Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
ఎపిసోడ్ 126

అజయ్ తన జీప్ దగ్గరకు వెళ్ళి యూనిఫామ్ తీసేసి అక్కడే సివిల్ లోనికి మారాడు. ఆనక, ముగ్గురూ లక్కీ కార్ లో అక్కడి నుంచి బయలుదేరారు.

పది నిముషాల తర్వాత లక్కీ కార్ ఒక బంగ్లా ముందు ఆగింది‌.
"వారేవ్వా... లక్కీ!" అంటూ కార్ దిగి ఆ బిల్డింగ్ ని చూడసాగాడు అజయ్.
"మా ఎమ్మెల్యే గారిది అన్నా... ఇది బ్యాక్ గేట్ నుంచి వ్యూ. ఫ్రంట్ ఇంకా అదిరిపోతుంది. అట్నించి పార్టీ మీటింగ్ హౌస్ లా వాడుతుంటాం‌. ప్రస్తుతానికి దీని వ్యవహారాలను చూసుకునేది నేనే. పగలంతా పార్టీలో కార్యకర్తలతో, సభ్యులతో బిజీగా ఉంటుంది. చీకటి పడగానే రసిక సామ్రాజ్యంగా మారిపోతుంది."
ముగ్గురూ ఆ బంగ్లాలోకి ప్రవేశించారు.
"ఐనా నువ్వు ఇలా పుసుక్కున పోలిటిక్స్ లోకి దూరిపోతావని అస్సలు ఊహించలేదురా లక్కీ!"
"మరే... కాలేజీ టైమ్‌లో కూడా ఎప్పుడూ మీటింగ్స్ అంటే పారిపోయేవాడు!"
"హహ్హహ్హా... అప్పటికీ ఇప్పటికీ కాలం చాలా మారిపోయింది బ్రో! నేను మా నాన్నగారికి సహాయకంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో అడుగుపెట్టాక చాలామంది పెద్దోళ్ళతో కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి. కానీ పదిమందిలో ఉన్నప్పుడు పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. కేవలం సినీ స్టార్స్, పొలిటీషియన్స్ కి చాలా తక్కువ కాలంలో ఎక్కువ పబ్లిసిటీ దొరుకుతోంది అని గ్రహించాను. ఆ సమయంలోనే మన ఎమ్మెల్యేగారిని ఒక ల్యాండ్ సెటిల్మెంటు మ్యాటర్ లో మీట్ అయినప్పుడు అతనిలా నాక్కూడా బలం, బలగం, పదిమందిలో గుర్తింపు లభించాలని మొదటిసారి అన్పించింది. అందుకే, ఆయనతో మాట్లాడి పార్టీలో చేరిపోయాను. రెండేళ్లు మామూలు కార్యకర్తగా గట్టిగా పనిచేసి ఈరోజున ఈ నియోజకవర్గానికి యూత్ లీడర్ని అయ్యాను.
పైగా ఇది మా ఎమ్మెల్యేగారి స్వంత నియోజకవర్గం. అధికారపక్షం కూడా మనమే కావడంతో మనకిక ఎదురులేదిక్కడ!"

"ఆ... అది యిందాక సెంటర్లో నువ్వు గన్ తీసినప్పుడే అర్ధమైందిలేరా యూత్ లీడరూ!" అజయ్ అనగానే, "అహ్... అది మాత్రం గుర్తు చెయ్యకన్నా!" అంటూ చేతులు జోడించాడు లక్కీ!
శిరీష్, అజయ్ లు నవ్వేశారు.

***

అమలాపురంలో—

మరునాటి పరీక్ష కోసం రోజూలాగే సుజాత ఇంటికి వెళ్ళి చదువుకోవడానికి పుస్తకాలను బ్యాగ్ లో సర్దుకుంటోంది నాస్మిన్.

ఇంతలో వాళ్లమ్మ కేక వినపడింది.
"బేటీ... సుజాత వచ్చింది!"
'సుజాతా? ఇదిక్కడికి ఎందుకు వచ్చింది?' అనుకుంటూ లేచి రూమ్ లోంచి బయటకి వచ్చింది‌. 
"హాయ్!"
సుజాత తలుపు దగ్గరే నిలబడి పలకరించిందామెను.
నాస్మిన్ కాస్త అనుమానంగా ఆమెను చూస్తూ తలూపి "ఏంటే... ఇలా సడెన్ గా వచ్చావ్?" అని అడిగింది. "నేనే వచ్చేదాన్ని కదా... చదువుకోడానికి—!"
సుజాత దానికి బదులు చెప్పేలోగా బైక్ చప్పుడు వినబడి వెనక్కి చూసింది. అప్పుడే బైక్ దిగి ఇంట్లోకి వస్తున్న సామిర్ కన్పించాడు. ఆమె చప్పున పక్కకు తప్పుకుంది. సామిర్ కూడా సుజాతని చూశాడు. ఆమెపై అతనికి పీకలదాకా ఉన్న కోపమంతా అతని మొహంలో ఒక్కసారిగా ప్రతిబింబించింది. సుజాత చూపులు ఆతని మొహమ్మీద లీలగా కన్పిస్తున్న ఎర్రని మచ్చమీదకి క్షణకాలం ప్రాకి కోపంతో కణకణలాడుతున్న అతని కళ్ళని గమనించి చప్పున నేలకి వాలిపోయాయి.
 ఆమెను దాటుకుని రెండడుగులు వేసిన సామిర్ కి 'కొంచెం తగ్గరా!' అంటూ అతని స్నేహితుడు రమణ చెప్పిన హిత బోధ జ్ఞాపకం వచ్చింది. తనలో తన్నుకొస్తున్న కోపాన్ని తమాయించుకుంటూ ముఖాన్ని ప్రసన్నంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ సుజాత వైపు తిరిగాడు. 
అప్పుడే నాస్మిన్ — "సుజీ! గదిలోకి పద," అని అనడంతో సుజాత అలాగే తల దించుకుని వడివడిగా అడుగులు వేసుకుంటూ నాస్మిన్ తో పాటుగా గదిలోకి వెళ్ళింది. నాస్మిన్ గది తలుపులు వేసి సుజాత వైపుకి తిరిగి, "చెప్పు... ఏంటి విషయం?" అంటూ సుజాత మనసుని చదివినట్లు సూటిగా అడిగింది.
సుజాత ముందు కాస్త తటపటాయించి మెల్లగా, "అదీ... నువ్వు... అ-ప్పు-డు... చెప్పావు కదా! మీ— మీ...అన్నయ్యా... నన్ను...హ్హ్... నన్ను ప్రే-హ్..మిస్తున్నాడనీ... అది నిజంగా నిజమేనా—?"
సుజాత అకస్మాత్తుగా వచ్చినప్పుడే ఇలాంటిదే ఏదో అయ్యి వుంటుంది అని అనుకుంది నాస్మిన్. మధ్యలోనే కల్పించుకుంటూ ఇలా అన్నది.
"—చ్-చూడు... అప్పుడేదో చెప్పేశానుగానీ, ఇప్పుడు మా భయ్యాకి నీ మీద అలాంటిదేమీ లేదే... నువ్వూ ఆ విషయాన్ని ఇక వదిలేస్తే మంచిది. అనవసరంగా ఆశలు గట్రా పెట్టుకోకు."
ఊహించని సమాధానానికి అవాక్కయింది సుజాత! 
"అదేమిటే?" అంది వణుకుతున్న పెదాలతో.
"నీకు తెలీదే మా ఫ్యామిలీ గురించి. మా బాబా బాగా పట్టింపులు ఉన్న మనిషి. ఇలాంటివి గానీ ఉన్నాయని తెలిసిందనుకో అస్సలు ఊరుకోరు! ఎంతైనా, మీరు వేరు, మేము వేరు‌ కదా... చాలా పెద్ద సమస్య అది—!"
"అదేంటే... మరి మీ అన్నయ్య—"
"ప్చ్... సుజీ! చెప్పేది అర్ధం చేసుకోవేఁ... మా భ్-భయ్యా కూడా మా బాబా మాటకి ఎదురు చెప్పలేడు—"
"కానీ,—" అని సుజాత సామిర్ తనని ప్రేమిస్తున్నట్లు చెప్పిన మాటను గురించి చెప్పబోతుండగా, "అంతేకాక, సామిర్ కి... మ్— మా అమ్మీ తరపు బంధువులలో అమ్మాయితో నిఖా ఫిక్స్ అయ్యింది కూడా!" అని అనేసింది నాస్మిన్.
సుజాతకి షాక్ కొట్టినట్లు అయ్యింది. ఇంకేం మాట్లాడాలో అర్ధం కాలేదు. 'సామిర్ కి పెళ్ళి సంబంధం ఫిక్స్ అయిందా? మరి నాతో ప్రే-మ...!?' 
నాస్మిన్ ని ఇంకేమీ అడగాలనిపించలేదు. నిరాశగా మొహాన్ని వేలాడేసుకుని ఉండిపోయింది‌.
సుజాత మౌనంగా ఉండటంతో నాస్మిన్ కి కాస్త ధైర్యం వచ్చింది‌. ఆమె కొనసాగిస్తూ, "సుజీ... ఇదంతా మర్చిపోవే! మనకిప్పుడు ఎగ్జామ్స్ ముఖ్యం. వాటికి ప్రిపేర్ అవ్వడం ముఖ్యం. ఇంకా రెండే ఎగ్జామ్స్. అంతే! జరగని విషయాల కోసం ఆలోచించి అనవసరంగా మనసు పాడు చేసుకోకు..." అంటూ సముదాయించే ప్రయత్నం చేయ సాగింది.
సుజాతకి మొత్తం మైండ్ బ్లాంక్ అయ్యినట్లు అన్పిస్తోంది. నాస్మిన్ మాటలు కూడా ఎక్కడో దూరం నుంచి వినబడుతున్నట్లు అనిపిస్తోంది. నాస్మిన్ సుజాత చెయ్యి పట్టుకుని కదిపింది. సుజాత చప్పున తలెత్తి చూసింది.
"ఆఁ...మ్... ఇక్కడే చదువుకుంటావా, లేకపోతే మీ ఇంటికి వెళదామా?" అడిగింది నాస్మిన్. సుజాత తన ఇంట్లో ఉంటే పక్కలో బాంబుని పెట్టుకున్నట్లు ఉందామెకు. "అంటే... నువ్వు నీ బుక్స్ ఏమీ తెచ్చుకోలేదు కదా!" అంది మళ్ళా.  
సుజాత అట్టే ఆలోచించలేక అన్యమనస్కంగా తలూపింది.

***

రాజమండ్రిలో—

ముగ్గురూ బంగళా లోపలికెళ్ళి లివింగ్ రూమ్ లో కూర్చోగానే ఒక కుర్రవాడు ట్రేలో మందు, గ్లాసులు, సోడా, స్నాక్స్ తో లోనికి వచ్చాడు. ఇరవై ఏళ్ళకు అటు ఇటు ఉండవచ్చు వాడికి.

"నమస్సేయండీ సార్లూ!" అంటూ పలకరించాడు వాళ్ళని. చూడ్డానికి బాగా లేతగా వున్నాడుగానీ వాడి వాయిస్ మాత్రం ఖంగుమనిపిస్తోంది. "మా సార్ మీరొస్తన్నారని భీబత్సంగా ఎరేంజ్‌మెంట్లు చేసేశారండీ... ఆయ్!" తెచ్చిన సరుకుని టేబుల్ మీద సర్దుతూ చెప్పాడు.
లక్కీ అజయ్ తో, "నువ్వు కూడా వస్తున్నావని ముందే చెప్పి వుంటే తగిన ఏర్పాట్లు చేసేవాణ్ణి కదా బ్రో... ప్చ్!" అని నిట్టూరుస్తూ కుర్చీలోంచి ముందుకి వంగి ఆ మందుని రెండు గ్లాసుల్లో పోసి సోడా మిక్స్ చేసి అజయ్, శిరీష్ ల వైపు తోశాడు లక్కీ. ఒక గ్లాసులో కేవలం మందుని మాత్రమే పోసుకుని తన చేతుల్లోకి తీసుకుని ముందుకి చాపి, "చీర్స్ ఫర్ అవర్ గ్రాండ్ గెట్ టుగెదర్ బ్రదర్స్!" అన్నాడు.

•••

అలా పెగ్గులెత్తేస్తూ స్టఫ్ లాగిస్తూ తమ కాలేజీ రోజుల్లోకి వెళ్లిపోయారు ఆ ముగ్గురూ. శిరీష్, అజయ్ రెండు పెగ్గులు వేసేలోగా నాలుగు పెగ్గులు ఎత్తేశాడు లక్కీ. ఆ కుర్రవాడు వాళ్ళకి పెగ్గులు ఫిక్స్ చేసి ఇస్తున్నాడు.

"ఏరా యూతు కార్యదర్శి! ఏంట్రా ఆ ఆత్రం? అలా ర్రా కొడ్తూ పోయేవంటే లివర్ తేడా కొట్టేస్తాది. ఇందా సోడా పోసుకో..." లక్కీ స్పీడుని చూస్తూ అన్నాడు అజయ్.
లక్కీ అడ్డంగా చెయ్యూపి "అలా నాకు కిక్కెక్కదు బ్రో. స్స్ట్రాంగ్గానే వుండాలి!" అంటూ పల్లికిలించాడు. లక్కీ ఖాళీ గ్లాసుని తీసుకుని మరో పెగ్ మందు వేస్తూ, "ఆయ్... మా సార్ గారు ఇస్ట్రాంగ్ గానే పుచ్చుకుంటారఁడే. బోయపాటి వీరోలా మాస్... ఊర మాస్ అండీ మా సారు!" అన్నాడా కుర్రవాడు.
అజయ్ తన పెగ్గులోంచి తలని పైకెత్తి 'ఎవడ్రా ఈ భజనగాడూ?' అన్న అర్ధంలో చూడటంతో లక్కీ వెంటనే "ఏదో, మావోడికి నా మీదున్న అభిమానం బ్రదర్. వదిలేయ్!" అనేసి, ఆ కుర్రాడితో, "ఒరేయ్ సీన్డ్రాయిడూ... ఈ పనిని నాకొదిలేసి నువ్వెళ్ళి... వెళ్ళి... ఆ సీలు తీయని సరుకుల సంగతి చూడు," అన్నాడు వాడి భుజాన్ని తడుతూ. వాడు 'ఆఁయ్...!' అంటూ తలాడించి లేచి నిల్చున్నాడు.
శిరీష్ కి చిన్నగా పొలమారింది. దగ్గుతూ తన చేతిలోని గ్లాసుని టేబుల్ మీద పెట్టి లక్కీతో, "స్-స్.సీన్డ్రా— ఏమని పిలిచావ్ వాణ్ణి!" అని అడిగాడు బొంగురుగా మారిన గొంతుతో.

వెళ్ళిపోతున్నవాడల్లా ఆగి, "ఆయ్... శీన్డ్రాయిడండీ... మా సార్ గారే యెట్టారండీ,", శిరీష్ వైపు తిరిగి ఉత్సాహంగా పల్లికిలిస్తూ చెప్పాడు ఆ కుర్రవాడు. 
లక్కీ బదులిస్తూ — " అదేం లేదు బ్రో... ఈడి అసలు పేరు శీనయ్య. అంటే... ఈడు మన నియోజకవర్గంలోని యూత్ తో మందులో షోడాలా మిక్సింగ్ ఐపోయ్, ఆండ్రాయిడ్ ఫోన్ లా ఎప్పటికప్పుడు ఇలువైన అప్డేట్లు సేత్తుంటాడని... మనమే కాస్సంత యెరైటీ గా ఇలా యెట్టామన్నమాట!—"
"—ఆయ్... ఔనండే. మరీ ముక్కేంగా కాలేజీ ఆడ లేడీస్ ని కమిట్ చేయించడంలో మనం సానా ఇస్పెసల్ అండీ!" అని అన్నాడు శీనయ్య కాసింత షోకులు పోతూ!
"రేయ్... పిల్లిపిత్తిరి కబుర్లు ఆపి ఇక్కణ్ణించి దెం..య్...!" అంటూ వాణ్ణి వెళ్ళమన్నట్లు సైగ చేశాడు లక్కీ.

అప్పుడే శిరీష్ ఫోన్ కి ఏదో మెసేజ్ వచ్చింది. తీసి చూసుకుని, "ఒక కాల్ చేసుకుని వస్తాను," అంటూ లేచాడు.
లక్కీ వెంటనే లేచి, "ఆ రూమ్ లో సిగ్నల్ బావుంటుంది బ్రో!" అంటూ ఒక రూమ్ వైపు చూపించాడు. శిరీష్ ఆ రూమ్లోకి వెళ్ళాడు. లక్కీ మళ్ళా తన కుర్చీలో కూర్చోగానే అజయ్, "ఏరా లక్కీ... ఏంట్రా ఏదో కాలేజీ లేడీస్... కమిట్మెంట్లూ... అని వినబడింది!" అంటూ కళ్ళెగరేశాడు.
లక్కీ ఒకసారి బలంగా నిట్టూర్చి — 
"నీకు తెలీందేముంది బ్రో... పార్టీలో కేడర్లు, అధికారులూ అప్పుడప్పుడూ నానా యాగీ చేస్తావుంటారు. ఫండింగుల ఏర్పాటు చెయ్యడానికి చాలానే ఇబ్బంది పెడుతుంటారు. వీళ్ళలో కొందరు డబ్బులకి, మరికొందరు కాంట్రాక్టులకి, ఇంకొందరు కావల్సిన కాలేజీలలో ఆళ్ళ పిల్లా పీచుల సీట్లకీ—"
"—సొల్లొద్దు. పాయింటుకి రా!"
"అదే బ్రో... వీళ్ళలో కొంతమందికి ఆడ లేడీస్ వీక్నెస్ వుంటుంది! అలాగని కంపెనీ గార్ల్స్ మీద కాదు... నిఖార్సయిన ఫ్యామిలీ లేడీస్, కాలేజీ టీనేజీ అమ్మాయిలు కావాలి కొడుకులకి. అందుకే, మాకు చేతనైనంతలో... మన సీన్డ్రాయిడ్ గాడితో... ఏదో సెట్టింగులు... హన్నమాట!" 
అజయ్ ఒకసారి లక్కీని ఎగాదిగా చూసి, "వార్నీ... నువ్వేదో యూత్ కార్యదర్శి వనుకున్నా... మినిస్టర్ కాడ బ్రోకరీ గిరీ చేసే బూతు కార్యదర్శివన్నమాట!" అన్నాడు.
"పాలటిక్స్ లోకి వచ్చాక మడి కట్టుకు కూర్చుంటాం అంటే కుదర్తాదేటి.! అవసరాన్ని బట్టీ బొడ్లో తుపాకీనీ, బొడ్డు క్రిందకి లపాకీనీ వర్కవుట్ చెయ్యాలి. లేకపోతే... ఏ పనులు జరగవు...!" అంటూ తన గ్లాసులోని సరుకంతా ఒక్కసారిగా గొంతులోకి పోసుకున్నాడు లక్కీ. 
అంతలో శిరీష్ కాల్ మాట్లాడి హాల్లోకి వచ్చాడు.
"సారీ తమ్ముళ్ళూ... నేనిక వెళ్ళాలి."
"ఏఁ?" "ఏఁవయింది?" అజయ్, లక్కీ ఇద్దరూ అడిగారు ఆశ్చర్యంగా. 
"రేపు మా కాలేజ్లో జరిగే బోర్డ్ పరీక్షలకు సడెన్ గా నన్ను ఇంచార్జ్ ని చేశారు. ఇప్పుడున్న ఇంచార్జ్ కి యాక్సిడెంట్ అయ్యిందంట!"
"ఓస్... ఇంతేనా బ్రదరూ! నేను...న్నే... మీ బాస్ ఎవడో చెప్పు. నేను మాట్లాడేత్తాను—"
"అదేం అక్కర్లేదు లక్కీ. ఇది నా రెస్పాన్సిబిలిటీ—"
"కానీ, బ్రో...—"
"ఒరే బూతుగా...అన్ని చోట్లా నీ బోకర్ గిరీ చూపించక్కర్లేదురా. గురూ చెప్తున్నాడంటే అది కచ్చితంగా ముఖ్యమైనదే అయ్యి వుంటుంది. నువ్వెళ్ళు గురూ—"
"అది కాదు బ్రో... ఇన్నాళ్ళ తర్వాత కలిశాం. హాయిగా రాత్రంతా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే—"
"ఎంజాయ్మెంటుదేం వుందిరా. ఇక్కడే వుంటాం కదా... మళ్ళీ కలుస్తూ వుందాంలేఁ! పోనీ నీ సాటిస్ఫాక్షన్ కోసం నాకు నువ్వు ఏమేమి చెయ్యాలనుకుంటున్నావో అన్నీ అజయ్ కి చేసేయ్!" అంటూ అజయ్ తో, "నువ్వు 'నో' చెప్పకురోయ్!" అన్నాడు శిరీష్. అజయ్ తన గ్లాసెత్తి "ఓకే గురూ!" అంటూ తలూపాడు.
వాళ్ళతో కలిసి ఒక స్మాల్ పెగ్ పుచ్చుకుని శిరీష్ అక్కణ్ణించి నిష్క్రమించాడు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
Episode 1 - by Vikatakavi02 - 07-11-2018, 11:49 PM
Episode — 2 - by Vikatakavi02 - 08-11-2018, 05:33 PM
Episode — 3 - by Vikatakavi02 - 08-11-2018, 11:12 PM
Episode — 4 - by Vikatakavi02 - 09-11-2018, 06:12 AM
Episode — 5 - by Vikatakavi02 - 09-11-2018, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 07-01-2019, 11:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 15-01-2019, 11:49 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 10-10-2023, 01:14 AM



Users browsing this thread: 111 Guest(s)