11-11-2018, 11:31 PM
Episode 17
పొద్దున్న కాలేజీకు వెళ్లేటప్పుడు ఆ అక్కాచెల్లెల్ల మొహాలు మతాబుల్లా వెలిగిపోతున్నాయి. వాణీ అయితే అడిగిన వారికీ అడగనివారికీ సార్ వాళ్ళింట్లోనే అద్దెకి దిగుతున్నారని చెప్పింది.
అప్పుడే, కాలేజ్ ముందు ఓ స్కోడా అగింది. ఆ పిల్లలు అలాంటి కారును ఇంతకుముందెన్నడూ కాలేజ్ పరిసరాలలో చూడలేదు. ఇక శిరీష్ ఆ కారులోంచి దిగగానే చాలామంది అమ్మాయిల గుండె జారింది. శిరీష్ వైట్ షర్ట్ ఇంకా గ్రే ప్యాంట్ వేసుకున్నాడు. చూడటానికి చాలా స్మార్టుగా ఇంకా సెక్సీగా అనిపించాడు వాళ్ళకు.
వాణీ పరిగెత్తుకుంటూ వెళ్ళి శిరీష్ తో, "సార్, నాన్నగారు మీరుండటానికి ఒప్పుకున్నారు," అంది.
"అలాగా..!"
"అవున్సార్... మీరుంటారుగా మాయింట్లోనే...?"
శిరీష్ వాణీ మొహంలోకి చూస్తూ, "తప్పకుండా ఉంటాను, వాణీ," అన్నాడు.
"ఎంత బాగుంది ఈ కార్, ఇది మీదేనా సార్?"
శిరీష్ ఆమె భుజంమీద చెయ్యివేసి, "నాది కాదు, మనది," అన్నాడు.
వాణీ బొమ్మలా నిలబడిపోయింది. అతనన్న చిన్న మాట ఆమెమీద మంత్రంలా పనిచేసింది. ఆ క్షణంలో వాణీకి శిరీష్ ఓ సొంతమనిషిలా అనిపించాడు.
వాణీ వెంటనే లత వద్దకు పోయి ఆమె చెయ్యి పట్టుకొని బరబరా ఈడ్చుకుంటూ ఆ కార్ దగ్గరికి తీసుకుపోయింది.
"అక్కా! ఈ కార్ చూసావా.. ఎంత బాగుందో. సారుది... కాదు కాదు.. మనది."
"ఏంటీ! మనదా?"
"అవును మనదే! సార్ చెప్పారు."
లత వాణీని ఓసారి మొట్టి, "ఒసేయ్ పిచ్చీ! సారేదో సరదాగా అనుంటారు. పద first bell కొట్టేస్తారు," అంది.
కానీ వాణీ మనసులో శిరీష్ మాటలు బలంగా నాటుకుపోయాయి. తను సంతోషంగా గెంతుకుంటూ క్లాసుకు వెళ్ళింది.
★★★
శిరీష్ ఆఫీస్ రూంకి పోయి, "గుడ్ మార్నింగ్, ma'am. May I come in!" అన్నాడు.
అంజలి అతన్ని చూపులతో తడిమి, "గుడ్ మార్నింగ్! కమిన్, మిస్టర్ శిరీష్. ఎలా ఉన్నారు," అనడిగింది.
"ఏదో మీ దయ! అన్నట్టు, నాకు అద్దెకి ఇల్లు దొరికింది."
"అవునా! ఎక్కడా?"
"అదే! నిన్న చెప్పానుగా... వాణీ ఇప్పుడే వచ్చి చెప్పింది. వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారని."
"చాలా సంతోషం. మీ సామాన్లు ఎక్కడున్నాయో చెప్తే సర్దించేస్తా!"
"ప్రస్తుతానికైతే, నా కార్లో కొన్ని సామాన్లున్నాయి. అయినా, పర్లేదులేండి. I can manage. Thank you."
అప్పుడే బెల్ మోగింది.
"క్లాస్ కి టైమ్ అయింది. Excuse me, ma'am," అంటూ తన రిజిస్టర్ బుక్ ను తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు.
★★★
2nd year క్లాసులో అడుగు పెట్టేసరికి అక్కడున్న అమ్మాయిలు శిరీష్ ని తినేసేలా చూస్తున్నారు. చూడరా మరి! ఇంతమంది అమ్మాయిల మధ్య 'ఒక్క మగాడు'. అచ్చుం తారల మద్య చంద్రుడిలాగా! ఇస్త్రీ చేసిన బట్టలు, చక్కని పెర్ఫ్యూమ్, ఖరీదైన కారు, మెడలో ఆరేడు తులాల బంగారు గొలుసు... అబ్బా... ఏమున్నాడు! ఇంతకుముందు అక్కడ పనిచేసిన మాస్టారైతే ఓ డొక్కు సైకిల్*మీద నస్యం పీల్చుకుంటూ వచ్చేవాడు. శిరీష్ ఆ రూమ్ మొత్తం తిరిగి చూసాడు. ఓ రకమైన నిశ్శబ్దం ఆ రూంని ఆవరించింది. నిస్సందేహంగా లత అందరిలోకీ ప్రత్యేకంగా కనిపిస్తూవుంది. అందరిచూపూ అతనిమీదే ఉంది.కానీ లత మాత్రం తలదించుకొనివుంది.
"Good morning, girls! నాపేరు శిరీష్. మీ కొత్త సైన్స్ టీచరుని. ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని disciplineలో ఉంచడానికి ఎలాంటి శిక్షలయినా వెయ్యమని నాకు చెప్పారు."
అందరూ ఉత్కంఠతో అతని వైపు చూస్తున్నారు. లతనుంచి ఎలాంటి స్పందనా కనపడలేదు.
"కానీ, మిమ్మల్ని చూస్తుంటే ఆ అవసరం ఉండదని నాకనిపిస్తోంది. ఎందుకో తెలుసా?"
ఎవరూ ఏం అనలేదు.
"ఎందుకంటే, మీరంతా బాగా ఎదిగినవారు."
నేహా కన్నార్పకుండా శిరీష్ నే చూస్తూవుంది.
"అంటే మీది పరిస్థితులను అర్ధంచేసుకొని దానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన వయసు. ఒకవేళ ఎవరైనా అలా ప్రవర్తించకపోతే నేను వారిపై దండప్రయోగం చేయవలసి వుంటుంది. అర్ధమయ్యందా!"
అక్కడ అర్ధమైన వాళ్ళకి మెల్లగా లీకయ్యింది.
శిరీష్ గొంతు సవరించుకొని, "మీ అందరికీ నేను చెప్పేది సరిగ్గా అర్ధమవుతుందనే నేననుకుంటున్నాను. బుద్ధిగా చదువుకుంటాం అనుకుంటే అందరికీ మంచిది. లేదంటే నా దగ్గర ఎలాగూ దండం రెడీగా ఉంటుంది. అందుకని కాలేజ్లో ఉన్నంతవరకు మిగిలిన విషయాలు పక్కన పెట్టి చదువుమీద మనసు లగ్నం చేయండి—"
అంతలో ప్యూన్ వచ్చాడు. "సార్! మీనాక్షి మేడంగారు ఆశాలతని తీసుకురమ్మన్నారు,"
అప్పటివరకూ దించి వుంచిన తలను చప్పున పైకెత్తింది లత.
శిరీష్ ఆమె వైపు చూసి, "ఆశాలత..?" అన్నాడు.
అవునన్నట్టుగా తలూపిందామె.
"సరే! వెళ్ళు."
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK