Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance భార్య భర్తల కిల్లికజ్జాలు (సమాప్తం)
#21
(31-03-2023, 04:03 PM)K.R.kishore Wrote: Nice super update

banana ధన్యవాదాలు మిత్రమా!

thanks

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
nice update
[+] 1 user Likes naree721's post
Like Reply
#23
గౌతమ్ వాళ్లది గుంటూరు....గౌతమ్ బీటెక్ చేసి క్యాంపస్ సెలక్షన్స్ లోనే ఇన్ఫోసిస్ లో జాబ్ కొట్టి ఇప్పటికీ అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు.... ఇన్ఫోసిస్ లో జాయిన్ అయినా రెండు సంవత్సరాలు తర్వాత తన అమ్మానాన్నలు గౌతమ్ కి పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తూ ఉండగా గౌతమ్ నాన్నగారి ఫ్రెండ్ దాదాపు పది సంవత్సరాల తర్వాత ఒక బంధువుల పెళ్ళిలో కలిసి ఇద్దరూ మాట్లాడుకుని తన కూతురు నందు కి కూడా సంబంధాలు చూస్తున్నాము ఆమె కూడా డిగ్రీ చదివిందని పై చదువులు చదివించ లేక పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తున్నామని అంటారు....
 
గౌతమ్ నాన్నగారు కూడా గౌతమ్ కి సంబంధాలు చూస్తున్నామని నందు నాన్నగారికి ఇష్టమైతే గౌతమ్ కి నందుని ఇచ్చి పెళ్లి చేద్దామని అడుగుతారు....
 
గౌతమ్ నాన్నగారు కూడా ప్రైవేట్ ఆఫీసులో వర్క్ చేస్తూ ఉన్నంతలో హ్యాపీగా బ్రతుకుతూ ఉంటారు.....
 
నందు నాన్నగారు కూడా అలాగే ప్రైవేట్ ఆఫీసులో గుమస్తాగా వర్క్ చేస్తూ ఉంటారు..... ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు మొదటి అమ్మాయి మన హీరోయిన్ నందిక రెండవ అమ్మాయి మౌనిక.... నందు నాన్నగారు ఉన్నంతలోనే బ్రతుకుతూ మౌనిక ఇంటర్ చదువుతుంటే నందుని డిగ్రీ వరకు చదివించి పై చదువులు చదివించే స్తోమత లేక అక్కడితో ఆపేసి నందుకి పెళ్లి చేయాలని అనుకుంటారు..... గౌతమ్ నాన్నగారి గురించి నందు నాన్నగారికి తెలిసి ఉండటం వలన ఆయన ఇబ్బందిగా "మేము కట్నం మీరు అడిగినంత ఇచ్చుకోలేము...." అని అంటారు
 
గౌతమ్ నాన్నగారు "అసలు మాకు కట్నమే వద్దు గౌతమ్ ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు రెండు సంవత్సరాలుగా.... మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి మన స్నేహాన్ని బంధుత్వం గా మార్చుకుందాం.... నా మాట మా అబ్బాయి తప్పకుండా వింటాడు...." అని నవ్వుతూ అడుగుతారు
 
నందు నాన్నగారికి కూడా ఇక ఏ ఇబ్బంది లేక అలాగే అని ఒప్పుకొని అడ్రెస్ ఫోన్ నెంబర్ చెప్పి పెళ్ళిచూపులకి రమ్మంటారు.....
 
గౌతమ్ నాన్నగారు నందు నాన్నగారు ఉండేది ఓకే ఊరిలోనే కాబట్టి గౌతమ్ నాన్నగారు ఇక ఆలస్యం చేయకుండా పంతులు గారికి ఫోన్ చేసి నందు నాన్నగారి ఎదురుగానే పెళ్ళిచూపులకి ఈ వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందని తెలుసుకొని ఆ రోజే వస్తామని చెప్తారు....
 
నందు నాన్నగారు కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళాక గౌతమ్ నాన్నగారు కూడా ఇంటికి వెళ్లి తన భార్యామణితో అంతా చెప్పి ఆమె కూడా సంతోషంగా ఒప్పుకోగానే గౌతమ్ కి ఫోన్ చేసి "నా ఫ్రెండ్ కూతురితో నీకు ఒక వారంలో పెళ్లి చూపులు ఫిక్స్ చేశాను.... నువ్వు కచ్చితంగా రావాలి ఈ సంబంధం ఎలాగైనా ఫిక్స్ అవ్వాలి.... నేను వాళ్లకు ఈ పెళ్లి జరుగుతుందని మాట ఇచ్చేశాను...." అని చెప్తారు
 
గౌతమ్"నాకు అమ్మాయి ఎలా ఉంటుందో?? కనీసం తెలియకుండా ఎలా నాన్న పెళ్లి చేసుకోవటం???కనీసం అమ్మాయి ఫోటో అయినా పంపండి..." అని అసహనంగా అడుగుతాడు
 
" నేను నా ఫ్రెండ్ ఫోన్ లో అమ్మాయి ఫోటో చూశాను.... తను కచ్చితంగా నీకు నచ్చుతుంది నువ్వు డైరెక్టుగా ఇక్కడికి వచ్చి చూద్దువు.... అన్ని మూసుకొని వారం రోజుల్లో ఇక్కడ ఉండాలి...." అని సీరియస్ గా చెప్తారు
 
గౌతమ్ ఇక ఏమనలేక అమ్మాయి నచ్చకపోతే అక్కడే డైరెక్ట్ గా అందరి ముందే నచ్చలేదు అని చెప్దాము అనుకుని సరే అని ఆ వారం రోజుల్లో తన వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తాడు....
 
ఇంటికి వెళ్లగానే గౌతమ్ అమ్మగారు "ఏంటి నాన్న ఇలా చిక్కి పోయావు???? అందుకే ఇలా దూరంగా ఉండే ఉద్యోగాలు చెయ్యద్దు అని చెప్పాను.... ఇప్పటికీ ముంచి పోయింది ఏమీ లేదు అక్కడ మానేసి ఇక్కడే మన ఊరిలోనే ఏదైనా జాబ్ చూసుకుంటే పోతుంది కదా!!!!"అని అంటూ కొడుకు మీద ప్రేమ కురిపించేస్తారు
 
గౌతమ్ నవ్వుతూ "అమ్మ నువ్వు ఎప్పుడు వచ్చిన ఇదే కదా అనేది!!! నేను నీకు అదే సమాధానం చెప్తున్నాను నేను బాగా ఉన్నాను.... నేనే వండుకొని తింటున్నాను.... ఆ ఉద్యోగం వదిలేసి రాలేను.... నువ్వు నా గురించి బెంగ పెట్టుకునే అవసరం లేదు....అని" అని నవ్వుతూ చెప్తాడు
 
ఇదంతా గౌతమ్ నాన్నగారు చూసి నవ్వుకుంటారు....
 
గౌతమ్ నాన్నగారు వెంటనే సీరియస్గా ఫేస్ పెట్టి "రేపే పెళ్లిచూపులు కి వెళ్ళాలి సిద్ధంగా ఉండు...."అని చెప్పగానే గౌతమ్ సరే అని అంటాడు...
 
 
నెక్స్ట్ రోజు ఉదయాన్నే పది గంటలు అప్పుడు గౌతమ్ రెడీ అయ్యి తన అమ్మానాన్నలతో పాటు నందుని పెళ్లిచూపులు చూసుకోవడానికి వెళతారు.....
 
@@@@@@@@@
 
నందు కూడా తన నాన్నగారు నందు కి అంతా చెప్పటం వలన కనీసం గౌతమ్ ఫోటో కూడా చూడకుండానే ఒప్పుకొని ఎలాగైనా ఫస్ట్ పెళ్లిచూపుల లోనే వచ్చే పెళ్లి కొడుకు కి తను నచ్చాలని అందంగా రెడీ అవ్వాలని ఆ వారం రోజుల్లో బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతుంది.....(అందరూ అమ్మాయిలు ఇంతే ఉంటారేమో కదా!!!! ఎలాగైనా ఫస్ట్ పెళ్లిచూపులు లోనే పెళ్లి ఫిక్స్ అవ్వాలని అనుకుంటారు కదా!!!!)
 
పెళ్లిచూపులు ముందురోజు షాపింగ్ మాల్ కి వెళ్లి తనకు నచ్చిన పట్టు సారీ కొనుక్కోని వచ్చి తన అమ్మానాన్నలకి చెల్లెలకి చూపించి వాళ్లు బాగుంది అనగానే సంతోషంగా పెళ్లిచూపులు కి అదే కట్టుకోవాలని ఫిక్స్ అవుతుంది.....
 
అలా గౌతమ్ వాళ్ళు వచ్చేసరికి నందు నాన్నగారు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి సోఫా లో కూర్చోబెడతారు(నందు నాన్నగారిది సామాన్య మధ్యతరగతి డాబా ఇల్లు.... ఆ ఇంటిలో రెండు బెడ్రూంలు ఒక కిచెన్ ఒక హాల్ ఒక పెరడు ఉంటాయి....) గౌతమ్ ఇంటిని అంతా చూస్తూ "బాగుంది చాలా నీట్ గా ఎరేంజ్ చేసుకున్నారు" అని మనసులోనే అనుకుంటాడు....
 
గదిలో తన చెల్లెలి సహాయంతో రెడీ అవుతున్న నందు కార్ సౌండ్ కి పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు అనుకొని నందు మనసులో "ఇతను అందంగా ఉంటాడా?? లేకపోతే యావరేజ్ గా ఉంటాడా??? బాగా సంపాదిస్తున్నాడా??? డైలీ నేనడిగింది లేదు కాదు అనకుండా కొనిస్తాడా??? నన్ను బాగా చూసుకుంటాడా???" అని ఆలోచించుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది(పెళ్లిచూపులు కి రెడీ అయిన ప్రతి అమ్మాయి మనసులో ఉండేది ఇదే కదా!!!!)
 
నందు అమ్మ గారు గౌతమ్ వాళ్ళకి కాఫీ టిఫిన్ పెట్టి అబ్బాయి గురించి అన్నీ వివరాలు తెలుసుకున్నాకా గౌతమ్ అమ్మగారు వాళ్ళు అమ్మాయి ని రమ్మని చెప్పగానే నందు అమ్మగారు, తన చెల్లెలు ఇద్దరు వెళ్లి నందు చెల్లెలు నందుని రెడీ చేస్తూ ఆటపట్టిస్తూ ఉంటే వాళ్ళిద్దర్నీ నవ్వుతూ చూసి నందుని పై నుంచి కింద వరకు చూసి మెటికలు విరుస్తూ"చాలా అందంగా ఉన్నావు నందు... కచ్చితంగా వాళ్ళ అబ్బాయికి నువ్వు నచ్చుతావు.... అబ్బాయి కూడా చాలా బాగున్నాడు.... ఈ సంబంధం గాని ఫిక్స్ అయితే మీ ఇద్దరి ఈడు జోడు చాలా బాగుంటుంది.... వాళ్లు నిన్ను చూసుకోవటానికి పిలుస్తున్నారు పదా..." అని అంటుంది
 
నందు కొంచెం బిడియంగా సిగ్గుగా ఫస్ట్ పెళ్లి చూపులు అవటం వలన ఎలాగైనా "అమ్మ చెప్పిందంటే అబ్బాయి చాలా అందంగా ఉండి ఉంటాడు....ఎలాగైనా ఈ అబ్బాయి తోనే పెళ్లి ఫిక్స్ అవ్వాలని...." మనసులో దేవుని కోరుకుంటూ ఉంటుంది
 
గౌతమ్ కూడా "అమ్మాయి అందంగా ఉండాలని ఈ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అవ్వాలని" దేవుని కోరుకుంటూ ఉంటాడు....(అందరూ అబ్బాయిల మనసుల్లోనూ ఇదే ఉంటుందా??? కొంచెం మీ ఒపీనియన్ షేర్ చేయండి....)
 
నందు తలదించుకునే బయటికి వచ్చి తన నాన్నగారి పక్కన కూర్చుంటుంది....
 
నందు బయటికి రాగానే గౌతమ్ కి నందు వాడే పర్ఫ్యూమ్ ఆరోమా స్మెల్ వచ్చే సరికి ఏమరుపాటుగా తలెత్తిన గౌతమ్ నందు ని అలా పట్టు సారీ లో పైనుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉంటే తనని అలా చూసి ఫిదా అయిపోయి మనసులో "ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది.... ఈ అమ్మాయికి ఎన్ని పద్ధతులు వచ్చి ఉంటే ఈ అమ్మాయి కానీ నా వైఫ్ అయితే చాలా బాగుంటుంది!!!"అని అనుకుంటూ నందు తీక్షణంగా చూస్తూ ఉంటాడు
 
నందు స్కై బ్లూ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ లో ఉన్న లైట్ వెయిట్ పట్టు సారీ కట్టుకుని మెడలో ఒక నెక్లెస్, చెవులకి పెద్ద బుట్టలు, రెండు కనుబొమల మధ్య రెడ్ కలర్ స్టోన్ స్టిక్కర్ పెట్టుకొని, తలలో మల్లెపూలు పెట్టుకుని సింపుల్ గా రెడీ అయ్యి ముట్టుకుంటే మాసిపోయే రంగులో పైనుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉంటుంది....
 
గౌతమ్ ఆరడుగుల కి ఒక్క ఇంచ్ తక్కువ ఎత్తులో వైట్ అండ్ బ్లూ కలర్ చెక్స్ షర్ట్ డార్క్ బ్లూ జీన్స్ వేసుకొని ఇన్ షట్ చేసుకుని ట్రిమ్ చేసిన గడ్డంతో చురు కత్తి లాంటి చూపులతో నందు కి ఏ మాత్రం తీసిపోని రంగులో హ్యాండ్సమ్ గా ఉంటాడు....
 
నందు కి గౌతమ్ చూపులు తాకుతున్న సైలెంట్గా మనసులోని టెన్షన్ పడుతూ తలదించుకుని ఉంటుంది.....
 
గౌతమ్ అమ్మగారు నాన్నగారు గౌతమ్ నందు వచ్చిన దగ్గరనుంచి చూస్తూ ఉండేసరికి వాళ్ళకి గౌతమ్ కి నందు నచ్చిందని అర్థమై నందుతో "తలదించుకునే ఉంటావా మా కొడుకుని కూడా చూసేదేమైనా ఉందా కోడలు పిల్ల???" అని గౌతమ్ అమ్మగారు నవ్వుతూ అంటారు
 
అయినా నందు తలదించుకునే ఉండేసరికి నందు అమ్మగారు నందు చెవిలో "ఒకసారి అబ్బాయిని చూడు నందు...." అని చెప్పగానే నందు చిన్నగా తలెత్తి గౌతమ్ వైపు చూసి తన చూపుల బాణాల్ని గౌతమ్ గుండెల్లో గుచ్చి సైలెంట్ గా వెంటనే తల దించుకొని ఉంటుంది
 
ఆ చూపుకి గౌతమ్ గుండె పేలిపోయి మనసులో"గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనే పట్టు మీద రాయి వేసి కొట్టినట్టుందే...."అనే సాంగ్ కూడా వేసుకొని "ఇక ఫిక్స్ ఇదే నా పెళ్ళాం"అనుకోని వెంటనే తన అమ్మానాన్నలతో "అమ్మాయి నాకు బాగా నచ్చింది మమ్మీ .... అమ్మాయికి కూడా నచ్చితే వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం...." అని నందు వైపే చూస్తూ ఆత్రంగా మాట్లాడుతాడు
 
ఆ మాటకి గౌతమ్ నాన్నగారి సీరియస్ గా గౌతమ్ వైపు చూస్తూ "నీకు అమ్మాయి నచ్చిందని మాత్రమే చెప్పు ఎప్పుడు మీకు పెళ్లి చేయాలి అనేది మేము చూసుకుంటాం...." అని గౌతమ్ కి మాత్రమే వినిపించేలా అంటారు
 
గౌతమ్ మాటలకి నందు ఫ్యామిలీ అంతా ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే గౌతమ్ నాన్నగారు వెంటనే నందు నాన్నగారితో "ఏమనుకోకు రా వీడికి కొంచం ఆత్రం ఎక్కువ.... ఏది దాచుకో లేడు వెంటనే బయటికి కక్కేస్తాడు...." అని నవ్వుతూ అంటారు
 
నందు నాన్నగారు పర్వాలేదు అనగానే నందు మనసులో "ఓహో అబ్బాయి గారికి చాలా తొందరగా ఉన్నట్టుందే నన్ను పెళ్లి చేసుకోవడానికి!!!!" అని నవ్వుకుంటుంది
 
గౌతమ్ మనసులో "ఈ నాన్నలు ఉన్నారే ఎప్పుడు ఇంతే కొడుకుని ఎప్పుడు ఏదో ఒక మాట అందామా అని చూస్తూ ఉంటారు...." అని అనుకొని బయటికి ఏమీ తెలియని అమాయక చక్రవర్తి సైలెంట్ గా సరే అని చెప్పాడు
 
గౌతమ్ ఎక్స్ప్రెషన్ని ఓరగా చూస్తున్న నందు నవ్వుకుంటుంది.....
 
నందు నాన్నగారు "నందు నీకు అబ్బాయి నచ్చాడా???" అని అడిగితే "నేను కొంచెం అబ్బాయి తో మాట్లాడాలి నాన్న..." అని అడుగుతుంది
 
గౌతమ్ వెంటనే పైకి లేచి "నేను రెడీ వెళ్దామా మాట్లాడుకోవడానికి!!!!" అని పళ్ళన్ని బయటికి పెట్టి నవ్వుతూ అంటాడు
 
గౌతమ్ నాన్నగారి సీరియస్ గా గౌతమ్ వైపు చూసేసరికి అప్పుడు గౌతమ్ ఏం చేశాడో గుర్తుకు వచ్చి "ఛ ఇలా చేశాడేంటి??? ఈ అమ్మాయి నా గురించి ఏమనుకోని ఉంటుంది???" అనుకుంటూ ఇబ్బందిగా అందరి వైపు చూస్తూ ఉంటాడు
 
నందు నాన్నగారు గౌతమ్ వైపు చూసి నవ్వుతూ "నీ గదిలోకి తీసుకు వెళ్ళు నందు ఇద్దరు మాట్లాడుకోండి...." అని అంటారు
 
నందు సరే అని నెమ్మదిగా పైకి లేచి అడుగుల్లో అడుగులు వేస్తూ ఒక అయిదు నిమిషాలకి తన రూమ్ చేరుకుంటుంది.....
 
గౌతమ్ నందు వెనకే అడుగులు వేస్తూ "ఏంటి ఈ అమ్మాయి ఇంత స్లోగా నడుస్తుంది????"అని నందుని బ్యాక్ సైడ్ నుంచి చూసి "బ్యాక్ సైడ్ నుంచి సూపర్ ఉంది...." అని నందు చీర జాకెట్ కలవని చోట గౌతమ్ చూపు నడుము దగ్గర ఆగిపోయి "దీని నడుము ఎంత ఒంపులు తిరిగి ఉంది??? పైగా దానిలో నెలవంక ఎంత అందంగా ఉంది??? ఇప్పుడే దాన్ని ముద్దు పెట్టుకోవాలని పిస్తుంది..... ఇన్ని సంవత్సరాలు నా బ్రహ్మచర్యానికి వెంటనే స్వస్తి పలకాలి అనిపిస్తుంది..... ఎలాగైనా సరే ఈ అమ్మాయికి నేను నచ్చి మా పెళ్లి వెంటనే జరిగేలా చూడు స్వామి...." దేవుడు మెక్కేసుకుంటూ ఉంటాడు
 
 
నందు లోపలికి వెళ్లి గౌతమ్ లోపలికి రాగానే వెంటనే డోర్ లాక్ చేసి తల పైకెత్తి సూటిగా గౌతమ్ కళ్ళల్లోకి చూస్తూ తన చీర చెంగు నడుము దగ్గర దోపుకుని "ఏంటి నేను బయటికి వచ్చిన దగ్గర నుంచి ఆ తినేసేలా చూడటం???? అయినా ఎప్పుడు అమ్మాయిలని చూడనట్టు అలా చూస్తున్నావ్ ఏంటి????" అని తన నడుము మీద చేతులు పెట్టుకుని అడుగుతుంది

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
#24
Excellent update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#25
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#26
అద్భుతం మిత్రమా, మాటల్లేవ్ Simply superb  yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply
#27
Next update please
[+] 1 user Likes sri7869's post
Like Reply
#28
Wow superb updates bro
[+] 1 user Likes K.rahul's post
Like Reply
#29
ఈ కథను చదువుతున్న, అదరిస్తున్న ప్రతి ఒక్కరికీ

పేరు పేరునా అభివందనములు

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#30
సడన్ గా మారిన నందు వేరియేషన్ కి గౌతమ్ షాక్ అయ్యి ఫెయింట్ అయ్యేలా ఉంటే వెంటనే నందు గౌతమ్ చెంప మీద చిన్నగా కొట్టి "ఓయ్ నన్ను ఇలా చూసి షాక్ అయ్యావా???? కానీ ఇదే నా ఒరిజినల్ క్యారెక్టర్..... కూర్చో నీతో చాలా మాట్లాడాలి...." అని చెప్పి గౌతమ్ ని బెడ్ మీద కూర్చోబెట్టి తను గౌతమ్ ఎదురుగా బాసిమఠం వేసుకొని కూర్చుంటుంది....
 
గౌతమ్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేక గుడ్లప్పగించి మరి నందు వైపే చూస్తూ ఉంటే "ఓయ్ ఏంటి అలా చూస్తున్నావ్ తినేస్తావా ఏంటి???? నేను బయటికి వచ్చినప్పుడు కూడా ఇలాగే చూసావు???" అని సీరియస్ గా అడుగుతుంది
 
నందు అప్పుడు చేరుకొని "లేదండి మిమ్మల్ని బయట చూసినప్పుడు చాలా సాఫ్ట్ గా కనిపించారు.... ఇక్కడేమో ఇలా మాట్లాడుతున్నారు??? అందుకే కొంచెం షాక్ అయ్యాను...." అని నార్మల్ అవుతూ అంటాడు
 
నందు గౌతమ్ వైపు సూటిగా చూస్తూ "అమ్మాయిలు అన్నాక ఇలాగే ఉండాలి.... మెత్తగా ఉంటే ప్రతి ఒక్క వెధవ ఆడుకుంటాడు.....అందుకే నేను అలాంటి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వడం లేదు.... ఇంతకీ నేను నీకు నచ్చానా????" అని సూటిగా అడుగుతుంది
 
గౌతమ్ అమ్మాయిల సిగ్గుపడుతూ బెడ్ షీట్ ని నలిపేస్తూ "చాలా నచ్చారండి మిమ్మల్ని చూడగానే పడిపోయాను...." అని అంటాడు
 
నందు గౌతమ్ వైపు వింతగా చూస్తూ "ఏంటండీ ఆ సిగ్గుపడటం నేను సిగ్గు పడాల్సింది పోయి మీరు సిగ్గు పడుతున్నారు.... ఇంతకీ నా గురించి మీకు తెలుసా???" అని అడుగుతుంది
 
"లేదండి నేను కనీసం మీ ఫోటో కూడా చూడలేదు..... డైరెక్టుగా పెళ్లిచూపులు కి వచ్చేసాను నచ్చితే ఓకే చెప్తాము లేకపోతే లేదు అనుకున్నాను...." అని గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ ల సిన్సియర్ గా చెప్తాడు
 
గౌతమ్ మాటల్లోని సిన్సియారిటీ నచ్చి "ఓకే నేను డిగ్రీ చేశాను ఇంతవరకు ఎవరినీ ప్రేమించలేదు.... కాలేజ్ లో అబ్బాయిలకి నన్ను చూస్తే హడల్ అందుకే త్వరగా నాకు ఎవరూ ప్రపోజ్ చేయరు.... నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్.... ఏదున్నా మొహం మీద చెప్పేస్తాను మనసులో ఏదీ దాచుకోను.... మా నాన్నగారు నన్ను పై చదువులు చదివించలేక డిగ్రీ తర్వాత చదువు మాన్పించేశారు.... నాకు కూడా చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేక నేను మానేశాను..... పైగా నా డిగ్రీ అయిపోయి జస్ట్ టూ మంత్స్ అవుతుంది... ఇక పెళ్లి చేయాలనుకున్నారు.... మొదటి సంబంధం మీదే మీరు నాకు బాగా నచ్చారు.... మీకు ఓకే అయితే మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం..... ఇంతకీ మీకు ఏమైనా లవ్ ఎఫైర్స్ ఉన్నాయా??? ఉంటే నిరభ్యంతరంగా చెప్పండి నేను చాలా బ్రాడ్ మైండెడ్ ఇలాంటివన్నీ పట్టించుకోను...‌." అని డైరెక్టుగా అడుగుతుంది
 
నందు అంత డైరెక్ట్ గా అడుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయని గౌతమ్ ఫస్ట్ షాక్ అయిన వెంటనే చిరునవ్వు నవ్వుతూ "అయ్యో నాకు అలాంటివి ఏమీ లేవండి.... నేను కూడా పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకోవాలి అనుకున్నాను పైగా అమ్మాయిలు మీ లాగ ఉంటేనే నాకు చాలా ఇష్టం నందు.... అవును నీ పేరు నందికనే కదా!!!నేను మిమ్మల్ని నందు అని పిలవచ్చా???" అని అడుగుతాడు
 
"మీరు నన్ను పెళ్లి చేసుకునే పని అయితే మీరు ఎలా పిలిచినా నేనే పలుకుతాను.... నాకేమీ అభ్యంతరం లేదు...." అని నవ్వుతూ అంటుంది
 
"అయితే నేను నిన్ను నందు అనే పిలుస్తాను నాకు నువ్వు బాగా నచ్చావు.... నీ మాటలు నీ క్యారెక్టర్ ఇంకా నచ్చింది...." అని మీరు నుంచి నువ్వు లోకి వచ్చి అంటాడు
 
నందు వెంటనే గౌతమ్ బుగ్గలు పట్టుకుని లాగుతూ "మీరు ఎంత క్యూట్ గా ఉన్నారో తెలుసా ఈ డ్రెస్ లో???? వచ్చినప్పట్నుంచి ఇలా మీ బుగ్గలు లాగుదామని మనసు పీకుతోంది ఇప్పటికి కుదిరింది.... ఒకవేళ మీకు నేను నచ్చలేదని చెప్పి అంటే ఇంత అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని కాదు.... మీరు నా గురించి తప్పుగా అనుకోవద్దు...." అని సిగ్గుపడుతూ ఉంటుంది
 
గౌతమ్ నవ్వుతూ "నాకు కూడా నిన్ను చూసినప్పటినుంచి ఒకటి చేయాలని ఉంది.... నీకు నేను ఇష్టమో లేదో తెలియక సైలెంట్ గా ఉన్నాను.... కానీ ఇప్పుడు నీకు ఇష్టం అని తెలిశాక ఆ అవసరం లేదు...." అంటూ వెంటనే తన బుగ్గ మీద ముద్దు పెడతాడు
 
గౌతమ్ నుంచి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చెయ్యని నందు షాక్ అయిపోయి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి గౌతమ్ వైపే చూస్తూ ఉంటుంది.....
 
"ఐ లవ్ యు నందు నువ్వు నాకు చాలా నచ్చావు.... మీ వాళ్లకి కూడా నేనే చెప్తాను.... నువ్వు ఈ షాక్ నుంచి తేరుకొని నిదానంగా బయటికి రా...." అని మళ్ళీ మరొక బుగ్గ మీద ముద్దు పెట్టి మరి బయటికి వెళ్ళిపోతాడు....
 
గౌతమ్ చేసిన పనికి ఒక్క నిమిషం కోపం వచ్చిన వెంటనే అతని మనసులో తను తన భార్య గా ఫిక్స్ అయ్యాడని అర్థమై నవ్వుకుంటూ బయటికి వచ్చేసరికి గౌతమ్ అందరితో "నందుకి నాకు ఈ పెళ్లి ఇష్టమే..." అని చెప్తాడు
 
ఆ మాటకి అందరూ సంతోషంగా నవ్వుతూ చూస్తూ "సంతోషం బావగారు పంతులు గారిని పిలిపించి త్వరగా ముహూర్తాలు పెట్టించేద్దాం...." అని నవ్వుతూ గౌతమ్ నాన్నగారు అంటారు
 
బయటికి వచ్చిన నందుని ఓరగా గౌతమ్ చూస్తే నందు గౌతమ్ వైపు చిరు కోపం గా చూస్తూ తన పక్కకు వచ్చి నిలబడి గౌతమ్ కాలిని గట్టిగా తన కాలితో తొక్కేస్తుంది....(గౌతమి కండలు తిరిగిన శరీరం ఏమీ కాదండీ కొంచెం సన్నగా చాక్లెట్ బాయ్ లా ఉంటాడు.... నందు కూడా సన్నగా పర్ఫెక్ట్ ఫిగర్ తో గౌతమ్ కి సరిపోయేలా ఉంటుంది)
 
గౌతమ్ వెంటనే "చచ్చాను రా బాబోయ్...." అని గట్టిగా కేకలు వేస్తూ కాలు పట్టుకొని దాని వైపు చూసే సరికి అప్పటికే నందు నవ్వుకుంటూ తన నాన్నగారి పక్కకి వెళ్ళి కూర్చుంటుంది....
 
గౌతమ్ అమ్మగారు కంగారుగా గౌతమ్ దగ్గరికి వచ్చి "ఏమైంది రా ఎందుకు అలా అరిసావు???" అని అడుగుతారు
 
గౌతమ్ నందు వైపు కోపంగా చూస్తూ "ఏమీ లేదు మమ్మీ ఏదో కాళ్ళ మీద పడి నట్టు ఉంది కొంచెం నొప్పిగా అనిపించి అరిచాను.... అంతే టెన్షన్ పడకు...." అని నవ్వుతూ అంటాడు
 
నందు ముసిముసిగా నవ్వుకుంటూ గౌతమ్ వైపు చూస్తూ ఉంటుంది.... అదంతా అందరు గమనించి ఇద్దరి మధ్య చిలిపిగా ఏదో జరిగిందని అర్థమై వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటారు... ఇంతలో నందు నాన్న గారు పంతులు గారిని పిలిపించి నిశ్చితార్థానికి వారం రోజుల్లో పెళ్లి కి నెల రోజుల్లో ముహూర్తం ఫిక్స్ చేస్తారు....
 
అలా అందరూ మాట్లాడుకున్నాక నిశ్చితార్థం నందు నాన్నగారు చేస్తానని చెప్పి గౌతమ్ వాళ్లందర్నీ పంపించేసాక నందుతో "చాలా సంతోషంగా ఉంది నందు.... వాళ్ళు కనీసం రూపాయి కట్నం కూడా వద్దన్నారు.... పైగా అబ్బాయి చాలా మంచివాడు నేను ఎంక్వయిరీ కూడా చేశాను ఏ చెడు అలవాట్లు లేవు పైగా చాలా అమాయకుడిలా కూడా ఉన్నాడు నీ నోట్లో పడ్డాడు.... ఇక అతని పరిస్థితి ఏంటో???" అని గౌతమ్ మీద జాలి చూపిస్తూ అంటారు
 
నందు కోపంగా వాళ్ళ నాన్న వైపు చూస్తూ "అంటే ఏంటి నాన్న నేను నీకు రాక్షసి లా కనిపిస్తున్నానా???" అని అడుగుతుంది
 
"అది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నువ్వు ఆల్రెడీ రాక్షసివే...." అని నవ్వుతూ చెప్పి "జస్ట్ జోకింగ్ నందు కానీ అబ్బాయి చాలా మంచివాడు.... అతనిని నొప్పించకుండా చూసుకో...." అని అంటారు
 
సరే అని చెప్పి నందు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్ లోకి వెళ్ళేసరికి గౌతమ్ నుంచి మెసేజ్ వస్తుంది "ఎందుకు నా కాలు అలా తొక్కే సావు నందు????" అని కార్ లో డ్రైవర్ పక్కన కూర్చుని నందు కి మెసేజ్ చేస్తూ ఉంటాడు
 
నందు షాకింగ్ "నా నెంబర్ గౌతమ్ కి ఎలా తెలిసింది???"అని అనుకుంటూ ఉండగానే గౌతమ్ నుంచి మరో మెసేజ్ "నీతో మాట్లాడి బయటికి రాగానే నీ చెల్లి దగ్గర నుంచి నీ ఫోన్ నెంబర్ తీసుకున్నాను.... నీ చిన్ని బుర్రని చించేస్తూ అంతలా కష్టపడకు బంగారం...." అని నవ్వుతున్న ఏమోజీ పెడతాడు
 
నందు నవ్వుకుంటూ "మరి నువ్వు నా పర్మిషన్ లేకుండా నాకు ముద్దు పెడితే ఏం చేయాలి??? నాకు కోపం వచ్చింది అది తీర్చుకున్నాను.... నాకు కోపం వస్తే అది తీర్చుకునే దాకా నేను ప్రశాంతంగా ఉండలేను...." అని అంటుంది
 
గౌతమ్ వెంటనే గుండెల మీద చెయ్యి వేసుకుని "అమ్మో అయితే నీతో కష్టమే నే బాబు!!! ఏదైనా కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తాను నువ్వు నా లైఫ్ లోకి వస్తే చాలు బంగారం...." అని మెసేజ్ పెడతాడు
 
అలా నందు డ్రెస్ చేంజ్ చేసుకుంటేనే గౌతమ్ కి మెసేజ్ చేస్తూ ఉంటుంది....
 
అలా కాలం ఎవరికోసం ఆగకుండా నిశ్చితార్ధం అయిన వాళ్ళ మధ్యలో జరిగితే పెళ్లి గ్రాండ్ గా చేస్తారు....
 
నిశ్చితార్థానికి పెళ్లి కి మధ్యలో ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ కలవాలి అనుకుంటే ఇద్దరి తల్లిదండ్రులు కలవకూడదు అని స్ట్రిక్ట్ గా చెప్పేసరికి ఇద్దరు ఫోన్లోనే మాట్లాడుకుంటూ బాగా క్లోజ్ అయిపోతారు....(ఇది మాత్రం పెళ్లి కుదిరిన అమ్మాయి అబ్బాయి మధ్య కామన్ గా నే జరుగుతుంది....)
 
పెళ్లి అయినా తర్వాత రోజు గౌతమ్ ఇంట్లో వ్రతం చేసి ఆ రోజే ఫస్ట్ నైట్ కూడా చేసుకుంటారు....
 
అక్కడే ఒక వారం రోజులు ఉండి నందు అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో ఒక వారం రోజులు ఉండి వెంటనే నందు ని తీసుకొని హైదరాబాద్ వెళ్లిపోతాడు.... అప్పటికే గౌతమ్ మంచి అపార్ట్మెంట్ లో ఒక డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉంటాడు....
 
నందు తో పాటు నందు అమ్మగారు వస్తే గౌతమ్ నాన్నగారు గౌతమ్ అమ్మగారు వచ్చి నందు గౌతమ్ ల చేత గృహప్రవేశం చేయించి వాళ్లతో పాటు ఒక నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతారు....
 
అలా గౌతమ్ నందు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు.... గౌతమ్ ఆఫీస్ కి వెళ్ళాక నందు ఒక్కతే ఇంట్లో ఉంటూ రోజు మొత్తం బోర్ కొడుతుంది అని టీవీ కొని టీవీ పెట్టిస్తాడు....(అపార్ట్మెంట్లో అంతే ఉంటుంది..... ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా ఇంట్లోనే కూర్చుంటారు)
 
నందు హ్యాపీగా గౌతమ్ ని కౌగిలించుకొని "గౌతమ్ నువ్వు ది బెస్ట్ హస్బెండ్..." అని అంటుంది
 
"మరి నీకు చదువుకోవాలని ఉంటే చెప్పు నేను ఎంబీఏ సీట్ తీసుకుంటాను..." అని అడుగుతాడు
 
"లేదు గౌతమ్ నాకు చదువంటే ఇష్టం లేదు..... డిగ్రీ నే ఏదో అరకొర మార్కులతో పాసయ్యాను.... నావల్ల కాదు బాబు ఈ చదువులు.... ప్రస్తుతానికి నీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చెయ్యాలని ఉంది.... తర్వాత మనకి పిల్లలు పుడితే ఆ పిల్లలతోనే నాకు రోజంతా సరిపోతుంది..... అప్పటివరకు ఇద్దరం కలిసి ఈ సిటీ అంతా చక్కర్లు కొడుతూ ఫుల్ గా ఎంజాయ్ చేయాలి కదా!!!! అందుకే ఈ చదువు గిదువు నా వల్ల కాదు..... నువ్వు సంపాదించు నేను ఇంట్లో కూర్చుని తింటాను..." అని నవ్వుతూ అంటుంది
 
నందు మాటలకి గౌతమ్ నవ్వుకుంటూ "సరే మరి పిల్లల్ని కనే వరకూ ఎంజాయ్ చేయాలి కదా మరి ఎంజాయ్ చేద్దాం పదా!!!!" అని చెప్పి నందుని ఎత్తుకుని బెడ్ రూం లోకి తీసుకు వెళ్తాడు
 
"ఇప్పుడేంటి గౌతమ్ అది మధ్యాహ్నం పూట!!!" అని కంగారుగా అడుగుతుంది
 
నాకు దొరికేదే రెండు రోజుల హాలిడేస్.... అందులో ఒక రోజు ఆఫ్టర్నూన్ వరకు వర్క్ ఉంటుంది.... ఆఫ్టర్ నూన్ నుంచి రెస్ట్ తీసుకుంటాను.... ఇక ఈ రోజే కదా నాకు మిగిలింది కనీసం ఈ రోజైనా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కదా!!! అందుకే ఇలా!!!" అని చెప్పి నందుని ఆక్రమించుకుంటాడు
 
గౌతమ్ టీవీ కొన్నాక పెళ్లయిన కొత్తలో గౌతమ్ ఆఫీస్ నుంచి రాగానే అలసటగా సోఫాలో నందు పక్కనే కూర్చుని "నందు కొంచెం కాఫీ ఇవ్వవా...." అని అడుగుతాడు
 
టీవీ లో మునిగి పోయిన నందు గౌతమ్ చెప్పింది వినిపించుకోదు.... గౌతమ్ "నందు"అని అంటూ నందు భుజాలు కదిపి "ప్లీజ్ కొంచెం కాఫీ ఇవ్వవా చాలా చిరాకుగా ఉంది...." అని అంటాడు
 
"అలాగే గౌతమ్ ఇప్పుడే తెస్తాను...." అని చెప్పి హడావిడిగా పాలు కాచి ఉండటం వలన వెంటనే కాఫీ కలుపుకొని తీసుకువచ్చి గౌతమ్కి ఇచ్చి వెంటనే తన పక్కన కూర్చుని టీవీ సీరియల్ లో మునిగి పోతుంది.....
 
గౌతమ్ కాఫీ ఒక్క సిప్ చేసి వెంటనే షింక్ దగ్గరికి వెళ్లి నోట్లో ఉన్న కాఫీ ఊసేస్తాడు....
 
"ఏంటి నందు ఇది కాఫీ ఇవ్వమంటే కషాయం ఇచ్చావు??? అయినా ఇదేంటి ఇంత ఉప్పగా ఉంది???" అని కోపంగా అడుగుతాడు
 
"ఏంటి గౌతమ్ ఇది నేను టీవీ సీరియల్ చూస్తూ ఉంటే డిస్టర్బ్ చేస్తున్నావు??? ప్లీజ్ నన్ను కొంచెం సేపు డిస్టర్బ్ చేయకు..... సీరియల్ మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు మీకు కావాల్సినట్టుగా కలిపిస్తాను...." అని విసుగ్గా అంటుంది
 
గౌతమ్ షాక్ గా "అంటే టీవీ సీరియల్ చూస్తూ కాఫీ ఇలా కలిపి ఇచ్చావా తల్లి???? ఇంకెప్పుడు నువ్వు ఇలా సీరియల్ చూస్తూ నాకు కాఫీ ఇవ్వకు..... ఇంకొకసారి ఉప్పు బదులు ఏదైనా గమీషన్ వేసావు అంటే ఏకంగా పైకే పోతాను...." అని భయంగా అంటాడు
 
నందు టీవీ సీరియల్ లో మునిగిపోయి "ఆ సరే సరేలే నీకు కావాల్సినట్టుగానే చేసి పెడతాను ప్రస్తుతానికి ఫ్రెష్ అయి రా పో అంతలోపు వంట రెడీ చేస్తాను..." అని అంటుంది
 
గౌతమ్ నందు ని ఒకసారి చూసి సైలెంట్ గా తన రూమ్ లోకి వెళుతూ మనసులో "అనవసరంగా టీవీ కొన్నాను ఇది టీవీ చూస్తూ పని కూడా చేయడం లేదు.... ఏంటో ఈ జీవితం???" అనుకుంటూ వెళ్ళిపోతాడు
 
అలా ఇద్దరు చిన్న చిన్న చిలిపి గొడవలతో హ్యాపీగా నడిపిస్తూ రెండు నెలలు టైం తెలియకుండానే గడిచి పోతుంది.....

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
#31
అప్డేట్ సూపర్ గా రాశారు మిత్రమా, 

నందు క్యారెక్టర్ బాగుంది, 


Thanks for update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#32
సూపర్ గా ఉన్నాయి
[+] 1 user Likes ramd420's post
Like Reply
#33
ఈ కధను చదువుతున్న, ప్రొత్సహిస్తున్న, అభిమానిస్తున్న పాఠక మితృలకు కృతజ్ఞతలు.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#34
ఒకరోజు గౌతం సాయంత్రం 7:00 ఎప్పుడు ఇంటికి వచ్చేసరికి నందు సోఫాలో కూర్చుని ఏడుస్తూ టీవీ చూస్తూ ఉంటుంది.....
 
గౌతమ్ వెంటనే కంగారుగా వెళ్లి నందు పక్కన కూర్చుని తనని దగ్గరికి తీసుకొని ఏమైంది నందు ఎందుకు ఏడుస్తున్నావ్??? మా అమ్మ నాన్న మీ అమ్మ నాన్న బాగానే ఉన్నారా??? ఏం జరిగింది???" అని కంగారుగా అడుగుతాడు
 
నందు చేయి తిప్పి ఎటువైపో చూపిస్తుంది.....
 
గౌతమ్ అటు వైపు చూసి షాక్ అయిపోతాడు.....
 
గౌతమి ఎందుకు షాక్ అయ్యారు అంటే టివి సీరియల్ లో మన కార్తీక దీపం లోని వంటలక్క ఏడుస్తూ ఉంటుంది.....
 
అది చూసి గౌతమ్ అయోమయంగా "అందుకు ఏడుస్తున్నావా???" అని అడుగుతాడు
 
"అవును గౌతమ్ మన వంటఅక్క ఎలా ఏడుస్తుందో!!!! డాక్టర్ బాబు ఇప్పటివరకు వంటలక్క ని ఏడిపించాడు..... ఇప్పుడు ఆ డాక్టర్ పిల్ల ఏడిపిస్తుంది..... దాన్ని ఏం చేసినా పాపం లేదు....." అని ఏడుస్తూ ముక్కు చేతి గౌతం షర్ట్ కి రాస్తూ అంటుంది
 
గౌతమ్ వెంటనే కోపంగా పైకిలేచింది " ఛీ ఛీ ఏంటి ఇది???"అని తన షర్ట్ కర్చీఫ్ తో తుడుచుకొని నందు వైపు కోపంగా చూస్తూ "నీకు బోర్ కొడుతుందేమోనని టీవీ కొన్ని పెద్ద తప్పు చేశాను..... నువ్వు ఇలా సీరియల్స్ కి ఎడిక్ట్ అయి అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఇలా ఏడుస్తావు అనుకోలేదు.... ఇప్పుడే ఈ టీవీ పగలగొట్టేస్తాను.... అప్పటికి కాని నాకు ఈ తలనొప్పి తగ్గుతుంది...." అని కోపంగా చెప్పి టీవీ దగ్గరికి వెళుతూ ఉంటే
 
నందు వెంటనే కోపంగా పైకి లేచి "ఆ పని చేసావ్ అంటే నీకు ఫుడ్ బెడ్ రెండు కట్ చేస్తాను.... నేను సీరియల్స్ కూడా చూడకూడదా ఏంటి???? ఇలా నాకు రిష్ట్రిక్షన్స్ పెట్టకూడదు అని పెళ్లికి ముందే చెప్పాను కదా!!!! నాకు ఇలాంటివన్నీ నచ్చవు గౌతమ్...."అని అంటుంది
 
"మరి నేను వచ్చేసరికి నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేనేం అనుకోవాలి???? నువ్వు అలా ఏడుస్తూ ఉంటే ఇంకా ఏం జరిగిందో అని నేను ఎంత టెన్షన్ పడ్డాను??? ఒకపక్క ఆఫీసులో టెన్షన్స్ మరోపక్క ఇదంతా ఏంటి?????నాకు ఇంటికి రావాలంటే నా తల నొప్పి పుడుతుంది...." అని అసహనంగా అంటాడు
 
నందు వెంటనే ఏడుస్తూ "అంతేలే నేనంటే నీకు అప్పుడే ప్రేమ తగ్గిపోయింది.... పెళ్లయి కనీసం 2 నెలలు కూడా కావట్లేదు అప్పుడే ఇలా మాట్లాడుతున్నావు??? ఇప్పుడే ఇలా ఉంటే రేపు నువ్వు నన్ను కొట్టావు అని గ్యారెంటీ ఏంటి??? నాకు నీ మీద నమ్మకం లేదు ... నేను నా పుట్టింటికి వెళ్ళి పోతాను...." అని అంటుంది
 
గౌతమ్ షాక్ అయ్యి "ఇంత చిన్న మాటకి అంత పెద్ద డెసిషన్ ఎందుకు నందు??? సరేలే నీ ఇష్టం వచ్చింది చేసుకో!!!" అని కోపంగా అంటాడు
 
"అయితే నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా వంట చేస్తాను...." అని అంటుంది
 
గౌతమ్ ఇక ఏమీ చేయలేక సైలెంట్ గా లోపలికి వెళ్ళి పోయి మనసులో "ఏంటి ఇది జస్ట్ సీరియల్ కోసం ఏడుస్తుంది??? రియల్ లైఫ్ లో ఇలాంటివి జరిగితే తట్టుకుంటుందా???? ప్రపంచంలో రోజు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి.... ఈ టీవీ లో సీరియల్స్ చూస్తూ డైలీ ప్రపంచంలో జరిగే వాటిని పట్టించుకోవట్లేదు.... ఒక్కసారి అవి చూస్తే కనీసం లోకజ్ఞానం అయినా వస్తుంది కదా!!!! ఇలాంటివి చూసి మమ్మల్ని ఏడిపించడం కాకపోతే!!!!" అనుకుంటూ ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి నందు నవ్వుతూ వంట చేసి గౌతమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది
 
గౌతమ్ ముభావంగా వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే నందు గౌతమ్ అలా ముభావంగా ఉండటం నచ్చక బాధగా గౌతమ్ తో "ఇంకొకసారి నీతో ఇలా మాట్లాడడానికి గౌతమ్.... నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నేను ఇలా సీరియల్స్ చూస్తూ నీతో అలా బిహేవ్ చేయను ప్రామిస్..... నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చడం లేదు..... ప్లీజ్ గౌతమ్ మనం మునుపటిలా ఉందాము...." అని బాధగా అంటుంది
 
గౌతమ్ అనుమానంగా నందు వైపు చూస్తూ "నిజంగానే అంటున్నావా నందు??? ఇకనుంచి నేను వచ్చేసరికి సీరియల్స్ చూడకుండా ఉంటావా???" అని అడుగుతాడు
 
"ఆది మాత్రం చెప్పలేను గౌతమ్.... సీరియల్స్ చూస్తాను కానీ ఇలా నిన్ను మాత్రం ఇబ్బంది పెట్టను ప్రామిస్....." అని అంటుంది
 
"సరేలే ఏం చేస్తాం చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు నువ్వు చెప్పిందే నేను వినాలి కానీ నేను చెప్పింది నువ్వేమైనా వింటావా ఏంటి???? మమ్మల్ని మీ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నారు...." అని నిష్టూరంగా అంటాడు
 
నందు వెంటనే గౌతమ్ బుగ్గ మీద ముద్దు పెట్టి "నువ్విలా డల్ గా ఉంటే నాకు నచ్చడం లేదు గౌతమ్.... ఇప్పుడు నువ్వు హ్యాపీ గా అవ్వాలంటే నేను ఏం చేయాలి????" అని అడుగుతుంది
 
"నేను వచ్చేసరికి నువ్వు అందంగా రడీ అయ్యి నవ్వుతూ నన్ను పలకరించాలి.... అప్పుడే కదా మేము ఆఫీసులోని టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఇంటికి వచ్చాక సంతోషంగా మీతో టైం స్పెండ్ చేసేది...." అని అడుగుతాడు
 
నందు కొంచెం సేపు ఆలోచించి "సరే గౌతమ్ నువ్వు చెప్పినట్టే చేస్తాను.... ఇక సంతోషమా ముందు భోజనం చెయ్యి అన్నం చల్లారి పోతుంది....." అని నవ్వుతూ అంటుంది
 
గౌతమ్ సరే అని నందుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని తన నోటి దగ్గర అన్నం కలిపి పెట్టగానే నందు కంగారుగా "నువ్వు తిను గౌతమ్ ఇప్పటికే చాలా అలసిపోయి వచ్చావు కదా!!!!" అని ప్రేమగా అంటుంది
 
"నువ్వు కూడా ఆ సీరియల్స్ లో పడి సరిగా తినటం లేదు నందు... ముందు అవి తగ్గించు చూడు ఎంత సన్నగా అయిపోతున్నావో!!! ఇలా అయితే నిన్ను నేను సరిగా చూసుకోవడం లేదని మీ అమ్మ నాన్న అనుకుంటారు... అది నీకు ఇష్టమా???" అని ప్రేమగా తనకి తినిపిస్తూనే అడుగుతాడు
 
నందు ఒకసారి తనని తాను చూసుకుని అది నిజమే అనిపించి "సరే గౌతమ్ చెప్పాను కదా సీరియల్ పూర్తిగా మానేయను కానీ అవి చూడటం తగ్గించి టైం టూ టైం భోజనం చేస్తాను.... నావల్ల నీకు ఎప్పుడు చెడ్డపేరు రానివ్వను ప్రామిస్.... ఇప్పుడైనా నీ అలకమాని భోజనం చెయ్యి...." అని ఇప్పటికీ మూతి ముడిచి ఉన్న గౌతమ్ ని చూస్తూ అంటుంది
 
"ముందు నువ్వు' అంటూ నందుకు తినిపిస్తూ తను తిని హ్యాపీగా నైట్ ఈ చేసుకొని ఉదయానికి ఎప్పుడో పడుకుంటారు...‌‌.
 
అలా నందు తనకి కావాలి అనుకున్నది గౌతమ్ చేత కొనిపించుకోవటానికి ఒకసారి గౌతమ్ తో గొడవ పడుతూ ఒకసారి గౌతమ్ కోరికలు తీరుస్తూ తన కోరిక కూడా తీర్చుకుంటూ చిన్న చిన్న చిలిపి తగాదాలు గిల్లికజ్జా లతో తమ లైఫ్ ని హ్యాపీగా ఉంచుకుంటారు....
 
అలా చూస్తూ ఉండగానే మరో నాలుగునెలలు గడిచిపోతాయి.... కానీ డైలీ నందు మాత్రం తన అమ్మానాన్నలతో చెల్లెళ్లతో గౌతమ్ అమ్మానాన్నలతో మాట్లాడుతూ ఉంటుంది....
 
గౌతమ్ మాత్రం ఆఫీస్ పనుల్లో ఉండి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు....
 
అలాంటి టైమ్లోనే అపార్ట్మెంట్లోని పక్క ఫ్లాట్ ఆంటీ షాపింగ్ కి వెళుతూ నందుని కూడా తీసుకు వెళ్తుంది..... నందు కూడా సరే అని వెళ్లి అక్కడ పది వేల రూపాయల సారీ నచ్చి పట్టుబట్టి గౌతమ్ చేత కొనుక్కుంటుంది.....
 
ఇది జరిగింది....
 
ఇప్పుడు మనం ప్రెసెంట్ లోకి వచ్చేద్దాం....
 
ఉదయాన్నే లేచిన గౌతమ్ తన కౌగిలిలో నే పడుకొని ఉన్న నందుని చూసి "పడుకున్నప్పుడు ఎంత అమాయకంగా కనిపిస్తావు నందు!!!! కానీ నిద్ర లేచినప్పుడు అంత గయ్యాళి గా మారిపోతావు.... కానీ నాకు ఈ నందు కూడా నచ్చింది....." అని నవ్వుకుంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి నందు అని తన భుజం తడుతూ లేపటానికి చూస్తాడు
 
"ఇంకొంచెం సేపు నిద్ర పోనివ్వడి గౌతమ్.... రాత్రంతా మీరు నన్ను వదిలారా???? అసలు నిద్ర పోనివ్వకుండా మళ్ళీ వెంటనే లేపుతున్నారు....నాకు చాలా అలసటగా ఉంది..... ప్లీజ్ గౌతమ్ కొంచెం సేపు పడుకో నివ్వండి...." అని పక్కకి వొత్తి గిల్లి మళ్ళీ పడుకుంటుంది
 
గౌతమి నవ్వుతూ "సరే అయితే నువ్వు నిద్రపో నేను ఫ్రెష్ అయి బయటకు ఏదో ఒకటి తినేసి ఆఫీస్ కి వెళ్ళి పోతాను...." అని చెప్పి నందు బుగ్గ మీద ముద్దు పెట్టి తనని పక్కన పడుకోపెడుతూ పైకి లేస్తూ ఉంటే నందు వెంటనే కళ్ళు తెరిచి గౌతమ్ వైపు చూస్తూ "టైం ఎంత అవుతుంది గౌతమ్???" అని ఆశ్చర్యంగా అడుగుతుంది
 
"ఆల్రెడీ 7 అయ్యింది ఇంకో వన్ అండ్ ఆఫ్ అవర్ లో నేను బయలుదేరాలి.... ఈ ట్రాఫిక్ లో ఆఫీస్కి వెళ్ళే సరికి 9:30 అవుతుంది అని నీకు తెలుసు కదా!!!"అని నవ్వుతూ అంటాడు
 
నందు వెంటనే పైకి లేచి జారిపోతున్న చీర సరి చేసుకుని జుట్టు ముడి వేసుకుంటూ "ఇంతసేపు పడుకున్నానా??? అయ్యో మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి రండి గౌతమ్ మీకు కాఫీ ఇచ్చి టిఫిన్ చేసి క్యారేజ్ ప్రిపేర్ చేస్తాను...." అని హడావిడిగా పైకి లేచి గౌతమ్ కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కిచెన్ లోకి వెళ్లి పోతుంది
 
గౌతమ్ నవ్వుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్లి బయటికి వచ్చేసరికి నందు కాఫీ కప్పుతో నవ్వుతూ గౌతమ్ ఎదురుగా నిలబడి ఉంటుంది....
 
గౌతమ్ నవ్వుతూ కాఫీ తీసుకుని "నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి రా.... లేకపోతే లేచిన తర్వాత ఉదయాన్నే చాలా అనీజీ గా ఉంటుంది....." అని అంటాడు
 
నందు భర్త ఏది చెప్తే అది వినే భార్యలా తల ఊపి ఫ్రెష్ అయ్యి రావడానికి వెళ్ళిపోతుంది....
 
"నిన్న దీనికి ఇష్టమైన చీర కొనే సరికి ఈ రోజంతా కూడా నేను ఏది చెప్తే అదే చేస్తుంది.... ఇది ఎప్పుడూ జరిగేదే కదా!!!"అని అనుకుంటా నవ్వుకుంటూ కాఫీ తాగి టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు
 
నందు ఫ్రెష్ అయి బయటకు వచ్చి "హాఫ్ n అవర్ గౌతమ్ టిఫిన్ చేస్తాను..."అని హడావిడిగా కిచెన్ లోకి వెళ్తుంది
 
గౌతమ్ కూడా నందు వెనకాలే వెళ్లి "నేను నీకు హెల్ప్ చేస్తాను.... వంట కూడా చేయాలి కదా!!!! అసలే నువ్వు తెల్లగా ఉంటావు ఇంత పని చేస్తే నీ చేతులు ఎర్రగా కందిపోయి నొప్పి పుడతాయి..." అని చెప్పి గౌతమ్ నందు తో మాట్లాడుతూనే కూరగాయలు కట్ చేసి ఇస్తాడు.....
 
నందు అవి తీసుకొని టిఫిన్ ప్రిపేర్ చేస్తూనే కర్రీ కూడా ప్రిపేర్ చేస్తూ గౌతమ్ ని చూసి మురిసిపోతూ "నీలాంటి హస్బెండ్ ఎవరికీ దొరకరు గౌతమ్.... ఎంత హెవీ వర్క్ ఉన్న నా మీద చిన్న చిరాకు కూడా చూపించవు.... పెళ్లి అయినప్పటినుంచి ఇంతవరకు నాకు ఇలా హెల్ప్ చేస్తూనే ఉన్నావు..... నువ్వు నా భర్తగా దొరకడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం....." అని గౌతమ్ ని ఆకాశానికి ఎత్తేస్తుంది
 
గౌతమ్ నందు మాటలకి భయపడుతూనే "ఇప్పుడు నీకు ఏం కావాలి నందు??? నన్ను ఇలా ఐస్ చేస్తున్నావు???" అని అడుగుతాడు
 
నందు వెంటనే అలక గా మొహం పెట్టి "నేను మిమ్మల్ని అంతలా సతాయిస్తున్నానా??? జస్ట్ చిన్న చిన్నవి కొనిపించమని అడుగుతున్నాను..... అందుకే కదా మీ దృష్టిలో నేను లోకువ అయ్యాను..... మీకు నేనంటే లెక్కేలేదు ప్రతిసారి ఇలాగే మాట్లాడుతారు...." అని అంటుంది
 
గౌతమ్ నవ్వుతూ నందుని వెనక నుంచి హగ్ చేసుకొని "నువ్వు ఇలా అలిగితే చాలా అందంగా ఉంటావు నందు.... నువ్వు అలిగినప్పుడు నీ ముక్కు కోపంతో ఎర్రగా ఉంటుంది చూడు అప్పుడు అది అచ్చం చిలకముక్కు లానే ఉంటుంది...."అని నందు మొహం తనవైపు తిప్పుకొని తన పెదవులు అందుకుని ఐదు నిమిషాలు ముద్దు పెట్టి తన ముక్కు మీద కూడా ముద్దు పెట్టి వదిలేసి నవ్వుతూ నందు వైపు చుస్తాడు
 
నందు చిరుకోపంగా గౌతమ్ వైపు చూస్తూ "ఇప్పుడేంటి ఈ అల్లరి గౌతమ్..... ఇప్పటికే చాలా లేట్ అయింది ఇక మీరు వెళ్లి స్నానం చేయండి నేను రైస్ వండి క్యారేజ్ రెడీ చేసి పెడతాను...." అని అంటుంది
 
గౌతమ్ గారంగా "నువ్వు కూడా నాతో పాటు స్నానానికి రావచ్చు కదా నందు ఇద్దరం కలిసి స్నానం చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా???' అని తన మెడమీద ముద్దులు పెడుతూ అడుగుతాడు
 
"ప్చ్ మీ అల్లరి ఉదయాన్నే మొదలు పెట్టకండి గౌతమ్ ప్లీజ్ నాకు చాలా పని ఉంది...." అని అంటూనే బియ్యం కడిగి రైస్ కుక్కర్ లో పెట్టేస్తుంది
 
"ఏమి కాదు నందు ఆల్రెడీ అన్నీ అయిపోయాయి కదా నాతో మాట్లాడుతూనే చేసేసావు కదా!!!! ఇంకేం పని ఉంది కర్రీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది.... నువ్వు వస్తేనే నేను స్నానానికి వెళతాను లేకపోతే ఇలాగే ఉంటాను.... నువ్వు ఇలా చేస్తూనే ఉంటే నాకు లేటవుతుంది చూసుకో మరి...." అని అంటాడు
 
"మీరు స్నానానికి వెళ్ళకుండా లేట్ చేస్తూ పైగా నన్ను అంటున్నారా నా వల్ల లేట్ అవుతుందని???" అని చిరు కోపంగా గౌతమ్ వైపు చూస్తూ నడుము మీద చేతులు పెట్టుకుని అడుగుతుంది
 
"అది నిజమే కదా నీ వల్లే నాకు లేట్ అవుతుంది.... నువ్వు నేను అడిగినప్పుడు నాతోపాటు వస్తే నాకు లేట్ అవుతుందా చెప్పు??? అందుకే రా ఇద్దరం కలిసి స్నానానికి వెళ్దాం...." అని గారంగా తన కొంగు పట్టుకొని లాగుతూ కొంటె కృష్ణుడిలా అడుగుతాడు
 
నందు నవ్వుతూ తన వైపు చూస్తూ "ఏంటి కృష్ణయ్య వేషాలు వేస్తున్నారు???? మనకి ఇప్పుడు వీటికే తక్కువ అయింది..... మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి గౌతమ్" అని గౌతమ్ వెనక నుంచి తోస్తూ ఉంటుంది.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
#35
Super broo nice update
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
#36
Nice update bro challa bagundhi
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#37
GOOD BUILDUP OF STORY
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
#38
కథను బానే రాస్తున్నారు బ్రో. కొంచెం నందూ క్యారెక్టర్ కూసింత కంఫ్యూజింగా ఉంది. పెళ్ళీ చూపులప్పుడు అంత డేరింగా మాటలాడిన అమ్మాయి (బాగా మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి అనుకున్నా) సీరియల్ చూసి ఏడ్వడం, మొగుడితో దెబ్బలాడడం....అమాయకత్వము, మొండితనము, గడుసుతనము, మూర్ఖత్వము అన్నీ కలిసినట్లు...బావుంది, కొనసాగించండి 
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#39
అప్డేట్ చాల బాగుంది మిత్రమా
[+] 1 user Likes sri7869's post
Like Reply
#40
Super update bro
[+] 1 user Likes poorna143k's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)