Thread Rating:
  • 49 Vote(s) - 3.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ❤️ భావన & విజయ్ ❤️ అపరిచిత బంధం ❤️(రక్త కధనరంగం -1)
ప్రదేశం: ముంబై ఇల్లు (శోభనపు పడకగది)

సమయం: ఉదయం 08:00 గంటలు
 
గత రాత్రంతా తీవ్రమైన అనురాగంలో, శారీరక భావోద్వేగాల వలయాల్లో మునిగిపోయి ఉన్న విజయ్, భావనలు ఆ ఉదయం ఒక్కసారిగా ఆ ఫోన్ మోతతో ఉలిక్కిపడి మేల్కొన్నారు.
 
సమయం ఉదయం 8 గంటలు అవుతోంది. అప్పటికే గర్భంతో ఉన్న భావన ఒళ్లంతా నొప్పులతో, అలసటతో ఉంది. సరిగ్గా అదే సమయంలో మొబైల్ రింగ్ అయింది... అది మోన్న రాత్రి వచ్చిన అదే 'ప్రైవేట్ నంబర్'!
 
ఫోన్ భావనకు కాస్త దగ్గరగా ఉండటంతో, భర్తను ఇబ్బంది పెట్టకూడదని ఆమెనే ఆ ఫోన్‌ను అందుకుంది. కానీ స్క్రీన్ పై ఆ 'ప్రైవేట్ నంబర్' ట్యాగ్ చూసి ఆమె మనసులో ఏదో తెలియని భయం, గుండెల్లో దడ మొదలయ్యాయి.
 
విజయ్ : (కళ్లు నులుముకుంటూ, వెంటనే అప్రమత్తమై) "భావన ...!  ఇంత పొద్దున్నే ఎవరిది ఫోన్? మన నానమ్మ కాదా?"
 
విజయ్: (భావన, వణుకుతున్న గొంతుతో) "శాంతంగా ఉండు విజయ్ , కంగారు పడకు...ఏం మాట్లాడకు"
 
విజయ్ వెంటనే ఆ ఫోన్ తీసుకుని కాల్ లిఫ్ట్ చేసి, గదిలోని అందరికీ వినిపించేలా 'స్పీకర్' ఆన్ చేశాడు. అవతలి వైపు నుండి వినిపిస్తున్న ఆ గొంతు వినగానే ఇద్దరి గుండె ఒక్క క్షణం ఆగిపోయింది...
 
[Image: 613696eebcec6bb28c1f734e60f02732.jpg]

అది అలేఖ్య గొంతు! ఆమె శ్వాస ఆయాసంగా ఉంది, బతికే సమయం చాలా తక్కువగా ఉందన్న మృత్యు భయం ఆ స్వరంలో స్పష్టంగా కనిపిస్తోంది.
 
అలేఖ్య: (ఫోన్‌లో, ప్రాణం పోతున్న ఆయాసంతో, కన్నీటి వేదనతో) "విజయ్... నాకు తెలుసు, నీ జీవితంలో నాకు దక్కాల్సిన స్థానం లేదు అని ఇంకా అది నా కల అని నాకు పూర్తిగా తెలుసు!
 
నేను ఎప్పుడూ నీకూ, భావన అక్కకూ మధ్యలో రావాలని కోరుకోలేదు... రాను కూడా! నేను ఇక మీదట ఎన్ని రోజులు బతుకుతానో నాకే తెలియదు.
 
కానీ చనిపోయే లోపు నా మనసులో ఉన్న కొన్ని ఆఖరి కోరికలను నీ ద్వారా తీర్చుకోవాలనిపిస్తోంది, ప్లీజ్... నాకోసం ఈ మూడు విషయాలు చేయి విజయ్!
 
మొదటగా... మా అమ్మ నాన్నలను నేను సరిగ్గా ఈ జన్మలో చూసుకోలేకపోయాను, వాళ్లకు దూరం అయ్యాను. చిన్నప్పుడే నాకు సొంత వాళ్లు లేరన్న లోటు కూడా రాకుండా నన్ను ప్రాణంగా పెంచి పెద్ద చేసిన ఆ తల్లిదండ్రులకు... మళ్లీ నాకు జన్మంటూ ఉంటే వాళ్ల కడుపునే పుట్టి సేవ చేసుకునే భాగ్యం కల్పించమని చెప్పు విజయ్!
 
[Image: 4a766813268290593277722fae673de6.jpg]

ఇక రెండోది... దేవి అమ్మను నన్ను క్షమించమని చెప్పు. నేను ఆ పరిస్థితులలో ఉండలేక, నన్ను నేను ఆపుకోలేక ఎవరికి చెప్పకుండా అక్కడి నుంచి వచ్చేసాను. ఆ అమ్మ రుణం నేను తీర్చుకోలేకపోయాను...
 
ఇక ఆఖరిగా... భావన అక్కను ప్రాణంతో సమానంగా చూసుకో విజయ్! అక్కకు నువ్వంటే ప్రాణం... నిన్ను నమ్మి సర్వస్వం అర్పించింది, ఆమెను ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకో. మీ ఇద్దరూ ఈ లోకంలో ఎప్పటికీ నూరేళ్లు చల్లగా, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... విజయ్, నేను..."
 
(అంతలోనే అవతలి వైపు లైన్ ఒక్కసారిగా కట్ అయింది... ఆ ఫోన్ పూర్తిగా మూగబోయింది.)
 
[Image: bceb0670ddd8e81aed7d7e5068bb8943.jpg]

(ఆ మాటలు విన్న భావన కళ్లల్లో నుంచి కన్నీళ్లు ఉబికివచ్చి గదిని తడిపాయి. విజయ్ కూడా అదే నిశ్శబ్ద వేదనలో, దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయాడు. 

[Image: 771ee3775ae719533252a4819a6fc6ab.jpg]

ఏమీ మాట్లాడలేక, గొంతు పెగలక... కేవలం భావన వణుకుతున్న చేతిని గట్టిగా పట్టుకుని అలాగే నిశ్శబ్దంగా ఉండిపోయాడు.)
 
భావన: (కన్నీళ్లను గుప్పిలితో తుడుచుకుంటూ, ఉక్కిరిబిక్కిరి అవుతున్న గొంతుతో) "విజయ్... అసలు అలేఖ్యకి ఏమైనా జరిగితే... నేను నా జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను!
 
నేను ఇప్పటికే ప్రేమించిన నా ఇద్దరు అక్కలను కోల్పోయాను... ఇప్పుడు మరో చెల్లిని కోల్పోయే శక్తి నాలో లేదు. మనం ఎలాగైనా అలేఖ్యను కాపాడుకుని తీరాలి, వెతికి పట్టుకుందాం విజయ్!
 
విజయ్: భావన అది సరే కానీ... అలేఖ్య ఇప్పుడే ఆ దేవి అమ్మ గురించి ఏదో చెప్పింది కదా... అసలు ఆ అమ్మ ఎవ..."
 
(భావన మాట పూర్తి కాకముందే... అకస్మాత్తుగా విజయ్ మొబైల్ మళ్లీ మోగింది! ఈసారి ఊరి నుంచి స్వయంగా నానమ్మే ఫోన్ చేసింది. ఆ టెన్షన్‌లో భావనే వెంటనే ఆ ఫోన్ రిసీవ్ చేసుకుంది.)
 
భావన: (వణుకుతున్న గొంతుతో) "చెప్పండి నాని..."
 
నానమ్మ: (అవతలి వైపు నుంచి బోరున విలపిస్తూ) "ఏమని చెప్పాలి తల్లి... మన వల్ల ఒక అభం శుభం తెలియని నిండు ప్రాణం, ఆ పిల్లకు ఏం జరుగుతుందో తెలియని దారుణమైన పరిస్థితి వచ్చింది!

[Image: c6973ee146689be392562ef016cc2b82.jpg]
 
ఎవరికీ కనపడకుండా ఆ అలేఖ్య ఎటో వెళ్లిపోయింది... దేశం అంతా వెతికారు కానీ ఎలాంటి ఆచూకీ దొరకడం లేదు! అక్కడ ఆ పిల్లను తలచుకుని వాళ్ల అమ్మానాన్న ఇద్దరూ నిద్రహారాలు మాని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అంటా తల్లి!
 
భావన: మీకు ఈ విషయం ఎవరు చెప్పారు?
 
నానమ్మ: అసలు నిజం చెప్పాలంటే...ఒకరకంగా నీ కొడుకె దీనికి కారణం , పాపం ఎంత అలరీ ముద్దుగా ఉండే ఆ బిడ్డ జీవితాన్ని నాశనం చేశాడు. ఈరోజు ఇప్పుడే వాళ్ళ పెదనాన్న వచ్చి అడిగి వెళ్లిపోయారు.
 
అలేఖ్యతో పాటు ఆ రోజు మన ఇంట్లోకి వచ్చిన ఆ పూనమ్ దేవి... సొంత అమ్మ కాదు కాదంటా, కానీ ఆ రోజు ఆమె ఆ బిడ్డను కన్నతల్లిలా గుండెల్లో పెట్టుకుని పెంచింది ఏమో అనిపించింది!
 
[Image: 60485fa6099d86ca21068d07430cdd7d.jpg]

ఆమె మాట్లాడిన తీరు ఆ బిడ్డని అర్ధం చేసుకున్న విధానం అసలు ఇతరుల పిల్లల్ని అంత ప్రేమగా చూసుకోవడం అంటే నిజంగా తల్లి ప్రేమ విలువ ఏంటో ఆ పూనమ్ దేవికి మాత్రమే తెలుసు..."
 
భావన: (గుండె ఆగినంత పనై, గట్టిగా అరుస్తూ) "నానమ్మ! ఏమన్నారు?... ఎవరు? ఆ అమ్మ పేరు ఏంటి? మరోసారి చెప్పు నానమ్మ!"
 
[Image: 92fc7d7d8a21ddabeec5c1b24060de0a.jpg]

(పక్కనే ఉన్న విజయ్, ఫోన్‌లో ఉన్న నానమ్మ ఇద్దరూ ఒకేసారి గొంతు కలిపి అన్నారు.)
 
విజయ్ & నానమ్మ: "పూనమ్ దేవి!"
 
(ఆ పేరు వినగానే భావన ప్రపంచమే ఒక్కసారిగా తలకిందులైనట్లయింది. ఆమె కళ్లల్లో నిండిన నీళ్లు అడ్డుకట్టలు తెంచుకుని ఉప్పెనలా ముంచెత్తాయి.)
 
భావన: (వెక్కివెక్కి ఏడుస్తూ, తల బాదుకుంటూ) "నానమ్మ... మా... మా అక్క బతికే ఉందా?... నిజంగా మా అమ్మ బతికే ఉందా నానమ్మ!"
 
నానమ్మ: (ఏడుపు ఆపుకోలేక, గొంతు బొంగురుపోగా) "అవును తల్లి... అక్క ఏంటి ఆమె ఎవరో నీకు తెలుసా . నువ్వు ఇంతగా తపించిపోతున్నావు ఆ పూనమ్ దేవి బతికే ఉంది!
 
భావన: నానమ్మ నాకనటు లోకంలో అమ్మ ,అక్క ఇంకా అన్నీ ఆమె .. ఆమె నన్ను పెంచింది.. నా ప్రాణం ఆమె పెట్టిన బిక్ష , ఆమె నా తల్లి కంటే ఎక్కువ......"

[Image: d4422efe10d8ca59cad02de4aa5e4d24.jpg]
 
నానమ్మ: అమ్మ భావన , నేను చెప్పేది విను .. లోకం ఒకోసారి చాలా చిన్నగా అనిపిస్తుంది. చూశావా తన బిడ్డ ఇన్ని రోజులు కలిసి నీతో నీ కొడుకుతో ఉన్న మనం గుర్తించలేదు.కానీ ఇప్పుడు ఆ బిడ్డకి ఏమి అయిన ఐతే మీ అక్క ముందు మనం తల కూడా ఎత్తుకోలేము
 
భావన: లేదు నానమ్మ నేను ఉండగా అలేఖ్య కి ఏమి కాదు నేను ఆమెని క్షేమంగా తీసుకు వస్తాను
 
నానమ్మ: అమ్మ మీరు కూడా ఇక్కడికి రండి పాపం ఆ తల్లి మనసు తిండి తిప్పలు లేకుండా అలానే ఉండిపోయింది. ఒక్కసారి ఆమెని వచ్చి కలువు..
 
భావన: మా అమ్మ ఎక్కడ ఉంది ఇప్పుడు..
 
నానమ్మ: ఆమె వైజాగ్ లో ఉంటుంది. ఇప్పుడు వచ్చిన అతను ఆమెని కాలవడానికే వెళ్ళాడు. విజయ్ కి ఆమె ఎక్కడ ఉండేది తెలుసు తల్లి
 
భావన : సరే నానమ్మ నేను మళ్ళీ చేస్తాను
 
(ఫోన్ మాట్లాడటం ఐపోయక భావనకి అన్నీ అర్ధం అవుతున్నాయి, అంటే విజయ్ కి ముందే తెలుసు అని ఆమె మనసులో మొదలవగానే భావన మెదడు పూర్తిగా మొద్దుబారిపోయింది.
 
ఆమె వెంటనే నోటిపై చేయి వేసుకుని, మంచం మీద నుంచి కింద నేల మీద పడిపోయింది. తన తలను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఆమె భూమిపై కూర్చుని గుండెలు పగిలేలా ఏడ్వడం మొదలుపెట్టింది. ఆమెకు అసలు ఆ క్షణం నిజమో కాదో నమ్మశక్యం కావడం లేదు.)
 
"అసలు... నాకు ఎందుకు చెప్పలేదు? మా అమ్మ బతికి ఉందని నాకెందుకు చెప్పలేదు?... విజయ్‌ నీకు ముందే తెలుసు కదా! మరి తెలిసి కూడా ఎందుకు దాచావు? నన్ను ఎందుకు ఇంత మోసం చేశావు ?
 
[Image: 4dbdfd6ba6da2b7882c3bb8de26a613f.jpg]

నా బతుకు ఇంత నరకంలా మారుతుంటే... నా అక్క బతికే ఉందని నాకెందుకు చెప్పలేదు విజయ్..." అంటూ విలవిలలాడిపోయింది.
 
విజయ్: (భావనను హత్తుకోబోతూ, కన్నీళ్లతో తల వంచుకుంటూ) "భావనా... నన్ను క్షమించు! నేను కావాలని దాచలేదు..."
 
భావన: (విజయ్‌ని గుండెపై బాదుకుంటూ, తోసేస్తూ) "వద్దు! నన్ను తాకకు! నీకు అన్నీ తెలిసి కూడా నువ్వు నన్ను ఎందుకు మోసం చేశావు విజయ్?
 
నా జీవితంలో నేను రోజూ ఆ దేవుడికి దండం పెట్టుకుని కోరుకున్న మొదటి కోరిక... 'నాకు నా అమ్మను, నా అక్కను మళ్లీ చూపించు స్వామి' అని! వాళ్ళని తలచుకొని రోజు లేదు.
 
అలాంటిది మా అమ్మ బతికే ఉందని నీకు ముందే తెలిసినా... నన్ను ఇంత క్షోభ పెడుతూ నువ్వు ఎందుకు దాచావు? నా వెర్రితనాన్ని చూసి నా వెనుక నవ్వుకున్నావా?"
 
(విజయ్ భావనను ఎంతో కష్టపడి తన చేతుల్లోకి తీసుకుని, కన్నీరు కార్చుతూ ఆమె కళ్లలోకి చూశాడు. అతని కళ్లలోనూ పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తోంది.)
 
విజయ్: "భావనా... నీ బాధ నాకు తెలుసు, నాకూ గుండె పగిలిపోతోంది. నేను అలేఖ్యను తీసుకుని, నీకోసం ఆ అమ్మను కలిసి నిన్ను ఆమె వద్దకు చేర్చాలనే వైజాగ్ వెళ్లాను!
 
కానీ అక్కడ పరిస్థితులు పూర్తిగా ఆ గొడవలు, కుట్రల వల్ల తారుమారయ్యాయి. నువ్వు అప్పుడు నన్ను వదిలి ఒంటరిగా వెళ్లిపోయావు... ఆ పూనమ్ దేవి అమ్మే నన్ను ప్రాణాలతో కాపాడుకుని నాకు వైద్యం చేసింది . ఆ రోజు నువ్వు కాపాడిన ఆ ఆఫీసర్‌ని కూడా ఆ అమ్మే కాపాడింది!
 
కానీ ఆ అమ్మ నాతో స్పష్టంగా చెప్పింది... 'బాబూ, ఈ రక్తపాతానికి, గొడవలకు దూరంగా ఉండు. నువ్వు మళ్లీ ప్రమాదంలో పడతావు, నీ కుటుంబానికి కూడా ముప్పు ఉంది' అని హెచ్చరించింది.
 
పైగా నువ్వు అప్పుడు నాపైన ఉన్న కోపం ఇంకా ఆ రోజు జారీనా గొడవ చూసి ఎక్కడ నీకు ఏమి అయిన అవుతుంది ఏమో అని చెప్పలేదు, మళ్ళీ నువ్వు  గర్భంతో ఉన్నావు అని తెలిశాక...
 
ఇంకా అసలు ఆ నిజం బయటికి చెప్పకోడాడు అనుకున్న .. లోపల ఉన్న బిడ్డ కోసం . ఆ టెన్షన్ నీకు చెబితే ఏమవుతుందోనని భయపడి చెప్పలేకపోయినాను భావనా!
 
నన్ను క్షమించు... నేను నిన్ను మోసం చేయాలని ఏనాడూ అనుకోలేదు, నా ప్రాణం పోయినా నీకు చెడు చేయను!"
 
(విజయ్ చెబుతున్న మాటలు వింటూ భావన గొంతుబొంగురుపోయేలా గుక్కపట్టి ఏడ్చింది. 

[Image: a0d269af5f52b9a008832f7135f9eadf.jpg]

ఆమె కన్నీళ్లు ఒక్క క్షణం కూడా ఆగలేదు. చాలా సేపటి వరకు విజయ్ చేతుల్లోనే ఉండిపోయి ఆమె పూర్తిగా అలిసిపోయింది.)
 
భావన: మా అమ్మ ఇప్పుడు డాక్టర్ అయిందా ..
 
విజయ్: అవును , చాలా పెద్ద మంచి డాక్టర్ ..
 
(కొద్దిసేపటికి భావన తన కన్నీళ్లను బలవంతంగా ఆపుకుని, ఎంతో గంభీరమైన, దృఢమైన గొంతుతో విజయ్ వైపు చూసింది. 

ఆమె కళ్లలో ఇప్పుడు భయం లేదు, కన్నతల్లిగా భావించిన పూనమ్ దేవిని  కలుసుకోవాలన్న తపన, చెల్లిని కాపాడుకోవాలన్న పట్టుదల కనిపిస్తున్నాయి.)
 
విజయ్ : (నిర్ణయించుకున్న ముఖంతో, గట్టిగా) "భావన... ఇంక ఆలస్యం చేయవద్దు. మనం ఇప్పుడే వైజాగ్ బయలుదేరదాం. అలేఖ్యను ప్రాణాలతో కాపాడుకోవాలి... ఆమెని రక్షించి, మీ అమ్మకు నువ్వు ఇవ్వాల్సిన ఆ ప్రేమ బహుమతిని తీర్చాలి! మా అమ్మ ప్రేమించే ఆ అమ్మను నేను మళ్ళీ కలుసుకోవాలి."
 
భావన : కానీ వాళ్ళ నుండి అలేఖ్యని నేను ఒంటరిగా కాపాడలేకపోవచ్చు. కానీ మా అమ్మ కచ్చితంగా ఆ పని చేయగలదు, నేను ఆమె వెనుక ఉన్న అంటే అమ్మకి మరింత ధైర్యంగా ఉంటుంది.
 
విజయ్: సరే భావన, ముందు పూనమ్ అమ్మ దగ్గరికే వెళ్దాం.
 
భావన : (భావన నుదుటిపై ఎంతో గాఢంగా, గౌరవంగా ముద్దుపెట్టి, ఉద్వేగంగా) "కచ్చితంగా విజయ్ ... నువ్వు చెప్పినట్టే చేద్దాం. అలేఖ్యను కాపాడుకుని, మా అమ్మను మనం కలుసుకుందాం. నువ్వు లేచి త్వరగా తయారవ్వు... నేను ఇప్పుడే మన ఇద్దరికీ వైజాగ్ టికెట్లు బుక్ చేస్తున్నాను!"
 
భావన తన ప్రాణం అయిన తన అమ్మని కలవడానికి అలానే అమ్మ కూతురు అయిన అలేఖ్యని కాపాడటానికి తాను జ్ఞాపకంగా దాచుకున్న పూనమ్ దేవి కనపడని ఆయుధాన్ని బయటికి తీసింది..
 
అన్నీ సిద్దం చేసుకుని తన గమ్యం ఇప్పుడు వైజాగ్ వైపు కొండంత ఆశతో , కళ్ళల్లో ఎప్పుడెప్పుడు అమ్మని కలుస్తామా అనే కోరికతో బయలుదేరింది.

విజయ్ వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళింది ఎవరు, అసలు వాళ్ళకి ఎలా తెలిసింది, ఇప్పుడు అక్కడ ఉన్న పూనమ్ దేవి ప్లేస్ లో ఉన్న సీమ దొరికిపోతే ఆమె పరిస్థితి ఏమిటి 
ఇట్లు,
✿SUNNY ✿

1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం
Like


Messages In This Thread
RE: ❤️ భావన & విజయ్ ❤️ అపరిచిత బంధం ❤️(రక్త కధనరంగం -1) - by Sunnysunnysunny - 30-08-2026, 11:43 PM



Users browsing this thread: 1 Guest(s)