Thread Rating:
  • 29 Vote(s) - 3.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ❤️ అందని జాబిలి..❤️ కోసం (రక్త కధనరంగం - 1)
కృష్ణమ్మ ఉప్పెన – నెత్తుటి పుష్కర ఘాట్
 

తేదీ: జూలై 1, 2026
 
ప్రదేశం: విజయవాడ (రెండు వేర్వేరు ప్రాంతాలు)

సమయం: ఉదయం 09:30 గంటలు
 

ప్రదేశం: విజయవాడ ఎయిర్పోర్టు  పరిసరాలు

 
సురేష్ చోప్రా పగతో రగిలిపోతూ విజయవాడలో ల్యాండ్ అయ్యాడు. అతని ముఖంలో క్రూరత్వం తాండవిస్తోంది. వెంటనే తన గ్యాంగ్ లీడర్ల కి కాల్ చేశాడు రెండు టీమ్‌లుగా విడిపోవాలని ఆదేశించాడు.
 

సురేష్ చోప్రా: (తీవ్రమైన గొంతుతో) "టీమ్ 1... ఇప్పుడే ఆ జాతరలోకి వెళ్లండి. ఆ సోను, వాడి తండ్రి రావు ఇద్దరినీ అక్కడే లేపేయాలి.
 

టీమ్ 2... నేరుగా వాళ్ల ఇంటికి వెళ్లండి. ఇంట్లో ఉన్నవాళ్లలో ఒక్క రూం కూడా వదలకుండా అందరినీ నరికేయండి, ఒక్కడు కూడా బ్రతకకూడదు!
 

నా కూతుళ్ల (వర్ష, అల్కా) దగ్గరికి ఏ మగాడు వచ్చినా... వాడికి అదే చివరి ఊపిరి అవ్వాలి. క్లియర్?!"
 

గ్యాంగ్ లీడర్స్: "ఎస్ బాస్!"
 

ఆదేశాలు ఇచ్చి, సురేష్ చోప్రా కూడా జాతర రద్దీలోకి దుర్గమ్మ దర్శనం కోసం బయలుదేరాడు.
 

సమయం: ఉదయం 10:00 గంటలు
ప్రదేశం: ఇంద్రకీలాద్రి పరిసరాలు (ది షాకింగ్ కాల్)
 

సురేష్ చోప్రా గుడి వైపు నడుస్తుండగా అతని వైజాగ్ మెయిన్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది.
 
ఆఫీసర్ (ఫోన్ లో): "సార్! ఒక అర్జెంట్ ఇన్ఫర్మేషన్. వర్ష మేడమ్ నిన్న నైట్ విజయవాడకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నట్లు సిస్టమ్‌లో చూపిస్తోంది. నా గెస్ ప్రకారం మేడమ్ కూడా ఇప్పుడు విజయవాడలోనే ఉన్నారు సార్!"
 
ఆ మాట వినగానే సురేష్ చోప్రాకు ఒక్కసారిగా ఒంటి నిండా చెమటలు పట్టాయి! ఎందుకంటే, పూనమ్ ఫ్యామిలీతో ఎవరున్నా సరే ఒక్కడిని కూడా వదలకుండా చంపేయమని బిహార్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ హై-ప్రొఫైల్ కిల్లర్స్‌కు కాంట్రాక్ట్ ఇచ్చాడు.
 
ఆ కిల్లర్స్‌కి తన పేరు తెలియదు, కేవలం టార్గెట్ మాత్రమే తెలుసు! ఇప్పుడు ఒకవేళ వర్ష వాళ్ల పక్కన ఉంటే... వాళ్లు తన సొంత కూతురిని కూడా చంపేస్తారు!
 
ఏం చేయాలో అర్థం కాక వణుకుతున్న చేతులతో బిహార్ కిల్లర్స్ నెంబర్‌కు డయల్ చేశాడు.
 
సురేష్ చోప్రా: (ఫోన్‌లో గాభరాగా అరుస్తూ) " మిషన్ క్యాన్సిల్! ఇప్పుడే మిషన్ క్యాన్సిల్ చేయండి! అక్కడ ఎవరికీ ఏమీ కాకూడదు... డూ ఇట్ నౌ!"
 
బిహార్ కిల్లర్ లీడర్: "సార్... మేం ఆల్రెడీ ఘాట్ లో ఉన్నాం. టార్గెట్ మా కళ్ల ముందే ఉన్నాడు."
 
సురేష్ చోప్రా: "వద్దని చెప్తున్నా కదా! వెనక్కి వచ్చేయండి!"
 
సురేష్ చోప్రా మాటలకు ఆ బిహార్ కిల్లర్స్ వెనక్కి తగ్గి, నీళ్లలోంచి ఒడ్డుకు రావడం ప్రారంభించారు.
 
కానీ... సురేష్ చోప్రాకు కానీ, చావు అంచులకి చేరుకుంటున్న సోను ఫ్యామిలీకి కానీ తెలియని భయంకరమైన నిజం ఒకటి ఉంది.
 
ఆ ఫ్యామిలీని ఈరోజు పూర్తిగా తుడిచిపెట్టడానికి ఆల్రెడీ మరో ప్లాన్ సిద్ధమైంది. దాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. ఎందుకంటే, ఆ ప్లాన్ వేసింది సురేష్ చోప్రా కాదు... 'ఆధీర'!
 
ది అల్టిమేట్ మాస్టర్ మైండ్ - 'ఆధీర' 20 ఏళ్ల ప్లాన్
 
అవును, ఈ ఘోరమంతటికీ అసలు సూత్రధారి ఆధీర! వాడు ఈ స్కెచ్‌ను ఈరోజు కాదు... 20 ఏళ్ల క్రితమే వేశాడు! ఎవ్వరికీ తెలియని అత్యంత భయంకరమైన రహస్యం ఏంటంటే...
 
పూనమ్ భర్త రావు మరెవరో కాదు, ఆ ఆధిర సొంత తమ్ముడు!
 
రావుతో పాటు గుడిలోని పూజారులతో సహా దాదాపు ఒక లక్ష మంది ఆధీర నమ్మిన బంట్లుగా సమాజంలో సాదాసీదా మనుషుల్లా నటిస్తున్నారు.
 
వీళ్లంతా గత 25 ఏళ్లుగా వెతుకుతున్నది ఆ ముగ్గురు కన్యల కోసం ( అల్కా, మిగిలిన ఇద్దరు త్వరలో తెలుస్తుంది ) కోసం! వాళ్ల నిరీక్షణ ఫలించింది, ఆ ముగ్గురూ దొరికారు.
 
ఇప్పుడు ఆ ముగ్గురినీ ఎలాగైనా ప్రాణాలతో పట్టుకుని ఆధీర ముందు నిలబెట్టడమే వీళ్ల 20 ఏళ్ల మిషన్!
 
(గుడి పూజారులు ఇందులో ఎందుకు ఉన్నారనే మిస్టరీ తర్వాత తెలుస్తుంది).
 
ఈ పని కోసమే రావు ఎవరికీ తెలియకుండా ఎప్పుడూ బయట తిరుగుతుండేవాడు. అయితే, ఈ కన్యలు దొరికిన తర్వాత ఈ మిషన్‌లో ఉన్నవాళ్లు చేయాల్సిన మొదటి పని...
 
తమ సొంత ఆనవాళ్లను (తమతో ఉన్న కుటుంబాలను) పూర్తిగా తుడిచిపెట్టేయడం! మిగతా వాళ్లకు ఆ పని ఈజీగానే అయిపోయింది కానీ, రావుకు తన ఫ్యామిలీని చంపడం కష్టంగా మారింది.
 
ఎందుకంటే సిటీ కమిషనర్ పూజ, సోను ఫ్యామిలీకి సొంత మనుషుల్లా క్లోజ్ అయిపోయారు. సెక్యూరిటీ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయితే ఆధారాలు దొరుకుతాయని రావు కావాలనే ఈ జాతర రోజును ఎంచుకున్నాడు.
 
తన ప్లాన్ ప్రకారం... తానూ, కొడుకు సోను జాతరలో ఉన్నప్పుడు కేవలం ఒక 5, 6 గురు రౌడీలు తమపై దాడి చేసేలా ప్లాన్ చేశాడు.
 
అలాగే, తన భార్య పూనమ్ ప్రవర్తనపై కొంచెం అనుమానం రావడంతో... ఒకేసారి ఒక 40 మంది ప్రొఫెషనల్ కిల్లర్స్‌ను నేరుగా పూనమ్ ఇంటిపై దాడి చేయడానికి పంపించాడు!
 
ఇప్పుడు జాతరలో ఆ దారుణం ఎలా జరిగిందో చూద్దాం...
 
సమయం: ఉదయం 10:30 గంటలు
ప్రదేశం: కృష్ణా నది పుష్కర ఘాట్
 
సురేష్ చోప్రా మాటలు విని బిహార్ కిల్లర్స్ వెనక్కి తగ్గినా... ఆధీర, రావులు పంపిన కరడుగట్టిన ట్రైన్డ్ కిల్లర్స్ ఆల్రెడీ సోను, రావులను నది నీళ్లలో చుట్టుముట్టేసారు. 

మిగిలిన 40 మంది కిల్లర్స్ పూనమ్ ఇంటి వైపు వాహనాల్లో బయలుదేరారు.
 
మరోవైపు... సోనుకి సర్ప్రైజ్ ఇవ్వాలని వచ్చిన వర్ష, అప్పుడే కృష్ణా నది ఘాట్ మెట్లు దిగుతూ, తన పాత మొక్కు తీర్చుకోవడానికి నది వైపు నడుస్తోంది. 

నదిలో మునుగుతున్న జనాలను చూస్తున్న ఆమె కళ్లు... ఒక్కసారిగా ఒక అబ్బాయి పైన పడ్డాయి.
 
వర్ష: (మనసులో, కళ్లు పెద్దవి చేస్తూ) "ఆ పోస్టర్... ఆ హెయిర్ స్టైల్... సోనులా ఉన్నాడేంటి? అవును... వాడే! సోను!"
 
వాడు సోను అని కన్ఫర్మ్ చేసుకునే లోపే... వర్ష గుండె ఆగిపోయే దృశ్యం అక్కడ కనిపించింది. ఆమె నోట్లోంచి భయంకరమైన చావు కేక వచ్చింది!
 
వర్ష: "వద్దుఊూూూూ!!!!!!"
 
ఎందుకంటే... సోను నీళ్లలో మొదటి మునక వేసి పైకి లేవబోతుండగా, అతని చుట్టూ ఉన్న ముగ్గురు కిల్లర్స్ తమ చేతుల్లోని కత్తులను నీళ్లలోంచి పైకి తీసి సోనుని నరకడానికి వేగంగా గాల్లోకి లేపారు!
 
మరో ఇద్దరు రౌడీలు రావు (సోను తండ్రి) ని పట్టుకుని, అతని గొంతు కోసి నదిలో పారేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నటిస్తూ పట్టుకున్నారు.
 
[ది ఎంట్రీ ఆఫ్ ప్రసాద్]
 
సరిగ్గా ఆ కత్తులు సోను మెడకు తగిలే ఆఖరి సెకన్... ఎక్కడినుండో ఒక బలమైన చేయి నీటి లోపలికి దూసుకొచ్చి, సోనుని వెనక్కి గట్టిగా లాగింది!
 
ఆ మూడు కత్తులు నీటిని చీల్చుకుంటూ వెళ్లాయి కానీ, అక్కడ సోను లేడు! సోనుకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ చేయి సోనుని గట్టిగా పట్టుకుని ఒడ్డు వైపు విసిరేసింది.
 
ఆ కాపాడిన వ్యక్తి మరెవరో కాదు... అనుష్క భర్త  ప్రసాద్!
 
((అవును, ప్రసాద్ తన ఓనర్‌తో కలిసి 3 రోజులు బయటికి వెళ్తున్నాడు అని చెప్పాడు .. మీరు 'కన్నతల్లి కన్నీటి సాక్షి'లో చెప్పిన సీన్ గుర్తుండే ఉంటుంది... ఆయన వచ్చింది ఇక్కడికే!))
 
***ప్రసాద్ , రావు ఆ కిల్లర్స్‌కు ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం చాలా సేపటి నుండి గమనిస్తూనే ఉన్నాడు. 

ఎందుకంటే కొన్ని రోజుల ముందు ఏ అనుష్క వెనుక మనుషులు వస్తున్నారు అని చెప్పింది 

తనని కూడా ఎవరో ఒకరు అనుసరిస్తూ ఉండవచ్చు అని ప్రసాద్ అన్నిటిపై ఒక కన్ను వేసి ఉంచాడు. ***
 
కిల్లర్స్ సోను మిస్ అవ్వడం చూసి క్షణాల్లో ఒడ్డు వైపు దూసుకొచ్చారు. కానీ వాళ్లు వచ్చేలోపే... 

ప్లాన్ ప్రకారం, అందరూ చూస్తుండగానే కిల్లర్స్ రావు మెడ కోసి నది నీళ్లలోకి పడేశారు!
 
(అందరి కళ్లముందూ తను చనిపోయినట్లు నటించాలనేది రావు ప్లాన్. అలా నీళ్లలో పడగానే ఆ ఫేక్ బ్లడ్‌ని కడుక్కొని, నీటి అడుగున ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లిపోవాలనేది వాడి అసలు వ్యూహం).
 
సోను: (నది ఒడ్డున పడి, తండ్రి మెడ కోయడం చూసి పిచ్చివాడైపోయి గట్టిగా అరుస్తూ)"నాన్నాఆఆఆఆఆ!!!"
 
సమయం: ఉదయం 10:33 నిమిషాలు
ప్రదేశం: నెత్తుటి ఘాట్
 
వేగంగా దూసుకొస్తున్న కిల్లర్లను ప్రసాద్ ఎదిరించే లోపే... ఒక కిల్లర్ కత్తి ఎత్తి సోను తల మీద బలంగా నరకబోయాడు. సోను ప్రాణం గాల్లో కలిసిపోయే ఆ సెకన్...
 
"ఛాక్!!!!"
 
ఒక ఆమె చేయి... ఆ పదునైన కత్తి గాటుకి అడ్డంగా వచ్చింది! ఆ కత్తి ఆమె అరచేతిని చీల్చుకుంటూ దిగింది.
 
అది మరెవరో కాదు... వర్ష! తన తమ్ముడిని కాపాడుకోవాలనే ఆలోచన తప్ప ఆమెకు ఏమీ గుర్తు రాలేదు. తన ప్రాణం పోయినా పర్లేదు అనుకుని కత్తికి చెయ్యి అడ్డం పెట్టింది!
 
ఆ దృశ్యం చూడగానే ప్రసాద్ లోపల రక్తం ఉప్పొంగింది. సింహంలా ఆ కిల్లర్స్ మీదికి విరుచుకుపడ్డాడు. ఘాట్‌లో ఉన్న జనాలంతా భయంతో కేకలు వేస్తూ అటు ఇటు పరుగులు తీస్తున్నారు.
 
సోను తల పైనుండి రక్తం కారుతోంది... కానీ ఆ రక్తం సోనుది కాదు, తనని హత్తుకుని ఉన్న తన అక్క వర్ష చేతి నుండి కారుతున్న రక్తం!
 
సోను తండ్రి మరణం నుండి కోలుకోక ముందే... కళ్లు తెరిచి చూశాడు. తన కోసం రక్తం చిందిస్తున్న ఆమె తన అక్క వర్ష అని అతను ఊహించలేదు.
 
సోను: (ఏడుస్తూ, గట్టిగా అరుస్తూ) "అక్కాకాాాా!!!!!!"
 
వర్ష: (బాధను తట్టుకుంటూ, సోను తలని తన గుండెలకి గట్టిగా హత్తుకుని నేలపై కూర్చుండిపోయింది) "ఏం కాదురా... ఏం కాదు తమ్ముడూ... నేను ఉన్నాను..."
 
ప్రసాద్ కింద పడిన ఒక కత్తిని అందుకుని, కిల్లర్లను నరకడం మొదలుపెట్టాడు. ఆ వేగంలో వెనుక నుండి వచ్చిన ఒక కత్తి ప్రసాద్ వీపులో దిగింది!
 
 "అఆఆహ్!" అని గర్జించిన ప్రసాద్, ఆ నొప్పును అస్సలు లెక్కచేయలేదు. కింద కూర్చుని ఉన్న ఆ అక్కాతమ్ముళ్ల వైపు చూశాడు. వాళ్లపైకి ఎవరినీ రానివ్వకుండా కత్తిని గాల్లో సుడిగాలిలా తిప్పసాగాడు.
 
ఘాట్ మొత్తం ఖాళీ అయిపోయింది. అక్కడ కేవలం ప్రాణాల కోసం ఏడుస్తున్న ఆ ఇద్దరు ప్రాణబంధాలైన అక్కాతమ్ముళ్లు... 

వాళ్లను కాపాడటానికి వీపులో కత్తి దిగినా పోరాడుతున్న ప్రసాద్ మాత్రమే మిగిలారు.
 
ప్రసాద్ ఆ ఇద్దరినీ చూస్తుంటే... తన సొంత పిల్లలు (అనుష్క పిల్లలు) గుర్తొచ్చారు. 

వీళ్లు తన సొంత పిల్లలే అనిపించింది ఆ క్షణంలో! (తమ పిల్లలు కూడా ఇంతే ప్రేమగా ఉంటారు అనుకున్నాడు)
 
ఆ బలంతోనే ఎదురొచ్చిన మరో ఇద్దరు కిల్లర్స్ తలలను "టక్... టక్..." మంటూ నరికి అవతల పారేశాడు. రక్తం ఏరులై పారుతూ వెళ్లి కృష్ణా నది నీళ్లలో కలుస్తోంది.
 
అయినా గాయాలతో ఉన్న ప్రసాద్ ఒంటరిగా... ముందర ఉన్న మరో ముగ్గురు ట్రైన్డ్ కిల్లర్స్ ముందు సింహంలా నిలబడ్డాడు.
 
సమయం: ఉదయం 10:35 నిమిషాలు
ప్రదేశం: కమిషనర్ పూజ ఎంట్రీ
 
సరిగ్గా అదే సమయానికి సమాచారం అందుకున్న సెక్యూరిటీ ఆఫీసర్లు తుఫానులా ఘాట్ లోకి దూసుకొచ్చారు.
 
అందరికంటే ముందు ఉన్న సిటీ కమిషనర్ పూజ... అక్కడ నెత్తుటి మడుగులో ఉన్న సోనుని చూసింది. 

తన బిడ్డలాంటి సోను తల నిండా రక్తం చూసేసరికి ఆమె గుండె పగిలినంత పనైంది. ఆమె సహనం పూర్తిగా కోల్పోయింది!
 
పూజ: (కళ్లల్లోంచి నీళ్లు కారుతుండగా, కోపంతో ఊగిపోతూ తన సర్వీస్ రివాల్వర్ తీసింది) 

"నా బిడ్డ జోలికే వస్తారా... చావండ్రా నా కొడుకుల్లారా!!!"
 
"ఢిష్యూం! ఢిష్యూం! ఢiష్యూం!"
 
పూజ తూటాలు ఆ మిగిలిన ముగ్గురు ట్రైన్డ్ కిల్లర్స్ గుండెలను చీల్చుకుంటూ వెళ్లాయి. వాళ్లు అక్కడికక్కడే శవాలై పడిపోయారు.
 
అంతా అయిపోయింది... ఒంటి నిండా గాయాలతో, విపరీతంగా రక్తం పోయిన ప్రసాద్... 

చేతిలోని కత్తిని అలాగే పట్టుకుని, సోను మరియు వర్షల ముందే నిస్సహాయంగా కింద పడిపోయాడు.
 
కృష్ణా నది ఘాట్ మొత్తం శవాలు, రక్తంతో ఒక భయంకరమైన యుద్ధభూమిలా మారిపోయింది!
 
ది డెత్ ఏంజెల్ - రక్తతర్పణం – కాళికాదేవి ప్రళయతాండవం
 
సమయం: ఉదయం 10:35 నిమిషాలు
ప్రదేశం: కృష్ణా నది పుష్కర ఘాట్ (మారణకాండ తదనంతర క్షణాలు)
 
కృష్ణా నది ఘాట్ మొత్తం శవాల దిబ్బగా మారింది. నరకయాతనతో మూలుగుతూ కింద పడిపోయిన ప్రసాద్ (అనుష్క భర్త) చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
 
అతని వీపులో కత్తి అలాగే దిగి ఉంది. అది చూసిన వర్ష గుండె పగిలిపోయినంత పనైంది. ఆమె తన చేతి గాయాన్ని కూడా లెక్కచేయకుండా, కన్నీళ్లు కారుస్తూ ప్రసాద్ దగ్గరకు పరుగెత్తింది.
 
వర్ష : (కళ్లల్లోంచి నీళ్లు వస్తుండగా, రెండు చేతులూ జోడించి ప్రసాద్‌కి దండం పెడుతూ)

"లేవండి అంకుల్! ప్లీజ్ లేవండి. మిమ్మల్ని ఇలాంటి స్థితిలో నేను చూడలేకపోతున్నాను. నా ప్రాణమైన నా తమ్ముడు సోనుని ఈరోజు మీరే కాపాడారు అంకుల్... ప్లీజ్ కళ్లు తెరవండి!"
 
సోను కూడా ఏడుస్తూ పరుగున వచ్చి ప్రసాద్ పక్కన మోకాళ్లపై కూర్చున్నాడు. ప్రసాద్‌ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ, ఎంతో కష్టంగా తన రక్తపు చేతిని సోను తలపై పెట్టాడు.
 
ప్రసాద్: (క్షీణిస్తున్న గొంతుతో, చాలా బలహీనంగా) "నువ్వు... నువ్వు బానే ఉన్నావా నాన్న...?"
 
సోను ఏడుస్తూ తలూపాడు. ప్రసాద్ మెల్లగా కళ్లు మూశాడు. అప్పుడే అక్కడికి పరుగున వచ్చిన కమిషనర్ పూజ వైర్లెస్ వాకి టాకీ తీసి గట్టిగా అరిచింది.
 
పూజ: "కంట్రోల్ రూమ్! ఇప్పుడే పుష్కర ఘాట్‌కి అంబులెన్స్ పంపండి.... ఐ నీడ్ ఇట్ నవ్ !"
 
సరిగ్గా నిమిషంలో అక్కడికి వచ్చిన ఎమర్జెన్సీ వెహికల్‌లో ప్రసాద్, వర్షలను ఎక్కించి నగరంలోని ప్రముఖ 'అంజలి హాస్పిటల్'కి తరలించారు. 

పూజ వెంటనే హాస్పిటల్ చుట్టూ వంద మంది సెక్యూరిటీ ఆఫీసర్లతో భారీ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయించింది.
 
సమయం: ఉదయం 10:45 నిమిషాలు
ప్రదేశం: పూనమ్ ఇల్లు, విజయవాడ (పొంచి ఉన్న ప్రళయం)
 
ఘాట్‌లో ఇంత జరుగుతున్నా ఇవేమీ తెలియని పూనమ్, ఆమె అత్తగారు ఇంట్లోనే ఉన్నారు. 

పూనమ్‌కు నెలసరి మొదటి రోజు (Periods First Day) కావడం, దానికి తోడు విపరీతమైన జ్వరం ఉండటంతో ఆమె ఒళ్లు తెలియని నీరసంతో లోపలి బెడ్‌రూమ్‌లో గాఢనిద్రలో ఉంది. 

అత్తగారు హాల్లో కూర్చుని ప్రశాంతంగా టీవీ చూస్తున్నారు.
 
సరిగ్గా అప్పుడు... ఇంటికి కొద్దిగా దూరంలో రెండు మినీ బస్సులు వచ్చి ఆగాయీ . అందులోంచి 40 మంది ప్రొఫెషనల్ కిల్లర్స్ ఒకరి తర్వాత ఒకరు దిగారు.
 
చుట్టుపక్కల వాళ్లకు ఎలాంటి అనుమానం రాకుండా, పిల్లుల్లా అడుగులు వేస్తూ పూనమ్ ఇంటి ఆవరణలోకి ప్రవేశించారు. 

రాగానే మొదట బయట ఉన్న మెయిన్ ఐరన్ గేట్‌ను లాక్ చేసేశారు.
 
ఎందుకంటే, రణధీర్ (రావు) వాళ్లకు ముందే గట్టిగా హెచ్చరించాడు—"పూనమ్ దేవి మామూలు ఆడది కాదు, అత్యంత ప్రమాదకరమైన మృత్యువు!" అని.
 
అందుకే వాళ్లు ఎలాంటి శబ్దం రాకుండా లోపలికి వచ్చారు. ఇంటి మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఉంది. ఒక కిల్లర్ ముందుకు వచ్చి డోర్ బెల్ కొట్టాడు.
 
అత్తగారు: (టీవీ సౌండ్ తగ్గించి, మనసులో) "అప్పుడే వచ్చేసారా రావు, సోను...?" అనుకుంటూ వెళ్లి తలుపు తీశారు.
 
తలుపు తీసిన మరుక్షణమే—"ఛాక్!!!!"
 
ఒక పదునైన కత్తి ఆమె గొంతులోకి దిగిపోయింది! నోట్లోంచి కేక కూడా రాకుండా అత్తగారు అలాగే వెనక్కి పడిపోయారు. ఆమె చేతిలో ఉన్న టానిక్ చిన్న బాటిల్ 'టుప్' మంటూ కిందపడి పగిలిపోయింది.
 
ఆ బాటిల్ పగిలిన శబ్దానికి పూనమ్‌కు ఒక్కసారిగా మెలకువ వచ్చింది.
 
పూనమ్: (నీరసంగా బెడ్‌రూమ్‌లో నుంచే గట్టిగా అరిచింది) "అత్తయ్యా... ఏమైంది అత్తయ్యా?!"
 
కాని అవతలి నుండి ఎలాంటి శబ్దమూ లేదు. భయంకరమైన నిశ్శబ్దం. అప్పటికే ఆ 40 మంది కిల్లర్స్ ఇల్లా కారిడార్‌లోకి వచ్చేసి, మెయిన్ డోర్ లాక్ చేసి, చేతుల్లో కత్తులతో పూనమ్ బెడ్‌రూమ్ డోర్ ముందర కాపుకాశారు.
 
సమయం: ఉదయం 10:48 నిమిషాలు
ది బ్లాక్ స్క్వాడ్ లీడర్ !
 
పూనమ్ నీరసంగానే మంచం దిగి, ఏమైందో చూద్దామని మెల్లగా బెడ్‌రూమ్ డోర్ వైపు నడవడం మొదలుపెట్టింది. సరిగ్గా హాల్ లోకి అడుగు పెట్టబోయే సమయానికి...
 
వంటగది నుండి వచ్చే వెలుతురు హాల్లో కనిపించలేదు!
 
పూనమ్ ఒక సెకను ఆగి ఆలోచించింది. అత్తగారు ఎప్పుడూ వంటగది తలుపులు కానీ, ఆ వెలుతురును కానీ క్లోజ్ చేయరు. అంటే... ఇంట్లో ఎవరో ఉన్నారు!
 
సాధారణ స్త్రీలకైతే అంత చీకట్లో ఆ చిన్న మార్పును కనిపెట్టే షార్ప్‌నెస్ ఉండదు. కానీ నిలబడింది సాదాసీదా కోడలు కాదు... బ్లాక్ స్క్వాడ్ లీడర్!
 
పూనమ్ వెళ్తూ వెళ్తూనే డోర్ పక్కన మూలలో ఉన్న ఒక భారీ ఇన్యుప రాడ్‌ను కుడిచేతిలోకి తీసుకుంది. 

ఆమె కాలి అడుగు బయట పెట్టడమే ఆలస్యం—చీకట్లోంచి ఒకేసారి 10 పదునైన కత్తులు ఆమె ముఖం వైపు వేగంగా దూసుకొచ్చాయి!
 
పూనమ్ మెరుపు వేగంతో వెనక్కి జరిగి, తన చేతిలోని ఐరన్ రాడ్‌తో కత్తులను బ్లాక్ చేస్తూ బెడ్‌రూమ్ తలుపును గట్టిగా బాది మూసేసింది! 

ఆ డోర్ ఫోర్స్‌కి బయట ఉన్న నలుగురు కిల్లర్స్ వెనక్కి పడిపోయారు.
 
పూనమ్ క్షణకాలం కూడా వేస్ట్ చేయలేదు. బెడ్‌రూమ్‌లో ఉన్న తన పొడుగు జుట్టును గట్టిగా పైకి ముడి వేసుకుంది. 

ఇన్నాళ్లుగా అణచిపెట్టుకున్న ఆ 'కాళికాదేవి' ఆమెలోంచి బయటకు వచ్చింది.
 
ఎడమచేత్తో పక్కనే ఉన్న డ్రెసింగ్ టేబుల్ మిర్రర్‌ను ఐరన్ రాడ్‌తో గట్టిగా కొట్టి పగలగొట్టింది. అందులోంచి ఒక అతి పెద్ద, పదునైన గాజు ముక్కను (Sharp Glass Piece) చేతిలోకి తీసుకుంది.
 
ఇప్పుడు ఆమె కుడిచేతిలో ఐరన్ రాడ్, ఎడమచేతిలో పదునైన గాజు ముక్క!
 
పూనమ్ ఒక సింహంలా బెడ్‌రూమ్ డోర్ తన్నుకుంటూ బయటకు దూకింది!
 
"ష్వాక్... ష్వాక్... ష్వాక్!!!"
 
ఆమె వేగానికి హాల్లో కిందపడి లేస్తున్న ఐదుగురు కిల్లర్స్ మెడలు క్షణాల వ్యవధిలో తెగిపోయాయి! రక్తం గోడల మీదకు చిమ్మింది.
 
కానీ, అక్కడి నుండి మెయిన్ డోర్ వైపు చూడగానే పూనమ్ గుండె ఆగిపోయినంత పనైంది. 

అక్కడ తన తల్లి లాంటి అత్తగారు గొంతు తెగి రక్తపు మడుగులో పడి ఉన్నారు. పూనమ్ కళ్లల్లోంచి కన్నీళ్లు ఉప్పొంగాయి.
 
పూనమ్: (ఆవేదనతో అరుస్తూ) "అత్తయ్యాఆఆఆఆ!!!"
 
ఆమె బ్రతికే ఉందేమోనని పూనమ్ ముందుకు అడుగు వేయబోయింది. సరిగ్గా అప్పుడే చీకట్లోంచి వచ్చిన ఒక కిల్లర్ కత్తి... 

పూనమ్ కుడికాలి మోకాలి కింద బలంగా కోసుకుంటూ వెళ్ళింది! రక్తం చిమ్మింది.
 
జ్వరం, పీరియడ్స్ పెయిన్, దానికి తోడు ఈ గాయం... ఏ ఆడదైనా అక్కడ కూలిపోవాలి. కానీ పూనమ్ రక్తం చూసి మరింత రౌద్రంగా మారింది.
 
ఆ గాయాన్ని అస్సలు లెక్కచేయకుండా వేగంగా అత్తగారి దగ్గరకు వెళ్లి ఆమె చేయి పట్టుకుని పల్స్ చూసింది. పల్స్ లేదు... ఆమె చనిపోయారు.
 
పూనమ్ కళ్లల్లో కన్నీళ్లు కాస్తా నెత్తురు రేఖలుగా (రక్తపు కసిగా) మారిపోయాయి.
 
సమయం: ఉదయం 10:52 నిమిషాలు
నరమేధం
 
మిగిలిన 35 మంది కిల్లర్స్ కత్తులతో పూనమ్‌ను చుట్టుముట్టారు. పూనమ్ కిందపడి ఉన్న ఒక కిల్లర్ కత్తిని కుడిచేతిలోకి తీసుకుంది, ఎడమచేతిలో ఆ పెద్ద గాజు ముక్క అలాగే ఉంది.
 
కిల్లర్ లీడర్: "నరకండ్రా దాన్ని! బాస్ చెప్పింది నిజమే...!"ఆ మాట పూర్తి కాకముందే...
 
 పూనమ్ గాలిలోకి ఎగిరింది! ఒకే దెబ్బకు ముగ్గురి తలలను గాల్లోనే నరికి అవతల పారేసింది. ఆమె చేతిలోని కత్తి కంటికి కూడా కనిపించనంత వేగంతో తిరుగుతోంది.
 
"ష్వాక్... ష్వాక్... భఛాక్!!!"
 
హాల్ మొత్తం తెగిన చేతులు, కాళ్లు, తలలతో నిండిపోయింది. పూనమ్ ఒక కిరాతకమైన వేటగాడిలా ఒక్కడిని కూడా వదలకుండా...
 
ఆ 40 మందినీ శవాలుగా మార్చేసింది. ఇల్లంతా శవాల దిబ్బలా మారిపోయింది. 

ఊపిరి పీల్చుకుంటూ, ఒంటి నిండా శత్రువుల రక్తంతో నిలబడిన పూనమ్‌కు ఒక విషయం అర్థమైంది—ఇదంతా తన కోసమే జరిగింది!
 
పూనమ్: (కంగారుగా, గుండెల్లో భయంతో) "ఇక్కడ నా మీద ఇంత పెద్ద దాడి జరిగిందంటే... నా కొడుకు సోను, నా భర్త రావుల పరిస్థితి ఏంటి? వాళ్లు జాతరలో ఉన్నారు... వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి!"
 
పూనమ్ కంటి నిండా రక్తం కారుతున్నా పట్టించుకోకుండా, వాళ్లను కాపాడటానికి బయటకు వెళ్లడానికి సిద్ధమైంది.
ఇట్లు,
✿SUNNY ✿

1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం
Like


Messages In This Thread
RE: ❤️❤️ అందని జాబిలి.. అమ్మ❤️❤️ కోసం ? - by Sunnysunnysunny - 18-07-2026, 07:54 PM



Users browsing this thread: 2 Guest(s)