Posts: 707
Threads: 5
Likes Received: 884 in 226 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
96
"తప్పు నీది కాదు సంజూ నాది... ఇంత పెద్ద ఇల్లు కావాలనుకుంది నేను... నిన్ను పిల్లల్ని సుఖపెట్టాలనుకుంది నేను... మీకు విలాసవంతమైన జీవితం ఇవ్వాలనుకుంది నేను... నిన్ను ఇంట్లోనే ఉంచి రాణిలా చూడలనుకుంది నేను... ఇవన్నీ నా తప్పులే..." వివేక్ ఎత్తి పొడిచాడు...
"ఉద్యోగం పోగొట్టుకొని మరో జాబ్ సంపాదించుకోలేక పోయింది కూడా చెప్పు వివేక్... దాని వల్లే కదా ఈ పెంటంతా..." తిప్పి కొట్టింది సంజన
"అది తల్చుకునే రోజూ చస్తున్నా సంజూ... నువ్వా పుండు మీద కారం చల్లి చాలా సహాయం చేశావ్... చాలా థాంక్స్ ..." అన్నాడు వివేక్ బయటకు రాబోతున్న కన్నీళ్లను ఆపుకుంటూ...
ఆ తరువాత అయిదు నిమిషాల పాటు మౌనమే రాజ్యమేలింది వాళ్ళిద్దరి మధ్య...
వాళ్లిద్దరూ పొట్లాడుకోక చాలా రోజులైంది... నిజానికి సంజన చాలా నెమ్మదస్తురాలు... ఎప్పుడైనా వివేక్ మూడ్ ని బట్టి నడుచుకునేది... ఇద్దరి మధ్యా ఏదైనా అభిప్రాయ భేదం తలెత్తితే సంజన తనే సర్దుకుపోయేది... వీలైనంత వరకు గొడవ కాకుండా చూసుకునేది... కాబట్టి వాళ్ళిద్దరి మధ్యా గొడవలు చాలా అరుదు... వివేక్ జాబ్ పోయి సమస్యలు మొదలయ్యాక తమ మధ్య ఎలాంటి గొడవలు రాకుండా సంజన మరింత జాగ్రత్తగా మసలుకుంటోంది...
సంజన కళ్ళు తుడుచుకుని కాళ్ళ మధ్య ముఖం దాచుకొని కూర్చున్న వివేక్ భుజం పై చెయ్యి వేసి నెమ్మదిగా అంది ...
"వివేక్ ... ఐ యాం సారి... కానీ నాక్కూడా చాలా బాధ కలిగింది... నిజానికి ఈ పరిస్థితులు చూస్తుంటే నాకు చాలా భయంగా కూడా ఉంది... "
"సంజూ... వాడు ఏమన్నాడు ఇంతకీ..." అడిగాడు వివేక్
"ట్రైనింగ్, బిడ్, కాంట్రాక్టు, జాబ్ ఇవన్నీ నిజమని ... మనకు సహాయం చేసే ఉద్దేశ్యం తోనే నన్ను రికమెండ్ చెసానని అన్నాడు... అంతేకాదు ఈ జాబ్ కోసం ఏ విషయంలోనూ నన్ను ఫోర్స్ చేయనని కూడా అన్నాడు..."
"వాట్... జాబ్ ఇచ్చినందుకు మననుండి ఏమీ కోరట్లేదా... అయితే మరి నువ్వింతగా బాధ పడుతున్నావేంటి సంజూ..." ప్రశ్నార్థకంగా చూసాడు వివేక్...
"నీకేమైనా మతి పోయిందా వివేక్... ఏం మాట్లాడుతున్నావ్ అసలు... వాడికేం కావాలో నాకు తెలియదా... ఇప్పుడో ఇంకో రోజో ఏదో ఒక వంకతో వాడు అక్కడికే వస్తాడు... వాడు నన్ను కోరుకుంటున్నాడని తెలిసీ వాడి దగ్గర ఎలా పని చేయగలననుకుంటున్నావు..." కాస్త కోపంగా అడిగింది సంజన...
"సంజనా నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నవేమో... ఆరోజు మనం అతని ప్రపోసల్ రిజెక్ట్ చేసేసరికి నువ్వు ఇక ఒప్పుకోవని గ్రహించి ఉంటాడేమో.... నిజంగానే అతను మనకు హెల్ప్ చెయ్యాలనుకుంటున్నాడేమో... "
"నిజంగానా... అతను మారాడని నిజంగా నువ్ నమ్ముతున్నవా..." వ్యంగ్యంగా అంది సంజనా...
"ఒక్కటి చెప్పు సంజూ... అతడు నిన్నేమైన చేస్తాడని భయపడుతున్నవా..." అడిగాడు వివేక్...
"లేదు .. నాకలాంటి భయమేం లేదు..." వెంటనే అంది సంజన...
"అంటే .. నీకున్న భయమల్లా... అతను మళ్ళీ నీ దగ్గర అప్పటి ప్రపోసల్ తెస్తాడాని... అంతేనా..."
"అవును.." సంశయిస్తూ అంది సంజన... వివేక్ సంభాషణ ఎటువైపు తీసుకెళ్తున్నాడో ఆమెకి తెలియట్లేదు...
"ఒకవేళ వాడు నీ దగ్గర ఆ ప్రస్తావన మళ్లీ తెస్తే నువేం చేస్తావ్..." అడిగాడు వివేక్... తాను వాడుతున్న పదాల్లో "పడుకోవడం" లాంటివి లేకుండా జాగ్రత్తగా అడిగాడు వివేక్...
"ఏం చేస్తానా... ముందు చెప్పు తీసుకొని రెండు చెంపలూ వాయించి, రాజీనామా వాడి మొహాన కొడ్తాను..." ఆవేశంగా అంది సంజన...
"గుడ్... వాడు మిస్ బిహేవ్ చేస్తే ఏం చేయాలో, ఎలా చేయాలో నీకు బాగ తెలుసు... అలాంటప్పుడు ఎందుకు భయపడి ముందే రాజీనామా చేయడం... వాడు అసభ్యంగా ప్రవర్తించి ఏదైనా ఇబ్బంది పెడితే అప్పుడే రాజీనామా చెయ్యొచ్చు... అప్పటివరకు పని చెయ్యొచ్చుగా..."
సంజన మౌనంగా ఉంది...
"నిజంగా సమస్య వచ్చినప్పుడు మనం ఎదుర్కొందాం... సమస్య వస్తుందేమో అని ఇప్పటినుండే భయపడ్డం ఎందుకు... ఆల్రెడీ మనకు చాలా సమస్యలు ఉన్నాయి... ఇప్పుడు భయంతో కొత్తదాన్ని తెచ్చుకోవడం ఎందుకు... " అన్నాడు వివేక్
వివేక్ తనను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని అర్థమవుతుంది సంజనకు... "ఎందుకు వివేక్ నన్ను ఒప్పించాలనుకుంటున్నాడు... స్పష్టంగా నన్ను తన పక్కలోకి రమ్మని పిలిచిన వాడి దగ్గర పని చేయడానికి వెళ్ళమని వివేక్ ఎలా చెప్పగలుగుతున్నాడు...." తనలో తానే అనుకుంది సంజన...
"వివేక్ చాలా దెబ్బతిని ఉన్నాడు... అతనిలో ఇసుమంతైనా ఆత్మవిశ్వాసం లేదిప్పుడు... పరిస్థితులు అతన్ని పూర్తిగా కిందికి లాక్కొచ్చాయి... అందుకే తన పెళ్ళాన్ని రెండు రాత్రులకి అడిగినా... వాడి దగ్గర పని చేయడానికి వెళ్లమంటున్నాడు... అందుకే ఇవన్నీ చెబుతున్నాడు... ఒకవేళ వివేక్ చెప్పేది కూడా నిజమేనేమో...." తర్కించుకుంది సంజన...
"సరే వివేక్... నువ్ చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది... . నేనేంటో , నా శక్తి సామర్థ్యాలు ఏంటో నాకు బాగా తెలుసు.. దేని విషయంలోనూ నన్ను ఎవరూ బలవంతం చేయలేరు... అలాంటప్పుడు వాడితో పని చేయడానికి నాకెందుకు భయం..."
అంది సంజన...
మళ్లీ తనే... "ఏదో వంకతో మీద చేతులు వేసే చీడపురుగులు ఉంటారని తెలిసీ బస్సుల్లో, రైళ్లలో వెళ్తుంటాం... కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపించినా వెళ్లడం మానుకోము కదా... ఈ ఆనంద్ కూడా అలాంటి పురుగే అనుకుంటాను..." అంది..
"సరిగ్గా చెప్పావ్ ... ఎక్కువగా ఆలోచించి బాధపడకు సంజూ... ఇదంతా ఒక నెల వరకే కదా... వీలైనంతగా వాడికి దూరంగా, జాగ్రత్తగా ఉండు... తరువాత నువ్ ఎలాగు ముఖేష్ దగ్గరే పని చేయాలి... అప్పుడు అంతా సర్దుకుంటుంది..." అన్నాడు..
"ఓకే వివేక్... ప్రయత్నిస్తాను..." అంటూ వివేక్ ని హత్తుకుంది సంజన...
(This post was last modified: 07-11-2019, 03:26 PM by
Lakshmi. Edited 1 time in total.)
The following 14 users Like Lakshmi's post:14 users Like Lakshmi's post
• iamrsg, lovelyraj, manmadha.sharma, Nandini Tina, Raj4869, Rajkumar1, rajufromhyd, ramabh, Ramesh_Rocky, Rohan-Hyd, Sadusri, sri7869, Venrao, vsn1995
Posts: 707
Threads: 5
Likes Received: 884 in 226 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
96
కథానుసారం ఈ భాగంలోనూ శృంగారం లేదు... తిట్టుకోకండేం...
Posts: 3,709
Threads: 0
Likes Received: 1,422 in 1,092 posts
Likes Given: 209
Joined: Nov 2018
Reputation:
15
లక్ష్మీ గారు ఇంగ్లీష్ వెర్షన్ లో చాలా అద్భుతమైన కథ ఇది. మీరు దాన్ని ఇంకా అద్భుతం గా వ్రాస్తున్నారు. చాలా బాగుంది. అభినందనలు.