11-07-2026, 10:44 AM
సమయం: మధ్యాహ్నం 1:00 గంటలు
ప్రదేశం: విజయ్ ఆఫీస్ (అలేఖ్య మౌన పోరాటం)
ఒకవైపు తన క్యాబిన్ లో కూర్చుని, దూరం నుండి విజయ్ నే రెప్ప వాల్చకుండా చూస్తోంది అలేఖ్య. ఆమె మనసులో ఏదో తెలియని చిన్నపాటి అలజడి, క్యూరియాసిటీ. ఆఫీసు బయట అతనికి క్యారేజ్ ఇవ్వడానికి వచ్చిన ఆ మహిళ ఎవరు? విజయ్ కి ఆమెతో ఉన్న సంబంధం ఏంటి?
ఆలోచిస్తున్న కొద్దీ అలేఖ్య మనసులో చిన్న బాధ. కానీ ఆమెకు విజయ్ మీద ఉన్న ప్రేమ, ఆ బాధను మించిపోయింది.
మధ్యాహ్న భోజన సమయంలో, విజయ్ ఇంట్లో నుండి భావన తెచ్చిన భోజనాన్ని ఎంతో ఇష్టంగా తిన్నాడు.
ఆ తర్వాత సార్ పిలవడంతో వెళ్లి ఆయన పక్కన కూర్చున్నాడు.
సార్: "సరే విజయ్, ఎల్లుండి ఆఫీస్ కి సెలవు. కాబట్టి మనం ఈరోజు, రేపే ఈ వర్క్ పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం."
విజయ్ (ఆశ్చర్యంగా): "ఎల్లుండి.... సెలవా సార్?"
సార్: "ఏయ్, నువ్వేం లోకంలో బతుకుతున్నావయ్యా... ఎల్లుండి పండుగ కదా... దానికే సెలవు ఉంది, ఇంకేంటి."
విజయ్ (నవ్వుతూ): "అయ్యో సారీ సార్, పనిలో పడి నాకు గుర్తులేదు."
విజయ్ మనసు గాల్లో తేలిపోతోంది. 'హమ్మయ్య... ఎల్లుండి రోజంతా నా భావనతో ప్రశాంతంగా గడపడానికి అవకాశం దొరికింది' అని మనసులోనే మురిసిపోయాడు.
సమయం: సాయంత్రం 5:30 గంటలు
ప్రదేశం: ఆఫీస్ పార్కింగ్ ఏరియా
ఆఫీస్ సమయం పూర్తయింది. అందరూ వెళ్ళిపోతున్నారు. విజయ్ తన బ్యాగ్ సర్దుకుని పార్కింగ్ ఏరియాలోకి వచ్చాడు. సరిగ్గా అదే సమయానికి అలేఖ్య కూడా అక్కడికి వచ్చింది.
ఆమె కళ్లు విజయ్ నే వెతుకుతున్నాయి. విజయ్ ఆమెను చూసి చిన్నగా నవ్వాడు.
విజయ్: "వెళ్తున్నారా అలేఖ్య గారు? మొదటి రోజు ఆఫీస్ ఎలా అనిపించింది?"
అలేఖ్య (కళ్లార్పకుండా అతని కళ్లలోకి చూస్తూ, చిన్న చిరునవ్వుతో): "హ్మ్..." (అవును అన్నట్లు తల ఊపింది)
![[Image: 2e64ab2f5ce45a6e90842fdb0951aa60.jpg]](https://i.pinimg.com/1200x/2e/64/ab/2e64ab2f5ce45a6e90842fdb0951aa60.jpg)
విజయ్: "ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది, ఆకాశం మేఘావృతమై ఉంది. బహుశా వర్షం పడేలా ఉంది, త్వరగా ఇంటికి వెళ్ళండి."
అలేఖ్య (అతని స్వరాన్ని, అతని కేరింగ్ ని మనసులోనే ఆస్వాదిస్తూ, ఎంతో ఆప్యాయంగా): "మీరు కూడా..." అని మాత్రమే అంది.
ఆమె మాటల కంటే ఆమె కళ్లే ఎక్కువ మాట్లాడుతున్నాయి. విజయ్ కి ఆమె చూపుల్లో ఏదో తెలియని భావం కనిపించింది, కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా అక్కడినుండి బయలుదేరాడు. అలేఖ్య మాత్రం అతను కనుమరుగయ్యే వరకు అలానే మౌనంగా చూస్తూ ఉండిపోయింది.
విజయ్ ఇంటికి వెళ్లే దారిలో ప్రతీసారిలాగే భావన కోసం ఇష్టంగా పూలు కొన్నాడు. భావన కోసం తన ట్యూషన్ దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరారు. విజయ్ డ్రైవ్ చేస్తున్నాడు, భావన వెనుక కూర్చుంది.
భావన (ప్రేమగా): "మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది విజయ్?"
విజయ్: "హ్మ్ం, చాలా అంటే చాలా బాగుంది భావన. నా సహోద్యోగులు కూడా అడిగారు... ఇంత కమ్మటి వంట ఎవరు వండారు అని."
భావన (ఆత్రుతగా): "మరి ఏం చెప్పావు?"
విజయ్ (నవ్వుతూ): "నేనే వండానని వాళ్లకి చెప్పా!"
భావన (బుంగమూతి పెట్టి): "అదేంటి? ఎందుకు నేను వండాను అని చెప్పలేదు?"
విజయ్ (ఒక చేత్తో ఆమె చెయ్యి పట్టుకుని): "అది కాదు భావన... అందులో దాచడానికి ఏముంది, నువ్వే నా భార్యవి అని త్వరలోనే అందరికీ గర్వంగా చెప్తాను."
ఆ మాటలకు భావన సిగ్గుతో తలదించుకుంది.
భావన: "హ్మ్, పర్వాలేదులే... సరే, గుడికి వెళ్దామా?"
విజయ్: "ప్లీజ్ భావన... ఆ ఆఫీసులో సార్ మాటలు విని విని విసిగిపోయాను ఈ రోజంతా. ఇంటికి వెళ్దాం పదా... పైగా ఆకాశం చూడు ఎలా మేఘావృతమై ఉందో, ఏ క్షణమైనా వర్షం పడొచ్చు. నాకు చాలా చలిగా అనిపిస్తోంది."
భావన సరే అనడంతో ఇద్దరూ నేరుగా ఇంటికి చేరుకున్నారు.
ఇంటికి రాగానే ఇద్దరూ ఫ్రెష్ అయ్యి, స్నానం చేసి కిందకి వచ్చారు.
విజయ్: "అయితే పద, వంట చేద్దాం."
భావన (అతన్ని ఆపుతూ): "అది నా పని విజయ్, దయచేసి ఇప్పుడు నన్ను మాత్రమే చేయనివ్వు... సరేనా?"
విజయ్: "ఇప్పుడు ఇందులో నాకూ, నీకూ అనే తేడా ఏముంది భావన? ఇద్దరం కలిసి చేసుకుందాం."
భావన (అధికారంగా): "వద్దు, అంటే వద్దు... ఇకపై ఇంటి పనులు నేను మాత్రమే చేస్తాను. నువ్వు నీ ఆఫీస్ పని మీద మాత్రమే దృష్టి పెట్టు."
ఆమె అలా అనగానే విజయ్ కి ముచ్చటేసింది. నెమ్మదిగా భావన వెనుక వెళ్ళి, ఆమె నడుము చుట్టూ తన చేతులు వేసి గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు.
విజయ్ (ఆమె చెవి దగ్గర గుసగుసగా): "ఏమైంది... అప్పుడే నా భార్యగా మారడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నావు?"
భావన (సిగ్గుతో ఒకింత వణుకుతూ): "అబ్బా వదిలేయ్ విజయ్... ఎవరైనా చూస్తారు."
విజయ్: "నా పెళ్లాన్ని నేను పట్టుకుంటే ఎవరెవరో ఎందుకు చూస్తారు? నిన్ను ఇలా నా చేతుల్లో బంధించడం నాకు చాలా ఇష్టం భావన."
అమ్మా: సరే ఇప్పుడు బయటకు వెళ్ళు ప్లీజ్ ... అంటూ ఆమె అక్కడినుండి వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది.
కానీ విజయ్ వదల్లేదు. అప్పుడు భావన నెమ్మదిగా వెనక్కి తిరిగి, తన ముఖాన్ని విజయ్ ముఖానికి దగ్గరగా తీసుకువచ్చింది. ఆమె పెదవులు అతన్ని ముద్దు పెట్టుకోబోతున్నట్లుగా అనిపించింది.
విజయ్ కళ్లు మూసుకుని ఎదురుచూస్తున్నాడు... అప్పుడు అకస్మాత్తుగా భావన అతన్ని ఆటపట్టిస్తూ, పక్కకు నెట్టి అక్కడి నుండి నవ్వుకుంటూ పరుగెత్తడం ప్రారంభించింది.
ఆమెను అలా సంతోషంగా చూస్తుంటే విజయ్ కి ప్రాణం లేచివచ్చినట్లు అయింది. ఆమె వెనుక పరిగెత్తి, హాల్లో ఆమెను అమాంతం తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు.
భావన (అతని కళ్లలోకి కసిగా, ప్రేమగా చూస్తూ): "విజయ్… ఇంక నేను నువ్వు లేకుండా ఉండలేను, దయచేసి నన్ను పూర్తిగా నీదానిగా చేసుకో…"
విజయ్ (ఆమెను కిందకు దించి, నుదుటిపై ముద్దుపెడుతూ): "భావన… నాకు తెలుసు… ఈ ప్రపంచంలో నేనే అత్యంత అదృష్టవంతుడిని… నీలాంటి అద్భుతమైన అమ్మాయి నాకు దొరికింది."
భావన (సిగ్గుపడిపోయి) : "సరే…చాలు చాలు ఇంకా... ఇప్పుడు నన్ను చాలా పొగిడావు చాలు, ఇంకా నన్ను వంట చేయనివ్వు, హహహహ ..." అంటూ వెళ్ళబోయింది.
విజయ్: "ఆగు... ఇదిగో, ముందు నేను తెచ్చిన ఈ పూలు పెట్టుకో..."
విజయ్ ఎంతో ప్రేమగా ఆమె జడకు మల్లెపూలు పెట్టాడు . ఆ పూల పరిమళం కన్నా అతని ప్రేమ పరిమళమే ఆమెను ఎక్కువగా మత్తులో పడేసింది. ఆ తర్వాత ఆమె వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్ళింది.
సమయం: రాత్రి 9:00 గంటలు
ప్రదేశం: అలేఖ్య గది (ముంబై)
అలేఖ్య ఆఫీసు నుండి నేరుగా RAW ఆఫీసు ట్రైనింగ్ కి తిరిగి ఇంటికి వచ్చింది. ఒకవైపు అలసట, మరోవైపు విజయ్ జ్ఞాపకాలతో మంచం మీద వాలింది.
రోజంతా ఆఫీసులో విజయ్ ని దొంగచాటుగా చూసుకున్న ఆ మధుర క్షణాలు ఆమె మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఈ ఆనందాన్ని తన ప్రాణ స్నేహితురాలు అల్కాతో పంచుకోవాలని వెంటనే ఫోన్ తీసి డయల్ చేసింది.
అలేఖ్య: "హలో అల్కా... ఏం చేస్తున్నావే పిచ్చిదానా? రోజంతా ఒక్క ఫోన్ కూడా చేయలేదు ఏంటి?"
అల్కా (కొంచెం డల్‌గా, చిన్న స్వరం తో): "హలో అలేఖ్య... నీకు ఫోన్ చేద్దామనే అనుకున్నా. కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు."
అలేఖ్య (కంగారుగా): "ఏమైందే? గొంతు అలా ఉంది? ఏమైనా సమస్య ఆ అల్కా? నాన్న ని పంపనా ?"
అల్కా (బాధను దిగమింగుకుంటూ): "అలేఖ్య... నేను ముంబై వదిలేసి వెళ్ళిపోతున్నానే. అక్క నన్ను వైజాగ్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళమని చెప్తుంది. మరి కొన్ని రోజుల్లో నేను ముంబై ని ఖాళీ చేసి వైజాగ్ షిఫ్ట్ అయిపోతున్నా."
ఆ మాట వినగానే అలేఖ్య గుండె కొద్దిసేపు ఆగిపోయినంత పనైంది. అల్కా అంటే ఆమెకు ప్రాణం. తన ప్రతి బాధ, సంతోషం పంచుకునే ఏకైక స్నేహితురాలు. చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు.
అలేఖ్య (కళ్ళలో నీళ్లతో, వణుకుతున్న గొంతుతో): "ఏంటే నువ్వు మాట్లాడేది? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు లేకుండా నేనెలా ఉండాలి ఇక్కడ? నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు కదా అల్కా... దయచేసి వెళ్ళొద్దు వర్ష అక్కకి చెప్పు."
అల్కా (సముదాయిస్తూ, తను కూడా ఏడుస్తూ): "ఏడవకే పిచ్చిదానా... నేను ముంబైని వదిలి వెళ్తున్నాను కానీ, నిన్ను కాదు కదా. ఫోన్ లో రోజూ మాట్లాడుతూనే ఉంటాను. నాకూ నిన్ను వదిలి వెళ్ళడం చాలా అంటే చాలా బాధగా ఉంది అలేఖ్య.
కానీ నాన్న , అన్నయ్యలు ఇంకా ఈ నరకం లో అక్క లేకుండా నేను ఒక్కదానినే ఉండలేను కదా, తప్పదు. నాకు ఏం అయిన అవుతుంది ఏమో అని అక్క భయంగా ఉంది."
అలేఖ్య కన్నీళ్లు తుడుచుకుంటూనే మౌనంగా ఉండిపోయింది. ఆమెకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
అల్కా (వాతావరణాన్ని తేలిక చేస్తూ): "సరే సరే... ఏడవడం ఆపి అసలు విషయం చెప్పు. నీ ఫోన్ ఎత్తగానే నీ వాయిస్ లో ఏదో తెలియని ఆనందం కనిపించింది. నాకెందుకో ఏదో పెద్ద గుడ్ న్యూస్ లాగే అనిపిస్తోంది... ఏంటి సంగతి? ఆఫీస్ లో ఫస్ట్ డే ఎలా జరిగింది?"
![[Image: eaf6432ce86fd879c947ef2df633fecf.jpg]](https://i.pinimg.com/736x/ea/f6/43/eaf6432ce86fd879c947ef2df633fecf.jpg)
అల్కా మాటలతో అలేఖ్య ముఖంలో కన్నీళ్ల మధ్యే మళ్లీ ఆ పాత చిరునవ్వు, సిగ్గుల మొగ్గ వికసించాయి.
అలేఖ్య (సిగ్గుపడుతూ, మెల్లగా): "అల్కా... అతను దొరికేశాడే!"
అల్కా (ఆశ్చర్యంతో గట్టిగా అరుస్తూ): "ఏంటి!!! నిజంగానా? ఎవరే... ఆ థియేటర్ లో నిన్ను కాపాడిన ఆ వీరుడేనా?? ఎక్కడ దొరికాడు?"
అలేఖ్య (సంతోషంగా కళ్ళు మూసుకుని, ఫోన్ ని గుండెలకు హత్తుకుని): "అవునే... నా విజయ్! నా ప్రాణదాత... ఇప్పుడు నా ప్రాణం. పెదనాన్న (RAW Chief) సహాయంతో అతని డీటెయిల్స్ కనుక్కున్నాను. అతను ఎక్కడ పనిచేస్తున్నాడో, అదే ఆఫీసులో, అదే టీమ్ లో నేను కూడా ఇవాళే జాయిన్ అయ్యాను."
అల్కా (ఆనందంతో): "వామ్మో! అలేఖ్య... నువ్వు మామూలు దానివి కాదే. ప్రేమ కోసం ఏకంగా ఆఫీసులే మార్చేశావా? మరి అతనేమన్నాడు? గుర్తుపట్టాడా నిన్ను? మాట్లాడాడా?"
అలేఖ్య (చిన్న నిట్టూర్పుతో): "లేదే అల్కా... తను నన్ను మామూలు కో-వర్కర్ లాగే పలకరించాడు. బహుశా ఆ చీకట్లో, ఆ హడావిడిలో నా ముఖం సరిగ్గా చూసి ఉండడు. కానీ అతన్ని అలా నా కళ్ళ ముందు చూస్తుంటే... నా జన్మ ధన్యం అయిపోయినట్లు అనిపించింది. అతను ఆఫీసులో పనిచేస్తుంటే, నేను నా పని వదిలేసి దొంగచాటుగా అతన్నే చూస్తూ ఉండిపోయాను. అతని చిరునవ్వు, అతను చూసే తీరు... అన్నీ నా మనసులో ముద్రపడిపోయాయి."
అల్కా: "మరి నీ ప్రేమ విషయం చెప్పలేదా పిచ్చిదానా? వెళ్లి గట్టిగా హగ్ చేసుకుని నువ్వే నా ప్రాణం అని చెప్పొచ్చు కదా!"
అలేఖ్య (నవ్వుతూ): "ఇప్పుడే కాదు అల్కా. అతనికి నా మీద నమ్మకం, ప్రేమ కలిగేలా చేస్తాను. అతని ప్రాణాలకు ప్రాణంగా నిలబడతాను. ఈరోజు అతనికి ఎవరో క్యారేజ్ తెచ్చారు... అతను ఎవరితో ఉన్నా, ఎలా ఉన్నా సరే... నా ప్రాణాలు కాపాడిన ఆ చేతులను జీవితాంతం వదలను. అతను నా వాడే అవ్వాలి."
అల్కా (ఎమోషనల్ అవుతూ): "నీ ప్రేమ చాలా స్వచ్ఛమైనది అలేఖ్య. నీ పిచ్చి ప్రేమ చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. అతను కచ్చితంగా నీవాడే అవుతాడు. నీ కళ్ళల్లో ఉన్న ఆ ఆరాధనను అతను త్వరలోనే గుర్తిస్తాడు చూడు. నేను వైజాగ్ వెళ్ళినా, నీ ప్రేమకథ అప్డేట్స్ మాత్రం నాకు గంట గంటకూ ఇవ్వాల్సిందే!"
అలేఖ్య (చిరునవ్వుతో): "తప్పకుండానే... నువ్వు వైజాగ్ వెళ్ళినా నా గుండెల్లోనే ఉంటావు. నీకోసం, నా విజయ్ ని తీసుకుని నేను వైజాగ్ కూడా వస్తాను చూడు."
అల్కా: "ప్రామిస్?"
అలేఖ్య: "ప్రామిస్!"
ఇద్దరు స్నేహితురాళ్లు తమ మధ్య త్వరలో రాబోతున్న భౌతిక దూరాన్ని... మనసుల దగ్గరతనంతో చెరిపేస్తూ ఆ రాత్రి చాలా సేపు కబుర్లు చెప్పుకున్నారు. అల్కా వెళ్ళిపోతోందన్న బాధను, విజయ్ దొరికాడన్న సంతోషం కొద్దిగా తగ్గించింది. అలేఖ్య మనసంతా ఇప్పుడు రేపు ఆఫీస్ కి వెళ్లి విజయ్ ని మళ్ళీ ఎప్పుడు చూస్తానా అన్న ఆరాటంతో నిండిపోయింది.
సమయం: రాత్రి 10:00 గంటలు
ప్రదేశం: భావన ఇల్లు (ముంబై)
కాసేపటికి ఇద్దరూ భోజనం చేశారు. విజయ్ ఇంకా బయట హాలులో సోఫాలో కూర్చునే ఉన్నాడు. చలి గాలికి చేతులు రుద్దుకుంటూ వణుకుతున్నాడు. అప్పుడు భావన ఒక అందమైన కొత్త స్వెటర్ తీసుకుని అతని వైపు నడుచుకుంటూ వచ్చింది.
భావన: "ఇది తీసుకుని వేసుకో..."
విజయ్ (ఆశ్చర్యంగా చూస్తూ): "ఈ స్వెటర్ నీదా?"
భావన (నవ్వుతూ): "కాదు... ఇది నీదే పిచ్చోడా. ఈరోజే మార్కెట్ కి వెళ్ళినప్పుడు నీకోసం కొన్నాను... బాగుంది కదూ..."
ఎందుకో తెలియదు కానీ, అప్పటివరకు ప్రేమగా ఉన్న విజయ్ కి, భావన తనకోసం డబ్బులు ఖర్చు చేయడం నచ్చలేదు. కష్టపడి ఆమె సంపాదించిన డబ్బు తన మీద అనవసరంగా ఖర్చు పెట్టకూడదన్నది అతని ఉద్దేశం. కోపం వచ్చింది.
విజయ్ (కొంచెం గట్టిగా): "నీకు పిచ్చి పట్టిందా భావన? ఏంటి... దీని అవసరం ఏముంది ఇప్పుడు? నా మీద ఎందుకు అనవసరంగా డబ్బులు తగలేస్తున్నావు? ఆ గొడవ తరువాత స్కూటీ అక్కడే వదిలేశావు ,,మళ్ళీ నేను పొద్దునే లేచే సరికి కొత్త స్కూటీ ఇంటి ముందు కొని ఉంచావు ? ఎందుకు ఇవి అన్నీ ?"
ఆ గట్టి స్వరం, కోపం చూసి భావన ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మొదట భయపడింది, ఆ తర్వాత గుండెల్లో ఏదో తెలియని బాధ మొదలైంది.
![[Image: d59934fe9e020a9ba10e44199d5ad185.jpg]](https://i.pinimg.com/736x/d5/99/34/d59934fe9e020a9ba10e44199d5ad185.jpg)
తాను ఎంతో ఇష్టపడి కొంటే, ఇలా అరుస్తాడా అని కళ్లలో నీళ్లు తిరిగాయి.
భావన కోపంగా ఆ స్వెటర్‌ను విజయ్ ముఖం వైపు విసిరికొట్టి, ఏడుస్తూ పడకగదిలోకి పరుగెత్తి తలుపు వేసుకుంది.
విజయ్ కి అప్పుడు అర్థమైంది... 'అయ్యో, నేను చాలా ఓవర్ రియాక్ట్ అయ్యాను, భావనను అనవసరంగా బాధపెట్టాను' అని. కిందపడిన ఆ స్వెటర్ తీసుకున్నాడు... అది చాలా వెచ్చగా, మెత్తగా, బాగుంది. వెంటనే ఆ స్వెటర్ వేసుకుని, కోపంగా ఉన్న తన దేవతను శాంతపరచడానికి పడకగదిలోకి వెళ్ళాడు.
భావన కళ్లు తుడుచుకుంటూ మంచం సర్దుతూ, పడుకోవడానికి సిద్ధమవుతోంది. విజయ్ నెమ్మదిగా ఆమె వెనుకకు వెళ్ళి ఆమెను తన రెండు చేతుల్లో బంధించాడు.
విజయ్ (చెవిలో మెల్లగా): "స్వెటర్ చాలా బాగుంది భావన... థాంక్యూ."
భావన (కోపంగా అతన్ని విడిపించుకోవాలని చూస్తూ): "నా దగ్గర నుండి పో విజయ్... నేను నీతో అస్సలు మాట్లాడాలనుకోవడం లేదు. లే అసలు "
విజయ్: "సరే, నన్ను క్షమించు ప్లీజ్ ... నేను కోపంలో ఏదో తప్పు మాట్లాడేసి ఉంటాను."
భావన (కన్నీళ్లతో): "లేదు... నువ్వు నన్ను అస్సలు అర్థం చేసుకోవు. నా ప్రేమను పట్టించుకోవు."
విజయ్ (ఆమెను తన వైపు తిప్పుకుంటూ): "ఏయ్, ఇప్పుడెందుకు అలా అంటున్నావు? నిజంగా నన్ను క్షమించు... నేను అలా అనకుండా ఉండాల్సింది."
భావన (ఏడుస్తూనే): "నీ సారీలు నేను వినదలుచుకోలేదు. పెళ్లి కాకముందే నువ్వు నా మీద ఇలా కోపపడటం మొదలుపెట్టావు, నా పైన అరవడం కూడా మొదలుపెట్టావు... భవిష్యత్తులో నువ్వేం చేస్తావో నాకు అర్థం కావడం లేదు."
అంతే... విజయ్ ఇంకేమీ మాట్లాడలేదు. ఆమె ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని, ఏడుస్తున్న ఆమె పెదవులపై తన పెదవులతో నేరుగా, గాఢంగా ముద్దుపెట్టుకున్నాడు. ఆ ముద్దులో అతని పశ్చాత్తాపం, అంతులేని ప్రేమ ఉన్నాయి.
![[Image: nadikar-kiss.gif]](https://media1.tenor.com/m/1VH2T48wmXoAAAAd/nadikar-kiss.gif)
ఆ ముద్దుతో భావన కోపం పూర్తిగా కరిగిపోయింది. ఆమె ముఖంలో స్పష్టంగా ఆ శాంతం కనిపించింది.
భావన (బుగ్గలు ఎర్రబడుతుండగా): "ఇలాగే కొనసాగితే... నా మీద అరవడం, కొప్పడటం ఆపేస్తావా?"
విజయ్ (నవ్వుతూ): "లేదు భావన... ఇక ఈ అలిగి రాజీపడటం జీవితాంతం కొనసాగుతుంది, దానికి ఇది కేవలం ట్రైలర్ మాత్రమే."
భావన (చిరునవ్వుతో): "అయితే సరే... నన్ను తిట్టాలనుకుంటే తిట్టు... నాకేమీ అభ్యంతరం లేదు, కానీ తర్వాత ఇలాగే ప్రేమగా నన్ను బుజ్జగించి ఒప్పించు విజయ్... నా జీవితాన్ని నీతో ఇలాగే గడపాలనుకుంటున్నాను."
విజయ్ (ఆమె కళ్లలోకి చూస్తూ): "నీ జీవితాన్ని ఇలాగే నా చేతుల్లో గడపాలనుకుంటే, ముందు నా పేరు ఉన్న మంగళసూత్రం నీ మెడలో పడాలి."
ఆ మాట వినగానే భావన ముఖం సిగ్గుతో ఎర్రబడింది.
భావన: "హ్మ్ం నేను కట్టుకుంటాను విజయ్...నువ్వు ఎప్పుడంటే అప్పుడే కట్టుకోవడానికి సిద్ధం."
విజయ్: "చూస్తూ ఉండు భావన, రాబోయే కొన్నేళ్లలో ఈ ఇంట్లో మనకు పుట్టిన ఒకరు ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు మన జీవితం ఎంత బాగుంటుందో కదా!"
పిల్లలు అనగానే భావన ముఖంలో ఉన్న సిగ్గు అదృశ్యమై, అకస్మాత్తుగా వాతావరణం గంభీరంగా మారింది. ఆమె ముఖంలో ఏదో తెలియని ఆందోళన.
విజయ్ (కంగారుగా): "ఏమైంది భావన... ఎందుకలా అయిపోయావు?"
భావన (కన్నీరు తుడుచుకుంటూ, సీరియస్ గా): "విజయ్... నిన్న నా గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నానని అడిగావు కదా... నా గతం గురించి చెప్పమన్నావు కదా?"
విజయ్: "అవును..."
భావన (దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని): "అయితే... నేను నా గురించి నీకు ఒక భయంకరమైన నిజం చెప్పాలి విజయ్... అది విన్నాక కూడా నువ్వు నన్ను ఇలాగే ప్రేమిస్తావో లేదో నాకు తెలియదు."

ఇట్లు,
✿SUNNY ✿
1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?( కొనసాగుతుంది )
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం ( కొనసాగుతుంది )
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం (మొదలు పెట్టాను )

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)