Thread Rating:
  • 29 Vote(s) - 3.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ❤️ అందని జాబిలి..❤️ కోసం (రక్త కధనరంగం - 1)
((ముందుగా మూడు కధల చివరి అప్డేట్స్ చదివి తరువాత ఇది చదవాలి అని కోరుకుంటున్న....))

 
సమయం: మధ్యాహ్నం 02:45 గంటలు
ప్రదేశం: వైజాగ్ రోడ్లు (పూనమ్ కారు ప్రయాణం)
 
వైజాగ్‌లో పూనమ్ దేవి, వర్ష మరియు సోనులను కారులో ఎక్కించుకుని కాలేజ్ ఫెస్ట్ వద్దకు బయలుదేరింది.

హఠాత్తుగా... పూనమ్ డాష్‌బోర్డ్ పక్కన ఉన్న సీక్రెట్ ఎన్‌క్రిప్టెడ్ ఫోన్ గట్టిగా మోగడం మొదలైంది!
 
30 ఏళ్లుగా మోగని ఆ ఫోన్ రింగ్ అవ్వగానే పూనమ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. 

ఎడమ చేత్తో స్టటీరింగ్ పట్టుకుని, కుడిచేత్తో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెవిన పెట్టుకుంది.
 
పూనమ్: (గాబరాగా, శ్వాస వేగంగా తీసుకుంటూ) "హలో... సీమా?!"
 
అవతలి నుండి చిన్న పాప ఏడుస్తూ మాట్లాడింది.
 
పాప: (కన్నీళ్లతో, భయంతో వణుకుతూ) "అమ్మమ్మ... ఆ రాక్షసులు ఊరిలోని అందరినీ చంపేస్తున్నారు అమ్మమ్మ! ఇల్లంతా రక్తం చిమ్మి ఉంది...
 
సీమ అమ్మమ్మ నన్ను దాచిపెట్టి, ఫోన్ ఎత్తగానే 'నన్ను క్షమించు అక్కా... నేను బతకను' అని నీకు చెప్పమంది అమ్మమ్మ! కాపాడు అమ్మమ్మ..."
 
పూనమ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సీమ పరిస్థితి తలుచుకుని గుండె పిండేస్తున్నా... వణుకుతున్న గొంతును సరిచేసుకుంటూ అడిగింది.
 
పూనమ్: (ఏడుస్తూనే)  "తల్లి! అమ్మమ్మ నిన్ను కాపాడాలంటే నాకు మీ ఊరు తెలీదు కదా..., మీ ఊరు పేరు తెలుసా? ఇంకా నువ్వు ఆడుకోవడానికి, తిరగడానికి ఎక్కడికి వెళ్తావు? అవి అయినా తెలుసా తల్లి?"
 
పాప: (నత్తినత్తిగా ఏడుస్తూ) "అమ్మమ్మ... డెహ్రాడూన్! సీమ అమ్మ రోజు నన్ను 'పూనమ్ అమ్మ' అనే హాస్పిటల్‌కి తీసుకువెళుతుంది. అక్కడే ఆడుకుంటాను. కానీ 4 డేస్ నుండి అందరం ఇంట్లోనే దాక్కున్నాం అమ్మమ్మ..."
 
డెహ్రాడూన్‌లోని తన పేరు మీద ఉన్న ఆ హాస్పిటల్ లొకేషన్ వినగానే పూనమ్ సింహంలా గర్జించింది.
 
పూనమ్: "తల్లి! నేను వస్తున్నాను... సరేనా? నువ్వు అక్కడే జాగ్రత్తగా ఉండు. సీమ అమ్మని, నిన్ను కాపాడటానికి నేను వస్తున్నాను!"
 
పూనమ్ కంగారుగా అడ్రస్ కనుక్కుని ఫోన్ కట్ చేసింది. వెంటనే వర్ష, సోనుల వైపు చూసి ఫోన్ సీక్రెట్ సైబర్ టీమ్‌కి కనెక్ట్ చేసింది.
 
డెహ్రాడూన్‌లోని ఆ హాస్పిటల్ ఓనర్ అడ్రస్ కనుక్కోవాలని, అక్కడ 5 గురు స్పెషల్ స్నిపర్లు రెడీగా ఉండాలని, ఎయిర్‌పోర్ట్ రన్‌వే పైన తన ప్రైవేట్ జెట్ విమానం ల్యాండ్ అయి రెడీగా ఉండాలని ఆదేశించింది.
 
పూనమ్: "వర్షా, సోనూ... నేను వెళ్లాలి! ఒక కుటుంబం చావు బతుకుల మధ్య ఉంది. నేను వెళ్లి వాళ్లను కాపాడుకోవాలి!"
 
వర్ష కళ్లల్లో నీళ్లతో వెంటనే సోను చేయి పట్టుకుని అంది.
 
వర్ష: "అమ్మ... నువ్వు వెంటనే వెళ్లు! నేను ఇక్కడ అల్కాని, సోనూని జాగ్రత్తగా చూసుకుంటాను."
 
పూనమ్: "సోనూ! నేను తిరిగొచ్చినా, రాకపోయినా... మన అక్కల బాధ్యత నీదే! అలాగే మీ ముగ్గురు ఈ చిన్న సైబర్ జీపీఎస్ ట్రాకింగ్ పిన్‌ను ఇన్జెక్ట్ చేసుకోండి. ఇది మీ బాడిలో ఉంటుంది.
 
శత్రువులకు కాలేజీలో మీరు ప్రాణాలతో కావాలి. మీరు ఎక్కడున్నా నేను వచ్చి మిమ్మల్ని తీసుకువస్తాను... నన్ను క్షమించండి!"
 
వర్ష: (కన్నీళ్లతో పూనమ్ ముఖాన్ని పట్టుకుని) "అమ్మ! నువ్వు మాకు ఎందుకు ఇదంతా చెప్తున్నావు? శత్రువులు ఏంటి అమ్మ ఏం జరుగుతుంది ?
 
కానీ నువ్వు ఏం చెప్పినా మేము చేస్తాం... కానీ తిరిగి వస్తానని మాత్రం ప్రమాణం చెయ్యి అమ్మ!"
 
పూనమ్ నెమ్మదిగా నవ్వి వర్ష ముఖాన్ని తడిమింది. కారును నేరుగా తన సీక్రెట్ ఎయిర్‌స్ట్రిప్ వైపు మళ్లించి, ప్రైవేట్ జెట్ ఎక్కి ఆ భయంకరమైన ప్రళయ వాతావరణంలో డెహ్రాడూన్ వైపు వాయువేగంతో బయలుదేరింది!
 
వర్ష, సోనులు కారులో కాలేజ్ వైపు ప్రయాణమయ్యారు.
 
ప్రదేశం: వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (రణధీర్ డెత్ ట్రాప్)
సమయం: మధ్యాహ్నం 03:00 గంటలు
 
ఆధీర తమ్ముడు రణధీర్ (రావు) సాధారణ ప్రేక్షకునిలా మ్యాచ్ చూడటానికి వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం లోపలికి ప్రవేశించి, తన విఐపి గ్యాలరీ సీట్లో కూర్చున్నాడు. అతని మనసులో వికృతమైన ఆనందం ఉంది.
 
తన ప్లాన్ ప్రకారం... మధ్యాహ్నం 3:30 గంటలకు విఐపి ఫుడ్ & క్యాటరింగ్ సప్లై వ్యాన్ ద్వారా 50 కేజీల RDX బాంబ్ స్టేడియం లోపలికి చేరుకుంటుంది.
 
ఆ బాంబు ప్యాకేజ్ రాగానే దాన్ని సీక్రెట్‌గా రిసీవ్ చేసుకుని స్టేడియాన్ని ఊచకోత కోయాలనేది అతడి ప్లాన్!
 
వైజాగ్ కాలేజ్ ఆవరణ (విజయ్, అలేఖ్య & భావన నిరీక్షణ)
సమయం: మధ్యాహ్నం 03:00 గంటలు
 
ఇటు కాలేజ్ ఆవరణకు విజయ్, అలేఖ్యలు ఇద్దరూ కలిసి అల్కాకి, ఆమె అమ్మకి మొదటిసారి కలుస్తున్నామని కొన్ని గిఫ్ట్స్ కొని మధ్యాహ్నం 3:00 గంటలకు చేరుకున్నారు. అలేఖ్య విజయ్ చేయి వదలకుండా పట్టుకుని నడుస్తోంది.
 
మరోవైపు... అనారోగ్యంతో కళ్లు తిరుగుతున్నా సరే, భావన తన బ్లాక్ కమాండో సూట్ పైన లాంగ్ కుర్తా వేసుకుని, ముఖం కవర్ చేసుకుని, కాలేజ్ బయట 100 మీటర్ల దూరంలో పొంచి ఉన్న పులిలా నిలబడి ఉంది.
 
భావన: (కన్నీళ్లతో, దూరంగా ఉన్న విజయ్‌ని చూస్తూ) "నా కొడుకు నన్ను వదిలేసి ఆ అమ్మాయితో ఎంత సంతోషంగా ఉన్నాడో...
 
కానీ వాడు నా కొడుకు! నా ప్రాణం! వాడు నా వాడు, నేను ఎవరికీ ఇవ్వను! వాడి జోలికి ఏ రాక్షసుడు వచ్చినా నరికిపడేస్తాను!"
 
సరిగ్గా అదే సమయంలో... కాలేజ్ గేట్ ముందుకు వేగంగా 6 నల్లటి కార్లు వచ్చి ఆగాయి! దాంతో భావన ఒక్కసారిగా అలర్ట్ అయింది.
 
కార్లలో నుండి అల్కా, సన్నీ, కంపెనీ డైరెక్టర్లు మరియు అల్కా పర్సనల్ బాడి గార్డ్స్ దిగారు. సురేష్ చోప్రా పంపిన 10 మంది వరల్డ్ డేంజరస్ కిల్లర్స్ కూడా దిగారు వాళ్ళలో కలిసిపోయారు.
 
అల్కా కారు దిగి, విజయ్, అలేఖ్యల కోసం ఫోన్ తీసి డయల్ చేయబోయింది, కానీ ఫోన్ కలవలేదు. అప్పటికే సురేష్ చోప్రా మనుషులు జామార్ ఆన్ చేసి పెట్టేశారు.
 
అప్పుడే దూరంగా ఉన్న అలేఖ్య గట్టిగా "అల్కా!" అని పిలవగానే అక్కడున్న కిల్లర్స్ చూపు ఆమె పైన పడింది. అల్కా కూడా వాళ్ళకి చెయ్యి ఊపింది. వాళ్లు వచ్చి అల్కాని కలిశారు.
 
అల్కా: "సన్నీ! మేనేజ్‌మెంట్ కి చెప్పి కొంచెం రితిక అనే అమ్మాయిని తీసుకురావా? మా అమ్మ వాళ్లు కూడా వచ్చేస్తారు కాసేపట్లో, ప్లీజ్... అమ్మ ఆ అమ్మాయిని చూడకపోతే నన్ను తిడుతుంది!"
 
సన్నీ: "సరే మేడమ్!"
 
సన్నీ లోపలికి వెళ్లి ఇన్ఫార్మ్ చేశాడు. లోపల ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న రితికకి "అల్కా మేడమ్ పిలిచారు" అనగానే, పూనమ్ అమ్మని కలవవచ్చని ఎదురుచూస్తున్న ఆమె నవ్వుకుంటూ బయటకి వచ్చింది.
 
బయటకు రాగానే రితిక అందరినీ కలిసింది. అల్కా, సన్నీని సిగ్గుగా అలేఖ్యకి, విజయ్‌కి పరిచయం చేసింది. అలేఖ్య కూడా వాళ్లిద్దరితో సరదాగా మాట్లాడింది.
 
రితిక: అల్కా, అమ్మ వాళ్ళు రాలేదా అని కొంచెం విచారంగా అడిగింది.
 
అల్కా : నేను వాళ్ళకి ఎప్పుడో ఫోన్ చేశాను, ఈపాటికి వెచేస్తూ ఉండాలి కాసేపట్లో వస్తారు.
 
ఇదంతా దూరంగా ఉండి చూస్తున్న భావనకి... విజయ్ వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతుంటే ప్రాణం పోతున్నట్లు ఉంది. ఆ క్షణం విజయ్ తాను లేకపోయినా ఉండగలాడు ఏమో అనుకుంది.
 
కానీ విజయ్ మనసులో మాత్రం "పూనమ్ అమ్మ రాగానే భావన అమ్మ గురించి చెప్పి ఇద్దరినీ ఒకటి చేయాలి" అని నిరంతరం ఆలోచిస్తున్నాడు.
 
స్టేడియంలో రణధీర్‌కి బిగ్ షాక్ & కాలేజీకి బయలుదేరిన ఆధీర

సమయం: మధ్యాహ్నం 03:30 గంటలు
 
సరిగ్గా 3:30 అయింది! రణధీర్ తన గడియారం వైపు చూసుకుంటూ ఫుడ్ వ్యాన్ కోసం ఎదురుచూస్తున్నాడు.

కానీ... పూనమ్ దేవి ముందే వేసిన 'త్రీ-స్టెప్ కమాండో ప్లాన్' అమలులోకి వచ్చింది!
 
RAW స్పెషల్ ఫోర్స్ స్టేడియం చుట్టూ 300 మీటర్ల దూరంలోనే బారికేడ్లు పెట్టి ప్రతీ ఒక్క వాహనాన్ని ఆపేసింది. 

ఫుడ్ వ్యాన్‌ను లోపలికి రానివ్వకుండా బయట నుంచే కంప్లీట్ స్కాన్ చేసి, కమాండోలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు!
 
అంతేకాకుండా, లోపల ఉన్న రణధీర్‌కి ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది...

"లోపలికి వచ్చిన వారు ఒక్కసారి బయటకు వెళ్తే, మళ్లీ లోపలికి రావడానికి విఐపి పాస్ చెల్లదు! గేట్లు పూర్తిగా లాక్ అయిపోయాయి!"
 
దాంతో రణధీర్ బాంబు తీసుకోలేక, బయటకు వెళ్లలేక స్టేడియంలోనే విఫలమై కూర్చుండిపోయాడు!
 
మరోవైపు సరిగ్గా 3:30 గంటలకు:
 
ఆధీర 50 కేజీల RDX బాంబును ఆ ఫుడ్ ట్రక్‌లో లోడ్ చేయించి, తన ప్లాన్ వర్కవుట్ అవుతుందనే ధీమాతో తన భయంకరమైన రీతిలో కాలేజ్ వైపు ప్రయాణం ప్రారంభించాడు! 

కాలేజీకి చేరుకోవడానికి అతనికి ఇంకో 45 నిమిషాల సమయం పడుతుంది.
 
ప్రదేశం: కాలేజ్ VIP ఎంట్రెన్స్ & జామర్లు
సమయం: మధ్యాహ్నం 03:45 గంటలు
 
చూస్తుండగానే టైమ్ 3:45 అయింది. అప్పుడే అక్కడికి వర్ష, సోను కూడా కారులో వచ్చారు. కారుని గేట్ దగ్గర ఆపగానే వర్ష అల్కాకి కాల్ చేయాలి అనుకుంటే సిగ్నల్ లేదు...
 
సురేష్ చోప్రా గార్డ్స్ బందోబస్తు కోసం జామర్లు ఆన్ చేశారు! అక్కడున్న వాచ్‌మెన్‌ని అడిగితే, JSS కంపెనీ ఓనర్ అని చెప్పగానే లోపలికి వేరే సీక్రెట్ ఎంట్రెన్స్ ఓపెన్ చేసి పంపించారు.
 
భావన చూపు విజయ్ పైన కాకుండా రితిక పైన నిలిచిపోయింది! ఎందుకంటే చిన్నప్పుడు తన ప్రాణమైన అచ్చం అనుష్కలా ఉంది! నవ్వుతూ అందరితో ఉన్న ఆమెనే చూస్తూ...
 
భావన తాను కోల్పోయిన వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటే కళ్లు తిరగడం స్టార్ట్ అయింది. అయినా అలాగే ఓపిక పట్టి నిలబడింది. నిరంతరం అన్నీ చూస్తూ ఉంది.
 
వర్ష, సోను రాగానే అందరూ కలిసి ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. కానీ ఇద్దరి కళ్ళు మాత్రం ఇంకా కార్ లో ఎవరు అయిన ఉన్నారా అని చూస్తున్నాయి (రితిక, విజయ్ )
 
అల్కా: ఒరేయ్ అమ్మ ఎక్కడ మీ ఇద్దరే వచ్చారు.
 
వర్ష: బుజ్జి పిల్ల , ఇప్పుడు అల్లరి చేయకు అమ్మ వేరే పని పైన వెళ్ళింది. కాసేపట్లో వచ్చేస్తా అన్నారు. సరేనా
 
అక్కడే ఉండి అది అంత గమనిస్తున్న ఆధీర మనుషులు "ముగ్గురు అమ్మాయిలు ఇక్కడే ఉన్నారు!" అని ఫోన్లో ఆధీరకు చెప్పగానే... ఆధీర "నేను రావడానికి మరొక 30 నిమిషాలు పడుతుంది.
 
లోపల కాలేజీలో ఉన్న అమ్మాయే ముఖ్యంగా కావాలి, ఎందుకంటే ఆమె మిగిలిన ఇద్దరి కంటే పెద్ద అమ్మాయి!" అని ఆర్డర్ ఇచ్చాడు.
 
వర్ష కారును పార్కింగ్‌లో పెట్టమని ఎవరినో అడుగుతుంటే... సన్నీ వచ్చి "మేడమ్ నేను వెళ్తాను" అని ప్రేమగా అడిగాడు. వర్ష నవ్వుతూ కారు కీస్ ఇచ్చి అల్కా వైపు చూసింది.
 
సన్నీ కార్ పార్కింగ్ చేస్తుంటే... రితిక చూపు అంతా గేట్ వైపే ఉంది, ఎందుకంటే పూనమ్ అమ్మ కోసం ఎదురుచూస్తోంది!
 
ప్రదేశం: కాలేజ్ పార్కింగ్ ఏరియా
సమయం: సాయంత్రం 04:00 గంటలు
 
సన్నీ కార్ పార్కింగ్ ఏరియాకి వెళ్లగానే జామర్‌కి కొంచెం దూరంగా వెళ్లేసరికి అతనికి మొబైల్‌లో ఒక మెసేజ్ వచ్చింది.
 
అది అనుష్క నుండి వచ్చింది! ఆ సమయానికి అనుష్క స్పోర్ట్స్ బైక్ మీద కాలేజీకి కేవలం 5 నిమిషాల దూరంలో ఉంది!
 
అనుష్క మెసేజ్: "సన్నీ! ఎవరినీ నమ్మకు! నీ ముందున్నదంతా భయంకరమైన నాటకం! రితికకి ఒక్క చిన్న గీత పడినా నిన్ను ప్రాణాలతో ఉంచను. నేను వచ్చే వరకు నా కూతురిని కాపాడటమే నీ లక్ష్యం... నేను వస్తున్నాను!"
 
అప్పుడే లోపలి నుండి ఒక సర్ వచ్చి "మేడమ్ ప్రొగ్రామ్ స్టార్ట్ అయింది వెళ్దాం" అనగానే అందరూ బయలుదేరుతుండగా... భావన గేట్ దగ్గర నిలబడే సడన్గా కుప్పకూలిపోయింది!
 
వాచ్‌మెన్ గట్టిగా "మేడమ్ మేడమ్ ఏం అయింది!" అని అడుగుతున్నా ఆమెలో ఉలుకూ పలుకూ లేదు. నాడి చాలా తక్కువగా కొట్టుకుంటోంది!
 
ఆ అరుపు విని అందరూ వెనక్కి తిరిగారు. కానీ రితిక ఎందుకో ఆగలేకపోయింది! పరుగెత్తి భావనని తన ఒడిలోకి తీసుకుంది!
 
రితిక: "కాలేజ్ మెయిన్ గేట్ పక్కన మెడికల్ టీమ్ ఉంది, త్వరగా తీసుకువెళ్లండి!"
 
అక్కడున్న ఇద్దరు వాచ్‌మెన్లు భావనను మోసుకెళ్లారు. రితిక కంగారు చూసి అమ్మ చెప్పిన మాట గుర్తుతెచ్చుకుని సన్నీ కూడా రితిక వెనుకే పరుగెత్తాడు.
 
భావనను తీసుకువెళ్లగానే డోర్ దగ్గరే ఆగి ఉన్న అందరూ "ఏమైంది?" అని అడిగితే, రితిక "ఏం లేదు, కళ్లు తిరిగి ఎవరో ఒక ఆమె పడిపోయారు" అని చెప్పి వాళ్ల వైపు నడవడం మొదలుపెట్టింది.
 
ప్రదేశం: ఆధీర ముఠా వీరవిహారం
సమయం: సాయంత్రం 04:05 గంటలు
 
సరిగ్గా అప్పుడే వేగంగా ఇద్దరు రౌడీలు వాళ్ల వైపు పరుగెత్తుకుంటూ వచ్చారు! ఒకడు గాలిలోకి ఎగిరి సన్నీని గుండెల పైన బలంగా తన్నగానే... సన్నీ సుమారు 30 అడుగుల దూరంలో ఎగిరి పడిపోయాడు!
 
ఆ శబ్దం ఎంత గట్టిగా ఉందంటే సన్నీ ఎముకలు విరిగిపోయాయా అనేంత భయంకరంగా ఉంది! రితిక నోరు తెరిచే ఉండిపోయింది, షాక్ అయింది!
 
అప్పుడే ఆకాశం నల్లగా మారింది... మొత్తం మబ్బులు! అందులో ముసుగులతో ఉన్న ఆధీర మనుషులు వచ్చి రితిక ముందు నిలబడ్డారు. అవును, ఆధీరకు కావలసిన మొదటి అమ్మాయి రితికే!
 
రితిక పరుగెత్తాలి అనుకుంది, కానీ వాళ్లు కత్తులతో అడ్డుపడగానే అక్కడే నిలబడిపోయింది. 1 నిమిషంలో తేరుకున్న అల్కా... సన్నీ కోసం ప్రాణం పోయేలా అరుస్తూ పరుగెత్తింది.
 
సన్నీ కూడా తేరుకుని తన అక్కను చూడగానే రక్తం మరిగిపోయింది! అలేఖ్య వెంటనే అల్కా వెంట పరుగెత్తింది.
సోను వేగంగా వెళ్లి రితిక ఎదురు నిలబడిన వారిని కొట్టాలని గాలిలో జంప్ చేశాడు.
 
కానీ పక్క నుండి వచ్చిన మిగిలిన 8 మందిలో ఒకడు సోనుని బలంగా తన్నగానే ఎగిరి సన్నీ పక్కన పడ్డాడు! ఆ 8 మంది సన్నీ, సోనుల వైపు వెళ్తుంటే విజయ్ కూడా అడ్డుకోవడానికి వెళ్లాడు.
 
ప్రదేశం: రక్తసిక్తమైన రణరంగం - ట్రైన్డ్ యోధుల వీరసమరం
సమయం: సాయంత్రం 04:15 గంటలు
 
ఆధీర రావడానికి ఇంకా 10 నిమిషాలు ఉంది. అనుష్క మెయిన్ గేట్ దగ్గర ముసుగు ధరించి నిలబడి ఉంది, తన వాళ్లు ఎక్కడున్నారో అర్థం కాలేదు.
 
ఇటు సురేష్ చోప్రా మనుషులు తమ పని వేరే ఎవరో చేస్తున్నారని ఆ దారిని లాక్ చేసి చూస్తూ ఉన్నారు. మనకి కావాల్సింది డబ్బు మనకి వస్తుంది.  
 
అల్కా రియల్ బాడీగార్డ్స్ ఆమెను కాపాడటానికి వెళ్తుంటే... ఆధీర రౌడీలు ముగ్గురు బాడీగార్డ్స్ తలలు తెగేలా నరికి పడేశారు! అది చూసి అందరి కాళ్లూ చేతులూ వణికిపోయాయి!
 
రితిక వాళ్ల మధ్య ఉంది... వర్ష, సోను, సన్నీ, అల్కా, అలేఖ్య, విజయ్ అందరూ ఒకే చోట ఉన్నారు. సన్నీ చూపు తన అక్క ముఖం పైనే ఉంది.
 
సన్నీ: "మిమ్మల్ని చంపి అయినా నా వాళ్లను కాపాడుకుంటాను!"అంటూ సన్నీ ముందుకు కదిలాడు.
 
సన్నీతో పాటు విజయ్, సోను, అలేఖ్య కూడా వెళ్లారు. సాధారణంగా కాకుండా... వీళ్లు ముగ్గరు కొన్ని అత్యంత భయంకరమైన మార్షల్ ఆర్ట్స్ మరియు కంబైన్డ్ టాక్టికల్ ఫైటింగ్‌లో ట్రైన్డ్ చేసిన యోధులు!
 
సన్నీ తన బాడీని లోవర్-స్టాన్స్ పొజిషన్‌కి తెచ్చి, ఎదురుగా వచ్చిన ఒక రౌడీ దవడపై 'రివర్స్ ఎల్బో స్ట్రైక్' ఇచ్చాడు! "థచ్" మంటూ వాడి పళ్లు రాలిపోయాయి. కానీ ఆ రౌడీలు సాధారణ మనుషులు కాదు...
 
నొప్పి తెలియని కిల్లర్ డ్రగ్స్ తీసుకున్న ఆధీర గొరిల్లాలు! వాడు తట్టుకుని సన్నీ భుజంపై కత్తితో దెబ్బ తీశాడు! సన్నీ భుజం చీలుకుంటూ రక్తం చిమ్మింది!
 
సన్నీ నొప్పిని దిగమింగుతూ వాడి కత్తి పట్టుకున్న చేతిని విరిచి నేలకేసి బాదాడు. సోను పక్కన నిలబడి సన్నీకి పర్ఫెక్ట్ 'డిఫెన్సివ్ షీల్డ్' గా మారాడు!
 
సోను తన మోకాళ్లతో, మోచేతులతో ఎదురొచ్చిన రౌడీల దాడులను సైడ్-బ్లాక్ చేస్తూ దెబ్బలు తింటున్నాడు.
 
అలేఖ్య తన హై-స్పీడ్ ఫుట్‌వర్క్‌తో గాలిలోకి ఎగిరి, ఒక రౌడీ మెడను తన రెండు కాళ్లతో చుట్టి 'ఫ్లయింగ్ సిజర్ కిక్' తో వాడిని కిందకి పడేసింది! వాళ్లు వెంటనే తమ కత్తులు పడేసారు...
 
ఎందుకంటే వాళ్లకు కావలసిన రెండో అమ్మాయి అలేఖ్య! ఆమెకి చిన్న గీత పడినా ఆధీర తమని ప్రాణాలతో ఉంచడని తెలుసు! అందుకే కేవలం ఆమెను అడ్డుకుంటూ మిగిలిన ముగ్గురినీ కొట్టడానికి చూస్తున్నారు.
 
ఒక్కసారిగా ఆరుగురు రౌడీలు ఉమ్మడిగా విరుచుకుపడ్డారు. ఒక రౌడీ తన పదునైన కత్తితో సన్నీ భుజంపై లోతుగా నరికి, ఆ తర్వాత అతడి మోకాలి వెనుక భాగంలో గట్టిగా తన్నాడు!
 
"కటక్" అనే శబ్దంతో సన్నీ కాలు బెణికి కిందపడ్డాడు! సన్నీ దారుణంగా దెబ్బ తిని రక్తం కక్కుతున్నాడు. అది చూసి రితిక, అల్కా ఇద్దరూ అరుస్తూ నేలపై కూర్చుండిపోయారు!
 
సోను కోపంతో గర్జిస్తూ వాళ్లపై పడ్డాడు, కానీ ఒక రౌడీ ఇనుప రాడ్‌తో సోను పక్కటెముకలపై బలంగా కొట్టాడు! సోను నోటి నుండి రక్తం వచ్చింది. మరో రౌడీ విజయ్ కడుపులో కత్తితో కోశాడు!
 
విజయ్ కడుపు పట్టుకుని రక్తం ఓడుతూ నేలకొరిగాడు. అలేఖ్య అది చూసి విజయ్ వైపు పరుగెత్తింది. సోను ఒక్కడే రక్తం కారుతున్న ఒంటితో, తెగిపోయిన ఊపిరితో పోరాడుతున్నాడు.
 
రితిక: (భోరున ఏడుస్తూ, కన్నీళ్లతో) "మీకు ఏం కావాలి? వాళ్లని వదిలేయండి! ప్లీజ్ వాళ్లని చంపకండి!"
 
రౌడీలు: (సోనుని గాలిలో ఎత్తి, వాడి మెడను బలంగా పట్టుకుని) "మాకు మీ ముగ్గురూ కావాలి! మీరు మాతో వస్తే వీళ్లని వదిలేస్తాం!" అని అల్కా, అలేఖ్య, రితికల వైపు చూపించారు.
 
అల్కా: "మేము వస్తాం! వాళ్లని ఏం చేయకండి... నా తమ్ముడిని వదిలేయండి!"
 
సోను గాలిలోనే తన సర్వశక్తులనూ కూడగట్టుకుని, వాడి ముఖంపై తన కాళ్లతో తన్ని విడిపించుకున్నాడు.
 
తన అక్కలను కాపాడటానికి రక్తం ఓడుతున్న కాలుతోనే ముందుకు కదిలాడు. 

అందులో ఒక రాక్షసుడు తన భయంకరమైన కత్తిని పైకెత్తి, సోను తల నరకడానికి బలంగా కిందికి విసిరాడు!

ప్రదేశం: అనుష్క కాళికా విజృంభణ & భావన  రహస్యం
సమయం: సాయంత్రం 04:25 గంటలు
 
సరిగ్గా ఆ కత్తి సోను మెడను తాకే మిల్లీసెకనులో...
 
"భచ్‌స్సససస!!!!!!!"
 
దూరం నుండి మెరుపు వేగంతో ఎగిరివచ్చిన ఒక పదునైన కాంబాట్ కత్తి... ఆ రౌడీ తలలో నిలువునా వెనుక నుండి నోట్లోకి దిగి, నాలుకను చీల్చుకుంటూ బయటకు వచ్చింది! రక్తం ఫౌంటెన్ లా చిమ్మింది!
 
టైమ్ 4:25!
 
అక్కడ బ్లాక్ ఈగల్ టీం సూట్‌లో, చేతిలో రక్తం ఓడుతున్న కాంబాట్ నైఫ్‌తో నిలబడి ఉంది... అనుష్క!
 
ఆమె తన ముసుగుతో చుట్టూ చూసింది... సన్నీ రక్తపు మడుగులో పడి కదల్లేకపోతున్నాడు, తన కంటిపాప రితిక గాయాలతో ఏడుస్తూ మోకాళ్లపై ఉంది!
 
ఆ దృశ్యం చూడగానే అనుష్కలోని మాతృమూర్తి మాయమైంది! సాక్షాత్తు రక్తపిపాసి అయిన కాళికాదేవి ఆవాహనమైనట్లు ఆమె కళ్లు రక్తం రంగులోకి మారాయి! తాను మనిషిననే విషయమే మర్చిపోయింది!
 
మిగిలిన 9 మంది రౌడీలు కత్తులు తిప్పుతూ అనుష్క వైపు పరుగెత్తారు. పిల్లలంతా భయంతో ఒకచోట చేరారు.
 
అటు మెడికల్ రూమ్‌లో (సమాంతరంగా):

బెడ్ పైన స్పృహలేకుండా ఉన్న భావనను చెక్ చేసిన డాక్టర్లు పరస్పరం చూసుకుని ఆశ్చర్యంతో చిరునవ్వు నవ్వారు. అవును... భావన ప్రెగ్నెంట్! (ఆమె గర్భవతి!)
 
ఆ విషయమే భావనకు తెలీదు! గడిచిన మూడు రోజుల నుండి ఏమీ తినకపోవడం, ప్రయాణాలు, మానసిక ఒత్తిడి వల్ల నాడి చాలా బలహీనంగా కొట్టుకుంటోంది.
 
డాక్టర్లు ఆమెకి అత్యవసరంగా గ్లూకోజ్ ఫ్లూయిడ్స్, విటమిన్ ఇన్జెక్షన్లు ఎక్కించారు. మరొక 15 నిమిషాల్లో ఆమెకి స్పృహ వస్తుందని ఎదురుచూస్తున్నారు!
 
సరిగ్గా అదే సమయానికి (సాయంత్రం 4:25 గంటలకు)... ఆధీర తన భయంకరమైన రూపం లో ఉన్న జీప్ తో, లోపలికి అడుగు పెట్టాడు. 

ఈగల్ టీం డ్రస్లో ఉన్న అనుష్క వైపు చూస్తూ పర్లేదు ఈరోజు కొంచెం మాజా వస్తుంది అని కార్ లో కూర్చొని చూస్తున్నాడు. 

(ఈగల్ టీం కేవలం ప్రెసిడెంట్ కె రిపోర్ట్ చేస్తారు , RAW, కంటే కూడా చాలా పవర్ఫుల్ అని ఆధీరకి తెలుసు)
ఇట్లు,
✿SUNNY ✿

1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం
[+] 8 users Like Sunnysunnysunny's post
Like


Messages In This Thread
RE: ❤️❤️ అందని జాబిలి.. అమ్మ❤️❤️ కోసం ? - by Sunnysunnysunny - 01-08-2026, 10:24 PM



Users browsing this thread: 2 Guest(s)