Posts: 3,333
Threads: 159
Likes Received: 10,467 in 2,076 posts
Likes Given: 6,773
Joined: Nov 2018
Reputation:
734
19-11-2025, 06:08 PM
(This post was last modified: 22-01-2026, 07:21 PM by k3vv3. Edited 4 times in total. Edited 4 times in total.)
శక్తి ఆగమనం.. ప్రోమో..
రాపర్తి అనూరాధ
*"" ఒక జంట ఎప్పటి నుంచో ప్రేమించు కుంటున్నారు...
ఒకరిని ఒకరు అర్థం
చేసుకుని పెళ్లి చేసుకోవాలి అనే భావనకి వచ్చారు.
ఆరోజు ఇంట్లో వాళ్ళకి
కాలేజ్ కి వెళుతున్నాము
అని అబద్ధం చెప్పి
బైట షికార్ ప్లాన్
చేసుకున్నారు
బైక్ పై ఫుల్ జోష్ తో షికార్లు
చేస్తూ బీచ్ పార్క్ రెస్టారెంట్
మూవీ అంటూ సాయంత్రం
వరకు చాలా ఎంజాయ్
చేశారు...
*"" తిరిగి వస్తుండగా
వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు...
ఇంకో వారం లో ఎగ్జామ్స్
తరువాత ఇంట్లో వాళ్ళతో
తమ లవ్ మ్యాటర్ చెప్పాలి
అని ప్లాన్ చేసుకుంటూ
ఉన్నారు....
*"" సాయంత్రం వరకు ఫుల్ ఎంజాయ్ చేసి తిరుగు
ప్రయాణం అవుతుంటే....
సిద్దు అంటే ఈ కథలో హీరో...."
నీ అడిగింది
ఇందు.... ( అంటే కథలో హీరోయిన్) నువ్వు ఇంక చదువు పై
దృష్టి పెట్టు నా ఆలోచనలతో
మైండ్ పాడు చేసుకోవద్దు
ఎలాగూ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాం
వాళ్ళు ఒప్పుకుంటే సరి
లేదంటే రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుందాం సరేనా...
అని అడుగుతూ ఉంది.
సిద్దు నవ్వుతూ థాంక్స్ ఇందు...
నా పై నా ప్రేమ పై ఇంత
నమ్మకం పెట్టుకున్నావు
ఇంక నాకే దిగులు లేదు
మన పెళ్లి జరిగి తీరుతుంది
అంటూ ఉన్నాడు.
*" అంతలో రోడ్ పై రెడ్ సిగ్నల్ పడింది.
సిద్దు వాచ్ వైపు చూసుకుని
ఓహ్ ఇంకో పది నిముషాలు
టైం ఉంది ఆలోగా నిన్ను కాలేజ్ దగ్గరకి చేర్చాలి లేదంటే
ఎగ్జామ్స్ ముందే మన పెళ్లి అయిపోతుంది
మీ నాన్న చేతిలో అని నవ్వుతున్నాడు.
*""
ఇందు కూడా నవ్వుతూ ఉంది అంతలో
గ్రీన్ సిగ్నల్ పడింది సిద్దు
బైక్ స్టార్ట్ చేసాడు
విచిత్రం బైక్ స్టార్ట్ అవ్వలేదు... అతడికి కంగారు అనిపించింది ఇదేంటి ఫుల్ పెట్రోల్ ఉంది
బండి కదలటం లేదు అని
సెల్ఫ్ స్టార్ట్ అవ్వకపోతే
కిక్ కొట్టి స్టార్ట్ చేసాడు
అయినా బండి కదల్లేదు
వెనుక నుంచి ట్రాఫిక్ జాం
అయ్యి హారెన్ మోగుతు
ఉంటే చేసేది
లేక బైక్ దిగి తోసుకుంటూ
పక్కకి పార్క్ చేయాలి అనుకున్నాడు
కానీ ఆ బైక్ ఇంచ్ కూడా
కదల్లేదు,
అతడికి ఆశ్చర్యం వేసింది
ఇందు కూడా కంగారుగా
చూస్తూ ఉంది
సిద్దు ఆమెను పక్కకి వెళ్లి
నిలుచో మని చెప్పి
ఎంతో బలం తో బైక్ కదల్చాలి
అని చూసాడు
హు హు ఛాన్స్ లేదు
ఎదో బూమిలో కూరుకు
పోయినట్టు బైక్ పై వంద
టన్నుల బరువు ఉంది
అన్నట్టు
ఆ బండి అలాగే నిలబడి
ఇంచ్ కూడా కదలటం
లేదు
*"""ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అని కొందరు
వచ్చి అతడికి హెల్ప్ చేయాలి
అని చూసారు
బట్ నో యూస్ పది మంది
వచ్చి లాగినా ఆ బైక్ కదల్లేదు అందరూ ఆశ్చర్యంగా ఎంటి
వింత అన్నట్టు
చూస్తున్నారు...!!
*" ఇందు కి టైం అయిపోతుంది డాడ్ కాలేజ్ కి వచ్చేస్తారు......
ఇంకో వైపు విచిత్రం గా బైక్ రోడ్ కి అడ్డం గా బిగుసుకు పోయింది. ఇప్పుడేం చేయాలి అని
చూస్తూ ఉంది ఆమె
*""
సరిగ్గా పది నిముషాలు
ఎన్ని విధాలుగా ట్రై చేసినా
ఫలితం లేకుండా పోయింది...
సిద్దు అన్నట్టు పది నిముషాల
టైం అయిపోయిన క్షణం లో
బైక్ మీద ఉన్న బరువు పక్కకి తొలగి పోయినట్టు ఎంతో
తేలిక అయిపోయింది.
అంత వరకు ఎంతో ట్రై చేసిన వారంతా బోర్లా పడ్డారు
బలం గా నెట్టడం తో పల్సర్ బైక్ విసురుగా యాభై అడుగుల అవతల పడింది.
*" సిద్దు మతిపోయినట్టు
ఆ విచిత్రం చూస్తూ ఉంటే
ఇందు హమ్మయ్య బైక్ కదిలింది అని అతడ్ని కదిలించింది
అప్పుడు వచ్చింది అతడికి
స్పృహ కంగారుగా కింద పడి ఉన్న బైక్ పైకి ఎత్తి అనుమానం గా చూసుకుంటూ హుష్ అమ్మా అనుకుని....
ఇందు నీ బైక్ ఎక్కించుకుని ముందుకి
కదిలాడు...!
***""""
అసలు ఆ బైక్ కి
ఎం జరిగిందో అంత వరకు
ఆ బైక్ మీద ఎం ఉందొ అంతా ఏమి అర్ధం కాలేదు
అంతా వింతగా ఇంకా అదో పెద్ద వైరల్ గా మారింది. ఇలాంటి సంఘటన
ఇప్పటి వరకు ఎక్కడా వినింది చూసింది లేదు. కానీ ఇలాంటివి
*""
*"" ఒక జంట జీవితం లో
ఎన్నో సంఘటన లు
ఎప్పటికప్పుడు జరుగుతూ
వారి జీవితం లో ఎన్నో
అలజడులు అనుమానాలు ఆశ్చర్యాలు కలిగిస్తూ
ఎదో అదృశ్య శక్తి వారిని
హెచ్చరిస్తూ గతం లో జరిగిన సంఘటన తెలియ చేయాలి
అని ప్రయత్నిస్తూ...
ఊహించని ప్రమాదాలు
ప్రళయాలు ప్రయాణాలు
చేయిస్తూ వారి ద్వారా
ఆగిపోయిన ఒక సత్కర్యాన్ని
పూర్తి చేయించే ప్రయత్నం
చేస్తున్న ఒక శక్తి కథ...!!!!
అసలు ఆ శక్తి ఎంటి
దయ్యమా దైవమా...??
ఆ ఇరువురికే ఎందుకు
ఇలాంటి ఇబ్బందులు
వారినే ఎందుకు ఎన్నుకుని
ఇబ్బంది పెట్టడం
అసలు ఎంటా గతం
ఈ జంట
జంట అవ్వడానికే పుట్టారా
వీరి పుట్టుకకు ఇంకేదో
కారణం ఉందా..???
వీరి పెళ్లికి ఇంట్లో వారు ఒప్పుకుంటారా..??
వాళ్ళు ఒప్పుకున్నా కనిపించని
శక్తి ఒప్పుకుంటుందా...???
ఇదంతా తెలియాలి అంటే
*"శక్తి...! ""
అనే సీరియల్ చదవాలి..!!
Posts: 3,333
Threads: 159
Likes Received: 10,467 in 2,076 posts
Likes Given: 6,773
Joined: Nov 2018
Reputation:
734
జనవరి 1 నుండి ప్రారంభం
మొదటి భాగంతో
•
Posts: 3,333
Threads: 159
Likes Received: 10,467 in 2,076 posts
Likes Given: 6,773
Joined: Nov 2018
Reputation:
734
20-11-2025, 09:46 AM
(This post was last modified: 20-11-2025, 10:01 AM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
జనవరి 1 నుండి
Posts: 894
Threads: 8
Likes Received: 5,909 in 645 posts
Likes Given: 1,719
Joined: Dec 2024
Reputation:
566
(20-11-2025, 09:46 AM)k3vv3 Wrote: జనవరి 1 నుండి
Waiting
Posts: 19
Threads: 0
Likes Received: 47 in 12 posts
Likes Given: 2,693
Joined: Mar 2024
Reputation:
2
(20-11-2025, 09:46 AM)k3vv3 Wrote: జనవరి 1 నుండి ప్రారంభం
మొదటి భాగంతో
ఇంట్రో ఇరగదీసావ్ గురు. ఎప్పుడు ఎప్పుడు మొదలువుతుందా అని చాల ఆశగా ఉంది
Posts: 3,333
Threads: 159
Likes Received: 10,467 in 2,076 posts
Likes Given: 6,773
Joined: Nov 2018
Reputation:
734
ఇంకో మూడు వారాలు మాత్రమే వ్యవధి ఉంది
మొదటి భాగం మీ ముందుకు రావడానికి
నిదానమే ప్రధానం కదా!
•
Posts: 3,333
Threads: 159
Likes Received: 10,467 in 2,076 posts
Likes Given: 6,773
Joined: Nov 2018
Reputation:
734
10-12-2025, 09:32 AM
(This post was last modified: 10-12-2025, 11:01 AM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
--- for future
•
Posts: 2,064
Threads: 4
Likes Received: 3,186 in 1,452 posts
Likes Given: 4,312
Joined: Nov 2018
Reputation:
70
ఇంట్రో అందామా, ప్రోమో అందామా....ఏదైనా ఇంటరెస్టింగా వుంది ప్లాటు...అన్నట్లే మొదలెట్టండి
: :ఉదయ్
Posts: 3,333
Threads: 159
Likes Received: 10,467 in 2,076 posts
Likes Given: 6,773
Joined: Nov 2018
Reputation:
734
శక్తి ఆగమనం 1
*"" ఓం గం గణపతయే నమః
ఓం ఆనంద గణపతియే నమః
ఓం మహా గణపతియే నమః
****
ఫస్ట్ టైం ఈ స్టోరీ రాస్తున్న
ఇది హారర్ అని పూర్తిగా చెప్పలేను
పాంటసీ ఇంకా లవ్ ఎమోషన్స్ తో
కూడుకుని ఉంటుంది.
మీకు నచ్చుతుంది అనే
అనుకుని ధైర్యం చేసి రాస్తున్న
నన్ను ఆదరిస్తారు
అనే నమ్మకం నాకు ఉంది...
ఇంక కధలోకి వెళుతున్న..!
*"""
*" నింగి లో చుక్కలు వరుసలు
కట్టి వజ్రపు కాంతుల వలే మెరుస్తూ.... పూ మాల లా ఒక
చోట చేరి నేల వంక చూస్తూ కనిపిస్తున్నాయి ....
*""
అర్ధ రాత్రి సమయం
అవుతున్న
ఆకాశం లో చీకటి
కమ్ముకొలేదు
నీలి రంగు తెర వేసుకుని
ఆకాశం ఎదో దైవ
కార్యం కనులారా చూడాలి
అన్నట్టు ఎదురు చూస్తూ
ఉంది.....!
*""""
నిండు చంద్రుడు మబ్బుల
నడుమ దాగుని వెన్నెల కాంతి కిరణాలు ప్రసరిస్తూ...
శుభ ముహూర్త సమయానికి వెలుపలికి వచ్చి తీరుతా
అని పంతం బూని చాటుగా నేల వంక చూస్తూ ఉన్నాడు...!
*""""
*" తెల్లవారితే
విజయ దశమి
ఆది పరాశక్తి అవతరించి
శిష్టరక్షణ దుష్టశిక్షణ
జరిపిన రోజు....
అంతటి పర్వదినాన
ఉద్భవిస్తున్న శక్తీ ఆగమనం
కొరకు ప్రకృతి తన కన్నుల
కునుకు పడనివ్వ కుండా
ఎంతో ఆతృత గా ఎదురు
చూస్తూ ఉంది
ఎందుకొసం
ఎవరి కోసం...???
*****
మానవ తప్పిదం తో
శాపానికి గురైన ప్రాంతం.
తొంబై తొమ్మిది ఏళ్లుగా
ఎడారి వలె మారి
గడ్డి పూచ కూడా మొలవనంత
నిర్ధయ ప్రాంతం గా
మారిపోయిన
ఓనాటి పచ్చని వనం
ఈనాటి నిప్పుల గుండం.
అక్కడి వారి బ్రతుకే ఓ నరకం
******నీటి చుక్క కరువైన జనం
మలమలమాడి
పోతున్న ప్రాణం
చే చేతుల చేసిన పాపం తొలగించుకున
చేస్తున్న యజ్ఞం... ఓ
నిష్కల్మష ప్రాణ త్యాగానికి
ఫలితం ఈ శక్తి ఆగమనం..!!!
*"" రాత్రి పన్నెండు దాటింది ఉదయానే విజయ దశమి
వేడుకలు ఎంతో కోలాహలం గా జరగనున్నాయి
ఊరిలో వారంతా పండుగ నాటి సంబరాలు కొరకు ఎన్నో
ఏర్పాట్లు చేసుకుంటూ
ఉన్నారు
*""" పరాశక్తి ఆలయానికి
దగ్గరలో ఓ ఆడ మనిషి నొప్పులు పడుతూ ఉంటే
ఆ ఇంట్లో వాళ్ళు
కంగారుపడుతూ ఆ శక్తి నీ వేడుకుంటూ ఉన్నారు..!
*""ఇంటికి వచ్చిన
డాక్టర్ హాస్పటిల్ కి సిప్ట్ చేసే సమయం లేక
ఇంట్లోనే పురుడు పోస్తూ
ఉంది.
అక్కడికి తొంబై తొమ్మిది
కిలోమీటర్ల దూరంలో ఇంకో ఆడమనిషి అదే విధం గా
పురిటి నొప్పులు పడుతూ
ఉంది ఆమె పరిస్తితి కూడా
కష్టం గా ఉంది
*""" రాజరాజేశ్వరీ దేవి ఆలయం కి దగ్గరలో ఉంటున్న ఆ కుటుంభం అంతా ఆ దేవి నే తలుచుకుంటూ బైట కూర్చుని ఉన్నారు.
*""
సరిగ్గా మహా శక్తి
అవతరించిన గడయల్లో
ఆ ఇరువు ఆడవాళ్ళు
ప్రసవించారు....
*"""కానీ ముందుగా ఓ
తల్లికి ఆడపిల్ల పుట్టింది...
*""ఆమె పుట్టిన
ఎనిమిది క్షణాలకి ఇంకో చోట
మగ బిడ్డ పుట్టాడు....!
*""
అంతే అప్పటివరకు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న ప్రకృతి పులకరించి పోయింది.
పంచ భూతాలు
ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించింది అన్నట్టు
ఆనందించాయి
ఆ శిశువులను
ఆశీర్వదించాయి.
*""విచిత్రం గా రెండు ప్రదేశాలు
వేరు కొన్ని కిలోమీటర్ల దూరం
వారి మధ్య ఉంది.
*"" కానీ అక్కడి
వాతావరణం ఒకే
విధం గా ఉంది
అప్పటి వరకు ఆకాశం లో
మాలగా ఉన్న నక్షత్రాలు
ఒకేసారి నేలకి రాలినట్టు
ఆ మాల పుట్టిన బిడ్డలని అభినందించినట్టు
వర్షపు చినుకులు గా మారి
నేల చేరుకున్నాయి.
*""ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది
చంద్రుడు మబ్బుల్లో ఉన్నావాడు కాస్తా వెలుపలికి వచ్చి
ఆ పసి బిడ్డలని చూసి
హు నాకంటే తేజో వంతంగా ఉన్నారే
అని మురిసి పోతు ఉన్నాడు.
*"""వెన్నెల కాంతి ఇంకా అలాగే ఉంది అయినా వర్షం
కురుస్తుంది
ఆ రెండు కుటుంబాల
వారికి విషయం
తెలిసింది పుట్టిన
బిడ్డలు సామాన్యులు కాదు వారి మహర్జాతకం
ఆ వాతావరణ మే
చెప్తుంది ..
*"""తల్లి బిడ్డ క్షేమం అని
డాక్టర్స్
చెప్పి వెళ్లారు
ఉన్నట్టుండి వాన
ఎక్కువయింది.
*"" మంచి ఉన్న చోటే చెడు ఉంటుంది ఆ శిశువుల జననం కోసం తొంబైతొమ్మిది ఏళ్లు ఎదురు చూసింది మంచి
ఆ శిశు జననం కాకుండా తొంబై తొమ్మిది ఏళ్లు
ఆపింది ఓ చెడు.
*""అందుకే పుట్టిన శిశువుల ఊపిరి ఆపాలి అని చూస్తుంది
ఓ దుష్ట శక్తి.
**""' అక్కడ అంతా సంతోషం
వరద లా ఆనందం
పొంగిపోతూ ఉంటే ఇంట్లో
వాళ్ళు ఒక విషయం
గమనించారు
పుట్టిన బిడ్డలు
కళ్ళు తెరిచే ఉన్నారు
కానీ ఏడవటం లేదు కదలటం లేదూ
అందుకే వాళ్ళు
భయ పడ్డారు
*"""ఇదేం చిత్రం డాక్టర్ ఎటువంటి సమస్య లేదు అని
చెప్పి వెళ్ళింది
బిడ్డ ఏడవటం లేదు కదలటం లేదూ....
ఏమై
ఉంటుంది అని ఇంట్లో
వాళ్లంతా కంగారు
పడిపోతూ ఉన్నారు.
బైటకు వెళ్ళడానికి
వీల్లేకుండా అప్పటి వరకు
శాంతం గా కురిసిన వాన
మరింత వుధృతం గా మారింది.
*"" అక్కడి వారు భయ పడిపోతూ ఎంతో వేదనగా కూర్చుని ఉన్నారు.
*""మరుసటి రోజు ఉదయం
ఆరు గంటల సమయం కావస్తుంది.....
అక్కడికి
దగ్గరలో ఉన్న ఆలయం లో
పూజలు నిర్వహిస్తున్నారు.
*""మంత్రోచ్చారణ జరుగుతూ
ఉంది
ఇంట్లో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నారు
రాత్రి మొదలైన వర్షం అప్పటి
వరకు కురుస్తూనే
ఉంది అప్పుడే కాస్త తగ్గు
ముఖం పట్టింది.
**""
కోవెల లో మంత్రాలు విని
ఇంట్లో వాళ్ళు పిల్లల్ని
గుడిలోకి తీసుకుని వెళ్లి
అమ్మ ఆశీర్వాదం తో
నుదుట కుంకుమ పెడితే
బిడ్డ లో చలనం వస్తుంది ఏడుస్తుంది ఏమో అప్పటికి
మార్పు రాకుంటే వర్షాన్ని లెక్క చేయకుండా తడుచుకుంటూనే
హాస్పటిల్ కి వెళ్దాం అని
పురిటి బిడ్డలని తీసుకుని
అమ్మ ఆశీర్వాదం కోసం
ఆలయం లో అడుగు పెట్టారు
బిడ్డ తండ్రులు..!
*""' అప్పటి వరకు ఆ పసికందు ల గొంతు పట్టి ఉంచిన
అదృశ్య శక్తి అక్కడితో
ఆగవలసి
వచ్చింది.
*""".....
ఒక్కసారిగా విచిత్రం జరిగింది ఆలయం లో
అడుగు పెట్టగానే పుట్టిన బిడ్డలు అదిరి పడ్డారు.
*"""అక్కడి పూజారి బిడ్డని అందుకుని అమ్మ దగ్గర పెట్టీ
అమే కుంకుమ అంటించె సరికి సరిగ్గా అప్పుడే అక్కడ ఎవరో
శంఖం పూరించారు...
మరో వైపు మంత్రాలు
చదువుతూ పండితులు
హోమం జరిపిస్తు ఉన్నారు.
పూజలు చేస్తూ అమ్మకి
కుంకుమ అర్చన చేస్తూ
ఉన్నారు.
అక్కడి శక్తి ఆశీర్వాదం
అందిస్తూ ఉంటే
ఆ పురిటి కందులు
స్పృహ లోకి వచ్చినట్టు
కెవ్వున ఎడ్చాయి....
ఆ బిడ్డల ఏడుపు వేద మంత్రం లా వినిపించింది అక్కడి వాళ్ళకి.
బిడ్డ తండ్రికి
ఆనందం అవదలు
దాటింది.
ఒక్కసారి గా అమ్మ
మహిమ అందరికీ
తెలిసేలా ఆ దృశ్యం
కనిపించింది.
అప్పటి వరకు ఉలుకు పలుకు లేకుండా ఉన్న బిడ్డ
గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటే
అక్కడ ఉన్న వారందరి
కళ్ళు చెమ్మగిల్లాయి.
జై మాతా జై జై మాతా
అంటూ
ఆదిపరాశక్తి ని
వేడుకుంటూ బిడ్డల్ని అందుకున్నారు...
అక్కడి పూజారి విషయం తెలుసుకుని దేవి ప్రతిమ ఉన్న రక్ష నీ ఆ పిల్లల మెడలో కట్టి
ఇద్దరికీ ఒకే మాట చెప్పారు
ఈ బిడ్డ వివాహం పూర్తి అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ
ఈ రక్ష బిడ్డ మెడలోనుంచి తియ్యకండి అలా తీస్తే
ప్రమాదం.
గుర్తుంచు కొండి.
అలా అని భయం కూడా పెట్టుకోకండి
నీ బిడ్డ విజయం కోసం పుట్టింది
అనుకున్నది సాధిస్తుంది అందులో సందేహం లేదు
గొప్ప జాతకం గలది
అని ఆశీర్వాదం ఇచ్చి
పంపారు.
ఆ పిల్లల్ని తీసుకుని
ఆనందం గా ఇల్లు
చేరుకున్నారు. పిల్లల తండ్రులు.
వాళ్ళు ఇల్లు చేరుకుని
విషయం అంతా చెప్పారు. ఒక్కసారిగా
పెద్ద పండుగ నెలకుంది ఆ కుటుంబాల్లో అంతా
పుట్టిన బిడ్డలకు పేర్లు పెట్టారు.
*""మగబిడ్డ పేరు సిద్ధార్థ... అని ఆడబిడ్డ పేరు ఇందిరా దేవి....
అని నామకరణం చేశారు .
*" ముందుగా సిద్ధార్థ
కుటుంభం కొరకు చెబుతాను
సిద్ధార్థ తండ్రి సాంబ శివరాం..
తల్లి ధక్ష్యాయిని...
వారికి సిద్ధార్థ మొదటి
సంతానం
పెళ్ళైన ఎనిమిది ఏళ్ల తరువాత వాళ్ళకి బాబు పుట్టాడు
సాంబ శివరాం కి అన్న తమ్ముళ్లు అంటూ ఎవరూ లేరు
తల్లి తండ్రి మనవలు లేరు
అంటూ ఎన్నో పూజలు వ్రతాలు యజ్ఞాలు చేయించారు
వాటి ఫలితమే ఈ బాబు అని అంతా
సంతోష పడుతూ
ఉన్నారు.
*""'ఇందిర తండ్రి ఫని బుషన్
తల్లి శారదాంబ వీళ్ళది
కూడా అదే సమస్య
సంతానం లేదు అని ఎన్నో నోములు వ్రతాలు పూజలు నిర్వహించారు
వాటి ఫలితమే
ఈ మహా లక్ష్మి
అనుకుంటూ ఉన్నారు
అనుకున్నట్టే
*"""
పుట్టిన బిడ్డలు జాతకం తో ఊహించని రీతిలో
ఆ రెండు కుటుంబాల వారు గొప్ప
ధనవంతులు అయ్యారు
చిన్న
గల్లీ లో నివాసం ఉండే వారు
మహా నగరానికి
చేరుకున్నారు
పారిశ్రామిక వేత్తలగా ఎదిగి
కోట్లు సంపాదించుకున్నారు
సంగం లో పలుకుబడి రాజికీయ పలకరింపుతో
ఆ ఇరువురి జీవన విధానం మారిపోయింది.
ఊహించని విధంగా భూషణం శివరాం అపోజిట్ అయ్యారు
అటు వ్యాపారం లో ఇటు రాజకీయం లో ఒకరంటే
ఒకరికి శతృత్వం ఏర్పడింది.....
కాదు ఏర్పడేలా ఓ
అదృశ్య శక్తి చేస్తుంది.
అందుకు కారణం ఉంది.
వారికి తెలియ కుండానే ఎన్నో విధాలుగా వారు
శత్రువులు అయ్యారు
ఇంక వారి మధ్య
భందుత్వం ఏర్పడటానికి అవకాశమేలేదు.
ఉదాహరణగా ఒక్క మాట
*"""హైదరాబాద్ నగరం లో
ఎన్నో ఆస్తులు అంతస్తులు సంపాదించుకుని గొప్ప
పొజిషన్ లో ఉన్న
ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికీ
ఉపయోగ పడుతుంది అన్న
గజం భూమి కూడా వదలరు
అంత మొండి గొడవలు మధ్యవర్తుల తగాదాలు
మరింత తార స్థాయికి
చేరుకుని తూర్పు
పడమర లా ఉన్నారు
ఈ శివరాం, ఇంకా భూషన్...!!
వారి సంతానం సిద్ధార్థ్
అదే అందరూ ముద్దుగా పిలుచుకునే సిద్దు.
ఇందిరా దేవి అదే ఇందు అని ముద్దుగా పిలుచుకునే అమే.
ఓకే కాలేజ్ లో జాయిన్ అవ్వబోతున్నరు
వారి పేరెంట్స్ పంతం తో
పోటీ పడి అక్కడి కాలేజ్ లో
జాయిన్ చేస్తున్నారు.
*""""
సిద్దు ఇందు ఒకర్ని ఒకరు
ఎప్పుడు ఎదుర్పడి చూసుకుంది
లేదు చూసుకోవాలి అనుకున్నది లేదు కానీ వారి తండ్రుల
తగాదా పుణ్యమా అని
అవతలి వారి అన్ని వివరాలు
వారికి తెలుసు.
అలాగే ఒకరికి ఒకరు దూరం గా ఉండాలి అనేది కూడా
తెలుసు.
లేదంటే సమస్యలు వస్తాయి
అని జాగర్తగా ఉండాలి అనుకుంటున్నారు
అలాగే ఒకరంటే ఒకరికి కోపం ఇంకా విసుగు
కలిగి
ఉన్నారు.
కానీ
వారి మధ్య దూరం తోలగే
సమయం రానుంద.
అందుకే ఇరువురు ఓకే
చోటుకు చేరుకున్నార.
ఆ విషయం ఆ
ఇరువురికి తెలిసేది
ఎప్పటికీ. ముందు ముందు ఎం జరగనుంది
చూడాలి
*****
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ఇరువురు
ఒకటై ఒక్కటిగా ఊహించని
గమ్యం చేరుకుని
ఏళ్లనాటి శాపం తొలగించి
నేల తల్లి దాహం
తీర్చగలుగుతారా
అందుకోసం
శక్తి ఆగమనం తప్పని సరా...????
*"""
అసలు గతం లో ఎం జరిగింది ఆ శాపం ఎంటి ఎవరు పెట్టారు ఎవరికి పెట్టారు సిద్దు ఇందు లని
అడ్డుకుంటుంది
ఎవరు...???
ఇక ముందు ముందు
ఎం జరగ బోతుంధి
మంచిని కాపాడాలి
అనుకుంది ఎవరు..???
చెడుగా మంచికి అడ్డం
వస్తుంది ఎవరు...????
వీరి జీవితం లో ఎలాంటి
మార్పులు రాబోతున్నాయి
ఎలాంటి సంఘటనలు
నెలకొంటాయి....???
*"" కంటికి కనిపించని
అదృశ్య శక్తి వీరిని ఎలా
అడ్డుకుంటుంది.
మంచికి సహాయ పడే
శక్తి ఆగమనం
ఎలా వీళ్ళ దారి
మళ్ళిస్తుంది
అనేదే.
శక్తి ఆగమనం
సీరియల్ సారాంశం.
*"""
రచనకు రేటింగ్ ఇవ్వండి
Posts: 3,333
Threads: 159
Likes Received: 10,467 in 2,076 posts
Likes Given: 6,773
Joined: Nov 2018
Reputation:
734
మితృలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర, 2026, శుభాకాంక్షలు
•
Posts: 894
Threads: 8
Likes Received: 5,909 in 645 posts
Likes Given: 1,719
Joined: Dec 2024
Reputation:
566
మీరు వాడిన అలంకారాలు, వర్ణనలు అద్భుతం. చాలారోజుల తర్వాత ఒక కథలో వీటిని చూసాను. అద్భుతంగా వాడారు, అంతకన్నా అద్భుతంగా రాశారు.
మీ కొత్త కథకి ఆల్ ది బెస్ట్
•
Posts: 3,333
Threads: 159
Likes Received: 10,467 in 2,076 posts
Likes Given: 6,773
Joined: Nov 2018
Reputation:
734
ధన్యవాదములు అనామిక గారు.
సంతోషం
•
Posts: 3,333
Threads: 159
Likes Received: 10,467 in 2,076 posts
Likes Given: 6,773
Joined: Nov 2018
Reputation:
734
శక్తి ఆగమనం..2
*"" ఆరోజు ఇందు కాలేజ్ జాయినింగ్....
ఆమెకు చిన్నప్పటి నుంచి
ప్రతి చిన్న విషయానికి
భయం చాలా సున్నిత మనస్కురాలు
ఇప్పటికే చాలా సార్లు
తెలియని ప్రమాదాలు
ఆమెను వెంటాడాయి
*"""ఆమె ప్రాణం పట్టుకు పోవాలి అని ఓ చీకటి నీడ
వెంటాడుతూ ఉంది అందుకే ఆమె
వంటరిగా ఉండాలి అంటే
చచ్చేంత భయ పడుతుంది.
అందుకు చాలా కారణాలు ఉన్నాయి
ఎన్నో సమయాల్లో ఆమెను
ఎవరో వెంటాడి నట్టు
తన పక్కనే ఉన్నట్టు
అనిపించేది తనని
చంపడానికి చూసినట్టు ఆ సమయం లో ఆమె భయం తో పరుగులు పెట్టీ కింద పడి
దెబ్బలు తగిలించు కునేది.
కానీ తననీ
వెంటాడిన అదృశ్య శక్తి
ఎప్పుడు నేరుగా ఆమెను
ఎటాక్ చేసేది కాదు.
****
అమే ప్రమాదం కలిగే ప్రదేశం లో ఉన్నప్పుడు భయపెట్టి ఆమె అంతట ఆమె ప్రమాదం లో
పడేట్టు చేసేది
అదంతా
ఆమె భ్రమే కావచ్చు.
ఎదీ ఏమైనా కానీ
ఆమె ప్రమాదం లో పడేది.
అందుకే ఇంట్లో వాళ్ళు
ఇందు నీ జాగర్తగా
చూసుకుంటూ
ఉండే వారు ముఖ్యం గా
భూషణ్ కూతురు నీ
అపురూపం గా అదృష్ట లక్ష్మి గా చూసుకుంటూ ఉండే
వారు
ఆమె అమాయక్త్వం ప్రతి చిన్న విషయానికి భయపడే గుణం
చూసి బైట పడక పోయినా ఆయన
చాలా భాధ పడేవారు.
****
ఆమె ముందు గంభీరం గా
ఉన్నట్టు ధైర్యం చెబుతూ
మనం దృఢం గా ఉండాలి
అసలే మనకి శత్రువులు
ఉన్నారు అని జాగర్తలు
తీసుకోవాలి అంటూ,
కాలేజ్ నుంచి ఇప్పుడు
కాలేజ్ వరకు ఆయనే
స్వయంగా తీసుకు వెళ్లి
తీసుకు రావాలి అని ఫిక్స్ అయ్యారు.
అలాగే ఇంటర్ పూర్తి చేసింది ఇప్పుడు
ఇంజినీరింగ్ చేయాలి అనుకుంటుంది.
*"""
ఈరోజే కొత్త కాలేజ్ కి ఆమె
వెళ్తుంది అంతలో
ఆమె తండ్రి కి ఒక విషయం
తెలిసింది.
అదే కాలేజ్ లో
శివరాం కొడుకు నీ జాయిన్ చేస్తున్నాడు అని
అంతా తనతో పోటీ అని
అర్థం చేసుకుని కూతుర్ని
దగ్గరకు
పిలిచి వివరం గా చెప్పారు
చూడు ఇందు నువ్వు
చేరబోతున్న కాలేజ్ లో
ఆ శివారం కొడుకు కూడా
ఉంటాడు.
వాడు కావాలనే నువ్వు
చేరుతున్న కాలేజ్ లో జాయిన్ అయ్యాడు
నీతో ఏమన్నా వేషాలు వేస్తే
చెప్పు ప్రాణం తీసేస్తాను....
అయినా అంత వరకు
రాదులే....
వాడు నీ నీడను కూడా
చూడటానికి భయపడేలా
వార్నింగ్ ఇస్తాను.
నువ్వేం కంగారు పడక
కాకుంటే జాగర్త గా ఉండు.
నువ్వు
వాడ్ని కళ్ళతో కూడా
చూడకు మాట్లాడే ప్రయత్నం చేయకుండా నీ మట్టుక నువ్వు జాగర్తగా ఉండలి నీకసలే అన్నిటికీ భయం.
వాడేమన్న నీతో వేషాలు వేస్తే మాత్రం నేను వాడి అంతు
చూస్తాను నువ్వు మాత్రం
వాడి మొహం చూడటానికి
కూడా వీల్లేదు వాళ్ళు మనకు
బద్ర శత్రువులు అర్థం
అవుతుందా అని విషయం చెప్పాడు.
*""" ఇందు నాన్న మాటలు విని అర్థం అయింది నాన్న గారు
నేను అసలు అక్కడి
అబ్బాయిలతో మాట్లాడను ఎవరి వంకా చూడను నా చదువు నేను చదువుకుని ఉంటాను
మీరన్నట్టు ఆ అబ్బాయి నాతో ఏమన్నా బ్యాడ్ బిహేవ్ చేస్తే
వెంటనే మీకు చెప్తాను అని
ఎంతో వినయం గా సమాధానం ఇచ్చింది.
*"" భూషణ్ చాలా సంతోష పడ్డారు నా కూతురు అంటే ఇలా ఉండాలి ఎంతో పద్ధతిగా....
నీ వినయం తెలివి సంస్కారం ఆ నడమంత్రపు సిరి తలకెక్కిన
శివరాం కొడుక్కి ఉండదు
అందుకే జాగర్త చెప్పాను
ఇంక వెళదామా అని
అడిగారు ఇందు సరే నాన్న గారు అని బుక్స్ పట్టుకుని
నిలుచుంది.
*"" భూషణ్ వంట గదిలో ఉన్న అతడి భార్య నీ ఎవే అని గట్టిగా ఒక కేకే పెట్టీ పిలిచాడు
*"ఆవిడ కూతురు కోసం లంచ్ బాక్స్ కట్టి గబగబా వచ్చి
వస్తున్న అండి ఇదిగో
అమ్మాయి లంచ్ రెడీ చేస్తున్న
అని అంటూ ఉంటే ఆయన
ఆవిడ పై కేకలు వేసి
ఇంట్లో ఇంటిడు పనివాళ్ళు ఉన్నారు ఆ మిడిల్ క్లాస్ వాళ్ళ బుద్ధులు మార్చుకోవా
నువ్వెందుకు వంట చేయడం
అని అరిచి అమ్మాయి కి
ఆలస్యం అవుతుంది అని
అరిచారు.
ఆవిడ విసుక్కుంటూ
ఎంత మంది పనివాళ్ళు
ఉంటే ఎంటి నా కూతురుకి
నేనే వండి పెట్టాలి అదే నాకు
తృప్తి. అని చెబుతూ ఇందు
తల నిమిరింది.
*"""సర్లే మేం వెళుతున్నాం
అని అక్కడి నుండి కదిలారు.
ఆయన వెనుక నలుగురు
కుర్రాళ్ళు ఉన్నారు భూషణ్ చుట్టు మనుషులు ఎప్పుడు ఉంటారు అంతా అయన్ని అన్నా అని పిలుస్తూ ఇంట్లో వారికి కాపలా ఉంటు చాలా పనులు ఇంకా పొలిటికల్ లీడర్స్ కి ఉపయోగ
పడే పనులు చేస్తూ
ఉంటారు భూషణ్
వ్యపరాలన్నిటి కి పెద్ద ఎత్తున వర్కర్స్ నీ ఏర్పాటు
చేసుకున్నాడు అయినా కూడా
తన చుట్టూ మనుషులు
కంపల్ సరి ఉండాలి.
ఆ విషయం ఇంట్లో అందరికి తెలుసు అందుకే ఎవరికి కొత్త అనిపించదు
ఇంటి నిండా వస్తాదులు
కనిపిస్తూ ఉంటారు ఇందు
మాత్రం చిరాకు పడుతూ
అమ్మ వంక చూసి అమ్మా నేను
వెళ్లి వస్తాను....
దేవి మాత ఆ అబ్బాయి నా కంట పడకుండా చూడు
లేదంటే నాకసలే టెన్షన్ అది చలాధు అని ఇంకో కొత్త టెన్షన్ అనుకుని బైటకు వెళ్లి కార్
ఎక్కింది.
*""" అమ్మాయి వెళ్తుంటే
ఆవిడ నవ్వుతూ
సాగనంపింది.
కార్ లో భూషణ్ ఆయన
కూతురు ఇంకో నలుగురు
కుర్రాళ్ళు ఉన్నారు వాళ్ళు
కాలేజ్ కి పయనం అయ్యారు. ఇందు కి తన తండ్రి నీ
అడగాలి అనిపిస్తుంది
వీళ్లంతా మనతో ఎందుకు
నాన్న గారు అని కానీ అంత
ధైర్యం ఆమేకెక్కడిధి
అందుకే లోలోపల తిట్టుకుంటూ సైలంట్ గా కూర్చుని ఉంది.
*"""
*"" మరో వైపు శివరాం కొడుకు
సిద్దు అతడికి ఎలాంటి భయం ఉండదు,
కోరి ప్రమాదాల తో ఎక్స్పరిమెంట్ చేస్తూ ఉంటాడు చాలా మొండి ఎవ్వరి మాట వినడు ఎదైనా కావాలి అనుకుంటే ఎంత వరకు అయినా వెళ్తాడు.
కానీ అప్పుడప్పుడు ఎదో వెలుగు
నిండిన రూపం అతడి కళ్ళ ముందుకి వచ్చి మాయం
అవుతూ ఉంటుంది.
*"" ఆ లైట్ అతడికి ఎదురైన
సమయం లో అతడికి
చెప్పలేని నీరసం వచ్చేస్తుంది అస్సలు కదల్లేని స్థితిలో ఉండిపోతాడు
కొన్ని నిముషాలు గడిస్తే
బెటర్ అవుతాడు
ఎదైనా ఫుడ్ తినగానే
పోయిన ఎనర్జీ వచ్చేస్తుంది మునుపటి కంటే ఎక్కువ శక్తి వంతుడు లా అయిపోతాడు
కానీ ఆ కాంతి అతడికి
ఎందుకు ఎదురవుతుంది
అసలు ఎంటా రూపం అనేది
అంతు పట్టని ప్రశ్న.
కానీ సిద్దు ఆ విషయం
పెద్దగా పట్టించు కోలేదు
ఇంట్లో వాళ్ళకి చెప్పినా అర్థం కాలేదు
కాకుంటే దాని వలన అతడికి ఎలాంటి హాని జరగడం లేదు
కావున వాళ్ళు భయపడటం లేదు. శివరాం మాత్రం కొడుకు కోసం పూజలు హోమాలు చేయిస్తూ ఉంటాడు కొడుకు
కుడి చేతి పై త్రిశూలం ఆకారం తో ఒక మచ్చ పుట్టినప్పటి నుంచి
ఉంది
అది చూసి అతడు
మహర్జాతకుడు అవుతాడు
అని పండితులు చెప్పారు
కాని సిద్దు కి ఆ గుర్తు
కనిపించడం ఇష్టం లేదు
అందుకే అది కవర్ అయ్యేట్టు
వాచ్ పెట్టుకుంటు
ఉంటాడు.
ఈరోజు అతడి కాలేజ్
జాయినింగ్.
శివరాం సిద్దు నీ పిలిచి
విషయం చెప్పాడు
రేయ్ సిద్దు నువ్వు ఇవ్వల
కాలేజ్ కి పోతున్నావు
ఆ భూషణం కూతురుని
అక్కడే జాయిన్ చేశాడట
వాడికి మనతోనే అంతా పోటీ
ఎంత పోటీ పడిన వాడి లేకి బుద్ధి ఎక్కడికి పోతుంది
నువ్వు మాత్రం వాడి కూతురు కంటే గొప్పగా ఉండాలి
చదువులో ఇంకా రేంజ్ లో
మంచి కాష్ట్లి కార్ తీసుకు పో అక్కడి ఫ్రెండ్స్ కి మంచిగా కర్చు చెయ్యి.....
నీకు ఎంత కావాలి అన్నా
తీసుకో... నీ ఎకౌంట్ లో డబ్బు ఉంటుంది
కావలసినంత గొడవ చెయ్
ఎక్కడా తగ్గకు అక్కడ
నిన్నెవరు ఏమి అనరు
ఈ శివరాం కొడుకు అంటే అందరూ భయ పడాలి నువ్వు
మన రేంజ్ కి తగ్గట్టు ఉండాలి
వాడి కూతురు కంటే నువ్వే గొప్ప అని అంతా అనుకోవాలి
చదువు లో హోదా లో నిన్ను
ఎవరు దాటలేరు అని
నువ్వు ఫ్రువ్ చేయి అని ఫుల్ ఫ్రీడమ్ ఇంకా కావలసినంత
డబ్బు ఇచ్చి పంపించాడు
శివరాం.
సిద్దు హ్యాపీ గా థాంక్స్ డాడ్ అని బైటకు వెళ్ళిపోయాడు.
*"" అయన భార్య కొడుక్కి
మంచి మాటలు చెప్పాల్సింది పోయి ఇలా రెచ్చకొడితే వాడు చెడిపోతాడు అండి
వాడికి అసలే తిక్క మొండి
ఎవరేం చెప్పినా వినడు
ఇప్పుడు మీరు ఆ అమ్మాయి కంటే తక్కువేం కాదు అని చెప్పడం కోసం ఇలా డబ్బు ఇచ్చి కార్ అని అక్కరలేని ఆడంబరాలు
అందిస్తే ఎలా అని అడ్డుకో
బోయింది అయన నవ్వుతూ
మనం లేని వాళ్ళం కాదు
కోట్లు ఉన్నాయి
వాడు ఎంత కర్చు చేసినా
తరగని అంత సంపాదించాను
కర్చు చేయని నాకేం దిగులు
లేదు ఆ భూషణం కూతురు ముందు నా కొడుకు రాజా అనిపించు కోవాలి అంతే
అని సీరియస్ గా
విషయం తేల్చి చెప్పారు
ఆవిడ ఇంకేం చేస్తాం అని ఊరుకుంది.
*""సిద్దు మంచి స్పోట్స్ కార్ తీసుకుని ఎంతో స్టైల్ గా
కాలేజ్ వైపు వెళుతూ డాడ్
చెప్పిన ఆ భూషణ్ కూతురు
ఎలా ఉంటుందో ఏమో గానీ
నాకు మరింత ఫ్రీడమ్ దొరికింది థాంక్స్ అనుకుని కాలేజ్ చేరుకున్నాడు.
*""
*" మొదటి రోజు కాలేజ్ లో
అడుగు పెట్టిన ఇందు
నాన్న గారు బై అని కార్ దిగి
చెప్పి ముందుకు కదిలింది.
ఆయన ఇంకో మారు జాగర్త
చెప్పి కార్ స్టార్ట్
చేయమన్నారు. ఆమె ముందుకు వెళ్ళిన ఎనిమిది సెకన్లు
తేడాలో అక్కడికి ఓ రెడ్ కాలర్ స్పొట్స్ కార్ వచ్చి ఆగింది.
*"" కార్ లో ఉన్న భూషణ్ ఆ కార్ వంక చూసారు
ఇందు అక్కడి అమ్మాయిల
మధ్య చేరి ముందుకు వెళ్లిపోయింది.
ఆ రెడ్ కార్ దిగిన వ్యక్తి నీ
చూసిన భూషణ్ కి ఎక్కడ లేని మంట రేగింది
కార్లో ఉన్న కుర్రాళ్ళు అన్నా....
గా శివరాం కొడుకు అన్నా...
ఓ తెగ స్టైల్ కొడుతుండు చుసినావా....
అబ్బో .. బచ్చగాని లెక్క
ఉంటాడు అనుకుంటే
హీరో లెక్కున్నాడు
అని ఒకడు నోరు జారితే
మిగిలిన వాళ్ళు
హే ఉర్కోవై ఎం ధిమాక్ గట్ల తిరిగింద ఎంది
అన్న ముంగట గట్లా వాగుడెంది అని కంట్రోల్ చేశారు
*" భూషణ్ మాత్రం సిద్దు నీ మిర్రి మిర్రీ చూస్తూ ఉంటే
డ్రైవర్ కార్ స్టార్ట్ చేసాడు
ఆ కార్ కి సిద్దు అడ్డం వచ్చి
వాళ్ళని కాస్త టెన్షన్ పెట్టాడు
డ్రైవర్ కంగారుగా సడన్ బ్రేక్
వేసి ఆపాడు
అంతే బూషన్ తల అదిరింది అక్కడ కుర్రాళ్ళు కంగారు
పడ్డారు.
సిద్దు ఎంతో మర్యాద గా కార్ డ్రైవర్ కి సారి అని చెబుతూ
ఉంటే అతడి వెనుక సీట్ లో ఉన్న భూషణ్ బుసలు కొడుతు కార్ దిగబోయాడు
ఆ కుర్రాళ్ళు కంగారుగా
అన్నా అన్నా మన ఇందుఅమ్మ
గీ దినమే కాలేజ్ లో జాయిన్ అయ్యింది
లొల్లి వద్దు అన్నా
ఇడిసెయ్ గా బచ్చా గాని సంగతి మేం చూసుకుంటాం లే
అని అపారు.
*""
సిద్దు వాళ్ళని సరిగా చూడలేదు అక్కడ వాళ్ళని పట్టించు
కోకుండా కాలేజ్ లోపలికి వెళ్ళిపోయాడు.
*" భూషణ్ కోపం పెంచుకోక
ముందే డ్రైవర్ కార్ స్టార్ట్
చేసాడు
వాళ్ళు కొంత దూరం వెళ్లేంత
వరకు భూషణ్ అదే మూడ్ లో ఉన్నాడు.
కొంత సమయం గడిచింది
భూషణ్ కి,,,
మేయర్ సరోజ కాల్ చేసింది
అతడు నార్మల్ మూడ్ కి వస్తూ చెప్పండి అమ్మ మీ ఫోన్ కొరకే చూస్తున్న అని వినయం గా అంటే ఆవిడ ఎదో ఇంపార్టెంట్
విషయం
మాట్లాడాలి ఆఫిస్ కి రండి
అని చెప్పి ఫోన్ పెట్టేసింది
*" భూషణ్ కి ఏమి అర్ధం కాలేదు ఈవిడ నేను అడిగిన కాంట్రాక్ట్ విషయం వదిలేసి ఇంకేదో ఇంపార్టెంట్ అని పిలుస్తుంది
ఎంటి విషయం అనుకుని
అటుగా పయనం
అయ్యాడు.
*"" సిద్దు కాలేజ్ లో ఎంటర్
అవుతూ ఉంటే అతడి స్టైల్ ఇంకా రెక్లెస్ చూసి కొందరు
ఆకర్షితులు అయ్యారు
అలాగే ఫ్రెండ్స్ అయ్యారు
నలుగురు కుర్రాళ్ళు అతడి
చుట్టు చేరి ఏ గ్రూప్ అని అడుగుతూ క్లాస్ రూం
చేరుకునే పనిలో పడ్డారు.
*""ఇందు... కూడా ఎంతో వినయం ఇంకా అందం గా అక్కడి
అందరినీ ఆకర్షిస్తూ ఉంది
ఆమెతో కూడా నలుగురు అమ్మాయిలు చేరారు
వాళ్ళు క్లాస్ కి వెళుతూ ఉంటే
వారి వెనకే సిద్దు అతడి ఫ్రెండ్స్ తో నడుస్తూ ఉన్నాడు.
*""చుట్టు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు సిద్దు చుట్టు చూస్తూ అక్కడ ఉన్న అమ్మాయిల
అందాన్ని గమనిస్తూ హు....
పర్లేదు కాలేజ్ లో కలర్స్ ఎక్కువగానే ఉన్నాయి
ఇంతకీ ఈ చితాకొక రంగుల
మధ్య ఆ భూషణ్ కూతురు
ఎక్కడ ఉంది ఎలా ఉందో
చూడాలి ఒకసారి కనిపిస్తే
థాంక్స్ చెప్పాలి నీ వల్లే నాకు చాలా ఫ్రీడమ్ దొరికింది అని
అనుకున్నాడు
*' అంతలో అతడి ఎదురుగా నడుస్తున్న అమ్మాయిలు కనిపించారు వాళ్ళ
మధ్య ఒక అమ్మాయి మెరూన్ కలర్ సల్వార్ వేసుకుని
వెనుక నుంచే
ఎంతో అందం గా కనిపిస్తూ పొడువాటి జడ అందమైన
నడుం మీద గా దిగి అటూ
ఇటూ కదులతు ఉంది
అమే నడకే అతడ్ని
ఆకర్షించింది....
అబ్బా ఎం నడుస్తుంది
ఆ నడుం ఇంకా బాగుంది
సిమ్రాన్ లా అందం అంతా
నడుం లోనే ఉంది
చాలా అందగత్తె అయి ఉంటుంది ఈ భామ అనుకుంటూ
అమే వెనకే నడవాలి అనిపించినట్టు నడుస్తూ
ఉన్నాడు.
Posts: 3,333
Threads: 159
Likes Received: 10,467 in 2,076 posts
Likes Given: 6,773
Joined: Nov 2018
Reputation:
734
*"" అంతలో అమే కాలి బంగారు పట్టి అక్కడ పడిపోయింది
అది అమే గమనించ లేదు
క్లాస్ ఆలస్యం అవుతుంది
అని తొందర లో
చూసుకోకుండా వెళ్లిపోయింది.
*" సిద్దు అమే అందమైన పాదం నుంచి జారుకున్న పట్ట గొలుసు అందుకుని హేయ్...
అని పిలిచాడు.
ఆ పిలుపు అమే చెవి వరకు చేరలేదు.
అమే వెళ్లిపోయింది
సిద్దు అమే వెళ్ళిన క్లాస్ వైపు వెళ్ళబోతూ ఉంటే
అతడితో ఉన్న కుర్రాళ్ళు
హేయ్ సిద్దు మనం వెళ్లాల్సింది అటు కాదు ఇటు మన క్లాస్ రూం ఇటు వైపు ఉంది
అని చెప్పి అతడ్ని వేరే దారి
వైపు తీసుకు వెళ్లారు.
*' సిద్దు కూడా క్లాస్ ఆలస్యం చేయడం ఎందుకు లంచ్ టైం లో అమ్మాయిని కలిసి ఇస్త అనుకుని
ఆ గొలుసు అతడి పాకెట్ లో వేసుకుని అతడి క్లాస్ కి వెళ్ళిపోయాడు.
*""సిద్దు క్లాస్ లో ఉన్నాడే గాని మనసంతా ఆ అందమైన
త్రాచు పాము లాంటి జాడ ఉన్న అమ్మాయి మీదే ఉంది.
ఆ అమ్మాయి బ్యాక్ సైడ్
అంత అందం గా ఉంది
మరీ ఫ్రంట్ ఎలా ఉందో
చూడాలి ఈ గొలుసు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తా ఆ బ్యూటి నీ ఫ్రంట్
నుంచి చూస్తా అని ఆలోచిస్తూ
ఉన్నాడు.
*""ఇందు క్లాస్ లో చాలా
ఇంట్రస్ట్ గా చదువుకుంటూ
ఉంది ఆమెకు భయం అనేదే
లేదూ చుట్టు చాలా మంది
ఉన్నారు గా అందుకే ఎంతో
అక్టీవ్ వా చదువుకుంటూ
ఉంది.
అయినా ఎక్కడో
మనసులో చిన్న కంగారు
అయితే ఉంది నాన్నగారు
చెప్పిన అబ్బాయి...
ఎక్కడ ఉన్నాడో ఏమో ఈ క్లాస్ రూం లో మాత్రం ఉండకూడదు
అని తన పక్కన కూర్చున్న అమ్మాయిలని అడిగింది
హేయ్ మన పక్కన అబ్బాయిలు కూర్చుని ఉన్నారు కదా
వాళ్ళు మన వైపు ఏమన్నా చూస్తున్నారా అని
వాళ్ళు ఆమె ప్రశ్నకి నవ్వుతూ
ఎంటి అలా అడుగుతావు
మన పక్కనే అబ్బాయిలు
ఉన్నారు బట్ ఎవరు మనల్ని చూడటం లేదు లెక్చలేర్ చెప్తున్న క్లాస్ వింటున్నారు
అయినా ఎందుకు అలా
అడుగావ్ ఎందుకు అలా తల దించుకుని కూర్చున్నావు మరీ
ఇంత సెన్సిటివ్ గా ఉంటే ఎలా
ఇది కో ఎడయుకేషన్ కాలేజ్
సో నువ్వు ఫ్రీగా ఉండాలి అని
ఆమె పక్కన కూర్చున్న ఒక అమ్మాయి చెబుతుంది
ఆమె పేరు శ్రావణి
ఇందు ఆమె వంక దిగులుగా చూస్తూ మా నాన్నగారికి మాట ఇచ్చాను అబ్బాయిల వంక చూడకుండా చదువుకుంట అని అందుకే ఇలా అని విషయం
చెబితే ఆమె నవ్వి ఇక్కడ మీ డాడ్ లేరు గా పైగా నిన్ననే మీ డాడ్ వచ్చి ఇక్కడి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు అంట నీతో మర్యాదగా నడుచుకోవాలి అని ఏమాత్రం మిస్టేక్ చేసిన కాళ్ళు చేతులు తీసేస్త అని సో ఎవరు నీతో మిస్ బిహేవ్ చేయరు లే అని నచ్చచెప్పిన
ఇందు బెరుకు గా కూర్చుని
క్లాస్ పూర్తి చేసింది
అక్కడి వారంతా లంచ్
చేసేందుకు కేంటీన్ కి వెళ్ళారు ఇందు ఆమె ఫ్రెండ్ తో కలిసి వెళ్ళింది అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్ ఓపిన్ చేసి తింటూ ఉంటే అక్కడి వాళ్ళు ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటూ ఉన్నారు.
*"సిద్దు తన మెరూన్ కలర్ సల్వార్ కోసం అక్కడంతా వెతుకుతూ ఉన్నాడు అతడితో ఉన్న
కుర్రాళ్ళు అడిగారు ఎంటి
విషయం అని అతడు నవ్వుతూ ఇందాకా ఒక మెరూన్ కలర్ సల్వార్ వేసుకుని అమ్మాయిని చూసాను ఆమె ఎక్కడ ఉందో చూసి పట్టుకోండి మీకు నైట్ ఫుల్ పార్టీ ఇస్తా అని
వాళ్ళు అమ్మాయి అనగానే
ఫుల్ జోష్ గా వెతకడం
మొదలు పెట్టారు.
*"మరో వైపు ఇందు భోజనం పూర్తి చేసి మళ్ళీ క్లాస్ అటెండ్ అయ్యే పనిలో ఉంది ఇప్పుడు ఆమె తో శ్రావణి ఒక్కర్తే ఉంది.
*"'"ఇందు అనుకుంటూ ఉంది ఈ శివరాం గారి అబ్బాయి నాకు కనిపించకుండా ఉంటే చాలు
అని అంతే సడన్ గా ఒక
అబ్బాయి ఆమెకి అడ్డం గా వచ్చి నిలుచున్నాడు
ఆమె అతడ్ని చూసి కంగారు
పడి తల దించుకుంది.
సిద్దు చాలా సేపు వెతుకుతూ
ఉన్న ఆమె కనిపించే సరికి
ఆయాస పడిపోతూ
ఆమెను ఎగా దిగా చూసి
వావ్ బలే ఉన్నావ్ అన్ని
వైపులా అందం నీ సొంతం అదిరిపోయావ్
.... బ్యూటీ నిన్ను ఎప్పటి నుంచి వెతుకుతున్నాను తెలుసా.... నీకో విషయం చెప్పాలి
అని ఆమెతో ఎంతో చనువుగా మాట్లాడాడు.
*"' అంతే ఆమె భయ పడిపోతూ తన పక్కన ఉన్న శ్రావణి వంక చూసింది
ఆమె భయం సంగతి
తెలుసుకున్న శ్రావణి సిద్దు పై సీరియస్ అవుతూ
హేయ్ మిష్టర్ ఏంటిది నన్నాఫ్ యూర్ బిజినెస్ అడ్డు తప్పుకో
అని సీరియస్ గా అతడ్ని
తప్పుకుని ఇందు నీ తీసుకుని వెళ్ళిపోతుంది.
*" సిద్దు కి షాక్ కొట్టినట్టు అయింది తను ఎంతో ఆశగా ఆమెతో మాట్లాడాలి అనుకుంటే ఆమె పక్కన ఉన్న అమ్మాయి ఇలా
అడ్డు పడటం ఆమె మాట్లాడకుండా తల దించుకుని వెళ్లిపోవడం
సిద్దు కి అస్సలు నచ్చలేదు
ఈ సిద్దు మాట్లాడుతూ ఉంటే
కాదు అంటూ వెళ్ళిపోతావా ఎంత పొగరు..... హు
ఎక్కడికి పోతావు
నానుంచి నిన్ను ఎవరు
తప్పించ లేరు ఫస్ట్ డే ఇంత
అందం నాకు ఎదురై నన్ను ఆ మాయలో
పడతోసి అంతలోనే
దూరం అయితే ఎలా నిన్ను వదలను గా
నీ పట్ట గొలుసు నా దగ్గర ఉంది అది నా చేత్తో నీకు
వేస్తా నిన్ను నా దాన్ని
చేసుకుంటా అంత వరకు నిధ్రపోను....
ఓ కాలికింది గొలుసు నీకు నా మనసు అలుసు
అని రైమింగ్ అందుకుని
పాడుతూ ఉంటే
అతడి ఫ్రెండ్స్ వచ్చి నవ్వుతూ అమ్మాయి దొరికిందా
మేం చూసంలే అంటూ
ఉన్నారు.
*" సిద్దు నవ్వుతూ
ఆమె ఎవరో ఏంటో తెలుసుకునే పని ఫ్రెండ్స్ కి అప్పచెప్పి
పంపించి ఆమె వెళ్ళిన వైపే వెళ్ళబోయాడు
కానీ అతడి వల్ల కాలేదు
ఎదో బలమైన గాలి వీచి
అతడ్ని దిశ మార్చింది
సిద్దు ఆ విసురు గా వీచిన
గాలికి అల్లంత దూరంలో
ఎగిరి పడ్డాడు
ఉన్నట్టుండి వీచిన గాలి కి అక్కడంతా చెల్లా చెదురు
అయ్యింది.
కొన్ని నిముషాలు అంతా గందరగోళం ప్రస్తుతం అంతా
నార్మల్ అయ్యింది
సిద్దు వంటి పై పడ్డ ధూళి
దులుపు కుంటు ఇదేం గాలి రా బాబు ఉన్నట్టుండి వీచింది
ఛ నా బ్యూటీ ఎటు పోయిందో ఎమో నా ఫ్రెండ్స్ అయితే వెళ్లారు గా తెలుసుకుంటారు లే
అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
*"""ఇందు చాలా భయ
పడిపోతూ ఏంటిది
శ్రావణి ఆ అబ్బాయి ఎవరు ఎందుకు నన్ను ఇబ్బంది
పెట్టాలి అని చూసాడు అలా మాట్లాడుతున్నాడు ఎంటి
ఓహ్ గాడ్ చాలా భయం
వేస్తుంది దేవి మాత ప్లీజ్ హెల్ప్ మీ అని అనుకుంటూ ఉంటే
*'శ్రావణి నవ్వుతూ ఏంటిది
ఇందు అబ్బాయిలు అన్నకా
ఇలాగే అల్లరి చేస్తూ ఉంటారు మనమే వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తు ఉండాలి ఇంత
భయస్తురాలివి ఎలా
బ్రతుకుతావో ఎమో
సరే రా ఆ అబ్బాయి
విషయం మరచిపోయి క్లాస్ కి వెళదాం
అని తీసుకు వెళ్ళింది.
*''ఇందు మాత్రం ఆ కుర్రాడి
చొరవ అమే వైపు చూసిన చూపులు మరచిపోలేక
భయం భయం గా గడిపింది.
*""ఇద్దరు ఓకే చోటికి చేరారు
కానీ కనిపించని అదృశ్య శక్తి వారిని అడ్డుకుంటూ వస్తుంది
కానీ వారి కలయిక కొరకు వేచి చూస్తున్న ఓ దైవ శక్తి వారిని కలపాలి అని చూస్తుంది
మరీ ముందు ముందు ఎం జరగనుంది కాస్త వేచి
చూడాలి ఫ్రెండ్స్ మీకు
ఈ అప్డేట్ ఎలా అనిపించింది తెలియ చేయండి నన్ను
ఆదరించే నా వారందరికీ ధన్యవాదాలు...
రచనకు లైకులు మరియు రేటింగ్ ఇవ్వండి
Posts: 3,333
Threads: 159
Likes Received: 10,467 in 2,076 posts
Likes Given: 6,773
Joined: Nov 2018
Reputation:
734
అప్డేట్లు ప్రతి గురువారం ఇస్తాను.
Posts: 3,333
Threads: 159
Likes Received: 10,467 in 2,076 posts
Likes Given: 6,773
Joined: Nov 2018
Reputation:
734
శక్తి ఆగమనం..3
*"" ఇందు...క్లాస్ రూం లో
ఉంది క్లాస్ అవుతుంది
కానీ ఆమె చాలా భయ
పడిపోతూ
ఉంది
క్లాస్ పూర్తి కాగానే బైటకు
వస్తూ ఇందు..... మళ్లీ అడిగింది
హేయ్ శ్రావణి...
ఆ అబ్బాయి ఎవరే....
ఎందుకు నాకు అడ్డం వచ్చాడు
మళ్లీ వస్తాడా....
ఓహ్ నో పెద్ద గొడవ అవుతుంది ఇంకాసేపట్లో నాన్న గారు మనుషులతో వస్తారు
ఆయన కంట ఆ అబ్బాయి
పడ్డాడే అనుకో చంపేస్తారు....
అసలు ఎవరే అతడు
కొంప తీసి ఆ శివరాం గారి అబ్బాయి అయితే కాదు గా
అతడే అయితే నాన్న గారు
అస్సలు ఊరుకోరు అని
ఆమె మట్టుకు ఎవేవేవో
మాట్లాడేస్తు ఉంటే...???
*""శ్రావణి ఆమెను కంట్రోల్ చేస్తూ
ఎం లేదు ఇందు ఇంక ఆ అబ్బాయి మన మధ్యకి రాడు చూడు
ఇక్కడ ఎక్కడ అతడు లేడు
గట్టిగా వార్నింగ్ ఇచ్చాను కదా.... అయినా నువ్వు ఇలా భయపడుతూ ఉంటే
ఎలా నాలుగేళ్లు కాలేజ్ లో
ఉండాలి అబ్బాయిలు
అన్నాక అల్లరి చేస్తారు మనం ఇజిగా తీసుకోవాలి..... తెలిసిందా..??
*" అయినా నేను విన్నాను మీ ఫాదర్ పెద్ద పారిశ్రామిక వేత్త అని పొలిటీషియన్స్ తో చాలా క్లోజ్ గా ఉంటారు అని సిటీ లో చాలా
మంది మీ నాన్నగారికి భయపడతారు అని.....
అలాంటి వారి అమ్మాయి
నువ్వు ఎంత స్ట్రాంగ్ గా
ఉండాలి....
అది మానేసి ఎవడో కుర్రాడు
వచ్చి టీజ్ చేశాడు అని భయ పడుతున్నావు ఇంక నీ మూడ్ మార్చుకో అని నచ్చచెప్పింది.....
*"" ఇందు ఆమె మాటలు విని దిగులుగా నువ్వన్నట్టు
నాకు భయం ఎక్కువే కానీ నా కారణం గా వెరవరికైన కష్టం
జరిగితే భయం కంటే
భాదే ఎక్కువ పడతాను
అందుకే అంటున్న ఆ అబ్బాయి మళ్లీ నాకు ఎదురు పడకూడదు అని నిట్టూరుస్తూ చెప్పింది
*"" ఇందు మనసు శ్రావణి కి అర్ధం అయింది అలాగే ఆమె కేరక్టర్ శ్రావణి కు బాగా నచ్చింది
ఒక్కరోజు లోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళు
అంతలో ఇందు కార్ వచ్చింది అందులో విచిత్రం గా ఇందు నాన్నగారు లేరు అతడి
మనుషులు లేరు కేవలం డ్రైవర్ మాత్రమే ఉన్నాడు.
ఇలా జరగడం ఫస్ట్ టైం...
ఆమె కోసం నాన్నగారు రాలేక
పోతే మనుషులని ఏర్పాటు చేస్తారు ఇలా వంటరిగా డ్రైవర్ నీ పంపరు ఆమె ఆశ్చర్యం గా
చూస్తూ ఉంటే శ్రావణి ఓకే
ఇందు రేపు కలుద్దాం బై
అంటూ వెళ్లిపోయింది.
*"" ఇందు కార్ దగ్గరకు
కంగారుగా వచ్చి యాధి ఏమైంది నువ్వు ఒక్కడివే వచ్చావ్ నాన్నగారు ఏరీ...
వెంట మనుషులు కూడా లేరు
అని కంగారుగా
అడుగుతుంటే...
"""యాది కార్ దిగి ఆమెకోసం
డోర్ ఓపెన్ చేసి..
అన్న మేయర్ కాడ ఉండారు ఇందమ్మ.... మీరు రండి ఆలస్యం అవుతాంది అని చెప్పి కార్ ఎక్కించాడు
ఇందు ఎదో గందరగోళం ఊహిస్తూ...నే కార్....ఎక్కి కూర్చుంది.
అతడు ఆమెను ఇంటికి తిరిగి తీసుకు వెళుతున్నాడు.
*"" సిద్దు దూరం నుండి చూసాడు ఇందు కార్ లో వెళ్ళడం...
అతడి ఫ్రెండ్స్ ఆమె డీటెయిల్స్ తీసుకు వచ్చే లోగా తానే తెలుసుకుంటే పోలా.....
అనుకుని
ఆమెనే ఫాలో చేస్తూ వెళ్లి ఆమె ఎవరో తెలుసుకుంటే బెటర్ అనుకుని ఆ కార్ వెనకే
అతడు కదిలాడు.
*"""
*"" కొన్ని గంటల ముందు
భూషణ్ మేయర్ సరోజ నీ కలిశాడు
అమే చెప్పిన మాటలు
విని షాక్ అయ్యాడు
అతడు అడిగిన కాంట్రాక్ట్
శివరాం కి ఇవ్వాల్సి వచ్చింది
అని అందుకు తను ఎం
చేయలేక పోయాను అని
చెప్పడం తో
భూషణ్ సీరియస్ అవతు
అదేంటి మేయరమ్మ.....
ముందు నుంచి ఈ కాంట్రాక్ట్ పై ఆ శివరాం కంటే నేనే ముందు
ఉన్నాను గా ..
పైగా వాడు ఈ కాంట్రాక్ట్ పై
ఇంట్రస్ట్ పెట్టలేదు గా
మరీ
మధ్యలో ఎక్కడి నుండి వచ్చాడు మీరెలా వాడికి కంట్రెక్ట్
ఇస్తున్నారు అని నిలదీశాడు....!!
*""""ఆవిడ భూషణ్ అంత సీరియస్ గా అడుగుతున్నా ఎంతో
తేలిక గా ఆన్సర్ చేసింది
చూడండి ఫణి భూషణ్ గారు
మీరు నాకు డబ్బులు
ఇచ్చారు అలాగే ఎంతో
రిక్వెస్ట్ చేశారు.......
నేను మీకు మాట ఇచ్చాను
కానీ మధ్యలో శివరాం
ఎంట్రీ ఇవ్వడం జరిగింది
అంటే అందుకు
కారణం
మినిష్టర్... హరిబాబు....
అంతా ఆయన వలనే జరిగింది.... నిజానికి నేను ఎమ్మెల్యే ఎంపి లకి ఈ మినిష్టర్ లకి
భయపడను...
వాళ్ళ కంటే నేను తక్కువేం
కాదు కానీ వీళ్ళకి
సపోర్ట్ సీఎం గారు ఉన్నారు.
*""మినిష్టర్ తో నేను వైరం పెట్టుకుంటే అతడికి
సన్నిహితుడు అయిన
సీఎం తో కోరి తగాదా పెత్తుకున్నట్టే....
మీరే చెప్పండి ఓ పాతిక కోట్ల కాంట్రాక్ట్ కోసం నేను అందులోనూ మహిళను సీఎం తో వైరం పెట్టుకోవడం అవసరం అంటారా.... త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి అందుకే మినిష్టర్ కి ఎదురు
వెళ్ళలేక పోయాను
ఈ కాంట్రాక్ట్ శివరాం కి
ఇచ్చేయాల్సి వచ్చింది
అందు వలన నాకు మినిష్టర్ తో అతడి ద్వారా సీఎం తో ప్లస్
శివరాం తో ఎలాంటి గొడవ ఉండదు.....
కాకుంటే మీకు ఇచ్చిన మాట నిలపెట్టుకో లేక పోయాను మన్నించాలి నెక్స్ట్ టైం
మీకు అవకాశం ఇస్తాను
అర్థం చేసుకుంటారు
అనుకుంటున్న
ఇదిగోండి మీరిచ్చిన డబ్బు
అని అతడి డబ్బు అతడి
మొహాన కొట్టినట్టు ఇచ్చి
అంతా చెప్పింది.
*"" అంతే భూషణ్ రగిలి పోతు ఎంటి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావ్
సీఎం మినిష్టర్ ఆ శివరాం వీళ్లకే నువ్వు భయ పడతావా....
అంటె ఈ భూషణ్ అంటే భయం లేదు అనేగా నేనేం చేయలేను అనేగా....
చేస్తా నేనేంటో నీకు అలాగే ఆ శివరాం కి తెలిసేలా
చేస్తా అని అక్కడి నుండి
వెనుతిరిగి వస్తుంటే....
*""అతడి మనుషులు మేయర్ కి
కోపం రాకుండా అన్న
పరేషాన్ లో ఉన్నాడు మాఫ్ చేయమని చెప్పి ముందుకు కదిలారు.
ఆవిడ వుష్ ఈ శివరాం టెన్షన్ తప్పింది అనుకుంటే
ఈ భూషణ్ టెన్షన్ స్టార్ట్
అయ్యింది అయినా
ఇతడెం చేయలేడు లే
అని ఊపిరి తీసుకుని
హమ్మయ్య అనుకుంది.
*"" నిజానికి
గవర్న్ మెంట్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అయ్యింది.....అందు కోసం
ఒక స్థలం చూస్తున్నారు
ప్రభుత్వం వారు.....
అంతా సక్రమం గా ఉంటే
కాంట్రాక్ట్ ఇస్తారు మంచి
ఉపయోగం ఉండే కాంట్రాక్ట్
కావడం తో
భూషణ్ ఆశ పడ్డాడు.
ఆ కాంట్రాక్ట్ మేయర్ చేతుల్లో
ఉంది.
భూషణ్ కి కొన్ని ఎకరాల
భూమి ఉంది దాన్ని
చూపించి
ఆ కాంట్రాక్ట్ తనకి ఇమ్మని
అడిగాడు కావలసినంత డబ్బు ఇస్తాను అని అడ్వాన్స్ కూడా ఆవిడకి ఇచ్చాడు
*""" ఆవిడ ముందు
నుండి ఈ కాంట్రాక్ట్ మీకు
ఇప్పిస్తా అని చెప్పి చివరిలో
శివరాం కి ఇచ్చింది
తనని
యదవ నీ
చేసింది అని కాదూ వాడు ఆ శివరాం తాను యదవ అయ్యేలా చేశాడు అని రగిలిపోతూ
ఉన్నాడు.
*"" భూషణ్ కి శివరాం తీసిన
దెబ్బ భరించ లేనట్టు ఉంది
అంతా పూర్తి అయ్యింది తన కూతురు
ఇందిరమ్మ పేరు పై పని ప్రారంభించాలి అనుకుంటే
నడిమిట్ల ఆ శివరాం
ఆ కాంట్రాక్ట్ గద్ధలా వచ్చి
తన్నుకు పోయాడు ఆడ్ని
విడిచి పెట్టేదే లేదు అని
ఎమ్మెల్యే శ్రీనివాసులుకి
ఫోన్
చేసి ఇక్కడ జరిగిన
సంఘటన చెప్పాడు
Posts: 3,333
Threads: 159
Likes Received: 10,467 in 2,076 posts
Likes Given: 6,773
Joined: Nov 2018
Reputation:
734
*" అతడు అర్థం చేసుకుని ఆ మినిష్టర్ సపోర్ట్ తో శివరాం రెచ్చిపోతున్నాడు
భూషణ్ నువ్వు ఆవేశ పడకు ముందు వచ్చి నన్ను కలువు
మనం మాట్లాడుకుందాం....
ఎం చేయాలి ఎలా ఆ శివరాం నీ దెబ్బ తియ్యాలి అన్నది ప్లాన్
చేద్దాం అని అతడ్ని అక్కడి
నుండి తన గెస్ట్ హౌస్ కి
పిలిపించి మంతనాలు
చేస్తూ
మందు మీద దృష్టి పెట్టారు
అంతా శివరాం పై రగిలిపోతూ
ప్లాన్ చేస్తున్నారు...
ప్రస్తుతం భూషణ్ తెలివి
లేనంత తాగాడు అంతలో
అతనికి
ఇందు విషయం
గుర్తు వచ్చింది....
టైం లేదు ఇవ్వాల్టి కి
డ్రైవర్ యాది నీ వెళ్ళమని
చెప్పి పంపించి.
అతడితో తన మనుషులని ఉండమని చెప్పాడు....!
*"" భూషణ్ అంటున్నాడు...
శ్రీనివాసులు....
ముందు ఆ హరిబాబు
సంగతి చూడాలి
వాడి పదవి వూడకొడితే
ఈ శివరాం రెక్కలు
రాలిపోతాయి అని అటుగా
ఎత్తు వేస్తు చెప్పాడు.
*"శ్రీనివాసులు కూడా
హరిబాబు పై నిప్పులు చేరుగుతు వీడికి పదవి రావడం
పట్టలేనట్టు గా ఉంది
అంతా వాడి ఇష్టానికి
చేస్తున్నాడు
నా పనులకు కూడా వాడు అడ్డు వస్తున్నాడు.
నిన్న మొన్నటి దాకా నన్ను
అన్నా అన్నా అని అనేవాడు
ఇప్పుడు పేరు పెట్టిపిలుస్తున్నాడు....
అంతా పదవి గర్వం.
*"" అందుకే అంటారు....
యదవలకి పదవలిచ్చిన
గుర్రానికి రెక్కలొచ్చి న
పట్టలెం.....!
అని...
ముందు వాడి పదవి ఊడకొట్టాలి
ఆ పదవి నీకు వచ్చేలా
చేయాలి అందుకు
నువ్వు కాస్త పైకం వదులుకోవాలి
ఎలాగూ ఎన్నికలు
రాబోతున్నాయ
అక్కడ చూసుకుందాం
వాళ్ళ సంగతి
ఏమంటావ్ భూషణ్ అని శ్రీనివాసులు అడిగాడు...?????
*'' భూషణ్ ఇంత వరకు పొలిటీషియన్ సపోర్ట్ తో
బిజినెస్లు రన్ చేస్తు వచ్చాడు
కానీ ఇప్పుడు
భూషణ్ కి పొలిటీషియన్
అవ్వమని సలహా
ఇచ్చాడు శ్రీనివాసులు.
అంతే తానే ఎమ్మెల్యే అయితే తనకున్న స్టేటస్ తో బ్యగ్రౌండ్ తో మినిస్ట్రీ కొట్టేయడం పెద్ద కష్టం
కాదు అప్పుడు
ఆ శివరాం ఎం
చేస్తాడో.... చూస్తాను
నన్ను చూసి ఎలా ఎడుస్తాడో
ఎంత కుల్లిపోతాడో
ఈ మేయరమ్మ నాకు
భయపడదట చూస్తాను
ఎలా భయ పడదో అని
వాళ్ళని తలచి నవ్వుకుంటూ.... శ్రీనివాసులు తో చేతులు
కలిపి నా ఎంత కర్చు అయినా నేను పెడతాను
ఎమ్మెల్యే కి నేను పోటీ చేస్తాను
ఆ హరిబాబు నాకు అడ్డు
వచ్చి శివరాం కి సాయం
చేసినందుకు అనుభవిస్తాడు...
నేను వాడి పదవి లాక్కుంట
అని అతడికి ఆపోజిట్ గా
పోటీ చేసేందుకు ఆమోదం
తెలిపాడు.
*"అంతే... శ్రీనివాసులు చక్రం తిప్పుతూ
పార్టీ అధిష్టానం తో
మీటింగ్ కి ఏర్పాట్లు
చేస్తున్నాడు.
*'భూషణ్ దగ్గర చాలా డబ్బు
ఉంది సో ఎలా అయినా
గెలుస్తాడు అందుకే పార్టీ టికెట్
ఈజీ గా వస్తుంది అని ధీమా
వ్యక్తం
చేశాడు..
వాళ్ళ ఆలోచన బైటకు
వెళ్లకుండా శ్రీనివాసులు
జాగర్తలు తీసుకుంటూ
ఉన్నాడు.
భూషణ్ కూడా సమయం
వచ్చే వరకు విషయం బైట
పెట్టను అని తను
రాజికియ్యాల్లోకి రాబోతున్నాడు అన్న విషయం ఇంట్లో వాళ్ళకి
కూడా చెప్పకూడదు అని
నిర్ణయం తీసుకుని అతడి మనుషులు తన మాట
జవదాటరని నమ్మకం తో
ఇంటికి తిరిగి వెళుతున్నాడు.
*""
*"" వాళ్ళకంటే ఒక అడుగు
ముందు ఉన్న శివరాం
కాంట్రాక్ట్ భూషణ్ కి కాకుండా చేశాను అని సంతోష పడుతూ హరిబాబు తో కలిసి పార్టీ చేసుకుంటూ ఉన్నాడు...
అలాగే దెబ్బ తిన్న భూషణ్
ఇప్పుడు ఎం చేయబోతున్నాడో
అని సందేహ పడుతూ వాడి
నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకునే పనిలో ఉన్నాడు శివరాం.
*"" యాది కార్ డ్రైవ్ చేస్తూ
ఉంటే ఇందు విండో నుంచి
బైట కి చూస్తూ....
త్వరగా ఇంటికి చేరుకుంటే
చాలు అని లోలోపల భయపడుతూ....
కూర్చుని ఉంది.
*""వాళ్ళని సిద్దు... తన కార్ తో ఫాలో చేస్తూ...వస్తున్నాడు...
కొంత దూరం వెళ్ళాక... ఎప్పటిలా.... సిద్దు...
ముందు కొన్ని సింటంస్
కనిపిస్తూ ఉన్నాయి...
అతడి చేతులు చమట పడుతుంటే....
కాళ్ళు వణుకుతూ
ఉన్నాయి... అతడికి
తెలుస్తుంది... ఆ లైట్.....
అతడి ముందుకు రాబోతుంది
అని సిద్దు కంగారుగా....
ఓహ్ నో.... ఇప్పుడా...
వద్దు ప్లీజ్....అని కార్ స్లో చేస్తున్నాడు
కానీ ఎదో తెలియని శక్తి...అక్కడంతా
అలుముకొని అతడికి
మార్గం కనిపించకుండా కమ్ముకుంది...!!
ఒక్కసారిగా సిద్దు కార్ స్టీరింగ్ వదిలేశాడు...
చివరిగా బ్రేక్ పై కాలు వేసి...
ముందుకు వెళుతున్న కార్ ఆపగలిగాడు
కానీ ఆ వెలుగు నుండి తప్పించు కోలెక పోయాడు...
కొన్ని క్షణాలు ఆ కాంతి
కిరణాలు సిద్దు నీ కవచం లా
చుట్టేసి..అతడిలో ఉన్న శక్తి
నంతా తీసుకున్నట్టు
చేసి అదృశ్యం అయ్యింది.
అంతే సిద్దు పూర్తి నిస్సత్తువ ఆవహించి నట్టు అయిపోయి
సొమ్మసిల్లి పడిపోయాడు.
*""ఇందు ఉన్న కార్ ముందుకు దూసుకు పోయింది.
ఒక ప్రదేశం కి చేరుకున్న వెంటనే
కార్ సడన్ గా ఆగిపోయింది.
ఉన్నట్టుండి కార్ ఆగిపోవడం
తో ఇందు భయం గా
ఉలిక్కి పడి ఏమైంది యాది ఎందుకు కార్ ఆపావ్ అని అడిగింది.
*""యాది ఏమి అర్ధం కానట్టు
చాలా సార్లు కార్ స్టార్ట్ చేసి
ఆ కార్ స్టార్ట్ అవ్వక ఇందమ్మా నాకు ఎం తెలియడం లేదు...
ఉండండి చూస్తాను
అని కార్ దిగాడు
*""ఇందు కి భయం
ఎక్కువయింది త్వరగా
యాది చీకటి పడింది
ఇంటికి వెళ్ళాలి అని
చెబుతూ ఉంటే
అతడు ఎంత అమ్మా
రెండు నిముషాలు అని చెప్తూ
కార్ బో నెట్ ఓపెన్ చేసాడు చూడబోతే రేడియేటర్ వేడెక్కి ఆవిర్లు వస్తున్నాయి
విచిత్రం గా కొత్త కారు
అందులోనూ అసలు ఎక్కువ వాడింది లేదు సర్వీసింగ్ చేయాల్సిన సమయం ఇంకా రాలేదు అలాంటిది
ఉన్నట్టుండి ఇలా పొగలు
రావడం ఎంటి అని చెక్ చేసి
వాటర్ పోస్తే సరిపోతుంది
అనుకుని ఇందుఅమ్మ
రెండు నిముషాలు ఇక్కడ
దగ్గర్లో వాటర్ ఉంటే తీసుకు వస్తాను మీరు కార్ లోనే
ఉండండి అని చెప్పి
ఆమె చెప్తున్న వినిపించు
కొకుండా వెళ్లిపోయాడు.
*" అంతే ఇందు గుండె
దడదడ కొట్టుకోవడం
మొదలైంది
చూస్తుంటే చుట్టు ప్రక్కల
ఎవరు లేనట్టు ఉంది
నిర్మానుష్య
ప్రదేశంలో ఆ కార్
ఆగింది
ఆమెకు ప్రాణం
వణికిపోతుంది....
ఎదో ప్రమాదం రాబోతుంది
అని అర్థం అవుతుంది....
ఆమె దేవి మాత స్తోత్రమ్
పటించాలి అని ప్రయత్నిస్తూ
ఉంది కానీ గొంతు పెగలడం
లేదు...
నోట మాట రావడం
లేదు చేతులు
వణుకుతుంటే
ఆమె పక్కన ఉన్న
బ్యాగ్ లో
మొబైల్ అందుకుని
తన
వాళ్ళ కి ఫోన్ చేయాలి
అనుకుంది కానీ
అందుకు
అవకాశం లేకుండా....
పోయింది.
Posts: 3,333
Threads: 159
Likes Received: 10,467 in 2,076 posts
Likes Given: 6,773
Joined: Nov 2018
Reputation:
734
*"" యాది వాటర్ పట్టుకుని వచ్చాడు అక్కడికి వచ్చి
చూడబోతే కార్ లో
అమ్మాయిగారు లేరు...
అతడికి కంగారు అనిపించింది.... ఇదేంటి ఇందమ్మ ఎక్కడికి
వెళ్లారు అని కంగారుగా
అక్కడంతా వెతుకుతూ...
ఉన్నాడు.
*"" స్పృహలో లేనట్టు
అయిపోయి ఉన్న సిద్దు కళ్ళ ముందుకు ఒక ఆకారం
హఠాత్ గా వచ్చి నిలుచుంది.
సిద్దు తుళ్ళి పడి చూసాడు చూడబోతే ఆమె ఒక హిజ్రా....
( ఫ్రెండ్స్ ఈ కథలో హిజ్రా గా
ఉన్న ఆమెకు చాలా
ఇంపార్టెన్స్ ఉంది
నేను వారిని గౌరవిస్తూ
వారికోసం ఒక పాత్రని
క్రియేట్ చేశాను
అంతా గమనించాలి
అని కోరుకుంటున్న)
*""ఎర్ర చీర కట్టుకుని
పసుపు పూసుకుని నుదిట సూర్యుని రూపం లో
కుంకుమ పెట్టుకుని
చూసేందుకు ఆది శక్తి
అవతారం అన్నట్టు
ప్రకాశిస్తూ కనిపిస్తుంది.....
ఆమెను చూసిన సిద్దు....
ఓపిక లేనట్టు ఎవరండీ
మీరు ఎం కావాలి అని అడిగాడు.
*"ఆమె తలపై ఒక కలశం
పెట్టుకుని ఉంది అక్కడికి
దగ్గరలో ఉన్న మావారి కి
అర్చన చేసేందుకు వెళ్తుంది
అని చెప్పి ఎంటి బిడ్డ ఇలా ఉన్నావు ఏమైంది అని
అతడి తల్లి అడిగినట్టు
అడిగింది...
సిద్దు నీరసం గా ఎం లేదు
అమ్మా ఎం జరిగిందో నాకే తెలియడం లేదు
ఇంక నీకే మి చేబుతను.....
అని అనడం తో
*""ఆమె నవ్వుతూ నువ్వు నాకేం చెప్పనవసరం లేదు
నీకు నువ్వు తెలుసుకుంటే
చాలు లే కానీ అందుకు
ఇంకా సమయం రాలేదు
ముందైతే నీ నీరసం
తొలగించుకో అని ఒక మట్టి
ప్రమిద లాంటి దానిలో ఆమె
తలపై ఉన్న కలశం లోని
పానకం పోసి...హు...
తాగు అని చెప్పింది.
*"" అస్సలు కదల్లేని పరిస్తితి లో సిద్దు ఉన్నాడు
ఆమె ఎవరో ఏంటో తెలియదు
కానీ మంచి ఆవిడలా
అనిపించి వద్దు అనకుండా
ఆ పానకం తాగాడు.
*" అంతే పోయిన ఎనర్జీ కి
వంద రెట్లు ఎక్కువ బలం
వచ్చినట్టు అనిపించింది
అతడు ఆశ్చర్య పోతూ
అమ్మా మీరెవరో గాని
సమయానికి ఈ సిరప్ ఇచ్చారు వావ్ నాకు నార్మల్ అయింది
అని అంటూ ఉంటే...
*"ఆమె నవ్వుతూ నీలో శక్తి కోల్పోవడం అంటే అదీ
తాత్కాలికం పోవలసింది
పోతేనే రావలసింది రాగలదు.... ఇప్పుడు ఈ శక్తి నీతో పాటు ఇంకొకరికి కూడా అవసరం
అని అర్థం కానట్టు
మాట్లాడుతూ ఉంటే
*"సిద్దు విసుగ్గా
నీ మాటలు నాకు అస్సలు అర్ధం కాలేదు కానీ థాంక్స్
ఇంక నేను వెళ్ళాలి నా బ్యూటీ ఎటుపోయిందో ఎమో అని ముందుకు వెళ్ళబోతూ ఉంటే.
*"" ఆమె కార్ కి అడ్డం వచ్చి
పొన్ను పోయినా వైపు
పోతున్నావు గాని నీ పయనం అటు కాదు బిడ్డ,
ఇటు మరలు అదే నీకు సరైన మార్గం పో ఇటేపు పో అని
యడమ వైపు చూపించి.
ఆమె చేతిలో ఉన్న కుంకుమ
అతడి నుదిట పెట్టింది.
*"" సిద్దు చాలా లేట్ అయ్యింది ఆమె కార్ వెళ్ళిపోయి
ఉంటుంది ఇంకెందుకు అటు పోవడం అని ఆవిడ చెప్పిన వైపు వెళ్తే తన ఇంటికి షార్ట్ కట్ అనుకుని అటు తిరిగి వెళుతున్నాడు...!!
*""ఆ హిజ్రా.... నవ్వుతూ....
నీ దిశ మార్చాలి అని వాడు చూస్తున్నాడు....
కానీ నీ కవచం అందుకు
అడ్డు పడింది.
నీ గమ్యం చేరేందుకు ఈ అమరావతి నీ అడ్డు పెట్టింది
ఆ శక్తి.....
బిడ్డా ఇంక వాడు ఏమి
చేయలేడు అంతా అమ్మ ఆశీర్వాదం అని గట్టిగా
నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
*"" సిద్దు విసుక్కుంటూ
అసలు నాకేం అవుతుంది
ఎందుకు నేను ఇలా తెలియని ఇమాజ్నేషన్ కి గురై పడిపోతున్నాను
ఒకవేళ షుగర్ లెవెల్స్ పడిపోతుంటే ఇలా జరుగుతుందా ఒకసారి డాక్టర్ నీ మీట్
అవుతా అని అనుకుంటూ
కార్ నడుపుతూ ఉంటే
కొంత దూరం లో ఎవరో
అమ్మాయి పరుగులు పెడుతూ రైల్వే ట్రాక్ వైపు
వెళుతున్నట్టు కనిపించింది.
*" అంతే సిద్దు కార్ స్పీడ్ పెంచి అటుగా వెళ్ళాడు
అక్కడ కార్ ఆపేసి అతడు
ఆ ట్రాక్ వైపు పరుగు
తీశాడు.
********"""""""""**********"""""""""""
*"" ఇందు కార్ లో ఉండగా ఆ చీకటి నీడ ఆమెను కమ్ముకుంటు
వచ్చింది అంతే ఇందు భయం తో కేక పెట్టింది...
అక్కడ ఎవరూ లేరు కానీ
ఎదో వింత సభ్ధం
భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి అంతే...
ఇందు భయం గా కార్ దిగి పరుగులు పెడుతూ ఉంది
ఆమె పరిస్తితి దారుణం గా
ఉంది చీకటి కంటే నల్లని నీడ
ఆమె ను వెంటాడుతూ
ఉంది ఇందు చుట్టు ప్రక్కల
ఎవరు లేకపోవడం వల్ల
ప్రాణాలు దక్కించు కోవడం
కోసం రోడ్ పై పరుగులు తీస్తు
ఉంది ఆ నీడ ఇందు నీ
తాకలేదు కానీ భయపెడుతూ వెంటాడుతూ ఉంది
అందుకే ఇందు పరుగులు
తీస్తూ రైల్వే ట్రాక్ వైపు
వచ్చింది
*""'ఆమెకు ఎం జరుగుతుంది
తాను ఎక్కడ ఉంది అర్థం కాలేదు వెంటాడుతున్న నీడ నుండి తప్పించు కోవాలి అదొక్కటే
ఆమె చేస్తుంది ఆ నీడ కూడా ఆమెను తరిమింది కేవలం
ఆమెను ప్రమాదం లో పడతోయాడానికే...
అటుగా వస్తున్న ట్రైన్ కింద
ఆమె పడబోతోంది.....
**""""***""""""**"""'"""***"""""""*****
*"" సిద్దు అనుకుంటూ ఉన్నాడు ఎవరో అమ్మాయి సూసైడ్
చేసుకునే ప్రయత్నం చేస్తుంది అనుకుని ఎంతో వేగం గా
వెళ్లి క్షణం లో ఆమె చేయి అందుకుని పక్కకి లాగేసాడు.
*" అతడు క్షణం ఆలస్యం చేస్తే
ఆమె ట్రైన్ కింద పడి ముక్కలు ముక్కలు అయిపోయేది.....
అంత వరకు ఆమెను
వెంటాడిన నీడ అక్కడికి
సిద్దు రావడం తో మాయం అయ్యింది....
*' సిద్దు చేయి అందుకున్న
ఇందు కెవ్వున కేకే పెట్టీ
స్పృహ కోల్పోయింది....
*"అంతే అక్కడి దృశ్యం చూసి సిద్దు షాక్ అయ్యాడు
తాను ఎవరికోసం అయితే
వెతుకుతూ ఉన్నాడో ఆమె
తానుగా ట్రైన్ కింద పడబొయింది కాస్త అతడు ఆలస్యం చేసి
ఉంటే ఓహ్ గాడ్ సిద్దు వళ్లు జలదరించింది.
*"" ఆమె చేయి ఇంకా అతడి
చేతిని బిగించి పట్టుకునే
ఉంది.
ఆమెను అతడు చుట్టుకుని ఉన్నాడు
అమే గుండె వేగం అతడికి తెలుస్తుంది...
ఎదో తెలియని అనుభూతి
ఎన్నో ఏళ్ల యడబాటు తొలగిపోయిన భావన
కలిగింది.
అలాగే ఆమెలో స్పృహ లేదు.... చాలా భయపడింది
అందుకే వళ్లంతా
చల్లబడి ఉంది
సిద్దు కి ఎలా అర్థం
చేసుకోవాలో తెలియడం
లేదు కాసేపటి క్రితం కాలేజ్
నుండి బైలుదేరిన అమ్మాయి
ఇలా సూసైడ్ చేసుకోవాలి
అని ఎందుకు అనుకుంది
అని ప్రశ్నించుకుంటూ.....
ఆమెను
ఎత్తుకుని తన కార్ వరకు
తెచ్చి
కార్ లో పడుకో పెట్టీ
ఆమెను తడుతు పిలుస్తూ
ఉన్నాడు,,
అతడికి ఆమె పేరు తెలియదు అందుకే హేయ్.... బ్యూటీ...
ఏ బ్యూటీ... కళ్ళు తెరవ
ఏమైంది నీకు
ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నావ్ అని అతడు
ఎంత పిలిచిన ఇందు పలక లేదూ ఆమెకు మెలుకవ
రాకపోయే సరికి అతడికి
కాస్త భయం వేసింది
ఎం చేయాలి అని తన
మనుషులకి కాల్ చేయ
బోయాడు.
*"" అంతలో అటుగా
యాది కార్ తో వచ్చాడు
అతడు సిద్దు కార్ అక్కడ
ఆగి ఉండటం చూసి సందేహం గా అక్కడికి వచ్చి చూసాడు
చూడబోతే ఆ కార్ లో ఇందుమ్మ ఉంది అతడు సిద్దు తో
గొడవ కి దిగబొయాడు....
సిద్దు ఊరుకుంటాడా....
గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆమె
ట్రైన్ కి అడ్డం వెళ్ళబోయింది
అని ఎందుకో భయపడింది
అని చెప్పాడు
తాను రాకుంటే ఆమె చనిపోయి ఉండేది అని చెప్పడం తో
యాది కి విషయం అర్ధం
అయింది ఇందమ్మా....
ఇలాంటి ప్రమాదాల్లో చాలా
సార్లు పడింది అంటే
ఈ అబ్బాయి నిజమే చెబుతున్నాడు శివరాం కొడుకు ఇంధమ్మ నీ కాపాడాడు
అనుకుని అతడికి
క్షమాపణ చెప్పి అతడి సాయం తో అమ్మాయిగారిని కార్ లో ఎక్కించుకుని
ముందుకు కదిలాడు.
*" సిద్దు అయోమయం గా
తన కళ్ళ ముందు అసలు ఎం జరిగిందో అర్థం కాక చూస్తూ ఉండిపోయాడు.
ఇందు కి తనని సిద్దు సేవ్
చేశాడు అని తెలియదు
ఆ డ్రైవర్ కూడా ఇందు కి
జరిగింది చెప్పాలి అనుకొలేదూ.
*"" మార్గం మధ్యలో ఇంటికి మెళుకువ వచ్చింది ఆమె అయోమయం గా చూస్తూ
ఉంటే అంతలో ఆమె ఇల్లు చేరుకుంది.
*"చూడబోతే తాను కార్ లో
ఉంది అంతా నార్మల్ గా ఉంది. ఆమె కంగారుగా యాది నాకు ఏమైంది నేను కార్లో కి ఎలా వచ్చాను అని కంగారు గా
అడిగింది..??
*" యాది తడబడకుండా మీరు కార్లోనే ఉన్నారు గా మరీ
ఎలా వచ్చాను అంటారు
ఎంటి అమ్మ నేను నీళ్లకోసం
వెళ్లి వచ్చాను చూడబోతే మీరు నిద్రపోతూ ఉన్నారు
మిమ్మల్ని డిస్ట్రబ్ చేయడం
ఎందుకు అని నెమ్మదిగా కార్ నడుపుకుంటూ వచ్చాను
అని అభద్ధం చెప్పాడు.
*""ఇందు కంగారుగా చుట్టు చూసి లేదు నన్ను ఎవరో తరిమారు
నేను భయం తో పరుగులు పెట్టాను అక్కడ
వేగం గా ట్రైన్ వస్తుంది
అంతలో ఎవరో నా చేయి
పట్టుకుని లాగారు అని
అంటూ ఉంటే యాది కి అర్థం
అయ్యింది
అతడు చెప్పింది
అంతా నిజమే అని
కానీ ఆమె భయ పడుతుంది
అని అలాంటిది ఏమి లేదు
అని మీరు కల కనీ ఉంటారు
అని అబద్ధం చెప్పాడు.
*" అంతే ఇందు షాక్ అయ్యి అవునా నిజంగా నేను కల
కన్నానా యాది నువ్వు అబద్ధం చెప్పడం లేదు గా
నాకు భయం వేస్తుంది
నేను చెబుతుంది నిజం
అయితే ఇంక కాలేజ్ కి కాదు
కదా ఇంట్లో నుంచి బైటికే
వెళ్ళను అని అనింది
*" అంతే యాది ఫిక్స్ అయిపోయాడు
ఇంధమ్మా నేను జరిగింది అంతా నిజం అని చెబితే
కాలేజ్ కి వెళ్ళడం మానేస్తారు
అన్న నన్ను చావకొడతాడు అమ్మాయిని వంటరిగా ఎందుకు వదిలేసావు అని
అందుకే ఆలోచించి
నేను చెప్పింది నిజం అమ్మ
మీరేం కంగారు పడకండి
అంతా మీ బ్రమ అని
నచ్చచెప్పాడు.
ఇందు యాది అంత కచ్చితం గా చెప్పడం తో మౌనం వహించింది నమ్మలేని దృశ్యం ఇంకా కళ్ళముందు మెదులుతూనే
ఉంది కానీ యాది అది
స్వప్నం అనడం తో ఎటు తేల్చుకోలేక ఇంటిలోపలికి
వెళ్ళింది ఇందూ.
*" ఆమె రావడం చూసి
శారదాంబ హమ్మయ్య
వచ్చేసవా
ఎందుకు ఇంత ఆలస్యం
అయ్యింది నీతో నాన్నగారు రాలేదా...???
అని అడిగి ఎప్పటిలా
అమ్మాయికి దిష్టి తీసి
అవతల పడేసి ఫ్రెష్ అయి
రమ్మని చెప్పింది.
ఇందు గదిలోకి వెళ్లి అక్కడ
ఉన్న దేవి ప్రతిమ కి
నమస్కరించి అమ్మా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది
నేను ఎం పాపం చేశాను
అంతా కలలా ఉంది
కానీ కాదు అనిపిస్తుంది
నన్ను తరిమింది ఎంటి
ఎందుకు వెంటాడుతుంది
నన్ను రక్షించింది ఎవరు...???
ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ
వేదన పడాలి ఇప్పుడు
జరిగింది అమ్మకి చెబితే
తను కంగారు పడుతుంది
అందుకే నేను అమ్మ తో ఏమి చెప్పను అనుకుని....
స్నానం చేసేందుకు డ్రెస్
రిమూవ్ చేయబోయిన
ఆమె చేతి గాజుల కి చిక్కున్న
ఒక వస్తువు కనిపించింది.
అది త్రిశూలం ఆకారం లో
ఉన్న లాకెట్ అది సిద్దు చేతికి
ఉన్న బ్రెస్లెట్ కి హేంగ్ అయి ఉంటుంది
సిద్దు తనకి వద్దు అని
ఎంత చెప్పినా దక్ష్యాయిని
అదే సిద్దు వాళ్ళ అమ్మ కుంకుమార్చన జరిపించి
ఆ బ్రేస్లెట్ తొడిగింది
ఇప్పుడు ఆ త్రిశూలం ఇందు
చేతికి చేరింది.....
ఆమె ఆ లాకెట్ ఆశ్చర్యం గా చూస్తూ ఇదెక్కడి నుండి వచ్చింది...
అని ఆలోచిస్తూ అంతలోనే
ఆనంద పడిపోతూ
ఆ దేవి మాత నాకోసం
ఇచ్చింది నేను ఎక్కువ
భయ పడుతున్నా కదా
అందుకని అని
అనుకుంటూ గబగబా స్నానం
చేసి బట్టలు వేసుకుని
ఆ త్రిశూలం లాకెట్ పూజ
గదిలో ఉన్న అమ్మవారి దగ్గర
పెట్టి తిరిగి తీసుకుని ఒక
ఎర్రని దారానికి దాన్ని
ఎక్కించి మెడలో కట్టుకుంది.
Posts: 3,333
Threads: 159
Likes Received: 10,467 in 2,076 posts
Likes Given: 6,773
Joined: Nov 2018
Reputation:
734
*" ఆమెకు ఎంతో ధైర్యం వచ్చినట్టు అనిపించింది
మనసు ప్రశాంతం గా ఉంది అమ్మవారి కుంకుమ
పెట్టుకుని థాంక్స్ దేవి మాత
అని అనుకుని హుషారు గా
వచ్చి అమ్మ వాళ్ళతో భోజనం చేస్తుంది
అప్పుడు వచ్చారు
ఆమె తండ్రి
ఆయన కూతురు దగ్గరకు
ప్రేమగా వచ్చి అమ్మా సారి రా
నాకు వేరే పనుల వలన నీ
దగ్గరకు రాలేక పోయాను
నీకేం ఇబ్బంది కలుగ లేదు గా
అని అడుగుతుంటే
ఆమె జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ
అదంతా నాన్నగారి కి చెప్పడం ఎందుకు అని ఏమి లేదు
నాన్నా నేను ఎంతో ధైర్యం గా ఉన్నాను ఇదిగో ఈ లాకెట్ నాకు దేవి మాత ఇచ్చారు దీన్ని వేసుకున్నాక ఇంకా ధైర్యం
వచ్చింది అని చెబుతూ
ఉంటే అయన నవ్వుతూ
ఆ లాకెట్ కోసం పెద్దగా పట్టించు కోకుండా
అయన టెన్షన్ ఏవో ఆయన పడుతూ అమ్మాయికి
పాలన్నం కాకుండా కాస్త కారం అలవాటు చేయ్యవే....
చూడు నా బిడ్డ ఎంత సుకుమారం గా ఉందో అని చెబుతూ
వెళ్లారు.
ఇందు వైపు ఆవిడ నవ్వుతూ
చూసి నువ్వింకా చిన్న పాపాయి కాదు పాలాన్నం తినడానికి
కాస్త కారం ఉన్న కూరలు
తింటూ ఉండు నాన్నగారు
చెప్పారు గా అని మందలించింది.
*" అయినా ఇందు తన వల్ల కాదు అని తప్పదు అంటే ఎప్పుడైనా తింటాలే ఇప్పటికీ ఈ పాలు కలుపుకుని తింటా అని గబగబా తినేసి గదిలోకి వెళ్ళిపోయింది.
దీని బట్టే మీకు అర్థం అయి ఉండాలి ఆమె ఎంత సెన్సిటివ్ గా ఉంటుందో..!
*"" ఇందు రాత్రంతా ఎంతో
ప్రశాంతం గా నిద్రపోయింది.
కానీ సిద్దు కి నిద్ర లేకుండా పోయింది...
తాను ఎదుర్కున్న సన్నివేశం మరచిపోలేక పోతున్నాడు
చేతిలో ఆమె కాలి గొలుసు పట్టుకుని చూసుకుంటూ
ఉన్నాడు.
ఆమె కావాలి అనుకుని
ఆమెను చేరుకోవాలి
అనుకున్నాడు అక్కడ
ఆమె చావు అంచులు దాకా వెళ్ళింది ఎందుకు అసలు ఎం జరిగింది అమే ఎవరు... అని ఆలోచిస్తూ ఫుల్ గా బీర్ తాగి పడిపోయాడు
రాత్రి రెండు గంటల సమయం లో అతడి ఫ్రెండ్స్ కాల్ చేశారు
సిద్దు మత్తుగా ఇప్పుడేవరు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు చూడబోతే అతడి ఫ్రెండ్ ఏంట్రా ఈ టైం లో అని విసుగ్గా అడిగాడు సిద్దు...
వాళ్ళు ఆ అమ్మాయి గురుంచి తెలుసుకున్నాం అని నీతో చెప్పాలి అని కాల్ చేశాం అనడం తో
సిద్ధ అటెన్షన్ లోకి వచ్చి
ఎవరా అమ్మాయి త్వరగా చెప్పండి అని అడిగాడు
వాళ్ళు చెప్పింది వినగానే
సిద్దు తాగింది మొత్తం దిగిపోయింది....
వాట్ అని గట్టిగా అరిచి
బిగుసుకు పోయాడు....!!!
మరీ ఇప్పుడు సిద్దు కి అసలు
నిజం తెలిసిందా అలా అయితే ఇందు నీ దూరం పెడతాడా...???
ఇందు కి తనని సిద్దు కాపాడాడు అని తెలుస్తుందా
తెలిస్తే ఎలా రియాక్షన్
ఇస్తుంది అసలు వీళ్ళ జీవితం లో జరుగుతున్న సంఘటనలు వెనుక కారణం ఎంటి తెలియాలి అంటే కాస్త వేచి చూడాలి
ఫ్రెండ్స్ ఈ అప్డేట్ ఎలా అనిపించింది తెలియ
చేయండి నన్ను
ఆదరించే నా వారందరికీ ధన్యవాదాలు.
రచనకు లైకులు/ రేటింగ్ ఇవ్వండి
Posts: 3,333
Threads: 159
Likes Received: 10,467 in 2,076 posts
Likes Given: 6,773
Joined: Nov 2018
Reputation:
734
పొగమంచుల్లో ప్రకృతి అందాలు
పచ్చటి పైరుల్లో పుడమి పులకరింతలు
ఇవి మన సంక్రాంతి కాంతులు..
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 2026
|