02-09-2026, 02:57 PM
ప్రదేశం: విశాఖపట్నం RAW కంట్రోల్ రూమ్
సమయం: మధ్యాహ్నం 02:37 గంటలు
విశాఖపట్నం RAW కంట్రోల్ రూమ్‌లోని మెయిన్ స్క్రీన్ ముందు రా చీఫ్, ఆయన కింద పని చేసే ఆఫీసర్లు కళ్లు ఆర్పకుండా చూస్తున్నారు. సముద్ర మధ్యలో ఉన్న ఆ భారీ నౌక లోపల అనుష్క ధరించిన టాక్టికల్ బాడీ కెమెరా (Cam) నుండి లైవ్ విజువల్స్ నేరుగా ఆ స్క్రీన్‌పై ప్రసారమవుతున్నాయి.
ఆ నౌక అంతా దట్టమైన తెల్లటి పొగ కమ్ముకుని ఉంది. ఆ పొగ మధ్యలో... అధీర పంపిన ఆ ఏడు, ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న, అరివీర భయంకరమైన దాదాపు 40 మంది హైలీ ట్రైన్డ్ హంతకులు స్పృహ కోల్పోయి, రక్తం కక్కుతూ అచేతనంగా పడి ఉన్నారు.
సరిగ్గా అదే సమయంలో, కంట్రోల్ రూమ్‌లోని టెక్నీషియన్లు వెంటనే ఒక కీలకమైన పని చేశారు. ఆపరేషన్ సజావుగా సాగడం కోసం, ఆ అజ్ఞాత వ్యక్తి (భావన) ఉపయోగిస్తున్న కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీని నేరుగా అనుష్క కమ్యూనికేషన్ సిస్టమ్‌కు లింక్ చేశారు.
కంట్రోల్ రూమ్ రేడియోలో:
“క్లియర్... క్లియర్...” అనే మాటలతో భావన, అనుష్కలు ఇద్దరూ లోపలికి అడుగుపెడుతున్న సంకేతాలు వినిపించాయి.
అయితే భావన చాలా నిమగ్నమై ఉంది. తన అసలు గొంతు బయటకు రాకుండా, ఎవరికీ తాను ఎవరో చిన్న క్లూ కూడా దొరకకూడదని తన కమ్యూనికేషన్ వాయిస్‌ను పూర్తిగా 'ఎన్‌క్రిప్టెడ్ రోబోటిక్ వాయిస్' రూపంలో సెట్ చేసుకుంది.
‘ఒక షాడోలా..... రావాలి... ఎవరి కంటికీ చిక్కకూడదు, ఎక్కడా జాడ దొరకకూడదు... అదే నా అసలు బలం!’ అనే తన నిబంధనకు ఆమె కట్టుబడి ఉంది.
ప్రదేశం: టార్గెట్ షిప్ కారిడార్
సమయం: మధ్యాహ్నం 02:40 గంటలు
దట్టమైన పొగను చీల్చుకుంటూ ముందుకు వెళ్తున్న భావనకు అస్సలు అర్థంకాని ఒక విషయం తట్టింది. ఆమె వెంటనే తన ఆడియో లింక్ ద్వారా అనుష్కను హెచ్చరించింది.
భావన (ఎన్‌క్రిప్టెడ్ గొంతుతో): "అనుష్క... హోల్డ్! ఇక్కడ ఒక విషయం గమనించాలి. మెయిన్ షిప్ ఎంట్రెన్స్ దగ్గర కానీ, కిచెన్‌లో కానీ, కాక్‌పిట్‌లో కానీ ఒక్క శత్రువు కూడా కదల్లేదు. అంటే అర్థం...
వాళ్లంతా పారిపోలేదు, అందరూ ఒకే చోట గుమిగూడారు. ప్రైమరీ టార్గెట్ అయిన అలేఖ్య ఉన్న ఆ ఒక్క గదిలోనే వీళ్లంతా మూగారు. టేక్ పొజిషన్!"
అనుష్క: "అర్థమైంది! నేను బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేస్తాను..." అని చెప్పి అనుష్క కొద్దిగా వెనక్కి తగ్గి మరో వైపు నుంచి అటాక్ చేయడానికి పొజిషన్ తీసుకుంది.
సరిగ్గా ఆ క్షణంలో... జీవితంలో సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు (భావన మరియు అనుష్క) ఒకరికొకరు ఎదురుపడ్డారు!
ఇద్దరూ ముఖానికి ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి ఉన్నారు, పైగా ఆ దట్టమైన పొగ కమ్ముకుని ఉండటంతో ఒకరినొకరు సరిగ్గా గుర్తుపట్టలేకపోయారు. కానీ, ఆ ఇద్దరూ ఒకరినొకరు దాటుకుని వెళ్తున్న ఆ ఒక్క క్షణంలో...
వారి మనసుల్లో ఏదో తెలియని, వర్ణించలేని ఒక తీవ్రమైన భావోద్వేగం, ఒక రక్త సంబంధపు స్పందన కలిగింది! అది ఏంటో ఆ క్షణంలో వారికి అంతుచిక్కలేదు.
అయినప్పటికీ, అనుష్క తన సహజ సిద్ధమైన ధైర్యంతో ఆ షాడో (భావన) వైపు చూసి మెల్లగా అంది...
అనుష్క: "టేక్ కేర్... నేను చూసుకుంటాను!"
భావన ఆ మాట విని ముఖంపై ఒక చిన్న, ప్రశాంతమైన చిరునవ్వు నవ్వుకుంది. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు దిశల నుంచి ఆ గదిని చుట్టుముట్టడానికి ముందుకు కదిలారు.
భావన మెల్లగా అలేఖ్యను బందీగా ఉంచిన ఆ భారీ ఉక్కు తలుపు వద్దకు చేరుకుంది. తలుపు తాళం వేసి ఉంది. ఆమె తన వద్ద ఉన్న ఒక అత్యాధునిక చిన్న మైక్రో-ఎక్స్‌ప్లోజివ్‌ను ఆ డోర్ లాక్ వద్ద అతికించి, మెల్లగా రిమోట్ బటన్ నొక్కి పేల్చింది!
"టాప్!" అనే చిన్న శబ్దంతో ఆ డోర్ లాక్ పగిలిపోయింది.
కానీ, లోపల అప్పటికే అప్రమత్తంగా ఉన్న ఆ 40 మంది భయంకరమైన సాయుధులు ఆ పేలుడు శబ్దం వైపు ఒక్కసారిగా గన్స్ గురిపెట్టి చూశారు!
భావన తల కొద్దిగా ముందుకు పెట్టి లోపలికి తొంగి చూసింది. గదికి సరిగ్గా అవతలి మూలన... అలేఖ్యను కుర్చీకి కట్టేసి, నోటికి టేప్ వేసి బంధించి ఉంచడాన్ని వాళ్ళు స్పష్టంగా చూశారు.
భావన (రేడియోలో): "రోజర్ దట్... సౌత్ 40 సేఫ్! టార్గెట్ కార్నర్‌లో ఉంది."
అనుష్క వెంటనే స్పందించి, తన సూట్‌లో ఉన్న మరో మినీ-ఎక్స్‌ప్లోజివ్‌ను ఆ గదికి వ్యతిరేక దిశలో ఉన్న గోడపై పెట్టి పేల్చింది!
ఆ పేలుడు ధాటికి లోపల ఉన్న శత్రువులు ఎటు చూడాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు. సరిగ్గా అదే అదనుగా... రెండు వైపుల నుంచి ఆ గదిలోకి ఇద్దరు యోధురాళ్లు ఒకేసారి దూసుకెళ్లారు!
అనుష్క చేతిలో రెండు పొడవైన పదునైన కత్తులు మెరుస్తున్నాయి, వీపు వెనుక M416 అసాల్ట్ రైఫిల్ సిద్దంగా ఉంది. అటు వైపు నుంచి వస్తున్న భావన చేతిలో మాత్రం ఎలాంటి ఆయుధం లేదు! ఆమె పూర్తిగా నిస్సాయుధురాలిలా, కేవలం తన ఒంటి చేతి నైపుణ్యంతో బరిలోకి దిగింది.
వారి ముందర ఉన్న ఆ 40 మంది హంతకులు ఎవరూ సాధారణమైన మనుషులు కాదు. ఒక్కొక్కరూ ఏడు, ఎనిమిది అడుగుల ఎత్తుతో రాక్షసుల్లా ఉన్నారు. వారి కళ్లలో విపరీతమైన రక్తదాహం ఉంది. ఆ నౌక నుంచి ప్రాణాలతో బయటపడాలంటే ఆ ఇద్దరు మహిళలను ముక్కలు చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు.
కానీ... వాళ్లెదురుగా ఉన్నది మనుషులు కాదు, సాక్షాత్తు మృత్యువు!
లోపలికి అడుగుపెట్టిన వెంటనే అనుష్క మెరుపు వేగంతో కదిలింది. శత్రువులు తేరుకునే లోపే... విసిరిన రెండు కత్తుల వేగానికి ఇద్దరు హంతకుల తలలు మొండెం నుంచి తెగి గాల్లో ఎగిరిపడ్డాయి!
RAW కంట్రోల్ రూమ్‌లో ఈ లైవ్ విజువల్స్ చూస్తున్న రా చీఫ్, ఆఫీసర్లు ఒక్కసారిగా నిలువునా షాక్ తిన్నారు! కనురెప్పపాటు కాలంలో... కేవలం కళ్లు తెరిచి మూసేలోపు అనుష్క అంత వేగంగా తలలు నరికివేయడం చూసి వాళ్ల గుండెలు ఆగిపోయినంత పనైంది.
'అనుష్క ఎందుకు మిగతా ముగ్గురు కమాండోలను వద్దు, ఒంటరిగా వెళ్తాను అని చెప్పింది?' అనేదానికి అసలు కారణం ఇప్పుడు ఆ చీఫ్‌కు స్పష్టంగా అర్థమైంది! అనుష్క ఒక సైనిక యంత్రంలా పోరాడుతోంది.
ఇక మరోవైపు... ఎలాంటి ఆయుధమూ లేకుండా, కేవలం ఖాళీ చేతులతో శత్రువుల మధ్య నిలబడి ఉన్న భావనను చూసి ఒక రాక్షసుడు ఉగిపోయాడు.
"చావురా!" అంటూ అతను తన చేతిలోని పొడవైన కత్తితో భావన గొంతు కోయడానికి విపరీతమైన వేగంగా ముందుకు దూసుకొచ్చి గాలిలో కత్తి విసిరాడు!
కానీ భావన చాలా సింపుల్‌గా, ఒక నీటి అలలా కిందికి వంగి ఆ వారాన్ని తప్పించుకుంది. అంతే... మరుక్షణంలో ఆమె తన బాడీ సూట్‌కు అమర్చి ఉన్న ఒక చిన్న పాకెట్ కత్తిని మెరుపు వేగంతో బయటికి తీసి, తనను చంపడానికి వచ్చిన ఆ శత్రువు గొంతులోకి అత్యంత కచ్చితత్వంతో గుచ్చి వదిలేసింది! ఆ శత్రువు ఒక్క కేక కూడా పెట్టకుండా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ఆ గదిలో ఇప్పుడు ఒక భీకరమైన మారణహోమం జరుగుతోంది. అనుష్క తన కత్తులతో శత్రువులను చీల్చి చెండాడుతుండగా ... శత్రువుల గుంపు వెనుక నుంచి అనుష్కపైకి అటాక్ చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు పెద్ద రాక్షసులను భావన గమనించింది.
అనుష్క ఒకరితో పోరాడుతున్న సమయంలో, మరొకడు వెనుక నుంచి పెద్ద కత్తితో అనుష్కపైకి దూకబోయాడు!
సరిగ్గా ఆ ఆపద సమయంలో... భావన ఒక చిరుతపులిలా గాల్లోకి దూకి, ఆ శత్రువు చేతిని విరిచి, వాడి దగ్గర ఉన్న కత్తిని లాక్కుని క్షణాల వ్యవధిలో వాడి గుండెల్ని చీల్చేసింది.
అనుష్కకు ప్రతి క్షణం ఒక షాడోలా మారి భావన రక్షణ కల్పిస్తోంది. ఆ ఇద్దరూ కలిసి ఆ గదిలోని శత్రువులను ఒక్కొక్కరిగా నేలకూలుస్తున్నారు.
కట్టేసి ఉన్న కుర్చీలో నుంచి ఇదంతా చూస్తున్న అలేఖ్య కళ్లలో నీళ్లు నిండిపోయాయి. ఆ పోరాడుతున్న ఇద్దరినీ చూసి ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ‘ఇద్దరూ ప్రాణాలకు తెగించి నాకోసం వచ్చారు... అసలు వీళ్లలో ఎవరు ఏంటి?
ఆ కత్తులతో పోరాడుతున్నది నా అక్క అనుష్కనా? మరి ఆయుధం లేకుండా అద్భుతంగా శత్రువులను అంతం చేస్తున్న ఆ అజ్ఞాత రూపం ఎవరిది?’ అని అలేఖ్య మనసులో ఉద్వేగంతో ప్రశ్నించుకుంది.
కంట్రోల్ రూమ్‌లో ఈ దృశ్యాలన్నీ చూస్తున్న రా చీఫ్ నోటి వెంట మాట రాలేదు.
రా చీఫ్: (వణుకుతున్న గొంతుతో, దిగ్భ్రాంతిగా) "ఓ మై గాడ్... అసలు ఆయుధం లేకుండా ఒక మనిషి ఇంత క్రూరంగా, ఇంత నిపుణురాలిగా శత్రువులను ఎలా అంతం చేయగలదు?! అసలు ఎవరీ అజ్ఞాత వ్యక్తి... ఈ దేశానికి ఈమె ఏ దేవుడిచ్చిన వరం?"
ఆ షిప్ లోపల ప్రవహిస్తున్న రక్తం, ఆ గదిలో మారుమోగుతున్న శత్రువుల ఆర్తనాదాలు... ఆపరేషన్‌ను ఒక సరికొత్త శిఖరానికి చేర్చాయి!
ఆ గది ఇప్పుడు ఒక రణరంగంగా మారింది. దట్టమైన పొగ, గాల్లో ఎగురుతున్న రక్తం, శత్రువుల భీకరమైన అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోతోంది. అనుష్క చేతిలోని రెండు పొడవైన కత్తులు ఒక మృత్యువులా మెరుస్తుండగా... భావన మాత్రం ఎలాంటి ఆయుధం లేని ఖాళీ చేతులతో, ఒక నిశ్శబ్ద తుఫానులా ఆ శత్రువుల గుంపులోకి దూసుకెళ్లింది!
ముగ్గురు రాక్షసులు లాంటి భారీ కాయం ఉన్న హంతకులు ఒక్కసారిగా గర్జించుకుంటూ అనుష్కపైకి దూసుకొచ్చారు.
అనుష్క ఏమాత్రం బెదరలేదు. ఒక కాలును నేల మీద బలంగా ఆనించి, గాల్లోకి అద్భుతమైన ఫ్లయింగ్ కిక్ ఇచ్చింది!
ఆ తన్ను తాకిన వేగానికి ముందున్న వాడి దవడ పగిలి కింద పడ్డాడు. అదే క్షణంలో ఆమె తన చేతిలోని కుడి కత్తితో రెండో వాడి గొంతును కోసి, ఎడమ కత్తితో మూడో వాడి గుండెల్ని చీల్చేసింది! కళ్లెం తెగిన గుర్రంలా ఆమె చేసిన ఆ దాడికి ఆ ముగ్గురూ ఒక్క సెకెన్ కూడా బతకలేదు.
మరోవైపు... నలుగురు హంతకులు కలిసి భావనను చుట్టుముట్టారు.
!"ఒకడు పెద్ద ఇనుప రాడ్‌తో ఆమె తలపై కొట్టడానికి ప్రయత్నించాడు. భావన చిరునవ్వు నవ్వుతూ, మెరుపు వేగంతో కిందకి వంగి వాడి కాళ్లను విరగ్గొట్టింది!
ఆ నొప్పితో వాడు కింద పడగానే, వాడి చేతిలో ఉన్న ఇనుప రాడ్‌ను లాక్కుని మరో ఇద్దరి తలలను ఒకే దెబ్బతో కొట్టి నేలకూల్చింది. నాల్గో వాడు వెనుక నుంచి పట్టుకోబోతే, వాడి చేతివేళ్లను విరిచి, వాడి తలను గోడకేసి బలంగా గుద్దింది! ఆ శబ్దం ఆ గది అంతటా ప్రతిధ్వనించింది.
కంట్రోల్ రూమ్‌లో లైవ్ స్క్రీన్ చూస్తున్న రా చీఫ్, ఆఫీసర్లు తమ సీట్లలో నుంచి లేచి నిలబడ్డారు. ఆ ఇద్దరు ఆడపులులు కలిసి చేస్తున్న ఆ పోరాటం చూస్తుంటే ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.
అనుష్క తన వీపు వెనుక ఉన్న M416 అసాల్ట్ రైఫిల్ తీసి, గది మధ్యలో ఉన్న శత్రువుల గుంపుపై తూటాల వర్షం కురిపించింది!
"ఢిష్యుమ్... ఢిష్యుమ్..." అంటూ ఆ గన్ శబ్దానికి 10 మంది హంతకులు క్షణాల్లో నేలకొరిగారు. గన్ అయిపోగానే, మళ్లీ కత్తులతో విరుచుకుపడింది.
ఇక భావన పోరాట శైలి అయితే వేరే లెవెల్! ఆమె ఒక గూఢచారిలా, ఒక మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలిలా ప్రతీ శత్రువు వీక్ పాయింట్‌ను టార్గెట్ చేసింది. ఒకడు వెనుక నుంచి కత్తితో పొడవబోతుంటే...
భావన వాడి చేతిని పట్టుకుని, గాల్లోనే ఒక రౌండ్ తిరిగి వాడి తలనే కింద ఉన్న నేలకేసి బలంగా కొట్టింది! మరో ఇద్దరిని తన కాళ్లతో గాల్లోకి లేపి కిందకు విసిరేసింది. ఆమె కదిలే వేగానికి, ఆ పొగ మధ్యలో ఆమె ఒక నల్లటి నీడలా (Shadow) మాత్రమే కనిపిస్తోంది!
కేవలం మూడు నిమిషాల వ్యవధిలో... ఆ గదిలో ఉన్న 40 మందిలో ముప్పై తొమ్మిది మంది హంతకులు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు.
ఇప్పుడు మిగిలింది కేవలం ఒక్కడే! ఆ గుంపుకి లీడర్‌గా ఉన్న, దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్న ఒక అతిభయంకరమైన రాక్షసుడు! వాడి శరీరం అంతా కండలతో, ముఖంపై పెద్ద మచ్చలతో ఉంది. వాడు పిచ్చివాడిలా అరుస్తూ, చేతిలో ఉన్న రక్తం కారుతున్న పెద్ద కత్తితో నేరుగా భావన పైకి దూకాడు!
"నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతాను!" అంటూ వాడు విసిరిన ఆ కత్తి పోటుకు గాలి కూడా వణికిపోయింది.
కానీ భావన ఏమాత్రం భయపడకుండా, నేరుగా వాడి వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది! వాడు కత్తి దించే లోపు... భావన గాల్లోకి ఎగిరి, తన రెండు కాళ్లతో వాడి మెడను గట్టిగా లాక్ వేసింది!
ఆ భారీ కాయం ఉన్న వాడు ఆ బరువును తట్టుకోలేక తూలిపడ్డాడు. అదే అదనుగా భావన కింద పడుతూనే వాడి ఛాతిపై కూర్చుని, తన రెండు గుద్దులతో వాడి ముఖాన్ని నుజ్జునుజ్జు చేసేసింది! చివరికి వాడి చేతిలోనే ఉన్న ఆ కత్తిని లాక్కుని, వాడి గుండెల్లోకి దింపి ఆ పోరాటానికి ఒకే ఒక్క దెబ్బతో ముగింపు పలిచింది!
ప్రదేశం: శత్రువుల నౌక (బందీల గది)
సమయం: మధ్యాహ్నం 03:00 గంటలు
ఆఖరి శత్రువు కూడా నేలకూలడంతో ఆ గదిలో రక్తసిక్తమైన నిశ్శబ్దం ఆవరించింది. అనుష్క వేగంగా అలేఖ్య దగ్గరకు వెళ్లి ఆమెను కట్టేసిన తాళ్లను విప్పేసి, ఆమె చేయి పట్టుకుని లేపింది. సరిగ్గా అదే సమయంలో సమయం మధ్యాహ్నం 3 గంటలు అయింది.
అనుష్క: (అలేఖ్యను పట్టుకుంటూ) "సరే... ఇక పద, ఇక్కడి నుంచి బయటపడాలి."
అనుష్కతో పాటు అలేఖ్య ఒక చేయి పట్టుకోగా, మరో వైపు నుంచి భావన కూడా వచ్చి అలేఖ్య మరో చేయి పట్టుకుని నిలబడింది.
అది చూసిన RAW చీఫ్ వెంటనే శాటిలైట్ ఫోన్ ద్వారా అనుష్కతో మాట్లాడాడు.
RAW చీఫ్ (ఫోన్‌లో): “నేను ముందే చెప్పాను కదా, ఆ అమ్మాయి నాతోనే రావాలి అని!"
ఆ మాట వినగానే అనుష్క ఒక్కక్షణం ఆగిపోయింది. ఆ అజ్ఞాత రూపంలో (మాస్క్ వేసుకుని ఉన్న) భావన వైపు ఆమె కోపంగా చూసింది.
అనుష్క: (ఆ అజ్ఞాత షాడోతో) "నా దారి నుంచి తప్పుకో! నాకూ మధ్యలో నువ్వు రావడానికి వీలు లేదు..." అని అరుస్తూ, భావనకు ఒక భీకరమైన 'ఫ్లయింగ్ కిక్' ఇవ్వడానికి గాల్లోకి ఎగిరింది!
కానీ భావన అత్యంత ప్రశాంతంగా, ఒక మెరుపులా పక్కకు తప్పుకుంది. అనుష్క షాట్ మిస్ అయింది.
RAW చీఫ్ (ఫోన్‌లో ఆందోళనగా): " వద్దు... ఆమెను ఏమీ చేయకు, నా బిడ్డ అలేఖ్య నాకు కావాలి!"
భావన (మార్చబడిన ఎన్‌క్రిప్టెడ్ గొంతుతో): "మీకు కావాలంటే... నన్ను ఓడించి ఆ అమ్మాయిని తీసుకెళ్లండి!" అని సవాల్ విసిరింది.
అనుష్కకు పట్టరాని కోపం వచ్చింది. ఆమె మెరుపు వేగంతో వరుస దాడి (attacks) చేయడం మొదలుపెట్టింది. కానీ ఆశ్చర్యకరంగా... అనుష్క వేస్తున్న ప్రతీ ముష్టిఘాతాన్ని, ప్రతీ కిక్‌ను భావన ఎంతో సులువుగా డిఫెన్స్ (Defense) చేస్తూ వస్తోంది తప్ప, ఆమెపై తిరిగి ఒక్క దాడి కూడా చేయడం లేదు!
భావనకు తెలుసు... వచ్చిన ఆఫీసర్ కేవలం తన పై అధికారి ఆదేశాలను, విధులను మాత్రమే పాటిస్తోందని భావన మనసులో అనుకుంది.
అందుకే ఆమెపై చేయి చేసుకోవడానికి ఆమె మనసు ఒప్పుకోలేదు. కేవలం అనుష్క దాడిని మాత్రమే ఆమె అడ్డుకుంటూ వచ్చింది.
కానీ అనుష్కకు మాత్రం సహనం నశించింది. 'ఈ షాడో నన్ను కావాలనే ఎగతాళి చేస్తోంది' అని భావించి, ఆమె తన సర్వశక్తిని ఉపయోగించి మెరుపు వేగంతో కదిలింది.
ఈసారి ఊహించని విధంగా ఒక పవర్‌ఫుల్ అటాక్ చేసి, భావనను బలంగా కింద పడేసింది!
భావన కింద పడినప్పటికీ, వెంటనే లేచి నిలబడి ఒక చిన్న చిరునవ్వు నవ్వుకుంది.
భావన: "ఇక చాలు... నేను నిన్ను గాయపరచాలని అసలు అనుకోవడం లేదు!"
అనుష్క ఆగ్రహంతో ఊగిపోతూ మళ్లీ వేగంగా ముందుకు దూసుకొచ్చింది. కానీ భావన ఈసారి కూడా చాలా సింపుల్‌గా తప్పుకుని, అనుష్క కడుపులో ఒక పవర్‌ఫుల్ 'స్మాష్' (Smash) ఇచ్చింది! ఆ దెబ్బ తాకిన వేగానికి అనుష్క వెనక్కి దూసుకెళ్లి కొద్ది దూరంలో పడిపోయింది.
ప్రదేశం: టార్గెట్ షిప్ డెక్
సమయం: మధ్యాహ్నం 03:02 గంటలు
సరిగ్గా అప్పుడే... చాలా సేపటి నుంచి తన తల్లికి (అనుష్కకు) ఫోన్ చేయాలని ప్రయత్నిస్తున్న సన్నీ ఎమర్జెన్సీ కాల్ కలిసింది!అనుష్క దగ్గర ఉన్న ఆ ఎమర్జెన్సీ ఫోన్ రింగ్ అయింది. ఆ కాల్ ఎవరిదో అనుష్కకు బాగా తెలుసు.
ఆమె ఎలాగైనా ఆ ఫోన్ తీసి మాట్లాడాలి అనుకుంది. కానీ అప్పటికే సమయం మధ్యాహ్నం 3 గంటలు కావడంతో, ఆమె ఆ ఫోన్‌ను రిసీవ్ చేసుకుని త్వరగా కట్ చేయాలని భావించింది.
అనుష్క: (ఆయాసపడుతూ, ఫోన్ లిఫ్ట్ చేసి) "సన్నీ... నేను ఇప్పుడు పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను..." అని కట్ చేయబోయింది.
కానీ అవతలి వైపు నుంచి సన్నీ పెట్టిన ఆర్తనాదం ఆ షిప్‌లో ఉన్న అనుష్కని నిశ్చేష్టులను చేసింది.
సన్నీ (ఫోన్‌లో ఏడుస్తూ): "అమ్మా...! అమ్మా... మనల్ని ఎవరో దారుణంగా మోసం చేశారు! యష్, అజయ్ ఇక్కడికి వచ్చేశారు... అంతకంటే పెద్ద విషం ఏంటంటే అమ్మా... నా అక్కలను... వాళ్లు... వాళ్లు ఎవరో ఎత్తుకెళ్లిపోయారు అమ్మా!!"
"ధడూమ్..." అన్నట్లుగా ఆ మాట అనుష్క గుండెల్లో దిగబడింది!
అనుష్క చేతిలో ఉన్న ఫోన్ జారి కింద పడిపోయింది. ఆమె రెండు మోకాళ్లపై నేల మీద కుప్పకూలిపోయింది. ముఖానికి ఉన్న ఆ మాస్క్ లోపల ఆమె గుండె పగిలిపోయి వెక్కివెక్కి ఏడుస్తున్న ఆవేదన ఎవరికీ కనిపించలేదు, కానీ ఆ మౌన రోదన ఆ సముద్ర గాలిని కూడా స్తంభింపజేసింది.
‘ఏది జరగకూడదని భయపడ్డానో... సరిగ్గా అదే జరిగింది!’
అనుష్క అలా విగతజీవిలా నిర్జీవంగా కూరుకుపోవడం చూసిన భావన గుండె కూడా చలించిపోయింది. ఆమె ఆందోళనగా పరుగెత్తుకుంటూ అనుష్క దగ్గరకు వచ్చింది.
భావన: (కంగారుగా, ఆందోళనగా) "ప్లీజ్... దయచేసి ఇక్కడి నుంచి త్వరగా బయటపడదాం రండి! లేకపోతే మనం ఇప్పటివరకు చేసిన ఈ పోరాటమంతా వృథా అయిపోతుంది... అర్థం చేసుకోండి!"
అనుష్క ఎలాంటి బదులూ ఇవ్వలేదు. ఆమె కన్నీళ్లతో ఉక్కిరిబిక్కిరి అవుతూ, కేవలం ఒక్కటే మాట అన్నది.
అనుష్క: (వణుకుతున్న గొంతుతో) "I'm leaving..." (నేను వెళ్తున్నాను...)
అని చెప్పి, ఆమె మృత్యువును సైతం లెక్కచేయకుండా వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి, అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న తన స్పీడ్ బోట్ ఎక్కి ఆ నౌకను వదిలి క్షణాల వ్యవధిలో దూరంగా వెళ్లిపోయింది.
ప్రదేశం: షిప్ డెక్
సమయం: మధ్యాహ్నం 03:06 గంటలు
అనుష్క వెళ్లిపోయాక, భావన తన చేతిలో ఉన్న ఫోన్‌ను తీసుకుని నేరుగా RAW చీఫ్‌తో మాట్లాడింది.
భావన: "చీఫ్... నేను ఇచ్చిన మాట ప్రకారం, ఇదిగో చూడండి!" అని చెప్పి, భావన తన ముఖానికి ఉన్న ఆ మాస్క్‌ను ఒక్క క్షణంలో తొలగించి, తన అసలు ముఖాన్ని నేరుగా అలేఖ్య వైపు తిప్పింది.
అలేఖ్య ఉలిక్కిపడి, ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి చేసి చూసింది.
అలేఖ్య: (గొంతు గగ్గోలుపెడుతుండగా) "అక్కా...!...
అనగానే ఇష్ .. అని సైగ చేసింది .
నీవు... నిజంగా నువ్వు నాకోసం వచ్చావా!" అని భావనను గట్టిగా కౌగిలించుకుని విలవిలలాడిపోయింది.
భావన: (కళ్లల్లో నీళ్లతో, నవ్వుతూ) "అలేఖ్య... నువ్వు బాగున్నావా తల్లి?"
అలేఖ్య: (భావన బుగ్గలపై ముద్దుపెట్టుకుంటూ, ఉద్వేగంగా) " ఈ ఫోన్ లో మాట్లాడు ..." అని భావన చేతిలో ఉన్న ఫోన్‌ను బలవంతంగా లాక్కుని RAW చీఫ్‌కు అందించింది.
అవతలి వైపు నుంచి RAW చీఫ్ గొంతు భావోద్వేగంతో వణికిపోయింది.
RAW చీఫ్ (ఫోన్‌లో): "తల్లీ... నువ్వు నిజంగా క్షేమంగానే ఉన్నావా అమ్మా?"
అలేఖ్య: (ఏడుపు ఆపుకోలేక) "పెదనాన్నా... నేను చాలా బాగున్నాను! కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే నా ప్రాణాలు కాపాడిన వారు నా దగ్గరే ఉన్నారు !"
ఆ మాట వినగానే RAW చీఫ్ మనసు ఒక్కసారిగా తేలికపడింది. ఆ అవతలి గొంతులో ఉన్న ఆనందాన్ని బట్టి... ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో కాదు, విజయ్ ఏమో అని ఆయన పక్కాగా నిర్ధారించుకున్నారు.
RAW చీఫ్: "సరే తల్లీ... మీరంతా సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యం. కానీ ఇక్కడ మీ అమ్మానాన్నలు మాత్రం నీ కోసం తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు..."
అలేఖ్య: (కంగారుగా) "పెదనాన్నా... నేను ఇప్పుడే మీ అందరి దగ్గరికి వస్తాను, అమ్మతో మాట్లాడతాను... ప్లీజ్ నన్ను పంపించండి!"
భావన: (మళ్లీ ఫోన్ తీసుకుని) "చీఫ్... నేను మీకు త్వరలోనే మళ్లీ కాల్ చేస్తాను. అలేఖ్య కూడా క్షేమంగా మీ దగ్గరికి చేరుకుంటుంది... నేను మాటిస్తున్నాను!"
RAW చీఫ్: "సరే... జాగ్రత్త."
భావన కాల్ కట్ చేసింది. వెంటనే ఆమె, అలేఖ్య ఇద్దరూ కలిసి అక్కడి నుంచి సిద్ధంగా ఉన్న మరో బోట్ ఎక్కి ఆ షిప్‌ను వదిలి సురక్షితంగా బయటకు బయలుదేరారు.
సరిగ్గా వాళ్ళ బోట్ ఆ టార్గెట్ షిప్‌కు సురక్షితమైన దూరానికి రాగానే... భావన తన రిమోట్ డివైజ్ తీసుకుని ఒక బటన్ నొక్కింది.
"కబ్లూమ్...!"
అనే మహా భీకర శబ్దంతో ఆ శత్రువుల భారీ నౌక ముక్కలు ముక్కలై సముద్రంలో పూర్తిగా పేలిపోయింది!
ఆ నౌకకు సంబంధించిన ఎలాంటి చిన్న క్లూ కూడా, ఏ శత్రువు ఆనవాడూ భూమిపై మిగలకుండా ఆ సముద్రపు అలల్లో కలిసిపోయింది. ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది!
ప్రదేశం: సముద్ర మధ్యలో స్పీడ్ బోట్
సమయం: మధ్యాహ్నం 03:15 గంటలు
ఆపరేషన్ విజయవంతంగా ముగిసిన తర్వాత, రా (RAW) అధికారులకు ఎలాంటి చిక్కకుండా, తనను తాను పూర్తిగా గోప్యంగా ఉంచుకోవడానికి భావన ముందుగానే రెండు పక్కా ప్రణాళికలు (Plan A & Plan B) సిద్ధం చేసుకుంది.
ఒకవేళ ఏ చిన్న పొరపాటు జరిగినా ఎలా తప్పించుకోవాలో ఆ వ్యూహాలు ఆమె మైండ్‌లో స్పష్టంగా ఉన్నాయి.
కానీ ఆపరేషన్ అనుకున్నదానికంటే చాలా సాఫీగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా ముగియడంతో భావనకు ఆ ప్లాన్లను ఉపయోగించాల్సిన అవసరం రాలేదు. ఆమె వెంటనే అలేఖ్యను తీసుకుని నేరుగా విజయ్ బోట్ ఉన్న ప్రాంతానికి చేరుకుంది.

ఇట్లు,
✿SUNNY ✿
1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)