06-01-2026, 12:53 PM
దొందూదొందే - సూర్యదేవర వేణుగోపాల్
![[Image: D.jpg]](https://i.ibb.co/twywjz4d/D.jpg)
మొత్తానికి ట్రైన్ టైమ్ కంటే ముందుగానే స్టేషన్ కి చేరాం. రాత్రి నుండి ఒకటే హడావుడి.
నేను నా భార్య , అన్నయ్య, వదిన అమ్మతో కలిసి తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాం. నిజానికి ఇది నా పెళ్లి మొక్కు. నాకు ఎంతకీ పెళ్లి కాకపోవడం తో అమ్మ తిరుపతి కి ముడుపు కట్టింది. దాని తర్వాతే అతి కష్టం మీద ఓ నాలుగు సంబంధాలు దగ్గర దాక వచ్చి జరిపోయిన తర్వాత నిర్మల తో నాకు పెళ్లి జరిగినది. అప్పటికే నాకు ముప్పైనాలుగు ఏళ్లు. ఇక నా పెళ్లి తంతు,
నేను చూసిన సంబంధాలు ఇవన్నీ చెప్పాలంటే ఒక భారతమే అవుతుంది. మొత్తానికి పెళ్లి కుదిరింది. దానితో పాటు మా ఇంట్లో అందరి దిగులు కూడా తీరిపోయింది. పెళ్లి అయిన తొమ్మిది నెలల తర్వాత తిరుపతికి ప్రయాణం కట్టాం. నాతో పాటు నా భార్య, నాకు పిల్లనిచ్చిన మామయ్య నారాయణ, అత్తయ్య శేషమ్మ, ఇంకా మా అమ్మ, అన్నయ్య వదిన అందరం కలిసి ట్రైన్ లో తిరుపతి బయలుదేరాం . ఖర్చు అంతా నాదే. చిన్నపాటి ఉద్యోగం కావడం వల్ల అన్ని సమకూర్చుకోవడానికి తొమ్మిది నెలలు పట్టింది..
ఇంతలో ట్రైన్ ప్లాట్ఫాం మీదకు వచ్చింది. అందరం జాగ్రత్తగా ట్రైన్ ఎక్కి మా బెర్తులు జాగ్రత్తగా సరి చూసుకొని కూర్చున్నాము. ఇంతలో ట్రైన్ కదిలింది..
"వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ మామ గారి నోటికి రెస్ట్ లేదు. ఒకటే వాగుడు . చచ్చిపోతున్నా రా కామేశం. నీ పెళ్ళానికి చెప్పి ఆయన నోరు కాస్త మూయించరా " అంది అమ్మ నాతో చిన్నగా. నిజమే అనిపించింది నాకు
ఇంతలో అన్నయ్య ప్రసాద్ కల్పించుకొని " అమ్మ అన్నది నిజమేరా కాముడు. ఒకటే నస. పోనీ విషయం ఏమైనా ఉందా అంటే ఏమి ఉండదు. అసలు ఏమైనా తెలిస్తే కదా. ప్రతి విషయానికి స్వంత కవిత్వం. భరించలేక పోతున్నాం. అన్నిట్లో జోక్యం చేసుకుంటాడు. కాస్త నోరు మూయించరా " అన్నాడు. వదిన ఏమి అనలేక నవ్వింది.
ఏమి చేయాలో నాకు అస్సలు అర్ధం కాలేదు. ఏమైనా చెబుదామా అంటే ఆ ఫ్యామిలీ మొత్తానికి ఒకటే వాగుడు జబ్బు. నా భార్య నిర్మల ని రోజు భరిస్తున్నగా. ఇంట్లో ఉన్నంత సేపు మన నోటికి పని ఉండదు. అంతా చెవులకే పని. పోనీ ఏమైనా విలువైన విషయాలు మాట్లాడతారా అంటే అది లేదు. ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా.. ఒక విషయం లో నుండి మరో విషయానికి, కోతి ఒక కొమ్మ మీద నుండి మరో కొమ్మకు మారినట్లు జంప్ చేస్తారు. ఎప్పటికో గాని వారు టాపిక్ ని మార్చారు అని అర్ధం గాదు మనకి. నా పెళ్ళాం అచ్చం వాళ్ళ అయ్య నారాయణ పోలికే. వచ్చిన దగ్గర నుండే నేను గమనిస్తున్నా నారాయణ గాడి వాగుడ్ని. విషయం ఏమైన ఉందా అంటే ఏమి ఉండదు. కంట్లో పడిన ప్రతిదీ ఒక టాపిక్ లా మారిపోతుంది. ఇక దానికి చిలవలు పలవలుగా అల్లుతాడు. పోనీ కంఠం ఏమైనా మధురమా అంటే అది లేదు. డబ్బాలో రాళ్ళు వేసినట్లు గా ఒకటే సౌండ్. వాగుడు తగ్గించమని చెబుదామా అంటే పిల్ల నిచ్చిన మామ.
పిల్ల నిచ్చిన మామ కడు స్వతంత్రుడు, ఫాలాక్షుడి తో సమానం కదా|.
పెళ్ళయిన మూడు నెలలకే నా పెళ్ళాం వాగుడు భరించలేక విడాకులు ఇద్దామనుకున్నా, ఇక ఇది పోతే నా ముఖానికి ఏ దిక్కు ఉండదు కనుకఅతి కష్టం మీద భరిస్తున్నా. తండ్రి ,బిడ్డలు ఇద్దరు ఒకే సమయంలో ఒకే ఇంట్లో ఉంటే ఆ ఊరికి దయ్యాలు రావు దొంగలు కూడా రారు. వీళ్ళ వాగుడికి ఎంత పెద్ద దయ్యమైనా పారిపోవల్సిందే.
"మీ నాన్న ను నెమ్మదిగా మాట్లాడమను .. అందరూ మన కేసే చూస్తున్నారు.. ఎదురుగా ఉన్న చిన్న పిల్లలు చూడు ఎలా అయిపోయారో. ఈ వాగుడు ఇలాగే ఉంటే మన మీద కంప్లయింట్ ఇస్తారు " అని చిన్నగా మా ఆవిడ చెవిలో చెప్పాను.
ఏ మూడ్ లో ఉందో మా ఆవిడ నా మాట విని వాళ్ల నాన్నకి చెవిలో ఏదో చెప్పింది. మా మామ సరే లే అని తల ఆడించినట్లుగా నాకు అనిపించింది.
మా ఆవిడ చెప్పిన తరువాత మా మామగారు శ్రీ నారాయణ గారు గొంతుని కాస్త తగ్గించారు. వాగుడయితే ఆపలేదు. నిజానికి మా మామ వాగుడు తగ్గడం అంటే కాటికి పోయినపుడే. అంతలో రాత్రి భోజనం టైమ్ అయ్యింది. అందరం ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న అల్పాహారం తీసుకున్నాం. మా అన్న, అమ్మ ఇక లాభం లేదనుకొని దుప్పటి ముసుగెట్టి నిద్ర కు ఉపక్రమించారు.. నేను కూడా ..
నా భార్య ఫ్యామిలీ మాత్రం వాగుడు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. వీళ్ళ సిగ తరగ పొద్దుటి నుండి వాగితే ఎవరైనా అలసిపోతారు. ఇది రాక్షస జాతిగా|| ఎంత వాగినా అలసిపోరు. రాత్రికి ఇంకా బలమోస్తుంది. ఎందుకంటే రాక్షసులు రాత్రి పూట అధిక బలవంతులు కదా||
మా మామను వూళ్ళో అందరూ CBN అని పిలుస్తారు. CBN అని అడిగితేనే మామ ఇంటి అడ్రస్ చెప్తారు ఆ వూళ్ళో. నారాయణ గారి ఇల్లు అని అడిగితే ఎవ్వరికి తెలీదు. ఇక్కడ మీరో విషయం గమనించాలి CBN అంటే చంద్రబాబు గారు కాదు. అంతటి గొప్పవారితో మా మామకి పోలిక ఎక్కడ. ఇక్కడ CBN అని అంటే "చాటర్ బాక్స్ నారాయణ" అని అర్ధం. ఎప్పుడు వాగుతూనే ఉంటాడు కాబట్టి వూళ్ళో వాళ్ళు చాటర్ బాక్స్ నారాయణ అని ముద్దుగా పిలుస్తారు. నా భార్య కూడా మరో CBN. ఎలా అంటే దాని పేరు నిర్మల, ఇంకా ఆనకట్ట లేని వాక్ ప్రవాహం దాని స్వంతం. అందువల్ల అది జూనియర్ CBN. అంటే చాటర్ బాక్స్ నిర్మల. నేను పూర్వ జన్మ లో రాళ్ళ తో దేవునికి పూజ చేసి ఉంటాను. అందుకే ఈ దిక్కు మాలిన సంత నా పాలిట పడింది.
రైలు చిన్నగా తిరుపతికి చేరింది. ముందుగానే అన్ని ఆన్లైన్ బుకింగ్ ఉండడం వల్ల రూమ్ దొరకడం, స్వామి వారి కళ్యాణం చేయించడం అన్నిసకాలం లో జరిగిపోయాయి. అయ్యా కూతురు మాత్రం తమ వాక్ నైపుణ్యాన్ని చూపుతూనే ఉన్నారు.
"ఇక్కడ దాకా వచ్చాంగా, ఇక్కడ అన్ని చూసుకొని పోదాం రా చిన్నోడా" అని మా అన్నయ్య అడిగేటప్పటికి అందరం ఇంకో రెండు రోజులు ఇక్కడే ఉందాం అనుకున్నాం.
సాయంత్రం అందరమూ డిన్నర్ కోసం హోటల్ కు వెళ్ళాం. అందరం సరదాగా మాట్లాడుతూ ఉన్నాం. మా మామ ఏదో పని మీద బయటకు వెళ్ళాడు. అంతలో
"ఒరే ప్రసాద్ " అనే కేక వినిపించింది. అందరం అటు తిరిగి చూశాం. అంతలో ఒక మనిషి మా దగ్గరకు రావడం మా అన్నయ్య ప్రసాద్ భుజం మీద చేయి వేయడం జరిగింది
"శ్రీను , నువ్వా .. ఎంత కాలం అయిందిరా చూసి " అన్నాడు మా అన్న సంతోషం గా.
మా వైపు తిరిగి..
"వీడు శ్రీనివాస్. నా క్లాస్ మెట్ ఇంకా రూమ్మేట్. ఇద్దరం కలిసి దాదాపు ఉద్యోగం వచ్చేదాకా హైదరాబాద్ లో కలిసి ఉన్నాం. వీడి ని చూసి దాదాపు పదేళ్లయింది." అని చెప్పాడు.
"ఏరా శ్రీను ఏమి చేస్తున్నావ్. ఉద్యోగం రాలేదుగా. పిల్లలు ఎంతమందిరా" చనువుగా అడిగాడు మా అన్న ప్రసాద్.
"చిన్న వ్యాపారం చేస్తున్నాను. కిరాణా అండ్ జనరల్. మేరేజ్ బ్యూరో కూడా ఉంది. నేను మా తోడల్లుడు ప్రభాకర్ కలిసి చేస్తున్నాము. ఒక్కడే బాబు" అని చెప్పాడు. శ్రీనివాస్
అంతలో మా మామ నారాయణ వచ్చాడు. శ్రీనివాస్ ని చూసి కొంచెం తడబాటు పడ్డట్లుగా మాకు అనిపించింది.
"CBN గారు నమస్తే . బాగున్నారా " అడిగాడు మా మామను శ్రీనివాస్.
ఇంతలో మా అన్న కల్పించుకొని ..
" శ్రీను ఆయన మా తమ్ముడు మామ గారు. ఇదిగో మా తమ్ముడు , మా మరదలు " అని మా కేసి చూపించాడు.
"అదా సంగతి. నిర్మల నీకు మరదలా. అయితే ఈ పెళ్లి మేము కుదిరించిందే. మా తోడల్లుడు ప్రభాకర్ మీకు బాగా పరిచయం ఉండే ఉంటుంది. ఈ పెళ్లి కుదిరే సమయంలో ఎక్కువ సార్లు మీ దగ్గరకు వచ్చాడుగా . వేరే పని ఉండడం వల్ల ఈ పెళ్ళికి నేను రాలేదు " అన్నాడు. శ్రీనివాస్
"ప్రభాకర్ మాకు బాగా తెలుసు" అన్నాం నేను మా అన్నయ్య.
శ్రీను ఉండడం వల్ల మా మామ, నా భార్య నిర్మల కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతు న్నట్లుగా నాకు అనిపించింది.
అసలు ఆశ్చర్య మైన విషయం ఏమంటే ఇద్దరు అస్సలు మాట్లాడడం లేదు. ఏదో మంత్రం వేసినట్లుగా మౌనంగా, కొంచెం కంగారుగా ఉన్నారు. ఈ విషయం నేను కొంత టైమ్ తర్వాతే గమనించాను. వీళ్ళకి ఏమైనా అయిందేమోనని కొంచెం కంగారుపడ్డాను . ఎందుకంటే వాళ్ళు మాట్లాడడం ఆపి అప్పటికి 10 నిముషాలు అయ్యింది.
"అంతా బాగానే ఉందా . ఏమైనా ఇబ్బంది ఉందా " అని మా ఆవిడని అడిగాను. అంతా బాగేనే ఉంది . ఇబ్బంది ఏమి లేదని మా ఆవిడ తేల్చిచెప్పింది.
మా మామ నారాయణ శ్రీను ని పక్కకి తీసుకెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు. మాకు ఏమి అర్ధం కాలేదు. మనకెందుకని అందరం మౌనంగా ఉన్నాం.
ఆరోజు మా అందరికీ చాలా హాయిగా ఉంది. జూనియర్, సీనియర్ CBN లు ఇద్దరు మౌనం గా ఏదో ఆలోచన లో ఉన్నారు. నోటివెంట మాట లేదు. కొంచెం కలవరంగా ఉన్నట్లు మాకు అనిపించింది. మా ఆవిడని ఏదైనా ఇబ్బంది ఉందా అని చాలా సార్లు అడిగాను. మా మామ ను కూడా అడిగాను . ఏమి చెప్పలేదు. అంతా బాగానే ఉంది అని బదులిచ్చారు.
ఇంతలో తెల్లారింది. అందరం కాణిపాకం బయలుదేరాం . అందరం బయలుదేరే సమయం లో శ్రీను వచ్చాడు..

ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)