10-08-2026, 03:59 PM
ప్రదేశం: దేవి గారి ఇల్లు (ఊరు)
సమయం: ఉదయం 08:30 గంటలు
ఉదయం 08:30 సమయం. అనుష్క కుటుంబం సురక్షితంగా దేవి గారి ఇల్లు చేరుకున్నాక , అక్కడ కాసేపు ప్రశాంతమైన వాతావరణం. కానీ అనుష్క మనసు మాత్రం ఏమాత్రం స్థిరంగా లేదు.
ఆమె వెంటనే సన్నీ ఫోన్ తీసుకుని , తనకు మాత్రమే తెలిసిన ఒక అత్యవసర నంబర్‌కు ఫోన్ చేసి వైద్య బృందాన్ని , భద్రతా సిబ్బందిని రప్పించింది.
సరిగ్గా గంట వ్యవధిలో... ఇంటి ప్రాంగణంలో ఒక ప్రైవేట్ అంబులెన్స్ , డాక్టర్ల బృందం , అలాగే ఒక బ్లాక్ కారు వచ్చి ఆగాయి. ఆ కారులోంచి నమ్మకస్తులైన ఇద్దరు సిబ్బంది దిగారు.
ఇంట్లోని వారంతా అసలు ఏం జరుగుతుందో , అనుష్క ఏం చేయబోతోందో అర్థం కాక తీవ్ర ఆందోళనతో చూస్తున్నారు. డాక్టర్లు లోపలికి వచ్చి అనుష్కను , సన్నీని క్షుణ్ణంగా పరీక్షించారు.
స్పెషలిస్ట్ డాక్టర్- "మేడమ్... సర్జరీ గాయాలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. మీరు పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఒక వారం రోజుల సమయం పడుతుంది. ఈ సమయంలో విశ్రాంతి చాలా అవసరం."
అనుష్క (కంగారుగా)- "నా కొడుకు ఎలా ఉన్నాడు డాక్టర్ ?"
డాక్టర్- "భయపడాల్సింది ఏమీ లేదు మేడమ్. సన్నీ కాలుకి కొద్దిగా వాపు , గాయం ఉంది అంతే. మందులు క్రమం తప్పకుండా వాడితే రెండు రోజుల్లో తగ్గుతుంది."
అనుష్క- "సరే డాక్టర్ , మీరు కాస్త బయట వేచి ఉండండి."
డాక్టర్లు బయటకు వెళ్లగానే... ఇంట్లోని వారంతా అనుష్క బెడ్ చుట్టూ ఆవేదనతో కూర్చున్నారు. అనుష్క నొప్పితో మూలుగుతూనే మెల్లగా పక్కపై సర్దుకుని కూర్చుంది.
ఆమె కళ్లల్లో ఒక భయంకరమైన గంభీరత , అదే సమయంలో మాతృత్వపు తపన ఒకేసారి కనిపిస్తున్నాయి.
అనుష్క కాసేపు నిశ్శబ్దంగా ప్రసాద్ వైపు చూసింది. ఆమె చూపుల్లో నమ్మకం , బాధ ఒకేసారి కనిపిస్తున్నాయి.
అనుష్క- "నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పటి నుండి నేను ఏది చెప్పినా , ఏ నిర్ణయం తీసుకున్నా ఏ ఒక్క చిన్న పొరపాటు లేకుండా అమలవ్వాలి.
మీరందరూ నా మాట వింటారని నమ్ముతున్నాను... ఎందుకంటే ఈసారి నా ప్రాణం పోయినా సరే , నా కుటుంబంలో ఏ ఒక్కరినీ నేను కోల్పోవడానికి సిద్ధంగా లేను!"
ఆ మాట వినగానే దేవి గారి కళ్లు చెమర్చాయి. ఆమె అనుష్క చేయి పట్టుకుని ఓదార్చే ప్రయత్నం చేసింది.
దేవి గారు- "ఏమైంది అనుష్క ? ఎందుకు అంతగా భయపడుతున్నావు తల్లి ? మనం అందరం సురక్షితంగా ఉన్నాం కదా , నీకు మేమున్నాం అమ్మ!"
అనుష్క కళ్లల్లోంచి కన్నీళ్లు ధారగా రాలాయి.
అనుష్క (ఏడుస్తూ)- "నా భయమే అదే అమ్మ! నా వల్ల , నా వెనుక ఉన్న ఈ రక్త చరిత్ర వల్ల... మీలాంటి ఏ పాపం ఎరుగని మంచి మనసున్న వాళ్లకు ఏమవుతుందోనని నా గుండె ఆగిపోతోంది అమ్మ!
నిన్న మనతో ఏ సంబంధం లేని ఒక అమాయక కుటుంబం మనల్ని కాపాడబోయి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది!
ఈ యుద్ధం నాది అమ్మ... 20 ఏళ్ల క్రితం నాపై జరిగిన అన్యాయానికి , నా ఆత్మీయుల చావుకి ప్రతీకారంగా మొదలైన యుద్ధం ఇది! దీన్ని నేనే ముగించాలి...
నా మాటలు మీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించండి , కానీ ఇది మనందరి రక్షణ కోసం చాలా అవసరం!"
దేవి గారు అనుష్క తలను ప్రేమగా నిమిరింది.
దేవి గారు- "సరే తల్లి... నువ్వు ఏది చేసినా మా మంచి కోసమే ఆలోచించి చేస్తావని నాకు తెలుసు. కానీ నా పిల్లల జాగ్రత్త అమ్మ."
అనుష్క- "నేను చూసుకుంటాను అమ్మ. ముందుగా... మీరు ఇప్పుడు ఈ క్షణమే ఇక్కడి నుండి మీ కోడలు అనిత దగ్గరికి వెళ్లాలి!"
దేవి గారు షాక్ అయ్యారు- "ఏంటి అనుష్క ? నేను నా ఉన్న జ్ఞాపకాల ఇల్లు వదిలి ఎక్కడికీ వెళ్లను తల్లి!"
అనుష్క (పట్టుదలగా)- "అమ్మా! ఇది అత్యవసరం కాకపోతే నేను మిమ్మల్ని వెళ్లమని అడగను. కొన్ని రోజులు మాత్రమే అమ్మ. నాకు ఇంకో విషయం కూడా తెలిసింది...
అమెరికా నుండి మీ మనవరాలు (రింకీ) బయలుదేరింది. అనిత అక్కడ ఒంటరిగా ఉంది , మీ మనవరాలి కోసమైనా మీరు అక్కడ ఉండాలి అమ్మ."
దేవి గారు కన్నీళ్లతో తల ఊపారు- "సరే తల్లీ... నా మనవరాలు వస్తోందంటే వెళ్తాను."
అనుష్క మీనాక్షి వైపు చూసింది- "మీనూ! అమ్మమ్మని తీసుకువెళ్లి బయట ఉన్న కార్లో కూర్చోబెట్టు. ఆ డ్రైవర్ సురక్షితంగా అనిత ఇంట్లో దింపుతారు. అలాగే బయట ఉన్న మరో మనిషిని లోపలికి రమ్మను."
మీనాక్షి కన్నీళ్లతో దేవి గారిని పట్టుకుని బయటకు వెళ్లి కార్ ఎక్కించింది . ఆవిడని గట్టిగా హత్తుకుని , ఆ వ్యక్తికి వివరాలు చెప్పి లోపలికి అందరితో పాటు కూర్చుంది.
రితిక అనుష్క అమ్మను గట్టిగా హత్తుకుని , ఆమె భుజంపై తలపెట్టి , అనుష్క గుండె చప్పుడు వింటూ పడుకుంది. అనుష్క ప్రేమగా రితిక తలను నిమురుతోంది.
మీనాక్షి రాగానే... అనుష్క సన్నీ వైపు తీవ్రమైన చూపులతో చూసింది.
అనుష్క- "సన్నీ! నువ్వు ఇప్పటి నుండి సిటీలో ఉన్న రూమ్‌లోనే ఒంటరిగా ఉంటావు. నేను చెప్పే వరకు అక్కడి నుండి మమ్మల్ని కలవడానికి అడుగు బయటకు వేయకూడదు!
ఇక మీనూ , రీతూ... మీరిద్దరూ ఇక్కడి నుండే కాలేజీకి వెళ్తారు , మీ నాన్న ప్రసాద్ ఇక్కడే మీతో ఉంటారు. నేను మాత్రం అయేషాని తీసుకుని మన పాత ఇంటికి వెళ్తున్నాను!"
ఆ మాట వినగానే రీతూ ఉలిక్కిపడి లేచింది!
రితిక (కోపంతో , ఏడుస్తూ)- "అమ్మా! ఏంటిది ? వాడిని ఒక్కడినీ సిటీ రూమ్‌కి ఎందుకు పంపుతున్నావు ? వాడి దగ్గరికి నేను వెళ్తాను!
అసలు ఈ గాయాలతో , ఈ పరిస్థితిలో నువ్వు ఒక్కదానివి ఆ ఇంట్లో ఎలా ఉంటావు ? నేను ఒప్పుకోను!"
ప్రసాద్ కూడా ఆందోళనగా ముందుకు వచ్చాడు.
ప్రసాద్- "అవును అనుష్క! ఇన్నాళ్లకు మనం అందరం కలిసే ఉన్నాం. ఇప్పుడు అందరం ఒకే చోట బలంగా ఉండాలి కానీ... ఇలా ముక్కలై ఉండటం లేదు ఏంటి అనుష్క ?"
అనుష్క ఒక్కసారిగా గంభీరంగా అరిచింది!
అనుష్క- "నేను ముందే చెప్పాను! నేను ఏది చెప్పినా మీరు వినాలి అని! నిన్న మనపై జరిగింది కేవలం ఆ సురేష్ చోప్రా గాడి పని మాత్రమే కాదు!"
ఆ మాట వినగానే గదిలో ఉన్న ప్రసాద్ , సన్నీ , రీతూ , మీనూ , అయేషాలు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు!
సన్నీ- "అమ్మా! నువ్వు ఏం చెప్తున్నావు ? సురేష్ చోప్రా పని కాకపోతే... ఇంకా ఎవరున్నారు అమ్మ ? ఎందుకు మాకు నిజం చెప్పకుండా ఇలా దూరంగా పంపుతున్నావు ?"
అనుష్క (కన్నీళ్లను దిగమింగుతూ)- "నన్ను ఏమీ అడగొద్దు సన్నీ! నేను చెప్పింది అంతే! రీతూ... ఇంకో ముఖ్యమైన విషయం!
వీలైతే ఆ అల్కాకి , ఆమె కుటుంబానికి పూర్తిగా దూరంగా ఉండు! మన వల్ల ఆ అమాయకులకు ఏ ప్రమాదం జరగకూడదు. ఎందుకంటే... ఇది నిన్నమొన్నటి పగ కాదు! ఇది 20 ఏళ్ల నాటి భయంకరమైన రక్తాపతర్పణ!
ఇది మీ కోసం జరుగుతున్న పోరాటం కాదు... ఇది నా కోసం , నా అమ్మలాంటి పూనమ్ దేవి కోసం , నా భావన కోసం జరుగుతున్న మహా యుద్ధం!
ఈ యుద్ధం మొదలైతే... అక్కడ కేవలం ' ఛావు ' మాత్రమే కనిపిస్తుంది! అందుకే నా కుటుంబం తప్ప వేరే ఇతర అమాయకులు ఇందులో బలికాకూడదు!"
అనుష్క మీనాక్షి , రితికల వైపు చూసింది.
అనుష్క- " మీనూ ... మీరు మామూలుగా బయట తిరగొద్దు. మీ వెనుక ఎప్పుడూ నా నమ్మకస్తులైన మనుషులు మిమ్మల్ని రక్షిస్తూ నిరంతరం ఉంటారు. వారి ప్రకారం నడుచుకోండి.
ఇక సన్నీ... నువ్వు ఆ గది దగ్గర నేర్చుకోవాల్సిన అసలైన యుద్ధ విద్యలు చాలా ఉన్నాయి. రేపు నీకు ఒక మహాయోధుడి నుండి ప్రత్యేక శిక్షణ మొదలవుతుంది. జాగ్రత్తగా నేర్చుకో!"
చివరగా అనుష్క ప్రసాద్ వైపు చూసింది. ఆమె కళ్లల్లోంచి కన్నీళ్లు ప్రవాహంలా కారాయి.
అనుష్క (ఏడుస్తూ)- "ఏవండీ... మీరు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఏ చిన్న హాని జరిగినా... నన్ను నేను జీవితంలో ఎప్పటికీ క్షమించలేను!"
ఆ మాటలకు గదిలోని వారందరి కళ్లల్లో నీళ్లు నిండిపోయాయి. విడిపోతున్నామనే బాధ ప్రతి ఒక్కరిలోనూ నిండిపోయింది.
ప్రసాద్ అనుష్క చేతులు పట్టుకున్నాడు.
ప్రసాద్- "చూడు అనుష్క... మనం శరీరాలతో దూరంగా ఉన్నా , మన మనసులు ఎప్పుడూ ఒకే చోట ఉంటాయి. మనం మన పిల్లలకు ధైర్యాన్ని , ధర్మాన్ని నేర్పించాం.
నువ్వు ఏ ధైర్యంతో ఈ యుద్ధానికి సిద్ధమయ్యావో... ఆ ధైర్యంతో ముందుకెళ్లు! నీ వెనుక నీ కుటుంబంగా మేము ఎప్పుడూ ఉంటాం!"
పిల్లలందరూ ఒక్కసారిగా అనుష్కను హత్తుకుని- "అవును అమ్మా... నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాం!" అని ఏడ్చారు.
రితిక కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది.
రితిక- "అమ్మా... కానీ నేను అల్కా వాళ్ల అమ్మను (సీమ/పూనమ్) ఎందుకు కలవకూడదు ? నాకు ఆవిడకు దూరంగా ఉండాలని లేదు అమ్మా..."
అనుష్క రితిక ముఖాన్ని రెండు చేతులతో పట్టుకుని కన్నీళ్లతో అడిగింది.
అనుష్క- "చూడు రీతూ... ఆవిడ ఒక పవిత్రమైన డాక్టర్! తన కళ్లముందే తన కన్న కొడుకు , కూతురు రక్తమోడుతుంటే.
తన సొంత చేతులతో ఆ గాయాలకు కుట్లు వేయాల్సిన భయంకరమైన పరిస్థితి ఆ తల్లికి వచ్చింది!
ఒక కన్న తల్లికి ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా రీతూ ? చెప్పు! మన వెనుక ఉన్న శత్రువుల వల్ల ఆ మంచి కుటుంబం నాశనం అవ్వాలా ? వాళ్లకి ఏమైనా జరగాలా చెప్పు ?"
రితిక భోరున ఏడుస్తూ అనుష్క గుండెలకు హత్తుకుంది.
రితిక- "వద్దమ్మా వద్దమ్మా! ఇంకేమీ చెప్పకు... నేను ఆవిడకి దూరంగానే ఉంటాను! వాళ్లకి ఏమీ కాకూడదు అమ్మా!"
అనుష్క కూడా కూతురిని గట్టిగా హత్తుకుని ఏడ్చింది. తన ముందర ఉన్న భయంకరమైన రహస్య శత్రువును ఒంటరిగా ఎలా ఎదుర్కోవాలా అని మనసులోనే వ్యూహాలు రచిస్తోంది.
అనుష్క లేచి నిలబడి- "సరే... అందరూ బయలుదేరండి" అని చెప్పి , బయట ఉన్న డ్రైవర్‌ను లోపలికి పిలిచింది.
అనుష్క (డ్రైవర్‌తో)- "నువ్వు సన్నీని తన సిటీ రూమ్ దగ్గర దించి... కారును నేరుగా ' లెమన్ ట్రీ ' సీక్రెట్ భవనం దగ్గరకు తీసుకెళ్లి తాళాలు అక్కడ ఇవ్వు.
వాళ్లు నిన్ను ' మమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేశావు , ఎక్కడి నుండి వచ్చావు ' అని అడుగుతారు. నువ్వు కేవలం ' వాళ్లను రైల్వే స్టేషన్‌లో దింపేసి వచ్చాను ' అని మాత్రమే చెప్పు! ఇంకేమీ మాట్లాడకు. వెళ్లు."
సన్నీ అనుష్క దగ్గరకు వచ్చాడు. అనుష్క కన్నీళ్లతో సన్నీ నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకుని వీడ్కోలు చెప్పింది. సన్నీ బరువుగా అడుగులు వేస్తూ బయటకు వెళ్లి కార్ ఎక్కాడు.
అనుష్క అయేషాను తీసుకుని అంబులెన్స్‌లో తమ పాత ఇంటికి బయలుదేరింది. రీతూ , మీనూలు కన్నీళ్లతో తమ తండ్రి ప్రసాద్ దగ్గరే ఉండిపోయారు.
అప్పటి వరకు ప్రాణానికి ప్రాణంగా ఒకే చోట ఉన్న ఆ ఆదర్శ కుటుంబం... మొదటిసారిగా ఒకరికొకరు తోడు లేకుండా దారుల్లో విడిపోయింది!
రాబోయే భయంకరమైన వినాశకర యుద్ధం కోసం ప్రతి ఒక్కరూ సిద్ధమవుతున్నారు.
కానీ ఆ కన్నతల్లి అనుష్క మనసులో ఏ భయంకరమైన వ్యూహం ఉందో , ఆ రహస్య శత్రువు ఎవరో ప్రసాద్‌కి కూడా అర్థం కాలేదు!

ఇట్లు,
✿SUNNY ✿
1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)