Thread Rating:
  • 29 Vote(s) - 3.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ❤️ అందని జాబిలి..❤️ కోసం (రక్త కధనరంగం - 1)
సమయం: రాత్రి 10:57 నిమిషాలు
ప్రదేశం: వైజాగ్ ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్
 
ఫోన్ రింగింగ్   శబ్దంతో పూనమ్, అల్కా ఇద్దరూ ఒక్కసారిగా నిశ్శబ్దంలోంచి లోకంలోకి వచ్చారు. స్క్రీన్ పైన సోను పేరు మెరుస్తోంది. 

ఆ పేరును చూడగానే అల్కా కళ్లల్లోని పగ కరిగి కన్నీళ్లుగా మారాయి. ఆమె మెల్లగా పూనమ్ వైపు తిరిగి, చేతులు పట్టుకుంది.
 
[Image: HJoJrDsboAA1l7Z.jpg]
అల్కా: (వణుకుతున్న గొంతుతో, ఏడుస్తూ) "అమ్మా... తమ్ముడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. వాడు కంగారుగా ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఇంకేం ఆలోచించొద్దు. నా మీద ఒట్టు...
 
నాతో ఇంటికి వచ్చేయ్, ఇంకేం మాట్లాడకు. మేము ఎప్పుడూ నీతోనే ఉంటాం. మాకు ఇంకేం వద్దు అమ్మా... నాకు, సోనుకి, వర్ష అక్కకి నువ్వు మాత్రమే కావాలి. మళ్లీ ఇలాంటి రక్తాన్ని, ఈ రూపాన్ని నేను ఎప్పటికీ చూడకూడదు!"
 
అంటూ అల్కా ఏడుస్తూ పూనమ్ చేతిని తీసుకుని తన తలపై పెట్టుకుంది. పూనమ్ కళ్లల్లో పాత జ్ఞాపకాలు, భయం ఒకేసారి కదలాడాయి.
 
పూనమ్: (ఆవేదనతో) "కానీ బుజ్జి తల్లీ... ఈ 'ఆధిర' గాడిని, వీడి వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఇప్పుడు ఇలాగే వదిలేస్తే, మిగిలిన ఇద్దరినీ వాళ్లు చంపేస్తారు తల్లి!"
 
[Image: 11b35c9cee125da78eb24966aa9fae61.jpg]

అల్కా: "అమ్మా! నాకు ఏమీ చెప్పకు ఇప్పుడు. ముందు ఇంటికి వెళ్దాం పద. అక్కడ వాడు కూడా భయపడుతూ మనకోసం ఎదురుచూస్తూ ఉంటాడు."
 
ఆ మాటలకు పూనమ్ నిస్సహాయంగా తలాడించింది. మరోవైపు ఫోన్ కాన్ఫరెన్స్‌లో ఉన్న అలేఖ్య ఏడుస్తూ మాట్లాడింది.
 
అలేఖ్య: "అల్కా... నీకేం కాలేదు కదా! నేను రేపు ఫోన్ చేస్తాను...
 
అల్కా : హ్మ్ం నాకు బానే ఉంది ...ఇక విజయ్ గారు! మీరు అలేఖ్య  ని జాగ్రత్తగా చూసుకోండి. తనకి నేను తప్ప ఎవరూ లేరు ఫ్రెండ్స్. మీరు తనతో ఉంటేనే బాగుంటుంది అనిపిస్తోంది."
 
[Image: c693f5a6800a2c3cf191bccceda1ff65.jpg]

విజయ్: (ఏం చెప్పాలో అర్థం కాక, గొంతు పూడుకుపోగా) "నేను... నేను చూసుకుంటాను అల్కా, నువ్వేం కంగారు పడకు."
 
అల్కా: (శాటిలైట్ ఫోన్ వైపు చూస్తూ) "సరే... నేను ఉంటాను. థాంక్స్ అంకుల్!" అని రా చీఫ్‌కి చెప్పింది.
 
వెంటనే పూనమ్ శాటిలైట్ ఫోన్ అందుకుని రా చీఫ్‌కి తన చివరి కమాండ్స్ ఇవ్వడం ప్రారంభించింది. ఆమె గొంతులో మళ్లీ పాత బ్లాక్ స్క్వాడ్ లీడర్ తాలూకు ఇంటెలిజెన్స్ స్పష్టంగా కనిపించింది.
 
పూనమ్: "చీఫ్! ఇక్కడ ఏం చేయాలో మీకు తెలుసు కదా? ఈ ఏరియా మొత్తం క్లీన్ చేయండి. ఒక్క క్లూ కూడా దొరకకూడదు. రోడ్ వర్క్ అని చెప్పి ఒక 5 రోజులు ఈ రోడ్డును పూర్తిగా క్లోజ్ చేయండి.
 
సీసీటీవీ రికార్డ్స్ అన్నింటినీ ఇప్పుడే ఎరేస్ చేయండి. ఈ లొకేషన్ పరిధిలో ఉన్న అన్ని సెల్ నెంబర్స్ డేటాను టవర్ సిగ్నల్స్ మరియు మెయిన్ సర్వర్ నుండి పూర్తిగా రిమూవ్ చేయండి."
 
RAW చీఫ్: "అలాగే పూనమ్. వాడు మళ్లీ నీ ఫ్యామిలీ జోలికి రాడు అని అనుకుంటున్నాను."
 
పూనమ్: "అలాగే... వైజాగ్ సిటీలో మరొక అమ్మాయి కోసం వాళ్లు దాడి చేసే అవకాశం ఉంది. సిటీ ట్రాఫిక్ సెక్యూరిటీ ఆఫీసర్ల పెట్రోలింగ్‌ను ఇప్పుడే పెంచండి. మీ స్పెషల్ టీమ్‌ని వెంటనే ఇక్కడికి పంపండి.
 
ఇక మీ ఆఫీసర్లకు చెప్పండి... ఈరోజు ఇక్కడ జరిగింది ఎవ్వరూ చూడలేదు, ఎవరికీ తెలియదు! నా పేరు గనుక బయటకు వస్తే నా పిల్లలకి ఏమైనా అవుతుంది...
 
వాళ్లకు ఏమైనా అయిందంటే, ఈసారి నా నుండి ఆ దేవుడు కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్లని కాపాడలేడు, వదిలిపెట్టను నేను !"
 
[Image: f378017dd22ee427695a00918a6e332f.jpg]

అని గంభీరంగా హెచ్చరించి పూనమ్ ఫోన్ కట్ చేసింది.
 
సమయం: రాత్రి 11:15 నిమిషాలు
ప్రదేశం: కిల్లర్స్ కారు (ఇంటికి తిరుగు ప్రయాణం)
 
అల్కా కారు దెబ్బతినడంతో, చనిపోయిన రౌడీల కారు ఒకటి తీసుకుని పూనమ్ డ్రైవ్ చేస్తోంది. పక్క సీట్లో కూర్చున్న అల్కా... పూనమ్ చేయిని ఎంత గట్టిగా పట్టుకుందంటే, మళ్లీ ఎక్కడ తన తల్లి దూరమైపోతుందో అన్న భయం ఆమెలో స్పష్టంగా ఉంది.
 
పూనమ్ భుజంపై తలవాల్చి ఏడుస్తూ మాట్లాడింది.
 
అల్కా: "అమ్మా... నేను నీ కడుపున పుట్టి ఉంటే ఎంత బాగుండేదో అమ్మా..." అని ఏడుస్తూ తన కళ్లు తుడుచుకుంది.
 
పూనమ్: (ఆమె తల నిమురుతూ) "నువ్వు నా కూతురివే తల్లి... అయినా, నాకసలు మీరెవరు అనే నిజం ఎందుకు చెప్పలేదు?"
 
అల్కా: "సరే... ఆ విషయం ఇప్పుడు వదిలేయ్ అమ్మా. ప్లీజ్..."
 
పూనమ్: "సరే, ఆ విషయం మర్చిపో... పడుకో."
 
పూనమ్ కారు నడుపుతూనే ఆలోచనల సుడిగుండంలోకి వెళ్ళిపోయింది. తన భర్త రావు... ఇదంతా వెనుక ఉండి నడిపిస్తున్నాడా? అసలు వాడికి ఇంత ధైర్యం ఎక్కడిది?
 
సమయం: రాత్రి 11:45 నిమిషాలు
ప్రదేశం: పూనమ్ ఇల్లు
 
కారు ఇల్లు చేరుకుంది. పూనమ్ అల్కాని లేపి, ఆమె ముఖం తడి గుడ్డతో తుడిచి కారు దిగమంది. అల్కా ముఖం అప్పటికే ఏడ్చి ఏడ్చి ఎర్రగా మారిపోయి, కళ్లన్నీ వాచిపోయాయి. చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన అలసట, భయం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
 
పూనమ్ డోర్ బెల్ కొట్టగానే... సోను కంగారుగా తలుపు తీశాడు. ఎదురుగా తల్లి ఒంటి నిండా రక్తం, కమాండో సూట్!
 
సోను: (భయంతో గట్టిగా అరుస్తూ) "అమ్మా!!! ఏమైంది అమ్మా? అక్క ఎక్కడ? అంతా బానే ఉందా?"
 
అప్పుడే మెల్లగా అల్కా వెనుక నుండి ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆమె ముఖం చూడగానే సోను కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నోట్లోంచి కేవలం ఒక్కటే మాట వచ్చింది.
 
[Image: Vulgar-comments-on-Sai-Pallavi-TS-Gov--r...5-1539.jpg]

సోను: "అక్కా............"
 
పూనమ్ నిశ్శబ్దంగా వచ్చి హాల్లోని సోఫాలో కూర్చుంది. అల్కా అలాగే నిలబడి సోను వైపు చూస్తోంది. సోను నెమ్మదిగా ముందుకు జరిగి అల్కా ముఖాన్ని తాకాలని చేయి చాచాడు.
 
ఆ స్పర్శ తగలగానే అల్కా అప్పటివరకు ఆపుకున్న ఏడుపు ఒక్కసారిగా బద్దలైంది. పిచ్చిదానిలా అరుస్తూ సోను చెంపల పైనా, గుండెల పైనా తన చిన్న చేతులతో గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది.
 
అల్కా: (ఏడుస్తూ, కొడుతూ) "నువ్వు నా ఫోన్ ఎందుకు ఎత్తలేదురా?! బండ వెధవా... నీకు నేను అంటే అస్సలు ఇష్టం లేదు కదా! నన్ను అస్సలు పట్టించుకోవు!
 
[Image: New-Project-2022-06-06T062632.965.jpg]

ఆ భయంలో, ఆ చావు ముందు నాకు నువ్వే గుర్తొచ్చావురా... ఆఫీస్ దగ్గరికి నిన్ను పిలుద్దామని ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా నీకు?!"
 
ఆమె కొడుతుంటే సోను అడ్డు చెప్పలేదు. కళ్లల్లోంచి నీళ్లు కారుతుండగా అలాగే నిలబడ్డాడు. పూనమ్ కూడా సోఫాలో కూర్చుని ఆ ఇద్దరినీ చూస్తూ ఏడుస్తోంది.
 
సోను నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. అల్కా కొట్టి కొట్టి అలసిపోయి, ఒక్కసారిగా సోను గుండెలపై వాలిపోయింది.
 
అల్కా: "నేను మళ్లీ నిన్ను చూస్తాను అని అస్సలు అనుకోలేదురా..." అని గట్టిగా ఏడ్చేసింది.
 
సోను: (అల్కాని గట్టిగా తన గుండెలకి హత్తుకుంటూ) "అక్కా... ఈ సెకండ్ నుండి నీకు తగిలే ప్రతి దెబ్బ, ముందు నన్ను దాటిన తర్వాతే నీకు తగలాలి!
 
[Image: 861f6d769094e2fec0c04dfd334ec897.jpg]

నా ప్రాణం అడ్డు వేసైనా సరే మీకు ఏమీ కానివ్వను. సారీ అక్కా... నా వల్లే ఇదంతా జరిగింది, నన్ను క్షమించు!"
 
ఆ ఇద్దరు అక్కాతమ్ముళ్లు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని అలాగే ఏడుస్తూ ఉండిపోయారు. అప్పుడు పూనమ్ సోఫాలోంచి లేచి ఆ ఇద్దరి దగ్గరికి వచ్చింది.
 
[Image: 0db4dbcfc019a2d58bb40ae48edec618.jpg]

ఆమె కళ్లల్లో ఇప్పుడు పశ్చాత్తాపం లేదు, ఒక గురువు, ఒక తల్లి తాలూకు పట్టుదల ఉన్నాయి.
 
పూనమ్: "సోను! నువ్వు అలా చేయాలి అంటే... ఇలా బలహీనంగా ఏడవడం మానేయాలి. రేపటి నుండి నువ్వు ఏం చేయాలో నేను నీకు చెప్తాను.
 
నేను లేని రోజున కూడా, నిన్ను దాటి మీ అక్కల దగ్గరికి చావు రావాలన్నా... ఆ చావు భయపడేలా నిన్ను తయారు చేస్తాను!" అని చెప్పి ఆ ఇద్దరినీ గట్టిగా హగ్ చేసుకుంది.
 
పూనమ్: "సరే... ఇద్దరూ వెళ్లి స్నానం చేసి రండి. నాకు చాలా ఆకలిగా ఉంది. ఈరోజు నా చేతులు కూడా బాలేవు (రక్తంతో ఉన్నాయి)... మీరే నాకు తినిపించాలి."
 
అల్కా: (వెంటనే సోనుని నెడుతూ) "వదలకురా బండ వెధవా! అమ్మకి ఆకలి వేస్తోందంటే అర్థం కాలేదా? ఛీ వేస్ట్ ఫెలో... వెళ్లు, అన్నీ రెడీ చెయ్. ఈరోజు మీ ఇద్దరికీ నేనే అన్నం కలిపి పెడతాను!"
 
అని ఇద్దరికీ చెరో ముద్దు పెట్టి అల్కా తన రూమ్‌లోకి వెళ్ళింది. పూనమ్ కూడా తన రూమ్‌లోకి వెళ్ళింది.
 
సమయం: రాత్రి 12:30 నిమిషాలు
ప్రదేశం: పూనమ్ ఇల్లు (హాల్)
 
ముగ్గురూ ఫ్రెష్ అప్ అయి వచ్చారు. అల్కా ఎంతో ప్రేమగా, కళ్లల్లో నీళ్లను దాచుకుంటూ పూనమ్‌కి, సోనుకి ముద్దలు కలిపి తినిపించింది. వాళ్లు వద్దు అంటున్నా వినకుండా తినిపించుకుంటూనే ఉంది.
 
[Image: Sai-Pallavi-Thandel-Pics-22-1738904644.j...k=gGWP6Mm-]

ముగ్గురూ తిన్న తర్వాత అల్కా సోను వైపు చూసింది.
 
అల్కా: "రేయ్ సోను... ఈరోజు హాల్లోనే పెద్ద బెడ్ రెడీ చెయ్. ముగ్గురం ఇక్కడే పడుకుందాం."
 
సోను అలాగే హాల్లో పెద్ద పరుపు పరిచి బెడ్ రెడీ చేశాడు. ముగ్గురూ పడుకోగానే అల్కా ఒకవైపు, సోను
ఒకవైపు పూనమ్‌ను గట్టిగా హత్తుకున్నారు.
 
ఆ అమ్మ కౌగిలిలో ఉన్నామనే ధైర్యంతో ఆ ఇద్దరూ కాసేపటికే గాఢ నిద్రలోకి జారుకున్నారు.
 
కానీ... పూనమ్‌కి మాత్రం నిద్ర రావడం లేదు. ఆమె కళ్లు చీకట్లోకి చూస్తున్నాయి.
మనసంతా ఒకటే ప్రశ్న...
 
[Image: f66a98168688aba0d87ee25427f8f202.jpg]

"నా భర్త రావు... ఇదంతా ఎలా చేశాడు? అసలు నాతో పెళ్లి కాకముందు వాడు ఎవరు? ఆ దుర్గమ్మ జాతర నరమేధం నుండి వాడు ప్రాణాలతో ఎలా బయటపడ్డాడు?!"
 
ఆ ఆలోచనలతో పూనమ్ కళ్లు మూసుకుంది... కాలం 2 నెలలు  క్రితం జరిగిన ఆ భయంకరమైన దుర్గమ్మ జాతర కి వెనక్కి వెళ్ళింది...
 
ఇక్కడి నుండి అసలైన ఫ్లాష్‌బ్యాక్ మిస్టరీ ప్రారంభమవుతుంది...
ఇట్లు,
✿SUNNY ✿

1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం
Like


Messages In This Thread
RE: ❤️❤️ అందని జాబిలి.. అమ్మ❤️❤️ కోసం ? - by Sunnysunnysunny - 17-07-2026, 09:38 PM



Users browsing this thread: 7 Guest(s)