Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
ఎపిసోడ్ — 117
(ముందరి ఎపిసోడ్ ఇరవై ఎనిమిదవ పేజీలో వుంది. చదవనివారు పేజీలు వెనక్కు తిప్పి చదవగలరు. ఆల్రెడీ ఆ ఎపిసోడ్ ని చదివేసినవారు క్రింది అప్డేట్ ని చదవగలరు)

సమయం రాత్రి పది గంటలు దాటింది.
సౌమ్య పెరట్లో మడత మంచమ్మీద వెల్లకిలా పడుకుని రెప్పవాల్చకుండా వినీలాకాశాన్ని వీక్షిస్తోంది.
అప్పుడే మబ్బు చాటు నుంచి బయటకొచ్చిన నెలవంక ఆమె నీలాల కన్నుల్లో తేలియాడింది. అయితే, ఆమె తలపులు ఆ చుక్కలరేడుని దాటి ప్రయాణిస్తున్నాయి. గత రెండ్రోజులుగా తన జీవితంలో జరుగుతున్న సంఘటనలు, మారుతున్న పరిణామాలు ఆమె కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి.
ఒక్కసారిగా చల్లగాలి జోరుగా వీచటంతో ఆమె చేతులు చప్పున ముడుచుకుపోయి ఆమె యదని గట్టిగా చుట్టేశాయ్. చూడ్డానికి ఆ చర్య చల్లగాలి నుంచి కాచుకోవటానికన్నట్లుగా అన్పించినా... నిజానికి, తన గుండెలమీదున్న అజయ్ ప్రేమలేఖను ఎగిరిపోకుండా ఆమె బలంగా పట్టుకుంది.
ఇప్పటికే ఆ వుత్తరాన్ని చాలాసార్లు చదివింది. చదివిన ప్రతిసారి తన మదిలో ఏదో అలజడి.!
చిత్రమేమిటంటే... ముందురోజున కాఠిన్యత నిండిన అతని చర్య కన్నా ఇవాళ్టి ఈ ప్రేమలేఖ ఆమె మనసుని ఎక్కువగా కలవరపరుస్తోంది.
"ఏంటమ్మా... నిద్ర పట్టడం లేదా...!?"
ఉలిక్కిపడి తలెత్తి చూసింది సౌమ్య. తన మంచం ప్రక్కనే తన తల్లి నుంచొని వుండటం చూసి చప్పున లేచి కూర్చుంది. తన ఆలోచనలల్లో తానుండిపోయి తన తల్లి రాకను కూడా గమనించలేదామె.
ఆవిడ వచ్చి సౌమ్య ప్రక్కన కూర్చుని,
"ఏమైంది తల్లీ!?" అనడిగింది.
"ఎ-ఏమీ లేదమ్మా...! నువ్వు ఇంకా ప-పడుకోలేదా!?" అంది సౌమ్య. తన తల్లితో కళ్ళు కలపలేదామె.
సౌమ్య తలని ప్రేమగా నిమురుతూ, "నా బిడ్డ తన బాధను పంచుకోలేక లోలోన విలవిల్లాడుతుంటే నేనెలా ప్రశాంతంగా పడుకోగలను తల్లీ!" అని అన్నదా పెద్దావిడ. తన మదిలోని ఆటుపోట్లను తన తల్లి చదివిందా అని అన్పించింది సౌమ్యకి.
చప్పున తలెత్తి తన తల్లిని చూసింది. ఆవిడ కళ్ళలో సన్నని కన్నీటి పొర కదలటం ఆమెకు కన్పించింది. కంగారుగా... "అమ్మా... అయ్యో... నేను— నాకేం... బాగానే వున్నానమ్మా... జస్ట్ ఇంకా నిద్ర పట్టలేదు, అంతే!" అంది రానినవ్వుని పెదాలమీదకి తెచ్చుకుంటూ...
అది విని ఆమె తల్లి కూడ సన్నగా నవ్వింది. ఐతే, ఆ నవ్వుకు వేరే అర్ధం వుంది.
"మరి నీ కళ్లలో...అఁ...నీళ్ళెందుకు వచ్చాయి తల్లీ!?" సౌమ్య బుగ్గలని తడుముతూ అంది.
సౌమ్య కూడ తన చెంపలని ఓమాటు తడుముకుంది. 'మళ్ళా తన కళ్ళలో తడిచేరిందేఁ! ఎందుకిలా?'
అప్పుడే సౌమ్య చేతిలో వున్న కాగితాన్ని చూసి, "ఏంటమ్మా అది...!" అనంటూ దాన్ని తీసుకోవటానికి చేతిని చాచింది. అప్రయత్నంగా సౌమ్య తన చేతిని వెనక్కి తీసుకుంది.
అంతే! షాక్ కొట్టినట్లు క్షణకాలం ఇద్దరూ అలా బొమ్మల్లా వుండిపోయారు!
మరుక్షణం... సౌమ్య— "అమ్మా...!" అని అంటూ ముందుకి వాలిపోయి తన తల్లి ఒడిలో తలదాచుకుని ఏడ్వటం మొదలెట్టింది.
ఆమె తన కూతుర్ని లాలనగా తన చేతులతో చుట్టేసి భుజాన్ని మెల్లగా తట్టింది, 'మరేం పర్వాలేద'న్నట్లుగా...
సౌమ్య నెమ్మదిగా తలెత్తి, "స్-స్సారీ అ-మ్మా!" అంది.
ఆవిడ నిర్మలంగా నవ్వుతూ ప్రేమగా చూసింది. కొండంత భరోసా లభించినట్లు అన్పించింది సౌమ్యకి.
అమ్మ ప్రేమలోని మర్మం అదేగా మరి! ద్వేషించటానికి కోటి కారణాలను కనులముందు నిలిపినా నిస్వార్ధంగా తన బిడ్డలపై అనంతమైన అనురాగాన్ని కురిపించే ప్రేమమూర్తి!
తన చేతిలోని కాగితాన్ని అమ్మ చేతిలో పెట్టి ఆవిడ ఒడిలో ఒదిగిపోయి జరిగినదంతా బెక్కుతూ చెప్పేసింది సౌమ్య.
అదంతా విన్నాక ఆ వుత్తరాన్ని చూస్తూ—
"హ్మ్... లేఁమ్మా!" అంది తన కూతుర్ని.
సౌమ్య మెల్లగా లేచి కూర్చుంది. ఆవిడ సౌమ్య తలని రెండు చేతులతో పట్టుకుని ముందుకి వంగి నుదుటిని ముద్దాడింది. సౌమ్య ముఖంపై చిన్నగా నవ్వు విరిసింది.
ఆమెనలాగే పట్టుకుని "హ్మ్... ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావ్?" అని అడిగిందావిడ.
పెదాలపైనున్న నవ్వు కరిగిపోయింది సౌమ్యకి.

★★★

"రేపు సుజాత మనతో కలిసి రావటం లేదు. శంకర్ సార్ తనని డ్రాప్ చేస్తానని చెప్పారంట!"
ఆ రాత్రి సామిర్ కి పాల గ్లాసుని ఇస్తూ చెప్పింది నాస్మిన్.
'యస్... సుజాత రేపు నాతో ఒంటరిగా రావటానికి దీనితో అలా చెప్పిందన్నమాట!' అని మనసులో ఆనందపడుతూ పైకి మాత్రం మామూలుగా— "ఓహో... మరి తిరిగొచ్చేప్పుడు మనతో కలిసి వస్తుందా?" అనడిగాడు తన చెల్లిని.
అతన్ని గుడ్లురిమి చూస్తూ— "ఏమో! నేనడగలేదు," అని విసురుగా అనేసి గదిలోంచి బయటకి వెళ్ళిపోయింది నాస్మిన్.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
Episode 1 - by Vikatakavi02 - 07-11-2018, 11:49 PM
Episode — 2 - by Vikatakavi02 - 08-11-2018, 05:33 PM
Episode — 3 - by Vikatakavi02 - 08-11-2018, 11:12 PM
Episode — 4 - by Vikatakavi02 - 09-11-2018, 06:12 AM
Episode — 5 - by Vikatakavi02 - 09-11-2018, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 07-01-2019, 11:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 15-01-2019, 11:49 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 23-05-2019, 08:11 AM



Users browsing this thread: 7 Guest(s)