Posts: 179
Threads: 3
Likes Received: 255 in 119 posts
Likes Given: 77
Joined: Nov 2018
Reputation:
11
10-12-2019, 11:16 AM
 అందరికీ నమస్కారం..
నా పేరు నరేష్.. మీలాగే నాకు కూడా కథలు రాయలనిపించి ఇలా వచ్చాను.. కానీ అందరిలా నేను కూడా ఒకే సెక్స్ కథ రాస్తే పాఠకులకు రుచించదు కదా..
అందుకే ఫాంటసీ, sci fi , థ్రిల్లర్ తదితర దరిద్రాలు అన్నీ కలిపి మీ ముందు పడేద్దాం అనుకుంటున్నా..
చూద్దాం.. ఆదివారం అప్డేట్ పెడతాను.
Posts: 179
Threads: 3
Likes Received: 255 in 119 posts
Likes Given: 77
Joined: Nov 2018
Reputation:
11
ఎవరైనా ఈ కథ థీమ్ గెస్ చెయ్యగలరేమో ట్రై చెయ్యండి.
Posts: 1,228
Threads: 1
Likes Received: 902 in 676 posts
Likes Given: 174
Joined: Dec 2018
Reputation:
25
నరేష్ గారూ మీ ఆరోగ్యం ఎలా ఉంది
ఆక్సిడెంట్ అయింది అన్నారు ఇప్పుడు అంతా బాగానే ఉందా
ఎలా ఉన్నారు
చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ నుండి కధ వస్తుంది అంటే చాలా ఆనందంగా ఉంది
మీరు ఏ కధ రాసిన కధనం సన్నివేశాలు చాలా బాగుంటాయి
Posts: 179
Threads: 3
Likes Received: 255 in 119 posts
Likes Given: 77
Joined: Nov 2018
Reputation:
11
(10-12-2019, 12:21 PM)Pradeep Wrote: నరేష్ గారూ మీ ఆరోగ్యం ఎలా ఉంది
ఆక్సిడెంట్ అయింది అన్నారు ఇప్పుడు అంతా బాగానే ఉందా
ఎలా ఉన్నారు
చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ నుండి కధ వస్తుంది అంటే చాలా ఆనందంగా ఉంది
మీరు ఏ కధ రాసిన కధనం సన్నివేశాలు చాలా బాగుంటాయి
ఆరోగ్యం బాగానే ఉంది ప్రదీప్ గారు.. చెయ్యి ఇక నా చెయ్యి దాటిపోయింది..
ఏదో పని చేస్తుంది అంటే చేస్తుంది.. ఇక దాని గురించి భాదపడదలుచుకోలేదు..
కథ రాయడం అలవాటు తప్పింది కదా అందుకే కొత్త కథ అయితే కాస్త లిబర్టీ దొరుకుతుంది అని ఇది మొదలుపెట్టాను..
దీనితో మిగిలినవి కలిపి తీరిగ్గా వడ్డిస్తాను..
ప్రస్తుతానికి టిఫిన్ చేస్తుంటే ఈ ఐడియా వచ్చింది.
భోజనం చేసేలోపు ప్రారంభం వస్తుందేమో చూడాలి
•
Posts: 75
Threads: 0
Likes Received: 58 in 45 posts
Likes Given: 190
Joined: Sep 2019
Reputation:
0
(10-12-2019, 11:16 AM)naresh2706 Wrote: అందరికీ నమస్కారం..
నా పేరు నరేష్.. మీలాగే నాకు కూడా కథలు రాయలనిపించి ఇలా వచ్చాను.. కానీ అందరిలా నేను కూడా ఒకే సెక్స్ కథ రాస్తే పాఠకులకు రుచించదు కదా..
అందుకే ఫాంటసీ, sci fi , థ్రిల్లర్ తదితర దరిద్రాలు అన్నీ కలిపి మీ ముందు పడేద్దాం అనుకుంటున్నా..
చూద్దాం.. ఆదివారం అప్డేట్ పెడతాను.
Hi naresh garu thank you for coming back to our site
Posts: 2,632
Threads: 0
Likes Received: 998 in 819 posts
Likes Given: 2,981
Joined: Nov 2018
Reputation:
25
మీ ఆరోగ్యం బాగుంది అన్నారు చాలా సంతోషం బ్రదర్
Posts: 179
Threads: 3
Likes Received: 255 in 119 posts
Likes Given: 77
Joined: Nov 2018
Reputation:
11
(10-12-2019, 03:16 PM)Mnlmnl Wrote: Hi naresh garu thank you for coming back to our site
Thankyou too
•
Posts: 179
Threads: 3
Likes Received: 255 in 119 posts
Likes Given: 77
Joined: Nov 2018
Reputation:
11
(10-12-2019, 05:14 PM)Sivakrishna Wrote: మీ ఆరోగ్యం బాగుంది అన్నారు చాలా సంతోషం బ్రదర్
Thankyou brother
•
Posts: 179
Threads: 3
Likes Received: 255 in 119 posts
Likes Given: 77
Joined: Nov 2018
Reputation:
11
ఇప్పుడే కాలేజ్ డేస్ చదివాను..
బాణాసుర గారు చాలా అద్భుతంగా రాస్తున్నారు..
మీలో ఎవరైనా మిస్ అయితే ఒక లుక్కెయ్యండి.
Posts: 179
Threads: 3
Likes Received: 255 in 119 posts
Likes Given: 77
Joined: Nov 2018
Reputation:
11
10-12-2019, 07:57 PM
(This post was last modified: 10-12-2019, 08:16 PM by naresh2706. Edited 1 time in total. Edited 1 time in total.)
సమయం: ఉదయం 11 గంటలు
స్థలం: పాకిస్తాన్ లో పీసీబీ సెలెక్టర్స్ కాన్ఫరెన్స్ హాల్..
అక్కడ మీటింగ్లో అందరూ చాలా ఆదుర్దాగా ఉన్నారు
2023 వరల్డ్ కప్ కి ఇంకా 3 నెలలే సమయం ఉంది.
ఇండియాతో సహా దాదాపు అన్ని దేశాలు తమ తుది జట్లను ప్రకటించేసాయి.
ఈ సారి విజేతలుగా భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తో పాటు ఆస్ట్రేలియా ని అందరూ ప్రతిపాదిస్తున్నారు.
కానీ అనిశ్చితికి, అనూహ్యమైన ఆటతీరుకు నిలయమైన పాక్ ని మాత్రం ఎవరూ సెమీఫైనల్లో ఆడుతుందని కూడా భావించట్లేదు.
ఇంకా దారుణం ఏంటంటే బంగ్లాదేశ్ వంటి చిన్న జట్లకు కూడా పాక్ కన్నా ఎక్కువ విజయావకాశాలు ఉండటం ఆ దేశాన్ని మరింతగా కలవరపెడుతుందని చెప్పాలి.
ఒక ప్రపంచకప్పు 1992లో గెలిచి, 1999లో దాదాపు గెలిచినంత పని చేసిన పాకిస్థాన్ ఇలా పాతాళానికి పడిపోవడం స్వయకృతపరాధమే..
క్రికెట్లో రాజకీయాలు ఆ దేశంలో ఎప్పుడూ ఉండేవే. కానీ ఈ హీన దశ నుండి బయట పడకపోతే ఇక ఈ దేశం కూడా వెస్టిండీస్ జట్టులా అయిపోయే ప్రమాదం లేకపోలేదు.
అందుకే ఈ అత్యవసర సమావేశం.
"మిమ్మల్ని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా?" అడిగాడు చీఫ్ సెలెక్టర్ ఇంజిమామ్.
"వరల్డ్ కప్ ప్రాబబుల్స్ ని ప్రకటించడానికే కదా?" అడిగాడు ఒక సెలెక్టర్
"అవును" బదులిచ్చాడు ఇంజి.
"దానికేముంది ఇదిగో నా తరపు ముగ్గురు క్రికెటర్లు. మిగిలిన వాళ్ళు కూడా వారి వారి తరపు పేర్లు ఇచ్చేస్తే అందర్నీ కలిపి ప్రకటించేద్దాం." ఇది మనకు అలవాటైన తీరే కదా అన్నట్టు సమాధానమిచ్చాడు ఒక సెలెక్టర్.
మిగిలిన అందరూ అంతేగా అంతేగా అన్నట్టు చూసారు.
"No...." గట్టిగా అరిచి తన కుర్చీ నేలకేసి విసిరికొట్టాడు.
"ఇలా మీ బంధువులు, స్నేహితుల పిల్లలు జట్టులో చేరడానికి కాదు మీరు సెలక్షన్ ప్యానెల్ లో ఉంది. " గట్టిగా అరిచాడు.
" ఇంతకుముందు చేసిందే కదా సర్ మనం చేస్తుంది. ఇందులో కొత్తేముంది?" సర్దిచెప్పాడు ఒక సెలెక్టర్.
"ఉంది. మనకి కావాల్సిన వారు పేరు తెచ్చుకోవడం సంతోషమే. కానీ ఇది ఇలాగే కొనసాగితే మన బోర్డ్ ఆర్థిక సంక్షోభంలో పడుతుంది. మన దాయాది భారత్ లో గవాస్కర్, కపిల్, సచిన్, ద్రవిడ్, ధోనీ, కోహ్లీ, రోహిత్ ఇలా మ్యాచ్ విన్నర్లు వస్తూనే ఉన్నారు. కానీ మనం ఎవరో ఒక్కరి మీదే ఆధారపడటం, కీలక సమయాల్లో చతికిలపడటం ఒక అలవాటుగా మారిపోయింది"
" భారత్ కి బ్యాటింగ్ బలం, మనకి బౌలింగ్ బలం. ఇది ఎప్పుడూ ఉండేదేగా?"
"కానీ బూమ్రా వచ్చాక వారి బౌలింగ్ స్వరూపమే మారిపోయింది. దానికి తోడు ముగ్గురు ఓపెనర్స్, ముగ్గురు వికెట్ కీపర్స్, ఇద్దరు ఆల్ రౌండర్లు, నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లు, నలుగురు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్లు అంటూ ఎవరూ అందుకోలేని స్థాయిలో ఉన్నారు. వాళ్లే కాదు మిగిలిన దేశాలన్నీ కూడా ఇలా స్పెషలిస్టులతో బరిలోకి దిగుతుంటే మన జట్టు మాత్రం కనీసం కాగితం మీద కూడా బలంగా లేదు." చెప్తున్న ఇంజిమామ్ కళ్ళల్లో ఒక రకమైన భాధ.
"మనకి కూడా బాబర్ అజాం, ఫఖర్ జమాన్ లాంటి ప్రతిభ గల బ్యాట్స్ మన్ ఉన్నారు కదా?" విస్మయంగా అడిగాడు ఒక సెలెక్టర్.
"బ్లడీ హెల్... ప్రతిభ ఉంటే సరిపోదు. పోరాటం కూడా ఉండాలి. నాలో కూడా ప్రతిభ ఉంది. వయసు నేర్పిన అనుభవమూ ఉంది. అలాగని నేను వెళ్ళి ఆడగలనా? నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ వికెట్ ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తూ అసాధారణ పోరాటం చేసే ఒక బ్యాట్స్ మన్ కావాలి" గుండెల్లో జ్వాల చల్లార్చుకుంటున్నట్టు స్వరం, కోపం రెండూ తగ్గిస్తూ దృఢ నిశ్చయానికి వచ్చిన వాడిలా చెప్పాడు ఇంజిమామ్.
సెలెక్టర్ల మధ్యలో కొంత సమయం మౌనమే రాజ్యమేలింది.
"వరల్డ్ కప్ 3నెలలు కూడా లేని ఈ టైంలో ఇప్పటికిప్పుడు అలాంటి బ్యాట్స్ మన్ ని వెతకడం అంటే ఎలా సర్?" చిన్నగా నసుగుతూ అర్ధోక్తిలో ఆగాడు ఒక సెలెక్టర్.
అది విన్న మిగతా సెలెక్టర్లు కూడా తమ మాట కూడా అదే అన్నట్టుగా ఇంజిమామ్ వైపు చూసారు.
వాళ్లందరిని అదే పనిగా సూటిగా చూస్తున్న ఇంజిమామ్ గుండెల నిండా ఊపిరి తీసుకుని గాఢంగా నిట్టూర్చి చెప్పడం ప్రారంభించాడు.
"My dear friends.. అవును, ఇప్పుడు కష్టమే. ఈ వరల్డ్ కప్ నెగ్గకపోయినా మనకొచ్చే నష్టం లేదు. కానీ సరిగ్గా ఆలోచిస్తే...
నష్టం ఉంది. ఇప్పటికే ఒక టీ20 వరల్డ్ కప్ తప్ప మనదైన ముద్ర వేసిన ఒక్క మేజర్ ఐసీసీ టోర్నమెంట్ అంటూ ఏది ఉంది? ఒక్క గాలివాటం ఛాంపియన్స్ ట్రోఫీ తప్ప?
ఇప్పటికే మన దేశంలో మ్యాచ్ ఆడటానికి ఎవరూ ముందుకు రావడంలేదు. స్పాన్సర్లు కరువయ్యారు.
ఇది వరకు '' దేశం పేరుతో ఎంతో మంది అరబ్ దేశాల ధనవంతులు ఇప్పుడు బంగ్లాదేశ్, అప్గనిస్థాన్ అంటూ తరలిపోతుంటే శత్రు రాజ్యం దండెత్తిన తరువాత నేలమట్టం అయి పాడుబడిన కోటలా నిస్సహాయంగా చూస్తున్నాం.
జీతాలు సరిపోకే కదా? మనలో ఈ అవినీతి, బంధుప్రీతి?
ఇవన్నీ మార్చడానికి ఒక్కడు కావాలి. మన భాధలన్నీ తొలగించేవాడు ఒక్కడు కావాలి.
ఎవడు వాడు? వాడ్ని వెతికి పట్టుకోవాలి అనుకుంటున్నా..
ఇప్పుడు చెప్పండి. చేద్దామా? వద్దా??? ఇక మీ ఇష్టం" అని సర్దుకుని వెళ్లబోతున్న ఇంజిమామ్ ని అక్కడున్న సెలెక్టర్లు అందరూ ముక్తకంఠంతో పిలిచి ఆపారు.
అందులో ఒక సెలెక్టర్ లేచి " సర్ ఇక నుంచి మేం అందరం ఒక్కక్కరుగా విడిపోయి ఒక్కో ఏరియా లో ఉన్న ప్రతి క్రికెటర్ ని క్షుణ్ణంగా పరిశీలించి మీకు రిపోర్ట్ చేస్తాం సర్" అన్నాడు.
"Good.. ok guys. ఇక మీ పని ఇదే. మీరు ఉక్కుని తీసుకురండి.
దానిని కత్తిగా నేను మారుస్తా.." అంటూ అక్కడి నుంచి వెళ్లడం వెళ్ళడమే ఇంగ్లాండ్ లోని రహస్య పరిశోధనలకు కావాల్సిన గూడ్స్ సప్లై చేసే సీక్రెట్ ఏజెన్సీలో పని చేస్తున్న తన సన్నిహితుడు ఇమాం అహ్మద్ కు ఎవరూ ట్రేస్ చేసే వీలు లేకుండా ఉండే శాటిలైట్ కాల్ చేసాడు.
..............$$$$$................
Posts: 3,596
Threads: 0
Likes Received: 1,324 in 1,028 posts
Likes Given: 196
Joined: Nov 2018
Reputation:
15
నరేష్ గారు డెఫ్ఫెరెంట్ థీమ్ ఎన్నుకున్నారు బాగుంది సర్.
Posts: 2,632
Threads: 0
Likes Received: 998 in 819 posts
Likes Given: 2,981
Joined: Nov 2018
Reputation:
25
నిజంగా చాలా కోతగా వుంది బ్రదర్
Posts: 2,942
Threads: 156
Likes Received: 9,532 in 1,909 posts
Likes Given: 5,576
Joined: Nov 2018
Reputation:
668
మంచి ఆరంభంతో మొదలుపెట్టారు నరేష్.....చివరిలో ఒక ట్విస్ట్ కూడా తగిలించారు....
బాగుంది....
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,146
Threads: 246
Likes Received: 1,427 in 849 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
తమ్ముడూ నరేషా... పేరు చూసి ఇంకేమో ఊహించేను.
కథ నేపథ్యం చాలా వినూత్నంగా వుంది. చదువుతుంటే యండమూరివారి లేడీస్ హాస్టల్ కథ జ్ఞాపకం వచ్చింది. మరలా నీ ఉపమానాలను వాడి వేడిగా చదవటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
ఆల్ ద బెస్ట్
యువర్ బ్రదర్
VikatakaVi 02
Posts: 179
Threads: 3
Likes Received: 255 in 119 posts
Likes Given: 77
Joined: Nov 2018
Reputation:
11
(10-12-2019, 08:47 PM)Eswar P Wrote: నరేష్ గారు డెఫ్ఫెరెంట్ థీమ్ ఎన్నుకున్నారు బాగుంది సర్.
చాలా సంతోషం ఈశ్వర్ గారూ.. నా ఈ కొత్త కథకు మొదటి పాఠకుడు మీరు అయినందుకు సంతోషం
•
Posts: 179
Threads: 3
Likes Received: 255 in 119 posts
Likes Given: 77
Joined: Nov 2018
Reputation:
11
(10-12-2019, 09:19 PM)Sivakrishna Wrote: నిజంగా చాలా కోతగా వుంది బ్రదర్
థాంక్స్ శివకృష్ణ గారు
•
Posts: 179
Threads: 3
Likes Received: 255 in 119 posts
Likes Given: 77
Joined: Nov 2018
Reputation:
11
(10-12-2019, 09:48 PM)k3vv3 Wrote: మంచి ఆరంభంతో మొదలుపెట్టారు నరేష్.....చివరిలో ఒక ట్విస్ట్ కూడా తగిలించారు....
బాగుంది....
సంతోషం పెదబాబు గారూ.. చివర్లో ట్విస్ట్ ఇవ్వకూడదనే అనుకున్నాను.
మళ్ళీ ఇది ఇంకొక లగాన్ అనుకుంటారేమో అని ఈ పెరుగన్నం ముద్ద పెట్టి చివర్లో కొంచెం ఆవకాయ నాకించా..
•
Posts: 179
Threads: 3
Likes Received: 255 in 119 posts
Likes Given: 77
Joined: Nov 2018
Reputation:
11
(10-12-2019, 09:59 PM)Vikatakavi02 Wrote: తమ్ముడూ నరేషా... పేరు చూసి ఇంకేమో ఊహించేను.
కథ నేపథ్యం చాలా వినూత్నంగా వుంది. చదువుతుంటే యండమూరివారి లేడీస్ హాస్టల్ కథ జ్ఞాపకం వచ్చింది. మరలా నీ ఉపమానాలను వాడి వేడిగా చదవటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
ఆల్ ద బెస్ట్
యువర్ బ్రదర్
VikatakaVi 02
థాంక్స్ అన్నయ్యా..
మనమందరం బ్యాట్స్ మన్ అనగానే అదే ఊహించుకుంటాం అని తెలుసు.. కానీ అలాంటి రొటీన్ కథా వస్తువుతో నేనైతే మెప్పించలేను అని తెలుసు కదా?
కథనం కొత్తగానే ఉంటుంది కానీ నా దగ్గర కథ ఔట్ లైన్ కూడా లేదు. పొద్దున్న దోసెలు తింటుంటే వచ్చిన చిన్న ఆలోచన.
కొత్తగా ఉంటుందో చెత్తగా ఉంటుందో కాలమే నిర్ణయించాలి.
నువ్వు చెప్పావనే ఈ కొత్త కథ.
బాగా ఆయిలింగ్ అయ్యి నువ్వన్న ఆ వాడి వేడి ఉపమానాలు దూసుకురావాలని కోరుకుంటున్నాను.
Thanks for backing me up brother
•
Posts: 2,426
Threads: 2
Likes Received: 2,893 in 1,145 posts
Likes Given: 8,066
Joined: Nov 2019
Reputation:
308
Not expected this type of starting
Fantastic idea... Story on cricket.. Very nice
Twist... Is super
Looking like a thriller
Hope you will not disappoint us...
Keep going bro
Posts: 179
Threads: 3
Likes Received: 255 in 119 posts
Likes Given: 77
Joined: Nov 2018
Reputation:
11
(10-12-2019, 11:06 PM)The Prince Wrote: Not expected this type of starting
Fantastic idea... Story on cricket.. Very nice
Twist... Is super
Looking like a thriller
Hope you will not disappoint us...
Keep going bro
Thankyou prince garu..
Na sakthi meraku prayatnista
•
|