Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
Episode 103

వాణీ లోపలికి అడుగుపెడుతూనే అజయ్ తో, "అన్నయ్యా...! వచ్చి ఎంతసేపయింది...? బయట జీప్ ని చూడఁగానే నువ్వొచ్చావని తెలిసిపోయిందిలేఁ—" అంటూ అతని ప్రక్కనే వున్న ఇద్దరాడాళ్ళనీ చూసి మాట్లాడ్డం ఆపేసింది. సౌమ్య కన్నీళ్ళతో ఉండటం తను గమనించింది.
"ఓయ్... వాగుడుకాయ్... ఎన్నిసార్లు చెప్పాను నీకు... నన్ను 'అన్నయ్య' అని పిలవొద్దని... ఆఁ... ఇంకోసారి పిలిచావంటేనా... నీ పిలకలు కత్తిరించేస్తాను!" అని వేలు చూపిస్తూ కోపంగా అన్నాడు అజయ్.
వాణీ తన కాలేజ్ బ్యాగ్ ని క్రింద పడేసి అజయ్ ని చూసి వెక్కిరిస్తున్నట్టుగా తన నాలికని బయటకు చాపి, "అలాగా అన్నయ్యా... అలాగే అన్నయ్యా... ఇంకేంటి అన్నయ్యా....!" అంది నవ్వుతూ.
"ఏయ్...నిన్నూ.!" అంటూ అజయ్ వాణీని పట్టుకోవడానికి ఉరికాడు.
వాణీ కూడా కిలకిలా నవ్వుతూ, "పట్టుకో చూద్దాం...!" అని అతనికి దొరక్కుండా పరుగెత్తింది.
అదంతా చూస్తున్న సౌమ్యకి అప్రయత్నంగా నవ్వొచ్చింది. నవ్వుని బలవంతంగా ఆపుకోడానికి ప్రయత్నిస్తూ కన్నీళ్ళను తుడుచుకుని వాళ్ళని చూడసాగింది.
వాణీ అజయ్ నించి తప్పించుకోడానికి హాల్ చుట్టూ తిరుగుతూ సౌమ్య దగ్గరకు వచ్చి సడెన్ గా పరుగెత్తడం ఆపేసి, "అవునూ... అడగటం మర్చిపోయాను. వీళ్ళు ఎవరు అన్నయ్యా?" అంటూ అజయ్ ని అడిగింది.
అజయ్ కూడా ఆగిపోయాడు. ఏం చెప్పాలో ఠక్కున తోచక, "వాళ్ళూ... అ..మ్....వాళ్ళూ...నా—" అంటూ వుండగా, "మీ చుట్టాలా....?" అంది వాణీ.
చిన్నగా నవ్వి, "హా.... అలాగే అనుకో...!" అంటూ తలూపాడు అజయ్.
అప్పుడే, "మేమిక వెళ్ళిపోమా బాబూ...?" అంటూ అజయ్ ని మరలా అడిగింది ఆ పెద్దావిడ.
వాణీ వెంటనే అవిడ వంక చూస్తూ, "అరే... అలా ఎలా వెళ్ళిపోతారు.? రాక రాక వచ్చారు. కూర్చోండి, కాఫీ చేసిస్తాను. తాగుతూ అందరం చక్కగా కబుర్లు చెప్పుకుందాం..." అనేసి సౌమ్య చేతిని పట్టుకుని, "మీరు నాతో రండి!" అంటూ గుంజింది.
సౌమ్యకి వాణీని చూస్తే చాలా ముచ్చటేసింది. (సహజమేగా! ;)) తన చిలిపి పలుకులు వింటుంటే సౌమ్యకి మనసులో ఎంతో హాయిగా అనిపిస్తోంది. దాంతో, తన తల్లిని కూర్చోమని చెప్పి వాణీతో కలిసి తనూ వంటగది వైపు నడిచింది.
అప్పుడే శిరీష్ శ్రీమతి ఆశాలత కూడా ఇల్లు చేరింది. అజయ్ ఆమె దగ్గరకెళ్ళి, "గురుపత్నికి ప్రణామాలు," అంటూ బాగా వొంగి ఆమెకు నమస్కరించాడు.
లత చప్పున ఒకడుగు వెనక్కి వేసి, "అజయ్ గారూ... మీకెన్నిసార్లు చెప్పాను. ఇలా చెయ్యవద్దనీ... నేను మీకన్నా చాలా చిన్నదాన్ని!" అంది నవ్వుతూ.
"అయితే ఏంటి? నువ్వు మా గురువుగారికి అర్ధాంగివి. అంటే... అతనిలో సగభాగం అన్నమాట. మరి అతనికి నేను ఎంత గౌరవం ఇస్తానో నీకూ అంతే ఇవ్వాలి కదా...!" అన్నాడు నవ్వుతూ. నవ్వులాటగా అన్నా, శిరీష్ జీవితంలో మళ్ళా సంతోషాన్ని నింపిన ఆశాలత అంటే అజయ్ కి నిజంగానే ఎంతో అభిమానం.
"చాలు చాలు... మీతో మాట్లాడ్డం చాలా కష్టం. అవునూ... వాణీ వచ్చిందా—?" అంటూ అక్కడ సౌమ్య వాళ్ళ అమ్మను చూసి ఆగిపోయింది.
"ఆవిడ— మా... దూరపు బంధువు... అన్నమాట!" అంటూ వెంటనే లత దగ్గరకొచ్చి ఆవిడని పరిచయం చేశాడు అజయ్.
లత ఆ పెద్దావిడకి నమస్కరించింది.
ఈలోగా వాణీ కాఫీని తయారు చేసి కప్పులలో పోసి ట్రేలో పట్టుకుని సౌమ్యతో పాటూ వంటగదిలోంచి బయటకు వచ్చింది.
లతకి సౌమ్యని పరిచయం చేసి అందరికీ కాఫీలు ఇస్తూ అజయ్ దగ్గరకి వచ్చి, "అన్నయ్యా... సౌమ్యగారు అచ్చం లతక్క లాగే చాలా అందంగా వున్నారు కదా...!" కాఫీ అందిస్తూ అన్నది.
అజయ్ చప్పున తలెత్తి సౌమ్య వైపు చూసాడు. అప్పుడే ఆమె ఎందుకో మళ్ళా వంటగదిలోకి వెళ్ళింది.
అజయ్ తిరిగి తన కాఫీ పై దృష్టి మరల్చగానే వాణీ గబుక్కున అజయ్ చెవిలో, "ఏంటీ... నేను చెప్పింది నిజమే కదా!" అంటూ గొణిగింది.
అజయ్ వాణీ ముఖంలోకి చూసి 'ఏంటి?' అన్నట్టు కళ్ళెగరేశాడు. వాణీ ముసిముసిగా నవ్వుతూ వంటగదివైపు చూపించి కన్ను కొట్టింది.
ఇక అందరూ కాఫీలు ముగించాక ఆ పెద్దావిడ మళ్ళీ అజయ్ ని 'తాము వెళ్ళవచ్చా' అని అడగడంతో, "పదండి. నేను మిమ్మల్ని దిగబెడతాను," అంటూ అతను కూడా కుర్చీలోంచి లేచాడు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
Episode 1 - by Vikatakavi02 - 07-11-2018, 11:49 PM
Episode — 2 - by Vikatakavi02 - 08-11-2018, 05:33 PM
Episode — 3 - by Vikatakavi02 - 08-11-2018, 11:12 PM
Episode — 4 - by Vikatakavi02 - 09-11-2018, 06:12 AM
Episode — 5 - by Vikatakavi02 - 09-11-2018, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 07-01-2019, 11:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 23-12-2018, 08:52 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 15-01-2019, 11:49 PM



Users browsing this thread: 114 Guest(s)