Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
లక్ష్మిగారు...
మీ ఆలోచన బాగుంది. కానీ, ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది చూడాలి. సరే ట్రై చేస్తాను.
రచన ఊబిలా లాగేస్తుంది అంటున్నారు. దాన్ని ఊబిలా చూడకుండా చలికాలంతో ప్రవహించే నీరు అనుకోండి. మునిగేవరకే చలి... నిండా మునిగాక ఇంకా చలేమిటి?
పెద్ద కథను వ్రాసిన మీకు చిన్న కథలు ఏమీ అడ్డు కావు. కాస్త సమయం వెచ్చించండి. ఇక్కడెవ్వలూ అప్రియులు లేరు. ముఖ్యంగా మీకు. కనుక, కథని తాయిలం వేస్తేనే సైట్లో హాయిగా అడుగుబెట్టవచ్చు అనే ఆలోచనను ప్రక్కన పెట్టి ఇంతకుముందులా కలియతిరగండి.

కమల్ కిషన్ గారూ...
కష్టపడి వ్రాస్తే ఆ కష్టం విలువ తెలుస్తుంది. ఇష్టం వచ్చినట్లు వ్రాస్తేనే చదవటం కష్టమైపోతుంది. బ్రహ్మోత్సవం సినిమాలాగా...
మీరు చెప్పాల్సింది కష్టమైనా ఇష్టపడి ఇలాగే వ్రాస్తే ఎవరికి అర్ధంకాదండీ... దానికి మళ్ళా ఒకరు ఆడిపోసుకుంటున్నారు అంటారు.
మీరన్నట్లు పాఠకులు చీలిపోలేదు. వారి అభిరుచికి తగినట్లుగా వున్న కథలకు కనెక్ట్ అవుతున్నారు.
ఉదాహరణకు నా కథలో అంజలికీ శిరీష్ కీ కలపలేదు అని మీరు కథను చదవటం మానేశాను అన్నారు. కథతో కనెక్ట్ అయిన మిగతా పాఠకులు చదివారు. అలాగని మీమీద వాళ్ళు ఎలాంటి అవాక్కులూ చవాక్కులూ వెయ్యలేదే! తర్వాత బాగా అందరినీ బతితెగించినట్లు వ్రాస్తున్నారు అని కమెంట్లు వచ్చాయి. ప్రక్కన కథల్లో అలా వ్రాస్తే... 'సూపర్' అని కమెంట్ పెట్టిన పాఠకులు వాళ్ళు. అదేమిటంటే... 'అలా పెట్టకపోతే అలిగి కథలు ఆపేస్తారు!' అంటారు.
నేను ఇప్పుడు కథ అప్డేట్ పెట్టలేకపోతున్నాను. కానీ, ఇంట్రెస్టు తగ్గి కాదు. ఎక్కువయిపోయి.... మనసులో ఉన్నదాన్ని ఇంకా బెటర్ గా ప్రెజంట్ చెయ్యాలనే ఉద్దేశ్యంతో... ఆలస్యం అవుతుందని జనాలు తిట్డినా నేను దాని గురించి మాత్రం రాజీపడను. అలాగని పాఠకులు నన్ను వదిలి వెళ్ళిపోయారు అనలేం. ఒక్క అప్డేట్ పెట్టగానే మొన్న వచ్చిన స్పందన చాలు వారి అభిమానాన్ని తెలియజెయ్యటానికి.
అలాగే, శివారెడ్డి కథ విషయానికొస్తే అందులోని కథాంశం బాగున్నా మరీ అసందర్భ శృంగారం (ఎంత కాలం కలిసి వచ్చినాసరే) అతి అయ్యినట్లు అన్పించటంతో మధ్యలోనే నేను చదవటం ఆపివేశాను. అలాగని, తక్కిన పాఠకులతో, శివారెడ్డితో నేను ఆ కథను గురించి యే గొడవ పెట్టుకోలేదే... అంతపెద్ద కథని నడిపిస్తున్నప్పుడు కొన్నింటిని చెయ్యటం అతనికి సాధ్యంకాకపోయుండొచ్చు.
అది నచ్చినవాళ్లు చదువుతారు, లేనివాళ్ళు చదవరు. అంతమాత్రాన రచయితలకి పాఠకులు చీలిపోయారు అనటం సబబు కాదు. లక్ష్మిగారు ఇన్సెస్ట్, చిన్నపిల్లలతో శృంగారం చదవరు. నేనూ అన్నిరకాల కథలూ చదువుతాను. ఎంతవరకు గ్రహించాలి, దేన్ని విడిచిపెట్టాలి అన్న విజ్ఞత కలిగివుంటే ఏ సమస్య వుండదు.
అలాగే, రచయిత(త్రి)తో... కథతో... ప్రత్యేక అనుబంధం వుంటుంది కొందరు పాఠకులకి. ఉదా|| సంధ్యాకిరణ్ గారితో మోహనా6996 — లక్ష్మి — రమేష్ రాకీ — కమల్ కిషన్... ఇలా అందరూ ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. అలాగని మిగతావాళ్ళని సంధ్యకిరణ్ పట్టించుకోరు అనలేం కదా... వారు అందరికీ సమాధానాలిస్తారు.
ఎంజాయ్ చెయ్యటానికే వచ్చాం అంటే ఆ ఎంజాయ్మెంట్ ఎంతవరకు... అనేది కూడ చూడాలి. యాడ్స్ వస్తున్నాయి కదా... 'ఆనందాన్ని ఎవరు కోరుకోరు. కానీ, ఎంత మూల్యానికీ!.' కేవలం శృంగారాన్ని ఆశించి అంటే చాలా మార్గాలు వున్నాయి. కథలు, నీలిచిత్రాలు, కార్టూన్లు... ఇలా ఎన్నో!
అలా కాకుండా మిగతా విషయాలనూ ఇక్కడ పంచుకుంటున్నాం. జాతకాల గురించీ, పుస్తకాల గురించీ... ఇది మరో రకం ఎంజాయ్మెంటు...
'బూతే కాదు... నీతి కూడ వుండాలి!' అన్న దృక్పథంతో అందరికీ ఉపయోగపడాలి... అందరినీ కలుపుకుపోవాలి... అనే సదుద్దేశంతో సైట్ ని నిర్మించారు. మిత్రులందరూ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు.
అలా కాకుండా పైకొకటి చెప్పి లోపల మరొకటి చేస్తేనే వ్యవహారం 'తిలకాష్టమహిష బంధనం' అయిపోతుంది.
కుదిరితే సహాయకంగా వుండాలి. లేదా మౌనంగా వుండాలి. అంతేగానీ, అయ్యిందానికీ కానిదానికి కయ్యాలు పెట్టుకునేవారిని గురించి ఏం చెప్తాం. (మీ గురించి కాదండీ బాబు... ఏదో కొంతమంది దూలగొండి రకాలను గురించి. మీరు కష్టం విలువ తెలిసినవారు.)


మిత్రుడు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: పారిజాతాలు(4వ కథ - "అత్తారింటికి దారేదీ") - by Vikatakavi02 - 21-05-2019, 12:48 AM



Users browsing this thread: 14 Guest(s)