Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
#35
Episode 13

మీనాక్షి : రేయ్! వెళ్ళి ఆవిడగారితో చెప్పు, మాస్టారుగారు మా బంగళాలో ఉంటారని. అంతపెద్ద బంగళా ఉండగా ఇంకెక్కడో ఎందుకు? వెళ్ళు.. ఆగాగు... నేనూ వస్తాను. నౌకరుకు చెప్పి ఓ గది శుబ్రం చేయించాలి... పద.
అంటూ ఆఫీస్ రూమ్ వైపు నడిచింది.

★★★
# మీనాక్షి దేవి గారి గురించి మరికొంత...
>>> ఆమెకు 38 ఏళ్ళుంటాయి. బలమైన శరీరం ఆమె సొంతం. ఇంకా commanding వాయిస్. తన మాట నెగ్గకపోయినా, తనకెవరు ఎదురెళ్ళినా ఆమె సహించలేదు. ఏమైనా అయితే చూడ్డానికి మామగారున్నారని మేడంగారి ధీమా!
>>> మీనాక్షి దేవిగారికి ఓ కూతురుంది. పేరు సరిత. తన వయసుని మించి ముదిరిపోయింది. ఇప్పటికే ఊరిలో చాలామందితో వేయించుకుంది. ప్రస్తుతం ఆ కాలేజ్ లోనే 2nd year చదువుతోంది.
★★★

మీనాక్షీ మేడం అలా వెళ్ళగానే —
నేహా: అవునే లతా! మీ చిన్నానగారి ఇంటి డాబామీద రెండు గదులు ఖాళీగా ఉన్నాయనుకుంటాను. మన సారుని మీ యింట్లో ఉండమని నువ్వడగవచ్చుగా!
లత: అడగచ్చనుకో... కానీ-
నేహా: కానీ గీనీ లేదే! ఈవిడగారింట్లో సార్ లాంటివారు ఇమడలేరు. అందుకే నువ్వోసారి అడుగు. లేట్ చేస్తే సార్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా అయిపోద్ది.
లత: అవేం మాటలే బాబు. అయినా... బాబాయ్ కూడా ఒప్పుకోవాలిగా..!
నేహా: ఆయన సంగతి తర్వాత చూడొచ్చు గానీ, ముందు పద! సార్ ఎక్కడున్నారో వెతుకుదాం. లే.. త్వరగా... ఇలా చేస్తే ఆయనకూడా నీ తప్పుని క్షమించేస్తారులే!

నేహా లతని ఓ బొమ్మలా ఈడ్చుకుంటూ ఒక్కో క్లాసూ వెదకసాగింది. ఇక లత తన ఆలోచనలో తానుంది. 'ఇలా చేస్తే సార్ తనని క్షమిస్తారా? ఒకవేళ సార్ ఒప్పుకున్నా బాబాయ్ ఒప్పుకోకపోతే!?' 
అలా వాళ్ళు వెదుకుతూ 1st year క్లాసుకి వచ్చేసరికి శిరీష్ పాఠం చెప్తూ కనిపించాడు. తలుపు దగ్గర వాళ్ళను చూసి శిరీష్ కుర్చీలోంచి లేచి వెళ్ళి లతతో, "ఇందాక మీపేరేదో చెప్పారండీ," అన్నాడు.
లత పెదవులు కదులుతున్నాయిగానీ ఏం వినబడలేదు.
నేహా లత చెయ్యి వదిలేసి శిరీష్ తో, "సార్.. మీకు ఇష్టమైతే వాళ్ళ చిన్నానగారింట్లో అద్దెకి ఉండొచ్చని చెప్పడానికి తను వచ్చింది. చెప్పవే!"
లతని చూసి క్లాసునుంచి బయటకు వచ్చి వింటున్న వాణీ, "అవును సార్! మీరు మాయింట్లోనే ఉండాలి," అంది ముద్దుగా.
శిరీష్ వాణీని చూసి, "నీకూ తనకీ ఏంటి సంబంధం?" అనడిగాడు.
వాణీ: తను మా లతక్క.
శిరీష్: అయితే!
వాణీ ఊరుకుండిపోయింది. ఇక్కడినుంచీ వివరించే బాధ్యత నేహా తీసుకుంది.
"సార్, లతని వాళ్ళ చిన్నానగారే పెంచారు. వారి సొంతకూతురు ఈ వాణీ. లత అమ్మా నాన్నా తనకి ఐదేళ్ళున్నపుడు కరెంట్ ప్రమాదంలో చనిపోయారు, అందుకే-"
★★★
శిరీష్ కి ఆ అమ్మాయిని చూడగానే ఎక్కడో చూసినట్టుగా ఎందుకనిపించిందో ఇప్పుడర్ధమైంది. వాణీ అచ్చంగా వాళ్ళ అక్కలాగే ఉంది. కాకపోతే కాస్త చిన్నగా. కానీ ఒకటి - ఇద్దరూ ఇద్దరే!
★★★
శిరీష్: ఆ... చాలు చాలు... చెప్పింది చాలు. నేనూ ఇందాకటినుంచి అనుకుంటున్నాను ఇద్దరూ ఒకేలా ఉన్నారేంటా అని. సరే పిల్లలు, క్లాసులు అయిపోయాక అందరం మీ ఇంటికెళ్దాం.
లత: కానీ... సార్—!
శిరీష్: ఏంటి... కానీ!
లత: అదీ... బాబాయిని అడగాలి—

కానీ వాణీ మధ్యలో కల్పించుకొని, "ఏం అక్కర్లేదు, సార్. మీరొచ్చేయండి. నాన్నని నేనొప్పిస్తాను." అంది.
శిరీష్ వాణీ బుగ్గను తడుతూ, "తప్పు, అలా చేయకూడదు. మీ అమ్మానాన్నలు మనస్పూర్తిగా ఒప్పుకున్నాకే నేను అక్కడికి వస్తాను. సరేనా!" అని చెప్పాడు.
వాణీ: ఓకే సార్, Thank you.

★★★

ఆరోజు లాస్ట్ బెల్ కొట్టగానే శిరీష్ తిన్నగా ఆఫీస్ రూం చేరుకున్నాడు. అంజలి దేనిగురించో తీవ్రంగా ఆలోచిస్తూవుంది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
Episode 1 - by Vikatakavi02 - 07-11-2018, 11:49 PM
Episode — 2 - by Vikatakavi02 - 08-11-2018, 05:33 PM
Episode — 3 - by Vikatakavi02 - 08-11-2018, 11:12 PM
Episode — 4 - by Vikatakavi02 - 09-11-2018, 06:12 AM
Episode — 5 - by Vikatakavi02 - 09-11-2018, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 11-11-2018, 10:50 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 07-01-2019, 11:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 15-01-2019, 11:49 PM



Users browsing this thread: 16 Guest(s)