29-07-2026, 02:16 AM
ప్రదేశం : రేపు యుద్దం జరగబోయే రణస్థలం
సమయం : సరిగ్గా 24 గంటల ముందు
సరిగ్గా సాయంత్రం 4 గంటలకు... ఒక కారులో అల్కా, అయేషా... మరో కారులో పూనమ్ దేవి, వర్ష, సోను వచ్చారు.
అందరూ కలిసి రితిక కోసం కాలేజ్ పార్కింగ్ ఏరియా పక్కన ఉన్న పచ్చటి చెట్ల మధ్య బెంచ్ మీద కూర్చున్నారు.
సోనుని ఆటపట్టిస్తూ నవ్వుకుంటున్నారు. పూనమ్ దేవి వారిని చూస్తూ నవ్వుతోంది.
![[Image: 145ce466ddd110ae72086f96ac1bc4f2.jpg]](https://i.pinimg.com/736x/14/5c/e4/145ce466ddd110ae72086f96ac1bc4f2.jpg)
అయేషాకు పూనమ్ దేవి అమ్మని చూడగానే... ఒక దేవతని దగ్గరగా చూసినంత కొత్తగా, ప్రశాంతంగా అనిపించింది. ఆమె కళ్లు, ఆ చిరునవ్వు అయేషాను కట్టిపడేసాయి.
అప్పుడే వర్షకి నిన్న మాల్‌లో సోను చేసిన గొడవ గుర్తొచ్చింది.
వర్ష- "బుజ్జీ! నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. నా తమ్ముడు నాకోసం ఎవరినైనా చంపడానికి కూడా వెనుకాడడు తెలుసా! నీ కంటే వాడికి నేనే ఎక్కువ ఇష్టం!"
అల్కా- "ఏం చేశాడు ఈ బండోడు?"
వర్ష- "నిన్న మాల్‌లో ఒక కుర్రాడు నా చున్నీ మీద కాలు వేస్తే నేను పడిపోయాను. దాంతో సోను వాడి మెడ పట్టుకుని నెట్టేశాడు.
కానీ ఆ కుర్రాడితో ఉన్న వాళ్ల అక్కని చూస్తే నాకు నువ్వే గుర్తొచ్చావు. ఆగు నీకో ఫోటో చూపిస్తాను" అని చెప్పి నిన్న తీసిన సన్నీ ఫోటో చూపించింది.
ఆ ఫోటో చూడగానే అల్కా కళ్లల్లో మెరుపు వచ్చింది. గుండె వేగంగా కొట్టుకుంది. ముఖంలో చిరునవ్వుతో "సన్నీ..." అని నోరూరింది.
పూనమ్ అమ్మ అది గమనించి- "నీకు తెలుసా తల్లి ఆ కుర్రాడు?" అని అడిగింది. (ఆ గొడవ గురించి, సన్నీని కలవడం గురించి అల్కా పూనమ్ అమ్మకి చెప్పలేదు).
![[Image: f055e627553db97a6b449a8f8c9297fa.jpg]](https://i.pinimg.com/736x/f0/55/e6/f055e627553db97a6b449a8f8c9297fa.jpg)
అల్కా తడబడుతూ- "లేదు లేదు అమ్మా, తెలీదు" అంది. సరిగ్గా అప్పుడే రితిక అక్కడికి వచ్చింది.
అయేషా- "మేడమ్, మా ఫ్రెండ్ వచ్చింది" అని చెప్పింది.
రితికను చూసి గుర్తుపట్టిన వర్ష- "అమ్మా! నిన్న మాల్‌లో చూసిన అమ్మాయి ఈమెనే!" అని పూనమ్ అమ్మ చెవిలో చెప్పింది.
సోను మెల్లగా "ఎవరా అమ్మాయి?" అని వెనక్కి తిరిగి చూడబోయాడు. కానీ రితికకి ఎదురుగా సోను కనిపించగానే ఎక్కడలేని కోపం, వాడి ప్రాణాలు తీసేయాలనేంత ఆవేశం వచ్చింది!
చుట్టూ ఎంతమంది ఉన్నా ఆమెకు కనిపించలేదు, ఆమె చూపు కేవలం సోను పైనే ఉంది.
అల్కా ముందుకు వచ్చి- "హాయ్, నా పేరు..." అని పరిచయం చేసుకునే లోపే...
రితిక ఆవేశంగా వచ్చి సోను చొక్కా పట్టుకుని 'పటా పటా' మని రెండు చెంపదెబ్బలు కొట్టింది!
అక్కడున్న వారందరూ నోరెళ్లబెట్టి షాక్‌లో నిలబడిపోయారు... ఒక్క పూనమ్ అమ్మ తప్ప!
పూనమ్ కి రితిక కళ్లల్లోని రక్తాన్ని చూసి అర్థమైంది... సోను ఏదో తప్పు చేసే ఉంటాడని!
అల్కా వెంటనే తేరుకుని- "ఏయ్! నీకెంత ధైర్యం నా తమ్ముడిని కొట్టడానికి!" అని రితికపై చేయి ఎత్తింది.
![[Image: 46d05a6c5e8881bd098dc1f1b1264b1a.jpg]](https://i.pinimg.com/736x/46/d0/5a/46d05a6c5e8881bd098dc1f1b1264b1a.jpg)
అయేషా కంగారుగా- "మేడమ్!" అని గట్టిగా అరిచింది.
కానీ రితిక అల్కా ఎత్తిన చేతిని గట్టిగా పట్టుకుని, ఆమె కళ్లల్లోకి సూటిగా చూస్తూ-
"నిన్న నా తమ్ముడిని వీడు కొట్టినప్పుడు నాకు కూడా ఇంతే కోపం వచ్చింది!
ఈ దెబ్బలు వీడికి నిన్ననే పడాల్సింది, కానీ మా తమ్ముడు ఆపాడు!" అని గంభీరంగా చెప్పింది.
అల్కా షాక్ అవుతూ- "ఏంటి? సన్నీని కొట్టాడా వీడు?!" అని గట్టిగా అరిచింది.
'అతను సన్నీ అని ఈమెకి ఎలా తెలుసు?' అని అందరూ ఆశ్చర్యపోయారు.
కానీ అల్కా అందరూ తేరుకునేలోపే సోనుని పట్టుకుని 'ఛెళ్లు ఛెళ్లు' మని రెండు పీకింది!
అల్కా- "బండ వెధవా! రౌడీలా తయారయ్యావా? అసలు వారి పై చేయి ఎందుకు ఎత్తావురా?!"
సోనుకి మైండ్ బ్లాంక్ అయింది. "అమ్మా! ఇదా నన్ను కాలేజీలో చేర్పించడం అంటే? నన్ను కొట్టడానికి పిలిచారా? అబ్బా... ఎంత గట్టిగా కొట్టిందో! కోతి " అని మూలిగాడు.
అందరూ పూనమ్ దేవి వైపు చూశారు. పూనమ్ అమ్మ బెంచ్ మీద కూర్చుని చిరునవ్వుతో రితిక, అల్కాల వైపు చూసింది. కాసేపు అక్కడ నిశ్శబ్దం అలుముకుంది.
రితిక పూనమ్ అమ్మ కళ్లల్లోకి చూసింది. ఎవరినో కోల్పోయిన తీరని బాధ, తనపై కురిపిస్తున్న అమితమైన వాత్సల్యం పూనమ్ కళ్లల్లో కనిపించాయి.
![[Image: 4968d60b8f501822095b793fdd4d6739.jpg]](https://i.pinimg.com/736x/49/68/d6/4968d60b8f501822095b793fdd4d6739.jpg)
అందరి మనసులను చదవగలిగే రితిక... తనకే తెలియకుండా పూనమ్ అమ్మ వైపు అడుగులు వేసింది.
పూనమ్ అమ్మకి చిన్నప్పుడు అనుష్కను చూసినట్లే అనిపించింది. ఆమె కళ్లు నీళ్లతో నిండిపోయాయి. అల్కా అది చూసి "అమ్మా..." అని దగ్గరకు వెళ్లబోయింది.
కానీ రితిక ఏమీ మాట్లాడకుండా వెళ్లి పూనమ్ అమ్మ పక్కన కూర్చుని, ఆమె భుజంపై తల పెట్టి గట్టిగా హత్తుకుని ఏడవడం మొదలుపెట్టింది!
సన్నీ తప్ప ఇంకెవరు బాధపడినా తన బాధను బయటపెట్టని రితిక... ఈరోజు ఒక కొత్త ఆవిడని హత్తుకుని ఎందుకు ఏడుస్తోందో అర్థం కాక అయేషా షాక్ అయింది.
దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న సన్నీ కూడా ఆశ్చర్యపోయాడు.
అనుష్క అమ్మ దగ్గరకు తప్ప ఎవరి దగ్గరకీ వెళ్లని రితిక... పూనమ్ దేవిని హత్తుకుని ఏడవడం అతనికి వింతగా అనిపించింది.
![[Image: 4c774db512aefe45e91e8c1a62090ad0.jpg]](https://i.pinimg.com/1200x/4c/77/4d/4c774db512aefe45e91e8c1a62090ad0.jpg)
ఒక 5 నిమిషాలకి పూనమ్ అమ్మ శాంతించింది. రితిక తలపై చేయి నిమిరి- "తమ్ముడంటే ప్రాణమా తల్లి?" అని అడిగింది.
( పూనమ్ దేవి తెలియకుండానే తాను వదిలేసిన తన చెల్లి “సీమ” గుర్తొచ్చి లోపల గుండె పగిలేలా ఏడుస్తుంది)
రితిక ఏడుస్తూ "అవును" అని తల ఊపింది. పూనమ్ అమ్మ ఆమె కన్నీళ్లు తుడిచి, ప్రేమగా ముందుకు వంగి నుదుటిపై ముద్దు పెట్టుకుంది. రితిక ఆనందంతో కళ్లు మూసుకుని నవ్వింది.
కళ్లు తెరిచిన వెంటనే... పూనమ్ అమ్మ మెడలో ఉన్న ఒక లాకెట్ టైప్ చైన్ మీద రితిక చూపు పడింది. ఆమె దాన్ని తదేకంగా చూస్తోంది.
పూనమ్ అమ్మ మెల్లగా- "మీ అమ్మ పేరేంటి తల్లి?" అని అడిగింది.
రితిక 'అనుష్క' అని చెప్పబోతుండగా అయేషా అడ్డుపడి- "మేడమ్! కాలేజ్ క్లోజ్ చేస్తారు, సమయం అవుతోంది" అని కవర్ చేసింది.
రితిక కొంచెం లోకంలోకి వచ్చి- "నాకు నాన్న మాత్రమే ఉన్నారమ్మా... మా అమ్మగారు లేరు" అని అబద్ధం చెప్పింది.
ఎందుకంటే అల్కా సురేష్ చోప్రా కూతురు కాబట్టి, తమ అమ్మ గురించి తెలిస్తే ప్రమాదమని భావించింది.
పూనమ్ అమ్మ రితికను కౌగిలించుకుని- "సరే తల్లి, నీకేం కావాలన్నా నన్ను అడుగు సరేనా?" అంది.
కానీ రితిక చూపు ఇంకా ఆ లాకెట్ పైనే ఉంది. అది గమనించిన పూనమ్ అమ్మ- "రీతూ..." అని పిలిచింది! (అనుష్క రోజు పిలిచినట్లే ఆ పేరుతో పిలిచేసరికి రితిక కళ్లల్లో మళ్లీ నీళ్లు తిరిగాయి).
పూనమ్ అమ్మ- "ఇది కావాలా నీకు?" అని అడిగింది.
రితిక 'అవును' అన్నట్లు తల ఊపింది. పూనమ్ తాను 35 ఏళ్లుగా ప్రాణంగా దాచుకున్న, అనుష్క మరియు భావనల ఫోటో ఉన్న ఆ పసిడి లాకెట్‌ను తీసి రితిక మెడలో వేసింది!
అది చూసి అల్కా అలుగుతూ- "అమ్మా! అది నేను నీకు చేయించి ఇచ్చాను కదా!" అంది.
పూనమ్ అమ్మ నవ్వుతూ- "నా కూతురు నాకు ఇంకోటి చేయించి ఇవ్వదా ఏంటి? నువ్వు ఇది చేసిన షాప్‌లోనే ఇంకోటి చేయించు, అప్పుడు నేను వేసుకుంటాను.
![[Image: bd35cd4d1e4706cd2eea8266b0536f54.jpg]](https://i.pinimg.com/736x/bd/35/cd/bd35cd4d1e4706cd2eea8266b0536f54.jpg)
కానీ ఇది మాత్రం ఈ పాపకే ఇస్తాను" అంది. అందరూ నవ్వేశారు.
దూరం నుండి చూస్తున్న సన్నీ, పక్కనే ఉన్న అయేషాల కళ్లు కూడా ఆ దృశ్యం చూసి చెమ్మగిల్లాయి.
పూనమ్ అమ్మ లేచి- "సరే, మీరు వెళ్లి కాలేజ్ అడ్మిషన్ పనులు చూడండి, నాకు కొంచెం పని ఉంది" అని చెప్పి కారు తాళాలు తీసుకుని బయలుదేరింది.
వారు లోపలికి వెళ్తుండగా, పూనమ్ అమ్మ బయటకు వెళ్తూ చుట్టూ గమనించింది. ఎవరో దూరంగా ఉండి తమను నిఘా వేసి గమనిస్తున్నారని పూనమ్ అమ్మ కనిపెట్టింది!
పిల్లలను లోపలికి పంపించి, కారును గేటు దగ్గర నిలబడిన సన్నీ వద్ద ఆపింది. సన్నీ ముఖంలో ఇంకా కన్నీళ్ల తడి ఉంది. పూనమ్ నవ్వుతూ- "నువ్వు ఏడిస్తే ఎలా నాయనా?
తల్లి లేని పిల్లని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకో విషయం... నువ్వు ఎప్పుడైనా ఒకరిని గమనిస్తున్నప్పుడు (ఫాలో అవుతున్నప్పుడు) వాళ్లకి లెఫ్ట్ సైడ్ ఉండి చేయి.
అప్పుడు నీపైన ఎవరి చూపు పడదు. ఇలా ఎదురుగా, వెనుక ఉంటే ఆమెకు ప్రమాదం! సరేనా, నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో" అని చెప్పి కారులో వెళ్లిపోయింది. సన్నీ ఆ మాటలకు షాక్ అయ్యాడు!
పూనమ్ నేరుగా “ రాయ్ గ్రూప్” పంపిన సైబర్ టీం ని కలవడానికి అలానే మరికొన్ని ఆయుధాలాను చూడటానికి తన ప్లేస్ కి బయలుదేరింది.
సమయం: సాయంత్రం 05:00 గంటలు
ప్రదేశం: లెమన్ ట్రీ సెంటర్ (పూనమ్ సీక్రెట్ కమాండో వార్ రూమ్)
గదిలో గుండె చప్పుడు సైతం వినపడేంత భయంకరమైన నిశ్శబ్దం. మల్టీ-మొనిటర్ స్క్రీన్‌ల నీలి వెలుగు పూనమ్ దేవి రౌద్రంతో నిండిన ముఖంపై పడుతోంది.
సడన్‌గా... ఆమె చేతిలో ఉన్న ప్రత్యేకమైన సైబర్ డిటెక్టర్ మొబైల్ "బీప్... బీప్... బీప్..." అని తీవ్రమైన హెచ్చరిక శబ్దంతో అరిచింది!
పూనమ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
(మనసులో) "సీమ...?! నా చెల్లి దగ్గర నుంచే ఫోన్ వస్తోందా?!"
కానీ పూనమ్ కమాండో బ్రెయిన్ వెంటనే అలర్ట్ అయింది. ఆ శబ్దం ఆమె సీక్రెట్ శాటిలైట్ ఫోన్ నుండి కాకుండా, ఆఫీషియల్ ఎన్‌క్రిప్టెడ్ డివైస్ నుండి వస్తోందని గ్రహించింది. శ్వాస గట్టిగా తీసుకుని ఫోన్ ఎత్తింది.
పూనమ్: (ప్రశాంతంగా, గంభీరంగా) "చెప్పండి చీఫ్..."
RAW చీఫ్: (అవతలి నుండి విపరీతమైన కంగారుతో, శ్వాస వేగంగా తీసుకుంటూ) "పూనమ్! అత్యవసరమైన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్...
ఇండియాలో వేరే ఎక్కడైనా అయితే నేనే చూసుకునేవాడిని, కానీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని దారుణాలూ వైజాగ్‌లోనే కేంద్రీకృతమవుతున్నాయి!
నీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని వెంటనే కాల్ చేశాను... చైనా నుండి సుమారు 50 కిలోల ప్రమాదకరమైన RDX బాంబ్ నేరుగా వైజాగ్ నగరం లోపలికి ప్రవేశించింది!"
ఆ మాట వినగానే పూనమ్ కళ్లల్లో పదునైన మెరుపులు మెరిశాయి. ఆమెలోని 'డెత్ ఏంజెల్' ఒక్కసారిగా మేల్కొంది!
పూనమ్: "టీమ్! రేపు వైజాగ్ సిటీలో జరగబోయే ప్రతీ ఒక్క ఈవెంట్, అఫీషియల్ మీటింగ్స్, హెచ్‌ఐపి డెలిగేషన్స్, సెలబ్రిటీస్ ఫంక్షన్స్... కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడే ఈ స్క్రీన్ పైన డిస్‌ప్లే చేయండి!"
సైబర్ టీమ్ వేళ్లు కీబోర్డులపై పిచ్చిగా పరిగెత్తాయి.
RAW చీఫ్: "ఏమైంది పూనమ్? నీకు దేనిపైన అయినా అనుమానం ఉందా?!"
పూనమ్: "నాకు కేవలం రెండు నిమిషాలు టైమ్ ఇవ్వండి చీఫ్!"
![[Image: 1f4e2c0bbc04cb6b7563491fa805209a.jpg]](https://i.pinimg.com/736x/1f/4e/2c/1f4e2c0bbc04cb6b7563491fa805209a.jpg)
సైబర్ కమాండో: "మేడమ్! స్క్రీన్ పైన డేటా వచ్చింది. రేపు వైజాగ్‌లో 4 ప్రధాన ఈవెంట్స్ ఉన్నాయి:
1. వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బిగ్ మ్యాచ్.
2. గీతం యూనివర్సిటీలో ఇండియా వైడ్ మెగా కాలేజ్ ఫెస్ట్.
3. లోకల్ లీడర్లతో డిప్యూటీ సీఎం ప్రైవేట్ మీటింగ్.
4. వైజాగ్ పోర్ట్‌లో నేవీ డే ఈవెంట్ ప్రెపరేషన్స్!"
పూనమ్ తన కళ్లు మూసుకుని... ఒక క్షణం తాను 'ఆధీర' స్థానంలో ఉంటే ఏం ఆలోచిస్తానో ఆ విధంగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమె మైండ్ కంప్యూటర్ కంటే వేగంగా లెక్కింపులు వేసింది.
పూనమ్: (కాల్‌లో ఉన్న చీఫ్‌తో) "చీఫ్! మీకు ఒక వ్యక్తి ప్రాణాలతో కావాలి అనుకున్నప్పుడు... మీరు సిటీలో ఆమె ఉండే చోట అలాంటి భారీ విధ్వంసం ఎందుకు చేస్తారు?"
RAW చీఫ్: "చేయను పూనమ్! ఎందుకంటే అందరి దృష్టి నా టార్గెట్ పైన పడుతుంది!"
పూనమ్: (సైబర్ టీమ్‌తో) "టీమ్! ఆ లిస్ట్ లోంచి కాలేజ్ ఫెస్ట్, డిప్యూటీ సీఎం మీటింగ్‌లను తక్షణమే డిలీట్ చేయండి! ఒక లోకల్ లీడర్ కోసం 50 కిలోల RDX వాడరు!"
పూనమ్ మనసులో :
("ఆధీరకి అల్కా, మిగిలిన ఇద్దరు ప్రాణాలతో కావాలి! వాళ్లను ఎత్తుకెళ్లాలంటే నగరంలో ఉన్న మొత్తం సెక్యూరిటీ అధికారి, ఆర్మీ, సెక్యూరిటీ దృష్టిని మళ్లించే భయంకరమైన డెమోలిషన్ ప్లాన్ కావాలి. ")
![[Image: 433f0809d1b5d8b19b654a26cdd13957.jpg]](https://i.pinimg.com/1200x/43/3f/08/433f0809d1b5d8b19b654a26cdd13957.jpg)
పూనమ్: "మిగిలినవి రెండే రెండు... ఒకటి క్రికెట్ స్టేడియం, రెండు నేవీ డే బేస్! ఎందుకంటే చైనా ఇన్నాళ్లుగా మన ఇండియన్ నేవీకి చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకను నాశనం చేయడానికి కుట్రలు చేస్తోంది.
కానీ నేవీ డే సెక్యూరిటీని దాటాలంటే నెలల తరబడి ప్లాన్ ఉండాలి... సో, నా అనాలసిస్ ప్రకారం 90% టార్గెట్ ఆ క్రికెట్ మ్యాచ్ మాత్రమే!"
RAW చీఫ్: (దిగ్భ్రాంతితో) "వాట్?! క్రికెట్ మ్యాచా?! పూనమ్... రేపటి మ్యాచ్‌కి దేశంలోని అత్యున్నత ప్రముఖులు, వ్యాపారవేత్తలు, కేంద్ర మంత్రులు వస్తున్నారు! నేను ఇప్పుడే వాళ్లందరికీ ఇన్ఫార్మ్ చేసి ఆ మ్యాచ్ రద్దు చేయిస్తాను!"
పూనమ్: (గర్జ గొంతుతో) "వద్దు చీఫ్! మీరు మ్యాచ్ రద్దు చేస్తే... వాడు ఆ ఆ బాంబును వేరే ఎక్కడో అమర్చుతాడు! మనకి ఈ ప్లాన్ తెలుసనే విషయం వాడికి తెలియకూడదు.
గేమ్ వాడికి మాత్రమే కాదు చీఫ్... రేపు 'డెత్ ఏంజెల్' కూడా ఆడుతుంది! రేపు మ్యాచ్ ముగిసేసరికి ఈ దేశమంతా వైజాగ్ వైపే చూసేలా చేస్తాను... ఈ ఇష్యూ నాకు వదిలేయండి!"
అంటూ స్క్రీన్ వైపు పదునైన చూపులు విసిరింది.
పూనమ్: "స్టాప్!"
RAW చీఫ్: "ఏమైంది పూనమ్?"
పూనమ్: "చీఫ్! మ్యాచ్ ప్రారంభానికి ముందు RDX లోపలికి వెళ్లే ఛాన్స్ 0%! ఎందుకంటే 3-లేయర్ సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. అలాగే ప్రేక్షకులు వెళ్లే సాధారణ గేట్ల ద్వారా 50 కిలోల బ్యాగ్ వెళ్లడం అసాధ్యం.
అక్కడ మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి. ఇక మిగిలింది కేవలం... 'VIP గేట్ అండ్ లీగల్ సప్లై వెహికల్స్'!"
RAW చీఫ్: (నిశ్చేష్టుడై) "మై గాడ్..."
పూనమ్: "మ్యాచ్ మొదలై ఆటగాళ్లు, ప్రేక్షకులు గేమ్‌లో మునిగిపోయిన కొద్దిసేపటికి... ప్లేయర్స్ కిట్ వెహికల్స్, విఐపి క్యాటరింగ్ వస్తువులు లేదా పవర్ఫుల్ విఐపి కార్స్ లోపలికి వెళ్లే సమయానికి చెకింగ్ అత్యంత నామమాత్రంగా ఉంటుంది!
వాళ్ళు సరిగ్గా ఆ విఐపి ఎంట్రీ పాయింట్‌నే తన డెత్ జోన్‌గా ఎంచుకున్నాడు!"
RAW చీఫ్: (ఒళ్లు గగుర్పొడుస్తుండగా) "లొకేషన్ లాక్ అయింది... విఐపి గేట్! ఇప్పుడు నీ నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ ఏంటి పూనమ్?"
ప్రదేశం: ది 'త్రీ-స్టెప్' మాస్టర్ ఎగ్జిక్యూషన్
సమయం: సాయంత్రం 05:30 గంటలు
పూనమ్ తన రెండు చేతులను టేబుల్ పైన ఆనించి, భయంకరమైన డెత్ ప్లాన్‌ను వివరించడం మొదలుపెట్టింది.
పూనమ్: "చీఫ్! మై త్రీ-స్టెప్ ఎగ్జిక్యూషన్ ప్లాన్:
స్టెప్ 1: రేపు ఒక్క విఐపి వాహనం లేదా ప్లేయర్ల బస్సు కూడా స్టేడియం మెయిన్ గేట్ వరకు రాకూడదు! కనీసం 300 మీటర్ల దూరంలోనే అన్ని వాహనాలను ఆపేయాలి.
చివరికి క్రికెటర్లు కూడా నడుచుకుంటూనే గ్రౌండ్‌లోకి రావాలి! ప్రతి ప్లేయర్, ప్రతి విఐపి లగేజ్ బ్యాగ్ నుండి కిట్ బ్యాగ్ వరకు ఇంచ్ బై ఇంచ్ క్లియర్ గా స్క్రీన్ చెకింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలి!
స్టెప్ 2: విఐపి బాక్స్‌లోకి ఒక్కసారి ప్రవేశించిన తర్వాత... ఎవరైనా సరే మళ్లీ బయటకు వస్తే వాళ్ల పాస్ తక్షణమే రద్దవుతుంది! మళ్లీ లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకూడదు.
అక్కడ సాధారణ సెక్యూరిటీ ఆఫీసర్లని కాకుండా... మన 'RAW బ్లాక్ కమాండోస్' 10 మందిని అండర్ కవర్‌లో నిలబెట్టండి!
స్టెప్ 3: మనకి ఆ 50 కేజీల RDX ప్యాకేజ్ దొరికిన తర్వాత... దాని టైమర్ డిఫ్యూజ్ చేయడానికి ఎంత టైమ్ ఉందో మనకు తెలియదు!
అందుకే స్టేడియం సీక్రెట్ పార్కింగ్ ఏరియాలో ఒక 'హై-స్పీడ్ ఎమర్జెన్సీ ఆర్మీ హెలికాప్టర్' ఇంజన్ ఆన్ చేసి సిద్ధంగా ఉంచండి.
ఆ ప్యాకేజీ దొరకగానే... మరుసటి సెకనులో దాన్ని హెలికాప్టర్‌లో నగరానికి దూరంగా, డీప్ సముద్రం లోపలికి తీసుకెళ్లి బాంబ్ డిస్పోజల్ టీమ్‌కి అప్పగించి క్రాష్ డిస్పోజ్ చేయాలి!"
ఆ ప్లానింగ్, ఆ డెప్త్, ఆ స్పీడ్ విన్న RAW చీఫ్ మైండ్ బ్లాంక్ అయిపోయింది!
RAW చీఫ్: (ఆనంద భాష్పాలు, ఆశ్చర్యంతో) "వెల్ డన్ పూనమ్! వెల్ డన్!
నిజంగా నువ్వు ఈ దేశం కోసం ఇంకా ఆఫీషియల్‌గా పనిచేయనందుకు నా గుండె తల్లడిల్లుతోంది... యు ఆర్ ది రియల్ లెజెండ్!"
పూనమ్: "థ్యాంక్స్ చీఫ్... ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయండి!" పూనమ్ కాల్ కట్ చేసింది.
స్క్రీన్ పై కాలిక్యులేషన్స్ మారుతున్నాయి. పూనమ్ దేవి చేతులు బలంగా బిగుసుకున్నాయి. కళ్లల్లోంచి రక్తపు రంగు ప్రసరిస్తోంది.
(మనసులో గర్జిస్తూ)
"ఆధీర... రేపు నీకైనా ఆఖరి రోజు కావాలి, లేదా నీ చేతుల్లో నాకైనా ఆఖరి రోజు కావాలి! ఈ 'డెత్ ఏంజెల్' అడుగుపెట్టిన నేల పైన... నా పిల్లల రక్తం కాదురా, నీ రాక్షస సామ్రాజ్యపు బూడిద మాత్రమే మిగులుతుంది!"
![[Image: bae38c0ad72701d883a30192e4e65d56.jpg]](https://i.pinimg.com/736x/ba/e3/8c/bae38c0ad72701d883a30192e4e65d56.jpg)
పూనమ్ కళ్లు నిప్పులు చెరిగాయి.
పూనమ్: (తన లోపల ఆవేదనను దాచుకుంటూ) "! రేపు నీ 'రక్తపు ఉచ్చు' లోకి నా పిల్లలను రానివ్వను... నిన్ను వైజాగ్ నేల పైన నరికి బలి ఇస్తాను!"
రెండు మహావృక్షాల్లాంటి నెట్‌వర్క్‌లు, ఇద్దరు రక్షక-రాక్షస శక్తి సమూహాలు రేపటి సాయంత్రం 5:15 నిమిషాల కౌంట్‌డౌన్‌కి సిద్ధమయ్యాయి!
కానీ, ఆ ఇద్దరి రక్షక-రాక్షస నెట్‌వర్క్‌ల కంటే ముందే... ఆ మహా నగరంలో మరొక నమ్మశక్యం కాని శక్తి అడుగుపెట్టింది!
ఆ విషయాన్ని ఆధీర ఊహించలేదు, కనీసం పూనమ్ దేవి కూడా కనిపెట్టలేకపోయింది!
అవును... ఆ శక్తే 'ఫ్యాబ్ షాడో' (భావన)!
![[Image: fadf7f0f6ba7d9b141f10ebe0375dc0e.jpg]](https://i.pinimg.com/1200x/fa/df/7f/fadf7f0f6ba7d9b141f10ebe0375dc0e.jpg)
(భావన అక్కడికి ఎలా వచ్చింది అనేది అమ్మతో అపరిచిత బందం చివరి ఎపిసోడ్స్ లో ఉంది )
గడిచిన రెండు రోజులుగా వైజాగ్ నగరాన్ని తన డేగకన్నుతో పర్యవేక్షిస్తోంది. అంతరిక్షంలో భ్రమిస్తున్న ఒక ఆర్మీ మిలిటరీ శాటిలైట్‌ను సైలెంట్‌గా హ్యాక్ చేసి,
నగరం నలుమూలలా జరుగుతున్న ప్రతి చిన్న అనుమానాస్పద కదలికను (Suspicious Activities) రికార్డ్ చేస్తూ, డేటాను మార్క్ చేసుకుంటూ వచ్చింది.
ఆధీర పంపిన గొరిల్లా మల్లయోధుల కదలికలు, రణధీర్ వేస్తున్న కుట్రలు, స్టేడియం వైపు వెళ్లే మార్గాలు...
ఇవన్నీ హ్యాక్ చేసిన ఆమె హై-టెక్ డివైజ్‌లో మ్యాప్ అయ్యాయి. చివరకు ఆమె కళ్లు ఆ కాలేజ్ ఫెస్ట్ వద్ద స్థిరపడ్డాయి. తన ప్రధాన టార్గెట్ కాలేజీయేనని భావన లాక్ చేసుకుంది!
తన కొడుకు విజయ్ ఈరోజు ఆ నగరంలో ఉన్నాడని, అతడికి తన రక్షణ కూడా అవసరమని భావన రగిలిపోతోంది.
ఆ చీకటి గదిలో, మల్టీ-స్క్రీన్ మానిటర్ల నుంచి వస్తున్న డిజిటల్ వెలుగు భావన కళ్లలో కసిగా ప్రతిబింబిస్తోంది. చేతిలోని ఎన్‌క్రిప్టెడ్ డివైస్‌ను బలంగా బిగిస్తూ...
ఆధీర ఫోటో వైపు చూసి నరనరాల్లో రౌద్రం ఉప్పొంగగా, గంభీరంగా గర్జించింది:
భావన: (కళ్లల్లో నిప్పులు చెరుగుతూ, కోపంతో వణుకుతున్న గొంతుతో)
"ఆధీరా... నా కొడుకు విజయ్ పైన నీ నీడ పడినా సరే... రేపు నా చేతిలో చావడం ఖాయం! ఆఖరికి ఆ దేవుడు దిగివచ్చినా నిన్ను నా నుంచి కాపాడలేడు!
ఇన్నాళ్లూ నా ప్రాణాలను, నా సంతోషాలను కోల్పోయాను... కానీ ఇప్పుడు వాడు నా కొడుకు! ఈసారి నా కుటుంబాన్ని, నా కొడుకుని పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను!"
భావన చూపుల్లో కొడుకు పట్ల ఉన్న అమితమైన మాతృప్రేమ, శత్రువును పీక్కుతినాలనే సింహం లాంటి కసి ఒకేసారి కనిపించాయి.
ఒకవైపు తన పిల్లలను కాపాడుకోవడానికి పూనమ్ దేవి వేసిన త్రీ-స్టెప్ కమాండో వ్యూహం...
మరొకవైపు నగరంలో విధ్వంసం సృష్టించి ముగ్గురిని ఎత్తుకెళ్లాలనే ఆధీర రక్తపాతం...
ఇంకోవైపు తన కొడుకు విజయ్ కోసం నిశ్శబ్దంగా మృత్యుదేవతలా అడుగుపెట్టిన భావన!
ఆధీర తీసుకువెళ్ళే మరో ఇద్దరు అమ్మాయిలు ఎవరు?
అనుష్క ఏం చేయబోతుంది అనేది మీకు రేపు వచ్చే ఎపిసోడ్ లో తెలుస్తుంది
వైజాగ్ నేల పైన 5:15 గంటల మహా సంగ్రామానికి తెరలేచింది!
రక్త కదన రంగం మొదలుకాబోతుందా??????????????????

ఇట్లు,
✿SUNNY ✿
1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)