12-06-2020, 06:37 PM
చాలా ఆహ్లాదంగా
హృద్యంగా కథ చెపుతున్నారు
చాల చాలా బాగుంది
Adultery పేరులో ఏముంది
|
12-06-2020, 06:37 PM
చాలా ఆహ్లాదంగా
హృద్యంగా కథ చెపుతున్నారు
చాల చాలా బాగుంది
13-06-2020, 09:44 AM
ఎపిసోడ్ 6
పెళ్లి చూపులవ్వగానే తిన్నగా హోటల్ కి చేరుకొన్నారు ప్రసాద్ దంపతులు. వాళ్లకి కావ్య బాగా నచ్చింది. శ్రీరామ్ కి నచ్చి సంభందం కుదిరితే బాగుణ్ణు అని అనుకొన్నారు. వాడికి ఫోన్ చేసి చెప్పండి అని లలిత అన్నప్పటికీ "పనిలో ఉంటాడు. రేపు సాయంత్రం ఫోన్ చేద్దాములే"అని వారించాడు. ఆ సాయంత్రమే కాకినాడ వెళ్లి పోయారు. గురువారం రాత్రి కొడుక్కి ఫోన్ చేసాడు ప్రసాద్ రావు. శ్రీరామ్ హలో చెప్పగానే స్పీకర్ ఫోన్ ఆన్ చేసాడు భార్య కూడా వింటుందని. "నిన్నే ఫోన్ చేద్దామనుకున్నామురా. కానీ పనిలో బిజీగా ఉంటావని చెయ్యలేదు. అమ్మాయి తల్లి తండ్రులు కూడా చాలా మంచి వారు. మమల్ని బాగా రిసీవ్ చేసుకొన్నారు. అమ్మాయి కూడా చాలా బాగుంది అణుకువ ఉన్న పిల్ల. మాకు అన్ని విధాలా బాగుంది. కాకపొతే బాగా ధనవంతులు",అన్నాడు ఏమి దాచకుండా "మీకు ముందే చెప్పా కదా నాన్న. మరీ అంత డబ్బున్నవాళ్ళు ఒద్దని. తరువాత మనం, ఆ అమ్మాయి ఇబ్బంది పడాల్సి ఉంటుంది అని." "మధ్యవర్తి కాస్త ఉన్నవారు అన్నాడు కాని మరి అంత ధనవంతులు అనుకోలేదురా. అమ్మాయికి అస్సలు గర్వం లేదు. నువ్వు ఒకసారి చూస్తే బాగుంటుంది."అన్నాడు కొడుక్కి కొంచెం నచ్చ చెప్పేధోరణితో. భర్తకు తోడు తనూ ఒక మాట సాయం చేద్దామని రంగంలోకి దిగింది లలిత. "వాళ్లకు మనకు చుట్టరికం కుదిరింది కూడాను. అసలు ఇంతకాలం కలుసుకోకుండా ఎలా ఉన్నామని అన్నారు మీ మామగారు. మనం సంభందం అంటే బాగా ఇష్టంగా ఉన్నారని తెలుస్తోంది. నీవు వచ్చి చూస్తావని మాటిచ్చాము. వెళ్లకపోతే బాగుండదు."అంటూ కొంచెం నొక్కింది. "అంత ధనికుల సంభందం చేసుకుంటే మీరు దూరమై పోయే అవకాశం ఉంది. ఇద్దరూ అమ్మాయిలు అంటున్నారు. ఒక్కోసారి వాళ్ళ వ్యాపారాలకు అల్లుళ్ళని వారసులుగా పెట్టు కోవాలనుకొంటారు నాన్న", అంటూ పెళ్లి సంభందాలు వెదికే ముందు తాను చెప్పిన ఆందోళనను మళ్ళా చెప్పాడు శ్రీరామ్. అలా కొంచెం సేపు మాట్లాడుకొని, చివరకు తాము ఫోన్ చెయ్యకుండా, వాళ్ళంతట వాళ్లే ముందుకు వస్తే వాళ్లకి ఇష్టం ఉన్నట్టు అని, మాట ఇచ్చినందుకన్నా అప్పుడు శ్రీరామ్ తప్పక వెళ్లాలని చెప్పి ముగించారు ప్రసాద్రావు దంపుతులు. ******** శుక్రవారం వాళ్ళ ఫోన్ గురించి ఎదురు చూస్తూ గడిపాడు రాజారావు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత భర్త కొంచెం మూడీగా ఉండటం చూసి అక్కడనుంచి ఫోన్ రాలేదని గ్రహించి, అతనిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఏమయ్యిందని అడగలేదు. ఒక పక్క కూతుర్ని గమనిస్తుంది. అది కూడా పొద్దున్నంతా పైకి, కిందికి తిరగడం, హాల్లో ఊరికే టీవీ చానెల్స్ మారుస్తుండడం గమనించింది. భోజనాలయిన తరువాత కావ్య తన రూమ్ కి వెళ్ళిపోయింది. అన్ని సర్దుకొని హాల్లో కూర్చున్నారు. "అమ్మాయిని బుధవారం చూసారు, అబ్బాయితో కనీసం నిన్న మాట్లాడి వుంటారు. మరీ ఇవ్వాళ్ళయినా మనకి ఫోన్ చెయ్యాలి కదా."అన్నాడు తన ఆత్రుత కనపడనీయకుండా. "అబ్బాయితో మాట్లాటడం కుదర లేదేమో. లేకపోతె మీకు ఖాళీగా ఉంటుంది వారాంతం లో చేద్దామని ఆగారేమో", అంది సమాధాన పరుస్తూ. "నేనే ఫోన్ చేసి కనుక్కుంటా", అంటూ మొబైల్ తీసాడు. "ఒక్క నిముషం. రేపు ఎలాగూ శనివారం. ఆయనకు కాలేజీ ఉండదేమో. మన పురుషోత్తమ రావు గార్ని పంపించి కనుక్కుంటే బాగుంటుంది కదా. ఆయన చెప్పిందాన్ని బట్టి అప్పుడు మీరు మాట్లాడొచ్చు." మధ్యవర్తి ద్వారా కనుక్కునే మంచి ఆలోచన తనకి ఇచ్చినందుకు అభినందనగా ఆమె చెయ్యి మృదువుగా నొక్కి, వెంటనే మధ్యవర్తికి ఫోన్ చేసి కాకినాడ వెళ్లి కనుక్కొని ఫోన్ చేయండని చెప్పాడు. అలాగే వాళ్ళ సంభందం అంటే తమకు బాగా ఇష్టంగా ఉందని కూడా నొక్కి చెప్పమన్నాడు. అక్కడ ప్రసాద్ రావు దంపతులు కూడా రాజారావు దగ్గర్నుంచి కాని మధ్యవర్తి దగ్గరనుంచి ఫోన్ రాకపోతే కొంచెం ఆదుర్దా పడ్డారు. తనే చెబుతానన్నాడు, మరి వాళ్ళు తన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా అని ఒక డౌట్. పోనీ తనే చేద్దామా అని అనుకొన్నాడు ప్రసాద్ రావు. కాని కొడుక్కి ఇచ్చిన మాటతో ఆగిపోయాడు. శనివారం సాయంత్రం మధ్యవర్తి వచ్చేసరికి ఇద్దరూ తేలిక పడ్డారు. అమ్మాయి వాళ్లు తమ సంభందం అంటే ఇష్టం ఉన్నట్టు చెప్పడంతో ఆనంద పడ్డారు. ఇంకో సారి అబ్బాయితో మాట్లాడి నేనే ఫోన్ చేసి చెప్తా అని మధ్యవర్తికి చెప్పడంతో, అతను సెలవు తీసుకోని, వెంటనే ఆ విషయాన్ని ఫోన్ లో చేరవేసాడు. అబ్బాయి తల్లితండ్రులు కూడా ఇష్టంగా ఉన్నారని చెప్పడంతో హాయిగా నిద్రపోయాడు రాజారావు ఆ రాత్రి. ఆదివారం ఉదయం ప్రసాద్ రావు ఫోన్ చేసి చెప్పాడు, "నేనే మీకు ఆదివారం చేద్దామనుకుంటున్నాను, ఖాళీగా ఉంటారు కదా అని. ఈ లోపులే మధ్యవర్తి వచ్చారు"అంటూ తన ఆలస్యానికి వివరణ ఇచ్చుకున్నాడు. "పరవాలేదు. మీరు నాకు ఎప్పుడైనా ఫోన్ చెయ్యొచ్చు"అన్నాడు కాబోయే వియ్యంకుడికి మరింత స్వేచ్ఛ, చనువు ఇస్తూ. "మా వాడికి అన్ని చెప్పాము. మధ్యలో నేనెందుకు. మీరే మా వాడితో మాట్లాడి తేదీ, సమయం ఫిక్స్ చెయ్యండి."అన్నాడు రాజారావు డైరెక్ట్ మాట్లాడితే శ్రీరామ్ కూడా అడ్డు చెప్పకుండా వెళతాడని. "తప్పకుండా. ఇప్పుడే మాట్లాడతాను. మీరు అబ్బాయి నెంబర్ మెసేజ్ చెయ్యండి", అంటూ ఫోన్ పెట్టి భార్యకు అప్డేట్ ఇచ్చాడు, కావ్య వినేలాగా. ప్రసాద్ రావు దగ్గర నుంచి sms రాగానే శ్రీరామ్ కి ఫోన్ చేసి వచ్చే శనివారం ఉదయం పది తర్వాత వాళ్ళింటిలోనే కలుసుకునేట్టు ఫిక్స్ చేయారు. తమ గెస్ట్ హౌస్ లో ఉండవచ్చని రాజారావు ఆఫర్ చేసిన సున్నితంగా తిరస్కరించి అన్ని తాను చూసుకొంటానని చెప్పాడు. కాల్ అయిన వెంటనే తన కార్ లో వెడదామని డిసైడ్ అయ్యి, శుక్రవారం రాత్రికి హోటల్ క్వాలిటీ DV Manor హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్నాడు. డేట్ ఫిక్స్ కావడంతో శనివారం కోసం ఎదురు చూడసాగారు అందరూ. *****************
13-06-2020, 09:54 AM
(12-06-2020, 03:05 PM)madavatirasa Wrote: konchem font size penchandi peddavallam chadavalekapotunnam కొంచెం పెంచాను. చూడండి. (12-06-2020, 03:46 PM)Venrao Wrote: excellent update థాంక్ యు (12-06-2020, 06:37 PM)Gopi299 Wrote: థాంక్ యు. (13-06-2020, 06:55 AM)Chandra228 Wrote: చాలా బాగా రాస్తున్నారు ఒక మంచి కాపీ లా బాగుంది థాంక్ యు. కామెంట్స్ తో ప్రోత్చహిస్తున్న మీ అందరికి ధన్యవాదములు.
13-06-2020, 11:32 AM
Story is close to Realistic and very good narration
13-06-2020, 12:00 PM
story perru lo yemi vundadu......story matter important ani prove chestunnaru......
challa natural gaa..... realistic gaa vundi story..... nakku baga nachindi mee kathanam.. ![]()
13-06-2020, 01:13 PM
Super update
13-06-2020, 07:41 PM
Nice conversations
Plz give some big updates
14-06-2020, 03:52 PM
చాలా బాగా రాసారండి మీరు కానీ నాకు ఒక విషయం చెప్పండి కావ్య పెళ్లి అయ్యాక వేరే వాళ్ళతో శృంగరం చేస్తుందా లేక
ఈ కథ కేవలం శ్రీరామ్ కావ్య లా మధ్య రొమాన్స్ శృంగరం మాత్రమేనా అంటే నాకు ఈ కథ చదువుతుంటే ఒక లవ్ స్టోరీ ఫీల్ కలుగుతుంది ఒక మంచి అనుభూతి కలుగుతుంది అందుకే అడుగుతున్న పెళ్లి అయ్యాక కావ్య వేరే వాళ్లతో చేస్తుందా లేక శ్రీరామ్ వేరే వాళ్ళతో చేస్తాడా లేక కేవలం వారి ఇద్దరి గురించేనా ఈ కథ ఒక అంచనా కోసం అంతే కానీ మీరు ఎలా రాసిన చదువుతాము మీరు కూడా xossipy లో ఒక మంచి రైటర్ నా దృష్టిలో
14-06-2020, 05:05 PM
Story bagundhi please daya chasi padu cheyakunda rayandi
15-06-2020, 12:38 AM
(13-06-2020, 11:32 AM)srinivasulu Wrote: Story is close to Realistic and very good narration నచ్చినందుకు థాంక్స్. (13-06-2020, 12:00 PM)nobody2u Wrote: story perru lo yemi vundadu......story matter important ani prove chestunnaru...... థాంక్స్ ఫర్ యువర్ కామెంట్. (13-06-2020, 01:13 PM)Gsyguwgjj Wrote: Super update నచ్చినందుకు థాంక్స్. (13-06-2020, 07:41 PM)maskachaska2000 Wrote: Nice conversations నచ్చినందుకు థాంక్స్. కథను సన్నివేశాలుగా విడిగొట్టి రాస్తున్న. ఏదైనా ఎపిసోడ్ లాజికల్ గా ముగిస్తే చదువరులకు బాగుంటుంది అని ఆలోచన. తరువాతది సన్నివేశపరంగా పెద్దది. (14-06-2020, 03:52 PM)Mahesh12345 Wrote: చాలా బాగా రాసారండి మీరు కానీ నాకు ఒక విషయం చెప్పండి కావ్య పెళ్లి అయ్యాక వేరే వాళ్ళతో శృంగరం చేస్తుందా లేక చాలా థాంక్స్ అండి డిటైల్డ్ గా కామెంట్ పెట్టినందుకు. ఇది సస్పెన్స్ కధ కాదు, కానీ చాలా మంది పాఠకులకు (నాక్కూడా) కధలో ముందు జరగబోతోందో తెలియకుండా ఉండటమే ఇష్టం. అందుకే ఇక్కడ చెప్పడం లేదు. మీకు తెలుసు కోవాలని ఉంటే చెప్పండి, పీఎం చేస్తా. (14-06-2020, 03:53 PM)appalapradeep Wrote: Update pl అప్డేట్ ప్లీజ్ అని సైట్ లో కామెంట్ చూసినప్ప్పుడల్లా, పాఠకులు కథపై తమ ఇష్టాన్ని పరోక్షంగా తెలియ చేస్తున్నట్టు నా భావన. నచ్చినందుకు థాంక్స్. ఒక్కో ఎపిసోడ్ సగటున రెండున్నర గంటలు పడుతోంది (రఫ్ డ్రాఫ్ట్, రివిషన్, తప్పులు దిద్దటం అన్ని కలిపి) రాయటానికి. ఇప్పటి వరకు ఉపోద్ఘాతం లో చెప్పినట్టు క్రమం తప్పకుండా వారానికి రెండు అప్డేట్లు పెడుతున్నాను. నెక్స్ట్ అప్డేట్ రఫ్ డ్రాఫ్ట్ అయ్యింది. కధా పరంగా కీలక సన్నివేశం. వారాంతం అయిపొయింది, రేపటి నుంచి మళ్ళా పని. రెండు రోజుల్లో తరువాత అప్డేట్ పెడతాను. (14-06-2020, 05:05 PM)Kumar678 Wrote: Story bagundhi please daya chasi padu cheyakunda rayandi కధ అనుకున్న ప్రకారం సన్నివేశాలుగా విభజించి రాస్తున్నా. ఇప్పుడు కధను మార్చే ఉద్దేశం లేదు. తమ కధ బాగుండాలని ప్రతి రచయిత ధ్యేయం. మీకు నచ్చినందుకు థాంక్స్. ఉపోద్ఘాతం లో చెప్పినట్టు, ఈ కధ రొమాంటిక్ గా రాయాలా లేక శృంగారం జోడించాలా అనేది నాకు కొంచెం సందేహం. చివరకు శృంగారం సన్నివేశాలకు అవకాశం ఉండటంతో, అలాగే కధకు కొంచెం బలం చేకూరుస్తాయని భావించడంతో రాయడానికి నిర్ణయించాను. అలాగే చిన్న ప్రయోగం చేద్దామనిపించింది. ఆల్రెడీ రెండు సీన్స్ (తరువాత వస్తాయి) రఫ్ డ్రాఫ్ట్ కొంత రాసాను. బాగా మెరుగు పెట్టాలి. నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలను చెబుతూ ఉండండి.
15-06-2020, 08:00 AM
nice story
15-06-2020, 02:50 PM
Nice Story bro... Story lo sex lekapoyana chala interesting ga chadavali anipistundi... Prathi update kosam eppudeppuda ani chala wait chestunnam Brother...
16-06-2020, 01:46 PM
చాలా చక్కగా సాగుతోంది కథ కావ్య శ్రీరామ్ శృంగరం ఎలా ఉండబోతోందో అలాగే చెల్లి కూడా బావ ని ఆట పట్టించడానికి రెడీ గా ఉంది..
Chandra
![]()
16-06-2020, 05:06 PM
అసలు ఏం కధనం అండి. నాకైతే ఏదైనా Novel చదువుతున్న భావన వస్తుంది.మీరు అనుకుని ఉంటే ఇక్కడ వరకు రాసినదంతా ఒక episode లో రాయొచ్చు . కానీ మీరు మీ కథతో పాటు మీ audience కూడా పాత్రలతో ప్రయాణిించాలనుకున్నారు. అందుకే కధనం పట్టు సడలకుండా సాగుతుంది. "పేరులో ఏముంది" అనే title ఎ
చాలా మందిని ఆకర్షిస్తోంది.That was a clever move...Update కోసం wait చేస్తూ ఉంటాను.
17-06-2020, 06:44 AM
(13-06-2020, 06:55 AM)Chandra228 Wrote: చాలా బాగా రాస్తున్నారు ఒక మంచి కాపీ లా బాగుంది మీ కామెంట్ పదహారేళ్ళ క్రితం విడుదలైన ఆనంద్ అనే సినిమాని గుర్తుకి తెచ్చింది. సినిమా టాగ్ లైన్ "మంచి కాఫీ లాంటి సినిమా" కు సరిపోయేలా, పోస్టర్ మీద కాఫీ కప్పుతో కమలిని ముఖర్జీ. థాంక్ యు సర్, ఫర్ ది వండర్ఫుల్ కామెంట్. (15-06-2020, 08:00 AM)bobby Wrote: nice story నచ్చినందుకు థాంక్స్. (16-06-2020, 01:46 PM)Chandra228 Wrote: చాలా చక్కగా సాగుతోంది కథ కావ్య శ్రీరామ్ శృంగరం ఎలా ఉండబోతోందో అలాగే చెల్లి కూడా బావ ని ఆట పట్టించడానికి రెడీ గా ఉంది.. "సౌమ్య ఒక చురుకైన అమ్మాయి. చలాకీతనంతో పాటు అల్లరి కూడా ఎక్కువే" అన్న ఒక్క వాక్యంతో ఆమె స్వభావం చెప్పేయొచ్చు. కానీ సంభాషణలతో పాఠకులే పాత్రల మీద ఒక అంచనాకు రాగలికితే, రాసిందంతా వ్యర్థం కాదని సంతోషం. రెగ్యులర్ గా కామెంట్స్ పెడుతూ ఎంకరేజ్ చేస్తున్నందుకు థాంక్స్ అండి. (16-06-2020, 05:06 PM)Thewhitewolf89 Wrote: అసలు ఏం కధనం అండి. నాకైతే ఏదైనా Novel చదువుతున్న భావన వస్తుంది.మీరు అనుకుని ఉంటే ఇక్కడ వరకు రాసినదంతా ఒక episode లో రాయొచ్చు . కానీ మీరు మీ కథతో పాటు మీ audience కూడా పాత్రలతో ప్రయాణిించాలనుకున్నారు. అందుకే కధనం పట్టు సడలకుండా సాగుతుంది. "పేరులో ఏముంది" అనే title ఎ మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇంతవరకు రాసింది ఒక ఎపిసోడ్ లో క్లుప్తంగా రాయొచ్చు. కానీ ఏ ఉద్దేశ్యంతో రాసానో అది సఫలీకృతం అయ్యిందని మీ కామెంట్ ద్వారా తెలిపారు. యు మేడ్ మై డే. కధ పేరు మీద చాలా మంది కామెంట్ చేసారు. చివరలో ఒక వివరణ రాస్తాను. తరువాతి అప్డేట్ ఇంకో పది నిముషాల్లో అప్లోడ్ చేస్తాను.
17-06-2020, 07:20 AM
ఎపిసోడ్ 7
అబ్బాయికి, కావ్యకి నచ్చితే ఇక ఫిక్స్ చేయడమే తరువాయి కాబట్టి ఎందుకైనా మంచిదని రాజారావు హైదరాబాద్ లో ఉన్న తన క్లోజ్ కాంటాక్ట్స్ ఇద్దరికీ ఫోన్ చేసి శ్రీరామ్ వివరాలు చెప్పి జాగ్రత్తగా వాకబు చేయమన్నాడు. వాళ్ళ దగ్గరనుంచి కూడా అంతా పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడంతో ఆ వివరాలన్నీ భార్య, కూతుళ్ళకి చెబుతూ తాను మనసులో ఆ సంభందం మీద ఫిక్స్ అయిపోయాడు. వాళ్ళ పేరెంట్స్ వచ్చినపుడు సాంప్రదాయంగా తయారైన తను శ్రీరామ్ వచ్చినప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచించింది. చివరకు చీర, జాకెట్ అయితే మంచిదని అమ్మతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చింది. తల్లి కూతుళ్లిద్దరూ కాచి వడపోసి ఒక చీర డిసైడ్ చేశారు. మొదట వీపంతా కనిపించే స్లీవ్ లెస్ డిజైనర్ జాకెట్ వేసుకొందామని అనుకొన్నా, మొదటి సారి అది ఎక్కువవుతోందేమో అని షార్ట్ స్లీవ్స్ కేవలం వీపు మధ్యలో నాలుగంగుళాల వృత్త భాగం మేర మాత్రమే కనిపించే జాకెట్ సెలెక్ట్ చేసింది. మొదట స్నేహితుణ్ని తీసుకెళదామా అనుకొన్నా, తను సీరియస్ కాదు కాబట్టి ఒంటరిగా వెళ్ళటానికి ఫిక్స్ అయ్యాడు శ్రీరామ్. మొదట్లో ఈజీగా తీసుకున్న, అతనికి మొదటి పెళ్లి చూపులవ్వడం, పైగా తాను ఒక్కడే వెళ్లాల్సి రావడంతో విజయవాడకు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ అనుభవం ఎలా ఉంటుందో అని టెన్షన్ గా అనిపించినా, తాను ఫార్మాలిటీ కోసం వెళుతున్నానని అనుకోడంతో నార్మల్ అయ్యాడు. పెళ్లి చూపుల తర్వాత విజయవాడలో ఏమి చెయ్యాలా అని ఆలోచించుకుంటూ హోటల్ గదిలో నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికి రెండు సార్లు అనుభవం ఉండటంతో నార్మల్ గానే ఉంది కావ్య. కాకపొతే తల్లితండ్రులు ఈ సంభందం మీద బాగా ఆశ పెట్టుకొన్నారు. అబ్బాయి ఎలాంటివాడో అన్న ఆలోచనలతో నిద్దురలోకి జారుకొంది. ************** అనుకున్నట్టుగానే మరుసటి రోజూ రాజారావు ఇచ్చిన అడ్రస్ ద్వారా వాళ్ళ ఇంటికి చేరుకొన్నాడు. ఇంటి బయట రాజారావు, జానకి అన్న పేర్లు లేకపోతె తాను తప్పు అడ్రస్ కి వచ్చానా అని అనుకొనేవాడే. తండ్రి ఇల్లు బాగా ఉందని చెప్పినా అంతపెద్దదని ఊహించలేదు. ముందుగానే చెప్పి ఉంచడంతో గేట్ తీసాడు సెక్యూరిటీ వాడు కార్ లో ఉన్న శ్రీరామ్ ని చూసి. లోపల పార్కింగ్ లో తన కార్ పార్క్ చేసి బయటికి దిగిన శ్రీరామ్ కి అక్కడ పోర్టికోలో ఉన్న బెంజ్, BMW లగ్జరీ కార్స్ చూసి, తన హుండాయ్ వెర్నా చూస్తే నవ్వు వచ్చింది. ఈ సంభందం తమ రేంజ్ కాదని ఆ క్షణమే ఫిక్స్ అయ్యాడు. పనివాడి ద్వారా అతని రాకను తెలుసుకున్న రాజారావు బయటకు వచ్చి సాదరంగా ఆహ్వానించాడు. లోపలికి వెళ్లే సరికి అక్కడే ఉన్న జానకి, కావ్య లను పరిచయం చేసాడు. తమ ఇంట్లో చెల్లి పెళ్లి చూపుల తంతు అలవాటయిన శ్రీరామ్, కొంచెం సేపు అయిన తర్వాత కావ్యను పిలుస్తారని అనుకొన్నాడు. కాని అలా ఇన్ఫార్మల్ గా పరిచయం చేయడం నచ్చింది. ప్రతి నమస్కారాలు అయిన తరువాత కూర్చున్నారు. తరువాత సంభాషణ ఎక్కువ రాజారావు నడిపించాడు. చదువు, హాబీలు, జాబ్ గురించి అడుగుతుంటే చాలా విపులంగా జవాబులు చెప్పాడు. ముఖ్యంగా తన ఉద్యోగం గురించి చెప్పేటప్పుడు, టెక్నికల్ మాటలు వాడకుండా సాధ్యమైనంత వరకు వాళ్లకు వివరించిన తీరు కావ్యకు బాగా నచ్చింది. అంతేకాకుండా మాట్లాడుతున్నంత సేపు తన తండ్రి వేపే చూస్తూ మాట్లాటడం గమనించింది. కొంత సేపు అలా మాటలు సాగిన తరువాత భార్య సైగ చేయడంతో కూతురి వేపు తిరిగి, "కావ్య, శ్రీరామ్ కి నీ గది చూపించు"అన్నాడు. అస్సలు అది ఊహించని శ్రీరామ్ కి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టు అయ్యింది. ఇక్కడే మాట్లాడదాం అందామనుకొనేలోగా కావ్య లేచి నిలబడటంతో గత్యంతరం లేక తను లేచి ఆమె వెనకాలే నడిచాడు. ఆ ఇంటి లోపల పరిసరాల్ని గమనిస్తూ ఆమె వెనక నడవసాగాడు. మెట్లు ఎక్కగానే అక్కడ ఒక గోడకి నిలువెత్తు అద్దం ఉంది. ముందుంగా మెట్లెక్కిన కావ్య కొంచెం పక్కకు జరిగి అద్దంలో తన వెనక వస్తున్న శ్రీరామ్ కేసి చూసింది. అతను వెనక్కి తిరిగి ఇంటి హై సీలింగ్, మధ్యగా అమర్చిన అందమైన పెద్ద శాండిలీర్ చూస్తూ తన వెనక వస్తుండటంతో కొంచెం నిరుత్సహ పడింది. తను అంత కష్టపడి డ్రెస్ సెలెక్ట్ చేస్తే మహానుభావుడు అస్సలు పట్టించుకున్నట్టు లేదు అని. పైకి చేరిన తరువాత ఎడమవైపు చూపించి అతనికి ముందు నడుస్తూ తన గదిలోకి తీసుకు వెళ్ళింది. గదిలోకి వెళ్లిన శ్రీరామ్ కి మతి పోయింది. ప్రవేశించగానే కూర్చోవడానికి సిట్ అవుట్ ఏరియా, అక్కడ ఒక రిక్లైనర్, ఒక కుర్చీ, రెండు సీట్ల సోఫా, మధ్య కాఫీ టేబుల్ తో కలిసిన ఖరీదైన ఫర్నిచర్ ఉంది. సోఫా కి వెనక గోడకి ఒక పెద్ద టేబుల్ కన్సోల్, పైన మూడు గాజు అల్మైరా లతో కూడిన పెద్ద బుక్ షెల్ఫ్. కుడి వైపుకు వెళితే దాదాపు 22x26 అడుగుల విస్టీర్ణంలో ఉన్న గదిలో, ఒక వైపు గోడకానుకొని కింగ్ సైజు బెడ్డు, సైడ్ టేబుల్స్, ఇంకో వైపు పెద్ద వార్డ్ రోబ్, మరో వైపు ఒక చిన్న స్టడీ టేబుల్ చైర్, మంచానికి ఎదురు వేపు గోడపై మౌంట్ చేసిన 65 అంగుళాల టీవీ. ఇంకో పక్క గోడకి తలుపు వుంది. బహుశా బాత్ రూమ్ అయివుండచ్చు అనుకొన్నాడు. ముందుగానే లైట్స్ వేసి ఉంచడంతో దేదీప్య మానంగా వెలిగి పోతుంది బెడ్ రూమ్. తనకి గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉండే కొంచెం రిచ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కాని అలాంటి బెడ్ రూమ్ అంతవరకూ చూడని శ్రీరామ్ తన ఆశ్యర్యాన్ని మనసులోనే దాచుకొన్నాడు. తను ఒప్పుకుంటే అదే తమ బెడ్ రూమ్ అన్న తలంపు వచ్చి అతని పెదవులపై చిరు దరహాసం మెరిసినా, అది కనిపించనీయకుండా ఇంకో వైపు చూస్తూ "చాలా బాగుందండి మీ గది", అని మెచ్చుకున్నాడు సిన్సియర్ గా. జవాబుగా "థాంక్స్"అని నవ్వి ఊరుకుంది కావ్య. తను సంభాషణ మొదలు పెడతాడేమోనని ఎదురు చూస్తుంది. ఈ లోపల బుక్ షెల్ఫ్ వేపు నడిచిన శ్రీరామ్ ప్రతి పుస్తకాన్ని చూడసాగాడు. "ఓ మీరు sapiens a brief history of humankind చదివారా. వెరీ గుడ్ బుక్. when breath becomes air, వెరీ టచింగ్"అంటూ పైకి మాట్లాడుతూ పుస్తకాలను వరుసగా చూడసాగాడు. కింద సెక్షన్ లో తెలుగు పుస్తకాలు చూసి,"మీరు తెలుగు పుస్తకాలు కూడా చదువుతారా. భరాగో, చాసో కధలు, మీ కలెక్షన్ చాలా అద్భుతంగా ఉంది", అంటూ ఉత్సాహంగా చెబుతుంటే అతను బుక్స్ బాగా చదువుతాడని అర్ధం అయ్యింది. మనస్సులో ఒక మెట్టు పైకి ఎక్కాడు. ఇక అలా వదిలేస్తే పుణ్య కాలమంతా తినేస్తాడని "లేదండి. నేను ఎక్కువ ఇంగ్లీష్ చదువుతాను. తెలుగు పుస్తకాలు అమ్మ, నాన్న చదువుతారు. వాళ్ళ రూమ్ లో ఎక్కువయిపోతే ఇక్కడ పెట్టాము. రండి కూర్చోండి"అంటూ తను కూర్చుంది. కొంచెం సేపు వరకు అతను ఏమి మాట్లాడకపోతే తనే కదిపింది,"మీరు బాడ్మింటన్ లో స్టేట్ రన్నర్ అప్ అని చెప్పారు అంకుల్" "అవునండి నేషనల్స్ కి ఎంట్రీ వచ్చింది. ట్రైన్లో ఢిల్లీ వెళ్లి రావాలంటే నాలుగు రోజులు పడుతుంది. ఇంకో పక్క పరీక్షలు దగ్గర పడ్డాయి. ఫ్లైట్ లో వెళ్లి వచ్చే తాహతు లేదు. అంతా ఆలోచించి వెళ్లడం మానేసాను. ఒకందుకు అదే మంచిదయ్యిందేమో, చదువు మీద దృష్టి నిలుపాను."అన్నాడు నిర్లిప్తంగా. "ఐఐటీ లో గోల్డ్ మెడలిస్ట్ అని కూడా చెప్పారు",అంది ఇంకో అస్త్రం వేస్తూ ఏమైనా ఓపెన్ అప్ అవుతాడేమోనని. "అవునండి దేవుడి దయ వల్ల నాకు చదువు బాగానే వచ్చింది"అన్నాడు అణకువగా. కొంచెం లిఫ్ట్ ఇచ్చినా తను ఎక్కువగా చెప్పకపోవడంతో, చూస్తుంటే ఈ రాముడు మరీ బుద్ధిమంతుడిలా ఉన్నాడు, కాకపొతే కొంచెం రిజెర్వేడ్ టైపు, ఇక తనే లీడ్ తీసుకోవాలి అని నిశ్చయానికి వొచ్చింది. ఏ మాత్రం అవకాశం వచ్చినా తమ గొప్పలు చెప్పుకునే అబ్బాయిలను చూసిన తరువాత, కనీసం తను వివాహానికి పరిశీలిస్తున్న అమ్మాయితో తన గురించి చాలా వున్నా, అవకాశమిచ్చినా చెప్పుకోకపోవడం ఆశ్చర్యమనిపించింది. "ఇంతలో ఇక వెళదామా అండి", అనటంతో షాక్ అయ్యింది. అంతలోనే తేరుకొని,"అరె అప్పుడే, మీకు టిఫిన్ కూడా పెట్టలేదు", అంటూ అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గది బయటకు వచ్చి కొంచెం దూరంగా ఎదురు చూస్తున్న పనిమనిషి సీత దగ్గరికి వెళ్లి, పది నిమిషాలు తరువాత టిఫిన్ తీసుకురా. తరువాత ఇంకో పావుగంటకి కాఫీ పట్టుకురా అని మెల్లిగా చెప్పి లోపలికి వెళ్ళింది. అసలు కొంచెం కూడా తినకుండా వెళ్ళిపోతే అమర్యాదగా ఉంటుందని కూర్చున్నాడు. చేతులు కడుక్కోవాలి అంటే తన రూమ్ లో మూసివున్న తలుపు కేసి చూపించింది. అది తీసుకొని లోపలికి వెళితే 8x10 సైజు లో ఒక డ్రెస్సింగ్ రూమ్. గదిలో పెద్ద డ్రెస్సింగ్ మిర్రర్, బట్టలు పెట్టుకోవడానికి వార్డ్ రోబ్స్. ఒకటి తెరచి ఉండటంతో అందులో కావ్య ఖరీదైన డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి. ఆ గదికి ఆవల వైపున ఉన్న తలుపు తీసుకొని లోపలికి వెళితే బాత్రూం. ఆల్మోస్ట్ తన థర్డ్ బెడ్ రూమ్ అంత పెద్దది. ఒక వైపున గ్లాస్ పార్టిషన్ తో షవర్ క్యూబికల్, దాని పక్కన పెద్ద బాత్ టబ్. గోడలకి అద్దాలు, మార్బల్ కౌంటర్ టాప్, కింద షెల్ఫ్ లు. గోడలకి అందమైన డిజైనర్ టైల్స్, ఆంటీ స్కిడ్ ఫ్లోర్ టైల్స్ తో చాలా అద్భుతంగా ఉంది. స్టార్ హోటల్ లో కూడా అంత అందమైన, విశాలమైన బాత్ రూమ్ చూడలేదు. చేతులు కడుక్కొని, అక్కడ టవల్ తో తుడుచుకొని వచ్చాడు. తనే మాటలు కదిపింది. మాటల్లో అతను మెల్లిగా తమ కుటుంబం గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, తన తల్లితండ్రులు కష్టపడి తనని చదివించి, చెల్లికి పెళ్లి చేయడం అన్ని చెప్పాడు. అతను తమ స్థితిగతుల గురించి చెబుతుంటే అతని నిజాయితీ నచ్చింది. ప్రతివారు ఎంతో కొంత ఎక్కువ చెబుతుంటే, ఇతనేమిటి కొంచెం భిన్నంగా ఉన్నాడు, అవకాశమిచ్చిన తనగురించి ఎక్కువ చెప్పుకోలేదు. ఏమై ఉంటుంది? ఏమైనా ప్రేమ వ్యవహారం ఉందా లేక అతను అణుకువ కలిగిన వ్యకిత్వమా అన్న అంచనాలు వేస్తోంది మనస్సులో. ఇంతలో స్నాక్స్ వస్తే టేబుల్ మీద పెట్టించి అతనికి ఒక ప్లేట్ స్వయంగా అందించింది. తింటున్నప్పుడు ఏమి మాట్లాడలేదు. తన గురించి ఏమి అడగక పోవటం కావ్యకు ఆశ్చర్యం కలిగిస్తుంటే, అక్కడ నుంచి ఎంత త్వరగా బయటపడదామా అని శ్రీరామ్ ఆలోచిస్తున్నాడు. కొంచెం సేపటికి కాఫీ లు వచ్చాయి. కాఫీ కప్పు అందిస్తూ, అది తాగితే ఇక తమకు సమయం లేదని తనే అడిగింది చివరికి,"ఇంతకీ మీరు నా గురించి ఏమి అడగలేదు" గొంతుకలో ఉన్న కాఫీ గుటక వేసి ఒక్క క్షణం ఆగాడు. ఆమె అడిగిన దాన్ని బట్టి తనలా ఆమె డిసైడ్ అవలేదని ఊహించి, ఎలా చెప్పాలి అని కొంచెం ఆలోచించి, ఊపిరి తీసుకోని చెప్పసాగాడు. "మీకు ఎలా చెప్పాలో అర్ధం కావటం లేదండి. అసలు మీరు ఇంకా మా సంభందం గురించి ఇంకా ఆలోచిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మీకు మాకు ఆర్ధికంగా చాలా తేడా ఉంది. నా అపార్ట్మెంట్ మీ బెడ్ రూమ్ సైజుకి రెండింతలు ఉంటుందేమో. కుర్రాడు బాగా చదువుకున్నాడు, కొంచెం ఆర్థికంగా సపోర్ట్ చేస్తే సరిపోతుంది అని మీ పేరెంట్స్ అనుకొని ఉండవచ్చు. నా ఆదాయంతో మీరు ఇప్పుడు పొందే సుఖాలను ఇచ్చే తాహతు నాకు లేదు. అలాగని ఆయాచితంగా వచ్చే డబ్బుని కూడా అనుభవించాలని ఉండదు. స్వంత కాళ్లపై నిలబడాలి అన్నదే నా ఆశయం. స్వశక్తితో ఒక్కో మెట్టు పైకెక్కాలన్నదే నా ఆలోచన. ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. బాగా చదువుకున్న, ఆర్ధికంగా మా స్థాయిలో ఉన్న వారినే చూడమన్నాను. ఇంతవరకు అనుకోకుండా వచ్చింది. నేను చేసుకునే అమ్మాయి పెళ్లి తర్వాత కష్ట పడటం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మీకు వంక పెట్టటానికి ఏమి లేదు. మీకు అన్ని వున్నాయి. మీకు సరిపోయే మంచి గొప్ప సంభందం తప్పక దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్" మెల్లిగా మొదలయి ఒక ప్రవాహంలా సాగిపోయిన అతని మాటలతో అతని వ్యక్తితంపై గౌరవం కలిగింది. అతను తన తల్లితండ్రుల మనోభావాల్ని పుస్తకం చదివినట్టు చెప్పడంతో అతని ఆలోచనా విధానం బాగా నచ్చింది. చాలా మంది మగవారు అమ్మాయి ఎంత బాగున్నా, వివాహం ద్వారా తాము ఎంత సుఖపెడతామా అని ఆలోచిస్తారు. అందులో తప్పేమి లేదు వారికి కావలిసినట్టు దొరికితే. అందరికి భిన్నంగా చేసుకునే అమ్మాయి కష్ట సుఖాలు, తాను అమ్మాయికి ఏమి ఇవ్వగలను అన్న అతని ఆలోచనతో ఒక నిర్ణయానికి వచ్చింది. కాని ఆ పరిస్థితిలో ఏమి మాట్లాడిన ప్రయోజనం ఉండదని గ్రహించి,"థాంక్స్ అండి. మీ ఆలోచన విధానం బాగుంది. తర్వాత మాట్లాడదాం", అంది ఇంకా సంబంధానికి తెరపడలేదని తెలియచేస్తూ. అప్పటికే కాఫీ అవడంతో, ఇంకా సంభాషణ పొడిగించడం ఇష్టం లేక,"వెళదామండి. కింద ఎదురు చూస్తుంటారు"అని తనే దారి తీసాడు. మాట్లాడకుండా గంభీరంగా వస్తున్న ఇద్దరినీ చూసి ఏమయి ఉంటుందా అనిపించింది రాజారావు దంపతులకు. కొంచెం వెనకగా వస్తున్న కూతురి వేపు చూసాడు ఏమైనా హింట్ ఇస్తుందేమోనని. చెయ్యి చూపించి తరువాత చెబుతా అన్నట్టు సైగ చేసింది కావ్య ప్రసన్నంగా. దాంతో కొంచెం సర్దుకొన్నాడు రాజారావు. "రా బాబు కూర్చో. ఏమిటి ఇవ్వాళ్ళ నీ ప్లాన్"అన్నాడు మెల్లిగా అతని దగ్గర నుంచి ఏమైనా లాగుదామని. "ఇక్కడ గాంధీ నగర్లో నా ఫ్రెండ్ పేరెంట్స్ ఉండాలి. వాళ్ళని కలిసి సాయంత్రం దుర్గ దర్శనం చేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతా. ఇప్పటికే చాలా సేపు అయ్యింది", అన్నాడు వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్టు. "నీ బిజినెస్ కార్డు ఏమైనా ఉంటే ఇవ్వు బాబు."అన్నాడు తన కార్డు అందచేస్తూ. శ్రీరామ్ ఇచ్చిన కార్డు తీసుకోని కావ్యకు ఇస్తూ, శ్రీరామ్ కి ఒక మిస్సెడ్ కాల్ ఇవ్వు అంటూ, "నీకు విజయవాడలో ఏమైనా అవసరం పడితే అమ్మాయికి గాని నాకు గాని ఫోన్ చెయ్యి బాబు." "అలాగే అంకుల్. మీ ఇల్లు చాలా బాగుంది. నైస్ మీటింగ్ యు", అంటూ అందరికి నమస్కారం చేసి బయటకు నడిచాడు. బయటకు వచ్చి కార్ ఎక్కి రివర్స్ చేసి వెళ్ళ బోతూ పోర్టికో కేసి చూసాడు. అక్కడ కావ్య కనిపించడంతో సభ్యతగా ఉండదని అద్దం కిందకు దించి బై అంటూ చెయ్యి ఊపాడు. ప్రతిగా తను చెయ్యి ఊపింది నవ్వుతూ. ఆ నవ్వుకు అర్ధం ఏమై ఉంటుందా అన్న సందిగ్తతో గేర్ మార్చి ముందుకు పోనిచ్చాడు కార్ ను.
17-06-2020, 07:33 AM
mkole123 గారి లాంటి మరియు మీ లాంటి రచయితలు దొరకటం (ఇక్కడ దొరకటం) మా అదృష్టం.
![]() ![]()
17-06-2020, 09:39 AM
very nice. good boy our hero so far
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini |
« Next Oldest | Next Newest »
|