Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 14(సమాప్తం))Completed

Showing only the posts of k3vv3: 108 of 231 posts. Show all posts
#41

శంభల నగరం – 3
ధనుః ప్రాకారం
"మనస్సును అదుపులో పెట్టుకోవటం అన్నది తేలికగా అబ్బే విద్య కాదు. మనలో ఒక్క రోజులో కొన్ని వేల ఆలోచనలు అలా సముద్రంలోని కెరటాలలా వస్తూ పోతూ ఉంటాయి. మనసుని అలజడికి గురి చేసే విషయాల్ని కట్టడి చేస్తే మరింత ప్రమాదం. దేన్నైనా సరే ఛేదించి, సాధించాలి. అలా ఛేదించాలి అంటే మనలో వుండే అలజడిని తగ్గించే దిశగా మనం అడుగులు వెయ్యాలి. అదొక సాధనలా నిరంతరం సాగాలి. అంతే కానీ మనసుని బలవంతంగా కట్టడి చేస్తే మాత్రం అది పదింతలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. ఇలాంటి మనసును జ్ఞాన మార్గం వైపుకు నడిపించేదే ఈ  ధనుః ప్రాకారం .
 
శంభల రాజ్యం లోని యోధులు, యోగులు, రాజులు ఎందరో ఈ  ధనుః ప్రాకారానికి వచ్చి ఇక్కడ ధనుస్సు ఆకారంలో నిర్మించబడ్డ ఈ ప్రాంగణం అంతా తిరుగుతూ మంత్రాన్ని మననం చేసుకుంటూ 18 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత  ఎక్కు పెట్టిన బాణంలా మధ్యలో ఉన్న దారి వెంట నడుస్తూ చివరిదాకా వెళ్లి అక్కడున్న  ధ్యాన పీఠము
మీద ఆసీనులవుతారు. ఈ బాణంలా వున్న దారికి ఇరు వైపులా 
పుష్కరిణి ఉంటుంది. ఈ పుష్కరిణిలోని నీళ్లు స్వర్వాహినీ క్షేత్రానివే అయినా శివుని ఆలయంలోని భస్మమును ఎప్పటికప్పుడు తెచ్చి ఇక్కడి నీటితో జత చేస్తూ వుంటారు. సృష్టి, స్థితి, లయము లకు అతీతమైన ఒక ప్రపంచం ఈ శంభల నగరం. శివుని ఆజ్ఞను అనుసరించటమే ఇక్కడ పరమావధి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ ధ్యాన పీఠాన్ని ఏర్పాటు చేసిన వేదికకు నలుదిక్కులా  శివోహం
అని వ్రాయబడి ఉంటుంది. అంటే దానర్థం నీ దారి ఆయన వేసిన దారి. నీ ప్రయాణానికి ఆయనే గమ్యం. నీ ఉనికికి ఆయనే మూలం. నీ లోని జ్ఞానమే ఆయన. ఆయనలోని జ్ఞానమే ఈ అనంతమైన విశ్వం అని.
 
 
చిదానంద రూపః శివోహం శివోహం
ధ్యాన పీఠము
మీద ఆసీనులయిన తర్వాత ఉపాసకుడు తన సంకల్పాన్ని, లక్ష్యాన్ని, గమ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పటికే పూర్తిగా మనసును తాను అనుకున్న లక్ష్యం వైపుగా దిశానిర్దేశం చేసి ఉండటంతో పరిపూర్ణమైన ఏకాగ్రత కుదురుతుంది. ఆ  ధ్యాన పీఠము మీదున్నప్పుడే అతనికి అన్ని సమాధానాలు దొరుకుతాయి. అతని ఇచ్చాశక్తిని బట్టి అతనికి  కలిగే అనుభూతి ఆధారపడి ఉంటుంది. తీవ్రమైన కోరిక వున్నప్పుడు మాత్రం ఇరువైపులా ఉన్న పుష్కరిణి లోని నీళ్లు 6 అడుగుల ఎత్తుకు ఎగసి పడుతూ ధ్యాన పీఠము మీదున్న ఉపాసకుడిని పునీతం చేస్తాయి. అనగా ఆ ఉపాసకుడు పవిత్రమైన పుష్కరిణి జలంతో ప్రోక్షణ చెయ్యబడ్డట్టు అన్నమాట. సంకల్ప సిద్ధి దొరికినట్టే అనుకోవచ్చు”, అంటూ చెప్పటం ముగించాడు 
ధనుః ప్రాకారంలో ఉన్న ఆ ఉద్ధారకుడు.
 
"స్వామి ఇక్కడ ఆడవారికి కూడా ప్రవేశం ఉన్నదా?" అడిగింది అంకిత.
 
"సంకల్ప సిద్ధి కోసం చేసే ధ్యానానికి స్త్రీ, పురుష భేదం లేదు తల్లి", అన్నాడా ఉద్ధారకుడు.
 
"ఇంత క్రితం మీరు ఉపాసకుడు అని మాత్రమే సంబోధించారు. అందుకే ఇంతవరకు ఏ ఉపాసకురాలు ఇక్కడికి రాలేదేమోనని అనుకున్నాను", అని చమత్కారంగా అన్నది అంకిత.
 
"చాలా సరైన విషయాన్ని ప్రస్తావనకు తెచ్చావమ్మా. ఇక్కడ ఉపాసకుడు అంటే అర్థం పురుషుడు అని కాదు. శివుడు అని. ఎందుకంటే ఈ ధ్యాన పీఠము మీద ఆసీనులై ఎవరు ఉపాసన చేసినా సరే వారిలోని శివుడే జాగృతం అవుతాడు. సర్వం ఆ శివుడికే చెందుతుంది అన్న భావన అది.
 
శివుడే కర్త, కర్మ, క్రియ అన్న అంతరార్థం", అన్నాడు ఆ ఉద్ధారకుడు.
 
"ధనుస్సు ఆకారంలో ఉన్న ఈ ప్రాంగణం మొత్తం తిరుగుతూ పఠించే ఆ మంత్రం ఏమిటి స్వామి?" అడిగాడు సంజయ్
 
"
 
సర్వ చైతన్య రూపాంతాం 
 
 
ఆద్యాం విద్యాంచ ధీమహి 
 
 
బుద్ధిం యాన: ప్రచోదయాత్‌ 
 
 
ఈ మంత్రాన్ని మనసులోనే సరిగ్గా 18 సార్లు జపించిన తరువాత మాత్రమే ఆ  ధ్యాన పీఠము దగ్గరికి వెళ్లే అర్హత మీకు దొరుకుతుంది", అన్నాడు ఆ ఉద్ధారకుడు.
 
"మాకు ఇవన్నీ చెయ్యటానికి ఇప్పుడు అనుమతి ఉన్నదా స్వామి?" అని అడిగాడు అభిజిత్.
 
"దృఢమైన సంకల్పంతో శంభల రాజు అనిరుద్ధుల వారు ఒక రోజు ముందుగానే శివుని ఆలయానికి వచ్చి ఇక్కడి శాస్త్రం ప్రకారం  దేవప్రశ్నము వేసిన తర్వాత ఒక శుభ ముహూర్తాన  ‘ధనుః ప్రాకారానికి విచ్చేసి సంకల్ప సిద్ధి కొరకు ఇవన్నీ చెయ్యటం జరుగుతుంది. ఎవ్వరైనా ఈ పద్ధతిని అనుసరించాల్సిందే" అని నిర్మొహమాటంగా చెప్పాడు ఆ ఉద్ధారకుడు.
 
“ఒక ముహూర్తం, ఒక దృఢమైన సంకల్పం, గ్రహబలం లేకుండా ఇక్కడ ప్రదక్షిణలు చెయ్యటానికి వీలు లేదు”, అని కాస్త ఘాటుగానే చెప్పాడాయన.
 
దీంతో అభిజిత్ వైపు నిరసనగా చూసారు సంజయ్, అంకితలు. సిద్ధపురుషుడు తనకి అలవాటైన నవ్వునే ధరించాడు.
 
తన ప్రశ్నలతో ఆ ఉద్ధారకుడికి కోపం తెప్పించి తనేమైనా అనుచితంగా ప్రవర్తించానేమోనని అభిజిత్ దిగాలుగా మొహం పెట్టి నిట్టూర్చాడు.
 
సిద్ధపురుషుడు ఆ విషయాన్ని గ్రహించి, "అభిజిత్ అడగటం వల్లనే కదా ఈ ప్రాకారానికి ఎవరి అనుమతితో రావాలో తెలిసింది. మీరు ఘోర కలిని ఎదుర్కోవటానికి శంభల రాజ్యంలో  ఎన్ని విద్యలు నేర్చుకున్నా, ఎన్ని శాస్త్రాలు పఠించినా భూలోకం కెళ్ళాక అవన్నీ మీకు గుర్తుండాలి అన్నా, ఆ శక్తులన్నీ మీకు సహకరించాలి అన్నా మనం శంభల నుండి బయలుదేరే ముందు ఖచ్చితంగా ఈ  ధనుః ప్రాకారానికే రావాలి. అభిజిత్ ఈ ప్రశ్న అడగటం మంచిదే అయ్యింది" అంటూ ముగించాడు ఆ సిద్ధపురుషుడు.
 
ఆ ఉద్ధారకుడి నుండి సెలవు తీసుకుని అక్కడి నుండి ముందుకు కదిలారు. ఒక ప్రాకారానికీ మరొక ప్రాకారానికి మధ్యనున్న దూరం 3 యోజనాలైనా నడుస్తూ వెళ్తున్నప్పుడు అలసట లేదు. కాళ్ళ నొప్పి లేదు. దూరం, దగ్గర అన్న వ్యత్యాసమే తెలియటం లేదు. దారి పొడవునా ఉన్న  పాదుకాతీర్థం  మహిమో మరేంటో కానీ శంభల నగరంలో ఎంత సేపు నడిచినా, ఎంత దూరం నడిచినా నడుస్తున్నట్టే లేదు. ఏదో శక్తి వాళ్ళను ముందుకు నడిపిస్తున్నట్టు ఉంది.
 
వాళ్ళు అక్కడి నుండి  సమరః ప్రాకారానికి బయలుదేరారు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42

శంభల నగరం – 4
సమర విజయ రాముని సమరః ప్రాకారం

చేరుకోగానే అక్కడ వారికి ఒక యోధుడి మూర్తి కనిపించింది. ఆ ప్రతిమ  ధ్యానం  చేస్తున్న భంగిమలో పద్మాసనంలో ఉంది. చూడటానికి  ఉగ్రరూపంలో ఉన్న యోధుడిలా ఉంది. ఆ యోధుడి కళ్ళను చూస్తే కేవలం ధ్యానం చేస్తున్నట్టు మాత్రమే లేదు. ఏదో యుద్ధంలో నిర్విరామంగా శత్రువులతో పోరాడుతూ తన ఆగ్రహ జ్వాలలని కళ్ళ నిండా నింపుకున్నట్టు ఉంది. ఎందుకంటే అతను అర్ధనిమీలితనేత్రాలతో ఉన్నాడు. తీక్షణమైన ఆ చూపులను బట్టి అతను ఎవరినో అంతం చెయ్యటానికే దీక్ష పూనాడనిపిస్తోంది. ఎన్నో గాయాలతో రక్తసిక్తమై వున్న అతని దేహాన్ని చూస్తే చురకత్తులతో, బాణాలతో ఆ యోధుడిని దాడి చేసినట్టు అర్థం అవుతోంది. అయినా అది తనపై ఏ మాత్రం ప్రభావం చూపించలేదని అతని ధీరత్వం మనతో చెబుతున్నట్టు ఉంటుంది. అణువణువూ ధైర్యంతో, వీరత్వంతో, అమరత్వంతో నిండిపోయి మృత్యుదేవతకు ముచ్చెమటలు పట్టించే పోరాటపటిమ తన సొంతం అన్నట్టు ఉన్నాయి అతని చూపులు.
 
ఆ ప్రాంగణం అంతా నిశ్శబ్దంగా వుంది. అక్కడున్న నిశ్శబ్దాన్ని చూస్తే ఇప్పటికీ ఆ యోధుని వీరత్వానికి అర్పిస్తున్న నివాళి అదేమో అనిపించేలా ఉంది. సమరః ప్రాకారం మొత్తం ఆ యోధుడిదే అనిపించేలా ఉంది ఆ నిశ్శబ్దం. అక్కడున్న ప్రతీ అంగుళానికి ఆ యోధుడి పరాక్రమం తెలుసేమో అనిపించే నిశ్శబ్దం.
 
అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆ యోధుడినే కన్నార్పకుండా చూస్తున్నారు. సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు కొంచెం దూరంగా నిలబడి ఉన్నారు.
 
అంతలో అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. ఆ వృద్ధుడిని చూడగానే సైనికులిద్దరూ ప్రణామం చేశారు. సిద్ధపురుషుడు కూడా నమస్కరించాడు.
 
ఆ వృద్ధుడు ఎప్పటిలానే యథావిధిగా తన ఆసనం చూసుకుని అక్కడే స్థిరపడి ఆ యోధుడి ప్రతిమను చూస్తూ ఏదో మంత్రం జపిస్తూ వున్నాడు. ఇంతలో ఏదో జ్ఞప్తికి వచ్చినట్టు అనిపించి
 
సమరవిజయ రామా 
సమరవిజయ రామా
సమరవిజయ రామా 
అంటూ తన్మయత్వంతో  తన కళ్ళ ముందే యుద్ధరంగం కనిపించినట్టు అనిపించి ఆ యోధుని ప్రతిమ దగ్గరకు పరిగెత్తుకుంటూ పోయి అక్కడున్న పూలను ఆ మూర్తీభవించిన వీరత్వానికి ప్రతీకగా సమర్పించి అక్కడున్న గంధపు జలంతో ఆ యోధుని పాదాలను పరిశుద్ధి చేసాడు ఆ వృద్ధుడు.
తిరిగి తన ఆసనం దగ్గరికి వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అభిజిత్, అంకిత, సంజయ్ లను ఇటు రమ్మని సైగ చేసాడు. సిద్ధపురుషుని వైపు భక్తి భావంతో చూస్తూ ఆహ్వానించాడు. అక్కడున్న ఇద్దరు సైనికులకు విషయం అర్థం అయిపోయి ఆ ప్రాంగణం నుండి బయటికి వెళ్లిపోయారు.
 
ఆ వృద్ధుడు ఇలా చెప్పటం మొదలు పెట్టాడు.
 
"నా పేరు  మహిభార్గవుడు. శంభల నగరంలో మీకు కనిపించే భూలోకవాసిని నేను. ఇక్కడ మీరు చూస్తున్న ఆ యోధుడిని గాయాలతో రక్తసిక్తమై వున్న స్థితిలో పార్థివ శరీరంగా వున్న తనని భూలోకం నుండి ఇక్కడకు  తీసుకునివచ్చే ఆ మహాభాగ్యాన్ని పొందాను. శంభలకు వచ్చి నేనూ అమరుణ్ణి ఐపోయాను. నాకు ఆనాడు కురుక్షేత్ర సంగ్రామంలో ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవదేవుడు ఆ శ్రీకృష్ణుడే", అన్నాడు ఆ వృద్ధుడు.
 
"స్వామీ ఆ యోధుడి వీరగాథను సవివరంగా మాకు చెప్తారా?" అని అడిగాడు సంజయ్.
 
"అది చెప్పటానికే మిమ్మల్ని ఇక్కడకు పిలిపించాను.
మీరు చూస్తున్న ఆ యోధుడి విగ్రహం సామాన్యమైనది కాదు. అది ఏ లోహంతో నిర్మితమైందో ఇప్పటిదాకా శంభలలో ఎవ్వరికీ తెలీదు. 
 
దేవశిల్పి విశ్వకర్మ ప్రత్యేకంగా 3 మాసములు కేటాయించి ఆ యోధుని మూర్తిని సృజించాడు. మూర్తీభవించిన ఆ వీరత్వానికి ప్రాణప్రతిష్ట చేసాడు ఆ మాహానుభావుడు.
 
మీకిప్పుడు ఆ యోధుడి గురించి చెబుతాను. జాగ్రత్తగా వినండి", అంటూ ఇలా ఆ యోధుని వీరగాథను చెప్పసాగాడు ఆ మహిభార్గవుడు.
 
సమరవిజయ రాముడు శంభల నగరంలోని ఈ ప్రాకారంలోనే పెరిగాడు. అతని తల్లి రామ భక్తురాలు. ఈ యోధుడి సమరవిజయ రామ అన్న నామధేయం వెనుక ఉన్న బలమైన శక్తికి మూలం ఆవిడ మాతృ ప్రేమ, భక్తి.
 
సమరవిజయుడు కూడా తన తల్లిలానే రామభక్తుడు. అతి చిన్న వయసులోనే యుద్ధవిద్యలన్నీ నేర్చుకుని ఆరితేరిన వాడు. తనకు రాముని దర్శన భాగ్యం కావాలని పరితపించిపోయేవాడు. రామనామం జపిస్తూ ఎంతో కఠినమైన తపస్సును ఆచరించాడు. ఆహారం, నిద్ర ఏవీ  లేకుండా కొన్ని నెలలు గడిపాడు. అయినా రాముడు కరుణించలేదు. అప్పుడు ఒక యోగి సమరవిజయుని చెంతకు వచ్చి శివుణ్ణి తపస్సు చెయ్యమని కోరాడు.
 
శివుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజిస్తూ తపం ఆచరించాడు.
ఒక రోజు శివుడు ప్రత్యక్షం అయ్యి సమరవిజయుణ్ణి ఒక వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ సమరవిజయుడు తనకు ఆ రాముని దర్శన భాగ్యం కలగాలనీ, అలాగే తన యుద్ధవిద్యా నైపుణ్యం వ్యర్థం అవ్వకుండా అదంతా ఆ రాముడికే ఉపయుక్తం అవ్వాలనీ, యుద్ధంలోనే అమరుడై శంభల చరిత్రలో తాను యోధుడిగానే మిగిలిపోవాలనీ కోరాడు.
 
రామదర్శనం తప్పక దొరుకుతుందని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. ఆ రోజు నుండి రామదర్శనం కోసమే ఎదురు చూస్తూ ఎన్నో ఏళ్ళు గడిపాడు ఆ సమరవిజయ రాముడు. అన్ని ఏళ్లలో అతను ఏ నాడూ రామనామ జపాన్ని వదిలిపెట్టలేదు.
 
కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందు శ్రీ కృష్ణుడు శంభల నగరానికి విచ్చేశాడు. సమరవిజయ రాముణ్ణి కలవటం కోసమే ఆయన ఇంత దూరం వచ్చాడు.
 
శ్రీకృష్ణుడిని చూడగానే సమరవిజయ రాముడు కంటతడి పెట్టుకున్నాడు. రాముడి దర్శనం తను కోరుకుంటే శ్రీ కృష్ణుని రూపంలో తన జన్మ తరింపజెయ్యటానికి వచ్చినందుకు భావోద్వేగానికి లోనయ్యాడు సమరవిజయుడు.
 
"మా అమ్మ తన జన్మను మీకే ధారబోసింది స్వామీ. మీ నామస్మరణే నా అంతిమ లక్ష్యంగా నన్ను పెంచింది. ఇన్నాళ్టికి నన్ను కరుణించారా స్వామీ", అంటూ శ్రీ కృష్ణుని పాదారవిందములకు శిరస్సువంచి నమస్కరించాడు ఆ సమరవిజయుడు.
 

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
#43

"నీ అంతిమ లక్ష్యం నేను కాదు సమరవిజయా. ఇన్నాళ్లూ నీ చేత నా నామ స్మరణ చేయించింది నీలోని యోధుడికి పెట్టిన పరీక్ష. నీలోని భక్తుడికి ఎలాంటి పరీక్షా లేదు. మీ అమ్మ గారి ద్వారా నీకు సంక్రమించిన ఆస్తి విష్ణు పథము. అసలైన పరీక్షలో నువ్వు ఇప్పుడు నెగ్గావు కాబట్టే నిన్ను వెతుక్కుంటూ భూలోకం నుండి నేను వచ్చాను.
 
కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల సైన్యాన్ని ఎదుర్కోవటం అంత సులభమైన పని కాదు. అందుకు నాకొక యోధుడు కావాలి. శివుణ్ణి నువ్వు కోరుకున్న మూడు కోరికల్లో మొదటిది నా దర్శనంతో ఈనాడు తీరిపోయింది. మిగిలిన రెండు కోరికలూ తీరే అవకాశం నీకిప్పుడు దొరికింది. నిన్ను కురుక్షేత్ర సంగ్రామంలోకి అడుగుపెట్టమని ఆదేశించను. నా భక్తుడవు నీవు. నేను నిన్ను అర్థిస్తున్నాను. నీకు సమ్మతం అయితేనే రా. లేనిచో ఆనందంగా తిరిగి వచ్చిన దారినే నే వెళ్లెదను", అన్నాడు శ్రీ కృష్ణుడు.
 
"స్వామీ, మీరు ఈ సమరవిజయుణ్ణి అర్థించటం ఏంటి? మీ కోసం యుద్ధంలో నా ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడిన వాణ్ణి. నన్ను ఆజ్ఞాపించండి", అన్నాడు ఆ సమరవిజయుడు.
 
అలా కురుక్షేత్ర సంగ్రామంలోకి అడుగుపెట్టాడు ఆ సమరవిజయుడు. శంభల నుండి భూలోకంలోకి వచ్చిన ఆ సమరవిజయుడు ఒక్క యోధుడిగా కాక 100 మంది యోధులలా రూపాంతరం చెందాడు. సమరవిజయునికి ఉన్న శక్తికి 1000 మందిని ఒకేసారి ఎదుర్కోగలడు.
 
సమరవిజయుణ్ణి ఒకే యోధుడిగా రంగంలోకి తెస్తే దుర్యోధనుడికి అనుమానం వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నది. అందుకే శ్రీ కృష్ణుడు తెలివిగా సమరవిజయుని నుండి 100 మంది వేర్వేరు యోధులను సృష్టించాడు. ఆ సమరవిజయుని యుద్ధశక్తిని 100 భాగాలుగా విభజించి ఈ 100 మందినీ సృజించాడు. 100 మందికీ వేర్వేరు ముఖాలు, వేర్వేరు యుద్ధ నైపుణ్యాలు ఉన్నా వారిలో ఉండే ఆత్మచైతన్యం ఒక్కటే. అదే  సమరవిజయ రామ.
 
కదనరంగంలో ఈ 100 మంది 1000 మందితో  సమానం.
అనగా ఒకే ఒక్కడైన సమరవిజయ రాముడే వెయ్యి మంది వున్న ఆ  సైన్యాన్ని చీల్చి  చెండాడగలడని  దానర్థం.
 
ఆ రోజు కురుక్షేత్రంలో సమరవిజయుడు చూపించిన తెగువకి ఎవ్వరికీ నోట మాట రాలేదు. 1000 మందిని మట్టి కరిపించటం అంటే మాటలా!
 
ఆ రోజున ఆ 1000 మంది కౌరవ సైన్యానికీ యుద్ధభూమిలో  వారి ఎదుటనున్న 100 మంది యోధులలోనూ సమరవిజయుడొక్కడే కనిపించటంతో  మాయకు గురయ్యారు. వాళ్లకేం తెలుసు ఆ ఒక్కడిలోనే 100 మంది ఉన్నారని....ఆ వంద మంది ఒక్కడి నుంచే వచ్చారని.
 
శంభల నగరంలోని అతి పెద్ద రహస్యం ఇది. ఎవరికైనా చెప్పినా నమ్మశక్యం కాని వీరత్వం సమరవిజయ రాముడిది. అలాంటి యోధుడు మరొకడు పుట్టడు. ఆ ధీరత్వాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో కళ్లారా చూసిన నేనే నా కళ్ళను నమ్మలేకపోయా. నేను అంతవరకు ఇలాంటి ధీరుని గురించి ఇలలో వినలేదు. కలలో కనలేదు. అందుకే ఆ సమరవిజయున్నే చూస్తూ ఉండిపోయా. ఆ రోజు సంగ్రామం పరిసమాప్తి అయినది. 1000 మందినీ మట్టికరిపించాడు. వారి సైన్యం అలా వారి కళ్ళముందే కుప్పకూలిపోవటం తట్టుకోలేక కౌరవులు యుద్ధభూమి నుండి నిష్క్రమించారు. 1000 మంది వున్న ఆ కౌరవుల సైన్యాన్ని హతమార్చిన తర్వాత ఆ 100 మంది యోధులు తమ ఉనికిని కోల్పోతూ వచ్చారు. యుద్ధభూమి యందు ఆ 100 మందికి బదులుగా ఇప్పుడు ఒక్కడే మిగిలాడు. అతనే ఇప్పుడు మీరిక్కడ ప్రతిమలో చూస్తున్న ఆ  సమరవిజయ రాముడు. మీరిక్కడ చూస్తున్నట్టే నాకు ఆ నాడు యుద్ధభూమిలో కనిపించాడు. తన ముఖం నిండా గాయాలతో, కత్తులు, బాణాలతో రక్తసిక్తమై కనిపించిన వీరాధి వీరుడు. నా హృదయం ద్రవించిపోయింది. ఆయన పాదాల మీద పడ్డాను. నీ లాంటి యోధుడిని  నేనెక్కడా  చూడలేదని చెప్పాను. ఉద్వేగానికి గురయ్యాను. అంతలో అక్కడికి శ్రీ కృష్ణుడు విచ్చేశాడు. శంభల నగరానికి ఈ సమరవిజయుణ్ణి తీసుకుని వెళ్లే అదృష్టాన్ని నాకిచ్చాడు. అక్కడి వారికి సమరుని వీరత్వాన్ని చాటి చెబుతూ 
సమరః ప్రాకారాన్ని నిర్మించే ప్రతిపాదనను శంభల రాజు ముందు పెట్టాను. అలా ఈ నాడు సమరవిజయుడు తన బాల్యం నుండి ఎదుగుతూ వచ్చిన ఈ చోటే 
సమరః ప్రాకారంగా మారిపోయింది. ఎంతో ఖ్యాతిని గడించింది", అంటూ చెప్పటం ముగించాడు ఆ మహిభార్గవుడు.
 
జీవితంలో అలాంటి యోధుడి గురించి ఎప్పుడూ వినని అభిజిత్, అంకిత, సంజయ్ లకు కళ్ళనిండా నీరు నిండిపోయింది. ఉద్వేగంతో. ఇంకేం మాట్లాడాలో తెలియని స్థితి అది.
 
ధైర్యానికీ, వీరత్వానికీ, యుద్ధనైపుణ్యానికీ పరాకాష్ఠ ఆ రోజు కురుక్షేత్ర మహాసంగ్రామంలో  సమరవిజయ రాముడు సృష్టించిన చరిత్ర. అలాంటి అరుదైన రహస్యాన్ని మహిభార్గవుడి ద్వారా తెలుసుకోవటం పూర్వజన్మ సుకృతమే అని వాళ్లకు అనిపించింది.
 
సిద్ధపురుషుడితో కాసేపు ముచ్చటించాడు ఆ మహిభార్గవుడు.
ఆ తర్వాత అక్కడినుండి సెలవు తీసుకున్నారు సిద్ధపురుషుడు, అభిజిత్, అంకిత, సంజయ్ లు.
 
ఆ ప్రాంగణం బయటే ఉన్న సైనికుల దగ్గరికొచ్చి సిద్ధపురుషుడు ఇలా అడిగాడు.
 
"తరువాతి ప్రాకారం ఏది?"
 
" సూర్యః ప్రాకారం. అతి ముఖ్యమైనది ఇదే. శంభల నగరంలోని ఈ  సూర్యః ప్రాకారానికి సూర్యుణ్ణి అమితంగా ఆరాధించే దేవతలు కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చి బ్రహ్మ ముహూర్తాన విచ్చేసి పూజలు నిర్వహించి వెళ్తూ ఉంటారు", అని చెప్పాడు వాళ్లలో ఒక సైనికుడు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply
#44

శంభల నగరం – 5
సూర్యః ప్రాకారం
 
సూర్యః ప్రాకారంలో వున్న 7 సువర్ణ అశ్వాలను, రథ సారథి అనూరుడిని, ఆ రథచక్రాన్ని, మండలాన్ని చుట్టూ తిరిగి పరిశీలిస్తున్నారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.
"సూర్యుడు రావటానికి ఇంకా అరగంట సమయమున్నది. దయచేసి ఈ సమయాన్ని సూర్యారాధనలోనే గడపండి", అన్నాడు సిద్ధపురుషుడు.
 
సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మ ధరందేవం తం సూర్యం ప్రణమామ్యహం ||
 
ఆ ప్రాకారం చుట్టూతా నలు వైపులా ఆ ఆదిత్యుని మంత్రము సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నది.
 
"స్వామీ మాకు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని, మరియు సూర్యుని గురించి మేము తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలను చెబితే మీ నోట వినాలని మేము అనుకుంటున్నాము", అని ఆ సిద్ధపురుషుణ్ణి అడిగాడు సంజయ్.
 
"సూర్యుడి నుండే సప్త వర్ణాలు వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ 7 అశ్వాలు 7 రంగులని అర్థం.
 
కశ్యపుడు, అదితికి కలిగిన ద్వాదశ ఆదిత్యులు అంటారు. అందుకే ఆ శ్లోకంలో మీకు కశ్యపాత్మజం అని ఉంటుంది. ఒక సంవత్సరంలో వున్న 12 మాసాలలో  ద్వాదశ ఆదిత్యుల శక్తి ఒక్కో మాసంలో ఒక్కోలా ఉంటుంది.
 
ప్రకృతి సూర్యరశ్మి నుండే శక్తిని పొందుతోంది. ఆ ప్రకృతి నుండి వచ్చిన ఫల, జల, కందమూలాదులు తింటూ మనం పరోక్షంగా సూర్యుని ద్వారానే ఆహారాన్ని పొందుతున్నాము. ధర్మరాజు సూర్యుడిని నిష్ఠతో ప్రార్థిస్తే   అక్షయ పాత్రను వరంగా పొందాడు. సమస్త ప్రాణికోటికి ఆహారాన్ని, నీటిని ప్రసాదించేది ఆ సూర్యభగవానుడే కాబట్టి సృష్టికి మూలం అయ్యాడు. అలా సూర్యుడు సృష్టికర్త బ్రహ్మ అయ్యాడు.
 
వ్యాప్తి చెందినవాడే విష్ణువు అంటారు. అంతటా తన సూర్యప్రభతో వ్యాప్తి చెందినవాడే ఆ భాస్కరుడు.
 
ఆదిత్యానామహం విష్ణుః
 
 
జ్యోతిషాం రవి రంశుమాన్ | 
 
అంటే ఆదిత్యులలో వుండే విష్ణువును నేను , వెలిగించే రవిని నేను అని భగవద్గీతలో మనకు శ్రీ కృష్ణుడే స్వయంగా చెప్పాడు.
 
అన్నింటా మంగళాన్ని అనగా శుభాన్ని కలిగించే వాడే శివుడు. మన ప్రతీ ఉదయం సూర్యునితోటే మొదలవుతుంది. సూర్యుని కంటే ముందుగానే  బ్రాహ్మి ముహూర్తంలో  మనం నిద్రలేచి శుచిగా ఆయనను స్వాగతిస్తే అంతకంటే మంగళకరమైన రోజు మరొకటి ఉంటుందా?”, అని అడిగాడు ఆ సిద్ధపురుషుడు.
 
"బ్రాహ్మీ ముహూర్తం అనగా ఏది స్వామి?" అని అడిగాడు అభిజిత్.
 
"ఉదయం 3 గంటల నుండి 6 గంటల మధ్యనున్న కాలం", అని బదులిచ్చాడు సిద్ధపురుషుడు.
 
“ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంధః ప్రజాపతిః
అని అగస్త్యుడు రాముడికి చెప్పిన ఆదిత్య హృదయంలో మనకు కనిపిస్తుంది. అనగా సృష్టి, స్థితి, లయ కారకులైన ఆ త్రిమూర్తుల ఆత్మ చైతన్యాన్ని ఒక్క ఆదిత్యునిలోనే  మనం దర్శించుకోవచ్చునని అర్థం.
 
అగ్నిహోత్రంలో ఆహుతులు వెయ్యటం వల్ల అవి శక్తిగా మారతాయి. ఈ భూమి మీదున్న జలములన్నీ సూర్యమండలం అనే అగ్నిలో ఆహుతులు అవుతున్నాయి. మళ్ళీ తిరిగి అవి భూమికి సంపదలు ఇస్తున్నాయి. అందుకే సూర్యుడు యజ్ఞ స్వరూపుడు. అగ్నిహోత్ర స్వరూపుడు.
 
ఏష చైవాగ్ని హోత్రంచ ఫలం చైవాగ్ని హోత్రిణాం
అని మనకు ఆదిత్య హృదయంలో అగస్త్యుల వారు చెప్పిన రహస్యమిది.
అగస్త్యుని చేత ఆదిత్య హృదయం ఉపదేశింపబడిన మయూరుడు ఆ ప్రేరణతోనే  సూర్య శతకం రాసాడు. 
 
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్
అన్న సూక్తి మనందరికీ తెలిసినదే.
 
అలాంటి సూర్యుడి గురించి ఎన్నని చెప్పను? ఏమని చెప్పను?
ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆరోగ్య ప్రదాత. ఐశ్వర్య ప్రదాత.
 
ఆ సూర్యభగవానుడిని మనం ఈ శంభలలో దర్శించుకోగలుగుతున్నాం అంటే మనమెంతటి అదృష్టవంతులమో మీరే అర్థం చేసుకోండి”, అంటూ చెప్పటం ముగించాడు ఆ సిద్ధపురుషుడు.
 
సూర్యుడే మూడు వేదాలైన ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలకు నిలయం అంటారు. సూర్య మండలాన్ని ఋగ్వేద స్వరూపముగా, ఆ సూర్య మండలంలోని పురుషుణ్ణి యజుర్వేద స్వరూపముగా, సూర్యకిరణాలను సామవేద స్వరూపముగా చెబుతారు. ఆ ప్రాతః కాల సమయమున ఎందరో ఋషులు శంభలలోని  సూర్యః ప్రాకారానికి
విచ్చేసారు.
 
గంధర్వులు గానం చేస్తున్నారు. వారి స్వరాన్ని సూర్య నామార్చనతో పావనం చేసుకుంటున్నారు. సూర్యుని యందే లీనమైపోయి వారు చేస్తున్న ఆ గానం వింటే ప్రాతః కాల సమయమున సూర్యునికి స్వాగతం పలకని మానవజన్మ వృథా అనిపించింది అభిజిత్, అంకిత, సంజయ్ లకు.
 
అప్సరసలు తమ నాట్యముతో తమ సూర్యారాధనను అభివ్యక్తీకరిస్తున్నారు. సూర్యుడి మేలుకొలుపు ఇంత అందంగా ఉంటుందా అనిపించేలా ఉంది వారి నాట్యం. ఆ నాట్యాన్ని చూడటానికే శంభలకు సూర్యుడొచ్చాడేమో అన్నట్టు కళ ఉట్టిపడుతోంది ఆ నాట్య భంగిమలలో.
 
యక్షులు రథాన్ని ఒక్క చోటికి చేర్చారు. నాగులు రథాన్ని చుట్టుముట్టి ఉన్నారు. రాక్షసులు రథాన్ని వెనుకనుండి తోస్తూ ఉన్నారు. క్రతువు ఋషి సంతానమైన 60,000 మంది వాలఖిల్యులు రథం ముందు నిలిచి సూర్యభగవానుని స్తుతిస్తూ ఉన్నారు. వారు అంగుష్ఠప్రమాణ దేహం కలవారు అనగా బొటనవేలంత పరిమాణంలో ఉంటారు. వేదాలను అభ్యసించిన వారు. బ్రహ్మచారులు. పవిత్రమైన మనసుకలవారు ఈ వాలఖిల్యులు.
 
ఇంత మంది ఆ సూర్యభగవానుడిని స్తుతిస్తూ ఉండగా ఆ 
సూర్యః ప్రాకారం తేజోమయమై దివ్యముగా వెలిగిపోతోంది.
సూర్యభగవానుడు 10 నిమిషాలపాటు అఖండజ్యోతిలా ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్, అంకిత, సంజయ్ లు వారి పాదాలపై మోకరిల్లి ఆ భానుతేజానికి ప్రణమిల్లారు.
 
సిద్ధపురుషునికి సూర్యుని యందున్న వీరి భక్తి చూసి ఎంతో ముచ్చటేసింది. ఆయన కూడా వారిలో ఒకడై ఆ ప్రభాకరునిలో వున్న విష్ణు శక్తికి తన శిరస్సు వంచి ఏకాంగ నమస్కారం చేసాడు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
#45

శంభల నగరం – 6
విమలః ప్రాకారం - 1
సూర్యః ప్రాకారం నుండి  విమలః ప్రాకారం వైపుగా వారి అడుగులు పడ్డాయి. సైనికులిద్దరూ వారికి దారి చూపిస్తూ ఉండగా సంజయ్ ఆ సైనికులను ఇలా అడిగాడు.
 
"ఈ  విమలః ప్రాకారం గురించి మాకు కాస్త చెప్తారా?"
నడుస్తూ ముందుకెళ్తున్న వాళ్ళల్లో ఒకడిలా చెప్పాడు.
 
" విమలః ప్రాకారంలో  మీకు ఎందరో దేవతామూర్తులు కనిపిస్తారు. వాళ్ళందరూ జ్ఞాన ప్రదాతలు. వాళ్ళ గురించి మీరు అక్కడికి వెళ్ళాక సిద్ధపురుషుణ్ణి అడిగి తెలుసుకుంటేనే సబబుగా ఉంటుంది. నాకు తెలిసింది నేను చెప్తాను. ఈ 
విమలః ప్రాకారంలో మీకు ముముక్షువులు కనబడతారు. ఈ ముముక్షువులు అందరూ భూలోకం వారే. పైగా వీళ్లల్లో కళాకారులు, శాస్త్రవేత్తలు, విద్యావంతులు, క్రీడాకారులు, వైద్యులు...ఇలా ఎందరో కనిపిస్తారు. వాళ్ళల్లో మీరు చాలా మందిని గుర్తుపట్టగలుగుతారు. కానీ వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టలేరు. అయినప్పటికీ మీరు మాట్లాడే భాష మాత్రం మాట్లాడగలరు. 
 
విమలః ప్రాకారంలో పొద్దున్నే సంగీతం, గానం వినిపిస్తుంది. ఎందరో ప్రసిద్ధ వాయిద్య కారులు పోటీపడి మరీ తమ సంగీత ప్రావీణ్యాన్ని చూపిస్తారు. ఎందరో కవులు కూడా తమ సాహిత్యాన్ని మనకు వారి కంఠం ద్వారా వినిపిస్తారు.
అసలైన విశేషం ఇది కాదు.  కొంత మంది అరుదైన ప్రతిభ, శక్తి సామర్ధ్యాలు, సాధన కలిగిన కళాకారులకు మాత్రం ఒక అద్భుతమైన సువర్ణావకాశం దక్కుతుంది. అలాంటి వారు ఒకరో ఇద్దరో ఉంటారు. వీరు తమ కళను, సాహిత్య ప్రతిభను ఎవరి ఎదుట ప్రదర్శిస్తారో తెలుసా?", అని తన నడక ఆపేసి సంజయ్, అభిజిత్, అంకితల దిక్కు చూస్తూ అడిగాడు ఆ సైనికుడు.
 
ఎవరి ఎదుట ప్రదర్శిస్తారు ? అని అడుగుతున్నట్టు అనిపించేలా ఆ సైనికుడి వైపే ఆశ్చర్యంగా చూసారు వాళ్ళు.
 
" బాలా త్రిపుర సుందరీ దేవి ఎదుట", అని చెప్పి తన నడకను తిరిగి ప్రారంభించాడు ఆ సైనికుడు.
 
"ముముక్షువు అంటే ఎవరు స్వామి?" అడిగాడు అభిజిత్
 
"సాధనలో పరాకాష్ఠను చూసిన వారు....చివరిగా మోక్షం కోసమే ఎదురు చూసేవారెవరైనా సరే ముముక్షువుల కోవలోకే వస్తారు", అని సమాధానమిచ్చాడా సిద్ధపురుషుడు.
 
"మనం ఈనాడు  బాలా త్రిపుర సుందరీ దేవి దర్శనం చేసుకోగలిగితే శంభల నగరంలో మనకు శివుని అనుమతి దొరికినట్టే అనుకోవచ్చు", అన్నాడా సిద్ధపురుషుడు.
 
"అదెలాగ స్వామీ?" అడిగాడు అభిజిత్.
 
“బాలా త్రిపుర సుందరీ దేవి అంటే ఎవరనుకున్నావ్? లలితా అమ్మవారి హృదయం నుండి వచ్చిన 9 ఏళ్ళ చిరు ప్రాయమున్న బాలిక. ముగ్ధమనోహర సౌందర్యమున్న శక్తి రూపిణి. దశ మహావిద్యలలో మూడవదైన శ్రీవిద్యకు మూలమే ఈ బాలా త్రిపుర సుందరీ దేవి. ఈవిడ చూపులు మన మీద పడినా చాలు. ఆ శక్తితో మనం ఎంతో సాధించవచ్చు. శంభల రాజ్యంలో మీరు నేర్చుకోవాల్సిన ఎన్నో విద్యలు అతి సులువుగా మీకు ప్రాప్తిస్తాయి", అన్నాడు ఆ సిద్ధపురుషుడు.
 
"స్వామీ ఈ ప్రాకారానికి  విమలః ప్రాకారం అన్న పేరెందుకు వచ్చిందో చెప్తారా?" అడిగాడు సంజయ్.
 
" విమల అనగా ఎలాంటి మలినం లేనిదని అర్థం. అలా ఏ మాలిన్యము లేకుండా ఉండేది జ్ఞానమే. ఈ ప్రాకారంలో మనకు జ్ఞానం దొరకటం మాత్రమే కాదు, మనలోని అజ్ఞానం కూడా దూరం అయ్యే మార్గం దొరుకుతుంది. అజ్ఞానం అన్నది అంధకారమే. ఆ అంధకారం వున్నప్పుడే మనలో చెడు ప్రవృత్తులు ప్రవేశిస్తాయి. అజ్ఞానాన్ని జ్ఞానం ద్వారానే ఛేదించాలి. అందుకే ఇక్కడ ఎంతో మంది జ్ఞాన దేవతలు ఉంటారు. ఈ విమలః ప్రాకారం లో వాక్దేవతల గురించి మనకు తెలుస్తుంది. హయగ్రీవుని ఆరాధన మనకు కనిపిస్తుంది. జ్ఞాన సరస్వతీ దేవి ఆరాధన కనిపిస్తుంది. శివపార్వతుల కుమారుడైన షణ్ముఖుని ఆరాధన కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ విమలః ప్రాకారమే శంభల లోని జ్ఞాన నిధి అని చెప్పవచ్చును. పయోనిధి అని కూడా చెప్పవచ్చు", అన్నాడా సిద్ధపురుషుడు.
 
"స్వామీ, పయోనిధి అంటే?" అంటూ అడగాలా వద్దా అన్నట్టు చూసాడు అభిజిత్
 
"అనంతమైన సముద్రమని అర్థం. దాశరథి కరుణాపయోనిధీ అన్న దాశరథి శతక పద్యాలు మనందరం విన్నాం కదా", అన్నాడు సిద్ధపురుషుడు.
 
అంతలోనే  విమలః ప్రాకారం చేరుకున్నారు వారు. వీరిని స్వాగతిస్తూ అక్కడికి కొందరు వచ్చారు. వారు శంభల నగర వాసులు.
 
"మీరు భూలోక వాసులని మాకర్థం అయింది. కొన్ని ఘడియల్లో ఇక్కడ  ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ప్రదర్శన ఇవ్వబోతున్నారు. మీరు ఇచట ఆసీనులు అవ్వండి", అంటూ వారికి తమ చోటును చూపిస్తూ,"మీరు బిస్మిల్లా ఖాన్ గారి ప్రదర్శనలు భూలోకంలో ఎన్నో సార్లు చూసి ఉంటారు. కానీ ఈ రోజు ఈ శంభలలో మీరు చూడబోయేది మాత్రం
న భూతో న భవిష్యతి అన్న రీతిగా ఉండబోతోంది. ఎందుకంటే బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయి వినటానికి 
బాలా త్రిపుర సుందరీ దేవి స్వయంగా విచ్చేస్తోంది.
 
శ్రీవిద్యోపాసన ఉంటే గాని మనకు కనబడని ఆ శక్తి రూపిణి కేవలం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి కళను కళ్లారా మనతో కలిసి చూడాలనే తపనతో ఆవిడే స్వయంగా శంభలలోని ఈ విమలః ప్రాకారానికి తరలి వస్తోంది. ఆయన కళ వల్ల మనకు ఆవిడ స్వయం ప్రకటితం అయ్యి కనబడుతోంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. బిస్మిల్లా ఖాన్ లాంటి అనర్ఘరత్నాలకే ఆ అర్హత దక్కుతుంది. ఆయన సాధన అలాంటిది మరి. వారణాసిలోని బాలాజీ మందిరంలో అతి లేత ప్రాయంలో ఆయన సాధన మొదలుపెట్టారు. అక్కడి బాలాజీ శక్తిని ఆయన మాత్రమే గుర్తించగలిగారు. గుడికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. పోతూ ఉంటారు. ఆయన మాత్రం అక్కడే ఉండి కొన్ని గంటల పాటు షెహనాయి సాధన చేసేవారు. ఆ గుడి బయటే ఉండి అక్కడి రాతిని తన చేతితో స్పృశించి దైవీ అనుభూతికి లోనయ్యారు. ఆయన షెహనాయి విన్న పూజారి ఆ రోజుకు ఆయనకు లోటు లేకుండా తినటానికి తన దగ్గరున్నది ఇచ్చేవారట. అలాంటి బిస్మిల్లా ఖాన్ గారు పుట్టిన భారత దేశం నుండి వస్తున్న మీకు మా ధన్యవాదములు", అనేసి అక్కడి నుండి వెళ్లిపోయారు వాళ్ళు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
#46

సిద్ధపురుషుడి కళ్ళు చెమర్చాయి.
 
"ఆ మహానుభావుడిది ఎంతటి గొప్ప అదృష్టం. కళలకు, జ్ఞానానికి నిలయమైన ఆ బాలా త్రిపుర సుందరీ దేవి ఎదుట తన కళను ప్రదర్శించటమా! ఇతను సామాన్య మానవుడు కాదు. సంజయ్,  ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గురించి నీకు తెలిసింది చెప్తావా? ఆయన గురించి నాకు ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంది", అని అడిగాడు సిద్ధపురుషుడు.
 
సంజయ్ కి బిస్మిల్లా ఖాన్ గారి గురించి పెద్దగా తెలియదు.
 
"మీకు అభ్యంతరం లేకపోతే నేను చెప్తాను స్వామీ", అన్నాడు అభిజిత్.
 
"ఎవరైతే ఏముంది? ఆ మాహానుభావుడి గురించి తెలుసుకోవటమే నాకు ముఖ్యం. చెప్పు, అభిజిత్", అన్నాడు ఆ సిద్ధపురుషుడు.
 
 
"బిస్మిల్లా ఖాన్ గారికి  భారత రత్న అనే గొప్ప గౌరవాన్ని ఇచ్చింది భారత కేంద్ర ప్రభుత్వం. ఎంతో మందికి భారత రత్న వచ్చి ఉండవచ్చు. కానీ బిస్మిల్లా ఖాన్ గారికి  భారత రత్న రావటం ఆయనకు గౌరవం కాదు. ఆయనని వరించటం భారత రత్నకు దక్కిన గౌరవం అని భావించారు. అంతటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ' సుర్ ఏక్ హయ్....భగవాన్ ఏక్ హయ్.....దునియా మే కళా జిస్ కే పాస్ హోతీ హయ్ వో అకేలా హయ్....క్యోన్కి వో ఏక్ హీ హయ్....అన్మోల్ రతన్ ఏక్ హీ హోతే హయ్....దో కభీ నహి హో సక్తే' అన్నారు. అంటే ఈ ప్రపంచంలో దేవుడు అనే శక్తి ఒక్కటే. సుస్వరాలను అవలీలగా పలికించగలిగే స్వరం ఒక్కటే. కళ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు ఒంటరిగానే ఉంటారు. వారిలా కళను ప్రదర్శించే మరొకరు మనకు ఎప్పటికీ కనబడరు. ఎందుకంటే వెలకట్టలేని మణి ప్రపంచంలో ఒక్కటే ఉంటుంది. రెండు ఎప్పటికీ ఉండవు అన్నారు. అనటం మాత్రమే కాదు ఆయన తన జీవితాంతం అదే సిద్ధాంతంతో బ్రతికారు. ఆయనని దగ్గర నుంచి గమనించిన వారు చెప్పేది ఏంటంటే ఆయనకి వారణాసి అంటే చాలా భక్తి అని. ఒకసారి పాశ్చాత్య దేశాలలో ఎక్కడో షెహనాయి ప్రదర్శన ఇవ్వటానికి వెళ్లాల్సి వచ్చిందంట. ఆయనకి తన మాతృదేశాన్ని వదిలి వెళ్ళటం ఎంత మాత్రం ఇష్టం లేదట. వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ కాశీ విశ్వనాథుణ్ణి తలుచుకుని అక్కడికి వెళ్ళారంట. అక్కడ ప్రదర్శన ఇచ్చి తిరిగి కాశీకి రాగానే షెహనాయిని గంగలో ముంచి కడిగారంట. ఎందుకు అని అడిగితే  నా షెహనాయి అపవిత్రం అయిపోయింది....అందుకే ఈ గంగాజలంతో తిరిగి పావనం చేస్తున్నాను అని సమాధానం ఇచ్చారంట. ఆయనకు కుల మత భేదాలు తెలియవు. తాత్విక చింతనతో బతికిన గొప్ప కళాకారుడు ఆయన. ఆయన నవ్వితే పసిపాప నవ్వినట్టుగా ఉంటుంది.
ఆయన బాధపడితే మన హృదయం ద్రవించిపోతుంది. ఆయన కంఠంలోనే షెహనాయి ఉందేమో అనిపిస్తుంది ఆయన గానం విన్నవారికి. అంత గొప్ప స్వరజ్ఞానం ఉంది. ఒకసారి రాగభైరవి లో అల్లాహ్ గురించి పాడి మతపరంగా తన విద్యను తప్పుబట్టాలని చూసిన ఒక మౌలానా నోరు మూయించారు. కళకు, దేవుడికి కుల, మత, వర్ణ భేదాలేంటి అంటూ ఆయన నవ్వేసేవారు. ఆయనే షెహనాయి. షెహనాయినే ఆయన. మనుషుల్లో దేవుడిలా బతికాడాయన. దేవుడికి దగ్గరగా బతికాడాయన. ఈ రోజు ఆ దేవుడి ముందే షెహనాయిని ప్రదర్శిస్తున్నాడాయన.
 
ఇది ఆయనకే సాధ్యం", అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు అభిజిత్.
 
సంజయ్, అంకితలు ఇద్దరూ ఆశ్చర్యపోతూ అభిజిత్ వంకే చూస్తున్నారు.
 
"బిస్మిల్లా ఖాన్ ఒక వ్యక్తిగా ఎలాంటి వారో నాకు పరిచయం చేసావు, అభిజిత్. నీలో చాలా లోతుంది. పైకి ఏమీ తెలియనట్టు ఉంటావు కానీ, నీకు చాలా తెలుసు. నీలో ఉన్న విద్యార్థిని ఇలానే ఉంచుకో. నీకు తిరుగుండదు", అన్నాడా సిద్ధపురుషుడు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
#47

శంభల నగరం – 7
విమలః ప్రాకారం - 2

దర్శించుకోవలసినవి ఇంకా ఎన్నో మిగిలే ఉన్నాయి. ముందుకు వెళుతూ ఉండగా వారికి మొట్ట మొదట కనిపించినది ఈ  జ్ఞాన కుంభము
 
జ్ఞాన కుంభములో ఉండే జలం స్వర్వాహినీ నదిలోనిదే అయినప్పటికీ ఆ జ్ఞాన కుంభాన్ని విమలః ప్రాకారంలోని జ్ఞాన దేవతలందరికీ తెల్లవారుఝామునే నివేదన చెయ్యటం చేత ఒక పవిత్రత సంతరించుకుని తీర్థం అయిపోతుంది.

జ్ఞాన కుంభములోని తీర్థాన్ని మూడు పర్యాయాలుగా ఒక క్రమంలో తీసుకోవాలి. అందులోఒక పరమార్థం దాగుంది.

మొదటి సారి తీర్థం తీసుకున్నప్పుడు  బుద్ధికి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ పవిత్రతను ఇచ్చే  హయగ్రీవుణ్ణి తలుచుకుంటూ తీసుకోవాలి.
 
రెండో సారి తీర్థం తీసుకునేటప్పుడు  మనసును జ్ఞానం వైపుకు మళ్లిస్తూ పవిత్రతను చేకూర్చే  షణ్ముఖుణ్ణి  స్మరించుకుంటూ తీసుకోవాలి.
 
మూడో సారి తీర్థం తీసుకుంటున్నప్పుడు నిర్మలమైన
బ్రహ్మజ్ఞానాన్ని ఏ నాటికైనా ప్రసాదించమని కోరుతూ  సరస్వతీ స్తుతిస్తూ తీసుకోవాలి.
 
ఆ జ్ఞాన కుంభము దగ్గర ఒక ముముక్షువు ఉంటాడు. అక్కడికి వచ్చిన వారందరికీ ఆయనే తీర్థాన్ని అందిస్తాడు.
 
హయగ్రీవుణ్ణి, షణ్ముఖుణ్ణి, జ్ఞాన సరస్వతీ దేవినీ దర్శించుకోకుండా అక్కడ తీర్థాన్ని స్వీకరించకూడదు.
 
ఆ జ్ఞాన కుంభము దాటిన తరువాత వాళ్లకు అక్కడొక మందిరం కనిపించింది.
 
దురిత నివారితః
అని వ్రాయబడి ఉన్నది. అదేమిటో తెలుసుకుందామని ముఖద్వారం దగ్గరికెళ్ళారు అభిజిత్, అంకిత, సంజయ్ లు. సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు మాత్రం దూరం నుంచే వీళ్ళను గమనిస్తున్నారు.
 
ముఖద్వారం దగ్గరే ఒక ముముక్షువు ఉన్నాడు. వారిని సాదరంగా లోనికి ఆహ్వానించాడు.
 
"మీకు నేనే విధముగా సాయపడగలను?" అని అడిగాడు ఆయన.
 
"మాకు ఈ మందిరం గురించి విపులంగా చెప్తారా?" అని అడిగాడు సంజయ్.
 
“దురిత నివారితః” అని పైన వ్రాయబడి ఉంది కదా. అనగా ఈ చోటు మీ పాపములను పూర్తిగా తొలగించి వేస్తుందని దానర్థం ", అని బదులిచ్చాడు ఆ ముముక్షువు.
 
"పాపములు అనగా ఏవి స్వామి?" అడిగాడు అభిజిత్.
 
"విమలః ప్రాకారంలో పాపం అంటే అజ్ఞానం అనే అర్థం. అజ్ఞానం చేతనే ఎన్నో తప్పిదాలు జరుగుతాయి", అన్నాడా ముముక్షువు.
 
"అంటే ఇక్కడ అజ్ఞానాన్ని పూర్తిగా తీసేస్తారా స్వామి?" అని అమాయకంగా అడిగింది అంకిత.
 
"అజ్ఞానాన్ని తీసివెయ్యటం అంటూ ఏమీ ఉండదు. ఎప్పటికప్పుడు జ్ఞానసముపార్జనతోనే మనం అజ్ఞానాన్ని దూరం చేసుకుంటూ ఉంటాం", అన్నాడు ఆ ముముక్షువు.
 
"అంటే ఇక్కడ గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఉంటాయా స్వామి?" అని అడిగాడు సంజయ్.
 
"అవేవీ ఇక్కడుండవు. ఇక్కడి నుండి కొంత దూరంలో ఉన్న జ్ఞాన శిఖ  అనబడే ఒక గ్రంథాలయములో మీకు అవన్నీ దొరుకుతాయి. అక్కడ దొరకనిది అంటూ ఏదీ లేదు. మీరేది తెలుసుకోవాలని ఆరాటపడినా అక్కడ ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన విషయ సంపదంతా మీకు దొరుకుతుంది", అన్నాడా ముముక్షువు.
 
"మరి ఈ మందిరం విశిష్టత ఏమిటి స్వామి?" అని అడిగాడు అభిజిత్.
 
"ఇక్కడ మీరు ఎన్నో విషయాలను మరిచిపోవచ్చు. అలా మరిచిపోవటానికి ఇక్కడ మీకు మూడు ద్వారాలు ఉన్నవి", అని కాసేపు ఆగి ఆ మందిరం మొత్తాన్ని చూపిస్తూ
"ఈ మందిరంలో మొత్తం మూడు వాకిళ్లు ఉన్నాయి. అనగా మొత్తం మూడు అరలు అన్నమాట", అన్నాడా ముముక్షువు.
 
అర అంటే ఏమిటి?
 
అన్నట్టు సందేహంగా చూస్తున్నాడు అభిజిత్. దాన్ని అర్థం చేసుకున్న ముముక్షువు వెంటనే ఇలా అన్నాడు.
 
"ఇక్కడ ఉండే వాటిని గదులు అనకూడదు. గడపలు ఉండవు కాబట్టి ఇవి గదులు కావు. అందుకే అరలు అన్నాను. గడపను దేహళి అంటారు. ఒక గృహము నందు వేర్వేరు గదులు ఉంటాయి. ప్రతీ గదికీ ఒక గడప ఉంటుంది. గడపను తొక్కరాదు. గడప మీద కూర్చోకూడదు. గడపకు పసుపు, కుంకుమ పెట్టాలి. గడప లక్ష్మీ దేవి స్వరూపం కనుకనే ఈ మందిరంలో ఉన్న మూడు ద్వారాలకూ వాటిని అమర్చలేదు. అజ్ఞాన అంధకారాన్ని మొత్తం తీసేసుకునే మూడు అరలు ఇవి. ఈ మందిరంలోకి అడుగుపెట్టే ముందు మాత్రం మీరొక గడపను చూసి ఉంటారు. అక్కడ దైవ ప్రతిష్ఠ జరిగింది. అందుకే ఆ మొదటి వాకిలికి మాత్రమే గడప ఉంటుంది", అని చెప్పటం ముగించాడు.
 
ఆ మూడు వాకిళ్ళనూ వారికి చూపిస్తూ ఆ ముముక్షువు ఇలా అన్నాడు.
 
"మొదటి వాకిలి ద్వారా వెళితే మీలో ఉన్న మానసికమైన మలినాలు అన్నీ దూరం అవుతాయి. అనగా మీలో ఉన్న మోహం, ప్రాపంచిక విషయాల పట్ల మీకుండే భ్రమలు, అజ్ఞానం వల్ల కలిగే కోపాలు...ఇలా అన్నీ తొలగిపోతాయి.
 
రెండవ వాకిలి ద్వారా వెళితే మీలో ఉన్న  బుద్ధి జాడ్యాలు అన్నీ తొలగిపోతాయి.అటు పిమ్మట మీకు సజ్జనుల సాంగత్యము దొరుకుతుంది. బుద్ధిలో పుట్టే జాడ్యాలన్నిటికీ కారణం దుర్జనుల సాంగత్యమే అన్నది నిర్వివాదాంశం.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
#48

మూడవ వాకిలి ద్వారా వెళితే మీలో ఉన్న ఆత్మస్తుతి అనే దోషము పూర్తిగా తొలగిపోతుంది. అన్నిటికీ నేనే కారణం. అంతా నా వల్లే జరుగుతోంది. అసలు నేను లేకపోతే ఇదంతా సాధ్యపడుతుందా? ఇలా ప్రతీ చిన్న విషయానికి ఆత్మస్తుతి చేసుకోవటం అలవాటైన వారికి ఈ వాకిలి ద్వారా వెళితే వారిలోని ఆత్మచైతన్య శక్తి జాగృతం అయ్యి అసలైన బ్రహ్మజ్ఞానం మీద జిజ్ఞాస పెరుగుతుంది. హరినామ సంకీర్తనతో మీ జన్మ సార్థకం అవుతుంది", అన్నాడు ఆయన.
 
హరినామ సంకీర్తనతో మీ జన్మ సార్థకం అవుతుంది
అన్న మాటలు ఆ ముముక్షువు చెబుతున్నట్టుగా వారికి అనిపించలేదు. ఆ మాటలు ఆయన నోటి వెంట వస్తున్నప్పుడు ఆ ముముక్షువునే చూసారు అభిజిత్, అంకిత, సంజయ్ లు. ఆ ముముక్షువుకి బదులుగా సిద్ధపురుషుడు కనిపించాడు వారికి. ఒక్క క్షణం నిర్ఘాంతపోయారు ముగ్గురూ.
 
"స్వామీ, చివర్లో మీరు బ్రహ్మ జ్ఞానం మీద జిజ్ఞాస పెరుగుతుంది అన్నారు కదా?" అడిగాడు సంజయ్.
 
"అవును", అన్నాడా ముముక్షువు.
 
"హరినామ సంకీర్తనతో మీ జన్మ సార్థకం అవుతుంది అని మీరు అనలేదా?" అడిగాడు అభిజిత్.
 
"అలా నేనలేదే", అన్నాడా ముముక్షువు.
 
అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆశ్చర్యపోయి చూస్తుంటే ఆ ముముక్షువు ఇలా చెప్పాడు.
 
"మీతో వచ్చిన ఆ సిద్ధపురుషుడిలో  ఋతంభర ప్రజ్ఞ వున్నది. నిరంతరమైన తపస్సు చేత, సాధన చేత ఆయనలో జాగృతం అయిన ప్రజ్ఞ అది. ఈ ప్రజ్ఞ ఆయన పొందటం వల్లే ఇంద్రియాలకు అతీతంగా చూడగలిగే ఒక దృష్టి ఆయన సొంతమయ్యింది. ఇప్పుడు ఆయన మీతో లేకపోయినప్పటికీ ఆయన శక్తి మీకు రక్షణ కవచంలా మీ చుట్టూ వున్నది. అందుకే మీకు ఆ వాక్యం వినిపించింది. ఇందులో అంతగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఆనందపడాల్సిన విషయమిది. అంతటి ప్రజ్ఞ కలిగిన ఆ సిద్ధపురుషుడు మీకు లభించటం మీరు చేసుకున్న పుణ్యఫలం. మీరెంతో అదృష్టవంతులు.
 
ఋషులు తపః శక్తితో సాధించిన శాశ్వత సత్యాల సమాహారమే వేదము. అలాంటి వేదాన్ని అర్థం చేసుకునే దృష్టి ఆ సిద్ధపురుషుని సొంతం. అలాంటి సిద్ధపురుషుడు మీకు గురువు అయ్యాడు. ఇంతకంటే మీకు కావలసినది ఏముంది?" అన్నాడు ఆ ముముక్షువు.
 
ఆ ముముక్షువుకు నమస్కరించి ఆయన నుండి సెలవు తీసుకున్నారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.
 
ఆ మందిరం నుండి బయటకి రాగానే అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆ సిద్ధపురుషునికి అక్కడే పాదాభివందనం చేశారు. వారెందుకు అలా చేశారో సిద్ధపురుషునికి ఏం అర్థం కాలేదు.
 
"స్వామీ ఈ మందిరానికి వెళ్ళాక మాకు మీరేంటో అర్థం అయ్యింది", అని భావోద్వేగంతో చెప్పాడు అభిజిత్.
 
"ఈ మందిరాన్ని గుర్తు పెట్టుకోండి. మనం మళ్ళీ ఇక్కడికి రావలసి ఉంటుంది", అని చిరుమందహాసంతో అభిజిత్, అంకిత, సంజయ్ లను చూస్తూ సిద్ధపురుషుడు అన్నాడా మాట.
 
ఇద్దరు సైనికులూ వారికి దారి చూపిస్తూ ముందుకెళ్తున్నారు. వారు విమలః ప్రాకారంలోని హయగ్రీవుణ్ణి, షణ్ముఖుణ్ణి, వాగ్దేవతలను, జ్ఞాన సరస్వతీ దేవిని దర్శనం చేసుకున్నారు. ఆ తరువాతే జ్ఞాన కుంభములోని తీర్థాన్ని మూడు మార్లు స్వీకరించారు.
 
శంభల రాజ్యంలో తారా దేవి అన్న సరస్వతీ శక్తి రూపం ఉంటుంది. శత్రువులను మాటలతో సంహరించగల శక్తిని ఇస్తుంది. నీలమైన రంగులో ఉండే రూపం ఈ తారాదేవిది. తారా దేవి గురించి అభిజిత్, అంకిత, సంజయ్ లకు పరిచయం చేసాడు ఆ సిద్ధపురుషుడు. వారికి ఏదైతే తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదో అది మాత్రమే చెబుతూ ఉంటాడు. అడిగితే తప్ప ఒక్క వాక్యమైననూ ఎక్కువ చెప్పడు. వాక్కు మీద ఆ సిద్ధపురుషునికి ఎంత పట్టుందో చెప్పటానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.
 
విమలః ప్రాకారంలోని జ్ఞాన దేవతలను దర్శించుకున్న తర్వాత, వారు  జ్ఞాన శిఖ గ్రంథాలయానికి వెళ్లారు. అక్కడున్న జ్ఞాన సంపదనంతా కళ్లారా చూసి ఆశ్చర్యపోయారు. అన్ని పుస్తకాలున్నాయి అక్కడ. జ్ఞాన శిఖ దాటిన తర్వాత జ్ఞాన దీపికలు అనబడే కేంద్రాలు 9 ఉన్నాయి. ఆ 9 జ్ఞాన దీపికలలో శాస్త్రవిద్యను క్షుణ్ణముగా అధ్యయనం చేసిన విద్యావేత్తలైన ముముక్షువులు ఉంటారు. వేదవిద్యను అభ్యసించిన ముముక్షువులు కూడా ఉంటారు. వాళ్ళందరూ సందేహ నివృత్తి చేస్తారక్కడ.

అలా విమలః ప్రాకారాన్ని మొత్తంగా సందర్శించాక వారు అక్కడి నుండి అభయః ప్రాకారానికి బయలుదేరారు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
#49

శంభల నగరం – 8
అభయః ప్రాకారం
 
సమరవిజయ రాముని కోసం శంభల నగరానికి విచ్చేసిన ఆ శ్రీకృష్ణుడు శంభలలో నడయాడిన ప్రాంతమే ఈ  అభయః ప్రాకారం. ఆయన ఎంతో దీక్షతో సదాశివుని జపం చేసి, మౌనాన్ని ధరించి లలితా దేవి ధ్యానంలోనే గడిపారు. అలాంటి ఈ అభయః ప్రాకారంలో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి చేతుల మీదుగా ఒక చెట్టును ప్రతిష్ఠించటం జరిగింది. అదే కల్పవృక్షము.
 
ఈ కల్పవృక్షం క్షీర సాగర మథనంలో పుట్టింది. దేవతలకు రాజైన ఇంద్రుడి చెంతకు చేరింది. మనం కోరిన కోరికలను తీర్చే చెట్టు ఇది. శ్రీకృష్ణుడు అమ్మవారిని ధ్యానం చేసి అలాంటి అరుదైన కల్పవృక్షాన్ని కోరగా ఆ లలితాదేవి వరంగా ప్రసాదించినది.
 
ఆ కల్పవృక్షాన్ని ఇక్కడ స్థాపన చేసిన తరువాత సమరవిజయ రామునితో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు.
 
“ఈ కల్పవృక్షానికి ఒక విశిష్టత ఉన్నది. భవిష్యత్తులో భూలోకవాసులు ఈ శంభలకు విచ్చేస్తారు. ఒకానొక సమయంలో భూలోకంలోని వారికి అగమ్యగోచరమైన స్థితి ఏర్పడుతుంది. పాతకులు అల్లకల్లోలాన్ని సృష్టిస్తూ ఉంటారు. ప్రపంచం మొత్తం ముష్కరులతో నిండిపోయి ఉంటుంది. అలాంటి విపత్కర పరిస్థితులలో కొంతమంది మానవులు ఈ శంభలకు శరణార్థి పొందటం కోసం వస్తారు. వాళ్ళు సామాన్య మానవులే అయినప్పటికీ వారి పూర్వీకులు చేసిన పుణ్య కర్మల వల్ల వారికి సిద్ధపురుషుల సాంగత్యం దొరుకుతుంది. అలా వారికి శంభలలో అడుగుపెట్టే యోగ్యత దక్కుతుంది.
ప్రపంచాన్ని పాపం నుండి, పాపుల నుండి విముక్తి చేసే శక్తిని పొందాలంటే కల్పవృక్షానికున్న ఈ కుసుమాలతో శక్తి పీఠమునందున్న అమ్మవారిని వారు పూజించాలి. శ్రద్ధతో పూజించినప్పుడు మాత్రం దివ్యశక్తులే వారిని వరిస్తాయి. అవి సరిగ్గా లోకానికి ఉపయోగపడతాయి.”
 
ఆ రోజు నుండి ఈ అభయః ప్రాకారంలోని  కల్పవృక్షాన్ని ఎంతో పవిత్రంగా ఆరాధించటం జరుగుతున్నది. శంభల రాజ్యంలోని రాజైన అనిరుద్ధుల వారికి అమ్మవారిని ఈ కుసుమాలతో పూజించటం అంటే ఎంతో ఇష్టం. ఒక సంకల్పం, ఒక లక్ష్యం, ఒక కోరిక లేకుండా అమ్మవారిని పూజించటం శాస్త్ర విరుద్ధమైన చర్య అవుతుంది. పైగా అమ్మవారిని కోరుకునే కోరిక లోకకల్యాణం కోసమే అయ్యి ఉండాలి. వ్యక్తిగతమైన వాంఛలు నెరవేరటం కోసం అమ్మవారిని కల్పవృక్షం కుసుమాలతో సేవిస్తే అది లోకానికే అరిష్టం. ఈ ధర్మసూక్ష్మం తెలుసు కాబట్టే అనిరుద్ధుల వారు తన మనస్సులోనే సహస్ర నామ పఠనం చేస్తూ ఆ దేవిని భక్తితో కొలుస్తారు.
 
అభయః ప్రాకారంలో ఎన్నో అద్భుతాలుంటాయి. శ్రీకృష్ణుడు ఎంతో కఠిన దీక్షతో ధ్యానంలో గడిపిన స్థలమిది. అందువల్ల ఆయన ధ్యానించిన చోటు శాశ్వతంగా ఒక  శక్తి వలయంలా  మారిపోయింది. ఆ వలయం చుట్టూ ఉండే అగ్ని నిరంతరం ఒక జ్యోతిలా ఎర్రటి కాంతితో వెలుగుతూ ఉంటుంది. ఆ వలయం మధ్యలో సూర్యుని కిరణాలన్నీ ఒక్క చోట చేరినట్టుగా ఉండే కాంతి పుంజం మనకు కనబడుతుంది. ఆ కాంతి పుంజం రంగు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అరుణ వర్ణం, నీలమేఘ వర్ణం, హరితవర్ణం.,ఇత్యాది వర్ణములను ఈ కాంతిపుంజంలో మనం దర్శించుకోవచ్చు. మనలో వున్న దైవీభావాలను ద్విగుణితం చేసే అరుదైన దర్శనమిది.
 
 
కల్పవృక్షాన్ని,  శక్తి వలయాన్నిదర్శించుకున్నారు అభిజిత్, అంకిత, సంజయ్ లు. సిద్ధపురుషుడు ఆ శక్తి వలయం దగ్గరే తగిన చోటు చూసుకుని అక్కడే ఆసీనుడై ధ్యానం చేసుకుంటున్నాడు. వారితో వచ్చిన ఆ ఇద్దరు సైనికులు సిద్ధపురుషునికి దగ్గరలోనే ఒక రాతి బండ మీద కూర్చుని ఉన్నారు.
 
అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆ ప్రదేశాన్నంతా పరిశీలనగా చూస్తున్నారు.
ఇంతలో అక్కడికొక కపిల గోవు వచ్చింది. ఆ కపిల గోవు మెడకి గంటలు కట్టి ఉండటంతో అది నడుస్తూ ముందుకెళ్తున్న కొద్దీ ఆ గంటల శబ్దం చెవులకు మధురంగా వినిపిస్తోంది. ఆ కపిల గోవునే అనుసరిస్తూ వారు ముందుకు కదిలారు. అక్కడొక గోశాల కనబడింది. సున్నితత్వానికి ప్రతీకలా, సాత్విక గుణాలకు పెన్నిధిలా, సచ్ఛీలతకు సదనములా అనిపించినదా గోశాల.
 
అభిజిత్, అంకిత, సంజయ్ లు భారత దేశంలో ఎన్నో సార్లు గోవులను చూసారు కానీ ఇక్కడున్న గోవులను మాత్రం ఇంతక్రితం ఎప్పుడూ వారు చూడలేదు. గోలోకంలోని గోవులలా అనిపించాయి వాళ్లకి. ఆ గోవులను సంరక్షించే ఉద్ధారకుడు వారికి అక్కడ కనిపించాడు. విచిత్రం ఏంటంటే ఆయనొక ముముక్షువు. భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో గోవులకు ఇలాగే సేవ చేసుకునేవాడు. గోసేవలో తరించిపోయేవాడు ఆయన.
 
అభిజిత్, అంకిత, సంజయ్ లను చూడగానే ఆ ఉద్ధారకుడు వారిని సమీపించి ఆ గోశాల గురించి ఇలా వివరించటం మొదలు పెట్టాడు.
“శ్రీకృష్ణుడు శంభల నగరంలో చాలా రోజులు ధ్యానంలో గడిపారు. సమరవిజయరాముడు చేసుకున్న అదృష్టం వల్ల శ్రీకృష్ణుడిని సేవించుకునే భాగ్యం శంభలకు కలిగింది. ఆయన గోవులు లేకుండా ఉండలేడు. శంభలకు కపిల గోవులను ఆయనే వరంగా ప్రసాదించాడు. ఆ రోజు నుండి శంభలలోని శివుని ఆలయంలో ఆ మహాదేవునికి  క్షీరాభిషేకం చెయ్యటమనే ప్రక్రియ మొదలయ్యింది. ఇక్కడి గోవు పాలనే శివుని అభిషేకానికి వినియోగిస్తారు. గోవులను సూర్యుని కిరణాలుగా, సూర్యమండలంలోని యజ్ఞపురుషుడిని గోవిందుడిగా భావిస్తూ ఇక్కడ సూర్యారాధన చేస్తారు.
 
 గోబ్రాహ్మణేభ్యహ శుభం భవతు అని వేదాలలో పఠిస్తారు. గోవులకు బ్రాహ్మణుల కంటే ముందు స్థానాన్ని ఇచ్చి వారికి శుభం కలుగుగాక అని మన ప్రార్థనలో మనం దేవుణ్ణి కోరుకుంటాం అన్నమాట. ఎంత గొప్ప భావన అది.
 
ఇక్కడ మీరు చూసేవి కపిల గోవులే అయినప్పటికీ ఇవన్నీ 
కామధేనువు నుండి వచ్చినవి. ఇక్కడున్న ప్రతీ కపిల గోవూ గోమాతగా ఉన్న దేవతే అనర్థం. వీటికి చావూ పుట్టుకలతో సంబంధం లేదు. శంభలలోని ఈ అభయః ప్రాకారంలో శ్రీకృష్ణుడిని సేవించుకుంటూ ఉంటాయి. దయచేసి మీరు ఈ కపిల గోవులను దేవతలలానే చూడండి. ఈ గోశాలలో ఉన్న ఏ కపిల గోవుకు మీరు సేవ చేసుకున్నా సరే దేవతలకు అభిషేకం చేసినంత ఫలం మీకు దక్కుతుంది.”
 
ఆ ఉద్ధారకుడి సూచనలు అనుసరిస్తూ అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆ గోశాలలోని కపిల గోవులకు సేవ చేసుకున్నారు.
 
అక్కడి నుండి కాస్త ముందుకెళ్ళగానే వాళ్లకి వేణు నాదం వినిపించింది. వేణుగానం చేస్తున్న ఒక ముముక్షువు కనిపించాడు వాళ్ళకి. సమ్మోహన పరిచేలా ఉందా వేణుగానం.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
#50

ఆ ముముక్షువు వేణు గానం చేస్తున్నంత సేపూ ఆ ప్రాంగణం అంతా కృష్ణమయం అయిపోయింది. అభిజిత్, అంకిత, సంజయ్ లు ఏదో తెలియని ఓ దివ్యానుభూతికి లోనయ్యారు. శ్రీకృష్ణుడి దర్శనం కోసం వాళ్లలో కలుగుతున్న తహతహ అది అని గ్రహించలేని స్థితికి వెళ్లిపోయారు. 
 
వేణుగానం ముగిసిన వెంటనే ఆ ముముక్షువు వారి వద్దకు వచ్చాడు. వేణుగానం చేస్తున్నంత సేపూ తాదాత్మ్య స్థితిలో ఉన్న వారిని చూసాక ఆ ముముక్షువుకు ఈ వేణుగానం వెనుకనున్న శ్రీకృష్ణుని మహిమ గురించి చెప్పాలనిపించి ఇలా చెప్పాడు.
 
“శ్రీకృష్ణుడి దర్శనభాగ్యం దొరకటం అంత సులువు కాదు. సిద్ధపురుషుడి సాంగత్యం చేత మీకు రాముడు కనిపించాడు. ఆయన మార్గదర్శిలా మిమ్మల్ని ఇక్కడి దాకా నడిపించాడు. మీ పూర్వీకుల రామభక్తి చేత మీకు రామలక్ష్మణుల దర్శనం దొరికింది. శ్రీకృష్ణుడిని దర్శించుకోవటం ఎందరో యోగీశ్వరులకు సైతం సాధ్యపడని విషయం. శంభలలోని సమరవిజయ రాముడికొక్కడికే అది సాధ్యపడినది. శంభలలో శ్రీకృష్ణుడు ఉన్నన్ని రోజులూ ఆయనని ఒక్కసారైనా చూడాలని ఎందరో యోగులు పరితపించిపోయేవారు. సాయం సంధ్యా సమయంలో శ్రీకృష్ణుడు వేణుగానం చేసేవాడు. ఆ వేణుగానం విని ఎందరో యోగులు శ్రీకృష్ణుడిని వెతుక్కుంటూ ఈ అభయః ప్రాకారానికి వచ్చేవారు. కానీ ఆయన వీరికి కనబడేవారు కాదు. అయినా సరే ఆ గానాన్నే విని ఆస్వాదిస్తూ ఆయన ధ్యానంలో, నామ జపంలో గడిపేవారు ఆ యోగులు. వేదాలనే వేణువు ద్వారా గానం చేసిన ఆయన స్థాయిని ఏ వేణునాద విద్వాంసుడూ అందుకోలేడు. ఈ అభయః ప్రాకారం చేసుకున్న పుణ్యం అలాంటిది. ఆయన ఇక్కడున్నన్ని రోజులూ వేణువు ద్వారా వేదగానం చేశారు.
 
ఆ వేణుగాన వేద ఘోష ఇప్పటికీ ఈ అభయః ప్రాకారంలో నిక్షిప్తమై ఉన్నది. నేను చేసిన వేణుగానం కూడా అలాంటిదే. శ్రీకృష్ణుడు అభయః ప్రాకారానికి ఇచ్చిన వేణుగాన జ్ఞాన సంపద వల్లే నేను వేణువును ఆలపించాను. ఇందులో నా ప్రతిభ కంటే శ్రీకృష్ణుని ప్రభే మీకు కనబడుతుంది.”
 
"స్వామి రాముని దర్శన భాగ్యం మాకు దొరికిందన్న విషయం మీకెలా తెలిసింది?" అని అడిగాడు సంజయ్
 
"మోక్ష సాధనలో ఉన్న వాడినే ముముక్షువు అంటారు. ఆధ్యాత్మిక పథంలో ఉన్నవారు అభ్యసించేది కూడా విద్యే కదా. విద్య ఎక్కడుంటుందో స్పర్ధ అక్కడుంటుంది. స్పర్ధ ఎక్కడుంటుందో అక్కడ అన్ని విషయాలూ తెలిసిపోతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా దైవానుగ్రహం ఎవరికి దక్కింది అన్న రహస్యాలు. మీకు రాముని అనుగ్రహం దొరకటం ఎంత విలువైనదో మీకిప్పుడు అర్థం కాదు. మోక్ష సాధనలోకి మీరు అడుగుపెట్టిన రోజున మీరెంత అదృష్టవంతులో మీకర్థం అవుతుంది", అన్నాడు ఆ ముముక్షువు.
 
ఆ ముముక్షువు నుండి సెలవు తీసుకుని అక్కడి నుండి బయలుదేరారు. సిద్ధపురుషుడు తన జపమును ముగించుకుని ధ్యాన స్థితిని వీడి వీరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
 
అభిజిత్, అంకిత, సంజయ్ లని చూడగానే వారితో ఒక ముఖ్యమైన విషయాన్ని ఇలా ప్రస్తావించాడు.
 
"వేణు గానాన్ని విని మీరు చాలా మంచిపని చేశారు. నేనే స్వయంగా మిమ్మల్ని అక్కడికి తీసుకెళదాం అనుకున్నాను. ఈ రోజుతో మీలోని పాషండ భావాలన్నీ పూర్తిగా నశించిపోయాయి. ఇక మీరు శంభల రాజ్యంలోని సకల విద్యలూ నేర్చుకోవటానికి సంసిద్ధులు అయినట్టే లెక్క", అన్నాడా సిద్ధపురుషుడు.
 
"పాషండ భావాలంటే ఏవి స్వామి?" అని అడిగాడు అభిజిత్.
 
"వేదాలకి విరుద్ధమైన భావాలు. కలిదోషం వల్ల మానవులలో కలిగే వికారాలు ఇవి. మీరు గోమాతను దర్శించి, సేవించి ఎంతో శ్రేష్ఠమైన పని చేశారు. గోవును మన సనాతన ధర్మదేవతగా వేదాలు అభివర్ణించాయి. మీరు సాక్షాత్తు ఆ కామధేనువు నుండి వచ్చిన కపిల గోవులను అనగా దేవతలనే సేవించుకున్నారు. ఇలాంటి అదృష్టం మీకు దక్కిందంటే మీకు దైవబలం తోడుగా ఉందని అర్థం. ప్రపంచాన్ని వినాశనం చేయాలనుకునే ఆ ఘోరకలిని అంతం చెయ్యటం కోసం అడుగు అడుగునా మిమ్మల్ని స్వాగతిస్తూ మీలోని అంతర్గత శక్తిని జాగృతం చేస్తున్నారు దేవతలు. ఆ ఘోరకలి అంతం అవ్వాలని, భూలోకం సురక్షితంగా ఉండాలని దేవతలు బలంగా కోరుకుంటున్నారని దానర్థం", అన్నాడు ఆ సిద్ధపురుషుడు.
 
"ఈ పాషండ భావాలు మాలో నుండి ఎలా పోయాయి స్వామి?" అడిగాడు సంజయ్
 
"శ్రీకృష్ణుడు శంభల కిచ్చిన వరం   వేణుగాన నాద శాస్త్రం. ఆ శాస్త్రాన్ని అనుసరించి చేసిన వేణుగానాన్నే మీరు విన్నారు. వేద విరుద్ధమైన భావాలు మీలో నుండి మాయమైపోయే గానమది. వేదాలని స్మృతి చేతనే గుర్తుపెట్టుకుని, పదే పదే మననం చేసుకునేవారు మన ఋషులు. ఇంద్రియాలలో ముఖ్యమైనది శ్రవణ శక్తి. కలియుగంలో ఆ శక్తి దుర్వినియోగం అవుతోందని చెప్పక తప్పదు. వినకూడని శబ్దాలు ఎన్నింటినో మీరు వినటం చేత మీలోకి ఈ పాషండ భావాలు చొరబడ్డాయి. ఒక్క చెవులకే కాదు మన జ్ఞానేంద్రియాలు అన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఇంద్రియాలకు నియమం అంటూ లేకపోతే మాత్రం విష్ణు నామం ఉచ్ఛరించటానికి కూడా మనస్కరించని దుస్థితికి వెళ్ళిపోతాడు మనిషి. తనకు దేవుడిచ్చిన ఇంద్రియ శక్తిని ఉపయోగించుకోకపోయినా పోయేదేంలేదు కానీ దుర్వినియోగం మాత్రం చెయ్యకూడదు. ఎందుకంటే దేహమే దేవాలయం అన్నారు. దేవాలయం లాంటి ఆ దేహంలో ఉన్న ఇంద్రియాలు గుడి తలుపుల లాంటివి. పవిత్రమైన దేవాలయంలోకి ఎవరిని అనుమతించాలి అన్న విజ్ఞత ఉండాల్సింది మనిషికే కదా”, అంటూ చెప్పటం ముగించాడు.
 
"స్వామి నాదొక చివరి ప్రశ్న", అడిగింది అంకిత.
అదేమిటో అడుగు అన్నట్టు చూసాడా సిద్ధపురుషుడు.
 
"ఈ ప్రాకారానికి  అభయః ప్రాకారం అన్న పేరెందుకు వచ్చింది?" అని అడిగింది అంకిత.
 
"కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి వైరాగ్యం కలిగినప్పుడు జ్ఞానబోధను చేసి తిరిగి తనని కార్యోన్ముఖుడిని చేశాడా కృష్ణ పరమాత్మ. తద్వారా లోకానికి  భగవద్గీత  దొరికింది. కష్టం వచ్చిన ప్రతీ సారి మనకు అభయాన్ని ఇచ్చేది ఆ శ్రీకృష్ణుడేనమ్మా. అలాంటి శ్రీ కృష్ణుడు ధ్యానించిన చోటిది. ఆయనే లలితాదేవిని ఉపాసన చేసిన స్థలమిది. అనగా ఆయనకు  అభయాన్ని ఇచ్చే ఆది పరాశక్తిని ధ్యానించాడిక్కడ. అలాంటి ఈ ప్రాకారం   అభయః ప్రాకారం కాక మరేం అవుతుంది" అంటూ మరొక్క మారు శ్రీకృష్ణుడిని తలచుకున్నాడా సిద్ధపురుషుడు.
 
"తరువాత వచ్చే ప్రాకారం ఏది?" అని అక్కడున్న ఇద్దరు సైనికులను సిద్ధపురుషుడు అడిగాడు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
#51

"ఇందుః ప్రాకారం", అన్నారా సైనికులు.
 
అభయః ప్రాకారం నుండి ఇందుః ప్రాకారం దిశగా వారి అడుగులు పడ్డాయి.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
#52

శంభల నగరం – 9
ఇందుః ప్రాకారం
 
ఇందుః ప్రాకారంలోకి అడుగుపెట్టగానే వారికి అమితాశ్చర్యం కలిగింది. భూలోకంలో మనం చూసే పరస్పర విరుద్ధమైన స్వభావం కల జీవులన్నీ ఒకే చోట కలిసి ఉంటున్నాయి ఇక్కడ. పాము-ముంగిస. శునకము-మార్జాలము. సింహము-జింక. ఇలా అన్నీ సాధు స్వభావంతో చేదోడు వాదోడుగా ఉంటున్నాయి. పైగా వాటి కళ్ళను చూస్తే పాశవిక లక్షణాలు కనిపించకపోగా, దైవీ కాంతులను విరజిమ్ముతున్నాయి.
 
వాటిని అలానే చూస్తూ విస్తుపోయిన అభిజిత్, అంకిత, సంజయ్ లతో సిద్ధపురుషుడు ఇలా అన్నాడు.
 
"ఈ  ఇందుః ప్రాకారంలో మనసు చంద్రుని ఆధీనములో ఉంటుంది. చంద్రుడు అంటే భూమి చుట్టూ తిరిగే చంద్రుడు కాదు. భూలోక వాసుల కంటికి కనిపించే చంద్ర రూపం అది. సూర్య మండలం పైన నిజమైన శీతల, జల లక్షణాలు కలిగిన ఒక భూమిక ఉన్నదని చెబుతోంది వేదం. ఆ భూమికనే చంద్ర మండలంగా గుర్తించారు మన వేదాలలో. భౌతిక దృష్టికి అందని చంద్రుని రూపం అది అని చెబుతారు. వేద ఋషులు దర్శించిన చంద్ర మండలం అదే.  ఆచంద్రతారార్కం అన్న పదం వినే ఉంటారు. చంద్రుడూ, తారలూ, సూర్యుడు ఉన్నంతవరకూ అని అనటంలో ఉన్న పరమార్థం ఇదే.
 
ఆ చంద్రుణ్ణి ప్రార్థిస్తే మనసును నిర్మలంగా, ఎలాంటి చెడు ఆలోచనలు రానివ్వకుండా ఒక సరోవరం వలే ప్రశాంతముగా ఉంచుతాడు. అందుకే భూలోకంలో పరస్పర వైరంతో ఉండే జంతువులు సైతం ఇక్కడ కలిసి మెలసి జీవిస్తాయి.
 
అంతే కాదు, ఈ ప్రాకారంలో మీ మనసుకు ఎన్నో పరీక్షలు ఎదురవ్వబోతున్నాయి. అందుకు సంసిద్ధంగా ఉండండి", అని వారిని హెచ్చరించాడా సిద్ధపురుషుడు.
"స్వామి, భూలోకంలో అడవుల్లో మనకు కనిపించే జంతువులన్నీ ఇక్కడ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదెలా సాధ్యం?" అని అడిగాడు సంజయ్.
 
"భూలోకంలోని మనుషులే ఇక్కడ ముముక్షువులుగా మీకెలా అయితే దర్శనం ఇచ్చారో, ఇదీ అంతే. భూలోకంలో జంతువుగా జన్మించినప్పటికీ ఆ జన్మలో చేసిన సాధన వల్ల ఉత్కృష్టమైన స్థితికి చేరుకున్న అన్ని జంతువులూ ఇక్కడ ముముక్షువులలా అవే శరీరాలు ధరించి కేవలం మోక్ష సాధన కోసమే తపించిపోతూ ఉంటాయి. వాటికి మరొక జన్మ అంటూ ఉండదని అర్థం", అన్నాడా సిద్ధపురుషుడు.
 
“ఇక్కడున్న ఆ సింహాన్ని చూసారా? అది శంభల నగరానికి కేంద్రబిందువు ఐన శక్తి పీఠమునందున్న అమ్మవారికి నిర్వహించే అన్ని పూజలలో  కర్మసాక్షిగా ఉంటుంది. అమ్మవారిని పూజించే రోజున ఆ అమ్మకు  వాహనంగా ఈ సింహం ఎన్నో సేవలను అందుకుంటుంది”, అన్నాడు సైనికులలో ఒకడు.

"ఆ సింహం పేరేమిటి?" అని అడిగాడు అభిజిత్.
 
" కేశనామ ", అన్నాడు ఆ సైనికుడు.
 
"ఆ పేరుకి అర్థం చెప్పగలరా?" అని అడిగాడు అభిజిత్.
 
 
"ఆ సింహం యొక్క కేశాలు సుగంధాన్ని వెదజల్లే మూలికలలా ఉంటాయి. ఎలాంటి దుష్ట పీడిత శక్తి దరిచేరకుండా ఉండటానికి  చింతామణి గృహమునందు  ఈ సింహ కేశాలను నీటితో కలిపి ప్రోక్షణ కూడా చేస్తారు. అంతటి ఓషధీ శక్తి ఉన్నదా కేశాలకు", అని వివరించాడు ఆ సైనికుడు.
అక్కడి నుండి అభిజిత్, అంకిత, సంజయ్ లు ముందుకు వెళుతూ ఉన్నారు. సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు మాత్రం అక్కడే ఆగిపోయారు. అభిజిత్, అంకిత, సంజయ్ లు వెనక్కి తిరిగి చూసారు.
 
అప్పుడు ఆ ఇద్దరు సైనికులు, "మీరు ముందుకు వెళ్ళండి. మేమిక్కడే ఉంటాము", అన్నారు.
 
సిద్ధపురుషుడు,"మీకు అక్కడ ఎదురయ్యే పరీక్షలు ఎంతో విలువైనవి. మీ జీవితాంతం మీరు గుర్తుపెట్టుకోవలసిన ఎన్నో పాఠాలను మీరక్కడ నేర్చుకోబోతున్నారు", అని చెప్పాడు.
 
అసిధారావ్రతం అని రాసి ఉన్న ప్రాంగణంలోకి అడుగుపెట్టారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.
 
అక్కడ ఎందరో అందమైన యువతీ, యువకులు జంటగా కనిపించారు. అందమైన దుస్తులు ధరించి, సుగంధ ద్రవ్యాలను వెదజల్లుతూ చేతిలో చెయ్యేసి ఒకరి సాహచర్యాన్ని మరొకరు ఆస్వాదిస్తూ ఆ ప్రాంగణం అంతా తిరుగుతున్నారు. వాళ్ళల్లో కొంత మంది ఒకరిని ఒకరు ఆటపట్టిస్తూ సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. మరి కొంత మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకొంత మంది నడుస్తూ మౌనంగా ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూస్తూ ఏదో తెలియని అనుభూతితో ఊహాలోకాల్లో విహరిస్తున్నారేమో అన్నట్టుగా కదులుతూ ముందుకెళుతున్నారు.
 
అంతలో అక్కడికి ఒక అందమైన శంఖినీ జాతి స్త్రీ వచ్చింది.
 
"మీ భూలోక వాసులకు ఇక్కడేం పని?" అని కొంటెగా అభిజిత్ వంక చూస్తూ సంజయ్ ని, అంకితని అడిగింది.
 
"శంభల రాజు అనిరుద్ధుల వారి ఆజ్ఞ మేరకు శంభల నగర సందర్శనం చేస్తూ ఈ  ఇందుః ప్రాకారానికి వచ్చాము", తడబడుతూ అన్నాడు అభిజిత్.
 
"తను నీ ప్రేయసి కదా", అని అంకితని చూపిస్తూ అభిజిత్ తో నవ్వుతూ అన్నదా శంఖినీ జాతి స్త్రీ.
 
"అవన్నీ నీకెందుకు?" అని పైకి కోపం నటిస్తూ అన్నాడు అభిజిత్.
 
"మంచి అభినయం దాగుంది నీలో. మంచి రసికుడివే కదా", అంటూ అభిజిత్ బుగ్గను చుంబించినది.
 
"ఇదిగో అమ్మాయి, ఇదేం బాగోలేదు.పద్ధతి కాదిది", అన్నాడు అభిజిత్.
 
"నీ ప్రేయసి కోపంగా నన్నే చూస్తోంది", అంటూ గట్టిగా నవ్విందా శంఖినీ జాతి స్త్రీ.
 
"ఇక్కడ ఇంతమంది అందమైన జంటలను చూస్తుంటే నీకేం అనిపిస్తోంది?" అని అభిజిత్ ని అడిగింది ఆ శంఖినీ జాతి స్త్రీ.
అభిజిత్ అంకిత వైపు చూసాడు ఏం చెప్పాలి? అన్నట్టు. అంకిత కోపంగా చూసింది.
 
"అబ్బో...ఆ అమ్మాయి కనుసైగ చేస్తే గాని తమరి నోటి నుండి ముత్యాల మాటలు రావే?" అంటూ నవ్వింది ఆ శంఖినీ జాతి స్త్రీ.
 
"అలా ఏం కాదు. ఈ అందమైన జంటలను చూస్తుంటే నాకు కూడా నా కాబోయే భార్యతో ఇలానే చేతిలో చెయ్యేసి కళ్ళతోటే అనుబంధం పెనవేసుకుని నడుస్తూ అలా ముందుకెళ్లాలి అనిపిస్తోంది", అన్నాడు అభిజిత్.
 
అలా అన్నాడో లేదో అక్కడి ప్రాంగణంలో ఒక్క జంట కూడా లేకుండా అందరూ మాయం అయిపోయారు. ఇప్పుడక్కడ అభిజిత్, అంకిత తప్ప ఎవ్వరూ లేరు. సంజయ్ లేడు. ఆ శంఖినీ జాతి స్త్రీ కూడా లేదు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
#53

అభిజిత్, అంకితలు వేసుకున్న దుస్తులు మారిపోయాయి. అక్కడి ప్రాంగణం అంతా చీకటిగా మారిపోయింది. అభిజిత్, అంకితలకు అసలు అక్కడ ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. ఎన్నో నక్షత్రాలు చుట్టూ కనబడుతున్నాయి. 27 నక్షత్రాలున్నాయి. దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలు ఆ 27 నక్షత్రాలు. దక్షుడు చంద్రుడికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చెయ్యటం అభిజిత్, అంకితల కళ్ళ ముందు కనబడుతోంది. చంద్రుడు రోహిణీకి బాగా దగ్గరయ్యి మిగతా 26 మందినీ దూరం పెట్టడం, ఆ 26 మందీ దక్షుని దగ్గరికి వెళ్లి తమ బాధను మొరపెట్టుకోవడం, దక్షుడు చంద్రుని దగ్గరకొచ్చి హెచ్చరించటం ఇవన్నీ ఒక దాని తర్వాత మరొకటి అభిజిత్, అంకితల కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. దక్షుడి శాపంతో చంద్రుడు ఒక చోట కూర్చుని రోదిస్తూ ఉండటం కనిపించింది అభిజిత్, అంకితలకు. వారి కళ్ళ ముందే చంద్రుడు అలా బాధపడటం చూసి చలించిపోయారు. ఓదార్చటానికి దగ్గరకి వెళ్లే లోపు చంద్రుని దగ్గరికి బ్రహ్మ వచ్చాడు.
 
"అదిగో అటు వైపు చూడు", అంటూ బ్రహ్మ చూపిస్తున్న దిశగా చూసిన చంద్రుడు ఆశ్చర్యపోయాడు. అభిజిత్, అంకితలు కూడా అటు వైపు చూసారు. వారి కళ్ళను వారే నమ్మలేనట్టుగా ఉందా అద్భుతం.
 
అదొక  పాల సముద్రం. ఆ పాల సముద్రంలో ఎగసి పడే అలలు. ఎవరో కవ్వముతో చిలుకుతున్నట్టుగా అక్కడ ఆ పాల సముద్ర మథనము జరుగుతోంది. పాల సముద్రములో ఎగసి పడే ప్రతీ అల వల్ల అక్కడ పాల నురుగు అంతకు అంత పెరుగుతూ పోతోంది. పెరుగుతున్న ఆ పాల నురుగు చిక్కగా తయారవుతోంది. అలా కొంతసేపు ఆ పాలసముద్రంలో జరిగే మథనాన్నే చూస్తూ ఉన్నారు అభిజిత్, అంకితలు. ఆ పాల నురుగు చిక్కదనం ఎక్కువవుతూ పోగా అందులో నుండి ఉద్భవించాడు చంద్రుడు. ఇదంతా బ్రహ్మ చంద్రుడికి చూపించాడు. బ్రహ్మ చంద్రుడితో ఇలా అన్నాడు.
 
"అది నీ పుట్టుక, చంద్రమా. అలాంటి నువ్వు ఇలాంటి స్థితిలో ఉండటం లోకానికే అమితమైన బాధ. దక్షుడు నీకిచ్చిన ఈ  క్షయ వ్యాధి పోవాలంటే నీ మనసును ఆ పరమశివుని యందే లగ్నం చేసి ఉంచు. కఠినమైన తపస్సును ఆచరించు. ఆ పరమశివుడే నీకు దారి చూపిస్తాడు. విజయోస్తు", అని అంతర్ధానమయ్యాడు.
 
చంద్రుడు నిష్ఠగా శివుణ్ణి పూజిస్తే, శివుడు ప్రత్యక్షం అయ్యి  శుక్ల పక్షంలో చంద్రుడు క్రమక్రమంగా  వృద్ధి చెందేలా,  కృష్ణ పక్షంలో  మాత్రం  క్షీణిస్తూ ఉండేలా దక్షుడిచ్చిన శాపాన్ని సడలించాడు. పూర్తిగా ఆ శాపాన్ని తొలగిస్తే దక్ష ప్రజాపతి వాక్కుకు అర్థం లేకుండా పోతుంది. అందుకే శివుడు చంద్రుని ప్రార్థన మేరకు ఆ చంద్రుణ్ణి శిరస్సున ధరించాడు. చంద్రుడు పార్వతీ దేవి భక్తుడయిపోయాడు. పన్నెండు మంది అమ్మవారి మహాభక్తులలో ఒకడయ్యాడు.
 
ఆ రోజు నుండి చంద్రుడు మహాశివభక్తుడిగా గొప్ప పేరు పొందాడు. తన దోషాన్ని సైతం అధిగమించాడు.
 
ఇదంతా ఒక కథలా వారి కళ్ళముందు జరుగుతున్నట్టు అనిపించింది. అది ముగిసిపోగానే వారి చుట్టూ ఉన్న చీకటి తొలగిపోయి అంతక్రితం ఉన్న ప్రాంగణం కనిపించింది.
 
మునుపటిలా అక్కడ ఎంతో మంది అందమైన జంటలు కనిపించారు. సంజయ్ వారి పక్కనే ఉన్నాడు. అంకిత మాత్రం అభిజిత్ పక్కన ఉంది. శంఖినీ జాతి స్త్రీ  వాళ్లకు  ఎదురుగానే ఉన్నది.
 
“మనసు చేసే మాయ తొలగిపోవాలంటే  భక్తి  ఒక్కటే ఏకైక మార్గం. ఎంత కష్టపడైనా సరే మనసుని భక్తి మార్గము నందే ప్రవేశ పెట్టాలి. మీకు చంద్రుని కథంతా కళ్ళ ముందు కనిపించటానికి కారణం ఏంటో తెలుసా?" అని అడిగింది ఆ శంఖినీ జాతి స్త్రీ.
 
తెలియదు అన్నట్టుగా అభిజిత్, అంకితలు  ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
"అయితే మీతో వచ్చిన మీ స్నేహితుడిని అతనికి ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారో ఒకసారి అడిగి చూడండి", అంది శంఖినీ జాతి స్త్రీ.
 
"సంజయ్, నీకు ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు?" అడిగాడు అభిజిత్.
 
"అదేం ప్రశ్న. బాగా వయసు మళ్ళిన వృద్ధ దంపతులు ఒకరిని ఒకరు చూసుకుంటూ పసి పిల్లలలా కలిసిపోయి తిరుగుతూ ఉన్నారు కదా. వాళ్ళే కనిపిస్తున్నారు.అయినా ఎందుకలా అడుగుతున్నావు?" అన్నాడు సంజయ్.
 
"అంటే నీకిక్కడ యువతీ, యువకులు ఎవ్వరూ కనిపించటం లేదా?" అని అడిగాడు అభిజిత్.
 
"లేదు", అటు వైపు నుండి సంజయ్ జవాబు.
 
"మరి శంఖినీ జాతి స్త్రీ కనిపిస్తోందా?" అడిగాడు అభిజిత్.
 
"లేదు", అటు వైపు నుండి సంజయ్ జవాబు.
 
సంజయ్ చెప్పిన జవాబులు విని నిర్ఘాంతపోయారు ఇద్దరూ. అభిజిత్, అంకిత ఇటు తిరిగి చూసే లోపు ఆ శంఖినీ జాతి స్త్రీ మాయమైపోయింది.
 
అప్పుడు అభిజిత్ కి అందులోని అంతరార్థం బోధపడింది. ఆమె ఒక దేవతని అర్థం అయ్యింది. అభిజిత్, అంకితల మనసు ఇంకా మాయకు వశం అయ్యి ఉండటం వల్లే వాళ్లకు అక్కడ ఎంతో మంది యువతీ, యువకులు జంటగా కనిపించారు. ఆ మాయను దూరం చేసి  ఇందుః ప్రాకారంలోని చంద్రుని గురించి చెబుతూ తమకు జ్ఞానోదయం కలిగించటానికి వచ్చిన దేవత అని అభిజిత్ కు అనిపించింది. అంకిత ఇంకా దిగ్భ్రాంతిలోనే ఉంది. అసలేం జరిగిందో అర్థం అయ్యే స్థితిలో తను లేదు.
 
ఆ  అసిధారావ్రతం అనే ప్రాంగణం నుండి బయటికి వచ్చేసారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.
 

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
#54

 
"స్వామి, ఈ ప్రాంగణానికి అన్న పేరెందుకు పెట్టారో చెప్పగలరా?" అని ఆత్రంగా అడిగాడు అభిజిత్.
 
" అసిధారావ్రతం అనగా స్త్రీపురుషులిద్దరూ ఒకే శయనంపై నిదురిస్తూ బ్రహ్మచర్య దీక్షతో ఉండుట. అతి కష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించేవారు మీకు ఈ ప్రాంగణంలో కనబడతారు కాబట్టే ఆ వ్రతం పేరే ఈ ప్రాంగణానికి పెట్టారు", అని బదులిచ్చాడా సిద్ధపురుషుడు.
 
"అంటే మాకు అక్కడ కనిపించిన వాళ్ళు కూడా ముముక్షువులేనా స్వామి?" అని ఆశ్చర్యపోతూ అడిగాడు సంజయ్.
 
సిద్ధపురుషుడు నవ్వుతూ,"అంతే కదా", అన్నాడు.
సిద్ధపురుషుడు, ఆ ఇద్దరు సైనికులూ ముందుకెళ్తూ ఉండగా వారిని అనుసరిస్తూ అభిజిత్, అంకిత, సంజయ్ లు   ఇందుః ప్రాకారం నుండి  శివుని ఆలయానికి బయలుదేరారు.
 
శంభలలోని ఈ  శివుని ఆలయం ఉండే ప్రాకారానికి ఏ పేరూ లేదు. అందరూ ఆ ప్రాకారాన్ని  శివుని ఆలయం అనే పిలుస్తారు. అక్కడంతా శివ మయమే.
 
ఓం నమః శివాయ

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply
#55

శంభల నగరం – 10
శివుని ఆలయం
 
అక్కడ విభూతి ధరించని మోము మనకు కనబడదు. శివ నామస్మరణ చెయ్యని గొంతు మనకు వినబడదు.
 
సుగంధ ద్రవ్యాల నుండి వచ్చే సువాసనలు మైకాన్ని కలిగిస్తాయి. కానీ అక్కడ అణువణువులో ఉన్న భస్మం యొక్క పరిమళాలు మాత్రం మనకు బ్రహ్మ జ్ఞానాన్ని అందిస్తాయి.
 
అక్కడ మాట్లాడితే శివుడు. ఆట ఆడితే శివుడు. పాట పాడితే శివుడు.
 
ఏది చెయ్యాలన్నా అక్కడ శివుడే. ఏదీ చెయ్యకపోయినా అక్కడ శివుడే.
 
అక్కడ అడుగుపెట్టక ముందు వరకూ మనకు కనిపించేదో ప్రపంచం. అడుగుపెట్టాక ఆ  శివుడే  ప్రపంచం.
 
మన శిరస్సు పైకెత్తి చూస్తే కానీ కనిపించనంత ఎత్తులో ఉంటాడు శివుడు. హిరణ్యము అనగా మేలిమి బంగారంతో చెయ్యబడ్డ మూర్తీభవించిన  ఈశ్వరత్వము అక్కడ మనకు కనిపిస్తుంది.
 
56 అడుగుల ఎత్తున్న ఆ శివుడు తన రెండు కళ్ళనూ మూసివేసి ధ్యానంలో ఉంటాడు. రెండు చేతులనూ  చిన్ముద్రతో ఉంచి పద్మాసనంలో ధ్యానం చేస్తున్న ఆ శివుడు అంత ఎత్తులో మనకు కనిపిస్తాడు.
 
అక్కడున్న శివుణ్ణి చూస్తే 56 అడుగుల ఎత్తున్న పరమశివుడే సాక్షాత్తుగా అక్కడికొచ్చి ధ్యానం చేస్తున్నాడు అన్నట్టుంటుంది కానీ శివుని విగ్రహంలా ఎక్కడా అనిపించదు.
 
ఒక దృశ్యం అద్భుతంగా ఉంటే కళ్లప్పగించి చూస్తాం. కానీ ఆ శివుని ఆలయములో ఏది చూసినా ఒక అద్భుతమే. అప్పుడు రెప్పార్పకుండా చూస్తాం. రెప్పపాటులేని స్థితినే  అనిమిషత్వం అంటారు. అనిమిషత్వానికున్న మరొక పేరే  ఈశ్వరత్వము. ఆ ఈశ్వరత్వమే కాల స్వరూపం. కాలం రెప్పపాటైనా సరే ఆగదు. అలాంటి కాలస్వరూపుడైన ఆ శివుణ్ణి మనం చూడాలంటే రెప్పార్పకుండానే చూడాలి. ఎప్పుడు ఏ అద్భుతం మన కంటికి అందకుండా పోతుందో అన్న భయం వెంటాడుతూ ఉంటుంది ఆ శివుని ఆలయంలో. అంత అద్భుతంగా ఉంటుందక్కడి  శివుని వైభవం.
 
శివునికి ఎదురుగా ఉన్న నంది 26 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ నంది కూడా సువర్ణముతోనే రూపకల్పన చేయబడ్డది.
 
శివునికి అభిషేకం జరుగుతున్నప్పుడే అక్కడున్న నందికి కూడా అభిషేకం జరుపుతారక్కడ.
 
ఆ ఆలయంలోనే ఒక బంగారు  ఉన్నది. ఆ సింహాసనం 36 అడుగుల ఎత్తు ఉంటుంది. అక్కడున్న 56 అడుగుల శివుడికి తగ్గట్టుగా ఉంటుందా సింహాసనం.
 
అక్కడ వాళ్ళ దినచర్య  శివపంచాక్షరితో   మొదలవుతుంది.
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ.... భస్మాంగరాగాయ మహేశ్వరాయ అంటూ మొదలయ్యే ఆ శివపంచాక్షరీ స్తోత్రాన్ని వినటం, చూడటం జన్మ జన్మల పుణ్యమే అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ శివపంచాక్షరి చెప్పే సమయానికి ఎందరో యోగులు, దేవతలు, యక్షులు, అఘోరీలు, ముముక్షువులు, నాగసాధువులు ఇలా శంభల నగర ప్రాకారాలలో లేని వారు ఎంతో మంది మనకు కనబడతారక్కడ.  యక్షస్వరూపాయ జటాధరాయ....పినాక హస్తాయ సనాతనాయ అంటున్నప్పుడు డమరుకం మోగుతూ ఉంటుందక్కడ.
 
అభిజిత్, అంకిత, సంజయ్ లు శివుణ్ణి చూస్తూ మైమరచిపోయి ఉన్నారు. సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు ఆలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
 
అభిజిత్, అంకిత, సంజయ్ లు నిలబడి శివుణ్ణి తదేకముగా చూస్తూ ఉన్న ఆ చోటికి ఒక  నాగసాధువు వచ్చాడు. వీరితో ఇలా అన్నాడు.
 
“ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై 
 ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబు 
ఎవ్వడాదిమధ్యలయుండెవ్వడు సర్వంబు తానై యున్నవాడెవ్వడు  వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్”
మీరే పని మీద ఇక్కడికొచ్చారో నాకు తెలుసు. మీరు కోరుకునే ఆ ప్రపంచ శాంతి కోసమే మేమిక్కడ రోజూ శివునికి పూజలు చేస్తున్నాము. శంభల రాజ్యంలో మీరు నేర్చుకునే విద్యలు ఘోర కలిని అంతం చెయ్యటానికి ఉపయోగపడతాయి. కానీ మీకు భవిష్యత్తులో మా నాగసాధువుల అవసరం ఉంటుంది. అందుకే ఈ  తాళంచెవిని మీ దగ్గర ఉంచుకోండి”, అని చెప్పేసి తాళంచెవిని సంజయ్ చేతికిచ్చి ఆ నాగసాధువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
 
ఆ నాగసాధువు వెళ్తున్న వైపే ఆశ్చర్యంగా చూసారు అభిజిత్, అంకిత, సంజయ్ లు ముగ్గురూ.
 
అంతలో అక్కడికి ఒక ముముక్షువు వచ్చాడు.
 
"ఇక్కడి శివాలయ చరిత్ర ఏంటో మీకు తెలుసా?" అని అడిగాడు.
 
"తెలీదు స్వామి", అన్నారు ముగ్గురూ ముక్తకంఠంతో.
 
"అయితే మీరు తప్పకుండా తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ఈ శివాలయంలో మీరు చూసే ఆ శివుడు శాంతస్వరూపుడు కాడు. సతీదేవి అగ్నికి ఆహుతైన రోజున ఇదే చోట ఆయన  శివతాండవం చేసాడు.
 
 ప్రతీ సంవత్సరం ఒక్కసారి ఆ శివతాండవాన్ని చూసే అదృష్టం శంభల నగర వాసులకు దక్కుతుంది. ఆ శివ తాండవాన్ని చూడటం అదృష్టమే అయినా చూసి తట్టుకోవటం అంత తేలిక కాదు. ఆయనని అలా చూస్తే కన్నీటి గంగ ధారగా ప్రవహిస్తుంది. మంగళస్వరూపుడైన ఈ శివుడేనా ఇలా రుద్ర తాండవం చేస్తోంది అని భయం వేస్తుంది. ఆ రోజు ఆయనను శాంతింపచెయ్యటానికి ఇక్కడ స్తోత్రాలు, సూక్తాలు ఎన్నింటినో పఠిస్తారు.
 
ఇక్కడున్న భక్తులకు ఆ రోజు నిజమైన పరీక్ష. ఎవ్వరైతే మనసారా శివుణ్ణి ప్రార్థిస్తారో అప్పుడే ఆయన శాంతిస్తాడు. ఆ భక్తుని కోరికలను నెరవేరుస్తాడు.
 
ఇక్కడ మీరు చూస్తున్న ఆ 56 అడుగుల శివుణ్ణి రూపకల్పన చేసింది  దేవశిల్పి విశ్వకర్మ. సూర్యమండలంలోని సూర్య గణాలు లెక్కలేనంత బంగారాన్ని తెచ్చి ఇచ్చాయి. ఆ మేలిమి బంగారంతోనే ఇక్కడున్న శివుణ్ణి, నందిని, సింహాసనాన్ని రూపకల్పన చేసాడు విశ్వకర్మ”, అన్నాడా ముముక్షువు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
#56

"స్వామి, శివుడు ఎక్కడి నుండి వస్తాడు?" అడిగాడు అభిజిత్
 
ఆ ముముక్షువు అభిజిత్ ను ఎగాదిగా ఒక్కసారి చూసి గట్టిగా నవ్వాడు. అభిజిత్ గుండెను తన చేత్తో బలంగా తాకుతూ,"నీ హృదయం అనే పద్మంలో నుండి వస్తాడు", అన్నాడు.
 
"ఇక్కడ ధ్యాన రూపంలో ఉన్న ఆ 56 అడుగుల బంగారు శివుణ్ణి కేవలం విగ్రహస్వరూపం అనుకుంటున్నావా?" అని అభిజిత్ ను గట్టిగా అడిగాడు.
 
“సూర్య గణాలు తెచ్చిన ఆ బంగారం  సూర్యప్రభకు నిదర్శనం. ఆ సూర్యుని ద్వారానే ఇక్కడ శివుణ్ణి మనం దర్శించుకుంటున్నాం. బంగారానికి ఉన్న గుణాలలో జ్వలించే శక్తి ప్రథమమైనది. ఎంతగా జ్వలిస్తే అంతగా మెరిసిపోతుంది. సతీదేవి అగ్నికి ఆహుతి కావటం జ్వలనమే కదా. అందుకే ఆ రోజున ఇక్కడ మీకు కనిపించే ఈ హిరణ్య తేజమైన శివుడు ధ్యానం వీడి తన నటరాజరూపంతో జ్వలిస్తూ తాండవం చేస్తాడు”, అన్నాడా ముముక్షువు.
 
"అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఆ ధ్యానరూపంలో ఉన్న శివుడే కళ్ళు తెరిచి ఇక్కడ తాండవం చేస్తాడా స్వామి?" అంటూ ఆ 56 అడుగుల శివుణ్ణి చూస్తూ అభిజిత్ విస్తుపోయి ఆ పరమశివునికి సాష్టాంగ నమస్కారం చేసాడు.
 
"అవును. ఆయనని బంగారు వర్ణంలో అలా ధ్యాన మూర్తిగా చూడటం వలన మీకు విగ్రహంలా కనిపిస్తున్నాడు. కొంత మంది యోగీంద్రులకు ఆయన తీసుకునే శ్వాస కూడా వినిపిస్తుంది. వాళ్ళ యోగసిద్ధి అలాంటిది మరి", అన్నాడా ముముక్షువు.
 
" పాదుకాతీర్థం తయారీలో వాడే పుప్పొడిని ఈ శివుని ఆలయంలో ఉన్న సువర్ణ పుష్పాల నుండే తీసుకుంటారని చెప్పారు స్వామి. ఆ సువర్ణ పుష్పాలు ఉన్న చెట్టు ఎక్కడుందో చెబుతారా?" అని అడిగాడు అభిజిత్.
 
ముముక్షువు వాళ్ళ ముగ్గురినీ ఒక చోటికి తీసుకువెళ్లాడు. అక్కడొక దేవతా వృక్షం ఉన్నది. ఆ దేవతా వృక్షానికే ఎన్నో సువర్ణ పుష్పాలున్నవి. వాటిని చూపిస్తూ ఆ ముముక్షువు ఇలా చెప్పాడు.
 
"సూర్యుని నామాలలోని ఒక నామమే పూషా. పోషించువాడు అని అర్థం. సమృద్ధిని ఇచ్చువాడు అని అర్థం. ద్వాదశ ఆదిత్యులలో ఒకడే పూషుడు. ఆయన నుండే ఈ సువర్ణ పుష్పాలు ఉన్న చెట్టు వచ్చింది. ఈ చెట్టుని కూడా సూర్య గణాలే అందించాయి", అన్నాడా ముముక్షువు.
 
ఇంతలో అక్కడికి సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు వచ్చారు. ఆ సైనికుల్ని చూడగానే అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళు సైనికులు కారు. ఇన్నాళ్లూ సైనికుల వేషధారణలో వాళ్ళని భ్రమింప జేసిన  కామరూపధారులు. అనగా ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగల శక్తి సంపన్నులు వారు.
 
ఆ ఇద్దరు సైనికులూ వాళ్ళ రూపాల్ని వదిలేసి తమ సొంత రూపంలోకి వచ్చేసారు. వాళ్లిప్పుడు సైనికులలా లేరు. శంభల రాజ్యంలోని ఖరీదైన వస్త్రాలు ధరించి ఉన్నారు.
 
"నేను అనిరుద్ధుల వారి ఆస్థానంలోని మంత్రిని. నా పేరు  ఫాలనేత్రుడు. మా అమ్మ శివభక్తురాలు. అందుకే నాకు ఆ శివుని పేరే పెట్టింది", అన్నాడు ఆ మంత్రి.
 
"నేను అనిరుద్ధుల వారి రాజ్యంలోని సేనాధిపతిని. నా పేరు   రుద్రసముద్భవ ", అన్నాడా సేనాధిపతి.
 
"మిమ్మల్ని పరీక్షించనిదే మీకు శంభల రాజ్యంలోని యుద్ధ విద్యలు నేర్పటం అసాధ్యం. మీకా యోగ్యత లేనిచో ఆ విద్యలు మీకు నేర్పినా అవి సిద్ధించవు. అందుకే మేము ఎప్పటికప్పుడు సిద్ధపురుషుడితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. ఇప్పుడు మాకు మీ మీద నమ్మకం కలిగినది. ఇక శంభల రాజ్యానికి బయలుదేరుదామా?" అని అడిగాడు ఆ ఫాలనేత్రుడు.
 
శివునికి నమస్కరించి ఆ ఆలయం నుండి బయటికొచ్చేశారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.
 
సిద్ధపురుషుడు, రుద్రసముద్భవ, ఫాలనేత్రుడు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు అనిపించింది.
 
అప్పుడే అక్కడికో  ఖగరథము వచ్చినది.
 
"భూలోకంలో మీరు చూసే విమానాల కంటే 1000 రేట్లు వేగంతో ఈ ఖగరథ గమనం ఉంటుంది.
 
ఇలాంటివి శంభల రాజ్యంలో కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి", అంటూ ఆ ఖగరథంలోకి వాళ్ళను ఆహ్వానిస్తూ అన్నాడు మంత్రి ఐన ఫాలనేత్రుడు.
 
భూలోకంలోని విమానానికి రెట్టింపు పరిమాణంలో ఉందా  ఖగరథం. బయటి నుండి చూసే వాళ్లకి బంగారు విమానంలా ఉంది. భూలోకంలోని విమానాలకు ఉన్నట్టే ఈ ఖగరథానికి రెక్కలున్నాయి కానీ అవి గాలిలో ఉన్నప్పుడు మాత్రమే తెరుచుకునేలా వెసలుబాటు ఉంది. ఒక్క సారి భూమ్మీదకు దిగిన తర్వాత ఆ రెక్కలు ఇక కనిపించవు. అలా అమర్చారు వాటిని.
 
శంభల నగరంలో చిట్టచివరి ప్రాకారం ఐన  చింతామణి గృహంలోకి అడుగుపెట్టడానికి అనుమతి, అర్హత లేకపోవటం వల్ల అభిజిత్, అంకిత, సంజయ్ లు  శివుని ఆలయం నుండి ఖగరథంలో  శంభల రాజ్యానికి పయనమయ్యారు. సిద్ధపురుషుడు కూడా వారితో పాటే వస్తున్నాడు.
 
మంత్రి ఫాలనేత్రుడు, సేనాధిపతి రుద్రసముద్భవ ఎంతో ఆనందంగా ఒక కార్యాన్ని పూర్తిచేసినట్టు గర్వంతో విజయదరహాసం చేస్తున్నారు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply
#57

ఘోర కలి అరాచకాలు  - 1
బోర్డు డైరెక్టర్ లతో ఘోర కలి మీటింగ్
 
భూలోకంలో ఘోర కలి ఏ రంగాన్నీ వదిలిపెట్టలేదు. స్టీల్, ఐరన్, మినరల్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఇలా అన్ని రంగాల్లో తనేంటో ప్రపంచానికి పరిచయం చెయ్యాలని సంకల్పించుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. తన సామ్రాజ్యాన్ని విస్తరించి    జీ.కె. కార్పొరేషన్ అండ్ ఇండస్ట్రీస్    పేరుతో ప్రపంచంలోని పలు చోట్ల కంపెనీలను స్థాపించి శ్రామికులను నియమించుకున్నాడు. తన ప్రతీ కంపెనీలో కొన్ని వేల మంది వర్కర్స్ తన ఆజ్ఞలను అనుసరించి పనిచేస్తూ ఉంటారు. ఘోర కలి దగ్గరున్న   నాగమణి   ఎంతో శక్తివంతమైనది కావటంతో దాన్ని ఆసరాగా చేసుకుని ఎన్నోఅరాచకాలు చెయ్యటం మొదలు పెట్టాడు.
 
ఒక రోజు  జీ.కె. కార్పొరేషన్ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్ ల మీటింగ్ ని ఘోర కలి సీక్రెట్ గా తన సామ్రాజ్యంలో ఏర్పాటు చేసాడు. ఆ రోజు ఘోర కలికి సెక్యూరిటీగా ఎంతో మంది ఉన్నారక్కడ. ఆ మీటింగ్ కి పది దేశాల నుండి వచ్చిన పదిహేను మంది బోర్డు డైరెక్టర్స్ ఒక చోట హాజరయ్యారు. వారు అక్కడికొచ్చి 2 గంటలవుతోంది. ఘోర కలి కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. అంతలో అక్కడికి ఘోర కలి తన సొంత రూపంతోనే వచ్చాడు. కళ్ళకు కాటుకతో, నలుపైన దుస్తులతో, తను ధరించిన ఆ దుస్తులపైన వికృతమైన గుర్తులతో చూడగానే ఒళ్ళు గగ్గుర్పొడిచేలా ఉన్నాడు.
 
"సభకు నమస్కారం. నేను డైరెక్ట్ గా పాయింట్ కొచ్చేస్తున్నాను. మీ పదిహేను మందీ ఇన్ని రోజులూ చాలా కష్టపడ్డారు. నేను చెప్పినట్టే మన కంపెనీలలో పని చేసే వర్కర్స్ తాగే టీ లో  'సమూఢ' అనే చీకటి రాజ్యంలో చెయ్యబడ్డ ద్రవ్యాన్ని కలిపి వారికిస్తూ వచ్చారు. వారిలో కనిపించిన మార్పేంటో మనం కళ్లారా మన ప్రొడక్షన్ యూనిట్ వాళ్ళు పంపిన రిపోర్ట్స్ లోనే చూసాం. అందుకు ముందుగా మనందరం సెలెబ్రేట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ లెక్కలేనంత మద్యం దొరుకుతుంది ఈ రోజు. ఇష్టపూర్వకంగా ఎంత కావలి అనిపిస్తే అంత తాగండి. ఏది కావాలి అనిపిస్తే అది తినండి. మా వంటవాళ్లు అన్ని రకాల కూరలూ వండించారు. మగువలకు కొదవే లేదీ సామ్రాజ్యంలో. ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయి మీ సొంతం అవుతుంది.
 
కానీ ఇవన్నీ మీరనుభవించే ముందు మీరు నాకోసం ఒక చిన్న పని చేసిపెట్టాలి. చేస్తారా?" అని వాళ్ళని అడిగాడు ఘోర కలి.
 
ఘోర కలి చేస్తారా అని ప్రత్యేకించి వాళ్ళని అడుగుతున్నాడంటే  అదేదో అల్లాటప్పా విషయం కాదని వాళ్లకి అర్థం అయిపోయింది.
 
అక్కడున్న పదిహేను మంది గుండెలూ వేగంగా పోటీపడి మరీ కొట్టుకుంటున్నాయి. ఒకరి కళ్ళు ఒకరు చూసుకుంటున్నారు. హ్యాండ్ కర్చీఫ్ తో నుదుటి పై చెమటని తుడుచుకుంటున్నారు. ప్రాణం పోయే ముందు ఎలా ఉంటుందో ఘోర కలి అడిగిన దానికి ఎదురుచెప్పటం అలా ఉంటుంది. ఇన్నాళ్లూ ఘోర కలితో చేతులు కలిపి తెగ సంబరపడిపోయారు. డబ్బు ఇచ్చే నషా అలాంటిది. ఎంత ప్రమాదంలో పడ్డామో తెలిసేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయి ఎదురుగా ఘోర కలి రూపంలో యముడు రెడీ గా ఉంటాడు.
 
"ఏంటి ఆలోచిస్తున్నారు?" అన్నాడు ఘోర కలి.
 
అక్కడంతా నిశ్శబ్దం.
 
"ఇంకా ఆలోచిస్తున్నారేంటి.......................?" అని ఈ సారి గట్టిగా బల్ల గుద్ది మరీ అడిగాడు ఘోర కలి.

"అలాగే….అలాగే…. మీరేది అడిగితే అది చేస్తాం", అని ఆ పదిహేను మందీ లేచి నిల్చుని చేతులు కట్టుకుని ముక్తకంఠంతో మాటిచ్చారు.
 
"హహ్హాహ్హా.....భయం....భయం.....భయం భయమే నా పెట్టుబడి.....ఇప్పుడీ భయమే నా రాబడి", అంటూ భయంకరంగా నవ్వాడు.
 
"మీరందరూ మీ మీ రూపాల్ని శాశ్వతంగా మార్చేసుకోవాలి. అదే మీరు నాకోసం చేసే చిన్న పని", అని గట్టిగా నవ్వాడు ఘోర కలి.
 
"అంటే మా ఐడెంటిటీ మారిపోతుందా?" అని అడిగాడు వాళ్ళల్లో ఒకడు.
 
"మీ ఐడెంటిటీ ఏం మారిపోదు. మీ ఫామిలీ వాళ్లకు మీరేం దూరం అవ్వరు. ప్రపంచానికి మీ ఐడెంటిటీ అలానే ఉంటుంది. కానీ మీ రూపురేఖలే పూర్తిగా మారిపోతాయి.
హ్హాహ్హాహ్హా", అంటూ నవ్వాడు ఘోర కలి.
 

వాళ్లకేం అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
 
అది గమనించిన ఘోర కలి వారికి అర్థం అయ్యేలా ఇలా వివరించాడు.
 
"మీరందరూ నా లా మారిపోతారు. అంటే చూడటానికి మీరు అచ్చం నాలాగే కనబడతారు బయటి ప్రపంచానికి. దీని వల్ల నా ఐడెంటిటీని ట్రేస్ అవుట్ చెయ్యటం ఎవ్వరి వల్లా కాదు. అప్పుడు మిమ్మల్ని చూసి మీకెదురు తిరగటానికి అందరూ భయపడతారు.
 
నేను నా సామ్రాజ్యంలో ఇక్కడే కూర్చుని ప్రపంచం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవచ్చు.
ఏది జరిగినా నిమిషాల్లో యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా నా సందేశాన్ని ప్రపంచంతో పంచుకుంటాను. ఇక్కడే ఉంటూ ప్రపంచంలో పలు చోట్ల జరిగే ఎన్నో సంఘటనలను నాకు నచ్చే విధంగా మలచుకుంటాను. ప్రపంచం మొత్తాన్ని భయపెడతాను.
 
మీరు ఉండే చోట జనాలు మిమ్మల్నే  ఘోర కలి  అనుకుని భ్రమపడుతూ భయపడుతూ బ్రతుకుతారు.
 
ఆ భయమే మన పెట్టుబడి.
 
ఆ భయంతోటే ప్రజలు మనకు బానిసలవుతారు.
 
ఆ భయంతోటే మనం వారికి దొరలు అవుతాం.
 
ఆ భయంతోటే ప్రపంచాన్ని గడగడలాడిస్తాం.
 
మీరు చెయ్య వలసిందల్లా నా లా మారిపోవటమే.
చేస్తారు కదూ?" అంటూ ఆ పదిహేను మందిని ఒక్కసారి సూటిగా చూస్తూ గంభీరంగా అడిగాడు.
 
వేరే గత్యంతరం లేక వాళ్ళందరూ ఒప్పుకున్నారు.

"ఈ ఘోర కలి ఎప్పుడూ మీ చుట్టూ రక్షగా ఉంటాడు", అంటూ ఘోర కలి అక్కడున్న ప్రతీ ఒక్కడి వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకుని రాక్షస ప్రేమతో ప్రతీ ఒక్కడి బుగ్గపైన ముద్దు పెట్టాడు. ఘోర కలి శ్వాస బలంగా తగులుతోంది అక్కడున్న ప్రతీ ఒక్కడికి.
 

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
#58

"నన్ను నమ్మి వచ్చిన వాళ్లకు ఇలాగే ముద్దిచ్చి నా ప్రేమను చూపిస్తాను. అది నా గుణం.
ఈ రోజుతో మీరందరూ నా లా మారిపోతారు.  ప్రపంచానికి నన్ను చూపే అద్దాలు మీరే.
 
హహ్హాహ్హా", అంటూ ఘోర కలి నవ్వుతున్నప్పుడు తెలియకుండానే కళ్ళ వెంట ధారగా కన్నీళ్లు ఉప్పొంగాయి.
 
ఇంతలో ఘోర కలికి ఒక రక్షక భటుడి నుండి పిలుపు రావటంతో అక్కడి నుండి హుటాహుటిన వెళ్ళిపోయాడు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
#59

 శంభల రాజ్యం – 1

శంభల రాజ్యానికి స్వాగతం

 

ఖగరథం శంభల రాజ్యానికి చేరుకున్నది. శంభల రాజ్య ప్రవేశ ద్వారం దగ్గర భూలోక వాసులకు ఘనస్వాగతం పలకటానికి అక్కడ ఎంతో మంది ఎదురుచూస్తూ ఉన్నారు. ఖగరథం నుండి బయటకు అడుగుపెట్టిన మంత్రి ఫాలనేత్రుడు, సేనాధిపతి రుద్రసముద్భవలతో పాటు సిద్ధపురుషుడు ముందుకు కదిలి వెళుతున్నారు. వారిని అభిజిత్, అంకిత, సంజయ్ లు అనుసరిస్తున్నారు. వీళ్ళతో పాటు అక్కడుండే  ఒక భటుడు కూడా వస్తున్నాడు.

 
శంభల రాజ్యాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు అన్నట్టుంది అక్కడి వాతావరణం. శంభల నగరంలోలానే శంభల రాజ్యంలో దొరికే వాయువు అత్యంత శ్రేష్ఠమైనదిగా అనిపించింది వారికి. కాలు నేలను తాకగానే అక్కడున్న మట్టి రేణువులు చర్మానికి గట్టిగా అతుక్కున్నట్టు అనిపించాయి. అభిజిత్ కి తన కాలు వైబ్రేట్ అయినట్టు అనిపించి, "ఇక్కడ మట్టి ఏంటి ఇలా ఉంది?" అని అడిగాడు.
"ఇది  మంకిల. మట్టి కాదు. ఇది చాలా దూరం వ్యాపిస్తుంది. నువ్వు ఇక్కడికొచ్చావన్న సాక్ష్యం చెబుతుంది", అన్నాడు భటుడు.
 
"ఇంద్రియాలకు స్పందించే గుణం ఉంటుంది. ఈ మంకిలకు వ్యాపించే గుణం ఉంది. వెళ్ళేటప్పుడు ఒక పిడికిలంత తీసుకుని వెళ్ళు. భూలోకంలో ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది", అన్నాడు ఆ భటుడు అభిజిత్ కళ్ళలోకి చూస్తూ.
 
భవిష్యత్తులో జరగబోయేదేదో కళ్ళ ముందు ఫ్లాష్ లా కనిపించింది అభిజిత్ కి. కానీ అదేంటో అంత క్లియర్ గా తెలియట్లేదు. ఒక్క నిమిషం షాక్ అయ్యాడు. ఆ భటుడు చెప్పినట్టే ఒక పిడికిలంత   మంకిల   తీసుకుని తన దగ్గరున్న పౌచ్ లో వేసుకున్నాడు.
 
“ఇప్పుడు దాచుకున్న ఈ పిడికెడే భూలోకంలో పదింతలు అవుతుంది. ఎందరినో కాపాడుతుంది”, అంటూ ఆ భటుడు చిత్రంగా నవ్వాడు.
 
"శంభల రాజ్యంలో జాగ్రత్త దొరా", అన్నాడు. అభిజిత్ అర్థం కానట్టు చూసాడు.
 
"ఇక్కడ నెగ్గావా...ముల్లోకాలు నీవే. ఇక్కడ ఓడావా... విజయమిక దక్కదు దొరా", అన్నాడు.
 
అభిజిత్ అలర్ట్ అయ్యాడు. తనకు సంబంధించినది ఏదో ఆ భటుడు చెబుతున్నాడనిపించింది.
 
"ఇక్కడి ఆడవాళ్లు మాయ చేస్తారు దొరా....వాళ్ళ వలలో పడకు", అని అంకితను చూస్తూ, "ఆమెను ప్రేమించాలో వద్దో ఒక నిర్ణయం తీసుకో దొరా....సౌఖ్యంగా ఉంటాది నీ మనసు. కుదుటపడుతుంది నీ వయసు", అన్నాడు. ఆ మాట అంకితకు కూడా వినబడింది. అభిజిత్ ని చూస్తూ నవ్వింది.
 
 
అభిజిత్ ఆ భటుడిని పక్కకు పిలిచి, "బాసు నువ్వు భూలోకంలో ఫార్చ్యూన్ టెల్లింగ్….అదే చిలకజోస్యం చెప్పేవాడివా....నీ లాంగ్వేజ్ అలాగే ఉంది మరి", అన్నాడు.
 
"నీకు అర్థం అవ్వాలని అలా చెప్పా దొరా", అన్నాడు భటుడు.
 
"ఇదిగో అంతా బానే ఉంది కానీ, నువ్వు నన్ను దొరా అనకు. ఐ యాం నాట్ యువర్ దొరా", అన్నాడు అభిజిత్.
 
"లేదు దొరా. మనది ఏడు జన్మల సంబంధం. నువ్వు మా దొరవే", అన్నాడు ఆ భటుడు. ముందుకు కదిలాడు భటుడు.
 
అభిజిత్ ఆగిపోయాడు ఆ మాటకి. లోపల ఇలా అనుకుంటున్నాడు.
 
"ఏడు జన్మల సంబంధమా? వీడెంటిలా మాట్లాడుతున్నాడు ! ఏంటోలే...ముందు ముందు ఇంకెన్ని షాక్ లు ఇస్తాడో !"
 
ఒక వేగు వీరిని స్వాగతించటానికి అక్కడే ఎదురు చూస్తూ ఉన్నాడు.
 
"భూలోక వాసులకు ప్రణామములు", అంటూ అక్కడున్న వేగు వారిని స్వాగతించాడు.
 
"శ్వేత ద్వీప వైకుంఠ వాసి ఐన సిద్ధపురుషుణ్ణి కలుసుకోవటం ఎంతో ఆనందాన్నిచ్చే విషయం", అని శిరస్సు వంచి సిద్ధపురుషునికి ప్రణామం చేశాడా వేగు.
 
"శంభల రాజ్యాధిపతి అనిరుద్ధుల వారు మీ అందరికీ తగిన విడిదిని ఏర్పాటు చేశారు", అంటూ ఆ వేగు వాళ్ళను ఒక అతిథి గృహానికి తీసుకెళ్లాడు.అతిథిగృహం చేరుకున్నారు వారందరూ.
... 
[+] 5 users Like k3vv3's post
Like Reply
#60

"ఇచట మీరు విశ్రాంతి తీసుకోవలసిందిగా అనిరుద్ధుల వారి విన్నపం. రేపు సభనందు మిమ్మల్ని అందరికీ పరిచయం చేసిన పిమ్మట వారు మీతో ఏకాంతంగా చర్చిస్తారు. కూలంకషంగా అన్ని విషయాలు అప్పుడు మీకే తెలుస్తాయి. అంతవరకు అలసటకు గురైన మీ మనసుకు ప్రశాంతతనివ్వండి", అని ఆ వేగు అక్కడి నుండి నిష్క్రమించాడు.
 
మంత్రి ఫాలనేత్రుడు, సేనాధిపతి రుద్రసముద్భవలు వారి నుండి సెలవు తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు.
 
అతిథి గృహం నుండి బయటకు చూస్తే ఎంతో విశాలమైన శంభల రాజ్యం కళ్ళకు దేదీప్యమానంగా కనిపించింది. శంభల రాజ్యాన్ని చూస్తూ సిద్ధపురుషుడు అభిజిత్, అంకిత, సంజయ్ లతో ఇలా చెప్పాడు.
 
 
“శంభల నగరంలో ప్రాకారాలున్నట్టే శంభల రాజ్యంలో కూడా ప్రాకారాలున్నాయి. కానీ అవి సందర్శించటానికి శంభల రాజ్యాధిపతి అయిన అనిరుద్ధుల వారి ఆజ్ఞ కావాలి. యుద్ధ సేనాధిపతికి సముచితంగా అనిపించాలి. శంభల రాజ్యంలోనివి యుద్ధ ప్రాకారాలు. అంటే ఇక్కడ యుద్ధంలో ప్రయోగించే అనేకానేక వ్యూహాలు, అస్త్రాలు, ఆయుధాలు, సైన్యం ఇలా ఒక వేరే ప్రపంచమే ఉంటుందిక్కడ. ఇక్కడ నేర్పేది యుద్ధ విద్య. ఇక్కడి వారు బ్రతికేది రక్షించటానికే. రక్షించేది బ్రతికించటానికే. యుద్ధ నీతి తెలుసు. రీతి తెలుసు. వాటిని అతిక్రమిస్తే సంహారం ఇంకా బాగా తెలుసు.
 
ఇక్కడి ప్రతి కన్నూ మిమ్మల్ని  ఒక కంట గమనిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఆలోచనలే శత్రువులు. వ్యక్తులు కాదు. చెడుకి, మంచికి వ్యత్యాసం వచ్చేది మన ఆలోచనలోనే. అది చెడ్డ పనైనా, మంచి పనైనా పడే కష్టం ఒక్కటే. అంతరంగంలో స్వచ్ఛత కోల్పోయినప్పుడు ఎంత గొప్ప పనైనా వృథాగా మిగిలిపోతుంది. అందుకే ఇక్కడ మీకిచ్చే శిక్షణకు మీరు అన్ని విధాలా అర్హులా కాదా అని మంత్రి, సేనాధిపతి మిమ్మల్ని పరీక్షించారు. భూలోక వాసులను ఘోర కలి నుండి కాపాడటం చిన్న విషయం కాదు. ఎన్నో యుద్ధ విద్యలలో ప్రవేశం ఉండాలి, ఎంతో వ్యూహ రచన కావాలి. అవన్నీ మీకందివ్వటానికి మీకొక గొప్ప ఆశయం కావాలి. మీలో పవిత్రత నిండి ఉండాలి.
 
 
మరీ ముఖ్యంగా, అవి కడదాకా మీలో అలాగే ఉండాలి”, అని చిన్నగా నవ్వుతూ సిద్ధపురుషుడు  అభిజిత్ కళ్ళలోకి చూసాడు.
 
తను ఎవరికైతే చెప్పాలనుకున్నాడో వారికి విషయం బోధపడేలా ఉంటుంది ఆయన చిరునవ్వు. అదొక అస్త్రం అంతే. ఆ నవ్వు ఒక బాణం లాంటిది. చాలా అరుదుగా సంధించే ఆ చిరునవ్వు మనకు గుచ్చుకుందా. అంతే. జ్ఞానం వెల్లివిరుస్తుంది. కార్యాచరణ కళ్లముందుంటుంది. సిద్ధపురుషుడి ద్వారా పెల్లుబికే దైవీ శక్తి అది.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)