01-09-2026, 10:37 PM
------------------అనుష్క పధకం --------------------------------
ప్రదేశం: ఊరిలోని పాత ఇల్లు & రహస్య ప్రాంతం
సమయం: మధ్యాహ్నం 12:00 గంటలు
మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటల సమయం. ఊరిలోని పాత ఇంటి ముందు ఒక నల్లటి ఫార్చ్యూనర్ కారు వచ్చి నిశ్శబ్దంగా ఆగింది. కారులోంచి 'రా' (RAW) చీఫ్ సాధారణ కుర్తా-పైజామాలో, కేవలం డ్రైవర్‌తో కలిసి దిగారు. చుట్టుపక్కల ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పదిమంది స్పెషల్ కమాండోలు సాధారణ పౌరుల్లా రహస్య కాపలా కాస్తున్నారు.
రా చీఫ్ ఇంటి ప్రధాన ద్వారం వద్దకు వచ్చి నెమ్మదిగా తలుపు తట్టారు. అనుష్క ఊహించినట్లే ఆయన లోపలికి అడుగుపెట్టారు.
కాపలాదారుడు- "ఎవరు కావాలి సార్?"
రా చీఫ్- "నేను రితికను కలవాలి."
ఆ మాట వినగానే అనుష్క చెప్పిన ప్లాన్ గుర్తొచ్చి కాపలాదారుడు- "ఒక్క నిమిషం సార్" అని తన జేబులోంచి ఆ శాటిలైట్ ఫోన్‌ను తీసి ఆయన చేతిలో పెట్టాడు.
కాల్ కనెక్ట్ అవ్వగానే అవతలి వైపు నుండి అనుష్క చిరునవ్వుతో కాల్ లిఫ్ట్ చేసింది. రా చీఫ్ కూడా ఆ ఫోన్ చూసి లోలోపల నవ్వుకున్నారు. 'నేను ఇక్కడికి వస్తానని ముందే పసిగట్టింది... తను కచ్చితంగా పాత బ్లాక్ స్క్వాడ్ టీమ్ మెంబరే!' అనే బలమైన నమ్మకం ఆయనకు కలిగింది.
రా చీఫ్- "హలో."
అనుష్క- "హలో మిస్టర్..."
రా చీఫ్- "నేను రా (RAW) చీఫ్‌ని. మీరు మీ ఐడెంటిటీని బయటపెట్టరని నాకు తెలుసు. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మీకు స్పష్టమైన అవగాహన ఉందని భావిస్తున్నాను. రితికను మీరు కాపాడుతున్నారంటే... ఆమె మీకు చాలా కావలసిన వ్యక్తి అని అర్థమవుతోంది."
అనుష్క- "అవును చీఫ్, సరిగ్గానే అర్థం చేసుకున్నారు. చెప్పండి... మీ ప్లాన్ ఏంటి? అలేఖ్యను కాపాడటానికి ఏం చేయాలి?"
రా చీఫ్- "ముందు ఆమె ఎక్కడుందో కనిపెట్టాలి. నాకు ఇంకా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కేవలం ఆ దాడి వెనుక ఉన్నది ఎవరో ఒక బలమైన అనుమానం మాత్రమే ఉంది."
అనుష్క- "ఎవరు అని అనుకుంటున్నారు చీఫ్?"
రా చీఫ్- "మీరు 25 ఏళ్ల కిందట ఎవరి సామ్రాజ్యాన్ని అయితే పూర్తిగా నాశనం చేశామని అనుకున్నారో... వాళ్లే! ఆధీర!"
ఆ పేరు వినగానే అనుష్క గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది! నోట్లోని మాట గొంతులోనే నిలిచిపోయింది. ఇన్ని రోజులు తన బిడ్డ వెనుక పడుతున్నది కేవలం సురేష్ చోప్రా మాత్రమే అనుకుంది... కానీ ఇది ఆమె ఊహకు మించిన మహోగ్ర ప్రమాదం! ఆధీర ముఠా నుండి రితికను కాపాడటం ఒంటరిగా సాధ్యమయ్యే పని కాదు.
అనుష్క వెంటనే తన భయాన్ని, ఆందోళనను నియంత్రించుకుని గంభీరంగా మాట్లాడింది.
అనుష్క- "ఆధీర నెట్‌వర్క్‌ను ఒంటరిగా ఎదుర్కొని ఓడించలేమని మీకు తెలుసు కదా చీఫ్?"
రా చీఫ్- "అవును, నాకు తెలుసు. అందుకే నా బిడ్డ అలేఖ్యను కాపాడుకోవడానికి మీ సహాయం కోరి వచ్చాను. వాళ్లు ఎలాగైనా రితిక కోసం వస్తారు... ఒకవేళ వాళ్ల చేతికి రితిక దొరికితే మాత్రం ఆ బిడ్డ ప్రాణాలు వదులుకోవాల్సిందే!"
అనుష్క- "ఇక ఒక్క మాట కూడా మాట్లాడకండి చీఫ్! ఎవరికీ ఏమీ కాదు. మీరు ముందు అలేఖ్య ఎక్కడుందో లోకేషన్ ట్రాక్ చేయండి, నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. సరైన లొకేషన్ దొరకగానే దానికి తగినట్లుగా మనం నెక్స్ట్ ప్లాన్‌తో దాడి చేద్దాం."
రా చీఫ్- "థాంక్యూ. ఖచ్చితంగా సాధిద్దాం."
రా చీఫ్ ఆ ఫోన్‌ను తనతోనే ఉంచుకుని, తన బిడ్డను కాపాడుకోవడానికి ఒక బలమైన ఆశ దొరికిందన్న ధైర్యంతో అక్కడి నుండి బయలుదేరారు.
అయితే, అనుష్క ఎవరి కోసమైతే ఎదురుచూస్తోందో... ఆ ప్రమాదకర ముఠా మాత్రం ఈ ఊరి పాత ఇంటికి రాలేదు! ఎందుకంటే... రితిక మరియు ఆమె కుటుంబం ప్రస్తుతం ఎక్కడ దాక్కున్నారో రణధీర్ అప్పటికే కనుక్కున్నాడు. రక్తపాతం సృష్టించడానికి రణధీర్ నేరుగా ఆ దిశగానే బయలుదేరాడు!
--------------------భావన పధకం -------------------------------
ప్రదేశం: వైజాగ్ ఎయిర్‌పోర్ట్ & లెమన్ ట్రీ బిల్డింగ్
సమయం: ఉదయం 11:00 గంటలు
(ముంబై నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరిన భావన, విజయ్‌లు తమ ప్రాణమైన పూనమ్ దేవిని కలుసుకోవాలన్న అంతులేని ఆశతో, ఆరాటంతో సరిగ్గా ఉదయం 11 గంటలకు వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక క్యాబ్ ఎక్కి నేరుగా లెమన్ ట్రీ బిల్డింగ్ వద్దకు వెళ్లారు.)
(అక్కడికి చేరుకోగానే విజయ్ సెక్యూరిటీ సిబ్బందికి తన పేరు చెప్పి, లోపలికి వెళ్లడానికి అనుమతి కోరాడు. ఆ పేరు విన్న వెంటనే... లోపల నుండి సీమ (పూనమ్ దేవి) సెక్యూరిటీతో...)
సీమ: (లోపల నుండి కంగారుగా) "అతన్ని క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే లోపలికి పంపండి!"
(సెక్యూరిటీ గేట్ తెరవగానే కారు లోపలికి వెళ్లడంతో... అప్పటికే గర్భంతో ఉన్న భావన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. ఆమె తన పరిస్థితిని, కడుపులో బిడ్డ ఉన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. కారు ఆగడమే తరువాయి... వేగంగా కార్ దిగి, 'అమ్మా... అమ్మా!' అని పిలుస్తూ వెర్రిదానిలా పరిగెత్తడం మొదలుపెట్టింది.)
విజయ్: (వెంటనే వెనకాలే పరుగెత్తుకుంటూ, భయంతో అరుస్తూ) "భావనా!... భావనా! ఆగు... అలా పరుగెత్తకు! ప్లీజ్ ఆగు!"
(అయినా భావన ఎవరి మాటా వినకుండా, ప్రాణం పోతున్నంత పట్టుదలతో పరుగెత్తింది. అప్పటికే ఆ పేరు విన్న సీమ కూడా హడావిడిగా తన రూమ్ నుండి హాల్ వైపునకు రావడానికి బయలుదేరింది.)
ప్రదేశం: లెమన్ ట్రీ బిల్డింగ్ హాల్
సమయం: ఉదయం 11:15 గంటలు
(ఎదురుగా పరుగెత్తుకుంటూ వస్తున్న ఒక మహిళను చూసి... సీమ మొదట ఆమె అలేఖ్య అనుకుని తన చేతులు చాచింది. ఆమె కళ్లల్లో కూడా ఆనందభాష్పాలు ఉప్పొంగుతున్నాయి. కానీ దగ్గరకు వచ్చి సరిగ్గా చూసేసరికి... సీమ నిలువునా దిగ్భ్రాంతి చెందింది! ఆమె అలేఖ్య కాదు... భావన!)
(ఎదురుగా నిలబడి ఉన్నది పూనమ్ దేవి రూపంలో ఉన్న సీమను చూడగానే... సుమారు 20 ఏళ్ల కిందట తాను కోల్పోయిన తన ప్రాణమైన అమ్మ జ్ఞాపకాలు భావన కళ్ల ముందు మెరిశాయి. చిన్నపిల్లలా, ఊపిరి ఆగిపోతున్నంత పనై ఆమె సీమను గట్టిగా 'దుప్' మంటూ కౌగిలించుకుంది!)
భావన: (విలవిలలాడిపోతూ, గుండెలు బాదుకుంటూ) "అమ్మా... నన్ను క్షమించు అమ్మా! నన్ను క్షమించు... నువ్వు లేవు అనుకున్నాను, అనుష్కతో పాటు నిన్ను కూడా కోల్పోయానని ఒక అబద్ధపు జీవితంలో ఇరవై ఏళ్లు నరకం అనుభవించాను... నన్ను క్షమించు అమ్మా! నన్ను వదిలిపెట్టి మాత్రం వెళ్ళిపోవద్దు అమ్మా... నీ బిడ్డ ఇక ఎక్కడికీ పోదు, అసలు వెళ్లదు..."
(అంతలోనే వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిన విజయ్‌ని చూసి, సీమ మొదట ఏమే అతని భార్య అయి ఉంటుంది అనుకుంది.)
భావన ఏడుపు ఆపుకోలేక, ఉక్కిరిబిక్కిరి అవుతూ ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ ఉంది అప్పుడే వెనుక ఉన్న విజయ్ "భావన ప్లీజ్ అలా ఎడవకు బిడ్డకి ఏమి అయిన అవుతుంది..."
భావన అనే పేరు వినగానే సీమ ఒక్క క్షణం గుండె గట్టిగా నిజంగా నా బొమ్మ ఏమే నా అనే ఆశతో..
సీమ: (ఒక్కక్షణం నిశ్శబ్దంగా ఉండిపోయి, భావనను వెనక్కి జరిపి ఆమె ముఖాన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని, కళ్లలోకి తేరిపార చూస్తూ ఒక్కసారిగా గట్టిగా అరిచింది) "అమ్ము... నిజంగా నువ్వు... నువ్వు మా అమ్మువేనా?!"
భావన: (విపరీతంగా ఏడుస్తూ, తల ఊపుతూ) "అవును అమ్మా... నేనే నీ అమ్మును అమ్మా!"
(ఆ క్షణంలో ఆ తల్లికూతుళ్లిద్దరూ ఎంతసేపు అలా కౌగిలించుకుని ఏడ్చారో వారికే తెలియదు. ఆ ఇరవై ఏళ్ల వేదన, ఆ దూరం అంతా ఆ కన్నీళ్ల రూపంలో కరిగిపోయింది. కసెపటికి సీమ కొద్దిగా తేరుకుని, భావన ముఖం అంతా తన చేతులతో తుడుస్తూ, ముద్దులు పెడుతూ...)
సీమ: (గొంతు గడగడ వణుకుతుండగా) "ఎన్ని రోజులు అయింది నా బంగారు బొమ్మను చూసి... నిన్ను విడిచిపెట్టను అమ్ము, అసలు వదలను!"
(అప్పుడే సీమ చూపు పక్కనే నిలబడి ఉన్న విజయ్ పై పడింది.)
సీమ: (విజయ్‌ని చూసి, భావనతో) "అతనేనా భావనా..."
భావన: (తల ఊపుతూ) "అవును అమ్మా..."
(కానీ భావన ముఖంలో ఏదో దాస్తున్న భయం, ఆందోళన స్పష్టంగా కనిపించాయి. అది సీమకు ఇట్టే అర్థమైంది.)
సీమ: (గీత గీసినట్లుగా, గంభీరంగా) "అమ్ము... నేను నీతో కొంచెం ఏకాంతంగా మాట్లాడాలి. విజయ్, నువ్వు కొంచెం ఇక్కడే బయట ఉండు." అని భావన చెయ్యి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్లింది.
ప్రదేశం: సీమ ప్రత్యేక గది
సమయం: ఉదయం 11:30 గంటలు
(గదిలోకి వెళ్లగానే సీమ భావనను కూర్చోబెట్టి, ఎంతో ప్రశాంతంగా, గంభీరమైన గొంతుతో మాట్లాడటం ప్రారంభించింది.)
సీమ: "అమ్ము... నేను నీకు గుర్తున్నానా? చిన్నప్పుడు నువ్వు ఆశ్రమానికి వచ్చినప్పుడు, నిన్ను కొన్ని రోజుల పాటు ఆ పూనమ్ దేవితో పాటు మరో వ్యక్తి కూడా ఎత్తుకుని తిప్పారు నిన్ను , అనూని... గుర్తుందా?"
భావన: (అమాయకంగా, గందరగోళంగా) " ఏంటమ్మా నువ్వు మాట్లాడేది?ఆ అప్పుడు సీమ అక్క ఉండేది "
సీమ: (కళ్లల్లో నీళ్లు నింపుకుంటూ, భావనను గట్టిగా హత్తుకుని) "అమ్ము..నేను పూనమ్ దేవిని కాదు! నీ సీమ అక్క !"
(ఆ మాట వినగానే భావన గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్లయింది. పూనమ్ అమ్మ నిజంగానే చనిపోయిందా అన్న నిజాన్ని జీర్ణించుకోలేక ఆమె నోటి నుంచి మాట రాలేదు, ఒక శిలావిగ్రహంలా అలా నిలబడిపోయింది.)
భావన: (వణుకుతున్న పెదవులతో, గుసగుసగా) "అంటే... అంటే మా అమ్మ..."
సీమ: (భావన పరిస్థితి అర్థం చేసుకుని, ఆమె భుజాలపై చేయి వేసి) "భయపడకు అమ్ము... నిజమైన పూనమ్ దేవి అమ్మ బతికే ఉంది! నేను ఆమె సొంత చెల్లినే. మేమిద్దరం కవల పిల్లలలా ఒకేలా ఉంటాము.
అందుకే ఆ రోజు ఎవరికీ నిజం తెలియకుండా నేను ఆ పాత్రలో ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం మీ అమ్మ మన ఇంట్లోనే... ఒక దురదృష్టకరమైన ప్రమాదంలో గాయపడి 'కోమా'లో ఉంది!"
(ఆ మాట వినగానే భావనకు ప్రాణం లేచివచ్చినట్లయింది. ఆమె కళ్లలో ఆనందంతో పాటు ఆరాటం ఉప్పొంగింది.)
భావన: (ఆత్రుతగా, కన్నీళ్లతో) "అమ్మ బతికే ఉందా అమ్మా! అయితే నన్ను వెంటనే తీసుకెళ్లు... మా అమ్మను ఇప్పుడే చూడాలి! తను ఎక్కడ ఉంది? నాకు చూపించు అమ్మా!"
సీమ: (భావన చేతులు గట్టిగా పట్టుకుని, ఆపుతూ) "అమ్ము... ముందు నువ్వు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. నీ ఆరోగ్యం నీకు తెలుసు కదా, ఇప్పుడు నీకు ఒంటరిగా లేదు, కడుపులో బిడ్డ ఉన్నాడు.
నేను మీ అమ్మకు దూరంగా ముప్పై ఏళ్లుగా ఉన్నాను... ఆ అమ్మకు నిన్ను చూడాలని ఎంత తపన ఉందో తెలుసా?
నీకు ముందే ఎందుకు చెప్పలేదంటే, నువ్వు ఒక షాడో లాగా ఎప్పుడూ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని ఆ అమ్మ కోరుకుంది.
కానీ అన్నింటికంటే ముఖ్యం... ముందు మనం మన అలేఖ్యను కాపాడుకోవాలి! అలేఖ్య తండ్రి ఎవరో తెలుసా? మన దేశ అత్యున్నత నిఘా సంస్థ 'రా' (RAW) చీఫ్!
ఆయన కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి వెళ్లారు . ఆయన ఒక అమ్మాయిని (రితికాను) వెతుక్కుంటూ వెళ్లారు, అదే ఇక్కడ కాలేజ్ లో జరిగిన గోడవలో ఉన్న అమ్మాయిని , ఇంకా నువ్వు ఆరోజు అక్కడే ఉన్నవా."
భావన: (ఉలిక్కిపడి) "అలేఖ్య... రితిక? ఆ రోజు నేను అక్కడ ఉన్నాను అమ్మా..."
సీమ: "అవును అమ్ము! ఆ రోజు నువ్వు అక్కడ ఏం చేశావో నీకు తెలుసా? నీ అమ్మ కన్నపేగు అయిన ఆ సొంత రక్తంతో పాటు, నీ అక్క ప్రేమించిన ఎంతో మంది బిడ్డలను నువ్వు ఆ రోజు కాపాడావు!"
భావన: (ఆశ్చర్యంగా) "అంటే... నేను కాపాడిన వాళ్లలో..."
సీమ: "అవును అమ్ము! నీ అక్క సొంత బిడ్డలు, కుటుంబసభ్యులు కూడా అక్కడే ఉన్నారు. అందుకే నువ్వు వాళ్లను కాపాడగలిగావు."
భావన: (కన్నీరు కారుస్తూ) "అమ్మ... నేను మా అమ్మను చూడాలి, ఆ పిల్లను కూడా కాపాడుకోవాలి!"
సీమ: "అమ్మ ఇప్పుడు ఆ స్థితిలో ఉంది, అలేఖ్యను కాపాడుకోకపోతే రేపు మనకు కన్నతల్లి ముందైనా తల ఎత్తుకునే హక్కు ఉండదు. నువ్వు వెంటనే రంగంలోకి దిగు అమ్ము. నువ్వు ఒంటరిగా వెళ్లలేవు... మన సైబర్ టీమ్ సాయంతో, RAW చీఫ్ సహాయంతో ఆ పాపను మనం కాపాడుకోవాలి."
ప్రదేశం: లెమన్ ట్రీ బిల్డింగ్ (సైబర్ కంట్రోల్ రూమ్)
సమయం: మధ్యాహ్నం 12:00 గంటలు
(సీమ వెంటనే భావనను తీసుకెళ్లి లెమన్ ట్రీ బిల్డింగ్‌లో ఉన్న అత్యాధునిక 'సైబర్ టీమ్' రూమ్ వద్దకు తీసుకువెళ్లింది. భావన తన ముఖానికి మాస్క్ వేసుకుని, ఎంతో నిపుణురాలిలా లోపలికి అడుగుపెట్టింది.)
సీమ: (సైబర్ టెక్నీషియన్లతో) "మీరందరూ బయటకి వెళ్లండి...!"
(అందరూ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోగానే... భావన తన వెంట తెచ్చిన ఫోన్‌ను టేబుల్ పై పెట్టింది. ఆమె వేళ్లు కీబోర్డ్ మీద మెరుపు వేగంతో కదలడం మొదలుపెట్టాయి. ముంబై నుండి విజయ్ ఫోన్‌కు వచ్చిన ఆ 'ప్రైవేట్ నంబర్'ను ఎన్‌క్రిప్ట్ చేసి, నేరుగా దేశ శాటిలైట్ మొబైల్ సర్వర్లను హ్యాక్ చేయడం ప్రారంభించింది!)
(కేవలం 5 నిమిషాల్లోనే ఆ ప్రైవేట్ నంబర్ తాలూకు ఒరిజినల్ శాటిలైట్ కోఆర్డినేట్స్ భావన స్క్రీన్‌పై కనిపించాయి. ఆ వెంటనే అలేఖ్య మాట్లాడిన ఆ చివరి లొకేషన్‌ను శాటిలైట్ ద్వారా ట్రేస్ చేయడం మొదలుపెట్టింది.)
(మరో 5 నిమిషాల ఉత్కంఠ తర్వాత... భావన ముఖంలో చిన్న చిరునవ్వు వెలిగింది. ఆమె స్క్రీన్ వైపు చూస్తూ సీమను పిలిచింది.)
భావన: (సంతోషంగా) "చూడు అక్కా... ఇదిగో అలేఖ్య లొకేషన్! ఇక్కడ ఒక షిప్ సముద్రంలో ఆగి ఉంది... దాని థర్మల్ ఇమేజింగ్ మన స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ శత్రువులు ఎంతమంది ఉన్నారనేది కూడా మనం ఈ థర్మల్ ఇమేజ్ ద్వారా పక్కాగా కనిపెట్టవచ్చు!"
సీమ: (స్క్రీన్ చూసి దిగ్భ్రాంతి చెందుతూ) "అమ్మా... అక్కడ చూడు, ఇప్పటికే శత్రువులు ఆ షిప్ నిండా చాలా మంది ఉన్నారు! సుమారుగా 70 నుంచి 80 మంది సాయుధులు ఉన్నట్లున్నారు... మరి ఇంత మంది ఉంటే మనం ఎలా అమ్ము?"
భావన: "నీ దగ్గర రా (RAW) చీఫ్ నంబర్ ఉందా అక్కా... నేను కనుక్కొన
సీమ : ఆగు ఆగు ఉంది .!"
సీమ: (కంగారుగా ఆమె చేయి పట్టుకుని) "వద్దు వద్దు అమ్ము... తొందరపడి నేరుగా ఒక్క దానివే వెళ్లకు. ప్రకారమే. నీకు కానీ నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏంఅయిన ఐతే నేను తట్టుకోలేను అమ్ము ... ఆ తర్వాతే మిగతాది!"
భావన: (కన్నీళ్లతో, దృఢమైన నిశ్చయంతో) "సరే అమ్మా... నాకు ఏమి కాదు నేను మాట ఇస్తున్న. కానీ అంతకంటే ముందు ఆ అలేఖ్య ప్రాణాలను కాపాడటం నా మొదటి బాధ్యత."
సీమ: నువ్వు అలేఖ్యని తీసుకుని నేరుగా నువ్వు తెలుసుకోలేని లొకేషన్ కి వెళ్ళు , కొన్నాళ్ళు కనీసం బిడ్డ పుట్టే వరకు అయిన ప్లీజ్ ప్రశాంతంగా బ్రతకండి.
ఆ మాట వినగానే భావన మళ్ళీ సీమ ని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ సరే అమ్మ అని చెప్పింది..
సీమ: గుర్తుంచుకో “ అక్క షాడో ఎప్పటికీ బయటికి తెలియకోడదు”
భావన: నా నియమం నాకు గుర్తుంది అమ్మ నేను ఇప్పుడు వెళ్తున్న, తిరిగి అలేఖ్యతో కలిసి అమ్మ దగ్గరికి చేరుకుంటా అని అక్కడ నుండి బయలు దేరింది.
ప్రదేశం: లెమన్ ట్రీ కారిడార్
సమయం: మధ్యాహ్నం 12:20 గంటలు
(భావన అక్కడి నుంచి బయటకు వచ్చి, పక్కనే ఉన్న విజయ్‌ని తనతో పాటు తీసుకువెళ్లింది. తన బ్యాగ్‌లో ఉన్న ల్యాప్‌టాప్ తీసి ఆన్ చేసి, అందులో నుండి RAW చీఫ్‌కు కాల్ చేయడానికి 'నాన్-ట్రేసబుల్ వాయిస్ ఛేంజర్' సాఫ్ట్‌వేర్‌ను ఆన్ చేసింది. ఎలాంటి గొంతు గుర్తుపట్టలేని విధంగా వాయిస్ మార్చుకుని ఆ అత్యున్నత స్థాయి నంబర్‌కు కాల్ కలిపింది.)
(ఫోన్ రింగ్ అవ్వగానే అవతలి వైపు నుండి దేశ అత్యున్నత నిఘా అధిపతి అయిన RAW చీఫ్ గొంతు గంభీరంగా వినిపించింది.)
RAW చీఫ్: "హలో... హూ ఈజ్ దిస్? (ఎవరు మీరు?)"
భావన: (మార్చబడిన గొంతుతో, చాలా ప్రశాంతంగా కానీ కఠినంగా) "చీఫ్... మీ ప్రయాణం, మీ ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయి?"
RAW చీఫ్: (ఆశ్చర్యంగా, కోపంగా) "ఎవరు నువ్వు? నా పర్సనల్ సెక్యూర్ లైన్‌కి నీకెలా నంబర్ దొరికింది? అసలు ఏం కావాలి నీకు?"
భావన: "ఆ ప్రశ్నలన్నీ ఇప్పటికీ పక్కన పెట్టండి చీఫ్. అలేఖ్య ఎక్కడ ఉందో... ఆ లొకేషన్ ఎక్కడో నాకు కచ్చితంగా తెలుసు! అక్కడ సుమారు 80 మంది సాయుధ శత్రువుల వలయంలో ఆమె బందీగా ఉంది. నేను అలేఖ్యను సురక్షితంగా కాపాడుకుని బయటకు తీసుకువస్తాను... కానీ, నేను చెప్పిన ప్లాన్ ప్రకారమే ఇదంతా జరగాలి!"
RAW చీఫ్: "అసలు నువ్వు ఎవరో చెప్పకుండా నీ మాట నేను ఎందుకు నమ్మాలి? నీకు అసలు ఏం కావాలి?"
భావన: "చూడండి చీఫ్... నేను అంతకంటే ఎక్కువ వివరాలు ఇప్పుడు చెప్పలేను. కానీ మీకు ఒక్క మాట ఇస్తున్నాను... నేను అలేఖ్యను సేవ్ చేసిన వెంటనే, మొట్టమొదట మీకే కాల్ చేసి ఆమెతో మాట్లాడిస్తాను.
నన్ను నమ్మండి! నాకు ఇప్పుడు మీ ఇండియన్ నేవీ పూర్తి సపోర్ట్ కావాలి. 500 మీటర్ల రేంజ్ టార్గెట్‌ను పిన్-పాయింట్ కచ్చితత్వంతో ధ్వంసం చేసే మూడు నేవీ వార్‌షిప్స్ మనకు ఆపరేషన్ కోసంగాలి!"
RAW చీఫ్: (ఒక్క క్షణం ఉలిక్కిపడి) "నేవీ సపోర్టా?! అసలు నువ్వు ఆడుతున్న ఆట ఏంటి..."
భావన: "మాకు టైమ్ లేదు చీఫ్! నా తర్వాతి కాల్ మీకు సరిగ్గా మధ్యాహ్నం 1:30 గంటలకు వస్తుంది... అప్పటికి నేవీ అప్రమత్తంగా ఉండాలి. జై హింద్!"
(టప్ మని ఫోన్ కట్ అయింది! ముంబైలోని RAW చీఫ్ తన టేబుల్ ముందు కూర్చుని, ఆ అజ్ఞాత వ్యక్తి మాటలకు ఏం చేయాలో తోచక బిత్తరపోయి చూస్తుండిపోయారు.)
భావన RAW చీఫ్ కి ఒక ఇమేజ్ పంపింది, అది కూడా థర్మల్ ఇమేజ్ .. అది చూసి RAW చీఫ్ కన్ఫర్మ్ చేసుకున్నాడు.. అతను తన ఆర్డర్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు.
(వైజాగ్ లో భావన తన ల్యాప్‌టాప్ మూసివేసి, పక్కనే ఉన్న విజయ్ వైపు చూసింది. ఆమె కళ్లల్లో కన్నీళ్లు ఉన్నప్పటికీ... ఒక చెల్లిని కాపాడుకోవాలన్న, కన్నతల్లిని కలుసుకోవాలన్న ఆకలి, ఆవేశం ఆ క్షణంలో ఆమెను ఒక యోధురాలిలా మార్చేశాయి.)

ఇట్లు,
✿SUNNY ✿
1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)