24-07-2026, 12:51 PM
అప్పటికే అల్కా ని కాపాడటం కోసం డెత్ ఏంజెల్ మరియు బెస్ట్ బ్లాక్ స్క్వాడ్ కమాండో పూనమ్ దేవి తన విశ్వరూపాన్ని బయట పెట్టడానికి మళ్ళీ ఈ ప్రపంచం ముందుకు వచ్చింది. ఇక మిగిలింది యుద్దం ఏ .
ఒంటరిగా ఆధీర ని, సురేష్ చోప్రా ముఖ్యం గా తనని మోసం చేసిన రణధీర్ ని .. ...
సమయం: రాత్రి 01:00 గంటలు
ప్రదేశం: పూనమ్ ఇల్లు, వైజాగ్ (హాల్)
అప్పటికే సమయం చాలా లేట్ అవ్వడం, శారీరకంగా, మానసికంగా తీవ్రంగా అలసిపోవడం, మరియు చావు అంచుల వరకు వెళ్ళొచ్చిన ఆ భయం వల్లా...
సోను, అల్కా ఇద్దరూ పూనమ్‌ను రెండు వైపులా పట్టుకుని ఒక అందమైన ప్రశాంతమైన లోకంలోకి జారుకున్నారు.
అంతే కదా! ఈ సమస్త విశ్వంలో కన్నతల్లి ఒడి కంటే ప్రశాంతత, రక్షణ ఇచ్చే ప్రదేశం వేరే ఎక్కడైనా దొరుకుతుందా?
కానీ... అదే సమయంలో, రెండు వేర్వేరు నగరాల్లో, రెండు వేర్వేరు రక్తాన్ని కోరే దిశల్లో మరొక ప్రమాదకరమైన ప్లానింగ్ సిద్ధమవుతోంది!
పూనమ్‌కి మాత్రం నిద్ర రావడం లేదు. ఆ చీకటి గదిలో ఆమె మనసులో భయంకరమైన ప్రశ్నలు సుడిగుండంలా తిరుగుతున్నాయి.
![[Image: f9998515ce7ad1a05550925dd3c5a092.jpg]](https://i.pinimg.com/1200x/f9/99/85/f9998515ce7ad1a05550925dd3c5a092.jpg)
'అసలు రణధీర్ ఎవరు? ఆధీర కోసం వాడు ఎందుకు అంత క్రూరంగా పనిచేస్తున్నాడు? ఈ వైజాగ్‌లో వాళ్లు కిడ్నాప్ చేయబోయే ఆ రెండో అమ్మాయి ఎవరు? ఆధీర ఈ 25 ఏళ్లుగా ఇలాంటి దారుణాలనే చేస్తున్నాడా?
అసలు ఆ జాతర నరమేధం నుండి వాడు ఎలా బ్రతికి బయటపడ్డాడు? వాడిని ఎలా ఎదుర్కోవాలి?'
ఆమె కళ్లల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి.
'ఈరోజు నా పక్కన నా ప్రాణం లాంటి స్నేహితులు అనుష్క గానీ, భావన గానీ లేరు... నేను ఒంటరిగా ఈ రాక్షసుడిని ఎదుర్కోవడమంటే ప్రాణాలతో చెలగాటమే! ఐనా పర్లేదు...
ఈ పోరాటంలో వాడైనా మిగలాలి, లేదా నేనైనా చావాలి! కానీ... ఈ సురేష్ చోప్రా కథేంటి? 25 ఏళ్ల తర్వాత తన సొంత పిల్లలనే చంపాలని వాడు ఎందుకు అనుకుంటున్నాడు?
ఆధీర చేసిన ఈ అటాక్ గురించి సురేష్ చోప్రాకి ఈపాటికే తెలిసి ఉంటుంది... వాడు కూడా ఊరికే ఉండడు, ఏదో ఒకటి చేస్తాడు!'
ఆలోచిస్తుంటే పూనమ్ గుండె పిండేసినట్లయింది.
'అల్కా, వర్ష... వీళ్లిద్దరి ప్రాణాలు ఏ సెకనులోనైనా పోవచ్చు! ఆధీరకి, సురేష్ చోప్రాకి వీళ్ల రక్తం కావాలి. ఒకవేళ నాతోటి పోరాటంలో నాకు ఏమైనా అయితే... వీళ్లను కాపాడటానికి ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు!'
కళ్లల్లోంచి కన్నీటి చుక్క కిందపడే క్షణంలో... పక్కనే పడుకున్న సోను చేయి మెల్లగా వచ్చి పూనమ్ గుండెలపై పడింది.
పూనమ్ పక్కకు తిరిగి, నిద్రలో అమాయకంగా ఉన్న కన్నకొడుకు ముఖం వైపు చూసింది. ఆమె పెదవులపై ఒక చిన్న, దిగులుతో కూడిన చిరునవ్వు వికసించింది. (మనసులో)
"నన్ను క్షమించు నాన్న... నాకు వేరే దారి లేదు! ఇకపై నీ అక్కలను కాపాడటం నీ బాధ్యత కూడా. అలా కాపాడుతూ నువ్వు నీ ప్రాణాలు విడిచినా సరే... నేను చాలా సంతోషిస్తాను.
రేపటి నుండి నీకు ఒక మహాయుద్ధం ఎలా చేయాలో, చావుని ఎలా ఎదురించాలో నేర్పుతాను!"
అప్పుడే సడన్‌గా ఆమెకు వర్ష గుర్తుకొచ్చింది! పూనమ్ ఒక్క ఉదుటున మంచం పైనుండి పైకి లేచింది.
ఆ కదలికకు అల్కా, సోను ఇద్దరూ ఉలిక్కిపడి లేచారు.
అల్కా & సోను: (కంగారుగా) "అమ్మాఅఅఅ!"
పూనమ్: "ఇష్ష్... ఏం లేదు బుజ్జి తల్లి, ఒక్క నిమిషం..."
![[Image: 288424809a69904690115555f681a33e.jpg]](https://i.pinimg.com/1200x/28/84/24/288424809a69904690115555f681a33e.jpg)
పూనమ్ అల్కా తల నిమురుతూ, పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని వెంటనే ముంబైలో ఉన్న వర్షకు డయల్ చేసింది.
సమయం: రాత్రి 01:15 నిమిషాలు
ప్రదేశం: వర్ష ఇల్లు, ముంబై
గాఢ నిద్రలో ఉన్న వర్ష ఫోన్ రింగ్ అవ్వగానే ఉలిక్కిపడి లేచి, స్క్రీన్ చూడకుండానే ఫోన్ ఎత్తింది.
వర్ష: (నిద్రమత్తుతో) "హలో..."
పూనమ్: "అమ్మా..."
ఆ మాట వినగానే వర్ష మంచం మీద నిటారుగా కూర్చుండిపోయింది. కంగారుగా గోడ గడియారం వైపు చూసి, భయంతో గడగడా మాట్లాడటం మొదలుపెట్టింది.
![[Image: ef7e1421746f7a6a727f094078165c80.jpg]](https://i.pinimg.com/736x/ef/7e/14/ef7e1421746f7a6a727f094078165c80.jpg)
వర్ష: (కంగారుగా, గుక్క తిప్పుకోకుండా) "అమ్మా! ఏమైంది అమ్మా? ఇంత లేట్ నైట్ ఫోన్ చేశావు? అంతా బానే ఉంది కదా? మీరు... మీరు, సోను, అల్కా అందరూ బాగున్నారా అమ్మా?!"
పూనమ్: (శాంతంగా, నెమ్మదిగా) "మేము బాగున్నాం అమ్మా... వర్షా, నేను చెప్పేది జాగ్రత్తగా విను! నీ కార్, నీ ఫ్లాట్ కీస్ అన్నింటినీ ఉన్నవి ఉన్నట్లుగా అక్కడే వదిలేయ్.
వెంటనే ఒక క్యాబ్ బుక్ చేసుకుని బయటకు రా. బయటికి వచ్చాక నీ పర్సనల్ ఫోన్‌ను దారిలో ఎక్కడైనా విసిరేయ్!"
వర్ష: (దిగ్భ్రాంతితో) "అమ్మా... ఏంటిది? అసలు ఏం జరుగుతోంది?"
పూనమ్: "నన్ను మాట్లాడనివ్వు వర్షా! నువ్వు నేరుగా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళు. బోర్డింగ్ పాస్ దగ్గర ఏజెంట్ విచారణలో కేవలం 'AGENT 1' అని మాత్రమే చెప్పు.
వాళ్లు నీకు ఒక సెక్యూర్డ్ ఫోన్, టికెట్స్ ఇస్తారు. చుట్టూ గమనిస్తూ జాగ్రత్తగా ఫోన్ తీసుకున్న తర్వాత నాకు కాల్ చెయ్!"
అప్పటికే లేచి ఇదంతా వింటున్న అల్కా... పూనమ్ చేతిలోని ఫోన్ వైపు చేయి చాచింది.
అల్కా: "అమ్మా... నాకు ఇవ్వు." ఫోన్ అందుకుని, వణుకుతున్న గొంతుతో మాట్లాడింది.
![[Image: c87e587ba637838930ae89f4bb3d6380.jpg]](https://i.pinimg.com/736x/c8/7e/58/c87e587ba637838930ae89f4bb3d6380.jpg)
అల్కా: "అక్కా! ఈరోజు నా పైన ఎవరో భయంకరంగా దాడి చేశారు అక్కా... కానీ నాకు చిన్న గీత కూడా పడలేదు!"
వర్ష: (అవతలి నుండి అరుస్తూ) "ఎవరు?! ఎవరు చేశారు?! నేను అనుకున్నదే అయింది అల్కా... ఆ రాక్షసులు మనల్ని బ్రతకనివ్వరు! మీరు కూడా ముంబై బయలుదేరండి, మనమందరం ఎక్కడికైనా దూరంగా పారిపోదాం!"
అల్కా: (గట్టిగా) "నేను ఎక్కడికీ రాను అక్కా! నేను ఇక్కడే ఉంటాను... నువ్వే ఇక్కడికి రా! ‘అమ్మ ఉంది' అని నాకు ఎప్పుడూ చెప్తావు కదా...
ఇప్పుడు నేను నీకోకటి చెప్తా విను. మన అమ్మ పక్కన ఉంటే కనీసం ఎవరి నీడ కూడా మన పైన పడదు! నువ్వు ఇక్కడికి వచ్చేయ్ ప్లీజ్..."
వర్షకు ఏం అర్థం కాలేదు, కానీ అల్కా మాటల్లో ఉన్న నమ్మకం ఆమెను కదిలించింది.
![[Image: 644d7e84e62c7487460912f35f3237af.jpg]](https://i.pinimg.com/736x/64/4d/7e/644d7e84e62c7487460912f35f3237af.jpg)
వర్ష: "సరే తల్లి... నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను." కాల్ కట్ అయింది.
అల్కా ఫోన్‌ను పూనమ్‌కు ఇస్తూ, ఎంతో ఆరాధనగా, అనుమానంగా పూనమ్ కళ్లల్లోకి చూసింది.
అల్కా: "అమ్మా... నువ్వు అసలు ఎవరివి అమ్మా?"
పూనమ్: (చిరునవ్వుతో) "నిన్ను నా కడుపున మోయకున్న మీ అమ్మని తల్లి... ఇప్పుడేం అడగకు. సమయం వచ్చినప్పుడు నీకే అన్నీ తెలుస్తాయి. సరేనా? ఫోన్ ఇవ్వు... అక్కకి సీక్రెట్ టికెట్స్ బుక్ చేయాలి."
పూనమ్ ఫోన్ తీసి సీనియర్ RAW ఆఫీసర్‌కి పర్సనల్ ఎన్‌క్రిప్టెడ్ లైన్ కలిపింది.
పూనమ్: "బ్లాక్ స్క్వాడ్ ఏజెంట్ 1 మాట్లాడుతున్న ! నాకు నెక్స్ట్ విమానంలో ముంబై నుండి వైజాగ్‌కి ఒక ఎమర్జెన్సీ టికెట్ కావాలి.
నేను ఒక లొకేషన్ పంపుతున్నాను... అండర్ కవర్‌లో ఉన్న మీ 4 కమాండోల టీమ్ ఆమె ఆ ఇంటి నుండి విమానం ఎక్కే వరకు వెనుకాలే షాడోలా ఉండాలి.
ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు టికెట్, ఒక క్లీన్ ఫోన్ హ్యాండోవర్ చేయాలి. సీక్రెట్ కోడ్: AGENT 1!"
![[Image: 7e22c3143ad4d89af6e96384b427eecb.jpg]](https://i.pinimg.com/1200x/7e/22/c3/7e22c3143ad4d89af6e96384b427eecb.jpg)
RAW : "అలాగే మేడమ్ . 10 నిమిషాల్లో ప్లాన్ ఎగ్జిక్యూట్ అవుతుంది."
ఫోన్ కట్ అయింది.
పక్కనే కూర్చొని ఉన్న సోను, అల్కాలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. తమ ఎదురుగా ఉన్నది కేవలం వంట చేసి పెట్టే సగటు తల్లి కాదు...
నేషన్‌ను షేక్ చేయగల అత్యున్నత స్థాయి మాస్టర్ మైండ్ కమాండో అని! సోను ఏదో అడగబోతుంటే... పూనమ్ వారి వైపు చూసి ఆపింది.
పూనమ్: "మీ ఇద్దరి బుర్రల్లో ఏం తిరుగుతుందో నాకు తెలుసు. నేను గతంలో ఈ దేశం కోసం, ప్రజల రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశాను.
కానీ ఇప్పుడు నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం మళ్లీ ఆ రూపం ఎత్తాల్సి వస్తోంది. నేను ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా... మీకు ఎప్పటికీ మీ అమ్మనే!
నన్ను చూసి అలా భయపడకండి, ఆ భయాన్ని నేను తట్టుకోలేను. నాకు ముందునుండి మీరు ఇచ్చే ఆ ప్రేమని ఇవ్వండి చాలు... మిగతా రాక్షసుల సంగతి నేను చూసుకుంటాను!"
ఆ మాట వినగానే సోను, అల్కాలా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇద్దరూ ఒక్కసారిగా పూనమ్‌ను బలంగా హత్తుకున్నారు.
![[Image: acde456d4dff1152370311ff1888300f.jpg]](https://i.pinimg.com/1200x/ac/de/45/acde456d4dff1152370311ff1888300f.jpg)
పూనమ్: "సరే సరే... ఆల్రెడీ చాలా లేట్ అయింది. ఉదయమే అక్క వచ్చేస్తుంది. పడుకుందాం పదండి."
ముగ్గురూ ఆ కౌగిలిలోనే ప్రశాంతంగా నిద్రపోయారు.
సమయం: రాత్రి 02:00 గంటలు
ప్రదేశం: ముంబై , ఆధీర సీక్రెట్ లొకేషన్
రహస్య స్థావరంలో ఉన్న 'ఆధీర' ఫోన్ మోగింది. విజయవాడ నుండి పారిపోయిన అతని తమ్ముడు రణధీర్ (రావు) శాటిలైట్ ఫోన్ నుండి కాల్ చేస్తున్నాడు.
ఆధీర: (గంభీరంగా) "చెప్పు రణధీర్... ఏమైంది?"
రణధీర్: (భయంతో, వణుకుతున్న గొంతుతో) "అన్నయ్యా... ఆ సురేష్ చోప్రా స్పెషల్‌గా డిజైన్ చేసిన ఎవరో ఒక అనామక 'బ్లాక్ కమాండో' టీమ్ మన వాళ్లందరినీ దారుణంగా చంపేసి... ఆ అల్కాని కాపాడి తీసుకెళ్లిపోయింది!"
ఆధీర: (రౌద్రంతో వైన్ గ్లాస్ పగలగొడుతూ) "ఒక్క చిన్న పిల్లను పట్టుకురావడం చేతకాలేదా రా?! ఛా. మనకి టైమ్ లేదు! ఎవరు ఆ కమాండో?
![[Image: a08f1272e91cb6786c500a4435618ca0.jpg]](https://i.pinimg.com/736x/a0/8f/12/a08f1272e91cb6786c500a4435618ca0.jpg)
సురేష్ చోప్రా తన కూతురి కోసం ఏమైనా చేస్తాడని నేను ముందే చెప్పాను కదా! మన ఆనవాళ్లు ఏమైనా దొరికాయా?"
రణధీర్: "లేదు అన్నయ్యా... ఎలాంటి ఆధారం లేదు. కమాండోలు మొత్తం క్లీన్ చేశారు."
ఆధీర: "మంచిది! సరే... వైజాగ్‌లో ఉన్న ఇంకో అమ్మాయి సంగతేంటి?"
రణధీర్: "ఆమె డీటెయిల్స్ వచ్చాయి అన్నయ్యా. ఎల్లుండి ఒక పెద్ద కాలేజ్ ఫంక్షన్ నుండి తిరిగి వస్తున్న సమయంలో... ఆమెను ఎత్తుకెళ్లడానికి లోకల్ గ్యాంగ్‌తో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి!"
ఆధీర: "సరే! ఆ పని పూర్తి చెయ్... నేను కూడా నేరుగా వైజాగ్ వస్తున్నాను!"
రణధీర్: "అన్నయ్యా! మరి ముంబైలో ఉన్న అమ్మాయి సంగతి?"
ఆధీర: "నేను వైజాగ్ వచ్చాక చెప్తాను!" అని ఫోన్ పెట్టేశాడు.
సమయం: రాత్రి 11:30 గంటలు
ప్రదేశం: ముంబై - సురేష్ చోప్రా ప్యాలెస్
ఒక భారీ భవంతులో తన విలాసవంతమైన గదిలో కూర్చుని ఉన్నాడు ముంబై డాన్ సురేష్ చోప్రా.
కొద్దిసేపటి క్రితమే అతనికి అల్కా పైన దాడి జరిగిన విషయం ఇన్ఫర్మేషన్ రూపంలో అందింది.
అంతేకాకుండా, ఒక అపరిచిత నెంబర్ నుండి అతనికి ఫోన్ కాల్ వచ్చింది... " నిన్ను చంపేస్తాను!" అని బెదిరించారు!
సురేష్ చోప్రా మనసులో ఒక భయంకరమైన అనుమానం రేగింది. (ఆలోచిస్తూ)
"అసలు ఆ దాడి నుండి నా కూతురిని కాపాడింది ఎవరు? నిజంగానే నా పాత శత్రువు డెత్ ఏంజెల్ అనుష్క ఇంకా బ్రతికే ఉందా? ఆమె బ్రతికి ఉంటేనే ఇది సాధ్యం!"
వెంటనే సురేష్ చోప్రా తన భార్యకు ఫోన్ చేసి కొన్ని రహస్య విషయాలు మాట్లాడి కట్ చేశాడు. ఆ తర్వాత తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు.
"అసలు ఇదంతా ఎక్కడ ప్రారంభమైంది? థియేటర్ అవును 'అలేఖ్య' అనే అమ్మాయి దగ్గరే కదా! నిజంగా అనుష్క బ్రతికి ఉంటే...
![[Image: 7cd58042dc92535a9fbbb3b239a89efa.jpg]](https://i.pinimg.com/736x/7c/d5/80/7cd58042dc92535a9fbbb3b239a89efa.jpg)
ఆ అలేఖ్య కోసం ఖచ్చితంగా బయటకు వస్తుంది! రేపే ఆ అలేఖ్యను చంపేస్తాను... నువ్వు ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను అనుష్కా!"
వెంటనే తన ప్రధాన అనుచరుడిని పిలిచాడు.
సురేష్ చోప్రా: (క్రూరమైన చూపులతో) "రేయ్... ముంబై కమిషనర్ కూతురు ఆ అలేఖ్య అనే అమ్మాయి ఫుల్ డీటెయిల్స్, లొకేషన్ ఇప్పుడే కనుక్కోండి. రేపు పొద్దుటికి ఆమె శవమై పడి ఉండాలి!"
ఒకవైపు ఆధీర వైజాగ్ వస్తున్నాడు... మరోవైపు సురేష్ చోప్రా అలేఖ్యను చంపడానికి డెత్ వారెంట్ జారీ చేశాడు...
![[Image: a982970055027e7a1834fa8e7d58c610.jpg]](https://i.pinimg.com/1200x/a9/82/97/a982970055027e7a1834fa8e7d58c610.jpg)
ఇంకోవైపు పూనమ్ దేవి తన కొడుకును కమాండోగా మార్చే సమరానికి సిద్ధమవుతోంది!

ఇట్లు,
✿SUNNY ✿
1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)