Posts: 2,143
Threads: 246
Likes Received: 1,432 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
(21-11-2019, 06:09 AM)Tvsubbarao Wrote: Super update ధన్యవాదములు మిత్రమా సుబ్బారావ్
(21-11-2019, 12:44 AM)K.R.kishore Wrote: Nice update ధన్యవాదములు కిషోర్
(20-11-2019, 11:37 PM)jhonnysamchaitu Wrote: Bagundi Andi konchem regular ga ivandi ధన్యవాదములు మిత్రమా... ప్రయత్నిస్తున్నాను. సమయం మరియు మూడ్ ఏకకాలంలో కుదరటం కష్టమైపోతోంది.
(20-11-2019, 10:40 PM)Kasim Wrote: వికటకవిగారు అప్డేట్ బాగుంది ధన్యవాదములు ఖాసిం
•
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,432 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
27-11-2019, 01:12 PM
(This post was last modified: 27-11-2019, 01:14 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
(21-11-2019, 08:21 AM)Okyes? Wrote: వికటకవి గారు.......
ఇలా అప్పుడప్పుడు కాకుండా కాస్త సమయం తీసుకొని రెగ్యులర్ గా అప్డేట్ పెట్టఁడి సార్
థాంక్స్ ఫర్ దిస్ టీసింగ్ అప్డేట్
అజయ్ సౌమ్యల మద్య
(మీరు మమ్మల్ని అప్పుడప్పుడు అప్డేట్ లు పెడుతూ.....)
ధన్యవాదములు గిరీశంగారూ.
త్వరితగతిని అప్డేట్లు పెట్టాలని నాకూ ఉన్నా అజయ్ కన్నా ఎక్కువగా నా మనసు సందిగ్ధావస్థలో పడిపోవటం చేత వ్రాయలేకపోతున్నాను అనుకుంటాను. అయిననూ వ్రాసేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే వున్నాను. మిమ్మల్ని టీజ్ చేసే ఆలోచన నాకస్సలు లేదు. ఈరోజే చూశాను. 'నా ముగ్గురు పెళ్ళాలు' రచయిత కిషోర్ గారు మెసేజీని. అతను తిరిగి తన కథను కొనసాగిస్తానని చెప్పటం సంతోషంగా అనిపించింది. అతని దారంలో మెసేజీలు పెట్టనని ఒట్టేసుకున్నాను గనుక నా ఆనందాన్ని నా యీ దారంలో మీతో పంచుకుంటున్నాను.
తర్వాతి అప్డేట్ మొదలుపెట్టాను. అలాగే, నేను మొదలుపెట్టిన చిన్న కథలు కూడా చాలానే సగంలో ఉండిపోయాయి. అవి కూడా ప్రస్తుతం వేగంగా పూర్తి చేసి పోస్టు చెయ్యాలనే సంకల్పంతో వ్రాస్తున్నాను.
•
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,432 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
(21-11-2019, 09:19 AM)Mnlmnl Wrote: soooooooooo sweet
Finally a story miss kakudadhani ee site lo register ayyano aa story update ee roju chusanu thank you so kavi sir మీ అభిమానానికి ధన్యవాదములు మిత్రమా...
(21-11-2019, 10:33 AM)Sivakrishna Wrote: ఇందుకె ఈ కథ అంటే పడి చచ్చేది అప్డేట్ చాలా బాగుంది కవి గారు ధన్యవాదాలు మిత్రమా శివకృష్ణా...
(21-11-2019, 01:44 PM)Eswar P Wrote: బాగుంది కవి గారు మిత్రమా ఈశ్వర్... ధన్యవాదములు
(22-11-2019, 07:52 AM)twinciteeguy Wrote: super ధన్యవాదాలు జంటనగరాల మిత్రమా
(22-11-2019, 09:14 AM)saleem8026 Wrote: Nice update మిత్రమా సలీమ్... ధన్యవాదాలు
•
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,432 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
(24-11-2019, 07:02 PM)lovelyraj Wrote: కథ చాలా బాగుంది వికటకవి గారు ధన్యవాదములు మిత్రమా లవ్లీరాజ్...నా తాపత్రయం కూడా అందుకోసమే!
(24-11-2019, 07:00 PM)Venkat 1982 Wrote: Very nice story bro.
Good update bro ధన్యవాదములు వెంకట్ బ్రో...
(24-11-2019, 03:54 PM)Saradhi41 Wrote: Nice update kunchem peddadi ithe bagunu ధన్యవాదములు మిత్రమా సారధి. కథ సాగేకొద్దీ అప్డేట్లు పెద్దవి వస్తాయి.
(24-11-2019, 01:51 PM)Pinkymunna Wrote: Nice update broo bhagundi... ధన్యవాదములు మిత్రమా మున్నా... మీ అభిమానానికి!
(22-11-2019, 09:22 AM)Chandra228 Wrote: ఎన్నాళ్ళుకు మళ్ళీ మొదలు పెట్టారు బ్రదర్ ఇప్పుడు అయినా పూర్తిగా అప్డేట్ లు ఇస్తారని కోరుతున్నాము.. ధన్యవాదములు చంద్రాగారూ...నా ప్రయత్నం కూడా అదే!
•
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,432 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
(24-11-2019, 08:19 PM)Lakshmi Wrote: కవి గారూ...
మీ update ఆలస్యంగా చూసాను... మన్నించాలి...
బాగా రాశారు... ఒకసారి ఒకరితో అమర్యాదగా ప్రవర్తిస్తే మళ్లీ వాళ్ళ దగ్గర సౌమ్యంగా ప్రవర్తించాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో అజయ్ పరిస్తితి చూస్తే మనకు తెలిసిపోతుంది... మన నిత్య జీవితంలో కూడా ఇది ఒక పాఠం మనకు...
సౌమ్య అజయ్ ని ఆడుకోవడం బాగుంది..
ధన్యవాదములు లక్ష్మిగారూ...
అమావాస్యలకీ పున్నమిలకీ నేను అప్డేట్లు పెడుతుంటే మీకు మాత్రం ఏమని తెలుస్తుందీ... నా దారాన్ని చూడాలని ఎందుకు అనిపిస్తుంది చెప్పండి!
పైగా నేనూ ఎవరికీ నా కథని చూడండి, చదవండి అని అడగను. ఇష్టమైతే వాళ్ళే చదువుతారు.
నాకు తెలిసి ఒక్క అన్నెపూ బ్రో కి మాత్రం ఈమధ్యనే 'అంజలి-శిరీష్'ల మధ్య ఒక అప్డేట్ వ్రాసానని చూడమని చెప్పాను. అతనికి 'అంజలి' క్యారెక్టర్ అంటే బాగా యిష్టం.లోగడ అతని అభ్యర్థనను దృష్టిలో ఉంచుకొని రెండవ భాగంలో ఒకట్రెండు అంజలి ఎపిసోడ్లు వ్రాయటం జరిగింది.
ఇక అజయ్ ప్రవర్తన విషయానికొస్తే, మీరు చెప్పినది వాస్తవమే లక్ష్మిగారు.
తర్వాత అప్డేట్లలో వారిద్దరి మధ్యనా ప్రేమ ప్రయాణం ఇంకెలా సాగుతుందో చూడాలి మరి!
•
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,432 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
(25-11-2019, 04:30 AM)ramd420 Wrote: అప్డేట్ బాగుంది
ధన్యవాదములు మిత్రమా రామ్
•
Posts: 1,482
Threads: 0
Likes Received: 403 in 358 posts
Likes Given: 24
Joined: Nov 2018
Reputation:
4
•
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,432 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
(27-11-2019, 03:59 PM)Tvsubbarao Wrote: Super update
మిత్రుడు తొందరపడి ముందే కూసేసినాడు. నేనింకా ఏ అప్డేట్ పెట్టనేలేదు అని మనవి చేసుకుంటున్నాను.
•
Posts: 2,428
Threads: 2
Likes Received: 2,897 in 1,145 posts
Likes Given: 8,161
Joined: Nov 2019
Reputation:
308
వికటకవి గారు అప్డేట్ ఇవ్వండి
ఈ కథకు చాలా మంది అభిమానులు ఉన్నారు
దయచేసి కొనసాగించగలరు
•
Posts: 2,135
Threads: 0
Likes Received: 794 in 640 posts
Likes Given: 3,815
Joined: Nov 2018
Reputation:
14
•
Posts: 1,482
Threads: 0
Likes Received: 403 in 358 posts
Likes Given: 24
Joined: Nov 2018
Reputation:
4
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,432 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
05-12-2019, 02:50 PM
(This post was last modified: 31-12-2019, 08:23 PM by Vikatakavi02. Edited 2 times in total. Edited 2 times in total.)
ఎపిసోడ్ — 121
"ఎగ్జామ్ కి టైం అయిపోతోంది. వీళ్ళింకా రాలేదేమిటి?" టెన్షన్‌తో పూనకం వచ్చినట్లు ఊగిపోతోంది నాస్మిన్.
సెంటర్ లోకి అనుమతించడానికి కేవలం పదిహేను నిముషాలే వుండటంతో నాస్మిన్, సామిర్ లు సుజాత గురించి కంగారు పడసాగారు.
"ఐనా... పరీక్ష పెట్టుకొని కూడా వెళ్ళాల్సినంత అర్జెంటు పనేమయివుంటుంది?" అందామె మళ్ళా.
సామిర్ కి అంతకుమించిన సందేహాలు, భయాలూ, ఆందోళనలూ వస్తున్నాయి గానీ నాస్మిన్ ముందు వాటిని బైట పెట్టకుండా, "సరే... నీకూ లేటయిపోతోందిగా, నువ్వు లోపలికెళ్ళు!" అన్నాడు.
నాస్మిన్ తలాడిస్తూ ఓసారి తన చేతికున్న వాచీని చూస్తూ, "హ్మ్... ఇంకో ఐదు నిముషాలు చూద్దాం—" అని అంటుండగా అప్పుడే శంకర్ బైక్ వారి ముందు ఆగింది. సుజాత ఆ బైక్ మీంచి దూకినట్లుగా దిగుతోంది.
నాస్మిన్ రిలీఫ్ గా ఊపిరి తీసుకుని, "సుజీ...!" అంటూ వడివడిగా ఆమె దగ్గరికి వెళ్ళి,
"ఇంతసేపూ ఎక్కడికి వెళ్ళిపోయావ్?" అని కోపంగా అడిగి శంకర్ వైపు చూసి, "సార్—" అని ఏదో అనబోతుండగా, "ఎగ్జామ్ కి టైం ఐపోతోంది. తొరగా వెళ్ళండి ఇద్దరూ... మళ్ళా ఎంట్రీ క్లోజ్ చేసేస్తారు. ఏమైనా వుంటే తర్వాత చూద్దాం. ఆల్ ద బెస్ట్!" అని గబగబా చెప్పేసి శంకర్ అక్కణ్ణించి స్టార్ట్ అయ్యాడు.
సుజాతని చూసిన సంతోషం వల్లనో మరెందుకనో పరీక్షా సమయం అయిపోతోందన్న విషయాన్ని క్షణంపాటు మరిచిపోయింది నాస్మిన్. శంకర్ గుర్తు చెయ్యగానే తుళ్ళిపడి, "హా... యహ్... అల్లా... యస్ సర్! థాంక్స్... సుజీ... పద వెళదాం!" అని వెనక్కి మరలుతూ అంది.
శంకర్ వెళ్ళిపోయాడు. సామిర్ అక్కడే నిల్చుని వున్నాడు. నాస్మిన్ అతన్ని దాటుకొని గాభరాగా సుజాత చెయ్యి పట్టుకుని సెంటర్ వైపు పరుగులాంటి నడకతో నడుస్తోంది. ఆమెకి ఇంకేమీ పట్టించుకునే ధ్యాసలేదు.
వెనక నించి, "ఆల్ ద బెస్ట్!" అన్నాడు సామిర్ కాస్త గ్రొంతుని పెంచి.
సుజాత వాణ్ని చూసి తన మరో చేత్తో హ్యాండ్ బ్యాగ్ జిప్ ని ఓపెన్ చేసి అందులోంచి మడిచిన కాగితాన్ని ఒకటి తీసి వాడికి కనపడేలా నేల మీద పడేసి కళ్ళతోనే తీసుకొమ్మన్నట్లుగా సైగ చేసింది.
సామిర్ ఆ కాగితాన్ని చూసి మళ్ళా సుజాతని చూశాడు.
ఆమె అతన్ని చూసి సన్నగా నవ్వుతూ చిన్నగా చెయ్యూపి నాస్మిన్ తో కలిసి సెంటర్ లోకి వెళ్ళిపోయింది.
★★★
"నువ్విక రాజమండ్రికి ట్రాన్సఫర్ చెయ్యించేసుకో అన్నయ్యా! రోజూ కాకినాడ నుంచి వస్తూ పోతూ ఎంత చిక్కిపోయావో చూడు... పాపం!" అని అజయ్ కి భోజనం వడ్డిస్తూ బుగ్గలు పట్టుకుని ముసిముసి నవ్వులు చిందించింది వాణీ.
అజయ్ వెంటనే వాణీ చెవిని దొరకబుచ్చుకొని, "నువ్వే సగం నా రక్తాన్ని పీల్చేస్తున్నావే!! ఏదో మా లత చేతి వంట చలువతో ఇంకా ఇలా బతికి ఉన్నానుగానీ—"
వాణీ తన చెవిని వదిలించుకొని దూరంగా జరిగి, "అబ్బోస్... అక్కయ్యే కాదమ్మా, నేనూ అద్భుతంగా వండగలను!" అంది తన ముక్కుని గాల్లోకి ఎగరేస్తూ.
"ఆమాట నువ్వు కాదు. నీ వంట తిని బ్రతికి బట్టకట్టినవాళ్ళు అనాలి వాణీ!" కుర్చీలో కూర్చుంటూ చల్లగా అన్నాడు శిరీష్. "కరెక్ట్ గురూ!" అంటూ అజయ్ పగలబడి నవ్వాడు. శిరీష్ కూడా అతనితో జత కలిశాడు. వాణీ బుంగమూతి పెట్టి, "బావా!" అంది గారంగా.
లత కిచెన్ లోంచి ఏదో కూరని పట్టుకుని వస్తూ, "ఏంటీ అంతలా నవ్వుతున్నారూ—!" అంటూ వాళ్ళని చూస్తూ కళ్ళెగరేసింది.
అంతలో అజయ్ ఫోన్ మ్రోగింది. తీసి చూశాడు.
'సౌమ్య!'
చప్పున లేచి నిల్చున్నాడు. "ఏమయింది అజయ్?" అడిగాడు శిరీష్.
"ఏం లేదు గురూ" అంటూ తల అడ్డంగా ఊపుతూ, "సౌమ్య—" అని ఫోన్ స్క్రీన్ ని చూపించి, "రాత్రికి కాల్ చేస్తానని చెప్పింది. నేనే మర్చిపోయాను... ఛ! ఒక్క నిముషం—" అంటూ అక్కణ్ణించి గబగబా బైటకి వచ్చేశాడు. వెనక ఆ ముగ్గురూ ఒకర్నొకరు చూసుకొని నవ్వుకున్నారు, సౌమ్య పట్ల అజయ్ కనబరుస్తున్న (అ)టెన్షన్ ని చూసి.!
ముందురోజుకి మల్లే అతను ఎత్తేలోగానే కట్ అయిపోయింది. ఉస్సూరుమంటూ ఫోన్ తో తలని ఓసారి మొట్టుకొని తనే సౌమ్యకి డయల్ చేసాడు. ఒక్క రింగ్ అయ్యీ అవ్వగానే అట్నించి, "హలో!" అంటూ మధురంగా మాట విన్పించిందతనికి. లోపల గుండె తలుపులు ధభాధభా కొట్టేసుకుంటోంటే— "హ్.. హలో... సౌమ్యా!?" అన్నాడు. అతని గొంతు కరుగ్గా కాకుండా చాలా మృదువుగా అన్పించింది అటు సౌమ్యకి కూడా.
"హా... సౌమ్యనే మాట్లాడుతున్నాను!"
"ఆ...ఆ...హ్... సారీ మర్చిపోయాను. థాంక్స్ ఫర్ కాలింగ్!"
"చేస్తానని మాటిచ్చానుగా!"
"యస్... థాంక్యూ... థాంక్యూ సోమచ్!"
"హుఁ... ఇలా థాంక్సులు చెప్పించుకోటానికేనా నేను కాల్ చేసిందీ!"
"స్... సారీ—"
"ఒహ్హో— ఇంకేమైనా మాట్లాడండీ!"
"సారీ... నేను— అఁ... నాకేం మాట్లాడాలో... తెలీడం లేదు!" అని అజయ్ అనగానే సౌమ్య తియ్యటి నవ్వు సన్నగా అతని చెవులని చేరింది. తన మనసులో ఏదో మెరుపు తీగ తళుక్కుమన్న భావన కలిగిందతనికి.
"మీ నవ్వు చాలా బాగుంది!" అనేశాడు.
దాంతో, అట్నుంచి బోనస్ గా మరి కొన్ని నవ్వులు విరిశాయి. "మీరూ లెటర్ ని చాలా బాగా వ్రాశారు!" అందామె చివర్న.
"థాంక్స్!" చెప్పాడు అజయ్.
"అబ్బా... ఇప్పటికి థాంక్సులూ, సారీలూ తప్ప మీరు ఏమీ మాట్లాడలేదు.! అవి కాకుండా మరేమైనా చెప్పండి," అంటూ మరలా అతన్ని ఆటపట్టించే ధోరణిలో మాట్లాడసాగింది సౌమ్య.
అజయ్ క్షణంసేపు ఆగి ఓసారి వెనక్కి తిరిగి ఎవరూ తనకి దగ్గరగా లేరని నిశ్చయించుకున్నాక, "అయ్- లవ్ యూ సౌమ్యా!" అన్నాడు మెల్లగా.
ఒళ్ళంతా జివ్వుమన్నట్లు అన్పించింది సౌమ్యకి. అతని నోటి నుంచి ఈమాటని వినటం కోసం ఆమె మనసు ఎంతగా తహతహలాడుతోందో ఆమెకి తెలిసొస్తోంది
గాఢంగా శ్వాసని తీసుకుని వస్తున్న నవ్వుని పెదాల చివర్న ఆపుకుంటూ, "ఎలా నమ్మమంటారూ?" అడిగిందతన్ని.
"నమ్మకం కలిగేందుకు... నన్నేం చెయ్యమంటారు?!"
"ఏం చెప్పినా చేస్తారా?"
"తప్పకుండా!"
ఒకట్రెండు క్షణాల మౌనం తర్వాత—"ఒకవేళ, చచ్చిపోమంటే... చచ్చిపోతారా?" అందామె.
చిత్రమైన సమస్యే! ఇదే ముందరి టఫ్ అయ్యుంటే సమాధానం ఎలా వుండేదోగానీ, ఇప్పుడు అజయ్ ఆమె ప్రశ్నకి సన్నగా నవ్వుతూ, "చచ్చిపోతానులేఁ... మీతో కలిసి ఓ అరవై, డెబ్భయి ఏళ్ళు బ్రతికేసి!" అన్నాడు.
చప్పున కళ్ళలో ఆనందపు తడి చేరింది సౌమ్యకి. కళ్ళను ఓసారి మూసుకొని తెరిచి, "అంటే... ఆతర్వాత ఒంటరిగా నన్నొదిలేసి పోతారా?!" అంది కూసింత గోముగా.
అజయ్, "ఛఛ... నిన్నూ నాతో కలిసి తీసుకుపోతానుగా!" అన్నాడు కొంటెగా.
గలగల నవ్వేసింది సౌమ్య. "మరి... నన్ను జీవితాంతం భరించేంత ఓపిక మీకుందా!"
"దానికేం! చాలానే వుంది. రోజూ జిమ్ కి వెళ్తున్నాను కదా!" అన్నాడు అజయ్. ఈసారి మొదలెట్టిన నవ్వుని ఆపటానికి సౌమ్యకి చాలా సమయమే పట్టింది.
అజయ్ కొనసాగిస్తూ— "సౌమ్య... నువ్విలా ఎప్పుడూ నవ్వుతూ నా ప్రక్కనే ఉంటే చాలు. నాకు జీవితంలో ఇంక ఏమీ అక్కరలేదు అనిపిస్తోంది!" అన్నాడామెతో.
అతని మాటలు తన హృదయాన్ని కరిగించేస్తుంటే సౌమ్య మెల్లగా, "సరే, ఉంటాను!" అనేసింది.
"నిజంగా! ఉండిపోతావా నాతో...?" ఉత్సాహంగా అడిగాడు అజయ్.
వెంటనే, "అహ్హా... 'ఇక ఉంటాను' అంటున్నాను. బాగా లేటవుతోంది కదా! పరీక్షలు దగ్గరపడుతున్నాయి. చదువుకోవాలి!" అందామె తన మాటని మార్చేస్తూ.
"ఓహ్... సరే అయితే!" నిరాశగా అంటూ, "ఓకే, గుడ్ నైట్... సౌమ్య," అన్నాడు. ఆమెతో ఎంతసేపు మాట్లాడినా మరికాసేపు మాట్లాడాలనిపిస్తోందతనికి.
నిజానికి, అటు సౌమ్య పరిస్థితి కూడా అలానే వుంది. ఆమె కూడా భారంగా శ్వాసని విడుస్తూ, "గుడ్ నైట్," అని అతనికి విష్ చేస్తూ చివర్న, "స్వీట్ డ్రీమ్స్... మై డియర్ ఇన్సపెక్టర్!" అనేసి చిలిపిగా నవ్వేస్తూ చప్పున కాల్ ను కట్ చేసేసింది.
Posts: 5,113
Threads: 0
Likes Received: 2,997 in 2,504 posts
Likes Given: 6,275
Joined: Feb 2019
Reputation:
19
Posts: 76
Threads: 0
Likes Received: 58 in 45 posts
Likes Given: 190
Joined: Sep 2019
Reputation:
0
Chala bagundi sir update Ajay sowmya la conversation Chala bagundi
Posts: 14,624
Threads: 8
Likes Received: 4,374 in 3,215 posts
Likes Given: 1,245
Joined: Dec 2018
Reputation:
164
love birds conversation baavundi
Posts: 3,607
Threads: 0
Likes Received: 1,326 in 1,029 posts
Likes Given: 197
Joined: Nov 2018
Reputation:
15
కవి గారు బాగుంది సర్. కొంచెం టైమ్ కేటాయించండి.
Posts: 2,632
Threads: 0
Likes Received: 1,001 in 819 posts
Likes Given: 2,981
Joined: Nov 2018
Reputation:
25
Posts: 3,986
Threads: 0
Likes Received: 2,708 in 2,200 posts
Likes Given: 40
Joined: Jun 2019
Reputation:
20
వావ్ అప్డేట్ చాలా బాగుంది వికటకవిగారు.
•
Posts: 712
Threads: 5
Likes Received: 725 in 192 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
మొత్తానికి అజయ్ తన మనసులో మాట బయటకి చెప్పాడు... సౌమ్య అవునని చెప్పకపోయినా కాదనలేదు కాబట్టి ఓకే అని అజయ్ అర్థం చేసుకుంటాడు.. సౌమ్య గేమ్ బాగుంది
Posts: 8,182
Threads: 1
Likes Received: 6,206 in 4,392 posts
Likes Given: 50,514
Joined: Nov 2018
Reputation:
107
•
|