06-07-2019, 01:17 PM
(This post was last modified: 06-07-2019, 05:44 PM by Vikatakavi02. Edited 3 times in total. Edited 3 times in total.)
Episode 118
తన తల్లి అడిగినదానికి ఏమని చెప్పాలో అస్సలు బోధపడటం లేదు సౌమ్యకి.
నిజానికి, అదే ప్రశ్నని ఇప్పటికే తనని తాను చాలాసార్లు వేసుకుంది.
కానీ, సంతృప్తికర సమాధానం ఏమీ దొరకటం లేదామెకు.
తన బిడ్డ మనసులోని సంఘర్షణను గమనించిన ఆ తల్లి —
"చిన్నప్పుడు చంద్రుడిని చూపిస్తూ నీకు గోరు ముద్దలు తినిపించేదాన్ని. 'అమ్మా! చందమామకి ఆ మచ్చేమిటమ్మా?' అని అడిగావు నన్నోసారి. అప్పుడు నేనేం చెప్పానో నీకు జ్ఞాపకముందా?"
సౌమ్య తనకి గుర్తుంది అన్నట్లు తలూపింది. కానీ, ఎందుకు తన తల్లి ఈ విషయం గురించి ఇప్పుడు అడుగుతుందా అన్నది అర్ధంకాక భృకుటి ముడివేస్తూ — "అఁ... మధ్యన కనిపించే మచ్చనే గమనిస్తే, చుట్టూ వున్న వెలుగుని చూడలేం అని.... చెప్పావు," అంది మెల్లగా.
ఆవిడ చిన్నగా నవ్వుతూ తలూపి, "కొన్నిసార్లు మన జీవితంలో ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. సరిగ్గా పదహారేళ్ళ క్రితం మీ నాన్నగారు యుద్ధంలో చనిపోయారన్న వార్త విన్న క్షణాన నిరాశా నిస్పృహలు నన్ను పూర్తిగా కమ్మేసినట్లనిపించింది. అప్పుడు నాకు కనిపించిన ఒకే ఒక్క వెలుగు... నా ఒడిలో పడుకుని వున్న నీ చల్లని చిరునవ్వు! ఏ కల్మషం లేని ఆ నవ్వు ఆనాడు నాలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపింది. నన్ను ముందుకి నడిపించింది. ఇప్పుడిలా మన జీవితాలని బాగు చేసింది.
నిన్న నువ్వు చూపిన పరిణితిని చూసి నాకెంతో గర్వంగా అన్పించింది. ఎన్ని ఆటుపోట్లు వొచ్చినా నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోగలవనే నమ్మకాన్ని నాకు కలిగించింది. కానీ, ఇప్పుడు నిన్ను చూస్తే... మళ్ళా నా ఒడిలో ఆడుకున్న ఆరేళ్ళ పాపాయిలా అనిపిస్తున్నావు!" నవ్వుతూ అందామె.
దాంతో, సౌమ్య కాస్త ఉడుకుమోతుగా మొహం పెట్టి, "అమ్మా!" అంది. ఆ పెద్దావిడ మొహం మరికాస్త విప్పారింది. తన కూతురి చేతిని తన చేతిని తన చేతుల్లోకి తీసుకుని—
"ఒక తల్లిగా... నీ మనసులో నెలకొన్న సందిగ్ధతని నేను అర్ధం చేసుకోగలను." తన చేతిలో వున్న ఉత్తరం వైపు చూస్తూ, "దీని గురించి నేను నీకు ఏమీ చెప్పదలుచుకోవట్లేదు. ఇది నీ జీవితం. ఏ నిర్ణయం అయినా నువ్వే తీసుకోవాలి!" అంటూ మళ్ళా సౌమ్య చేతిలో ఆ వుత్తరాన్ని పెట్టేసింది.
సౌమ్య అయోమయంగా తన తల్లిని చూసింది.
ఆవిడ కొనసాగిస్తూ— "ఒక్క మాట! ఎవరి జీవితమూ తెరిచిన పుస్తకం కాదు. ఎదుర్కొన్న పరిస్థితులను బట్టీ దేనిమీద ఎప్పుడూ ఒక నిర్ణయానికి రాకూడదు. నిష్పక్షపాతంగా తార్కికంగా బాగా ఆలోచించి మనసుకు ఏది మంచిదని తోస్తుందో అదే చెయ్యాలి. ఇదే, అనుభవపూర్వకంగా నేను నేర్చుకున్న జీవన పాఠం! చివరగా... నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, నీకు నేను ఎప్పుడూ తోడుగా వుంటాను," అంటూ మెల్లగా పక్కమీంచి లేచి, "బాగా పొద్దుపోయింది. ఇక పడుకో..." అనేసి ఆమె లోపలికి వెళ్ళిపోయింది.
"నాస్మిన్! త్వరగా రా... ఎగ్జామ్ కి బయలుదేరుదాం!"
బైక్ మీద కూర్చుని కేకేశాడు సామిర్.
"ఇంకా చాలా టైముందిగా...!" అంటూ బయటకొచ్చింది నాస్మిన్.
నిజమే! రోజూకన్నా చాలాముందే రెడీ అయిపోయాడు సామిర్. మరి అతనికి డబుల్ డ్యూటీ వుంది కదా!
"ఎలాగూ సుజాత మనతో రావట్లేదన్నావ్ కదా... ఇంక ఆలస్యమెందుకు చెయ్యటం? నిన్ను ఎగ్జామ్ సెంటర్ లో దింపేసి నా ఫ్రెండ్ రమణ దగ్గరకు వెళ్తాను.!" అంటూ ఆమెను తొందర చెయ్యసాగాడు.
నాస్మిన్ కూడ మంచి మూడ్ లో వుండటంతో, "సరే... సరే... వస్తున్నాను!" అంటూ తన బ్యాగ్ పట్టుకుని బయటకొచ్చింది.
సామిర్ బైక్ స్టార్ట్ చేసాడు. ఆమె అతని వీపుకి అతుక్కుపోయినట్లుగా కూర్చొని "మ్... పద!" అంది.
అప్పుడే, వారి ముందునించి శంకర్ తన బైక్ లో వెళ్ళటం ఆ యిద్దరూ చూశారు. అతని వెనుకే ఓ ప్రక్కకి తిరిగి కూర్చుని వుంది సుజాత!

★★★

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK