08-08-2026, 03:12 PM
ప్రదేశం: దేవి గారి ఇల్లు
సమయం: సాయంత్రం 4:30 గంటల నుండి రాత్రి 9:00 గంటలు
ఆఫీసు నుండి బయలుదేరిన అయేషా, మీనాక్షి ఇద్దరూ ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేకుండా, కంగారుగా పరుగెత్తుకుంటూ ఊరిలోని తమ నాన్న ఉన్న (దేవి గారి) ఇంటికి చేరుకున్నారు.
ఇంట్లోకి రాగానే దేవి వద్ద కూర్చుని ఉన్న ప్రసాద్ ని చూసి ఇద్దరూ ఒక్కసారిగా ఏడుస్తూ అతడిని హత్తుకున్నారు.
అయేషా (ఏడుస్తూ)- "నాన్నా... అమ్మ మమ్మల్ని హఠాత్తుగా ఇక్కడికి వెళ్ళమంది నాన్నా! ఆఫీస్‌కి, కాలేజీ నుండి ఎక్కడికీ వెళ్ళకూడదని, వెంటనే నీ దగ్గరికి రమ్మని చెప్పింది.
నాకెందుకో చాలా భయంగా ఉంది నాన్నా!అమ్మ చాలా కంగారు పడుతుంది, ఇంకా సన్నీ , రితిక కోసం భయంగా ఉంది. వాళ్ళ ఇద్దరికీ ఏమైనా అవుతుంది అని"
మీనాక్షి- "అవును నాన్నా... అమ్మ గొంతులో ఏదో తెలియని వణుకు వినిపించింది. సురేష్ చోప్రా గాడు ఏమైనా కుట్ర చేశాడా? నాన్న...
మన అనుష్క అమ్మకి,సన్నీకి ఏమైనా అవుతుందా నాన్నా? నాకు గుండె ఆగిపోయినంత పని అవుతోంది!"
ప్రసాద్ ఇద్దరినీ గుండెలకు హత్తుకుని ఓదారుస్తున్నాడు. కానీ, అతడి గుండె లోపల కూడా భయంకరమైన ప్రళయం సుడిగుండంలా తిరుగుతోంది.
సురేష్ చోప్రా ఎంతటి భయంకరమైన రాక్షసుడో, ఆస్తి కోసం ఏమైనా చేయగలడో ప్రసాద్కి బాగా తెలుసు. పైకి ధైర్యం చెప్తున్నా అతడి గుండెల్లో మంట రగులుతోంది.
ప్రసాద్ (కన్నీళ్లు దాచుకుంటూ)- "పిల్లలూ... ఏమీ కాదు. మీ అమ్మ ఎలాంటిదో మీకు తెలుసు కదా! ఆమె తన బిడ్డల కోసం, కుటుంబం కోసం ఏ రాక్షసుడినైనా నరికి పారేస్తుంది.
అలాగే రితిక చాలా తెలివి ఉన్న అమ్మాయి తనని తాను చూసుకుంటుంది ,మన అనుష్కకి ఏమీ కాదు. సన్నీని, రీతూని సురక్షితంగా తీసుకుని మీ అమ్మ తిరిగి వస్తుంది. ధైర్యంగా ఉండండి!"
కానీ కాలం గడుస్తున్న కొద్దీ భయం కొండంతగా పెరుగుతోంది. ప్రసాద్ పదే పదే అనుష్క ఫోన్‌కి ప్రయత్నిస్తున్నాడు...
'ది నంబర్ యు ఆర్ కాలింగ్ ఈజ్ విత్ ఇన్ జామర్ నెట్‌వర్క్ / నాట్ రీచబుల్' అని వస్తోంది. సన్నీకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. రీతూ ఫోన్ అసలు కలవడమే లేదు.
చీకటి పడుతోంది. గంటలు గడుస్తున్న కొద్దీ అయేషా, మీనాక్షిల ఏడుపులు ఆగడం లేదు. నన్నమ్మ దేవి వారిని ఓదారుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటోంది.
రాత్రి 9:00 గంటలు దాటింది. మళ్లీ ఒకసారి ధైర్యం చేసి ప్రసాద్ సన్నీ ఫోన్‌కి ట్రై చేశాడు. ఈసారి రింగ్ అయింది!
అవతలి వైపు ఫోన్ లిఫ్ట్ అయింది. కానీ ఫోన్ ఎత్తింది సన్నీ కాదు... రీతూ!
రీతూ (ఫోన్ లో)- "హలో... మీనాక్షి అక్కా..."
మీనాక్షి వెంటనే ఫోన్ లాక్కుని- "రీతూ! రీతూ! ఎక్కడున్నారురా మీరు? అమ్మ ఎలా ఉంది? సన్నీ ఎలా ఉన్నాడు? మేము ఇక్కడ చచ్చిపోతున్నాము మీ కోసం! ఏమైంది అక్కడ?" అని భోరున ఏడ్చేసింది.
రితిక తన లోపల రగులుతున్న కొండంత బాధను, ఐసియులో అనుష్క అమ్మ చావుబతుకుల మధ్య ఉందనే నిజాన్ని గుండెల్లోనే దాచేసుకుంది. బయటకు ఒక్క చిన్న మాట కూడా పొక్కకుండా, ప్రశాంతమైన గొంతుతో మాట్లాడింది.
రితిక- "అక్కా... మేమందరం క్షేమంగానే ఉన్నాం. ఏమీ కంగారు పడకండి. ఇక్కడ అల్కా మేడమ్ వాళ్ల ఇంట్లో ఉన్నాం. సన్నీ ఆఫీస్ పనుల్లో ఉండి ఫోన్ చూసుకోలేదు.
వారు కూడా చాలా బాగున్నారు. మేమందరం కాసేపట్లో ఇంటికి వచ్చేస్తాం. మీరు ప్రశాంతంగా పడుకోండి, నాన్నకి కూడా చెప్పండి."
మీనాక్షి ఊపిరి పీల్చుకుని- "నిజంగానే అంతా బాగుందా రీతూ?"
రితిక- "అవును అక్కా... అంతా బాగుంది. మేము త్వరలోనే వస్తాం." అని చెప్పి ఫోన్ కట్ చేసింది.
కాల్ కట్ కాగానే రితిక కళ్లల్లోంచి కన్నీళ్లు ముత్యాల్లా రాలాయి. ఇటు ఊరిలో మీనాక్షి, అయేషా, ప్రసాద్లు కొంత ఊరట చెందినా, ప్రసాద్ కి మాత్రం ఏదో చెడు జరిగిందనే అనుమానం తీరలేదు.
ప్రదేశం: లెమన్ Tree సీక్రెట్ బిల్డింగ్ - ఆపరేషన్ థియేటర్ బయట
సమయం: రాత్రి 09:30 గంటలు
ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చిన సీమ (పూనమ్ దేవి) చుట్టూ పిల్లలందరూ ప్రేమగా, భద్రతగా చేరుకున్నారు.
అనుష్క ప్రాణాపాయం నుండి బయటపడిందనే వార్త అందరి గుండెల్లో నిండిన కొండంత భారాన్ని ఒక్కసారిగా దించేసింది. అక్కడ ఉన్న మెడికల్ టీమ్ అంతా తమ వస్తువులు సర్దుకుని వెళ్లడానికి సిద్ధమయ్యారు.
కానీ ఆ స్పెషలిస్ట్ డాక్టర్ మాత్రం అక్కడే ఆగిపోయి, అప్పటినుండి తన మనసును తొలిచేస్తున్న ఆశ్చర్యంతో సీమ వైపు చూశాడు.
డాక్టర్: "మాడమ్... నన్ను క్షమించండి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా?"
పిల్లలు, సీమ అందరూ అతడి వైపు చూశారు.
డాక్టర్: "మీరు నిజంగా ఎవరు మాడమ్? అంత సీరియస్ న్యూరో-సర్జరీ ప్రాసెస్ లో ఒక్క చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోతాయని మా అందరికీ తెలుసు.
కానీ మీరు ఎలాంటి భయం లేకుండా, ఏ ప్రాక్టీస్ లేకుండా ఒంటరిగా ఆ ఆపరేషన్ సక్సెస్ చేశారు! కనీసం 20 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న టాప్ సర్జన్ తప్ప ఇది ఎవరూ చేయలేరు... మీ గురించి నేను తెలుసుకోవచ్చా?"
సీమ ముఖంలో ఒక చిన్న, ప్రశాంతమైన నవ్వు వెలిసింది. ఆ నవ్వు వెనుక తన అక్క పూనమ్ దేవి త్యాగం, తన వృత్తిపై ఉన్న పట్టు దాగి ఉన్నాయి.
సీమ (పూనమ్ రూపంలో): "అది అంత పెద్ద విషయం కాదు డాక్టర్. నా పిల్లల సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను! నేను ఎవరో మీకు తర్వాత తెలుస్తుంది... ఇప్పుడు మీరు వెళ్లండి."
ఆ సమాధానం వినగానే డాక్టర్ ఆశ్చర్యంతో తలాడించి వెళ్లిపోయాడు. ఒకవేళ సీమ ఆ క్షణంలో తన అసలు పేరు (ప్రపంచ టాప్ సర్జన్ డాక్టర్ సీమ) అని చెప్పి ఉంటే... అక్కడ కథ మరో రకంగా మారేది! కానీ ఆమె తన అక్క 'పూనమ్' పాత్రలోనే ఉండిపోయింది.
రితిక కళ్లల్లోంచి మళ్లీ కన్నీళ్లు కారడం చూసి సీమ ప్రేమగా ఆమె దగ్గరకు వచ్చింది.
సీమ: "చూడు రీతూ... అంతా మంచిగా జరిగినా ఇంకా ఏడుస్తూనే ఉన్నావా తల్లి?"
రితిక ఏమీ మాట్లాడకుండా సీమను మరింత గట్టిగా కౌగిలించుకుని ఆమె గుండెల్లో ముఖం దాచుకుని రోదించింది.
ప్రదేశం: హాల్ & రెస్ట్ రూమ్
సమయం: రాత్రి 10:30 గంటలు
రాత్రి 10:30 అయింది. లోపల మెడికల్ కేర్‌లో ఉన్న ముగ్గురు అబ్బాయిలకి (సోను, విజయ్, సన్నీ) మెల్లగా మత్తు వదిలి స్పృహ వచ్చింది.
సన్నీ కంగారుగా చుట్టూ చూస్తూ, పక్కనే ఐసియులో పడుకుని ఉన్న అనుష్క అమ్మని చూసి కంటి నీళ్లు పెట్టుకున్నాడు.
బయట సీమ అందరికీ కొసరి కొసరి వడ్డిస్తుంటే... వర్ష, అల్కా, అలేఖ్య, సోనులతో కలిసి విజయ్ గురించి మాట్లాడుతున్నారు.
కానీ లోపల ఉన్న సన్నీ, రితికల గుండెలు మాత్రం తమ ప్రాణమైన అనుష్క అమ్మ కోసమే తల్లడిల్లుతున్నాయి. అన్ని బాధలను దిగమింగుకుంటూ, కన్నీళ్లను లోపలే అణచుకుంటున్నారు.
ఇటు రితిక... సన్నీ దగ్గరకు వెళ్లి, అనుష్కకి ఏం కాలేదన్నట్లు ప్రశాంతంగా తల ఊపింది. సన్నీ, సోనులు మెల్లగా నిద్రలోకి జారుకున్నారు.
ప్రదేశం: ఐసియు గది
సమయం: రాత్రి 02:15 గంటలు
సరిగ్గా రాత్రి 02:00 గంటల సమయం! ఎవరో ఏడుస్తున్న చిన్న శబ్దం విని పూనమ్ (సీమ) కళ్లు తెరిచింది. తన పక్కన ఒకవైపు అల్కా తన్ను వదలకుండా పట్టుకుని పడుకుని ఉంది. మరోవైపు పడుకుని ఉన్న రితిక అక్కడ లేదు!
అందరూ అలసిపోవడంతో... హాల్లో పెద్ద మ్యాట్రెస్‌లు వేసి అందరూ ఒకే చోట పడుకున్నారు.
సరిగ్గా రాత్రి 02:00 గంటల సమయం!
ఎవరో ఏడుస్తున్న చిన్న శబ్దం విని పూనమ్ కళ్లు తెరిచింది. తన పక్కన ఒకవైపు అల్కా తన్ను వదలకుండా పట్టుకుని పడుకుని ఉంది. మరోవైపు పడుకోని ఉన్న రితిక అక్కడ లేదు!
పక్కనే అలేఖ్య కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడుస్తోంది. వర్ష అల్కాని పట్టుకుని నిద్రపోతోంది. పూనమ్ మెల్లగా అల్కాని పక్కకు జరిపి, ఆమె నుదుటిపై ముద్దుపెట్టి లేచింది.
అలేఖ్య దగ్గరకు వెళ్లి ఆమెను పట్టుకుంది. అలేఖ్య ఒక్కసారిగా సీమను హత్తుకుని గుండెలపై ఏడ్చేసింది.
పూనమ్ : (మెల్లగా, నిశ్శబ్దంగా) "నీకు ఆ అబ్బాయి (విజయ్) అంటే ఇష్టమా తల్లి?"
అలేఖ్య: (ఏడుస్తూ తల ఊపింది) "అవునమ్మా..."
పూనమ్ : (అలేఖ్య కన్నీళ్లు తుడిచి, ప్రేమగా) "సరే... నేను నీకు మాట ఇస్తున్నాను! అతడితో నీ పెళ్లి చేసే బాధ్యత నాది, సరేనా?"
అలేఖ్య ఒక్కసారిగా సీమ వైపు ఆశ్చర్యంగా చూసింది.
పూనమ్ : "ఏంటి... నన్ను నమ్మట్లేదా? నేను అందరితో మాట్లాడి మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను. కానీ నువ్వు ఇప్పుడు పడుకోవాలి. వాళ్లు కోలుకోగానే మనం అక్కడికి వెళ్దాం.
నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నీ ఫేస్ పాడైపోతుంది, అప్పుడు అతడికి నువ్వు నచ్చకపోతే ఎలా?"
అలేఖ్య ముఖంలో చిన్న చిరునవ్వు వికసించింది. "హ్మ్మ్..." అంటూ కన్నీళ్లు తుడుచుకుంది. సీమ ఆమె బుగ్గపై ప్రేమగా ముద్దు పెట్టుకుని, "నువ్వు పడుకో... నేను లోపల వాళ్లను చెక్ చేసి వస్తాను" అని లేచింది.
సీమ ఐసియు గది వైపు నడుచుకుంటూ వెళ్తుండగా... తలుపుల సందులోంచి లోపల ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్క క్షణం అక్కడే ఆగిపోయింది!
అక్కడ... రితిక, సన్నీ మరియు అనుష్కల బెడ్‌ల మధ్యలో నేలపై కూర్చుని ఉంది!
ఆమె ఒక చేత్తో బెడ్‌పై ఉన్న అనుష్క చేయిని, మరొక చేత్తో సన్నీ చేయిని పట్టుకుని అనుష్క ముఖం వైపు తదేకంగా చూస్తోంది. సోనుతో సహా అందరికీ దుప్పట్లు కప్పి ఉన్నాయి.
రితిక కళ్లల్లో ఎలాంటి వికారం లేదు, ఏడుపు లేదు... కేవలం ఎనలేని నిశ్శబ్దంతో కూడిన అమితమైన ప్రేమ మాత్రమే ఉంది!
లోపల ఏ ప్రళయం జరుగుతుందో ఎవరికీ తెలియనివ్వకుండా, బయటకు అంత ప్రశాంతంగా ఉందో ఆ పిల్ల!
సీమ మనసులో అనుకుంది: (మనసులో) "ఈ అమ్మాయి నిజంగా నా అక్క కంటే గుండె నిబ్బరం ఉన్నదిలా ఉంది! ఎంత ప్రశాంతంగా ఉందో... లోపల ఇంత బాధను దాచుకుని అందరిపట్ల ఎంత ప్రేమగా ఉంది!
ఈమె నిజంగా అందరికంటే చాలా ప్రత్యేకమైనది. బహుశా... ఈమె నా అక్క కూతురే అయి ఉంటుంది! కానీ అందరూ నన్నే అమ్మ అని ఎందుకు పిలుస్తున్నారు? అసలు ఈ కుటుంబం ఏంటి, వీరి అనుబంధాలు ఏంటి?"
సీమ నెమ్మదిగా లోపలికి అడుగులు వేసింది. అనుష్క పక్కన నిలబడి, ఆమె చెంపపై చేయి వేసి హెల్త్ రిపోర్ట్స్ చూసింది. అనుష్క హార్ట్ బీట్ నార్మల్‌గా కొట్టుకుంటోంది, కోలుకుంటోంది!
అప్పుడే రితిక... సీమ చేయిపై తన చిన్న చేయి వేసి "అమ్మా..." అని పిలిచింది. సీమ చల్లగా, అమితమైన ప్రేమతో రితిక వైపు చూసింది.
రితిక: "వీళ్లందరూ ఎప్పుడు లేస్తారు అమ్మా?"
సీమ: (నవ్వుతూ) "నువ్వు ఇప్పుడు వెళ్లి పడుకో తల్లి... నువ్వు నిద్రలేచే సరికి వాళ్లు కూడా నవ్వుతూ లేస్తారు, సరేనా? రా..."
సీమ రితిక చేయి పట్టుకుని బయటకు తీసుకువచ్చింది. ఇద్దరూ మ్యాట్రెస్ పైన పడుకుని, ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని ప్రశాంతమైన నిద్రలోకి జారుకున్నారు!
ప్రదేశం: ఐసియు గది - అనుష్క మేల్కొనడం & ప్రయాణం
సమయం: ఉదయం 05:30 గంటల నుండి 07:30 గంటల వరకు
సరిగ్గా ఉదయం 05:30 గంటలకు... ఐసియు గదిలో ఉన్న అనుష్కకి సడన్‌గా మేల్కువ వచ్చింది! ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ ఉలిక్కిపడి లేచి... "రీతూ!" అని గట్టిగా అరిచింది!
ఆ అరుపు వినగానే పక్కనే ఉన్న సోను, సన్నీలు ఉలిక్కిపడి లేచారు! సోను కంగారుగా పరుగెత్తుకెళ్లి అనుష్క చేయి పట్టుకున్నాడు.
సోను: "మేడమ్ మేడమ్! ఏం కాలేదు... అందరం బానే ఉన్నాం! రీతూ అక్క కూడా ఇక్కడే ఉంది, మీరేం కంగారు పడకండి!"
సన్నీ కుంటుకుంటూ వచ్చి అనుష్క వైపు చూశాడు. అనుష్క ఏదో అడగబోతుంటే సన్నీ "ఇష్ష్శ్..." అని పెదవులపై వేలు వేసి సైగ చేశాడు. అర్థం చేసుకున్న అనుష్క మెల్లగా అంది:
అనుష్క: "రీతూని పిలువు నాన్నా..."
సోను సంతోషంగా "సరే మేడమ్!" అని హాల్లోకి పరుగెత్తి పడుకున్న రీతూ, అల్కా, వర్ష, అలేఖ్యలను లేపాడు.
సోను: "అక్కా! లేవండి లేవండి!"
అల్కా: (కళ్లు నలుపుకుంటూ) "ఏమైందిరా బండోడా? బానే ఉన్నావా?"
సోను: "అబ్బా! మీరంతా నాకంటే ముందే ఎలా పుట్టారో తెలీదు... ఇంత కూడా తెలివి లేదు! నేను బాగున్నాను కాబట్టే మిమ్మల్ని లేపుతున్నాను. ఆ మేడమ్‌కి స్పృహ వచ్చింది!"
ఆ మాట పూర్తి కాకముందే... రీతూ సోనుని పక్కకు తోసేసి ఐసియు లోపలికి పరుగెత్తింది! వెనుక అందరూ నిద్రలోనే ఉలిక్కిపడి ఆమె వెనుకాల పరుగెత్తారు. ఆఖరున ఉన్న అలేఖ్య సోనుని పట్టుకుని జాగ్రత్తగా లోపలికి తీసుకువెళ్లింది.
అప్పటికే లోపల సన్నీ అనుష్కతో మాట్లాడాడు:
సన్నీ: "అమ్మా! మేమందరం క్షేమంగానే ఉన్నాం."
అనుష్క: "మన మీద దాడి చేసింది ఎవరురా సన్నీ?"
సన్నీ: "నాకు తెలీదు అమ్మా... కానీ తర్వాత ఒక ఆమె వచ్చి అందరినీ కాపాడి నిన్ను తీసుకువెళ్లమంది. అల్కా వాళ్ల అమ్మ నీకు ఆపరేషన్ చేసి ప్రాణాలు పోసింది!"
అనుష్క: "ఆవిడ డాక్టరా?"
సన్నీ: "అవును అమ్మా. రీతూ ఇక్కడే ఉంది. వాళ్లు నిన్ను పెద్ద సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ అనుకుంటున్నారు... నువ్వు ఎవరో వాళ్లకు తెలీదు."
అనుష్క: "సన్నీ! మన వల్ల ఇంత మంచి కుటుంబం ముక్కలవడం మంచిది కాదు. మనం త్వరగా ఇక్కడి నుండి వెళ్లాలి, టైమ్ లేదు!"
అప్పుడే రీతూ పరుగెత్తుకుంటూ వచ్చి అనుష్క గుండెల పైన పడి భోరున ఏడ్చేసింది! సన్నీ "అక్కా! వాళ్లు వస్తున్నారు, అమ్మ ఎవరో వాళ్లకి తెలీదు!" అని హెచ్చరించడంతో, రీతూ వెంటనే తేరుకుని అనుష్క చేయి పట్టుకుని కూర్చుంది.
అల్కా లోపలికి వచ్చి అనుష్క పక్కన కూర్చుని: "మేడమ్! మీకు ఇప్పుడు ఎలా ఉంది? అసలు మీరెవరు?" అని కంగారుగా అడిగింది.
నైట్ నుండి భయం భయంగా ఉన్న వర్ష... ఇప్పుడు అనుష్క సురక్షితంగా ఉండటం చూసి ఊపిరి పీల్చుకుంది.
వర్ష: "మేడమ్! మీరు మా అందరి ప్రాణాలు కాపాడారు. మీ రుణం మేము తీర్చుకోలేము!"
అనుష్క: "పర్లేదు అమ్మ... నేను నా కర్తవ్యం చేశాను. అయినా పిల్లల కోసం ఎంత చేసినా తక్కువే!"
అల్కా: "మీ పిల్లలా మేడమ్?"
అనుష్క: (సర్దుకుంటూ) "లేదు... నేను నిన్న ఒక మిషన్ మీద మీ కాలేజీకి వచ్చాను. అక్కడ గొడవ చూసి జోక్యం చేసుకున్నాను. కానీ నేను వెంటనే నా డిపార్ట్‌మెంట్‌కి ఇన్ఫార్మ్ చేయాలి, లేకపోతే పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. నన్ను డ్రాప్ చేయండి."
అల్కా: (పట్టుదలగా అనుష్క చేయి పట్టుకుని) "లేదు మేడమ్! మా అమ్మ బయటకు వెళ్లింది, అమ్మ వచ్చే వరకు మిమ్మల్ని ఎక్కడికీ పంపను!"
అనుష్క: (ప్రేమగా) "చూడు తల్లి... నన్ను అర్థం చేసుకో. నా కుటుంబం రాత్రి నుండి నా కోసం ఎంత కంగారుగా ఉంటుందో ఆలోచించు! నాకూ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు నీలాగే... నేను మళ్లీ తప్పకుండా వచ్చి మీ అమ్మగారిని కలుస్తాను."
వర్ష: "అల్కా... మేడమ్‌ని వెళ్లనివ్వు, ఏం కాదు."
అల్కా: "లేదు లేదు అమ్మ చెప్పే వరకు నేను పంపను, నాకు ఏం చెప్పకు అక్క!"
సన్నీ: "అల్కా మేడమ్... ఆవిడ బాధ్యతగల ఆఫీసర్. ఆమె కుటుంబం, ఆమె కర్తవ్యం ఆవిడకు ఉంటాయి. మీరు అడ్డుపడకండి ప్లీజ్."
సన్నీ చెప్పిన మాటలకు అల్కా మౌనంగా అనుష్క చేయి వదిలేసింది. అనుష్క సన్నీ, అల్కాల వైపు నవ్వుతూ చూసి నెమ్మదిగా లేచింది.
రీతూ "నేను కూడా వస్తాను!" అనగానే... వర్ష "రీతూ నువ్వు ఉండు" అంది.
సన్నీ: "మేడమ్... మా అక్కకి కాలేజీలో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంది. ఏడాది అంతా కష్టపడింది, ఇప్పుడు ఇక్కడే ఆగిపోవడం మంచిది కాదు. ఆమెను హాస్టల్‌లో దింపి, నేను మేడమ్‌ని వాళ్ల ఇంట్లో దింపి నా రూమ్‌కి వెళ్తాను, ప్లీజ్ కాదనకండి."
వర్ష: "నీ కాలు సరిగ్గా లేదు సన్నీ..."
అల్కా: "అబ్బా అక్కా! నువ్వెందుకు ప్రతీదానికీ ఎదురు చెప్తావు? సన్నీ... ఒక్క నిమిషం ఆగు!"
అల్కా లోపలికి వెళ్లి తన కార్ కీస్, ఎటిఎం కార్డ్ తీసుకొచ్చింది. కార్ కీస్ సన్నీకి ఇస్తూ అంది:
అల్కా: "ఇదిగో... కార్ కీస్, ఎటిఎం కార్డ్! మీరు మేడమ్‌కి, మీ అక్కకి కావలసిన మెడిసిన్స్, మిగతావి తీసుకుని సురక్షితంగా దింపండి. కాదనకండి ప్లీజ్!"
సన్నీ: "మేడమ్... నా దగ్గర డబ్బులు ఉన్నాయి..."
అనుష్క: (నవ్వుతూ తల ఊపుతూ) "తీసుకో సన్నీ."
సన్నీ కార్డు తీసుకుని, అనుష్క, రీతూలతో కలిసి బయలుదేరాడు.
ప్రదేశం: ఊరిలోని దేవి గారి ఇల్లు
సమయం: ఉదయం 07:30 గంటలు
అటు దేవి గారి ఇంట్లో... రాత్రంతా నరకం అనుభవించిన ప్రసాద్ , ఆ రాత్రి ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు.
శత్రువులు ఎప్పుడు ఎటువైపు నుండి వస్తారోనని, చేతిలో ఒక పెద్ద కత్తి పట్టుకుని, పడగ విప్పిన త్రాచులా ఇంటి బయట తిరుగుతూ ప్రతి శబ్దాన్ని గమనిస్తూ కాపలా కాశాడు.
లోపల అయేషా, మీనాక్షిలు అనుష్క అమ్మని తలుచుకుని ఏడుస్తూ, ఏడుస్తూ దేవి గారిని పట్టుకుని ఎప్పుడు నిద్రలోకి జారుకున్నారో వారికే తెలియదు.
సరిగ్గా ఉదయం 07:30 గంటలకు అల్కా కారు వచ్చి ప్రసాద్ ఇంటి ముందు ఆగింది!
కారులోంచి అనుష్క, సన్నీ, రీతూలు క్షేమంగా కిందకు దిగడం చూసి... ప్రసాద్ చేతిలోని కత్తి నేలపై పడిపోయింది. కళ్లల్లోంచి ప్రవాహంలా కన్నీళ్లు కారాయి.
లోపల నుండి శబ్దం విని పరుగెత్తుకొచ్చిన అయేషా, మీనాక్షిలు అమ్మని చూసి బిగ్గరగా ఏడుస్తూ పరుగెత్తుకెళ్లి అనుష్కను, సన్నీని, రీతూని హత్తుకున్నారు.
ఇన్నాళ్లకు తమ ప్రాణం తిరిగి వచ్చినట్లు ఆ కుటుంబం మొత్తం కన్నీళ్లలో మునిగిపోయింది!

ఇట్లు,
✿SUNNY ✿
1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)