Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
Episode 120

"ఇంకా అరగంట టైం వుంది అజయ్!"
"ఇంకా-నా గురూ?!"
మధ్యాహ్నం పన్నెండు గంటల నించీ రాజ్యలక్ష్మీ కాలేజీ ముందర సౌమ్య కోసం ఎదురుచూస్తున్నారు వాళ్ళు.
సౌమ్యని ఒంటరిగా కలవడానికి యింకా ధైర్యం చాలని అజయ్ శిరీష్ ని కూడా వెంట తెచ్చుకున్నాడు గడుస్తున్న ప్రతిక్షణం ఒక యుగాన్ని తలపిస్తుండటంతో జీప్ దిగి రోడ్డు మీద అటు ఇటు తచ్చాడసాగాడు.
"హ్మ్... ఎప్పుడో చదువుకునే రోజుల్లో అనుకుంటా, ఇలాగే కాలేజీ వదిలేప్పుడు అమ్మాయిలని చూడ్డానికి పడిగాపులు కాసేవాళ్ళం! ఇదుగో మళ్ళా ఇన్నాళ్ళకి—"
"అబ్బా గురూ! అదంతా ఇప్పుడు గుర్తు చెయ్యకు! నేనిప్పుడేమీ ఆలోచించలే—" అన్నాడు వేడుకోలుగా.
"—హా... ఆలోచన... అంటే జ్ఞాపకమొచ్చిందీ, సులోచన గుర్తుందారా?"
ఆ పేరు వినగానే అజయ్ కాస్త డైవర్ట్ అయ్యి శిరీష్ ని చూసి నవ్వు మొహంతో—
"ఎలా మర్చిపోతాం గురూ? అప్పట్లో దానికోసం మన బ్యాచ్ మొత్తం ఆ లేడీస్ కాలేజీ ముందరే పడిగాపులు కాసేవాళ్ళం కదా!" అన్నాడు.
"అంతేనా...! బీచ్ రోడ్డు వెంబడి తను పోతుంటే మీరంతా వెనకాలే క్యూ కట్టేవాళ్ళు కూడా!"
"హహ్హా... అదేమైనా తక్కువ తిందా గురూ! యింటివరకు సిటిబస్ ఫెసిలిటీ వున్నా దొంగముండ కావాలనే నడిచి వెళ్ళేది... అందరినీ అలా తన వెంట తిప్పుకోవటానికి!"
"హ్మ్... ఏఁవైనా అప్పట్లో అదో సరదాలేఁరా!" అంటూ నవ్వాడు. అజయ్ కూడా నవ్వేశాడు.
అలా వాళ్ళు తమ కాలేజీ విషయాలను నెమరవేసుకుంటుండగా ఇక్కడ కాలేజీ విడిచిపెట్టడంతో అమ్మాయిలు అందరూ గుంపులు గుంపులుగా బయటకి రాసాగారు.
రోజూ షరామామూలుగా కాలేజీ ముందు కనిపించే అల్లరి కుర్రమూకలు ఇవ్వాళ అక్కడ అస్సలు కనపడకపోవడం అక్కడి అమ్మాయిలకి వింతగా తోచింది—
"ఏంటే ఇవ్వాళ విశేషం.... ఒక్కడు కూడా లేడు!" లోపలి నుంచి బయటకి వస్తూ ఒక అమ్మాయి తన స్నేహితురాలితో బిగ్గరగా అనటం అజయ్, శిరీష్ ల చెవిన పడింది. అటేపు చూశారు వాళ్ళు.
ఆ మాట్లాడుతున్న అమ్మాయి ప్రక్కనే నడుస్తూ వస్తోంది 'సౌ-మ్య'.
అజయ్ గుండె రెండు అంగుళాలు క్రిందకి జారిపోయింది. బిగుసుకుపోయి రెప్పవేయకుండా ఆమెనే చూడసాగాడు. ఎందుకో తెలీదు, అతని కాళ్ళు సన్నగా వణుకుతున్నాయి!
అంతలో సౌమ్యకి మరో ప్రక్క నడిచి వస్తున్న అమ్మాయి, "అదుగో చూడండేఁ... పో'లీ'సు జీప్!" అంది.
వాళ్ళు తలలు త్రిప్పి చూశారు.
సౌమ్య దృష్టి అజయ్ మీద పడింది. ఆమె ముఖంలో ఏ భావమూ ప్రకటితమవటం లేదు.
"హ్మ్... అందుకేనేమో, ఇవ్వాళ ఎవడూ రాలేదు!" అంది ఆ మొదట అమ్మాయి కూసింత నిరాశగా!
అజయ్ ని చూసినా చూడనట్టుగా తన స్నేహితురాళ్ళతో కలిసి ముందుకు నడవసాగిందామె.
అతనికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఇంతసేపు ఎదురుచూపులూ నీళ్ళపాలవుతుండటంతో వెనక్కి తిరిగి అసహనంగా తన గురువుని చూశాడు.
శిరీష్ కి అజయ్ పరిస్థితి అర్ధమైంది. అభయం ఇస్తున్నట్లుగా తన చేతిని పైకెత్తి 'వెళ్ళి మాట్లాడరా' అని కళ్ళతోనే సైగ చేసి ఆ ఎత్తిన చేత్తో గట్టిగా అజయ్ ని ఒక్క తోపు తోసాడు.
అజయ్ గభాల్న ఒక్కడుగు ముందుకు తుళ్ళి తమాయించుకుని ఒక్కసారి గొంతుని సవరించుకుని, "సౌమ్య-గారు!" అంటూ ఆమెను పిలిచాడు.
సౌమ్య నడుస్తున్నదల్లా ఆగి తలత్రిప్పి అతన్ని చూసింది. ఆమె చుట్టుప్రక్కల వున్న స్నేహితురాళ్ళు కూడా ఆగిపోయారు.
అజయ్ ఒక్కసారి గాఢంగా ఊపిరి తీసుకుని ఆమెని సమీపించాడు.
ఆమె తన చేతిలో ఉన్న పుస్తకాన్ని గట్టిగా పట్టుకుని నిలుచునుంది.
"అ...మ్... అఁ... హ్... అదీ... మ్.మ్మీ-రూ—" కంట్రీ బూతులన్నీ కలగలిపి భాషని అనర్గళంగా మాట్లాడేంత టంగ్ పవర్ వున్న టఫ్ కి కనీసం ఒక్క మాట కూడా సరిగ్గా నోటివెంట రావటం లేదిప్పుడు!
అతనలా తడబడటం చూసి సౌమ్య పక్కన నిలుచున్న అమ్మాయిలు ముసిముసి నవ్వులు చిందించసాగారు.
దాంతో, "అటు ప్రక్కకి వెళ్దాం పదండి!" అంది సౌమ్య అతని అవస్థని గమనించి.
అజయ్ మౌనంగా తలూపాడు. ఇద్దరూ ఓ ప్రక్కకి వెళ్ళాక—
"హ్మ్... ఇప్పుడు చెప్పండి ఇన్స్పెక్టర్ గారూ!" అందామె.
"అఁ... సౌమ్యగారూ... మ్మీరు... ఇంకా... ఏం చెప్పలేదు!" అన్నాడతడు ఆఖరుకి. ఊపిరంతా ఎగిరిపోయినట్లయింది ఆ ఒక్క మాటకే... హుఫ్!
"ఏం చెప్పాలి?" అందామె ఏమీ ఎరుగనట్లు.
"అదేంటి...? నిన్న... న్-నేను... లెహ్-టర్...— ఆ ప్యూన్ మీకు—ఇవ్వలేదా?"
"మ్... అతనిచ్చాడూ...!" అంటూ దీర్ఘం తీసి, "ఐతే!" వదిలిందామె.
ఆమె వైఖరి చూస్తే కావాలనే అజయ్ ని ఓ ఆటాడుకుంటున్నట్లు అనిపిస్తోంది కదూ!
"ఐతే... అదీ...బబ్బదీ...గదీ...యిదీ... ఛ... అంటే... నేను—!" ఎంత వైచిత్రం! క్రిమినల్స్ కి ముచ్చెమటలు పట్టించి మూడు చెరువుల నీళ్ళు తాగించిన వాడు ఇప్పుడీమె ముందు మాట్లాడటానికి నీళ్ళు నములుతున్నాడు.
అక్కడ ఆమె ముఖం చూస్తే వస్తున్న నవ్వుని కావాలని ఆపుకుంటున్నట్లు కనిపిస్తోంది.
కాస్త ధైర్యాన్ని కూడదీసుకుని మరలా తన గ్రొంతుని సవరించుకుంటూ, "సౌమ్యగారూ!" అని పిలిచాడు అజయ్.
"హ్మ్... చెప్పండి ఇన్స్పెక్టర్ గారూ!"
అతను మరోమారు గాఢంగా శ్వాసని తీసుకుని వదిలి ఆమె కళ్ళలోకి చూస్తూ, "సౌమ్యగారూ.... నా పేరు అజయ్. నన్ను నా పేరుతో పిలవండి చాలు!" అన్నాడు.
"అయ్యబాబోయ్! ఇంకేమైనా వుందా? మీవంటి పెద్దవారిని పేరు పెట్టి పిలవడమే! నా వల్ల కాదండీ!" అందామె వెంటనే.

అజయ్ కంగారుగా— "అఁ-అబ్బే-చూడ్డానికి అలా కనిపిస్తున్నానేమోగానీ... న్-నేనంత పెద్దవాడ్నేమీ కాదండీ... అఁ...జస్ట్ ఇ-ఇరవై ఏడేళ్ళే నాకు!" తన చొక్కాని కిందకి లాక్కుంటూ అన్నాడు.
సౌమ్యకి అతను అచ్చంగా చిన్నపిల్లవాడికి మళ్ళే అమాయకంగా అన్పించాడు ఆక్షణాన.
"సరే... విషయం ఏంటో చెప్పండి!" అందామె.
"అదే... మీరు ఏమీ జవాబివ్వలేదు కదా... నా... లెటర్ కి!"
"అంటే... ఏమని జవాబీయమంటారు నన్ను!?" అతని సహనాన్ని పరీక్షిస్తూ అడిగిందామె.
"అంటే... అంటే... మీకు ఏమని అనిపిస్తుందో— అలాగే... చెప్పేయండి. అంతే!" వెర్రిగా నవ్వాడతను.
"అమ్మో! మీకది నచ్చకపోతే మళ్ళా మీ లాఠీని ఎక్కడ పెడతారో మరి!" అంది భయపడుతున్నట్లు నటిస్తూ.
"ఛఛ... నేను చచ్చినా అలా అస్సలు చెయ్యను సౌమ్యగారూ...! జరిగినదానికి మీకు ఆల్రెడీ క్షమాపణలు చెప్పాను కదా...!"
"ఐనా, ఒకవేళ... మీరు కోరుకున్న జవాబుని నేనివ్వకపోతే?"
గుటకపడింది అజయ్ కి. తలదించుకుని ఒక్కక్షణం మౌనంగా ఆలోచించినాక—
ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, "నాకు నమ్మకముంది!" అన్నాడు నిజాయితీగా.
అతనన్న మాటకి ఇంకా అతన్ని వెయిట్ చేయించడం న్యాయమనిపించలేదు సౌమ్యకి. తన లేఖ ద్వారా అజయ్ అతని మనసుని ఆవిష్కరించిన విధానానికి ఆమె ఎప్పుడో ముగ్ధురాలయింది. ఆమెకే తెలుసు, గతరాత్రి నిద్రపోకుండా తను అతని లేఖను ఎన్నిమార్లు చదివిందో... తన కన్నీళ్ళు ఎంతగా ఆ లేఖను తడిపేసాయో..!
ఐనా... అప్పుడే బైటపడటం ఇష్టంలేక—
"మనం... స్నేహితులం అవ్వ వచ్చు ఇన్స్పెక్టర్ గారూ!" అంది.
"స్నే-హితులమా....?" అంటూ మొహాన్ని వేలాడేశాడు అజయ్.
"ఇ-ప్పటికి... మనం స్నేహితులగా వుందాం ఇన్స్పెక్టర్ గారు!"
"ఇప్పటికి అంటే... ఆ తర్వాత?!"
"చూద్దాం... ఇప్పటికి ఇంతే!" అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం తన చేతిని చాపింది.
అజయ్ సంశయంగా ఆ చేతిని అందుకుంటూ, "సరే... నేను వెయిట్ చేస్తాను సౌమ్యగారూ!" అన్నాడు.
"సౌమ్య అని పిలవండి... మనం ఇప్పటి నుంచీ స్నేహితులం కదా!"
'ఎప్పటి వరకో...' అని మనసులో అనుకుంటూ "ఐతే... నన్ను కూడా పేరు పెట్టి పిలవాలి!" అన్నాడు అజయ్.
"ఇప్పుడు కాదు... రాత్రికి మీకు కాల్ చేసి అలాగే పిలుస్తానులెండి!"
అంటూ తన చేతిని వెనక్కి తీసుకొని అక్కణ్ణించి తిరిగి నాలుగడుగులు వేసింది.
అప్పుడే, అజయ్ కి మైండ్ లో ఒకటి ఫ్లాష్ అయ్యి—
"ఆఁ... సౌమ్యా... నిన్న రాత్రి కాల్ చేశారు... నేను లిఫ్ట్ చేసేలోగా కట్ అయిపోయింది!" అన్నాడు.
ఆమె వెనక్కి తిరిగి, "ఎదురుచూస్తున్నాను అన్నారుగా...—" అని అంటూ నునుసిగ్గుతో చిన్నగా నవ్వుతూ, "—లెటర్ లో...!" అని అనేసి పరుగులాంటి నడకతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
అజయ్ తన బుర్రని గోక్కుంటూ ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 7 users Like Vikatakavi02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(11-11-2019, 06:21 AM)Tvsubbarao Wrote: Super update

(11-11-2019, 01:33 AM)K.R.kishore Wrote: Nice update


(12-11-2019, 10:29 AM)Eswar P Wrote: కవి గారు బాగుంది సర్. కొద్దిగ సమయం కేటాయించండి సర్. ఈ కథ అంటే నాకు చాలా ఇష్టం సర్ ప్లీస్.

ధన్యవాదాలు మిత్రులారా...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
(12-11-2019, 04:49 PM)stories1968 Wrote: కార్తీక పున్నమి స్నానం కు వచ్చిన అంజలి 
[Image: DSm-L1-QGU8-AMrt-K9.jpg]

బొమ్మ అదిరింది సర్...
నిజానికి ప్రస్తుత అప్డేట్స్ నాన్ - ఎరోటిక్ జోనర్ ని తలపిస్తున్నాయి కదాని శిరీష్-అంజలిల మధ్య ఒక కొత్త 'పాత' అప్డేట్ ని వ్రాశాను.
అది అందరికీ తెలియాలని ఇలా పోస్టు చేశాను.
ధన్యవాదములు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
వికటకవిగారు అప్డేట్ బాగుంది
Like Reply
Bagundi Andi konchem regular ga ivandi
Like Reply
Nice update
Like Reply
Super update
Like Reply
వికటకవి గారు.......

ఇలా అప్పుడప్పుడు కాకుండా కాస్త సమయం తీసుకొని రెగ్యులర్ గా అప్డేట్ పెట్టఁడి సార్
థాంక్స్ ఫర్ దిస్ టీసింగ్ అప్డేట్
 అజయ్ సౌమ్యల మద్య
(మీరు మమ్మల్ని అప్పుడప్పుడు అప్డేట్ లు పెడుతూ.....)
mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
soooooooooo sweet
Finally a story miss kakudadhani ee site lo register ayyano aa story update ee roju chusanu thank you so kavi sir
Like Reply
ఇందుకె ఈ కథ అంటే పడి చచ్చేది అప్డేట్ చాలా బాగుంది కవి గారు
[+] 1 user Likes Sivakrishna's post
Like Reply
బాగుంది కవి గారు
Like Reply
super
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
Nice update
Like Reply
ఎన్నాళ్ళుకు మళ్ళీ మొదలు పెట్టారు బ్రదర్ ఇప్పుడు అయినా పూర్తిగా అప్డేట్ లు ఇస్తారని కోరుతున్నాము..
 Chandra Heart
Like Reply
Nice update broo bhagundi...
Like Reply
Nice update kunchem peddadi ithe bagunu
Like Reply
Very nice story bro.
Good update bro
Like Reply
కథ చాలా బాగుంది వికటకవి గారు
Like Reply
కవి గారూ...
మీ update ఆలస్యంగా చూసాను... మన్నించాలి...

బాగా రాశారు... ఒకసారి ఒకరితో అమర్యాదగా ప్రవర్తిస్తే మళ్లీ వాళ్ళ దగ్గర సౌమ్యంగా ప్రవర్తించాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో అజయ్ పరిస్తితి చూస్తే మనకు తెలిసిపోతుంది... మన నిత్య జీవితంలో కూడా ఇది ఒక పాఠం మనకు...

సౌమ్య అజయ్ ని ఆడుకోవడం బాగుంది..
Like Reply
అప్డేట్ బాగుంది
Like Reply




Users browsing this thread: 25 Guest(s)