27-11-2019, 09:38 AM
Update bagundi
Thriller అశ్వత్థామ
|
27-11-2019, 09:42 AM
27-11-2019, 09:42 AM
27-11-2019, 09:43 AM
అశ్వత్థామ రామన్ తో ఏదో తమిళ్ లో మాట్లాడాడు దాంతో రామన్ కొద్ది సేపు ఆలోచించి సరే అని తల ఆడించి పక్కకు వెళ్లాడు ఎవరికో ఫోన్ చేయడానికి ఆ తర్వాత సంగీత వైపు తిరిగి తనకు కావాల్సిన ఒక వస్తువు గురించి అడిగాడు అది విన్న సంగీత షాక్ అయ్యి "సార్ మీరు చాక్లెట్ అడిగినట్లు అడిగితే ఎలా సార్ అది ఎక్కడ పడితే అక్కడ దొరకడం కష్టం మహా అయితే navy force లేదా ఏదైనా హర్బర్ లో దోరకోచ్చు" అని చెప్పింది దానికి అశ్వత్థామ నవ్వుతూ "నాకూ తెలియదు అనుకుంటున్నావా నేను ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటాను నువ్వు కార్ లో ఇక్కడ పక్కనే కలాం హౌస్ అని ఒక మ్యూజియం ఉంది అందులో అబ్దుల్ కలాం వాడిన ప్రతి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి నువ్వు దాని దొంగలించి ఈ అడ్రస్ కీ రా" అని బ్రెయిలి లిపి లో రాసి ఇచ్చి తనని పంపాడు ఆ తర్వాత రామన్ వచ్చి" నువ్వు అడిగినట్లే అంతా రెడీ ఇంకో అర గంట లో బయలుదేరాలి మా అబ్బాయి వస్తాడు ముగ్గురం కలిసి వెళ్లోచ్చు " అన్నాడు దానికి అశ్వత్థామ సరే అని తల ఊప్పాడు, సంగీత అశ్వత్థామ చెప్పినట్లే కలాం హౌస్ కీ వెళ్లి అక్కడ ఉన్న కొని ఇన్స్ట్రుమెంట్స్ అని చూస్తోంది అలా లోపలికి వెళ్లుతుంటే అక్కడ తనకు కావాల్సిన వస్తువు కనిపించడం తో వెళ్లి మెయిన్ కరెంట్ బోర్డ్ పక్కన ఉన్న కనెక్షన్ లు అన్ని పీకి కరెంట్ పోయిన తర్వాత అలారం నీ కట్ చేసి తనకు కావాల్సిన దాని దొంగలించి వెనుక కిటికీ ఫైర్ ఎమర్జెన్సీ ద్వారా పారిపోయింది.
ఇక్కడ చెన్నై లో ఆకాశ్ కీ ఎక్కడ పడితే అక్కడ రమణ కనిపించడం తో ఆకాశ్ డైరెక్ట్ గా వెళ్లి రమణ నీ అడిగాడు దాంతో ఇంక రమణ చేసేది లేక మొత్తం జరిగినది అంతా చెప్పాడు రమణ చెప్పింది అంతా విన్న ఆకాశ్ గట్టిగా నవ్వి ఇది అంతా తన తండ్రి చేస్తూన్న పని అనుకోని వెళ్లిపోయాడు ఆ తర్వాత రమణ కీ సుమా నుంచి ఫోన్ వస్తే తను ఆనందం తో హైదరాబాద్ ప్రయాణం అయ్యాడు ఇది అంతా సంగీత ఆకాశ్ ఫోన్ కెమెరా నుంచి హాకింగ్ చేసి మొత్తం చూసింది దాంతో ఆకాశ్ ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు అని అర్థం అయ్యింది ఆ తర్వాత ఆకాశ్ తన ఫ్రెండ్స్ దెగ్గర కార్ ఇప్పించుకోని తనకు కోపం వచ్చినప్పుడు అలా కార్ లో లక్ష్యం లేకుండా వెళ్లిపోవడం అలవాటు అలా తను హోటల్ నుంచి కార్ లో వెళుతూ వెళుతూ హైవే లో రామేశ్వరం వైపు వెళ్లడం మొదలు పెట్టాడు. ఇక్కడ అశ్వత్థామ రామన్ తో కలిసి ఒక నది దెగ్గర ఒక మత్స్యకారుల బోట్ లో వెళ్లడానికి మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడే వచ్చిన సంగీత తన బాగ్ లో ఉన్న మెషిన్ నీ తీసి అశ్వత్థామ చేతికి ఇచ్చింది అంతే కాకుండా ఆకాశ్ ఒంటరిగా ఉన్నాడు అన్న విషయం చెప్పింది అప్పుడే అశ్వత్థామ మెదడు లో ఒక ఆలోచన వచ్చింది అంత కంటే ముందు తను వచ్చిన పని చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు వెంటనే బోట్ లో శ్రీలంక బార్డర్ వైపు వెళ్లమని చెప్పాడు దాంతో అట్టు వైపు వెళ్లడం మొదలు పెట్టారు అప్పుడు సంగీత తను తెచ్చిన censor moment machine నీ తన ల్యాప్ టాప్ కీ కనెక్ట్ చేసి సముద్ర గర్భంలో ఉన్న మెటల్స్ కీ స్కాన్ చేస్తూ ఉంది అదే సమయంలో తనకు మెటల్ బదులు యురేనియం తాలూకు సిగ్నల్స్ రావడం మొదలు అయ్యింది వెంటనే అది అశ్వత్థామ కీ చెప్పింది దాంతో అశ్వత్థామ నవ్వుతూ టేబుల్ పైన ఉన్న తాళం చెవి తో టిక్ టిక్ అంటూ కొట్టడం మొదలు పెట్టాడు అది మార్స్ కోడ్ అని అర్థం చేసుకున్న సంగీత వెంటనే ఆ కోడ్ నీ decode చేసింది అది decode అవ్వగానే సంగీత ఆశ్చర్యంతో అశ్వత్థామ వైపు చూసి "సార్" అని అడిగింది దానికి అవును అన్నట్లు తల ఆడించాడు. దానికి సంగీత అదే షాక్ లో తన బాగ్ లో ఉన్న గన్ తీసి ఆ బోట్ ఓనర్ నీ రామన్ నీ అతని కొడుకు నీ చంపేసింది కానీ తనకు చంపిన దానికంటే అశ్వత్థామ నీ చూస్తేనే భయం వేసింది "ఎందుకు సార్" అని అడిగింది దానికి అశ్వత్థామ "వాడు చిన్నప్పుడు నను ఎగతాళి చేశాడు అబ్దుల్ నీ అవమానించాడు అందుకే ఇప్పుడు శిక్ష వేశా పైగా ఇప్పుడు మనం చేయబోయే విషయం నీకు నాకూ తప్ప మూడో కంటికి తెలియకుడదు" అన్నాడు దానికి సంగీత షాక్ అయ్యి ఎప్పుడో తన చిన్నతనం లో జరిగిన అవమానం కీ ఇప్పుడు పగ తీర్చుకున్నాడు అంటే ఇప్పుడు రెండు దేశాలు తనని బాధ పెట్టాయి ఏమీ చేస్తాడు అని ఆలోచనలో పడింది అప్పుడే సిగ్నల్స్ బలం గా రావడం చూసిన సంగీత "సార్ ఇది చూడండి ఆ యురేనియం కీ మనం దెగ్గర లో ఉన్నాం అయినా అది ఇక్కడ ఉంది అని ఎలా తెలుసు" అని అడిగింది దానికి అశ్వత్థామ "1971 లో శ్రీలంక లో insecurration war జరిగింది అందులో భాగంగా కొని భూగర్భ గనుల లో ఉన్న కొని మెటల్స్ కీ షిప్ ద్వారా కోరియా పంపి ఆయుధాలు సరఫరా చేసుకున్నారు అది A క్లాస్ యురేనియం దానితోనే న్యూక్లియర్ మిసైల్స్ తయారు చేయవచ్చు కాబట్టి దానికి బదులు డబ్బు ఆయుధాలు శ్రీలంక కీ సహాయం అయ్యాయి అందులో ఒక షిప్ ప్రమాదం లో మునిగి పోయింది ఆ షిప్ లోని యురేనియం నీ ఇప్పుడు మనం బయటికి తీసి దాని చైనా మీద ప్రయోగిస్తాం అప్పుడు పాకిస్తాన్ చైనా కలిసి శ్రీలంక పైకి యుద్ధం కీ వస్తారు శ్రీలంక కీ సహాయం గా ఇండియా వస్తుంది అప్పుడు థర్డ్ వరల్డ్ వార్ "అని చెప్పి గట్టిగా నవ్వడం మొదలు పెట్టాడు. అశ్వత్థామ ఎవరికి తెలియకుండా ఈ పధకం వేశాడు కానీ రామేశ్వరం నుంచి కన్యాకుమారి వెళ్లే బ్రిడ్జ్ మీద ఆగిన ఆకాశ్ binoculars తో శ్రీలంక బార్డర్ చూద్దాం అనుకున్నాడు అప్పుడే సంగీత వాళ్ళని చంపడము చూశాడు తన పక్కన ఉన్న అశ్వత్థామ నీ చూసి షాక్ అయ్యాడు ఆకాశ్.
27-11-2019, 12:38 PM
27-11-2019, 01:27 PM
27-11-2019, 01:59 PM
Surprising twist.
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
27-11-2019, 02:42 PM
27-11-2019, 04:21 PM
(27-11-2019, 02:42 PM)Vickyking02 Wrote: Tomorrow is end for this twists U mean the story will end???
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
27-11-2019, 04:52 PM
చాలా బాగా రాశారు మిత్రమా. అశ్వత్థామ తన చిన్నప్పుడు తనని అబ్దుల్ ను అవహేళన చేశాడని రామన్ ని చంపటం అలాగే వాళ్ళతో వచ్చిన బోట్ డ్రైవర్ని, రామన్ కొడుకుని చంపటం(ఇది నేను అసలు ఊహించలేదు) ఎందుకంటే ఇప్పుడు అశ్వత్థామ చేసే పని మూడోకంటికి తెలియకూడదు అని. సంగీత వీళ్ళని చంపటం అశోక్ చూడటం. అసలు ఊహించని మలుపులు తెచ్చారుగా కథలో. ఇలాగే కొనసాగించండి.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
27-11-2019, 05:11 PM
Wonderful story , saw this thread just now and completed all episodes....
27-11-2019, 06:39 PM
27-11-2019, 06:40 PM
27-11-2019, 06:40 PM
27-11-2019, 06:45 PM
(27-11-2019, 04:52 PM)Joncena Wrote: చాలా బాగా రాశారు మిత్రమా. అశ్వత్థామ తన చిన్నప్పుడు తనని అబ్దుల్ ను అవహేళన చేశాడని రామన్ ని చంపటం అలాగే వాళ్ళతో వచ్చిన బోట్ డ్రైవర్ని, రామన్ కొడుకుని చంపటం(ఇది నేను అసలు ఊహించలేదు) ఎందుకంటే ఇప్పుడు అశ్వత్థామ చేసే పని మూడోకంటికి తెలియకూడదు అని. సంగీత వీళ్ళని చంపటం అశోక్ చూడటం. అసలు ఊహించని మలుపులు తెచ్చారుగా కథలో. ఇలాగే కొనసాగించండి. నేను ముందే చెప్పాను ప్రపంచంలోనే అతిపెద్ద తెలివైన క్రూరమైన విలన్ నీ మీ ముందుకు తీసుకొని వస్తాను అని తనకు emotions లేవు attachments లేవు ఉన్నది అలా తన లక్ష్యం ఈ ప్రపంచం మొత్తం తగలబడుతున్న దాని ముందు కూర్చొని ఆర్తనాదాలు వింటూ ఉండే వాడే కానీ ఆప్పేవాడు కాదు రేపు update KGF సినిమా రేంజ్ లో ఉంటుంది చూడండి
28-11-2019, 10:27 AM
యురేనియం నీ బయటకు తీసుకొని రావడానికి అశ్వత్థామ కీ ఒక ఆలోచన వచ్చింది వెంటనే కోస్తల్ గార్డస్ కీ తనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇద్దరు కానీ ఇది అంతా ఆకాశ్ చూస్తున్న విషయం వాళ్ళకి తెలియదు వాళ్లు ఒడ్డుకు రావడం గమనించిన ఆకాశ్ వెంటనే తన కార్ లో వాళ్లను ఫాలో అవ్వడానికి రెడీ అయ్యాడు, శ్రీలంక బార్డర్ లో A క్లాస్ యురేనియం ఉంది అన్న విషయం అడవి కీ అంటుకున్న కార్చిచు లా పాకింది తమిళనాడు గవర్నమెంట్ నుంచి ప్రధాని ఆఫీస్ దాకా క్షణాల్లో వ్యాపించింది A క్లాస్ యురేనియం అంటే సైంటిస్ట్ అనే వాడికి గుర్తు వచ్చేది న్యూక్లియర్ మిసైల్ కానీ రాజకీయ నాయకులకు గుర్తుకు వచ్చేది వెళ్ల వెళ్ల కోట్ల రూపాయల డబ్బు, ఆ డబ్బు కోసం అయినా వాళ్లు దాని బయటకు తీస్తారు అని అశ్వత్థామ కీ బాగా తెలుసు అందుకే ఆ విషయం బయటకు తేచ్చాడు కాకపోతే ఆ మొత్తం యురేనియం కొట్టేయాలి అంటే తనకు ఒక టీం కావాలి అందుకే బాగా ఆలోచించి ఒకే ఒక్క ప్లేయర్ నీ రంగంలోకి దించాలి అని నిర్ణయం తీసుకున్నాడు ఆ ఒక ప్లేయర్ గురించి వివరాలు అని సంగీత కీ ఇచ్చాడు ఆ మొత్తం యురేనియం బయటికి రావాలి అంటే కనీసం రెండు నెలలు సమయం పడుతుందని అర్థం అవుతోంది అశ్వత్థామ కీ అందుకే వెంటనే రామేశ్వరం నుంచి వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నాడు వాళ్లు ఒక హోటల్ రూమ్ నుంచి మొత్తం అని సర్దుకోని బయలుదేరడానికి సిద్ధం అయ్యారు, వాళ్ల హోటల్ రూమ్ తలుపు ఎవరో కొట్టి కాఫీ అన్నాడు దాంతో సంగీత తలుపు తెరిచింది అప్పుడే తూఫాన్ లాగా లోపలికి వచ్చాడు ఆకాశ్ రావడంతోనే లోపలికి వచ్చి సంగీత, అశ్వత్థామ పై దాడి చేసి ఇద్దరిని కట్టిపడేసి సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసాడు సెక్యూరిటీ ఆఫీసర్లు రావడానికి ముందే అశ్వత్థామ తన కర్ర లో ఉన్న ఒక గ్యాస్ capsule నీ కిందకు వేశాడు దాంతో ఆ రూమ్ అంతా గ్యాస్ తో నిండి పోయింది సంగీత తప్పించుకోని వెళ్లిపోయింది అశ్వత్థామ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి అరెస్ట్ చేశారు.
(6 నెలల తరువాత) హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ లో సిఐ గా ఉద్యోగం లో చేరాడు ఆకాశ్ అశ్వత్థామ లాంటి క్రిమినల్ నీ పట్టించినందుకు మెచ్చి గవర్నమెంట్ ఆకాశ్ కీ సెక్యూరిటీ అధికారి ఉద్యోగం ఇచ్చారు దాంతో ఆకాశ్ వాళ్ల నాన్న హ్యాపీ కానీ ఆకాశ్ కీ మాత్రం ఆ ఉద్యోగం ఇష్టం లేదు అని ఆయనకి తెలుసు కానీ ఎందుకో తన కొడుకు ఉద్యోగం చక్కగా చేయడం ఆయనకు బాగా నచ్చింది ఆకాశ్ వేగం నచ్చి సిద్ధు అతని తన టీం లో వేసుకున్నాడు ఎందుకు అంటే అశ్వత్థామ నీ డైరెక్ట్ గా చూసింది తను ఒక్కడే చూసిన రమణ మూడు నెలల క్రితం జరిగిన ప్రమాదంలో కొమ్మాలో ఉన్నాడు దాంతో ఆకాశ్ తన టీం లో ఉంటే పట్టుకున్న వారం రోజుల్లో తప్పించుకున్న అశ్వత్థామ నీ మళ్లీ పట్టుకోవచ్చు అతను దొంగలించి తీసుకొని వెళ్లిన ఆ యురేనియం కూడా తిరిగి తీసుకొని రావచ్చు అని అనుకున్నాడు అశ్వత్థామ కోసం హైదరాబాద్ మాత్రమే కాదు, ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్లు, ఇంటర్ పోల్, ఒకటి కాదు రెండు కాదు ప్రపంచంలో ఉన్న అని దేశాల సెక్యూరిటీ ఆఫీసర్లు వెతుకుతూ ఉన్నారు తన దెగ్గర ఉన్న యురేనియం తో ఏ దేశం మీద బోక్క పెడతాడో అని అందరి భయం దాంతో అందరూ అశ్వత్థామ వెనుక పడ్డారు అతను ఏ దేశంలో ఉన్నాడు అని అందరూ వెతుకుతూ ఉన్నారు, ఒక రోజు ఆకాశ్ ఎవరికి తెలియకుండా ఇంటి నుంచి వెళ్లడం వాళ్ల నాన్న చూశాడు దాంతో ఆకాశ్ నీ ఫాలో అయ్యాడు. ఆకాశ్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లాడు తన వెనుక వచ్చిన తన తండ్రి నీ చూసి షాక్ అయ్యాడు అప్పుడు ఆకాశ్ అబ్బ దొరికేసాను అని మనసులో అనుకున్నాడు దాంతో ఆకాశ్ చేతిలో ఉన్న బోర్డింగ్ పాస్ లాకుని చూశాడు ఆకాశ్ తండ్రి అందులో ముంబాయి అని ఉంది "ముంబాయి ఎందుకు రా" అని అడిగాడు దాంతో ఇంక లాభం లేదు అనుకోని తన పర్స్ లో ఉన్న audition ఆఫర్ పేపర్ చూపించాడు దాంతో తన కొడుకు ఇంకా ఆక్టింగ్ వదలలేదు అని అర్థం అయ్యింది "శుభ్రంగా ఉద్యోగం చేసుకోక ఎందుకురా ఈ పిచ్చి పనులు" అన్నాడు దాంతో ఆకాశ్ "నేను audition కోసం వెళ్లడం లేదు అశ్వత్థామ అసిస్టెంట్ సంగీత ముంబాయి లో ఉంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది నా మీద నువ్వు అధికారం చెల్లాయిస్తే నచ్చదు ఆ సిద్ధు గాడు నా మీద అధికారం చూపిస్తే కడుపు మండిపోతుంది ఇక్కడ అందుకే తనని పట్టుకోవడానికి సీక్రెట్ గా వెళ్లుతున్న" అని చెప్పాడు, దాంతో నేను వస్తా నువ్వు audition కీ వెళ్లు నేను ఆ అమ్మాయిని పట్టుకుంటా అన్నాడు ఆకాశ్ కీ ఆ ఐడియా బాగా నచ్చింది వెంటనే తనకి ఒక టికెట్ తీసి ఇద్దరు ముంబాయి వెళ్లారు అప్పుడు ఆకాశ్ ఒక టాక్సీ లో "దాదా సాహెబ్ ఫిల్మ్ నగరి" స్టూడియో కీ వెళ్లమని చెప్పాడు ఆ తర్వాత కమిషనర్ అక్కడ లోకల్ DCP తన బాచ్మేట్ అవ్వడం తో అతనికి ఫోన్ చేసి హెల్ప్ అడగాలి అనుకున్నాడు కానీ ఆకాశ్ వద్దు అన్నాడు పోలిసులకు తెలిస్తే తను alret అవుతుంది అని చెప్పాడు దానికి కమిషనర్ నిజమే అనుకోని ఫోన్ పెట్టేసాడు ఆ తర్వాత ఆకాశ్ స్టూడియో దెగ్గర దిగేసి వాళ్ల నాన్న కీ సంగీత అడ్రస్ చెప్పి తనని పంపాడు. ఆ తరువాత వేరే టాక్సీ లో కమిషనర్ నీ ఫాలో అవుతూ వెళ్లాడు ఆకాశ్ దారావి అనే slum ఏరియా లో దిగాడు కమిషనర్ ఆ తర్వాత ఆకాశ్ కూడా కమిషనర్ నీ 100 అడుగుల దూరం నుంచి ఫాలో అవుతూ వెళ్లాడు అప్పుడు సంగీత ఉన్న ఇంటి దెగ్గర తలుపు కొడుతూ ఉన్నాడు ఆకాశ్ సడన్ గా వెనుక నుంచి వచ్చి తన మెడ పైన కమిషనర్ కీ ముత్తు ఇన్జేకట్ చేసి తన వెనుక ఉన్న ఇంటి లోకి లాకుని వెళ్లాడు ఆ తర్వాత సంగీత కమిషనర్ నీ కట్టేసి ఒక ఇన్జేక్షన్ తీసి మెల్లగ కమిషనర్ కీ ఇచ్చింది ఆకాశ్ తన ముందు ఉన్న కంప్యూటర్ లో ఏదో ప్రింట్ తీస్తు ఉన్నాడు ఆ తర్వాత తన ముందు ఉన్న చార్ట్ పైన కొన్ని బొమ్మలు గీస్తు ఉన్నాడు అప్పుడు సంగీత వచ్చి ఇంకో ఇన్జేక్షన్ ఆకాశ్ కీ వేసింది అప్పుడు కమిషనర్ "రేయి ఆకాశ్ ఏమీ చేస్తున్నావు రా అసలు ఎక్కడ ఉన్నాం" అని అడిగాడు దానికి ఆకాశ్ "don't worry commissioner ఇంకో గంట లో నిన్ను నీ కొడుకు ఆకాశ్ దగ్గరికి పంపుతాను నువ్వు ఓపికగా ఉంటే కనీసం గంట అయిన బ్రతుకుతావు లేదు అంటే అర గంట లో చనిపోతావు నీకు ఇచ్చింది most deadly atoms poison అది పోస్ట్ మార్టం చేసిన అది బయటకు రాదు" అని అన్నాడు, అది విన్న కమిషనర్ "నువ్వు నా కొడుకు కాదు అంటే నువ్వు ఎవ్వరూ నా కొడుకు ఎక్కడ" అని అడిగాడు. అప్పుడు తన వెనుక ఉన్న కర్టెన్ తీసి దాని వెనుక ఉన్న ఒక మిసైల్ నీ తీసి చూపించాడు అది చూసిన కమిషనర్ ఒక సారిగా షాక్ అయ్యాడు అప్పుడు ఆకాశ్ వైపు చూసి "అంటే నువ్వు నువ్వు" అని అడిగాడు "అశ్వథ్థామ హతహ కుంజరహ " అని నవ్వాడు అశ్వథ్థామ. (6 నెలల క్రితం) అశ్వథ్థామ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు పట్టుకున్నాక తనని రామేశ్వరం నుంచి తరలిస్తున్నప్పుడు తన పక్కనే ఉన్న ఆకాశ్ తో మాటలు కలిపాడు అశ్వథ్థామ అప్పుడు ఆకాశ్ లో చిన్న భయం తెలుస్తోంది దాంతో మెల్లగ అతని ఆలోచనలు పసి గట్టడం మొదలు పెట్టాడు ఆకాశ్ తన నటన గురించి తనే అనుమానం పడుతూ ఉన్నాడు అదే అదునుగా అశ్వథ్థామ "నువ్వు చాలా బలహీనుడివి ఆకాశ్ నీలో ప్రతిభ లేదు ఎక్కడ నువ్వు ఒడిపోతావో నిన్ను నీ తండ్రి ఎక్కడ బలవంతంగా సెక్యూరిటీ అధికారి చేస్తాడు అని నీ భయం ఈ అవమానం నిస్సహాయం లో నిన్ను ఎవరూ కాపాడాలి అని అనుకోరు అందుకే నువ్వు ఉండి ఏమీ లాభం నీ ప్రాణం కీ విలువ లేదు" అన్నాడు దానికి ఆకాశ్ మనసులో నిజంగానే అభద్రతభావం మొదలు అయ్యి వెంటనే తన పక్కన ఉన్న సెక్యూరిటీ అధికారి గన్ తీసుకొని తనని తాను కాల్చుకొని చనిపోవడానికి చూశాడు కానీ సెక్యూరిటీ ఆఫీసర్లు అప్పడానికి చూశారు ఆ టైమ్ లో గన్ పేలి డ్రైవర్ కీ తగిలి వాన్ బోల్తా పడింది ఆకాశ్ కీ రాడ్ తగిలి స్ప్రుహ కోల్పోయి పడిపోయాడు అప్పుడు సంగీత వచ్చి అశ్వథ్థామ నీ ఆకాశ్ నీ ఇద్దరిని కార్ లో తీసుకొని వెళ్లింది అప్పుడు దారిలో సంగీత తను ఆ రోజు పారిపోతూ ఆకాశ్ చేత్తిని కట్ చేసి అతని బ్లడ్ తీసుకొని వెళ్లి చేసిన టెస్ట్ రిపోర్ట్ తీసుకొని వచ్చింది అందులో ఆకాశ్ బాడి హార్మోన్స్, ఐ అశ్వథ్థామ తో మ్యాచ్ అవుతాయి అని తెలుసుకున్నారు. దాంతో ఆకాశ్ నీ తీసుకొని వెళ్లి అతని కళ్ళు బాడి లోని హార్మోన్స్ నీ తీసుకొని అశ్వథ్థామ కీ ఇచ్చారు దాంతో 3 నెలల్లో పూర్తిగా అశ్వథ్థామ లో ఆకాశ్ హార్మోన్స్ ఇచ్చి తన శరీరం లో వృద్ధత్వం పొయ్యి మెల్లగ యువకుడు లా మారడం మొదలు అయ్యాడు ఆ తర్వాత చెన్నై పోర్ట్ లో నిలువ ఉంచిన యురేనియం నీ కాజేసి ముంబాయి కీ తీసుకొని వచ్చాడు ఆకాశ్ నీ చంపేసి తనని సముద్రం లో పడేసి తనే ఆకాశ్ అయ్యాడు అశ్వథ్థామ. Chapter 1 ends (to be continued)
28-11-2019, 10:30 AM
ఫ్రెండ్స్ నాకూ రేపటి నుంచి semester exams వల్ల నేను 2 వారాలు బిజీ బిజీగా ఉంటాను దానికి తోడు మా ఇంట్లో రెండు పెళ్లిళ్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ రెండు వారాలు నా నుంచి Update ఉండదు అందుకే చాప్టర్ 1 ఈ రోజు ముగుస్తున్న నా exams పెళ్లి హడావిడి అన్ని అయిన తర్వాత మళ్లీ కథ ఫ్రెష్ గా మొదలు పెడతా.
|
« Next Oldest | Next Newest »
|