Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 14(సమాప్తం))Completed

Showing only the posts of k3vv3: 108 of 231 posts. Show all posts
#61

ఘోర కలి అరాచకాలు  - 2
కపాలిని దేవి ఆలయం
 
ఘోర కలికి రక్షక భటుడి నుండి పిలుపొచ్చింది. కపాలిని దేవి ఉండే చోటు నుండి కబురొచ్చిందని ఆ భటుడు వణుకుతూ ఘోర కలికి  చెప్పాడు. ఆ రోజు సాయంత్రమే తన సామ్రాజ్యంలో పది దేశాల నుండి వచ్చిన పదిహేను మంది బోర్డు డైరెక్టర్ లను తన రూపంలోకి మార్చే ప్రక్రియ మొదలవ్వబోతుంది. అది జరిగేటప్పుడు తను అక్కడ వుండకూడదు. ఈ ప్రక్రియ తంత్రం ద్వారా జరుగుతుంది.
ఘోర కలి తంత్ర విద్యలను అర్థం చేసుకున్న వైద్య బృందం అక్కడుంది. వారికి ఆజ్ఞ రాగానే ఈ పదిహేను మందిని అచ్చు గుద్దినట్టు ఘోర కలిలా మార్చేస్తారు. వారికి ఆజ్ఞ ఇవ్వటానికి రాయబారిగా ఘోర కలికి బాగా నమ్మకస్తుడైన  సురా  ను నియమించాడు.  సురా ఘోర కలికి బాగా దగ్గరైన వ్యక్తి. బాల్యం నుండి మిత్రుడే. ఘోర కలి ఎక్కడుంటే  సురా అక్కడుంటాడు. వారి స్నేహం అలాంటిది.  సురా   తంత్రంతో సిద్ధించిన ఆ యంత్రాన్ని తీసుకొచ్చి వైద్య బృందానికి అందిస్తాడు. అప్పుడు వారు అచేతనంగా అక్కడ ఉన్న పదిహేను మందిపై ఆ యంత్రాన్ని ఉంచుతారు. ఘోర కలి అనుకునే లక్ష్యాలు, ఆశయాలు, ఆశలు అన్నీ యంత్రం ద్వారా ఆ పదిహేను మందిలో నరనరాన నిండిపోయాక ఆ వైద్య బృందం ఘోర కలిలా వారి బాహ్యరూపాల్ని కూడా మార్చేస్తుంది.
 
 
నాగమణితో, తంత్రంతో ఘోర కలి కపాలిని దేవి సాక్షాత్కారము పొందుతాడు. ఆ దేవి మంత్రాన్ని ప్రసాదిస్తుంది. ఆ మంత్రాన్ని ఘోర కలి అక్కడి నుండే పఠిస్తాడు.సూరాకు తను ఇచ్చి పంపే యంత్రంతో తన సామ్రాజ్యంలో ఉన్న ఆ పదిహేను మందిని తన రూపంలోకి మార్చేస్తారు వైద్య బృందం. దేవి ఇచ్చిన మంత్రంతో కఠోర దీక్షతో సాధన పూర్తయ్యాక పరిపూర్ణమైన కామరూపధారిగా మారిపోతాడు ఘోర కలి. తను అనుకున్నట్టే ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు.
 
ఇది ఘోర కలి ప్రణాళిక.
 
ప్రపంచంపై తను సాధించబోయే ఆధిపత్యాన్ని గుర్తుచేసుకుంటూ, తన ఇన్ని యుగాల నిరీక్షణను గుర్తుచేసుకుంటూ ఒక పక్క వికృతంగా నవ్వుతూనే మరో పక్క కంటి నిండా నీరు నిండిపోయి ఉండగా ఒక్క నిమిషం ఆగి మంచి నీళ్లు తాగి ముందుకు కదిలాడు. తన చీకటి సామ్రాజ్యం నుండి కపాలిని దేవి ఉండే స్థలానికి బయలుదేరాడు.
 
ఘోర కలి తన దగ్గరున్న నాగమణిని వెంట తీసుకెళుతూ
 కాళీ….
 కపాలిని….
 శూలిని…..
జగజ్జనని…..
అని అమ్మవారి నామాలను పదే పదే గట్టిగా బయటికి వినబడేలా ఘోషిస్తూ వెళుతున్నాడు.
 
కపాలిని దేవి ఆలయాన్ని సమీపిస్తున్నాడు. చీకటి తెరలు తెరలుగా కమ్ముకొంటోంది. చిన్న వెలుగు రేఖ కూడా దరిదాపుల్లో కనబడనంత దూరం అయిపోతోంది. ఘోర కలిని సైతం వణికించే పెను చీకటిలా ఉందది.
 
బాహ్యప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతున్నట్టుంది. మనకు కనిపించే ఈ వెలుగు ప్రపంచంలోనే కనబడని అంధకారం ఇంత దాగుందా అనిపించేలా ఉంది ఆ కపాలిని దేవి ఆలయ ప్రాంగణం. గాలి వల్ల, వాసన వల్ల, గుళ్లోని గంటల చప్పుడు వల్ల మాత్రమే ఘోర కలి అడుగులు ముందుకు పడుతున్నాయి కానీ దారి తెలిసి కాదు.
 
మెల్లిగా పసిపాపల ఏడుపులు మొదలయ్యాయి. ఘోర కలి ఘోషలు ఆగిపోయాయి. పసిపాల ఏడుపులు ఇంకా ఇంకా ఎక్కువయ్యాయి. ఒకరు ఇద్దరు ముగ్గురు అలా కొన్ని వేల, లక్షల, కోట్ల ఏడుపులు పసిపాపల ఏడుపులు తీవ్రతరం దాల్చాయి. ఘోర కలి కంట నీరు తిరిగింది. ఘోర కలికి ఏడుపంటేనే అసహ్యం. పసిపిల్లలు ఏడిస్తే తన బాల్యం గుర్తుకొచ్చి కోపం తెచ్చేసుకుంటాడు. అక్కడి నుండి నిష్క్రమిస్తాడు. అలాంటిది ఈ రోజు అన్ని ఏడుపులు ఒకేసారి ఎలా విన్నాడో, విని ఎలా తట్టుకున్నాడో కూడా తెలియట్లేదు. ఒంట్లోని ప్రతి కణం స్పందించినట్టు అనిపించింది. కొన్ని సంవత్సరాల, దశాబ్దాల, శతాబ్దాల బాధ కన్నీటి సంద్రమై ఎగసెగసి పడ్డట్టు అనిపించింది. కన్నీరు ధారలా ప్రవహించింది. వానలా ఎడతెరపి లేకుండా కురిసింది.
 
ఇన్నాళ్లూ తన అంతరంగం ఎండిపోయిన ఎడారి అనుకున్నాడు. ఇవ్వాళే తెలిసింది. తనను కూడా ఏడిపించగల శక్తి ఒకటుందని. అది ఈ కపాలిని దేవి ఆలయంలోనే ఉంటుందని మాత్రం కలలో కూడా కల కనలేదు. కపాలిని దేవిని ఇప్పుడు చూడాలంటేనే భయంగా అనిపించేలా ఉంది ఆ పసిపాపల రోదన.
 
ఘోర కలికి ఏమీ పాలుపోవట్లేదు. అంతు చిక్కట్లేదు. ఏడుపు ఎప్పుడాగిపోతుందో తెలియట్లేదు. కపాలిని దేవి కనిపిస్తుందో లేదో కూడా తెలియదు. కనిపించినా కరుణిస్తుందో లేదో తెలియదు. తన చీకటి సామ్రాజ్యం నుండి ధైర్యంగా బయలుదేరిన ఘోర కలి ఇప్పుడు భయంతో వణికిపోతున్నాడు.  కాళీ....కపాలిని....శూలిని....జగజ్జనని  అంటూ ఊగిపోతూ వచ్చిన ఘోర కలికి ఇప్పుడు నోరు పెగలట్లేదు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62

శంభల రాజ్యం – 2
అనిరుద్ధుడి ఆగమనం – ఆదేశం
 
శంభల రాజ్యాధిపతి అనిరుద్ధుడు. ఆయన మహా విష్ణు భక్తుడు. భూలోకవాసులలో విష్ణువును అత్యంత భక్తితో కొనియాడిన అన్నమయ్య, త్యాగరాజు వంటి వాగ్గేయకారుల సంకీర్తనలు నిత్యం వింటూ కన్నీటి పర్యంతం అవుతూ ఉంటాడు. ఆయన భూలోకవాసులను ఇంతవరకు కలిసింది లేదు. మొదటి సారి సిద్ధపురుషుడి మీదున్న నమ్మకంతో అభిజిత్, అంకిత, సంజయ్ లను కలుస్తున్నాడు. సిద్ధపురుషుడు శ్వేతద్వీప వైకుంఠ వాసి. సిద్ధపురుషుడి గురించి ముల్లోకాలలో తెలియని వారు లేరు. అంత గొప్ప విష్ణు భక్తుడు. సమర్థ రాఘవుడు అనే పేరుతో చివరి జన్మలో నామధేయాన్ని సార్థకం చేసుకున్న తెలివైన మంత్రివర్యుడు. అతని మాటకంత విలువుంది.
 
అనిరుద్ధుడి దినచర్య రోజూ పొద్దున్నేఎన్నో సేవలతో విష్ణు మూర్తికి పూజలు చెయ్యటంతో మొదలవుతుంది. అటు పిమ్మట సర్వలోక రక్షకుడైన ఈశ్వరుణ్ణి వేడుకుంటాడు. కావ్యాలెన్నో చదువుతాడు. యుద్ధవిద్యలెన్నిటినో పర్యవేక్షిస్తాడు. శంభల రాజ్యం చాలా తెలివైనవారిని సైతం మాయకు గురి చేసే లోకం. ఇక్కడి మగువలకు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అందులో ఒక మర్మం దాగుంది. యుద్ధం జయించాలంటే ప్రతి క్షణం గెలుపు మీదనే దృష్టి నిలపాలి. ఆ దృష్టిని తమవైపుకు తిప్పుకునే శక్తి పుష్కలంగా కలవారు శంభల రాజ్యం లోని సౌందర్యవతులు. వీరికున్నఅపురూప లావణ్యంతో చూపులను బంధించి వేస్తారు. వీరు నిత్య యవ్వనంతో అలరారే స్త్రీ శక్తి కలవారు. యుద్ధవీరుల గురించి వీరి ద్వారా సేనాధిపతికి ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తుంది. వీరికి సంబంధించిన రహస్యం ఒకటుంది. అనిరుద్ధుడికీ, మంత్రికి, సేనాధిపతికి తప్ప శంభల రాజ్యంలో మరెవరికీ తెలియదది.
 
అనిరుద్ధుడి ఆజ్ఞను అనుసరించి సిద్ధపురుషుడు అభిజిత్, అంకిత, సంజయ్ లతో శంభల రాజ్యంలోని ఆస్థానంలో ఆయన రాకకై ఎదురుచూస్తూ ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ దుందుభి మ్రోగింది. జయజయ ధ్వానంలా వినిపించే ఆ భేరి అనిరుద్ధుడి రాకను సూచిస్తుంది. అందుకు చిహ్నంగా సభలోని ప్రతి ఒక్కరూ లేచి నిల్చున్నారు. అందరి కళ్ళూ ఆయన పైనే ఉన్నాయి. రాజే రాజ్యానికి రవి అనిపించేలా ద్వారాలు తెరుచుకోగానే కిరణాలు చుట్టూ పరివారంలా ఉండగా మధ్యలో నక్షత్రంలా వెలిగిపోతూ వస్తున్నాడు అనిరుద్ధుడు. ఆయన చిరునవ్వు చూస్తే చాలు మనం గెలిచేసినట్టే అన్నట్టు ఉంటుంది. ఆయన నవ్వు మన హృదయ సామ్రాజ్యాన్ని ఎప్పుడు ఆక్రమించిందో తెలిసేలోపే మన మోముపై చిరునవ్వు వెల్లివిరుస్తుంది. అది ఆయన ఘనత.
ఎంతో తెలిసినా ఏమీ తెలియనట్టు ఉంటాడనిపిస్తుంది. ఎంత తెలిసినా ఇంకేదో తెలుసుకుంటూనే  ఉంటాడనిపిస్తుంది. ఎన్నో యుద్ధాలను చూసిన చిరుతపులి కళ్ళలా ఆయన కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి. ఎంతో మందిని మట్టికరిపించిన చేతులలా అనిపిస్తాయి. ఆయన ఠీవి చూస్తే ఎక్కడా లేశమాత్రమైనా అహం కనబడదు. పైగా ఆభరణంలా అనిపిస్తుంది. ఆయన రాజసం చూస్తే అది ఆయన మకుటంలా మెరిసిపోతూ ఉంటుంది. ఆయన ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా అనే మన గుండెచప్పుడు మనకే ఆ ఆస్థానంలో ప్రతిధ్వనిస్తూ వినబడుతూ ఉంటుంది. అంతటి మౌనం నెలవై ఉంటుందక్కడ. అది ఆయన మహిమ. నీలివర్ణంలో ఉన్న పట్టు వస్త్రముతో, మెడలో  వైకుంఠ హారము ధరించి వస్తుంటే ఆ శోభతోనే సభ విరాజిల్లుతోందా అన్నట్టుంది.
 
సింహాసనం పై ఆసీనుడైన అనిరుద్ధుడు తన హావభావాలతో, చేతి సైగతో అక్కడున్న మంత్రికి ఏదో చెబితే మంత్రి మర్యాదపూర్వకంగా  సిద్ధపురుషుణ్ణి మాట్లాడవలసిందిగా కోరాడు.
 
సిద్ధపురుషుడు, "ప్రణామములు అనిరుద్ధా, మీరు ఈ రోజున ధృవ నక్షత్రం వలే విష్ణుకాంతితో ధగధగా మెరిసిపోతున్నారు."
 
మధ్యలోనే సిద్ధపురుషుణ్ణి అడ్డుకున్న అనిరుద్ధుడు, " అందుకు ఒక కారణం ఉన్నది. నేను పూజలో నిమగ్నమై ఉండగా  మీ గురించి స్వామివారు అడిగారు. మీరు తేజస్సుతో వెలిగిపోతున్నారని వారికి చెప్పాను. ఆయన నవ్వు నాకు వినిపించింది. రోజూ ఆయనను దర్శించే మీరు ఇంకెంత అదృష్టవంతులో అనిపించింది."
 
సిద్ధపురుషుడు ఆనందపడిపోతూ,"ఆయన నా గురించి మిమ్మల్ని అడిగారా !"
 
శ్వేతద్వీప వైకుంఠాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, "వారు తండ్రివలే వాత్సల్యం చూపిస్తారు. ఆ ప్రేమ రుచి చూసినవాడికి వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కాదు. వారి ఆజ్ఞను అనుసరించే ఇంత దూరం వచ్చాను. వారిని నేనెప్పుడూ మరిచిపోలేదు."
 
అనిరుద్ధుడు అందుకుని," మరిచిపోలేరు. వారి దర్శనభాగ్యం నాకు కలుగుతుందో లేదో తెలియదు కానీ వారిని చూసిన మిమ్మల్ని నేరుగా ఇలా కలుసుకోవటం నన్నెంతో భక్తిపారవశ్యానికి గురి చేస్తోంది" అంటూ ఆయన సింహాసనం పై నుండి లేచి సిద్ధపురుషుడి వద్దకు నడుస్తూ వచ్చి ఆయనకు శిరస్సు వంచి అభివందనం చేసి తిరిగి తన పీఠాన్ని అధిష్టించారు.
 
సిద్ధపురుషుడు, "భూలోకంలో ఘోరకలి ఆధిపత్యం చేపడతాడు. ఘోరకలిని అడ్డుకోవాలంటే శంభల రాజ్యం లోని యుద్ధవిద్యలలో వీరు రాటుదేలాలి", అంటూ అభిజిత్, అంకిత, సంజయ్ లను పరిచయం చేసాడు.
 
"శంభల రాజ్యంలోని వీరులు కొందరు మాకు కావాలి. వారు లేనిదే ఘోర కలిని ఎదిరించలేము. మీ సైన్యం, మీ వ్యూహ రచన, మీ ఆయుధాలు, మీ అస్త్రాలు...ఇలా మీరు ఇవ్వగలిగినది ఏదైనా అది మాకు భాగ్యమే" , అని సిద్ధపురుషుడు ముగించాడు.
 
"మరి పరాక్రమము?" అన్నాడు అనిరుద్ధుడు.
 
అభిజిత్ మాట్లాడకుండా ఉండలేకపోయాడు.
"సర్...మీకు మా భూలోకవాసుల గురించి తెలీదు అనుకుంటా. మాకుండేదే పరాక్రమము. చిన్నప్పటి నుండి మేము రాసినన్ని పరీక్షలు ఏ లోకంలోనూ రాసుండరు. ప్రాణానికి తెగించి ఘోర కలితో నేను పోరాడతాను. మీకు కుదిరితే హెల్ప్ చెయ్యండి. లేకపోతే లేదు."
 

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
#63

అనిరుద్ధుడు మళ్ళీ లేచి నిలబడి అభిజిత్ ఉన్న చోటికి నడుచుకుంటూ వచ్చి అభిజిత్ కళ్ళల్లోకి సూటిగా చూసి నవ్వుతూ, "అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసే నీ ఉయ్యాల పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపెనీ ఉయ్యాల" అంటూ అభిజిత్ భుజాల పై తన రెండు చేతులూ వేసి గట్టిగా పట్టుకునేసరికి ఏదో తెలియని జ్ఞానం అతనిలో ప్రవేశించినట్టు అభిజిత్ అనిరుద్ధుడినే చూస్తూ ఉండిపోయాడు.
 
“పరాక్రమం నీలో కనిపించింది అభిజిత్. ఈ జోరు కాస్త తగ్గిస్తే సరిపోతుంది", అనేసి సభాప్రాంగణం మధ్యలో నిలబడి అనిరుద్ధుడు అక్కడున్న వాళ్ళ అందరి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఇలా చెప్పాడు.
 
"మన శంభల నుండి ఘోర కలిని సంహరించేందుకు కొంత సైన్యాన్ని తరలిస్తున్నాను. ఇందులో మీకెలాంటి అభ్యంతరాలు లేవనే భావిస్తున్నాను. సిద్ధపురుషుడు శ్వేతద్వీప వైకుంఠ వాసి. ఆయన నేతృత్వంలో ఈ ముగ్గురూ మన రాజ్యంలో యుద్ధవిద్యలనభ్యసిస్తారు. వీరికి మీ సహకారం కావాలి. పరాక్రమం అంటే ఏంటో అదెలా ఉంటుందో వీరికి పరిచయం చెయ్యండి రుద్రసముద్భవా" అంటూ సేనాధిపతి వైపు సూటిగా చూస్తూ ఆజ్ఞాపించటంతో సభ ముగిసింది. అనిరుద్ధుడు నిష్క్రమించాడు.
 
ఆయన వచ్చేటప్పుడు ఎలా అయితే అందరూ నిలబడ్డారో, వెళ్లిపోయేటప్పుడు కూడా గౌరవప్రదంగా నిల్చున్నారు. ఒక రాజుకిచ్చే గౌరవం శాసనాల్లో రాయబడి ఉండదు. ఆయనని చూసిన మరుక్షణమే  అది పుడుతుంది. రాజు వెడలె రవి తేజములలరగా అంటూ అదిగో వెళుతున్నాడే ఆ అనిరుద్ధుడే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. ఇదే ఆయన శంభల రాజ్యం.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply
#64

ఘోర కలి అరాచకాలు  - 3
కపాలిని దేవి సాక్షాత్కారం - ఘోర కలి కామరూపధారిగా మారుట
 
ఘోర కలి కపాలిని దేవి ఆలయంలో అయితే ఉన్నాడు కానీ, తన మనసంతా వేదనకు గురి అయ్యి పసిపిల్లల రోదనలతో నిండి ఉంది. చుట్టూ చూస్తున్నాడు కానీ ఆ ఏడుపులు ఎక్కడి నుండి వస్తున్నాయో కనిపించట్లేదు. చిమ్మ చీకటి ఒక పక్క, ఈ ఆర్తనాదాలు మరో పక్క ఘోర కలిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
 
అంతలో  సురా కపాలిని దేవి ఆలయంలోకి ప్రవేశించాడు. ఘోర కలి భుజం తట్టాడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసాడు. ఎదురుగా  సురా. చీకటి వీడిపోయింది. ఏడుపు ఆగిపోయింది. అంతవరకూ తనకు కనిపించనివి కూడా ఇప్పుడు కళ్ళముందున్నాయి. ఘోర కలి ఆశ్చర్యపోయాడు.
 
సురా,"ఏమైందన్నా? అలా భయపడ్డావు? ఇక్కడికి నేను కాక ఇంకెవరొస్తారు?" అని అడిగాడు.
 
"నువ్వొచ్చే దాకా ఇక్కడ వెలుతురు లేదురా. దారంతా చీకటి. కటిక చీకటి. నేనిక్కడికి ఎలా రాగలిగానో కూడా అర్థం కాలేదు. ఒకటే ఏడుపులు వినిపించాయి. పసిపిల్లల ఏడుపులు. నా జీవితంలో అంత మంది ఏడుపులు ఒకేసారి వినటం ఎప్పుడూ జరగలేదు. కంట నీరు తిరిగింది", అన్నాడు ఘోర కలి.
 
సురా విస్తుపోయాడు.
 
"అన్నా....నాకు అల్లంత దూరం నుండి చూస్తే నువ్వు  కాళీ....కపాలిని...శూలిని...జగజ్జనని అంటున్నట్టు కనిపించింది. ఏదో పెద్ద వెలుగు నీ ముందు ఉండాదంట. దాన్ని చూస్తూ మైమరచిపోయి నువ్వు ఇట్టా అంటున్నావంట. అది కనబడే పరిగెత్తుకుంటూ నీ దగ్గరికొచ్చాను. ఇప్పుడేమో నువ్వు చీకటి అంటున్నావ్. నాకేం అర్థం కావట్లేదు"
 
ఘోర కలికి అక్కడేం జరుగుతోందో అర్థం కావట్లేదు. కపాలిని దేవి పరీక్షిస్తోందని అర్థం అయ్యింది.
 
తన రెండు మోకాళ్ళ మీద నిలబడి నలుదిక్కులా కపాలిని దేవి కోసం వెతికే వేదనాభరితమైన కళ్ళతో ఇలా ప్రార్థించటం మొదలు పెట్టాడు.
" కాళీ.....
 కపాలిని.....
శూలిని.....
జగజ్జనని 
ఎందుకమ్మా నా కళ్ళల్లో చీకట్లు నింపావు? నేనేం పాపం చేసాను?
 
ఎన్ని జన్మలకు నాకీ శిక్ష? మరెన్ని జన్మలు నాకీ నిరీక్షణ?
నేను అంటరాని వాడినా? నరరూప రాక్షసుడినా?
ఎంతో మంది పసిపిల్లలను ఈ భూమ్మీదకు రానివ్వకుండా చేసే ఎందరో పుణ్య దంపతులకంటే క్రూరుడను కాను కదా?
నాకు నువ్వు వినిపించిన ఈ ఆర్తనాదాలతో నా బాల్యాన్ని గుర్తుకు చేసి ఏడిపించావు తల్లీ.....
 
నేను పుట్టినప్పుడు అక్కడెవరూ లేరంట ! నేనొక్కడినే ఆ గ్రామంలో బ్రతికానంట ! నా కోసం ఒక గ్రామం చనిపోయిందంట ! నన్నందరూ భయపడుతూనే చూసేవారు తల్లీ !
 
ప్రేమకు నోచుకోని జన్మలు ఇప్పటికి ఆరు ఇచ్చావు. నాకు ఏడో జన్మ లేదంట. నా బతుకు పాతాళలోకంలోనే సమాధి అంట. అసలు జన్మంటూ లేని నా బ్రతుక్కి ఏడో జన్మనిచ్చింది నా ప్రాణానికి ప్రాణమైన సురా !
సురా....సురా.....సురా
 
ఎంత గొప్ప మిత్రుడైనా మహా అయితే ప్రాణ త్యాగం చేస్తాడేమో...కానీ ఈ సురా నన్ను పాతాళలోకం నుండి విముక్తిడిని చెయ్యటానికి తన కర్మ త్యాగం చేసి నాతో ఈ భూమి మీదకి వచ్చాడు.
 
అలాంటి సూరాకు నువ్వు కనిపించావంట. నాకు కనపడవేం తల్లీ ?
 
ఈ కపాలిని దేవి ఆలయంలో నువ్వున్నావన్న ఆశ కల్పించు.....నీ అఖండ జ్యోతిలోని చిన్న వెలుగు రేఖను ఇటుగా పంపించు......నా ఏడో జన్మను సార్థకం చేసే నీ దర్శనం కలిగించు......ప్రపంచాన్ని పట్టి పీడించే అన్ని జాడ్యాలనూ వదిలించే ఈ ఘోర కలిని ఆశీర్వదించు.....
 
నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను పూజించిన మాతృమూర్తివి నీవే తల్లీ.....
కాళీ 
కపాలిని 
శూలిని 
 జగజ్జనని
ఘోర కలిగా కాదమ్మా.....ఇక్కడికి నీ బిడ్డగా వచ్చాను
 
నన్నీ ప్రపంచానికి రాజునైనా చెయ్యి......లేదా నా బూడిదెతో ఈ పుడమి మీద నిప్పు రాజుకునేలా చెయ్యి
నువ్వేం చేసినా సరే....నీ ఆనకే కట్టుబడి ఉంటా”
 
 కాళీ....కపాలిని.....శూలిని....జగజ్జనని 
అంటూ ఘోర కలి అలా అమ్మను పిలుస్తూనే ఉన్నాడు. కన్నీరు మున్నీరవుతూనే ఉన్నాడు.
 
తన మాటలే అమ్మకు మంత్రాలనుకుంటున్నాడు. అలా మాట్లాడుతూనే ఉన్నాడు.
 
తన కన్నీళ్లే అమ్మకు అభిషేకం అనుకుంటున్నాడు. అలా కన్నీరాభిషేకం చేస్తున్నాడు.
 
కాలానికే జాలి కలిగిందేమో అమ్మ జాడ కనిపించింది. అయినా ఆ మహాకాలుడు రుద్రుడే కదా. ఆయనే అమ్మను వెళ్ళమన్నాడేమో.
 
ఘోర కలి నిరీక్షణ ఫలించింది. ఆదమరచి పడి ఉన్న ఘోర కలిని చూస్తూ కపాలిని దేవి రాల్చిన ఒక కన్నీటి చుక్క ఘోర కలి చెక్కిలి పై పడింది.
 
కళ్ళు తెరిచిన ఘోర కలి, "అమ్మా నీ అశ్రువు నా చెంపను తాకింది తల్లీ ! చాలమ్మా ఇది చాలు ఈ ఏడో జన్మలో నేనెలా చచ్చినా పరవాలేదు. ఈ ఒక్క సంఘటన తలుచుకుంటూ బ్రతికేస్తాను"
 
"నువ్వు కోరుకునే ప్రపంచాధిపత్యం మహాప్రళయ సంగ్రామానికి దారి తీస్తుంది. చూస్తూ చూస్తూ నీకు అలాంటి ఆధిపత్యాన్ని కట్టబెట్టమంటావా !

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
#65

నా స్థానంలో ఉంటే నువ్వేం చేస్తావురా? ఒక అమ్మలా ఆలోచించి చెప్పు", అని బాధపడుతూ అంది కపాలిని దేవి.
 
"బిడ్డ ఏది కోరినా అమ్మ అది తీర్చాలి. అది అమ్మ బాధ్యత. మంచైనా చెడైనా దాని పాపపుణ్యాలతో అమ్మకు సంబంధం లేదు. ఇదే సృష్టి ధర్మం", అని నిర్మొహమాటంగా చెప్పేసాడు ఘోర కలి.
 
"బిడ్డ కోరాడు కదా అని చెప్పి ప్రపంచం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా?" అని అడిగింది కపాలిని దేవి.
 
"ఊరుకోవాలి", అన్నాడు ఘోర కలి.
 
"ఏమిటి దానర్థం?" అని కోపంగా చూస్తూ అడిగింది కపాలిని దేవి.
 
"ఇదంతా నీ సృష్టే తల్లీ! నువ్వు అందరికీ అమ్మవు. నేను అడిగింది నీకు నచ్చలేదు కాబట్టి అదివ్వను అంటున్నావ్. అంటే నీకు నచ్చినవే బిడ్డలు అడగాలా? వారి ఇష్టాయిష్టాలు వారికుండవా? చెప్పు తల్లీ ", అని బాధపడుతూ అడిగాడు ఘోర కలి.
 
"ఇష్టపడిన ప్రతిదీ ఇస్తూ పోతే అది వినాశనానికి దారి తీస్తుంది. కాదంటావా?" అని అడిగింది కపాలిని దేవి.
 
"నీ సృష్టి పట్ల నీకే అంతటి మోహం ఉంటే ఇక అల్ప జీవులం మాకెంత మోహం ఉంటుంది తల్లీ", అని తన సందేహాన్ని బయటపెట్టాడు ఘోర కలి.
 
"నాది మోహం కాదురా", అంటూనే,"సరే నీకు నచ్చినట్టే చెయ్యి. కానీ ఒక షరతు", అంది కపాలిని దేవి.
 
"అదేంటో విన్నవించు తల్లీ", అంటూ రెండు కళ్ళూ పెద్దవి చేసి అమ్మ వైపు ఆశగా చూస్తున్నాడు ఘోర కలి.
 
"ప్రతి రోజూ సాయంసంధ్యా సమయంలో 10 ఘడియలు నిరంతరాయంగా నా నామావళి జపిస్తేనే నీకీ ప్రపంచం పైన ఆధిపత్యం నిరవధికంగా కొనసాగుతూ ఉంటుంది. అలా జరగని మరుసటి రోజే నీ చరమాంకం. ఇదే నా ఆన" అనేసి అంతర్ధానం అయ్యింది.
 
అక్కడి నుండి పది యోజనాల దూరంలో ఉన్న గుహలో కపాలిని దేవి అమ్మవారి నామావళి రాతిగోడలపై వెలుగుతూ కనిపిస్తుంది. ప్రతీ నామం చివర నమః అని మాత్రం ఉండదు. కపాలిని దేవి వినూత్నమైన పేర్లు మాత్రమే కనిపిస్తాయి. వాటినే అక్షర దోషం లేకుండా జపించాలి. ఒక్క సారి నోరారా ప్రతి నామాన్ని పఠిస్తే స్మృతిలో అవే గుర్తుండిపోతాయని అక్కడ రాసి ఉన్నది.
 
అక్కడే యంత్రం ఉన్నది. అందుకు కావలసిన తంత్రాన్ని అందించేందుకు ఒక వృద్ధ యోగి ఘోర కలిని, సురాని చూస్తూ అక్కడే ఉన్న చెట్టు కింద ధ్యానంలో ఉన్నాడు.
 
ఘోర కలి కపాలిని దేవి నామావళి మొత్తం పఠించాడు. ప్రతీ నామం ఇప్పుడు తేనె  కంటే మధురంగా అనిపిస్తోంది. గుహ నుండి బయటకు రాగానే మొహములో తేజస్సు రెట్టింపు అయ్యింది. ఆ వృద్ధ యోగి కూడా కన్నార్పకుండా ఘోర కలినే చూస్తూ ఉన్నాడు.
 
తంత్రం ఘోర కలి మననం చేస్తూ ఉంటాడు. యంత్రాన్ని మాత్రం సురా ఇక్కడి నుండి తీసుకెళ్లి ఎదురుచూస్తోన్న వైద్య బృందం వద్దకు తీసుకెళతాడు.
 
ఘోర కలి తంత్రం, సురా యంత్రం, వైద్య బృందం శాస్త్రం మూడూ ఒకేసారి పని చేసి పది దేశాల నుండి వచ్చిన ఆ పదిహేను మంది బోర్డు డైరెక్టర్ లనూ ఘోర కలి రూపంలోకి మార్చేస్తాయి. ఘోర కలిని ప్రపంచానికి రారాజును చేస్తాయి. ఇప్పుడు ఘోర కలి  కామరూపధారి కూడా అవుతాడు. అంటే తను కోరుకున్న రూపంలోకి మారగలిగే విద్యను కూడా కలిగినవాడని అర్థం.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 8 users Like k3vv3's post
Like Reply
#66

శంభల రాజ్యం – 3
జటిల
 
రుద్రసముద్భవ ఆధ్వర్యంలో అభిజిత్, అంకిత, సంజయ్ లు శంభల రాజ్యంలోని ప్రాకారాలన్నీ తిరిగి యుద్ధ విద్యా నైపుణ్యాన్ని, వ్యూహాలను, అస్త్ర విద్యలను నేర్చుకునేందుకు పయనమయ్యారు. సిద్ధపురుషుడు మాత్రం శంభల రాజ్యంలో ఇచ్చిన అతిథి గృహంలోనే ఉండిపోయాడు. ధ్యానంలో నిమగ్నమయ్యాడు.
 
ఆ ప్రయాణంలో మొదటిగా వారికి స్వాగతం పలికింది ' జటిల'.
" జటిల శంభల రాజ్యంలోని మహా మహా యోధులకు కూడా అంతుచిక్కని ప్రాకారం. ఇక్కడ ఏ క్షణానైనా సింహాలతో తలపడవలసి రావొచ్చు. సింహానికి స్నేహితుడివి అయ్యావంటే మాత్రం అవే దగ్గరుండి మరీ ఎన్నో కఠినమైన విద్యలను నేర్పిస్తాయి. శంభల రాజ్యంలోని ప్రతీ యోధుడూ జటిల పేరు చెబితే చాలు వణికిపోవటానికి కారణం ఇదే. ఇక్కడి సింహాలు భూలోకంలో కనిపించే క్రూర సింహాలు కావు. ఎంతో రాజసం కలిగినవి. ఒక యోధుడిని ఇట్టే కనిపెట్టేస్తాయవి. ఎన్ని విద్యలొచ్చినా సరే జటిలలోని సింహాలు అంగీకారం తెలిపితేనే ఆ వ్యక్తి పరిపూర్ణమైన యోధుడి కింద లెక్క", అంటూ చెప్పటం ముగించాడు రుద్రసముద్భవ.
 
"ఏంటి? సింహాలతో ఫైట్ చెయ్యాలా?" అంటూ నీళ్లు నమిలాడు అభిజిత్.
 
"మరి అనిరుద్ధుడి సంస్థానంలో ప్రాణాలకు తెలిగించి అయినా సరే ఘోర కలితో పోరాడతాను అని శపథం చేసొచ్చావు కదా", అని గుర్తుచేశాడు సంజయ్.
 
"మన చేతిలో ఏం లేదు, అభిజిత్. ఫైట్ చెయ్యాల్సిందే", అంటూ భయం నటిస్తూ అంది అంకిత.
 
"తప్పదా?" భయంగా అడిగాడు అభిజిత్.
 
"అసలు ఇక్కడ ప్రొసీజర్ ఏంటి సర్? ఆ యోధుడిని సింహాలు ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటాయి ?" అని రుద్రసముద్భవను అడిగాడు అభిజిత్.
 
"యోధుడిని అవే ఎంచుకుంటాయి. అందుకోసం అవి పెట్టుకునే ప్రమాణాలేంటో మాకు కూడా తెలియదు. జటిలలోని అతిపెద్ద రహస్యం అది. ఇక్కడ మొత్తం 8 సింహాలుంటాయి. ఇంతవరకు నేను 5 సింహాలను ఒకేసారి చూసాను. నీ అదృష్టం బావుంటే 8 సింహాలనూ చూస్తావేమో", అంటూ నవ్వుతూ చెప్పాడు రుద్రసముద్భవ.
 
అభిజిత్ షాక్ తిన్నాడు.
 
జటిల చూడటానికి ప్రాకారంలా ఉండదు. ఎండు గడ్డి మొలిచిన నేలపై దూరం నుండి సూర్యుని కాంతితో ఎదురుగా ఎనిమిది పర్వత శ్రేణులతో మధ్యలో మూసి వున్న ఒక సింహ ద్వారంతో కళ్ళకు గంభీరంగా ఉంటుంది.
 
"ఆ మధ్యలో ఉన్న పెద్ద డోర్ మూసేసి ఉందేంటి?" అని అభిజిత్ రుద్రసముద్భవను అడిగాడు.
 
"జటిలలో జయించిన పిమ్మట ఆ ద్వారం తెరుచుకుంటుంది", అన్నాడు రుద్రసముద్భవ.
 
"లేనిచో?" అని భయపడుతూ అడిగాడు అభిజిత్.
 
"శంభలలో లేనిచో, కానిచో అను పదాలకు చోటు లేదు అభిజిత్. జటిలలో నీ ఆగమనమే నీ విజయానికి సంకేతం", అనేశాడు రుద్రసముద్భవ.
 
"ఇలాంటి సమయంలో సిద్ధపురుషుడు పక్కనే ఉండుంటే ఎంత బావుణ్ణు", అని మనసులో అభిజిత్ అనుకున్నాడో లేదో ప్రత్యక్షం అయ్యాడు ఆయన.
 
"స్వామీ!" అని ఆశ్చర్యపోతూ, "ఇప్పుడు నేనేం చెయ్యాలి?" అని అడిగాడు.
 
"జటిల నీ సాహసానికి, నీ లోని పరాక్రమానికి అంతిమ పరీక్ష. కొన్ని ఘడియల తరువాత ఇక్కడ 5 సార్లు గంటలు మోగుతాయి. 5 వ గంట మోగిన మరుక్షణమే సింహాలు కదిలి వస్తాయి. నువ్వు నిజమైన యోధుడివైతే 8 సింహాలొస్తాయి. అవి నిన్ను ఆటపట్టిస్తాయి. వాటితో పాటు తీసుకెళతాయి. అవి వచ్చే వరకే నీలోని సంశయాలు, భయాలు. ఒక్కసారి వాటిని చూసాక నీ ధైర్యం వెయ్యి రెట్లు పెరుగుతుంది. నీ మనోబలం నీకు తెలుస్తుంది. అక్కడ  కనిపించే ఎనిమిది పర్వత శ్రేణులలో నీకు ఆ సింహాలు పరాక్రమాన్ని పరిచయం చేస్తాయి. ఎంతో  కఠినమైన శిక్షణ లభిస్తుంది. అది పూర్తి చేసిన పిమ్మట ఎదురుగా కనబడే సింహద్వారం తెరుచుకుంటుంది. ఆ తలుపులు తెరుచుకున్నాయంటే నువ్వు జటిలను దాటినట్టే. విజయోస్తు", అని చెప్పి సిద్ధపురుషుడు అదృశ్యమైపోయాడు.
 
సూర్యుని మేలిమి కాంతి ఎక్కువయింది. ఎండు గడ్డి మీద బంగారు కిరణాలు పడుతూ ఆకాశం బంగారు వర్ణంలో ఉండగా ఎదురుగా ఉన్న పర్వతాల నుండి గంటలు మోగుతున్నాయి.
 
మొదటి గంట మోగింది.
 
సింహం గర్జన వినబడింది. సింహం పరుగు కళ్ళకు కట్టినట్టుగా అంత దూరం నుండే కనిపిస్తోంది. ఆ పరుగులో ఉన్న శక్తికి మనలోని దుర్గుణాలు ఎగిరిపోతాయి. ఆ గర్జన చెవిన పడంగానే మనలోని సంశయాలు తొలగిపోతాయి. ధైర్యం హుంకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సింహం అంత దూరం నుండే అభిజిత్ ని మాత్రమే చూస్తూ వస్తోంది. అభిజిత్ కూడా సింహాన్నే చూస్తున్నాడు. కళ్ళల్లో ఎక్కడా క్రూరత్వం లేదు. రాజసం అణువణువునా నిండిన దైవీ శక్తి గల పార్వతీ దేవి వాహనంలా అనిపించింది. సింహం అభిజిత్ ని సమీపించగానే సంజయ్, అంకిత కాస్త టెన్షన్ పడ్డారు. రుద్రసముద్భవ సైగ చేసి వాళ్ళను వారించాడు. అభిజిత్ సింహాన్నే చూస్తున్నాడు. సింహం అభిజిత్ కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తోంది.
 
అభిజిత్ చుట్టూ తిరుగుతూ సింహం చూస్తోంది. అభిజిత్ ఏ మాత్రం బెదరలేదు. సింహం కాసేపు ఆగి ఒక్క ఉదుటున అభిజిత్ పైకి ఎగిరింది. అభిజిత్ వెంటనే తనకు బాగా తెలిసినవాడిలా సింహపు గోర్లు తనకు తగలకుండా సింహం మెడను పట్టుకుని తన తలను సింహం నుదుటికి తాకిస్తూ జూలు పట్టుకున్నాడు. వెంటనే ఆ సింహం పట్టు విడిపించుకుని ముందుకెళ్లి గట్టిగా హుంకరించింది.
 
అవన్నీ అభిజిత్ ని చుట్టుముట్టగా మొదటి సింహం మాత్రం ముందుకు పరిగెడుతూ అభిజిత్ కు దారి తెలిసేలా పర్వత శ్రేణుల వైపుగా వెళుతోంది. అభిజిత్ దాన్నే అనుసరిస్తూ వెళుతున్నాడు. అభిజిత్ ను అనుసరిస్తూ ఈ ఏడు సింహాలు వెళుతున్నాయి. అభిజిత్ పర్వత శ్రేణులను చేరుకోగానే రెండో గంట ఆగిపోయింది.
 
దూరంగా కనబడుతున్న సంజయ్, అంకిత లకు చేత్తో సైగ చేసాడు. వాళ్ళు కూడా తిరిగి చేతులు ఊపుతూ  సైగ చేశారు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply
#67

 
"ఈ అభిజిత్ ఏంటో మనకు అర్థం కాడు", అన్నాడు సంజయ్
"యా. ఇంతకు ముందు వరకూ భయపడుతూ ఉన్నాడు.
అంతలోనే ఇలా...", ఆశ్చర్యపోతూ,"అస్సలు అర్థం కాడు" అంది అంకిత.
 
"అభిజిత్ ఒక జన్మలో శంభల యోధుడు", అన్నాడు రుద్రసముద్భవ.
 
"అందుకే పరాక్రమం గురించి అనిరుద్ధుడు మాట్లాడగానే అభిజిత్ మాత్రమే తీవ్రంగా స్పందించాడు. అభిజిత్ గురించి అనిరుద్ధుడికి మొత్తం తెలుసు. ఆయన గురించి మీకు ముందు ముందు ఎన్నో విషయాలు తెలుస్తాయి", అంటూ నవ్వుతూ చెప్పటం ముగించాడు రుద్రసముద్భవ.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
#68

ఘోర కలి అరాచకాలు  - 4
సింహం రక్తం తాగే ఘోర కలి
 
సురా యంత్రాన్ని తీసుకుని చీకటి రాజ్యానికి చేరుకున్నాడు. వైద్య బృందం సురా తెచ్చే యంత్రం కోసం ఎదురు చూస్తోంది. సురా యంత్రాన్ని అందివ్వగానే ఒక 10 ఘడియల తరువాత శస్త్రచికిత్స మొదలు పెట్టారు. పది దేశాల నుండి వచ్చిన ఆ పదిహేను మంది జీకే కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ లనూ పూర్తిగా ఘోర కలి రూపంలోకి మార్చేశారు. సురా చీకటి రాజ్యం బయటే ఘోర కలి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
 
అంతలో ఘోర కలి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ, వికృతమైన నాట్యం చేస్తూ వస్తున్నాడు. ఈ ప్రపంచానికి అప్పుడే రారాజునైపోయాననే గర్వం కళ్ళల్లో ఉప్పొంగుతోంది. సురా మిత్రుడు కాబట్టి తేలికగానే పసిగట్టాడు.
 
చీకటి రాజ్యం చేరుకోగానే ఘోర కలి సురాను కౌగిలించుకుంటూ, "సురా నాకిప్పుడు సింహం రక్తం తాగాలని ఉంది రా ", అన్నాడు.
 
సురా, "సింహం రక్తం ఎందుకన్నా?" అన్నాడు ఏమీ పాలుపోక.
 
"సింహం తన వేటకు చిక్కిన జంతువు రక్తం తాగటం వల్లే అంత బలంతో ఉంటుంది సురా. అలాంటి సింహం రక్తమే నేను తాగితే ఎలా ఉంటుందా అన్న అద్భుతమైన ఆలోచన తట్టింది రా. ఏమంటావు సురా?" అడిగాడు ఘోర కలి.
 
"అన్నా అడవికి సింహం రారాజు. ఇందాక మనం కపాలిని దేవి ఆలయంలో సూసినాం కదా. అమ్మోరు సింహం మీదనే ఉండాది. అట్టాంటి సింహంతో మనకు వైరము దేనికి అన్నా? ఆలోచించు", అన్నాడు సురా.
 
"రేయ్ సురా, నేను నేరుగా పోయి సింహాన్ని చంపుతానా ఏంది? భలే ఉండావే! సింహంలా మారి సింహాన్ని చంపి ఘోర కలిగా రక్తాన్ని తాగుతా. ఇప్పుడు నేను కామరూపధారిని కదరా", అన్నాడు ఘోర కలి ఆనందం పట్టలేనివాడిగా.
 
"నీకిచ్చిన శక్తిని పరీక్షించుకుంటాను అంటావ్. అంతేనా?" అడిగాడు సురా.
 
"అది రా సురా. ఇప్పుడర్థం అయ్యిండాది నా మనసు", అన్నాడు ఘోర కలి.
 
"అయినా సింహం రక్తం తాగితే ఏమొస్తుందన్నా?" ఆశ్చర్యపోతూ అడిగాడు ఘోర కలి.
 
"సింహం అంటే నాకు పడదురా. ఒక జన్మలో సింహంతో పోరుకు వెళ్ళా. సింహం చేతిలో చనిపోయా. ఆ సింహం దెబ్బ ఇప్పటికీ నన్ను దెబ్బతీస్తూనే ఉందిరా.....దాన్ని నా చేతులతో చంపాలి. దాని రక్తం తాగి దానికంటే గొప్ప రారాజును నేనేనని దాని శవం ముందు చిందెయ్యాలి. కామరూపధారిగా నాకొచ్చిన ఈ శక్తితోనే అది సాధ్యంరా సురా. ఏమంటావ్?" అన్నాడు ఘోర కలి సూటిగా సురా కళ్ళల్లోకి చూస్తూ.
 
తన మిత్రుడు తనలా మారిపోయిన ఆ పదిహేనుమందినీ చూడటానికి ఉత్సాహపడతాడేమో అనుకున్న సూరాను ఇలాంటి ప్రతిపాదన విస్మయానికి గురి చేసింది. తను ఇప్పుడు కాదన్నాడంటే ఘోర కలికి అది తీరని కోరికగా మిగిలిపోయి మళ్ళీ భవిష్యత్తులో అయినా సింహాన్ని చంపాలని అనిపిస్తుందేమో. అదేదో ఇప్పుడే చంపేస్తే పోతుంది అనుకుని సరే అన్నాడు సురా. ఇదే  సురా చెయ్యబోయే అతి పెద్ద తప్పిదం అని బహుశా అతనికి కూడా తెలియదేమో.
 
సురా నుండి సరే అన్న పదం వినబడగానే సూరాను వెంటబెట్టుకుని చీకటి రాజ్యానికి దగ్గర్లో ఉన్న అడవికి తీసుకెళ్లాడు. అక్కడ అదే సమయంలో ఒక సింహం వేట ముగించుకుని ఆహారాన్ని భుజిస్తోంది.
 
దూరం నుండి ఇదంతా చూస్తున్న ఘోర కలి సురాతో," ఇప్పుడు దాని నోటి కింది కూడు లాక్కుంటాను చూడు", అంటూ వికృతంగా నవ్వాడు.
 
వృద్ధ సాధువు ఇచ్చిన మంత్రం జపించిన కొద్ది నిమిషాల్లోనే సింహంలా మారిపోయాడు ఘోర కలి. పరిగెత్తుకుంటూ ఆ సింహం దగ్గరికెళ్లి తన ఆహారాన్ని లాక్కుని తినటం మొదలు పెట్టాడు. ఆ సింహం ఉగ్రరూపం ధరించి పంజా విసిరింది. ఆ సింహాన్ని చిత్తుగా ఓడించాడు సింహం రూపంలో ఉన్న ఘోర కలి. రెండే రెండు దెబ్బలకు నేలకొరిగింది.
 
వెంటనే తన స్వంత రూపంలోకి మారిపోయిన ఘోర కలి సింహం బ్రతికున్నదా, చచ్చినదా అని పరీక్షగా చూసాడు. కొనఊపిరితో ఉండటంతో ఆ సింహం పంజా చురుకుగా ఘోరకలి మొహాన్ని తాకింది. ఘోరకలి అసలు రూపాన్ని చూస్తూ ఆ సింహం తుది శ్వాస విడిచింది. చనిపోయే ముందు కూడా తన గుర్తును వదిలి వెళ్ళింది. ఘోర కలి మొహంపై ఏటవాలుగా పెట్టిన గాటు ఇందుకు తార్కాణం. ఘోర కలి ఆవేశం కట్టలు తెంచుకుంది. తన దగ్గరున్న కత్తి తీసి ఆ సింహాన్ని నిలువునా చీల్చేసి మరిగే ఆ రక్తాన్ని తాగాడు. తనేం చేస్తున్నాడో తనకే అంతుబట్టని కోపంలో ఊగిపోతున్నాడు ఘోర కలి. సింహం మెడ పై కాలు పెట్టి, "చచ్చిందిది చివరికి....హహ్హాహ్హా", అంటున్నప్పుడు తన మొహం పై పడ్డ సింహం గాటు బలంగా ఉండటంతో రక్తం కారుతూ బొట్లు బొట్లుగా నిర్జీవంగా పడి ఉన్న సింహం పై పడ్డాయి.
 
సరిగ్గా సింహం నాలుక తెరుచుకుని ఉన్న చోట ఈ రక్తం బొట్లు పడ్డాయి. అంటే సింహం కూడా ఘోర కలి రక్తాన్ని రుచి చూసిందన్న అర్థం వచ్చేలా ఉందా దృశ్యం. కానీ అప్పటికి సింహంలో ప్రాణం లేదు. ఈ దృశ్యాన్ని దూరం నుండి చూస్తున్న సూరాకు భవిష్యత్తులో జరగబోయే దేనికో ఇది సంకేతంలా అనిపించింది.
 
ఘోర కలి దగ్గరకొచ్చి, "అన్నా ! తృటిలో తప్పించుకున్నావ్ . సింహాన్ని చంపి, రక్తం తాగావు కదా. మన చీకటి రాజ్యానికి పోదాం పద", అన్నాడు సురా.
 
"నాకు సింహం రక్తం బాగా నచ్చిందిరా. దాని కడుపు నిండా పౌరుషమే. ఆ పౌరుషం మొత్తం తాగేసానురా.
 
హహహ...ఇలాగే ప్రతీ వారం నాకు సింహం రక్తం కావాలిరా", అంటూ ఆవేశం కట్టలు తెంచుకున్నవాడిలా నడుస్తూ ముందుకెళ్లాడు ఘోర కలి.
 
కనీసం వెనక్కి తిరిగి తన వంక కూడా చూడకుండా  వెళ్తున్న ఘోర కలి వైపే చూస్తూ స్థాణువులా నిలబడిపోయాడు సురా. ఇలాగే కొనసాగితే తన మిత్రుడేమైపోతాడా అన్న భయంతో, బాధతో ఆలోచనలో పడ్డాడు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
#69

జోసెఫ్  సెబాస్టియన్ డిస్గైజ్
జోసెఫ్ సెబాస్టియన్ aka ముత్తుస్వామి అయ్యర్
 
బెంగళూరులో క్యాబ్ లో ఉన్న జోసెఫ్ సెబాస్టియన్ డ్రైవర్ కి కృష్ణ స్వామి ఇంటి అడ్రస్ చెప్పాడు. కృష్ణ స్వామి బెంగళూరులోని బసవనగుడిలో ఉన్న ఒక సాదాసీదా అపార్ట్మెంట్ లో ఉంటాడు. అతను అక్కడ ఉంటున్నట్టు చాలా తక్కువ మందికి తెలుసు. జోసెఫ్ సెబాస్టియన్ తన ఇన్వెస్టిగేటివ్ మైండ్సెట్ తో కృష్ణస్వామి ప్రతి మూవ్ మెంట్ నీ ట్రాక్ చేసిన ఆ ఏరియాలోని జర్నలిస్ట్ ద్వారా ఈ విషయం తెలుసుకున్నాడు. కృష్ణస్వామి దగ్గర 'అదృశ్య మందిరం' ప్రాజెక్ట్ ఫండింగ్ డీటెయిల్స్ ఉన్న ఫోల్డర్ ఒకటుంది. అది లాప్టాప్ లో ఉందో, హార్డ్ కాపీలో ఉందో తెలీదు. జోసెఫ్ సెబాస్టియన్ వెళుతున్న క్యాబ్ ని బ్లాక్ కలర్ చెవరోలెట్ వోల్ట్ కార్ ఫాలో చేస్తోంది. అందుకే జోసెఫ్ టెన్షన్ పడుతున్నాడు.
 
బసవనగుడి లోని వీవీ పురంలో న్యూ మోడరన్ హోటల్ ఉంది. అక్కడే క్యాబ్ దిగాడు జోసెఫ్. హోటల్ లోకి ఎంటర్ అయ్యాడు. లంచ్ టైం కావటంతో బాగా రద్దీగా ఉంది. థాలి ఆర్డర్ చేసాడు. రావటానికి ఐదు నిమిషాల సమయం ఉంది. వెనకాలే తనని ఫాలో చేస్తున్న వ్యక్తి తన టేబుల్ కనబడేలా రెండు టేబుల్స్ అవతల కూర్చున్నాడు. అతను కాఫీ ఆర్డర్ చేసాడు. కాఫీ వెంటనే వచ్చేసింది. ఇంతలో జోసెఫ్ హ్యాండ్ వాష్ కోసం పక్క సెక్షన్ కెళ్ళాడు. హ్యాండ్ వాష్ ఎక్కడా అని అక్కడున్న వెయిటర్ ని అడిగితే ఆ వెయిటర్ అదిగో అటే అని చేత్తో చూపించటం ఆ స్ట్రేంజర్ కి కనబడింది. జోసెఫ్ తిన్నగా ఆ హ్యాండ్ వాష్ సెక్షన్ కెళుతున్నట్టే వెళ్లి రూట్ మార్చి కిచెన్ వైపుగా వెళ్ళాడు. అక్కడున్న వంటతను విచిత్రంగా చూసేసరికి, అతని చేతిలో ఒక 500 /- నోట్ పెట్టేసి అక్కడున్న ఎగ్జిట్ డోర్ గుండా వెళ్ళిపోయాడు. కృష్ణస్వామి ఉంటున్న అపార్ట్మెంట్ కి రెండే రెండు నిమిషాల్లో చేరుకున్నాడు.
 
కృష్ణ స్వామి రెండో ఫ్లోర్ లో ఉంటాడు. ఆ అపార్ట్మెంట్ పేరు కూడా సరిగ్గా కనబడదు. కానీ జోసెఫ్ కి అడ్రస్ ఫొటోలతో సహా పక్కాగా తెలియటంతో వెంటనే గుర్తుపట్టేసాడు.
కృష్ణస్వామి ఉండే ఇంటి కీని తను ఎక్కడ దాచుంచాడో రాధాకృష్ణన్ ఇంట్లో దొరికిన టూర్ దే అదృశ్య మందిరం ప్రాజెక్ట్ ఫైల్ లో రాసి ఉంది. ఆ ఫైల్ ని స్టడీ చెయ్యటం ఇందుకు పనికొచ్చింది. టైం వేస్ట్ చెయ్యకుండా జోసెఫ్ సెల్లార్ లోని కృష్ణస్వామి పాత కార్ దగ్గరికి వెళ్ళాడు. మారుతి 800 కార్ అది. చాలా ఓల్డ్ మోడల్. తన దగ్గరున్న పిక్చర్ లో మూడో టైర్ రింలో ఎక్కడ దాచాడో క్లియర్ గా మార్క్ చేసాడు. అక్కడి నుండి కీ తీసుకుని సెకండ్ ఫ్లోర్ కెళ్లిన జోసెఫ్ కు నమ్మబుద్ధి కావటం లేదు. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫైల్స్ ఉన్న కృష్ణస్వామి ఇంటి తాళాన్ని ఇలా మారుతి 800 టైర్ రింలో దాచటం ఏంటా అనుకున్నాడు. కృష్ణస్వామి ఇంటి డోర్ తెరవగానే ఒక అలార్మ్ ఆక్టివేట్ అయినట్టు సౌండ్ వచ్చింది. జోసెఫ్ చుట్టూ చూసాడు. ఆ డోర్ వెనకే టైమర్ ఉంది. అందులో 05 :00 మినిట్స్ అన్న టైమర్ చూపిస్తోంది. అంటే జోసెఫ్ దగ్గరున్న టైం 5 నిమిషాలు మాత్రమే. ఆ ఐదు నిమిషాల్లో ఫైల్ ఎక్కడుందో కనిపెట్టాలి. లేదా అక్కడేదైనా జరగొచ్చు. అంటే తను ఇంతక్రితం మారుతి 800 టైర్ రింలో నుండి తెచ్చిన కీ తో ఓపెన్ చెయ్యటం వల్లే ఇది ఆక్టివేట్ అయ్యింది. జోసెఫ్ నిర్ఘాంతపోయాడు. ఫ్లాట్ లో మూడే మూడు రూమ్స్ ఉన్నాయి. స్టడీ రూమ్ కెళ్ళాడు చాలా మెటీరియల్ కనబడింది. కానీ ఫండింగ్ డీటెయిల్స్ ఎక్కడుంటాయో తెలియట్లేదు. అందుకే అక్కడున్న లాప్టాప్ ని తీసుకొచ్చాడు. టైం ఎక్కువ లేకపోవటంతో వెంటనే అపార్ట్మెంట్ బయటికొచ్చేసాడు.
 
హీట్ డిటెక్టర్ సర్క్యూట్ మైక్రో కంట్రోలర్ కి సిగ్నల్ పంపటం వల్ల మారుతి 800 సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయి పేలిపోయింది. చూస్తుండగానే రెండో ఫ్లోర్ లో ఉన్న కృష్ణస్వామి ఇంటి నుండి పేలిన శబ్దం వినబడింది. అది చూసిన జోసెఫ్ కు ముచ్చెమటలు పట్టేసాయి. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
 
జోసెఫ్ వెంటనే ఒక్క నిమిషం టైం వేస్ట్ చెయ్యకుండా నెక్స్ట్ ఫ్లైట్ కోసం బెంగళూరు ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. తనని ఎవరైనా ఫాలో చేస్తున్నారేమోనని చుట్టూ చూసాడు.
 
బెంగళూరు ఎయిర్పోర్ట్ బయట బ్లాక్ కలర్ చెవరోలెట్ వోల్ట్ కార్ ఆగింది. ఆ స్ట్రేంజర్ వేగంగా అడుగులు వేస్తూ జోసెఫ్ ని వెతుకుతూ వస్తున్నాడు.
 
ఎయిర్పోర్ట్ చెక్ ఇన్ దగ్గర జోసెఫ్ లగేజ్ మొత్తం స్కాన్ అయిపోయి అక్కడున్న కన్వేయర్ బెల్ట్ మీదుగా వెళ్తోంది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న జోసెఫ్ కు అప్పుడే ఆ స్ట్రేంజర్ కనిపించాడు. ఆ స్ట్రేంజర్ కూడా అదే ఫ్లైట్ ఎక్కబోతున్నాడని అర్థమైంది. టెన్షన్ స్టార్ట్ అయింది.
 

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
#70

 
అప్పుడే సరిగ్గా ఒక విచిత్రం జరిగింది. ఆ స్ట్రేంజర్ బుక్ చేసుకుంది ముంబై ఫ్లైట్. జోసెఫ్ బుక్ చేసుకున్న నెక్స్ట్ ఫ్లైట్ డైరెక్ట్ గా చెన్నై కెళ్తుంది. బెంగళూరు - చెన్నై - దుబాయ్  ఇలా జోసెఫ్ ఫ్లైట్ బుక్ చేసాడు. జోసెఫ్ డైరెక్ట్ గా ముంబై కే ఫ్లైట్ బుక్ చేసుకుని ఉంటాడు అనుకుని ఆ స్ట్రేంజర్ బెంగళూరు - ముంబై ఫ్లైట్ చేసాడు.
 
జోసెఫ్ చెన్నై చేరుకోగానే అక్కడున్న కొరియర్ సర్వీస్ ద్వారా తాంబరంలోని ప్రియా కృష్ణన్ ఇంటికి కృష్ణ స్వామి లాప్టాప్ ని చేరవేసేలా అరేంజ్ చేసాడు. తను కంగారు పడకుండా ఒక ఉత్తరం కూడా జత చేసాడు. అన్నీ అందులోనే వివరించాడు.
 
చెన్నై డొమెస్టిక్ వింగ్ లో నుండి తన లగేజ్ కలెక్ట్ చేసుకుని ఇంటర్నేషనల్ సర్వీస్ వింగ్ కెళ్ళి దుబాయ్ కి బుక్ చేసిన నెక్స్ట్ ఫ్లైట్ కోసం చెక్ ఇన్ అయ్యాడు.
 
దుబాయ్ లోని జీకే కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ లో డేటా అనలిస్ట్ గా మరుసటి రోజే జాయిన్ అవ్వబోతున్నాడు జోసెఫ్ సెబాస్టియన్. కాదు కాదు. ఇప్పుడు తన పేరు ముత్తుస్వామి అయ్యర్. ఈ డిస్గైజ్ తోనే జీకే కార్పొరేషన్ జాయిన్ అయ్యి, అక్కడే ఉంటూ ఘోర కలిని దగ్గర నుండి చూస్తూ అశుతోష్ ఇప్పుడెలా ఉన్నాడో, ఎక్కడున్నాడో తెలుసుకుంటూ ఘోర కలికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నీ సిబిఐకి ఎప్పటికప్పుడు అందించేలా పెద్ద ప్లాన్ తోటే బయలుదేరుతున్నాడు.
 
చెన్నై డొమెస్టిక్ వింగ్ కి సరిగ్గా అదే టైములో ఆ స్ట్రేంజర్ రాగలిగాడు. చాలా హై లెవెల్ ఇన్ఫ్లూయెన్స్ వాడి బెంగళూరు నుండి చెన్నై కి చేరుకోగలిగాడు. కానీ ఇప్పుడు చెన్నై డొమెస్టిక్ వింగ్ లో జోసెఫ్ కనబడటం లేదు. ఆ స్ట్రేంజర్ కి జోసెఫ్ ప్లాన్ అంతుబట్టడం లేదు. అటు ఇటు చూస్తున్నాడు. అంతలో జోసెఫ్ ఒక ఎయిర్పోర్ట్ బస్సు లో కనిపించాడు. డొమెస్టిక్ వింగ్ నుండి బయటికొచ్చిన ఆ స్ట్రేంజర్ అక్కడున్న స్టాఫ్ ని ఆ బస్సు ఎక్కడికెళ్తోందని అడిగాడు. దుబాయ్ కెళ్లే బస్సు అని చెప్పాడు. షాక్ లో ఉండిపోయిన ఆ స్ట్రేంజర్ అలా చూస్తుండగానే తన కళ్ళముందే దుబాయ్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు జోసెఫ్.
 
జోసెఫ్ ప్లాన్ ఏంటో అంతుబట్టక, తన బాస్ కి తన మొహం ఎలా చూపించుకోవాలిరా దేవుడా అని ఆ స్ట్రేంజర్ కి తల దిమ్మెక్కిపోయింది. తన బాస్ కి ఇప్పుడేం చెప్పాలో   తెలియక తికమక పడుతున్నాడు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
#71

[Image: image-2024-09-07-152549762.png]

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
#72

జోసెఫ్ సెబాస్టియన్ - అశుతోష్ మీటింగ్
జోసెఫ్ సెబాస్టియన్ వాళ్ళ నాన్న గారిని గుర్తు చేసుకోవటం
 
అశుతోష్ చీకటి రాజ్యంలో బందీగా ఉన్నాడు. సరైన తిండి లేక కృశించిపోయి ఉన్నాడు.
 
తనని ఒక డార్క్ రూంలో బంధించి ఉండటంతో అక్కడికొచ్చే ధైర్యం ఎవ్వరూ చెయ్యలేదు. ఘోర కలి చెప్పినట్టుగా టైం కి ఫుడ్, మంచి నీళ్లు, స్నానం చెయ్యటానికి ఒక పది నిమిషాలు, కాలకృత్యాలు తీర్చుకోవటానికి మరో పది నిమిషాలు మాత్రమే కేటాయిస్తూ తనను ఒక ఖైదీ కంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నారక్కడ. ఏ కాంటాక్ట్ డివైస్ కూడా అశుతోష్ కి అందుబాటులో లేకపోవటంతో అసలు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
 
కానీ అశుతోష్ జేబులో మాత్రం ఒక పాత హ్యాండ్సెట్ ఒకటి ఉండిపోయింది. ఆ నెంబర్ ప్రస్తుతం అతను వాడుతున్నది కాదు. పైగా అదొక బేసిక్ హ్యాండ్సెట్. సంజయ్ జోసెఫ్ సెబాస్టియన్ కి ఈ మొబైల్ నెంబర్ ని ఒకప్పుడు షేర్ చేసాడు. అశుతోష్ తో ఫోన్ కాల్ లో జోసెఫ్ గురించి సంజయ్ మాట్లాడిన తర్వాత సంజయ్ బై మిస్టేక్ అశుతోష్ పాత నెంబర్ ని జోసెఫ్ కు ఫార్వర్డ్ చేసాడు. జోసెఫ్ మొబైల్ లో అశుతోష్ పేరు మీద ఈ నెంబర్ స్టోర్ అయ్యి ఉంది.  అలా ఇప్పుడీ అశుతోష్ పాత మొబైల్ కి కొత్త నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది.
 
"హాయ్....అశుతోష్
జోసెఫ్ సెబాస్టియన్ హియర్"
 
ఆ మెసేజ్ చూడగానే అశుతోష్ కళ్ళు మెరిసిపోయాయి. ఇన్ని రోజులూ హోప్ వదిలేసి బతుకుతున్నాడు. ఇప్పుడు కొత్తగా ఆ డార్క్ రూమ్ లో ఎగ్జిట్ పాయింట్స్ వెతకటం మొదలు పెట్టాడు. కిటికీలు ఏవీ తెరుచుకోవటం లేదు. పైన ఒక హాపర్ విండో ఒకటుంది. ఆ హాపర్ విండో లో నుండి చూస్తే తను ఎక్కడున్నాడో  అర్థం అవుతుందేమోనన్న చిన్న ఆశ చిగురించింది. అక్కడ చాలా పెద్ద పెద్ద టేబుల్స్ ఉన్నాయి. పెద్ద కుర్చీలు కూడా ఉన్నాయి. అంతకముందు అక్కడ కార్పెంటరీ మరియు ఎలక్ట్రికల్ వర్క్స్ ఏవైనా జరిగాయేమో అనిపించేలా వుడెన్ ఫర్నిచర్, డ్రిల్లింగ్ మెషీన్లు ఉన్నాయి. అక్కడున్న పెద్ద టేబుల్ ని జరిపి మధ్యలో ఒక కుర్చీ వేసుకుని దాని పైకెక్కాడు అశుతోష్. టేబుల్ జరుపుతున్నప్పుడే అక్కడ బైనాక్యూలర్స్ దొరికింది. దాని సాయంతో హాపర్ విండో తెరిచి చూసాడు. జీకే నేషనల్ ఆయిల్ కంపెనీ అని కనబడింది. వెంటనే జోసెఫ్ కు మెసేజ్ చేసాడు.
 
"జీకే నేషనల్ ఆయిల్ కంపెనీ...
కమ్యూనిటీ 309
జీకే స్ట్రీట్"
 
అన్న మెసేజ్ వచ్చింది జోసెఫ్ మొబైల్ కు.
 
జోసెఫ్ సెబాస్టియన్ అదే ముత్తుస్వామి అయ్యర్ జీకే కార్పొరేషన్ లో జాయిన్ అయిన మొదటి రోజే జీషాన్ అన్న వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు. జీషాన్ జీకే కార్పొరేషన్ మొదలైనప్పటి నుండి అక్కడే పని చేస్తున్నాడు. జీషాన్ కి ఆ జాబ్ వాళ్ళ పెద్దనాన్న ద్వారా వచ్చింది. వాళ్ళ పెద్దనాన్న జీకే కార్పొరేషన్ దుబాయ్ బోర్డు డైరెక్టర్. ఆయన ప్రస్తుతం అక్కడ లేరు. చీకటి రాజ్యంలో ఉన్నాడు.
 
జీషాన్ ని ఆ అడ్రస్ గురించి వాకబు చేసాడు జోసెఫ్. జీషాన్ కి జీకే స్ట్రీట్ మొత్తం బాగా తెలిసుండటంతో
 
"జీకే స్ట్రీట్ లో జీకే కార్పొరేషన్ ఎంప్లాయిస్ కి తప్ప బయటి వారికి చోటు లేదు. జీకే స్ట్రీట్ లోని ఏ కమ్యూనిటీకి వెళ్లాలన్నా సరే నీకొక ఐడి కార్డు కావాలి. నేను అరేంజ్ చేస్తాను. బట్ బీ కేర్ఫుల్. అక్కడ ఎవరిని కలవటానికి వెళుతున్నావ్?" అని అడిగాడు జీషాన్.
 
"మా మావయ్య. తనే నాకీ జాబ్ వచ్చేలా చేసాడు", అని వెంటనే సమాధానం ఇచ్చాడు జోసెఫ్.
 
"ఇంటరెస్టింగ్. మీ మావయ్య ఎక్కడుంటాడు?" అని అడిగాడు.
" కమ్యూనిటీ 309..."అని చెప్పి సంశయించాడు జోసెఫ్.
 
"హే, ఇట్స్ ఓకే. జస్ట్ అడిగాను. డీటెయిల్స్ చెప్పటం ఇష్టం లేకపోతే ఇబ్బందేం లేదు", అన్నాడు జీషాన్.
 
కమ్యూనిటీ 309 లో జీకే కార్పొరేషన్ ఎంప్లాయిస్ ఇళ్ళు చాలా ఉన్నాయి. అందుకే జీషాన్ పెద్దగా అనుమాన పడలేదు. వెంటనే జోసెఫ్ అక్కడికి వెళ్లేందుకు కావలసిన ఐడి కార్డును నిమిషాల్లో అరేంజ్ చేసిచ్చాడు.
 
కానీ అశుతోష్ ఉన్న డార్క్ రూమ్   కమ్యూనిటీ 309  లో లేదు. అశుతోష్ హాపర్ విండో లో నుండి చూస్తూ తన కంటికి ఏదైతే సైన్ బోర్డు కనబడిందో వెంటనే అదే చెప్పేసాడు తొందర్లో. డార్క్ రూమ్ కి  సరిగ్గా వెనక వైపున ఉందది.
 
ఇప్పుడు  కమ్యూనిటీ 309 కి వెళ్ళాక అశుతోష్ ఎక్కడున్నాడో వెతకాల్సిన పజిల్ మాత్రం జోసెఫ్ దే. ఎందుకంటే ఆ డార్క్ రూమ్ వేరే కమ్యూనిటీ పరిధి కిందకు వస్తుంది. డార్క్ రూమ్ బ్యాక్ సైడ్ నుండి చూసినప్పుడు ఎదురుగా కనబడే సైన్ బోర్డు మీద కమ్యూనిటీ 309 అని ఉందంటే డార్క్ రూమ్ ఉండేది 310 అయినా అయ్యి ఉండాలి లేదా 308 అయినా అయ్యుండాలి.
 
పైగా అశుతోష్ కి కేటాయించిన ఆ డార్క్ రూమ్ జీకే కార్పొరేషన్ ఎంప్లాయిస్ నివసించే కమ్యూనిటీలో ఉందో లేదోనన్నది అసలైన పజిల్. జీకే కార్పొరేషన్ ఎంప్లాయిస్ లేని కమ్యూనిటీ లలో ఎంటర్ అవ్వటం చాలా కష్టమని జీషాన్ హెచ్చరించడంతో జోసెఫ్ ఆలోచనలో పడ్డాడిప్పుడు. సరే ఏదైతే అదైంది అనుకుని ముందుగా   కమ్యూనిటీ 309 చేరుకున్నాడు జోసెఫ్.
 
జోసెఫ్ తను వచ్చే టైం అండ్ ప్లేస్ మెసేజ్ చెయ్యటంతో సరిగ్గా అదే టైంకి అశుతోష్ అలెర్ట్ అయ్యాడు. జోసెఫ్ కమ్యూనిటీ 309 సైన్ బోర్డు దగ్గరే నిల్చుని ఉన్నాడు. హాపర్ విండో లో నుండి జోసెఫ్ ను అశుతోష్ చూసాడు. ఎలా సైగ చెయ్యాలో తెలియట్లేదు.
 
అలాంటి టైంలో అశుతోష్ అక్కడున్న వుడెన్ ప్లాంక్ ని, డ్రిల్లింగ్ మెషిన్ ని తీసుకుని హాపర్ విండో పైన పెట్టి డ్రిల్ల్ చెయ్యటం మొదలు పెట్టాడు. వెంటనే గాలికి ఆ పొట్టు అంతా వ్యాపించింది. డ్రిల్లింగ్ సౌండ్ ని, గాలికి ఎగసి పడి తన వైపుగా వస్తోన్న ఈ పొట్టును రెంటిని ఒకేసారి గమనించిన జోసెఫ్ అశుతోష్ ఎక్కడున్నాడో కనిపెట్టగలిగాడు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
#73

కమ్యూనిటీ 310 పరిధిలోని డార్క్ రూమ్ అది.
జోసెఫ్  కమ్యూనిటీ 310   లోకి అడుగుపెట్టాడు. అక్కడున్న బాడీ గార్డ్స్ కి తన ఐడి కార్డు చూపించాడు. తను జీకే కార్పొరేషన్ ఎంప్లాయ్ ని అని చెప్పాడు. అయితే నీకు ఇక్కడేం పని అన్నట్టు వాళ్ళు చూసారు. తన మావయ్యను కలవటానికి ఇటు వైపు వచ్చానని చెప్పాడు. కలిసాక తిరిగి బయలుదేరబోతూ మధ్యలో లఘుశంక కోసం తనకు దారిలో రెస్ట్ రూమ్స్ ఏవీ కనబడకపోవడంతో ఇటొచ్చానని చెప్పాడు. ఆ బాడీ గార్డ్స్ పైన నుండి కింద దాకా ఎగాదిగా చూసి ఒకరితో ఒకరు మాట్లాడుకుని జోసెఫ్ కు పర్మిషన్ ఇచ్చారు. జోసెఫ్ వెంటనే లేట్ చెయ్యకుండా అశుతోష్ డార్క్ రూమ్ ఉన్న వైపుగా వెళ్ళాడు. అశుతోష్ డార్క్ రూమ్ బయట బాడీ గార్డ్ ఎవ్వడూ లేదు. పైగా అక్కడున్న బెంచ్ పైన కీస్ ఉన్నాయి. వెంటనే జోసెఫ్ అక్కడున్న కీ తో డార్క్ రూమ్ డోర్ తెరిచాడు. తెరవగానే అశుతోష్ బయటకొచ్చేసాడు. అశుతోష్, జోసెఫ్ వెంటనే అక్కడున్న రెస్ట్ రూమ్ వైపుగా వెళ్లారు.
 
అశుతోష్, "నువ్వు వెంటనే నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్లే ప్లాన్ చెయ్యాలి....ప్లీజ్ హెల్ప్ మీ" అంటూ ప్రాధేయపడ్డాడు.
 
జోసెఫ్, "సర్ నా దగ్గర రెండు జీపీఎస్ ట్రాకింగ్ డివైజెస్ ఉన్నాయి. ఒకటి వ్యక్తికీ, మరొకటి వెహికల్ కి ఫిక్స్ చెయ్యొచ్చు", అంటూ తన దగ్గరున్న డివైజెస్ ని అశుతోష్ కిచ్చేసాడు.
 
అశుతోష్,"థాంక్ యూ జోసెఫ్. ఘోర కలి ఇక్కడి నుండి వెళుతూ చివరి సారిగా నాతో మాట్లాడి వెళ్ళాడు. మళ్ళీ కనబడలేదు. ఘోర కలికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడని ఈ బాడీ గార్డ్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను. సురా అతని పేరు. అతనికి ఒక జీపీఎస్ ట్రాకర్ ఫిక్స్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అతనికి ఎలాంటి సెక్యూరిటీ చెక్ అప్స్ లేవంట. మిగతా అందరికీ టైట్ సెక్యూరిటీ చెక్ ఉందిక్కడ. అండ్ ఇంకో డివైజ్ ని నేను టైం చూసి ఒక వెహికల్ కి ఫిక్స్ చేస్తాను. ఈ ట్రాకింగ్ డివైజెస్ తో వీళ్ళ మూవ్ మెంట్స్ తెలిసినా చాలు మనం ఏదైనా ప్లాన్ చెయ్యొచ్చు"
 
జోసెఫ్, "ఘోర కలి ఇంకా ఇక్కడికి రాలేదు సర్. చీకటి రాజ్యంలోనే ఉన్నాడు. మీ బేసిక్ హ్యాండ్సెట్ కోసం చార్జర్ అడిగారు కదా ఇదిగో", అంటూ తను తెచ్చిన చార్జర్ ఇచ్చాడు.
 
అశుతోష్,"హమ్మయ్య థాంక్ యూ జోసెఫ్. డార్క్ రూమ్ లో ఒక డొక్కు చార్జర్ ఉంది. ఇన్ని రోజులూ దానితోనే నెట్టుకొచ్చా", అంటూ జోసెఫ్ ను హగ్ చేసుకుని అశుతోష్ ఎమోషనల్ అయిపోయాడు.
 
"అసలు ఈ డార్క్ రూమ్ లోనే చచ్చిపోతానేమో అనిపించింది. నా లైఫ్....నా లైఫ్ ఎవ్వరికీ పనికిరాకుండా ఈ చీకట్లోనే అంతమైపోతుందేమో అనిపించింది. నాకు ఇలాంటి గతి పట్టించిన ఘోర కలిని ఊరికే వదలను. ఐ విల్ టీచ్ హిం ఏ వాల్యూబిల్ లెసన్", అంటూ తన కన్నీళ్లు తుడుచుకుంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు.
 
అశుతోష్ తిరిగి డార్క్ రూమ్ లోకి వెళ్తూ, "జోసెఫ్ నీ గురించి నాకు సంజయ్ చెప్పాడు. కానీ నా ఈ పాత మొబైల్ నెంబర్ నీకెవరిచ్చారు?"
జోసెఫ్,"సంజయ్ ఆ రోజు మీతో ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత ఈ నెంబర్ ఫార్వర్డ్ చేసాడు. అది మీ పాత మొబైల్ నెంబర్ అని నాకు తెలీదు. లైఫ్ ఈజ్ సో స్ట్రేంజ్ కదా",అంటూ డోర్ క్లోజ్ చేస్తూ అన్నాడు.
 
అశుతోష్ జోసెఫ్ వైపు చూస్తూ ఒక నవ్వు నవ్వాడు. లైఫ్ లోని ఫిలాసఫీ అంతా అర్థం ఐపోయేలా ఉందా చిరునవ్వు.
 
డార్క్ రూమ్ కి తాళం వేసి కీ ని అక్కడే బెంచ్ మీద పెట్టేసి జోసెఫ్ తను వచ్చిన దారినే వెళ్ళిపోయాడు.
జోసెఫ్  కమ్యూనిటీ 310   నుండి బయటపడ్డాడు.
 
రోడ్ మీద నడుస్తూ ముందుకు వెళుతున్నాడు.
 
ఇప్పుడిప్పుడే తను దుబాయ్ లో చెయ్యాల్సిన పనులు క్రిస్టల్ క్లియర్ గా కళ్ళ ముందు కనబడుతున్నాయి.
 
అశుతోష్ కెరీర్ లో సాధించిన ఎన్నో విజయాలను సంజయ్ ద్వారా విని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో తిరుగులేని ఆర్టికల్స్ ఎన్నింటినో రాసాడు.
 
అవార్డ్స్ కూడా అందుకున్నాడు జోసెఫ్. అలాంటి గొప్ప ఆఫీసర్ ఇప్పుడు తనను ప్రాధేయపడుతున్నాడు.
అలాంటి సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ లో ఆ దైన్యం చూడటం చాలా బాధేసింది.
 
విధి మరీ ఇంత బలీయమైనదా ! మానవ యత్నం చెయ్యటం తప్ప మన చేతుల్లో ఏమీ లేదా అన్న వేదాంతం జీర్ణం కావటం లేదు.
 
జీవితపు లోతు తెలిసే కొద్దీ మనిషి మరింత కృషి చేస్తాడు విధిని తనకు నచ్చినట్టుగా మలచుకోవటానికి. కానీ ఇప్పుడు జోసెఫ్ విధిని మార్చాలి అనుకోవటం లేదు. ఒక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ గౌరవాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. ఎందుకంటే జోసెఫ్ వాళ్ళ నాన్న కూడా ఒక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ కాబట్టి. జోసెఫ్ కి వాళ్ళ నాన్న గుర్తుకొచ్చి రోడ్ నడిమధ్యలో మోకాళ్ళ మీద కూర్చుని ఆకాశం దిక్కు చూస్తూ ఏడ్చాడు. జోసెఫ్ వాళ్ళ నాన్న గారు చనిపోయారు. ఒక రెస్క్యూ ఆపరేషన్ లో టెర్రరిస్ట్ ల బందీలో ఇలాగే అశుతోష్ లా చీకటి గదిలో నిర్బంధింపబడి అతి కిరాతకంగా వాళ్ళ చేతుల్లో చనిపోయాడు. వాళ్ళ నాన్న ఆ రోజున ఎంతటి వేదనను అనుభవించి ఉంటాడో ఈ రోజున అశుతోష్ ను చూసాక జోసెఫ్ కు సరిగ్గా అర్థం అయ్యింది. అందుకే కన్నీటి రూపంలో తన ఆవేదనను, ఆవేశాన్ని వ్యక్తపరుస్తున్నాడు.
 
అశుతోష్ లో ఇప్పుడొక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ ని కాదు. వాళ్ళ నాన్నగారిని చూసుకుంటున్నాడు జోసెఫ్.
 
వాళ్ళ నాన్న గారిని కాపాడుకోలేకపోయానని ప్రతీ ఆదివారం చర్చిలో జీసస్ తో ఎన్నో సార్లు వేడుకున్నాడు. ఆ దేవుడు తన మొర ఆలకించినట్టున్నాడు. ఇలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడేమో అనిపించింది. ఇప్పుడు అశుతోష్ ని నిండు ప్రాణాలతో ఇంటికి చేర్చటం జోసెఫ్ ముందున్న మిషన్.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
#74

శంభల రాజ్యం – 4
విక్రమసింహుడి పరాక్రమం
 
అభిజిత్ సింహాల వెంట పర్వత శ్రేణులపై ఉన్న శిక్షణా కేంద్రాన్ని సమీపిస్తున్నాడు. ముందుగా వెళ్తున్న సింహం ఒక్కసారి ఆగి అభిజిత్ వైపు తిరిగి చూసింది. ఆ చూపు స్పర్శ అభిజిత్ ని బలంగా తాకింది. అలాంటి సన్నివేశం ఎన్నో సార్లు అక్కడ జరిగినట్టు అనిపించింది. తన స్మృతి పథంలోకి వెళ్ళిపోయాడు. ఇదే సింహం అలా ఎన్నో సార్లు వెనక్కి తిరిగి చూసేది. కానీ అప్పుడున్నదేదో ఇక్కడ కనబడటం లేదు. అసలేంటది ? ఒక వస్తువా? మనిషా? అభిజిత్ చుట్టూ ఉన్న సింహాలు కూడా ఇప్పుడు అభిజిత్ నే చూస్తూ ఉన్నాయి అదేదో గుర్తించు అన్నట్టు. ఒకే సారి ఎనిమిది సింహాల వంక చూస్తూ ఉన్నాడు అభిజిత్. ప్రతీ సింహం తనను ఒకేలా చూస్తోంది. వాటి చూపుల స్పర్శ తాలూకు గాంభీర్యం అదే. ఏ మాత్రం తేడా లేదందులో. అభిజిత్ కే తెలియకుండా కన్నీళ్ళొచ్చేస్తున్నాయి. ఏం చెప్పాలని చూస్తున్నాయో అంతుబట్టక కలిగే బాధ నుండి వస్తున్న కన్నీటి అలలవి. కన్నీళ్లు తుడుచుకుని మళ్ళీ ఒకసారి వాటి వంక చూసాడు. ఇప్పుడు సరిగ్గా అర్థం అవుతోంది. అక్కడ ఒకప్పుడు ఉండే మనిషి ఎవరో కాదు. తనే అని. ఇప్పుడు అభిజిత్ లా కాదు. విక్రమసింహుడిలా ఆలోచించాడు. విక్రమసింహ చూపు ఎలా ఉంటుందో అలా చూసాడు అక్కడున్న సింహాసనం వైపు.
 
ఎదురుగా ఉన్న అడ్డంకులు అన్నీ గుర్తుకొచ్చాయి. ఇదొకప్పుడు తన శిక్షణా కేంద్రమే. ఆ సింహాసనం పై తన గురువు  సమవర్తి ఉండేవాడు. ఆ సింహాసనం వైపుగా నడుచుకుంటూ వెళ్లి గురువును గుర్తుచేసుకోగానే ఆయన రూపం మెదిలింది అక్కడ. ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తున్నప్పుడు కన్నీటి బొట్లు అక్కడ పడ్డాయి. ఆ కన్నీటి చుక్కలు ఆ నేలపై పడ్డాయి. అంటే ఆయన అక్కడ లేకపోయినా తనకు కనిపిస్తున్నాడు అన్న దానికి సంకేతం అది.
 
"విక్రమసింహా....జయించు....జయించు....జయించు 
నీలో ఉన్న ఆవరణలు దాటు
నీ ముందున్నదేదీ నీకు అడ్డు కాదు....నీలో ఉన్నది మాత్రం ఖచ్చితంగా నీకు అడ్డుపడుతోందని తెలుసుకో 
విక్రమసింహా......జయించు.....జయించు....విజయం నీదే తెగించు " 
 
అవే మాటలు. ఎన్నో సార్లు తన చెవులతో తనే విన్న విజయ డంకాలు.
 
అగాధపు అంచుల్లోకి తను పడిపోతున్నప్పుడు పైకి తీసుకొచ్చిన చేతులలాంటి మాటలవి.
 
ఓటమి అంటే భయపడే విక్రముడిని విజయం తప్ప మరొకటి తెలియని విక్రమసింహుడిగా మార్చిన మంత్రాలవి.
 
విక్రముడు విక్రమసింహుడిగా మారితే అతని నడక చాలు సింహాలు కనిపెట్టేస్తాయి. ఒక నిఖార్సయిన యోధుడిని అదీ విక్రమసింహుడి లాంటి ప్రాణాలకు తెగించైనా వీరత్వాన్ని ప్రదర్శించే యోధుడిని అవి ఎప్పటికీ మరిచిపోవు. అందుకే అవి మామూలు సింహాలు కావు అన్నది.
 
అభిజిత్ ఇప్పుడు విక్రమసింహుడైపోయాడు. తన ఎదురుగా ఉన్న అడ్డంకులు ఇప్పుడు కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యాయి.
 
అగ్ని వలయం కనిపించింది మొదటగా. మరో ఆలోచన లేకుండా దూకేసాడు. దాన్ని చూసిన సింహాలు గర్జిస్తూ వచ్చాయి. ఒక దాని వెంట మరొకటి అదే అగ్ని వలయంలో విక్రమసింహ ఆజ్ఞ జారీ చేసినట్టు కళ్ళు మూసుకుని దూకేశాయి. అగ్ని వలయం మాయమై   సుడి గుండం ప్రత్యక్షం అయ్యింది. మరో ఆలోచన లేకుండా సుడి గుండంలో దూకేసాడు. సుడి గుండాన్ని చూస్తే గుండె ఆగిపోయే భయం వేస్తుంది ఎవ్వరికైనా. అలాంటి సుడి గుండం విక్రమసింహుడికి కనిపించట్లేదు. మరేదో కనిపిస్తోంది. ఆపద కనిపిస్తే ఎవ్వరైనా ఆగిపోతారు. ఒక యోధుడికి మామూలు వాడికి సరిగ్గా ఇక్కడే వ్యత్యాసం ఉంటుంది. యోధుడికి ఆపద చివరన ఉన్న ఉపాయం కనిపిస్తుంది. అందుకే కళ్ళ ముందున్న ఈ ఉపద్రవం అపాయంలా అనిపించదు. విక్రమసింహుడి వెంట ఈ సుడి గుండంలోకి సింహాలు రక్షక భటులలా వెంట వచ్చేసాయి. అనుకున్నట్టే ఆ సుడిగుండం కూడా ఆగిపోయింది.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
#75

 
ఇప్పుడు కళ్ళ ముందు  కత్తుల వలయం ఉంది. ఆ వలయంలో అడుగుపెడితే కత్తుల మీదే నడక. ఒక్క ఘడియ అయినా అవి కత్తులు అన్న స్పృహ కలిగితే ఆ మరుక్షణమే చచ్చినట్టు లెక్క. నొప్పి తెలిస్తే నడక ఆగిపోతుంది. నొప్పి తెలిసేలోపు వలయం ఆగిపోవాలనుకున్నాడు విక్రమసింహుడు. పరుగులో వేగం కాలాన్ని సైతం ఓడిస్తుంది. విక్రమసింహుడి దగ్గర మాత్రమే ఉన్న నైపుణ్యం ఇది. అలాంటి పరుగు అతనిది. లిప్తకాలంలో జయించుకు రాగలడు. కత్తులు తోరణాలలా, బాటలలా, గోడలలా చుట్టూ ఉన్న వలయంలోకి ఎప్పుడు వెళ్ళాడో ఎప్పుడు వచ్చాడో తెలియని వేగంతో పరిగెత్తాడు. సింహాలు గర్జిస్తూ వెళ్లాయి. ఏనుగులలా ఘీంకరిస్తూ బయట పడ్డాయి. కత్తుల వలయం పోయి  శబ్దారావం మొదలయింది.
 
ధ్వని యోధుడి దృష్టిని మార్చేస్తుంది. ఈ శబ్దారావంలోకి అడుగుపెడితే మాత్రం రకరకాల భావనలు కలిగించే శబ్దాలు మార్మోగుతుంటాయి. అవి కొంతసేపు మాత్రమే. అసలైన ప్రమాదం ముందున్నది. నిషాదం మొదలయ్యిందంటే ముందు ఏడుపొస్తుంది ఆ తర్వాత బాధ ఆ తర్వాత మనో వ్యథ ఆ తర్వాత బలహీనపడిపోయి అనంతమైన విషాదంలోకి మనల్ని ఎవరో నెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. నిషాదం అనగా ఏనుగు ఘీంకారం. ఆ తర్వాత గాంధార, మధ్యమ, రిషభ, దైవత రాగాలు మొదలవుతాయి. వీటిని ఉపయోగించి ఏమైనా చెయ్యొచ్చు. అంతటి శక్తి కలిగిన సంగీతం ఉంది వీటిలో. బాధనే ఆయుధంగా చేసుకున్న ఈ శబ్దారావంలోకి ఏ బాధ లేకుండా అడుగు పెట్టాడు విక్రమసింహుడు. అన్నీ క్షణికాలే అన్న స్పృహతో ఎల్లప్పుడూ బతికే వాడు, దాన్ని బలంగా నమ్మేవాడు నిజమైన యోధుడు. ఒక యోధుడు భావోద్వేగాలకు లోనవ్వడు. వాటికి అతీతమైన వాడే. ఎన్నో దాటొచ్చిన వాడు. ఈ ధైర్యంతోనే విక్రమసింహుడు కదిలాడు.
 
సింహాలు కదిలాయి.
 
శబ్దారావం దాటేసరికి విక్రమసింహుడికి కన్నీళ్లు వచ్చేసాయి. బాధతో కడుపులో మెలి తిప్పినట్టయ్యింది. గతంలోని బాధంతా బయటికొచ్చేసింది. ఓడిపోయానేమోనని ఆగిపోయాడు అక్కడే.
 
సమవర్తి ప్రత్యక్షం అయ్యాడు. తలదించుకున్న విక్రమసింహుడి వైపు చూస్తూ ఇలా మాట్లాడాడు.
 
"బాధనెప్పుడూ జయించలేవు విక్రమా...బాధ అనేది ఎప్పుడూ మనతో ఉండిపోయే గాయమే.
 
కాలం మాత్రమే ఆ బాధను తీసివెయ్యగలదు. మన చేతుల్లో లేనిదది. నీ బాధకు కాలమే పరిష్కారం చూపిస్తుంది. నువ్వు ఓటమి అని దేన్నైతే అనుకుంటున్నావో అది నీలో ఉన్న బాధ మాత్రమే. బాధ కలగటం ఎప్పుడూ ఓటమి కాదు. అసలు ఓటమి అన్నదే నీకు కలగకపోతే అప్పుడు నిజంగా బాధపడాలి. ఎందుకంటే ఈ అనంత విశ్వంలో ఓడిపోకుండా గెలిచిన యోధుడే లేడు. ఓటమి లేదంటే గెలుపు లేనట్టే", అనేసి అంతర్ధానం అయిపోయాడు.
 
జటిలలో మూసివున్న సింహ ద్వారం తెరుచుకుంది.
అంకిత, సంజయ్ అలెర్ట్ అయ్యారు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply
#76

 
"విక్రమసింహుడు గెలిచాడు. తురగము పై మెరుపులు మెరిపించటానికి వస్తున్నాడు.
 
తురగ ప్రాకారానికి సమాయత్తం కండి. విక్రమసింహుడి అశ్వహృదయ విద్య చూద్దురు గాని. నలుడు నేర్పిన విద్య", అంటూ మందహాసం చేస్తూ ముందుకు కదిలాడు రుద్రసముద్భవ.
 
విక్రమసింహుడే అభిజిత్ అని తెలియక తికమక పడ్డారు అంకిత, సంజయ్ లు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
#77

నా తప్పిదం

రేపు మారుస్తాను, ఇదే స్థానంలో

ధన్యవాదములు ఉదయ్ గారు

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#78

కథ ఇపుడు సరిగానే వచ్చింది.

మార్చాను, పునరుక్తమైన భాగాలను.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#79

[Image: image-2024-10-12-092753099.png]

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#80

[Image: image-2024-10-12-092753099.png]

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)