11-12-2019, 10:47 AM
మిత్రమా నరేశా
ఇంకా ఈ కథ చదవలేదు
చదివినాక స్పందిస్తా
ఇంకా ఈ కథ చదవలేదు
చదివినాక స్పందిస్తా
Poll: నా కథల్లో ఏది కొనసాగించాలి అనుకుంటున్నారు? You do not have permission to vote in this poll. |
|||
దూలగాడు | 9 | 13.85% | |
బుతుబంగ్లా | 10 | 15.38% | |
ఖర్కోటకుడు | 46 | 70.77% | |
Total | 65 vote(s) | 100% |
* You voted for this item. | [Show Results] |
Fantasy WBC { వరల్డ్స్ బెస్ట్ క్రికెటర్ }
|
11-12-2019, 10:55 AM
11-12-2019, 10:58 AM
(10-12-2019, 10:38 PM)naresh2706 Wrote: థాంక్స్ అన్నయ్యా.. గతంలో ఒక కథ చదివాను. స్వాతీలోనో మరే మ్యాగజైనో జ్ఞాపకం లేదు. అందులో క్రికెట్ నేపథ్యంలో ఒక థ్రిల్లింగ్ కథ వుంటుంది. అందుకు తగినట్లే వలపు సన్నివేశాలు వ్రాసారా రైటర్. పేరు గుర్తులేదు. కానీ, కంటెంట్ కాస్త గుర్తు వుంది. అందుకే, నువ్వు కథని క్రకెట్ నేపథ్యంలో ఎంచుకున్నప్పుడు నాకు ఆ కథ జ్ఞప్తికి వచ్చింది. కానీ, ఇది వేరేలా వుంది. కాస్త ఖర్కోటకుడు టైప్ మిక్స్ అయ్యేలా అన్పిస్తోంది... ఆ సాటిలైట్ ఫోన్ వాడకం చదివాక. ఓకే... ఒకటే లైన్ వ్రాయాలన్నా బోర్ కొట్టేందుకు ఆస్కారం వుంది. తప్పకుండా ఇలా మార్పులు చేస్తూ వుండాలి. ట్రైన్ లో ప్రయాణిస్తుండగా తళుక్కున ఆలోచన మెరిసింది హ్యారీ పాటర్ రచయిత్రికి... ఒక కాఫీ షాప్ లో కూర్చొని కథని వ్రాసేది. కనుక,వ్రాత ఎక్కడ ఎంతసేపు టైం తీసుకుంటున్నాం అన్నదానిపైన ధ్యాస పెట్టనక్కరలేదు. అవుట్ పుట్ కరెక్టుగా వస్తే చాలు. కానీ, ముగింపు మాత్రం కాస్తయినా అవగాహన మొదలుపెట్టేప్పుడు వుండాలి. లేదంటే మాత్రం మళ్ళా ఇబ్బందయిపోతుంది. ఓకే... కంటిన్యూ! గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
11-12-2019, 01:00 PM
సారి బ్రదర్... పైన పోల్ లో ఎదీ సెలెక్ట్ చేయలేను. నువ్వు అన్ని కొనసాగించాలసిందే...! ;)
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
13-12-2019, 09:42 AM
గురూ...... నరేశా .....
లక్ష్మిగారి " తప్పని సరియై " కొరకు వెతుకుతుంటే ఒక త్రెడ్ WBC { వరల్డ్స్ బెస్ట్ క్రికెటర్ } అని...... ఎవడో క్రికెట్ పిచ్చోడు అనుకొంటూ దాటి పోయా కాని ఎక్కడో చిన్న జలుక్కుల మెదడులో తగిలింది మల్లీ వెతుక్కుంటూ తిరిగివచ్చా........ యస్.... మై ఫ్రెండ్ naresh2706 it is you ......... కరెక్టే నిద్రావస్తలో కూడా కొన్ని విషయాలు మైండ్ లో రెజిస్టర్ అవుతుంటాయి ........ అలాగే నీ పేరు మైండ్ లో lock అయిపొయ్యింది At last you"r back .... with BANG నీదైన శైలి లో సూపర్ ఓపనింగ్ అని splగా చెప్పనవసరం లేదు__ IT IS........ Thanks for comming back ఇక నివ్వు ఏది రాసిన ,దేని మీద రాసిన అద్బుతంగా ఉంటుంది..... ప్రాబ్లమ్ మాకే సూపర్ ,బెస్ట్,ఫైన్ .ఆతరువాత కొత్త పదాలు దొరకక . Iam most happy person right now
mm గిరీశం
13-12-2019, 04:08 PM
(11-12-2019, 10:58 AM)Vikatakavi02 Wrote: గతంలో ఒక కథ చదివాను. స్వాతీలోనో మరే మ్యాగజైనో జ్ఞాపకం లేదు. అందులో క్రికెట్ నేపథ్యంలో ఒక థ్రిల్లింగ్ కథ వుంటుంది. అందుకు తగినట్లే వలపు సన్నివేశాలు వ్రాసారా రైటర్. పేరు గుర్తులేదు. ఇంత సపోర్ట్ నేను పెయిడ్ ఆర్మీ పెట్టుకున్న పొందలేను బ్రదర్.. కొత్త అప్డేట్ ఇస్తున్నా చూసి ఎలా ఉందో చెప్పు
13-12-2019, 04:12 PM
13-12-2019, 04:20 PM
(13-12-2019, 09:42 AM)Okyes? Wrote: గురూ...... నరేశా ..... నా అప్డేట్ చూసి నువ్వు ఎంత ఆనందపడ్డావ్ అనేది నాకు తెలీదు కాని బాబాయ్.. నీ కామెంట్ చూసాక నాకు మాత్రం జాక్ డేనియల్స్ ఇండియాలో, అది కూడా ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 8 దాటిన తర్వాత mrp రేటుకు దొరికినంత ఆనందంగా ఉంది. అయినా బాబాయ్ బాబాయే.. మావయ్య మావయ్యే.. ఆయన చెప్పినా చూస్తానని చూడలేదు. నీకు చెప్పకపోయినా వెతుక్కుని మరీ చూశావ్. నీ happiness డబల్ చేయడానికే నీ కామెంట్ చదివి ఖాళీ చేసుకుని అప్డేట్ రాసి పోస్ట్ చేస్తున్నా. చదివి అభిప్రాయం చెప్పు.
13-12-2019, 04:36 PM
(This post was last modified: 13-12-2019, 04:52 PM by naresh2706. Edited 2 times in total. Edited 2 times in total.)
అప్డేట్ : 2
2023ఏప్రిల్ 1st స్థలం: కరాచీలో గుల్షన్ నగరానికి పక్కగా ఉన్న చిన్న మురికివాడ. ఉదయాన్నే లేచి తన అమ్మీ పెట్టిన రోటీ క్యారేజ్ లో సర్దుకుని సైకిల్ మీద టౌన్ కి వెళ్తున్నాడు అమీర్ భాషా. దారిలో మురికి గుంట పక్కన పొదల్లో కుక్కలు గుంపులుగా కీచులాడుకుంటున్నాయి. వాటి రొద విని అటువైపుగా దృష్టి సారించాడు భాషా. "ఏదో ఆవుని పట్టేసాయి ఇవి" అని మనసులో అనుకుంటూ కుతూహలం కొద్దీ కర్ర తీసుకుని వాటిని అదిలిస్తూ కుక్కలు ఉన్న వైపు వెళ్ళి చూడగానే అదిరిపడ్డాడు. అక్కడ కుక్కలు ఎవరో చనిపోయిన యువకుడి శవాన్ని పీకుతున్నాయ్. వెంటనే వెనక్కి పరిగెత్తి సైకిల్ కి తగిలించిన తన బుట్టలోంచి ఫోన్ తీసి సెక్యూరిటీ అధికారి ఎమర్జెన్సీ నెంబర్ 15 డయల్ చేసాడు. "హలో.. సెక్యూరిటీ అధికారి ఎమర్జెన్సీ.. చెప్పండి" " సర్ ఇక్కడ ఒక శవం ఉంది సార్" "మీ పేరు?" "భాషా.. అమీర్ భాషా సర్" "మీరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు?" "కరాచీలో గుల్షన్ సిటీకి 10కిలోమీటర్ల దూరంలో ఉన్న మురికివాడ నుంచి సార్" "హ్మ్... చూడండి భాషా.. ఈ రోజు ఇది 15వ కాల్. ఏప్రిల్ 1st కదా అని డైరెక్టుగా సెక్యూరిటీ అధికారి డిపార్ట్మెంట్ తో పెట్టుకోవడం మంచిది కాదు. మర్యాదగా ఫోన్ పెట్టేయ్యండి." "సార్ నన్ను నమ్మండి సర్. నేను నిజమే చెప్తున్నాను. " "ఓకే. బట్ ఇది ప్రాంక్ అయితే నా రియాక్షన్ బియాండ్ ద లిమిట్స్ ఉంటుంది." "ఓకే త్వరగా రండి సర్" ఆ ఆఫీసర్ లైన్ కట్ చేసి అక్కడికి దగ్గర్లో ఉన్న సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి రిపోర్ట్ చేసాడు. మరొక 20నిమిషాల్లో అక్కడికి సెక్యూరిటీ అధికారి జీప్ వచ్చి ఆగింది. ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్ళి "ఇక్కడ ఫోన్ చేసింది నువ్వేనా" అని అడిగాడు అక్కడే నిలబడి ఉన్న ఒక యువకుడ్ని. అవునన్నట్టు తలూపాడు అతను. "శవం ఎక్కడ?" అని అడిగి అతను చెప్పిన వైపు నడిచిన ఇన్స్పెక్టర్ ఆ శవాన్ని చూడగానే తుళ్ళిపడ్డాడు. " ఇది... ఇది మొహమ్మద్ రిజ్వాన్?..." చుట్టుపక్కల పిచ్చిగా చూస్తూ అడిగాడు. అవునన్నట్టు తలూపాడు మళ్ళీ ఆ యువకుడు. "మొహమ్మద్ రిజ్వాన్" ఆ పేరు వినగానే మిగిలిన కానిస్టేబుల్స్ అందరూ పరుగుపరుగున చేరుకున్నారు శవం దగ్గరికి. క్షణాల్లో విషయం పై అధికారులకి చేరవేశాడు ఇన్స్పెక్టర్. ఈ లోపు మీడియా అక్కడికి చేరుకుంది. పొద్దెక్కే కొద్దీ జనం కూడా మూగడం, క్షణాల్లో ఈ విషయం వైరల్ కావడంతో న్యూస్ చానెల్స్ క్షణం తీరిక లేకుండా బులెటిన్లు ప్రసారం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఒకటే వార్త " 31 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ కి ఒంటి చేత్తో ప్రపంచకప్ అందించిన మొహమ్మద్ రిజ్వాన్ అనుమానాస్పద మృతి" ప్రపంచం మొత్తం ఈ వార్త రేపిన కలకలం అంతా ఇంతా కాదు. ఇన్స్పెక్టర్ అక్కడి స్థానికుల సహాయంతో శవాన్ని రోడ్ మీదకు తీసుకువచ్చి పోస్టుమార్టం నిమిత్తం తరలించాడు. పోస్టుమార్టం జరుగుతున్న స్థలం వద్ద క్రికెటర్లు, రాజకీయ నాయకులు, సెక్యూరిటీ ఆఫీసర్లు, జనంతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా ఉంది. ........
స్థలం: పీసీబీ ఆఫీస్. పీసీబీ ప్రెసిడెంట్ ఇషాన్ మణి కి తీరిక లేకుండా ఫోన్లు వస్తున్నాయి. ఐసీసీ ఈ విషయంలో బోర్డ్ నుంచి ఒక సవివరమైన రిపోర్ట్ అన్ని ఆధారాలతో సహా అందించాలని ఆజ్ఞ జారీ చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ మృతికి సంతాపం ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. " దేశం ఒక ఉజ్వల భవిష్యత్తు కలిగిన క్రికెటర్ ని కోల్పోయిందని, అతని స్థానం భర్తీ చెయ్యడం పాకిస్తాన్ టీం కి ఒక తీరని లోటని, కేవలం 11 మ్యాచుల్లోనే అతని ప్రతిభ చూసి తమ బ్యాట్స్ మన్ గొప్పతనం మరుగున పడుతుందనే భయంతో ఎవరో చేతకాని వారే అతన్ని చంపించి ఉంటారని" తమ అనుమానం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం చివర్లో అన్న మాటలు భారతదేశ ప్రధానమంత్రికి ఎక్కడో రగిలేలా చేసాయి. అసలే పాకిస్తాన్ తో ఒక్క వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఓడిపోని ఇండియా మీద, వరల్డ్ కప్ ముందు వరకూ అసలు పసికూన చేతిలో అయినా మ్యాచ్ గెలుస్తుందా అనిపించిన పాకిస్తాన్ ఫైనల్లో భారత్ ని అలవోకగా ఓడించి భారత్ లో భారత్ మీద గెలిచి కప్ పట్టుకెళ్ళడంతో పుండు పడిన సగటు భారత అభిమాని గుండె మీద ఈ మాటలు కారమేం ఖర్మ ఆచి చికెన్ మసాలానే చల్లాయి. ప్రధాని హుటాహుటిన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశాడు.
13-12-2019, 10:28 PM
మనకి అంత సీరియస్ విషయాలు అవసరమా! నరేష్?
మీరేదో దేశాల మధ్య యుద్ధవాతావరణం స్థాయికి తీసుకుపోయారు రెండో భాగంలోనే! చుద్దాం ముందు ముందు ఎక్కడకు తీసుకెళ్తారో
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
13-12-2019, 10:33 PM
(13-12-2019, 10:28 PM)k3vv3 Wrote: మనకి అంత సీరియస్ విషయాలు అవసరమా! నరేష్? అబ్బే మన కథల్లో మనుషులు కొట్టుకోవడమే తక్కువ.. ఇంకా దేశాలు ఎక్కడ కొట్టేసుకుంటాయి భయ్యా.. ఏదో రొటీన్ కి భిన్నంగా రాద్దామని ఈ వెర్రి ప్రయత్నం. చూద్దాం ఎంత వరకు మెప్పిస్తానో
14-12-2019, 09:29 AM
వామ్మో..ఆదిలోనే శత్రుదేశంతో ఉద్రిక్త పరిస్థితి కి నడిపించారుగా. చూడబోతే ఇది ఒంట్లో వేడి పుట్టించేది గా గాక బుర్రలో వేడి ( థ్రిల్లర్) రేపేది గా ఉంది.చూడాలి మరి ముందుకు.
బాగా ప్రారంభం అయ్యారు. కానివ్వండి. దీని అంతు ఎలా ఉండనుందో అనే మంచి థ్రిల్ పెట్టారు. Keep move
14-12-2019, 10:05 AM
నరేశా.....
నివ్వు ఏది రాసిన ,దేని మీద రాసిన అద్బుతంగా ఉంటుంది.... నీ శైలి ఏకైకం (unique) or Aకేక....... మొదటి రెండు అప్డేట్ లలోనే 'ఆచీ మసాల' (త్రిల్లర్) వాసనలు రావడం మొదలు పెట్టాయి. Keep it up......
mm గిరీశం
14-12-2019, 10:52 AM
(14-12-2019, 09:29 AM)Milf rider Wrote: వామ్మో..ఆదిలోనే శత్రుదేశంతో ఉద్రిక్త పరిస్థితి కి నడిపించారుగా. చూడబోతే ఇది ఒంట్లో వేడి పుట్టించేది గా గాక బుర్రలో వేడి ( థ్రిల్లర్) రేపేది గా ఉంది.చూడాలి మరి ముందుకు. ఇక్కడికి రెండొందలు బాకీ.. గుర్తు పెట్టుకోండి
14-12-2019, 10:55 AM
(14-12-2019, 10:05 AM)Okyes? Wrote: నరేశా..... అలాగే బాబాయ్.. తప్పకుండా.. ఇంతకీ నీ ఫోన్ పని చేస్తుందా? నువ్వు నాకు 2 vat69 లు బాకీ గుర్తు పెట్టుకో
14-12-2019, 02:25 PM
తమ్ముడూ నరేష్...
రెండవ భాగం చాలా బాగుంది. ఇది క్లయిమేక్స్ అనుకుంటే ఇకపైన మొదలు ఇంకెంత వినూత్నంగా సాగుతుందో తెలుసుకోవాలని ఆసక్తిగా వుంది. మొత్తానికీ వరల్డ్ కప్ లో ఇండియా అజేయ రికార్డుకి నీ కథతో చరమగీతం పాడేసావన్నమాట! నిజంగా ఇది ఒక భారతీయ క్రికెట్ అభిమానికి (నాగురించే) పీడకలే! ఓకే... కొనసాగించు మరి! గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
14-12-2019, 02:49 PM
(14-12-2019, 02:25 PM)Vikatakavi02 Wrote: తమ్ముడూ నరేష్... మీ దగ్గర నుంచి సలహా తీసుకోవడమే నా కథ ముందుకు సాగడానికి కారణం కవి భయ్యా.. నా కథ బండి అయితే అందులో కనపడని పెట్రోల్ నువ్వే.. నాకు కూడా ఇండియా ఓడిపోవడం నచ్చలేదు కానీ మన టీం ఫైనల్ అయినా ఆడాలని అలా చేశా.. అప్డేట్ మరి కాసేపట్లో ఇస్తాను
15-12-2019, 10:51 PM
పీఎం కాన్ఫరెన్స్ హాల్
పీఎం సహా దేశ హోం మంత్రి, సీబీఐ చీఫ్, రక్షణ శాఖ మంత్రి, బీసీసీఐ అధ్యక్షుడు, RAW చీఫ్ ఇంకా మిగిలిన ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు. "న్యూస్ చూసారా?" అడిగారు పీఎం. "యెస్ సర్" అన్నారు అక్కడివారు. "ఇది ఎలా జరిగి ఉంటుందని మీ అభిప్రాయం?" అడిగాడు పీఎం RAW చీఫ్ ని. "పాకిస్తాన్ లో మన ఏజెంట్స్ ఆ పని మీదే ఉన్నారు సర్" "ఏమైనా కొత్త న్యూస్ బయటకు వచ్చిందా?" "ఇంకా ఏమీ రిపోర్ట్ అందలేదు సర్. ఫోరెన్సిక్ అండ్ లాబ్ రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది అంటున్నారు" "మరి పోస్టుమార్టం సంభందించి?" "ఇంకా తెలీలేదు కానీ ప్రాధమిక దర్యాప్తులో మాత్రం డ్రగ్ డోసేజ్ మోతాదుకు మించడం వల్ల చనిపోయాడు అనుకుంటున్నారు" చెప్పాడు RAW చీఫ్. "something is suspecious.. వాళ్ళు చాలా తెలివిగా దీన్ని మన మీదకు నెట్టాలని చూస్తున్నట్టు నా అనుమానం. ఈ కేసు దర్యాప్తులో మనం కూడా ఉండటం చాలా అవసరం." అన్నాడు సాలోచనగా మోడీ. "కానీ మనకు పాకిస్తాన్ కు అస్సలు పడదు. ఇప్పుడు వాళ్లకు మనకు ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో ఒకరినొకరు దూషించుకున్నారు కూడా.. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో మనం అక్కడికి వెళ్ళడం అసాధ్యం." బదులిచ్చాడు డిఫెన్స్ మినిస్టర్. " నేనే స్వయంగా ఇమ్రాన్ ఖాన్ ని కలిసి అడుగుతాను" అన్నాడు మోడీ. "వద్దు పీఎం గారూ. మనమే తేనెతుట్టెని కదపడం మన దేశానికే మంచిది కాదు. దీనికి వేరే మార్గం నేను చెప్తాను." అన్నాడు అమిత్ షా. వ్యూహరచన లో అమిత్ షా నైపుణ్యం తెలుసు కనుక అక్కడున్న వారంతా మిన్నకుండిపోయారు. " మిస్టర్ గంగూలీ. నేను మిమ్మల్నేమి అడగను. మాకు ఏమాత్రం ఉపయోగపడే విషయం మీ దగ్గరున్నా మాకు చెప్పండి. లేకపోతే you are free to go" ముగించాడు అమిత్ షా. "ఈ వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ మీ అండదండలతోనే ఘనంగా నిర్వహించాను. మొదట్నుంచీ మిగిలిన జట్లు పాకిస్తాన్ మీద గెలవలేకపోవడానికి అతనొక్కడే అడ్డంకిగా మారాడు. అతని బ్యాట్, ఎక్విప్మెంట్ అంతా పరిశీలించాం. ఎక్కడా ఏ విధమైన తేడా కనపడలేదు. కానీ అతను చాలా చాలా స్పెషల్ గా ఉండేవాడు." చెప్పాడు గంగూలీ. అతను లేచి వెళ్లబోతుంటే షా అడిగాడు. "ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అంత డ్రగ్ తీసుకున్నాడంటే మీ అభిప్రాయం ఏంటి?" ఆయనలా అడగ్గానే గంగూలీ ఏదో స్ఫూరణకు వచ్చిన వాడిలా గంగూలీ తిరిగి తన కుర్చీలో కూర్చుంటూ "అతనికి డోప్ టెస్ట్ చేద్దామనుకుంటే అతను కేవలం సాంప్రదయమైన క్రికెట్ షాట్లు మాత్రమే ఆడేవాడు. అతని బ్యాట్ కూడా 1950ల్లో ఉన్నట్టు చాలా ఫ్లాట్ గా ఉండేది. అతను ఈ టోర్నమెంట్ లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేదంటే నమ్ముతారా? కానీ ఫోర్లు మాత్రం చాలా అలవోకగా కొట్టాడు. అతను కొట్టిన ఫోర్లు మొత్తం సర్కిల్ లోపల ఉన్న ఫీల్డర్ల మధ్యలో నుంచి మాత్రమే బౌండరీ దగ్గర ఎవరూ లేని వైపే కొట్టేవాడు" అన్నాడు. "ఇంట్రెస్టింగ్.. ఇంకా ఏమైనా తెలుసేమో గుర్తు తెచ్చుకోండి. ఐసీసీ పరిథిలో కానీ ఇంకా ఏమైనా తెలుసా? వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ కదా? ఒక్కసారి" అన్నాడు షా. " యెస్ సర్. అతను ఇంకొక నాలుగు రోజుల్లో వాడా ( ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ) ముందుకు పరీక్షల నిమిత్తం హాజరు కావాలి. ఈ లోపే ఇలా జరిగింది" " here is the tail" బల్ల చరుస్తూ లేచి నిలబడ్డాడు అమిత్ షా. అందరూ విచిత్రంగా ఆయన మొహంలోకి చూసారు. "ఏంటి అందరూ నన్ను చూస్తున్నారు? మీకింకా అర్ధం కాలేదా? So sad" అంటూ ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసాడు.
16-12-2019, 01:51 PM
మ్... బావుంది. గంగూలీ మరికొంత సమయం బిసిసిఐ పీఠంలోనే ఉన్నాడన్నమాట. మోదీ కూడా ఇంకా పిఎమ్ సీటు వదల్లేదు. అతని బుర్ర (అమిత్ షా) పరిగెడుతోంది. మరి అజిత్ దోవల్ ఆ మీటింగులో ఉన్నాడా?
ఓకే... సంభాషణల్లో తీవ్రత బాగుంది. సస్పెన్స్ కూడా బాగా మెయింటెయిన్ చేస్తున్నావ్. కొనసాగించు తంబీ! గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
16-12-2019, 07:13 PM
ఇపుడే అప్డేట్ చదివా! ఆసక్తికరమైన మలుపులు తిప్పుతున్నావు నరేష్.
ఆసక్తి పెరిగేలా ఉంది రచన పద్ధతి
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ |
« Next Oldest | Next Newest »
|