Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - తాతయ్యా నాకు భయం
#41
Nice story
[+] 1 user Likes sri7869's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
ఆ కొందరి వలన - గంగాధర్ వడ్లమన్నాటి
[Image: image-2024-12-19-142503039.png]

జడ్జి గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వంక చూసి “మొదలు పెట్టండి” అన్నారు.
“థాంక్ యు యువరానర్, ఈ ముద్దాయి వంక ఓ సారి పరీక్షగా చూడండి”.
“ఏం, అతనేవన్నా సల్మాన్ ఖానా”.
“కాదు, స్మగ్లర్ మేన్” .
“అలాగా! అయితే మాత్రం అతని ముఖంలో ఏమైనా సాక్ష్యం కనబడుతుందా ఏమిటి! ,నేను అతని ముఖం వంక తీక్షణంగా చూడటానికి. పైగా వీడి మొహం చూసి వీడు నేరం చేసాడో లేదో చెప్పడానికి నాకు ఫేస్ రీడింగ్ కూడా తెలీదు” చెప్పారు జడ్జి గారు
“అది కాదు యువరానర్, ఇతను ఇది వరకు కూడా ఇలాగే నేర చరిత్ర కలిగినవాడు. కొద్ది నెలల క్రితం, ఇతను ఓ జ్యూలరీ షాపులో దొంగతనం చేసిన దొంగ బంగారం, దొంగతనంగా అమ్మబోతుండగా, సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా దొంగల్లా వెళ్ళి ఈ దొంగని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, దొంగ సొమ్ముని పంచుకున్నారు” అని నాలుక కరుచుకుని “అదే పట్టుకున్నారు .అప్పుడు మీరు ఇతనికి మూడు నెలలు జైలు శిక్ష కూడా విధించారు. కానీ దొంగకి దొంగ బుద్దులు ఎక్కడికి పోతాయి ,అందుకే మళ్ళీ సెక్యూరిటీ ఆఫీసర్లకి పట్టుబడ్డాడు”.
ఆ మాటలు విన్న జడ్జిగారు “అంటే, నాడు వీడు చెప్పిన మాటలు విని, వీడు ఓ మంచి గాడిలో పడి మారతాడని నేను కూడా ఎంతో నమ్మాను .కానీ మళ్ళీ ఇలా దొంగతనం చేసి పట్టుబడతాడనుకోలేదు. పప్పీ షేమ్ .ఇంతకీ ఈ సారి ఏం దొంగతనం చేసావ్ చెప్పు” అడిగారు జడ్జిగారు కోపంతో ఊగిపోతూ.
“నేను దొంగతనం చేయలేదండీ”.అమాయకంగా చెప్పాడు ముద్దాయి
“అలాగా” అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వంక చూస్తూ “ఇతను చెప్పింది నిజమేనా” అడిగారు.
“అవును సార్ ఇతను చెప్పింది నిజమే. ఇతను దొంగతనం చేయలేదు. కానీ గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు” చెప్పారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు .
ఆ మాటలు విన్న జడ్జిగారు ఇంకా ఎర్రగా చూస్తూ , “అంటే తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు , దొంగ ముదిరి స్మగ్లర్ అయ్యావన్నమాట. సిగ్గు లేదూ ,అయినా నీ తరపున వాదించడానికి లాయర్ ఎవరూ లేరా” అడిగారు జడ్జి గారు .
ఆ మాట వింటూనే ఆ ముద్దాయి గజ గాజా వణికి పోతూ, “వద్దు మహా ప్రభో వద్దు, నేను ఇక జీవితంలో నా తరపు వాదించడానికి లాయర్ ని పెట్టుకోను గాక పెట్టుకోను.ఈ నేరం నేనే చేశాను .నాకు శిక్ష విధించండి చాలు.ఆనందంగా గడిపేస్తాను. అలా కాదు అంటే, నాదో విన్నపం ” చెప్పాడు బిక్క మొహంతో
“ఏవిటది! .కొంపదీసి నీ కేస్ నువ్వే వాదించుకుంటానంటావా ఏవిటి ఖర్మ” అడిగారు జడ్జిగారు అతని వంక అసహనంగా చూస్తూ.
“అవును సార్, అదే చేస్తాను” చెప్పాడు
“ఏం! ఎందుకలాగా?” .
“ఆ విషయం మీకు తెలియాలంటే, నేను కొంచెం వెనక్కి వెళ్ళాలి”.అంటూ మూడు అడుగులు వెనక్కి వేసి బోను దిగిపోయి, “అది మే మాసం. ఎండలు బాగా మండుతున్నాయి.మావిడి పళ్ళు దొరికే కాలం. ఆవకాయ్ పెట్టుకోవడం కోసం అతివలు ఆబగా ఎదురు చూసే కాలం”. అని ముద్దాయి ఇంకా ఏదో చెప్పేంతలో
“వద్దు, వర్ణనలు వద్దు. సూటిగా చెప్పు చాలు. అలాగే, నీ గతం చెప్పాలంటే నువ్వు వెనక్కి వెళ్లక్కరలేదు.నీ ఆలోచనలు వెళితే చాలు” చెప్పారు జడ్జిగారు
“సారీ సార్”,అని బోనులోకి వచ్చి “ పోయిన సారి, నా దొంగతనం కేస్ వాదించడానికి గాను ఓ లాయర్ ని పెట్టుకున్నాను. అతను అత్యాశతో, నా దగ్గర నుండి కొంచెం కొంచెంగా, మొత్తం నా డబ్బంతా లాగేసాడు.అయినా అతని ఫీజు తీరలేదు.ఇక ఆయన ఫీజు చెల్లించలేక ,అతని హింస భరించలేక, స్మగ్లింగ్ చేసి అతని బాకీ తీర్చేద్దామనుకున్నాను .అది చేస్తూ ఇలా పట్టుబడిపోయాను.ఆ లాయర్ ని ఓ సారి పెట్టుకున్నందుకే దొంగని స్మగ్లర్ ని అయ్యాను .మళ్ళీ ఈ కేస్ కి కూడా మరో లాయర్ ని పెట్టుకుంటే ,ఈ సారి స్మగ్లర్ ని కాస్తా ఖూనీకోరు గా మారిపోవాల్సి రావొచ్చునేమో! .అందుకే నేను లాయర్ ని పెట్టుకోను” చెప్పాడు ముద్దాయి ఏడుపు మొహంతో.
జడ్జి గారు కొంచెం సేపు ఆలోచించి , “ఛ ఛ , ఇలాంటి కొందరి వల్ల, అందరి లాయర్లకీ చెడ్డ పేరు”అనుకున్నాడాయన మనసులో
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#43
Good story
[+] 1 user Likes sri7869's post
Like Reply
#44
ప్రమోద్-పెసరట్టు - వీరేశ్వర రావు మూల
 
[Image: image-2024-12-27-093809400.png]
ప్రమోద్ కి చిన్నప్పటినుండి పెసరట్టు అంటే చాలా ఇష్టం. అందులో నేతి పెసరట్లంటే అవలీల గా పది లాగిస్తాడు. విత్ ఉప్మా ఐతే ఒ ఐదు లాగిస్తాడు. పచ్చి మిర్చి, అల్లం, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వీటితో నేతి తో దోరగా వేయిస్తే ఆరోజు వేరే భోజనం అక్కర్లేదు. పెసరట్ల తో ఉండిపోతాడు. సరే మన ప్రమోద్ కి బ్యాంక్ లో ఉద్యోగం వచ్చి, అమలాపురం ట్రాన్సఫరవడం తో అగ్రహారం లోని మేడ మీద గది అద్దెకు తీసుకున్నాడు. ఇంటి యజమానురాలికి సర్వమంగళ కి ఇలియానా లాంటి మనవరాలు ఉంది. ఇల్లు అద్దెకిచ్చేటప్పుడే ఇంటి యజమానురాలు అన్ని వివరాలు రాబట్టింది. ప్రమోద్ ఒక్కడే కొడుకు. పైగా ఆర్ధిక ఇబ్బందులు లేవు. తణుకు లో ఇంటి స్థలం ఉంది. మాటల సందర్భం లో తెలుసుకుంది ప్రమోద్ కి పెసరట్టు అంటే ఇష్టమని. పెసరట్టు చెయ్యడం లో సర్వమంగళ ది అందే వేసిన చెయ్యి.
ఆ రోజు ఉదయం సర్వ మంగళ మనవరాలు, సరోజ, వయ్యారం గా నడుచుకుంటూ ప్రమోద్ దగ్గరికి పెసరట్టు ప్లేట్ తో వచ్చింది. అది చూసి ప్రమోద్ " నువ్వే చేసావా?" అని అడిగాడు. సరోజ కి తన బామ్మ సర్వ మంగళ మాటలు గుర్తుకొచ్చాయి. "అబ్బాయి అడిగితే నేను చేసాను అని చెప్పు. మా బామ్మ చేసిందని చెప్పకు. తెలిసిందా?" "నేనే చేసాను బాగుందా" అడిగింది సరోజ బొటన వేలితో నేలను రాస్తూ. "అదుర్స్" అలా లవ్ ఎట్ ఫస్ట్ పెసరట్టు అని సరోజ ప్రేమ లో పడిపోయాడు. రోజూ సర్వ మంగళ పెసరట్టు చెయ్యడం, సరోజ ఇవ్వడం, ప్రమోద్ లొట్టలు వేసుకుంటూ తినడం నిరాటంకం గా మూడు నెలల పాటు కొనసాగింది.
"సాఫ్టువేర్ సంబంధం ఉంది. పెళ్ళి చూపులకు రా" ఫోన్ లో చెప్పాడు ప్రమోద్ తండ్రి పరమేశం. "ఎందుకు? ఇక్కడ నాకు నచ్చిన అమ్మాయి దొరికింది" " ఏమిటో ఆ అమ్మాయి స్పెషల్ ?" "పెసరట్టు వేయడం వచ్చు" " ఎక్కడ వేస్తుంది? రోడ్డు పక్కనా?" " కాదు ఇంట్లోనే! ఆ అమ్మాయినే చేసుకుంటా పెళ్ళి " " పెసరట్టు తో ప్రేమ పొలిమేర దాటుతోందా?" " అలాగే అనుకో" " వెధవ పెసరట్టు కోసం తండ్రి నే ఎదురిస్తున్నావు? " ప్రమోద్ మరీ మాట్లాడలేదు. 
 ప్రమోద్, సరోజల పెళ్ళి వైభవం గా జరిగింది. పెసరట్టు తిని తన తొలి రాత్రి జరుపుకున్నాడు. ఆరు నెలలు గడిచాక సర్వమంగళ ఈ లోకాన్నీ వదిలి వెళ్ళి పోయింది. దాంతో సరోజ కీ పిడుగు పడ్డట్టయ్యింది. తన కు పెసరట్టు చెయ్యడం రాదు. ఈ మహానుభావుడికీ పెసరట్టు లేనిదే రోజు గడవదు. తన కొచ్చిన విధం గా పెసరట్టు చేసి మొగుడికి పెట్టింది. "ఏమిటి పెసరట్టు తేడా గా ఉంది?" అడిగాడు ప్రమోద్. " పెసలు తేడా" ఆఫీసు నండి ఫోన్ రావడం తో అర్జంటు గా వెళ్ళి పోయాడు. ప్రమోద్. హమ్మయ గండం గడిచింది అనుకుంది సరోజ.
గతం లో లా పెసరట్టు లేక పోవడం, పెసరట్టు రుచి ఎందుకీలా మారిందో అర్ధం కాలేదు ప్రమోద్ కి. ఓక రోజు మాడిపోయిన పెసరట్టు తెచ్చింది సరోజ. అగ్గిరాముడై పోయాడు ప్రమోద్. "పెళ్ళి కి ముందు బాగుండే పెసరట్లు ఇప్పడెందుకూ ఇలా తగలడ్డాయి?" "పెళ్ళికి ముందు నేను వెయ్యలేదు" "మరి ఎవరు వేసారు?" " మా బామ్మ సర్వ మంగళ" " అలాగ కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మీ బామ్మన్న మాట. తమరు ప్లేట్ తో యాక్టీంగ్ అన్న మాట" సరోజ ఏం మాట్లాడ లేదు. " నాకు విడాకులు కావాలి " అన్నాడు ప్రమోద్. " బాబూ పెళ్ళయి ఆరు నెలలు కాలేదు. ఎందుకో తెలుసు కోవచ్చునా? " అడిగాడు లాయర్ వామనరావు. " నాకు పెసరట్టు అంటే ఇష్టం. నా భార్య కీ చెయ్యడం రాదు. " "పెళ్ళి కి ముందు ఈ విషయం తెలియదా. " జరిగిన విషయం లాయర్ తో చెప్పింది సరోజ. " సర్వ మంగళ గారు గ్రేట్. పెసరట్ తో మంచి కుర్రాడి కీ గాలం వేసింది" "ఆనక ఆవిడని తాపీ గా పొగుడుదురు గాని. నా విడాకుల సంగతి తేల్చండి." " ఉండవయ్యా, నా భార్య కి పెసరట్ చెయ్యడం రాదు. నేను విడాకులు ఇచ్చానా? " అన్నాడు వామనరావు. " మీ కారణాలు మీకుండ వచ్చు విడాకులు ఇవ్వక పోవడానికి" " ఆ ముఖానికి విడాకులు అన్న పదం నా దగ్గర గట్టిగా అనడానికి దమ్ము లేదు. అలాంటిది విడాకులు అవుటాఫ్ కవరేజ్ ఏరియా ", అలా వామన రావు భార్య ఐరావతం సంభాషణ మధ్య లో దూరింది. " పెసరట్ చెయ్యడం రాలేదని కోర్టు విడాకులు ఇవ్వదయ్యా " " నీకు పెసరట్ చెయ్యడం రాదు అంటే మీ బామ్మ నే పెళ్ళి చేసుకునే వాడిని " అన్నాడు ప్రమోద్ సరోజ ని చూస్తూ! సరోజ ఇదో తిక్క మేళం అనుకుంది. " బాబూ నువ్వు ఆఫ్రికా లో లేవు. అమలాపురం లో ఉన్నావు.వయస్సు ఎక్కువ ఉన్న వనితలని వివాహం చేసుకోవడానికి" ప్రమోద్ నాలుక కరుచుకున్నాడు. " ఆరు నెలలు సమయం తీసుకో. ఈ లోగా పెసరట్ వెయ్యడం సరోజ నేర్చుకుంటుంది. ఆ తరువాత చూద్దాం" అన్నాడు వామనరావు. ఆరు నెలలు గడిచాయి. ఆరు నెలలయినా సరోజ కి పెసరట్ వెయ్యడం రాలేదు. ప్రమోద్ వామనరావు దగ్గరికి వెళ్ళ లేదు. ప్రమోదే పెసరట్లు వెయ్యడం నేర్చుకున్నాడు. భార్య కి పెసరట్టు రాక పోయినా ఓర్చుకున్నాడు. సాఫ్ట్ వేర్ అమ్మాయిలు వండుతున్నారా అంతా జొమాటో బ్యాచ్ అని సర్ధుకున్నాడు. ముఖ్యం గా సర్వమంగళ తను చనిపోతూ తన ఆస్తిని సమానంగా సరోజకి, ప్రమోద్ కి చెందేటట్టు విల్లు రాసింది. అందుకే సరోజ మైనస్ పెసరెట్ ని ప్రేమిస్తున్నాడు. "బాబూ పెసరట్టూ, విడాకులు కావాలా నాయనా" పలకరించాడు వామనరావు ప్రమోద్ ని. " అదేమిటీ? సహధర్మ చారిణి ని వదిలి పెట్టడం మన సంప్రదాయమా? నాతి చరామి అని శాస్త్రములు ఘోషించ లేదా?" "ఇప్పుడలాగే అంటావు! సర్వమంగళ సొమ్ము అందింది ఆ విల్లు డ్రాఫ్టీంగ్ నాదే నని నీకు తెలియదు కదా " అని మనస్సు లో నవ్వుకున్నాడు వామనరావు.
END
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#45
బామ్మల తెలివి ఈ నాడు ఎవ్వరికుంది....
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#46
Nice story
[+] 1 user Likes sri7869's post
Like Reply
#47
రాందాస్ ఫార్ములా - వీరేశ్వర రావు మూల
[Image: image-2025-01-03-171241115.png]
అది పరమ్ కనస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ ఆఫీసు లో ఇర వై మంది పనిచేస్తున్నారు. ఆ కంపెనీని పరమ్ పెయిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలుచుకుంటారు. ఆ కంపెనీ లో బాధలు అలా ఉంటాయి మరి. ఫిబ్రవరి, మార్చి ఇంక్రిమెంట్లు టైమ్ కదా అందరూ బాస్ ని ఇంప్రెస్ చేసే పని లో పడ్డారు.
ఎడ్మీన్ ఆనంద్ ఒన్ సైడ్ A4 పేపరు వాడి బాస్ మెప్పు కోసం తాపత్రయ పడుతున్నాడు. ఒక పెన్సిల్ రెండు ముక్కలు చేసి పొదుపు గా చూపిస్తున్నాడు. ఏక్కౌంటు ఆఫీసర్ ఇంటికి వెళ్ళడం మానేసి ఆఫీసు లోనే పడుక్కుంటున్నాడు. టైపిస్ట్ తరళ ఎర్లీ గా వచ్చి లేటు గా వెడుతోంది. డిస్ని స్టార్ లో వచ్చే దిక్కుమాలిన బంధం ఇంకెన్నాళ్ళు సీరియల్ ని కూడా చూడడం త్యాగం చేసింది. అందరూ తమ తమ పరిధి లో హడావిడి చేస్తున్నారు.
 ఒక్క పి ఆర్ ప్రభాకర్ తప్ఫ. ప్రభాకర్ కుదిరితే బాస్ ని కలుస్తాడు. లేక పోతే లేదు. ఉదయం పది గంటలికి వస్తాడు. నాలుగు గంటలికే ఆఫిసు నుండి వెళ్ళి పోతాడు. పి ఆర్ ప్రభాకర్ కి ఈ సారి వెయ్యి రూపాయిలే అని అందరూ గుస గుస లాడుకోసాగారు. వాళ్ళ మాటలు వింటూ ప్రభాకర్ చిరునవ్వు నవ్వేవాడు. రెండు నెలలు గడిచాయి.
హెడ్ ఆఫీస్ నుండి ఇంక్రిమెంట్ కవర్లు వచ్చాయి. ఊహించి నట్టు గొప్పగా ఇంక్రిమెంట్లు రాలేదు. కాని అందరూ ఆశ్చర్య పోయేలా ప్రభాకర్ కి ప్రమోషన్ మరియు ఐదు వేల ఇంక్రిమెంట్ వచ్చింది. ఇది ఏలా సాధ్యమా అని ఎవరికి అంతు పట్ట లేదు. ఏక్కౌంటు ఆఫిసర్ వామనరావు ప్రభాకర్ ని బార్ కి పిలిచి అసలు విషయం రాబట్టడానికి ప్రయత్నించాడు.
" నీకు ప్రమోషన్ రావడం ఆశ్చర్యం గా ఉంది. ఏలా సాధ్యం?"
"హార్డ్ వర్క్" అన్నాడు ప్రభాకర్.
 "అలా కాదు గాని ప్రభాకర్ ఇంకో మాట చెప్పు"
ఎవరికీ చెప్పనని వామనరావు దగ్గర మాట తీసుకుని అసలు విషయం చెప్పాడు.
"ఇటునుంచి కుదరక పోతే అటు నుంచి నరుక్కురమ్మ న్నారు." "మన బాస్ బొక్కా శ్రీనివాస రావు తో అదే చేసాను "
 " ఏం చేసావు?" " రాందాస్ ఫార్ములా" "
కంచర్ల రాందాస్ ఏం చేసాడు?
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నాడు కదా" " అంటే బాస్ భార్య భారతి గారికి దగ్గరయ్యి, ఆవిడ కి డిష్ రిచార్జ్, కుక్కర్ బాగులు, ప్లంబర్ పనులు అన్ని ఈ ప్రభాకర్ చూసుకున్నాడు. " " మీకు అందం తక్కువా? అలా మెనిక్యూర్, పెడిక్యూర్ చేయించుకుని జుట్టుకి రంగేస్తే, ఏ కాలేజ్ లో చదువుతున్నారు అని అడగక పోతే నా పేరు మార్చుకుంటా ". అని చెప్పా. బ్యూటి క్లినిక్ పరిచయం చేసా. భారతి గారికీ కొత్త లోకం చూపించా. భారతి గారు బజారు లో వాళ్ళ అమ్మాయి తో కనబడినప్పుడు " అక్క చెల్లెళ్లా? ". అని అడిగా. దాంతో ఫ్లాటయిపోయింది!.
ఒక్క మాట లో చెప్పాలంటే ఆవిడ లో తల లో నాలుక నయ్యాను. ఇంక్రిమెంట్ లిస్ట్ తయారయ్యాటప్పుడు నా ఎంప్లాయి కోడ్, పేరు ఆవిడకు ఇచ్చా! "లోకాంతరంగుడు శ్రీకాంత నిను గుడి ఏకాంతమున ఏక శయ్యనున్న వేళా నను బ్రోవమని చెప్పవే" అంతే! మిగిలిన కధ నీకూ తెలుసు అన్నాడు. ప్రభాకర్.
ఆశ్చర్యం తో వామన రావుఅలా నోరు తెరుచుకుంటే, బ్లెండర్స్ ప్రైడ్ తో మూసాడు ప్రభాకర్!
END
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#48
Good story
[+] 1 user Likes sri7869's post
Like Reply
#49
రాం దాసు ఫార్ములా బావుంది, ఇకనుంచి ఆఫీసు పని మానేసి, బాసు పనులు చేస్తే పోలా happy happy ....
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#50
చరవాణి తెచ్చిన తంటా - టి. వి. యెల్. గాయత్రి.
[Image: image-2025-01-18-193759686.png]
శ్రీనివాస్ రిటైర్ అయ్యాడు. ఇంట్లోనే ఉండాలి. అయితే తోచదు అన్న బాధలేదు.
చేతిలో సెల్ ఫోన్ ఉంది.
వెధవ ఆఫీసు!.. గవర్నమెంటాఫీసులో ఎదుగు బొదుగులేని ఉద్యోగం చేసి చేసి విసిగిపోయాడు. పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు.
భార్య పద్మజకు ఎప్పుడు పూజలూ,పారాయణాల గొడవ!...
తెల్లవారి లేచి వంట చేసి దేవుడికి నైవేద్యాలు,పెట్టి మేడ మీద మొక్కలు దగ్గరికి వెళుతుంది.
మిద్దె తోట పెంపకం!...అన్ని కూరగాయలూ ఆకుకూరలూ పెంచి,ఇంట్లోకి కొన్ని వాడి,కొన్ని చుట్టుపక్కల వాళ్లకు పంచుతుంది.
ఈ మధ్య బంగాళాదుంపలు కూడా ఇంట్లోనే పండించాలని ఆమె ఆశయం..
ఆమెకు ఆ తోటంటే ప్రాణం!...
ఆ తర్వాత పెరట్లో గోడ దగ్గర చేరి రోజూ గంట సేపు పక్కింటి నీరజతో కబుర్లు చెబుతుంది. ఒంటి గంటకు ఎలాగో కబుర్లు ఆపి భోజనానికి వస్తుంది. భోజనం అయ్యాక కాసేపు నడుంవాల్చటం!... ఆ తర్వాత లేచి కాఫీ తాగి,సాయంత్రానికి ఇద్దరికీ కాస్త టిఫిన్ కలియబెడుతుంది.మేడమీద పూసిన పూలు భక్తిగా మాల కడుతుంది. వాటిని తీసికొని ఠంచనుగా ఐదింటికి వీధి చివర ఉన్న గుడికి వెళుతుంది.
అక్కడ పారాయణాలూ, భజనలూ చేసి వచ్చేసరికి ఎనిమిది అవుతుంది.
శ్రీనివాసుకు భార్య ఒక పల్లెటూరిమొద్దులాగా కనిపిస్తూ ఉంటుంది.పనికిమాలిన భజనలూ,పారాయణాలూను..
అతడికి అరవై ఏళ్లు దాటాయి. అయినా యంగుగా ఆలోచించాలంటాడు.
"అంటే ఏమిటి?" అంది పద్మజ.
"సెల్లుఫోన్ చూడు! ఫేస్ బుక్కు లోకి వెళ్లి జ్ఞానాన్ని సంపాదించుకో! అందరితోపాటు చాట్ చెయ్!జ్ఞానానికి జ్ఞానం కాలక్షేపానికి కాలక్షేపం!మీ అమ్మలక్కల ముచ్చట్లలో ఏముంటుంది? ఎదురింటి వాళ్ళు ఇట్లా!పక్కింటి వాళ్ళుఅట్లా!..అంతే కదా!... ఎప్పుడూ ఆ పాతకాలం వాళ్ళలాగా చాదస్తంగా ఉండకు!కొంత మోడ్రన్ గా ఆలోచించి,కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకో! కొత్త వంటలు నేర్చుకొని ఫేసుబుక్కులో పెట్టు! బోలెడు గుర్తింపు!...నువ్వే చూడు!కొద్ది రోజుల్లో నువ్వొక సెలబ్రిటీవి అయిపోతావ్!"
బోధించాడు శ్రీనివాస్.
"అవన్నీ చేసి మీరు గొప్ప వాళ్ళు అవ్వండి!.. నన్నుమాత్రం వదిలేయండి బాబూ!"అంటూ చేతులు జోడించింది పాతకాలపు భార్యామణి పద్మజ.
శ్రీనివాసుకు పొద్దున లేచింది మొదలు సెల్ ఫోను...గట్టిగా కేక వేస్తే గాని భోజనానికి రాడు..
ఆదరా బాదరా ఇంత తినేసి మళ్ళీ చరవాణి సేవ!..
రోజులు గడుస్తున్నాయి.. మొన్నొక రోజు గార్డెనులో సెల్ ఫోను చేతితో పట్టుకొని చూసుకుంటూ వాకింగ్ చేస్తూ అక్కడున్న చిన్న గుంతని చూడకుండా దానిలో కాలువేసి పడ్డాడు..
వెంట్రుక వాసి ఫ్రాక్చరట!...మూడు వారాలు బెడ్ రెస్ట్...
అయినా మానవుడికి బుద్ధి రాలేదు... బెడ్ మీద ఉండి కూడా సెల్ ఫోన్ తోనే తరిస్తున్నాడు.
ఇంకో ఆరు నెలలు గడిచాయి. ఈ మధ్య శ్రీనివాసుకు కళ్ళ మంటలు మొదలయ్యాయి. 'ఏదోలే!' అనుకొని తెలిసిన మందుల షాపు వాడిని అడిగి ఐ డ్రాప్స్ తెచ్చుకొని వేసుకున్నాడు.
తగ్గలేదు సరికదా కళ్ళు రెండూ నీళ్లు కారటం మొదలుపెట్టాయి.
వస్తువులన్నీ రెండుగా కనిపిస్తున్నాయి..
ఇంక లాభం లేదని కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
అన్ని పరీక్షలు చేశాడా డాక్టర్.
కుర్రవాడు..తన కొడుకంత వయసువాడు.
"అంకుల్ మీ కంటిలో పొర కాస్త మందమైంది..కాటరాక్ట్ ఆపరేషన్ చేయాలి!"అన్నాడు డాక్టర్.
"మా నాన్నకు అసలు కాటరాక్ట్ రాలేదు. ఎనభై ఏళ్లు బ్రతికారు.
మా అమ్మకు కూడా రాలేదు.ఆవిడ ఎనభై మూడేళ్లకు పోయింది. మా ఇంటా వంటా ఎవరికీ కంటి ఆపరేషన్లు లేవు!"అన్నాడు శ్రీనివాస్.
"నిజమే అంకుల్! వాళ్లు సెల్ ఫోను వాడలేదు కదా! సెల్ ఫోను రోజు మొత్తంలో ఇరవై నిమిషాలు మాత్రమే చూడాలి! లేకపోతే మీలాంటి పెద్ద వాళ్ళకి మెడ నొప్పులు, కళ్ల జబ్బులు వస్తాయి! శరీరానికి కదలిక లేకపోవడం వలన షుగరు, దాని వలన కిడ్నీ జబ్బులు,గుండె రోగాలు వస్తాయి!...." ఇంకా చెప్పుకుబోతున్నాడు కుర్ర డాక్టర్.
"ఆపు! ఆపు!"అంటూ గట్టిగా అరిచాడు శ్రీనివాస్.
వెఱ్ఱి భయం వేస్తోంది. ఒళ్ళు జలదరిస్తోంది..
పిల్లలు వచ్చారు. తండ్రి దగ్గర రోజూ కాసేపు కూర్చుని ఉపదేశాలు చేయడం మొదలుపెట్టారు. సెల్ ఫోను చేతికి ఇవ్వటమే లేదు.
కొద్ది రోజుల తర్వాత శ్రీనివాసుకు కంటి ఆపరేషన్ అయింది.
మూడు నెలలు కంటికి రెస్ట్.
అది అయ్యాక శ్రీనివాస్ దినచర్యలో మార్పు వచ్చింది.
పొద్దునే యోగా చేయటం అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత మిద్దె తోట పెంపకం!.. సాయంత్రం పూట పదిమంది టెన్త్ క్లాస్ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ట్యూషనులు చెబుతున్నాడు. ఇంకా టైం మిగిలితే పుస్తకాలు చదువుతున్నాడు. ఇలా సాగుతోంది జీవితం.
భర్తలో వచ్చిన మార్పుకు సంతోషించింది పద్మజ.
సమాప్తం.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#51
Good story
[+] 1 user Likes sri7869's post
Like Reply
#52
మాలావు యుద్ధం - లక్ష్మీ సుజాత
[Image: image-2025-01-25-102640026.png]
చిన్నప్పట్నించి నా స్థూలకాయం మీద నేను యుద్ధం ప్రకటిస్తూనే వున్నా..అలాగే ఓడిపోతూనే వున్నా. ఆ విషయంలో గజనీమహమ్మదే నయం. అసలు చిన్నప్పట్నించీ నేను లావే! పిల్లాడిగా వున్నప్పుడు బొద్దుగా వుంటే అందమే కానీ పెద్దై కాలేజ్లో చేరాక..నన్నందరూ లావుగా వున్నానని వెక్కిరిస్తూ వుండేవారు. అప్పుడు నాలో నేను ఉడుక్కుని లావు మీద యుద్ధం ప్రకటించేవాణ్ణి. ఓ పదిరోజులపాటు విపరీతమైన వాకింగ్ చేసేవాణ్ణి. తర్వాత కాళ్ళ నొప్పులు బద్ధకంతో మానేసేవాణ్ణి.

అలా అలా లావు మీద యుద్ధం ప్రకటిస్తూ..ఓడిపోతూ..చదువు పూర్తి చేసుకుని ఉద్యోగస్తుడినయ్యాను. నా లావు పెళ్ళి సంబంధాల విషయంలో కూడా అడ్డొచ్చింది. కట్నాలు కానుకలూ, జాతకాల తర్వాత ముఖ్యంగా చూసేది ఈడూ జోడు. బక్కగా వున్న అమ్మాయి నా పక్కన పీలగా వుండేది. లావుగా వున్న అమ్మాయి హిడింబిలా భయానకంగా వుండేది. సరే ఎలాగో ఓ మోస్తరు పిల్లతో పెళ్ళయింది.లావు తగ్గి స్లిమ్ గా వుండాలని ఎవరికి మాత్రం వుండదు..కానీ ఎలా?

***

ఒకరోజు నాక్కాస్త కళ్ళు తిరిగాయి. డాక్టర్ కి చూపించుకున్నాను. "మీకు చాలా హై బీపీ వుందండీ! మీరు లావు తగ్గాలి లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్కానీ, హార్ట్ ఎట్టాక్ కానీ, బ్రెయిన్ హేమరేజ్ కానీ, పెరాల్సిస్ స్ట్రోక్లాంటివేవైనా రావచ్చు."అని డాక్టర్ కృష్ణుడిలా మెడికోపదేశం చేశాడు.

దాంతో నా గుండె జారిపోయింది. మళ్ళీ లావు మీద యుద్ధం ప్రకటించాను. ఇంటికొచ్చి నా శ్రీమతితో "చూడు..వాణీ! నేను హఠాత్తుగా లావు తగ్గకపోతే నీ మంగళసూత్రానికి హాని జరిగి నీకు నా ఇన్సురెన్స్ వచ్చేస్తుంది. అంచేత మాంగళ్యం కాపాడుకోవాలంటే ఇంట్లో నూనె వినియోగం, ఉప్పుకారాలు తగ్గించు..లేదంటే వచ్చే ఇన్సురెన్స్ డబ్బు బ్యాంకులో వేసుకుని పొదుపుగా కాలం గడపండి"అన్నాను.

"ఆపండీ..మీ అమంగళపు మాటలు..మీరు కల్పవృక్షం లాంటివాళ్ళు. ఎవరన్నా కల్పవృక్షం కుప్పకూలిపోవాలని చూస్తారా? ఎప్పటికైనా ఇన్సురెన్స్ నాకు రావలసిందే కదా..అప్పటిదాకా ఎదురుచూస్తా..అంతేకాని మిమ్మల్ని పైలోకానికి ఇంత తొందరగా చేరనివ్వను"అంది పదానికి పదానికీ మధ్య చాలా గ్యాపిస్తూ ముఖకవళికలు మారుస్తూ..టీ వీ సీరియల్ లోని పాత్రలా..

ఆరోజు నుంచి నాకు మాత్రం నేచర్ క్యూర్ హాస్పిటల్ లోని ఫుడ్..పిల్లలకీ తనకీ మాత్రం ఆవకాయ, మాగాయ, నూనెలో తేరట్లాడే వడియాలు, వేపుళ్ళూ..రుచికరమైన వంటకాలు. నాకు ఆ గడ్డి తినాలంటే బాధగానే వుంది..కానీ ఏం చేస్తాం? ‘నేను త్వరలోనే స్లిమ్ అవడం ఖాయం..నా పర్సనాలిటీతో అందమైన అమ్మాయిలకి లైనేస్తే అప్పుడు తెలుస్తుంది దానికి’ కసిగా మనసులో అనుకున్నాను(ఎందుకో?).విధి ఎలాంటిదంటే..సరిగ్గా అప్పుడే..పెళ్ళిళ్ళు శుభకార్యాలకి చాలా ఆహ్వానాలందుకున్నాం. ఆ కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఆకర్షించేవి ఆహారపదార్ధాలే..ముక్కుపుటాలదరగొట్టే ఘుమఘుమలే! నిజానికి ‘పేరు దేవుడిది..నైవేద్యం మనకీ’ లాగా..శుభకార్యాలకి వెళ్లేది కమ్మటి పదార్ధాలు తినడానికే కదా! నన్ను నేను వాటిదగ్గరకి వెళ్ళకుండా కట్టేసుకోవడానికి..నాలికని మడతేసుకుని నోటిలో మూసేయ్యడానికి మహా కష్టపడాల్సొచ్చింది. పైగా "ఏమిటండీ..మీరేం తినట్లేదు" అని ఎవరన్నా అంటే "మా ఆయన స్ట్రిక్ట్ డైటింగ్ లో వున్నాడు. టెంప్ట్ చేయకండి.. అయినా ఆయన అవడనుకోండి..ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అంతే ఆయన!" అని పదిమందిలో కితాబిచ్చేది మా ఆవిడ. అలా ఇన్ స్ట్రక్షన్ ఇచ్చింది నేనే, కాకపోతే..మనసులో ఏమిటో తెలియని బాధ సుళ్ళు తిరిగేది. అందరూ సుఖ పడుతుంటే నేనొక్కడినే వెలివేయబడినట్టు అనిపించేది.

ఒక పెళ్ళిలో..అక్కడి పదార్ధాలు నా కట్లు తెంపేశాయి. గట్టుదాటిన వరదలా..పొలంగట్టు దాటిన దున్నలా పదార్ధాల మీద పడిపోయాను. వీటినా? ఇన్నాళ్ళూ వదిలి..ఋషిపుంగవుడిలా ఆకులూ అలములూ తింటూ తిరిగింది?..కాకిలా కలకాలం బ్రతికేకన్నా..హంసలా కొద్దికాలం బ్రతికినా చాలు (ఈ సామెత ఇక్కడ వర్తిస్తుందో లేదో అప్రస్తుతం) అనుకుని నన్ను నేను సమాధానపరచుకున్నాను. మా ఆవిడా పిల్లలు వింతగా..విడ్డూరంగా చూస్తున్నారు. "ఏంట్రా అలా చూస్తున్నారు?"కోపంగా ప్రశ్నించాను.

"డాడీ..నువ్వు ఇన్నాళ్ళూ మానేసినదంతా ఇవాళే తినేశావు"అన్నాడు మా రెండోవాడు.

నిజమే..ఇన్నాళ్ళ డైటింగ్ తో..కొద్దిగా లోపలికి వెళ్ళిన పొట్ట..ఇప్పుడు పేద్ద బెలూన్లా ఉబ్బింది.

"సర్లే..సర్లే"అని ఇంటికి బయల్దేరాను. ఆరోజుతో డైటింగ్ సరి.

ఆతర్వాత పక్కవాటాలోకి పరమేశం ఫ్యామిలీ దిగింది.

అందులో కొట్టొచ్చినట్టు కనబడింది పరమేశం. నా బరువు మహా అయితే ఓ వంద కే జీలుంటుంది..కానీ పరమేశం నూటేభైకి తక్కువుండడు.నేనతనితో పరిచయం పెంచుకుని "ఏవండీ..మన లావు చూశారుగా! అందరూ దిష్టి కొట్టడానికి తప్ప దీనితో ఏముపయోగం? పైగా మనమీద పగబట్టినట్టు రోగాలు అదనుకోసం ఎదురుచూస్తుంటాయి. డాక్టర్లకయితే పండగే..అంచేత మనం ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేద్దాం. ఒకరికొకరం అయితే టైం టేబుల్ తప్పం."అన్నాను.

"నేనూ కంపెనీకోసమే చూస్తున్నానండీ..తప్పకుండా చేద్దాం" అన్నాడు. నిజానికి నాకు కుక్కలంటే భయం. అందుకనే ఇన్నాళ్ళూ తోడు కోసం చూశాను. లక్కీగా దొరికాడీయన.

మరుసటిరోజు మూడు గంటలకి లేచి ట్రాక్ సూట్ లో సిద్ధంగా వున్నాను. నాలుగింటికి ఆయన తలుపు తట్టాడు.

"నేను మూడు గంటలకే లేచి ప్రిపేరయి ఉన్నానండీ" నేనెంత డిటర్మినెంటో తెలియజేసాను.

ఇద్దరం వారం పాటూ క్రమం తప్పకుండా చేశాం. ఎనిమిదో రోజు ఆయన వచ్చి మా తలుపు తట్టలేదు. నేనే పదినిముషాలు చూసి వాళ్ళ తలుపు తట్టాను. ఆయన విసుగ్గా బయటకొచ్చి"నేను రాత్రి ఆఫీసునుండి బాగా ఆలస్యంగా వచ్చాను. నిద్ర సరిపోలేదు అంచేత మీరెళ్ళోచ్చేయండి"అని ముఖంమీదే తలుపేసేసాడు.

‘పోన్లే..ఒక్క రోజు వెళ్ళకపోతే ఏమవుతుంది’ అనుకుని లోపలికొచ్చి మంచంమీద వాలిపోయాను. మా ఆవిడెందుకో నిద్రలో నవ్వినట్టనిపించింది.

అలా ఆ వాకింగ్ కాశీకెళ్ళిపోయింది.

ఆ తర్వాత జిమ్..వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్..స్లిమ్ క్యాప్సూల్స్..సైక్లింగ్..వాట్ నాట్ ఎన్ని ప్రయోగాలు చేసినా ఇంచ్ కూడా తగ్గలేదు. వెయిట్ లో ఒక్క గ్రామ్ తేడాలేదు.

‘ఓడిపోయాను..లావుతో చేసిన యుద్ధంలో ఓడిపోయాను. సైంటిస్ట్ లు ఇన్నన్ని కనుక్కుంటుంటారు..ఎయిడ్స్ ..క్యాన్సర్ మహమ్మారుల్ని రూపుమాపడానికి కంకణం కట్టుకుంటారు కాని..అమాంతం లావుని తగ్గించే ఒక చిన్న ట్యాబ్లెట్ కనుక్కోలేకపోతున్నారు! అసలు అలాంటి రోజోకటి వస్తుందా?’ మా ఆవిడందించిన చిక్కటి కాఫీ తాగుతూ...పొట్టనిమురుకుంటూ బాధగా అనుకున్నాను.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#53
Nice story
[+] 1 user Likes sri7869's post
Like Reply
#54
రమణారావూ-రాశిఫలాలూ - ఆదూరి.శ్రీనివాసరావు
 
[Image: image-2025-02-03-125022495.png]
" రా వదినా! రా! చాలాకాలమైంది నిన్నుచూసి " అని ఆహ్వానించింది ధనలక్ష్మి తన వదిన ధనలక్ష్మిని కూర్చీ చూపుతూ ఆప్యాయంగా.

" ఏమే ధనలక్ష్మీ! మీ ఆయన ఆఫీసుకు దారిమార్చి వెళుతున్నాడేమిటి ? మావీధివైపు రావటమే లేదు?" అంది కూర్చుంటూ వరలక్ష్మి.

" ఏంలేదు వదినా! ఆయన ఈమధ్య రోజూ రాశిఫలాలు టీ.వీ.లో విని మరీ ఆఫీసుకువెళుతున్నాడు. వృషభరాశి వారు ఉత్తరం వైపునుంచీ పోవాలనీ , అది మంచిదనీ అటువైపునుండీ ఆఫీసుకు వెళుతున్నాడు." అంది ధనలక్ష్మి.

"అదేమిటే! మరీ చోద్యంగా ఉందీ! అలావెళితే ఆఫీసుకు దూర మవట్లేదుటే ! " అంది ఆశ్చర్యం ఒలకబోస్తూ వరలక్ష్మి.

"ఏమచెప్పను వదినా! ఆయనకీ మధ్య చాదస్తం ఎక్కువై పోయింది . ఈరాశిఫలాల వారు ‘మీకు ఈరోజు ప్రయాణం లాభదా యకం ‘అన్న రోజుమాత్రమే క్యాంపు కెళుతున్నారు.!’ ఆకుపచ్చరంగు ధరిస్తే మంచిది’ అనగానే లేక పోయినా ఆకుపచ్చ షర్టు కొని మరీ వేసుకెళు తున్నారు. ‘ఆంజనేయస్వామికి అప్పాలునైవేద్యం చేస్తే మంచి దంటే ‘ ఆరోజు నాచేత అప్పాలు చేయించి , అప్పాలు ఎక్కువ అన్నం తక్కువ గా తింటున్నారు. ఒకరోజు గణపతిపూజ, మరోక రోజు ఉమాపతి, ఇంకోరోజు రమా పతి, ఆరాశివారికి ఆరోజు ఏది మంచిదని చెప్తారో ఆ పూలు పండ్లతో పూజ చేస్తున్నారు.’ ధన లాభం ‘ అని చెప్పిన నాడు ధనలక్ష్మిని, నన్నుకాదులే వదినా[ అంటూ సిగ్గుల మొగ్గై] వర్షం కురవ టానికి వరలక్ష్మినీ, నిన్నుకాదులే వదినా! ఆదేవతను పూజ చేస్తున్నాడు. పూజా మందిరంలో రోజు కొక ఫోటో మారుస్తున్నాడు . వినాయకునికి ఉండ్రాళ్ళు చేయాలి. సుభ్రహ్మణ్య స్వామికి సున్నుండలు, పరమశివునికి పాయసం, అనంతపద్మనాభునికి అరిసెలు, అన్నపూర్ణా దేవికి ఆవడ లు,! వేపుకు తినున్నాడనుకో!నిజానికి పూజకు ఒకదేవుడు చాలడా వదినా?చెప్పు. కొండంత దేవునికి కొండంత పత్రి పెట్ట గల మా!. దేవుళ్ళంతా ఒక్కటే కదా! " అంటూ తన బాధనంతా వెళ్ళబోసుకుంది , తన వదినతో ధనలక్ష్మి.

" అదేంటే మరీ విడ్డూరంగా ఉంది. ఇట్లా చేస్తూ పోతే ఎంత డబ్బు ఖర్చవుతుందోకదా! " అంటూ సానుభూతి వ్యక్త పరిచింది వరలక్ష్మి.

" మొన్నమొన్న టీ.వీ.లో ఎవరో ఒకామె " ఏమండీ బావున్నారా ! " అంటూ తన ప్రోగ్రాం లో మాటలు మొదలెట్టగానే తననే అనుకుని పొంగిపోయాడు.'ఆహా ! ఏమి ప్రేమ! ఎంత అభిమానం అంటూ’ ఆమె చెప్పిన అడ్రెస్సుకు, ఒకరుద్రాక్ష ఆర్డరిచ్చాడు , అది మెడలో వేసు కుంటే ఉన్నత శిఖరాలను అందుకోవచ్చుట! చేతికి శనిదేవుని కంకణం , మెడ లో మేలిరత్నం తగిలించుకుని తిరుగుతున్నాడు. ఏమి టీ.వీ లో కానీ ఇప్పుడు కాస్సేపు ప్రకటనలు అంటూ , సబ్బుల నుండీ , సాంబారుపొడి వరకూ, చర్మ సౌందర్యానికి చల్లాయి సబ్బులూ, కోమల దేహానికి కొల్లాయి క్రీములూ, పులిపిరి కాయ లకు పుల్లాయి పౌడర్లూ ... చస్తున్నా వినలేక, కనలేక. పూటకో సెంటూ గంటకో డ్రెస్సూ రోజు కో సబ్బూ మాఆయన మారుస్తున్నాడు. ఉన్నడబ్బంతా హూష్ కాకీ అవు తున్నది. ‘అదేమిటండీ!’ అంటే, నీకెందుకూ? ’ లక్ష్మీ లాకెట్ పుచ్చుకో ధనలక్ష్మీని తెచ్చుకో!’నిన్నుకాదులే వదినా! , అంటూ నాకూ ఓలాకెట్ తెప్పించి ఇచ్చారు. ఇదమ్మా మా ఆయన భాగోతం! మీ తమ్ముడితో వేగలేక చస్తున్నానుకో! " అంటూ వాపోయింది పాపం ధనలక్ష్మి.
 " అదా సంగతి! అందుకనా? ’ రమణా రావు ‘అనే పేరును మార్చి’ రావురమణ ‘ అంటే కలిసి వస్తుందనేనా నేం ప్లేట్ మార్చింది? " అంటూ తన ఆశ్చర్యాన్ని వెలిబుచ్చింది వరలక్ష్మి నేం ప్లేట్ వైపు చూస్తూ..
ఇంతలో వరలక్ష్మి చేతిలో చరవాణి ' ఏమే రాకాసీ ఏమే నీవెక్కడున్నా చాటుకు పోవే చాటుకుపోవే!!' అనే కొత్తరింగ్టోన్ తో మోగసాగింది.ధనలక్ష్మీఆశ్చర్యంగా" అదేంటి వదినా ! ఈ కొత్తపాట ఎక్కడావినలేదే!"అంది బుగ్గలునొక్కుకుంటూనూ.
"అయ్యో! వదినా! ఎందుకు అడుగుతావ్లే! ఇప్పటిదాకా నీ బాధ చెప్పావ్ , నా అగచాట్లు చెప్తే తీరేవికాదు , అనుభవించి తీరా ల్సిందేనమ్మా! అందుకే నీకుచెప్పనే లేదు! మాఆయనకూ ఓ పిచ్చి పట్టుకుంది.నాతో నేరుగా మాట్లాడకూడదని , నాముఖం చూసి అస్సలు మాట్లాడకూడదనీ , నాకు ఆయుష్షీణమనీ, నన్నుపేరుతో పిలవరాదనీ ఏజ్యోతిష్కుడో చెప్పాట్ట, అందుకని ఇంట్లో ఉన్నా పక్క గదిలోకి వెళ్ళి ఇలా చరవాణిలో మాట్లాడుతారు. అన్నం వడ్డించేప్పుడూ, ముఖానికి ముసు గేసుకో మంటాడు , టిఫిన్ టేబుల్ మీద పెట్టి నెనౌ పక్కకెలీతే కానీ వచ్చితినడు. తలవంచుకుని ఫోన్ లోనే వద్దనీ , కావాలనీ చెప్తారు. అందుకే ఏనాడూ లేంది నేను ఈ చరవాణిలో మాట్లాడను చెవులకు లోలాక్కులు తీసేసి చెవిలో వైర్లుపెట్టుకుని , మెడలో తాళిబొట్టుతోపాటుగా ఒక త్రాటికి ఈ ఫోన్ వ్రేలడదీసుకుని ఊరేగుతున్నాను , మా ఆయనకంటే మీఆయనే నయం , రోలొచ్చి మద్దేలకు మొరపెట్టుకున్నట్లుంది వదినా! మాఆయన ఒక్కమారు రింగిస్తే ఆఫీస్ నుంచీ బయల్దేరుతున్నట్లు, రెండోమారు రింగిస్తే పదినిముషాల్లో ఇంటికి వస్తున్నట్లు , చూచనన్నమాట! నేరుగా నాముఖం చూడడు. రాత్రులు లైట్స్ ఆపేశాకే పడగ్గదిలో కెళ్ళాలి నేను. ముందుతాను వెళ్ళి అప్పుడు రింగిస్తాడు.నేను రింగ్ విని సమాధానమిస్తే లైట్లార్పుతాడు. ఆతర్వాతే నేను గదిలో కెల్ళాలన్నమాట! ఎవరైనా వింటే నవ్విపోరూ వదినా!నా యాతన ఎవరికి చెప్పుకోను! ఏ టెల్ వాడో టెక్ వాడో తన కంపెనీ రీచార్జ్ పెంచుకోను ఈమాటఏజ్యోతిష్కుడిచేతో చెప్పించి ఉంటే మాఆయనలాంటి చాదస్తులు నమ్మిఆచరిస్తుంటారల్లేఉంది వదినా! ఇహవస్తాను రెండో రింగ్ వేల్టికి వెళ్ళి తలుపుతీసి చాటుకెళితేనే ఇంట్లో అడుగుపెడతారు ! నాముఖం చూసి నెల్నాళ్ళైంది వదినా!"అంటూ ముక్కుచీదుకుంటూ గుమ్మందాటింది వరలక్ష్మి .
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#55
తిండి పిచ్చి
[font=var(--ricos-font-family,unset)][Image: image-2025-02-09-073052339.png][/font]

రచన : జీడిగుంట శ్రీనివాసరావు



అర్ధరాత్రి.. జోరున వర్షము. అంత వర్షం లో కూడా, విసుగులేని విక్రమార్కుడు భేతాళుడిని భుజాన వేసుకుని నడుస్తున్నాడు.



భుజం మీద వున్న భేతాళుడు రాజా! రాబోయే కాలం లో జరిగే సంఘటన ఒకటి వినిపిస్తాను, విని నా సందేహం తీర్చు అని కథ చెప్పడం మొదలుపెట్టాడు.



అది ఒక నగరం. నగరంలో సీతారామయ్య, మహాలక్ష్మి దంపతులు వారి స్వంత యింటిలో సగభాగం అద్దెకు యిచ్చి, మిగిలిన సగభాగం లో వీళ్ళు వుంటున్నారు అన్నాడు భేతాళుడు.
ఆగవయ్య భేతాళా, రాబోయే కాలం లో జరిగే కథని నువ్వు చెప్పటం కంటే, నాకు కనిపించేడట్లు చేస్తే నాకు బాగా అర్ధం అవుతుంది, నీ సందేహం తీర్చగలను, నువ్వు యిప్పుడు నా భుజం మీద ఒక కునుకు తీయవచ్చు అన్నాడు విక్రమార్కుడు.



సరే అయితే నువ్వే చూడు అన్నాడు భేతాళుడు.
***
యిదిగో! ఏమిటి భుజం మీద భేతాళుడిని మోసుకుని వస్తున్నట్టు బూడిద గుమ్మడి కాయ? వేసవి కాలం వస్తే చాలు, బూడిదగుమ్మడి కాయ ని పట్టుకుని తయారు అవుతారు. నా వల్ల కాదు తరగడం, వడియాలు పెట్టడం అంది మహాలక్ష్మి.



ప్రతీదానికి ఎందుకు కంగారు పడతావు, వడియాలు, అప్పడాలు లేని ఇల్లూ ఒక ఇల్లే..? యిప్పుడు పెట్టుకున్న వడియాలు రేపు వానాకాలం లో కూరగాయలు తెచ్చుకోలేకపోయినా, ఉపయోగం పడతాయి అన్నాడు గుమ్మడి కాయని టేబుల్ మీద పెట్టి ఆయాసపడుతో.



ఎలాగో మీ వదినగారు పెడుతుంది కదా, వాళ్ళ పిల్లలకి అమెరికా పంపించడానికి, మీరు నాలుగు వడియాలు అడిగి తెచ్చుకుంటే సరిపోతుంది అంది.



చాల్లే! క్రిందటి ఏడాది అడిగితే యిస్తాను రమ్మని, నా చేత ఏనుగు లాంటి బూడిదగుమ్మడి కాయ తరిగించింది. యిదిగో అప్పుడు తెగిన వేళ్లు ఎలా మచ్చలు పడ్డాయో అన్నాడు చేతికి అంటిన బూడిద తుడుచుకుంటూ.



అయితే మినప్పప్పు నానాపెడతాను, మీరు గుమ్మడి కాయ తరిగి ఇవ్వండి అంది.



ఈసారి తెగితే ఏకలవ్యుడు అవుతానేమోనే అన్నాడు తప్పించుకోవడానికి.



అదేమి కుదరదు. వడియాలు కావాలంటే, ముక్కలు తరగండి. లేదంటే యింటి ముందు గుమ్మం కి కట్టండి. దిష్టి తగ్గుతుంది. మనమేదో ఇల్లు అద్దెకు యిచ్చి బాగుపడి పోతున్నామని కొందరు అనుకుంటున్నారు అంది.



చాల్లే, చచ్చి చెడి మోసుకుని వస్తే, గుమ్మం కి కట్టమంటావా, అయినా నువ్వు వున్నావుగా గుమ్మడి కాయాలా.. ఇంటికి యింకా దిష్టి ఎక్కడ వుంటుంది? అన్నాడు సీతారామయ్య.



అవును, మీరు తెచ్చిపెట్టిన జీడిపప్పులు తిని యిలా లావు అయ్యాను. సోద్యం కాకపోతే పండగనాడు పరవన్నాం లోకి జీడిపప్పు తెమ్మంటే, పెరటి లోని బాదంపప్పు తెచ్చారు. నాకు యింకా గుర్తువుంది మీ పిసినారితనం అని దులపరించింది భర్తని.



లంచ్ అయిన తరువాత ఒక కునుకుతీసి, లేచి కత్తిపిట తీసుకొని గుమ్మడి కాయ మొత్తం తరిగి, యివిగో ముక్కలు.  చాలా పని, లేదంటే పిండి కూడా రుబ్బాలా అన్నాడు సీతారామయ్య.
అక్కర్లేదు. రేపు ఉదయమే నేను రుబ్బి అంతా తయారుచేసి యిస్తాను. నలుగురు లేచి చూసేలోపు మేడమీదకి వెళ్లి వడియాలు పెట్టేసుకుని రండి అంది మహాలక్ష్మి.



నీ చీర కూడా ఒకటి యివ్వు, కట్టుకుని వడియాలు పెడతాను. వెధవది నోరు కట్టుకోలేక వడియాలు పెట్టమన్నందుకు శాస్తి బాగా జరిగింది అన్నాడు.
***
చూస్తున్నావా.. అన్న భేతాళుడి ప్రశ్నకి, చూస్తున్నా మొగుడు పెళ్ళాలా గొడవ, మా రాణి గారే నయ్యం అన్నాడు. 



సరే చూడు అని నిద్రలోకి వెళ్ళిపోయాడు భేతాళుడు.
***
తెల్లవారిజామున మహాలక్ష్మి సీతారామయ్యలు లేచి మేడమీద వడియాలు పెట్టేసారు. సాయంత్రం సీతారామయ్య మెల్లగా మేడమీదకి వెళ్లి నాలుగు ఎండి ఎండని వడియాలు వలుచుకుని వద్దామని చూస్తే, అప్పటికే ఎవ్వరో ఆరు వడియాలు పీకేసి తీసుకుని పోయారు. బహుశా తనకంటే ముందుగానే తన భార్య తీసుకొని వచ్చి వుంటుంది అనుకుని మేడ దిగి వచ్చి భార్య ని ఆడిగాడు, నువ్వు ఏమైనా కొన్ని వడియాలు తీసుకుని వచ్చావా అని. 



ఉదయం వంగి వడియాలు పెట్టేసరికి నడుం విరిగి కదలకుండా పడున్నాను, యింకా మేడమీదకి ఏం వెళ్తాను అంది.



అయితే కాకులు ఆరు వడియాలు ఎత్తుకుపోయాయి అన్నాడు. 



ఇప్పటికైనా లోపలికి తీసుకుని వచ్చారా, కాకుల కోసం అక్కడే వుంచారా అంది. 



తెచ్చి పైన గదిలో పెట్టాను. రేపు మళ్ళీ ఎండపెట్టినప్పుడు అక్కడే నీడలో కూర్చొని చూస్తా, కాకి ఎలా వస్తుందో అన్నాడు.



రెండో రోజు ఉదయం నుంచి మేడమీదనే వుండి వడియాలకి కాపలా వున్నాడు. 
అన్నం తినటానికి రండి, ఎండలో పక్షులు రావు అని భార్య పిలుపు క్రిందకి దిగి వెళ్లి భోజనం చేసి మళ్ళీ పైకి వెళ్లి చూస్తే, సగం వడియాలు లేవు. 



కొంపములిగింది, మళ్ళీ వడియాలు పోయాయి అన్నాడు పైనుండి.



మిగిలినవి క్రిందకు తీసుకుని రండి, రేపు మన గుమ్మం ముందు వచ్చే ఎండలో ఎండపెడదాం, కాకులు వస్తే కాళ్ళు విరగకొడతాను అంది మహాలక్ష్మి.



రెండవ రోజు తన మడి బట్ట ఆరవేసుకోవడానికి మేడమీద కి వెళ్ళిన సీతారామయ్య కి అద్దికున్న వాళ్ళు పెద్ద బట్ట మీద చాలా వడియాలు పెట్టుకుని వుండటం కనిపించింది. పాపం వీళ్ళ వడియాలు కూడా ఉష్ కాకి అనుకున్నాడు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#56
వెళ్లి వాళ్ళని హెచ్చరించుదామానుకుని, మావి పోలేదా, వాళ్ళవి పోతే నాకెందుకు అనుకుని  వచ్చి, పక్కన అద్దికున్న వాళ్ళు కూడా వడియాలు పెట్టుకున్నారోయ్ అన్నాడు భార్య తో.
రోజు సాయంత్రం మేడమీదకి వెళ్లి చూసేవాడు సీతారామయ్య, వాళ్ళ వడియాలు కాకులు ఎత్తుకువెళ్ళయో లేదో అని. పెట్టిన వడియాలు పెట్టినట్టు వుండేవి. భార్య కి చెప్పి, బహుశా వాళ్ళు కారం ఎక్కువ వేసుకొని వుంటారు, నువ్వు వేయమంటే మీకు బీపీ అని చెప్పి నడిచప్పిడి గా చేసావు అన్నాడు సీతారామయ్య.



నాలుగు రోజుల తరువాత, అద్దెకున్న వాటలోని మూర్తిగారు చేతిలో ఒక పొట్లంతో వచ్చి, టేబుల్ మీద పెట్టాడు. 



ఏమిటి మూర్తి గారు పొట్లం అన్నాడు సీతారామయ్య.



ముందు మీరు నన్ను క్షమించాలి, మీరు బూడిదగుమ్మడి కాయ కొనడం చూసి, నేను కూడా బూడిదగుమ్మడి కాయ కొని మా ఆవిడ కిచ్చి వడియాలు పెట్టమని చెప్పాను. అయితే అందరు భార్యలు అనే విధంగానే తను కూడా నడుం నొప్పి, వడియాలు పెట్టలేను అంది. దానికి మా మహాలక్ష్మి అక్కయ్య గారు వడియాలు పెడుతున్నారు, మనకి కూడా పెట్టి యిమ్మంటాను, నీకు రాదు అని చెప్పి అడుగుతాను అన్నాను.



తరువాత కాయ విషయం, వడియాలు విషయం మర్చిపోయాను. నాలుగు రోజుల క్రితం సాయంత్రం మేడమీదకి వెళ్ళినప్పుడు వడియాలు చూసి, అరే పాపం.. నేను పెట్టలేను అని వడియాలు పెట్టేసింది అనుకుని, పచ్చి వడియాలు వేయించుకుని తింటే బాగుంటాయి అని కొన్ని వడియాలు తీసుకుని వేయించుకుని తిన్నాను. 



అయితే అప్పుడు మా ఆవిడ తాంబూలం తీసుకోవడానికి పక్క వీధిలో కి వెళ్లడం తో తనకి విషయం తెలియదు.



రుచి మరిగిన నోరు వూరుకోదు అని, మర్నాడు కూడా కొన్ని వడియాలు తీసుకుని నా భార్యకిచ్చి వేయించమన్నాను.



 తను వడియాలు ఎవ్వరు యిచ్చారని అడిగితే, నువ్వు పెట్టావుగా అన్నాను. 



అయ్యే రాత, అటు చూడండి టేబుల్ క్రింద అంది. 



మా బూడిదగుమ్మడి కాయ ముసముసి నవ్వులు నవ్వుతు కనిపించింది.  అయితే వడియాలు మన యింటి యజమాని గారివి అన్నమాట, కొంపములిగింది అనుకుని, అప్పటికప్పుడు మా ఆవిడ చేత వడియాలు పెట్టించి, ఎండిన తరువాత యిప్పుడు కొన్ని మీకు తీసుకొని వచ్చాను. నా పొరపాటు కి క్షమించండి అన్నాడు మూర్తి.



మేము కాకులు ఎత్తుకుపోయాయి అనుకున్నాము. తెలియక చేసినదానికి క్షమించడం లాంటి పెద్ద మాటలు ఎందుకు మూర్తి గారు అన్నాడు.
***
ఆగు, కథ బాగుంది కదా అని చూసేస్తున్నావు, అసలు వడియాలు ఎవరు కనిపెట్టారు, వాటిని ఏమి చేసుకుంటారో చెప్పు, జవాబు తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు ఆవలిస్తో భేతాళుడు.



నిజానికి విక్రమార్కుడుకి కథలో  ఎందుకు వాళ్ళు కంగారు పడుతున్నారో, వడియాలు ఏమిటో, ఎండపెట్టడం ఏమిటో ఒక్క ముక్క అర్ధం కాలేదు. తనకి రాజకుమారులు వేటకు వెళ్లి చేపలు ఎండపెడతారని తెలుసు అంతే అనుకుని మాట్లాడకుండా వున్నాడు.



ఏదో ఒక జవాబు చెప్పవయ్యా రాజా, నేను త్వరగా చెట్టు మీదకి ఎగరాలి అన్నాడు భేతాళుడు.



కాలం గడిచి అడివిలో నుంచి బయటకు వచ్చేస్తున్నాడు తప్పా విక్రమార్కుడు ఒక్క మాట మాట్లాడలేదు. అంతలో భుజం మీద వున్న భేతాళుడు విక్రమార్కుడికి ఎదురుగా నిలబడి, రాజా నువ్వే గెలిచావు. యిహనుంచి నేను నీ అదుపులో వుంటాను, నువ్వు చెప్పింది చేస్తాను అన్నాడు వినయంగా.



భేతాళా! నువ్వు నీ చెట్టు మీదనే వుండి, దారిన వెళ్తున్నవారికి శ్రమ తెలియకుండా కథలు చెప్పి, వాళ్ళు ఏమి జవాబు చెప్పారో నాకు ప్రతీ ఉదయం చెప్పాలి. కథలు మా కవులకి నేను చెప్పి పరీక్ష పెడతాను అని చెప్పి, యిప్పుడు ముందుగా దంపతుల యింటికి వెళ్లి వడియాలతో వాళ్ళు ఏమి చేసుకున్నారో అవి తీసుకుని రా అన్నాడు.



ఆజ్ఞ అంటూ భేతాళుడు మాయం అయ్యాడు. విక్రమార్కుడు యింటికి చేరి భోజనం కి కూర్చుని, మహారాణికి వడియాల గురించి చెప్పుతోవుండగా, భేతాళుడు నాలుగు గిన్నెలు తో  ప్రవేశించి మహారాజా! యివిగో వాళ్ళు చేసుకున్న వంటలు. వడియాలు వేసిన పనసపోట్టు కూర, ఉల్లిపాయలు వడియాల పులుసు, వేయించిన వడియాలు, ఎందుకైనా మంచిది అని కొన్ని వడియాలు కూడా తీసుకుని వచ్చాను, మీకు మహారాణి గారు వండి పెట్టడానికి అన్నాడు భేతాళుడు.



మాట విని మహారాణి కోపంగా చూసింది భేతాళుడు వంక.
***
ఆమ్మో! భేతాళుడు మన వడియాలు ఎత్తుకుపోతున్నాడు అంటూ పెద్ద కేక పెట్టాడు సీతారామయ్య. 



పడుకోండి మీ వడియాలు పాడుగాను, నిద్రలో కూడా తిండి పిచ్చే. యింకా తెల్లారలేదు అని కసిరింది మహాలక్ష్మి.
[font=var(--ricos-font-family,unset)]     [/font][font=var(--ricos-font-family,unset)] [/font]

శుభం  
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#57
[Image: image-2025-02-22-131424907.png]

అదొక ఊర చెరువు. అ చెరువుకు అవతలొక పేట, ఇవతలొక పేట. ఆ రెండు పేటలూ ఓ  రెండు పేటల గొలుసు కోసం తెగ ఆరాట పడిపోయాయి ఒకానొక సందర్భంలో!

“యావండీ, లేవండి పాడు నిద్రా మీరూనూ. సర్పంచ్ సక్కుబాయి గారు
  నిన్నతన  రెండు పేటల బంగారం గొలుసుని  వినాయకుడి మెడలోంచి తియ్యడం మరిచిపోయి నిమజ్జనం చేసేసిందట మన చెరువులో. ఇప్పుడు  గోల పెడుతోందట ఇంట్లో. మన పని మనిషి చెబుతోంది. లేవండి తొందరగా.  ఎవరికీ తెలియకుండా దబ్బున  వెళ్లి తెచ్చేసుకుందాం.”

“చెరువులో దిగా? నాకు ఈత రాదేవ్. చస్తా!” -- “ఈ మాత్రానికే
  చచ్చిపోతారా? నేను గట్టు మీద నించి తాడేసి పట్టుకుంటానుగా.  రెండు పేటల గొలుసండీ! రెండు లక్షలుంటుంది. మీరెలాగూ చేయించి చచ్చింది లేదు. ”

తాడు, తువ్వాళ్ళూ పట్టుకుని హడావుడిగా
  చెరువు దగ్గరకు పరుగెట్టారు మొగుడూ పెళ్ళాం. వస్తూనే గతుక్కు మన్నారు. అప్పటికే పదిమంది దాకా మొగుళ్ళు   వెతికేస్తున్నారు నీళ్ళల్లో దిగి.  తాళ్లేసి లాగి పట్టుక్కూర్చున్నారు వాళ్ళ  పెళ్ళాలు గట్టు మీద.

“అయ్యయ్యో. ఆలస్యం అయిపోయిందండోయ్. దిగండి తొందరగా.” అంటూ మొగుడి నడుముకు తాడు కట్టి,
  గోచీతో నీళ్ళల్లోకి తోసేసింది పెళ్ళాం.   “ తాడు గట్టిగా పటుకోవేవ్. ఈ తాడు తెగితే  నా తాడు తెగినట్టే!” అన్నాడు మొగుడు.  “మీ తాడు తెగితే నా తాడు తెగినట్టు కాదా ఏం? దిగండి ఏం భయం లేదు.”

చెరువంతా నాచు, తూడు, గుర్రపు డెక్కాకుతో నిండి పోయి ఉంది. అడ్డొచ్చిన ఆకుల్ని, తూడుని బయటకు విసిరేస్తూ మొగుళ్ళందరూ మునుగుతూ, తేలుతూ లోపల ఏ బొమ్మ దొరికినా పుచ్చుకుని పైకి లేస్తున్నారు. దానికి గొలుసేవన్నా వేళ్ళాడుతోందేమోనని
  తడిమి చూసి, గట్టు మీదకి విసిరేస్తున్నారు. వాళ్ళకి ఊపిరి పీల్చుకోడాని క్కూడా  టైమివ్వడం లేదు పెళ్ళాలు. మళ్ళీ మునిగేదాకా కేకలు, పెడబొబ్బలు! ఒకటా రెండా? రెండు లక్షల రూపాయల గొలుసు మరి! కాస్త తాత్సారం చేస్తే వేరే వాళ్ళకి దొరికేస్తుందేమో. ‘దేవుడా దేవుడా అది మా ఆయనకే దొరకాలమ్మా, దొరికితే నీకు  ఆ రెండు పేటల్లో  ఒక పే.. కాదు కాదు ..  మా అయన  తల నీలాలిస్తాం తండ్రీ’ లాంటి వీలైన   మొక్కులు  మొక్కేసుకుంటు న్నారు  పెళ్ళాలు!

“ఒదినా. అన్నయ్య గారు లోపల బిజీ అయిపోయారు. అసలు పైకి లేవనే లేవట్లా!” - “మా వారికి జలస్తంభన విద్య తెలుసమ్మా. ఎంతసేపైనా నీళ్ళల్లో ఉండగలరు. గొలుసు దొరికాకే వస్తారు పైకి.”--

“అవునా? ఎందుకైనా మంచిది ఓసారి తాడు కదిపి
  చూడమ్మా”

“అవునూ, మనం కష్టపడి గొలుసు
  కోసం వెతుకుతున్నాం కదా. తీరా దొరికాక  సర్పంచ్  గారు

‘అది నాదీ,
  నాకిచ్చె’య్యమనదు  కదా?” --  “ అట్టెట్టా కుదురుద్దీ? ఓ సారి నిమజ్జనం చేసేక ఇంతే సంగతులు. హక్కులేం ఉండవు వాటి మీద.  మా అయన చెప్పారు.  లాయరు కదా!” -- “లాయరా? ప్లీడరు గుమస్తా అన్నారు మా అయన?”

“చీఛీ. ఇవేమిటే? ఎంత పట్టుకుని లాగినా సాగుతున్నాయి, వదలటం లేదూ!”
  “జలగలండీ! వీటి దుంపతెగా.   పీకితే  సాగుతాయే గాని వదలవు. చుట్టో  సిగరెట్టో వెలిగింఛి, ఆ నిప్పు తగిలించాలి వాటికి, నా చిన్నపుడు మా వూళ్ళో చూసా. ఉండండి.” అంటూ పెళ్ళాం గట్టు మీద మొగుడు విడిచిన ప్యాంటు జేబులోంచి అగ్గిపెట్టె, సిగరెట్టు  తీసి వెలిగించి మొగుడి నోట్లో పెట్టింది. అదికాస్తా నీళ్ళ తడికి  ఆరిపోయింది.  “ ఇలా ఇవ్వండి”  అంటూ ఆ సిగరెట్టుని లాక్కుని , తన  నోట్లో పెట్టుకుని  వెలిగించి ఓ  దమ్ము పీకింది పెళ్ళాం.  దగ్గొచ్చి ఉక్కిరిబిక్కిరయ్యింది!   నెత్తి మీద కొట్టుకుని  గట్టిగా పీల్చి, ఎర్రటి నిప్పుని జలగల  మీద పెట్టింది. వెంటనే అవి  రాలిపోయాయి. విజయ గర్వంతో ఓ చూపు చూసి,  మొగుణ్ణి  మళ్ళీ నీళ్ళపాలు చేసింది పెళ్ళాం.

“వొదిన గారూ, ఇదిగో మా ఆయనక్కూడా పాడు
  జలగలు పట్టేయి. కాస్త నిప్పు పెట్టండి” అంది ఒక పెళ్ళాం మొగుణ్ణి తెచ్చి.  అప్పటికే అరడజను జలగ బాధితులు  లైన్లో నిలబడ్డారు పీక్కుంటూ.

“సిగరెట్టు రేట్లు బాగా పెరిగాయమ్మా. జలగకి ఇరవై అవుతుంది మరి,
  ఇష్టమైతే చెప్పండి.” అంది పెళ్ళాం ఓ దమ్ము పీల్చి పొగ వొదుల్తూ. -- “ఖర్మ! ఓ పక్క రక్తం పీల్చేస్తుంటే డబ్బుకి చూసుకుంటామా, కానివ్వమ్మా” అంది బాధితుని పెళ్ళాం కొర కొరా చూస్తూ. వెంటనే పెళ్ళాం గట్టిగా దమ్ము లాగి, వరసగా ఒక్కొక్కరినీ జలగ విముక్తుల్ని చెయ్యసాగింది నిప్పు పెడుతూ.  అరగంటలో మూడొందలకు  పైగా వసూలయ్యింది!!  

ఈలోగా మొగుడు భళ్ళున నీళ్ళలోంచి లేచి, “ఏమేవ్. చూడు. ఎవడో
  నా డొక్కలో గట్టిగా తన్నేడు లోపల.” అంటూ  ఏడుపు లంకించుకున్నాడు. -- “ అవునా? మీ పక్కన దిగింది దుందుభి గారు. ఆయనే అయి ఉంటాడు. వాడి మొహం మాడిపోనూ.  బయట మిమ్మల్ని ఎదుర్కోలేక ఇలా నీళ్ళల్లో ఎటాక్ చేస్తున్నాడా పీనుగా? దమ్ముంటే బయట చూసుకోవాలి!”

“ఏవమ్మో వొళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మా ఆయనకి అలా చాటుగా తన్నాల్సిన అవసరం లేదు.
  బయటే తన్నగలడు. మిలట్రీలో పనిచేసాడు. ఆ.” -- “ఏంటే  చూసుకునేది? నువ్వెంత నీ బతుకెంత?” -- “ఎవన్నావే?”  ఇద్దరు పెళ్ళాలూ జుట్టు జుట్టు పట్టుకుని తన్నుకోవడం ప్రారంభించారు!

“ఏవమ్మోయ్. మీరిద్దరూ కొట్టుకుంటూ తాళ్ళు వదిలేసారు. మీ మొగుళ్ళ సంగతి
  చూసుకోండి బుడగలొచ్చేస్తున్నాయి లోపల్నించి.” అంది పక్క పెళ్ళాం.  కొట్లాట ఆపేసి  ఇద్దరూ  మళ్ళీ తాళ్ళు పుచ్చుకున్నారు.

ఈ లోగా ఒక మొగుడు చటుక్కున నీళ్ళల్లోంచి బయటకు వచ్చి గట్టెక్కి, అటూ ఇటూ చూసాడు.
  చూసి, దబ్బున  ఒక్క దూకు దూకి,  ఇంటి వైపు పారిపోయాడు!  అతడి వెంటే అతడి పెళ్ళాం కూడా బట్టలు, తాడు పట్టుకుని పరుగెత్తింది!  అందరూ విస్తుపోయి చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు!!

“అయిపోయింది, అంతా అయిపోయింది! ఆయనకి
  గొలుసు దొరికేసింది!  అందుకే అలా పారిపోయాడు. చాల్లెండి వెతకడం.  బయటకు రండి.”

“ చూసారా ఎంత తెలివిగా అయన గొలుసు పట్టేసాడో. మీరూ ఉన్నారు ఒట్టి దద్దమ్మ. రెండు లక్షల రూపాయల గొలుసండీ” గొల్లుమని ఏడుపు ప్రారంభించింది పెళ్ళాం. ఈలోగా
  తాళ్ళు చుట్టేసుకుంటూ  పెళ్ళా లందరూ నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టసాగేరు వెర్రి మొహాల్తో గట్టెక్కుతున్న అసమర్థ మొగుళ్ళని చూస్తూ.  ఒక పెళ్ళాం అయితే చెయ్యి కూడా చేసుకుంది. 

ఆ మర్నాడు సర్పంచి సక్కుబాయి గారు రెండు పేటల వారినీ
  మీటింగుకి పిలిచింది. “మన కందరికీ  ఉపయోగపడుతుందని, చెరువును బాగు చేసుకుందామని, శ్రమ దానం చెయ్యమంటే ఎవ్వరూ ముందుకు  రాలేదు. ఇప్పుడు నా గొలుసు పుణ్యమా అని అందరూ నీళ్ళల్లో  దిగీ తూడు, నాచు తీసేసి శుభ్రం చేసేసారు చెరువుని. అందరికీ ధన్యవాదాలు! మరో విషయం. నా గొలుసు నిమజ్జనం చేసానని నేను ఎవరితో చెప్పాను? గొలుసు ఇదిగో నా దగ్గరే ఉంది. ఎవరో పుకారు పుట్టించారు  పోయిందని.  నేనైతే కాదు.  పోనీలెండి. జరిగిందేదో జరిగింది. చెరువు బాగు పడింది!”  అంది రెండు పేటల వాళ్ళూ నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తూ ఉండగా తన రెండు పేటల  గొలుసుని  జాకెట్లోకి జాగ్రత్తగా విడుస్తూ.

*****
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#58
(22-02-2025, 01:16 PM)k3vv3 Wrote:  మరో విషయం. నా గొలుసు నిమజ్జనం చేసానని నేను ఎవరితో చెప్పాను? గొలుసు ఇదిగో నా దగ్గరే ఉంది. ఎవరో పుకారు పుట్టించారు  పోయిందని.  నేనైతే కాదు.  పోనీలెండి. జరిగిందేదో జరిగింది. చెరువు బాగు పడింది!”  అంది రెండు పేటల వాళ్ళూ నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తూ ఉండగా తన రెండు పేటల  గొలుసుని  జాకెట్లోకి జాగ్రత్తగా విడుస్తూ.

*****

Shy clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#59
[Image: image-2025-03-07-083122911.png]
రిక్షావాడితో దెబ్బలాడి అలసిన సుబ్బారావూ, పమిటి చెంగుతో చెమటలు తుడుచు కుంటున్నసోదితల్లి భుజాల నుండి సంచుల బరువుని దించుకుంటూ వీధి అరుగు మీదే కూలబడ్డారు.
“అదేంటొదినా, ఇక్కడే కూర్చుండిపోయావూ! లోపలికి పదండి” సంచి అందుకుంటూ అంది జలజాక్షి.
“నువ్వేంటన్నయ్యా మరీ చిక్కిపోయి అలా పొట్లకాయలా వేలాడిపోతున్నావూ?” కందగడ్డలా ఎర్రగా ఉన్న అన్నగారిని చూస్తూ పలకరించింది.
“ఏం చెప్పమంటా వొదినా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందనీ..” రుసరుసలాడుతున్న భర్తని చూస్తూ సగంలోనే ఆపేసింది సోదితల్లి.
 
“అన్నయ్య మాటకేం కానీ నువ్వు చెప్పొదినా, ఏం జరిగిందీ? అసలా రిక్షావాడితో పేచీ ఎందుకొచ్చిందీ?” అడిగింది కాఫీ ఇస్తూ.
ఆడపడుచిచ్చిన ధైర్యంతో దండకాన్ని అందుకుంది సోదితల్లి.
 
“ఇవాళంటే మీ ఊళ్లో రిక్షావాడు కానీ, అసలు మీ అన్నయ్య ఒంటి కాలి మీద లేవడానికి వాళ్ళూ వీళ్ళూ అని లేదనుకో.  ఇంట్లో పనిమనిషేంటి, కూర్లబ్బేంటి, పాలవాడనీ, పూలవాడనీ ఒకరేంటి అందరూ ఆయన్ని చూసి జడవవలసిందే!  వేలికేస్తే కాలికీ, కాలికేస్తే వేలికీ వేస్తూ తన మాటే నెగ్గాలని సాధించేస్తున్నారనుకో.
అక్కడితో ఆగుతారా! లేదే!. ఊళ్ళో పెళ్ళికి వేటికో హడావుడన్నట్టు అన్ని ఘనకార్యాల బాధ్యతనూ నేత్తినేసుకోవడం, నేనే గొప్పగా చేస్తానంటూ గౌప్పలకు పోవడం. రంగంలోకి దిగాకా ఏదైనా కొంప మీదకి ముంచుకొస్తే అప్పుడు ఎదురు దెబ్బలాడ్డం, అదీ కుదరకపోతే చీవాట్లూ చెప్పు దెబ్బలూ తినడం అనుకో! రిటైరైయ్యాకా కృష్ణారామా అనుకోండీ అంటే, ఇదిగో ఇలా ఏదో ముప్పు తెస్తూ ఉంటున్నారనుకో”

“వింటున్నా వింటున్నా, నీకు అందుకే మీ వాళ్ళు సరైన పేరే పెట్టారే!
  అయ్యిందా నీ సోదీ, ఇంకా ఉందా? నేనేదో బావతో కబుర్లు చెపుతున్నానని అక్కడ జలజం చెవుల్లో సీసం పోసేస్తే నాకు నీ నేరాల చిట్టా వినపడట్లేదనుకుంటున్నావేమో! అన్నీహ్...  వినిపిస్తున్నాయ్” ఝాడిస్తూ సాధించాడు సుబ్బారావు.
“ఒదినంటోందని కాదు కానీ, నీకెందుకన్నయ్యా ఊళ్ళో గొడవలూ అవీను? నాలుగు రాళ్ళు వస్తాయి, కాలక్షేపంగానూ ఉంటుందనేగా ఆ  పంచాయితీ కార్యాలయంలో చేరావు. నీకసలు ఆ పనితో తీరికెక్కడిదీ? ఇంకా ఊళ్ళో గొడవల్లోకెళ్ళడానికి సమయం నీకు ఎక్కడు కుదురుతుందీ!?” ప్రశ్నలోనే ఆశ్చర్యాన్నీకలిపి విసిరింది జలజాక్షి.
“నన్ను ముందు స్నానం చేసి రానిస్తారా, మీ ఒదినా మరదళ్ళిద్దరూ, లేక చెరోవైపూ చేరి తలంటు పోసేస్తారా?”  ఎడం భుజమ్మీది తువ్వాలుని తీసి రోషంగా దులిపి కుడి భుజ మ్మీద వేసుకుంటూ నూతి పళ్ళెం దగ్గరికి వెళ్ళిపోయాడు.
 
“హయ్యోరామ! ఇంకెక్కడిదీ!! మీ అన్నయ్య నిర్వాకానికి అదెప్పుడో చెట్టెక్కింది. ఆ ముచ్చటా చెపుతాను విను” వచ్చిన అవకాశాన్ని వదలకుండా ఆ కథలోకి దూకి వల్లించడం మొదలెట్టిది సోత్తల్లి.
“మొన్నామధ్య ప్రభుత్వ కార్యాలయాల్లో రిటైరైనవారిని కూడా కాంట్రాక్టులో తీసుకుంటున్నారని చెప్పుకున్నారు విన్నావా?పూర్వరోజుల నాటి అదేదర్పం, హోదా ఉంటుందంటూ, దానికి దరఖాస్తు పెట్టుకున్నారులే.అంత వరకూ సంతోషమే. రెండు నెలలకి ‘ఆన్ ఇండియా గవర్నమెంటు సర్వీస్’ ముద్ర వేసున్న కవరు తెచ్చాడు పోస్ట్ మాన్.  ఇచ్చినవాడు ఊరికే ఇవ్వకుండా,తంతే బూరెలబుట్టలో పడ్డట్టు, వయసు మళ్ళినా మీకు వచ్చేసింది సార్. మీరు దరఖాస్తు పెట్టుకున్న ప్రభుత్వోద్యోగంలోమళ్ళీ అధికారి హోదాలో దర్జాగా ఉంటారు. ఇంతటి శుభవార్త మోసుకొచ్చిన నా నోరు తీపి చెయ్యాల్సిందే. మళ్ళీ వచ్చేసరికి స్వీటు సిద్ధం చేయండి” అంటూ సైకిలెక్కి రైయ్యి మన్నాడు.
“అంతే, ఇంక మీ అన్నయ్య కాళ్ళు నేలమీదుంటేనా!ట్రంకు పెట్టిలో భద్రంగా దాచిన ఏళ్ళ నాటి పాతకోటు తీసారు. దాని దుమ్ము దులిపేసరికి అరడజను తుమ్ములు ఆక్కుండా వచ్చాయనుకో.  అసలే కరోనా వెళ్ళి ఎన్నాళ్లో అవ్వలేదు, ఇన్ని తుమ్ములు తుమ్మితే అపార్థాలు అనర్థాలు అంటే వింటేనా!! ఆగండీఅసలేంచేద్దామని ఈ ప్రయాణం అని ఎంత అడిగినా చెప్పకుండా, ఎవరితోనూ పేచీ పెట్టుకుని నోరుపారేసుకోవద్దని ఎంత చెప్పినా వినకుండా, తగుదునమ్మా అని బయల్దేరారు.  బొబ్బిలి యుద్ధంలో కత్తి చేతపట్టి తాండ్రపాపారాయుడు రంగంలోకి దిగినట్టు, కోటు తగిలించుకుని, ఆకవరును చేత పుచ్చుకుని పంచాయితీ కార్యాలయం వైపు దారిదీసారు.
వెళ్లారే అనుకో, తిన్నింటి వాసాలు లెక్కెట్టాలా? ఆ పంచాయితీ కార్యాలయంలోని అవకతవకలన్నీ వల్లించడం, నలుగురుకీ తెలుస్తుందన్న ఆలోచన లేకుండా అయినవీ కానివీ అనడం. తనలాంటి అనుభవజ్ఞులను అమర్యాదగా వ్యవహరిస్తున్నారని వాళ్ళని దుమ్మెత్తి పోసారుటయ అక్కడున్న గుమాస్తా మీద రంకెలేస్తూ, ‘చూడవోయ్, మాలాంటి వాళ్ళ అనుభవాన్ని కావాలనుకుని మళ్ళీ పిలిచిమరీ నియమిస్తోంది ప్రభుత్వం.ఆ విలువ మీకు తెలియక ఇలా అఘోరిస్తున్నారు. ఇంక ఇలాంటి మర్యాదలేని చోట పనిచేసే ఖర్మ నాకులేదు’అరచీటీలో రాజీనామాను విసిరి, నానా మాటలూ అంటూ వారి మీద వీరతాండవం చేసివచ్చారు” వాబోయిది సోత్తల్లి.
“పోనీలే ఒదినా పోతేపోయిందిలే వెధవ ఉద్యోగం. ఏదిఏమైనా, అన్నయ్యన్నట్టు, ప్రభుత్వోద్యోగంలో ఉన్న గౌరవమే వేరూ!” బుగ్గన చెయ్యెట్టి గర్వంగా కనుబొమ్మలెగరేస్తూ అంది జలజాక్షి.
“ఆగాగు, ఇంకా నేను చెప్పడం ఇంకా పూర్తవ్వందే!!!”
ఒదినన్న మాట అర్థంగానట్టు చూసింది జలజాక్షి.

“ఈయనెంత నోరు పారేసుకున్నా, ‘పోన్లెండి సుబ్బారావుగారు, మీ సేవలను పొందే అదృష్టం మాకు లేదనే అనుకుందా. ఇదిగోండి ఇవాల్టి వరకూ మీకురావలసిన బాకీలు. అణా పైసలతో సహా చెల్లించేస్తున్నాను’ మర్యాదగా చెప్పి సంతకం తీసుకుని సాగనంపాడు గుమాస్తా.  ఎప్పటికప్పుడు మీ అన్నయ్య పెడుతున్న పేచీకి, ఏనాడైనా నేనే రానని ఆయన అన్ననాడు వెంటనే జీతభత్యాల రొక్కాన్ని అప్పచెప్పి పంపించాలని వాళ్ళల్లో వాళ్ళు ఎప్పుడో నిర్ణయించుకున్నారుట. ఉత్తర్వులు చేతిలో ఉన్నాయేమో, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గుమాస్తా దివ్యమైన ఆ సత్కార్యాన్ని చడీచప్పుడు కాకుండా కానిచ్చేసేసాడు. ఉన్నది కాస్తా ఊడి సర్వమంగళం పాడింది”
“ఆ ఉద్యోగం లేదన్న మాట ఇందాకే చెప్పావుగా, ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన సంగతేంటీ? ఆర్నెల్ల సావాసంలో వారు వీరవుతారన్నట్టు అన్నయ్య చాదస్తమే నీకూ పట్టుకున్నట్టుంది” చిక్కుముడి విడక విసుక్కుంది జలజాక్షి.
“ఇంటికొచ్చిన సుబ్బారావు, కోటుని చిలక్కొయ్యకు తగిలించి, ఉయ్యాలా బల్లమీద రంగనాధస్మామిలా వాలి, సోదితల్లిని వైపుకి వీర గర్వంతో చూపు విసిరి కవరు విప్పాడు. ప్రధానమంత్రి కార్యాలయం నుండి వచ్చింది. గర్వంతో ముఖం మరింత ప్రకాశించింది.  75వ గణతంత్ర దినోత్సవ వేడుకల అభినందనలు తెలియజేస్తూ ప్రధానమంత్రి సంతకంతో వచ్చిన లేఖ అది.  ఈ మధ్య ఇలాంటివి బోల్టు మందికి వస్తున్నాయిటగా. మొన్న అదేదో దేశం ఉన్న క్రికెట్టు వీరుడికీ, మరేదో ఊళ్ళోని రైతన్నకీ అలా బోల్డు మందికి వస్తున్నాయిట.  ఐనా, చేసే ప్రతీ పనిలోనూ అంత తొందరపాటు పనికిరాదొదినా!  అప్పట్నుంచీ మొహం చెల్లక పంచాయితీ కార్యాలయం వీధిలోకి వెళితే ఒట్టు. అక్కడికీ ఆవేళ మన రమణంటూనే ఉన్నాడు, ‘బావా కవరు విప్పి చూడనా బావా అని. వింటేనా!?”
­­­­­­­­­­­­­
“చెప్పవే చెప్పూ, ఇంకా ఉన్నవీ లేనివీ కలిపి మరీ చెప్పు.
 అసలు నా అనుభవం వాళ్ళకి ఉపయోగ పడుతుందిని కానీ, లేకపోతే ఈ వయసులో ఉద్యోగం చెయ్యాల్సిన ఖర్మ నాకేంటే! షేవింగ్ లేక గడ్డం పెరిగినట్టు, సేవింగ్ లేక బ్యాంకు ఖాతా చిక్కుతుందని, స్వామికార్యం స్వకార్యం అవుతుందీ, నాకూ కాలక్షేపమనీ ఆ పనికొప్పుకున్నాను కానీ!” ఒంటికాలి మీద లేచాడు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#60
“ఐనా కృతజ్ఞతలేక వాళ్ళఘోరిస్తున్నారు సరే! అసలీ మాటు ఎన్నికల్లో నేను చేసి కృషివల్లనే కదే కొత్త పంచాయితీ బోర్టు ఎంపికైందీ? అవకాశం వచ్చింది కదాని నా చెల్లెలితో నేరాలచిట్టా విప్పి ఇందాకట్నుంచీ రీలు తిప్పేస్తున్నావు అసలు నీ బుద్ధికేం బుధ్ధి పుట్టిందీ?” శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం... అంటూ అప్పుడే మొదలెట్టిన శ్లోకాన్ని మధ్యలోనే ఆపేసి సోత్తల్లి మీదకి సంధించాడు నోటి ధాటితో తిట్ల బాణాన్ని.
“చాల్లెండి సంబడం. ఆ ఎన్నికల మాటెత్తేరంటేనే నాకు చిర్రెత్తుకొస్తుంది. అవన్నీ మనకెందుకండీ, ఏదో కృష్ణా రామా అని ఊరుకోక అని నెత్తీనోరూ కొట్టుకుని చెపుతూనే ఉన్నాను.  కోతికి కొబ్బరిచిప్పలా ఈయనకి తోడు మన రవఁణగాడొకడు.  మిమ్మల్ని గెలిపించే పూచీ మాది అని అటు జగ్గిరెడ్డిగారికీ ఇటు సుబ్బారాయుడు గారికీ చెప్పి వచ్చారు. నాకు తెలీకడుగుతానూ, అసలు ఇద్దరినీ ఎలా నెగ్గిస్తారూ అని నేనడిగితే, నీకేం తెలీదు నువ్వు నోర్ముయ్ అంటూ నానోరు నొక్కారు” అప్పటివరకూ వర్తమానంలో ఉన్న సోత్తల్లి నేరాల చిట్టా నాలుగేళ్ళ క్రితానికి భూతకాలానికి వెళ్ళింది.
కొత్త సినిమా మొదటి షో రిలీజ్ నాడే చూస్తున్నంత ఉత్సాహంగా వింటోంది జలజాక్షి.
“ఇంకా కరోనా ధాటి పూర్తిగా తగ్గలేదు. టీకా వచ్చే దాకా టిక్కెట్టు కొయ్యకురా తిక్క శంకరుడా అని దేవుడితో ఐతే మొరపెట్టుకున్నాను కానీ మానవ ప్రయత్నం చెయ్యాలిగా ఒదినా! మీ అన్నయ్యకు అసలే ఆయాసమా! నా పసుపుకుంకుమల్ని కాపాడుకోవడానికి నా వంతు ప్రయత్నం చేసాను. మన బాగుకోసమేగా పాపం ఆ యూట్యూబులోనూ, వాట్సాపుల్లోనూ చెపుతున్నారు. అంచేత వారు ఉచితంగా పడేసిన సలహాలన్నీ పాటిస్తూ ఆయన్ని కాపాడుకుంటూ వచ్చాననుకో” మంగళ సూత్రాల్ని కళ్ళకద్దుకుంటూ అమాయకంగా అంటున్న సోత్తల్లిని కళ్ళు రెండింతలు చేసుకుని చూస్తోంది జలజాక్షి.
“ఆ, కాపాడుకొచ్చావు, వచ్చావు!! కోరి కష్టాన్ని కొని తెచ్చుకున్నట్టు ఆ వాట్సాపు విశ్వవిద్యాలయం వారి ఔషధాలన్నీ నా మీద ప్రయోగించి ప్రాణం మీదకే తెచ్చావు!  కషాయాలన్నీ ఏకధాటిగా పోసేసి నోరు గాబు కట్టేసిన సంగతి చెప్పవేఁ? దాంతో ఐందా, ఆ లేహ్యమేదో ఇచ్చిన ముక్క చెప్పవేఁ? కరోనా సోకిన కళ్ళకు కరీనా కనబడదన్నట్టు, నాకసలే రుచి తెలియకేడుస్తుంటే, గోరుచుట్టుమీది రోకలి పోటులా ఆ లేహ్యంతో కడుపు కట్టేసిందా? ఆ తెలిసీ తెలియనివి వద్దే అని చెవుల్లో గూడుకట్టుకుని చెప్పా విన్నావా చివరికి డాక్టరు దగ్గరకెడితే పరీక్షలంటూ, స్కానంటూ, కొలొనోస్కోపీలంటూ భయపెట్టింది చాలక ఒ అర లాకారం లాగేసాడా!” సంధ్యావందనాన్ని ఆపి మరి సణుగాడు సుబ్బారావు.
“అబ్బా, మీరు ముందా పూజ కానివ్వండి” దాటేసింది సోదితల్లి.
“అవన్నీఅయ్యి, ఆ రెండు టీకాలూ పూర్తి చేసుకుని బతుకు జీవుడా అనుకున్నామా!  కొన్నాళ్ళైనా ప్రశాంతగా ఉండనిచ్చారా? అక్కడితో ఆగారా?” జేమ్స్బాండ్ సినిమా చూపిస్తున్నంత ఉద్రిక్తకరంగా చెప్పసాగింది సోత్తల్లి.
వంట ఆలస్యమైపోతుందని కత్తిపీటా, కూరగాయలూ అక్కడికే తెచ్చుకుని, అక్కడే తిష్ట వేసుక్కూర్చున్న జలజాక్షితో, “ఇప్పటికిప్పుడు ఇంత హడావుడిగా ఇక్కడికెందుకొచ్చామో తెలుసా? కొన్నాళ్ళు ఊరికి దూరంగా ఇక్కడుండక తప్పదు మరి.  లేకపోతే ప్రాణాల మీదకే వచ్చి పడింది” ముక్కు చీదుతూ అంది సోత్తల్లి.
 
“పంచాయితీ ఎన్నికలు తన సారథ్యంలోనే జరిపించి గెలిపించానన్నాడుగా అన్నయ్య” మరో అనుమాన్నాన్ని అడిగింది జలజం.
“పంచాయితీ ఎన్నికలు సన్నాహాలు జరుగుతున్నాయి. పోటుగాళ్లందరూ రంగం సిద్ధం చేస్తున్నారు. ఎవరేం పని చేయాలా అని పనుల పంపిణీలు చేస్తున్నారు. వాళ్ళే ఇస్తే సులభమైన పనే ఇద్దురు. మీ అన్నయ్యకి గులగులలాడి, ఊరు చివర మురికి వాడల్లో ఓట్లన్నీ మన ప్రెసిడెంట్గారికే వేయిస్తానని శపథం చేసినంతపని చేసారు. ఆ మాట పట్టుకుని “అన్నిటి కంటే క్లిష్టమైన సమస్య సుబ్బారావు పుణ్యమా అని తీరిపోతుంది.  క్రితం సారి హామీ ఇచ్చినట్టుగా ఆ వీధుల్లో రోడ్లు కూడా వేయించలేదు.  వాళ్ళు కోపంగా ఉన్నందు చేత అక్కడి ఓట్లు జాగ్రత్తగా రాబట్టవలసిన అవసరముంది” అన్నారు జగ్గిరెడ్డిగారు.
“పోనీలే ఒదినా, అన్నయ్య మంచి మనసుతో చేసిన కృషికి ప్రెసిడెంటుగారు గెలిచేసుంటారు” మురిసిపోతూ అంది జలజాక్షి.
“ఆఁ అలా జరిగుంటే ఇంక గొడవేముంది?
  గెలుపు మాట అటుంచీ, అక్కడ అసలేం జరిగిందో విను మరీ”
“నెల్లాళ్ళ పాటు ఆ వీధులన్నీ కాళ్ళరిగిపోయేలా తరిగారు. వేళకు తినక కంటికి కునుకు లేక బోల్టు కష్టపడ్డారు. జగ్గిరెడ్డి గారే మళ్ళీ ప్రెసిడెంటని అందరం అనుకున్నాం. ఓటు వెయ్యడం మానకుండా అందరినీ ఔననిపించి, బతిమాలి బామాలి, ఒళ్ళు హూనం అయ్యేలా పనిచేసారు. ఎన్నికలు దిగ్విజయంగా పూర్తైయ్యాయి. అనుకున్న దాని కంటే ఎక్కువ శాతమే ఓట్లు వేసారు.

ఆ రోజు సాయంకాలం తన ఘనత చూపించు కోవడం కోసం కొందరితో ముఖాముఖి మాట్లాడించారు మీ అన్నయ్య. ఓట్ల అంచనాకి జగ్గిరెడ్డిగారి బావమరిది పెద్దిరెడ్డిని పిలిపించారు. అన్నయ్య ముఖంలో వీరగర్వ తొణికిసలాడింది”
“ఒరేయ్ వీరన్నా, నీ ఓటు ఎవరికేసావురా?” అన్నాడు పెద్దిరెడ్డి.
“ఐ బాబోయ్ మన సుబ్బారావుగారి మాటంటే మాటేకదండీ! ఆరొకటికి పది సార్లు సెప్పాక అట్టాగే సెయ్యాలి కదండి బాబయ్యా. ఆరి మాటంటే మాటే. మన గొడ్డలి గుర్తుకే గుద్దేసానండి” అతివినయంగా చెప్పాడు వీరయ్య.
“నమ్మొచ్చంటావా? క్రితం సారి కంటే ఎక్కువ ఓట్లు ఆశిస్తున్నాము” సందేహంగా అడిగాడు.
“సూసారా, నన్ను నమ్మట్నేదు తమరు. నేనంత ఎర్ర పప్పనేటండీ, మీకిట్టాంటి డౌటనుమానం వత్తాదనుకునే సూపిద్దామని తెచ్చాను, కావాలంచే మీరే సూసుకోండి బాబయ్యా” ఓటు కాగితం తీసిమరీ చూపించాడు వీరన్న.
మొహం చాటేస్తూ, “ఆ వీరన్న సంగతలా ఉంచడి రెడ్డిగారూ, వాడో వెర్రినాగన్న. వీడు మాత్రం మనం గీసిన గీత దాటడు. మన రాఁవుడంటే సాక్షాత్తూ రాఁవుడే” అన్నాడు సుబ్బరావు.
“ధమ్మపెబువులు. ఆరి ఉప్పుతిన్నాక మాట తప్పొచ్చాండీ! కళ్ళుపోతాయి. ఆరు ఎయ్యిచ్చింతరువాత ఒకటో రెండో ఏత్తే ఏం బాగుంటాది, అంచేత ఒ నాలుగైదు బలంగా గుద్దేసానండి.  మళ్ళీ నా ఇబ్బంది చూసి ఆరు ఇంకో వంద నా సేతిలో ఎట్టారా, మరి దానికో రెండు గుద్దానండి.  ఐనా ఆరి దయకి సాలిందనిపించలా బాబూ, కాయితమంతా ఎడా పెడా గుద్దేసానండి. నాకిప్పుడు మనసు తుత్తిగా ఉందంటే నమ్మడయ్య” గర్వంగా చెప్పాడు రావుడు.
“మన గొడ్డలి తప్ప మరో గుర్తు కనిపించడానికి ఈల్లేదయ్యా, అగుపడకూడదని అయన్ని సించేసానండయ్యా, మీ మాటంటే మాటే మరి”  చావు కబురు చల్లగా చెప్పాడు సాహసం చేసిన సోమయ్య.
తలపట్టుకుని కూలబడుతున్న మీ అన్నయ్యను పట్టుకుని, “ఇంకా అవ్వలేదు, ఇదీ చూద్దాం!” తాడోపేడో తేలే దాకా పట్టు వదల్లేదు బామ్మరిది పెద్దిరెడ్డి.  
“అయ్ బాబోయ్, నేను మాత్రం ఆ అయ్యగోరు సెప్పింది సెప్పినట్టు సేసానండయ్యా!  గొడ్డలి గుర్తుందా, ఉంది కదయ్యా, దానికీ, దానికీ...”
వంకర్లు తిరిగింది చాలు కానీ చెప్పి ఛావు!
“గొడ్డలికి ఏసి, మా అయ్యగారే గెలవాలని దణ్ణమెట్టుకుని మరీ వచ్చానండయ్యా” చెప్పింది రంగి.
“హమ్మయ్య!!” ఊపిరి పీల్చుకున్నాడు పెద్దిరెడ్డి.
“పోనీలే మా మావ సోమయ్యలా నువ్వేం వెలగబెట్టావో అనుకున్నాను. నువ్వైనా నా పరువు నిలబెట్టావు రంగీ” ఇంచుమించు స్పృహ తప్పిన సుబ్బారావు అన్నాడు.
“కావాలంటే సూడండయ్యా! మీరు అన్నది అన్నట్టేసేసానంతే!!” జాకెట్టులోంచి భద్రంగా బ్యాలెట్ పేపరును తీసు చూపించింది రంగి.
“మరినేనేమో అని ఇంకోడు అనేలోపే పెద్దిరెడ్డి మీ అన్నయ్య మీది చెయ్యి చేసుకుని, ఈయనకి దేహశుద్ధి చెయ్యడము జరిగిపోయాయి” కష్టాలచిట్టాను విప్పి చెప్పింది సోత్తల్లి.
“అలా ఊళ్ళోంచి ప్రాణాలను చేతిలో పెట్టుకుని బయటపడ్డామనుకో జలజం”
“ఇక్కడ దిగీదిగ్గానే, రిక్షా వాడితో మాటామాటా పెరిగింది. కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న వాదన. ఎలుకతోలు వచ్చి ఏడాది ఉతికినా అని” అంచేత మీ అన్నయ్య కొన్నాళ్ళు ఇక్కడుంటేనే క్షేమమమ్మా మరదలమ్మా.
“అయ్యొ నా మతిమండా, వేగిరం వంట కానిచ్చెయ్యాలి. సంధ్యావందనం పూర్తవుతూనే వడ్డించెయ్యమంటారు.  ఆయనసలే ఆకలికి ఆగలేరు, కూరలు తరిగేసావుగా ఇట్టే వార్చేస్తానుండు” వంటలోకి దిగుతూ అంది సోదితల్లి.
‘ఒదినొచ్చిందంటే ఇంతే, అన్నయ్యకి నచ్చినట్టుగా ఉండాలంటూ తనే వంట చెయ్యాలంటుంది. ఇంతసేపూ ఇన్ని నేరాలూ చెప్పి హడావుడి పడుతూ వంట మొదలెట్టేసింది. ఆమెకు మించిన వాడు అన్నయ్య! రుసరుసలాడుతూ ఉంటాడే కానీ ఒక్క క్షణం ఒదిన కనిపించకపోతే తోచదు. దొందూ దొందే!!’ మళ్ళీ తన మీద విరుచుకు పడతాడని అన్నయ్య కంట పడకుండా చిరునవ్వు నవ్వుకుంది జలజాక్షి.
*****
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)