23-12-2018, 05:04 PM
Episode 101
అలా ఎంతసేపు ఎదురుచూసినా సుజాత దర్శన భాగ్యం కలుగకపోవడంతో నిరాశగా తన ఇంటి దారి పట్టాడు సామిర్.
ఇల్లు చేరుకున్నాక తలుపు తెరిచే వుండటంతో, "అమ్మీ...!" అని పిలుస్తూ లోపలికి అడుగుపెట్టాడు.
వంటగదిలోంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చి తన కొడుకుని చూసి నవ్వు మొహంతో పలకరించింది.
"సామిర్ బేటా.... వచ్చేశావా...! కూర్చో, పానీ తెస్తాను...!" అంటూ అతని తలనిమిరి తిరిగి వంటింటిలోనికి వెళ్ళిపోయింది.
సామిర్ తన బ్యాగ్ ని దివాణాకాట్ మీద పడేసి గదులన్నీ కలియదిరిగాడు. ఇంట్లో మరెవ్వరూ కనపడలేదు.
'బాబా వర్క్ నుంచి ఇంకా వచ్చివుండరులేఁ... మరి ఈ నాస్మిన్ ఎక్కడికి పోయింది? తన కాలేజ్ కూడ అయిపోయిందిగా?' అనుకుంటూ అప్పుడే మంచినీళ్ళు పట్టుకొచ్చిన తన తల్లితో, "నాస్మిన్ ఏది అమ్మీ?" అనడిగాడు.
"ఏదో నోట్సు కోసం తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది. తనకీ పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా.... తెగ కంగారు పడిపోతోంది, బిచారి... ప్చ్... షుక్ర్ హే... సరిగ్గా సమయానికి వచ్చావు. ఆ పరీక్షలకు నువ్వు కాస్త దాన్ని సిద్ధం చెయ్!"
"అది నువ్వు చెప్పాలా అమ్మీ... నువ్వేం ఫికర్ కావద్దు. అంతా నేను చూసుకుంటానుగా!" అంటూ ఆమెకు భరోసా ఇచ్చాడు సామిర్. తర్వాత తన గదిలోకి వెళుతూ, 'ఒకవేళ నాస్మిన్... సుజాత దగ్గరికే వెళ్ళివుంటుందా?' అనుకున్నాడు మనసులో.
★★★
జీప్ రాజమండ్రి హైవే ఎక్కాక అజయ్ ఫోన్ రింగ్ అయ్యింది. పాణి ఫోన్ చేశాడు అనుకున్నాడు. కానీ, ఆ ఫోన్ శిరీష్ దగ్గరి నుంచి.
"హా... గురూ...!"
"ఏం టఫ్, బిజీనా?"
"హ్మ్... బిజీయా అంటే...! ఓ కేస్ పనిమీద రాజమండ్రికే వస్తున్నాను ఇప్పుడు."
"ఆహా... అయితే, ఇంటికి రా మరి!"
"చూస్తాను గురూ... కుదిరితే— అవునూ, ఏంటి ఫోన్ చేశావ్?"
"హ్మ్... ఏం లేదు. నీకు మన లక్కీగాడు గుర్తున్నాడుగా?"
"లక్కీ-యా?"
"అదేరా... మన కాలేజ్ మేట్... లక్ష్మీవరప్రసాదు— మర్చిపోయావా?"
"ఓ-హ్.. లక్కీగాడా... గుర్తున్నాడు... గుర్తున్నాడు... ఏవైంది వాడికి? కొంపదీసి పోయాడా?"
శిరీష్ చిన్నగా నవ్వుతూ, "పో-లేద్రా...ఇక్కడ తేలాడు. నిన్ననే కలిశాడు. ఇక్కడ రూలింగ్ పార్టీలో కార్యకర్తగా పని చేస్తున్నాడంట!"
"కార్యకర్తగానా? అదేంటీ... వాడు ఏదో రియల్ ఎస్టేటు వర్క్స్ చేసేవాడుగా," అంటూ సందేహం వ్యక్తం చేశాడు అజయ్.
"హ్మ్... నిజానికి నేనూ వాడితో ఇంకా డీప్ గా ఏమీ మాట్లాడలేదు టఫ్. కలిశాక వాడు ముందు నాగురించీ, నీ గురించి అడిగాడు. చెప్పాను. వాడి గురించి ఇంకా వివరాలు తెలుసుకునేలోగా ఏదో అర్జెంట్ కాల్ వచ్చిందని సడెన్ గా వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ వాడి విజిటింగ్ కార్డ్ ఇచ్చి, నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు," అని చెప్పి, మళ్ళా తనే కొనసాగిస్తూ, "ఇందాకనే ఫోన్ చేశాడు. వైజాగ్ వెళ్ళాడంట ఏదో పార్టీ మీటింగ్ వుంటే... 'రేపు తిరిగొస్తాను. తర్వాత మన ముగ్గురం పార్టీలో కలుద్దాం' అన్నాడు. ఏమంటావ్—?"
"గురూ... నాకీ పొలిటికల్ పార్టీల్లో కలిసిపోయే వుద్దేశం అయితే అస్సలు లేదు..." అన్నాడు అజయ్ వెంటనే.
శిరీష్ గట్టిగా నవ్వేస్తూ, "టఫ్.... నేను చెప్పింది ఆ పార్టీలో కలవడం గురించి కాదు. మన గెట్ టుగెదర్ పార్టీ గురించి!" అన్నాడు.
"ఓహొహో... ఆ పార్టీనా...! నేనింకా—"
"హ్మ్.... సర్లే... నీ కేసు పని అదీ పూర్తయ్యాక. వీలయితే ఓసారి ఇంటికి రా.... మర్చిపోకు!"
"అరే... నిన్ను మర్చిపోతానా గురూ... తప్పకుండా వస్తాను. వుంటా మరి..."
"హ్మ్... అలాగే..."
అజయ్ ఫోన్ పెట్టేసి బండిని ముందుకు పోనిచ్చాడు. ఫోన్ పెట్టేయగానే అజయ్ ఫోకస్ మళ్ళీ అతను వెళ్తున్న పని మీదకు షిఫ్టయిపోయింది. సిటీలోకి ఎంటరవ్వగానే జేబులో వున్న పేపర్ ని తీసి అందులో వున్న అడ్రస్సు వైపు జీప్ ని ఉరికించాడు.
పది నిముషాల తర్వాత ఒక ఇంటి ముందు బండిని ఆపాడు. ఆ ఇంటికి ముందర చిన్న కిరాణా షాప్ అటాచ్ అయి వుంది. ఆ షాప్ లో ఒక పెద్దావిడ కూర్చొని వుంది.
పో'లీ'స్ జీప్ తమ దగ్గర ఆగడంతో ఓసారి అటుగా చూసిందామె. అప్పుడే, ఇంటి లోపలినుంచి ఒకమ్మాయి బయటకు వచ్చింది.
సౌమ్య... వయసు సుమారుగా 22-23 సంవత్సరాలు వుండొచ్చు. పసిమి ఛాయతో ధగధగ మెరిసిపోతోంది. చూడగానే ఆకట్టుకునే రూపం ఆమెది. అయితే, అజయ్ ఇప్పుడు అదంతా గమనించే మూడ్ లో లేడు.
ఆమెను చూడగానే సర్రున్న జీప్ లోంచి దిగి వేగంగా ఆమె దగ్గరకు వెళ్ళి చాచి చెంపమీద లాగిపెట్టి కొట్టాడు. ఆ హటాత్పరిణామానికి తను అవాక్కయి కాస్త పక్కకి ఒరిగిపోయి మళ్ళా తిన్నగా నించుంది. చెయ్యి చెంప కంటుకుపోగా అజయ్ ని కోపంగా చూస్తూ, "ఎ-ఎవరు మీరు...—?" అంటూ అతని వెనకున్న పో'లీ'స్ జీప్ ని చూసి, "న్-నేను చ్-చెప్పాల్సిందంతా ఇందాకే మీ పో'లీ'సుకు చెప్పేశానుగా! మళ్ళీ ఏంటీ దౌర్జన్యం—?" అనబోతుండగా అజయ్, "ష్... నోర్మూసేయ్...! పో'లీ'సులంటే నాటకాలుగా వుందే నీకు? లేకపోతే యెర్రినాయాళ్ళం అనుకున్నావా? ఏది బడితే అది వాగేస్తే నమ్మేయడానికి!" అని గద్దిస్తూ అన్నాడు.
అంతలో పక్కనే కొట్టులో వున్న పెద్దావిడ వాళ్ళ దగ్గరకు వచ్చి, "ఎవరు బాబూ మీరు...? ఏంటిదంతా...?" అని కంగారుపడుతూ అడిగింది.
"మీరెవరు...?" అన్నాడు అజయ్ నిర్లక్ష్యంగా.
"తన తల్లిని బాబూ!" సౌమ్య ప్రక్కకు వచ్చి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేస్తూ అంది.
ఈలోగా కానిస్టేబల్ సప్తగిరి అక్కడికి వచ్చి 'సార్..!' అంటూ అజయ్ కి సెల్యూట్ చేసి, "ఈ చుట్టు ప్రక్కల అందరినీ ఎంక్వయిరీ చేశాను సార్... అంతా వీళ్ళ గురించి మంచిగానే చెప్పారు..." అన్నాడు.
"పైకి కనిపించనంత మాత్రాన ఏమీ లేదనుకోవడానికి లేదు. సరైన ట్రీట్‌మెంటు పడితే నిజం దానంతటదే గటగట కారుతుంది!" అంటూ సౌమ్య వైపు కొరకొరా చూసి, "జీపెక్కండి ఇద్దరూ..!" అన్నాడు.
వెంటనే వాళ్ళమ్మ, "మాకేం తెలీదు బాబూ.. మమ్మల్ని వదిలేయండి...!" అంటూ కన్నీళ్ళతో చేతులు జోడిస్తూ వేడుకుంది.
అయితే, అజయ్ ఏమాత్రం కనికరించకపోవడంతో చివరికి ఆ యిద్దరూ జీపెక్కక తప్పలేదు.
అజయ్ ఆ కానిస్టేబుల్ తో, "నువ్వు ఇక్కడే వుండు.... మ్...పాణీకి ఫోన్ చేసి ఈ నెంబర్ రీసెంట్ కాల్ డిటెయిల్స్ అన్నీ కనుక్కుని నా ఫోన్ కి వాట్సాప్ చెయ్యమను..!" అన్నాడు. ఆ కానిస్టేబుల్ 'సరేన'న్నటుగా తలూపి అతనికి మరోసారి సెల్యూట్ చేశాడు.
ఆ తర్వాత అజయ్ జీప్ స్టార్ట్ చేసి అక్కణ్ణుంచి బయలుదేరాడు. పావుగంట తర్వాత బండిని ఓ యింటి ముందు ఆపాడు. అది శిరీష్ ఇల్లు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK