Thread Rating:
  • 38 Vote(s) - 3.58 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ❤️కన్నతల్లి కన్నీటి సాక్షిగా ❤️(రక్త కధనరంగం-1)❤️
ప్రదేశం: అల్కా ఆఫీస్ క్యాబిన్

సమయం: మధ్యాహ్నం 2:30 గంటలు
 
అల్కా తన క్యాబిన్‌లో ఉన్న గ్లాస్ విండో పక్కన నిలబడి బయటకు చూస్తోంది. ఆమె పెదవులపై ఒక చిన్న, మధురమైన చిరునవ్వు మెరుస్తోంది. మదిలో కేవలం ఒకే ఒక్కడి రూపం... సన్నీ!
 
అతని గంభీరమైన గొంతు, చూపుల్లోని నిశ్చయత, తన చురుకుదనం ఈరోజు అంత అతనికి దగ్గరగా ఉంటూ అతని పనిని చూడటం ఆమె మనసులో నాటుకుపోయింది....
 
ప్రతీదీ ఆమె హృదయంలో ఒక కొత్త అలజడిని సృష్టిస్తున్నాయి. 'సన్నీ... నువ్వు మామూలు వాడివి కాదు' అని మనసులోనే అనుకుంటూ మురిసిపోతోంది. పద్దతిగా ఉండే నన్నే ఇలా చేశావు రాస్కెల్....
 
ఫెస్ట్‌కి వెళ్లడానికి ఇంకా రెండు గంటల సమయం ఉందనేసరికి, ఉత్సాహంగా ఫోన్ తీసి పూనం అమ్మకి, వర్షకి, సోనుకి ఫోన్ చేసింది.
 
అల్కా- "అమ్మా! త్వరగా రెడీ అవ్వండి, సాయంత్రం కాలేజీకి బయలుదేరుతున్నాం. అని చెప్పా కదా నాకు నిన్ను చూడాలి అనిపిస్తుంది!".
 
పూనమ్ దేవి: వస్తున్నాం తల్లి టైమ్ కి అక్కడ ఉంటాం. అని ఫోన్ పెట్టేసింది.
(పూర్తి వివరణ పూనమ్ చెప్పే సూచనలు మీకు పూనమ్ దేవి స్టోరీ అప్డేట్ లో వస్తాయి)
 
మరోవైపు... నగరంలోని ఒక చీకటి రహస్య ప్రదేశంలో...
 
సురేష్ చోప్రా పంపిన 10 మంది అత్యంత ప్రమాదకరమైన అంతర్జాతీయ క్రిమినల్స్, సోనియాతో సీక్రెట్ కాన్ఫరెన్స్ కాల్‌లో ఉన్నారు.
 
ఆ గదిలో కేవలం పదునైన ఆయుధాల మెరుపులు, రక్తదాహం మాత్రమే కనిపిస్తున్నాయి.
 
కిల్లర్ 1 (రకసిగా)- "మేడమ్... మేము నగరంలోకి అడుగుపెట్టాం. ఎప్పుడు, ఎవరిని వేటాడాలో ఆజ్ఞాపించండి."
 
సోనియా ఫోన్ లోంచి చాలా కఠినంగా, గంభీరంగా మాట్లాడింది.
 
సోనియా- "వినండి! సురేష్ చోప్రా మీకు ఒక హెచ్చరిక, కఠినమైన నిబంధన విధిస్తున్నాడు... మన చిన్న కూతురు అల్కా పక్కన ఆ అలేఖ్య ఉన్నంతవరకు మీ కత్తి ఆ అలేఖ్యను తాకకూడదు!
 
అల్కాకి ఏ చిన్న గీత పడినా మీ ప్రాణాలు తీస్తాడు. అల్కా ఆమె పక్క నుండి తప్పుకునే వరకు వేచి చూడాలి. ఇంకో విషయం... ఎవరూ గన్స్ వాడటానికి వీల్లేదు!
 
ఆ దెబ్బల నొప్పిని, నరకాన్ని అనుభవిస్తూ వాళ్లు ప్రాణాలు విడవాలి. అలేఖ్యను, ఆమెను కాపాడటానికి వచ్చే ఆ ముసుగు మనిషిని నరికి పారేయండి. ఆ ముసుగు మనిషిని చంపినవాడికి 10 కోట్ల క్యాష్ రివార్డ్!"
 
ఆ మాట వినగానే ఆ కిల్లర్స్ కళ్లల్లో కొంటెతనం, రాక్షసానందం మెరిసాయి.
 
కిల్లర్ 1- "సరే మేడమ్... మీ పాపకి ఏ ప్రమాదం రాకుండా, ఆ పక్షిని, దాన్ని కాపాడే మనిషిని నరికి బలి ఇస్తాం."
 
వాళ్లు వెంటనే బ్లాక్ సూట్లు వేసుకుని, అల్కాకి తెలియకుండా ఆమె పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్‌ టీమ్‌లోకి కలిసిపోవాలి అని ముందే కాలేజ్ కి చేరుకున్నారు.
 
ప్రదేశం: అనుష్క పనిచేస్తున్న కాలేజ్ క్లాస్‌రూమ్
సమయం: మధ్యాహ్నం 2:40 గంటలు
 
తరగతి గదిలో బోర్డుపై రాస్తున్న అనుష్క చెయ్యి ఒక్కసారిగా ఆగింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది.
 
ఏదో భయంకరమైన దుర్ఘటన జరగబోతోందనే సంకేతం ఆమె ఆత్మను నిలవనీయడం లేదు. కంటిపాపల్లాంటి పిల్లలు ప్రమాదంలో ఉన్నారనే భయం ఆమె శరీరంలో వణుకు పుట్టించింది.
 
అలానే రితికకి అంత నచ్చిన ఆమె ఎవరు అని ఆమెని సురేష్ చోప్రా పిల్లలు అమ్మ అని ఎందుకు పిలుస్తున్నారో ఆమెని కలిసి తెలుసుకోవాలి అనుకుంది.
 
అంతలో వెనుక బెంచీలో ఇద్దరు విద్యార్థులు గట్టిగా కొట్టుకోవడం చూసి, అనుష్క శ్వాస వేగంగా తీసుకుంటూ అక్కడికి వెళ్లి ఇద్దరినీ పట్టుకుని విడదీసింది.
 
అనుష్క (కోపంగా)- "ఏంటా అల్లరి? ఎందుకు కొట్టుకుంటున్నారు?"
 
పిల్లాడు 1 (ఏడుస్తూ)- "మేడమ్... వీడు నిన్న కావాలనే నా సైకిల్ టైర్ పంచర్ చేయించాడు మేడమ్!"
 
పిల్లాడు 2- "అబద్ధం మేడమ్! నేను సైకిల్ ముట్టుకోనేలేదు!"
 
పిల్లాడు 1- "వీడు సొంతంగా చేయలేదు మేడమ్. నిన్న కాలేజ్ ఎగ్గొట్టి, తన ఫ్రెండ్‌కి నా సైకిల్ చూపించి పంచర్ చేయమన్నాడు!
 
సాయంత్రం నేను వెళ్తుంటే వీడి ఫ్రెండ్ నన్ను చూసి గేలి చేస్తూ నవ్వాడు. వాడిని నిలదీస్తే... వీడే డబ్బులిచ్చి చేయించాడని నిజం చెప్పేశాడు మేడమ్!"
 
అనుష్క రెండో పిల్లాడి వైపు సీరియస్‌గా చూస్తూ, అతని చెంపపై కొద్దిగా గట్టిగానే కొట్టింది.
 
అనుష్క- "ఎందుకురా అలాంటి నీచమైన పని చేశావు?"
 
పిల్లాడు 2 (చెంప పట్టుకుని ఏడుస్తూ)- "నేను సైకిల్ అడిగితే వీడు ఇవ్వలేదు మేడమ్... అందుకే వీడి సైకిల్‌ని నాశనం చేయాలనుకున్నాను.
 
దాన్ని నాశనం చేయడానికి నేనే వెళ్లాల్సిన పనిలేదు కదా మేడమ్... నా బదులు వేరే ఎవరు వెళ్లి చేసినా నేను అనుకున్నది జరుగుతుంది అనిపించింది..."
 
ఆ చిన్న పిల్లాడు అమాయకంగా అన్న మాట... "నా బదులు వేరే ఎవరు వెళ్లి చేసినా నేను అనుకున్నది జరుగుతుంది!" అనే వాక్యం అనుష్క మెదడులో నిప్పుకణికలా పడింది!
 
మరుక్షణమే ఆమెకు నిన్న అయేషా చెప్పిన మాటలు కళ్లముందు మెదిలాయి... 'అమ్మా... సోనియా వచ్చింది!'
 
'సురేష్ చోప్రా స్వయంగా రంగంలోకి దిగడు...అలానే సోనియాని కూడా ఇందులోకి డైరెక్ట్ గా వెళ్లనివ్వడు.
 
అంటే వాళ్ళకి అయేషా నుండి ఏదో విషయం తెలిసి ఉంటుంది అంటే నా పిల్లలు ప్రమాదంలో ఉన్నారు.తన బదులు చంపడానికి వేరే రాక్షసులను బరిలోకి దింపుతుంది!' అని అనుష్కకి అర్థమైపోయింది.
 
ఆమె గుండె ఆగినంత పనైంది. కంటిచూపు మసకబారినంత భయంతో వెంటనే తన హ్యాండ్‌బ్యాగ్‌లోని ఫోన్ తీసి, వణుకుతున్న వేళ్లతో అయేషాకి కాల్ చేసింది.
 
అనుష్క- "అయేషా! ఆ కాలేజీ ఫెస్ట్‌కి ఎవరెవరు వెళ్తున్నారు? నిజం చెప్పు!"
 
అయేషా (కంగారుగా)- "అల్కా మేడమ్,నేను, ఆమె ఫ్రెండ్స్, ఫ్యామిలీ వెళ్తున్నారు అమ్మా.బహుశా సన్నీ ని కూడా మేడమ్ తీసుకు వస్తారు. పొద్దున నుండి అక్కడే ఉన్నారు ఇద్దరు"
 
అనుష్క- "ఫ్యామిలీ అంటే ఆ సోనియా కూడా వస్తోందా?"
 
అయేషా- "లేదు అమ్మా, సోనియా మేడమ్‌కి ఏదో పని ఉండి రానని చెప్పేసింది.."
 
సోనియా రావడం లేదు అనే మాట వినగానే అనుష్క మైండ్ బ్లాంక్ అయింది! శత్రువు సైలెంట్‌గా ఉందంటే... కచ్చితంగా అక్కడ రక్తం ఏరులై పారించే వ్యూహం సిద్ధమైంది!
 
అనుష్క- "అయేషా! నేను చెప్పేది జాగ్రత్తగా విను! ఈ క్షణమే నీ బ్యాగ్ తీసుకుని 'మా అమ్మకి బాగోలేదు' అని చెప్పి అక్కడి నుండి బయలుదేరు!
 
ఎక్కడా ఆగకుండా మీనాక్షి దగ్గరికి వెళ్లి, ఇద్దరూ కలిసి ఊరిలో ఉన్న మీ నాన్న దగ్గరికి పారిపోండి! త్వరగా!"
 
అయేషా "అమ్మా..." అనేలోపే కాల్ కట్ చేసి మీనాక్షికి ఫోన్ చేసింది.
 
అనుష్క- "మీనూ! అయేషా రాగానే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇద్దరూ ఊరిలోకి మీ నాన్న దగ్గరికి వెళ్లండి!"
 
మీనాక్షి- "ఏమైంది అమ్మా? అంత కంగారుపడుతున్నావు?"
 
అనుష్క- "నేను చెప్పింది చెయ్ మీనూ!" అని ఫోన్ పెట్టేసింది.
 
తన చిన్న కూతురు రితిక ప్రమాదంలో ఉందనే ఆలోచన అనుష్కను పిచ్చిదాన్ని చేసింది. పరుగెత్తుకుంటూ వెళ్లి ప్రిన్సిపాల్ రూమ్‌లో పర్మిషన్ తీసుకుని, రోడ్డుపైకి వచ్చి వేగంగా వెళ్తున్న ఆటోను ఆపి ఎక్కింది.
 
సమయం మధ్యాహ్నం 3:30 అయింది. దారంతా రితికకి ఫోన్ చేస్తూనే ఉంది... కానీ స్విచ్ ఆఫ్ వస్తోంది! ఎందుకంటే అప్పటికే కిల్లర్స్ కాలేజీ ప్రాంగణంలోకి ప్రవేశించి, హై-పవర్ సిగ్నల్ జామర్లు ఆన్ చేశారు!
 
ప్రదేశం: అల్కా కారు / అనుష్క ఇల్లు
సమయం: సాయంత్రం 3:40 గంటలు
 
అల్కాతో పాటు కారులో వెళ్తున్న సన్నీ ఫోన్ వైబ్రేట్ అయింది. స్క్రీన్ పై 'అమ్మ' అని పడగానే సన్నీ మెసేజ్ ఓపెన్ చేశాడు.
 
అనుష్క పంపిన మెసేజ్: "సన్నీ! నేను కాలేజీ దగ్గరికి వస్తున్నాను. ఎవరినీ నమ్మకు! ఆ దేవుడే నీ ముందు వచ్చి నిలబడ్డా సరే... నీ ముందున్నదంతా ఒక భయంకరమైన నాటకం అని గుర్తుంచుకో!
 
రితికకి ఒక్క చిన్న గీత పడినా నిన్ను ప్రాణాలతో ఉంచను! నేను వచ్చే వరకు నా కూతురిని కాపాడుకోవడమే నీ లక్ష్యం... నేను వస్తున్నాను!"
 
ఆ మెసేజ్ చదవగానే సన్నీ వెన్నులో వణుకు పుట్టింది. అమ్మ గొంతులోని ఆవేశం, హెచ్చరిక అతనికి స్పష్టంగా అర్థమయ్యాయి.
 
తన చుట్టూ మృత్యువు పొంచి ఉందనే నిజం తెలిసొచ్చింది. 'అమ్మ చెప్పినట్లు రితికకి ఏ హానీ జరగకుండా చూడటమే నా మొదటి బాధ్యత!' అని సన్నీ మనసులో శపథం పూనాడు.
 
ప్రదేశం: అనుష్క ఇల్లు
సమయం: సాయంత్రం 3:42 గంటలు
ఇంటికి చేరుకున్న అనుష్క... ముఖంలో ఎలాంటి భయం లేదు, కేవలం శత్రువుల రక్త దాహం మాత్రమే కనిపిస్తోంది.
 
రెండు రోజుల క్రితమే రహస్యంగా తెప్పించిన అడ్వాన్స్‌డ్ బ్లాక్ కమాండో సూట్‌ను బయటకు తీసింది. వెంటనే ఒక సీక్రెట్ నంబర్‌కి ఫోన్ చేసి "5 మినిట్స్!" అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
 
సరిగ్గా ఐదు నిమిషాల్లో బయట ఒక స్పోర్ట్స్ బైక్ ఆగిన శబ్దం వినిపించింది. ఒక వ్యక్తి హెల్మెట్ తీసి బైక్ తాళాలు ఇచ్చి వెళ్లాడు.
 
లోపల నల్లటి కమాండో సూట్, దానిపై ఎవరికీ అనుమానం రాకుండా పొడవాటి లూజ్ డ్రెస్, తలపై బ్లాక్ హెల్మెట్ ధరించి అనుష్క బైక్ స్టార్ట్ చేసింది. ఇంజన్ సైలెన్సర్ గర్జించింది.
 
సమయం సాయంత్రం 3:45!
 
తన కంటిపాప లాంటి చిన్న కూతురు రితికపై చెయ్యి వేయాలని చూస్తే... ఈరోజు నగర వీధులు శవాల దిబ్బగా మారడం ఖాయం.
 
రౌద్రంతో ఊగిపోతున్న కాళికాదేవిలా అనుష్క బైక్ ఎక్సిలేటర్ తిప్పి, కాలేజీ వైపు వాయువేగంతో దూసుకెళ్లింది! యుద్ధం మొదలైంది!
 
(మీకు ఆధీర గురించి మిగిలిన మరింత సమాచారం పూనమ్ దేవి స్టోరీ లో తెలుస్తుంది.}
ఇట్లు,
✿SUNNY ✿

1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం
Like


Messages In This Thread
RE: ❤️కన్నతల్లి కన్నీటి సాక్షిగా ❤️..రక్త కదనరంగం❤️ - by Sunnysunnysunny - 29-07-2026, 11:12 PM



Users browsing this thread: