Thread Rating:
  • 29 Vote(s) - 3.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ❤️ అందని జాబిలి..❤️ కోసం (రక్త కధనరంగం - 1)
డెహ్రాడూన్ నరమేధం - పూనమ్ దేవి త్యాగం & 'సీమ' అవతారం

 
సమయం: సాయంత్రం 05:00 గంటలు
ప్రదేశం: డెహ్రాడూన్ (సీమ నివాసం & ప్రైవేట్ హ్యాంగర్)
 
సాయంత్రం సరిగ్గా 5:00 గంటల సమయం.
 
శత్రువులతో వీరపోరాటం చేసి, ఒంటినిండా భయంకరమైన గాయాలతో రక్తం ఓడుతూ పూనమ్ దేవి నేలకొరిగింది. శరీరం స్పృహ కోల్పోతున్న క్షణాల్లో...
 
ఆమె ఆఖరి శ్వాసతో పక్కనే ఉన్న చెల్లి సీమ చేతిని గట్టిగా పట్టుకుంది. పూనమ్ గొంతు బొంగురుపోయి, మాటలు కూడా సరిగ్గా రావడం లేదు.
 
పూనమ్: (తీవ్రమైన నొప్పిని దిగమింగుతూ, తడబడుతూ) "సీ... సీమా... నా పిల్లలు... వైజాగ్‌లో నా పిల్లలు ప్రమాదంలో ఉన్నారు! నేను... నేను లేకపోతే వాళ్లు చనిపోతారు సీమా! వాళ్లను కాపాడు..."
 
ఆ మాటలు చెప్తూనే, పూనమ్ దేవి తను తన జీవితం గురించి, తన కమాండో ఆపరేషన్ల గురించి రికార్డ్ చేసిన ఒక సీక్రెట్ ఆడియో డివైస్‌ను సీమ చేతిలో పెట్టింది.
 
పూనమ్: "పిల్లలు... పిల్లలు జాగ్రత్త సీమా..." అని చెప్తూ పూనమ్ దేవి కళ్లు మూసింది!
 
సీమ భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతురాలైన శస్త్రచికిత్స నిపుణులలో (Top Surgeons) ఒకరు. అక్క పరిస్థితి చూసి గుండె నిలువునా బద్దలైనా...
 
వెంటనే తేరుకుని, తన ఇంట్లోనే ఉన్న అడ్వాన్స్‌డ్ మెడికల్ ఈక్విప్‌మెంట్ సాయంతో అక్కకు అత్యవసర చికిత్స చేయడం మొదలుపెట్టింది.
 
పూనమ్ ప్రాణాలనైతే కాపాడగలిగింది గానీ... పూనమ్ దేవి శరీరం తీవ్రమైన గాయాల వల్ల కోలుకోవడానికి సమయం పడుతుంది, ఆమె ప్రస్తుతం కనీసం పక్కపై నుండి కూడా లేవలేని స్థితిలో ఉండిపోయింది!
 
ఆ క్షణంలో సీమకు అక్క పూనమ్ చెప్పిన ఆఖరి మాటలు గుర్తుకొచ్చాయి: "నా పిల్లలు ప్రమాదంలో ఉన్నారు!"
 
సీమ వెంటనే నిశ్చయించుకుంది.
 
సీమ: (కన్నీళ్లతో అక్క ముఖాన్ని పట్టుకుని) "అక్కా... నువ్వు నాకోసం ప్రాణాలు పణంగా పెట్టావు. ఇప్పుడు పిల్లలను కాపాడుకోవడానికి నేను వైజాగ్ వెళ్తున్నాను! నేను వాళ్ళతో తిరిగి వస్తాను అక్క.
 
సీమ నెమ్మదిగా బయటికి వచ్చి ఆ ఇంటి పెద్ద అయిన ఒక ముసలి అతని దగ్గరికీ వెళ్ళి తల వంచుకుని నేను ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పింది..
 
రియా: అమ్మ ఇలాంటి సమయంలో  మమ్మల్ని వదిలి వెళ్లకు అమ్మ.. నీకు ఏమైనా అయితే మా వాళ్ళ కాదు .
 
సీమ: మీలాగే లోపల పడుకున్న నా అక్క పిల్లలకి ఇప్పుడు తల్లి అవసరం రియా. నేను వెళ్ళాలి.
 
ఇంటి పెద్ద: కోడలా చూడండి,, ఏది మంచి ఏది చెడు అనేది మీకంటే ఎవరికి బాగ తెలీదు అని నాకు తెలుసు. దేవుడు ఏ కారణం లేకుండా మిమ్మల్ని అక్కడికి పంపడు. మీరు ధైర్యంగా వెళ్ళి పిల్లల్ని తీసుకుని ఇక్కడికి రండి.
 
సీమ: సరే మావయ్య .. ఆమెకి ఏమేమి చికిత్స చేయాలో ఇక్కడ ఉన్న హెల్త్‌కేర్ టీమ్‌కి చెప్పి వెళ్తున్నాను. అలాగే మీరు అంత జాగ్రత్త నా అక్కాకి ఏం కానివ్వను..."
 
ఇంటిపెద్ద: అమ్మ, అసలు మీరు ఎవరు?
 
సీమ: ఇంకా టైమ్ రాలేదు మావయ్య , అక్క చెప్తుంది మీకు. నేను వెళుతున్నాను.
 
సీమ వెంటనే పూనమ్ దేవి వేసుకున్న ఆ కమాండో డ్రెస్‌ను తను ధరించి... పూనమ్ దేవిలా మారిపోయింది!
ఇంటి బయట ల్యాండ్ అయి ఉన్న హెలికాప్టర్, ప్రైవేట్ జెట్ దగ్గరకు సీమ నడుచుకుంటూ వచ్చింది.
 
అక్కడ ఉన్న స్పెషల్ స్నిపర్లు, కమాండోలు అందరూ పూనమ్ రూపులో ఉన్న సీమకు సెల్యూట్ చేశారు.
అక్కడ జరుగుతున్నది అంతా ఆమెకి కొత్తగా ఉంది, అస్సలు అక్క ఏం చేసింది ఈ 30 ఏళ్లు.
 
గుండెల్లో అక్క త్యాగం వల్ల కలిగిన బాధను, ఆవేదనను దిగమింగుకుని... సీమ తన అక్క పిల్లలను కాపాడటానికి వైజాగ్ ప్రయాణమైంది.
 
ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు "అమ్మా! మేము పూనమ్ అక్కని చూసుకుంటాం, నువ్వు వెళ్లి పిల్లలను కాపాడుకుని జాగ్రత్తగా తీసుకరా!" అని సీమకు ధైర్యం చెప్పి పంపించారు.
 
సమయం: సాయంత్రం 05:15 గంటల నుండి 06:00 వరకు
ప్రదేశం: వైజాగ్ వీధులు
 
సాయంత్రం 05:15 గంటలకు: వైజాగ్ కాలేజీ ప్రాంగణంలో అనుష్కను కారులోకి ఎక్కించుకుని సన్నీ, రితికలు వాయువేగంతో బయలుదేరారు.
 
రితిక తన చున్నీ తీసి అనుష్క తలకు రక్తస్రావం కాకుండా గట్టిగా కట్టు కట్టింది. రితిక "అమ్మా... అమ్మా..." అని ఏడుస్తున్న ఏడుపు సన్నీ గుండెను పిండేస్తోంది.
 
సన్నీకి ఒక కాలు, రెండు పక్కటెముకలు విరిగిపోయి విపరీతమైన నొప్పితో రక్తం కారుతున్నా... తన తల్లి లాంటి అనుష్కని కాపాడుకోలేకపోతున్నాననే వేదనతో కన్నీళ్లతో డ్రైవింగ్ చేస్తున్నాడు.
 
సాయంత్రం 05:30 గంటలకు: కాలేజీ ప్రాంగణం నుండి సోనుని తీసుకుని అల్కా, వర్షలు వేగంగా కారులో హాస్పిటల్‌కి పరుగెడుతున్నారు.
 
అల్కా భోరున ఏడుస్తూ: "అక్కా! త్వరగా పోనివ్వు... అమ్మకి ఏమైంది? అమ్మ ఎక్కడుంది?" అని అరుస్తోంది.
 
వర్ష ఓదారుస్తూ: "నాకు తెలీదు అల్కా... అమ్మకి ఏం కాదు, నువ్వు ఏడవకు, అమ్మ వచ్చేస్తుంది!" అని నచ్చజెబుతోంది.
 
సాయంత్రం 06:00 గంటలకు: కాలేజీలో ఆధీర పారిపోయాక... అలేఖ్య రక్తసిక్తమైన విజయ్‌ని కారులో ఎక్కించుకుని బయలుదేరింది.
 
వర్షంలో డ్రైవింగ్ చేస్తూ "విజయ్... కళ్లు తెరువు విజయ్!" అని ఏడుస్తోంది. ఎక్కడికి వెళ్లాలో తెలీక... వెంటనే అల్కాకి ఫోన్ చేసింది.
 
అలేఖ్య: "అల్కా! మా అక్క చెప్పింది... హాస్పిటల్స్‌కి వెళ్లొద్దు, అక్కడ కూడా శత్రువులు ఉంటారు! ఏదైనా సీక్రెట్ ప్లేస్‌కి తీసుకువెళ్లమనీ అంది. నేను విజయ్‌ని తీసుకుని ఎక్కడికి రావాలి?!"
 
వర్ష: (అల్కా చేతిలోంచి ఫోన్ లాక్కుని) "అలేఖ్యా! మీరందరూ 'లెమన్ ట్రీ బిల్డింగ్' సీక్రెట్ జోన్‌కి రండి! నేను అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాను!"
 
వర్ష వెంటనే అల్కాతో: "అల్కా! సన్నీకి కూడా ఫోన్ చేసి లెమన్ ట్రీ బిల్డింగ్‌కే రమ్మని చెప్పు!" అని ఆదేశించింది.
 
అల్కా వెంటనే సన్నీకి ఫోన్ చేసింది. అప్పటికే సన్నీ ఒక హాస్పిటల్ ముందరకు వచ్చి అనుష్కను చేతుల్లోకి తీసుకోబోతున్నాడు. కారులో ఉన్న రితిక ఫోన్ ఎత్తింది.
 
అల్కా: "రితికా! హాస్పిటల్‌కి వెళ్లొద్దు... అక్కడ కూడా ప్రమాదం ఉంది! ఆ ఆఫీసర్‌ని తీసుకుని లెమన్ ట్రీ బిల్డింగ్‌కి రండి, పూనమ్ అమ్మ అక్కడకి వస్తోంది!"
 
రితిక: (గట్టిగా అరిచింది) "సన్నీ... ఆగు! ఇక్కడ వద్దు... మనం పూనమ్ అమ్మ దగ్గరకు వెళ్దాం, పద!"
 
సన్నీ: "రితికా! టైమ్ లేదురా... రక్తస్రావం పోతుంది అమ్మకి!"
 
రితిక: "ఏం కాదు సన్నీ... పదా, అమ్మ అక్కడికే వస్తుంది!" సన్నీ వెంటనే కారును లెమన్ ట్రీ బిల్డింగ్ వైపు మళ్లించాడు!
 
ఇటు వర్ష వెంటనే లోకల్‌లో ఉన్న ఒక ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌కి ఫోన్ చేసి: "నాకు 10 నిమిషాల్లో ప్రైవేట్ స్పెషలిస్ట్ డాక్టర్లు, అడ్వాన్స్‌డ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ ఈక్విప్‌మెంట్ లెమన్ ట్రీ బిల్డింగ్‌కి కావాలి!
 
ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను!" అని ఆర్డర్ వేసింది. హాస్పిటల్ యాజమాన్యం వెంటనే అంగీకరించింది.
 
సమయం: సాయంత్రం 06:15 గంటల నుండి 06:40 వరకు
ప్రదేశం: లెమన్ ట్రీ బిల్డింగ్ హ్యాంగర్ & మెడికల్ రూమ్
 
సాయంత్రం 06:15: రోడ్డు మీద స్పృహతప్పి పడిపోయిన భావనను ఒక నల్లటి సీక్రెట్ కారు ఎక్కించుకుని వేగంగా వెళ్లిపోయింది.
 
సాయంత్రం 06:30: వైజాగ్‌లో వర్షం భయంకరంగా పడుతోంది. లెమన్ ట్రీ బిల్డింగ్ ముందు 6 అంబులెన్సులు వచ్చి ఆగాయి. డాక్టర్లు మెడికల్ పరికరాలను లోపలికి తరలిస్తున్నారు.
 
అప్పుడే వర్ష, అల్కాల కారు వేగంగా వచ్చి ఆగింది. సిబ్బంది పరుగెత్తుకుంటూ వచ్చి గాయపడిన సోనుని స్ట్రెచ్చర్‌పై లోపలికి తీసుకువెళ్లారు.
 
వెంటనే సన్నీ కారు కూడా వచ్చి ఆగింది. రితిక దిగింది, సన్నీ కారు దిగుతూనే విరిగిన కాలు వల్ల కిందపడిపోయాడో! అల్కా పరుగెత్తి సన్నీని లేపింది. వర్ష డాక్టర్లను పిలిచి అనుష్కను స్ట్రెచ్చర్‌పై లోపలికి పంపించింది.
 
సరిగ్గా అనుష్కను లోపలికి తీసుకువెళ్తున్న క్షణంలో... ఆకాశాన్ని చీల్చుకుంటూ పిడుగు శబ్దంతో ఒక ప్రైవేట్ హెలికాప్టర్ బిల్డింగ్ హెలిప్యాడ్ పైన ల్యాండ్ అయింది!
 
ఆ శబ్దానికి అల్కా, వర్ష, రితికలు పైకి పరుగెత్తారు. హెలికాప్టర్ నుండి సీమ (పూనమ్ దేవి రూపంలో) కిందకు దిగింది. అక్కడికి అలేఖ్య, విజయ్‌లు కూడా కారులో వచ్చి చేరుకున్నారు. విజయ్‌ని, సన్నీని లోపలికి చికిత్స కోసం తీసుకెళ్లారు.
 
సమయం: సాయంత్రం 06:45 గంటలు
 
పూనమ్ దేవి రూపంలో ఉన్న సీమ... ఒంటిపై, ముఖంపై వర్షపు చుక్కలు, రక్తపు తడితో మెట్లు దిగి లోపలికి నడుచుకుంటూ వచ్చింది.
 
బయట వెయిట్ చేస్తున్న అల్కా, వర్ష, రితిక, అలేఖ్యలు ఆమెను చూశారు. అల్కా పరుగెత్తుకెళ్లి పూనమ్‌గా ఉన్న సీమను హత్తుకుని భోరున ఏడ్చింది!
 
అల్కా: "అమ్మా... అమ్మా! నువ్వు ఎందుకు రాలేదమ్మా? తమ్ముడు... సన్నీ... వాళ్లంతా రక్తం
కక్కుకుంటున్నారు అమ్మా! వాళ్లను చంపేసేవారు అమ్మా!"
 
వర్ష, అలేఖ్యలు కూడా వచ్చి పూనమ్‌ను పట్టుకుని ఏడ్చారు. సీమ గుండె తరుక్కుపోయింది! "నా అక్క తన కుటుంబాన్ని, పిల్లలను వదిలేసి నన్ను కాపాడటానికి వచ్చింది" అని లోపల ఏడుస్తూ, పిల్లల తలలు నిమిరింది.
 
అప్పుడే... రితిక పరుగెత్తుకుంటూ వచ్చి సీమ కాళ్ల పైన పడిపోయింది!
 
వర్ష, అల్కా shock అయ్యారు: "రీతూ! ఏమైందిరా?!"
 
రితిక: (సీమ కాళ్లు పట్టుకుని, గుండెలు పగిలేలా ఏడుస్తూ) "అమ్మా... ఆరోజు నీ దగ్గర ఏది కావాలన్నా అడగమన్నావు కదా అమ్మా! నాకు లోపల ఉన్న వాళ్లందరూ కావాలి అమ్మా!
 
నా వాళ్ళు... అందరూ బతకాలి అమ్మా! నన్ను అనాథను చేయకండి అమ్మా... ప్లీజ్!" సీమ రితికను పైకి లేపి, ఆమె ముఖాన్ని ముద్దుపెట్టుకుని హత్తుకుంది.
 
సీమ: (మనసులో) "వీళ్లంతా నా అక్క పిల్లలు... ఒకరికొకరు ప్రాణంగా ఉన్నారు!"
 
సీమ: (రితికతో ప్రేమగా) "నువ్వు ఇలా ఏడిస్తే నేను ఎలా కాపాడతానమ్మా? నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటాను!"
 
అప్పుడే లోపలి నుండి వచ్చిన సీనియర్ డాక్టర్ అన్నాడు:
 
డాక్టర్: "మామ్... ఆ ఫీమేల్ ఆఫీసర్ (అనుష్క) బ్రెయిన్ సెల్స్ దారుణంగా దెబ్బతిన్నాయి. మేము ఏమీ చేయలేము. ఆపరేషన్ చేస్తే ఇప్పుడే చనిపోతారు, వదిలేస్తే కొద్దిరోజులు బతుకుతారు."
 
అది విన్న అల్కా "లేదు! ఆవిడ మమ్మల్ని కాపాడింది, ఆవిడ బతకాలి!" అని అరిచింది. రితిక పూనమ్ చేతిని గట్టిగా పట్టుకుని వేడుకుంది.
 
సీమకు అర్థమైంది... లోపల ఉన్న ఆ ఆఫీసర్ (అనుష్క) రితిక కి ఎంత ముఖ్యమో!
 
సీమ: "మీరందరూ ఇక్కడే ఉండండి... నేను చూసుకుంటాను!"
 
అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా, సీమ లోపలికి వెళ్లి: "నాకు ఆవిడ ఫుల్ మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వండి, ఆపరేషన్ థియేటర్ రెడీ చేయండి!" అని ఆర్డర్ వేసింది.
 
సమయం: సాయంత్రం 07:00 గంటలు
ప్రదేశం: సీక్రెట్ లోకేషన్ / ఆధీర డెన్
 
వర్షం వల్ల స్టేడియం నుండి బయటకు వచ్చిన రణధీర్... తన అన్న ఆధీరకు ఫోన్ చేశాడు.
 
రణధీర్: "అన్నా... ఏమైంది? మన ప్లాన్ అంతా దెబ్బతింది!"
 
ఆధీర: (రక్తపు మడుగులో గాయాలతో ఉండి, రగులుతూ) "రణధీర్... త్వరగా మన 'తంత్ర శాల (సామ్రాజ్య పూజారి/వ్యూహకర్త)కి ఫోన్ చేయి! మహాయుద్ధం రాబోతోంది!"
 
రణధీర్: "అన్నా! ఏం మాట్లాడుతున్నావ్?!"
 
ఆధీర: "వాళ్లు ఇంకా బ్రతికే ఉన్నారురా! 25 ఏళ్ల క్రితం మనం ఏ యుద్ధాన్ని చూసి భయపడ్డామో... ఆ 'బ్లాక్ స్క్వాడ్' ఇంకా బ్రతికే ఉంది! ఆమె ఉంటే మనం ఏమీ చేయలేము!"
 
రణధీర్ గుండె వేగంగా కొట్టుకుంది. వెంటనే అవతలి సీక్రెట్ నంబర్‌కి ఫోన్ చేశారు.
 
అజ్ఞాత వ్యక్తి: "చెప్పండి... ఏమైంది?"
 
రణధీర్: "అయ్యా... మమ్మల్ని క్షమించండి! 'బ్లాక్ స్క్వాడ్' బ్రతికే ఉంది! అన్నయ్య కూడా దారుణంగా గాయపడ్డాడు!"
 
అజ్ఞాత వ్యక్తి: (కోపంతో గర్జిస్తూ) "వాట్?! ఒకేసారి రెండు చోట్ల మన ప్లాన్ ఎలా విఫలమైంది? నేను మిమ్మల్ని నమ్మి తప్పు చేశాను! ఇక మీరు వైజాగ్ వదిలి తిరిగొచ్చేయండి... మిగిలినది నేను చూసుకుంటాను!" అని ఫోన్ కట్ చేశాడు!
 
((డెహ్రాడూన్ , వైజాగ్ రెండు చోట్ల ప్లాన్ చేసింది అతనే ఆ అజ్ఞాత వ్యక్తి)))
 
ఇటు RAW ఆఫీస్ అధికారులు ఆ వర్షంలో కాలేజీలో జరిగిన రక్తపాతం ఆధారాలు బయటకు రాకుండా సీక్రెట్‌గా క్లూస్ అన్నింటినీ తుడిచిపెట్టేశారు.
 
ఇటు సురేష్ చోప్రా పంపిన 10 మంది రౌడీలు ఫోన్ ఎత్తకపోవడంతో... సురేష్ చోప్రా, సోనియాలు భయంతో, కోపంతో రగిలిపోతున్నారు!
 
ఆపరేషన్ థియేటర్ నాటకం & సీమ శస్త్రచికిత్సా విన్యాసం
సమయం: సాయంత్రం 07:15 గంటల నుండి 09:00 వరకు
 
సీమ ఆపరేషన్ థియేటర్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ అనుష్క క్రిటికల్ పొజిషన్‌లో ఉంది.
 
డాక్టర్లు: "మేడమ్! మీరేం చేస్తున్నారు? ఆవిడకి ఏమైనా అయితే మా ఉద్యోగాలు పోతాయి! ఇది డాక్టర్లు చేయాల్సిన పని!"
 
సీమ: (లేత చిరునవ్వుతో) "మీరు కాసేపు బయట వెయిట్ చేయండి!"
 
ఈలోపు సన్నీ, విజయ్‌లు మైకంలో ఉన్నారు. కానీ సోనుకి స్పృహ వచ్చింది. గాజు తలుపుల అవతలి నుండి అల్కా, వర్ష, రితికలను చూసి సోనుకి ప్రాణం లేచొచ్చినట్లయింది.
 
పక్కనే పూనమ్ డ్రెస్‌లో ఉన్న సీమను చూసి సోను గట్టిగా: "అమ్మా... అమ్మా!" అని అరిచాడు.
 
సీమ ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి... నన్నే పిలుస్తున్నాడు అనుకుంటా అని వేగంగా సోను దగ్గరకు వెళ్లి, వాడి తల నిమిరింది:
 
సీమ: "బాబు... ప్రశాంతంగా పడుకో! నేను ఆ ఆఫీసర్‌కి ట్రీట్‌మెంట్ చేయాలి. తర్వాత మాట్లాడుకుందాం, డిస్టర్బ్ చేయకు సరేనా?" అని చెప్పి అనుష్క దగ్గరకు వెళ్లింది.
 
బయటకు వచ్చిన డాక్టర్ వర్షతో అన్నాడు:
 
డాక్టర్: "మేడమ్... ఆవిడ బతకడం అసాధ్యం. సర్జరీ చేయాలంటే ఇండియాలోనే ఒకరిద్దరు టాప్ న్యూరో సర్జన్లు ఉన్నారు, వాళ్లు వస్తే తప్ప బతకదు!"
 
ఆ మాట పూర్తికాకముందే... రితిక  ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, కానీ అల్కా కోపంతో రగిలిపోతూ ఆ డాక్టర్ చెంప పగలగొట్టింది!
 
అల్కా: "నోరు మూయ్! అసలు నువ్వు డాక్టర్‌వేనా?!"
 
రితిక వెంటనే అల్కాని కౌగిలించుకుని ఓదార్చింది. అల్కా: "ఏం కాదు రీతూ... అమ్మ వచ్చింది కదా, అమ్మ చూసుకుంటుంది!"
 
అంతలో ఆపరేషన్ థియేటర్ లోపల జరుగుతున్న దానిని చూసిన ఒక స్పెషలిస్ట్ డాక్టర్ గాజు తలుపుల్లోంచి సీమ చేస్తున్న అద్భుతమైన, సంక్లిష్టమైన శస్త్రచికిత్సను చూసి ఆశ్చర్యపోయాడు!
 
డాక్టర్: "మై గాడ్... షీ నోస్ వాట్ షీ ఈజ్ డూయింగ్! ఐ థింక్ షీ ఈజ్ ఏ వరల్డ్-క్లాస్ సర్జన్!"
 
ఆ మాట వినగానే బయట ఉన్న పిల్లలందరూ, డాక్టర్స్  షాక్ అయ్యారు... అల్కా, రితికలు ఆనందంతో నవ్వేశారు!
 
అలేఖ్య మాత్రం భావన అక్కకి ఏం అయిందో అని కంగారుగా ఆమె ఫోన్ కి ఫోన్ చేస్తుంది కానీ కాలవట్లేదు.
 
సరిగ్గా రాత్రి 09:00 గంటలకు సీమ ఆపరేషన్ థియేటర్ బయటకు వచ్చింది.
 
సీమ: "డాక్టర్స్! ఈ మెడిసిన్స్ 24 అవర్స్ కంటిన్యూ చేయండి. ఆవిడ ప్రాణాలకి ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు... రేపటికి స్పృహ వస్తుంది!"
 
ఆ మాట వినగానే రితిక ఆనందంతో పరుగెత్తుకెళ్లి సీమను ఎంత గట్టిగా హత్తుకుందంటే... సీమ రెండడుగులు వెనక్కి పడింది!
 
రితిక: (కన్నీళ్లతో) "థ్యాంక్స్ అమ్మా... థ్యాంక్స్ అమ్మా!"
 
సీమ: (రితిక తల నిమిరి, ప్రేమగా) "నేను వచ్చేసాను కదా తల్లి... ఇక ఏమీ కాదు, సరేనా?"
 
అల్కా కూడా కన్నీళ్లతో చూడగానే సీమ చేయి చాచింది... అల్కా, వర్షలు కూడా వచ్చి సీమను గట్టిగా కౌగిలించుకున్నారు!
 
రహస్య ఆవిష్కరణ - సృష్టిలోని 5 పంచభూతాల తత్వం:
 
సృష్టి నిర్మాణం 5 పంచభూతాల పైన ఆధారపడి ఉంది. ఈ సిరీస్ 5 మహా శక్తులు ఆ పంచభూతాలకు ప్రతిరూపాలు:
 
1.     భూమి (క్షమాగుణం & భారం) - పూనమ్ దేవి: ఎంతటి కష్టాన్నైనా, భారాన్నైనా తనపై మోస్తూ... ఓర్పుతో ఉంటూనే శత్రు సంహారంలో అత్యంత భయంకరమైన డిఫెండర్‌గా నిలుస్తుంది.
 
2.     నిప్పు (రౌద్రం & క్రోధం) - అనుష్క: శత్రువుల కంటే పది అడుగులు ముందుంటూ... రణరంగంలో నిప్పులా రగిలిపోతూ శత్రు సామ్రాజ్యాలను తగలబెడుతుంది.
 
 
3.     గాళి / ఆక్సిజన్ (జీవనాధారం) - సీమ: గాలి కంటికి కనిపించదు... కానీ అది లేకపోతే సమస్త సృష్టి అంతమైపోతుంది!
 
చనిపోతున్న ప్రాణాలకు ఊపిరిపోసి, మృత్యువు అంచుల నుండి ప్రాణాలను తిరిగి తీసుకువచ్చే జీవనాధార శక్తే 'సీమ'! వైద్య విద్యలో ప్రపంచానికే తలమానికమైన ఆ శక్తి... ఈరోజు తన అక్క పిల్లల కోసం, అనుష్క కోసం ఊపిరిగా మారింది!
 
4.     నీరు: (దీని వివరాలు రాబోయే చాప్టర్లలో వెల్లడవుతాయి).

5.     ఆకాశం / విశ్వం (పరిపూర్ణ శక్తి) - భావన (FAB SHADOW):

సమస్త విశ్వాన్ని తనలో లయం చేసుకునే అత్యున్నత శక్తి! వైజాగ్ నగరంలో ప్రళయ రాత్రి గడిచింది... 'సీమ' ఆగమనం, అనుష్క పునర్జన్మ, పిల్లల రక్షణతో కథ మహా సమరానికి నాంది పలికింది!
------------------------------------------------------------------------------------------
భావనని తీసుకు వెళ్ళింది ఎవరు?
 
ఆధీర, అజిత్ ఇద్దరికంటే పైన ఉన్న ఆ లీడర్ “ అజ్ఞాతవ్యక్తి ఎవరు?
 
సురేష్ చోప్రా ఏం చేయబోతున్నాడు?
 
అనుష్క రేపు లేచాక ఏం అవుతుంది?
 
పూనమ్ కి మెళుకువ వచ్చి జరిగింది తెలిస్తే? అన్స్ , అభి లకి ఇప్పుడు పూనమ్ శక్తి తోడైతే? (పార్ట్ -2 లో )

ఇప్పటి నుండి మూడు కధలు మళ్ళీ ,, విడి విడిగా కొనసాగుతాయి. అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నా.......
ఇట్లు,
✿SUNNY ✿

1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం
Like


Messages In This Thread
RE: ❤️❤️ అందని జాబిలి.. అమ్మ❤️❤️ కోసం ? - by Sunnysunnysunny - 02-08-2026, 05:02 PM



Users browsing this thread: 3 Guest(s)