Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
Episode 113


సామిర్ తిరిగి ఇంటికి వెళ్ళకుండా ఎగ్జామ్ సెంటర్ దగ్గరే కాలక్షేపం చేసేశాడు.
తన పేంట్ జిప్ తెరిచి వుండటాన్ని చూసిన సుజాత ఆమె మనసులో ఏమనుకుంటోందో అని కాసేపు, అందుకు కారణమైన నాస్మిన్ ని తిట్టుకుంటూ మరికాసేపు గడిపిన అతడు చివరగా సుజాతని ఎలాగైనా వశపరుచుకొనేందుకు కొత్త మార్గాలను యోచిస్తుండగా—
"సామిర్... వచ్చేశావా?" అన్న పిలుపు వినబడి తల త్రిప్పి చూశాడు.
నాస్మిన్, సుజాత అతని దగ్గరకు వస్తూ కనపడ్డారు.
బండి దిగి, "ఎగ్జామ్ ఎలా రాశారు?" అని అడిగాడు వాళ్ళని. అతని కళ్ళు సుజాత మొహాన్ని నిశితంగా గమనిస్తున్నాయి.
"మ్... సూపర్ గా రాశాను," అంది నాస్మిన్.
సుజాత కూడ, "పేపర్ చాలా ఈజీగా వుంది," అని చెప్పింది. అప్పుడే, ఆమె చూపు ఒక్కక్షణం తన క్రిందకి ప్రాకి మళ్ళీ పైకి రావటం అతను గమనించాడు. తనూ కావాలనే ఒకసారి క్రిందకి చూసుకుని ఆమె వంక చూశాడు. చప్పున తన చూపుని ప్రక్కకి తిప్పేసుకుంది సుజాత. అమె పెదాలపై చిరునవ్వు తళుక్కున మెరిసి మాయమైంది.
అప్పుడే... నాస్మిన్, "వెళ్దామా!" అని అనటంతో బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు సామిర్. మళ్ళా నాస్మిన్ గబుక్కున తన వెనకాల కూర్చోవటంతో నిరాశగా నిట్టూర్చి బండిని ముందుకు పోనిచ్చాడు.


★★★

అజయ్ పేరుని చూడగానే అతని రూపం కళ్ళ ముందు మెదిలి ఒళ్ళంతా జలదరించింది సౌమ్యకు. నిన్నటి చేదు జ్ఞాపకం ఆమె మదిలో ఇంకా పచ్చిగానే వుంది. దాన్నో పీడకలగా భావించి మర్చిపోదాం అని ప్రొద్దున్నే తీర్మానించుకుంది. కానీ ఈ లెటర్ పాత గాయాన్ని మళ్ళీ రేపుతున్నట్లు అన్పించటంతో  వెంటనే దాన్ని వుండచుట్టి దూరంగా విసిరేయాలని భావించింది.
అంతలోనే... 'అతనేం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాలని లేదా?' అని తన మనసు తనను అడిగినట్లు అన్పించిందామెకు.
ఒక్కసారి ఆ లెటర్ వైపు చూసింది. గ్లిట్టరింగ్ ఇంక్ వాడటంతో కవర్ మీద 'అజయ్' పేరు ఫ్లాష్ అవుతూ కన్పించింది. మరోమారు అతని రూపం కళ్లముందు కదిలింది.
నిన్న కోపంతో అతని మీద అరిచేసినప్పుడు అతను తిరిగి ఒక్క మాట కూడ అనకుండా మౌనంగా వెళ్ళిపోవటం చూసి నిజానికి ఆమె ఆశ్చర్యపడింది. జరిగిన తప్పుకు పశ్చాత్తాపంతో అతను మర్యాదగా 'సారీ' చెప్తే తొందరపడి అతనిపై ఎక్కువగా అరిచేసానా అని తర్వాత అనుకుంది కూడా.
'మరి ఇప్పుడీ లెటర్ ని చదవకుండా చించేయాలనుకోవటం కూడా తొందరపాటు చర్యే అవుతుంది కదా!'
అలా అనుకుంటూ మెల్లగా ఎన్వలప్ కవర్ ని ఓపెన్ చేసి లెటర్ ని బయటకు తీయబోయింది. అప్పుడే, క్లాస్ చెప్పటానికి వచ్చిన లెక్చరర్ — "సౌమ్య... బయటేం చేస్తున్నావ్?" అని అనటంతో తుళ్ళిపడి సడెన్ గా ఏమీ తోచక చేతిలోని లెటర్ తో కంగారుగా క్లాస్ లోకి నడిచింది.
లోపల తన క్లాస్‌మేట్స్ ని చూడగానే ఆ లెటర్ ని చప్పున తన చున్నీలో దాచేసి తన సీట్లో కూర్చున్నాక ఎవరూ చూడకుండా జాగ్రత్తగా ఆ లెటర్ ని తన ముందరున్న పుస్తకంలో పెట్టేసింది. క్లాస్ జరుగుతున్నంతసేపూ ఆమె దృష్టంతా ఆ పుస్తకం మీదనే! ఆలోచనలన్నీ అందులోని లెటర్ గురించే!
క్లాస్ పూర్తయినా... తన స్నేహితురాళ్ళు కూడా వుంటూ ఏవేవో కబుర్లు చెప్పుతుండటంతో ఆమెకు ఆ లెటర్ ని చదవటానికి ఏకాంతంగా సమయమే దొరకలేదు. దాంతో, ఇంటికి వెళ్ళాక చదవటం మేలని నిశ్చయించుకొని కాలేజీ నుంచి బయలుదేరింది.


~~~

వడివడిగా అడుగులేస్తూ ఇంట్లోకి అడుగుపెట్టింది సౌమ్య.
ఆమె మొహం నెర్వస్ గా వుండటం చూసి వాళ్ళమ్మ షాప్ లోంచి లేచి ఆమె వెనకాలే వస్తూ — "ఏంటమ్మా... అలా వున్నావేఁ! ఏమైంది?" అని అడిగింది కాస్త కంగారుగా.
ఆ లెటర్ విషయం చెప్పి తన తల్లిని అనవసరంగా ఆందోళనకు గురి చెయ్యటం మంచిది కాదని భావించి, "ఏం లేదమ్మా...! జస్ట్ కొంచెం తలనొప్పిగా వుంది. అంతే!" అంది.
తన బ్యాగ్ ని స్టడీ టేబిల్ మీద పెట్టేసి పెదాలపై చిన్నగా నవ్వును పులుముకొని వాళ్లమ్మ వైపు తిరిగింది.
ఆమె తన కూతురు దగ్గరకు వచ్చి ప్రేమగా తలని నిమురుతూ, "అనవసరమైన విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించకు, తలనొప్పి తగ్గిపోతుంది," అంది.
నిన్న జరిగినదాని గురించి తన తల్లి ప్రస్తావిస్తున్నదని అనిపించింది సౌమ్యకి. మౌనంగా తలాడించింది.
"వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రా... ఈలోగా నీకోసం వేడి వేడి కాఫీ చేసి తీసుకొస్తాను. నీ తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది!" అని వంటగది వైపు నడిచిందా పెద్దావిడ.


~~~

కాసేపటి తర్వాత తన తల్లి ఇచ్చిన కాఫీని సిప్ చేస్తూ స్టడీ టేబిల్ దగ్గరకు వెళ్ళ తన బ్యాగ్ ఓపెన్ చేసి లెటర్ పెట్టిన పుస్తకాన్ని బయటకు తీసింది. ఎందుకో ఆమె చెయ్యి సన్నగా వణికింది.
ఒకసారి వెనక్కి తిరిగి తన తల్లి ఎక్కడుందా అని చూసింది. ఆవిడ మళ్ళా షాప్ దగ్గరికి వెళ్ళిపోవటంతో లెటర్ ని పుస్తకంలోంచి తీసింది. గుండె చప్పుడు చెవులకు వినిపిస్తుండగా లెటర్ ని ఓపెన్ చేసి చదవ నారంభించింది.

.
.

సౌమ్య...

నేనెప్పుడూ అనుకోలేదు — ఇలాంటి ఒకరోజు నా జీవితంలోనూ వస్తుందని... నా మనసు కూడా ఈ విధంగా స్పందిస్తుందని.!

నిన్నటివరకు నేనిలా లేను. లైఫ్ ఎటు తీసుకుపోతే అటు మొండిగా దూసుకుపోయాను. నా వృత్తిని తప్ప వ్యక్తిగత జీవితాన్ని నేనెన్నడూ సీరియస్ గా తీసుకోలేదు. ఎవరినీ ప్రేమించలేదు. ఎవరి ప్రేమ కోసమూ తపించలేదు. ఇప్పటివరకూ నా జీవితంలో అన్నీ రాత్రికి మొదలై పొద్దున్న ముగిసిపోయిన వ్యవహారాలే! ఒకవేళ నానుంచి ఇతరులు పొందినదంటూ ఏమైనా వుందా అంటే అది కేవలం బాధనే! అయితే, మొదటిసారిగా — నేనూ ఆ బాధను అనుభవించాను, నీ వల్ల! నిజానికి... బాధ కూడా సంతోషానికి కారకమవుతుందని నీ వల్లనే నాకు తెలిసింది. అందుకు నీకు థాంక్స్ చెప్పాలి!

నిన్ను కలిశాక నా మనసు తీరులో ఎంతో మార్పు. నీ పరిచయం — ఇన్నేళ్ళుగా నా మనసుని కప్పేసిన ముసుగుని తొలగించి నన్ను నాకు తేటతెల్లం చేసింది.

నిన్ను విడిచి వచ్చినప్పటినుంచీ నాలో ఏదో తెలీని వెలితి!
పదేపదే నువ్వు... నీ మాటలు గుర్తుకొచ్చి పశ్చాత్తాపాన్ని మించిన భావమేదో గుండెను మెలిపెడుతుంటే తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఆ సమయంలో నీ చిరునవ్వు నా జ్ఞాపకంలో లిప్తకాలం మెదిలి నా మనసుకు కొత్త వూపిరిలూదింది.
ఆ క్షణం నాకు అర్ధమైంది. నా జీవితానికి సరికొత్త నిర్వచనం నువ్వని... నీ చిరునవ్వని...!

ఒక్కసారిగా అంపశయ్య మీంచి అమ్మ ఒడిలోకి మారినట్టు ఆ క్షణం వరకూ నా గుండెల్లో పరుచుకొన్న అలజడంతా ఆవిరై అవ్యక్తమైన ఆనందపు అలికిడితో మనసంతా నిండిపోయింది.

వెంటనే నిన్ను కలవాలని, నాలో కలిగిన భావాలను నీతో పంచుకోవాలని నా మది ఎంతో తహతహలాడింది. కానీ, నీ ముందుకు రావాలంటే నాలో బెరుకు... భయం! అందుకే, నా మనస్సులోని మాటలను నీకు ఎలాగైనా వ్యక్తపరచాలనే సంకల్పంతో వుత్తరాన్ని వ్రాస్తున్నాను.

నువ్వు నాకు కావాలి సౌమ్యా!
నీ మనసుతో చెలిమి కావాలి
జీవితాంతం నీ తోడు కావాలి!
నీకు తెలియకుండానే నా హృదయంలో చిరుదీపాన్ని వెలిగించి నాలో మార్పుకి నాంది పలికావు. నువ్వు నాతో లేకపోతే మరలా అంధకారంలో మగ్గిపోయి అసలు నా ఉనికినే కోల్పోతానేమోనని బెంగగా వుంది.

మరి... నీ చేతిని నాకందిస్తావా?
'నా సౌమ్య'గా మారతావా?

ఇది నా ఫోన్ నెంబర్... ౬౫౭౮౬౯౦౦౮
నీ కాల్ కోసం ఎదురుచూస్తూ వుంటాను.

ప్రేమతో...
నీ అజయ్

.
.
.
.
లెటర్ చదవటం పూర్తి చేసిన సౌమ్య చప్పున తన కళ్ళను మూసుకుంది. ఎందుకో మనసంతా బరువెక్కిన ఫీలింగ్ ఆమెలో కలిగింది. మెల్లగా కళ్ళను తెరిచి ఆ లెటర్ ని చూసింది. ఆ లెటర్ మీద ఒక నీటి చుక్క పడివుంది; 'సౌమ్య' అన్న పేరు మీద.
ఒక్కసారి చెంపలను తడిమి చూసుకుంది. ఆమె కళ్ళలోంచి ఉబికి వస్తున్న నీరు చేతులకు వెచ్చగా తగిలింది. అప్పుడే మరో నీటి బిందువు ఆమె చెంప నుంచి జారి లెటర్ లోని 'అజయ్'ని తాకింది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
Episode 1 - by Vikatakavi02 - 07-11-2018, 11:49 PM
Episode — 2 - by Vikatakavi02 - 08-11-2018, 05:33 PM
Episode — 3 - by Vikatakavi02 - 08-11-2018, 11:12 PM
Episode — 4 - by Vikatakavi02 - 09-11-2018, 06:12 AM
Episode — 5 - by Vikatakavi02 - 09-11-2018, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 07-01-2019, 11:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 30-12-2018, 08:01 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 15-01-2019, 11:49 PM



Users browsing this thread: 113 Guest(s)