాన్ విశి నేను ఉండగా నువ్వు అలా ఆలోచించడం ఏమైనా బాగుందా..

మీకున్న ధైర్యం నాకు లేదు లే సార్.. వై..  విక్రమ్ సార్ చాలా స్ట్రిక్ట్ అంట..  టైం మెయింటైన్ చేయకపోతే ఫస్టే బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది కదా..

సో అదొకటి ఉందా.. సరే అయితే గట్టిగా పట్టుకో అని బైక్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తాడు.

ఆ స్పీడ్ కి గట్టిగా కళ్ళు మూసుకుని సూర్యని అతుక్కుపోతుంది. ఆఫీస్ ముందు బైక్ ఆపి హలో విశిష్ట గారు వచ్చేసాము.

కళ్ళు తెరిసి చూస్తుంది. ఏంటి  సార్ ఆ స్పీడ్.. నువ్వే కదా స్పీడ్ గా తీసుకు వెళ్ళమన్నావు. వెళ్లిన, వెళ్ళకపోయినా కోప్పడుతున్నావు.

ఇలాగైతే ఎలా..  సరే ముందు లోపలికి వెళ్ళు. ఆల్ ద బెస్ట్. థాంక్యూ సార్ అని ముందుకు వెళ్ళింది మళ్ళీ వెనక్కు వచ్చి ఇక్కడే ఉంటారు కదా..

నీ హ్యాపీ ఫేస్ చూసేదాకా ఇక్కడే ఉంటాను సరేనా ముందు వెళ్ళు అని  స్మూత్ గా చెబుతాడు.  విశి లోపలికి వెళ్ళేటప్పటికి వైభవ్ అక్కడే ఉంటాడు.

రండి బాబి వెళదాం.. నువ్వు వచ్చి ఎంత సేపు అయింది. ఇప్పుడే వచ్చాను.

విశి, వైభవ్ ఇద్దరు లోపలికి వెళతారు.. మీటింగ్ టైం కి మేనేజర్ వచ్చి తీసుకువెళతాడు.

మీటింగ్ రూమ్ లో విక్రమ్ ని చూడగానే అలాగే నిలబడిపోతుంది.

ఏమైంది బాబీ అని వైభవ్ కదుపుతాడు..

విశి ఏం చెప్పబోతోంది.......
[+] 6 users Like SivaSai's post
Like Reply

Part - 83



ఏంటి బాబి అలా నిలబడిపోయావు. వైభవ్ ఒక్కసారి అటు చూడు.  హ  విక్రమ్ సార్. అచ్చు మన దేవా సార్ లాగా ఉన్నారు కదా..

అబ్బా ఇది మర్చిపోయాము అనుకొని మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు  అంట..అందులో విక్రమ్ సార్ కూడా ఒకరయ్యి అంటారు.

అలా ఎలా జరుగుతుంది.  ఏమో... ఎవరు ఏదో చెప్పారు కదా..మనం ఫాలో అయిపోదాం.  ఇప్పుడు మనకు కావలసింది ప్రాజెక్టు.

ఇక మిగిలిన విషయాలు గురించి మనం మాట్లాడకుండా ఉంటే బెటర్ ఏమో బాబీ...ప్లీజ్. సరే అని వెళ్లి హాయి సార్ గుడ్ మార్నింగ్.

హాయ్ మిస్ విశిష్ట గుడ్ మార్నింగ్..

ఆ వాయిస్లో వచ్చిన గంభీరానికి కొంచెం భయపడి వెనక్కి అడుగువేస్తోంది.. హే కూల్ బేబీ ఎందుకు అలా భయపడుతున్నావు.

ఫస్ట్ కూర్చో.  రిలాక్స్... ప్యూన్ ని  పిలిచి జ్యూస్ తెప్పిస్తాడు.  ఫస్ట్ రిలాక్స్ అవ్వు. కూల్ గా నీ ప్రెజెంటేషన్ వింటాను.

వైభవ్ రిలాక్స్ గా కూర్చుని తాగుతూ ఉంటాడు. విశిష్ట సైలెంట్గా ఏంటి  వైభవ్.. అసలు భయం లేదా.. మన ముందు ఉన్నది ది గ్రేట్ లయన్ విక్రమ్ సార్..

  మనకు ఆఫర్ ఇచ్చినప్పుడు యూస్ చేసుకొవాలి. ఎంత ఇచ్చిన సరే మన లిమిట్స్ లో మనం ఉండడం మర్యాద.
సరిగ్గా కూర్చో.  సరే బాబి అని స్ట్రైట్ గా కూర్చుంటాడు. విక్రమ్ ఇద్దరినీ చూసి ఏమీటి మీ ఇద్దరి డిస్కషన్..

మా బాబి ఎప్పుడు ప్రజెంటేషన్ ఇద్దామా..  మిమ్మల్ని మెప్పించాలి అని వెయిట్ చేస్తుంది.
ఓ.. మీ ప్రజెంటేషన్ మీద మీకు అంత కాన్ఫిడెన్సా.. అవును సార్..మేము మమ్మల్ని నమ్ముకుని ఇక్కడి వరకు వచ్చాము.

అంతా నువ్వే మాట్లాడుతున్నావు కానీ మీ బాబి ఏమీ మాట్లాడడం లేదు.  మా బాబి ఓన్లీ వర్క్ గురించే మాట్లాడుతుంది.

మిగిలిన టైం అంతా ఇలా సైలెంట్ గానే ఉంటుంది. వైభవ్ మాట్లాడేదానికి విశి భయంగా విక్రమ్ వైపు చూస్తుంది. ఎందుకు బేబీ అంత భయపడుతున్నావు.

నేను ఏమన్నా సింహంలాగా కనిపిస్తున్నానా ఏమిటి...  అవును కాదు అన్నట్టుగా తల ఊపుతుంది.  విశి ఎక్స్ప్రెషన్ కి నవ్వుతూ కమాన్ బేబీ..

మేము బయట మాత్రమే సీరియస్ గా ఉంటాము. వర్క్ లేకపోతే జోవియల్ గానే ఉంటాను.  అది కూడా డిపెండ్స్ ఆన్ థట్ పర్సన్.

నిన్ను చూస్తూ ఉంటే నాకు మా ఫ్యామిలీ మెంబర్ లాగానే అనిపిస్తుంది.   సో  ఫ్రీగా ఉండు..  అప్పుడే ఇంకా కాన్ఫిడెంట్గా చెప్పగలవు.

ఓకే సార్.  సరే ఎలా చెప్పినా నీకు ఆ భయం పోదుగానీ ప్రజెంటేషన్ స్టార్ట్ చెయ్..

విశి లాంగ్ బ్రీత్ తీసుకుని..  స్క్రీన్ దగ్గరకి నిలబడి ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తుంది.  భరత్, వినయ్, రాజ్ కూడా వచ్చి కూర్చుంటారు.


విశి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే  డౌట్స్ అడుగుతానే ఉంటారు.  ఒకవైపు నుంచి చెబుతూ ఉంటే మరోవైపు నుంచి అడుగుతూ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు.

కానీ విశి చాలా కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వీళ్ళు అడుగుతున్న చిన్న చిన్న మార్పులకి కూడా ఎలా ఉంటే బాగుంటుందా కూడా క్లియర్ గా చెబుతూ ఉంటుంది.

విశి చెప్పిన దానికి  సాటిస్ఫై అవుతారు. క్లాప్స్ కొడుతూ వెల్డన్ విశి ఇంకా స్టడీస్ కంప్లీట్ అవ్వకుండానే ఇంత మంచి వర్క్ ఇస్తున్నావు.

నీతో ఫ్యూచర్లో కలిసి వర్క్ చేయాలని మాకు గట్టిగా ఉంది. నీ అభిప్రాయం ఏమిటి. విశి సంతోషంగా వైభవ్ వైపు చూస్తే కళ్ళు ఆర్పుతాడు.

నాకు మీతో కొలెబ్రేట్ అవ్వాలని ఉంది సార్.  కానీ నాదొక రిక్వెస్ట్. చెప్పు విశిష్ట..  నేను నా సెల్ఫ్ గా వర్క్ స్టార్ట్ చేస్తున్నాను.  ఐ మీన్ ఇది నా సొంత బిజినెస్ ఏ అనుకోండి.

మీకు కంటిన్యూస్గా నా నుంచి వర్క్ వస్తుంది కానీ మీ ఆఫీసులో ఒక ఎంప్లాయ్ గా మాత్రం నేను వర్క్ చేయలేను. ఇలా చెబుతున్నందుకు తప్పుగా అనుకోవద్దు. సోరి..

ఒకరిని  ఒకరు చూసుకుని.. నవ్వుకుని..  విశిష్ట దగ్గరికి వచ్చి నీ టాలెంట్ నచ్చింది. నీ కాన్ఫిడెంట్ అంతకన్నా బాగా నచ్చింది.

మేము నీతో కొలబ్రేట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము.సో ప్రైస్ కూడా ఫైనలైజ్ చేద్దామా అనగానే... చాలా సంతోషపడుతూ థాంక్యు థాంక్యు సార్ అని విక్రమ్ చేయి పట్టుకుని ఊపేస్తుంది.

వెంటనే తేరుకుని సోరి ఏదో ఎక్సైట్మెంట్లో అంటే..  విశిష్ట చేయి పట్టుకొని ఎప్పుడు ఇదే కాన్ఫిడెంట్ తో ఉండు. నీ టాలెంట్ కి ఎక్కడికో వెళ్ళిపోతావు.

నీ వెనకాల వి. జె.  స్ కంపెనీ మొత్తం ఉంది.  ఎవరడిగినా సరే ఈ విక్రమ్ మనిషి అని చెప్పు చాలు. ఆ మాటకి విశిష్ట పొంగిపోతుంది.

శ్రీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి.  మీరు బయట కనిపించేది ఒకటి.. బాగా  పరిచయం అవుతే మీరేమిటో అన్నది మరొకటి..  థాంక్యూ సార్.

శ్రీ లోపలికి వస్తూ నేను చెప్పాను కదా విశి.. విక్రమ్ ని దగ్గరగా చూస్తే చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అని. అంకుల్.. మీరు ఇక్కడ అని కన్ఫ్యూషన్ గా అడగుతుంది.

విక్రమ్ శ్రీ భుజం మీద చెయ్యి వేసి వీడు నా బెస్ట్ ఫ్రెండ్. ఈ కంపెనీ లో  ఒక పార్ట్నర్. మీరు నేను శ్రీ అంకుల్ కి తెలుసు అన్న సాఫ్ట్ కార్నర్ తో నా ప్రాజెక్ట్ ఓకే చేశారా..

వద్దు సార్ నాకు నా టాలెంట్ మీద వెళ్ళడమే ఇష్టం. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా బాగుంది. తెలిసినవాళ్ళు. జెన్యూన్ అయితే జాబ్ ఇస్తాను.. మనీ ఇస్తాను.  ఏదో రకంగా హెల్ప్ చేస్తాను.

రికమండేషన్ అయితే అసలు ఒప్పుకోను.  టాలెంట్ లేకుండా ఇంక పెద్ద ప్రాజెక్ట్ నీకు ఎలా ఇస్తాను అనుకున్నావు.

నీ డిజైన్ బేస్ చేసుకుని మా ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఎంతో మంది ఎంప్లాయిస్ కి లైఫ్ అది. అలాగే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎంతో మంది అక్కడికి వస్తూ ఉంటారు వెళుతూఉంటారు.

అలాంటి చోట రికమండేషనా..  నో వే..  టాలెంట్ కి రిలేషన్ కి అసలు లింకు పెట్టను. దేని దారి దానిదే. థాంక్యూ సార్..

మీ గురించి తెలిసి కూడా ఏదో మాట్లాడేశాను. సోరి సార్.. నో ప్రాబ్లం... ఒక్కొక్కసారి మన కళ్ళ ముందు ఉన్నదే నిజం అనిపిస్తుంది.

ఆవేశపడతాము కానీ ఆ టైంలో మనం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని ఏమి జరుగుతుంది  అన్నది అబ్జర్వ్ చేస్తే సొల్యూషన్ అక్కడే ఉంటుంది.

ఓకే శ్రీ..  ప్రాసెస్ కంప్లీట్ చేయండి. అని వెళ్ళిపోతాడు. కంగ్రాట్ విశి... ఇప్పటి నుంచి నువ్వు కూడా వి. జె. స్ ఫ్యామిలీలో మెంబర్ అయ్యావు.

ఆనందంతో ముఖం వెలిగిపోతు ఉంటుంది. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి వైభవ్ కి బాయ్ చెప్పి పరిగెత్తుకుంటూ వెళుతుంది.

వినయ్ అది చూసి ఎక్కడికి రా మీ బాబి అలా పరిగెడుతుంది.  ఈ గుడ్ న్యూస్ మరి అన్నయ్యతో షేర్ చేసుకోవాలి కదా...

ఏక్కడ ఉన్నాడు.. ఇప్పటివరకు కేబిన్ లో ఉన్నాడు.  జస్ట్ టెన్ మినిట్స్ బ్యాక్ కి వెళ్ళాడు.

బాబీ వచ్చే వరకు వెయిట్ చేస్తాను అన్నాడు.  సో అని భుజాలు ఎగరేస్తాడు.  మా అన్నయ్య తరువాత వీళ్ళే బెస్ట్ కపుల్ అయ్యేటట్టు ఉన్నారు.

ఈ మాట పూజిత వింటే నీ పని అంతే..

ఇక్కడ లేదు కదా బావ. అందుకే అంత ధైర్యంగా మాట్లాడాను.   పూజిత లేకపోతే ఏమైంది.. తమరి సుపుత్రుడు ఉన్నాడు కదా.. ఏరా అని భరత్ అడిగితే...

అయ్యో మావయ్య మీరు అన్ని అలా అడగకూడదు. నేను చెప్పకూడదు బాయ్ అని వెళ్ళిపోతాడు.

వెళ్లేవాడు మళ్లీ వెనక్కి వచ్చి మావయ్య అని రాజ్ ని పిలుస్తాడు.  ఏంట్రా.  చందు ఎక్కడ ఉంది. ఆ మాటకు అందరూ  చూస్తే...

అదే నాలుగు రోజుల నుంచి కనపడలేదు. ఏమైపోయింది అని అడుగుతున్నాను. దానికి కూడా ఎందుకు అందరూ ఏదో సెక్యూరిటీ ఆఫీసర్ దొంగను చూసినట్టు చూస్తున్నారు.

అలా అని మేము అన్నామా... నీకు నువ్వ అసుకుంటున్నావు. దీన్నే అంటారు..  గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకోవడం అని..

మీ కొటేషన్స్ ఆపి చందు ఎక్కడ ఉందో చెప్పండి. వర్క్ బిజీ లో తిరుగుతుంది రా . అదేం వర్క్ చేస్తుంది.  నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు.

అంత బిజీగా ఏమి చేస్తోంది. వెళ్లి నువ్వే అడుగు. ఈ మధ్య మేడం గారు చాలా బెట్టు చేస్తున్నారు. సైలెంట్ అయిపోయి ఏం మాట్లాడిన ఒక స్మైల్ ఇచ్చి ఊరుకుంటుంది.

చూస్తాను. నాకు చెప్పకుండా అంత బిజీగా ఏం చేస్తుందో అని కోపంగా వెళ్ళిపోతాడు.

వెళుతున్న వైభవ్ ని చూసి నవ్వుకుంటూ మనకి ఫ్యూచర్లో మరో రాజ్,  నివి కపుల్ వస్తుందన్నమాట...

కాకపోతే చిన్న కరెక్షన్..  వీళ్ళ జంటలో నివినీ చూసి అమాయకురాలు అనుకుని బుట్టలో పడ్డాడు. ఇక్కడేమో ఫస్ట్ నుంచి చందు గడుసుగా ఉండి ఇప్పుడు సైలెంట్ అయిపోయింది అంతే తేడా..

హ్మ్... ఎలాగైనా మీ సింహ ఫ్యామిలీదే కదా డామినేషన్... పోనేలే బావ అది అర్థం చేసుకుని కాంప్రమైజ్ అయిపోతే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి.

ఎప్పుడు మేమే అర్థం చేసుకోవాలి గాని మీరు ఎవరు అర్థం చేసుకోరా ఏంట్రా..  నీకు ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటి బావ.

మా నివి నిన్న ఎంత బాగా చూసుకుంటుంది. ఒక్క రోజైనా నిన్ను వదిలి వస్తుందా..

వినయ్ చెప్పిన దానికి పైనుంచి కిందకి చూస్తూ.. అవును.. అది ఏమో భారతదేశం మొదలు ఉంటే మీరేమో ఈ చివరన ఉన్నారు.

చెప్పడానికైనా మీనింగ్ ఉండాలి. ఫోన్ చేసి పెట్టే లోపు ఏ ఇంట్లో కావలిస్తే ఆ ఇంట్లో వాలతారు. అలాంటిది  ఒక్క రోజు అయినా వదిలి ఉంటుందా అని భారీ డైలాగ్ లు..

ఒక్కొక్కసారి అనిపిస్తుందిరా..పెళ్ళాం ఊరెళితే ఎలా ఉంటుందా అని.  అందుకే వేరే ఊరు అమ్మాయిని చేసుకొని ఉంటే ఏదో వంకన వెళుతూ ఉండేది కదా... అప్పుడు లైఫ్ ఎలా ఉంటుందో అనేది చూసే వాళ్ళము.

బట్ మనలో ఎవరికీ ఆ ఛాన్స్ లేదు.  ఒక శ్రీ కి తప్ప..

శ్రీ రియాక్షన్......
[+] 6 users Like SivaSai's post
Like Reply

Part - 84



ఒక్కొక్కసారి అనిపిస్తుందిరా..పెళ్ళాం ఊరెళితే ఎలా ఉంటుందా అని.  అందుకే వేరే ఊరు అమ్మాయిని చేసుకొని ఉంటే ఏదో వంకన వెళుతూ ఉండేది కదా... అప్పుడు లైఫ్ ఎలా ఉంటుందో అనేది చూసే వాళ్ళము.

బట్ మనలో ఎవరికీ ఆ ఛాన్స్ లేదు.  ఒక శ్రీ కి తప్ప..
ఏమంటావు శ్రీ. ఒక సామేత ఉందిరా..  పీత కష్టాలు పీతవి అయితే..  చేప కష్టాలు చేపవి అని. అలా ఉంది మీరు చెప్పేవి.

నేహాతో నీకేంటి రా ఇబ్బంది. నువ్వెలాగా నివి అమాయకురాలు అని బుట్టలో పడ్డావో మేము అంతే.. అవని నీ చూసి నేహా కూడా అంతే సాఫ్ట్... ఇన్నోసేంట్ అనుకున్నాను.

తర్వాత తర్వాతే తెలిసింది ఇంక ఏం చేస్తాం ఈ బండిని ఇలా నడపాలిసిందే...
భరత్ వైఫ్ విద్య కూడా అంతే కదా... వీడి కంటిచూపుకే పాపం ఆ అమాయకరాలు ఆగిపోతుంది. ఒక మాట కూడా మాట్లాడదు అంతేనా భరత్...

నాకేమో స్ట్రాంగ్ గా నిలబడి రఫాడిస్తే చూడాలని ఉంటుంది..ఎన్ని సంవత్సరాలైనా విద్య గట్టిగా మాట్లాడదు. అవునంటే అవును..  కాదంటే కాదు. నేనెవరికీ చెప్పుకోవాలి..

సో మనందరిలో లక్కీ ఫెలో ఒక విక్రమ్ అన్నమాట... అన్న మాట ఏంటి ఉన్నమాట కూడా అదే..

విక్రమ్ కూడా జాయిన్ అయ్యి మూస్తారా.. అందరూ లక్కీ ఫెలోసే..  కాబట్టే మనం ఇప్పటికీ ఇలాగే కలిసి ఉన్నాము. అది అర్థం కావడం లేదా..

నువ్వు చాలురా కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అనిపించడానికి. ఈ లోపు వైభవ్ వెనక్కి వస్తాడు.  ఏమైందిరా. నా ఫోన్ ఇక్కడే మర్చిపోయాను అని ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు.

వీడు ఫోన్ మర్చిపోవడమేంటి అని డౌట్ గా రాజ్ చూస్తూ ఉంటే ఏమైంది బావ.. నీ కొడుకు ఏదో చేశాడు రా..  మనకేదో బ్యాండ్ భాజ మూవీ ప్రోగ్రాం ఉందేమో అని అనుమానంగా ఉంది.

ఊరుకో బావ.  వాడు అల్లరి చేస్తాడేమో కానీ ఇలా అందరినీ ఇరికించడు. నువ్వు తండ్రి ప్రేమంటే ఏమిటో ఒక ముక్కలో చెప్పావు రా..

విశి పరిగెత్తుకుంటూ సూర్య దగ్గరికి వెళుతుంది.  సార్ అంటే... ఇక్కడే ఉన్నా అని టీ కప్ తో నిలబడతాడు.  సార్ మనం విన్ అయ్యాము.

నాతో ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు.. నేను చెప్పిన కండిషన్ కూడా యాక్సెప్ట్ చేశారు. అసలు విక్రమ్ సార్ ఎంత బాగా మాట్లాడారో తెలుసా అని ఎక్సైట్ అవుతూ ఉంటే...

కూల్ కూల్ అని అక్కడ బెంచ్ పైన కూర్చోబెట్టి టీ కప్ చేతికి ఇస్తాడు.  మీరు చూడలేదు కానీ విక్రమ్ సార్ అని...  సార్ అని మళ్ళీ అరుస్తుంది.

ఏమయింది మీకు ఒక విషయం తెలుసా...విక్రమ్ సార్ అచ్చు మీలాగానే ఉన్నారు.  నేను షాక్.  వైభవ్ కన్ఫ్యూజ్ చేశాడు.

ఏం చెప్పాడు... మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు.  అందులో ఒకళ్ళు అనుకో బాబి అంటున్నాడు.  ఎంత ఒకేలా  ఉన్న ఇలా దగ్గరలో ఉంటారా మీరే చెప్పండి.

హ్మ్.. అసలు విషయం వదిలేసి కొసరి విషయం చెబుతున్నావు.  ప్రాజెక్ట్ గురించి మాట్లాడకుండా... నాలాగా ఉన్నారు. ఏడుగురు అని ఏదో చెబుతావు ఎందుకు క్యూటి..

హ అంటే.. అదే విశి..

సార్ మళ్లీ అరుస్తుంది ఏమయింది ఇక్కడ శ్రీ  అంకుల్ కూడా ఉన్నారు. విక్రమ్ సార్ కి బెస్ట్ ఫ్రెండ్ అంట.. ఓ.. అవునా..

అంత సింపుల్ గా అవునా అంటారేమిటి.. నాకంటే తెలియకపోవచ్చు.  మీకు తెలియాలి కదా. నాకెలా తెలుస్తుంది.

భలేవారే శ్రీకర్ సార్ మీకు ఫ్రెండ్ కదా...మరి శ్రీకర్ గారు ఆ శ్రీ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మీకెందుకు తెలియలేదు.

అబ్బా ఏం లాజిక్ అడిగావు..ఇప్పుడు నువ్వు నాకు బాగా తెలుసు.  అలాగని మీ చుట్టాలు అందరూ నాకు తెలుస్తారా చెప్పు. లేకపోతే ఆంటీ ఫ్రెండ్స్ నాకు తెలుస్తారా... తెలియదు కదా..  అలాగే ఇది అంతే.

కానీ అంటే.. చూడు నీకు ఇచ్చిన టీ కూడా చల్లారిపోయింది..ఈ ఆనందంలో అసలు ఆకలి కూడా వేయడం లేదు సార్.

అయితే ఒక ప్లాన్ చేద్దామా ఏమిటి సార్..  ఈ వీకెండ్ మనిద్దరం లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం. లాంగ్ డ్రైవ్ అని స్లో అవుతుంది.

హైదరాబాద్ టు వైజాగ్ బైక్ మీద వెళ్దాం. సరదాగా ఎంజాయ్ చేసి వద్దాం.  కానీ అంత దూరం అంటే.. నా మీద నమ్మకం లేదా..

మిమ్మల్ని నమ్మకపోతే నేను లేను సార్. అమ్మకి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇలా దేవా సార్ తో కలిసి వెళుతున్నాను అని చెప్పు.

అలా చెబితే ఊరుకుంటుందా.. ఎవరైనా  పెళ్లి కాని అమ్మాయి అబ్బాయి బైక్ మీద వెళ్తాము అంటే  రెండు పీకుతారు.  ఆ మాటకి నవ్వుతూ నువ్వు చెప్పి చూడు.. పీకుతారో లేదో తెలుస్తుంది కదా..

వీళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటుంది దూరం నుంచి గౌతమ్ చూస్తాడు. ఏమిటి ఎప్పుడు చూసిన ఈ దేవతో తిరుగుతుంది. పళ్ళు ఇకలిస్తూ ఉంటుంది.

అందులో వి. జె. స్. కంపెనీ దగ్గరలో ఉన్నారు.  ఇక్కడ ఏమైనా జాబ్ కి ట్రై చేస్తుందా. విశిష్ట టాలెంట్ కి ఎవరైనా కళ్ళకు అద్దుకుని జాబ్ ఇస్తారు.

కానీ అలా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటి? వెళ్ళనివ్వకూడదు.  ఎలాగైనా నా దగ్గరికి తెచ్చేసుకోవాలి.  ఆ అందాన్ని వదులుకోలేను.  తన టాలెంట్ ని వదులుకోలేను.

అనవసరంగా హిమ వెనకాల తిరుగుతున్నాను కానీ విశి ని లైన్ లో పెట్టుకుని ప్రాజెక్ట్స్ చేయిపిస్తే అంతకంత మనీ వచ్చేవి.

మెల్లిగా విశి తో ప్రేమ కబుర్లు చెబుతాను. పెళ్లి చేసుకుందామని చెబుతాను.. అప్పుడు తనే లైన్లోకి వస్తుంది అనుకుంటూ కార్ ఒక పక్కకి పార్క్ చేసి వీళ్ల దగ్గరకి వస్తాడు.

వాళ్ళ ముందు ఏదో నీడ ఉన్నట్టు అనిపించి పక్కకి చూస్తే గౌతమ్ నిలబడి ఉంటాడు..హాయ్ దేవా... హౌ ఆర్ యు అంటే... గుడ్.  హౌ ఆర్ యు అని డౌట్ గా అడుగుతాడు.

బాగున్నాను. ఏం విశి ఎలా ఉన్నావు.. ఆంటీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు.  వీడేంటి కొత్తగా అడుగుతున్నాడు అని సూర్య చూస్తూ ఉంటే...

బాగున్నాను మిస్టర్ గౌతమ్.  మా మదర్ కూడా చాలా బాగున్నారు. మీరేమిటిక్కడ..

నిన్ను చూసే ఆగాను.  నీతో మాట్లాడాలి అని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తాను. బట్ కుదరడం లేదు.  అవునా ప్రాజెక్ట్ గురించి అయితే మీరు వైభవ్ ని కాంటాక్ట్ చేయండి.

నో విశి పర్సనల్..  నీతో సపరేట్గా మాట్లాడాలి.. చెప్పండి. మనిద్దరమే అంటే.. దేవా సార్ నేను వేర్వేరు కాదు..ఏది చెప్పిన దేవా సార్ ముందే చెప్పండి..

ఆ మాటకి సూర్య హ్యాపీగా ఫీల్ అవుతూ..  గౌతమ్ వైపు చూసి కళ్ళు ఎగరేస్తాడు. గౌతమ్ కుతకుతా ఉడికిపోతూ ఉంటాడు.

అది పైకి కనపడనివ్వకుండా మనిద్దరం ఒకప్పటి ప్రేమికులము విశి...  చేయి అడ్డుపెట్టి ఇంకొకసారి ఆ మాట అన్నారు అంటే మీరు ఎక్కడ ఉన్నారు అని కూడా చూడకుండా వేరేలాగా ట్రీట్ చేయాల్సి వస్తుంది.

మీకు చాలాసార్లు చెప్పాను.  మన మధ్యన ఉన్నది ఓన్లీ బిజినెస్ డీల్ మాత్రమే.  అది మాట్లాడాలి అనుకుంటేనే కలవండి.  లేకపోతే లేదు.

నాకు తెలుసు నువ్వు నా మీద కోపంగా ఉంటావు అని.. హిమ ఫాదర్ మాకు చాలా దగ్గర రెలేటివ్స్. అప్పుడు హిమ హెల్త్ అసలు బాగోలేదు.

తనకి ఒక డ్రీమ్ ఉంది ఫుల్ ఫిల్ చేయమంటే కాదనలేకపోయాను. అంతేగాని నీ వర్క్ ఎవరికో ఇవ్వాలని కాదు.  స్టిల్ ఐ లవ్ యు. మనం పెళ్లి చేసుకుందాం అని చెయ్యి పట్టుకుంటాడు.

విశి చెయ్యి విదిల్చుకుంటూ..  మీ మధ్యన ఎటువంటి రిలేషన్ ఉంటే నాకెందుకు మిస్టర్.. ప్లీజ్ వదలండి. వదలను విశి..

ఇప్పటికే అనవసరమైన విషయాలతో మనిద్దరి మధ్యన దూరం వచ్చింది. ఎవరెవరో మన మధ్యన వచ్చి లేనిపోని అపార్ధాలు సృష్టిస్తున్నారు.

విశి ఎంత ట్రై చేస్తున్న గౌతమ్ వదలడు. సూర్యకి చిరాకు వచ్చి ఆ చేతిని గట్టిగా పట్టుకొని విడిపిస్తూ చూడండి మిస్టర్..

విశిష్ట కి ఇష్టం లేదు అన్నప్పుడు మీరు దూరంగా ఉండడం బెటర్..మధ్యలో నీ పెత్తనం ఏమిటి దేవా. ఇది మేమిద్దరం డిసైడ్ చేసుకునేది.

నిజమే అది ఇద్దరికీ ఇష్టమై ఉన్నప్పుడు... కానీ రోడ్డు మీద మీరు ఇలా బిహేవ్ చేస్తే రెస్పాన్సిబిలిటీ ఉన్న ఏ పర్సన్ అయినా సరే ఇలాగే బిహేవ్ చేస్తాడు.

రెస్పాన్సిబిలిటీ పర్సనా లేక విశిష్ట టాలెంట్ మీద ఉన్న ఇంట్రెస్టా.. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ కి వచ్చావు.

విశిష్ట తో వర్క్ ఆగిపోయినప్పటి నుంచి నీ ప్రాజెక్ట్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి.. సో ఎంత లాస్ అవుతుందో ఏమిటో అన్నది తెలుస్తుంది.

అందుకే కదా మళ్ళీ దొంగ ప్రేమ నాటకాలు ఆడుతున్నావు. నో నో దానికి దీనికి సంబంధం లేదు. నిజంగానే నాకు విశిష్ట అంటే చాలా ఇష్టం అని కంగారుగా చెబుతాడు.

నీ కంగారులోనే తెలుస్తుంది నువ్వు చెప్పేది ఎంతవరకు నిజమో అన్నది. ఇంకొకసారి విశిష్ట ని ఇబ్బంది పెట్టినట్టుగా నాకు తెలిస్తే మాత్రం ఇలా కూడా నిలబడవు అర్థమవుతుందా అని స్మూత్ గా చెబుతూనే వార్నింగ్ ఇస్తాడు.

ఓకే విశి నీ మూడేం బాగున్నట్టు లేదు. మళ్ళీ కలుస్తాను అని వెళ్ళిపోతాడు. ఇడియట్ ఎన్నిసార్లు చెబుతున్నా అర్థం కావడం లేదు.

దీనికి సొల్యూషన్ ఒకటే..  నువ్వు తొందరగా స్టార్ట్ అప్ స్టార్ట్ చేసేయడమే..

దాని గురించే ఆలోచిస్తున్నాను..ఈ కంపెనీతో కొలబరేట్ అవుతున్నాము కదా... సో వచ్చే మనీతో మెల్లిగా పెట్టేద్దాము. అప్పుడు మీరు నాతో జాయిన్ అవ్వండి.

నేనెందుకు నీతో... వైభవ్ ఉన్నాడు కదా. మీరు ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. నీకు అదే చెబుతున్నాను.

ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. నా మీద నమ్మకం ఉంది కదా చాలు. నేనే పక్కనే ఉండాలి అంటే ప్రతిసారి కుదరదు.

విశి సమాధానం....
[+] 6 users Like SivaSai's post
Like Reply

Part - 85



ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. నా మీద నమ్మకం ఉంది కదా చాలు. నేనే పక్కనే ఉండాలి అంటే ప్రతిసారి కుదరదు.

మీరు చెప్పేటప్పుడు నాకు బాగానే ఉంటుంది కానీ ఎందుకో  మీరు నా కళ్ళ ముందు ఉంటే ఒక ధైర్యం వస్తుంది. మాట్లాడకపోయినా పర్వాలేదు అలా ఉంటే చాలు.. అయితే ఒక పని చెయ్యి. నా ఫోటో ఒకటి పెట్టుకో..

వెటకారమా సార్..  అయ్యో సజెషన్ ఇస్తే.. వెటకారం అంటావేమిటి..  ఇప్పటికే లేట్ అయింది పదా అని నవ్వుతాడు.

మీ నవ్వే చెబుతుంది ఎంత వెటకారం ఆడుతున్నారో  అని మూతి తిప్పుకుంటూ బైక్ ఎక్కుతుంది.

రాజ్ ఇంటికి వెళ్ళేటప్పటికీ నివి గుమ్మం దగ్గరే ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమిటి శ్రీమతి ఎవరికోసం చూస్తున్నావు.

ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ పెట్టావా..  అయ్యో అలా అంటారేమిటండి.. మీ కోసమే ఎదురు చూస్తున్నాను అని చేతుల్లో బ్యాగ్ తీసుకుంటుంది.

బ్యాగ్ వైపు.. నివి వైపు చూస్తూ ఉంటే... ఏమిటండీ అలా చూస్తున్నారు రండి అని సోఫాలో కూర్చోబెడుతుంది ఎందుకు ఈరోజు ఇలా కొత్తగా మర్యాదలు చేస్తున్నావు. నాకు భయం వేస్తుంది.

భలేవారే మర్యాదలు చేస్తే భయపడతారు ఏమిటి అని మళ్లీ గుమ్మం వైపు చూస్తుంది.. ఎవరికోసం చూస్తున్నావు. పెళ్లిళ్లు బ్రోకర్ వస్తానన్నాడు.

అతని కోసమే...  ఎందుకు మన చందు కి వైభవ్ ఉన్నాడు కదా.. ఉండండి స్నాక్స్ తీసుకొస్తాను అని వేడివేడిగా ఆనియన్ పకోడీ తీసుకొచ్చి చేతికి ఇస్తుంది.

తింటూ ఉండండి అనగానే ఏం జరుగుతుందో అర్థం కాక మెల్లిగా తింటూ ఉంటాడు.. ఈలోపు పెళ్లిళ్లు బ్రోకర్ వస్తే.. అమ్మ ఎందుకు హడావుడిగా రమ్మన్నారు.

మీరు రమ్మన్నారని ఉన్న పళంగా వచ్చేసాను.  ఎవరికి సంబంధం చూడాలి.  ఎవరికో ఐతే మిమ్మల్ని ఎందుకు రమ్మంటాను.

మా వారికే... అంతే..  ఆ మాటకి పకోడీ అడ్డుపడి పులమారుతుంది..అయ్యో మెల్లిగా తినండి అని వాటర్ పట్టిస్తుంది.

నాకు పెళ్లి ఏంటి అని రాజ్ కంగారుగా అడిగితే.. బ్రోకర్ అయోమయంగా చూస్తాడు.  ఇదిగోండి మా వారి పెళ్లి చాలా దూరం నుంచి రావాలి.

ఏడు గోదావరి అవతల అంటారే అలా రావాలి. పెళ్లయిన తర్వాత కూడా అమ్మాయి నెలకి ఒకసారి పుట్టింటికి వెళ్లి  వెళ్లి రావాలి.

మా వారు పెళ్ళాం ఊరెళితే ఎలా ఉంటుందా అన్నది ఎంజాయ్ చేయాలి.  అంతేనా అండి అంటుంది.

రాజ్ కి మేటర్ అర్థమయ్యి తినే ప్లేట్ పక్కన పెట్టి బ్రోకర్ వైపు చూసి మీరు వెళ్ళండి..మళ్ళీ కబురు పంపుతామని పంపించి వచ్చి నిలబడతాడు.

ఏమైందండీ.. ఇంకొక బ్రోకర్ని పిలిపించానా.. గదిలోకి తీసుకువెళ్లి తలుపులు వేసి మోకాళ్ళ మీద కూర్చుని నడుం చుట్టూ చేతులు వేసి..

నీకు అంతా తెలిసిందని నాకు అర్థమైంది. ఏదో సరదాగా పిచ్చపాటి మాట్లాడుకున్నాం.  మగవాళ్ళు అన్నాక  ఆ స్వేచ్ఛ ఉండదా. దానిని నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటే ఎలాగా..

మన పెళ్లయినప్పటి నుంచి మీ కోరిక ఏదైనా తీరుస్తున్నాను కదా. అలాగే ఇది కూడా తీరుస్తాను.  మీకు వేరే ఊరు అమ్మాయి కావాలి అనుకున్నప్పుడు అలాగే చేస్తాను  రాజ్.

ఇదిగో నువ్వు ఇలా అంటే నేను అలుగుతాను. హ  ఏమిటి... అలా ఉంటే ఎలా ఉంటుందా అన్నాను కానీ నీ స్థానంలో ఇంకొకళ్ళు అనలేదు కదా బంగారం.

మా బుజ్జి కదా ఈ అలక పాన్పు కొద్దిగా దిగు.  లేదు మీకు పెళ్ళాం ఊరెళితే అన్న సినిమా కావాలి అన్నారు కదా... సో నేను పుట్టింటికి వెళుతున్నాను.

ఎప్పుడు వస్తానో నాకే తెలియదు అని సర్ది ఉన్న బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుంది. ఆల్రెడీ సర్దుకునే ఉన్నావా.
నా మేనల్లుడు కూడా రెడీగా ఉన్నాడు.

ఇదంతా వైభవ్ గాడి పనే కదా అని పళ్ళు నూరితే... వాడి చిన్న పిల్లోడు. వాడు ఏం చేసాడు అని బ్యాగ్ తీసుకుని బయటకి వస్తుంది.

చూడు నివి నా మీద అలిగి వెళితే బాగోదు. అయ్యో నాలాంటి గడుసువాళ్లతో మీరు ఎలా పడగలరండి..  ఒక అమాయకురాలుని తెచ్చి పెళ్లి చేస్తాను.

సరేనా నువ్వు పదరా అని వైభవ్ భుజం మీద కొడుతుంది. అలాగే అత్తయ్య అని బ్యాగు కార్ డిక్కీ లో పెట్టి రాజ్ దగ్గరికి వచ్చి..

ఏమన్నావు మామ.. నీ కూతురు ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అంటే నువ్వే అడుగు అని ఫోజ్ కొట్టావు కదా.. ఇప్పుడు మా అత్తని తీసుకురావడానికి నీకు చుక్కలు కనపడతాయి.

హమ్మయ్య పుట్టింటికి వెళ్ళింది అని నువ్వు రిలాక్స్ గా ఉన్నా తలపోటే... వచ్చి బ్రతిమాలి తీసుకురావడం ఇంకా పెద్ద తలపోటు.

ఒరేయ్ అని ఏడుపు గొంతుతో పిలిస్తే..  అబ్బా ఎంత హాయినిస్తుంది మామ.. ఈసారి నుంచి నేను ఎప్పుడైనా అడిగినప్పుడు తిన్నగా సమాధానం చెప్పకపోతే మీకు ఇంతకన్నా బాగా జింకుచక అనుకుంటూ వెళ్ళిపోతాడు.

రాజ్ కోపంగా వినయ్ కి ఫోన్ చేస్తాడు. నీరసంగా చెప్పు బావ. నీ కొడుకు ఏదో ఉత్తముడని చెప్పావు.  వాడు ఏం చేసాడో తెలుసా..

నా కింద ఆల్రెడీ పేలిపోయింది. నీకేం పేలిందిరా. అయితే విను అని వేలుతో తిప్పుతూ ఉంటాడు.  ఫోన్లో కూడా ఎదవ సిగ్నల్స్ ఏంటి సరిగ్గా చెప్పు..

వినయ్ ఇంటికి రాగానే పూజిత ఎక్కడా కనిపించదు.  గదిలోకి వెళ్లి టై  లూస్ చేస్తూ ఉండేటప్పటికీ వెనక నుండి వచ్చి హత్తుకుంటుంది.

అమ్మో దయ్యం దయ్యం అని అరుస్తాడు. అదేమిటండి నేను ఎంత ముద్దుగా హత్తుకుంటే.. అలా అరుస్తున్నారు  నువ్వా అని గుండెల మీద మెల్లిగా కొట్టుకుంటాడు.

ఇదిగో మీకోసం కాఫీ, టీ, జ్యూస్, స్నాక్స్ ఇంకా అంటే ఆగు..  ఎందుకు ఇన్ని రకాలు..ఎవరైనా ఏదో ఒకటే కదా తాగుతారు.

మీతో నేను ఉత్తమమైన ఇల్లాలు అనిపించుకుని..  మనం బెస్ట్ కపుల్ లాగా ఉండాలి కదా...ఆ డైలాగ్ కి ఒకసారి గా తలపైన వెంట్రుకలు అన్ని నిక్కబోడుచుకుంటే.. స్టార్స్ అన్ని పైన తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది.

వెంటనే పూజితని అక్కడ సోఫాలో కూర్చోపెట్టి... వేళ్ళు లాగుతూ ఎందుకు బంగారం నువ్వు ఇలాంటి కష్టమైన పనులన్నీ మీద వేసుకుంటావు.

నువ్వు ఎప్పటికీ నా దృష్టిలో ఉత్తమమైన ఇల్లాలివే.. మనం బెస్ట్ కప్పుల్స్ మే.. అలా కుదరదండి నా సేవతో మిమ్మల్ని మెప్పించాలి.

వద్దు అని చెబుతున్నాను కదా.. నువ్వు అంత పెద్ద పెద్ద టాస్కులు నెత్తి మీద వేసుకుంటే నేనేం అయిపోవాలి. భలేవారే మీకోసమే కదా..

ఏది తాగుతారు. నువ్వు ఏది ఇచ్చినా నాకు పరవాలేదు అని భయంగా చేతులు రెండు దగ్గరకి పెట్టుకుంటాడు. అయ్యో మీరు ఎలా అంటే ఎలాగండి....మీకు నచ్చింది తీసుకోండి అని ట్రే ని ముందుకి జరుపుతుంది.

ఏం చేయాలో అర్థం కాక కాఫీ, టీ, జ్యూస్ అన్నీ ఒక దాంట్లో పోసుకొని గటకట తాగేసి సంతోషమా అంటాడు. మీ కాళ్లు ఇలా పెట్టండి నొక్కుతాను.

నా కాళ్ళ మీద నాకు కొన్ని రోజుల ఆశ ఉంది. ఆశ తీరిన వెంటనే నీకు అప్ప చెబుతాను..ఈరోజుకి వదిలేయవా ప్లీజ్ అని బ్రతిమాలితాడు.

అలాగంటారా సరే అయితే.. మీకోసం మీకు ఇష్టమైనవన్నీ ప్రిపేర్ చేస్తాను సరేనా అని చెంప మీద తట్టి వెళ్ళిపోతుంది. ఇది బావ జరిగింది.

ఏ నిమిషం ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్తో సచ్చిపోతున్నాను.  అందుకే నేను ఆఫీసు రూమ్ లోకి వెళ్లి దాక్కుంటున్నాను.

అక్కడికైతే ఈ లేడీస్ రారు కదా...అన్నయ్యతో వర్క్ బిజీ అని  అక్కడే ఉంచేస్తాను..మీ పనే బాగుందిరా..అందరూ ఒక చోట ఉండేటప్పటికీ ఎస్కేప్ అయిపోతున్నారు. నేను శ్రీ అనుకుని..

ఇంతకి శ్రీ,  భరత్ పరిస్థితి ఏమిటి..  నాకు తెలియదు. భరత్  బావది ఏముంది.. విద్య కూర్చోమంటే కూర్చుంటుంది. నుంచో అంటే నుంచుంటుంది.

ఒక శ్రీ దే ఆలోచించాలి. ఫోన్ చేద్దామా..  ఎందుకులే.. అంతా అయ్యిన తర్వాత వాడే ఫోన్ చేస్తాడు అని ఫోన్ పెట్టేసి ఆఫీస్ రూమ్ లోకి పరుగు పెడతాడు.


కథ కొనసాగుతుంది.......
[+] 8 users Like SivaSai's post
Like Reply

Part - 86



శ్రీ ఇంటికి విజిల్ వేసుకుంటూ వెళతాడు.  నేహా ఎదురు వచ్చి రండి రండి అని కూర్చోబెడుతుంది..వాట్ డార్లింగ్ ఏం చేశారు ఈరోజు.

బాగా ఎంజాయ్ చేశారా.. ఏదో మీ దయ.. కాఫీ తెమ్మంటారా టీ తెమ్మంటారా. కాఫీ తీసుకురా.. సరేనండీ. కాఫీలో పాలు పోయమంటారా నీళ్లు పోయమంటారా.

నో బ్లాక్ కాఫీ ఓన్లీ వైట్ కాఫీ. కాఫీ పొడి  ఎంత వేయమంటారు... షుగర్ వెయ్యనా వద్దా..  ఆ మాటలకి పిచ్చి చూపులు చూస్తూ..

నేహా నుదిరిపైన చెయ్యి పెట్టి..  చెక్ చేస్తూ బాగానే ఉన్నావా.. అయ్యో నేను బాగానే ఉన్నాను అండి. అమాయకులు అంటే ఇలాగే ఉండాలి కదా అందుకనే అడుగుతున్నాను.

అప్పటివరకు కాలి మీద కాలు వేసుకుని విజిల్ వేస్తున్న శ్రీ కాలికి పక్కకు పెట్టి.. అమాయకులు ఏమిటి ఏం మాట్లాడుతున్నావు.

అదేమిటండి మీ భార్య అమాయకురాలుగా ఉండాలని మీరే కోరుకున్నారు కదా.. ఇప్పుడు అన్ని అడిగి చేస్తుంటే అలా చూస్తారు ఏమిటి.

కాఫీ తీసుకొస్తాను అని కిచెన్లోనికి వెళుతుంది.. ఒరేయ్ వైభవ్ గా ఎంత పని చేసావురా అని తల పట్టుకుంటాడు.

కాఫీ తెచ్చి చేతికిస్తుంది. భయంగా కప్పు పుచ్చుకుంటే ఏమండీ వేడి నీళ్లు పెట్టమంటారా..    సరే అని తల ఊపుతాడు.

ఎంత వేడిలో కావాలి...  వేలు  ఊడి వచ్చే రేంజ్ లో కావాలా లేక గోరువెచ్చగా కావాలా...లేకపోతే మధ్యలోకి కావాలా..

కప్పు పక్కనపెట్టి నేహాని గదిలోకి తీసుకు వెళ్లి మంచం మీద కూర్చోబెట్టి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని గట్టిగా మాట్లాడతాడు.

చేతులు కట్టుకుని చూస్తూ ఉంటే...ఇక లాభం లేదని కింద బోర్లా పడుకొని కాళ్లు పట్టుకుని... ఏదో పిచ్చపాటి మాట్లాడుకున్నాం కానీ నా పెళ్ళాం తెలివిగా అన్ని చక్కపెట్టుకునేటట్టుగా ఉంటేనే నాకు ఇష్టం.

నా బంగారం కదా నా బుజ్జి కదా.. అన్ని అలా మనసులోకి తీసుకోకూడదు.. అయినా ఆఫీసులో మేము మాట్లాడుకుంది నీకు ఎలా తెలిసింది.. ఆ వైభవ్ వేనా చెప్పింది. ఇడియట్ అంటాడు.

వైభవ్ ని ఏమైనా అన్నారంటే ఊరుకోను... వాడివల్లే కదా మీ మనసులో మాట తెలిసింది. ఈరోజు నుంచి మీకు అన్ని ఇలాగే ఉంటాయి అని లేచి పైట దులుపుకుని బయటికి వెళ్లి పోతుంది.

కిందే ఒక పక్కకి పడుకుని నా పరిస్థితే ఇలా ఉందంటే ఇక రాజ్, వినయ్ పరిస్థితి ఇంకా ఎలా ఉందో...మా ముగ్గురు పెళ్ళాలు టార్చర్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి పరవాలేదు.

ఇదే రేంజ్ లో విద్యా కూడా రెచ్చిపోతే..  అప్పుడు మా భరత్ గాడి పరిస్థితి ఏమిటి అని ఊహించకని గట్టిగా నవ్వుతాడు. మళ్ళీ వెంటనే కంట్రోల్ కంట్రోల్..

నైట్ కి గ్రూప్ కాల్ పెట్టాల్సిందే అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు.

భరత్ ఇంటికి వచ్చేటప్పటికి విద్య ఎక్కడ కనిపించదు. ఏమైపోయింది ఇది.. నేను రాగానే ఎదురు వస్తుంది కదా.. అంతా చూస్తూ గదిలోకి వెళతాడు.

గదిలోకి వెళ్ళేటప్పటికి విద్యా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఫ్రూట్స్ తింటూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

ఏమిటి విద్య..  నేను రాగానే ఎదురు రావాలని తెలియదా. ఈ టైంకి హాల్లో ఉండడం మానేసి రూంలో కూర్చున్నావు అని గట్టిగా మాట్లాడుతాడు.

కూర్చుంటే ఏమైంది.  రోజు ఎదురు రావాలని మన పెళ్లి అప్పుడు చెప్పలేదే.. విద్యా సమాధానానికి భరత్ ముందుకి వెనక్కి చూసుకుంటాడు.

విద్య పట్టించుకోకుండా మళ్ళీ సాంగ్స్ వింటూ ఉంటే.. దగ్గరికి వచ్చి నిలబడి ఇప్పుడు మాట్లాడింది నువ్వేనా.. కాదు.

నా డుబు వచ్చి మాట్లాడింది.  మీకు ఏమైనా అనుమానమా..  ఏమైంది దీనికి... ఇలా కొత్త కొత్తగా మాట్లాడుతుంది.

సరే తర్వాత చూద్దాంలే అనుకుని..నేను స్నానం చేసి వస్తాను. ట్రాక్ ప్యాంటు  తీసి పెట్టు.. తీయకపోతే...అంతే ఆ మాటకి భూమి ఒక్కసారిగా రివర్స్లో తిరిగినట్టుగా అనిపిస్తుంది.

తీయకపోతే నేనే తీసుకుంటాను అని ఆలోచిస్తూ స్నానం చేసి వచ్చి ప్యాంటు వేసుకుని టవల్ అక్కడ మంచం మీద వేస్తాడు.

ఇంత వయసొచ్చింది టవల్ ఎక్కడి వెయ్యాలో కూడా తెలియదా..  అలా మంచాల మీద వేస్తే ఎలాగా...  వాసన రాదా అని గట్టిగా మాట్లాడుతుంది.

ఓకే ఓకే ఆరేస్తాను అని బాల్కనీలో ఉన్న దండెం మీద ఆరేసి వస్తాడు. విద్యా అని పిలిస్తే ఏంటి అని గట్టిగా అడుగుతుంది.

ఏమీ లేదు.  కూల్ కూల్ అని చెప్పి బయటకివస్తూ ఆలోచిస్తూఉంటాడు.
అప్పుడే నివి లోపలికి రావడం.. వినయ్ ఆఫీస్ రూమ్లోకి పరిగెత్తడం రెండు చూస్తాడు.  నివి  వెనకాలే ఉన్న వైభవ్ ని చూసి ఇదంతా నీ పని ఏంట్రా..

చీమలగా వచ్చి దోమ లాగా కుట్టావన్నమాట.  చెబుతాను ఉండు నీ పని అంటూ చూస్తూ ఉంటాడు.  నివి ముక్కు చీదుకుంటూ అమ్మ అని వస్తుంది.

ఏమైందే అలా ఏడుస్తున్నావు. మీ అల్లుడు గారికి నేను బోర్ కొట్టేసాను అంట.  కొత్త పెళ్ళాం కావాలి అంట.. ఇంకో పెళ్లి చేసుకుంటారంట..

అది కూడా ఏడు గోదావరుల అవతల ఉన్న అమ్మాయిని తెచ్చుకుంటారంట.. ఇంక నా జీవితం ఏం కావాలి అని ఏడుస్తూ ఉంటుంది.

నువ్వు చెప్పేది ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. రాజ్ ఎందుకు అలా మాట్లాడుతాడు అని కళ్యాణ్ అడిగితే..

మీకు ఎంతసేపు మీ అల్లుడు ని వేనేకేసుకుని రావడమేగాని..  కూతురు బాధ అర్థం కావడం లేదు.

ఒరేయ్ చిన్నన్నయ్య, భరత్ బావ అని పిలుస్తుంది. ఇరికించేసాడు ఎదవ అనుకొని.. భరత్... రాజ్ కి ఫోన్ చేసి తమరు ఎక్కడ ఉన్నా సరే మీ పుష్పక విమానంలో అత్తవారింట్లో వాలండి.

లేకపోతే మీకు అంటే..  అర్థమయ్యింది వస్తున్న అని చందు తో బయలుదేరుతాడు.. మా పరిస్థితి ఇలా ఉందంటే శ్రీ పరిస్థితి ఎలా ఉందో.. ఒకసారి కాల్ చేయాలి అని ఆఫీసు రూమ్ లోకి వెళ్లి శ్రీ ని లైన్ లోకి తీసుకుంటాడు.

స్నానం చేసి వచ్చిన శ్రీ లిఫ్ట్ చేసి ఏమైంది.. ఫోన్ చేశారు. నువ్వు బాగానే ఉన్నావా..  నాకేం రా బిందాస్.. నేహా ఏమి ఇబ్బంది పెట్టలేదా..

నా పెళ్ళాం అలా ఇబ్బంది పెట్టదు.  ఏమి మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా... నీమాట ఒకటి చెబుతుంది. కళ్ళల్లోనేమో భయం కనపడుతుంది.

నిజం చెప్పు. నేను నిజమే చెబుతున్నాను. ఈ లోపు నేహా వచ్చి ఏవండీ కూరలో ఉప్పు వేయమంటారా...పంచదార వేయమంటారా..

నూనె ఎన్ని స్పూన్లు వేయమంటారు. ఉల్లిపాయలు వేయించమంటారా వద్దా అని అడుగుతూ ఉంటే.. భరత్ గట్టిగా నవ్వుతూ తిక్క కుదిరింది ఎదవకి..

లేకపోతే నా దగ్గరే ఎక్కసక్కాల ఎంజాయ్ శ్రీ అని ఫోన్ పెట్టేస్తాడు.  వినయ్ బిక్క మొహం వేసుకుని చూస్తూ ఉంటే..

నీకేమైంది రా.. పూజిత ఎలా ఆడుకుందో చెబుతాడు.  నువ్వు సేఫ్ బావ. పాపం విద్య అక్క చాలా అమాయకరాలు కదా.

ఇప్పటివరకు అలాగే అనుకున్నాను రా అని వాపోతాడు. అంటే నీకు కూడా దబిడి దిబిడేనా... చాలా.. అసలు నేను చూడని యాంగిల్ చూపించింది.

సరే రా వెళ్దాము. అమ్మో నేను రాను.. నా పెళ్ళాం ఉంటుంది అంతకన్నా ఇంకొక బాంబు వచ్చి పడింది.  ఏం  బాంబ్..

నివి బాంబ్.. ఇప్పుడు రాజ్ ఎలా బ్రతిమాలతాడో ఏమిటో..  రాజ్ బావే కాదు.  మనమందరం బ్రతిమాలుకోవాల్సిందే..

ఇంకొకసారి నీ కొడుకుని వెనకేసుకొచ్చావు అంటే.. ఇప్పుడే కదా బావ అర్థమైంది. పద అని నీరసంగా బయటకి వస్తాడు.

వీళ్ళ వెళ్ళేటప్పటికి నివి హాల్లో శ్లోకాలు పెడుతూ ఉంటుంది. అందరూ చుట్టూ కూర్చుని ఓదార్చుతూ ఉంటారు.

రాజ్, చందు వచ్చేటప్పటికి వింతగా వెరైటీగా కనపడుతూ ఉంటుంది. భరత్,  వినయ్ ఒక పక్కగా నిలబడి ఉంటే రాజ్ వాళ్ల పక్కకి చేరి ఏం జరుగుతుంది రా ఇక్కడ..
నీ రెండో పెళ్లికి సంబంధించిన మాటలు..

రాజ్ పరిస్థితి..

నలుగురు పెళ్ళాల్ని ఎలా బుజ్జగించతారు.....
[+] 5 users Like SivaSai's post
Like Reply

Part - 87



రాజ్, చందు వచ్చేటప్పటికి వింతగా వెరైటీగా కనపడుతూ ఉంటుంది. భరత్,  వినయ్ ఒక పక్కగా నిలబడి ఉంటే రాజ్ వాళ్ల పక్కకి చేరి ఏం జరుగుతుంది రా ఇక్కడ..
నీ రెండో పెళ్లికి సంబంధించిన మాటలు..

ఇంకా గొడవ వదలలేదా..  నివి వదిలితే మిగిలిన అందరూ వదిలేస్తారు కానీ నివి వదిలేటట్టుగా కనిపించడం లేదు.

బుజ్జగించు బావ అని వినయ్ గెడ్డం పట్టుకుంటే ఇంటి దగ్గర ఆల్రెడీ చేశాను రా. అది సరిపోయినట్టు లేదు. ఇంకా ఎలా బుజ్జగించాలి.

ఇంతకి విక్కీ ఏం చేస్తున్నాడు.  ఎక్కడో పెళ్ళాంతో సేవలు చేయించుకుంటూ ఉంటాడు. వెంటనే విక్రమ్ కి కాల్ చేస్తాడు.

ఏంట్రా.. ఎక్కడున్నావు.. గదిలో..  కింద ఇంత మహాభారతం జరుగుతూ ఉంటే నువ్వు గదిలో ఏం చేస్తున్నావు  కిందకి రా..

మహాభారతమా... ఏం జరుగుతుంది అని నవ్వుతూ బయటికి వస్తాడు.. నీ చిన్న కొడుకు పెట్టిన పెంటకి.. నీ ముద్దుల చెల్లెలు చేస్తున్న రాద్ధాంతం.

అందుకే అనేది నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి అని..  అంత సీక్రెట్ ప్లేస్ లో కూడా డేటా కలెక్ట్ చేస్తారని ఎవరు అనుకుంటారు రా..

ప్లీజ్ రా బాబు వచ్చి.. నీ చెల్లిని కంట్రోల్ చెయ్.  ఇన్ని సంవత్సరాలు అయిన పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం రావడం లేదు.

పక్కనే వస్తున్న అవని వీపు మీద ఒక్కటేస్తుంది. ఏమిటే..
అని కళ్ళు ఎగరేస్తే ఏమీ లేదని మూతి తిప్పి వెళ్ళిపోతుంది.

ఈ మధ్యన భార్యామణికి అలకలు ఎక్కువైంది..అలిగే టైం లోనేమో బిక్కు బిక్కు మంటు చూసింది.. ఇప్పుడేమో ఈ సింహాన్ని వణికించాలనుకుంటుంది.

ఈ యాంగిల్ కూడా బాగుందిలే  అని నవ్వుకుంటూ వస్తున్న...

వచ్చి చెల్లి పక్కన కూర్చుని ఏమైందిరా.. చూడు అన్నయ్య మీ బావగారు రెండో పెళ్లి చేసుకుంటారంట.. అది కూడా ఏడు గోదావరుల అవతల ఉన్న అమ్మాయిని.

రాజ్ తలగోక్కుంటూ.. నేనెప్పుడూ  అన్నాను  అనుకుంటూఉంటాడు.  వినయ్ ఏమైంది బావ అలా చూస్తున్నావు.

నేను అనని డైలాగులు కూడా మీ చెల్లి కలిపేస్తూ ఉంటే నెక్స్ట్ ఎలా వెళ్లాలా అర్థం కావడం లేదు.. అవన్నీ ఇంటి దగ్గర మీ చెల్లి కొట్టినవే..

అప్పుడు నువ్వు ఏమి అనలేదా. బుజ్జిగించాను రా..
ఏమని బుజ్జగించావు .. ఒకసారి జరిగినది అంతా గుర్తుచేసుకొని.. చెప్పడం ఎందుకులే అని..

ఏదో ఒకటి..  నీ తర్వాతే ఏదైనా అని చెప్పాను. నీ తర్వాతే ఏదైనా అంటే అది ఇలా అల్లేసింది.. ఏంటి బావ అల్లుడు వచ్చే టైం అయింది ఇంకా పెళ్ళాన్ని బుజ్జగించడం రావడం లేదు.

పెద్ద తమరు  ఈ టాపిక్ లో  పీహెచ్డీ చేసినట్టు. అదిగో పూజిత వస్తుంది. వెంటనే అలర్ట్ అయ్యి..  విక్రమ్ పక్కన కూర్చుంటాడు.

వీడు మాత్రం పెళ్ళానికి సు.. సుసు.. పోస్తాడు. మనకి మాత్రం నీతి సూత్రాలు చెబుతాడు.

బావ ఊరికేనే అన్నాడు.  ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలియదా.. అవన్నీ అప్పుడు అన్నయ్య. ఇప్పుడు కాదు అని ముక్కు చీదుతుంది.

ఇక రాజ్ తప్పక వెళ్లి నివి ముందు కింద కూర్చొని ఇదిగో నివి.. ఎప్పుడైనా నేను నిన్ను మాత్రమే ప్రేమించాను. నేనేమన్నాను..

పెళ్ళాలు వేరే ఊరు అయితే ఎలా ఉంటుందో చూడాలి అన్నారు. అంతేగాని పెళ్ళాన్ని మారుస్తాను అనలేదు కదా. మీరైనా చెప్పండి అత్తయ్యగారు నేను అన్న దాంట్లో  అంత అర్థం ఉందా..


నివి ఇంకా ఆపు.  అల్లుడుగారు బ్రతిమాలుతుంటే నీ పెంకి ఏడుపు ఏమిటి.. ఎప్పటికీ అర్థం చేసుకుంటావు.   ఏదో వాళ్ళ సరదాగా అనుకున్న మాటలు నువ్వు అంత సీరియస్గా తీసుకుంటున్నావు.

ఇంకా అల్లుడొచ్చే టైం అయింది..ఇప్పటికీ కూడా రాజ్ నిన్ను బ్రతిమాలతూ ఉంటే వచ్చే అల్లుడు ముందు ఎంత లోకువగా ఉంటుంది.

కళ్ళు తుడుచుకుని ఇంకెప్పుడూ అలా మాట్లాడనని చెప్పమనమ్మ.  కలలో కూడా మాట్లాడను సరేనా.. నీకు ఏది కావాలంటే అది కొంటాను.

ఇప్పుడే షాపింగ్ కి వెళ్దామా.  ప్రస్తుతానికి మూడ్ లేదులే అని కళ్ళు తుడుచుకుంటుంది.అమ్మయ్య నేను సేఫ్ అనుకుంటాడు.

ఒక తుఫాను వెలిసింది. భరత్ విద్యాని గదిలోకి తీసుకువెళ్లి వెనకనుంచి పట్టుకొని.. నా బంగారం కదు.. నువ్వు ఎప్పటిలాగానే ఉండవే..

నీలో ఈ రెబల్ చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. మీరే కదా అంటే....ఇంక ఎప్పుడూ అలా అడగను.  నా విద్య ముద్దుగా బంగారంలాగా నాకు నవ్వుతూ ఎదురు వచ్చే నా పాత పెళ్ళమే కావాలి.

సరే అంతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి ఈసారి ఒప్పుకుంటున్నాను. వెళదామా. తప్పకుండా శ్రీమతి. హమ్మయ్య  నేను గట్టెక్కేసాను.

ఇంక వినయ్ శ్రీ  మిగిలారు. వినయ్ సీరియస్ గా లేచి పూజిత చేయ పట్టుకుని లాక్కు వెళతాడు. మాధవి ఒరేయ్ ఏమైంది రా అలా లాగుతున్నావు.

ఇప్పుడే వస్తాను అత్తయ్య అని గదిలోకి తీసుకువెళ్లి షర్టు హాండ్స్ పైకి మడత పెడుతూ ఏంటే ఎక్కువ చేస్తున్నావు. హ అని చేతులు కట్టుకొని చూస్తుంది. వెంటనే హ్యాండ్స్ కిందకి దించి చూడు పూజిత బుజ్జులు..

నువ్విలా ఉంటే అస్సలు బాగోలేదు. నేను ఒక లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయాను. ఈ వయసులో దాన్ని మార్చితే ఎలాగా..

ఎంత కన్ఫ్యూజ్ అవుతాను.  నువ్వు నా రౌడీ బేబీ లాగా ఉంటేనే నాకు ఇష్టం. ఆ రౌడీ బేబీ ని చూసే కదా నేను ప్రేమలో పడ్డాను.  ప్లీజ్ నువ్వు ఇలా ఉండి నన్ను భయపెట్టదు.

అది కాదండి అంటే.. వద్దు మనం ఎలా ఉన్నా బెస్ట్ కపులే..  వదిన అలా ఉంటుంది కాబట్టే అన్నయ్య హ్యాండిల్ చేస్తున్నాడు.  నేను ఇలా ఉంటాను కాబట్టి నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు అంతే..

నన్ను నువ్వు కాకపోతే ఎవరు భరించగలుగుతారు చెప్పు బంగారం.  ఈ మాటలకు ఏమి తక్కువ లేదు పదండి.
కిందకి వెళ్లి ఏం చెబుతావు.

మా ఆయన నన్ను భయపెట్టారు అని చెప్పమంటారా ? అలా చెబితే అప్పుడే పుట్టిన పసిపాప కూడా నమ్మదే.. నవ్వుతూ ఎవరు ఏమి అడగరు కానీ పదండి అని వెళుతుంది. హమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకుంటాడు.

శ్రీ... కిచెన్ లో నేహా ముందు మోకాళ్ళ మీద కూర్చొని నువ్వు ఎలా వండినా నేను తింటాను కదా. ఎందుకు ఇలా కొత్త కొత్తగా అడుగుతావు.

మీరే కదా అమాయకంగా ఉండాలి అన్నారు.మరి అమాయకంగా అంటే అన్ని అడిగే కదండి చెయ్యాలి.  నీకు ఈ అమాయకత్వం అస్సలు సూటి కాదు.

అవని అవనీయే.. నువ్వు నువ్వే. దీన్ని బట్టి మీకు ఏమి అర్థమైంది.

లేచి నిలబడి చేతులు కట్టుకొని ఒకరితో ఒకరిని కంపేర్ చేయకూడదు. ఎవరి నేచర్ వాళ్ళదే..  ఎవరి స్వభావం వాళ్ళదే.

రకరకాల పువ్వులన్ని కలిసి దండ అయినట్టుగా స్నేహమైనా, రిలేషన్ అయినా అంతే..భిన్న మనస్తత్వాలు కలిసినదే కుటుంబం..అర్థం చేసుకుని వెళ్ళాలి.

గుడ్ ఇన్ని సంవత్సరాలకు మీ బుర్ర పనిచేయడం మొదలైంది. వెళ్ళండి. నేను డిన్నర్ ప్రిపేర్ చేశాను తీసుకొస్తున్నాను.

ఏంటి పంచదార వేసా..  ఏదో మిమ్మల్ని అడిగాను కానీ అలా ఎందుకు వండుతాను.. నాకు తెలియదా అని నవ్వుతుంది.. పెళ్ళాలా మజాకానా అనుకుని గుండె మీద చెయ్యి వేసుకుంటాడు.

వాతావరణమంతా తేలిక పడింది అనుకునే సమయానికి సూర్య వచ్చి ఏమైంది.. అందరూ అలా ఉన్నారు? అత్తయ్య కళ్ళు ఏంటి ఎర్రగా ఉన్నాయి.

ఏమైంది అత్తయ్య.. నిన్ను ఎవరు ఏమిన్నారు అని అడుగుతాడు.  వెంటనే రాజ్ రెండు చేతులతో నమస్కరం చేసి ఒరేయ్ ఇప్పుడే మీ అత్తని కూల్ చేసి లైన్లో పెట్టుకున్నాను.
మళ్ళీ నువ్వు అడిగి మొదటికి తీసుకురాకు. ఆ టాప్ ఇప్పి హైదరాబాద్ ని ముంచకురా..

వైభవ్ కామ్ గా చందు చేయ పట్టుకుని  గదిలోకి తీసుకువెళతాడు.  వదులు వైభవ్..  ఏంటిది అందరూ ఉన్నారు.

అసలు ఏమైందే నీకు..  నాతో మాట్లాడటం తగ్గించేసావు. ఎక్కడ తగ్గించాను.  కలిసినప్పుడు మాట్లాడుతున్నాను కదా..  ఎక్కడ మాట్లాడుతున్నావు.

పొడిపొడిగా మాట్లాడుతున్నావు.  అవునా కాదా ఈ అని పళ్లు బయటపెట్టి ఒక చిన్న స్మైల్ ఇవ్వడం తప్ప ఇంకేమైనా మాట్లాడుతున్నావా..

ఇప్పుడు నీకు ఏం కావాలి.  ఏదో ఇంపార్టెంట్ వర్క్ మీద తిరుగుతున్నావు అంట.. ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు నన్నే కదా పిలిచేదానివి.

ఇప్పుడు ఎందుకు పిలవలేదు.  అసలు నీ ప్రాబ్లం ఏంట్రా.. పిలిచినా గొడవపడతావు.  పిలవకపోయినా గొడవ పడుతున్నావు.

పిలిచి నువ్వు అనే మాటలు అనిపించుకోవడం కన్నా నా పని నేను చేసుకుంటే బెటర్ అనుకుంటే దానికి 100 వంకలు పెడుతున్నావు. అనుమానంగా చూస్తూ ఈరోజు గొడవకు అంతటకే కారణం నువ్వేనా..

ఎటో చూస్తూ వాళ్ల గొడవకి నాకు సంబంధం ఏమిటి.  నిజం చెప్పు అని కాలర్ పట్టుకుంటుంది.
పట్టుకున్న చందు వైపు చూస్తూ ఎంత ధైర్యం ఉంటే నా కాలర్ పట్టుకున్నావే..

దీనికి ధైర్యం ఎందుకురా.. నా రెండు చేతిలో సరిపోవా.. ఇంతకీ ఏం చేశావురా.  నేనేమీ చేయలేదు. నా ఫోను క్యాబిన్లో మర్చిపోయాను. వెళ్లి తెచ్చుకున్నాను  అంతే..

వీళ్ళందరికీ గ్రూప్ కాల్ కనెక్ట్ చేసావా.. నేనా చేయలేదే..  అనుకోకుండా నా వేలు కాల్ మీదకు వెళ్ళిపోయినట్టు ఉంది. అయితే ఇప్పుడేమంటావు.

చూడు మా నాన్న ఎలా బ్రతిమాలుతున్నాడో. మరి మర్యాదగా అడిగాను.  చందు ఏం చేస్తుంది.. ఎక్కడుంది. నువ్వే కనుక్కో..

ఇంపార్టెంట్ వర్క్ మీద తిరుగుతుంది.తెలుసుకో అని పోజ్ కొట్టాడు. మరి ఆ పోజునంత దింపాలి కదా..

దింపడం అంటే ఇదా.. మా నాన్నతో పాటు మిగిలిన వాళ్ళని కూడా ఇరికించేసావు కదా. నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు చందు.

ఏమిటి... చాలాసేపటి నుంచి నువ్వు నా కాలర్నే పట్టుకుని ఉన్నావు.  ఇదేమన్నా మర్యాదగా ఉందా..  నీకు మర్యదా ఇచ్చేది ఏమిట్రా.

పోనీలే ఆడపిల్లవి అని చూస్తూ ఉంటే తెగ రెచ్చపోతున్నావేమిటి అని నడుం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు.

రేయ్ ఏం చేస్తున్నావురా అని తడబడుతూ అడుగుతుంది.  ఏమైంది చందు ఇప్పుడు దాకా బెకబెకమంటూ అరిచావు కదా..

ఇప్పుడు ఎందుకు మాట తడబడుతుంది.. మర్యాదగా నడుం మీద చెయ్యి.   ఏమయిందే పిల్ల రాక్షసి.. ఈ వయసులో మాట తడబడుతూ..  గొంతు తడారిపోతుంది అంటే అర్థం ఏమిటో తెలుసా..

చందు రియాక్షన్.....
[+] 7 users Like SivaSai's post
Like Reply

Part - 88



ఇప్పుడు ఎందుకు మాట తడబడుతుంది.. మర్యాదగా నడుం మీద చెయ్యి.   ఏమయిందే పిల్ల రాక్షసి.. ఈ వయసులో మాట తడబడుతూ..  గొంతు తడారిపోతుంది అంటే అర్థం ఏమిటో తెలుసా..
చెయ్యి తీసి మాట్లాడు  సరే అని చెయ్యి తీస్తాడు గాని దూరం జరగనివ్వడు..

నేను వెళ్ళాలి. అడిగినదానికి సమాధానం చెప్పేసి వెళ్ళు. ఏం అడిగావు. అంత మతిమరుపు వచ్చిందా..

అలాంటివి నువ్వు ఫ్లర్ట్ చేసే అమ్మాయిలని అడుగు.  నన్ను కాదు. ఓ.. నిన్ను నేను ఫ్లర్ట్ చేయలేదు అని ఫీల్ అవుతున్నావా..

పోని ఇప్పుడు చేస్తాను చెప్పవే..  వే.. గి..  అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. నాకు పళ్ళు లేకపోతే తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు.

నీ పళ్ళకి.. నా ఇబ్బందికి సంబంధం ఏముంది.  మరి రేపటి నుంచి నేను ఏమీ తినలేకపోయాను అనుకో.. చిన్నపిల్లలకి పెట్టినట్టుగా స్మూతీస్ చేసి తినిపించాలి.

జ్యూస్ లు పట్టించాలి.  ఇవన్నీ కష్టం కదా..  నీకెందుకు నేను పట్టిస్తాను. కాబోయే శ్రీమతే కదా నాకు అవన్నీ చేయాల్సింది.

ఏమిటి నీకు ఏడిపించడానికి నేను దొరకడం లేదు అని కొత్త యాంగిల్ ట్రై చేస్తున్నావా ? ఏడిపించడం కాదే తింగరి. ఐ లవ్ యు.

ఒక్క నిమిషం వైభవ్ వైపు చూస్తుంది. ఏమిటే అలా చూస్తున్నావు. అంత నచ్చానా..

చూడు నీ దారి నీది.. నా దారి నాది..  ఏడిపించడానికి కూడా ఒక హద్దు ఉండాలి. ప్రేమించానని చెప్పి ఇంకా ఏమీ ఏడిపించాలని నీ ప్లాను.

అయ్యో ఏడిపించడం కాదు. నిజమే చెబుతున్నాను. చేసిన ఓవర్ యాక్షన్ చాలు గాని.. నాకు దారి వదులు.  నేను వెళ్ళాలి.

ఇంతకీ నా ప్రేమను ఒప్పుకుంటున్నావా లేదా ? నేను అంత ఫూల్  ని కాదు. మర్యాదగా తప్పుకోకపోతే పెద్ద మావయ్యని పిలుస్తాను.

వైభవ్ దారి ఇచ్చి వెళుతున్న చందు నే చూస్తూ ఉంటాడు. నేనింత ఇదిగా లవ్ చేస్తున్నానని చెబుతూ ఉంటే.. ఫూల్ చేయడం అంటుంది ఏమిటి..

నా ప్రపోజల్ అంత చండాలంగా ఉందా...ఇప్పుడు నాకు దీనికి సొల్యూషన్ చెప్పే వాళ్ళు ఎవరు.. ఎవరు.. అనుకుంటూ ఆ బాబి కరెక్ట్ గా చెబుతుంది అని విశి కి కాల్ చేస్తాడు.

వైభవ్ కాల్  లిఫ్ట్ చేసి ఏమిటి ఈ టైంలో చేస్తున్నావు. నాకు ఒక ప్రాబ్లం వచ్చింది బాబి..  నీకా..  హ నాకే..  ఏమిటి.

నేను ప్రపోజ్ చేస్తే.. చందు  ఎలా మాట్లాడిందో చెబుతాడు. మొత్తం విన్న విశి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం మాట్లాడవే బాబి.

నీకు ఒక పాయింట్ అర్థం కావడం లేదు..చందు నిన్ను లవ్ చేయడం లేదు అని చెప్పడం లేదు. నిన్ను నమ్మను అంటుంది.

రెండింటికి తేడా ఏముంది. నీ ప్రేమ తనకు అర్థమయ్యే విధంగా చెప్పి నమ్మకం కలిగించు. ఆటోమేటిక్గా చందు లవ్ చేస్తుంది.
ఇది ఏమన్నా సినిమానా..  నమ్మించడానికి..  డ్రామాలు చూపించడానికి.  సినిమాలు కూడా నిజ జీవితం నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసినవే.

నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి. కానీ ఎలాగా నా లవ్ చూపించాలి బాబి.. అది నాకు తెలిస్తే ఇలా నీరసంగా ఎందుకు కూర్చుంటాను.

నీది అదే ప్రాబ్లమా? అవును. మనం దీని మీద బాగా స్టడీ చేద్దాం. ఎలా.. ఏదో ఒకటి నేను ఆలోచించి నీకు చెబుతాను అని ఫోన్ పెట్టేసి చించుతూ ఉంటాడు.

దీనికి సొల్యూషన్ చెప్పగలిగే వాళ్ళు ఇద్దరే ఇద్దరు. ఒక్కళ్ళు శ్రీకర్ ఐతే ఇంకొకళ్ళు అన్నయ్య. ఫస్ట్ అన్నయ్యని అడుగుదామని సూర్య గదిలోకి పరిగెడుతాడు.

ఫ్రెష్  అయ్యి వచ్చి మంచం మీద వాలి ఫోన్ చూస్తున్న సూర్య మీదకు వచ్చి పడతాడు.  ఒరేయ్ ఇలా వచ్చి పడ్డావు ఏమిటిరా..

లేగు. అన్నయ్య నాకు ఒక హెల్ప్ కావాలి. ఏదైనా సరే ముందు లెగిసి అడగరా..  నడుము విరిగిపోతుంది.

ఓ సోరి..  ఆవేశంలో వచ్చి మీద పడ్డాను.  నీ బొంద అని వైభవ్ ని పక్కకి గెంటి సూర్య లేచి నిలబడి నడుం సెట్ చేసుకుంటాడు. ఇంతకీ నీ ఆవేశం ఏంటో చెప్పు.

చెప్పాక కోప్పడవు కదా..  ముందు చెప్పరా..

చందు కి ప్రపోజ్ చేశాను. ఆ మాటకి సూర్యకి పులమారుతుంది. ఏం మాట్లాడుతున్నావు రా. అవును ప్రపోజ్ చేశాను.

మరి చందు ఏమంది.  నేను అంత ఫుల్ ని కాదు అని వెళ్ళిపోయింది. బాగా చెప్పింది.  నా ప్రేమ నిజం కాదా.. నేను దాన్ని ఏడిపించడానికి చెప్పాను అని అనుకుంటున్నావా..

వైభవ్ ఫేస్ చూస్తే సిన్సియర్గా కనపడుతుంది.. చిన్నగా నవ్వుకొని అక్కడ సోఫాలో కూర్చోబెట్టి... మీ ఇద్దరి మధ్యన ఇప్పుడు దాకా గిల్లికజ్జాలే జరిగాయి.

ఒక్కసారిగా నువ్వు వెళ్లి ఐ లవ్ యు అంటే చందు ఎలా రియాక్ట్ అవుతుంది.  ఫర్ సపోస్ చందు వచ్చి నీకు అలా చెప్పిందే అనుకో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు.

మరి ఎలా అన్నయ్య.. నాకు అది కావాలి అని నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకుని అడుగుతాడు.  నన్ను పట్టుకుంటే ఎలాగా..

దానికి నీ తిప్పలు నువ్వు పడాలి.  అది తెలియకే కదా... బాబి ని కూడా అడిగాను.  జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టుగా ఉంది.

ఇంతకీ ఏం చెప్పింది. అది నాకు తెలిస్తే నాకెందుకు ఇన్ని బాధలు అని బాధ పడింది. ఆ మాటకి నవ్వుకుంటూ...మీ బాబి సంగతి నేను చూసుకుంటాను కానీ నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి. అదే ఎలాగా..

ప్రేమనీది..  ప్రయత్నాలు నీవే అవ్వాలి. నీ ప్రయత్నంలో సిన్సియారిటీ చూపించు. 
అదే తెలియడం లేదు.  ఫ్లర్ట్ చేయడం వేరు.  ప్రేమించానని చెప్పడం వేరు కానీ ఎలా..  ఎలా..  ప్లీజ్ అన్నయ్య హెల్ప్ మీ..

సూర్య వైభవ్‌ పక్కనే కూర్చుని భుజం మీద చెయ్యి వేసి..

ప్రేమ అంటే మాట కాదు రా వైభవ్…
ప్రేమను నీవే చూపించాలి.
ప్రేమను అర్థం చేసుకోనివ్వాలి.
ప్రేమిస్తున్నావని చెప్పడానికి…
పొరపాటున కూడా మూడో మనిషిని మధ్యలో పెట్టకు.

చందుకు నువ్వు నిజంగా మారిపోయావా?
నిజంగా సీరియస్‌వా?
నీ అలవాట్లు, నీ తిట్టుకూడా ఆమె మీద ప్రేమైతే…
అవి ఆమెకి కనిపించాలి.

ఒక్కసారిగా ఐ లవ్ యూ అన్నంత మాత్రాన ఎవ్వరికీ నమ్మకం రాదు.
రోజూ చూపించే చిన్న చిన్న జాగ్రత్తలు…
మాటల్లోనూ, ప్రవర్తనలోనూ వచ్చే స్థిరత్వం…
అదే నమ్మకం తెస్తుంది.

నీ ప్రేమని చందు నమ్మాలంటే…
నీ ప్రేమను నువ్వే లాంగ్వేజ్‌లా నేర్పించాలి.
అదే నీ ప్రయత్నం.

నువ్వు చెబుతుంటే అర్థమయ్యి అవనట్టుగా ఉంది. ఏదో మళయాళం సినిమా కొంకిణి లాంగ్వేజ్ లో చూసినట్టుంది.
కానీ  ఒక్క పాయింట్ అర్థమైంది.

ప్రేమ నాది.. ఫైటింగ్ నాది.. చందూకు అర్థమయ్యే విధంగా చెప్పే బాధ్యత కూడా నాది అంతే కదా.. అబ్బా.. ఎన్ని రోజులకి నీ నోటి నుంచి బాధ్యత అన్నమాట వచ్చింది రా..

ఇంక నీకు ఎదురేలేదు. క్యారీ ఆన్.. థాంక్యూ బ్రో.. చందు వస్తున్న కాచుకో..  అంత వద్దు  మామూలుగా వెళ్ళు..

ఏమిటో అన్నయ్య నీకు నా ఫాంటసీ అస్సలు అర్థం కావడం లేదు అని రూమ్ కి వెళ్లి ఎలా చెప్పాలో..  ఏమిటా అని ఆలోచిస్తాడు.

ఐడియా..  లవ్ మూవీస్ చూస్తే మన కంటెంట్ దొరకచ్చు కదా అని రాత్రంతా జాగారం చేసి మరి సినిమాలు చూస్తాడు.

వైభవ్ వెళ్లి సూర్య గది తలుపులు బాధేస్తూ ఉంటే.. అబ్బా ఈ టైంలో ఎవరు అని తలుపులు తీస్తే.. అన్నయ్య..  ఏంట్రా ఈ టైంలో.

నేను కొన్ని ప్రాక్టీస్ చేశాను. అవి చూపిద్దామని. ఇప్పుడా ఇంత ఎర్లీ మార్నింగ్ లో ఏదైనా ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలిరా. అందుకే కదా వచ్చాను అని లోపలకి వస్తాడు.

చెప్పు..

అద్దం ముందు  నిలబడతాడు అద్ధం వైపు ఎందుకురా అయ్యో నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి కదా..
ఎక్స్ప్రెషన్స్ అని సూర్యా పెడతాడు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అన్నయ్య.
శ్… ప్రాక్టీస్ మోడ్ లో ఉన్నా!
చందుకి పర్ఫెక్ట్ గా ప్రపోజ్ చేయాలి కదా!

వైభవ్...మాస్ హీరో స్టైల్

అద్దం ముందు తల వెంట్రుకలు స్టైల్ చేసి, కాలర్ కొంచెం ఎత్తి:

మాస్ టోన్ తో
చందు… నీకోసం ఏడు సముద్రాలు దాటి వచ్చేసానురా…
ఒక్కసారి ‘అవును’ అన్నా… నువ్వు నా రాణి… నేను నీ హీరో!
ఎలా ఉంది అన్నయ్య..

సూర్య తలపై చెయ్యేసుకుని:
అరేయ్… చందు నిన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోతుంది ఈ స్టైల్‌లో.

అయ్యో... ఇది కూల్‌గా లేదేమో.

ఇప్పుడు క్లాసిక్ రొమాన్స్ లో చెబుతాను..


చేతిలో ఒక పుస్తకం పట్టుకుని, గ్లాస్ నెమ్మదిగా తీసి..

వైభవ్ సాఫ్ట్ టోన్ తో..
చందు… నీ కళ్ళలో పడిన రోజు నుంచి…
నా జీవితం బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్ మోడ్‌కి మారిపోయింది.
విత్ లవ్… వైభవ్.

సూర్య నవ్వు ఆపుకోలేక:
అయ్యా కవిత్వం ఆపు. నువ్వు కవి సమ్మేళనంలో ప్రపోజ్ చేస్తున్నట్టు ఉంది.


ఛ.. ఇది కూడా సెట్ అవ్వలేదా మరొకటి వదులుతాను చూడు..

వైభవ్ వెనుక నుండి చేతులు చుట్టే పోజ్ ప్రాక్టీస్ చేస్తూ..

చందు… నీ దగ్గరకు రావడం… నీ వెనుక నిలబడడం…
ఇవి అన్నీ నేను ప్రాక్టీస్ చేశాననుకుంటున్నావా?
లేవురా…
అవి నాకు ఆటోమేటిక్ గా వస్తాయి…

సూర్య వెంటనే:
ఒకేసారి ఇలా దగ్గరకు వెళ్లకు… చందు బలంగా  మోచేతి తో ఒకటి ఇస్తుంది.


ఏమిటి న్నయ్య ఎన్ని చెప్పినా ఏదో ఒకటి చెబుతున్నావు ఇది చూడు..



వైభవ్ గుండెపై చెయ్యేసుకుని, డీప్ బ్రీతింగ్ తో

చందు…
సూర్య వైపు చూసి బిక్కమొహం వేస్తాడు.
ఏమైందిరా డైలాగ్ మర్చిపోయాను.
ఓహ్ షిట్! స్లో మోషన్ పాట బాక్గ్రౌండ్ లో ఉంటేనే ఇది బాగుంటుంది బ్రో..


సూర్య తల పట్టుకుంటాడు.ఇది ఫైనల్.
నా ఒరిజినల్ స్టైల్..

అద్దం ముందు నిజంగా తనలా నిలబడి..

వైభవ్ నిజాయితీగా చందు కళ్ళల్లోకి చూస్తున్నట్టుగా ఫీల్ అవుతూ..
చందు…
నీతో ఉండటం నాకు బాగుంటుంది.
నీతో మాట్లాడితే నా రోజు సరి అయినట్లు అనిపిస్తుంది.
నీ మీద నాకు ప్రేమ…
ఆ మాట చెప్పడానికి నేను నేనే ఉండాలి.
ఇదే నేను… ఇదే నా ప్రేమ.

సూర్య గట్టిగా చప్పట్లు కొడుతూ:
అది రా! అదే నీ స్టైల్!
సినిమాల్లా కాకుండా… నువ్వు నిన్ను నమ్మి చెప్పాలి.

వైభవ్ అద్దంలోకి చూసి చిన్నగా నవ్వుకుంటాడు:
అయితే… దీన్నే ప్రాక్టీస్ చేస్తా.
చందుకి ఇది నచ్చుతుంది.

వైభవ్ ప్రాక్టీస్ ఎంతవరకు వస్తుంది..........
[+] 5 users Like SivaSai's post
Like Reply

Part - 89



వైభవ్ ఇలాగే ప్రాక్టీస్ చేసి చందుకి చెబుతాను అన్నయ్య అని వెళ్ళిపోతాడు . వెళుతున్న వైభవ్ ని చూసి నవ్వుకుంటూ..

ప్రేమలో పడను పడను అంటూనే..  మాకన్నా ఎక్కువగా ఆరాటపడుతున్నావు కదరా..  ఇంతకి నా తింగరబుచ్చి ఏం చేస్తుందో.. ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తే కంగారు పడుతుంది ఏమో..

ఒసేయ్ తొందరగా ప్రపోజ్ చేయవే... నాకున్న ఒకే ఒక డ్రీమ్.. ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందా అని. నేను ప్రేమించింది నిన్నే. ప్రపోజ్ చేయవే బంగారం.

అప్పుడే నిద్ర లేచిన విశికి పులమారుతూ ఉంటుంది. అబ్బా..  ఇంత పొద్దున్నే ఏమిటీ. ఎవరు తలుచుకుంటున్నారు.

దేవా సార్ మీరే తలుచుకుంటున్నారా. నేను అమ్మకి చెప్పాను లేదా అని ఆలోచిస్తూ ఉండి ఉంటారు కదా. ఇదిగో ఈ రోజు అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుంటాను.

స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటూ..  ప్లీజ్ భగవంతుడా అమ్మ ఒప్పుకునేటట్టు చెయ్యి..
రాగానే నీ గుడికి వచ్చి కొబ్బరికాయ కొడతాను సరేనా అని దేవుడితో డీల్ పెట్టుకుని కిచెన్లో ఉన్న తల్లి దగ్గరికి వెళ్లి అమ్మ అని పిలుస్తుంది.

ఏంట్రా..  నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు.  ఈరోజు వంట నేను చెయ్యనా..  ఏమిటి ఇది చెబుదామన..

ఆహా అది కాదు. నా దగ్గర నువ్వు మోహమాటపడడం ఎప్పటినుంచి మొదలు పెట్టావు.

అది నిన్న ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్టు డీల్ ఓకే అయ్యింది. మంచిది. కానీ ఆ విషయం నిన్నే చెప్పావు కదా.. హ దేవా సార్..  ప్రాజెక్ట్ ఓకే అయింది కదా అన్నవరం తీసుకువెళతాను అన్నారు.

నీ పర్మిషన్ అడిగి చెబుతాను అని చెప్పాను.. ఏం చెప్పమంటావు అమ్మ అని తల్లి వైపు చూస్తోంది. కూరగాయలు కట్ చేస్తున్న భానుమతి చాక్ పక్కన పెట్టి కూతురు వైపు చూస్తుంది.

  నీకు ఇష్టం లేకపోతే వద్దు అని చెప్పేస్తాను అని.. ఒప్పుకోవాలి అన్నట్టుగా చూస్తూ ఉన్న కూతురు కళ్ళు చూసి నవ్వుకుంటూ..

దీనికి కూడా భయపడుతున్నావా..  దేవాసార్ మీద నాకు  నమ్మకం ఉంది. నేహాగారు కూడా చాలా గొప్పగా చెప్పారు. అలాంటి అబ్బాయి దొరకాలి అంటే పెట్టి పుట్టాలి అని.

అన్నీ కలిసి వస్తే మన ఇంటి అల్లుడిని చేసుకోవాలని ఉంది. అమ్మ అని ఆనందంగా హత్తుకుంటుంది. పిచ్చిదానా..  మనసులో ఆశ ఉంటే సరిపోదు అది చెప్పడం కూడా రావాలి.

అన్నవరం నుంచి వచ్చేలోపు నీ మనసులో మాట అబ్బాయికి చెప్పి శుభవార్తతో నా ముందు నిలబడాలి అర్థ మయిందా.

నువ్వు బెస్ట్ అమ్మవి అని బుగ్గన ముద్దు పెట్టుకుంటుంది.
నన్ను పొగిడింది చాలు కానీ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పు సరే అని పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని సూర్యకే కాల్ చేస్తుంది.

విక్రమ్ తో మాట్లాడుతున్న సూర్య  ఫోను చూసి అబ్బా.. ఇప్పుడు ఎలా లిఫ్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే... ఏరా నా కోడలా..

మీరు ఎలా గెస్ చేశారు.  నీ ఫేస్ చూస్తే మీ అమ్మ కూడా గెస్ చేస్తుంది. అలాంటిది నేను గెస్ చేయలేనా..
ఏం అవసరం వచ్చిందో వెళ్లి మాట్లాడు.

ఫోన్ లిఫ్ట్ చేసి.. చెప్పండి మేడం. మాతో ఏం అవసరం వచ్చింది.. సార్.... నేను మేడం ఏమిటి.. మీ స్టూడెంట్ ని. కానీ ఇప్పుడు వి. జె. స్.  కంపెనీ తోనే డీల్ కుదుర్చుకున్న బిజినెస్ ఉమెన్ కదా.. ఇదంతా మీ చలవ కాదా..

నీకు అదే చెప్పాను.  నీ క్రెడిట్ ని నా ఎకౌంట్లో వేస్తావు ఎందుకు. భయపడుతుంటే మోటివేషన్ ఇచ్చాను కానీ నేనేమీ వర్క్ చేయలేదు కదా..

బేసికల్గా నీలో ఆ టాలెంట్ ఉంది. ఎక్స్పోజ్ అయ్యావు అంతే..మీలో నచ్చేది ఇదే సార్..ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మీ క్యారెక్టర్ చూస్తే..

హ చూస్తే... అదే నేర్చుకోవాలి అనిపిస్తుంది. ఏదో చెప్పాలని ఫోన్ చేసి ఇంకా ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది.

అమ్మతో మన విషయం చెప్పాను. మన విషయమా... మన విషయం అంటే ఏమిటి విశి. అదే హైదరాబాద్ టు వైజాగ్ వెళ్దాం అన్నారు కదా..

అమ్మతో అన్నవరం వెళుతున్నాము అని చెప్పాను. ఆ మాటకి నవ్వుకుంటూ మరేమన్నారు.  మీ మీద నమ్మకం ఉంది వెళ్ళమని చెప్పింది.

నీ మీద నమ్మకం లేదా.. సార్ నా మీద నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది.  నా మీద నమ్మకంతో వెళ్ళమన్నారు కానీ నీ మీద నమ్మకంతో వెళ్ళమని చెప్పలేదు కదా..

అందుకనే అడుగుతున్నాను. మీకు నన్ను ఏడిపించడం చాలా ఇష్టం కదా..  ఏడిపించడం కాదు నవ్వించడం ఇష్టం.
ఆ మాటకి చిన్నగా సిగ్గుపడుతుంది.

ఎప్పుడు బయలుదేరాదాము సార్.  నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. ఈరోజు స్టార్ట్ అవుదామా. అబ్బో అమ్మాయిగారికి చాలా కంగారుగా ఉన్నట్టుంది.

ఏదైనా స్పెషల్ న్యూస్ ఉందా..  ఆ మాటకి తడబడుతూ స్పెషల్ న్యూస్ ఏముంటుంది సార్.  ఎంత తొందరగా వెళితే అంత మంచిది కదా.

నాకు సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ విషయం అక్కడే మొదలయ్యింది అందుగురించే..

ఇప్పుడు ఇంకా ఏదైనా ముఖ్యమైన విషయం మొదలవ్వబోతుందా .. ఇంచుమించు అలాంటిదే. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది.

ఫోన్ వైపు చూస్తూ నవ్వుకుంటూ వెనక్కి తిరుగుతాడు
అక్కడ ఉన్న వాళ్ళని చూసి ఉలిక్కిపడి వీపు మీద చరుచుకుని ఏంట్రా ఇద్దరు అలా చూస్తున్నారు.

నువ్వు ఫోన్లో రొమాన్స్  ఒలకపోస్తూ ఉంటే నేర్చుకుందామని అన్నయ్య.. అంతేనా శ్రీకర్..
అంతే.  నేను నా బుజ్జి పప్పీ తో ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నాను కానీ ఇలా ట్రిప్ కి వెళ్ళానా.

నువ్వు ప్రేమలో పడి పడగానే..  అని రయ్ రయ్ మంటూ  వెళ్ళిపోతున్నావు.

శ్రీకర్ భుజం మీద చెయ్యి వేసి మీకు నాకు తేడా ఉందిరా.. ఏమిటో ఆ తేడా.  నువ్వు ఆల్రెడీ ప్రేమలో పడ్డావు. ప్రపోజ్ చేసావు. నీ ప్రేమని సౌమ్య ఒప్పుకుంది.

ఇంక నా పిల్ల ఎక్కడికి వెళుతుంది లే అన్న ధీమా నీది.  ఇంక వీడంటావా.. చందుని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి వాడికి కొంచెం టైం పడుతుంది.

ఇక నా సంగతి అంటావా.. నా క్యూటి నన్ను లవ్ చేస్తున్న విషయం నాకు తెలుసు.  నేను ఇష్టపడుతున్న విషయం క్యూటి కి తెలుసు.

అందుకే అది ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి మేము ట్రావెలింగ్ స్టార్ట్ చేసాము.

అమ్మ బావ... ఇంత ఉందా..  ఇలా అనుకుంటే..నా బుజ్జి పప్పీ ని కూడా తీసుకుని రయ్... రయ్.. అంటూ తీసుకు వెళ్లి ప్రపోజ్ చేసే వాడిని.
  ఛ.. అనవసరంగా డైరెక్ట్ గా చెప్పేసాను. ఇది గనక భరత్ మామయ్య విన్నాడనుకో..  ఇప్పుడు అస్సలు పంపించడు జాగ్రత్త.

ఆ.. అన్ని వాళ్ళకి చెప్పే చేస్తాం ఏమిటి? మేము చెప్పే చేస్తున్నాము. మీ అంత సిన్సియారిటీ మా దగ్గర లేదులే అని వెనక్కి తిరుగుతాడు.

అక్కడ భరత్ చేతులు కట్టుకొని చూస్తూ ఉంటే.. మావయ్య నువ్వు వచ్చి ఎంత సేపు అయింది.  ఇదిగో ఇప్పుడే వీడి ప్రేమ గురించి చెబుతూ ఉంటే..

భరత్ మావయ్యని అడుగు సలహాలు బాగా ఇస్తాడు అని చెబుతున్నాను అంతే కదా..
ఏమిట్రా అని కొంచెం గట్టిగా అంటే..  ఛీ.. ఛీ..ప్రేమలో కాదు మావయ్య.  బిజినెస్...  బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాము అంతే కదరా అని సూర్య షర్టు పట్టుకుంది లాగుతూ ఉంటాడు.


సూర్య నవ్వుతూ నువ్వు వచ్చి ఎంతసేపు అయింది మావయ్య. వీడు వస్తున్నాడు అని తెలిస్తే.. నేను ఇంట్లోనే ఉంటున్నాను.

ఆడపిల్ల తండ్రిలము  కదా.. మా జాగ్రత్తలో మేము ఉండాలి. మావయ్య అని శ్రీకర్  గుండె మీద చెయ్యి వేసుకుంటాడు.

శ్రీకర్ అరుపుకి వైభవ్ రెండు అడుగులు వెనక్కి వేస్తాడు. ఎందుకురా అలా అరిచావు అని భరత్ అంటే.. నువ్వు నీ కూతురు నైనా అనుమానించొచ్చుగానీ నన్ను అనుమానించకూడదు అని డ్రామాటిక్ గా  చెబుతాడు.

అవునా. అవును మావయ్య.  నేను ఎంత గుడ్ బోయ్ నో తెలుసా.. అసలు ఇప్పటివరకు సౌమ్యని బైక్ ఎక్కించుకున్నానే కానీ మా ఇద్దరి మధ్యన బ్యాగ్ అడ్డు పెడతాను.

నీ పర్మిషన్ లేకుండా చెయ్యి కూడా పట్టుకోవడం లేదు.
ఇంక సౌమ్యనే మనం ప్రేమలో ఉన్నాము కదా అంటుంది. అవునా సౌమ్య. నువ్వు అలా మాట్లాడావా.

సౌమ్యనా.. అదెక్కడుంది అని పక్కకి చూస్తే అక్కడ ఉగ్రరూపం లో కనపడుతుంది.
అంతే శ్రీకర్ తల మీద చెయ్యి వేసుకుని అక్కడ నేలపైన కూర్చుండిపోతాడు. భరత్ శ్రీకర్ ముందుకు వచ్చి మామగారులతో పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి రా..

ఏది పడితే అది మాట్లాడితే ఇదిగో ఇలాగే ఇరుక్కుపోతావు. ఇందులో నీ తోకకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అని భరత్.. వైభవ్ వైపు చూసి పళ్ళు నూరుతాడు.

ఆఫీసులో సంగతి గుర్తుకొచ్చి వైభవ్ ఒక తింగరి నవ్వుతే.. నా చేతిలో నువ్వు అయిపోయావురా..  చందు కి లైన్ వేస్తున్నావు కదా.. ఎన్ని పుల్లలు పెట్టాలో అన్ని పెడతాను చూస్తూ ఉండు.

అంతే వైభవ్ వెంటనే భరత్ కాళ్ళు పట్టుకుని మావయ్య ఏదో చిన్న పిల్లోడిని. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో తెలుసుకుందామని అలా చేశాను కానీ మిమ్మల్ని ఇరికిస్తానా..

ప్లీజ్ మావయ్య అసలు ఇంకా పట్టాలె ఎక్కని నా ప్రేమకి నువ్వు బ్రేకులు వెయ్యకు.  ఒరేయ్ వదలరా. మీరు అడ్డుపడను అని చెప్పే వరకు మీ కాళ్లు వదలను.

ఒరేయ్ నువ్వు ఊపే ఊపుడికి నేను కూడా పడిపోయేటట్టు ఉన్నాను.  పర్వాలేదు.
పడిపోతే దెబ్బలకి ఆయిల్ రాస్తాను కానీ మీరు ఒప్పుకోండి మావయ్య.

నేను ఒప్పుకున్నా..  రాజ్ నీ మీద కారాలు మిరియాలు బాగా నూరుతున్నాడు. రాజ్ మావయ్యని నేను కన్విన్స్ చేసుకుంటాను మీరు ఒప్పుకున్నట్టే కదా..

ఒప్పుకోక చస్తానా..   వదులు అనగానే.. హమ్మయ్య అని శ్రీకర్ వైపు చూసి  నేను ఎలాగైతే మావయ్యని ఒప్పించేసాను.

నీదే మిగిలింది.  సౌమ్యను బ్రతిమాలుకో..  మరీ ఇలాగా.. నా వే లో నేను వెళ్ళాను.  నీ వేలో నువ్వు వెళ్ళు.

శ్రీకర్ సౌమ్యని ఎలా బ్రతిమాలతాడు.

కథ కొనసాగుతుంది.............
[+] 8 users Like SivaSai's post
Like Reply

E Roju Ma Village Lo Festival So Signal's Levu afternoon 1:00 P.M Lopu Update Istanu
Like Reply

Part - 90

సౌమ్య... శ్రీకర్ ని కొరకొరా చూసి వెళ్ళిపోతుంది. అబ్బా అలకలే తెలియని నా బుజ్జి పప్పీ ప్రేమలో పడిన దగ్గరనుంచి అలకల మీద అలకలు చూపిస్తుంది.

దేవుడా..  ఆడవాళ్ళకి ప్రేమలో పడేటప్పటికీ అలకలు ఎక్కువ అవుతాయి... ఓపిక లేని మగవాళ్ళకి బుజ్జగించడం వస్తుంది అంటే ఏదో అనుకున్నాను కానీ మా ఇద్దరినీ చూస్తుంటే అదే అని అర్థమవుతుంది.

ఇప్పుడు ఎలా బుజ్జగించాలి గదిలోకి వెళ్ళిన సౌమ్య ని చూస్తూ వెళ్లబోతూ ఉంటే... భరత్ ఎక్కడికి రా..  నువ్వు పెట్టిన మంటకి నీ కూతురు అలిగి కూర్చుంది.

బుజ్జగించుకోవాలి కదా..  ఆ బుజ్జగింపులు అన్ని బయట. గదిలోకి వెళ్ళావంటే కాళ్ళు ఇరగ్గకొడతాను.  మరి దాన్ని బయటికి రమ్మని చెప్పు మావయ్య..అది నేను ఎలా చెబుతాను రా..

పక్కనే కూర్చుని ఎందుకు చెప్పలేవు.  ఇది నీ కూతురు లైఫ్ కి సంబంధించింది కదా..  చిన్న కరెక్షన్ రా. కాబోయే అల్లుడు లైఫ్ కి సంబంధించింది. అర్థం కాలేదు మావయ్య..

ఒరేయ్ ఇప్పుడు ఎవ్వడు ఎవరిని బ్రతిమాలడానికి చూస్తున్నారు. నేను సౌమ్యని అని...  ఇది నువ్వు కావాలనే పెట్టావు కదా...

ఎస్.. ఎందుకు మావయ్య అలా చేసావు.  అసలు అలకలే తెలియని.. నా బుజ్జి పప్పీ ఎలా  అలుగుతుందో  తెలుసా.. నీ తోకేదో అన్నాడు కదురా..

ఎలా హ్యాండిల్ చేస్తామో చూడాలి అని.  అలాగే మీరు మా అమ్మాయిలని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అన్నది మాకు తెలియాలి కదా.. శ్రీకర్ నెత్తి మీద చేతులు వేసుకుని కూర్చుంటాడు.

అల్లుడు ఢమాల్ మావగారు రాక్..

సూర్య విక్రమ్ దగ్గరికి వెళ్లి నాన్న అని పిలుస్తాడు.  ఏంట్రా.. రా..

ఈరోజు..  క్యూటి తో నేను చేతితోనే  బైక్ డ్రైవ్ చేస్తున్నట్టుగా చూపిస్తాడు.

అప్పుడే ఫస్ట్ డేటింగ్ మొదలైంది అన్నమాట..  చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. నాన్న ఏమన్నా టిప్స్ చెప్పచ్చు కదా..

ఒరేయ్ ప్రేమలో ఎవరిని సలహాలు అడగకూడదు.  నీ మనసుకి ఆ నిమిషం ఎలా అనిపిస్తే అలా ఫాలోఅయ్యిపో.. అలానే అడ్వాన్స్ అవ్వకు.  ఎప్పుడు అందం అప్పుడే..

విక్రమ్ ని హాగ్ చేసుకుని.. నువ్వు బెస్ట్  నాన్నవి. పొగిడింది చాలు కానీ.. అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాను.  జాగ్రత్తగా వెళ్లి రండి.

థాంక్యూ  అని ముద్దుపెడితే..  మీ అమ్మకి చెప్పరోయ్.. లేకపోతే మనిద్దరం ఏదో  గుడుపుఠాణి చేసేసాము అని రాత్రంతా ముక్కు చీదుతూ ఉంటుంది.

ఆ మాటకి నవ్వుతూ అమ్మని మాత్రం భలే హ్యాండిల్ చేస్తారు నాన్న. ఎంత అలిగిన వెంటనే కూల్ అయిపోతుంది.

అక్కడ సోఫాలో కూర్చుంటూ..  మీ అమ్మది చిన్నపిల్లల మనస్తత్వం.  పెళ్ళికి ముందు తన కోరికలు ఏమీ తీరలేదు. బిక్కుబిక్కు మంటూ బ్రతికింది.

ఒక పక్కన తనని తాను కాపాడుకోవడం..  స్టడీస్..  సెల్ఫ్ రెస్పెక్ట్ వదలకుండా బతకడం అంటే ఒక ఆడపిల్లకి మాటలు కాదు.

మనసులో బాధ చెప్పుకోవడానికి తోడు లేకపోతే అది ఇంకా నరకం. మీ అమ్మ ప్రతిదీ ధైర్యంగా ఎదుర్కొంది. మా పెళ్లి జరిగిన విధానం తెలుసు కదా..

ఒక్కరోజులోనే తను నన్ను పూర్తిగా నమ్మింది..  నేను వస్తాను తన చెయ్యి పట్టుకుంటాను అని నమ్మకంతో ఉంది. ఆ నమ్మకమే మీ అమ్మ నా ప్రాణమైపోయింది.

ఏరోజు కూడా తన తండ్రిని ద్వేషించలేదు. విరక్తితో అతనికి దూరంగా జరిగింది.. మీ తాతయ్య కూడా నిజ నిజాలు తెలుసుకోకుండా అవని కి దూరంగా ఉన్నారు.

మీ తాతయ్య  తెలుసుకునేటప్పటికి తన లైఫ్లో చాలా మిస్ అయిపోయింది. అందుకే మీ అమ్మ అలిగిన..  మారం చేసినా..  ఏది చేసినా సరే..

ఒక చిన్న పిల్లని హ్యాండిల్ చేసినట్టే చేస్తాను. మీ అమ్మ అలకలైన చిరుబురులైన నా దగ్గర మాత్రమే. ఇంకెవరి దగ్గర చూపించదు.  ఎందుకో తెలుసా..

ఏ లైఫ్ పార్టనర్ కైనా అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ ఉంటే.. వాళ్లే పిల్లలు అవుతారు.  తల్లి అవుతారు.  తండ్రి, స్నేహితుడు అన్ని రిలేషన్స్ వాళ్ళలోనే ఉంటాయి.

అందుకే బయట వెతుక్కోవలసిన అవసరం ఉండదు. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది.  భార్యలకి చీరలు కొనిచ్చి కూల్ చేస్తే సరిపోతుంది.

నగలు తెచ్చిస్తే సరిపోతుంది.  ఏది కొన్న వీళ్ళకి తృప్తి ఉండదు అని కామెంట్స్ చేస్తారు..  బట్ రియాలిటీ ఏమిటో తెలుసా..

మాట. సూర్య చూస్తూ ఉంటే అర్థం కాలేదు కదా..
లేదు అన్నట్టుగా తల ఊపితే..

అలసిపోయి ఉన్నప్పుడు ఏరా ఈరోజు పని ఎక్కువయిందా రెస్ట్ తీసుకోపోయావా అని అడుగుతూ.. కాళ్లు పట్టడంలో తప్పులేదు. బయట నుంచి మనం వచ్చేటప్పటికి ఎదురుగా వాళ్ళు ఉండాలని ఎలా కోరుకుంటామో..

వాళ్ళ చిన్న చిన్న ఆనందాలు కూడా మనతో షేర్ చేసుకోవాలని వాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు.   ఫ్రెండ్స్, బిజినెస్, మీ పార్టీ స్ అని టైమ్ స్పెండ్ చేస్తాము.

జస్ట్ ఆ టైంలో ఒక్క ఆఫెన్ అవర్ వాళ్ళకి ఇస్తే చాలు. ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం మన ముందు ఉంచుతారు.

ప్రతిరోజు చేసే వంట అయినా సరే సూపర్ ఉంది అంటే చాలు..  వాళ్ళ మొఖాలు వెలిగిపోతాయి.  అది నువ్వు హార్ట్ ఫుల్ గానే చెప్పాలి.

చాలామంది చేసే మిస్టేక్ ఏమిటో తెలుసా.. బాగున్న రోజున చెప్పేది ఏముందిలే అనుకుని ఏరోజైతే బాగోదో ఆ రోజే చెబుతారు.

అంటే పెళ్ళాలో ప్రెస్టేషన్ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది.
వాళ్లు తినేటప్పుడు తెలియదా బాగుందో లేదో.. మనం బాగుంది అని చెప్పాము అంటే బాగోపోయిన బాగుంది అన్నారు నేను బాధపడకూడదు అనే కదా..

రేపటి నుంచి ఇంకా జాగ్రత్తగా చేయాలి అని ఆలోచిస్తారు. మనం చేయాల్సిన అంత చిన్న చిన్న మాటలే రా..  అది చాలు కుటుంబం సంతోషంగా వెళ్లిపోతుంది.  మన సంసారం హాయిగా ఉంటుంది.

సూర్య తండ్రిని అబ్బురంగా చూస్తూ.. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు.

విక్రమ్ నవ్వుతూ జీవితమే అన్నీ నేర్పిస్తుంది.. ప్రతిదీ పుస్తకాల్లో ఉండవు.  యూనివర్సిటీస్ చెప్పవు. కుటుంబం నేర్పిస్తుంది.

నువ్వు రోజు వెనకాలే తిరుగుతూ ఇలా చేయి ఇలా చేయి అంటే ఎవరికైనా విసుగొస్తుంది. అదే నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో నిన్ను చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు.

మా తాతగారిని చూసి మా నాన్నగారు... మా నాన్నగారిని చూసి మేము అంతే.. నా నుంచి నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకోవాలి అంటే నేను కరెక్ట్ గా ఉండాలి.

నేను కరెక్ట్ గా లేకుండా నువ్వు అలా ఉండు..  ఇలా ఉండు..  అని చెప్పితే అర్థమే లేదు.

తండ్రిని చూసి బయట ప్రపంచం లో కొడుకు నేర్చుకుంటాడు. తల్లిని చూసి కూతురు ఇంటిలో నేర్చుకుంటుంది.

నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావో లేదో కానీ మీ అత్తయ్య అయినా..  పిన్నులైనా ఎవరైనా సరే... సరదాగా ఇంట్లో భర్తల్ని ఏడిపిస్తూ గొడవ గొడవ చేస్తారు కానీ బయట ఎక్కడ తగ్గనివ్వరు.

అందుకే మేమందరం వాళ్లకి అలా సరెండర్ అయిపోతుంది. లేకపోతే మీ నివి అత్త గోలకి కి మీ రాజ్ మావయ్య ఎప్పుడో అని నవ్వుతాడు.

సూర్య కూడా ఆ నవ్వులో శృతి కలిపి థాంక్యూ నాన్న. మీతో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటాను.
సరే నాకు టైం అవుతుంది. క్యూటి వెయిట్ చేస్తూ ఉంటుంది అని  అమ్మ అరుస్తూ వెళ్తాడు. కిచెన్ లో ఉన్న అవని ఎందుకురా అలా అరుస్తున్నావు.

మెడ చుట్టూ చేతులు వేసి.. నీ కోడలతో కలిసి బైక్ మీద టుడేస్ ట్రిప్ కి వెళుతున్నాను. గరిటి పుచ్చుకొని వెనక్కి తిరుగుతుంది.

ఎందుకు అమ్మ  అలా చూస్తున్నావు.  ఎక్కడికి రా పెళ్లికి ముందు తిరిగేది. అయ్యో అమ్మ.. మేము వెళ్ళేది అన్నవరం.

నీ కోడలికి ప్రతిదీ సెంటిమెంటే. మన కంపెనీతో తన ప్రాజెక్ట్ ఓకే అయింది కదా.. అన్నవరం వెళ్ళాలి అని తన కోరిక.
ఎప్పుడూ వాళ్ళ నాన్నగారు ఉండేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కదా.  ఒక్కతే వెళ్లడానికి భయపడుతుంది. మొహమాటపడుతుంది. అది అర్థం చేసుకుని నేనే ఒక అడుగు ముందుకు వేశాను.

తప్పా అమ్మ నీ కోడలు కోరిక తీర్చడం.  ఫేస్ అమాయకంగా పెట్టి అడుగుతాడు.  వెంటనే గరిట పక్కన పెట్టి.. తప్పు లేదురా తీసుకువెళ్ళు.

కానీ జాగ్రత్త. అమ్మాయి ఏమి ఇబ్బంది పడకుండా చూడు. సరేనా.  అందుకే అమ్మ నువ్వంటే నాకంత ఇష్టం. పరిస్థితిని చక్కగా అర్థం చేసుకుంటావు అని బుగ్గన ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు.
వెళుతున్న కొడుకుని చూసి నవ్వుకుంటుంది.
సూర్య రెడీ అయ్యి బ్యాగ్ తో కిందకి వచ్చి.. రాయల్ ఎంఫిల్డ్ క్లాసిక్ 350 తీస్తాడు . అది చూసి నవ్వుకుంటూ ఈరోజు నా క్యూటి నోరు వదిలేస్తుంది.

రోజు నార్మల్ బైక్ లో వచ్చి ఈరోజు ఈ బైక్ ఏమిటా అని కూడా అడుగుతుంది. వైభవ్ చూస్తూ ఉంటాడు.  ఏంట్రా ఆ చూపు..

నువ్వు మాత్రం మా బాబితో రయ్.. రయ్..అని వెళ్ళిపోతున్నావు.  కానీ నేనే... మేము వచ్చేటప్పటికి సెట్ చేసుకో.

మూడు జంటలు కలిసి ఇంకో ట్రిప్ వేయవచ్చు. బాయ్ అని బైక్ ని ముందుకి దూకిస్తాడు.

చలో హైదరాబాద్ టు వైజాగ్ ?️?️...
[+] 6 users Like SivaSai's post
Like Reply

Part - 91



విశి బ్యాగ్ సర్దుకొని రెడీ అయ్యి సూర్య కోసం చూస్తూ ఉంటుంది. అబ్బాయిని ఎక్కువ ఇబ్బంది పెట్టకు. నీ మనసులో మాట క్లియర్గా చెప్పు.

అమ్మ  భయం వేస్తుంది.  ప్రేమ ఉన్నచోట భయమే ఉంటుంది.  కానీ భయపడుతూ ఉంటే ప్రేమ ఎలా గెలుస్తుంది.

నేను చెప్పిన తర్వాత సార్ నో అంటే... అంటారని నువ్వు అనుకుంటున్నావా.  అనరు కానీ... నీ మీద ఒక సింపతితోనే ఇవన్నీ చేశాను అంటే తట్టుకోలేను అమ్మ.

నీకు నువ్వే ఏదో ఊహించేసుకుని మీ దేవా సార్ ప్రేమని అనుమానించకు. మీ దేవా సార్ కి కూడా నువ్వంటే ప్రేమే. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో మీ సార్ కూడా అలాగే ఆలోచించవచ్చు. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి.

నేహా గుమ్మం దగ్గరే ఉంటుంది. రా నేహా అని భానుమతి పిలిస్తే.. విన్నాను.  అమ్మ చెప్పింది నిజమే.  దేవా కీ నువ్వంటే చాలా ఇష్టం.

ఈ ట్రిప్ నుంచి వచ్చేలోపు ఇద్దరు మనస్సులు విప్పుకొని మాట్లాడుకుని మా ముందుకు శుభవార్తతో రండి.
మేము పెళ్లి ముహూర్తాలతో సిద్ధంగా ఉంటాము. ఆంటీ అని సిగ్గుపడితే ఇలా సిగ్గుపడుతూ ఉంటే కష్టం.

భాను మీరు మిగిలిన పనులు చూసుకోండి. విశి కి నేను కొన్ని టిప్స్ చెప్తాను. సరే అని భానుమతి అక్కడ నుంచి వెళుతుంది.

భానుమతి వెళ్లిన వెంటనే, నేహా తలుపు మూసి విశి దగ్గరకి వచ్చి రెండు చేతులు నడుముపై పెట్టుకుని..

ఎలా చెబుతానో అని టెన్షన్ పడుతున్నావు కానీ, డైలాగ్ కంటే ఫీలింగ్ ముఖ్యం. నీ కళ్లే హాఫ్ వర్క్ చేస్తాయి.

నాకు చెప్పే టైంలో వోయిస్ కంపించేస్తుంది ఏమో అని భయం వేస్తుంది ఆంటీ.
ఆ కంపించడం అందంగా ఉంటుంది.  పాపం..  అబ్బాయిలు నిజమైన భావాలు ఉన్నప్పుడు వచ్చే ఆ చిన్న వణుకు చూసి మరీ మెదిలిపోతారు.
కానీ… నువ్వు మాత్రం కనీసం ఇలా మూడు పాయింట్లు ఫాలో అవ్వాలి.

క్యూట్, సింపుల్, వర్కౌట్ అయ్యే టిప్స్.

ఏమిటి అర్థం కాలేదా సరే అయితే క్లియర్ గా చెబుతాను విను..

మొదటే ‘ఐ లవ్ యు ’ బాంబు వెయ్యకు. మొదట ఇలా చెప్పు...
సార్‌ మీతో మాట్లాడాలి… ప్లీజ్ నేను చెప్పేది మనసుపెట్టి వినండి.  ఇలా నువ్వు సీరియస్‌గా చెప్తే వాళ్ల అటెన్షన్ నీ మీద ఫిక్స్ అయిపోతుంది.

నీ గురించి నీకు పూర్తిగా తెలుసు..
నేహా విశి చిన్‌కి చిన్నగా తట్టి...
నువ్వు అందంగా ఉన్నావ్… ఇంటెలిజెంట్… లవింగ్… ఇవన్నీ దేవా కి తెలిసే ఉన్నాయి.
కాబట్టి నా మాట వినాలి సార్… ఈ విషయం మీకు చెప్పడానికి నేను భయపడుతున్నాను కానీ చెప్పాలి అని నిజాయితీగా చెప్పు.
నిజాయితీకి ఎవరు తల ఒగ్గరు చెప్పు..

క్లైమాక్స్ సింపుల్‌గా, నీ స్టైల్లో..
అంతా చెప్పాక, ఒక చిన్న రోస్ తీసుకో…
అప్పుడే నువ్వు ఇలా చెప్పు..

నన్ను మీరు.. ప్రేమగా చూస్తారు అనిపిస్తుంది. మీ మాటల్లో మీ చూపుల్లో నా పైన ప్రేమే కనపడుతుంది. అదే నిజం అని నామనసు చెబుతుంది అని ఇంకా నీకు ఏమేమి అనిపిస్తుందో అదే ఆ ఫ్లోలో చెప్పేసేయ్.
అంతే.

ఆంటీ అని సిగ్గు పడితే.. హ.. ఇలా సిగ్గుపడు.
ఇలా సిగ్గుగా, సాఫ్ట్‌గా చెప్తే దేవా కరిగిపోతాడు.

నేహా చెప్పింది వినేసరికి  విశి చెవుల వరకూ ఎర్రబడిపోతుంది.

విశి చిన్నగా … ఇలా మాట్లాడగలనా నేను..

నేహా.. చిన్నగా జుట్టు సరిచేస్తూ...
తప్పకుండా మాట్లాడగలవు.  ప్రేమ నీది.. భయం నీది. అలాగే దేవా కూడా నీ వాడే..
మరి… దేవా సార్ నిన్ను చూసే చూపు… నేను పది సార్లు గమనించాను.
ఆ చూపు ప్రేమ లేకుంటే రాదు.
కాబట్టి నీ పని ఒక్కటే..  భయంతో పాటు ధైర్యాన్ని కూడా తీసుకెళ్లు.

విశి లోతుగా ఊపిరి తీసుకుంటుంది.
థాంక్స్ ఆంటీ అని హాగ్ చేసుకుంటుంది.

పిచ్చి పిల్ల..  ఈ ట్రిప్  నుంచి వచ్చేసరికి…
నీ చీక్స్ మీద ఈ సిగ్గు, నీ కళ్లలో ఈ వణుకు, నీ పెదవుల మీద ఆ చిన్న నవ్వు  అన్నీ సార్‌కే చెప్పి వస్తాయి.
నువ్వు ఒక్క ‘స్టార్ట్’ చేయ్… ఆ తర్వాత దేవా హ్యాండిల్ చేసుకుంటాడు.

విశి గమ్మత్తుగా నవ్వుకుంటుంది.
బ్యాగ్ మూసి పట్టుకునే టైంలో… చేతులు ఇంకా కొంచెం వణుకుతూనే ఉంటాయి.

భానుమతి గది దగ్గరకు వచ్చి మీ దేవా సార్ వచ్చారు. హా వస్తున్న అని గదిలో నుంచి బయటికి వస్తుంది. దేవా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే..

వెళ్ళొస్తాము అంటీ..  విశిని జాగ్రత్తగా తీసుకువెళ్లి తీసుకువచ్చే బాధ్యత నాది..  వెళదామా.  సరే అని తల్లి వైపు చూస్తోంది.  కళ్ళతోనే ధైర్యం చెబితే.. నేహా ఆల్ ద బెస్ట్ అని హాండ్స్ తో చూపిస్తుంది.

బైక్ దగ్గరికి వచ్చి చూస్తూ నిలబడిపోతుంది. ఏంటి అలా చూస్తున్నావు.  మీరు రోజు వచ్చేది దీనిమీద కాదు కదా..ఆ బైక్ మీద అంత దూరం జర్నీ చేయగలమా..

డ్రైవింగ్ కష్టమే వెనక కూర్చునే నీకు కష్టమే. ఇది అయితే కంఫర్ట్ గా ఉంటుంది. లగేజ్ కూడా ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు.

లగేజ్ వెనకాల గట్టిగా కట్టి బైక్ స్టార్ట్ చేస్తాడు. విశి ఒక పక్కకి కూర్చోబోతు ఉంటే.. హలో మేడం మనమేమి కాలేజీకి వెళ్లడం లేదు. టూ సైడ్స్ కి కూర్చో ఇబ్బంది లేకుండా ఉంటుంది.

విశి ఆలోచిస్తూ ఉంటే సూర్య బైక్ రైస్ చేస్తూ ఉంటాడు. సరే అని టూ సైడ్స్ కి కూర్చుని వెనక హ్యాండిల్ పట్టుకుంటుంది.

ఇద్దరూ బైక్ మీద వెళుతూ సిగ్నల్ దగ్గర ఆగుతారు. సూర్య ఏదో చెబుతూ ఉంటే విశి నవ్వుతూ ఉంటుంది. ఆపోజిట్ లో వెళుతున్న గౌతమ్ వీళ్లిద్దరినీ చూస్తాడు.

బైకు, లగేజ్ చూస్తూ ఉంటే ఇద్దరూ ఎక్కడికో వెళుతున్నట్టున్నారు. నేను చెయ్యి పట్టుకోవాలని చూసినా టచ్ మీ నాట్ అన్నట్టు ఉండేది.

వీడితో మాత్రం ఇకఇకలు..  పకపకలు.  చూస్తాను ఎంత దూరం వెళతావో అని సిగ్నల్ పడగానే కార్ స్టార్ట్ చేస్తాడు.

శ్రీకర్ సౌమ్యని బ్రతిమాలికొనే ప్రోగ్రాంలో ఉంటాడు.  బుజ్జి తలుపు తీయవే.. నా బుజ్జి పప్పీవి కదు.. నా బంగారం కదు.

కొంచెం తలుపు తీసి.. అయ్యో సార్ మీ మీద అంటే నమ్మకం ఉంటుంది. మళ్లీ నాతో తిరిగితే ఆ నమ్మకం ఏమైపోవాలి చెప్పు.

అందుకే పెళ్లి అయ్యే వరకు నువ్వు నువ్వే.. నేను నేనే అని మళ్ళీ తలుపు వేస్తుంది. ఏదో సరదాగా అన్నాను నీ గురించి నాకు తెలియదా..

మావయ్యకి నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది కదా..  అలాగే నన్ను నమ్మాలని అలా చెప్పాను అంతే. కావాలంటే  మావయ్యని అడుగు అని ఏం మావయ్య అంతే కదా అని రిక్వెస్టింగ్ గా చూస్తాడు.

  భరత్... విద్యా అని పిలిస్తే.. చెప్పండి అంటుంది. నాకు మంచి స్వీట్ చేసి తీసుకుని రా..  ఈ ఆనంద సమయంలో స్వీట్ ఎంజాయ్ చేయాలి.

మావయ్య అని ఏడుపు మొఖంతో పిలుస్తాడు. ఏంట్రా..  నువ్వు చెబితే వింటుంది.  ఒరేయ్ మనుషుల మధ్యన, బిజినెస్ లో రాయబారాలు ఉండొచ్చు గాని ప్రేమలో అస్సలు రాయబారం ఉండకూడదు.

ఈరోజు నువ్వు నా కూతుర్ని ఎలా కన్విన్స్ చేస్తావో చూస్తాను. నా కూతురు కన్విన్స్ అయ్యి బయటకు వచ్చి నిన్ను గనక ఎక్స్క్యూజ్ చేస్తే..  బంపర్ ఆఫర్.

ఏంటి మావయ్య... ఆఫర్ ఏమిటో చెప్పు.  దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను.
చెబితే ఇక్కడే పడిపోతావేమో..  పడిపోతే పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా.  చెప్పు అని మోకాళ్ళ మీద కూర్చుని అడుగుతాడు.

సూర్య వెళ్లినట్టే.. మిమ్మల్ని పంపిస్తాను.  నిజంగా మావయ్య అని కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ అడుగుతాడు. నేను ఎప్పుడైనా మాట తప్పానా..

అయితే చూసుకోండి మావయ్య. ఒక్క అరగంటలో నీ కూతురు బయటకి వస్తుంది. అది చూస్తాను అని అక్కడే కూర్చుంటాడు.

మీరు ఇక్కడే కూర్చుంటే సౌమ్య ఎలా బయటకు వస్తుంది. అది నీ ప్రాబ్లం నాది కాదు.  ఇదే మరి..  ఎదురుగా తీపి పెట్టి తిను అని దాని చుట్టూ కాపలాగా కుక్కని పెట్టినట్టు ఉంది.

ఒరేయ్ నన్ను కుక్క అంటావా..  ఛీ..  ఛీ..  మిమ్మల్ని కాదు మావయ్య అలాగుంది అని చెబుతున్నాను అంతే.

వెళితే నాకేంటి రా.. రేపు పుట్టబోయే నా కొడుక్కి నీ పేరే పెట్టుకుంటాను.  ఇది కొంచెం ఎక్కువ అవ్వలేదా.. ప్లీజ్ మావయ్య..

సరే అని ఆఫీసు రూమ్ లోకి వెళ్ళిపోతాడు.  హమ్మయ్య అనుకుని ఫస్ట్ మెసేజ్ పంపిస్తాడు.  ఇక్కడ మావయ్య లేడు వెళ్ళిపోయాడు అని దానికి యాంగ్రీ ఎమోజి పంపిస్తుంది.

ప్లీజ్ బుజ్జి పప్పీ  తలుపు తీయవే.. ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. నీకు ఏది కావాలంటే అది కొంటాను. నిన్ను ఎప్పుడు ఎక్కడకి తిప్పమంటే అలా తిప్పుతాను.

అయినా తలుపు తీయదు. ఏం చేయాలో అర్థం కాక  ఆలోచిస్తూ..  విక్రమ్ అంకుల్ అయితేనే కరెక్ట్ గా దీనికి సొల్యూషన్ ఇవ్వగలరని విక్రమ్ కోసం పరుగు పెడతాడు.

లాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నా విక్రమ్.. ముందు ఆయాస పడుతూ మోకాళ్ళపై కూర్చుంటాడు.  ఏంట్రా ఏమైంది అని కంగారుగా అడిగితే..

ప్లీజ్ అంకుల్ చిన్న హెల్ప్ కావాలి. ఏం కావాలి. ముందు పైకి లేగు..  అంకుల్ ఆడవాళ్ళని ఎలా కూల్ చేయాలి.

ఆ ప్రశ్నకి పైనుంచి కిందికి చూస్తూ ఉంటాడు.  ఏంటి అంకుల్ మాట్లాడకుండా చూస్తున్నారు. ఇది నువ్వేనా అని డౌట్ వచ్చి..

నేనే... నాకే కావాలి.  దేనికి రా.  అబ్బా ప్లీజ్ చెప్పండి. ముందు ప్రాబ్లం ఏమిటో చెబితే దాని తగ్గ సొల్యూషన్ చెప్పొచ్చు.

ఆడవాళ్ళని కూల్ చేయడం అంటే చాలా రకాలు ఉంటాయి. ఇంతకీ నీకు ఏ టైప్ కూలింగ్ కావాలి.

అక్కడే కింద చతికిలపడి జరిగింది మొత్తం చెప్పి తల పైన చెయ్యి వేసుకుంటాడు.

శ్రీకర్ చెప్పిన దానికి విక్రమ్ గట్టిగా నవ్వుతాడు. ప్లీజ్ అంకుల్ మీరు అలా నవ్వకండి.  సొల్యూషన్ మాత్రమే చెప్పండి.

విక్రమ్ ఏం చెబుతాడు.......
[+] 6 users Like SivaSai's post
Like Reply

Part - 92



ప్లీజ్ అంకుల్ మీరు అలా నవ్వకండి.. సొల్యూషన్ మాత్రమే చెప్పండి అని శ్రీకర్ దిగులుగా అడిగితే.. ఓ మై గాడ్ శ్రీకర్ నువ్వు ఇలా అయిపోతావు అని అస్సలు ఊహించలేదు తెలుసా..

అందుకే అంటారు  ఏమో.. ఎంతటి వారైనా కాంతాదాసులే అని.. ఇప్పుడు మీరు కొటేషన్స్ చెప్పడం అవసరమా..

సరే ఇప్పుడు నీకు ఏం కావాలి..సౌమ్య ని ఎలా కూల్ చేయాలో చెప్పండి అంకుల్ ప్లీజ్ ప్లీజ్. తనకు ఏది ఇష్టమో అది చెయ్యి.

అయ్యో చేద్దామని ట్రై చేస్తున్నాను బట్ అది కోపరేట్ చేయడం లేదు. ఏయ్..  అంకుల్ మీరు డబల్ మీనింగ్ కి వెళ్ళకండి.

షాపింగ్ తీసుకెళ్లడం అనుకున్న..  బట్ అది తలుపులు వేసుకుని కూర్చుంది. అయితే ఒక పని చెయ్యి.. అని  చెవిలో చెబుతాడు. అందుకే అంకుల్ మీరు సూపర్ అనేది అని కిచెన్ లోకి పరుగు పెడతాడు.

కిచెన్లో ఉన్న లేడీస్ అందర్నీ బయటికి గెంటేస్తాడు. ఏమైంది వీడికి. వెనకాల వచ్చిన విక్రమ్ ప్రియసఖి కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఆ మాటకి విద్య నోరు వదిలేసి చూస్తుంది. ఏమైందిరా అని విక్రమ్ అడిగితే...  అన్నయ్య మీ బావమరిది ఎప్పుడు నా కోసమేమీ ఇలా చేయలేదు.

చూడండి నా అల్లుడు అప్పుడే కాబోయే భార్య కోసం ఎంత చేస్తున్నాడో అని మెటికలు విరుస్తుంది.

అప్పుడే అక్కడికి వచ్చిన భరత్ గుర్రుగా శ్రీకర్ ని చూస్తాడు. పక్కనే ఉన్న  వినయ్ ఎందుకు బావ నీ అల్లుడిని అంత ప్రేమగా చూస్తున్నావు.

అల్లుడు అవ్వకముందే మా మధ్యన పుల్లలు పెడుతున్నాడు.  వాడికి టాస్క్ ఇచ్చింది ఎవరు? నువ్వే కదా..  మళ్లీ ఎందుకు హైరానా పడుతున్నావు.

నేనిచ్చింది నా కూతుర్ని కూల్ చేసుకోమని... అంతేగాని మా ఆవిడ మనసుని నా వైపుకు రివర్స్లో తిప్పమని కాదు.

ఇది దారుణం కాదా బావ.  దేనికి రా..  నీ కూతుర్ని మాత్రం ఉఫ్.. ఉఫ్..  అని చూడాలా..  అదే మా చెల్లి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మా చెల్లి  నిన్ను ఉఫ్.. ఉఫ్.. అని చూడాలా..

అంతే కదా..  మామాటే పైనుంటే మాకు అదో తృప్తి.

శ్రీకర్ కిచెన్ లో కుస్తీ పడుతూ ఉంటే వినయ్ శ్రీకి లైవ్ పెడతాడు..అది చూసి నేహా కోపంగా శ్రీ వైపు చూస్తుంది. ఏమిటి శ్రీమతి నాపై అంత ప్రేమ కలిగింది.

అలా చూస్తున్నావు.. అక్కడ మీ సుపుత్రుడిని చూడండి. చూస్తున్నాను కదా..  ఏం చేస్తున్నాడు.   వంట చేస్తున్నాడు. అదే ఎందుకు చేస్తున్నాడు.

ఎందుకు అంటే..  సౌమ్య అలిగిందంట.  కూల్ చేసుకోవాలని వాడి తాపత్రయం.  వెంటనే పక్కన కూర్చున్నది లేచి  పైట కొంగుని నడుం దగ్గర దోపుకుని ఏరోజైనా మీరు నా కోసం అలా చేశారా..

ఎట్లిస్ట్ ఒక కప్పు కాఫీ, టీ ఏదైనా చేసి ఇచ్చారా.. లేదే.. అలిగిన అరిచినా కోప్పడిన ఏదైనా నేనే చేయాలి. అక్కడ నా కొడుకుని చూడండి.

ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత తాపత్రయ పడుతున్నాడో.. మీరు ఉన్నారు ప్రేమించాను ప్రేమించానని చెప్పి అన్ని నాతోనే చేయించుకుంటున్నారు.

మావయ్య అనుకుంటూ వెళ్ళిపోతుంది.. అంతే... కొడుకు వైపు కోపంగా చూస్తూ ఒరేయ్ నీ ప్రేమ సంగతి ఏమోగాని మా మధ్యన చిచ్చు పెడుతున్నావు రా.

ఒరేయ్ వినయ్ గా నువ్వు ముందు ఆపేయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.

కట్ అయిన ఫోన్ చూసి వినయ్ నవ్వుకుంటూ ఉంటే.. ఏమైంది అని భరత్ అడుగుతాడు.. అక్కడ నేహ చేతిలో శ్రీకేదో గట్టిగా ముడినట్టు ఉంది.

నీకు ఇదేమి ఆనందం రా.. అదో కిక్కు బావ. ఆ వైభవ్ గాడు అలా ఉండడంలో తప్పే లేదు.. మీ ఇద్దరితో పూజిత ఎలా వేగుతుందో ఏమిటో..  రేపు చందు బలి.

పో బావ..  నువ్వు అన్ని అలా నిజాలు చెబుతావు.  అందుకే ఐ లైక్ యు అని..  నీ అల్లుడు ఏం చేస్తున్నాడో చూద్దాం పద అని కిచెన్లోకి వెళ్తాడు.

శ్రీకర్ పక్కన నిలబడి ఏం చేస్తున్నావు నాన్న. ప్లీజ్ అంకుల్ డిస్టర్బ్ చేయకండి. ఏం వెరైటీలు చేస్తున్నావు. చూపించవచ్చు కదా..  స్మెల్ మాత్రం అదిరిపోతుంది.

చెమటలు తుడుచుకుంటూ ఒక స్వీట్ చేశాను.  రసం పెట్టాను.  ఇంకా ఆలూ ఫ్రై చేసి రైస్ పెట్టాను ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదు.

ఒరేయ్ నీ చెయ్యి కాలింది రా అని వేళ్ళు చూస్తే.. పర్వాలేదులే. దాని కోపం ముందు ఈ బర్నింగ్ పెద్ద నొప్పిగా లేదు.

ఏడ్చేవు ఒక్క నిమిషం ఉండు అని చెప్పి హ్యాండ్ వాష్ చేసి వెన్న రాస్తాడు. అంకుల్ నేనేమైనా ఆడపిల్లనా..  ఆడపిల్లలకైతేనే నొప్పి ఉంటుందా అని పట్టు అని మంట తగ్గిందా..

యువర్ సో స్వీట్ అంకుల్ అందుకే పూజిత ఆంటీ మీకు అలా పడిపోయింది. ఇప్పుడు నా వైపు టర్న్ తిరిగావా..  వెళ్లి  నీ లవర్ ని కూల్ చేసుకో.  అక్కడ మా బావ...నువ్వు ఎలా కూల్ చేస్తావా అని తెగ వేయిటింగ్.

మొత్తం అన్ని ట్రే లో నీట్ గా సర్ది..  పక్కనే రోజెస్ పెట్టి సర్వెంట్ ని పిలుస్తాడు.  అదేంట్రా నువ్వు పట్టికెళ్ళావా.  నా మొహం మీద తలుపేస్తూఉంటే..  ఇవి పట్టుకెళ్లిన చూస్తుందా.  ప్లేట్ విసురు కొడుతుంది.

అది నిజమేలే. ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం.  మన మగవాళ్ళు కష్టాలు ఎప్పటికీ తీరుతాయో అని డ్రామాటిక్ గా చెబుతాడు.

ఇది మీకు అస్సలు సూట్ అవ్వలేదు అంకుల్. అవునా..
ఫీలవుతున్నావ్ కదా నా ఒరిజినల్ వెర్షన్ లోకి వచ్చేస్తాను.

సర్వెంట్ ని పిలిచి ఆ ట్రే ఇచ్చి పంపిస్తాడు. సర్వెంట్ కి వెళ్లి తలుపు కొడితే... ఏమిటి అని గట్టిగా అరుస్తుంది.  మేడం మీ కోసం ఫుడ్ తీసుకోవచ్చాను. డోర్ తీయండి.

అది ప్రిపేర్ చేసిన వాడిని తీసుకుని రమ్మను. నువ్వు కాదు. అంతే...ఆ మాటకి వెనకాల నిలబడిన శ్రీకర్ దీనికి ఎలా తెలిసిందబ్బా అని ఆలోచిస్తూ..  సరే అని ట్రే వచ్చుకుని సర్వెంట్ ని  వెళ్ళమని కళ్ళతోనే చెబుతాడు.

శ్రీకర అ ట్రే పట్టుకుని తలుపు కొడతాడు.  ఎవరు అని అంటే..  నేనే బంగారం తలుపు తీయి. నా మీద కోపంతో నువ్వు ఏమి తినకుండా కూర్చుంటే ఎలా చెప్పు.

అసలే డాక్టర్ వి. ఆకలితో ఉంటే ఎన్ని ఇష్యూస్ వస్తాయో నీకు తెలుసు కదా.  నా బంగారం అలా బాధపడుతూ ఉంటే నేను చూడగలనా. తలుపు తీయరా అని బ్రతిమాలుతూ ఉంటాడు.

అది చూసి  భరత్ నోరు వదిలేస్తే.. విద్య మోచేతులతో మొగుడు పొట్టలో పొడుస్తు.. నా అల్లుడుని చూసి నేర్చుకోండి.

అప్పుడే నా కూతుర్ని ఎంత గారాబంగా చూస్తున్నాడో.. మీరు ఉన్నారు.  ఎప్పుడు చూసినా.. ఏయ్,  ఏంటే, తీసుకురా అని అరవడం తప్ప ఎప్పుడైనా అలా ప్రేమగా మాట్లాడారా.  పిలిచారా మళ్ళీ లవ్ మ్యారేజ్ అని మూతి తిప్పుకొని వెళ్ళిపోతుంది.

సౌమ్య తలుపులు తీస్తోంది.  హమ్మయ్య తీసావా..  నీకోసమే.. నా సహస్రాలతో వంట చేశాను. తెలుసు అని పక్కకి తప్పుకుంటుంది.

లోపలికి రావచ్చా అంటే కళ్లతోనే చెబుతుంది .థాంక్యూ అని వెనక్కి తిరిగి భరత్ ని చూసి కళ్ళు ఎగరేస్తాడు.


భరత్ పళ్ళునూరుతూ ఉంటే.. వినయ్ వచ్చి ఏంటి బావ వాడి క్యారెక్టర్ ఇది కాదే.. సౌమ్యనే వచ్చి బ్రతిమాలే వరకు బెట్టు చేస్తాడు.

అలాంటిది ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నాడు అంటే సంథింగ్ తేడా  జరిగింది బావ. ఏమి జరిగింది.  వాడు ఎలాగా టాస్క్ గెలవలేడు కదా అని నా కూతురుని కన్విన్స్ చేస్తే మిమ్మల్ని కూడా సూర్య ని పంపినట్టు పంపుతాను అన్నాను అంతే..

భరత్ ని పైనుంచి కిందకి చూస్తూ అది తెలివైన వాళ్ళు ఎక్కడో వెళ్లి పడతారంట.  అలాగుంది నీ గొడవ. నువ్వు ఏదో చేద్దామనుకొని.. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టు నీ కూతుర్ని వాడి చేతిలో పెట్టావు.

ఊరుకుంటాడా.. అందులో వయసులో ఉన్నవాడు. ఎలా దక్కించుకోవాలో తెలియదా ఏంటి బావ... వయసు అయ్యే కొలది నీ బుర్ర కూడా కిందకి దిగిపోతుందా ఏమిటి.

ఒరేయ్.. నాకసలే ఒళ్ళు మండిపోతుంది. నువ్వు ఇలాంటి అప్పుడు ఎదవ సెటైర్లు వేయకు. ఇదే మరి.. ఉన్నది చెబితే ఉలుకెక్కువ అంట.

అందుకే నా చెల్లి అలిగి వెళ్లినట్టుంది. ముందు వెళ్లి విద్యని కూల్ చేసుకో.  లేకపోతే... లేకపోతే ఏం చేస్తుంది.  కాసేపటికి విద్యనే వస్తుంది.

అదే నీకు అర్థమైంది.  ఆడవాళ్ళు చాలా సున్నిత మనస్సు కలవాళ్లు బావ. అప్పుడప్పుడు మనం ఆ మనసు మీద వెన్న, బట్టర్ రాస్తూ ఉండాలి.

ఏమిటి ఆలోచిస్తున్నావు బావ.  శ్రీకర్ గాడికి ఈ ఐడియా ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నా.  మాక్సిమం షాపింగ్ తీసుకువెళ్ళడానికి ట్రై చేయడం.. లేకపోతే  ఏ బొకే నో తెచ్చి బ్రతిమాలుతాడు అనుకున్నాను.

కానీ ఇలా కుకింగ్ చేసి నా కూతుర్ని కూల్ చేయొచ్చు అని ఐడియా ఎలా వచ్చిందంటావు. ఒకసారి అటు తిరుగు అని విక్రమ్ వైపు కి ఫేస్ తిప్పుతాడు.

అక్కడ మాధవి, లలితతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు.. అంటే ఇదంతా బావ పనా.. మరి సలహా ఇచ్చింది అన్నయ్య.

కిచెన్ లో జరిగేది మొత్తం సౌమ్యకి వీడియో కాల్ చేసి చూపించింది కూడా అన్నయ్యే.  లేకపోతే  ఎవరు చేశారో వాళ్ళనే తీసుకురమ్మని అని ఎలా చెబుతుంది.

విక్రమ్ ముందుకు వెళ్లి బావ అని కోపంగా పిలుస్తాడు. ఏమైందిరా  నువ్వు శ్రీకరర్ కి ఎందుకు సలహా ఇచ్చావు. నేనేమిచ్చాను రా..

నాకు అంతా తెలుసుగాని అని పక్కన కూర్చుంటాడు. ఒరేయ్ కూతురు పెళ్లి అవుతుంటే నువ్వు అలుగుతావేంట్రా..

నాకన్నా బాగా నీ చెల్లి అలుగుతుంది.. అల్లుడిని చూసి నేర్చుకోండి అని అలకపానుపు ఎక్కింది.. ఆ మాటకి నవ్వుతూ ఇప్పుడు నీ బాధంతా విద్య అలిగిందనా..


వెళ్లి కూల్ చెయ్. ఒక్కొక్కసారి మనం కూల్ చేసేది కూడా తర్వాత మంచి కిక్ ఇస్తుందని కన్ను కొడతాడు.

భరత్ రియాక్షన్.....
[+] 7 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: 4 Guest(s)