10-11-2020, 02:18 PM
EXCELLENT AND GOOD UPDATE
Thriller బ్లాక్ రోస్
|
10-11-2020, 10:01 PM
10-11-2020, 10:01 PM
11-11-2020, 08:18 AM
కీర్తి నుంచి ఫోన్ రాగానే అరుణ్ తన టీం నీ కీర్తి సెక్యూరిటీ అధికారి గెస్ట్ హౌస్ లో జాగ్రత్తగా ఉంచమని చెప్పి తను నెక్స్ట్ ఫ్లయిట్ లో బెంగళూరు వస్తున్నా అని చెప్పాడు దాంతో వాళ్లు కీర్తి నీ తీసుకోని సెక్యూరిటీ అధికారి గెస్ట్ హౌస్ కీ వెళ్లారు అక్కడ కీర్తి కొంచెం ఫ్రెష్ అయి పడుకుంది అప్పటికే ఉరుములు, మెరుపుల తో వర్షం మొదలైంది అప్పుడు అరుణ్, కీర్తి కోసం భోజనం తెచ్చి సర్వ్ చేయమని చెప్పాడు కీర్తి భోజనం చేస్తున్న సమయంలో అరుణ్ కూడా అదే డైనింగ్ టేబుల్ లో కీర్తి కీ ఎదురుగా కూర్చుని వీడియో కెమెరా పెట్టి "ఇప్పుడు చెప్పండి ఆ రోజు అవినాష్ శవం ఉన్న సూట్కేస్ నీ నా కార్ లో ఎందుకు పెట్టావు ఎవరూ పెట్టమని" చెప్పారు అని అడిగాడు దాంతో కీర్తి భయం తో గ్లాస్ నీలు తాగుతూ భయం తో కింద పడేసింది ఆ తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకుని "విన్ నాతో ఈ పని చేయించాడు సార్" అని చెప్పింది దాంతో అరుణ్ షాక్ అయ్యి "ఎవరూ ఆ కాఫీ షాప్ ఓనర్ వినయ్ ఆ" అని అడిగాడు అప్పుడు కీర్తి భయం తో అవును అని తల ఆడించింది అప్పుడు సడన్ గా కరెంట్ పోయింది ఉరుముల శబ్దం కీ కీర్తి ఉలిక్కిపడ్డింది అప్పుడు అరుణ్ జనరేటర్ వేయమని చెప్పాడు అప్పుడు ఇంట్లోకి ఏదో పొగ వచ్చింది ఏంటి అని చూస్తే అది స్మొక్ బాంబ్ ఆ పొగ నుంచి ఒక రూపం నడచుకుంటు వచ్చినట్లు కనిపించింది.
"Twinkle Twinkle little star How do you escaped from my trap Your tounge just tell the truth My hand just know to cut the throats Twinkle Twinkle little star Just go and rest with the star's" (ఈ డైలాగ్ నీ బేస్ వాయిస్ లో ఒక horror మ్యూజిక్ తో ఊహించుకోని కామెంట్ చేయండి ఎలా ఉందో) అలా ఒక రైమ్ వినిపిస్తే అరుణ్ చీకటి లో ఆ పొగ లో గన్ తో కాల్చాడు అప్పుడు ఎవరో బుల్లెట్ తగిలి కింద పడి ఉంటే వెళ్లి చూశాడు అక్కడ తన టీం లో ఇద్దరికి బుల్లెట్ లు తగ్గిలాయి అరుణ్ కాల్చినప్పుడు అప్పుడు పొగ మొత్తం పోయిన తర్వాత చూస్తే కెమెరా లేదు ఎదురుగా కీర్తి అలాగే కుర్చీ లో ఉలుకూపలుకూ లేకుండా ఉంది దగ్గరికి వెళ్లి చూస్తే తన పీక తెగి పడి ఉంది తన చేతిలో ఒక పాకెట్ నైఫ్ ఉంది. తన ముందే సాక్ష్యం నీ చంపేసాడు అన్న కోపంతో అరుణ్ విన్ షాప్ కీ వెళ్లాడు కానీ విన్ అక్కడ లేడు వర్ష నీ అడిగితే తనకు తెలియదు అని చెప్పింది అక్కడ ఉన్న విన్ స్టాఫ్ నీ అడిగితే వాళ్లకు తెలియదు అని చెప్పారు దాంతో వాడి ఇళ్లు చూపించమని బలవంతంగా ఒకడి నీ సెక్యూరిటీ అధికారి జీప్ లో వేసుకొని తీసుకోని వెళ్లాడు అక్కడికి వెళ్లి చూస్తే విన్ మాల లో ఉండి ఇంట్లో పూజలు చేస్తూ ఉన్నాడు దాంతో అరుణ్ విన్ నీ కొట్టి అలాగే లాకుని వెళ్లాడు షర్ట్ లేకుండా అలాగే లాగి సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ తీసుకుని వెళ్లారు అక్కడ విన్ నీ పడేసి కొడుతున్నారు అప్పుడే వర్ష, సుధాకర్ ఇద్దరు లాయర్ నీ, కమిషనర్ నీ తీసుకోని వచ్చారు అప్పుడు కమిషనర్ అరుణ్ ఆపి తిట్టాడు మాల లో ఉన్న వ్యక్తి నీ కొట్టినందుకు పైగా అందరి ముందు షర్ట్ కూడా లేకుండా తీసుకోని వచ్చాడు అని దానికి అరుణ్ "సార్ మీరు వాడి స్వాతిముత్యం యాక్టింగ్ చూసి మోసపోవదు వాడు అభినయచక్రవర్తి ఏ పాత్ర లో అయిన చాలా తేలికగా దూరి పోతాడు నా ముందే ఒక అమ్మాయిని చంపి వెళ్లాడు" అని చెప్పాడు దానికి కమిషనర్ ప్రూఫ్ ఉందా అని అడిగాడు దానికి అరుణ్ లేదు అని తల ఆడించాడు దాంతో కమిషనర్ విన్ నీ వదిలేయమని ఆర్డర్ చేశాడు వేరే దారి లేక అరుణ్ విన్ నీ వదిలేశాడు, ఇంటికి వెళ్లుతున్న విన్ అరుణ్ వైపు చూసి "సార్ మీ ఆవేశం మీ ముందు సమాధానం ఉన్న కనపడకుండా చేస్తోంది కాబట్టి ప్రశాంతంగా ఆలోచించండి నను ఏమీ తెలియదు సార్ ఈ నాలుగు హత్యలు నేను చేయలేదు సార్ దయచేసి నను వదిలేయండి మా అమ్మ నాన్న కు నేను ఒక్కడినే వాళ్ళని చూసుకోవాలి ప్లీజ్" అని చేతులు జోడించి వేడుకున్నాడు, విన్ వెళ్లిన తర్వాత కమిషనర్ అరుణ్ కీ అతని సస్పెండ్ ఆర్డర్ చూపించాడు దానికి అరుణ్ ఏదో చెప్పబోతుంటే "నేను ఏమీ చేయలేని పరిస్థితి నీ గురించి నాకూ తెలుసు కానీ ఒక అమాయకుని ఇలా చేస్తే రేపు హ్యూమన్ రైట్స్ కమిటీ వాళ్లు మనల్ని క్వశ్చన్ చేస్తారు నీకు ఈ కేసు లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చా కానీ నీ ఆవేశం కోపం నీను ఓటమి పాలు చేస్తోంది కాబట్టి రెండు వారాల పాటు ప్రశాంతంగా నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లిరా అసలు నాలుగు నెలలు అయింది నువ్వు తనని చూసి" అని చెప్పాడు దాంతో అరుణ్ తన ఫోన్ లో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూసి కొంచెం నవ్వి సస్పెండ్ ఆర్డర్ తీసుకోని కొచ్చి బయలుదేరాడు. (మరుసటి రోజు ఉదయం RAW హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ) తన క్యాబిన్ లో కూర్చుని న్యూస్ చూస్తూ ఉన్నాడు RAW జాయింట్ సెక్రటరీ రవీంద్ర సింగ్ అందులో లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా అబ్దుల్ ఖాదర్ కీ నాలుగు రోజులో ఉరి శిక్ష విధించింది సుప్రీంకోర్టు ఈ న్యూస్ చూస్తూ ఉన్నపుడు తన అసిస్టెంట్ కబీర్ వచ్చి ఇంకో న్యూస్ చానెల్ పెట్టాడు అందులో కీర్తి చనిపోయిన న్యూస్ వచ్చింది అది చూసి కబీర్ మొహం నిండా చెమటలు పట్టాయి కానీ రవీంద్ర మొహం లో ఎలాంటి మార్పు లేదు అప్పుడు కబీర్ "సార్ మౌలానా నీ చంపడానికి మనం పంపిన బెస్ట్ ఏజెంట్ ఈ అమ్మాయి ఇప్పుడు తనే ప్రాణాలతో లేదు మౌలానా కీ ఉరి శిక్ష అమలు చేశారు ఎలా సార్" అని అడిగాడు దానికి రవీంద్ర "మంచిదే కదా మనకు కొంచెం పని తగ్గింది కీర్తి ఫైల్ తీసుకోని రా తన ఫ్యామిలీ కీ రావాల్సిన అని సెటిల్ మెంట్స్ పక్కగా ఉండాలి" అని చెప్పి పంపించాడు కానీ కోపం తో తన టేబుల్ పైన ఉన్న ల్యాండ్ ఫోన్ నీ పగలగొట్టి కోపం తీర్చుకున్నాడు. (బెంగళూరు) విన్ తన దెబ్బకు మందు వేసుకుంటు న్యూస్ చూస్తూ ఉన్నాడు అందులో మౌలానా ఉరి శిక్ష గురించి వార్తలు పదే పదే చూపిస్తూ ఉన్నారు అప్పుడే ఒక ఫోన్ వచ్చింది అందులో ప్రైవేట్ నెంబర్ అని వచ్చింది దాని తీస్తే "హలో డబ్బు తీసుకుని రెండు నెలలు అయ్యింది మా భాయ్ ఎప్పుడు బయటికి వస్తాడు" అని అడిగాడు దానికి విన్ "నాలుగు రోజుల టైమ్ ఉంది" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. అక్కడ కొచ్చి లో ఉన్న అరుణ్ కీ కోపం కంట్రోల్ అవ్వడానికీ తన గర్ల్ ఫ్రెండ్ అనిత యోగా నేర్పిస్తు ఉంది ధ్యానం లో ఉండగా తనకు నిన్న విన్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి "ఈ నాలుగు హత్యలు నేను చేయలేదు" అన్నాడు అప్పుడు అరుణ్ తను డీల్ చేస్తోంది మూడు కేసులే కదా ఇంకో హత్య ఎవరిది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు రవి ఒక అమ్మాయి మర్డర్ న్యూస్ చూసి షాక్ అయ్యాడు అన్న విషయం గుర్తుకు వచ్చింది అంటే ఆ అమ్మాయి ఎవరో కనిపెడితే వీల అందరి విషయాలు తెలియొచ్చు అని కళ్లు తెరిచి పక్కనే ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ కీ గట్టిగా ముద్దు ఇచ్చి "you are my lucky charm I love you" అన్నాడు దానికి అనిత కూడా షాక్ అయ్యి నవ్వుకుంది
11-11-2020, 10:55 AM
superb ga vundi update
waiting for the next one
11-11-2020, 12:02 PM
11-11-2020, 12:02 PM
11-11-2020, 12:02 PM
11-11-2020, 12:33 PM
Superb bro for a while dual anukunna... waiting for the next one
11-11-2020, 01:05 PM
11-11-2020, 03:53 PM
Excellent update with awesome twists. I have to see what happens next as Vin killed Keerhi and Arun got a clue about Vin(I think).
Respect everyone
![]() ![]() My first story: ప్రేమ+పగ=జీవితం
11-11-2020, 05:36 PM
11-11-2020, 07:22 PM
excellent
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
11-11-2020, 09:28 PM
11-11-2020, 10:10 PM
(11-11-2020, 05:36 PM)Vickyking02 Wrote: Yeah Arun got clue about Vin and he finally set a trap to Vin game going to end What is the story coming to end? Is it in next update???
Respect everyone
![]() ![]() My first story: ప్రేమ+పగ=జీవితం
12-11-2020, 05:33 AM
13-11-2020, 08:16 AM
విన్ చేసిన హత్యలు గురించి తన నోటి ద్వారా చెప్పించాలి అంతకంటే ముందు వాడు చంపిన వాళ్ళకి వాడికి ఏంటి సంబంధం తెలుసుకోవాలి అని హైదరాబాద్ వెళ్లాడు అరుణ్, అప్పుడు రవి, జెస్సిక పని చేసే కంపెనీ కీ వెళితే ఆ కంపెనీ నే లేదు దాని ముందు అందరూ ఉద్యోగులు ధర్నా చేస్తూ ఉన్నారు అప్పుడు అది చూసిన అరుణ్ ఆ కంపెనీ ceo ఫోటో తీసుకొని వెతకడం మొదలు పెట్టారు అప్పుడు ఒక ట్రాఫిక్ సిగ్నల్ దెగ్గర ఆగితే ఒకడు వచ్చి డూప్లికేట్ Rolex వాచ్ లు అమ్ముతున్నాడు అప్పుడు వాడిని చూసి అరుణ్ తన చేతిలో ఉన్న ఫోటో వైపు చూశాడు ఇద్దరు ఒక్కడే దాంతో అరుణ్ "మా ఫ్రెండ్ పెళ్లి ఉంది అక్కడ అందరూ తీంగరోలు వాళ్ళకి ఈ మాల్ నేను చెప్పినట్లు అమ్మితే వచ్చిన దాంట్లో నీకు 80 నాకూ 20 సరేనా" అని అడిగాడు దాంతో డబ్బుకు ఆశపడి వాడు ఒప్పుకున్నాడు అరుణ్ కార్ ఎక్కాడు వాడిని ఒక సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ తీసుకుని వెళ్లాడు అక్కడ వాడిని కట్టెసి కోట్టే లోపే వాడు "సార్ ఏమీ కావాలి అన్న చెప్తా సార్ కొట్టోదు" అన్నాడు దాంతో అరుణ్ తన డౌట్ లు అడిగితే అసలు నిజం చెప్పాడు "ఈ కంపెనీ పెట్టింది రవి, జెస్సిక, మున్నా (విన్) అని వాళ్ల మీద ఇన్కమ్ టాక్స్ ప్రాబ్లమ్స్ రాకుండా తనకు డబ్బు ఇచ్చి అక్కడ ceo గా బిల్డ్ అప్ ఇవ్వాలి అని చెప్పి అక్కడ పెట్టారు అని చెప్పాడు కాకపోతే ఆ ఎసి గదుల్లో టైట్ సూట్ లో ఇబ్బంది పడలేక పారిపోయాడు అని ఈ మధ్య సిటీ కీ వచ్చాడు"అని చెప్పాడు దాంతో అరుణ్ కీ మళ్లీ క్లూ మిస్ అయ్యింది దాంతో వాడిని వదిలేసి రవి చెల్లి నీ పిలిపించాడు ఆ అమ్మాయి చెప్పిన దాని బట్టి ఆ న్యూస్ నీ యూట్యూబ్ లో వెతికి పట్టుకుని హఫీజా మర్డర్ గురించి తెలుసుకున్నాడు అరుణ్.
(బెంగళూరు) విన్ షాప్ లో తన పనిలో తాను ఉండగా అప్పుడు వర్ష చీర కట్టుకుని అందంగా రెడీ అయ్యి వచ్చింది విన్ తనని చూసిన పట్టించుకోకుండా తన పని లో తాను ఉన్నాడు అప్పుడు వర్ష అతని పిలిస్తే ఏంటి అని సైగ చేశాడు దానికి వర్ష "ఈ రోజు నా బర్త్ డే" అనింది దాంతో విన్ "రేయ్ ఆ చాక్లెట్ కేక్ ఒక kg దీ తీసుకోని దాని మీద హ్యాపీ బర్త్ డే వర్ష అని రాసి తీసుకోని రా బిల్ వద్దు తనకి బర్త్ డే గిఫ్ట్" దానికి వర్ష "చీ చీ నేను దాని కోసం రాలేదు నాకూ మైసూర్ లో అమ్మ వారికి మొక్కు ఉంది వెళ్లాలి నువ్వు హెల్ప్ చేస్తావా" అని వయ్యారంగా అడిగింది అప్పుడే కేక్ తెచ్చిన వెయిటర్ "ఓయ్ క్లబ్ లో తన ఫ్రెండ్స్ ముందు, రోడ్డు మీద జనం ముందు రెండు సార్లు మా బాస్ నీ కొట్టి ఇప్పుడు నువ్వు రా అని పిలిస్తే రావడానికి మా బాస్ నీ పెంపుడు కుక్క అనుకున్నావా" అని వాడి మాట పూర్తి కాకముందే విన్ వాడిని కాలుతో తన్నాడు "నీ అబ్బ పోయి పోయి నను పెంపుడు జంతువుల తో పోలిస్తావా రేయ్ ఈ నెల వీడికి సాలరీ కట్" అని చెప్పి వర్ష వైపు తిరిగి "ఇక్కడి నుంచి 20 అడుగులు వేస్తే బస్ స్టాప్ ఉంది 122c ఎక్కితే మెజిస్టిక్ బస్ స్టేషన్ కీ వెళ్లుతావ్ అక్కడ 14 ఫ్లాట్ ఫారం లో అర గంట కీ ఒక బస్ ఉంది" అని చెప్పాడు. వర్ష : అయ్యో నాకూ బస్ జర్ని పడదు విన్ : ఎమ్ పర్లేదు బస్ స్టేషన్ కీ ఎదురుగా రైల్వే స్టేషన్ ఇప్పుడు టైమ్ 10 ఇంకో గంటన్నర అంటే 11:30 కీ ఒక ట్రైన్ ఉంది వర్ష : నాకూ రోడ్డు ట్రిప్ లో వెళ్లాలి అని ఉంది విన్ : నా బైక్ లేదు వాడిది పంచర్ అయ్యింది అని నాది డెల్లీవరీ కీ తీసుకుని వెళ్లాడు వర్ష : కార్ లో వెళ్లదాం విన్ : నాకూ కార్ లేదు వర్ష : మా అన్నయ్య నీ అడుగుదాం విన్ : వదిలేలా లేవు సరే అని సుధాకర్ కీ ఫోన్ చేసి కార్ తెప్పించాడు అలా ఇద్దరు కార్ లో వెళ్ళుతుంటే వర్ష అడిగింది "నీకు పెట్స్ అంటే ఎందుకు అంత కోపం" అని దానికి విన్ "నేను హైదరాబాద్ అకాడమీ లో ఉండగా నాకూ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది తనకి ఒక కుక్క ఉండేది ఆ కుక్క రోజు నా బైక్ పైన పాస్ పోసేది ఒక రోజు చిరాకు వేసి దాని కోట్టా దాంతో ఆ పిల్ల బ్రేక్ అప్ చెప్పి పోయింది" అని చెప్పాడు దానికి వర్ష నవ్వుతుంటే "ఇది కామిడీ గా ఉండొచ్చు కానీ మనుషులు సాటి మనిషిని ప్రేమించడం మానేశారు ఎందుకంటే వాళ్ళు విశ్వాసం గా ఉండడం లేదు ప్రేమ పంచడం లేదు అని అంటున్నారు అలా అయితే ఆ నోరు లేని జీవి నువ్వు తిండి పెట్టే వరకు విశ్వాసం చూపిస్తూంది ఒడిలో ఎక్కించుకోని ముత్తి నాకించుకుంటే అది ప్రేమ చూపిస్తుంది అనుకుంటారు కానీ అది దానికి మన అసలు ఆప్యాయత అర్థం కాదు ఇప్పుడు ప్రతి ఒక్కడు కాస్టలీ పెంపుడు జంతువులను తెచ్చి పెంచుతున్నాడు దానికి పెట్టే కర్చు బదులు దాని నెల నెల పోషించే బదులు అదే ఖర్చు నెలకు ఒక అనాధాశ్రమం లో ఇస్తే వంద మంది పిల్లలు కడుపు నిండా తిండి తింటారు అందుకే నాకూ పెంపుడు జంతువులు అన్న వాళ్ళని ప్రేమించే వాళ్లు అన్న కోపం" అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్లు గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా వర్ష "i love you" అని చెప్పింది దానికి విన్ షాక్ అయ్యి వర్ష వైపు చూసి కార్ ఒక పక్కకు ఆపి బయటకు దిగి తను విన్నది నిజమ కాదా అని ఆలోచిస్తూ ఉంటే వర్ష వెనుక నుంచి వచ్చి "I love you" అని చెప్పింది దాంతో వర్ష నీ గట్టిగా కౌగిలించుకున్నాడు అప్పుడు వర్ష విన్ తో "కానీ ఒక నిజం తెలియాలి నువ్వు నిజంగా ఏ తప్పు చేయలేదని నా మీద మీ అమ్మ నాన్న మీద ఒట్టు వేసి నిజం చెప్పు" అనింది దాంతో విన్ వేరే దారి లేక ఇంక నిజం చెప్పాడు తనే ఆ హత్యలు చేశాడు అని దానికి వర్ష ఏమీ మాట్లాడలేదు వెళ్లి కార్ లో కూర్చుని ఉంది తిరిగి ఇంటికి వెళ్లే వరకు ఏమీ మాట్లాడలేదు. మరుసటి రోజు ఉదయం కాఫీ షాప్ బాగ హడావిడి గా ఉంది అప్పుడు అరుణ్, అనిత తో కలిసి వచ్చాడు వచ్చి లవర్స్ స్పెషల్ అని ఉన్న ఒక స్పెషల్ కాఫీ ఆర్డర్ ఇచ్చి ఈ రోజు అందరి బిల్ తనే కడుతా అన్నాడు విన్ కీ ఏదో అనుమానం గా ఉంది అప్పుడు అరుణ్, విన్ దగ్గరికి వచ్చి "మాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది అందుకే ఆనందం లో అందరికీ పార్టీ ఇచ్చా కాకపోతే నాకూ బాగా సంతోషం ఇస్తున్న విషయం తెలుసా" అని తన ఫోన్ లో నిన్న వర్ష తో తను చెప్పిన విషయాలు ఒక వీడియో రూపంలో ఉంది. (ఆ రోజు రాత్రి స్టేషన్ లో తన సస్పెండ్ ఆర్డర్ తీసుకోని వెళ్లుతున్న అరుణ్ నీ వర్ష కలిసి విన్ మీద తనకు డౌట్ ఉంది అని చెప్పింది దాంతో ఇద్దరు ఇలా ప్లాన్ చేసి విన్ నోటి నుంచే నిజం చెప్పించారు) |
« Next Oldest | Next Newest »
|