Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

పాణిగ్రహణం

Showing only the posts of SivaSai: 341 of 820 posts. Show all posts

Part - 93



నాకన్నా బాగా నీ చెల్లి అలుగుతుంది.. అల్లుడిని చూసి నేర్చుకోండి అని అలకపానుపు ఎక్కింది.. ఆ మాటకి నవ్వుతూ ఇప్పుడు నీ బాధంతా విద్య అలిగిందనా..


వెళ్లి కూల్ చెయ్. ఒక్కొక్కసారి మనం కూల్ చేసేది కూడా తర్వాత మంచి కిక్ ఇస్తుందని కన్ను కొడతాడు.

బావ అని నోరు వదిలేస్తాడు.  ఏంట్రా.  అసలు నీతో అవని ఎలా వేగుతుందో నాకు అర్థం కావడం లేదు.  ఆ మాటకి విక్రమ్ చిరుకోపంగా చూస్తే.. నువ్వు ఎలా చూసినా సరే.

ఈ వయసులో కూడా ఇంత రొమాంటిక్ ఆలోచనల.  నెత్తి మీద ఒకటి కొట్టి..  వయసుకి రొమాన్స్ కి సంబంధం ఏమిటి.

మన మనసు ఉల్లాసంగా ఉండడం ముఖ్యం. అయినా ఇప్పుడు నాకు పెద్ద వయసు ఏమైపోయింది. అవునవును అందరూ అదే అనుకుంటున్నారు. నీకోసం ఒక పెళ్లి సంబంధం కూడా వచ్చిందంట కదా..

అప్పుడే అవని అటూ వస్తూ ఆ మాటలు విని ఎవరికి పెళ్లి సంబంధాలు.  భరత్... విక్రమ్ వైపు చూసి నవ్వుతూ మనకి బాగా కావాల్సిన వాళ్ళకిలే.

అదే ఎవరు.  అత్తయ్య ఎవరికో పెళ్లి సంబంధం అంట.  విక్రమ్ తల కొట్టుకుంటూ పూర్తిగా వినవా..  పెళ్లి అనగానే ఎగురుకుంటూ పిలిచేస్తున్నావు.

  అయ్యో పెళ్ళంటే వినడానికి బాగుంటుంది. ఎవరికి అన్నయ్య..  ఎవరుకో అయితే నేనెందుకు చెబుతాను చెల్లెమ్మ. మీ ఆయనకే.

ఆ మాటకి అవని ఉగ్రరూపం దాల్చి మీ మగాళ్ళ అందరికీ ఏమయింది.  సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నారా..  మొన్న రాజ్ అన్నయ్య.. ఇప్పుడు మీరు.

ఏం తక్కువ అయ్యింది అని రెండో పెళ్లి మాట  ఎత్తుతున్నారు హా అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మాధవి ఎందుకే అలా అరుస్తున్నావు.

చూడు అమ్మ మీ అల్లుడికి రెండో పెళ్లి కావాలంట. ఆ మాటకి భరత్ నవ్వుతూ ఉంటే విక్రమ్ చేతులు కట్టుకుని సీరియస్ గా చూస్తూ ఉంటాడు.

అవని తల మీద ఒకటి వేసి.. నువ్వు ఎవరినైనా అనుమానించు గాని నా మేనల్లుడు అనుమానిస్తే బాగోదు. వాడు మేలిమి బంగారం.

ఎవరు ఏది చెప్తే అది నమ్మేయడమేనా అంతే... ఆ మాటకి అవని విక్రమ్ వైపు చూసి తన గోక్కుంటూ తింగరి నువ్వు నవ్వుతుంది.  విక్రమ్ సీరియస్గా లేచి వెళ్ళిపోతాడు.

భరత్ వైపు కోపంగా చూస్తే..  ఏంట్రా.. ఎందుకన్నయ్య ఇలా ఇరికించావు.  లేకపోతే నా కూతుర్ని ఎలా కూల్ చేసుకోవాలా అని  పెళ్లికి ముందే నా అల్లుడికి ట్రైనింగ్ ఇస్తున్నాడు.

మంచిదే కదా..  ఏం మంచిది.  వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్లారు ఇక్కడ నాకు టెన్షన్.  శ్రీకర్ మీద అలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

మన సౌమ్య మీద పెట్టుకోవాలా..  ఛీ.. ఛీ.. నా ఉద్దేశం అది కాదు. ఎప్పుడైనా స్టెప్ అబ్బాయిలే కదా అని. ఉండు అన్నయ్య.. ఇప్పుడు మా ఆయన కూల్ చేసుకోవాలి అని పరుగుపడుతుంది.

శ్రీకర్ ట్రై తో గదిలోకి వెళతాడు.  సౌమ్య అక్కడ సోఫాలో కూర్చుని చేతివేళ్లు చేసుకుంటూ ఉంటే..  బంగారం అని పిలిస్తే ఒక లుక్ ఇస్తుంది.

భోజనం బంగారం. ఎలా చేయాలి? నువ్వు అలాగా ఒలింపిక్ జ్యోతి లాగా ట్రై చేతిలో పెట్టుకొని ఉంటే నేను అక్కడికి వచ్చి నిలబడి తిననా?

అయ్యో నీకెందుకు అంత శ్రమ.  టేబుల్ మీద పెట్టి ప్లేట్లో అన్ని వడ్డించి ఇస్తాడు.  మళ్ళీ చూస్తూ ఉంటే.. ఏమైంది. కూర్చో అని కళ్ళతో చెబుతోంది.

సరే అని పక్కనే కూర్చోంటాడు.  ఇది కొంచెం ఎక్కువ అవ్వలేదా.. ఏది బంగారం.  నువ్వు ఇలా ఓవర్ ఓబీయిడింట్ గా ఉండడం.

నచ్చలేదా..  కొంచెం ఎక్కువ అయింది. ఆ ప్లేట్ తీసుకొని కలిపి ముద్ద శ్రీకర్ నోటు దగ్గర పెడుతుంది. అయ్యో నీకోసం చేశాను.  మూసుకుని తిను. నీ వేలు కాలింది కదా..

నీకెలా తెలుసు.  మాకు అలాగే తెలుస్తాయి లే గాని తిను అని తినిపిస్తుంది.  మరి నువ్వు శ్రీకర్ కి తినిపిస్తూ తను తింటుంది.

భోజనం అయిన తర్వాత ఆ వేలుకి ఆయింట్మెంట్ రాసి వచ్చిన పని అయింది కదా ఇంకా వెళ్ళు.  బంగారం అలా ఎలా వెళ్ళిపోతాను.  నువ్వు కూల్ అవ్వాలి కదా..
కూల్ చేసుకునే ప్రాసెస్లో పడతాడు.

ఇక విశిష్ట సూర్య బైక్ మీద ట్రావెలింగ్ మొదలు పెడతారు.
సూర్య ఫుల్ కాన్ఫిడెన్స్ తో డ్రైవ్ చేస్తుంటాడు.
విశిష్ట గాలి ఇయర్ పక్కగా కొడుతుంటే ఎంజాయ్ చేస్తుంది.

మీ డ్రైవింగ్‌పై ఇంత నమ్మకం ఎలా పెరిగింది సార్..

సూర్య నవ్వుతూ నీ నమ్మకం వల్లే పెరిగింది.

ఆ ఒక డైలాగ్ ఆమెను సైలెంట్ చేస్తుంది.
చిన్న బ్లష్, కానీ వెంటనే సర్దుకొని..
అయితే సేఫ్ గా డ్రైవ్ చెయ్యాలి. నేను చిన్నగా అయినా దెబ్బ తింటే… మీకే మొదటి చెబుతాను నేనుండగా నీకు దెబ్బ తగలని ఇస్తాన.

దాంతో ఆమె చిరునవ్వు పెంచుకుంటూ బైక్ మీద కంఫర్ట్‌గా సెటిల్ అవుతుంది.

హైదరాబాద్ దాటి ఓపెన్ హైవేలోకి వెళ్ళాక…

దేవా సార్, ఒక సాంగ్ ప్లే చెయ్యరా..
నేను డ్రైవింగ్ లో ఉన్నాను. నీకు నచ్చిన సాంగ్ పెట్టు.

విశిష్ట ప్లే చేసే మొదటి పాట..  సాఫ్ట్ రొమాంటిక్ ట్రాక్.
సూర్య తల తిప్పి చూస్తాడు.

నీ ప్లేలిస్ట్‌ కూడా నీకు తగ్గట్టుగానే ఉన్నాయి... సైలెంటుగా ఉంటూ లోపల మాత్రం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.

విశి సూర్యనే చూస్తూ.. మీకు ఏం తెలుసు… నా ఎమోషన్స్ అన్నీ.

అందుకే నేనే అర్థం చేసుకుంటాను.

మళ్లీ ఆ ఇద్దరూ సైలెంట్.
కానీ ఆ సైలెన్స్‌లోనే దగ్గరితనం ఉంటుంది.

ఒక చిన్న హైవే షాప్ దగ్గర ఆపుతాడు సూర్య.

సూర్య బైక్ స్టాండ్ వేస్తూ:
పాదాలు స్ట్రెచ్ చెయ్. చాలా దూరం వెళ్ళాలి ఇంకా.

విషిష్ట కప్పు పట్టుకుని చూస్తుంది...
ఆమె జుట్టు, బైక్ రైడ్ గాలి వల్ల అన్నీ స్కాటర్ అయ్యాయి.

సూర్య నవ్వుతూ... ఓహో హీరోయిన్లా వచ్చేశావే.

విశి తన రిఫ్లక్షన్ ‌లో జుట్టు సెట్ చేస్తూ:
నేను అందంగా ఉండటం మీకు ప్రాబ్లమా?

ప్రాబ్లం కాదు… కాన్సంట్రేషన్ కాస్త డిస్టర్బ్ అవుతుంది అంతే.

విశిష్ట దగ్గరగా వచ్చి నెమ్మదిగా చెప్పుతుంది.
కానీ మీకు ఏ మాత్రం తప్పు దారిలో కాన్సంట్రేషన్ పోనివ్వను… మీరు డ్రైవ్ చేయాలి కదా...

మిమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లి మీ పేరెంట్స్ కి అప్ప చెప్పాలి కదా..

సూర్య ఒక చిన్న ప్రౌడ్ స్మైల్.
అతను ఆమెను గౌరవంతోనే చూస్తాడు.
అది లవర్ లుక్ కాదు,
ఫ్రెండ్షిప్ కి మించి ఉన్న ట్రస్ట్ లుక్.
మళ్లీ ఇద్దరూ జర్నీ స్టార్ట్ చేస్తారు కొంచెం దూరం వెళ్ళిన తరువాత...  సూర్య వేగం తగ్గిస్తాడు.

నువ్వు అలిసిపోయావా?
లేదు సార్ మీ మీద వాలి ఉన్నాను.  ఇంకా మీరే అలసిపోయిఉన్నారు.
మీకు అలసటగా లేదా నువ్వు నా పక్కన ఉంటే అలసట ఏముంటుంది అని మనసులో అనుకుంటూ..నాకు అలవాటే అని చెబుతాడు. మీరు లేకపోతే నాకే జర్నీ చాలా కష్టం అయ్యేది.
చెప్పాను కదా… సేఫ్ గా తీసుకెళ్తానని.

నమ్మేను.
మీతో రైడ్… ఏ ప్రయాణమయినా ఓ కథల్లా ఉంటుంది.

సూర్య బైక్‌ను కొంచెం స్లో చేస్తాడు.
వాతావరణం కూల్ … చుట్టూ పచ్చటి పొలాలు.

విశిష్ట అతని భుజానికి సైలెంట్‌గా తలను ఆనిస్తుంది.
అతను ఏ మాటా మాట్లాడడు,

అదే రెస్పెక్ట్.
అదే లవ్.
అదే ఫ్రెండ్షిప్ బాండ్.

వీరి ప్రయాణం ఏ తీరానికి చేరనందో...
కథ కొనసాగుతుంది.....

[+] 8 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(01-05-2026, 09:31 AM)ash.enigma Wrote:  ade waiting bhayya!!
.. mana Sivagare oorlo edo function lo unnaru.. internet issues ani edo chepparu kada!!

next update kosam waiting!!

Update is Coming Within 1 Hour
Like Reply

(01-05-2026, 09:31 AM)ash.enigma Wrote:  ade waiting bhayya!!
.. mana Sivagare oorlo edo function lo unnaru.. internet issues ani edo chepparu kada!!

next update kosam waiting!!

Next Monday Varaku Updates Afternoon Vatsthai

Tuesday Nuchi Regular Ga Early Morning Vastundi
[+] 1 user Likes SivaSai's post
Like Reply

Part - 94


సూర్య  ఒకచోట బైక్ ఆపి.. ఆమెకు చూస్తూ...
మనిద్దరం ఇంతదూరం వచ్చాం…
కానీ అసలు జర్నీ ఇప్పుడే మొదలవుతుంది విశి..

ఆమె కళ్లలో ఒక చిన్న మెరుపు.

దేవా సార్...నాతో ఇలా ఎప్పటికీ ఉండారా..

అతను స్మైల్.

నువ్వు వెనక్కి చూస్తే… నేను ఎప్పుడూ అక్కడే ఉంటాను.
ఎలా సార్..
మళ్లీ బైక్ స్టార్ట్ చేస్తాడు.

బైక్ మీద మొదలైన ప్రయాణం…
వారి హృదయాల్లో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టింది.
నేను ఉంటాను అంటే..  నువ్వు ఆర్గ్యు  ఎందుకు చేస్తావు?

బైక్ మీద బాడీని ఒక్కసారిగా స్ట్రెచ్ చేస్తుంది.

విశిష్ట చేతులు కొంచెం లూస్ అవుతాయి.
హే జాగ్రత్త గట్టిగా పట్టుకో.

పరవాలేదు సార్ మీరు ఎక్కువ కంగారు పడుతున్నారు.
నీ గురించి కంగారు కాకపోతే ఇంకా ఎవరి గురించి ఉంటుంది.

విశిష్ట ఆ మాటకి చిన్నగా బ్లష్ అవుతూ సార్ మీరు ఎలా చెబుతూ ఉంటే ఏదో మూవీలో హీరో హీరోయిన్స్ ఇలా బైక్ మీద వెళుతూ ఉంటే..

హీరో మీలాగే చెబుతూ ఉంటే...అప్పుడు హీరోయిన్ డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టు ఎందుకు అనవసరమైన రొమాంటిక్ డైలాగులు చెబుతావు అంటుంది.

దానికి సూర్య నవ్వుతూ అప్పుడు హీరో కూడా చెప్పిండాలే నువ్వే ఎక్కువ రొమాంటిక్ విషయాలు గురించి ఆలోచిస్తున్నావు అని..
అవునా నేను చెప్పకపోతే మీ వాయిస్ చెప్పడం లేదా..


సూర్య స్మైల్.
నేను కేర్ చేస్తున్నానని చెబుతుంది.
అది నాకు ఆల్రెడీ తెలుసు… కానీ ఆర్గ్యు మాత్రం చేస్తాను. ఎందుకో తెలుసా మన జర్నీ బోర్ కొట్టకుండా ఉండడానికి..



సూర్య చిన్నగా మిర్రర్ లోకి చూసి ఆమె ఎలా ఉన్నదో చెక్ చేస్తాడు.

విశిష్ట గమనిస్తుంది.

ఏం చూసారు ఇప్పుడు..

నువ్వు ఎలా ఉన్నావో చూసా.

ఎలా అంటే? నేను ఎగిరిపోయానేమో అనుకున్నారా..
అదిగో... ఇలా  ఆర్గ్యు చేస్తావేమోనని చూసా.
నేను చూశానని నీకు ఎలా తెలుసు..

నన్ను మిర్రర్ లో చూశారంటే… నేను ఎందుకు చూడకూడదు.

సూర్య నవ్వి...  అలా రెస్పాండ్ అవుతావు కాబట్టే చూశాను.

నన్ను ఆర్గ్యు మోడ్ లో చూసుకోవడమే గోల్ ఆ...

అవును....క్యూట్ గా ఉంటావు.

విశిష్ట మనసులో...
క్యూట్ అంటే… నేను ఓకే.
బట్ మీరు చెప్పినప్పుడు ఎందుకో హార్ట్ బీట్ పెరుగుతుంది… అది ఓకే కాదు.

విశి మనసులో మాట అర్థమైనట్టుగా సూర్య..అది నాకు ఓకే.




సూర్య హైవేలో స్పీడ్ కాస్త పెంచుతాడు.

స్లో చేయండి సార్.

ఈ రోడ్ సేఫ్.. ఎటువంటి రిస్క్ లేదు.

మీరు సేఫ్ అనుకున్నా… నాకు భయం ఉంటుంది… అనేది అర్థం చేసుకోండి ప్లీజ్..

సూర్య వెంటనే స్పీడ్ తగ్గిస్తాడు.
కాసేపు నిశ్శబ్దం.

సోరి... భయపడ్డావా..  మీరు ఉండగా నాకు భయం ఎందుకు సార్.

మీరు నా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అది మీ మనసుపెట్టి ఆలోచిస్తారు. నీ విషయంలో మనసుపెట్టి ఆలోచించడమే నాకు ఇష్టం.
విశి మౌనంగా ఉంటుంది.  ఏమిటి నేను అలా ఉండడం తప్పా
విశి చిన్నగా తప్పు కాదు...
మీరు అలా ఉంటే నేను కంగారులో ఏమి మాట్లాడతానో.. ఏం తప్పు చేస్తానో అని భయం.
నేనుండగా నువ్వు ఆ భయాన్ని దగ్గరికి రానివ్వాల్సిన అవసరం లేదు.

కాఫీ షాప్ కనిపిస్తే బ్రేక్ ఇచ్చి బైక్ ఆపుతాడు.
ఇద్దరూ కాఫీ తాగుతుంటారు.
సూర్య ఫోన్ తో  విశి ని ఫోటో తీసుకొని చూస్తాడు.
అది చూసిన విశి ఏం చేస్తున్నారు సార్. నా ఫోటో ఎందుకు తీసారు.
లైట్ లో బాగా కనిపిస్తున్నావు. బాగున్నావు అని తీశాను నీకు పంపించాను చూడు.

ఫోటోలో క్యూట్ గా కనిపిస్తూ ఉంటే … నేను ఎప్పుడూ సీరియస్ గా ఉండలేను.ఉండాలని ప్రయత్నించిన అవడం లేదు.
నాకు నీలో ఉండే ప్రతి యాంగిల్ ఇష్టమే.

విశిష్ట వెంటనే వెనక్కి తిరుగుతుంది.
ముక్కు నెమ్మదిగా పింక్.
మీరెలా మాట్లాడితే నేను కోపం చూపించాల్సి వస్తుంది.
నీ మాటకి చేష్టలకి సంబంధమే లేదు. కోపం అంటున్నావు కానీ బ్లష్ అవుతూ లేని కోపాన్ని చూపిస్తున్నావు అనిపిస్తుంది.
అంతలేదు. బ్లష్ అవ్వాల్సిన అవసరం నాకేమిటి.

అవునా...  మరి కలర్ చేంజ్ అవుతున్నా చెవులు ఎవ్వరి అంటావు.

విశిష్ట చేతితో చెవులు దాచుకుంటూ.. ఏమో నాకేం తెలుసు.
సూర్య ఒక్క నిమిషం సైలెంట్ అవుతాడు. ఇద్దరూ కాఫీ తాగి మళ్ళీ బైక్ ఎక్కుతారు.




బైక్ మీద, విశిష్ట  చోరవుగా సూర్య  బ్యాక్ కి వాలి ఉంటుంది. సూర్య ఆ చొరవ కి చిన్నగా నవ్వుకుంటాడు.
ఎందుకు నవ్వుతున్నారు సార్..
అరే నవ్వే స్వాతంత్రం కూడా లేదా..   సందర్భం లేకుండా నవ్వు వస్తుంది అంటే ఎలా..
హ్మ్.. నువ్వు కంఫర్టబుల్గా చొరవుగా ఉన్నావు కాబట్టి నవ్వుకున్నాను చాలా..
అంటే నేను అలా ఉండకూడదా.. అలా అని నేను అన్నానా..
నువ్వు నాపై ఇలా వాలితే... నాకు కూడా కొంచెం... ఏమో…

ఏమో అంటే
నువ్వే చెప్పాలి.

నేను చెప్పానంటే... పరిస్థితులు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాయి.
ఆల్రెడీ వెళుతున్నయేమో అనిపిస్తుంది.

ఇద్దరు చిన్నగా నవ్వుకుంటారు.



ఒక బ్రిడ్జి దగ్గర చిన్న చెట్ల దగ్గర కోతులు కూర్చుంటాయి.
సూర్య బైక్ స్లో చేస్తాడు.

విశిష్ట వెంటనే... స్లో చేయకండి సార్.  అక్కడ కోతులు చాలా ఉన్నాయి.  నా చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంటే ఇంకా అంతే సంగతులు.
అవి నీ బ్యాగ్ కోసం చూడడం లేదు.  మరి... నిన్ను చూసి కన్ఫ్యూజ్ అవుతున్నాయి.
నన్ను చూసా..  ఎందుకు..
వాటి జాతి ఏమిటా బైక్ మీద కూర్చుంది అని చూస్తున్నాయి.
సార్ అని ఉక్రోషంగా పిలుస్తుంది.

ఒక కోతి దగ్గరకి రాగానే .. విశిష్ట సూర్య బ్యాక్ ని గట్టి గా పట్టుకుంటుంది.
ఓహో...  కోతి రాగానే నా మీద చాలా ఎఫెక్షన్ పెరిగినట్టుంది.  ఎఫెక్షను కాదు ఏమీ కాదు. భయం సార్.


విశి పరిస్థితి చూసి సూర్య నవ్వు ఆపుకోలేక పోతాడు. నువ్వు ఇలా క్యూట్ గా భయపడితే... కోతులు కూడా సిగ్గుపడుతున్నాయి.



ప్లీజ్ సార్ తొందరగా వెళ్ళండి  సరే టెన్షన్ పడకు అని బైక్ స్పీడ్ పెంచుతాడు. హమ్మయ్య అనుకునని రిలాక్స్ అవుతుంది.



హైవేలో ఒక పెద్ద ఆవు స్ట్రైటుగా రోడ్డుకి మధ్యలో నిలబడుతుంది.
సూర్య అది చూసి ఇది ఇక్కడ నిలబెడడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చి ఉంటారు.
విశి కూడా ఆలోచిస్తూ వాటికి ఎక్కడైనా నిలబడచ్చు అని గవర్నమెంట్ సర్టిఫికెట్ ఉండి ఉంటది.


ఆవు బైక్ వైపూ చూస్తుంది.
దేవా సార్ ఆపండి.  ఆవు ఆగు...
అద్భుతమైన చూపులు. ఒకరినొకరు చూసుకుంటూన్నట్టుగా ఆవు ముందుకు వస్తూ ఉంటుంది.

దయ చేసి దగ్గరికి రాకు పరువు పోతుంది.
సూర్య రెండు చేతులు పైకి లేపి..  మేడం మనం ఒక కష్టతరమైన ట్రాఫిక్ ని దాటాలి అనుకుంటా సార్ అని ఏడుపు ముఖంతో చూస్తుంది.

ఆవు చివరకు పక్కకి వెళ్తుంది.
ఇదే అసలు రోడ్డుపై డామినేషన్.  ఏం చేస్తాం సర్ మీ స్పీడ్ కన్నా ఆవు కున్న ఆటిట్యూడ్ ఎక్కువగా ఉంది.

ఇద్దరికీ తెలియకుండానే ఈ జర్నీలో ఇంకా దగ్గరవుతూ ఉంటారు.....
[+] 7 users Like SivaSai's post
Like Reply

Part - 95



అవని విక్రమ్ నీ వెతుక్కుంటూ గదిలోకి వెళుతుంది. బాల్కనీలో నిలబడి సీరియస్ గా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు.

వెనకనించి వెళ్లి హత్తుకుని సోరి అంటుంది. నేను మళ్ళీ కాల్ చేస్తానని ఫోన్ పెట్టేసి దేనికి..  ఇందాక మిమ్మల్ని బాధ పెట్టాను కదా అందుకు.

ఇందాక బాధపెట్టి ఇప్పుడు వచ్చి సోరి చెబుతున్నావా.. అయినా నా పైన నమ్మకం లేనప్పుడు ఈ సోరీలు,పూరీలు నాకెందుకు.

మీ పైన నమ్మకం లేదు అని నేను అన్నానా అని ఏడుపు గొంతుతో అడుగుతుంది. మరి భరత్ అనగానే మా ఆయన అలాంటివారు కాదు అనకుండా నాపైన ఒక రాక్షసిలాగా పడిపోయావు.  రెండో పెళ్లి కావాలా మీకు అని చిందులు వేశావు.

అది మీ పైన అనుమానం కాదు మరి జలస్ అనుకోవచ్చు కదా.. పొరపాటున కూడా మీ పక్కన నేను ఎవ్వరిని ఊహించుకోలేను. 

ఆ ఆలోచన కూడా భరించలేను. ఒక్కసారిగా పెళ్లి అనేటప్పటికీ అని తలకిందకి దించేస్తుంది.  నడుం చుట్టూ చేతులు వేసి  దగ్గరకు లాక్కుని  పిచ్చిదానా..

రాముడు సీతని అడివిలోకి పంపిన తరువాత అశ్వమేధ యాగం తలపెట్టినప్పుడు సీతకి అనుమానం వచ్చింది పక్కన భార్య లేకుండా యాగం ఎలా చేస్తారు అని.

ఎక్కడ రాముడు రెండో పెళ్లి చేసుకున్నాడో అని  కంగారు పడింది.  తన మనసుకి తెలుసు రాముడు తనని తప్ప పొరపాటున కూడా ఏ స్త్రీ వైపు కన్నెత్తి చూడడు అని కానీ ఎక్కడా చేసుకున్నాడో అని ఒక భయం.

అది అనుమానం కాదు ప్రేమ ఎక్కువై వచ్చిన భయం మాత్రమే.  ఆ భయంతోనే వెళ్లి చూసి వచ్చి సమాధాన పడింది.

తప్పుగా ఆలోచించినందుకు.. ఇదిగో ఇలాగే నీలాగే ఈ గిల్టీగా ఫీల్ అయింది కానీ రాముడు సీతని దూరం చేసుకున్నా బంగారు సీతని తయారు చేసుకుని.. అక్కడే కాలం గడిపాడు.

రాముడికి ఉన్న బాధ్యతలు కోసమో..  మరి ఏ కారణాలైనా అవ్వని..  దూరమైన సీతను తలుచుకుంటూ బ్రతికాడేమో కానీ..

నీ రాముడు నువ్వు దూరం అవుతే ఆ మరుక్షణమే ఎన్ని బంధాల మధ్యన ఉన్న, బాధ్యతలు మధ్యన ఉన్నా సరే ఉండలేడు.

నువ్వు ఎక్కడుంటే అక్కడికే నీ రాముడి ప్రయాణం అర్థమవుతుందా... అర్థమవుతుంది అని విక్రమ్ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంటుంది.

అబ్బో మా శ్రీమతికి పెళ్లిఅయ్యి ఇన్ని సంవత్సరాలకి మొగుణ్ణి హత్తుకోవాలి అనిపించింది. ఇది వండరే...వండర్ ఏమి కాదు ప్రేమ ఎక్కువై.

అలాగే హత్తుకుని మీకు నా పైన కోపం రాలేదా..  ఎందుకు. అందరి ముందు అరిచాను కదా..  అలా అరిచినందుకే కదా ఇలా వచ్చి హత్తుకున్నావు.

అబ్బా సీరియస్ అండి.  రాలేదు.  మా ఆవిడలో కనిపించిన ఇంకొక యాంగిల్ కి నవ్వు వచ్చింది. మరి ఎందుకు వచ్చేసారు.

అందరి ముందు అలా నవ్వితే నువ్వు ఫీల్ అవుతావు కదా..  అప్పుడు ఇలా వచ్చేసాను కాబట్టే ఇదిగో ఏరుకోరి మరి నా శ్రీమతి నాకు ఇంత బిగి కౌగిలి ఇచ్చింది.

మీరు బంగారం అండి.. ఇలా మాటలతోనే కాలక్షేపం చేస్తావా..  మీకు అసలు సిగ్గులేదు అని చాతి మీద చిన్నగా ఒక దెబ్బ వేసి.. విడిపించుకుని బయటికి వస్తుంది. వెళుతున్న అవనిను చూసి నవ్వుకుంటూ మళ్లీ ఫోన్లో బిజీ అయిపోతాడు.





మధ్యలో ఒక రోడ్డుసైడ్ చాయ్‌ బండి కనిపిస్తుంది సార్ ఒక టీ తాగి వెళదామా అంటే సరే అని బైక్ ఆపుతాడు.
వీళ్లిద్దరూ దిగగానే.. టీ మాస్టర్ గట్టిగా ప్రేమజంట వచ్చారు. రెండు స్ట్రాంగ్ టీ ఇవ్వమంటారా..

ఆ మాటకి విశిష్ట ఆశ్చర్యపోయి  చూస్తుంది.  సూర్య చిన్నగా దగ్గుతూ.. విశిష్టనీ  ఈ లోకంలోనికి తీసుకు వస్తాడు.

సార్ ఈ టీ మాస్టర్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు. మన గురించి తప్పుగా అనుకుంటున్నాడు. కాదని చెబుదామా.. ఏమని చెబుతావు.

మీరు లెక్చరర్ నేను స్టూడెంట్ అని.  అప్పుడు గాని మనిద్దరిని పైనుంచి కిందకి చూడడు.  ఒక టీ తాగి వెళ్ళిపోతాము.  మళ్ళీ అతను ఎవరో... మనము ఎవరో..
రా అని తీసుకువెళ్తాడు.

ఇద్దరూ కూర్చోగానే సార్ ఒకే కప్పులో టీనా లేక.. అన్న మేము ఇద్దరం ఫ్రెండ్స్ ఓకే. అవునా కానీ మిమ్మల్ని చూస్తే ఫ్రెండ్స్ లాగా లేరు సార్ మంచి లవర్స్లాగా ఉన్నారు.

టీ కప్పు తీసుకుంటున్న  విశి కంగారుపడుతుంది. ఆ కంగారులో కప్ ఆల్మోస్ట్ పడబోతు ఉంటే... గట్టిగా పట్టుకుని కంట్రోల్ విశి..

నీ ఎక్స్ప్రెషన్ తో అందరికీ దొరికిపోయేటట్టు  ఉన్నావు. ఎవరైనా చూశారా అంటే ఇంకా అంతే. సూర్యాకి ఆ మాటలు అర్థం అయినట్టు.. కంగారుపడకు. నీ బ్లష్ చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది.

ఏంటి సార్. అదే మన ఫ్రెండ్షిప్ గురించి. ఓ అవునా...  నేను అదే అనుకున్నాను అంటూ మెల్లిగా ఫినిష్ చేస్తుంది.
సూర్య నవ్వుకుంటూ తాగి బయలుదేరిదామా అంటే సరే సార్ అని వెనకాలే వెళుతుంది.


ఒక ట్రావెలర్ వాన్‌లో ఉన్న వయసు మీద మనిషి వీళ్ళిద్దర్ని చూస్తూ  స్మైల్‌తో ఫోటో తీసేస్తాడు.

విశిష్ట భయంగా హలో ఎవరు మీరు... ఎందుకు మా ఫొటోస్ తీస్తున్నారు అని అడుగుతుంది.

సూర్య హే.. కూల్. భయపడకు.  మేబి వాళ్ళు ట్రావెల్ వ్లాగ్ చేస్తూ ఉండొచ్చు.

విశి పక్కకు తల తిప్పి.. వ్లాగ్ లో మేమే ట్రావెలింగ్ కపుల్స్ లాగా ఫేమస్ అవుతామో ఏమో...
కపుల్ కాదు… సైలెంట్ క్రష్ ట్రావెలర్స్ అని మెన్షన్ చేస్తారు.

సార్ నేను భయపడుతూ ఉంటే  మీరు జోక్స్ వేస్తున్నారా అని భుజంపై మెల్లిగా కొడుతుంది.
పక్కన నేను ఉండగా కూడా భయపడుతున్నావా... ఆ మాటకి చిన్నగా నవ్వుకుంటూ తలవాల్చుతుంది.

కొంచెం దూరం వెళ్ళాక సార్ అని పిలుస్తుంది.  ఏంటి. చిన్న రిక్వెస్ట్ సార్.  వాష్ రూమ్ కి  వెళ్లాలా.. కాదు సార్.. ప్లీజ్ విషయం ఏమిటో చెప్పు.  నాకు డ్రైవింగ్ చేయాలని ఉంది నేర్పిస్తారా.  వాట్ అని సైడ్ కు తిరిగి అడుగుతాడు.

అవును సార్. మా నాన్న ఉండగా అడిగితే చిన్నపిల్లవు భయపడతావు పడిపోతావు దెబ్బలు తగులుతాయి అని నేర్పించలేదు.

తర్వాత ఫోకస్ చేయడం కుదరలేదు. ప్లీజ్...  ప్లీజ్...  నువ్వు ఇంత ముద్దుగా అడిగితే నేను కాదంటానా అని బైక్ ని సైడ్ కి ఆపుతాడు.

విశి బైక్ దిగగానే సూర్య వెనక్కి జరిగి అడ్జస్ట్ చేస్తాడు.  కళ్ళతోనే కూర్చొ అని చెప్పగానే..  ఎక్సైట్మెంట్ విశి కూర్చుని హ్యాండిల్ పట్టుకుంటుంది.

క్లచ్ బ్రేక్ ఎక్సలేటర్ అన్ని చూపిస్తూ ఎలా  స్టార్ట్ చేయాలో కూడా చెబుతాడు. బైక్ స్టార్ట్ చేసి మెల్లిగా వెళుతూ ముందు కన్ఫ్యూజ్ అవుతుంది.

హ్యాండిల్స్ అటు ఇటు తిప్పేస్తూ ఉంటే... ఆ చేతులు మీద సూర్య చేతులు వేసి కూల్.. టెన్షన్ పడకు అని చెబుతాడు. సూర్య చేతులు అలా తగలగానే విశి బాడీ ఒక్కసారిగా జర్క్ ఇస్తుంది.  సూర్యకి కూడా ఆ ఫీల్ బాగా నచ్చుతుంది.

బైక్ ఇద్దరి డ్రైవింగ్ తో స్లోగా ముందుకు వెళుతూ ఉంటుంది.  విశి తేరుకుని సార్ మనం ఇలా 20 లో వెళితే సైకిల్ వేసుకెల్లేవాళ్ళు కూడా మన కన్నా ముందే వెళ్లిపోతారు.

నో ప్రాబ్లం ఇలా బాగుంది కదా... ఏం బాగుంది.  అదే స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఇలాగే స్లోగా వెళ్ళాలి పర్ఫెక్ట్ అనుకున్నాక స్పీడ్ పెంచాలి.

మెల్లిగా సూర్య తన చేతులను తీసేస్తాడు.  కొంచెం స్పీడు పెంచి డ్రైవ్ చేస్తూ సార్ నాకు వచ్చేసింది అని సంతోషంగా అరుస్తుంది.  విశి సంతోషంలోనే తన ఆనందాన్ని వెతుకుతున్న సూర్యకి అదొక చెప్పలేని తృప్తి.

చాలా దూరం వెళ్ళిన తర్వాత దాబా కనిపిస్తుంది.  అది చూసిన సూర్య అక్కడ ఆపమని చెబుతాడు.  బైక్ పార్క్ చేసి సార్ నేను చాలా కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేశాను.

ఫుడ్ తిన్న తర్వాత మళ్లీ నేనే డ్రైవ్ చేస్తాను.  ఆ మాటకి సూర్య నవ్వుతూ మళ్లీ నువ్వు డ్రైవ్ చేస్తే మనం అనుకున్న టైం కి వెళ్లలేము. రిటర్న్లో డ్రైవ్ చేయొచ్చు కం అని తీసుకువెళ్తాడు.
ఇద్దరూ కూర్చున్న తర్వాత విశి కాన్ఫిడెంట్గా ఆర్డర్ ఇస్తుంది.

అన్నా… కారం తక్కువగా వెయ్యండి. సర్వర్ కారం కాన్సెప్ట్ ని పూర్తిగా రివర్స్లో అర్థం చేసుకుంటాడు.

ఫుడ్ వస్తుంది..  ఆ ఫుడ్డు చూడగానే ఇద్దరికీ కళ్ళు తిరిగినంతా పని అవుతుంది. అది అచ్చు ఒక ఎర్రటి లావా పొంగుతున్నంత ఎర్రగా కనిపిస్తుంది.

సూర్య ఒక స్పూన్ నోట్లో పెట్టుకుని...  అమ్మో.. ఇవేనా కారం తక్కువ ఐటమ్స్..

విశిష్ట చిన్నగా ఆ ఫుడ్ ని చూస్తూ తనలో తానే.. ఇదే తక్కువ అయితే మరి ఎక్కువ అయితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది.

సర్వర్ సీరియస్‌గా...  మేడమ్, మా దగ్గర కారం స్కేల్ ఇలానే ఉంటుంది
ఎలా..
తక్కువ – మామూలు మంట
మోస్తరు – కంటతడి
ఎక్కువ – హాస్పిటల్ కి పంపించేవి.

సూర్య నోరు తడుముకుంటూ.. అవును… ఈ తక్కువే చాలు సార్.

విశిష్ట నీళ్లు గ్లాస్ గ్లాస్ గా తాగుతూ... దేవా సార్..  నాకు ఇప్పుడు ఎమోషనల్ ఫ్లాషబాక్స్ గుర్తుకు వస్తున్నాయి.

ఇద్దరూ కష్టంగా తిని బయటకి వస్తారు. సార్ ఎక్కడైనా కొబ్బరి బొండాలి కనిపిస్తే తాగాల్సిందే..  లేకపోతే ఈ మంటతో అయిపోతాము.

పెద్ద ఏదో కాన్ఫిడెంట్గా ఆర్డర్ ఇచ్చావు.  కారం తక్కువ వేయండి అన్న అని..   తక్కువ వేయమన్నాను కాబట్టి ఇలా ఉంది.

అది నార్మల్ గా చెప్పి ఉంటే మన పరిస్థితి ఏమిటి సార్.. అర్థం చేసుకోవాలి. అవును.. అవును.. బాగా అర్థం చేసుకుంటున్నాను.

దారిలో కొబ్బరిబండాలు తాగి మళ్లీ ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తారు.  చీకటి పడుతున్న సమయానికి ఎక్కడైనా రూమ్ తీసుకుని ఆ నైట్ ఆగాలి అని డిసైడ్ అవుతారు.

ఇద్దరూ ఒక హోటల్ దగ్గరికి వెళ్లి రూమ్స్ తీసుకుంటారు. ఒక రూమ్ తీసుకోవాలా..  రెండు రూమ్స్ తీసుకోవాలో అర్థం కాకుండా ఉంటుంది.

పెళ్లి కాకుండా ఇద్దరూ ఒక రూమ్ లో ఉండడం ఎలా అని.. ఒక వైపు విశిని ఒక దాన్నే రూమ్ లో ఉంచడం కరెక్ట్ కాదు అని మరోవైపు..

ఒక రూమా లేక రెండు రూమ్స్ ఆ ?......
[+] 6 users Like SivaSai's post
Like Reply

Part - 96



పెళ్లి కాకుండా ఇద్దరూ ఒక రూమ్ లో ఉండడం ఎలా అని.. ఒక వైపు విశిని ఒక దాన్నే రూమ్ లో ఉంచడం కరెక్ట్ కాదు అని మరోవైపు..
ఇద్దరం ఒకే రూమ్ లో ఉందాము అంటే విశి ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తూ ఉంటాడు. విశి కి కూడా పరిస్థితి అర్థం అయ్యి సార్ అని పిలుస్తుంది.

హ అని చూస్తే ఒక రూమ్ తీసుకోండి. పర్వాలేదా మీ మీద నాకు నమ్మకం ఉంది. విశి చెప్పినదానికి చిన్నగా నవ్వుకుంటూ ముందుకు నడుస్తాడు.


ఇద్దరూ లిఫ్ట్‌ నుంచి బయటికి వచ్చి రూమ్‌ డోర్ తెరుస్తారు.
అందంగా, శుభ్రంగా, సేఫ్‌ సూట్ రూమ్. లోపల అడుగు పెట్టిన విశి కళ్లే పెద్దవై...

సార్… ఇది చాలా కాస్ట్ అయి ఉంటుంది అనుకుంటా…

సూర్య తల ఊపుతూ....

ఇట్స్ ఓకే విశి… సేఫ్టీ కన్నా ఏదీ ఇంపార్టెంట్ కాదు.

రెండు సపరేట్ బెడ్స్ చూసి విశి ఊపిరి తీసుకుంటూ ఒక బెడ్‌పై కూర్చుంది.
సూర్య బ్యాగ్‌ను ఓపెన్‌ చేస్తూ...

ఫ్రెష్ అయి వచ్చేస్తావా?
హా సార్.
విశి డ్రెస్ తీసుకొని వాష్ రూమ్ కి వెళుతుంది. వాష్‌రూమ్ కి వెళ్లిన విశి కొద్ది సేపటి తర్వాత హాయిగా స్నానం చేసి, సింపుల్ నైట్‌డ్రెస్ వేసుకుని బయటకు వస్తుంది.

సూర్యను చూసి కొంచెం ఎంబరాస్మెంట్‌గా తలదించుకొని వెళ్లి మంచం పైన కూర్చుంటుంది. ఫోన్ తీసుకుని భానుమతికి మెసేజ్ చేస్తుంది.

అంతలో సూర్య కూడా ఫ్రెష్‌ అయ్యి నైట్ ట్రాక్ వేసుకుని బయటకు వచ్చేస్తాడు.
ఏమైనా తింటావా? అని అడుగుతాడు.

విశి చేతులు ఊపుతూ... అమ్మో వద్దు సార్… చాలా హెవీ అయిపోయింది. ఒక్క దుప్పటి ముసుగేస్తే కళ్లే మూసుకుంటున్నాయి. నిద్ర దేవి వెంట తీసుకెళుతోంది.

ఆ మాటకి సూర్య నవ్వుతాడు.

సార్… మీరు ఏమైనా తినండి. నాది సేమ్ పొజిషన్. నేను అలసిపోయాను

తలగడ ఒళ్ళో పెట్టుకుని ఇద్దరూ కొంచెం టైమ్ ఫ్రెండ్లా మాట్లాడుకుంటారు.
ఎక్కడ ఆగాలో ఇద్దరికీ అర్థమే... మర్యాద, గౌరవం, బౌండరీలు అన్నీ తెలిసిన ఒక ప్రేమ జంట.
రేపు లాంగ్ డ్రైవ్ ఉంది కదా… 6 కి రెడీ అవ్వాలి.
అయ్యో అంత ఎర్లీనా?

ఏం లెగలేవా..  ఎందుకు లెగలేను సార్..  మీ గురించే ఆలోచిస్తున్నాను. అంత ఎర్లీగా అంటే మీరు డ్రైవింగ్ చేయగలరో లేదో అని.

నా గురించి నేను చూసుకుంటాను గాని.. లేడీస్ రెడీ అవ్వడానికి చాలా టైం తీసుకుంటారు కదా..  నువ్వు తొందరగా లేచి రెడీ అవ్వు.

హలో సార్ నేను అసలు మేకప్ వేసుకోను. నిజమా..  మీరు ఎప్పుడూ నన్ను అబ్జర్వ్ చేయలేదా అని  చిన్న బుచ్చుకున్నట్టుగా అడుగుతుంది.

విశి ముద్దు మొహాన్ని చూసి నవ్వుకుంటూ అమ్మాయిలని నేను ఎప్పుడు పట్టికలర్గా అబ్జర్వ్ చేయలేదు.  అందరూ అనుకునే మాటే నేను అడిగాను.

సో నీలాంటి స్పెషల్ ఎక్స్ట్రా కాండిడేట్స్ ఉంటారు అని ఇప్పుడే అర్థమైంది.  సూర్య కాంప్లిమెంట్ కి చిన్నగా సిగ్గుపడుతుంది.
కాసేపు నవ్వులు, చిన్న చిన్న జోక్స్.

గుడ్ నైట్ సార్.
గుడ్ నైట్ విశి.

రూమ్‌లో కేవలం ఏసీ హమ్, కర్టన్‌ల స్లయిట్ కదలికలు, మరియు ఇద్దరికీ వచ్చిన నిజమైన… ప్రశాంత నిద్ర.

రూమ్‌లో కర్టన్ గ్యాప్‌ నుంచి సూర్యకాంతి నెమ్మదిగా లోపలికి చేరుతోంది.
విశి ఇంకా దుప్పటి ముసుగేసి గాఢంగా నిద్రపోతుంది.
సూర్య ముందుగానే లేచిపోయి, కుర్చీలో కూర్చుని ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి ఏదో పని చూస్తుంటాడు.

సడన్‌గా బెడ్ పక్కన నుండి....

హ్మ్మ్మ్..  అని చిన్నగా మూలుగినట్టుగా విశి టర్నింగ్ అవుతుంది. అమ్మ కర్టిన్ దగ్గరికి లాగు అని దుప్పటిని పైకి లాక్కుంటుంది.

సూర్య నవ్వు ఆపుకుంటూ చూస్తాడు. కొంచెం తర్వాత విశి ఒక్కసారిగా కళ్లప్పగించి లేచి కూర్చుంటుంది.

సార్!! నేను నిన్న రాత్రి ఇలా నిద్రపోయానా?
అని తన జుట్టు మొత్తం గాలివాన తాకినట్టు అయిపోయినట్టు హడావుడిగా సరి చేసుకుంటుంది.

సూర్య నవ్వుకుంటూ...  విశి… రిలాక్స్. ఏం ఏమీ కాదు. నిద్రపోయావంతే.

విశి ఇంకా పక్క బెడ్‌ కవర్‌ చూస్తూ...  ఓహ్ గాడ్… నేను ఇలా పడుకున్నానా? కనీసం గుడ్ మార్నింగ్ సార్ అనడానికి ముందు నా హెయిర్‌ ఇలా?  అని ముఖం చేతుల్లో దాచుకుంటుంది.

సూర్య నవ్వు ఆపుకోలేక... ఏంటి విశి సిగ్గుపడుతున్నావా అయినా నేనేమీ అనుకోవడం లేదు. చాలా క్యూట్ గా నిద్రపోయావు.

విశి కళ్ళని చిన్నగాపెట్టి సార్... మీరు నన్ను ఏడిపిస్తున్నారు.

సూర్య లైట్‌గా...  చాలా క్యూట్‌గా నిద్రపోయావంటే నమ్మవా... వెంటనే విశి ముఖం టమాటో రెడ్ అయిపోతుంది.

సార్… ఇలాంటివి చెప్పకండి ప్లీజ్…
టైం చూసుకుని సార్ అని అరుస్తుంది. మళ్ళీ ఏమైంది అప్పుడే సెవెన్ అయిపోయింది. అవును మనం సిక్స్ కే బయలుదేరాలి అనుకున్నాము కదా..

మీరు ఎప్పుడో లేచారు.  లేపాల్సింది అని గిల్టీగా అంటుంది.  ఇప్పుడు ఏమైంది మన సెల్ఫ్ డ్రైవింగ్ ఏ కదా..

కొంచెం లేటుగా వెళతాము. బాగా అలసిపోయి ఉన్నావు.. పడుకున్నావు.  లేపాలి అనిపించలేదు. కానీ డ్రైవింగ్ చేసిందంతా మీరే. నేను బ్యాక్ కూర్చున్నాను.

నేనేం అలిసిపోయి ఉంటాను సార్.ఎలాగైనా జర్నీ కదా. నో ప్రాబ్లం వెళ్లి ఫ్రెష్ అవ్వు. బ్రేక్‌ఫాస్ట్ కి వెళ్దాం.
షాల్ సరిచేసుకుంటూ అర్జంట్‌గా వాష్‌రూమ్‌ వైపు నడుస్తుంది.
సూర్య మాత్రం తల ఊపుకుంటూ, చిరునవ్వుతో...  గుడ్ మార్నింగ్ విశి.. అని కాస్త గట్టిగా అంటాడు.

విశి డోర్ మూసే మధ్యలోనే..  గుడ్ మార్నింగ్ సార్…
అని సగం సిగ్గుతో..  సగం ఇబ్బందితో తలుపు వేస్తుంది.

తలుపు మూసిన తర్వాత తానలో తాను...
ఛ… ఎందుకిలా అయిపోయిందబ్బా…

విశి రెడీ  అయ్యి వచ్చేటప్పటికి రూమ్ లోకి బ్రేక్ ఫాస్ట్ కాఫీ ఆర్డర్ పెడతాడు.  విశి  టేబుల్ దగ్గరకి వస్తుంది.
సూర్య అప్పటికే కూర్చుని కాఫీ ఆర్డర్ చేసి వెయిటింగ్.

విశి చైర్ దగ్గర కూర్చునే సమయంలో సూర్య  ఆమెను ఒకసారి పై నుంచి కింద దాకా చూసి...

హ్మ్… ఇప్పుడు మాత్రం పూర్తిగా అమ్మాయిలాగా ఉన్నావు.

ఏం సార్! నేను ముందు ఇలాగే ఉన్నాను కదా..

సూర్య కాఫీ తాగుతూ...  నిన్న రూమ్‌లో లేచినప్పుడు చూశానుగా… హరికేన్ విశి వెర్షన్.

విశి కళ్లను పెద్దవిగా చేసి...  సార్ ప్లీజ్… అది నిద్ర వల్లే. అవి చెప్పక్కర్లేదుగా.

సూర్య నవ్వుతూనే...  నిన్ను చూస్తే నాకు అర్థం అయ్యింది ఏమిటంటే … నిద్ర అంటే నిజంగా నీకు దేవతలా ఉంటుంది. నిద్ర పోయేటప్పుడు ప్రపంచం, ఇమేజ్, బౌండరీలు అన్నీ ఆఫ్ అయ్యిపోతాయి.

విశి ప్లేట్‌లో ఉన్న ఇడ్లీని చూస్తూ...  సార్… ఇలా చాలా టీజ్ చేస్తుంటే… నేను మాట్లాడను. అలుగుతాను.

అవునా నీలో అలక అనే యాంగిల్ ఇప్పుడు వరకు చూడలేదు ప్లీజ్ ఒక్కసారి అలగవ అని టీజింగ్ వాయిస్ తో అడుగుతాడు.

విశి చేతులు జోడించి... ఈ ఒక్కరోజు నన్ను టీజ్ చేయకుండా ఉండండి, చూద్దాం మీ వల్ల అవుతుందా?

సూర్య వెంటనే నవ్వి....  ఒక్కరోజా? అది అసాధ్యం.
నీ ఎక్సప్రెషన్స్ చూడగానే ఆటో టీసింగ్ మోడ్ ఆన్ అయిపోతుంది. ఏమి చేయమంటావు చెప్పు..

విశి ప్లేట్‌తోనే అతన్ని కొట్టాలనుకున్నట్టుగా..  సార్… చాలా ఇబ్బంది పెడుతున్నారు.
అయితే నీకు ఒక్క ఛాలెంజ్.
ఇవాళ్టి ట్రిప్‌లో నువ్వు నన్ను ఒక్కసారి అయినా టీజ్ చేస్తే… నేను నిన్ను ఇక టీజ్ చేయను.

విశి ఐబ్రో రైజ్ చేస్తూ.. మిమ్మల్ని చేయలేను అనుకుంటున్నారా... అరే చేయమనే కదా నేను అంటున్నాను.

ఇప్పటివరకు నన్ను టీజ్ చేసే అవకాశం ఏ అమ్మాయికి ఇవ్వలేదు ఫస్ట్ నీకే ఇస్తున్నాను కాబట్టి యూస్ చేసుకో.

సూర్య ముఖం చూడటం కష్టమయ్యేలా అటు చూసి... మీకు ఎందుకు సార్ నన్ను టీజ్ చెయ్యాలి అనిపిస్తుంది. కాఫీ తాగుతూ నేను టీజ్ చేస్తున్న సరే ఎందుకు అబ్జెక్ట్ చెప్పకుండా నీలో నువ్వు నవ్వుకుంటున్నావు.
ఏంటి… నేను అలా నవ్వుకుంటున్నానా..

విశి తలవంచుకొని చిన్నగా సార్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి.  లేకపోతే నా పని అంతే. ఏం ఆలోచిస్తున్నావు.. సీరియస్గా పెట్టాను అనుకోని సూర్యని చూస్తూ..
సార్… మీరు ఆలా ఎలా చెప్పేశారు.

సూర్య కప్పు పెట్టి...  సరే... లెట్స్ ఈట్.
అదేంటంటే.. టీజ్ చేస్తున్నప్పుడు....నీవు క్యూట్‌గా రెయాక్ట్ అవుతావు.

విశి ముఖం వెంటనే పింక్ అయిపోతుంది.

సార్… ప్లీజ్ … ఇంకో మాట మాట్లాడితే టేబుల్ వదిలి వెళ్తాను

సూర్య చిన్నగా సైరన్‌లా  ఓకే, ఓకే… అని చేతులు ఎత్తేస్తాడు.

కానీ ఆమె ప్లేట్‌లో దోసె కట్ చేస్తుండగా అతను మళ్ళీ నెమ్మదిగా...
బై ది వే... గుడ్ మార్నింగ్...  హరికెన్ వెర్షన్ కాదు... నార్మల్ క్యూట్ వెర్షన్.

సార్…

సూర్య నవ్వి చేతిలో నాప్‌కిన్ పెడతాడు.

ఇద్దరూ నవ్వుకుంటూ బ్రేక్‌ఫాస్ట్‌ ఫినిష్ చేస్తారు.
మధ్యలో వచ్చే చిన్న చిన్న ఐ కాంటాక్ట్స్ …
కంఫరటబుల్ సైలెన్స్ …
అలిగినట్టు నటించే విశి…
హర్ టీజ్ ఛాలెంజ్ ఇన్ మైండ్ …

ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఇంకా దగ్గరవుతుంది.
లగేజ్ ప్యాక్ చేసుకుని... రూమ్ చెక్ అవుట్ చేసి మళ్లీ స్టార్ట్ అవుతారు.


వైభవ్ మార్నింగ్ లేచి జిమ్ చేసి వచ్చి ప్రోటీన్ షేక్ తాగుతూ అందరినీ చూస్తూ ఉంటాడు. లేడీస్ భర్త ల కోసం హైరానా పడుతూ ఉంటే... సౌమ్య సైలెంట్ గా శ్రీకర్ తో ఫోన్ లో బిజీగా ఉంటుంది.

సీనియర్ సిటిజన్స్ కపుల్స్ మీద సెటైర్లు వేస్తూ ఉంటారు. అందరూ వాళ్ళ పెయిర్ తో ఎంజాయ్ చేస్తున్నారు. నేనే ఒంటికాయ సొంటికొమ్ములాగ ఇలా చూస్తూ ఉంటున్నాను.

ఇంతకీ నా చందు బేబీ ఏం చేస్తుందో ఏమిటో..  ఫోన్ చేయాలి. హ అదే చేయొచ్చు కదా..  నేను చేస్తే లోకువైపోతానేమో.

అంతరాత్మ బయటికి వచ్చి ఏడ్చావులే...  చందు నీకెందుకు ఫోన్ చేస్తుంది.  మేమిద్దరం లవర్స్ అయ్యాము కదా.....

అది నువ్వు అనుకుంటున్నావు. ఇంకా నీ పిల్ల రాక్షసి ఫిక్స్ అవ్వలేదు.  ఎందుకు ఫిక్స్ అవ్వలేదు.  ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను అని రూమ్ కి వెళ్లి ఫోన్ చేస్తాడు.

చందు ఫోన్ లిఫ్ట్ చేస్తుందా.....
[+] 6 users Like SivaSai's post
Like Reply

Part - 97



నీ పిల్ల రాక్షసి ఫిక్స్ అవ్వలేదు.  ఎందుకు ఫిక్స్ అవ్వలేదు.  ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను అని రూమ్ కి వెళ్లి ఫోన్ చేస్తాడు.

మత్తుగా నిద్రపోతున్న చందు లాస్ట్ రింగ్ కి లిఫ్ట్ చేసి కళ్లు తెలవకుండానే హలో అని ఉంటుంది. ఏమిటే తెల్లారి ఇంతసేపైనా లవర్ కి ఫోన్ చేయాలని తెలియదా అని గట్టిగా అరుస్తాడు.

ఆ అరుపులకి నిద్రమత్తు వదిలిపోయి ఫోన్ వైపు చూస్తుంది. మంకీ అని సేవ్ చేసి ఉన్న నెంబర్ నుంచి కాల్ వస్తుంటే లేచి తల పట్టుకుని...

ఎవరికీ ఎవరు లవర్స్ రా.. ఏం మాట్లాడుతున్నావు. రాత్రి ఏమైనా తాగావా... తాగింది దిగలేదా..

అమ్మ.. నీ..ఎంత మాట అన్నావే. నీ ఫోన్ కోసం చకోరి పక్షిలాగా ఎదురు చూస్తూ ఉంటే నన్ను తాగుబోతు అంటావా.

నా ఫోన్ కోసం నువ్వు ఎందుకు ఎదురు చూడాలి. అంత ఇంపార్టెంట్ మేటర్ ఏముంది.. ఇంపార్టెంట్ మేటర్ అని అంత మెల్లిగా అడుగుతావేమిటి...

లవర్స్ అంటే ఎప్పుడు ఫోన్ లోనే ఉండాలి.. సౌమ్య,  శ్రీకర్ ని ఇద్దరిని చూసి నేర్చుకో.  నిజమే లవర్స్ అయితే అలాగే మాట్లాడుకోవాలి కానీ మనం ఎనిమిస్ కదా ఎలా మాట్లాడుకుంటాము..

వైభవ్ మనసులో... ఇది పాత విషయాలన్నీ మనసులో పెట్టేసుకుంది రాక్షసి.. ఇప్పుడు సమయం వచ్చిందని నన్ను ఫ్రై చేయడం మొదలు పెట్టింది.

దీనిని ఎలాగైనా లైన్లో పెట్టుకోవాలి అనుకుని చందు అని గారంగా పిలుస్తాడు. ఒరేయ్ నువ్వు ఖాళీగా ఉండి ఏడిపించడానికి ఎవరూ దొరకలేదా.. పొద్దుపొద్దునే నాకు ఫోన్ చేశావు.

నేనెక్కడ ఖాళీగా ఉన్నాను ఫుల్ బిజీ. అయితే ఆ బిజీలో ఉండు. ఫోన్ పెట్టేయ్. నాకు చాలా పని ఉంది. నాకు తెలియక అడుగుతాను.

పని పని అని కొన్ని రోజుల నుంచి చాలా బిజీగా తిరుగుతున్నావు.  ఏం పని.. ఫ్యాషన్ షో ఏమైనా కండక్ట్ చేస్తున్నావా..

నేనేది చేస్తే నీకెందుకు. అరే లవర్స్ అన్నాక చెప్పుకోవాలి కదా... ఏమన్నా పర్మిషన్స్ అవసరం ఉంటే హెల్ప్ చేస్తాను. నాకేదైనా అవసరం ఉంటే చూసుకోవడానికి మా అమ్మ నాన్న ఉన్నారు.

అంతేకానీ ఎనిమీస్  దగ్గర హెల్ప్ తీసుకుని అంత విశాల హృదయం నాకు లేదు.

ఐ యాం సారీ చందు.  దేనికి నిన్ను ఇంతకుముందు చాలాసార్లు రాష్ గా మాట్లాడి హార్ట్ చేశాను కదా..  దానికే కదా నువ్వు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు.  ఆ మాటకి ఒక నిమిషం సైలెంట్ అయిపోతుంది.  నేను చెబుతుంది నిజమే కదా..

చూడు వైభవ్ నువ్వు నీ మనసులో మాటలు నువ్వు ఓపెన్ గా చెప్పావు.  అది పూర్తిగా నీ ఇష్టం.  దానికి నేను రియలైజ్ అయ్యి దూరంగా ఉండాలి కదా.. అది నా ఆత్మ అభిమానం .

ఇంక నన్ను ఏడిపించింది..  టీజ్ చేసింది చాలు.  నువ్వు ఎవరితో బెట్ కట్టావో నాకు తెలియదు కానీ ఇలా ప్రేమా ప్రేమా అని లేని ఫీలింగ్స్ తెచ్చుకొని నన్ను ఇబ్బంది పెట్టకు బాయ్ అని ఫోన్ పెట్టేస్తోంది.

పెట్టేసిన ఫోన్ వైపు చూస్తూ ఇదేమిటి నేను లవ్ చేస్తున్నాను అంటే ఎవరితోనో బెట్ కట్టి దీన్ని టీజ్ చేస్తున్నాను అనుకుంటుంది.
ఏంటి రా ఇది… ప్రేమ పోరాటం స్టార్ట్ కాకముందే ఓడిపోయానేమో..


విశిష్ట సూర్య బైక్ డ్రైవింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ముందు రోజు కన్నా ఈ రోజు ఇద్దరిలో కాస్తచనువు పెరుగుతుంది.

ఒకరినొకరు కామెంట్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఎలాగైనా సూర్యని టీజ్ చెయ్యాలి అని విశిష్ట ఆలోచిస్తూ ఉంటే  విశి ఆలోచనలు అర్థమయ్యి సూర్య నవ్వుకుంటాడు.


ఇద్దరూ మెల్లిగా అన్నవరం చేరుకుంటారు.  కిందే బైక్ ఒక పక్కకి పార్క్ చేసి అక్కడ దండం పెట్టుకుంటారు. సార్ మీరు బైక్ తీసుకొని వచ్చేయండి..నేను స్టెప్స్ ఎక్కి మెల్లిగా వస్తూ ఉంటాను.

నేను నడిచి వస్తాను అంటే స్వామి వద్దంటారా ఏమిటి.. అయ్యో నా ఉద్దేశం అది కాదు.. బైక్ ఇక్కడే ఉంటే ఎలా.. డోంట్ వర్రీ నా అరేంజ్మెంట్స్ నేను చేసుకుంటాను అని కాల్ చేసి మాట్లాడి వచ్చి వెళదామా.

మరి బైకు అది మనం వెళ్లేటప్పటికీ పైకి వచ్చేస్తుంది పద అని అక్కడ కుంకం పెట్టుకొని నడక మొదలు పెడతారు.

ఇద్దరూ స్టెప్స్ ఎక్కుతూ  విశి చుట్టూ చూస్తూ  ఎమోషనల్ అవుతుంది. సూర్య ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాడు. అప్పుడు విశి ని చూసిన రూపం గుర్తుతెచ్చుకొని నవ్వుకుంటాడు.

కొంచెం దూరం వెళ్లిన తర్వాత విశి గట్టు పైన కూర్చుంటుంది. సూర్యా  విశి ఫేస్ ని అబ్జర్వ్ చేస్తూ కొంచెం దూరంగా కూర్చుని ఏమి ఆలోచిస్తున్నావు.

ఈ గుడి తో నాకు చాలా అనుబంధం ఉంది సార్. మా పేరెంట్స్ కి చాలా రోజులు వరకు పిల్లలు లేకపోతే.. ఈ స్వామికి దండం పెట్టుకున్న తర్వాత నేను పుట్టాను అంట.

అందుకే నా ప్రతి పుట్టినరోజుకి నాన్నగారు ఇక్కడికే తీసుకువచ్చేవారు.  నాకు సంబంధించి ప్రతి ముఖ్య కార్యక్రమం ఇక్కడే మొదలుపెట్టేవారు.

నాకు నాలుగు, అయిదు సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు ఈ గుడికి వచ్చాము అంట.  అప్పుడు ఒక కోతి ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక ఫ్రెండ్ హెల్ప్ చేశారు అని నాన్నగారు అన్నారు.

ఆ ఫ్రెండ్ ఇచ్చినా రింగ్ నా మెడలో వేశారు. దీనిని ఎప్పుడూ తీయొద్దు అని నాన్నగారు మరి మరీ చెప్పేవారు. నాన్న ఉన్నన్ని  రోజులు ఎప్పుడూ తీయలేదు కానీ...

నాన్న దూరమయ్యాక ఎందుకో ఉంచుకోవాలి అనిపించలేదు..మళ్ళీ మీరు పరిచయం అయ్యాక ఇది నా మెడలోకి వచ్చింది మళ్ళీ నా సంతోషాలన్నీ ఒక దాని వెనకాల ఒకటి వస్తున్నాయి.

విశి చెబుతూ ఉంటే సూర్య మెడలో ఉన్న రింగ్ ని చేతితో పట్టుకొని ఇంకా కొన్ని గంటలే విశి.  నీ నోటితో చెప్పించి ఆ చిన్ననాటి స్నేహితుడిని నేనే అని చూపిస్తాను..

సంతోషాలు తిరిగి వస్తున్నప్పుడు ఈ విచారం ఎందుకు. నాన్న గుర్తొచ్చారు. ఎప్పుడు నా చెయ్యి పట్టుకుని నడిపించేవారు అని అరచేతుల్ని చూసుకుంటుంది.

ఏ నిమిషమైనా నేను నీ పక్కనే ఉంటాను అని ధైర్యం చెప్పిన నాన్న ఒక్కసారిగా దూరమయ్యేసరికి ఈ చేతులు బలహీన పడిపోయాయి.

సూర్య ఏ శబ్దం చేయకుండా
విశి చేతులను తన చేతుల్లోకి తీసుకుంటాడు.
అతని పట్టులో ఒక అర్థం… ఒక నమ్మకం… ఒక హత్తుకునే వెచ్చదనం ఉంటుంది.

సూర్య చాలా మృదువుగా.... ఇక నీ చేతులు బలహీనంగా ఉండవు విశి.
నీ నాన్నలా… కాకపోయినా…
నిన్ను ధైర్యం చెప్పేలా…
నీ పక్కనే నిలబడి ఉండే వాడి అవసరం నీకు ఉన్నప్పుడు..  నేను ఇక్కడే ఉంటాను.

అతని స్వరం గుడి గంటల శబ్దంలో కలిసిపోతుంది.
ఆ మాటల్లో ఒక తండ్రి ఇచ్చే భరోసా...
ఒక స్నేహితుడు ఇచ్చే అండ…
ఒక ప్రేమించే మనసు ఇచ్చే అర్థం... అన్నీ ఉంటాయి.

విశి కళ్లలో కన్నీరు రాలబోతే.. సూర్య  ఆ కన్నీళ్లు తుడిచి..
నీ సంతోషాలు ఇప్పుడు నీవే కాదు విశి…
మనిద్దరికీ వస్తున్నాయి.

విశి అర్థం కాకుండా చూస్తే అదే నీతో పాటు ఈ గుడికి వచ్చాను కదా అందుకే సంతోషాలు మనిద్దరికీ అని చెబుతున్నాను.

విశి ఆ నవ్వులోనే తన బాధ మర్చిపోతుంది.
సూర్య మాటల్లో నాన్న ఇచ్చిన ఆ భరోసా…
మళ్ళీ తన జీవితంలోకి తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తుంది.

సూర్య ఆ మాటలు చెప్పిన తర్వాత
గుడి మెట్లు మీద ఒక్కసారిగా నిశ్శబ్దం పెరుగుతుంది.
గాలి కూడా నెమ్మదిగా వీచుతూ
వారి మధ్య ఉన్న ఆ క్షణాన్ని గౌరవించినట్టుగా ఉంటుంది.

విశి మాటలు రావట్లేదు.
కన్నీళ్లు మాత్రం కళ్ల పొరల్లో నెమ్మదిగా చేరుతున్నాయి.
సూర్య ఆమె చేతులను విడిచిపెట్టకుండా... లేచి నిలబడి ఉన్న విశి ని  ఒక చిన్న మెట్టుపై కూర్చోమని చిన్నగా చెబుతాడు.

విశి నెమ్మదిగా కూర్చుంటోంది. సూర్య కూడా ఆమె పక్కనే..
కానీ తాకకుండా, దూరంగా కాకుండా అచ్చం ఆమెకి సపోర్ట్ అయ్యేంత దూరంలో కూర్చుంటాడు.

కొన్ని క్షణాలు ఇద్దరూ ఏ మాటా మాట్లాడరు.
వారి శ్వాసలు మాత్రమే వినిపిస్తున్నాయి.
గుడి గంటల శబ్దం దూరంగా ఆలపిస్తుంది.

విశి తన తలను కాస్త ముందుకు వంచి
కన్నీరు చిందకుండా ఆపుకుంటోంది.
అది చూసిన సూర్య నెమ్మదిగా
ఆమె భుజం వైపు తన చెయ్యిని తీసుకెళ్తాడు…
ఒక్క క్షణం ఆపేసి...
తన చెయ్యి ఆమెకు నిజంగా సాంత్వనం ఇస్తుందా అని
అన్నట్టు నిశ్శబ్దంగా చూస్తాడు.

విశి మాత్రం నెమ్మదిగా
స్వల్పంగా తన భుజం అతని వైపు వాలుస్తుంది.
అదొక్క సంకేతమే సూర్యకి.

సూర్య తన చేతిని ఆమె భుజంపై
సున్నితంగా ఉంచుతాడు.
ఏ ఒత్తిడి లేకుండా,
ఒక భరోసా ఉన్న స్పర్శలా.

విశి కళ్లలోంచి
చిన్నచిన్న కన్నీటి బిందువులు జారిపడతాయి…
కానీ ఈసారి అవి బాధ కన్నీళ్లు కావు..
విడిచిపెట్టిన బాధ...  చేరుకున్న సాంత్వనం.

సూర్య ఏ మాట మాట్లాడడు.
విశి ఏడుపు వినిపించకపోయినా
ఆమె శ్వాసలోని వణుకు అతనికి తెలిసిపోతుంది.
అతను నెమ్మదిగా తన బొటనవేలు తో
ఆమె భుజంపై చిన్న సర్కిల్స్ వేస్తాడు..
ఆ మాటలకన్నా గొప్ప ఓదార్పు.

కొద్దిసేపటికి విశి తన కళ్లను మూసుకుని
సూర్య భుజంపై తలను వాలుస్తుంది.
ఆ వాలుడు...
తన నాన్న చెయ్యి కోల్పోయిన తర్వాత
మొదటిసారి ఎవరిదో ఆధారంగా అనిపించే క్షణం.

సూర్య తల కిందికి వంచి
ఆమె తలపైకి చూడుతూ
ఒక చిన్న, ప్రశాంతమైన చిరునవ్వు ఇస్తాడు.
నేను ఉన్నా… నువ్వు ఒంటరిగా లేవు
అని ఆయన కళ్లే చెబుతున్నట్టు.

ఆ ఇద్దరి చుట్టూ గాలి కూడా
కొంచెం వెచ్చగా అనిపిస్తుంది.

అలా మాటల్లేకుండా…
వారి హృదయాలు మాట్లాడుతాయి.

విశి కాసేపటికి తేరుకుంది అనుకున్నాక ఇక వెళదామా అని అడుగుతాడు. హ్మ్.. అనిల్ లేచి నిలబడుతుంది.
విశి నడుస్తూ ఉంటే.. దూరంగా, దగ్గరగా కానీ రక్షణలా ఉన్న సైడ్ లో నడుస్తాడు.



వాళ్లు నడుస్తూ ఉంటే ఒక చిన్న పిల్ల అమ్మాయి అకస్మాత్తుగా జారిపడుతుంది. విశిష్ట  వెంటనే రియాక్ట్ అయ్యి ఆమెను పట్టుకుంటుంది.

సూర్య కాసేపు ఆశ్చర్యంగా చూసి...
హీరోయిన్ క్వాలిటీస్ స్లోలీ బయటకు వస్తున్నాయ్.
ఇది హీరోయిజం కాదు... ఒక మనిషిగా మరో మనిషికి చేస్తున్న సాయం.
అవునా అని నవ్వుకుంటాడు విశి పూర్తిగా నార్మల్ అయ్యింది అని మనసు తేలిక పడుతుంది.

ఇద్దరూ మెట్లకి  హమ్మయ్య అనుకుని చూస్తూ ఉంటారు. సరే ముందు రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి అప్పుడు గుడికి వెళదాము అదే రూమ్ కి వెళ్తారు.

రూమ్ కి వెళ్ళేటప్పటికి బైక్ అక్కడే ఉంటుంది.  అరె సార్ మీరు చెప్పినట్టుగా బైకు వచ్చేసింది. మీకు మాయలు మంత్రాలు తెలుసా.

దీనికి కూడా మాయలు.. మంత్రాలు కావాలా.. కాల్ చేసాము. బైక్ తెచ్చేవాళ్ళు తెచ్చి పెట్టేసారు అంతే.. పద స్నానాలు చేద్దాము అని రూమ్ కి తీసుకు వెళతాడు.  ఇద్దరు స్నానం చేసి రెడీ అవుతారు.

విశిష్ట చిలకపచ్చ రంగు పట్టు చీర కట్టుకుంటే.. సూర్య పట్టు పంచే, బనేను వేసుకుని పట్టు కండువా చుట్టూ కప్పుకుంటాడు.  ఒకరినొకరు అలా చూస్తూ నిలబడిపోతారు.

చూపులు కలిసిన శుభవేళ......
[+] 7 users Like SivaSai's post
Like Reply

Part - 98



ఎంతసేపు నిలబడి చూస్తూ ఉన్న ఇద్దరికీ తనివి తీరడం లేదు. తలుపు కొడుతున్న శబ్దం వినపడి ఈ లోకంలోనికి వస్తారు.

ఇద్దరూ ఒకరినొకరు ఇబ్బందిగా చూసుకొని నవ్వుకుంటారు. సూర్య వెళ్లి తలుపు తీస్తే...  సార్ మిమ్మల్ని గుడికి తీసుకువెళ్లి పూజ ఏర్పాట్లు చూడడానికి వచ్చాము.

సరే పదండి అని.. విశి కం అంటే సార్ ఇలాగంటే చాలా ఖర్చవుతుంది కదా...  ఇక్కడ నా ఫ్రెండ్ కి రిలేటివ్స్ ఉన్నారు.

అరేంజ్ చేశాడు అని చెబితే... అవునా అని సూర్య వెనకాలే వెళుతుంది.  నేను ఏది చెప్పినా నమ్మేస్తావా... అది నిజమా కాదా అని అడగవా..

అడగవలసిన అవసరం లేదు సార్ పదండి అంటుంది అంత నమ్మకం ఏమిటో.. ఆ నమ్మకం ఉంది కాబట్టే మీతో ఇంత దూరం వచ్చాను ఇంకా ప్రశ్నలు ఆపీ దర్శనానికి పదండి అని నవ్వుతుంది.


దీపాల వెలుగు, గంటల మోగుతున్న శబ్దం… ఇద్దరు జంటగా వెళుతూ ఉంటారు స్వామి ముందుకు వెళ్లగానే..
విశిష్ట చేతులు కలిపి నమస్కారం చేస్తోంది.
సూర్య ఆమెను చూస్తూ నెమ్మదిగా తన చూపు కిందకు వంచి నమస్కారం చేస్తాడు.

కాసేపు వారిద్దరూ పక్కపక్కనే నిశ్శబ్దంగా నిలబడుతారు.



పూజారి తులసి తీర్థం ఇస్తాడు. తులసి మాల విశిష్ట చేతికి ఇచ్చి సూర్యకి వేయమని చెబుతారు.
విశిష్ట రెండు చేతులతో తీసుకుని  సూర్య వైపు చూస్తుంది.
మెల్లిగా వేసుకో…
పూజారి గారు చెప్పింది నీకు వినపడలేదు అనుకుంటా నీ చేతులతో నా మెడలో వేయమన్నారు.
ఆ మాటలకి విశి బుగ్గలు సిగ్గుతో కందిపోతాయి. చేతులు వణుకుతూ ఉంటాయి.
ఆ సిగ్గుని ఎంజాయ్ చేస్తూ ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక..  ఆమె చేతుల్లోనుంచి తులసి మాల ని తీసుకుంటూ అతని వేళ్లు ఆమె వేళ్లను కేవలం ఒక సెకను తాకుతాయి…
విశిష్ట గుండె లైట్‌గా జారిపోతుంది.

వాళ్లు సైడ్ కారిడోర్ లో నిలబడి ఉంటారు. బాక్గ్రౌండ్ లో మంత్రాలు వినపడుతూ ఉంటాయి.

నిజం చెప్పానా విశి.. హ్మ్..

నీతో ఇక్కడ ఇలా నిలబడ్డానంటే… చాలా ప్రశాంతంగా ఆశ్చర్యంగా ఉంది. విశి సూర్య వైపు చూస్తూ నాకు అలాగే ఉంది.

ప్రసాదం తీసుకున్న తర్వాత వాళ్ళని తీసుకు వచ్చిన వాళ్ళకి థాంక్స్ చెప్పి ఒకచోట కూర్చుంటారు..


ఇద్దరూ కలిసి దిగువ మెట్లు వైపు నడుస్తారు.
సైలెంట్.. ప్రశాంతత కానీ చాలా దగ్గరగా..
వాళ్లు మెట్లు దిగుతున్నప్పుడు విశిష్ట ప్రసాదం కవర్ తీసి ఓ చిన్న ముక్క తీసుకుంటుంది.

సూర్య చేతిలోని కవర్ ఆమెకు చూపిస్తూ...
నువ్వు తీసుకో… నా దగ్గర కూడా ఉంది. కానీ సూర్య మనసులో విశి చేతిలో ఉన్న కొంచెం ప్రసాదం లోనే షేర్ చేసుకోవాలని ఉంటుంది.

అవసరం లేదు… ఇంత చిన్నది. కలిపి షేర్ చేసుకున్నాకే టేస్ట్ బాగుంటుంది తలవంచుకుని చెబుతుంది.
సూర్య  విశి వైపు తిరిగి... షేర్ …? నువ్వు నిజమే చెబుతున్నావా అని వస్తున్నా ఆనందాన్ని అనిచిపెట్టి  అడుగుతాడు.
కళ్ళు మాత్రమే పైకి ఎత్తి అలా ఎందుకనుకుంటున్నారు. అంటే నీ చేతిలో చాలా తక్కువ ఉంది కదా.. అదే నాకు షేర్ చేస్తాను అంటే డౌట్ వచ్చి...

మీకు ఇష్టమైతేనే తీసుకోండి అని చేయి వెనక్కి తీసుకోబోతుంది.  వెంటనే చెయ్యి పట్టుకుని అందులో ప్రసాదం నోట్లో వేసుకుంటాడు.


టెంపుల్ ఎంట్రన్స్ పక్కన వచ్చే గోడ ముందు సన్ ఫ్లవర్ యెల్లో లైట్ పడుతుంది.
సూర్య ఫోన్ తీసి...  ఫొటోస్ తీసుకుందాం?
టెంపుల్ లో సెల్ఫీస్ తీసుకోకూడదు.
టెంపుల్ లో కాదు మేడం.. పక్కన ఈ షాడో గ్లో లో తీసుకుందాం..

సూర్య కెమెరా అడ్జస్ట్ చేస్తూ..  స్మైల్ … కానీ టూ మచ్ కాదు.
చిన్నగా స్మైల్ చేస్తుంది. చీరలో తలలో పువ్వులతో.. సూర్య మనసు కొల్లగొడుతుంది.
క్లిక్.
క్లిక్.

ఓసారి ఫోన్ స్క్రీన్ చూపిస్తాడు.
యాక్టుల్లి … ఒకే గానే వచ్చింది.
ఒకే కాదు. నెక్స్ట్ వన్ … నాతో కలిపి.
విశి కళ్ళల్లో మెరుపు కానీ సూర్య మనసులో ఏముందో తెలుసుకోవాలి అని  ఏం…
ఫ్రెండ్షిప్ మూమెంట్. రిలాక్స్ … రెస్పెక్ట్ఫుల్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తా.

సెల్ఫీ లో ఇద్దరి ఫేసస్ దగ్గరగా కాకపోయినా… బాక్గ్రౌండ్ గ్లో వాళ్ల క్లోసనెస్ ను చాలా దగ్గరగా చూపిస్తుంది.

క్యూట్. ఫోటో గురించా... అవును… మోస్టలీ.

విశిష్ట ఉలిక్కిపడి మాట మారుస్తుంది.




ప్రసాదం ఫినిష్ అయిన వెంటనే, వాళ్లు చెప్పులు వేసుకుంటూ ఉంటారు.

టెంపుల్ లోకి వచ్చిన తర్వాత నీవు ఏదో డిఫరెంట్ గా ఉన్నావు.
ఎలా?
సాఫ్ట్. కామ్. నాతో ఏదైనా చెప్పాలా అని ఆపోజిట్ లో నడుస్తూ అడుగుతాడు.
విశిష్ట కళ్ళు గుండ్రంగా తిప్పుతూ  సరే… ఇప్పుడే రోడ్ కి వచ్చాం. బ్యాక్ టు నార్మల్.

సూర్య నవ్వుకుంటూ నడుస్తాడు.

కొన్ని అడుగులు నడిచి అకస్మాత్తుగా ఆగి..

ఒక్క నిమిషం.
అతను తన జుట్టు సరిచేసుకుని, ఆమె షోల్డర్ దగ్గర ఒక చిన్న పూల రేకు పడినట్టు తీసి...
ఇది… నిన్ను డిస్టర్బ్ చేస్తోంది.
విశిష్ట గుండె కొట్టుకుంటూ, మాట తడబడుతూ ... అది పూలరేకే కదా మీరెందుకు తీస్తున్నారు.
ఎందుకంటే… నన్నే నమ్మి వదిలేశావుగా....
అని అర్ధం కానంత నెమ్మదిగా చెప్పి ముందుకు నడుస్తాడు.

విశిష్ట అక్కడే రెండు సెకన్లు నిలబడి... అలాగే చూస్తూ ఉండిపోతుంది.  నిలబడింది చాలు గానీ రా అని పిలుస్తాడు.

రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఒకరు మంచం మీద, మరొకరు కుర్చీలో   సెటిల్ అవుతారు.

బయట అక్కడక్కడా వచ్చిన గుడి గంటల శబ్దం.
గదిలో డిం యెల్లో లైట్ …
ఒకే ఫ్యాన్ స్టేడీ గా తిరుగుతూ…
ఆ సైలెన్స్ లో వాళ్లిద్దరే ఉన్నట్టు అనిపిస్తుంది.
సూర్య చూపు నుంచి తప్పించుకోవాలని తప్పించుకోవాలని...
విశిష్ట విండో దగ్గర నిలబడి బయటకు చూస్తోంది.
అన్నవరం హిల్ లైట్స్ అలా పూసిన ఫైర్ ఫ్లైస్ లాగా మెరుస్తున్నాయి.

సూర్య ఆమెను చూసి కాసేపు ఏమీ మాట్లాడకుండా నిలబడతాడు.
ఆమె నిశ్శబ్దం అతనిలోని నిగ్రహానికి పరీక్ష పెడుతూ ఉంటుంది.

సూర్య కష్టంగా అలసిపోయావా అని అడుగుతాడు.
విశిష్ట నవ్వి కొంచెం. కానీ ఈ అలసట బాగుంది ప్రశాంతంగా అనిపిస్తుంది.

సూర్య కుర్చీలో కూర్చుని  ఆమె వైపు చూస్తూ ఉంటాడు.

విశిష్ట జడ విప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. జడ చిన్నగా ముడిపడి విప్పుకోవడానికి అవస్థలు పడుతూ ఉంటుంది.
విశి అవస్థ ద చూసి సూర్యా మెల్లిగా దగ్గరికి వస్తాడు.

ఇస్తావా..
ఏమిటి..

నీ జడతో ఇబ్బంది పడుతున్నావు కదా హెల్ప్ చేస్తాను. మీరు..
అవును. డోంట్ వర్రీ. నేను ఏం నీ జడని చిక్కులు చెయ్యను.

విశిష్ట జడను వెనక్కి వేస్తుంది. ఆ బ్రాడ్ నెక్ పైన ఉన్న జడ ని చూసి సూర్యాకి చెమటలు పడతాయి.
అతను చాలా నెమ్మదిగా.. విశి ఇబ్బంది పడకుండా ఆ చిక్కులన్నీ వేళ్ళతో తీస్తాడు.

ఆమెకు అతని శ్వాస కూడా ఫీల్ కాకుండా...
సూర్య చాలా రెస్పెక్ట్ఫుల్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తాడు.

ఇదిగో… అయిపోయింది.
విశిష్ట.చిన్నగా థాంక్స్ …

ఆ ఒక్క మృదువైన స్పర్శ..
ఆ ఒక్క నిశ్శబ్దమైన దగ్గరతనం. ఆమె హృదయ స్పందనని పరుగులు పెట్టించింది.



రూమ్ లో ఒక బెడ్, ఒక  సోఫా..
మీరు మంచం మీద పడుకోండి నేను సోఫాలో పడుకుంటాను.

అవసరం లేదు. నాకు సోఫా సరిపోతుంది నీకే నిద్రంటే ప్రాణం అని నవ్వుతాడు. ఆ మాటకి బుంగమూతి పెట్టుకొని డ్రైవింగ్ చేసేది మీరు అలాంటప్పుడు రెస్ట్ కావాల్సింది మీకే కదా..
నేను ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వగలను కానీ అతి సుకుమారివి నువ్వే అడ్జస్ట్ అవ్వగలవా..

ఆ మాటతో ఆమె ఒక సెకను మాటేరాని బొమ్మ అవుతుంది ప్రతి మాటలోనూ ప్రతి చర్యలోనూ తన తండ్రి గుర్తుకు వస్తున్నాడు ఇది ఒక అద్భుతమే కదా అనుకుంటూ చూస్తూ ఉంటుంది.

లైట్స్ ఆఫ్ చేసి విండో నుంచి వచ్చే చందమామ వెలుగుని చూస్తూ మాట్లాదూకుంటారు.
చాలా థాంక్స్ సార్. దేనికి. ఎందుకో మీకు తెలుసు.  కానీ తీసుకోవడం నాకు ఇష్టం లేదు.  ఎందుకో...  ఆ థాంక్స్ మనిద్దరి మధ్యన దూరం పెంచుతుంది.

నీకు కావాలేమో గాని నాకు అక్కర్లేదు అని తన మనసులో మాట చెప్పకనే చెబుతాడు.

విశిష్ట బ్లష్ అవుతుంది.

ఆమె సైలెంట్ గా నవ్వుతుంది.

కళ్ళు మూతలు పడుతూ ఉంటే వారిద్దరి మధ్యన సైలెన్స్ ముందుకు వెళ్ళను అని మారం చేస్తూ ఉంటుంది.

గుడ్ నైట్ … సార్
గుడ్ నైట్... విశి.


ఇద్దరూ నిద్రపోయినా…
ఆ రాత్రి వాళ్లు దూరంగా కాదు.
శబ్ధం లేకుండా దగ్గరయ్యారు.
గది నిశ్శబ్దంగా ఉంది.
ఫ్యాన్ శబ్దం స్టేడీ … బయటి నుంచి వచ్చే టెంపుల్ హిల్ బ్రీజీ కిటికీని కొంచెం కొట్టుకుంటోంది.

విశిష్ట పడుకున్నా నిద్ర మాత్రం రాదు. గుండెల్లో ఏదో తెలియని కొత్త బరువు.  ఇది కొత్త ప్లేస్ అవడం వలన లేక దేవ సార్ తో ఉండడం వలన.. మే బి సార్ వలన ఏమో..

కొంతసేపు తిరుగుతూ చివరికి మెల్లగా సోఫా వైపు చూస్తుంది.
సూర్య అక్కడ నిద్రలో.. ఒక చేతిని తలకి వెనక పెట్టుకుని.. నిద్రపోతూ ఉంటాడు ఆ శ్వాస చెబుతూ ఉంది సూర్య డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాడు అని.

సూర్యని అలా చూడగానే విశికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ ఆ ప్రశాంతతలో తెలియని అలజడి.


సార్ రోజు రోజుకి నాకు తెలియకుండానే మీకు దగ్గర అయిపోతున్నాను.  నచ్చేస్తున్నారు.  ఎంతగా అంటే ఆలోచిస్తూ మాటల్లో చెప్పలేకపోతున్నాను.

ఈ నిమిషం ఇలా మీ దగ్గరికి వచ్చి గట్టిగా హత్తుకుని ఐ లవ్ యు సార్ అని చెప్పాలని ఉంది.  చెప్పాక మీరు ఏమనుకుంటారో అని భయంగా ఉంది కానీ ఎలాగైనా సరే ఈ కొండపైన మీకు నేను ప్రపోజ్ చేస్తాను నా ప్రేమ మొత్తం చూపిస్తాను.

విశి కోరిక తీరుతుందా...........
[+] 7 users Like SivaSai's post
Like Reply

Part - 99



వైభవ్ ఫోన్ వైపు చూస్తూ కూర్చుంటాడు. ఎంతసేపు చూస్తున్నా ఫోన్లో ఏమీ కనిపించదు అన్నమాట వినిపించగానే వెనక తిరిగి చూస్తాడు.

అక్కడ తండ్రి ఉంటే నాన్న అని చంక ఎక్కి ఏడుస్తూ ఉంటాడు. ముందు దిగరా.. నువ్వు ఏమైనా చంటి పిల్లోడివి అనుకుంటున్నావా..

మొయ్యలేకపోతున్నాను. నేను ఏడుస్తూ ఉంటే ఓదార్చడం మానేసి తిడుతున్నారా..  అమ్మకు చెబుతాను. ముందు దిగాహే అని కిందకి దింపి ఇప్పుడు చెప్పు ఏమయిందో..

చందు నా ప్రేమనే అనుమానిస్తుంది.. సరిగ్గా చెప్పు చావు. అరే నేను ప్రేమిస్తున్నాను అంటే ఎవరితోనో బెట్ కట్టి నన్ను టీజ్ చేయాల్సిన అవసరం లేదు.

ఇలాంటి పిచ్చి పనులు మాను.. నేను బిజీ అని పెట్టేసింది. నేను ప్రేమిస్తున్నాను అని చెబితే అంత కామెడీగా ఉందా.. అసలు పట్టించుకోలేదు.

ప్రేమిస్తున్నాను అని చెబితే సరిపోదు రా దాన్ని సిన్సియర్గా ఎక్స్ప్రెస్ చేయడం రావాలి. ఏం చేయాలి నాన్న. అప్పటికి సినిమాలు చూశాను. బుక్స్ చదివాను. అవన్నీ ప్రిపేర్ అయ్యి మరీ చెప్పాను. అందుకే నీకు బెడిసి కొట్టింది.

మీ అన్నయ్యని చూడు ప్రేమిస్తున్నాను అని నోటితో చెప్పడం లేదు చేతల్లో చూపిస్తున్నాడు.  పక్కనే ఉంటే మీ బాబి ఎంత భరోసాగా ఫీల్ అవుతుంది.

ఆ భరోసాని నువ్వు చందు కి ఇవ్వు.  అర్థం అయింది. ఇప్పుడు చందు ఏదో వర్క్ లో బిజీగా ఉంది కదా...దానితోనే ఉంటూ ఆ వర్క్ లో అంతా హెల్ప్ చేయాలన్నమాట..

అంతే కదా..  ఇంచుమించు అలాంటిదే..  కాకపోతే సెటైర్లు వేయడం కామెడీ చేయడం తగ్గించు.. అయ్యో నాన్న దాన్ని చూడగానే నా నోరు ఆగదే.. అందుకే అది నిన్ను నమ్మడం లేదు.
వైభవ్ ముఖం చిట్లించి, కిందికి చూస్తాడు.
అంటే నాన్నా… నేను చాలా ఓవర్‌యాక్ట్ అవుతానన్నమాట?

వినయ్ నవ్వేస్తాడు.  ఓవర్ యాక్ట్ కాదు రా… ఓవర్ లౌడ్. చందు ఎంత గలగల మాట్లాడేది అలాంటిది ఎందుకో సైలెంట్ అయిపోయింది.
అది ఎందుకో అర్థమైనా వైభవ్ కామ్ అవుతాడు.  ఏంట్రా చందు కామ్ అయిందంటే నువ్వు సైలెంట్ అవుతున్నావు.

వైభవ్ మెల్లిగా నవ్వుతాడు. అలాగైతే నేను నోరు మూసుకుంటా.

అది కాదు రా..తండ్రి అతని భుజం మీద చేయి వేసి,  చందుకి నువ్వు కోపంగా కాకుండా… సీరియస్ గా, హార్ట్ నుంచి మాట్లాడటం కావాలి. అదే నమ్మకం.

అంతలో వైభవ్ ఫోన్ తిరిగి చెక్ చేస్తాడు.
చందు నుంచి రిప్లై లేదు.

ఇంకా మెసేజ్ చేయలా? అంటూ వైభవ్ మెల్లిగా అనుకుంటాడు.

లేదురా… ఇప్పుడే నువ్వు ఫోన్ చేసి మాట్లాడిన తింగరవాగుడికి  రిప్లై ఇవ్వడానికి సమయం కావాలి అమ్మాయికి. నువ్వు వెంట వెంటనే మెసేజ్ లు పెడితే అది మరీ… నీ ఖర్మ

స్టాకర్ లా కనిపిస్తానా…?

అదీ కాదు రా. కానీ నీ టెన్షన్ మొత్తం ఆమెకి ఫార్వర్డ్ అవుతుంది. కాస్త స్పేస్ ఇవ్వి. ఆ స్పేస్ లోనే నువ్వు నీ పని ఆలోచించు...ఆమెకి ఎలా భరోసా ఇవ్వాలో.

వైభవ్ కళ్లలో చిన్న మెరుపు పడుతుంది. నాన్న… నేను నిజంగానే చందు ను మిస్ అవుతున్నాను. ఫన్నీగా కాకుండా, రియల్‌గా చెప్పాలని ఉంది.

వినయ్ చిరునవ్వు. అదే రా ప్రేమ. ఇప్పుడు ఒక పని చేస్తావా?

ఏంటి నాన్న?

చందు ఎదో వర్క్ బిజీ లో ఉంది అని తెలిసినది కదా…? అసలు ఆమె ఏ బాధలో ఉందో, ఏ పనిలో బిజీగా ఉందో… ఆ సమయానికి ఆమెకి బెస్ట్‌గా ఏం హెల్ప్ అవుతుందో ఆలోచించు. నువ్వు వెళ్లి మాట్లాడడం కాదు… పని చాలా టైట్‌గా ఉంటే చిన్న థాట్‌ఫుల్ మెసేజ్, చిన్న హెల్పింగ్ యాక్ట్… అలాంటి జెస్టర్స్.

వైభవ్ చెవులు ముందుకు పెట్టి వింటూ ఉంటాడు.
అంటే… చందు పని తగ్గించడమా?

అవును రా. నీ ఫన్నీ జోక్స్ లో చిక్కుకోకుండా, ఆమె స్ట్రెస్ తీయడం నీ పని.

అది నేను చేస్తాను నాన్న! ఆమె పని, ఆమె డెడ్‌లైన్, ఏదైనా నేనేం సాయం చేయగలనో…
అంతలో ఉసురుమంటూ చూస్తూ.. కానీ ఒకటి చెప్పు నాన్న.. నేను సెటైర్లు మొత్తం ఆపేయాలా?

వినయ్ ఊపిరి తీసుకుంటూ.. పది లో ఏడు ఆపు.

అయ్యోఓఓ...

అదే ఎక్కువ రా… చందుకైతే అతి.

వైభవ్ నవ్వి తల గోక్కుంటాడు. సరే. ఈరోజు నుంచే పర్ఫెక్ట్ లవర్ అవుతా. చందు నన్ను తిరిగి నమ్మాలి.

వినయ్ అతని వెన్నుపై తడతాడు.
అదే కావాలి రా. నీ హృదయం సీరియస్‌గా ఉంటే… నీ మాటలు కూడా ఒక రోజు సీరియస్‌గా వినిపిస్తాయి.

వైభవ్ లోలోపల కాస్త కాన్ఫిడెన్స్ రావడం మొదలవుతుంది. నాన్నా… ఇప్పుడే వెళ్తా. చందు ఏం వర్క్ చేస్తుందో చెక్ చేస్తా… ఏదైనా హెల్ప్ కావాలంటే నేనే ముందు నిలబడతా.

వినయ్ నవ్వుతూ..  అయితే పో. కానీ...

మరేం నాన్న… అని వైభవ్ తిరిగి చూస్తాడు.

ఈ సారి ఫోన్ ముందు కూర్చుని ఏడవకు. అవసరం వచ్చినప్పుడు మాట్లాడి,  సెన్సిబుల్‌గా హ్యాండిల్ చెయ్యి.

వైభవ్ చేతిని ఎత్తి సల్యూట్ పెట్టాడు.
యెస్ సర్.. అంటూ బయటకి ఉత్సాహంగా పరుగెత్తుతాడు.

కొడుకు అల్లరి చూసి నవ్వుకుంటాడు..ఇంత వయసు వచ్చిన వీడికి అల్లరి పోలేదు. నీకేమైనా తగ్గిందా.  అరే నువ్వు ఎప్పుడు వచ్చావు పూజిత.

కొడుకుకి ప్రేమ పాటలు నేర్పిస్తున్నప్పుడు వచ్చాను. మనలాగా వాళ్ళు కూడా క్యూట్ లవర్స్ అవ్వాలి కదా..

మనం లవర్స్ అని ఎవరు చెప్పారు.  నిజమే నువ్వు లవ్ చేసావు నేను చేయాల్సి వచ్చింది అంతే కదా..  మిమ్మల్ని అని చెయ్యెత్తితే అరిచేతి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ బంగారం.

ఈ వేషానికి ఏమీ తక్కువ లేదు.  పదండి అని నవ్వుతుంది. నీ నవ్వు చాలే బతికేయడానికి..

వైభవ్ రాజ్ ఇంటికి వెళ్లి హాయ్ మావయ్య అని పిలిస్తే ఏంట్రా పొద్దున్నే నీ గాలి ఇటు మళ్ళింది. మా అత్తయ్య ఎలా ఉందో...నువ్వు ఎలా చూసుకుంటున్నావో అని బెంగపడి వచ్చాను మావయ్య.

ఒరేయ్ నువ్వు తిన్నగా మాట్లాడు. లేనిపోని మాటలు మాట్లాడి కొత్త అనుమానాలు పుట్టించి మా మధ్యన పుల్లలు పెట్టకు.
నివి వచ్చి ఒరేయ్ ఎంతసేపయిందిరా..  టిఫిన్ చేసావా వేడివేడిగా పూరీలు వెయ్యనా.  మాకేమో ఇడ్లీలు నీ మేనల్లుడికి పూరీలా.

అబ్బా మీ వయసుకి ఇడ్లీయే తినాలి.  డైజేషన్ బాగుంటది. వాడు వయసులో ఉన్నాడు. ఏది తిన్న  అరుగుతుంది.  నా వయసు ఏమన్నా ఎక్కువ.

ఏదో 70 ఏళ్ళు వయసు ఉన్న వాడిని అన్నట్టు చెబుతున్నావు.

అయ్యో మావయ్య మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈజీ డైజేషన్ వి తింటే ఎప్పటికీ యంగ్ డైనమిక్ గా ఉంటారని అత్తయ్య ఉద్దేశం.

అత్తయ్య మిమ్మల్ని హీరోలాగా చూడాలి అనుకుంటే దాన్ని మీరు తప్పుగా అనుకుంటున్నారు.
నివి ముక్కు చీదుతూ అంతే రా నేను ఎంత చేసినా మీ మావయ్య అలాగే పేర్లు పెడతారు.

రాజ్ ఒక నమస్కారం చేసి ఇద్దరూ కిచెన్ లోకి వెళ్లి ఏది కావాలో అది చేసుకోండి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి.
ఇది బాగుంది. పద అత్తయ్య అని కిచెన్ లోకి తీసుకువెళతాడు.

నివి పూరీ కోసం పిండి కలుపుతుండగా వైభవ్ కూర్చుంటాడు.
రాజ్ నీళ్ళ గ్లాస్ పక్కకు తోసుకుంటూ... పక్కనే సెట్టిల్ అవుతాడు. మళ్లీ మీరు ఎందుకు వచ్చారు. మా ఆవిడ ఎంత అలసిపోతుందో చూద్దాం అని..
మీ మావయ్యకి ఒళ్లంతా వెటకారమే.. ఏమిటి మీ సింహ ఫ్యామిలీ కన్నానా..
మావయ్య మీకు ఏదైనా కావాలా.. టీ కావాలి. మీ ఇద్దరి గోలకి నా బ్రెయిన్ ఆన్ అవదు.

మావయ్య… మీ బ్రెయిన్ ఆఫ్ అయ్యే టైం ఏదైనా ఉందా? 24/7 పనిచేస్తుంది కదా. టర్బో మోడ్‌లో.

ఒరేయ్! నన్ను పొగిడుతున్నావా లేక పరోక్షంగా ఏమైనా తిడుతున్నావా..

పొగడ్తే మావయ్య. మీ లెవెల్‌కి రావాలంటే నేను రెండు జన్మలు ఎత్తాలి.

నివి నవ్వుతూ...రెండేమో… మూడు ఎత్తాలి. మీ మామయ్యకి ఈగో కూడా కాస్త ఎక్కువ.
నాకు ఈగో అని పైకి చూస్తాడు. ఏం లేదా మావయ్య..

ఎంతన్నా మాట్లాడండి… కానీ ఇప్పుడైనా ఒకరు టీ చేస్తారా? లేక నేనే చేసికోవాలా?


అయ్యో వద్దు మావయ్య… మీరు చేసిన టీ అంటే ప్యారాసిటమాల్ డ్రింక్‌లా ఉంటుంది. మీ చేతుల మీద నమ్మకం లేదయ్యా..

నువు చేసిందే టీనా? గతసారి చక్కర వేసినట్టు వేసావ్… కానీ రుచి మాత్రం పానకం..

చాలు మీ ఇద్దరూ! నేను చేస్తా… కానీ రాజ్ మీకు షుగర్ లేకుండా, వైభవ్‌కి స్పెషల్‌గా అదనంగా చక్కర.

నాకెందుకు షుగరు వద్దు.  డైట్ అండి.  తల పట్టుకుంటాడు.

ఏమయింది మామయ్య. హెడేక్ వస్తుందా. చందు ఉందా ఇంట్లో.  ఇప్పుడు చందు తో నీకేం పని రా..  చందు ఉంటే మీ హెడేక్ కి మెడిసిన్ తెస్తుందేమో అని చందు చందు అని పిలుస్తూ ఉంటాడు.

చందు పలుకుతుందా........
[+] 9 users Like SivaSai's post
Like Reply

Part - 100


ఏమయింది మామయ్య. హెడేక్ వస్తుందా. చందు ఉందా ఇంట్లో.  ఇప్పుడు చందు తో నీకేం పని రా..  చందు ఉంటే మీ హెడేక్ కి మెడిసిన్ తెస్తుందేమో అని చందు చందు అని పిలుస్తూ ఉంటాడు.

అది లేదురా.  పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది.  దానికి కూడ పనులు ఉంటాయి కదా..  అబ్బా నెల పైనుంచి చూస్తున్న పనీ పనీ పనే అంటున్నారు కానీ ఏం పనో చెప్పడం లేదు.

చెబితే నేనేమైనా హెల్ప్ చేయడానికి ఉంటుంది కదా.. రాజ్  పైనుండి కిందకు చూస్తాడు.  ఏంటి మామయ్య అంత ప్రేమగా చూస్తున్నావు.  నీ మాటలేవో తేడాగా వినిపిస్తూ ఉంటే..

ఏ..  గ్రామర్ మిస్టేక్ వచ్చిందా.. కాద కాని.. సెంటెన్స్ ఫార్మేషన్ లో ఏవో తేడాలు కనిపిస్తున్నాయి. అందుకే డౌట్ వచ్చి చూస్తున్నాను.  ఏంట్రా సంగతి.

కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఏమంటుంది మామూలుగానే అడిగాను.  ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినా నన్ను టార్చర్ పెట్టి మరీ తీసుకువెళ్ళేది.  కాకిలాగా అరుస్తూ నా బ్రెయిన్ తినేది.

నన్ను ఆలోచించుకోనివ్వకుండా పరుగులు పెట్టించేది. అలాంటిది ఈ మధ్యన అసలు నాకు చెప్పడం మానేసింది. మాట్లాడడం మానేసింది.  సైలెంట్ గా చూస్తుంది.

ఏం జరుగుతుందో నాకు తెలియాలి తెలియాలి అని ఆ పూరి పిండి పైన గుద్దుతూ ఉంటాడు.  ఒరేయ్ ఎక్కువగా నీ ప్రెస్టేషన్ చూపించకు రా బాబు..

ఆ పిండి మరీ మెత్తగా అయిపోతే ఆయిల్ పీల్చేస్తాయి అని నివి గబగబా తీసుకుంటుంది.  అత్తయ్య నేనింత ఎమోషనల్ గా చెబుతూ ఉంటే నీ పిండి ఆయిల్ అని మాట్లాడుతావేమిటి..

రాజ్ నవ్వుతూ ఆడవాళ్లు అంటే ఏమనుకుంటున్నావు..  మన ఎమోషన్స్ కన్నా వాళ్ళ వర్క్ వాళ్ళకి ఇంపార్టెంట్. అవునవును నీ కూతుర్నే చూస్తే బాగా తెలుస్తుంది.

అది ఎక్కడికి వెళ్ళిందో చెప్పకుండా ఏదేదో చెబుతావేంటి మావయ్య అని విసుగ్గా అంటే... ఏరా నా కూతుర్ని అంతగా మిస్ అవుతున్నావా..

మిస్ అవ్వడం కాదు ఏమీ కాదు.. అది ఏం చేస్తుందో తెలియక ఎక్కడైనా ప్రాబ్లం లో ఉందా ఏమిటా అని అడుగుతున్నాను అంతే.

ఒరేయ్ నిజాలు చెప్పడానికి ఎంత ధైర్యం కావాలో... ఒప్పుకోవడానికి కూడా అంతే ధైర్యం కావాలి. ఆ రెండు లేనప్పుడు ప్రేమ ముందుకు వెళ్లదు.

ప్రేమ ఏంటి అని అడిగితే... కొయ్యి కొయ్యి మేము అందరం ఈ వయసు దాటి వచ్చిన వాళ్లము కాదా ఏమిటి..

ఉఫ్.. అనుకుని నడుం మీద చేతులు పెట్టుకొని ఓకే మీ ఇద్దరికీ మేటర్ అర్థమైందని నాకు అర్థం అవుతుంది. అవును అదంటే నాకు ఇష్టం.

ప్రేమిస్తున్నాను కానీ నేను చెబుతుంటే అది పిచ్చ లైట్ తీసుకుంటుంది. టీజ్ చేస్తున్నాను అనుకుంటుంది. ఎలా దానికి నా ప్రేమను తెలిపేది.

నువ్వు చెప్పు అత్తయ్య. చిన్నగా నవ్వుతూ నమ్మకం రా.. నాన్న కూడా ఇదే ముక్క చెబుతున్నారు.  అరే నమ్మకం కలిగించాలి అంటే ఏం చేయాలి దాని కాళ్లు పట్టుకోవాలా..

కాళ్లు కాదు మనసు పట్టుకో.  అది ఎలాగా అని అడుగుతున్నాను.
వైభవ్ చెంప మీద చెయ్యి వేసి నివి కాస్త దగ్గరికి వచ్చి మెల్లిగా నవ్వుతుంది…

మనసు పట్టుకోవడం అంటే… మాటలతో కాదు రా … నీ ప్రెసెన్స్ తో.
ఆమె నీ దగ్గర ఉన్నప్పుడు ఆమెకి వచ్చే ఫీలింగ్‌… అదే నమ్మకం.

అది ఎలా క్రియేట్ చేయాలి అత్తయ్య… నేను ఫీలింగ్స్ చెబితే అది సీరియస్‌గా తీసుకోదు… నవ్వేస్తుంది… టీజ్ చేస్తున్నాను.  ఎవరితో బెట్టుకట్టి దీన్ని ఏడిపిస్తున్నాను అనుకుంటుంది . నేను నిజంగా చెప్పాలనుకున్నప్పుడు కూడా పిచ్చి ఫన్‌గా మార్చేస్తుంది.

అది అమ్మాయి. అలానే చేస్తుంది రా. భయపడుతుంది.
నీ మాటల్ని తప్పుగా అర్ధం చేసుకుంటే… అని ఊహించుకుని మౌనంగా ఉండిపోతుంది.

అమ్మాయిలకి కూడా భయం ఉంటుందా? అన్నట్టు నిజంగా ఆశ్చర్యపోతూ అడుగుతాడు.

ఎక్కువగానే ఉంటుంది. నీకు ఆమె మీద ఫీలింగ్ ఉందని తెలుసు.
కానీ ఆమెకు నీ ఫీలింగ్ ఎంత లోతుగా ఉందో తెలియదు.
అందుకే జోక్‌లోకి మార్చేస్తుంది…  సేఫ్‌గానే ఫీల్ అవ్వడానికి.

వైభవ్  కాసేపు మౌనంగా కూర్చుంటాడు. చేతిలోని పూరి పిండి ని మెల్లగా గుద్దుతూ, తనలోనే ఏదో లెక్కేసుకుంటాడు.

అంటే నేను ఎప్పుడో ఒక రోజు డైరెక్ట్‌గా… సీరియస్‌గా… లైట్ లేకుండా చెబితేనేగా?

నివి కన్నుచూపుతో హమ్మయ్య ఇపుడు అర్థమైంది అన్నట్టు తల ఊపుతుంది.

సీరియస్‌గా చెప్పడం కాదు వైభవ్..
సరిగ్గా ఆమె ఒంటరిగా ఉన్నపుడు…
ఎవరూ లేకపోయినపుడు…
నీ మాటలు ఆమె హృదయానికి నేరుగా చేరేలా చెప్పాలి.

ఫన్నీ టైంలో ప్రేమ చెప్పావంటే… అది కూడా జోక్ అయ్యిపోతుంది.

వైభవ్  ఆలోచనగా పైకప్పు వైపు చూస్తాడు.

కానీ అత్తయ్య… ఈ మధ్యనే అది నాకు దూరమవుతున్నట్టు ఉంది. నాతో మాట్లాడడం తక్కువ… నా దగ్గర ఉండడం తక్కువ… ముందులా గిగిల్స్, ఫైట్, టీజ్ ఏమీ లేదు. అంతా సైలెంట్. ఇది ఎందుకు?

నివి ఉప్పు వేస్తూ చిన్నగా చిరునవ్వు నవ్వుతుంది.

ఒక అమ్మాయి అకస్మాత్తుగా సైలెంట్ అవుతుంది అంటే…
అది ఏం జరుగుతుందో తెలుసా?

వైభవ్ కళ్ళు పెద్దవిగా చేసి ఏమిటి అత్తయ్య? అని అడుగుతాడు.

అత్తయ్య జాగ్రత్తగా వైభవ్ వైపు చూసి… రెండు కారణాలు ఉంటాయి.

ఒకటి నీ మాటలకి, ప్రవర్తనకి దాని మనసు గాయమవుతే దూరంగా ఉండడం.
ఆ మాటకి వైభవ్ ఆలోచిస్తూ ఉంటాడు.
మరి రెండో విషయం..

నివి నవ్వుతూ..

అది తను నిన్ను అవాయిడ్ చేయడం కాదు రా…
తన ఫీలింగ్స్ ని హ్యాండిల్ చేయలేక… నీ నుండి దాచుకుంటుంది.
మీ మీద ప్రేమ పెరిగిపోయినప్పుడు అమ్మాయిలు ఇలా సైలెంట్ అవుతారు.

ఇప్పుడు ఆలోచించుకో మీ ఇద్దరి మధ్య ఉన్నది ఏమిటో..

వైభవ్ ఒక్కసారిగా నిశ్శబ్దమవుతాడు… ఆలోచిస్తూ ఉంటాడు చందుకే నా మీద ఉన్నది ఏమిటి.. ఏదో స్ట్రైక్ అయినట్టుగా.. అంటే చందుకి... నిజంగా నా మీద...

నివి నవ్వుతూ గిన్నె అందుకుంటుంది.

అవును.  అదే తేడా. అదే భయం.
అదే నిశ్శబ్దం.

వైభవ్ చెవులు కొంచెం ఎర్రబడతాయి.

అత్తయ్య… నేను ఏం చేయాలి ఇప్పుడు?

ఒక మంచి టైం చూసి.. అది ఎందుకు అలా ఉంటుందో తెలుసుకో.. మాట్లాడదు.నీకు చెప్పకపోవచ్చు. అదే స్మైల్ మైంటైన్ చేస్తూ ఉంటుంది.

కానీ పట్టు వదలని విక్రమార్కుడు లాగ నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి . ఎందుకు దూరమవుతోంది…
ఏం ఫీలవుతోంది… అన్నీ నెమ్మదిగా అడుగు.
అవసరం అయితే కొంచెం దగ్గరికి తీసుకో…
నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావని… జస్ట్ లైట్ మాట కాదని… చందు ఫీలయ్యేలా చూపించు.

వైభవ్ లోపల ఏదో వెలిగినట్టు, కళ్ళల్లో కొత్త స్పార్క్.

సరే అత్తయ్య… ఈ రోజు చందుతో ఎలాగైనా మాట్లాడతాను..  ఇక లైట్‌గా కాదు..  నిజంగా మాట్లాడతా.

నివి నవ్వుతుంది. రాజ్ చంప పైన చేయి వేసుకుని ఇద్దరినీ చూస్తూ ఇక్కడ నేను ఒకడిని ఉన్నాను. అది ఏమైనా గుర్తిస్తున్నారా..

అబ్బా మావయ్య ఇప్పుడు నేను గుర్తించకపోయినా వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఇంతకీ నీ ముద్దుల కూతురు ఎక్కడికి వెళ్ళింది ఇది మాత్రం నేను చెప్పాల..  చెప్పను పో అని ఇంకో పక్కకి తిరుగుతాడు.

నువ్వు చెప్పకపోతే ఏమైంది.  మా అత్తయ్య చెబుతుంది కదా అని బుగ్గన ముద్దు ఇచ్చి చెప్పు అత్తయ్య  సౌమ్య కాలేజ్ కి వెళ్ళింది.

అవును ఈ మధ్యన సౌమ్య కాలేజ్ చుట్టూ తిరుగుతుంది. ఎందుకు.  వెళ్లి నువ్వే అడుగు. సరే బాయ్ అత్తయ్య. ఒరేయ్ తినేసి వెళ్లు రా.

అక్కడ నీ కూతురుతో తింటాలే మావయ్యకి పెట్టేసేయ్ అని వెళ్ళిపోతాడు.

చెయ్యమంటారా. ఎందుకు నాకు ఇడ్లీ పెట్టావు కదా..  వాడికే పూరి అన్నావు.  వాడు వద్దు అన్నాడని నాకు పెడుతున్నావా.  అబ్బా చిన్న పిల్లాడితో మీకేంటి అండి..

వైభవ్ కాలేజ్ ముందు బైక్ ఆపి సౌమ్యకి కాల్ చేస్తాడు. నవ్వుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పు. ఎక్కడుంది అది.  ఇక్కడే.. సరే నేను వస్తున్నాను అని సౌమ్య దగ్గరికి వెళతాడు.

వాళ్ల కూర్చున్న చోట వైభవ్ అక్కడ కుర్చీలో కూర్చొని గాగుల్స్  తీసి షర్టుకి తగిలిస్తాడు. చందు చూసిన చూడనట్టుగా సౌమ్య ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటుంది.

వైభవ్ మాత్రం ఇంటెన్సీగా చూస్తూ ఉంటే ఆ చూపులకి ఇబ్బంది పడుతూ హెయిర్ ని వెనక్కి అనుకుంటూ మాట తడబడుతూ మాట్లాడుతూ ఉంటుంది.

అదేంటి చందు ఇప్పటిదాకా బాగానే మాట్లాడావు కదా.. ఇప్పుడేంటి మాట తడబడుతుంది అని ఫ్రెండ్స్ అడిగితే ఏమీ లేదు.

మీకు చెప్పిన వర్క్ గురించి ఆలోచించండి.  ఈ వీకెండ్ బయలుదేరాదాము.  మనీ అవసరం ఉంటే చెప్పండి. ఇప్పటికి ఇన్వెస్ట్ చేసింది సరిపోతుంది ఏదన్నా ఉంటే చెబుతాము.

ఏం బిజినెస్ మొదలుపెట్టారు ఆ డాక్టర్ పాపాలు,  డిజైనర్ కలిపి..
ఆ మాటకి చందు తలదించుకుంటే..  డాక్టర్స్..  హలో ఇది బిజినెస్ కాదమ్మా సర్వీస్.  సర్వీస్ ఏం సర్వీస్ అని రిలాక్స్డ్ గా కూర్చుని అడుగుతాడు.
ఏం చందు నువ్వు చెప్పలేదా.. ఈ మధ్యన చెప్పడం తగ్గించిందిలే గాని మీరు చెప్పండి పాపలు.

చందు  వచ్చిన ప్రాఫిట్ తో సర్వీస్ స్టార్ట్ చేసింది.  దానికి మా హెల్ప్ అడిగింది.  అదే ఏం సర్వీస్.  మెడికల్ ట్రీట్మెంట్ సరిగ్గా లేని కొన్ని గ్రామాలు సెలెక్ట్ చేసింది.

వన్ బై వన్ ఆ గ్రామాలకు వెళ్లి ఏం అవసరం ఉందో అని చూసి..  చెకప్ చేసి ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ అవసరం ఉంటే హాస్పిటల్ లో అడ్మిట్ చేసే విధంగా ప్లాన్ చేస్తుంది.

ఆ మాటకి రిలాక్స్డ్ గా కూర్చున్న వైభవ్ స్టడీగా కూర్చుని చందు వైపు చూస్తాడు.  చందు మాత్రం వైభవ్ వైపు అసలు చూడదు.

నిజంగానా అని ఆశ్చర్యంగా అడిగితే నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు ఏముందిరా అని సౌమ్య అంటుంది. మరి నువ్వు కూడా నాకు చెప్పలేదు. నువ్వు నన్ను అడగలేదు కదా..


వైభవ్ రియాక్షన్..

కథ కొనసాగుతుంది.........
[+] 11 users Like SivaSai's post
Like Reply

(01-05-2026, 02:45 PM)ash.enigma Wrote:  Endi Sivabhayya.. emaina weekend off aa? Okesari inni episodes pettav.
Bagundi.. ilage continue cheyandi!!

Yes Going To Family Tour 

E Weekend Antha Offline Unta 

Next 2 Days No-Updates. But E Evening Ekkuva Updates Isthanuuu................
[+] 1 user Likes SivaSai's post
Like Reply

Part - 101


విశి, సూర్య ఒకరిని ఒకరు చూసుకుంటూనే నిద్రలోకి జారుకుంటారు. ఉదయం సూర్య తొందరగా లేచి విశి ని చూసి నవ్వుకొని ఫ్రెష్  అయ్యి వచ్చి మెల్లిగా లేపుతాడు.

కళ్ళు నలుపుకుంటూ గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. ఇదేమన్నా హాస్టల..  లేకపోతే స్కూలా.. ఎప్పుడు చూసినా సార్ సార్..  అంటావు ఏమిటి..

దేవా అని పిలవచ్చు కదా.  అయ్యో సార్ ని ఎవరైనా అలా పిలుస్తారా. సరే రెడీ అయ్యి రా. నీకు ఒక సర్ప్రైజ్ అంటాడు.  మీకు కూడా ఒక సర్ప్రైస్ సార్  అని గబగబా వాష్ రూమ్ లోనికి పరిగెడుతుంది.

వెళుతున్న విశిని చూస్తూ నవ్వుకుంటూ రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా. మేము కాదు నువ్వే చెప్పాలి. చెప్పావా మా చెల్లికి.

లేదు రా.. పోనీ మా చెల్లి నీకు చెప్పిందా.  అబ్బా లేదురా.. ఇద్దరు రెండు రోజుల నుంచి తిరుగుతున్నారు ప్రపోజ్ చేసుకోవడానికి టైం ఏ లేదా అని శ్రీకర్ గట్టిగా అరుస్తాడు.

ఒక్కసారి ఫోన్ దూరంగా పెట్టి మళ్ళీ దగ్గరగా పెట్టుకుని ఎందుకు రా అలా అరుస్తావు. నా అరుపులే వినిపిస్తున్నాయి కానీ నా ప్రెస్స్టేషన్ కనిపించడం లేదా..


చెప్పాను కదా నాకు ఒక ఫాంటసీ ఉందని.  ముందు మీ చెల్లి నోటితోనే వినాలి. అప్పుడు నా మనసులో మాట చెబుతాను.

నీ ఫాంటసీలు ఏమోగానీ.. ఆడపిల్ల ఎలా  బయటపడుతుంది రా.. నువ్వే అర్థం చేసుకోవాలి. తనకి కూడా కొంచెం ఎక్కడో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండొచ్చు కదా...

ఆ గౌతమ్ విషయంలో నువ్వు ఏమనుకుంటున్నావో అని ఆలోచించొచ్చు కదా.. అప్పుడే స్నానం చేసి ముద్దమందారం లాగా ఫ్రెష్ గా బయటకు వచ్చిన విశి ని చూస్తూ అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు.

అసలు గౌతమ్ మేటర్ మా మధ్యన లేదు.  నువ్వు పెట్టేయ్. ఏరా మా చెల్లి వస్తుందా.  మూసుకొని పెట్టెయ్ అని ఫోన్ పెట్టేస్తాడు.

రెడీ అయ్యి వచ్చినా విశిని అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి సార్ అలాగే చూస్తున్నారు. ఈ డ్రెస్ గుర్తుందా అని తల కిందకి వంచి అడుగుతుంది.

విశి సిగ్గు చూసి నవ్వుకుంటూ..  అది ఏమీ తెలియనట్టుగానే ఈ డ్రెస్సు అని కణతల మీద కొట్టుకుంటూ ఉంటాడు.

అయ్యో సార్ మర్చిపోయారా..  మనం వి. జె. స్ కంపెనితో ప్రజెంటేషన్ ఉంది అని షాపింగ్ కి వెళ్ళాము కదా..  అప్పుడు తీసుకున్నాను మీకు గుర్తులేదా..

హ.. గుర్తొచ్చింది. నైస్ చాలా బాగుంది..అప్పుడు ఇది మీరే సెలెక్ట్ చేశారు అని డ్రస్సును చూసుకుంటూ చెబుతుంది. నీకు అంత నచ్చిందా. కొన్ని కొన్ని ఇష్టాలు మాటల్లో చెప్పలేము. పోని చేతల్లో చూపించిన అర్థం చేసుకుంటాను.

చేతల్లో చూపిస్తే తప్పుగా అనుకుంటారేమో అని భయం. అసలు చూపిస్తేనే కదా అది తప్పో..  ఒప్పో తెలిసేది.

సరే పద అని ఇద్దరూ బయటికి వస్తారు.  రూమ్ లాక్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు ఎక్కడికి అని ఆరామంగా కూర్చుని అడిగితే..  విశి టెన్షన్ గా చేతులు నలుపుకుంటూ ఉంటుంది.

అంత టెన్షన్ పడుతున్నావు. ఏదైనా ఎగ్జామ్ రాసావా ఏమిటి అని ఏమీ తెలియనట్టుగా అడిగితే..  సార్ అని బిక్క మొహం వేస్తుంది.

ఊరికినే అన్నాను కానీ విషయం ఏమిటో చెప్పు..ఇక్కడ కాదు అటు వెళదామా అని ఒక ప్లేస్ చూపిస్తుంది..సరే పద అని వెళతాడు.

గుడి కనిపించే విధంగా ఇద్దరూ ఒకచోట కూర్చుంటారు. చుట్టూ ఎవరూ ఉండరు.  సరే ఇప్పుడు చెప్పు. టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ గోళ్ళు కొరికేస్తూ ఉంటుంది.

విశి టెన్షన్ ని ఎంజాయ్ చేస్తూ విశికే తెలియకుండా ఫొటోస్ తీస్తూ ఉంటాడు.  ఎంతసేపు విశి ఏమిటో చెప్పు. ఐస్క్రీం తింటారా.. ఇంత పొద్దుటేనా.  పోనీ కొబ్బరినీళ్లు.

విషయం చెప్పకుండా అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నావు.

విశి గట్టిగా శ్వాస తీసుకుని వదిలి  ఇది నీ లైఫ్ కి సంబంధించిన విషయం..ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి అని గుడి వైపు చూసి ఒక నమస్కారం చేసి సూర్య ముందు మోకాళ్ళ పైన కూర్చుంటుంది.

ఏయ్.. ఏమిటిది అని కంగారుగా అడిగితే..  ప్లీజ్  సార్.. నేను అసలే టెన్షన్ గా ఉన్నాను. డిస్టర్బ్ చెయ్యొద్దు అని వణికే చేతులతో సూర్య చేతులు పట్టుకుంటుంది.

సూర్య ఒక్క నిమిషం అలాగే ఉండిపోతాడు. సార్ నాకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన విషయం ఈ గుడి దగ్గరే జరిగింది.

అప్పుడు ఎప్పుడూ తోడుగా నాన్న ఉండేవారు కానీ నా జీవితంలో నేను తీసుకుంటున్నా అతి ముఖ్యమైన విషయంలో పక్కన లేరు.. కాకపోతే ఆయన ఉన్నట్టే అనుకుని ధైర్యంతో మీతో ఈ విషయం చెబుతున్నాను.

కళ్ళు మూసుకుని ఐ లవ్ యు దేవా సార్ అని గట్టిగా అరుస్తూ చెబుతుంది. అది వినగానే సూర్య కి పట్టలేనంత ఆనందం.. గట్టిగా కౌగిలించుకోవాలి అనిపిస్తుంది గాని కంట్రోల్.. కంట్రోల్ అనుకుంటూ చూస్తూనే ఉంటాడు.

విశి మెల్లిగా కళ్ళు తెరిచి మీరంటే ఎందుకో తెలియదు చాలా ఇష్టం.  మిమ్మల్ని చూడగానే మనిద్దరికీ ఎప్పుడో పరిచయం ఉంది అనిపించింది.

మీకు అనిపించవచ్చు గౌతమ్ తో ప్రేమ అని కొన్ని రోజులు తిరిగావు కదా ఇదేమిటి అని. ఆ మాటకి కొంచెం కోపంగా చూస్తాడు. ప్లీజ్ సర్ నన్ను చెప్పనివ్వండి.

గౌతమ్ కి నేను ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదు.  వాడే చెప్పాడు.. అప్పటి పరిస్థితుల్లో నేను మౌనంగా ఉండిపోయాను.

ఏరోజు మా మధ్యన ప్రేమ మాటలు గానీ ఇంకా ఏదీ జరగలేదు.  ఒక బిజినెస్ డీల్ తప్ప. నాకు తెలుసు అంటాడు.
నాపైన అంత నమ్మకమా అన్నట్టుగా చూస్తుంది.  సూర్య కళ్ళు అవును అన్నట్టుగా చెబుతాయి.

నా మనసులో మాట మీకు చెప్పాను. మీకు నచ్చకపోతే ఈ విషయంలో ఎటువంటి బలవంతం లేదు కానీ నాతో ఫ్రెండ్షిప్ మాత్రం కట్ చేయవద్దు.

మీరు మాట్లాడకపోయినా మిమ్మల్ని చూడకపోయినా నేను ఉండలేను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.

సూర్య విశి  చేతుల్లో నుంచి తన చేతులు విడిపించుకుని మెల్లిగా లేచి నిలబడతాడు.  విశి కూడా లేచి నిలబెట్టి టెన్షన్ గా చూస్తూ ఉంటే..

ఎటువంటి భావం లేకుండా విశి నే చూసి మెల్లిగా అడుగులు వేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళుతున్న సూర్యనే చూస్తూ విశి  మోకాళ్ళ మీద కూర్చుని దోసెట్లో మొఖం పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది.

చందు చేస్తున్న సర్వీస్ విని వైభవ్ ఆశ్చర్యపోతాడు. చందు వైపే అలాగే చూస్తూ ఉంటే.. ఏంట్రా చూపులతోనే మా చందు ని తినేస్తావా అని సౌమ్య అడిగితే..

నిజంగా దీనిలో ఈ కోణం కూడా ఉందా... ఇప్పటివరకు నాకు తెలియలేదే.. నువ్వు ఎప్పుడూ ఒకే కోణంలో చూసావు.

చిన్నప్పుడు చందు ఎలాగో ఇప్పుడు అలాగే అనుకున్నావు. అందుకే దానిలో ఉన్న టాలెంట్ నీకు తెలియలేదు.

నిజంగానే ఇది రోజు రోజుకి ఎక్కేస్తుంది. హలో లేడీస్ అని పిలుస్తాడు. డాక్టర్స్ చూసి ఏంటి మిస్టర్. ఇందులో నేను కూడా పార్టిసిపేట్ చేయవచ్చా.

ఇది మొత్తం ఆర్గనైజ్ చేసేది చందు. చందు కిష్టమైతే మాకేమీ ఇబ్బంది లేదు. ఓకే చందు బాయ్.. మళ్లీ మీట్ అవుదాం ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తాము అని వెళ్ళిపోతారు.

చందు వైపు చూస్తూ నన్ను జాయిన్ చేసుకుంటావా మిస్ చంద్రిక అని అడుగుతాడు.
చందు సీరియస్గా చూస్తే వర్క్  వర్కే.. పర్సనల్ పర్సనలే.. రెండిటినీ కలపకూడదు.

చందు రియాక్షన్..

సూర్య ఎక్కడికి వెళ్ళాడు.....
[+] 7 users Like SivaSai's post
Like Reply

Part - 102

విశి అక్కడే మోకాళ్ళ పైన చాలాసేపు కూర్చుండిపోతుంది మౌనంగా కూర్చునే ఉన్న విశి చెవులకి ఐ లవ్ యు విశిష్ట అని గట్టిగా వినపడుతుంది.

ఉలిక్కిపడి తల పైకెత్తి  చూస్తే సూర్య రెడ్ రోసెస్ తో నిలబడి ఉంటాడు. విశి నమ్మలేకపోతోంది.  మెల్లిగా లేచి నిలబడి అలాగే చూస్తూ ఉంటే.. విశిష్ట ఐ లవ్ యు వినిపిస్తుందా అని మళ్ళీ అరుస్తాడు.

వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక్కసారిగా సూర్యా మీదకి జంప్ చేస్తుంది. అది ఊహించని సూర్య ఒక్క అడుగు వెనక్కి వేసి పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ విశిష్ట నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటాడు.

సూర్య మెడ చుట్టూ చేతులు వేసి ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేస్తుంది . ఓయ్ క్యూటి ఎందుకు ఏడుస్తున్నావు.  మీరు ఎందుకు సార్ నన్ను ఇలా ఏడిపించారు. ఎక్కడ మీరు దూరం అయిపోతారో అని నేను ఎంత భయపడ్డానో తెలుసా..

నీకోసమే వచ్చిన నేను ఎందుకు దూరం అవుతానే నా బంగారం అని ఇంకా గట్టిగా హత్తుకుంటాడు. ఎంతసేపు ఇద్దరు అలా ఉండిపోయారో అన్నది కాలమే చెప్పాలి.

వెళుతున్న జనం చూస్తూ నవ్వుకుంటూ ఉంటే..  విశి తేరుకుని సార్ అని ఇబ్బందిగా కదులుతూ ఉంటుంది. సూర్యా కూడా విశి  పిలుపుకి చుట్టూ చూస్తూ విశి ని వదిలి తల వెనకాల రబ్ చేసుకుంటాడు.

సూర్య తల వెనకాల రబ్ చేసుకుంటూ చుట్టూ చూసి,
అయ్యో… అందరూ చూస్తున్నారు కదా అని మెల్లిగా నవ్వుతాడు.

విశి చెంపలు ఎర్రబడిపోతాయి. సార్… అందరూ చూస్తున్నారు అంటూ రెండు అడుగులు వెనక్కి వేస్తుంది.
కానీ ఆమె చెయ్యి మాత్రం ఇంకా సూర్య చేతిలోనే ఉంటుంది.

చూస్తే ఏమైంది? అని సూర్య కళ్ళల్లో అల్లరి మెరుపుతో,
ఇంతసేపు నా మీదకి జంప్ చేసినప్పుడు సిగ్గు రాలేదా మేడం? అంటాడు.

అది… అని మాట దొరకక తల వంచేస్తుంది విశి.
కళ్ళల్లో ఇంకా తడి ఉంది.

సూర్య ఒక్క అడుగు ముందుకు వచ్చి.. ఇదిగో… ఏడవద్దు. నువ్వు ఇలా బాధపడితే నాకు ఊపిరి ఆగినట్టు ఉంటుంది అని ఆమె కళ్ళలోకి చూస్తాడు.

విశి మెల్లిగా తల పైకెత్తి.. నిజంగా… మీరు వెళ్లిపోతారేమో అనిపించింది సార్. ఒక్క మాట కూడా చెప్పకుండా… అంటుంది వణికే గొంతుతో.

సూర్య ఆమె చేతిని రెండు చేతులతో పట్టుకుని,
నేను వెళ్లేది ఉంటే ఇంత దూరం వచ్చి రెడ్ రోజెస్ పట్టుకుని నిలబడతానా?
నిన్ను భయపెట్టినందుకు సారీ విశిష్ట… కానీ నీ ప్రేమ నాకు ఎంత విలువైనదో అర్థమైంది ఈ నిమిషంలో అంటాడు.

విశి కళ్ళలో వెలుగు మెరుస్తుంది.  అంటే… మీరు నిజంగానే… అని మాట ఆగిపోతుంది.

సూర్య మెల్లిగా నవ్వుతూ.. అదే కదా నేను గట్టిగా అరచింది… ఐ లవ్ యు విశిష్ట అని మళ్లీ చెబుతాడు, ఈసారి నెమ్మదిగా… ఆమెకు మాత్రమే వినిపించేలా.

విశి గుండె ఒక్కసారిగా వేగం పెరుగుతుంది.
సార్…అని పిలిచి.. ఈసారి తానే ముందుకు వచ్చి అతని భుజం మీద తల వాల్చేస్తుంది.

సూర్య చుట్టూ జనాలు ఉన్నాయని మరిచిపోయి,
ఆమె జుట్టు మీద మెల్లిగా చెయ్యి వేస్తాడు.
ఇలా ఉంటేనే బాగుంటుంది నువ్వు… నా దగ్గర అంటాడు.

దూరంగా ఎవరో విజిల్ వేస్తే ఇద్దరూ ఒక్కసారిగా తేరుకుంటారు.
విశి వెంటనే దూరమవుతూ,
ఇంకా చాల్లేండి… అందరూ మనలని చూస్తున్నారు  అంటుంది నవ్వుతూ.

సూర్య నవ్వుతూ...చూస్తే చూస్తారు… కానీ ఈ నవ్వు మళ్ళీ ఎప్పుడూ పోకుండా చూసుకోవాలి కదా అని రోజెస్ ఆమె చేతిలో పెడతాడు.

విశి రోజెస్ ని గుండెలకు హత్తుకుని,
సూర్య వైపు చూసి మౌనంగా నవ్వుతుంది.
ఆ నవ్వులో ప్రేమ ఉంది… భయం లేదు…
ముందు రోజులు కలిసి నడిచే ధైర్యం ఉంది.

నీకు ఒక సర్ప్రైజ్ క్యూటి.. క్యూటి నా అదేమిటి. అది నీకు నేను చిన్నప్పుడు పెట్టిన ముద్దు పేరు.  హ అని అయోమయంగా చూస్తుంది. అర్థం కాలేదు కదా..

మనం మొదటిసారి ఎప్పుడు కలిసాము. హాస్పిటల్ లో... కాదు అని నవ్వుతూ.. నీకు మేబీ నాలుగు లేక ఐదు సంవత్సరాలు ఉండవచ్చు. అప్పుడు కలిశాను.

అర్థం కాలేదు కదా అని మొదటిసారి ఎక్కడ కలిశారో ఆ ప్లేస్ దగ్గరికి తీసుకు వెళ్లి నిలబడతాడు.  ఇక్కడ నువ్వు మీ నాన్నగారు ఉన్నారు అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా..

ఆరోజు నీ పుట్టిన రోజు. పట్టు పరికిణి వేసుకుని బుట్ట బొమ్మలాగా ఉన్నావు. నాకు చూడగానే నీతో స్నేహం చేయాలి అనిపించి దగ్గరికి వచ్చేటప్పటికి కోతితో ఫైటింగ్ అని నవ్వుతాడు.

సార్ అప్పుడు నేను చిన్న పిల్లని కానీ మీరు అని కొంచెం ఎక్సైట్ మెంట్ తో అడుగుతుంది.

అప్పుడు కోతి నుంచి సేవ్ చేసింది మనమే అని కాలర్ ఎగరేస్తాడు. అవునా అని ఆశ్చర్యంగా అడిగితే.. ఇంకా నమ్మకం లేదా అని తన చైన్ కి ఉన్న రింగ్ చూపిస్తాడు.

ఇది అని  అడిగితే.. అప్పుడు నా గుర్తుగా నీకు రింగ్ ఇస్తే మీ నాన్నగారు నీ రింగ్ నాకు ఇచ్చారు.

నమ్మలేనట్టుగా చూస్తూ తన మెడలో చైన్ బయటికి తీస్తుంది.  సూర్యా దగ్గర ఉన్న రింగ్ చిన్నప్పుడు ఫొటోస్ లో ఉంది కానీ అది ఏమయిందో తెలియలేదు.

  దగ్గరికంటా వెళ్లి ఆ రింగు పట్టుకొని చూస్తూ సంతోషంతో కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. ఏయ్.. పిచ్చి.. ప్రతిదానికి కన్నీళ్లేనా..  ఇది ఏడుపు కాదు సార్ ఆనందభాష్పాలు.

మా నాన్న నాతో ఉన్నన్ని రోజులు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. నిన్ను ఒక ఫ్రెండ్ సేవ్ చేసి ఇచ్చాడు.  ఎప్పుడు తీయొద్దు అని కానీ మిమ్మల్ని నా కోసం సిద్ధం చేశారు అని ఊహించలేకపోయాను.

ఎమోషనల్ అవుతూ ఎక్కడ ఉన్నారో కూడా చూసుకోకుండా గట్టిగా హత్తుకుంటుంది. విశి చుట్టూ చేతులు వేసి క్యూటి మనల్ని అందరూ చూస్తున్నారు. పరవాలేదు అని  గుండెల మీద తలపెట్టి కళ్ళు మూసుకుంటుంది.

వైభవ్ చందు ని చూస్తూ ఏం మాట్లాడవేమిటి.  నేను అడుగుతున్నాను కదా.. అక్కడ వర్క్ చాలా డెడికేషన్ గా చేయాలి. కోతి లాగా ఎగిరితే కుదరదు.

అంటే ఏమిటి... నేను కోతి నా..  నువ్వు కోతి అని నేను ఆ జాతిని తక్కువ చేయలేను.
ఆ మాటకి సౌమ్య నవ్వుతుంది.  వైభవ్ సౌమ్య వైపు కోపంగా చూసి నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. నీకు ఆ విషయం తెలుసా అని ఒక ఉక్రోషంగా అడుగుతాడు.

తెలుసు అక్క దగ్గరే కదా..  నా వలన బాబీకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో అదైనా తెలుసా..

చూడు వైభవ్ నీ దగ్గర టాలెంట్ లేదు అని నేను అనడం లేదు. జాబ్, ప్రొఫెషనల్ వేరు.  సర్వీస్ వేరు.  సర్వీస్ చేసేటప్పుడు చాలా సెన్సిటివ్ గా ఉంటుంది.

అది కూడా మెడికల్ క్యాంపు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ఫెయిల్ అవడం పక్కన పెట్టు..  ఎవరికైనా ఏదైనా జరిగితే..

అంటే నేను సిన్సియర్గా ఉండను అని నీ ఉద్దేశమా.. డెడికేషన్ గా ఉండడం ముఖ్యం అంటున్నాను. ఓకే నీతో డీల్..

సౌమ్య చందు ఇద్దరూ డీల్ అని ఒకేసారి అంటారు. అవును.  ఈ మెడికల్ క్యాంపు లో నీతో పాటే ట్రావెల్ చేస్తాను.

నేను ఎంత డెడికేషన్ గా ఉన్నానో అన్నది చూపిస్తాను. అలా ఉంటే కనుక.. హ ఉంటే అని సౌమ్య ఇంకా క్యూరియాసిటీతో అడుగుతుంది.

వైభవ్ చిరాకుగా చూపించవలసిన వాళ్ళు చూపిస్తే బాగుంటుందే నువ్వు కాస్త తట్టుకో అని ఇదిగో పిల్ల రాక్షసి.. సరిగ్గా విను.

నా డెడికేషన్ కి నువ్వు ఇంప్రెస్స్ అవ్వితే.. లైఫ్ లాంగ్ నువ్వు నాతోనే ఉండాలి. అర్థమవుతుందా..  అన్నయ్య పెళ్లి అవగానే మనం పెళ్లి చేసుకుందాం.

డీల్ ఓకే అని చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు.  వైభవ్ చెప్పినదానికి చందు నోరు వదిలేసి చూస్తుంది.  సౌమ్య ఏంటే వీడు ఇలా చెబుతున్నాడు.

చందు కోపంగా నా అభిప్రాయంతో వీడికి సంబంధం లేదా.. డెడికేషన్ వేరు లవ్ వేరు అది వీడికి అర్థం కావడం లేదా అని గట్టిగా అరుస్తుంది.

ష్.. అరవకే బాబు మనం క్యాంపస్ లో ఉన్నాము. నీకు కూడా వాడంటే ఇష్టమే కదా..  ఆ మాటకి చందు సైలెంట్ అయిపోతుంది.

సౌమ్య బ్యాగ్ తీసుకుని  నిలబడి.. ఏదైనా ఆలోచించి అడుగు వెయ్యి.  ఏప్పుడు ఒకేలాగా ఎవరూ ఉండరు. వాడికి బాధ్యత తెలుసు.  నీ పైన ఇష్టం ఉంది.

ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లాగా ఎక్స్ప్రెస్ చేస్తారు.  నీతోనే ఉంటాడు కదా చూడు.. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు.  మీరు ఇద్దరు సంతోషంగా ఉంటే అందరూ హ్యాపీయే. బాయ్ అని వెళ్ళిపోతుంది.


చందు నిర్ణయం......
[+] 9 users Like SivaSai's post
Like Reply

Part - 103


విశి, సూర్య సంతోషంగా టైం స్పెండ్ చేస్తారు.  శ్రీకర్ కి ఫోన్ చేసి మొత్తం చెబుతాడు.. నువ్వే ఎవరో అన్నది కూడా చెప్పావా..  అప్పుడే కాదు.

విశి ప్రాజెక్ట్స్ సక్సెస్ అయిన తర్వాత నేను ఎవరో అన్నది చెబుతాను.  ముందే చెబితే తన వర్క్ మీద ఫోకస్ పెట్టలేదు.

ఏదో నా వలన తన వర్క్ ఒకే చేశారు అనుకోని డౌన్ అయిన అవ్వచ్చు.. నువ్వు అన్నది కూడా నిజమేలే.. ఎప్పుడు బయలుదేరుతున్నారు ప్రేమ పక్షులు.

సాయంత్రం.  అక్కడంతా ఓకేనా. ఆ ఓకే. వైభవ్ గాడు చందును ఒప్పించకుండా బెదిరిస్తున్నాడు. ఏదో ఒకటి. వాళ్ళిద్దరూ తిప్పలు వాళ్లే పడి ఈ మెడికల్ క్యాంపు అయ్యే లోపు ఒకటి అవుతే చాలు.

అప్పుడు మూడు పెళ్లిళ్లు ఒకేసారి జరిగిపోతాయి కదా బావ అని శ్రీకర్ అడిగితే... నాకేమీ పెళ్లి గురించి కంగారు లేదు.

నీకు లేకపోతే నాకు చాలా ఉంది. ఆ ముక్క చెప్పొచ్చు కదా.. అన్ని చెప్పరు బావ అర్థం చేసుకోవాలి భరత్ మామయ్య ఒప్పుకోవాలి కదా..

మా మామ గారిని ఎలా లైన్లో పెట్టుకోవాలో నాకు తెలుసు కానీ తమరు మా చెల్లి మీద ఫోకస్ పెట్టండి అని పెట్టేస్తాడు.

ఫోన్ పెట్టేసి నవ్వుకుంటూ విశి ని చూస్తాడు. పూలతో ఆడుతూ కనిపిస్తుంది.  దగ్గరికి వెళ్లి క్యూటి ఏం చేస్తున్నావు.

మీరు ఫోన్ లో బిజీగా ఉన్నారు కదా అని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను.  పర్వాలేదు నా పక్కన ఉండి విన్నా అభ్యంతరం లేదు.

ఆ మాటకి నవ్వుతూ..  ఎవరికీ వాళ్ళకే సం పర్సనల్ స్పేస్ ఇవ్వాలి సార్. ఎంత నేను లవరైనా మీకంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా..

అందులో ఇబ్బంది పెట్టడం కన్నా మీరు చెప్పినప్పుడు వింటే బాగుంటుంది. ఇదే నీలో నాకు బాగా నచ్చేది. ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో ముందు ఉంటావు.ఆ మాటకి చిన్నగా నవ్వుతుంది.

సాయంత్రమే మన ప్రయాణం. సరే. లేకపోతే ఒక రెండు రోజులు ఉందామా. లేదు ఈ విషయం నేను నేరుగా అమ్మకి చెప్పాలి అమ్మ కళ్ళల్లోనే మెరుపు చూడాలి.

అయితే తర్వాత మళ్లీ ట్రిప్ ప్లాన్ చేయొచ్చు అన్నమాట.. అమ్మో కాదు కాదు నాకు ప్రాజెక్ట్ ఉంది. అది సక్సెస్ అవ్వాలి.

నీ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత నీకు ఒక సర్ప్రైజ్ రెడీగా ఉంది..ఏమిటి అది.. సర్ప్రైజ్ అంటే ముందు చెప్పరే తింగరి అని తల మీద ఒకటి వేస్తాడు.

సార్ మీరు నన్ను కొడుతున్నారు. అబ్బా ఇంకా సార్ సార్ అని పిలుస్తావు ఏంటి.  క్యూట్ గా దేవా అని పిలవచ్చు కదా అమ్మో నాకు సిగ్గు అని చేతుల్లో ముఖం దాచుకుంటుంది.

నువ్వలా సిగ్గుపడితే నాకు ఏదేదో అయిపోతుంది అని మెల్లిగా చెవిలో చెబుతాడు.  చెవిలో చెప్పినప్పుడు సూర్య మీసాలు తగిలి గిలిగింతలు మొదలవుతాయి.

చెవిలో గిలిగింతలు మొదలవ్వగానే విశి ఉలిక్కిపడి ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది.
ఇది ఫెయిర్ కాదు సార్…అని చెబుతూ ఉంటే.. బుగ్గలు  ఎర్రగా కందిపోతాయి.  అరే సడన్ గా నీ బుగ్గలు ఏంటి రెడ్ పెయింట్ వేసుకున్నాయి అని టచ్ చేస్తే సార్ అని దీనంగా పిలుస్తుంది..

మళ్లీ సార్ అంటావా? అంటూ సూర్య కళ్లతోనే హెచ్చరిస్తాడు.
విశి నవ్వు ఆపుకోలేక, సరే సరే… దేవా అని మెల్లిగా అంటుంది. ఆ పిలుపు పిలిచే లోపే ఇంకా సిగ్గుతో ముడుచుకుపోతుంది.  పిలుపుకే ఇలాగైపోతే తర్వాత పనులకి ఇంకేం అయిపోతావు నా క్యూటీ..

మీరు నన్ను బాగా ఏడిపిస్తున్నారు. విశి సిగ్గుకి..పిలిచిన విధానానికి..

ఆ ఒక్క మాటకే సూర్య ముఖంలో ఏదో గెలిచిన ఆనందం.
ఇలానే పిలుస్తూ ఉంటే… నా రోజు మొత్తం సక్సెస్ అంటాడు.

చుట్టూ సాయంత్రం వెలుగు మెల్లిగా మాయమవుతూ ఉంటుంది. ఆకాశంలో నారింజ–పింక్ రంగులు.
విశి చేతిలో ఉన్న పూలను సూర్య చేతిలో పెడుతుంది.
ఇవి నీకే. ఈ ట్రిప్ గుర్తుగా.

పూలు కాదు క్యూటి … ఈ క్షణమే నాకు గుర్తు. నువ్వు ఇలా నవ్వుతూ నా పక్కన నిలబడ్డ క్షణం అంటాడు.
ఇద్దరు రూమ్ కి వెళ్లి లగేజ్ ప్యాక్ చేసుకొని బైక్ స్టార్ట్ చేస్తాడు. విశి కి ఈసారి కూర్చోవడానికి ఏదో తెలియని బేరుకు.

ఏమైంది క్యూటి.  ఏమీ లేదు అని తల ఊపి మెల్లిగా కూర్చుంటుంది.  హలో మేడం తమరేమి కొత్త పెళ్లికూతురు కాదు ఫ్రీగా కూర్చోవచ్చు.

ఆ మాటకి భుజం పైన మెల్లిగా చరిచి మీకు ప్రతిదీ వేళాకోళమే. నీతో కాక ఇంకెవరితో చేస్తారు బంగారం.
ఇద్దరు రిటన్ బయలుదేరతారు.  మధ్య రాత్రిలో ఒక ప్లేస్లో స్టే చేసి మళ్లీ పొద్దుటే బయలుదేరుతారు.

హైదరాబాద్ చేరుకోగానే విశి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది క్యూటి ఎందుకు టెన్షన్ పడుతున్నావు. అమ్మకి  చెప్పాలి అంటే ఏదో లాగా ఉంది.

అత్తయ్యకి తెలియదు అని నువ్వు అనుకుంటున్నావా అత్తయ్య అని ఆశ్చర్యంగా చూస్తే.. అవును నువ్వు నాకు కాబోయే శ్రీమతివి. మరి అప్పుడు మీ అమ్మగారు నాకు అత్తయ్యే కదా.

థాంక్యూ సార్. అదిగో మళ్ళీ..  ఓకే..  ఓకే.. థాంక్యూ దేవా అని వెనక నుండి హత్తుకుంటుంది. నువ్వు ఇలా ఎనర్జీ ఇస్తే బైక్ గాలిలో తేలుతుంది.

అత్తయ్యకి ఇద్దరం జంటగా వెళ్లి కనిపిద్దాము. సరే అని వెలిగిపోతున్న ముఖంతో చెబుతుంది.
బైక్ ఇంటి ముందు ఆగుతుంది. ఇద్దరూ బైక్ దిగి లోపలికి అడుగులు వేస్తూ ఉంటే టెన్షన్ గా సూర్య చెయ్యి పట్టుకుంటుంది.

ఏమైందిరా..  అమ్మకి తెలుసు అన్న విషయం నాకు తెలుసు కానీ ఏమిటో ఇలా చెప్పాలి అంటే చాలా టెన్షన్ వస్తుంది.  ఇబ్బందిగా అనిపిస్తుంది.

టెన్షన్ నాకు వదిలెయ్యి. నీ కలలు నువ్వు సాధించు. నీ ప్రాజెక్ట్… నీ శ్రమ… అవే నీ అసలైన టెన్షన్ అంటాడు సీరియస్‌గా.

ఆ మాటలు వింటే విశి కళ్లలో నమ్మకం మెరుస్తుంది.
నాకెందుకో… మీరు ఉన్నంతవరకూ ఏదీ భయంగా అనిపించదు అంటుంది.

నీకు అదే చెబుతున్నాను. ఎదుట మనిషి మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు అని..  మీరు నేను వేరు కాదు కదా దేవా అంటే.. అబ్బో మా మేడంగారిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయే..

ఇద్దరూ వెళ్లేటప్పటికీ తలుపులు తెరిచే ఉంటాయి.  అరే అమ్మ తెలుపు కూడా వేసుకోలేదా..  ఇక్కడ భయం ఏమీ ఉండదులే. ఇప్పుడు దాకా నేహా అంటీ ఏమైనా ఉండి వెళ్ళచ్చు అని ఇద్దరు లోపలికి అడుగుపెడతారు.

అటువైపు తిరిగి ఉన్న భానుమతిని అమ్మ అని పిలుస్తుంది.

వచ్చేసారా వస్తున్నాను అని వెనక్కి తిరుగుతుంది.  అంతే భానుమతిని ఆలా చూడగానే చేతిలో ఉన్న బ్యాగ్ వదిలేసి బిగుసుకుపోతుంది.

ఏమి అయ్యింది రా అని భానుమతి ముందుకు వస్తే సూర్యకి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉంటాడు.

కూతురు దగ్గరికి వచ్చి కదుపుతూ అలా ఉన్నావేమిటి విశి ఏమైంది. అమ్మ నువ్వు అని వేలు పెట్టి చూపిస్తూ భయంగా అడుగుతుంది.

భానుమతి ఎలా కనిపిస్తుంది..

కథ కొనసాగుతుంది.....
[+] 8 users Like SivaSai's post
Like Reply

Part - 104


కూతురు దగ్గరికి వచ్చి కదుపుతూ అలా ఉన్నావేమిటి విశి ఏమైంది. అమ్మ నువ్వు అని వేలు పెట్టి చూపిస్తూ భయంగా అడుగుతుంది.

ఏమైంది అలా చూస్తున్నావు. నువ్వు.  ఏంటమ్మా ఇలాగ ఉన్నావు. నుదుటిమీద చెయ్యి వేసుకుని ఇదా అని అక్కడ కుర్చీలో కూర్చుని నిజం తెలిసింది.

ఆ మాటకి భయంగా తల్లి దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని ఏం మాట్లాడుతున్నావు అమ్మ. నాకు ఏదో అవుతుంది అని నిజం తెలియకుండా ఎన్ని రోజులని ఉంచుతావు విశి.

ఎవరు చెప్పారు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటుంది.
కళ్ళు తెరిచి కూతురు చెంప పైన చెయ్యి వేసి నువ్వు దేవా బాబు బయటికి వెళ్ళిన రోజునే తెలిసింది.

గౌతమ్ వచ్చాడు.  ఆ మాటకి సూర్య గౌతమ్ అని అనుమానంగా చూస్తే.. నేహా కూడా అప్పుడే పైకి వస్తుంది. నేహా ని చూస్తే కళ్ళు అర్పుతుంది.

మీరిద్దరూ ప్రేమించుకున్నారు.  నా ట్రీట్మెంట్ కోసం మనీ ఇచ్చింది అని ఏదేదో చెప్పాడు.  నాకు నమ్మబుద్ధి అవ్వలేదు.  కాదు అని గట్టిగా అరిస్తే...

మీ నాన్నగారు చనిపోయిన విషయం దగ్గర నుంచి అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఒక్క నిమిషం నా కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది.

నాకోసం నువ్వు ఇంత కష్టపడ్డావు అని తెలిసినప్పుడు ఈ తల్లి హృదయం ఎన్ని ముక్కలు అయ్యిందో ఆ భగవంతుడికే తెలుసు.

నాకు కూతురిగా పుట్టి నాకు అమ్మగా మారావా విశి బంగారం అని నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది. వెచ్చటి కన్నీళ్లు నుదిటన పడతాయి.

అమ్మ అని ఏడుపు గొంతుతో పిలిస్తే నాకేమీ అవదురా.. మీ నాన్నగారి బలం కూడా నాకే ఇచ్చారు. నిన్ను జాగ్రత్తగా చూసుకోని దేవా బాబు చేతుల్లో పెట్టాలి.  అంతకుమించి నాకు ఏమీ అవసరం లేదు.

సూర్య విశి తో నేను ఇప్పుడే వస్తాను అని నేహా వైపు చూసి కిందకి వెళతాడు. నేహా కూడా వెనకాలే వెళుతుంది. అసలు ఏం జరిగింది ఆంటీ.

ఆ ఇడియట్ చాలా ఎక్కువ చేశాడు రా.. మావయ్య ఉన్నారు కాబట్టి రెండు పీకి పంపించారు.

ఏం జరిగింది ఆంటీ.ఆరోజు జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది.

గౌతమ్ వచ్చి తలుపు కొడతాడు. భానుమతి తలుపు తీసి ఎవరు అంటే.. నా పేరు గౌతమ్. ఆంటీ నేను మీతో మాట్లాడాలి.

మీరు ఎవరో నాకు తెలియదు. మా వారు ఉన్నప్పుడు రండి.  దాని గురించే మాట్లాడాలి. మావారి గురించి నువ్వు మాట్లాడేది ఏమిటి. బయటికి వెళ్ళు.

నేను చెప్పేది వినండి. విశి మిమ్మల్ని మోసం చేస్తోంది. రేయ్ నా కూతురు గురించి ఏదైనా మాట్లాడావంటే ఊరుకోను.

నేహా..  నేహా అని పిలుస్తూ ఉంటే.. ప్లీజ్ ఆంటీ మీకు అంకుల్ గురించి కూడా తెలియాలి.  అంకుల్ ఇంటికి వచ్చి ఎన్ని రోజులు అయింది.  అనుమానంగా చూస్తుంది.

మీరు ఎలా చూసినా సరే మీకు ఒక నిజాన్ని చెబుతున్నాను. అంకుల్ లేరు.  చనిపోయారు.  ఆ మాటకి కోపంగా గౌతమ్ చెంప పైన కొడుతుంది.

మీరు నన్ను కొట్టిన సరే అదే నిజం. అంకుల్ యాక్సిడెంట్ లో చనిపోయి చాలా నెలలే అవుతుంది. మీ దగ్గర ఆ విషయం దాచి మేనేజ్ చేస్తుంది.

నువ్వు చెప్పేదంతా అబద్ధం.  నిజం నా దగ్గరే ప్రాజెక్ట్ చేసింది. అలాగే రెస్టారెంట్ లో కూడా సర్వెంట్ జాబ్ చేసింది. నేను చెప్పేదంతా  నిజం.

నాతో కొన్ని రోజులు ప్రేమ అని తిరిగింది.  నాతో అవసరం తీరిపోయిన తర్వాత దేవా తో తిరుగుతుంది. నాకు విశి అంటే చాలా ఇష్టం. ప్లీజ్ ఆంటీ..

మీరే ఎలాగైనా నచ్చచెప్పి నాతో విశి పెళ్లి జరిగేలాగా చూడండి.

భానుమతికి బుర్ర పనిచేయడం మానేస్తుంది.  అంతా శూన్యంగా కనిపిస్తూ ఉంటే..  తల పట్టుకుంటుంది. ఈ లోపు నేహా వచ్చి భానుమతిని పట్టుకుంటుంది.

నేహా వైపు చూసి.. ఇతను ఏదేదో చెబుతున్నాడు.
అతని మాటలేమీ పట్టించుకోవద్దు.  విశి ఎలాంటిదో మనకి తెలియదా.

మీరు కూడా ఎందుకు ఆవిడని మోసం చేస్తున్నారు.  నేను చెప్పేది ఇది అందరికీ తెలుసు. విశి బెస్ట్ ఫ్రెండ్ అయినా భవ్యకి కూడా తెలుసు.

మీ ఆస్తులన్నీ కూడా మీవారు చనిపోయిన తరువాత మీ బంధువుల అన్యాయంగా ఆక్రమించారు. అందుకే విశి నా దగ్గర ఉద్యోగం చేసింది.

ప్రతి నెల మీ ట్రీట్మెంట్ కి నేనే డబ్బులు సాయం చేశాను. అలాంటిది కృతజ్ఞత లేకుండా ఇప్పుడు వేరే వాళ్ళతో తిరుగుతుంది.

ఇదేనా మీ పెంపకం అని మాట్లాడుతూ ఉంటే.. వాసు గారు వచ్చి ఒక్కటి పీకుతారు.  గౌతమ్ భయంగా చూస్తాడు. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా..

నా కొడుకు వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి వెళ్ళిపో.. లేదు అంటే నీకు భవిష్యత్ అన్నది ఉండదు. ఒక ఆడపిల్ల కష్టపడి తల్లిని చూసుకుంటూ.. తన కాళ్ళ మీద తను నిలబడితే చూడలేకపోతున్నావా...

సెక్యూరిటీని పిలిచి బయటకి గెంటిస్తాడు. ఇదిరా జరిగింది. పాపం అది తెలియగానే భానుమతి చాలాసేపటి వరకు మనిషి కాలేకపోయారు.

మెల్లిగా సర్దుకున్న తరువాత నా చేతులు పట్టుకుని అసలు ఏం జరిగిందో చెప్పరా ప్లీజ్ అని అడిగితే.. ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నా సరే గట్టిగా పట్టుబడ్డారు.

అత్తయ్య కూడా పక్కనే ఉండి చెప్పమన్నట్టుగా సైగ చేస్తే... మొత్తం జరిగింది చెప్పాను. విశి ఎంత కష్టపడిందో.. తన ఆరోగ్య విషయంలో ఎన్ని  జాగ్రత్తలు తీసుకుందో తెలిసి చాలా కుమిలిపోయారు రా.

అపురూపంగా పెంచాము.  కాలికి మట్టి అంటితే ఎక్కడ కందిపోతుందో అన్న అంతగా వాళ్ళ నాన్నగారు గుండెల మీద పెట్టుకుని పెంచుకున్నారంట.. అలాంటి పిల్ల ఇలా కష్టపడుతుందని తెలిసి విలవిలలాడిపోయారు.

ఒక రోజంతా అలాగే మౌనంగా ఉండిపోయారు. నిన్నటికి సర్దుకుని ఇదిగో నేను చూసేటప్పటికి ఇలాగే కనిపించారు. అలా చూడగానే ముందు భయం వేసింది కానీ తర్వాత అర్థమయింది.

పరిస్థితులను అర్థం చేసుకొని  నిలబడ్డారు అని.  నా చేతులు పట్టుకుని థాంక్స్ చెబితే ఇబ్బందిగా అనిపించింది. కానీ ఆ గౌతమ్ గాడిని మాత్రం అస్సలు వదలకండి.

ఎందుకు విశి మీద అంత కక్ష కట్టాడు. రాస్కెల్.. ఒక ఆడపిల్ల కష్టపడి నిలబడుతూ ఉంటే చూడలేకపోతున్నాడు.

సూర్య ఆలోచిస్తూ ఉంటే.. ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. ఏమీ లేదు అని తల ఊపి ఒక గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాము కానీ ఇలా అంటే..

మీరిద్దరూ ఇలాంటి గుడ్ న్యూస్ వస్తారని ముందే ఊహించాము. అందుకే నన్ను కూడా రానివ్వకుండా మొత్తం భానుమతి చాలా వెరైటీస్ చేసింది.

పద పైకి వెళ్తాము.  నువ్వు కనిపించకపోతే తల్లి కూతుర్లు ఇద్దరు ఇంకా డల్ అయిపోతారు. మా అందరికీ కూడా పైనే భోజనాలు అని సూర్యని తీసుకుని వెళుతుంది.

వీళ్లిద్దరూ ఎలా ఉన్నారో అన్ని టెన్షన్ గా ఉన్న సూర్య లోపలికి వెళ్లి చూస్తాడు. వాళ్ళని చూడగానే పెదవులపై చిరునవ్వు వస్తుంది. నేహా వైపు చూస్తే... చెప్పాను కదా భానుమతి నిలబడింది అని.

సూర్య నవ్వుకుంటూ వెళ్లి ఏంటి ఆంటీ  స్పెషల్స్. ఇంకా ఆంటీ అని పిలవకూడదు. అత్తయ్య అనాలి.సరే ఏం చేస్తున్నారు.  లిస్ట్ మొత్తం చెబుతోంది. అన్ని నాకు ఇష్టమైనవే..

వాళ్ళిద్దరినీ చూస్తూ విశి తండ్రి ఫోటో వైపు చూస్తుంది. గోడమీద ఉన్న తండ్రి ఫోటో కి  చనిపోయిన తరువాత ఇదే మొదటిసారి ధైర్యంగా దండా వేసి బొట్టు పెట్టడం.

బాబు మీ పెద్ద వాళ్ళని పిలిపిస్తే మీ ఇద్దరికీ పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాను . ఆ మాటకి విశి ఉలిక్కిపడితే సూర్య నవ్వుతాడు.

ఏంటి బాబు ఏమి చెప్పడం లేదు. ఇప్పుడు కాదు.

దానికి ఇంకా కొంచెం టైం ఉంది పోనీ ఫోన్ నెంబరు ఇవ్వు మాట్లాడతాను.

సూర్య నెంబర్ ఇస్తాడా.......
[+] 8 users Like SivaSai's post
Like Reply

Part - 105



ఫోన్ నెంబర్ ఇవ్వ బాబు మాట్లాడుతాను.. తప్పకుండా... రేపు డైరెక్ట్ గా అమ్మని తీసుకువస్తాను.

అమ్మ,  మీరు ఎంత సేపు కావాలి అంటే అంత సేపు మాట్లాడుకోండి. సరేనా అత్తయ్య.. ప్రస్తుతానికి ఆకలి దంచేస్తుంది.

అయ్యో రండి అని అందరికీ వడ్డీస్తుంది. చాలా రోజుల తర్వాత చాలా తన చేతులతో వండి నలుగురికి పెడుతున్నందుకు భానుమతికి చాలా సంతోషంగా అనిపిస్తుంది.

భోజనం చేస్తూ ఆలోచిస్తున్నా సూర్య ని శ్రీకర్ కదిపి ఏమాలోచిస్తున్నావు బావ. ఆ గౌతమ్ గాడికి అర్జెంటుగా చెక్ పెట్టేయాలి.  చాలా ఎక్కువ చేస్తున్నాడు.

విశి చేతులతోనే చెక్ పెట్టించాలి అనుకున్నాము కదా..  అందుకే ఓపిక పడుతున్నాను కానీ ఈరోజు ఆంటీ ధైర్యంగా నిలబడ్డారు కాబట్టి సరిపోయింది లేకపోతే విశి పరిస్థితి ఏమిటి..

రేపటి నుంచి వాడిని పరుగులు పెట్టేస్తాను.

గౌతమ్ డ్రింక్ చేస్తూ విశి వచ్చే ఉంటావు కదా.  మీ అమ్మగారిని చూసి మీ ఫేస్ ఎలా ఉండు ఉంటుందో...

పాపం ఆవిడ ఇంకా తట్టుకుని నిలబడ్డారు అంటావా.. లేకపోతే హాస్పిటల్ లో ఎడ్మిట్ అయి ఉంటారా.  నువ్వు నన్ను చీట్ చేసావు అని తెలుసుకుని నీ రెండు చెంపలు వాయించేస్తున్నారేమో..

కన్నింగ నవ్వుకుంటూ డ్రింక్ సిప్ చేస్తూ ఉంటే.. హిమ వచ్చి గౌతమ్ చేతిలో గ్లాస్ తీసుకుని తాగుతూ ఉంటుంది. హాయ్ బేబీ  అంటే..

ఏమిటి చాలా హుషారుగా ఉన్నట్టున్నావు. హ.. ఆ విశిని వాళ్ళ అమ్మ దగ్గరే ఇరికించాను. రేపు వచ్చి నా కాళ్లు పట్టుకుని ఏడుస్తుంది చూడు..

అంత నమ్మకమా..  నేను చెప్పింది అలాగుంది.. ప్రూఫ్స్ చూపించాను. అవి చూస్తూనే ఆవిడ కళ్ళు తిరిగి పడిపోబోయింది.

పడిపోలేదు కదా..  అలాంటి వీక్ మెంటాలిటీ లేడీస్ ఈజీగా నమ్మేస్తారు.

నీ ప్లాన్ వర్క్ అవుట్ అవుతే విశి నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది అంటున్నావు.  ఒకవేళ అవ్వకపోతే... అవ్వదు అనే ఆప్షన్ లేదు.

రేపు తెల్లారిన తర్వాత జరిగే సీన్ చూడు.  కావాలి అంటే నీకు లైవ్ కూడా చూపిస్తాను.
సూర్య భోజనం చేసి వెళుతూ మంచి రోజు చూసి అమ్మని, నానమ్మని తీసుకు వస్తానని చెప్పి విశి కి కళ్ళతోనే బాయ్ చెప్పే శ్రీకర్ ని తీసుకుని వెళ్ళిపోతాడు.

ఇంటికి వెళ్లేటప్పటికీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఏమిటి అందరు పనులు మానేసుకుని మరీ కూర్చున్నారు. నీ గురించే అన్నయ్య అని వైభవ్ అంటాడు.

నా గురించా..  ఎనీ స్పెషల్. అది నువ్వు చెప్పాలి. మా బాబికి ప్రపోజ్ చేసావా. చిన్నగా సిగ్గుపడతాడు. అబ్బో మా అన్నయ్య సిగ్గుపడ్డాడు అంటే అక్కడ ఓకే అయినట్టుంది. చెప్పు చెప్పు ఎవరు ముందు ప్రపోజ్ చేశారు.

ఇంకెవరు ప్రపోజ్ చేస్తారు రా బాబు.  అమాయకురాలైన మా చెల్లి అని శ్రీకర్ అంటాడు. మీ చెల్లి అమాయకరాల అలా అనుకుంటే మేము అని వైభవ్ అంటే..

మీరు సింహాలు రా. పీల్చి పిప్పి చేస్తారు మమ్మల్ని. నా చెల్లిని ఎంత ఏడిపించాడో తెలుసా ఇడియట్ అని మెడ చుట్టూ చెయ్యి వేసి గట్టిగా నొక్కుతాడు.

అబ్బా వదలరా.. ఏదో కాస్త ఫన్ చేస్తే లైఫ్ లో గుర్తుండిపోతుంది అని. అందుకని విశిని అలా ఏడిపిస్తావా.

ఏం చేశావు అని అందరూ చుట్టూ ముగితే అబ్బా వీడు నోరు అసలు కుదిరిగా ఉండదే అని చూస్తే.. ఏంట్రా అని కళ్ళు ఎగరేస్తాడు.

చెప్పు అన్నయ్య ఏం చేసావు నేను టెన్షన్ భరించలేను. జరిగింది చెబుతాడు.. ఓ ముందు నువ్వే ఏడిపించి తర్వాత నువ్వే నవ్వించావా..

అయినా అదేం ఫాంటసీ అన్నయ్య.  ముందు బాబి చెప్పాలని.  ఒరేయ్ నాకేమీ నీలాగా మోర్ దెన్ గర్ల్ ఫ్రెండ్స్ ఏమీ లేరు.

నాకు ఏదైనా సరే క్యూటి నే.. ఏదో నాకంటూ కొన్ని సరదాలు ఉంటాయి కదా అని తల మీద కొట్టి రూమ్ కి వెళ్ళిపోతాడు.

అందుకే అన్నయ్య ఎక్కువమంది గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయాలి అని నోట్లో మాట బయటకు వస్తూ ఉన్నప్పుడే.. చందు లోపలికి వస్తుంది.

అంతే ఆ మాట గబుక్కున మింగేస్తున్నాడు గాని ఆల్రెడీ చందు అది విని కోపంగా చూసి అవని దగ్గరికి వెళుతుంది.

శ్రీకర్ నవ్వుతూ బాగా ఇరుక్కున్నట్టున్నావు కదా..  ఈ మధ్యన నా టైం అసలు బాగుండడం లేదు బావ.  నేను సిన్సియర్గా ఉన్నప్పుడల్లా దీనికే దొరుకుతున్నాను.

గర్ల్స్ తో ఫ్లర్ట్ చేసిన అన్ని రోజులు ఎవరికి దొరకలేదు.  ఛీ.. నా జీవితం ఏమిటో అని వాపోతే.. అదే రా సిన్సియర్ కి ఉన్న ఎక్సమ్.

అందులో మనం ఎంత హార్డ్ వర్క్ చేసి స్కోర్ కొడితే అంత మంచి రిజల్ట్ అని బుగ్గ మీద తట్టి  సూర్య దగ్గరికి వెళ్ళిపోతాడు.


సూర్య దగ్గరికి వచ్చిన శ్రీకర్ నెమ్మదిగా చెబుతాడు.
బావ… నువ్వు స్ట్రాంగ్‌గా ఉన్నావు కానీ విశి ఇప్పుడు చాలా వల్నరబుల్ స్టేజ్‌లో ఉంది. రేపు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ ఇడియట్ ఒక ఆడపిల్ల మీద అలాంటి నిందలు వేయడం ఏమిటి. అసలే విశి సెన్సిటివ్.

సూర్య కళ్ళల్లో కాస్త కోపం..  నాకు తెలుసు శ్రీకర్. అందుకే రేపు నేను ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయను.

అదే సమయంలో హాల్‌లో భానుమతి.. విశి వైపే చూస్తూ ఉంటుంది.  భానుమతి నెమ్మదిగా ఇలా రా బంగారం అంటే..  విశి వచ్చి భానుమతి ఒళ్ళో పడుకుంటుంది.

ఏరా ఆ గౌతమ్ మాటలకి బాధపడుతున్నావా..
విశి నవ్వే ప్రయత్నం చేస్తుంది.  లేదమ్మా… కాస్త అలసట అంతే.
అమ్మ దగ్గరే మాట దాస్తున్నావా.. తల్లి చేతులు గట్టిగా పట్టుకొని వాడు చెప్పిందే నిజమని నువ్వు నమ్మితే..  నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది.

ఏ కష్టం అయినా లోపల దాచుకోకూడదు. నా అనుకున్న వాళ్ళకి చెప్పాలి. నీకు దేవా బాబు తోడుగా ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు.

ఆ మాటకి విశి కళ్ళు తడుస్తాయి కానీ మాట బయటికి రాదు.

సూర్య విక్రమ్ దగ్గరికి వెళ్లి డాడ్ అని పిలిస్తే...అరే వచ్చి ఎంత సేపు అయింది. ఎలా జరిగింది మీ ట్రిప్. హ్మ్..అని ముభావంగా చెబుతాడు.

ఏమైందిరా. శ్రీకర్ వచ్చి ఆ గౌతమ్ గాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు అంకుల్.  ఓ.. ఆ విషయమా... మీకు తెలిసి కూడా సైలెంట్ గా ఉన్నారా డాడ్.

నవ్వుతూ సైలెన్స్ చాలా డేంజర్ సూర్య. ఆవేశంగా మాట్లాడే దానికన్నా మౌనం 100 రెట్లు ఎక్కువ పని చేస్తుంది.

ఎగరని. ఎక్కడికి ఎగిరిన వాడు జుట్టు మన చేతుల్లోనే ఉంది.  నువ్వు ఎవరో తెలియక ఎగిరెగిరి పడుతున్నాడు. నా కోడలు చేతే నువ్వు సమాధానం చెప్పించాలి అన్నావు అని వాడిని  కాస్త వదులుతున్నాను కానీ లేకపోతే మీరు వచ్చేలోపే వాడు మొత్తం భూస్థాపితం అయిపోయేవాడు.

తండ్రిని హత్తుకుని కళ్ళు మూసుకుంటాడు. సూర్య చాలా ఎమోషనల్ అవుతున్నాడని అర్థమయ్యి ఏమైందిరా అని వెన్ను నిమురుతూ అడిగితే..

నేహా ఆంటీ పక్కన ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే అత్తయ్య పరిస్థితి ఏమిటి... అత్తయ్యకి ఏదైనా జరిగితే క్యూటి తట్టుకోగలుగుతుందా.

క్యూటి లేకపోతే నేను అంటే..  షట్ అప్ సూర్య.  ఈ నాన్న ఉండగా అంత దూరం వస్తుందని నువ్వు అనుకుంటున్నావా..
నాకు తెలుసు డాడ్. మీరు రానివ్వరని.. కానీ ఒక్కసారిగా వినగానే నాకు  భయమేసింది. తొందరగా క్యూటి ని తెచ్చేసుకోవాలి.  తప్పకుండా..


అంకుల్ వాడు మీ దగ్గర ఇండైరెక్టుగా చెబుతున్నాడు. పెళ్లి మాటలు మాట్లాడమని. ఆంటీ అడిగితే..  అమ్మని నాన్నమ్మని తీసుకు వస్తాను అని బాబుగారు మాట ఇచ్చారు.  అది ఎలా చెప్పాలో తెలియక ఇలా ఏదేదో మాట్లాడుతున్నాడు.

అప్పుడే లోపలికి వస్తున్న అవని ఎవరికి ఎవరు మాట ఇచ్చారు అని అడుగుతుంది.

సూర్య ఏం చెబుతాడు........
[+] 7 users Like SivaSai's post
Like Reply

Part - 106



ఎవరు ఎవరికి మాటిచ్చారు అని అవని అడిగితే..  సూర్య శ్రీకర్ వైపు కొరకొరా చూస్తూ అవని దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేసి సో క్యూట్ మా అంటాడు.

పొగిడింది చాలుగాని విషయం ఏంటో చెప్పు నాన్న. అది అమ్మ అంటూ ఉంటే..  పెళ్లి మాటలా..  అరే ఎలా గెస్ చేశారు.

నువ్వు ఆడపిల్ల లాగా సిగ్గుపడుతుంటేనే అర్థం అవుతుంది. ఏమిటో రోజులు ఇలా మారిపోతాయని అనుకోలేదు అని విక్రమ్ పక్కన కూర్చుంటుంది.

అమ్మ అని గారంగా పిలిస్తే...  నిజమేరా మా టైంలో మేము సిగ్గుపడే వాళ్ళము ఇప్పుడు అబ్బాయిలు సిగ్గుపడుతున్నారు అంతేనా అండి.

శ్రీమతి గారు ఏమి చెబితే అదే నిజం అంటాడు.. శ్రీకర్ వెంటనే ఆ రోజుల్లో ఆడవాళ్లు సిగ్గుపడితే మగవాళ్ళు మాట వినేవారు అనుకుంట..

ఇప్పుడు మగవాళ్ళు సిగ్గుపడుతున్నాం కాబట్టి ఆడవాళ్లు మాట వింటారు.  ఒరేయ్ బావ నువ్వు ఇదే కంటిన్యూ చేసేయ్.  మరి నువ్వు అంటే ఆల్రెడీ నేను సరెండర్ అయిపోయాను ఆంటీ అని ఒడిలో పడుకుంటాడు.

కోతలు కొయ్యకు. సౌమ్య చాలా సాఫ్ట్.  అలాగే అనుకున్నాను అంటీ.  ప్రపోజ్ చేసే వరకు బిక్కు బిక్కుమంటూ చూసింది.

అయ్యో అమాయకమైన నా బుజ్జి పప్పీ అని నేను మెల్ట్ అవ్వగానే ఆ బుజ్జి పప్పి నుంచి వైల్డ్ డాగ్ గా మారిపోయింది.

వైభవ్  కూడా పెద్దమ్మ అనుకుంటూ వస్తాడు.  నీకేమైంది రా.. ఆ చందు దగ్గర మళ్లీ ఇరుకున్నాను. ఏం చేసావు. ఏదో ఇందాక పిచ్చా పాటిగా మాట్లాడుతూ ఉంటే అదే నిజం అనుకుని నన్ను కొరకరా చూసింది.

ఏం మాట్లాడావు అని శ్రీకర్ క అడిగితే మీరిద్దరూ ఉన్నచోట ఉండకుండా నీకు మోర్ దాన్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వు ఏమైనా చెబుతావు అంటే... నేను ఫన్ గా తీసుకున్నాను.  అది వింది ఇంకా అంతే అని తల మీద చేయి వేసుకుంటాడు.

ముగ్గురిని చూసి నవ్వుతూ ఆడవాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో మీ పెదనాన్ని అడగండి.  కరెక్ట్ గా చెబుతారు. ఇది మరీ బాగుంది. నాకు అసలు రాదు.

వచ్చుంటే ఇలా ఎందుకుంటాను. అవునా మీకు రాకుండానే నన్ను హ్యాండిల్ చేశారా. అయ్యో నిన్ను నేనేంటి అప్పుడే పుట్టిన బేబీ అయినా హ్యాండిల్ చేస్తుంది.

భర్త వైపు గుర్రుగా చూస్తూ ఉంటే నన్ను రాత్రంతా చూడొచ్చు గాని ముందు వాళ్ళు ముగ్గురు పాట్లు చూడు బంగారం.  నాకసలే నిద్ర అంటే.. ఇంకా ఆపండి అని  సూర్య వైపు చూస్తుంది.

అవని చేతులు మడిచేసుకుని.. సరే సరే… ఎవరెవరికి మాటిచ్చారో ఒక్కొక్కరుగా చెప్పండి. లవ్ ప్రాబ్లమ్స్ ఏంటో చెబితే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాము. ఇంటర్వ్యూ స్టార్ట్

సూర్య వెంటనే శ్రీకర్ వెనక దాక్కుంటూ..  ఫస్ట్ ప్రశ్నే నాకెందుకు అమ్మా... ఇంకా నేను అ ఆ లు దగ్గరే ఉన్నాను.
శ్రీకర్ సైడ్ చూసి..  ఏంటి రా… నిన్నే హీరో అనుకున్నా, ఇప్పుడే సైడ్ క్యారెక్టర్ అయిపోయావా?

విక్రమ్ నవ్వుతూ.. అప్పట్లో ప్రేమ అంటే లేఖలు, ఇప్పుడు ప్రేమ అంటే ఫ్యామిలీ మీటింగులు.
అవని తల ఊపుతూ... అందుకే అంటున్నా… ఈ జనరేషన్ చాలా డేంజర్. ప్రేమ ముందు, భయం తర్వాత.

అంతలో సౌమ్య లోపలికి వస్తే..  ముగ్గురూ ఒకేసారి సైలెంట్. ఏమైంది? కరెంట్ కట్ అయిందా లేక ధైర్యం కట్ అయిందా?

శ్రీకర్ వెంటనే చూడూ… ఇదే ఆ హ్యాండిలింగ్. మాటతోనే షట్‌డౌన్.
వైభవ్ కుర్చీలో కూర్చుంటూ పెద్దమ్మా… పెళ్లి తర్వాత మాకు ఇలాంటివే ఎదురవుతాయా?
ఎదురవుతాయా కాదు రా… ఎదురుచూస్తుంటాయి.
అందరూ నవ్వుతుంటే
సూర్య గట్టిగా.. ఒక విషయం క్లియర్… ఈ ఇంట్లో అబ్బాయిలకి హక్కు లేదు.
సౌమ్య కళ్లెత్తి..  ఉంది… వంటింట్లో ఏ కూర చేయాలో చెప్పే హక్కు.


అవని చప్పట్లు కొడుతూ.. శభాష్ సౌమ్య. ఇక నీకు ధైర్యంగా పెళ్లి చేసేయవచ్చు. థాంక్యూ అత్తయ్య అని శ్రీకర్ వైపుత చూస్తూ కళ్ళు ఎగరేస్తుంది.

శ్రీకర్ కక్కలేక మింగలేక చూస్తూ ఉంటాడు. శ్రీకర్ అవస్థ చూసి..  ఇప్పుడే ఇలా ఉంటే… ఇంక పెళ్లి తర్వాత నీ పరిస్థితి దేవుడికే తెలియాలి.

శ్రీకర్ చేతులు జోడించి... అందుకే పెళ్లి ముందు నుంచే సరెండర్ అయిపోయాం అంకుల్.

మా గొడవ ఎప్పుడూ ఉండేది లే కానీ సూర్య డైవర్ట్ చేయకుండా మేటర్ ఏంటో ఆంటీ కి చెప్పు అనగానే.. అబ్బా వీడు వదలడు కదా అనుకుని..

అమ్మ అని తల్లి ముందుకూర్చుంటాడు. చెప్పు నాన్న అని చెంప మీద చెయ్యి వేస్తె.. మరేమో అన్నవరం లో నేను క్యూటి కి ప్రపోజ్ చేశాను అంతా ఓకే అయ్యింది.

నువ్వు ప్రపోజ్ చేసావా.. మా చెల్లి ప్రపోజ్ చేసిందా అని శ్రీకర్ వెంటనే అందుకుంటే..  ఎవరు ప్రపోజ్ చేస్తే ఏంటి మా ఇద్దరికీ ఓకే అయింది ఇంక నువ్వు ముయ్యి.

సరే ఇప్పుడు నేనేం చేయాలి. విశి వాళ్ళ మదర్ మిమ్మల్ని కలవాలి అంటున్నారు.  ఫోన్ నెంబర్ అడిగితే ముందు మీతో మాట్లాడే ఇవ్వచ్చు అని ఇవ్వలేదు అమ్మ.

సరే రేపు వెళ్ళి మాట్లాడదాము.  కాకపోతే ఇక్కడొక చిన్న మెలిక ఉంది.  మెలిక ఏమిట్రా..

మీరు జై సింహ ఫ్యామిలీ మెంబర్స్ లాగా కాకుండా ఒక సామాన్య లెక్చరర్ తల్లిగా మాత్రమే రావాలి. విక్రమ్ వైపు చూస్తే నాకేమీ సంబంధం లేదు అని భుజాలు ఎగరేస్తాడు.

ఇప్పుడు నాన్న రావాల్సిన అవసరం లేదు.  ఓన్లీ లేడీస్ వరకే. అదేంటి. నాన్నని విశి చూసింది అమ్మ.  చూస్తే ఏమైంది. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా.

కానీ ఇప్పుడు కాదు.  తను మన కంపెనీతో చేస్తున్న ప్రాజెక్టు సక్సెస్ అవ్వాలి. అప్పుడు నేను ఎవరో అన్నది రివిల్ చేస్తాను. ఇప్పుడే చెబితే ఏమైంది.

చెప్పొచ్చు కానీ తను ఓన్ టాలెంట్ తోనే ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటుంది.  నేను ఎవరో తెలిస్తే నేనేమైనా రికమెండ్ చేశాను అనుకొని డిసప్పాయింట్ అవుతుంది. అది నాకు ఇష్టం లేదు.

నీదంతా మీ నాన్న పోలికే అని నుదుటన ముద్దుపెట్టుకుని..  సరే అత్తయ్య వాళ్ళతో నేను మాట్లాడతాను. మంచి రోజు చూసుకుని వెళదాము.

థాంక్యూ అమ్మ. గుడ్ నైట్ నాన్న అని చెప్పి శ్రీకర్,  వైభవ్ ని లాక్కొని వెళ్ళిపోతాడు. వెళుతున్న ముగ్గురిని చూసి నవ్వుతూ భర్త వైపు చూస్తుంది.

భార్యని చూస్తూ కన్ను కొడితే ఏంటిది అని సిగ్గుపడుతుంది.  నువ్వు సిగ్గుపడడం మానవ..  మీరు కన్ను కొట్టడం మానుతున్నారా.. అది ఎలాగో ఇది అంతే.

నేను కన్ను కొట్టినప్పుడు నువ్వు సిగ్గుపడుతుంటే భలే ఉంటుంది తెలుసా.. అప్పుడే మొదటిసారి ఇద్దరం కలిసామా అన్న ఫీలింగ్ వస్తుంది.

చాలు చాల్లే మీ సంబరం అని ఏదో గుర్తొచ్చినట్టుగా అవును ఇందాక ఏమన్నారు. నేనేమన్నాను అని అమాయకంగా  ఫేస్ పెట్టి అడుగుతాడు.

భర్తను కోపంగా చూస్తూ నన్ను హేండిల్ చేయడం అప్పుడే పుట్టిన బేబీకి కూడా ఈజీనా.. అంటే నేను మరీ అంత తింగరిదాన్ని అనా.

అయ్యో నా ఉద్దేశం అది కాదు బంగారం. మరి ఏమిటి..  నువ్వంత మంచి దానివి అని. ఇలాంటి కహాని చెప్పమంటే మీ తర్వాతే.. పిల్లల ముందు అలాగంటారా..

నువ్వు ఇలా ఉడుక్కుంటే ఇంకా ముద్దుగా ఉంటావు అని చక్కెలగింతలు పెడతాడు. అబ్బా వదలండి. మా శ్రీమతి నువ్వే దాకా నేను ఈ చక్కెలగింతలు ఆపను అని పెడుతూ ఉంటాడు.

అవని కళ్ళ నీళ్లు వచ్చేలాగా నవ్వుతూ ప్లీజ్ ప్లీజ్ అని అంటూ ఉంటే.. దగ్గరికి తీసుకుని నుదుటిని ముద్దు పెట్టుకుని ఐ లవ్ యు సో మచ్ మై స్వీట్ హార్ట్  అని చెబుతాడు.

భర్తని అలాగే హగ్ చేసుకుని కళ్ళు మూసుకొని ఉండిపోతుంది. ఓయ్ శ్రీమతి నేను ఐ లవ్ యూ చెప్పాను. హ్మ్ అంటుంది.

ఐ టూ అని ఏమీ చెప్పవా.. ఇంతకన్నా ఎలా చెప్పాలో నాకు తెలియదు.

ప్రతి జంట అవని విక్రమ్ జంట లాగా ఉండాలని కోరుకుంటూ..........
[+] 7 users Like SivaSai's post
Like Reply

Part - 107


ఉదయం ఉషస్సు కిరణాలు మీద పడేటప్పటికీ విశి మగతగా లేచి కిటికీ దగ్గరకి వెళ్లి నిలబడి సూర్యుడిని చూస్తూ ఉంటుంది.

నిన్నటికీ ఈ రోజుకి ఎంత తేడా..  దేవా సార్ తో లవ్ లో ఉన్నాను అంటేనే కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. నాన్నకి ముందే తెలుసు అనుకుంట..

దేవా సర్ నా లైఫ్ లోకి వస్తారు అని. అందుకే చిన్నప్పుడే చూసి పెట్టేసారు అని నవ్వుకుంటుంది. దేవా సార్ లేచి ఉంటారా ఇంకా పడుకునే ఉంటారా..

ఫోన్ చేయాలా వద్దా అని ఫోన్ చేతిలో పట్టుకొని ఊగుతూ ఉంటుంది. డిస్టర్బ్ చేస్తానేమో..

అయినా సార్ ఫోన్ చేయాలి కదా.. ప్రేమలో ఉన్న వాళ్ళందరూ ఇలాగే చేసి మాట్లాడుకోవాలి  కదా..  ఎందుకు చేయలేదు సార్.

ఆలోచనలో ఉన్న విశి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఎవరు చేశారో చూసుకోకుండా హలో సార్ అని పిలుస్తుంది.  మౌనం. సార్ వినిపిస్తుందా అన్న అదే మౌనం.

ఎవరా అని చూసి తల కొట్టుకుంటుంది. భవ్య.. హ్మ్.. ప్లీజ్ భవ్య మాట్లాడు.  నీకు ఒక ఫ్రెండ్ ఉంది అని గుర్తుఉందా.. అలా అంటావేంటే..  నువ్వు నా బెస్టి కదా..

అందుకేనా ఇన్ని రోజులు ఫోన్ చేయలేదు.  అలాకాదే దేవసార్ తో అన్నవరం వెళ్ళాను. అక్కడ. వద్దు.  ఏమైందే.. నాకు ఇలా ఫోన్లో కాదు.

డైరెక్ట్గా కలిసి సేమ్ టు సేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి.
అప్పుడు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నేను చూడాలి. నువ్వు మరీ ఆడుకుంటున్నావు.

లేదు... ఇన్ని రోజులు నాకు ఫోన్ చేయనందుకు... నీకు ఇచ్చే పనిష్మెంట్. కరెక్ట్ గా నేను కాలేజ్ కి వచ్చేస్తాను. నువ్వు రా అర్థమయిందా.

విశి రెడీ అయ్యి సూర్య కోసం చూస్తూ ఉంటుంది. బైక్ సౌండ్ వినిపించగానే భానుమతికి ముద్దు పెట్టి బాయ్ అమ్మ అని పరిగెత్తుకుంటూ వెళుతుంది. పిచ్చి పిల్ల అని బుగ్గన తుడిచికొని నవ్వుతారు.

విశి సూర్య ముందుకు వెళ్లి ఆయాస పడుతూ ఉంటుంది. హేయ్.. కూల్.. ఎందుకు అంత కంగారు పడుతున్నావు.
నేనెప్పుడో రెడీ అయ్యాను.
మీ కోసమే వెయిటింగ్. బైక్ మీద కూర్చుని చేతులు కట్టుకొని అంత మిస్ అవుతున్నావా..  మరి కాదా మార్నింగ్ ఎంతసేపు వెయిట్ చేసానో తెలుసా... మీ దగ్గర నుంచి ఫోన్ వస్తుందేమో అని.

ఎందుకు వెయిట్ చేయడం.  అయ్యో లవర్స్ అన్నాక రోజు ఫోన్ చేసుకోవాలి. బోళ్ళు కబుర్లు చెప్పుకోవాలి.  ఇంకా... ఇంకా అప్పుడప్పుడు అని ఏం మాట్లాడబోతుందో అర్థం అయ్యి నాలుక కర్చుకుని తలదించుకుంటుంది.

నువ్వు నా ముందు ఇలా సిగ్గుపడుతూ ఉంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది అని చెయ్యి పట్టుకుని దగ్గరకి లాక్కుంటాడు.

అయినా తలదించుకునే ఉంటే గెడ్డం కింద వేలు పెట్టి పైకి లేపుతాడు.  కళ్ళు నీళ్లతో నిండి ఉంటే..  ఏమైంది అని ఇప్పుడు ఇలా ఏడుస్తున్నావు.

సార్ ఇదంతా నిజమే కదా..  కల కాదు కదా..  నీకు కలలాగా అనిపిస్తుందా అని ఆ కళ్ళు తుడుస్తాడు.  ఏమో సార్ భయం వేస్తుంది.

ఒకవేళ ఇది కల అయితే తట్టుకోవడం నావల్ల కాదు.నీకు చాలా పెద్ద డౌటే వచ్చింది ఇది కల కాదు నిజం అని తెలిసేలాగా ఒక పని చేయాలి.

ఏమిటి సార్.  దగ్గరికి రా.. దగ్గరకు వచ్చి చెప్పండి అంటుంది. బుగ్గ మీద గట్టిగా ముద్దు పెడతాడు.  వెంటనే చుట్టూ చూస్తూ సార్ అని సిగ్గుపడుతుంది. ఇప్పుడు అర్థమైందా ఇది నిజమే అని..

మీరు మరీ అల్లరి చేస్తున్నారు.  నా క్యూటి దగ్గరే కదా..  నో ప్రాబ్లం.  వెళదామా. సరే అని బైక్ ఎక్కి టు సైడ్స్ కూర్చుని భుజాల మీద చెయ్యి వేస్తుంది.

హలో.... ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు భుజం మీద చెయ్యి వేయాలి.  లవర్స్ గా ఉన్నప్పుడు ఇలా నడుం చుట్టూ చెయ్యి వేసి టైట్గా పట్టుకోవాలి.

మనం వెళ్లేది కాలేజీకి సార్.  దగ్గరికి వెళ్ళాక తీసేయొచ్చులే అని చేతులు ముందుకు పట్టుకుంటాడు. ఇది చూసిన శ్రీకర్..  అమ్మ బావ.... ఎంత ముదిరిపోయావు నేనే అడ్వాన్స్ అవ్వాలి.

మళ్లీ ఆంటీ తో అ,ఆలు దగ్గరే ఉన్నాను అని చెబుతావా అని చూస్తూ ఉంటాడు.

బైక్ కాలేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి విశి నార్మల్గా కూర్చుంటుంది.  పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి సూర్యా వెళ్ళిపోతాడు.

భవ్య కోసం చూస్తూ ఉంటే గొంతు సవరించుకున్న సౌండ్ వినపడుతుంది. వెనక్కి తిరిగి భవ్య అంటే... నేను మాట్లాడాను.

అబ్బా ఫోన్లో సోరి చెప్పాను కదా. ఆ సోరి నాకు సరిపోదు. సరే ఏం కావాలి. ట్రీట్ కావాలి. ఓకే కాలేజ్ బంక్ కొట్టేసి వెళదామా. వద్దు క్యాంటీన్లో కూర్చుందాం పద అని తీసుకువెళ్లి కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు. అన్నవరంలో ఏం జరిగింది.

విశి భవ్య చేతిని పట్టుకుని కాస్త దగ్గరగా కూర్చుంటుంది.
కళ్లల్లో ఇంకా ఆ ఉదయపు మెరుపు అలాగే ఉంది.
చెప్పు… అన్నవరంలో ఏం జరిగింది అని భవ్య కళ్ళు ముడుచుకుని అడిగితే,

విశి చిన్న నవ్వు నవ్వి క్షణం ఆగుతుంది. సిగ్గుపడుతున్న విశిని..  అబ్బా చెప్పవే టెన్షన్ తో చచ్చిపోతున్నాను. నువ్వు ఇలా టెన్షన్ పడకూడదు అనే ఫోన్లో చెబుతాను అన్నాను.  అది ఫోనులో వింటే నీ ఎక్స్ప్రెషన్స్ మిస్
అయిపోను.

అది అలా ఫోన్‌లో చెప్పే విషయం కాదు అన్నాను కదా… భవ్య మాటలకు విసి సిగ్గుపడుతూ..  అక్కడ ప్రతి క్షణం నాకు ఇప్పటికీ గుండెల్లో తిరుగుతోంది అంటూ కాఫీ కప్పు చేతిలో తిప్పుకుంటుంది.

అయ్యో మొదలెట్టింది… సినిమా స్టైల్‌లో డైలాగులు అని భవ్య నవ్వినా.... అవేమీ పట్టించుకోకుండా ఒకటి ట్రాన్స్లో చెబుతూ ఉంటుంది.

అన్నవరం వెళ్లేటప్పుడే సార్… కాదు… దేవా సార్ నా పక్కన ఉన్నారు అన్న ఫీలింగ్ వేరుగా ఉంది భవ్య. జనాలు, గుడి, మెట్లు… కానీ నాకు కనిపించింది మాత్రం ఆయన చేయి నా చేతిలో ఉండటం మాత్రమే.

భవ్య కళ్లెత్తి చూస్తూ...  ఓహో… చేయి పట్టుకున్నారా? అని కాస్త ఆటపట్టిస్తుంది.
విశి చెంపలు ఎర్రబడుతూ..  అంతే కాదు… గుడిలోకి వెళ్లాక ఆయన కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంటే… నాకు ఏం కోరాలో కూడా తెలియలేదు. ఆయన పక్కనే ఉండేలా ఇలానే ఉండిపోతే చాలు అనిపించింది.

భవ్య ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. అంటే… నిజంగానే ప్రేమలో పడిపోయావు కదే.
విశి తల ఊపుతూ మెల్లిగా అంటుంది.
సార్ కి నేను అక్కడే ప్రపోజ్ చేశాను. ఎంత ధైర్యం వచ్చిందో నీకు అనే గుండెల మీద చేయి వేసుకుంటుంది. కానీ సార్ నన్ను ఎంత ఏడిపించారో తెలుసా? ఆమె జరిగింది చెబుతుంది. అమ్మో మన దేవ సార్ పైకి కనపడరు కానీ చాలా రొమాంటిక్ ఫెలో కదా..

కాలేజీకి వచ్చే ముందు పెట్టిన ముద్దు గుర్తొచ్చి చెంప పైన చెయ్యి వేసుకుంటుంది.

అవును… భయం కూడా ఉంది. ఇంత ఆనందం నాకు అలవాటు కాదు. అందుకే నిన్న రాత్రి నిద్రపట్టలేదు. ఇది కలేమో అనిపించింది.
నువ్వు ఫోన్ చేసినా అది దేవా సారే అనుకుని చూసుకోలేదు.
అందుకే ఉదయం సార్ మీద పడి ఏడ్చావా? అని భవ్య నవ్వితే.. సార్ మీద పడి ఏడవలేదు కానీ అంటే... అర్థం అయింది తర్వాత..
విశి బుగ్గ మీద చెయ్యి వేసుకుని ఇది అంతా నిజమే అని ప్రూఫ్ చూపించారు.  ఎలా... ఎలా అంటే ఎలాగోలాగాలే. ఉహూ.. చెప్పాలి నాకు.
అది… ఆయన ముద్దు పెట్టి ప్రూఫ్ ఇచ్చారు అని చెబుతుంది.

భవ్య ఒక్కసారిగా ఆశ్చర్యంగా విశి వైపు చూస్తూ..
అమ్మో… విశి..  ఫుల్ రొమాంటిక్ హీరోయిన్ అయిపోయావే. ఇంకేం… పెళ్లి కార్డ్ డిజైన్ చేయడమే మిగిలింది అంటుంది.

విశి నవ్వుతూ భవ్య భుజంపై తల పెట్టుకుంటుంది.
అంత దూరం ఆలోచించలేను… ఇప్పటికి ఆయన నా పక్కన ఉంటే చాలు.

దూరంగా కాలేజ్ బెల్ మోగుతుంది.
భవ్య లేచి...  పద హీరోయిన్ గారు… క్లాస్ కి లేట్ అవుతోంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో… ప్రేమలో ఉన్నప్పుడు భయం ఉంటేనే అది నిజం అంటుంది.

విశి నవ్వుతూ లేచి...  అయితే ఇది నిజమైన ప్రేమే భవ్య అని కళ్లలో మెరుపుతో చెప్పుకుంటూ క్లాస్ వైపు నడుస్తుంది.

గౌతమ్ లేచినప్పటి నుంచి ఫోన్ చూస్తూనే ఉంటాడు. అది చూసినా హిమ ఏమైంది గౌతమ్ ఫోన్ తోనే కూర్చున్నావు అని పక్కన కూర్చుంటుంది.

ఆ విశి ఎందుకు ఫోన్ చేయలేదు. ఈ పాటికి ఫోన్ చేసి నన్ను బెగ్ చేసుకుంటూ ఏడుస్తుంది అనుకుంటే... ఇప్పటికీ ఫోను లేదు.  ఏమనుకుంటుంది.

అది ఏమనుకుంటే మనకెందుకు.. మనకి పని అవ్వాలి కాబట్టి నువ్వే డైరెక్ట్ గా మీట్ అవ్వు. ఇది కరెక్ట్. ఈవినింగ్ కాలేజ్ కి వెళతాను.

ఈవినింగ్ వరకు ఎందుకు ఇప్పుడు వెళితే ఏదైనా దుర్ముహూర్తం ఉందా? మళ్ళీ సాయంత్రం ఎవరో దానికి సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటున్నాడు అంటున్నావు కదా.. నువ్వు చెప్పింది నిజమే అని ఫ్రెష్ అవ్వడానికి వెళుతాడు.

గౌతమ్ విశి నీ కలుస్తాడా.....
[+] 9 users Like SivaSai's post
Like Reply

Part - 108



గౌతమ్ గబగబా రెడీ అయ్యే హిమకి బాయ్ చెప్పి వెళతాడు.  వెళుతున్న గౌతమ్ని చూసి నవ్వుకుంటూ నీలాంటి వాడికి బిజినెస్ అవసరమా..

గొర్రె తల ఊపునట్లు ఊపుతావు.. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మాత్రం నీకు గట్టి సన్మానమే జరుగుతుంది చూద్దాం అని తండ్రికి ఫోన్ చేస్తుంది.

ఏమైంది రా. ఈ గొర్రె వెళ్ళింది కలవడానికి...  నాకు తెలిసి అయితే ఆ విశిష్ట గట్టిగానే బయటికి గెంటుతుంది. ఇంకా వాడితో నీకు పని ఏమిటి రా...

నీకు కావలసిన పబ్లిసిటీ వచ్చేసింది కదా..  అన్ని చోట్ల హిమ అంటే బెస్ట్ ఆర్కిటెక్చర్ అన్న పేరు ఉంది. ఇంకా వాడి గురించి ఆలోచించడం అవసరమా..

ఏమైనా నాకు ఉపయోగపడతాడా అని చూస్తున్నాను.  ఇక లేదు అనుకుంటే అప్పుడే వాడిని రోడ్డు మీదకి గెంటేస్తాను. వస్తున్నావా. హా ఇప్పుడే బయలుదేరుతున్న అని హిమ ఇంటికి  స్టార్ట్ అవుతుంది.

గౌతమ్ కాలేజ్ కి వెళ్ళి ఎప్పుడు కలిసే చోట నిలబడి విశికి కబురు పంపిస్తాడు.

విశి, భవ్య వైపు చూస్తూ ఎవరై ఉంటారు. ఏమో చూద్దాం పద అని ఇద్దరు గ్రౌండ్లోకి వస్తారు.

అక్కడ గౌతమ్ ని చూసి వీడేంటి ఇక్కడ అని భవ్య అడిగితే.. విశి కి మాత్రం చాలా కోపం వస్తుంది. ఎందుకు నాకు కబురు పంపావు గౌతమ్ అని కోపంగా అడుగుతుంది.
గౌతమ్ విశిని చూసి ఆశ్చర్యపోతాడు.  ఏడుస్తూ ఉంటుంది నేను కనిపించగానే నన్ను బెగ్ చేసుకుంటుంది అన్న ఊహల్లో ఉన్న గౌతమ్ నేల మీదకి వస్తూ..

విశి ఆర్ యు ఆల్ రైట్ అని అడిగితే..  నాకేం.. నేను బాగానే ఉన్నాను.  తమరు వచ్చిన కారణమేమిటో చెబుతారా అని కొంచెం వెటకారంగా అడుగుతుంది.

గౌతమ్ ఆలోచిస్తూ..  ఏమిటి ఎప్పుడూ లేని కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది.  వాళ్ళ మదర్ ఏమీ చెప్పలేదా..  లేక చెప్పినా ఇది కన్విన్స్ చేసేసిందా అని ఆలోచిస్తూ ఉంటే...

ముఖం మీద చిటికెలు వేసి.. మమ్మల్ని పిలిపించి నువ్వేమీ మాట్లాడవేమిటి?అని భవ్య అనగానే
గౌతమ్ ఒక్కసారిగా తేరుకుని భవ్యని కోపంగా చూస్తాడు. మళ్లీ వెంటనే చూపు మార్చుకుని..  విశి… నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు మెల్లగా.

విశి చేతులు ఛాతీ మీద మడత వేసుకుని.. ఇక్కడే చెప్పండి. ప్రైవేట్‌గా చెప్పాల్సినంత విషయం అయితే ముందే చెప్పాల్సింది అంటుంది సూటిగా.

భవ్య ఆశ్చర్యంగా చూస్తుంది. ఇది విశియేనా? అన్నట్టుగా.
గౌతమ్ స్వరం కాస్త తగ్గించి
నీ మదర్ తో …  నేను మాట్లాడాను. నీ గురించి కొన్ని విషయాలు చెప్పింది అంటాడు.
విశి నవ్వుతుంది.
నా మదర్ ఎప్పుడూ నా గురించి చాలా విషయాలు చెప్తూనే ఉంటారు.
అయితే మీరు ఏ వెర్షన్ చెప్పారో చెప్పండి అంటుంది.

గౌతమ్ కాస్త అసహనంగా.. నువ్వు నన్ను ప్రేమించి ఇంకొకడుతో తిరుగుతూ ఉంటే ఎలా చూస్తూ ఉంటాను. అందుకే మీ మదర్ దగ్గరికి వెళ్లి మనిద్దరి ప్రేమ విషయం చెప్పాను.

ప్రేమా.. మనమా.. ఎప్పుడు ప్రేమించుకున్నాము.. ఎలా ప్రేమించుకున్నాము..

విశి నువ్వు ఇంకా స్టూడెంట్‌వి. ఫ్యూచర్ అర్థం కాదు. ఎమోషనల్‌గా డిసిషన్స్ తీసుకుంటున్నావు అనబోతుంటే...

విశి మధ్యలోనే కట్ చేస్తుంది. స్టూడెంట్‌ని కాబట్టే నేర్చుకుంటున్నాను..ఎమోషనల్‌ని కాబట్టే మనుషుల్ని అర్థం చేసుకోగలుగుతున్నాను.
మీరు చెప్పిన లోపాలే నాకు ప్లస్ పాయింట్స్.

గౌతమ్ నోట మాట రాదు.
భవ్య మెల్లగా.. విశి… కూల్ డౌన్ అంటుంది.
విశి తల  అడ్డంగా ఊపి... లేదు భవ్య.
ఇన్నాళ్లు అందరూ నా తరపున మాట్లాడారు.
ఈరోజు నేను మాట్లాడాలి.

తిరిగి గౌతమ్ వైపు చూసి మీరు ఎందుకు వచ్చారు?
సోరి చెప్పడానికా? లేదా ఇంకోసారి కంట్రోల్ చేయడానికా? అంటుంది.

గౌతమ్ లోపల కలవరం మొదలవుతుంది.
ఇది  నేను ఊహించిన అమ్మాయి కాదు…
ఇది బ్రేక్ అయిపోయిన విశి కాదు…
నేను నీ మంచికే... అనగానే..
మంచా.. అంటే ఏమిటి మిస్టర్. చూడు విశి. నేను మీ మదర్ తో చెప్పానని నీకు కోపంగా ఉండవచ్చు.  నేను వెల్ సెటిల్ బిజినెస్ మాన్ ని.

ఏది కోరుకున్న నా కాళ్ళ దగ్గరే ఉంటుంది.  అలాంటిది నన్ను కాదని ఆఫ్టర్ నెల జీతానికి పనిచేసే ఒక లెక్చరర్ వెంట పడుతున్నావు. ఇది నీ కెరియర్ కి అసలు మంచిది కాదు.
విశి గట్టిగా.. నాకు ఏది మంచిదో ఆలోచించుకునే  హక్కు ఉంది.
మీరు కాదు… నా మదర్ కాదు… ఇంకా ఎవరెవరో కాదు..
నేను.

ఆ మాటలకు గౌతమ్ వెనక్కి ఒక అడుగు వేస్తాడు.
భవ్య చిరునవ్వుతో.. ఇప్పుడు అర్థమైందా ఎందుకు విశి మారిందో? అంటుంది.

విశి చివరిగా  మీరు ఇంకేమైనా చెప్పాలంటే చెప్పండి.
లేదంటే… మాకు క్లాస్ ఉంది అని తిరగబోతుంది.

గౌతమ్ గొంతులో తొలిసారి భయం.విశి… నువ్వు ఇలా ఉంటావని అనుకోలేదు. ఐ లవ్ యు..

విశి వెనక్కి తిరిగి... మీరు వెల్ సెటిల్ బిజినెస్ మాన్.  మీరు ఏది కోరుకున్న మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. అలాంటిది మీరు ఇలా రావడం కరెక్ట్ కాదేమో..
నిన్ను మిస్ అవుతానేమో అని భయం వేసే మీ మదర్ తో మాట్లాడాను కానీ నిన్ను తక్కువ చేయాలనే కాదు అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు.

ఎప్పుడూ తక్కువగా అంచనా వేసినవాళ్లు
ఒక్కసారిగా ఎదురు నిలబడితే ఇలానే భయపడతారు. నా మీద ప్రేమతో కాదు ఆ విషయం మీకు తెలుసు నాకు తెలుసు.. అని చెప్పి వెళ్ళిపోతుంది.

గౌతమ్ అక్కడే నిలబడిపోతాడు.
గ్రౌండ్ లో శబ్దాలు…  కానీ అతని చెవుల్లో మాత్రం
విశి మాటలే మోగుతుంటాయి.

వీళ్ళకి తెలియకుండా ఇదంతా విన్న సూర్య మాత్రం నవ్వుకుంటాడు. పర్వాలేదు క్యూటీ నాతో పూర్తి ప్రేమలో పడ్డాక నీలో బాగానే ధైర్యం వచ్చింది.

విశి అక్కడినుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా
గౌతమ్ అదే చోట నిలబడి ఉంటాడు.
ఇది ఇలా అయిపోతుందా?

నన్ను చూసి ఏడుస్తుంది అనుకున్నాను…
కానీ నన్నే చిన్నబుచ్చింది…
అంతలో వెనుక నుంచి కార్ బ్రేక్ సౌండ్.
గౌతమ్ తల ఎత్తి చూస్తాడు.

బ్లాక్ స్ యూ వి.
డోర్ ఓపెన్ అవుతుంది.
హిమ దిగుతుంది.
సింపుల్ కానీ పవర్ ఉన్న లుక్.
కళ్లలో పొగరు … నడకలో రెక్లేస్..

గౌతమ్ గుండె ఒక్కసారి దడదడ.
ఇక్కడ ఎందుకు? ఇప్పుడేనా?
హిమ చుట్టూ చూసి
ఇదేనా నువ్వు చాలా ఉత్సాహంగా చెప్పిన కాలేజ్?

గౌతమ్ తడబడుతూ
హిమ… నువ్వు ఇక్కడికి...
నీ పని అయిందా?  సూటిగా అడుగుతుంది హిమ.

గౌతమ్ మాట మార్చాలని చూస్తూ అదే… కొంచెం మిస్ అండర్‌స్టాండింగ్.. విశి ఎదురు తిరిగింది  అని హిమ ముందు ఒప్పుకోలేకపోతూ ఉంటాడు.

హిమ నవ్వుతుంది.
అది నవ్వు కాదు…. ఒక రకమైన హేళన..
విశి బ్రేక్ అయి ఉంటుందని వచ్చావు కదా?
కంట్రోల్ చేద్దాం అనుకున్నావు కదా? నిన్ను బెగ్ చేస్తుంది అని చాలా కలలతో వచ్చావు కదా?

గౌతమ్ కళ్ళు పక్కకి తిప్పుతాడు.
ఇప్పుడెలా ఉంది?  నీ స్ట్రాటజీ వర్క్ అయిందా? అని అడుగుతుంది.

గౌతమ్ నెమ్మదిగా  హిమ… నేను అనుకున్నట్టు లేదు అంటాడు.
హిమ ఒక్క అడుగు ముందుకు వచ్చి.. అనుకున్నట్టు లేదంటే? అంటుంది.

ఆ విశి … చాలా మారిపోయింది. నాకే ఎదురు తిరుగుతుంది వార్నింగ్ ఇచ్చింది  అని చెబుతాడు.

హిమ నవ్వి తండ్రికి ఫోన్ చేస్తుంది.  నాన్న… మనం అనుకున్నట్టే జరిగింది.
ఫోన్ లోంచి తండ్రి స్వరం
ఏమైంది? గొర్రెకి కొమ్మలు వచ్చాయా?

హిమ కళ్ళు గౌతమ్ మీదే పెట్టి
కొమ్మలు కాదు నాన్న… అవి విరిగిపోయి..
ఇప్పుడు ఆ గొర్రె ఎవరో కూడా తెలియదు అంటుంది.

గౌతమ్ ముఖం ఎర్రబడుతుంది.
హిమ కాల్ కట్ చేసి... చూడు గౌతమ్, నీకు ఒక మాట చెప్పాలి.

నువ్వు ఎప్పుడూ మనుషుల్ని అండర్‌ఎస్టిమేట్ చేస్తావు.
అది నీ పెద్ద ఫెయిల్యూర్.  నిన్ను చూసి నువ్వే గొప్ప అనుకుంటావు.
కానీ నిన్ను చూసి ఎదుటివాళ్లు ఎదగడం మొదలెడితే
అప్పుడు నువ్వు పనికిరావు.

గౌతమ్ నిస్సహాయంగా  నాకు కొంచెం టైమ్ ఇవ్వు అంటాడు.
హిమ గట్టిగా.. టైమ్ ఇవ్వడానికి నువ్వేమీ ప్రాజెక్ట్ కాదు.
తిరిగి వెళ్ళిపోతూ... ఒక రకంగా నీకు థాంక్స్ చెప్పాలి. నీవల్లనే నాకు ఈరోజు..పబ్లిసిటీ వచ్చింది.
ఒక బిజినెస్ ఉమెన్ గా అవసరం లేదు అనుకుంటే ఏదైనా వదిలేయాలి సో.. నీ అవసరం అయిపోయింది.

స్ యూ వి లోకి ఎక్కుతూ..  ఇక నీతో నాకు బిజినెస్ లేదు అంటుంది.
కారు వెళ్ళిపోతుంది.

గౌతమ్ ఒంటరిగా గ్రౌండ్ మధ్యలో నిలబడి ఉంటాడు.
చుట్టూ విద్యార్థుల నవ్వులు…
ఆటల శబ్దాలు…
కానీ అతని లోపల మాత్రం
పూర్తి సైలెన్స్.

ఇవాళ ఇద్దరూ చేతులిచ్చి వెళ్లిపోయారు.
ఒకటి ప్రేమ కాదు… ఇంకొకటి బిజినెస్ కాదు…
రెండింట్లోనూ నేను ఫెయిల్ అయ్యాను.

ఫస్ట్ టైమ్.. అతని కళ్ళలో భయం.

గౌతమ్ పరిస్థితి...........
[+] 6 users Like SivaSai's post
Like Reply

Part - 109



గౌతమ్ లో మొదట భయం మొదలవుతుంది. తర్వాత అది ఒక అసహనంగా మారి కోపంగా రూపాంతరం చెందుతుంది.

బానిసలాగా పడి ఉంటుంది అనుకున్న విశి ఎదురు తిరిగింది. హిమ ని పెళ్లి చేసుకుని సోషల్ స్టేటస్ పెంచుకోవాలి అనుకుంటే అది వదిలేసి వెళ్ళిపోయింది.

ఆ హిమని నిలబెట్టడం కోసం విశి టాలెంట్ అంతా హిమకి వాడాను.. అది దానితో తను బెస్ట్ ఆర్కిటెక్చర్ అనే బ్రాండ్ నేమ్ తెచ్చుకుని నా అవసరం లేదు అంటూ వెళ్ళిపోయింది.

ఇటు విశి వర్క్ లేదు. ఆటు సోషల్ స్టేటస్ లేదు. ఎలాగైనా వి. జె. స్ కంపెనీ ప్రాజెక్ట్ ఓకే చేయించుకోవాలి.. అప్పుడే వెళ్లిన ఇద్దరు వెనక్కి తిరిగి వస్తారు.. అప్పుడు చెబుతాను.

ఈ లోపు హిమ పొగరంతా అనగతొక్కలి  అని పళ్ళు నూరుతూ అక్కడ నుండి వెళ్లిపోతాడు.

హిమ కార్ డ్రైవ్ చేస్తూ సూర్య ని ఎలాగైనా లైన్లో పెట్టుకోవాలి. ఇక ఈ గౌతమ్ వేస్ట్.  అఫ్కోర్స్ వీడు వల్ల ఎంత ఉపయోగం ఉన్నా వాడిని పెళ్లి చేసుకునేది ఏమీ లేదు.

సూర్యతో అయితేనే నా లైఫ్ బాగుంటుంది. అటు పేరుకు పేరు. స్టేటస్ కి స్టేటస్..  హిమ సూర్యా దేవాన్ష్ జైసింహ అంటే ఆ క్రేజే వేరు కదా అని అప్పుడే ఊహల్లోకి వెళ్ళిపోతుంది.

హిమ ఊహల నుంచి ఒక్కసారిగా బ్రేక్ పడుతుంది.
ముందు సిగ్నల్ రెడ్.
బ్రేక్ మీద కాలు నొక్కుతూ స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకుంటుంది.  సూర్య…
ఆ పేరు పెదవుల మీద నుంచి జారుతుంది.

సూర్య నాకు కాల్ చేస్తానని చెప్పి చాలా రోజులైంది. ఇప్పటివరకు ఫోను లేదు.  అసలు గుర్తున్నానా లేక నన్ను అవాయిడ్ చేయడానికి చెప్పాడా.

అలా అనుకోవడం కూడా హిమకి నచ్చదు.  లేదు తను ఫుల్ బిజీ పర్సన్ కదా..  అందుకే గుర్తుండదు.  నేనే వెళ్లి మాట్లాడతాను అని కార్ ని ఆఫీస్ వైపు తిప్పుతుంది.

విశి, భవ్య క్లాస్ కి వెళ్ళిపోతారు.
డెస్క్ మీద డ్రాయింగ్ షీట్స్ అలా పడి ఉంటాయి.
విశి ఒక్కొక్క షీట్ తీస్తూ చూస్తుంది.
తన టాలెంట్…
తన ఐడెంటిటీ…
నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు.
లోతుగా శ్వాస తీసుకుంటుంది.
గౌతమ్ ఇలాగే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి భయపెట్టడానికి చూసిన నేను ధైర్యంగా నిలబడాలి.
నాకు నా కెరీర్ ముఖ్యం. నా గోల్ ముఖ్యం.
ఆ క్షణంలోనే డిసిషన్.
ఫోన్ తీసి మెయిల్ ఓపెన్ చేస్తుంది.

సబ్జెక్ట్ లైన్ టైప్ చేస్తుంది.
ఇండిపెండెంట్ ఆర్చిటెక్చరల్ ప్రపోసల్... విశి
సెండ్ బటన్ నొక్కే ముందు క్షణం ఆగుతుంది.
కళ్లలో ఒక చిన్న తడిమి…
తర్వాత గట్టి నిశ్చయం.
వి. జె. స్ కంపెనీకి పంపించి సూర్యకి మెసేజ్ చేస్తుంది అది చూసి సూర్య నవ్వుకుంటూ ఆల్ ద బెస్ట్ అని మెసేజ్ చేస్తాడు.

సూర్య నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉందని మెసేజ్ చేసి ఆఫీస్ కి వెళ్తాడు. ఇంపార్టెంట్ మీటింగ్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే సార్ మీ కోసం హిమ అనే ఒక లేడీ వెయిట్ చేస్తున్నారు అని చెబుతాడు.

పంపించవని చెబుతాడు. ప్యూన్ వెళ్ళగానే హిమ లోపలికి వచ్చి హాయ్ సూర్య అని హస్కీ గా పిలుస్తుంది. చూడకుండానే సీట్ హిమ అంటే..

ఏంటి సూర్య కాల్ చేస్తాను అన్నావు కానీ ఫోన్ లేదు. ఏమైపోయావు అని గారంగా అడుగుతుంది.

ఓరి నీ దీన వేషాలో అనుకోని..  చూస్తున్నావు కదా ఎంత బిజీగా ఉన్నానో. నువ్వు వచ్చి ఇంతసేపైనా నీ వైపు చూడలేదంటే అర్థం చేసుకోవాలి.

ఐ నో సూర్య నీలాంటి బిజినెస్ పర్సన్స్ ఇలాగే బిజీగా ఉంటారు. అప్పుడే కదా మన స్టేటస్ ఇంకా పెరిగేది. మన కాదు నా అంటాడు. అదే అదే అని కంగారు కప్పిపుచ్చుకుని లంచ్ కి వెళదామా..

ఎనీ స్పెషల్. నొథింగ్.  నీతో కలిసి లంచ్ చేయడమే స్పెషల్.  బట్ సోరి హిమ నా వర్క్ చూస్తున్నావు కదా..  లంచ్ కి బయటికి వచ్చి టైం వేస్ట్ చేసే అంత ఖాళీగా లేను. పోనీ ఇక్కడే చేద్దాము.

ఇది వదిలేటట్టు లేదు అనుకుని ప్యూన్ కి చెప్పి జ్యూస్ తెప్పిస్తాడు. జ్యూస్ ఏమిటి..  నేను అడుగుతుంది లంచ్. చెప్పాను కదా నాకు లంచ్ చేసే అంత టైం లేదు అని సో జ్యూస్ తాగేసి వెళ్ళు.

ఈ జ్యూస్ నేను తాగాలేనా... నువ్వు ఇప్పిస్తే గాని అని కొంచెం రోషంగా అడుగుతుంది.  చేస్తున్న వర్క్ పక్కన పెట్టి నువ్వు వచ్చిన పర్పస్...  లంచ్ కి వెళదామని.

నాకు కుదరదు అని చెప్పాను.  అక్కడితో టాపిక్ కట్ అవ్వాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతున్నావు ఏంటి అని కొంచెం సీరియస్గా అడుగుతాడు.

వెంటనే హిమ కంట్రోల్ చేసుకుంటూ అయ్యో సూర్య నా ఉద్దేశం అది కాదు.  ఓకే నువ్వు ఎప్పుడు ఫ్రీ గా ఉంటావో చెప్పు. అప్పుడే వెళదాము.

బట్ నీతో డేట్ కి వెళ్లాలని నాకు చాలా కోరికగా ఉంది. నేను ఎప్పుడు ఫ్రీ అవుతానో నీకు ఇన్ఫార్మ్ చేస్తాను అప్పుడు వెళదాంలే.

ఎప్పుడు ఇలాగే చెబుతున్నావు గాని నువ్వు ఫోన్ చేయడం లేదు.  నీ నెంబర్ నాకు ఇవ్వు. నేనే చేస్తాను. ఇక వదిలేటట్టు లేదు అని...  ఒక నెంబర్ చెబుతాడు.

థాంక్యూ థాంక్యూ అనుకుంటూ వెళ్ళిపోతుంది. అయ్యబాబోయ్ గౌతమ్ గాడు ఇన్ని రోజులు దీన్ని ఎలా భరించాడో కానీ ఒక అరగంటకే నా బుర్ర హీటెక్కిపోయింది.

అదే నా విశి బంగారం చూడు... క్యూట్గా మాట్లాడుతుంది. ఎంతసేపు మాట్లాడినా బోర్ కొట్టదు. ఆడపిల్లలంటే అలాగా ఉండాలి అని విశిని తలుచుకుని మురిసిపోతూ ఉంటాడు.

వైభవ్ సౌమ్య దగ్గరికి వస్తాడు. ఏంట్రా.  నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో ఏం మాట్లాడాలి.  అసలు చందు ఏం ప్రాజెక్ట్ చేస్తుంది. ఆ సర్వీస్ దాని గురించి నాకు డీటెయిల్స్ కావాలి. ఎందుకు.  అబ్బా అన్ని తెలిసే అడుగుతావేమిటి..

మెడికల్ క్యాంపు పెడుతుంది. అది నాకు తెలుసు కానీ సడన్గా ఎందుకు ఆ డిసిషన్ తీసుకుంది. సడన్గా ఏమీ కాదు. దానికి ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి ప్లాన్ ఉంది.

వచ్చే ఇన్కంలో  సంమ్ అమౌంటుతో ఏదో ఒక సర్వీస్ చేయాలి అని. సో..  ఎర్నింగ్ స్టార్ట్ చేసింది. ఆటోమేటిక్గా ఈ స్టెప్ తీసుకుంది. దానికి పిన్ని బాబాయ్ కూడా  సపోర్ట్ ఇచ్చారు. కొంత అమౌంట్ దానిది.  అయితే కొంత అమౌంట్  ఫ్యామిలీ నుంచి.

ఎవరైనా డొనేషన్స్ ఇస్తే దానికి తగ్గట్టుగా సర్వీస్ చేసి డీటెయిల్స్ వాళ్లకు పంపించేటట్టుగా ప్లాన్ చేస్తోంది.. సడన్గా దానికి ఇంత మంచి బుద్ధి ఏమిటి?

అది ఎప్పుడూ మంచిగానే ఉంది. నీకు అర్థం అవ్వడానికే టైం పట్టింది. ఏదో చిన్నప్పుడు గొడవలు బుర్రలో పెట్టుకొని పెద్దయ్యాక కూడా అలాగే ఉంటారు అనుకుంటే ఇదిగో నీ లాగానే కన్ఫ్యూషన్ బాక్స్ లో ఉంటారు.

అంటే నేను కన్ఫ్యూషన్.. చందు క్లారిటీ నా.. నువ్వు ఫీల్ అవ్వనంటే మాత్రం అది నిజమే.  ఫీల్ అయితే మాత్రం నిజం అబద్ధం అవుతుందా ఏంటి అంటాడు.

చిన్నప్పటి చందు నా కళ్ల ముందు అలా ఫిక్స్ అయిపోయింది అనుకుంట. చందు అంత మెచ్యూర్ గా ఆలోచిస్తుంది అని ఊహించలేకపోయాను.  ఇన్ఫాక్ట్ ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు.
చందు మారలేదు నువ్వు ఆలోచించే విధానం మారింది.
నీకెప్పుడూ కనిపించనంతగా అప్పుడూ ఉంది.
నువ్వు చూసేలా ఆమె నీ ముందు నిలబడలేదు అంతే.
అది విన్న వైభవ్ చిన్నగా నవ్వుతాడు. కానీ ఆ నవ్వులో తేలిక లేదు.

నేను ఇప్పటికీ పాత ఫైల్స్ ఓపెన్ చేసి కూర్చున్నానా?
అవును.
మిగతావాళ్లు అప్డేట్స్ తీసుకుంటుంటే నువ్వు మాత్రం క్యాష్ క్లియర్ చేయకుండా అదే వెర్షన్ చూస్తున్నావు.
వైభవ్ నిట్టూర్చి వెనక్కి వాలుతాడు.

ఆ మెడికల్ క్యాంప్…  అది నిజంగా వర్క్ అవుతుందా? దానికి ఏమీ రిస్క్ అవ్వదు కదా... అంటే నా ఉద్దేశం అది సరిగ్గ కండక్ట్ చేయలేదు అని కాదు.  మెడికల్ క్యాంపు అంటే చాలా ప్రొసీజర్స్ ఉంటాయి కదా..

సౌమ్య నవ్వుతూ..  వర్క్ అవుతుంది.
ఎందుకంటే అది డబ్బు కోసం కాదు… పేరు కోసమో కాదు.
ఒక అప్పు తీర్చుకున్నట్టు చేస్తోంది.

ఎవరికీ?

సౌమ్య కాసేపు ఆగి, నిదానంగా..... తనకే.
అర్థం కాలేదు.  మనం వచ్చినందుకు చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా. అప్పుడే మనకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు గాడ్ కి థాంక్స్ చెప్పుకోవడానికి ఉంటుంది అని చందు ఆలోచన.
ఆ మాట వైభవ్‌ని గట్టిగా తాకుతుంది. ఏమీ మాట్లాడకుండా కిందకి చూస్తాడు.

నువ్వు తెలుసుకోవాలనుకుంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ నేను ఇస్తాను.
కానీ ఒకటే క్లియర్ చేసుకో…

ఏంటి?

చందుని అర్థం చేసుకోవాలా… లేదా జడ్జ్ చేయాలా?
మౌనం.
దూరంగా చందు నవ్వుతున్న శబ్దం వినిపిస్తున్నట్టుగా ఉంటుంది.
వైభవ్ చూపు అటు వైపు వెళ్తుంది.
ఈసారి ఆ చూపులో సందేహం లేదు… మొదటి సారి ఆసక్తి ఉంది.

అర్థం చేసుకుని దానితో ట్రావెలింగ్ చేస్తాను అని కళ్ళ ముందు మెదులుతున్న చందు ని చూస్తూ చెబుతాడు.

ఆల్ ద బెస్ట్ వైభవ్ ??
[+] 6 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)