Thread Rating:
  • 43 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery బావ నచ్చాడు (రెండో భాగం నడుస్తోంది)

Showing only the posts of JustRandom: 121 of 716 posts. Show all posts
#1
Heart 

అందరికి హలో!!!

ఈ కథ అందరికి నచ్చుతుంది  ఆశిస్తున్నాను. అలాగే ఏమన్నా తప్పులు ఉంటే సర్దుకుపోగలరు. మీకు ఏమనిపించిన దయచేసి ఫీడ్ బ్యాక్ రూపంలో నాకు చెప్పండి..


- JR
[+] 5 users Like JustRandom's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

Episode - 1

అదొక శనివారం. హైదరాబాద్ నగరం నడిబొడ్డుగా భావించే హైటెక్ సిటీ లో ఒక రెస్టారంట్ లో ఒక కార్నర్ టేబుల్ మీద కూర్చున్నాడు కిట్టు. అసలు పేరు చాలా పెద్దది అయినప్పటికీ అందరు కిట్టు అనే పిలుస్తారు.

వెయిటర్ తెచ్చిన ఆర్డర్ తీసుకుని ఐటమ్స్ రుచి చూస్తున్నాడు. తిన్నంత వరకు అన్ని బాగానే అనిపించాయి. చికెన్, ఎగ్స్, వెజిటేరియన్, ఫిష్ అలా అన్ని టేస్ట్ చేశాడు. కన్విన్స్ అయ్యి ఇక తెచ్చినవి అన్ని ఫినిష్ చేస్తూ కూర్చున్నాడు. మైండ్ గిర్రు గిర్రున తిరుగుతోంది.

సంవత్సరం క్రితం వరకు హ్యాపీగా ఉండేవాడు. ఎనిమిది సంవత్సరాలు పరిచయం ఉన్న అమ్మాయితో మూడు సంవత్సరాలుగా రేలషన్శిప్ లో ఉండేవాడు. అమ్మాయి కూడా బాగా చదువుకుంది. లక్షకు పైగా జీతం. మంచి ఆస్తిపరురాలు కూడా. 

విడి విడిగా ఉన్నప్పటికీ, అటొచ్చి ఇటొచ్చి vacations కి వెళ్లేవారు. ఆ వెళ్ళినప్పుడు బాగానే సెక్స్ చేసే వారు. అది కాకుండా కార్ లో , థియేటర్ లో ముద్దులు, బూబ్స్ పిసకడం వంటివి కూడా జరిగేవి. సెక్స్ లైఫ్ పర్లేదు. కిట్టుగాడికి ఆ పిల్ల అంటే ప్రాణం. సెక్స్ కోరిక యావ కూడా చాలా ఎక్కువ.పెళ్లి చేసుకుని అసలు ఆ అమ్మాయితో వాడి కోరికలు తీర్చుకుని శృంగార సాగరంలో ఎవ్వరూ చూడని ద్వీపాలని సందర్సించాలి అని తెగ కలలు కనేవాడు. 

అయితే ఏమైందో తెలియదు, ఆ అమ్మాయికి వీడిలో ఏమి నచ్చలేదో తెలియదు కానీ చిరాకు పడడం మొదలెట్టింది. అలా అతి తక్కువ సమయంలోనే ఇద్దరికీ మనస్పర్దలు బాగా పెరిగిపోయాయి. ఇలా మనము కలిసి ఉండలేము అని చెప్పి బ్రేకప్ చేసుకుంది.

కిట్టుగాడికి ఆ షాక్ నుంచి తేరుకోవడం జరగని పని. ముందు కాస్త డిప్రెషన్లోకి వెళ్లినా, మరల తేరుకుని ఆఫీస్ పని, ప్రాజెక్ట్ అంటూ నెట్టుకొస్తున్నాడు అప్పటినుండి.

అయితే, ఒక్కగానొక్క పిల్లాడు కావడంతో, అందులోనూ వయసు ముప్పయి తాకేసరికి, ఇంట్లో అమ్మ నాన్న గోల ఎక్కువైంది. మంచి చదువు, మంచి ఉద్యోగం, నెలకి మూడు లక్షలు జీతం, ఇలా అన్ని ఉన్నప్పటికీ, వాడి మనసులో ఆ ఆలోచన రావట్లేదు. ప్రేమించిన అమ్మాయిని తప్ప ఎవ్వరిని ఊహించుకోలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో తండ్రికి గుండెపోటు వచ్చింది. అంతే, అయన ఉండగానే పెళ్ళిచేసెయ్యాలి అన్న సంకల్పం పెద్దవారిలో దృఢంగా మారింది. ఇంక తనకి కావాల్సిన అమ్మాయి కాకపోతే ఏ అమ్మాయి అయితే ఏంటి అనుకున్నాడు. పెళ్లికి ఒప్పుకున్నాడు.

అంతే అదొక యజ్ఞం లాగ చేసి, రెండు నెలలలో పది సంబంధాలు తెచ్చారు. అమ్మాయిలు చూడటానికి ఫొటోలో బానే ఉన్నారు. కాకపోతే కలవాలంటే మాత్రం కిట్టుగాడు ఒక షరతు పెట్టాడు. ముందుగా అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడి వాడి గతం మొత్తం వివరించి అది వారికి  పర్లేదు అంటేనే కలుస్తాను అని మెలిక పెట్టాడు. అంతే, తొమ్మిది సంబంధాలు ఆవిరి మాయం అయినట్టు మాయం అయిపోయాయి. ఒక్క అమ్మాయి మాత్రం వీడిలాగానే ఆలోచించినట్టుంది, ముందు ఫోన్ ఆ తరువాతే కలవడం అన్న షరతు తనవైపున కూడా పెట్టింది. 

అలా ఒక నెల ఫోన్ మాట్లాడాక ఇక పర్లేదు అన్నప్పుడు ఇద్దరు కలవాలి అని నిర్ణయించుకున్నారు.

కిట్టు గాడు అయితే, ఆ అమ్మాయి ఫోటో ఎదో ఒకటి చూశాడు కానీ అమ్మాయి అందచందాల పట్ల ధ్యాస పోలేదు. అమ్మాయికి నచ్చితే తనకి ఓకే అని ఇంట్లో చెప్పేసాడు. అలా ఒకసారి ఆ అమ్మాయిని కలిసి మాట్లాడాక, అమ్మాయికి కూడా వీడు నచ్చాడు. అంతే పెద్దోళ్ళు పెళ్లి పనులు మొదలెట్టేశారు.

అయితే ఇక్కడ ఇంకో చిన్న కిటుకు ఉంది. సమీరా, అదే మన పెళ్లి కూతురికి, ఒక చెల్లెలు ఉంది. తనపేరు స్పందన. అక్కాచెల్లెళ్లు చాలా క్లోజ్. అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు.

అయితే స్పందనకి కిట్టు ఫోటో నచ్చలేదు. కిట్టుగాడి ఫ్లాష్ బ్యాక్ అస్సలు నచ్చలేదు. సమీరకి చెప్పింది కూడా, ఈ సంబంధం వద్దు అని. కానీ తనకి కూడా వయసు పైబడటంతో సమీరకి కిట్టుగాడి నిజాయితీ నచ్చి ఒప్పేసుకుంది. 


ఇంట్లో స్పందనని తిట్టారు కూడా. "నీకెందుకే అన్ని? చేసుకునేదానికి నచ్చితే చాలు. నీకు నచ్చిన వాడిని నువ్వు చేసుకుందువుగాని," అంది వాళ్ళ అమ్మ.  

స్పందనకి అక్క అంటే చాలా ప్రేమ. పెళ్లి ఫిక్స్ అయ్యే సమాయానికి తాను ఇండియాలో లేదు. ప్రాజెక్ట్ పని మీద అమెరికా వెళ్ళింది. తాను చూడకుండా అక్క ఎవడినైనా చేసుకుంటే కష్టాలు పడుతుందేమో అన్న ప్రేమ నుండి పుట్టిన డామినేషన్ తప్ప, నిజానికి స్పందన చాలా మంచిది. ఇక పెళ్లి ఫిక్స్ అయ్యాక ఎంగేజ్మెంట్ కూడా అయ్యాక తాను ఇండియా వచ్చింది.

అయితే మనసులో కోపం కిట్టుమీద అయిష్టత అలానే ఉన్నాయి. అందుకే అసలు వాడితో ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఇంకా నెల ఉంది పెళ్ళికి. ఇప్పుడు మొట్ట మొదటి సారిగా కిట్టు ని పరిచయం చేయడానికి సమీర స్పందనని తీసుకువస్తోంది. అందుకని కిట్టు ఒక మంచి రెస్టారంట్ లో ఆదివారం డిన్నర్ ప్లాన్ చేశాడు.

స్పందనకి నచ్చక పోతే మళ్ళీ ఏమి ఇబ్బందులు వస్తాయో అన్న చిన్న భయంతో అన్ని బాగున్నాయా లేదా అని ముందే చూడటానికి వచ్చాడు. అన్ని బాగున్నాయి అని నమ్మకం కలిగాక బిల్ కట్టేసి, మరుసటి రోజు ఆదివారానికి ఒక మంచి టేబుల్ రిజర్వు చేసి ఇంటికి బయల్దేరాడు.

ఇంకా ఉంది.  
Like Reply
#3

Episode - 2

మరుసటి రోజున అనుకున్న టైం కి రెస్టారెంట్లో కూర్చున్నాడు కిట్టు. అటు ఇటు చూస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం పన్నెండు కావడంతో జనాలు వస్తున్నారు అప్పుడప్పుడే. కాకపోతే పోష్ రెస్టారంట్ కావున అంతా నీట్ గా ఉంది. ఒక మూలన వాటర్ఫాల్ పడుతున్న గాజు గోడకి ఆనుకుని ఉన్న టేబుల్ బుక్ చేశాడు కిట్టు. 


ఇంకా సమీర-స్పందనల జాడ లేదు. అలా కూర్చుని ఏదో టైంపాస్ చేద్దాము అని పక్కనే ఉన్న మ్యాగజిన్ అందుకున్నాడు. అలా పేజీలు తిరగేస్తుంటే వెయిటర్ వచ్చాడు. ఇంకా టైం పడుతుంది అని చెప్పి వాడ్ని పంపేశాడు. అయితే ముందురోజు వచ్చినప్పుడు వాడికి అయిదు వందలు టిప్ ఇచ్చాడు కాబట్టి వాడికి కిట్టు గుర్తున్నాడు. అదేదో చాలా ఏళ్ళు పరిచయం ఉన్నవాడిలాగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు వాడు. మధ్య-మధ్య లో వచ్చి కిట్టుకి ఏమి కావాలో చూస్తున్నాడు. 

ఒక పది నిమిషాల తరువాత అలా దూరంగా డోర్ తెరుచుకుని తెల్లటి కుర్తా టాప్ ఇంకా బ్లూ జీన్స్ వేసుకుని సమీర ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచే కిట్టుని చూసి నవ్వింది. కిట్టు తిరిగి నవ్వాడు. వెంటనే కుర్చీలోంచి లేచాడు. 

సమీర నడుచుకుంటూ కిట్టు దెగ్గరికి వచ్చింది. ఎలా పలకరించాలో అర్థం కాలేదు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. వాటేసుకుని పలకరించాలా? లేక ఇంకా కొత్త కాబట్టి అతి చనువు తీసుకోకూడదా? అర్థం కాకుండా అలా చెయ్యి చాపి హ్యాండ్ షేక్ ఇచ్చాడు. సమీర కూడా చెయ్యి ఊపింది. 

మర్యాదగా ముందుకి వచ్చి కుర్చీ లాగి 'కూర్చోండి,' అన్నాడు. 

సమీర కూర్చుంది. 

'మీ చెల్లెలు రాలేదా?' అని అడిగాడు. 

'వాష్రూమ్ కి అని ఇందాకే వచ్చింది. ఇక్కడికి రాలేదా?' అని అడిగింది. 


ఇంతలో ఒక అమ్మాయి సైడ్ నుంచి వచ్చింది. 'హాయ్!' అని పలకరించింది. 



'ఓసిని? ఎటెళ్ళావే? నాకంటే ముందే వచ్చావుగా?' అని అడిగింది సమీర. 

ఆ అమ్మాయి ఒక చిన్న నవ్వు నవ్వింది. సమీర నవ్వింది. తన చెల్లి తనకన్నా ముందు వచ్చి కాబోయే బావని సీక్రెట్గా అబ్సర్వ్ చేస్తోంది అని అర్థం అయింది. 
కిట్టు మాత్రం బిత్తర చూపులు చూశాడు.

కవర్ చేస్తూ, 'ఇది నా చెల్లి, స్పందన,' అని పరిచయం చేసింది.     

'హాయ్ స్పందన, కూర్చోండి,' అని కుర్చీ లాగాడు. 

స్పందన ఒక సెకను పాటు అలా కిట్టు మొహంలోకి చూసి కూర్చుని తన అక్క వైపు చూసింది. 

కిట్టుకి అక్క చెల్లెళ్ళు ఎదో సైగ చేసుకుంటున్నారు అని అర్థం అయింది కానీ అది పాజిటివ్ గానా నెగటివ్ గానా  అని తెలియలేదు. 

వెయిటర్ వెల్కమ్ డ్రింక్స్ తీసుకొచ్చాడు. 'మీరు comfortable అవ్వండి. నేను ఒకసారి వాష్రూమ్ కి వెళ్ళొస్తాను అని లేచి వెళ్ళాడు. నిజానికి వాడు వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడానికి వెళ్ళాడు. 

'అక్కా.. అక్కా.. అక్కా..' అని సమీర చెయ్యి పట్టుకుని ఊపేసింది స్పందన.  

సమీర: ఏంటే? ఏంటి నీ హడావిడి? 

స్పందన: అక్క.. బావ బావున్నాడు.

సమీర: నాకంటే ముందొచ్చి నువ్వు బావకి సైట్ కొడుతున్నావా?

స్పందన: ఛా.. నీకేమి అన్యాయం చెయ్యను లేవే. కానీ మనిషి బావున్నాడు.    

సమీర: పర్వాలేదులే నువ్వేగా. నేనేమి అనుకోను (నవ్వుతూ). అయినా నువ్వోచింది తన అందం చూడటానికా లేక మంచోడా కాదా అని స్టడీ చెయ్యడానికా? 

స్పందన: మంచోడా కాదా అనేది అప్పుడే తెలియదు. ఆ రిసల్ట్ రావడానికి సమయం పడుతుంది. కానీ ప్రస్తుతానికి ఇదొక్కటే కాంప్లిమెంట్.

సమీర నవ్వింది. ఇంతలో కిట్టు తిరిగి వచ్చాడు. ఏవో కబుర్లు చెప్పుకున్నారు. పెళ్లి పనులు ఎక్కడిదాకా వచ్చాయి ఏంటి  అనే అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. స్పందన మాత్రం కిట్టుని అదే పనిగా పరిశీలిస్తోంది. కిట్టు హావభావాలు, మాట్లాడే మాటలు, వాడి బాడీ లాంగ్వేజ్, వాడు ప్రవర్తన అన్ని క్షుణ్ణంగా చూస్తోంది. 

'ఏమి తింటారు?' అని అడిగాడు స్పందన వైపు చూస్తూ. 

'మీరే ఆర్డర్ చెయ్యండి,' అంది .

'మీరు చెప్పండి సమీరా,' అన్నాడు.

అక్కని మీరు అనే సంబోధిస్తున్నాడు. అంటే అది అతి వినయమా లేక నిజంగా గౌరవం ఇస్తున్నాడా? అని అనుకుంది మనసులో. 

'మీరే ఆర్డర్ చేయండి,' అంది సమీర.

ముందు రోజు వచ్చి మెనూ చూసి టేస్ట్ చేశాడు కాబట్టి టక టక ఆర్డర్ చేసేశాడు. వెయిటర్ తీసుకొచ్చి చికెన్, ఫిష్ స్టార్టర్స్ ఇంకా సాఫ్టుడ్రింక్స్ తెచ్చాడు. సమీర స్పందన ఇద్దరు తినడం ప్రారంభించారు. అందులో వారు ఇంతక ముందు ఎప్పుడు రుచి చూడని డిషెస్ కూడా ఉన్నాయి. స్పందనకి అన్ని నచ్చాయి.

పర్లేదు వీడికి ఫుడ్ విషయంలో టేస్ట్ బానే ఉంది, అని మనసులో ఇంకొక బాక్స్ టిక్ వేసుకుంది.

'మీరు ఇక్కడికి రేగులర్గా వస్తారా?' అని అడిగింది సమీర.


'లేదు. ఎందుకండీ? భోజనం నచ్చలేదా?' అని అడిగాడు చిన్నగా ఖంగారు పడుతూ.

'లేదు లేదు. అన్ని బావున్నాయి. ఇవన్నీ ఇంతక ముందు ఎప్పుడు వినలేదు తినలేదు కానీ చాలా బావున్నాయి. అందుకే అడుగుతున్నాను మీకు ఎలా తెలుసా అని,' అంది. 

అదేదో ఇంటరాగేషన్ లో ఖైదీని ప్రశ్న అడిగితే పక్కన ఉండే సెక్యూరిటీ ఆఫీసర్లు చూస్తున్నట్టు కిట్టు ఏమి చెప్తాడా అని చూస్తోంది స్పందన. చూపు వాడి వైపే ఉంది కానీ చెయ్యి నోరు వాటి పని అవి చేసుకుపోతున్నాయి. గుటుకు గుటుకు మని తింటోంది అన్ని.

కిట్టు చిన్నగా నవ్వుకున్నాడు. హమ్మయ్య అన్ని నచినట్టున్నాయి అసలు ఆగకుండా తింటోంది స్పందన అనుకున్నాడు. మళ్ళీ తేరుకుని సమీరకి సమాధానం ఇచ్చాడు. 

'అదా.. ఏమి లేదండి. ఈరోజు కలుద్దాము అనుకున్నాము. మీ చెల్లెలు కూడా వస్తున్నారు. అందరమూ కలిసి ఫస్ట్ టైం వెళ్తున్నాము కదా. ఇది మెమొరబుల్ గా ఉండాలి అని నిన్ననే వచ్చి ఈ ప్లేస్ చూసి ఐటమ్స్ కొన్ని రుచి చూసి వెళ్ళాను. నాకు బాగా నచ్చినవి ఆర్డర్ చేశాను,' అన్నాడు.

సమీర appreciate చేస్తున్నట్టు నవ్వింది. 

స్పందన కూడా చాలా ఇంప్రెస్స్ అయింది. పైకి అనకపోయినా మనసులో అనుకుంది. అబ్బో వీడికి స్పెషల్ అకేషన్స్ ని ఎలా ప్లాన్ చెయ్యాలో బాగా తెలుసు అనుకుంట. అబ్బాయిలలో చాలా మందికి ఆ ఆలోచన రాదు. ఫుడ్ కూడా ముందే టేస్ట్ చేసి ప్రిపేర్ అయ్యాడు అంటే వీడికి ప్లానింగ్ ఎక్కువ. గుడ్. ఇంకో బాక్స్ టిక్ చేయచ్చు, అనుకుంది.

ఇంకాసేపు గడిచింది. 'ఇంక లేట్ అవుతోంది, షాపింగ్ పని ఉంది. మేము బయల్దేరుతాము,' అంది సమీర.

'షూర్ అండి. I can understand,' అన్నాడు. 

సమీర వాష్రూమ్ కి వెళ్ళింది. స్పందన అక్కడే కూర్చుంది కానీ ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. అందుకే ఫోన్ పట్టుకుని ఎదో ఇంపార్టెంట్ మెసేజెస్ చదువుతున్నట్టు నటించింది.  

బిల్ చెప్పడానికి  'రావు గారు బిల్ తెచ్చేయండి,' అని వెయిటర్ ని పిలిచాడు. ఆ వెయిటర్ ఎంతో వినయంగా తెచ్చి బిల్ ఇచ్చాడు. నాలుగు వేలు దాటింది. క్రెడిట్ కార్డు తీసి ఇచ్చాడు. వాడు పేమెంట్ చేసేసి తీసుకొచ్చి కార్డు ఇచ్చాడు. 'అన్ని బావున్నాయా సర్, ' అని అడిగాడు. 

కిట్టు ఒక అయిదు వందలు చేతిలో పెట్టి, 'చాలా బావున్నాయి సర్. మీ సర్వీస్ కూడా చాలా బావున్నది. థాంక్యూ,' అని వెయిటర్ తో చెయ్యి కలిపాడు. వాడు ఎంతో ఆనంద పడ్డాడు. 

స్పందన అన్ని గమనిస్తోంది అని కిట్టుకి తెలియదు. 

స్పందన అప్పటి వరకు ఏమి మాట్లాడలేదు. అక్క లేని సమయమే కరెక్ట్ అనుకుందో ఏమో, 'మీకు వెయిటర్ బాగా తెలుసా? అతన్ని సర్ అని ఎందుకు పిలుస్తున్నారు?' అని అడిగింది. 

అర్థంలేని ప్రశ్నలుగా అనిపించినా సమాధానం చెప్పాడు. 'లేదండి. నిన్న రాత్రి వచ్చినప్పుడు కలిసాను. అతను తన పని పట్ల ఎంతో శ్రద్ధతో చేస్తున్నాడు. అలా చేసేవారంటే నాకు బాగా గౌరవం. అందుకే అలా సర్ అని పిలిచాను,' అన్నాడు. 

'మరి శ్రద్ధతో పని చెయ్యకపోతే ఎలా పిలుస్తారు?' అని అడిగింది. 
ఏంటి రా బాబు ఈ ప్రశ్నలు  అనుకున్నాడు. 'అప్పుడు కేవలం పేరు పెట్టి పిలుస్తాను. కానీ అలంటి వారితో ఎంతవరకు పని ఉందో అంత వరకే  మాట్లాడుతాను. వీళ్ళే కాదు క్యాబ్ డ్రైవర్ అయినా, షాప్ లో పని చేసేవారు అయినా, డెలివరీ బాయ్ అయినా, చెత్త తీసుకెళ్లే వారు అయినా, వారిని నేను గవరవిస్తాను. ఎందుకంటే వారు వారి పని చెయ్యకపోతే మనము మన పని చేయలేము కదా. అందుకే, అందరు ఇంపార్టెంట్ అందరికి గౌరవం ఇవ్వాలి,' అన్నాడు క్యాజువల్ గా.

పర్లేదు. వీడికి డిగ్నిటీ అఫ్ లేబర్ ఎలా చూపించాలో తెలుసు. వెరీ నైస్. ఇంకో రెండు మూడు బాక్స్ లు టిక్ పెట్టుకోవచ్చు, అని అనుకుంది మనసుతో. 

ఇంతలో తాను కూడా వాష్రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చింది. అందరు కలిసి పార్కింగ్ దెగ్గరికి వెళ్లారు. సమీర కార్ డ్రైవర్ సీట్ దెగ్గరికి వెళ్ళింది, కిట్టు స్పందన కోసం డ్రైవర్ పక్కన సీట్ డోర్ కూడా తీసాడు. స్పందనకి ఆడవారి పట్ల వాడు చూపే మర్యాద నచ్చింది. దాదాపు మూడు గంటలు అన్ని విషయాలలో తనకి కిట్టు పద్ధతి నచ్చింది. కాకపోతే తండ్రిలేని పిల్లలు కావడంతో స్వతహాగా జాగ్రత్త ఎక్కువ. అందులోను స్పందన ఎవ్వరిని తొందరగా నమ్మదు. 

కాకపోతే తమ మొదటి మీటింగ్ గుర్తుండిపోయేలాగా ఉండటం కోసం జాగ్రత్తలు తీసుకుని, తమకి మంచి ఎక్స్పీరియన్స్ పంచిన కిట్టుకి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంది. 

'మెమొరబుల్ గా ఉండాలి మొదటి మీటింగ్ అని చెప్పారు ఫోటోగ్రాఫర్ ని ఆరెంజ్ చెయ్యలేదా?' అని అడిగింది స్పందన. 

అయితే తాను అడిగిన తీరులో కొంచం వ్యంగ్యత గమనించిన సమీర కళ్ళు పెద్దవి చేసి నోరు ముయ్యి అని సైగ చేసింది. 

కానీ అందులో ఆటపట్టించేలా ఉండటం గమనించిన కిట్టు, 'DSLR సరిపోతుందా లేక డ్రోన్ కెమెరా కావాలా?' అని అడిగాడు. 

ఒక క్షణం సైలెంట్ అయిపోయింది స్పందన. కానీ జోక్ అర్థం అయిన సమీర మాత్రం ఫక్కున నవ్వింది. జోక్ అర్థం అయ్యి స్పందన కూడా నవ్వింది.

సెన్స్ అఫ్ హ్యూమర్ కి ఇంకో టిక్, అనుకుంది మనసులో.

మొత్తానికి మళ్ళీ దిగి ముగ్గురు సెల్ఫీ దిగారు. సెల్ఫీ దిగేప్పుడు బాగా దెగ్గరిగా వచ్చారు ముగ్గురు. 


మొదటి సారి సమీర భుజానికి తన భుజం తగిలేసరికి మెత్తగా ఒక చిన్న హాయి కలిగింది కిట్టు మనసులో. సమీర మాత్రం మామూలుగానే ఉంది. అయితే సెల్ఫీ తీస్తున్న స్పందన కిట్టు మోహంలో చిన్న చేంజ్ గమనించింది. అది తన అక్క శరీరం తగలడం వల్ల అని అర్థం అయింది. చిన్నగా నవ్వుకుంది. 

పర్లేదు, అక్క కి అట్ట్రాక్ట్ అవుతున్నాడు, అనుకుంది మనసులో. ఇంకో బాక్స్ టిక్ పెట్టచ్చా లేదా అని ఆలోచించింది. ఇందులో టిక్ పెట్టడానికి ఏముంది? అక్క చెల్లి ఇద్దరు అందంగానే ఉంటా[b]ము. అందులోను అక్కా చాలా బావుంటుంది. ఏ మగాడైనా అట్ట్రాక్ట్ అవ్వాల్సిందే. టిక్ కాన్సల్ అనుకుంది. [/b]

ఇంతలో గుప్పుమని ఒక మంచి వాసన తన ముక్కుకి తగలింది. అది కిట్టుగాడి పెర్ఫ్యూమ్. స్పందనకి చాలా నచ్చింది. వీడికి బాడీ స్మెల్ రాకుండా మైంటైన్ చేయడం తెలుసు. గుడ్. ఇంకో టిక్ వేయచ్చు అనుకుంది. 

'సరే కిట్టు, మేము బయల్దేరుతాము,' అని సమీర కదలడంతో కిట్టు కార్ డోర్ తీసి పట్టుకున్నాడు. స్పందన ఎక్కింది. డోర్ నెమ్మదిగా వేసాడు. 

'ఎంజాయ్ యువర్ షాపింగ్,' అని చెయ్యి ఊపాడు. సమీరా స్పందన ఇద్దరు బయల్దేరారు. ఇంకా తన కార్ తీసుకుని కిట్టు ఇంటికి బయల్దేరాడు.  

ఇంకా ఉంది
Like Reply
#4

(13-02-2025, 08:51 PM)shekhadu Wrote:  deenamma jeevitam
edo vacharu tinnaru poinaru ani kakunda ee test lu endi bro
anyway superb update

alaa vellipothe adi Spandana enduku avutundi bro? She is very intelligent.
Like Reply
#5

Episode - 3

స్పందన అమెరికా నుంచి వచ్చి రెండు వారాలు అయింది. రెండు ఏళ్ళ తరువాత వచ్చి మరల అక్కతో ఉండటం షాపింగ్ కి వెళ్లడం వలన అక్క సమీరలో ఏదో చిన్న మార్పుని చూసింది. ఇది అని ఖచ్చితంగా చెప్పలేకపోయినా అక్క ఇదివరకు లాగా లేదు అని గమనించింది. 

సమీర ఎంత సేపు తనలో తాను ఏదో పరధ్యానంలో ఉండటం, ఎక్కువ సేపు ఒక్కత్తే ఏకాంతంలో గడపటం వంటివి చేస్తోంది. తమ తల్లి సరోజని అడగాలి అనుకుంది కానీ ఆగిపోయింది. బహుశా పెళ్లి దెగ్గరికి వస్తుండటంతో ఎమన్నా కంగారు పడుతోంది ఏమో అనుకుంది. అది ఏ అమ్మాయికి అయినా సహజంగా వచ్చే భయం. కాబట్టి దాన్ని పెద్ద విషయం చేయడం దేనికి అని తనకి తానే సర్దిచెప్పుకుంది. 

కాకపోతే స్పందనని కలవరపరిచే విషయం ఇంకొకటి గమనించింది. అది సమీర కిట్టు అసలు ఫోన్లో మాట్లాడుకోవడం చూడలేదు. సాధారణంగా ఎవరైనా సరే పెళ్లి అవ్వబోతోంది అంటే ఎన్నో మాట్లాడతారు. కొంతమంది గంటల తరబడి మాట్లాడుకుంటారు. కొందరు ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకుని రాత్రి అన్ని పనులు ఆపేసి మాట్లాడుకుంటారు. కానీ స్పందనకి సమీర కిట్టుల మధ్య ఒక ముద్దు ముచ్చట ఉన్నట్టు అనిపించలేదు. కనీసం మెస్సేజెస్ చేసుకుంటున్నట్టు కూడా లేదు. సమీర ఫోన్ ఎక్కడపడితే అక్కడ పడేసి ఉండేది ఇంట్లో. అది సమీర వలనా లేక కిట్టు వలనా అనేది తెలీదు. సమీర ప్రవర్తనలో తేడాకి కారణం అదే అయ్యి ఉంటుందా అని కూడా అనుమానం వచ్చింది. 

స్పందనకి అమెరికాలో ఒకడు పరిచయం అయ్యాడు. అతని పేరు ప్రవీణ్. స్పందన ప్రవీణ్ రోజు మాట్లాడుకుంటారు. ఎప్పుడైనా బిజీ గా ఉంటే కనీసం మెసేజ్ పెట్టుకుంటారు. 

ఎప్పుడైనా అందులో గ్యాప్ వస్తేనే స్పందనకి చాలా చిరాకు వస్తుంది. ఇండియా వచ్చే ముందు ప్రవీణ్ కి తనకి చిన్న గొడవ అయింది. ప్రవీణ్ పెళ్లి చేసుకుందాము అని గొడవ చేసాడు. అయితే అంత త్వరగా వద్దు అని స్పందన ఆపుతుండటంతో మాట మాట పెరిగి గొడవ అయింది. స్పందన మరల అమెరికా వెళ్ళగానే వాడికి తన డెసిషన్ చెప్పాలి. ఒకవేళ తాను నో అని చెప్తే బ్రేకప్ అయినట్టే. యెస్ అనాలి అంటే స్పందన కి అంత ధైర్యం లేదు. 

సరే అక్క పెళ్లి మీద ఫోకస్ చేద్దాము అని తన అంతఃసంఘర్షణని పక్కకి పెట్టింది. 

*****

సమీర-స్పందనల అమ్మ సరోజ ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్. ఆవిడ చాలా స్ట్రిక్ట్. చిన్న వయసులో భర్త చనిపోయినా, భర్త వైపు చుట్టాలు ఆస్తి పంచాల్సివస్తుంది అని దూరం పెట్టినా, స్వశక్తితో ఇద్దరి పిల్లలకి రెండు ఇళ్ళు, బంగారం, కాస్త బ్యాంకు బాలన్స్ సంపాదించి పెట్టి, ఇద్దరినీ బాగా చదివించింది. 
సమీర స్పందనలు కిట్టుని కలిసి వచ్చి వారం అవుతోంది. పోయిన వారం కొంత షాపింగ్ చేసుకున్నారు కానీ ఇంకా స్పందన షాపింగ్ చాలా పెండింగ్ ఉంది. 

సరోజ: మీరు ఇంకా ఎమన్నా కొనుక్కోవాలి అంటే ఈరోజు-రేపట్లో కొనేసుకోండి. ఇంకా 25 రోజులు ఉన్నాయి పెళ్ళికి. లాస్ట్ దాకా పెట్టుకోకండి. 

సమీర: ఒకే అమ్మ. ఇంకా ఏమి లేవులే. నావి బ్లౌసులు కూడా కుట్టడానికి ఇచ్చేశాను.
ఇంకా ఏవో చిన్నా చితక షాపింగ్ ఉంది అంతే. అవి మనము రేపు వెళ్ళినప్పుడు కొనేసుకుంటా. 

స్పందన: ఒసేయ్? అదేంటి? మొత్తం వార్డ్రోబ్ మార్చేస్తావేమో అనుకున్నాను. 

సమీర: ఎందుకు? పది కొత్త చీరలు కొనుక్కున్నాను. అవి చాలు నాకు.

స్పందన: చీరలు కొనుక్కుంటే సరిపోతుందా? మిగతావి? 

సమీర: మిగతావి అంటే? 

సమీర అంత క్యాజువల్ గా అడిగేసరికి స్పందనకి నోట మాట రాలేదు. తన బిహేవియర్ విచిత్రంగా అనిపించింది. 

స్పందన: ఏంటీ? అన్ని నేనే చెప్పాలా? పెళ్లి చేసుకుంటున్నావు. ఏమేమి కావలసి వస్తాయో అది కూడా నేనే చెప్పాలా? ఆ మాత్రం అర్థం కాదా? 

స్పందన తల్లికి వినపడకుండా గొణగడానికి ప్రయత్నించింది. కానీ చిరాకుగా అనేసరికి సరోజకి వినిపించింది. సమీర మాత్రం ఏమి పట్టనట్లు టిఫిన్ తింటోంది. 
సరోజకి అర్థం అయింది స్పందన వేటి గురించి మాట్లాడుతోందో. 

సరోజ: సమీర? నిన్నే అడుగుతోంది చెల్లి. 

సమీర: నాకు పెద్ద షాపింగ్ మూడ్ లేదమ్మా. అయినా బయట ఎక్కువ తిరగద్దు అంటున్నారు అందరు. నాకు కావాల్సినవి అన్ని ఉన్నాయి. నేను ఇంటిపట్టున ఉంటా, టైంకి తిని టైంకి నిద్రపోతా.

సమీర మాటకి స్పందనకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. తల్లి వైపు చూసింది. సరోజ ముఖంలో ఏమి తేడాలేదు. 

సరోజ: సరే అమ్మ. నీ ఇష్టం. ఒక విధంగా నువ్వు బయట తిరగకపోవడమే మంచిది. బాగా రెస్ట్ తీసుకో. అప్పుడు పెళ్ళికి చక్కగా అందంగా కనిపిస్తావు.

సమీర చిన్నగా నవ్వి మల్లి ఇడ్లి తింటూ కూర్చుంది. 

స్పందన: మరి ఈరోజు ప్లాన్ ఏంటి? 

స్పందనకి కంగారు వస్తోంది అక్క గురించి అదే విధంగా తన షాపింగ్ పని అవ్వలేదు అన్న టెన్షన్, అక్క పెళ్లి అయ్యాక బాయ్ఫ్రెండ్ ప్రవీణ్ గురించి చెప్పాలి అనే మరో టెన్షన్. బుర్ర వేడెక్కి నరాలు చిట్లిపోతాయి ఏమో అన్నట్టుంది.  

సమీర: కిట్టు మనని లంచ్ కి కలుద్దాము అన్నాడు.

స్పందన: మనమా? అంటే అమ్మ నేను కూడానా? 

సరోజ: నాకు కుదరదు. ముందే చెప్పా కదా? వచ్చే వారం నాకు నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది. ఈరోజు స్టాఫ్ అందరితో ప్రేపరషన్ మీటింగ్ ఉంది. రాత్రి అయిపోతుంది నాకు. 

సమీర: కిట్టు లాస్ట్ వీకే చెప్పాడు. నేనే నీకు చెప్పడం మర్చిపోయాను. 

స్పందన: థాంక్యూ. ఇప్పటికైనా గుర్తొచ్చింది. లేదంటే చెప్పులేసుకుని చెయ్యి పట్టుకుని చెప్పేదానివేమో. 

స్పందన వెటకారంగా అన్నా, సమీర చిన్నగా నవ్వింది. సమీర నిజంగానే మర్చిపోయింది. రోజు మాట్లాడుకునే జంట అయ్యి ఉంటే గుర్తుండేది. కానీ అలా కాదు కదా. అయినా చెల్లి కోపం న్యాయం అని అనుకుంది. 

సమీర: సారీ చెల్లి. నాదే తప్పు. మర్చిపోయాను.

స్పందన: అయినా పెళ్లి చేసుకోబోయే మీరిద్దరూ వెళ్ళాలి కానీ నేనెందుకు మళ్ళీ తోకలాగా? నన్ను ఎందుకు రమ్మనటం. 

సమీర: కిట్టునే invite చేశాడు.

స్పందన: నన్ను ఇన్వైట్ చెయ్యమని నీకు చెప్పాడా? ఏదో ఫార్మాలిటీకి పిలవమని ఉంటాడులే. నేను రాను. 

సమీర: ఫార్మాలిటీ ఓ కాదో. పోయిన వారం మనము కలిసొచ్చాక అదే రోజు మెసేజ్ పెట్టాడు నాకు. సరదాగా మళ్ళీ వెళదాము అని. మనకి షాపింగ్ పని ఉంది అన్నాను. అందుకని మన ఇంటికి దెగ్గరలోనే రెస్టారంట్ కి వెళదాము అన్నాడు. పొద్దున్న రిమైండర్ కూడా పెట్టాడు.

స్పందన: ఓహో! అయినా ఇన్వైట్ చెయ్యాలి అంటే నాకు డైరెక్టుగా చెప్పాలి కానీ ఇలా వేరే వాళ్ళతో చెప్పిస్తే ఎగేసుకుంటూ వచ్చేయ్యలా? వచ్చేయడానికి మాకు ఇంకా ఏమి పనులు ఉండవా? 

స్పందన కోపం చాలా కంట్రోల్ చేసుకుంటోంది. ఇంకా డిస్కషన్ ఆగట్లేదు అనుకుని సరోజ కలగజేసుకుంది. 

సరోజ: స్పందన! పెద్ద ఇష్యూ చెయ్యకు. మర్చిపోయాను అని చెప్తోంది కదా. అయినా ఇకనుంచి అక్క వేరు బావ వేరు కాదు. ఇద్దరు ఒకటే. ఒకరు పిలిస్తే ఇంకొకరు పిలిచినట్టే. అలవాటు చేస్కో. అయినా నిన్ను పిలవాల్సిన అవసరం ఆ అబ్బాయికి ఏముంది? ఎవరన్నా అడుగుతారా? వాళ్లిద్దరూ మాత్రమే రోజు కలిసినా ఎవ్వరు ఏమి అనరు. అయినా పిలిచాడు అంటే నీకు గౌరవం ఇచ్చాడు అనే కదా. 

తల్లి అన్న మాటలలో నిజాన్ని గ్రహించిన స్పందన సైలెంట్ అయిపోయింది. అయినా సణుగుతోంది. 

సరోజ: ఆ అబ్బాయి అన్ని సార్లు చెప్పాడు అని చెప్తోంది కాదమ్మా, వెళ్ళు. బావుండదు లేకపోతే. 

సమీర: తప్పు నాది చెల్లి. కిట్టుది కాదు. సారీ చెప్తున్నా కదా. 
అక్క అమ్మ బుజ్జగించేసరికి స్పందన ఒప్పుకుంది. 

స్పందన: సరే.. వస్తాను 

సమీర చెల్లి చేతిమీద చెయ్యి వేసి నొక్కింది. తన మోహంలో చెల్లి వస్తోంది అన్న ఆనందం కనిపించింది. అక్క మోహంలో నవ్వు చూసి స్పందన కి కాస్త మనసు కుదుట పడింది. ఇద్దరు కూతుళ్లను చూసి సరోజ సంతుష్టంగా నవ్వుకుంది. 

సరోజ: సరే. టైం ఏడున్నర అవుతోంది. నేను ఇంక బయల్దేరుతాను. రాత్రికి డిన్నర్ చేసి వస్తాను. బై.

ఇంకా ఉంది
    

Like Reply
#6

(15-02-2025, 03:13 PM)nareN 2 Wrote:  కధని కధలా రాస్తున్నారు..చక్కగా..

రాబోయే త్రీసమ్ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాం.. బాగా రాయండి..

అల్ ది బెస్ట్..

థాంక్యూ మిత్రమా.
[+] 1 user Likes JustRandom's post
Like Reply
#7
Wink 

(15-02-2025, 03:58 PM)3sivaram Wrote:  [Image: anime-two-indian-girls-v0-q-UVMSZL9on-G4...3e4-Y.webp]

ఇందులో మీ ఊహలో స్పందన ఎవరు  సమీర ఎవరు?  :shy:
[+] 1 user Likes JustRandom's post
Like Reply
#8

(15-02-2025, 05:50 PM)3sivaram Wrote:  సరిగా చూడండి మీకే తెలుస్తుంది?

ఒకరు చలాకీగా చీర మొత్తం పరుపు మీద పరిచి, మొహం నిండుగా నవ్వుతూ ఉన్నారు.  స్పందన
రైట్

మరొకరు వయస్సు వల్ల వచ్చిన పెద్దరికం కనబరుస్తూ కేవలం పెదవుల చివరన చిన్న వంపు వచ్చేలా నవ్వారు.  సమీరా..
లెఫ్ట్

మీ ఊహ బావుంది. అలా క్యారెక్టర్ కి ఒక రూపాన్ని సృష్టించుకుని కథ చదివితే వచ్చే అనుభూతి నెక్స్ట్ లెవెల్.
Like Reply
#9

(16-02-2025, 05:22 PM)Ranjith62 Wrote:  Excellent updates

Thank you Ranjith62 gaaru.
Like Reply
#10

Episode - 4

ఉదయం పదకొండు గంటలకి అక్కాచెల్లెళ్లు రెడీ అయిపోయి కూర్చున్నారు. కిట్టు వచ్చి కింద వెయిట్ చేస్తున్నాని కాల్ చేశాడు.

స్పందన: పైకి పిలవ్వా? 

సమీర: అడిగాను. మళ్ళీ మనకి షాపింగ్ కి లేట్ అవుతుందేమో అని తానే వచేయమన్నాడు. 

స్పందన కి ఇర్రిటేషన్ పెరిగిపోతోంది తన అక్క ధోరణికి. మీరేంటో మీ విధానాలేంటో అని రావు రమేష్ తరహాలో మనసులో అనుకుని బయల్దేరింది. 

లిఫ్ట్ దిగి అలా నడుచుకుంటూ పార్కింగ్ దెగ్గరికి వెళ్లేసరికి కిట్టు కార్ దిగి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. స్పందన సమీరా కన్నా ఒక పది అడుగులు వెనకాల ఉంది. 

సమీర కిట్టు ఎలా పలకరించుకుంటారా అని ఒక కన్నేసి చూస్తోంది. 
సమీర తన దెగ్గరికి రాగానే కిట్టు ఒక అడుగు ముందుకి వేశాడు. హాగ్ చేసుకుంటాడేమో అని చూసింది. కానీ సమీర చెయ్యి చెప్పడంతో అడుగు వెనక్కి వేసి చెయ్యి చాపాడు. దాదాపుగా తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరిని హాగ్ చేసుకుంటూ పలకరించుకునే స్పందనకి సమీర వ్యవహారం వింతగా అనిపించింది. 

కిట్టు పర్లేదు. ట్రై చేస్తున్నట్టున్నాడు. అక్కనే అతన్ని దూరం పెడుతోందా? ఎందుకు? 

స్పందన బుర్రకి సమాధానం అందలేదు. తాను తన బాయ్ఫ్రెండ్ ప్రవీణ్ ని హాగ్ చేసుకుంటుంది కానీ వాడు స్మోక్ చేస్తాడు. అప్పుడు మాత్రం దూరం పెడుతుంది. కానీ కిట్టు స్మోక్ చేసేవాడిలాగా అనిపించలేదు. మరి ఏంటో చూద్దాము అనుకుంటూ వాళ్ళిద్దరి దెగ్గరికి వచ్చింది.    

'హలో స్పందన,' అని రెండడుగులు ముందుకి వేసి మరి హ్యాండ్ షేక్ ఇచ్చాడు. స్పందన చెయ్యి అందించింది. తన ముక్కుపుటాలు చాలా షార్ప్. పెర్ఫ్యూమ్ వాసన వచ్చిందే తప్ప ఇంకా ఏమి దుర్వాసన రాలేదు. సమీర మొహం చూసింది. సమీర చిన్నగా నవ్వుతు నుంచుంది. ఏంటో మా ఇద్దరికీ హ్యాండ్ షేక్ ఇచ్చాడు. వింత జంట అనుకుంటూ కార్ వెనక డోర్ ఓపెన్ చేసి ఎక్కింది.

మంచి కార్ పెర్ఫ్యూమ్ వాసనకి మూడ్ ఒక్కసారిగా లిఫ్ట్ అయింది. కార్ చాలా నీట్ గా ఉంది. ఇక అందరు కారెక్కి ఇరవయి నిమిషాలలో రెస్టారెంట్ కి చేరుకున్నారు. ఒక మంచి టేబుల్ దెగ్గరికి వెళ్లి రోడ్ సైడ్ వ్యూ చూస్తూ ఆర్డర్ పెట్టేసి కూర్చున్నారు. 

కిట్టు: షాపింగ్ ఎక్కడిదాకా వచ్చింది. 

సమీర: నా షాపింగ్ దాదాపుగా అయిపోయింది. ఇంకా కొంచం మిగిలి ఉంది. 

కిట్టు: గుడ్. మరి మీది స్పందన? ఎక్కడిదాకా వచ్చింది. 

స్పందన: నాది చాలా పెండింగ్ ఉంది. వచ్చి రెండు వారాలే కదా అయింది. ఇంకా చాలా పనులు ఉన్నాయి. 

స్పందనకి మనసులో కోపం చిరాకు ఉన్నా కిట్టు చాలా పొలిట్ గా మాట్లాడుతుండేసరికి తాను కూడా నార్మల్గా మాట్లాడుతోంది. ఫార్మాలిటీకి పిలిచాడో లేదో తెలీదు కానీ గతవారం కంటే ఎక్కువ ఫ్రీగా మాట్లాడుతున్నాడు. బాగా ట్రీట్ చేస్తున్నాడు అని కూడా అనిపించింది.  

కిట్టు: I can understand.   

సమీర ఏదో పరధ్యానంలో ఉంది. అది కిట్టు ఇంక స్పందన ఇద్దరు గమనించారు. కిట్టు ఏ మాత్రం ఆక్వర్డ్ గా కాకుండా సిట్యుయేషన్ హేండిల్ చేస్తున్నాడు. కడుపు నిండా భోజనం పడేసరికి స్పందన మూడ్ బాగుపడి మళ్ళి కిట్టుని ఒబ్సెర్వె చెయ్యడం మొదలెట్టింది. 'పర్లేదు బాబు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా హేండిల్ చేస్తున్నాడు,' అనుకుంది.     

స్పందన: మీ షాపింగ్ ఎక్కడిదాకా వచ్చింది?

కిట్టు: నేను ఇంకా మొదలు పెట్టలేదండి. ముందు మా ఇంట్లో వాళ్ళకి కావాల్సిన షాపింగ్ అంతా చేసేశాను. ఇంకా నాది చెయ్యాలి. వచ్చే వారంలో వెళ్తాను.

స్పందన: వచ్చే వారం అంటే బాగా లేట్ అవ్వదా?

కిట్టు: లేట్ ఏముందండి. తెలిసిన టైలర్ ఉన్నాడు. కుట్టించాల్సినవి అన్నీ ఆయన దెగ్గరే. ఇంకా మిగతావి కొన్ని రెడీమేడ్. ఏవో కొంచం ఆల్టరేషన్ చేయిస్తే చాలు. మొత్తం కలిపి వారం పడుతుంది అంతే. 

స్పందన: ఆహా! ఎంత అదృష్టం. మాకు కూడా అలా ఎవరన్నా ఉంటే ఎంత బావుండేదో! కదాక్క? 

స్పందన జెన్యూన్ గా సమాధానం చెప్తూ అదే పనిలో అక్కతో మాట్లాడించే ప్రయత్నం చేసింది. 

సమీర: అవును. కానీ మనకి అంత త్వరగా ఇచ్చే టైలర్స్ లేరుగా. అమ్మాయిల బట్టలు టైం పడతాయి ఎలాగూ. 

స్పందన: అయినా నీవి అన్ని అయిపొయినాయి. నావే ఇంకా కొనాలి స్టీట్చింగ్ కి ఇవ్వాలి. 

కిట్టుకి సడన్ గా ఏదో గుర్తొచ్చింది.

కిట్టు: నా టైలర్ దెగ్గర లేడీస్ టైలర్స్ కూడా ఉంటారండీ. నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ చాలా సార్లు చూసాను. చాలా మంది ఆడవారు వచ్చి డిసైనర్ వేర్ కుట్టించుకుంటూ ఉంటారు.  

అది వినగానే స్పందన మొహం వెలిగిపోయింది. వెంటనే సమీర వైపు చూసింది. సమీరకి తన చెల్లి మనసులో ఏమి అనుకుంటోందో అర్థం అయింది. 

సమీర: నువ్వు ట్రై చేస్తావా? 

స్పందన సమీర వైపు కిట్టు వైపు మార్చి మార్చి చూసింది. తన బుర్రలో ఏవో ఆలోచనలు నడుస్తూనే ఉన్నాయి. 

సమీర: కానీ ఎంత టైం తీసుకుంటారో ఎమన్నా ఐడియా ఉందా కిట్టు? సాధారణంగా అంత బిజీ ఉన్నవాళ్లు నెలలు తీసుకుంటారు. అందులో డిసైనర్ బ్లౌజ్ లు కుట్టాలి అన్నా సారీ మీద వర్క్ చెయ్యాలి అన్నా హాండీవర్క్ కాబట్టి టైం పడుతుంది. 

కిట్టు: అమ్మాయిలవి నాకు ఐడియా లేదండి. కానీ కనుక్కోమంటే ఒక సారి కనుక్కుంటాను.

వెంటనే స్పందన సమీర వైపు చూసింది ఏదో సలహా కోసం అన్నట్టు. చాలా సేపటి తరువాత అక్క మళ్ళీ మాములుగా మాట్లాడుతూ ఉండటంతో స్పందన మనసు కాస్త కుదుట పడింది.     

సమీరకి చెల్లి మనసు అర్థం అయింది. 

సమీర: కిట్టు, మీరు కనుక్కోండి. 

కిట్టు వెంటనే ఫోన్ తీసి డయల్ చేశాడు.

కిట్టు (ఫోన్ లో): హలో పటేల్ గారు. ఎలా ఉన్నారు. నేను చాల బాగున్నాను... ఏదో ఈ మధ్య కాలంలో కొత్తవి ఏమి కుట్టించుకోవాల్సిన అవసరం రాలేదు. మీరు కుడితే పదేళ్లు చెక్కు చెదరదు కదా... హ హ హ. అయినా పాత బాకీలు అన్ని తీర్చేసుకునేందుకు మీ దగ్గరికి వచ్చే వారంలో వస్తాను. అవును. నాకు పెళ్లి కుదిరింది.. ఓహ్ థాంక్యూ థాంక్యూ.. పార్టీ నా... మీరు చెప్పండి... ఎప్పుడంటే.. అప్పుడే.... మీకన్నా ఎక్కువా... పటేల్ జి... హ హ.. ఏమి లేదు... నాకు ఒక చిన్న హెల్ప్ కావలి... అనుకోకుండా పెళ్లి కుదరడంతో మా వాళ్ళకి పెళ్ళికి కావాల్సిన చీరలు, డిసైనర్ బ్లౌజ్ లు అవి త్వరగా కుట్టే టైలర్స్ కోసం చూస్తున్నారు... అంతే అంటారా? తెచ్చెయ్యమంటారా? హ హ హ మీరు సూపర్ సర్. సరే.. నేను కనుక్కుని చెప్తాను... ముందు శాంపిల్ తెమ్మంటారా? సరే సరే.. అడిగి ఫోన్ చేస్తాను. ఉంటాను సర్... బై.. 

స్పందన సమీరాలు ఆతృతగా చూస్తున్నారు. 

కిట్టు: వాళ్ళ దెగ్గర లేడీస్ టైలర్ తో మాట్లాడుతాను అన్నాడు. మనని ఏదన్నా శాంపిల్ కి ఒకటి ఇమ్మన్నాడు. అది నచ్చితే అన్ని కొట్టడానికి ఇమ్మన్నాడు.     
సమీరా స్పందనలు ఏదో లంకె బిందెలు దొరికినవారి మల్లె మొహాలు విప్పారి చూస్తున్నారు. 

స్పందన: సరే అయితే. నేను రేపు ఎల్లుండి కావాల్సినవి అన్ని కొనేసుకుంటాను. ఈరోజు శాంపిల్ కి ఒక రెండు బ్లౌసులు ఇస్తాను. ఎక్కడికి పంపించాలి? రాపిడో చేస్తాను.  

కిట్టు: రాపిడోలో  వద్దు. అక్కడ ఆయన వర్కర్స్ రిసీవ్ చేసుకుని పక్కకి పెట్టేస్తారు. నేనే వెళ్తాను. 

స్పందన వెంటనే కళ్ళు పెద్దవి చేసి చూసింది. 

స్పందన: అయ్యో మీకెందుకండి శ్రమ. మీరు ఫోన్లో చెప్పారు కదా.. నేనే వెళ్లి ఇస్తాను లెండి. 

కిట్టు: శ్రమ ఏమి లేదు. అసలే మీరు షాపింగ్ చెయ్యాలి. ఇండియా వచ్చి రెండు వారాలు అయింది. మీకెన్ని పనులు ఉంటాయో నేను ఊహించగలను. అసలు మొహమాటం లేకుండా ఏమన్నా పనులు ఉంటే నాకు చెప్పేయండి. వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారు అని ఆలోచించకండి. ఎవ్వరికి చెప్పక్కర్లేదు. 

ఆ క్షణంలో స్పందనకి కిట్టు పట్ల గౌరవం లక్షింతలు పెరిగింది. అలా మాట్లాడే వ్యక్తిని ఎప్పుడు ఎప్పుడు చూడలేదు.

సమీర: పర్లేదు స్పందన. ఇవ్వు. థాంక్యూ సో మచ్ కిట్టు. 

ఇంతలో వెయిటర్ మెయిన్ కోర్స్ తెచ్చాడు. బిర్యానీ తినడంలో  నిమఘ్నమైపోయారు. 
    
ఇంకా ఉంది     
Like Reply
#11

(16-02-2025, 10:40 PM)shekhadu Wrote:  ekkado kodtondi chinna....
Nice update bro.

Big Grin
Like Reply
#12

(17-02-2025, 04:14 PM)nareN 2 Wrote:  టైలర్ తో కాల్ కూడా బా రాసావ్ బ్రో.. లైక్ అవతలి వాళ్ళు చెప్పేవి కూడా చెప్తూ.. ఇంప్రెస్డ్..

నైస్ హ్యాండ్లింగ్ అఫ్ ది లీడ్ క్యారెక్టర్స్ అండ్ కారక్టరైజెషన్..

బావ తో పాటు మాకు మరదలు కూడా నచ్చింది..

Thank you for your comments!
[+] 1 user Likes JustRandom's post
Like Reply
#13

(16-02-2025, 11:45 PM)Mahesh12 Wrote:  Nice writing brother...

Thank you brother!
Like Reply
#14

(18-02-2025, 05:47 PM)Raju1987 Wrote:  చాలా మంచి స్టోరీ ఇలాగే కొనసాగిచండి

Thank you Raju1987 gaaru!!!
Like Reply
#15

Episode - 5

బిర్యానీ ఎంజాయ్ హిస్తూ ఇంటున్నారు. ఇంతలో కిట్టు కాజుఅల్ గా అడిగాడు. 

కిట్టు: నెక్స్ట్ రెండు రోజులలో మీ షాపింగ్ అయిపోతుందా?

స్పందన సమాధానం చెప్పే లోపల సమీర మాట్లాడింది. 

సమీర: అది అడగొద్దు. మేడం గారికి ఏది పట్టాన నచ్చదు. పది షాపులు తిరిగి వంద చూసి అప్పుడు డిసైడ్ అవుతుంది. 

స్పందన: అందులో తప్పు ఏముంది? అంత డబ్బు పెట్టి కొనేప్పుడు ఒకటికి పది చూసి బాగా నచ్చింది కొనుక్కుంటాను. దానికి కాస్త టైం పడుతుంది. మీరు చెప్పండి కిట్టు, సెలెక్టీవ్గా ఉండటం తప్పా?

మొదటి సారి స్పందన అంత కంఫోర్టాబుల్ గా మాట్లాడుతోంది. కిట్టు మాట్లాడేముందు నవ్వుతు సమీర కేసి చూశాడు. సమీర కూడా నవ్వుతోంది.  

కిట్టు: అసలు తప్పు లేదు. బెస్ట్ కావలి అంటే కాస్త టైం స్పెండ్ చెయ్యాలి. నేను అయితే వెయిట్ చేస్తాను. 

స్పందన: కదా! చూశావా అక్క? కిట్టు కూడా నాలాగే. 

స్పందన అక్కకి పంచ్ వేసినట్టు గర్వంగా చూసింది. చెల్లిని చూసి సమీర ఇంకా నవ్వుకుంది. 

సమీర: సరేనే. మీరిద్దరూ ఒకే పార్టీ. మేమే వేరు. ఒకే నా? 

ముగ్గురు నవ్వుకున్నారు. వెంటనే స్పందనకి సమస్య గుర్తొచ్చింది. 

స్పందన: నేను రేపు షాపింగ్ కి వెళ్లి మాక్సిమం కొనేస్తాను. ఎల్లుండి సెలవు పెట్టి అయినా సరే ఇంకా మిగతావి కూడా కొనేస్తాను.    

ఇంతలో సమీరకి ఫోన్ వచ్చింది. అది తన బ్యూటీ పార్లర్ ఆవిడ. సమీర ఒక రెండు నిమిషాలు మాట్లాడింది. 

స్పందన: ఏమైందక్క? 

సమీర: ఆ బ్యూటీ పార్లర్ ఆమె రేపు ఏటో వెళ్లొతోంది అంట. అందుకే ఈరోజే రమ్మంటోంది. 

స్పందన (చిరాకుగా): అదేంటి? రేపు పొద్దున్న నాలుగు గంటలు నీకోసమే అంది. అలా ఎలా మారుస్తుంది మళ్ళీ?

సమీర: ఏదో ఫామిలీ ఎమర్జెన్సీ అంట. పర్వాలేదులే. నేను ఎలాగూ ఖాళీగానే ఉన్నకదా. సరే నేను బయల్దేరుతున్నాను. 

స్పందన: సరే నేను కూడా ఇంటికి వెళ్తాను. కిట్టుకి ఇవ్వాలి కదా? 

సమీర: డన్. 

స్పందన: డన్. 

కిట్టు: డన్. 

సంబంధం లేకుండా కిట్టు మాట్లాడేసరికి అందరు నవ్వుకున్నారు. డెసెర్ట్స్ తినేసి స్టార్ట్ అయ్యారు. సమీర ని పార్లర్ దెగ్గర దింపారు. ట్రాఫిక్ బాగా ఉండటం వల్ల స్పందన కార్ దిగి ముందు సీట్లోకి వచ్చే అవకాశం లేదు. అలానే వెళ్లిపోయారు. స్పందన వాళ్ళ అపార్ట్మెంట్ దెగ్గరికి రాగానే సెక్యూరిటీవాడు కిట్టుని క్యాబ్ డ్రైవర్ లాగా డీటెయిల్స్ అడిగి క్యాబ్ డ్రాప్ అండ్ పికప్ పాయింట్ కి వెళ్ళమని చెప్పాడు. 
కిట్టు నవ్వాడు. స్పందన వెంటనే కలగచేసుకుని అతను క్యాబ్ డ్రైవర్ కాదు ఫామిలీ అని చెప్పింది. మొత్తానికి విసిటర్ పార్కింగ్ దెగ్గరికి వెళ్లారు. స్పందన కార్ దిగింది.  

కిట్టు: నేను వెయిట్ చేస్తాను. 

స్పందన: అదేంటి? ఇక్కడిదాకా వచ్చి ఇంట్లోకి రారా? 

కిట్టు: ఎందుకులేండి? ఉంటాను పర్లేదు. 

స్పందన: ఛీ చి. అదేంటి! పెళ్ళికి ముందు ఇంట్లోకి రాకూడదు అని ఎమన్నా సెంటిమెంట్స్ ఉన్నాయా? అలా ఉంటే బలవంతపెట్టను.

కిట్టు నవ్వాడు. స్పందన మంచి మాటకారి అని గమనించాడు. స్పందన మాటల్ని ఎంజాయ్ చేస్తున్నాడు. 

కిట్టు: నాకు అలాంటి చెత్త సెంటిమెంట్స్ లేవు. 

స్పందన: నాకు అస్సలు లేవు. నాకు తెలిసి మా అమ్మకి కూడా లేదు. మా అక్క పట్టించుకోదు.  సో రండి. లేదంటే నిజంగా డ్రైవర్ అనుకుంటారు. 

కిట్టు నవ్వుకుంటూ స్పందన వెనకాలే వెళ్ళాడు. లిఫ్టులో పదో ఫ్లోర్లో ఉన్న ఇంటికి వెళ్లారు. స్పందన తలుపు తీసింది. ముందు తాను లోపలి వెళ్ళింది. 

స్పందన: వెల్కమ్ శ్రీ శ్రీ కిట్టు! మీ ఫ్యూచర్ వైఫ్ ని మీకు అందిస్తున్న ఇంటికి రండి. 

కిట్టు నవ్వుకుంటూ లోపలికి వచ్చాడు. వాడు రాగానే స్పందన వచ్చి మెయిన్ డోర్ వేసేసింది. కిట్టు కొంచం సంకోచించాడు. స్పందనకి అర్థం అయింది. 

స్పందన: ఏమి పర్లేదు. లిఫ్ట్ ఎదురుగా ఉన్న ఇల్లు కదా. వచ్చేపోయేవారు చూసుకుంటూ వెళ్తుంటారు. అందుకే ఆ తలుపు ఎప్పుడూ వేసేస్తాము.

కిట్టు ఇంప్రెస్స్ అయ్యాడు. అనుకోకుండానే తన మనసులో సమీరాకి స్పందనకి ఉన్న వ్యత్యాసం గమనించాడు. ఒక పక్క సమీర ఎంత మాట్లాడినా ప్రతిస్పందించదు. మరో పక్క స్పందన కిట్టు మనసులో ఉన్నది కూడా దాదాపుగా అన్ని అర్థం చేసుకుంటోంది. చిన్నగా నవ్వుకుని కూర్చున్నాడు. 

స్పందన చల్లటి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. టీవీ ఆన్ చేసి రిమోట్ ఇచ్చింది. బాత్రూం ఎక్కడ ఉందో చూపించింది. ఒక వ్యక్తి మొదటి సారి ఇంటికి వస్తే అడగడానికి ఇబ్బంది పడే విషయాల్ని గమనించి ముందే టక టక చెప్పేసింది. 

స్పందన: నేను వెళ్లి మెటీరియల్ తెస్తాను. 

స్పందన లోపలికి వెళ్ళింది. కిట్టు ఇల్లు గమనిస్తూ కూర్చున్నాడు. 3BHK ఇల్లు. ఇంటీరియర్స్ బావున్నాయి. చాలా బావుందనిపించింది. ఈలోగా స్పందన రెండు కవర్లు తీసుకుని వచ్చింది. 

స్పందన: ఇదిగోండి. ఇందులో నాలుగు పీస్ లు ఉన్నాయి. 

కిట్టు: నాలుగా? 

స్పందన: కాదు కాదు. ఏవైనా రెండు. రెండురకాల సాంపిల్స్ డిజైన్ ఇంకా సైజు కోసం ఈ కవర్లో పెట్టాను.

క్లోత్లు చేతికి ఇచ్చింది కానీ మొహమాటంగా తన బ్లౌసులు ఉన్న కవర్ అక్కడ పక్కన పెట్టింది.

కిట్టు: ఒకే! అక్కడ ఎమన్నా డౌట్ వస్తే కాల్ చేస్తాను. ఇప్పుడు ఇంక బయల్దేరుతాను

కిట్టు లేవబోయాడు. స్పందన ఆపింది. 

స్పందన: అప్పుడేనా? ఏమన్నా తీసుకుని వెల్దురు కూర్చోండి.

కిట్టు (మొహమాటంగా): ఇందాకే కదా పీకల దాకా తిన్నాను.    

స్పందన: తింటే తిన్నారులే. ఇప్పుడు చెప్పండి. అసలే రాక రాక వచ్చారు.

కిట్టు నవ్వుతు ఎందుకు అన్నాడో తెలీదు కానీ ఫ్లోలో అనేశాడు. 

కిట్టు: రాక రాక కాదు. మొదటిసారి వచ్చాను. 

స్పందన ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు తనకి గుర్తొచ్చింది. కిట్టు తల్లిదండ్రులు వచ్చారు కానీ కిట్టు ఎప్పుడూ ఇంటికి రాలేదు. 

స్పందన: మొదటిసారి? అయితే మీతో రిబ్బన్ కటింగ్ నేను చేయించానా? 

కిట్టు (నవ్వుతు): అవును రిబ్బన్ కటింగ్ మీతోనే.

స్పందన:  అయితే కుడికాలు లోపల పెట్టి వచ్చారా? 

కిట్టు: మీ వెనకేగా వచ్చాను. కుడికాలే పెట్టాను. చూడలేదా? 

ఇద్దరు పకపకా నవ్వుకున్నారు. వారు మాట్లాడిన దాంట్లో ద్వందార్థం ఎంత ఉందో ఇద్దరికీ తట్టలేదు. 

స్పందన: చెప్పండి, ఏమి తాగుతారు? కాఫీ, టీ, సాఫ్టుడ్రింక్? 

కిట్టు: మీకు ఏది తాగాలి అనిపిస్తే అది. 

స్పందన: నాకు మందెయ్యాలని ఉంది. వేస్తారా? 

కిట్టు: మరీ మిట్ట మధ్యాహ్నం బావుండదేమో? అసలే మీ పని మీదే వెళ్ళాలి.

ఇద్దరు మళ్ళీ పకపకా నవ్వుకున్నారు. స్పందనకి కిట్టు మీద ఒక మంచి ఒపీనియన్ ఏర్పడుతోంది. రెండు నెలల క్రితం కిట్టు ఫోటో చూసినప్పుడు గాని, వారం రోజుల క్రితం మొదటిసారి కలిసినప్పుడు కానీ అస్సలు ఊహించలేదు కిట్టు అంత సరదా మనిషి అని. ఇంకా విచిత్రం, తానూ ఇంత త్వరగా జోకులు వేస్తూ మాట్లాడుతుంది అని అసలు అనుకోలేదు. 

కిట్టు కూడా, తన బ్రేకప్ తరువాత ఒక ఇంట్రావర్ట్ అయిపోయాడు. ఏదో ఒకటి అని పెళ్ళికి ఒప్పేసుకున్నాడు. దానికి తోడు సమీర తనకి ఫోన్ మాట్లాడటం, మెసేజ్లు చేస్కోవడం, గంటలు గంటలు నిద్రాహారాలు మానేసి సొల్లు చెప్పడం ఇష్టం లేదు అనడంతో, వాడు ట్రై కూడా చెయ్యలేదు. ఏదో పెళ్లి పనులు అయిపోతున్నాయి, కాలం నడుస్తోంది, వాడు పనులు చేసుకుంటూ పోతున్నాడు.

కిట్టుకి ఏదో ఫోన్ రావడంతో వాడి ఆలోచనలకి, వాళ్ళ మాటలకి చిన్న బ్రేక్ పడింది. 

ఇంకా ఉంది     


 

 
Like Reply
#16

(18-02-2025, 09:36 PM)Adwaith Bhushan Wrote:  స్టోరీ బాగుంది...డబుల్ మీనింగ్ డైలగులు పెట్టండి..వాళ్లిద్దరి అందాన్ని వర్ణించండి..

వీలున్న చోట అవి కూడా వస్తాయి అండి. అవసరం లేని చోట నేను ప్రిఫర్ చెయ్యను. నా శైలి కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.   
[+] 4 users Like JustRandom's post
Like Reply
#17

(18-02-2025, 09:22 PM)Mahesh12 Wrote:  Chala baga rasthunnaru brother...

Thank you andi! Glad you liked it.
Like Reply
#18

(18-02-2025, 08:54 PM)shekhadu Wrote:  how romantic
naku aite edo swati weekly lo stories chaduvutunnatlu undi
good one again sir

హమ్మయ్య.. మీరు బాగా క్యాచ్ చేశారు అంది. శృంగారం కూడా ఉంటుంది కానీ అది కేవలం కథలో భాగమే.
[+] 3 users Like JustRandom's post
Like Reply
#19

Episode - 6

కిట్టు కాల్ మాట్లాడి వాష్రూంకి వెళ్లి వచ్చాడు. స్పందన కిట్టు సమాధానం కోసం ఇంకా వెయిట్ చేస్తోంది. 

స్పందన: నేను పొద్దున్నే కాఫీ తాగుతాను మధ్యాహ్నం టీ తాగుతాను. 

కిట్టు: హే! సేమ్ టు సేమ్. నిజానికి నేను ఏది పడితే అది తాగేస్తాను.  కానీ ఒక్కడినే ఉన్నప్పుడు మాత్రం పొద్దున్న కాఫీ మధ్యాహ్నం టీ ఇంకా రాత్రికి పాలు తాగుతాను. 

స్పందన: సేమ్ పించ్. పది నిమిషాలు.

పది నిమిషాలలో టీ పెట్టుకుని కప్లలో పోసుకుని తీసుకొచ్చింది స్పందన. ఇద్దరు కప్లు పట్టుకుని ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

స్పందన: మందు వెయ్యట్లేదు కాబట్టి ఇదే మందు అనుకుందాము. చీర్స్. 

కిట్టు: చీర్స్! 

ఇద్దరు కప్లు తగిలించుకుని టీ సిప్ చేశారు. 

కిట్టు: ఆహా! అల్లం ఛాయ్! సూపరో సూపర్.

కిట్టు అలా ఫార్మాలిటీస్ పక్కన పెట్టి ఓపెన్ అప్ అయ్యి మాట్లాడుతుంటే స్పందనకి నచ్చింది. 

స్పందన: థాంక్యూ! అమెరికాలో నా టీ చాలా ఫేమస్ తెలుసా? 

కిట్టు: అవునా! మరి మీవాళ్లేంటి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పారు?

స్పందనకి పంచ్ అర్థం అవ్వడానికి ఒక రెండు సెకన్లు పట్టింది. పకపకా నవ్వింది. కిట్టు కనిపించేంత సైలెంట్ కాదు అని అనుకుంది. 

కిట్టు ఏమనుకున్నాడో ఏమో. వెంటనే సీరియస్ గా మాట్లాడాడు. 

కిట్టు: సారీ ! మరీ కుళ్ళు జోక్ వేసినట్టున్నాను. మీరు ఏమి ఫీల్ అవ్వలేదుగా? 

స్పందన: అయ్యో లేదు లేదు. అస్సలు అంటే అస్సలు ఫీల్ అవ్వలేదు. నాకు అలా సరదాగా ఉంటేనే ఇష్టం. నిజానికి నేను కూడా అలా జోకులు వేసి ఇంట్లో తిట్లు తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. 

కిట్టు: ఆమ్మో! అవేంటి నాకు కూడా చెప్పండి. ముందే జాగ్రత్త పడతాను.

స్పందన: అవి చెప్పడం కష్టం. అనుభవించి తెలుసుకోవాలి అంతే.

కిట్టు: అంతేనా? 

స్పందన: అంతే... మిగతాది నీ అదృష్టం. ఎలా రాసి పెట్టి ఉంటే అలా. 

మళ్ళీ నవ్వుకున్నారు. 

స్పందన: అన్నట్టు మార్చుపోయాను. నేను మందు తాగే జోక్స్ వేశాను అని మా అక్క అమ్మ కి చెప్పద్దు. 

కిట్టు (నవ్వు ఆపుకుంటూ): ఎందుకు? జోక్ వేశారు అని తెలిస్తే ప్రోబ్లేమా? లేక మందు తాగుతారు అని తెలిస్తే ప్రోబ్లేమా? 

స్పందన దొరికిపోయాను అన్నట్టు నీళ్లు నమిలింది. చిన్నగా ఇబ్బందిగా నవ్వింది. 
స్పందన: ఏది తెలిసినా ప్రాబ్లెమ్ ఏ. ఎప్పుడో రేర్ గా తాగుతాను. అది కొంచం వైన్ అంతే. 

కిట్టు నవ్వాడు. వాడికి స్పందన మాటల్లో అమాయకత్వం కనిపించింది. తనని కంఫోర్టాబుల్ చెయ్యడానికి వాడి తాగుడు అలవాటు గురించి చెప్పాడు. 

కిట్టు: డోంట్ వర్రీ. నేను కూడా ఎప్పుడైనా రేర్ గా తాగుతాను. ఇది మన సీక్రెట్. 

స్పందనకి ఏదో తెలియని ప్రశాంతత.    

స్పందన: మొదటిసారి ఇంటికి వచ్చారు. రండి ఇల్లు చూపిస్తాను. 

అలా స్పందన కిట్టుకి ఇల్లు చూపించింది. తన తల్లి రూమ్, అక్క రూమ్, ఆ తరువాత తన రూమ్ చూపించింది. ఒక అరగంట తమ ఉద్యోగాల గురించి మాట్లాడుకున్నారు. 

కిట్టు: సరే స్పందన. ఇంక నేను బయలుదేరుతాను. మళ్ళీ లేట్ అయితే మీకు ఇవ్వడం లేట్ చేస్తాడు.

స్పందన: సరే. అసలు మీతో మాట్లాడుతుంటే టైం తెలియట్లేదు.   

కిట్టు: నాకు కూడా (చిన్నగా నవ్వుతు) 

ఇద్దరు కిందకి పార్కింగ్ దాకా వచ్చారు. కార్ ఎక్కబోతూ కిట్టు వెనక్కి తిరిగాడు. 

కిట్టు: థాంక్యూ ఫర్ ది టీ. 

స్పందన: మై ప్లెషర్. మీకే చాలా పెద్ద థాంక్యూ. నా షాపింగ్ సమస్యకి సొల్యూషన్ చూపించారు.

కిట్టు: అప్పుడేనా? మీకు నచ్చాలి కదా. 

స్పందన: నచుతుంది. మీరు చెప్పారు కదా. 

స్పందన మోహంలో ఒక కనిపించీ కనిపించని నవ్వు. అది చూసిన కిట్టు సంతృప్తిగా నవ్వాడు. 

స్పందన: సో నేనే మీకు రుణ పది ఉంటాను. 

కిట్టు: అబ్బా అంత పెద్ద మాటలు ఎందుకు? ఫ్రెండ్ అనుకోండి నన్ను.

స్పందన వెంటనే మోహంలో ఎక్స్ప్రెషన్ మార్చేసింది. 

స్పందన: ఫ్రెండ్ అనుకొనా? నేను ఫ్రెండ్స్ ని అరేయ్ తురేయ్ రారా పోరా అంటాను. 
కిట్టుకూడా అంతే సీరియస్ గా.
 

కిట్టు: నేను కూడా ఫ్రెండ్స్ ని ఒసేయ్ రావే పోవే అంటూ ఉంటాను.  

స్పందన: మరీ అందరిముందు అలా తిట్టుకుంటే బావుండదేమో? 

కిట్టు: మరి ఏమి చేద్దాము? 

స్పందన: అందరి ముందు ఫ్రెండ్షిప్ ప్రదర్సించద్దు లే. అది అర్థం చేసుకుని మెచూరిటీ ఇంకా ఈ లోకానికి లేదు. 

మళ్ళీ నవ్వుకున్నారు. 

స్పందన: అబ్బా! నిజంగా. ఇలా నవ్వుకుని ఎన్నాళ్ళైందో గుర్తుకూడా లేదు. థాంక్యూ సో మచ్. 

కిట్టు: సేమ్ నేను కూడా. మీకు కూడా పెద్ద థాంక్యూ.

స్పందన: 'మీరు' వద్దులే. నన్ను నువ్వు అని పిలవచ్చు. 

ఆ మాట అనేముందు ఏమి ఆలోచించకుండా అనేసింది. 

కిట్టు: నన్ను కూడా నువ్వు అనే పిలవచ్చు. నాకు ఫ్రెండ్లీ గా ఉంటేనే ఇష్టం.

స్పందన: నాకు అలా పిలవాలి అని ఉన్నా, అందరిముందు పిలిస్తే నాకు తిట్లు పడతాయి. అందుకే అందరి ముందు మీరు. మనమిద్దరమే ఉన్నప్పుడు నువ్వు. 

కిట్టు (నవ్వుతు): డన్. ఇది కూడా మన సీక్రెట్. 

కార్ ఎక్కి స్టార్ట్ చేసి బయల్దేరాడు. ఈలోగా మిర్రర్స్లో వెనక స్పందన చేతులు ఊపుతూ పిలుస్తోంది అని చూసాడు. ఏమైందో అని వెంటనే ఆపాడు. 

కిట్టు: ఏమైంది స్పందన? 

స్పందన: నా దెగ్గర మీ ఫోన్ నెంబర్ లేదు. 

కిట్టు: ఓహ్ అవును కదా. నా దెగ్గర కూడా నీ నెంబర్ లేదు. 

కిట్టు తనని ఏకవచనంలో సంబోధిస్తున్నాడు అని గమనించింది. ఇద్దరు నంబర్లు మార్చుకున్నారు. 

కిట్టు: సరే. నేను వెళ్ళాక అప్డేట్ ఇస్తాను. 

స్పందన: ఓకే. జాగ్రత్తగా వెళ్ళు. బై.    

కిట్టు అక్కడి నుంచి కదిలాడు కానీ చిరునవ్వు ఆపుకోలేకపోయాడు. ఒక రెండు గంటల తరువాత కిట్టు మెసేజ్ వచ్చింది. 


కిట్టు: హాయ్ ఫ్రెండ్. టైలర్ కి ఇచ్చాను. వాళ్ళ లేడీస్ టైలర్ వర్క్షాప్ గద్వాల్ కి మార్చింది. పెద్ద స్టోరీ. మళ్ళీ కలిసినప్పుడు చెప్తాను. ఇప్పుడు అయితే రేపు ఉదయం వాళ్ళ స్టాక్ ఏదో గద్వాల్ వెళ్తుందట. అప్పుడు నీవి పంపిస్తాడు. టు డేస్ లో వచ్చేస్తాయి. అప్పుడు వెళ్లి తీసుకుంటాను. 

అప్పటికి సమీర ఇంకా ఇంటికి రాలేదు. సరోజ డిన్నర్ చేసి వస్తాను అని చెప్పింది. దాంతో స్పందన తనకోసం అక్క కోసం వంట చేస్తోంది. కిట్టు పంపిన మెసేజ్ చూసింది. 

స్పందన: ఒకే. అప్పటికి నా షాపింగ్ అంతా కూడా అయిపోతుంది. థాంక్యూ సో మచ్ కిట్టు. ఐ మీన్ ఇట్. 

కిట్టు స్మైలీ పంపాడు. 

కిట్టు: ఎంజాయ్ యువర్ షాపింగ్. 

కిట్టు మెసేజ్ చదివి ఫోన్ పక్కన పెట్టింది. కాసేపాగి వంట పూర్తి అయ్యాక ఫోన్ తెచ్చుకుని సోఫాలో కూర్చుంది. మెసేజ్ లు అన్ని మళ్ళీ చదివింది. కిట్టు నెంబర్ సేవ్ చేసుకుంది 'KITTU' అని సేవ్ చేసుకుంది. 

కిట్టు మెసేజ్ చ్చదువుతున్నంత సేపు, తనకి తెలియకుండా, స్పందన మోహంలో చిరునవ్వు చెదరలేదు. 


ఇంకా ఉంది.    
Like Reply
#20

(19-02-2025, 09:43 AM)Mahesh12 Wrote:  Adhbuthangha rasthunnaru, continue....

Thank you, andi.
Like Reply




Users browsing this thread: 1 Guest(s)