Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బ్లాక్ రోస్
#1
Video 
హలో ఫ్రెండ్స్ నేను మీ విక్కి కింగ్ బాగ బ్రేక్ తీసుకోని మళ్లీ ఒక కొత్త కథ తో మీ ముందుకు వచ్చాను ఈ సారి ఇంత ఆలస్యం అవ్వడానికీ కారణం నేను ఎంచుకున్న కాన్సెప్ట్ ఎప్పుడు ఒకటే థ్రిల్లింగ్ కథ రాసే వాడిని కాకపోతే ఈ సారి రెండు థ్రిల్లింగ్ కథలు కలిపి రాయడానికి ప్రయత్నం చేస్తున్నా ఇలాంటి కాన్సెప్ట్ చాలా కొత్తగా ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నం చేయలేదు నేను కూడా కొంచెం భయంగానే మొదలు పెట్టా ఈ కథ ఎక్కడ తేడా కొట్టిన మొత్తం మిస్ ఫైర్ అవుతుంది అందుకే బాగా జాగ్రత్తగా ఈ కథ రాస్తున్న.


నా ముందు కథల లాగే ఈ కథను ఆదరిస్తారు అని ఆశిస్తున్నా ఇంక కథ లోకి వెళితే.

(రాత్రి 11 సమయం లక్నో)

లక్నో లోని బీజి మార్కెట్ లో ఒకటి అయిన నకాస్ మార్కెట్ ఆ రోజు కొంచెం ఆలస్యంగా షాప్ మూసి ఇంటికి బయలుదేరింది హఫీజా ఇంకో రెండు రోజుల్లో తన అక్క పెళ్లి దాని కోసం ఈ వారం అంతా తన తండ్రి బదులు తనే షాప్ లో ఉండి బిజినెస్ చూసుకుంది తన తండ్రి పెళ్లి పనిలో బిజీగా ఉండటం వల్ల, అలా ఆలస్యం అయ్యింది అని హడావిడి గా స్కూటీ తీసింది కానీ చూస్తే టైర్ పంచర్ అయ్యింది దాంతో చిరాకుగా నడుస్తూ ఆటో కోసం సెంటర్ లోకి వచ్చింది కానీ ఒక ఆటో కూడా లేదు తన తండ్రి కీ ఫోన్ చేస్తే సిగ్నల్ లేదు దాంతో కొంచెం ముందుకు వెళితే ఆటో దొరుకుతుంది అని నడుస్తూ వెళ్లింది కానీ తనని ఎవరో ఫాలో అవుతున్నారు అని తనకి తెలియడం లేదు, అలా నడుస్తూ వెళ్లుతుంటే ఫూట్ పాత్ మీద ముగ్గురు తాగుతూ వెళుతున్న హఫీజా వైపు చూశారు దాంతో కొంచెం వేగం పెంచి నడవడం మొదలు పెట్టింది, అలా వెళ్లుతున్న వాళ్లు తన వెనుక రావడంతో పరిగెత్తుతూ వెళ్లి ఒక చిన్న గళ్లీ లో దూరింది అప్పుడు అక్కడ ఒక సందులో దూరి దాకుంది అప్పుడు తనకు దూరం గా వెనుక గోడ పైన ఒక నీడ వచ్చి తన వైపే చూస్తూ ఉంది ఆ తర్వాత ఆ ముగ్గురు తాగుబోతులు వచ్చిన ఆ శబ్దం కీ ఆ నీడ మాయం అయ్యింది, ఆ తర్వాత హఫీజా కీ ఏదో కోడుతున్న శబ్దం వస్తే బయటకు వచ్చి చూసింది అక్కడ ఆ ముగ్గురు చలనం లేకుండా ఉన్నారు ఒకడికి గొంతు లో ఇంకొకరికి కడుపు లో విరిగిన బీర్ బాటిల్స్ ఉన్నాయి ఇంకొకడు మెడ తిరిగి పడి ఉన్నాడు ఆ తర్వాత సడన్ గా హఫీజా వెనుక నుంచి ఎవరో భుజం మీద చేయి పడింది.

(బెంగళూరు బ్లాక్ రోస్ కేఫ్)

బెంగళూరు లో ఈ కాఫీ షాప్ ప్రేమికులకు చాలా ఫేమస్ వాళ్ల ప్రేమ నీ పెంచుకోవడానికి కాదు వాళ్ల ప్రేమకు ముగింపు ఇవ్వడానికి అవును ఈ కాఫీ షాప్ లో బ్రేక్ అప్ ఫేమస్ ఎందుకంటే ఈ కాఫీ షాప్ లోనే ఒక మూల బోకెట్ షాప్ ఉంది అక్కడ అని రకాల రోజా పువ్వులు ఉన్నాయి అందులో నల గులాబీ ఇంకా ఫేమస్, ఒక సారి ఒక ప్రేమ జంట వచ్చి అక్కడ బ్లాక్ రోస్ కొని ఒకరికి ఒకరు ఇచ్చుకోని బ్రేక్ అప్ చెప్పుకున్నారు దాంతో ఆ కాఫీ షాప్ ఓనర్ విన్ (వినయ్ అయితే తన ఫేవరెట్ హాలీవుడ్ హీరో విన్ డీజిల్ లాగా స్టయిల్ గా ఉంటుంది అని విన్ అని పెట్టుకున్నాడు) కీ ఒక ఐడియా వచ్చింది, బ్రేక్ అప్ చేసుకున్న జంటలకు ఆ రోజు బిల్ ఉండదు అని ఆఫర్ పెట్టాడు దాంతో చాలా జంటలు వచ్చే వాళ్లు కానీ మన వాడు తెలివిగా ముందు వాళ్లు తాగడానికి, తినడానికి ఆర్డర్ తీసుకోని తరువాత ఆ బిల్ ఎంత అయితే అంత నల్ల గులాబీ పైన వేసి అమ్మే వాడు ఎటు చూసినా బిజినెస్ సక్సెస్ లో ఉంది విన్ కీ ఇది ఇలా ఉంటే విన్ షాప్ పక్కనే ఒక పెట్ షాప్ ఉంది ఈ ప్రపంచంలో విన్ కి నచ్చనిది పెంపుడు జంతువులు వాటిని ప్రేమించే వాళ్లు, ఆ షాప్ లో ఉండే కీర్తి కీ జంతువులు అంటే ఇష్టం తనకి బాగ ఇష్టం అయిన కుక్క పిల్ల ఎప్పుడు విన్ షాప్ కీ వచ్చి వాడి బోకేట్ షాప్ లో కుండీలు పాడు చేస్తూంది దాంతో ఆ కుక్క పిల్ల కీ విన్ కీ రోజు గొడవ ఆ రోజు అది రాగానే దాని పైన ఒక కుండీ మూసి దాచి పెట్టాడు దాని వెతుక్కుంటూ వచ్చింది కీర్తి.

"విన్ నా జేమ్స్ ఇక్కడికి వచ్చాడ" అని అడిగింది దానికి విన్ చూడలేదు అన్నాడు అప్పుడు ఆ కుక్క మొరిగిన సౌండ్ విని వెళ్లి కుండీ తీసి చూసింది "హే నోరు లేని మూగ జీవి నీ ఎందుకు ఇంత హింసిస్తున్నావ్" అని అనింది దాంతో విన్ కీ కోపం వచ్చి ఏదో బూతు మాట్లాడ పోయి కంట్రోల్ చేసుకొని "చూడు దానికి నోరు లేదు కానీ నా మొక్కలకు ప్రాణం ఉంది వాడు రోజు వచ్చి నా మొక్కలు పాడుచేస్తుంటే ఊరుకోవాలా మళ్లీ చెప్తున్నా ఇంకో సారి వాడు ఇక్కడికి వచ్చి కాలు ఏత్తాడు అనుకో కట్ అయిపోది" అని చెప్పాడు చిరాకుగా దాంతో కీర్తి జేమ్స్ నీ షాప్ లో వదిలేసి మళ్లీ విన్ దగ్గరికి వచ్చి "నా ప్రేమ విషయం ఏమీ చేశావు " అని సిగ్గు పడుతూ అడిగింది దానికి విన్ నవ్వుతూ కీర్తి నీ దగ్గరికి రా అని సైగ చేసి "నువ్వు నీ షాప్ మూసుకొని పోతే అప్పుడు ఆలోచిస్తా " చిరాకుగా చెప్పాడు దాంతో కీర్తి అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఆ రోజు రాత్రి హఫీజా ఇంటికి రాక పోవడంతో వాళ్ల ఇంట్లో వాళ్లు సెక్యూరిటీ ఆఫీసర్లకు కంప్లయింట్ ఇచ్చారు, ఆ తర్వాత హఫీజా వాళ్ల నాన్న తిరిగి షాప్ కీ వెళ్ళి షాప్ తేరిస్తే హఫీజా శవం నీ లోపల వెళ్లాడ తీసి ఉంది దాంతో హఫీజా వాళ్ల నాన్న అక్కడే  కుప్పకూలిపోయాడు ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి శవం తీసుకోని వెళ్లారు పోస్టు మార్టం తరువాత రిపోర్ట్ ప్రకారం తను ఈ రోజు ఉదయం చనిపోయింది అని అది కూడా ఉరి వేయడం వల్ల కాకపోతే తన కుడి చేతి లో మనికట్టు పైన కత్తి తో లోతుగా నరాలు కట్ చేసి ఉంది అలాగే ఎడమ చేతికి మోచేతి పైన ఎలాంటి రేప్ ఆనవాలు కానీ లేవు అని చెప్పారు దాంతో ఇది ఏదో సైకో కిల్లర్ పనిలా ఉంది అనుకున్నారు సెక్యూరిటీ ఆఫీసర్లు.

ఆ మరుసటి రోజు హఫీజా శవం స్మశానం లో పూడ్చి తన కుటుంబ సభ్యులు వెళ్లి పోయారు కానీ వాళ్ళని అక్కడే ఉన్న ఆ హంతకుడు గమనిస్తూ ఉన్నాడు వాళ్లు వెళ్లిన తర్వాత ఆ హంతకుడు ఒక నల్ల గులాబీ తెచ్చి ఆ సమాధి మీద పెట్టి సారీ అని ఒక పేపర్ మీద రాసి అక్కడ పెట్టి వెళ్లిపోయాడు. 
[+] 6 users Like Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
చాలా బాగుంది
[+] 1 user Likes afzal.kgm8's post
Like Reply
#3
(29-10-2020, 10:53 AM)afzal.kgm8 Wrote: చాలా  బాగుంది

Thank you bro ముందు ముందు ఇంకా బాగుంటుంది
Like Reply
#4
Excellent starting of a new story with unexpected twist at the end.

Keep it up bro. This story will get more views and comments than previous stories.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#5
(29-10-2020, 11:22 AM)Joncena Wrote: Excellent starting of a new story with unexpected twist at the end.

Keep it up bro. This story will get more views and comments than previous stories.

Thank you bro yeah I am also expecting same you will be enjoy this story with unexpected twists and gripping way to end
Like Reply
#6
Super ga undi bro continue cheyandi bro madhyalo apakandi
[+] 1 user Likes Santhoshsan's post
Like Reply
#7
సూపర్
[+] 1 user Likes Thimmappa's post
Like Reply
#8
(29-10-2020, 09:22 PM)Santhoshsan Wrote: Super ga undi bro continue cheyandi bro madhyalo apakandi

Sure bro kachitanga
Like Reply
#9
(29-10-2020, 09:41 PM)Thimmappa Wrote: సూపర్

Thank you bro
Like Reply
#10
రోజు లాగే షాప్ తేరవడానికి వెళుతున్న విన్ ట్రాఫిక్ సిగ్నల్ దెగ్గర ఆగి ఉన్నాడు అప్పుడు రోడ్డు మధ్యలో ఒక కుక్క పిల్ల కాలు విరిగి అటు ఇటు పరిగెత్తుతూ ఉంది అవతలి వైపు నుంచి వచ్చే బండ్లు దాని మిస్ చేసి వెళుతున్నాయి దానికి విన్ ఏదో థ్రిల్లింగ్ సినిమా చూస్తున్నట్లు ఏదైనా బండి దాని తొక్కక పొదా అని చూస్తూ ఉన్నాడు అప్పుడు విన్ సిగ్నల్ పడగానే స్పీడ్ గా ఆ కుక్క మీదకు వెళ్లాడు కానీ సడన్ గా ఒక అమ్మాయి అడ్డు వచ్చి ఆ కుక్క నీ పక్కకు తీసింది అలా అమ్మాయి అడ్డు రావడంతో విన్ బ్రేక్ వేసి జారీ పడ్డాడు అప్పుడు తన బైక్ వెళ్లి డివైడర్ కీ గుద్దుకుంది ఆ తర్వాత విన్ నీ ట్రాఫిక్ సెక్యూరిటీ అధికారి కొంతమంది వచ్చి లేపారు ఆ తర్వాత ఆ అమ్మాయి కోసం చూస్తే తను పారిపోయింది ఆ తర్వాత బైక్ తన ఫ్రెండ్ గ్యారేజ్ లో ఇచ్చి హాస్పిటల్ లో ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని షాప్ కీ వెళ్లాడు, తను షాప్ కీ వెళ్లిన తర్వాత ఒక లగేజ్ లారీ వచ్చి ఆగింది అందులో నుంచి ఒక అంకుల్ ఒక అమ్మాయి దిగారు ఆ అమ్మాయిని చూడగానే విన్ గుండె చప్పుడు వేగం పెరిగింది తన గుండె లో నుంచి పావురాళ్లు ఎగురుతునట్లు రెక్కలు చప్పుడు తన చెంప పైన తగిలింది అప్పుడు తన పక్కన ఉన్న ఒక వెయిటర్ తో "ఏంట్రా ఆ పిల్ల నీ చూస్తుంటే పావురాళ్లు తాకినట్లు ఉంది" అని అన్నాడు దానికి అతను "సరిగ్గా చూడు అన్న ఆ పావురాళ్ళు నీ టేబుల్ మీద తిరుగుతున్నట్లు కూడా ఉంటుంది" అని అన్నాడు దానికి విన్ సరిగా చూస్తే తన కాఫీ షాప్ లో పావురాళ్లు ఎగురుతున్నాయ్ కీర్తి ఆ పావురాళ్లు పట్టుకుని పంజరం లో వేస్తూ కనిపించింది.


దాంతో చిరాకు వేసి విన్, కీర్తి దగ్గరికి వెళ్లి "ఓయ్ ఏంటి నా బిజినెస్ పాడు చేస్తున్నావు" అని అరిచాడు దానికి కీర్తి "అయ్యో ఇవి నావి కాదు" అని చెప్పి ఆ వచ్చిన కొత్త అమ్మాయికి ఆ పంజరం ఇచ్చింది అప్పుడు ఆ అమ్మాయి కీర్తి కీ థాంక్స్ చెప్పి విన్ నీ చూసి షాక్ అయ్యింది అప్పుడు ఆ అమ్మాయి తో వచ్చిన అంకుల్ "ఇక్కడ వినయ్ అంటే ఎవరు అయ్యా" అని అడిగాడు దానికి విన్ నేనే అన్నాడు "నా పేరు ప్రభాకరరావు మీ షాప్ పైన ఇంటికి కొత్తగా అద్దెకు వచ్చింది మేమే ఇది నా కూతురు వర్ష సుధాకర్ చెప్పింది నీ గురించేనా" అని అడిగాడు దానికి విన్ "అవును సార్ నేనే ఈ షాప్ నాకూ పెట్టి ఇచ్చింది సుధాకర్ అన్ననే మీరు నిన్న సాయంత్రం వస్తారు అని అంటే రాత్రి 10 వరకు చూశా మీరు రాలేదు అని ఇంటికి వెళ్లా ఇళ్లు క్లీన్ చేయించా అద్దె ననే చూసుకో అన్నాడు అన్న " అని చెప్పాడు విన్ దానికి ప్రభాకర్ ఎంత అని అడిగాడు దానికి విన్ "15,000 వేళ్లు అద్దె 6 నెలల అడ్వాన్స్" అని చెప్పాడు దానికి ప్రభాకర్ షాక్ అయ్యి "అది ఏంటి అయ్యా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కీ 15,000 వేళ్లా అది కూడా 6 నెలల అడ్వాన్స్ సుధాకర్ మాట్లాడిన్నప్పుడు అంత చెప్పలేదే" అని అడిగాడు దానికి విన్ "మీ అమ్మాయి ఇందాక నాకూ చేసిన ఆక్సిడేంట్ కీ నా బైక్ కీ అయిన రీపేర్ కలిపి వసూలు చేస్తున్నా దాంతో పాటు మీరు పెట్స్ తెచ్చుకుంటారు అని నాకూ ముందు చెప్పలేదు అందుకు ఇంకో రెండు వేళ్లు పెంచా" అని చెప్పాడు, దాంతో ప్రభాకర్ వర్ష ఇద్దరు ఒకరి మొహలు ఒకరు చూసుకున్నారు అప్పుడు విన్ వాళ్ళని చిటికె వేసి పిలిచి "ఇందాక రోడ్డు మీద దొరికిన ఆ కుక్క నీ బయట పడేసి ఇంట్లో చేరండి ఏమీ ఆలోచిస్తున్నారు సుధాకర్ అన్న కీ చెప్పాలి అనుకుంటున్నారా అన్న కూడా నా మాట కాదు అన్నడు" అని చెప్పాడు విన్ దాంతో వర్ష తన కుక్క నీ కీర్తి కీ ఇచ్చింది, ప్రభాకర్ ఇంట్లో సామాన్లు సర్దిస్తూ ఉండగా వర్ష, విన్ దగ్గరికి వచ్చి "ఆ అమ్మాయిని నేనే అని ఎలా కనిపెట్టావు" అని అడిగింది దానికి విన్ "నువ్వు వేసుకున్న డ్రస్ బాగ గుర్తు ఉంది దాంతో పాటు ఇందాక నువ్వు నన్ను చూసి షాక్ అయ్యావ్ దాంతో అర్థం అయ్యింది" అని చెప్పాడు ఆ తర్వాత తను పైకి వెళ్లింది. 

(హైదరాబాద్ ఓల్డ్ సిటీ) 

తన ఇంటి ముందు కొత్త కార్ తో వచ్చి దిగాడు రవి కొడుకు కొత్త కారు లో ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ల కళ్లలో ఆనందం పట్టలేక పోయారు ఒక సంవత్సరం వరకు అప్పులో కూరుకుపోయిన తమ కుటుంబం ఇప్పుడు ఇలా సంతోషంగా ఉండటం కోసం కొడుకు పడిన కష్టంకి వాళ్ల అమ్మ నాన్న ఇప్పుడు వాళ్ల ఆనందం కళ్ల నుంచి నీరు లాగా బయటికి వచ్చింది ఆ తర్వాత రవి వాళ్లను రెడీ అవ్వమని చెప్పి వాళ్లను ఒక తయారు అవుతున్న బిల్డింగ్ కీ తీసుకోని వెళ్లి "అమ్మ నాన్న ఇక్కడ మన కొత్త ఇల్లు రాబోతుంది ఇంకో 5 నెలలో మన జీవితాలు మారీ పోతాయి" అని చెప్పాడు ఆ తర్వాత వాళ్లు అంతా కలిసి ఒక హోటల్ లో డిన్నర్ చేశారు అప్పుడే రవి కీ తన గర్ల్ ఫ్రెండ్ నుంచి మెసేజ్ వచ్చింది నిన్ను కలవాలి అని ఆ మెసేజ్ లో ఉంటే వెళ్లాడు, అక్కడికి వెళ్లి చూస్తే ఆ అమ్మాయి మొహం మీద గాయాలతో ఉంది తనను చూసి వెంటనే వెళ్లి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఎవరో రవి తల పైన కొట్టారు దాంతో రవి లేచే సమయం కీ తనని ఒక పిల్లర్ కీ కట్టెసి ఉంచారు అతని చేరి ఒక కాలు కీ తాడు కట్టి దాని కారు కీ కట్టాడు. 

నోట్లో toothpick పెట్టుకొని నములుతు వాడు రవి దగ్గరికి వచ్చి "అయిన ఎమ్ గర్ల్ ఫ్రెండ్ రా అది రోడ్డు మీద సెక్సీ గా కనిపించింది రేప్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ నన్ను వదిలేయి అని బతిమాలింది సరే నీ ఫోన్ లో లాస్ట్ ఫోన్ ఎవరికి చేశావో వాళ్ళని రమ్మని చెప్పు నిన్ను వదిలేస్తా అంటే అదీ నిన్ను తగిలించి దోబేసింది అందుకే నిన్ను చంపుతున్న సారీ బ్రో దిగులు పడోదు నీ పిల్ల నీ కూడా నీ దగ్గరికి పంపుతా" అని చెప్పి వెళ్లి కార్ స్టార్ట్ చేసి దాని ముందుకు స్పీడ్ గా పోనీంచాడు అలా కార్ వేగంగా వెళ్లడం తో రవి కాలు విరిగి వెన్నపూస కూడా కదిలి చెవిలో నుంచి రక్తం కారి చనిపోయాడు ఆ తర్వాత డిక్కిలో ఉన్న రవి గర్ల్ ఫ్రెండ్ బాడి కూడా తెచ్చి అక్కడ పడేసి ఒక నల్ల గులాబీ తెచ్చి అక్కడ పెట్టి సారీ అని అక్కడ ఇసుక లో రాసి వెళ్లిపోయాడు. 

[+] 6 users Like Vickyking02's post
Like Reply
#11
yourock awesome story
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
#12
రెండు కథలువేరే జోనర్ ల ఉన్నాయి బాగుంది
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply
#13
(30-10-2020, 10:27 AM)paamu_buss Wrote: yourock awesome story

Thank you bro you will enjoy further twists
Like Reply
#14
(30-10-2020, 11:04 AM)Chandra228 Wrote: రెండు కథలువేరే జోనర్ ల ఉన్నాయి బాగుంది

అదే బ్రో నేను చెప్తున్నా experiment కింద రెండు డిఫరెంట్ జోనర్లు కలిపి రాస్తున్న
Like Reply
#15
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#16
బాబోయ్ ఏమిటి బ్రో ఇది, మరీ సైకో కిల్లెర్ మూవీలా ఉంది. అప్డేట్ చాలా బాగా రాసారు.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#17
(30-10-2020, 03:28 PM)utkrusta Wrote: GOOD UPDATE

Thank you bro
Like Reply
#18
(30-10-2020, 03:32 PM)Joncena Wrote: బాబోయ్ ఏమిటి బ్రో ఇది, మరీ సైకో కిల్లెర్ మూవీలా ఉంది. అప్డేట్ చాలా బాగా రాసారు.

థాంక్ యు బ్రో అదే  కదా చెప్పా  రెండు థ్రిల్లింగ్ జోనర్లు కలిపి రాశాాను అని  మొదటిది సైకో జోనర్
Like Reply
#19
మరుసటి రోజు ఉదయం సైట్ లో పని చేసే వాళ్లు ఓనర్ కీ ఫోన్ చేస్తే అతను సెక్యూరిటీ ఆఫీసర్లకు చెప్పాడు దాంతో సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి బాడిలు తీసుకోని వెళ్లారు అప్పుడు హాస్పిటల్ లో రవి అమ్మ, నాన్న, చెల్లి అతని శవం పైన పడి దారుణమైన చావు చనిపోయిన తమ బిడ్డను చూసి గుండెలు పగిలేల ఏడ్చారు దాంతో అది సెక్యూరిటీ ఆఫీసర్లకే మనసు చివుక్కుమనింది దాంతో రవి చెల్లి నీ పక్కకు పిలిచి ఎంక్వయిరీ చేస్తున్నారు రవి కీ ఎవరైన శత్రువులు కానీ ఈ మధ్య గొడవ పడిన వారు గాని ఇలా అడిగారు దాంతో రవి చెల్లి "మా అన్నయ్య చాలా సాఫ్ట్ సార్ ఎవరితో గొడవ పడ్డడు కాకపోతే వాళ్ల ఆఫీసు లో అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ వల్ల ఒక అతనితో 3 నెలల క్రితం గొడవ అయ్యింది ఆ తర్వాత అతను బెంగళూరు వెళ్లాడు అంతే సార్ ఆ తర్వాత నాకూ తెలిసి అన్నయ్య ఎప్పుడు ఎవరితో గోడవ పడలేదు" అని చెప్పింది దాంతో సెక్యూరిటీ ఆఫీసర్లు ఈ మధ్య ఎప్పుడైన విచిత్రంగా ఏమైన ప్రవర్తించాడ అని అడిగారు దానికి ఆ అమ్మాయి "మొన్న న్యూస్ లో ఒక అమ్మాయి చనిపోయింది అన్న న్యూస్ చూసి కొద్ది సేపు షాక్ అయ్యి ఏదో పిచ్చి పట్టినట్టు ప్రవర్తించాడు" అని చెప్పింది దాంతో సెక్యూరిటీ ఆఫీసర్లు రవి వాళ్ల ఆఫీసు కీ వెళ్లారు అక్కడ 3 నెలల క్రితం ఆ ఆఫీసు నుంచి వెళ్లిపోయింది ఎవరో తెలుసుకోవడానికి HR జెసికా దగ్గరికి వెళ్లారు ఆమె మొత్తం వెతింకింది కానీ అతని వివరాలు ఏమీ తెలియలేదు, దాంతో సెక్యూరిటీ ఆఫీసర్లకు ఈ కేసు లో ముందుకు ఎలా వెళ్లాలో తెలియడం లేదు అప్పుడు జెసికా బదులు కంపెనీ స్టాఫ్ లో వాళ్లను అడిగారు ఆ గొడవ పడిన కుర్రాడు ఎవరూ అని దాంతో ఒక్కోకరు ఒకలా చెప్పడం మొదలు పెట్టారు వాడి గురించి కొంతమంది ఏమో వాడిని పిచ్చోడు అన్నారు ఇంకొందరు బిల్ గేట్స్ లాంటి తెలివైన వాడు అన్నారు కొందరు తేడా అన్నారు ఇంకొందరు మంచోడు అన్నారు మొత్తం వడగట్టితే వాడి ఫోటో, కానీ కాంటాక్ట్ ఏవి దొరకలేదు వాడి పేరు తప్ప "షేర్ యూసఫ్ ఖాన్" అలియాస్ మున్నా.


(బెంగళూరు)

రోజు లాగే విన్ షాప్ మొత్తం నిండి పోయింది అప్పుడు ఒక కస్టమర్ వేయిటర్ తో గొడవ పడుతూ ఉంటే విన్ వెళ్లి ఏంటి సమస్య అని అడిగాడు దాంతో చూస్తే అతని షర్ట్ పైన టేబుల్ పైన పక్షి రేట పడింది దాంతో పైకి చూస్తే పైన ఉన్న పావురాళ్లు ఖాళీగా ఉన్న రూఫ్ పై నుంచి కింద షాప్ నీ పాడు చేస్తూ ఉన్నాయి, దాంతో విన్ కస్టమర్ కీ సారీ చెప్పి తనకు బిల్ ఇవ్వోదు అని చెప్పి కోపం తో పైకి వెళ్లాడు అక్కడ వర్ష బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంది అలా తనని చూసే సరికి విన్ ఒకసారి అలాగే శిల్పం లాగా నిలబడి వర్ష అందం చూస్తూ ఉన్నాడు అప్పుడే ప్రభాకర్ వచ్చి విన్ నీ చూసి పిలిస్తే ఈ లోకం లోకి వచ్చాడు దాంతో వెంటనే "చూడండి అంకుల్ మీ పావురాళ్లను గూట్లో పెట్టుకొండి లేదా కోసుకొని తినండి అంతే కానీ ఊరికే ఇలా బయటకు వదిలి నా షాప్ బిజినెస్ పాడు చేయొద్దూ ఇంకోసారి అవి బయటికి వస్తే కాల్చి రోస్ట్ చేసి నా కాఫీ షాప్ లో చికెన్ బదులు మీ పావురాళ్లు పెట్టి అమ్ముతా" అని వార్నింగ్ ఇచ్చాడు, దాంతో వర్ష కోపంతో తన ఫోన్ తీసుకోని ఆ ల్యాండ్ ఓనర్ సుధాకర్ కీ ఫోన్ చేసింది "హలో సుధాకర్ అన్న ఆ వినయ్ చాలా ఏక్సటార్లు చేస్తూన్నాడు అర్జెంటుగా వాడిని కాలి చేయించు లేదా మేము కాలి చేస్తాము" అని చెప్పింది దాంతో సుధాకర్ "మీరు కాలి చేస్తే చేయండి అంతే కానీ వాడిని ఇబ్బంది పెట్టోద్దు అక్కడే ఉండాలి అంటే వాడు చెప్పినట్లు వినండి అంతే కాకుండా మాటి మాటికి నాకూ ఫోన్ చేయదు నేను మీ నాన్న లాగా ఖాళీగా లేను ఒక మల్టీ నేషనల్ కంపెనీ నడుపుతున్న" అని సీరియస్ గా చెప్పాడు.

దాంతో వర్ష షాక్ అయ్యింది సొంత బాబాయ్ కూతురుని నను వాడి ఎవడో కోసం తిట్టాడు అని వర్ష కీ వినయ్ మీద కోపం వచ్చింది దాంతో విన్ కళ్లు ఎగరేసి "ఏంటి బాగ పడిందా" అన్నాడు దాంతో వర్ష తన చేతిలో ఉన్న బాస్కెట్ బాల్ చూసి ఒక ఐడియా వచ్చింది "సరే నా పావురాళ్లు నిన్ను ఇబ్బంది పెట్టకుడదు అంటే నువ్వు ఒక పని చేయాలి ఈ బాల్ నీ ఆ బాస్కెట్ లో చూడకుండా" వేయాలి అని ఛాలెంజ్ చేసింది, దానికి విన్ ఏమీ ఆలోచించకుండా ఆ బాల్ తీసుకోని వెనకు తిరిగాడు కాకపోతే ఆ బాల్ ముట్టుకోగానే అతని మెదడులో "నిన్ను ఈ జన్మ లో బాస్కెట్ బాల్ ఆడనివ్వను, నువ్వు మళ్లీ ఎప్పుడు బాస్కెట్ బాల్ ఆడకుడద్దూ, మన లాంటి పెద వాళ్లకు పెద్ద కలలు వద్దు నాన్న" అని తన గతం లో జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి దాంతో బాల్ నీ పట్టుకుని కంగారు పడుతూ ఉన్నాడు విన్, అది చూసిన వర్ష "ఏంటి భయం వేస్తుందా" వెకిలి చేసింది దాంతో విన్ బాల్ నీ వెనకు విసిరాడు దాంతో అది బాస్కెట్ లో పడింది అది చూసి వర్ష షాక్ అయ్యింది అలా షాక్ లో ఉన్న వర్ష నీ చిటికె వేసి పిలిచాడు విన్ "clean the mess" అని చెప్పి వెళ్లిపోయాడు దాంతో చేసేది లేక వర్ష పావురాళ్లను పంజరం లో పెట్టింది, ఆ తర్వాత విన్ బాల్ నీ వేసిన విధానం చూసి ఇంకా షాక్ లోనే ఉంది అలా ఆలోచిస్తూ స్పోర్ట్స్ క్లబ్ కీ వెళ్లడానికి కిందకి వచ్చింది.

అప్పుడే ప్రభాకర్ కూడా కిందకి వచ్చి "చూడు బాబు నాకూ ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి ఇక్కడ మంచి ఇంటర్నెట్ కంపెనీ ఏదైన ఉందా" అని అడిగాడు దాంతో విన్ తన షాప్ కి ఉన్న వైఫై కంపెనీ నెంబర్ ఇచ్చాడు అది చూసి ప్రభాకర్ నెలకు ఎంత అని అడిగాడు దానికి ఒక 550 ఉంటుంది అని చెప్పాడు విన్, దానికి "రెండు నెలలు టెంపరరీ గా తీసుకుంటే తగించుకోడా" అని అడిగాడు ప్రభాకర్ దాంతో విన్ కీ చిరెతుకు వచ్చింది అయిన కొంచెం కూల్ అయ్యి "రెండు నెలలు మీరు బిల్ కట్టండి అంకుల్ మూడో నెల కట్టోద్దు వాడే కట్ చేస్తాడు" అని చెప్పాడు దానికి వర్ష కూడా నవ్వింది, ఆ తర్వాత విన్ దగ్గరికి వచ్చి "వినయ్ నను స్పోర్ట్స్ క్లబ్ లో డ్రాప్ చేస్తావ ప్లీజ్" అని అడిగింది వర్ష దాంతో విన్ ఏమీ ఆలోచించకుండా బైక్ తీసి రమ్మని చెప్పాడు అలా వాళ్లు స్పోర్ట్స్ క్లబ్ కీ వెళ్లాక "ఏంటి నేషనల్ సెలక్షన్ ఆ" అని అడిగాడు దానికి వర్ష "అవును ఇది సెలెక్ట్ అయితే IBF కీ సెలెక్ట్ అవ్వోచ్చు" అని చెప్పి లోపలికి వెళ్ళింది అప్పుడు లోపల కోచ్ డ్రస్ లో ఉన్న అతని చూసి విన్ రక్తం మురిగింది "నువ్వు ఎలా సెలెక్ట్ అవుతావో చూస్తా I will screw your life man నిన్ను ఇంటికి పంపించక పోతే నా పేరు కిరణ్ కాదురా" అని వాడు చేసిన ద్రోహం గుర్తుకు వచ్చింది దాంతో అక్కడి నుంచి ఆవేశం గా వెళ్లాడు, ఆ తర్వాత వర్ష కోచ్ అయిన కిరణ్ దగ్గరికి వెళ్లి పరిచయం చేసుకుంది అప్పుడు కిరణ్ తన ఒంటి మీద చెయ్యి వేసి అభినందించినట్టు చేసి భుజం పిసికాడు దాంతో వర్ష కొంచెం ఇబ్బంది పడింది.

ఆ తర్వాత షాప్ కీ వెళ్లిన విన్ కీ అక్కడ ఒక వ్యక్తి నల్ల గులాబీ మొక్కలు చూస్తూ ఉన్నాడు దాంతో విన్ దగ్గరికి వెళ్లి "నమస్తే మున్నా అన్న నీ కోసమే నాలుగు రోజుల క్రితం తెప్పించా" అని చెప్పి రెండు రోజా మొక్కల కుండీలు ఇచ్చి పంపాడు పూల కుండీలు తీసుకున్న మున్నా టాక్సీ లో ఎక్కి ఎయిర్ పోర్ట్ అని చెప్పాడు ఆ తర్వాత తన ఫోన్ తీసి రోడ్డు మీద వెళుతున్న బండ్లు చూసి వాటి నెంబర్ ప్లేట్ మీద ఉన్న చివరి నెంబర్ చూసి తన ఫోన్ లో నోక్కాడు ఒక random ఫోన్ నెంబర్ వచ్చింది దానికి ఫోన్ చేశాడు అది ముంబై తాజ్ హోటల్ లో ఒక రూమ్ సర్వీస్ బాయ్ కీ తగిలింది వాడు ఫోన్ తీసి ఎవరూ అని అడిగాడు దానికి మున్నా "నీ చావు" అని చెప్పి నవ్వాడు ఆ తర్వాత తన ఫోన్ లో ఉన్న సాఫ్ట్వేర్ ద్వారా ఆ నెంబర్ ఎక్కడికి వెళ్లింది తెలుసుకొని ముంబై కీ ఫ్లయిట్ టికెట్ బుక్ చేసుకొని వెళ్లాడు. 
[+] 6 users Like Vickyking02's post
Like Reply
#20
సుపర్
[+] 2 users Like Thimmappa's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)