Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
Episode 93

"ఏమైంది బెదరూ....?!" అజయ్ అడిగాడు. శంకర్ బదులివ్వలేదు. అతని చేతిలో వున్న ఫోన్ లోంచి, "—...అల్లుడుగారూ.... అల్లుడుగారూ.... హలో....హలో...—" అని మాటలు వినిపిస్తున్నాయి. దాన్నీ అతడు పట్టించుకోలేదు. తన ఆలోచనల్లో తాను మునిగిపోయాడు... 'అంతకుముందు చాలాసార్లు శ్రీదేవి ఇలా అమ్మ తనని పిలుస్తోందని చెప్పి మూడు నాల్గు రోజులకు వెళ్ళి వచ్చేది. ఒకసారి ఫోన్ లో, "నువ్వు మాటిమాటికి ఫోన్ చెయ్యకు.... నేనే వీలు చూసుకొని ఫోన్ చేస్తాను..!" అని తను అనడం కూడా విన్నాడు. అడిగితే, "అమ్మ.... ఫోన్ చేసింది. నాకు ఫోన్ లో ఆఫర్ వుంది కదాని తనకు చేయవద్దని నేనే చేస్తానని తనకి చెప్పాను," అని చెప్పింది. అప్పుడు తనకేమీ అనిపించలేదు... కానీ, ఇప్పుడదంతా ఆలోచిస్తుంటే బుర్రంతా పిచ్చెక్కిపోతోంది.'
అజయ్ శంకర్ భుజమ్మీద చెయ్యేసి ఊపుతూ, "బెదరూ.... ఏం జరిగింది...?" అన్నాడు మళ్ళీ. అంజలి కూడా లోపలికి వచ్చి శంకర్ వైపు ఆందోళనగా చూస్తోంది. అయితే, తలెత్తి వాళ్ళిద్దరి వైపూ చూడ్డానికి కూడా శంకర్ కి ఏదోలా వుంది. 'శ్రీదేవి.... అహ్—' తన మనసులో కూడా అలా అనుకోవటానికి అతనికి చాలా కష్టంగా వుంది.
మళ్ళా ఏదో గుర్తొచ్చి చేతిలో వున్న ఫోన్ వైపు చూశాడు. తన అత్తగారి కాల్ అప్పటికే కట్టయిపోయింది. రీసెంట్ హిస్టరీని ఓపెన్ చేసి మూడ్రోజుల క్రింద వచ్చిన కాల్స్ అన్నీ చూశాడు. ఒక నెంబరు దగ్గర అతడు ఆగిపోయాడు. దాని టైం చూసి మెల్లగా డయల్ బటన్ ప్రెస్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు.
'మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారుడు స్విచ్చాఫ్ చేసియున్నారు... దయచేసి—' అని మెసేజీ వస్తూండటంతో విసురుగా ఫోన్ ని చెవి దగ్గర నుంచి తీసేసాడు. అతని ముఖంలోని కలవరం స్పష్టంగా కన్పిస్తుంది.
అంజలి నెమ్మదిగా శంకర్ దగ్గరకు వెళ్ళి అతని భుజమ్మీద చెయ్యేస్తూ, "ఎ-ఏమైంది శంకర్...?" అంది.
"నేను కూడా ఇందాకటినుంచి అదే తెలుసుకోవాలని దొబ్బించుకుంటున్నా నిక్కడ....!" అంటూ తన అసహనాన్ని కాస్త గట్టిగా వ్యక్తం చేశాడు అజయ్. అంజలి అజయ్ ని ఆశ్చర్యంగా చూసింది.
శంకర్ ఓసారి తలెత్తి అజయ్ ని చూశాడు. అతని కళ్ళు ఎర్రబడి వుండటం అజయ్ కి కనపడింది.
"సారీ.. అజయ్... న్నేనేదో ఆలోచనల్లో వుండి—" అని శంకర్ అంటుండగా అతన్ని మధ్యలోనే ఆపేస్తూ, "అదంతా తర్వాత.... ముందు ఏం జరిగిందో చెప్పు..!" అన్నాడు అజయ్ అదే తీవ్ర స్వరంలో.
"శ్రీదేవి... తన తల్లి దగ్గరకు వెళ్తున్నానని నాతో అబద్ధం చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆరోజున తనకు వచ్చిన ఫోన్ నెంబర్ ఇది... కచ్చితంగా తను ఇప్పుడు ఈ నెంబర్ గాడి దగ్గరే వుండుంటుంది. నేను ఈ నెంబర్ కి ఇప్పుడే ట్రై చేశాను. కానీ, స్విచ్చాఫ్ అని వస్తోంది...!" అంటూ ఆ ఫోన్ ని తన ప్రక్కనే మంచమ్మీద పడేశాడు.
అజయ్ శంకర్ భుజాన్ని అదిమి పట్టుకొని, "ఓహ్.... సారీ బ్రో...! విషయం తెలీక అనవసరంగా నీమీద ఆరిచేసాను. ఏది... ఆ ఫోన్ నెంబర్... నేను కనుక్కుంటాను... ఎవరిదో...!" అంటూ శంకర్ పక్కన వున్న ఫోన్ ని తీసుకున్నాడు.
"ఇంతకీ శ్రీదేవి ఎక్కడికి వెళ్ళుంటుంది?" అంది అంజలి శంకర్ తో.
"అదే నాకూ అర్ధం కావడంలేదు...!" అంటూ తలపట్టుకున్నాడు శంకర్.
అప్పుడే శ్రీదేవి వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది శంకర్ ఫోన్ కి. శంకర్ ఫోన్ ఎత్తగానే,
"బాబూ.... నా పాపకి ఏమైంది...? నాకు చాలా కంగారుగా వుంది... నా పాప—" అని అంటుండగా శంకర్ కోపంతో వూగిపోతూ, "మీ 'పాప' మీ దగ్గరకు వెళ్తున్నానని నాకు అబద్దం చెప్పి వెళ్ళి ఇప్పటికి మూడ్రోజులైంది. తను నన్ను నమ్మించడానికి మీరని చెప్పి వేరే ఎవరితోనో మాట్లాడించింది కూడా...! అలాంటి మీ పాపకి ఏమయిందోనని మీకు కంగారుగా... బెంగగా వుందా...? తను ఎక్కడకు పోయిందో....? 'ఎవడి' దగ్గరకు....పోయిందో...? ఎందుకు పోయిందో...? తిరిగొచ్చే వుద్దేశ్యం వుందో లేదో...? అన్నీ పూర్తిగా కనుక్కొని మీకు మళ్లీ ఫోన్ చేసి చెప్తాన్లేండీ...! మీ 'పాపని' కట్టుకున్న పాపానికి నాకది తప్పదుగా....!" అని అరుస్తూ విసురుగా ఫోన్ ని కట్ చేశాడు.
సరిగ్గా ఆ సమయంలోనే సుజాత ఆ గదిలోకి అడుగుపెట్టి, "అమ్మా... సార్.... ఈ డ్రెస్ చూడండి.... బాత్రూంలో నానబెట్టి వుంది," అంది.
శంకర్ ఆ డ్రెస్సును చూడగానే గుర్తుపట్టాడు. అది శ్రీదేవి అక్కణ్ణించి ప్రయాణమయ్యినప్పుడు వేసుకున్న డ్రెస్సు. అంతేకాదు, శ్రీదేవి కోసం తను ఎంతో ఇష్టపడి కొన్న డ్రస్సు అది.
ఆ రాత్రి ఊరునుంచి తిరిగొచ్చాక శ్రీదేవి ఆ డ్రస్సుని ఉతకడానికని బాత్రూమ్ కి తీసుకుపోయి అక్కడి బకెట్లో నానబెట్టి వుంచింది. అయితే, తను తిరిగి ఆ బాత్రూంకి వెళ్ళలేదు (ఎందుకో మనందరికీ తెలుసు!). నిన్న రాత్రి దాన్ని ఎవరూ గమనించలేదుగానీ, ఇవ్వాళ సుజాత స్నానం చేస్తూండగా మరో బకెట్ లో తేలుతున్న ఈ బట్టల్ని చూసి కాస్త అనుమానం వచ్చి వాటిని తీసుకొచ్చి చూపించింది.
'ఈ డ్రెస్ ఇక్కడ వుందంటే.... శ్రీదేవి తిరిగొచ్చిందా....? తిరిగొస్తే... మళ్ళా ఎక్కడికి పోయింది...?' అనుకుంటూ అజయ్ తో అదే మాట అన్నాడు.
అదంతా వింటుంటే అజయ్ కి బుర్రంతా వేడెక్కిపోయింది. వెంటనే జేబులోంచి గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ ప్యాకెట్ ని తీసి ఒక సిగరెట్ ని నోటికందించి లైటర్ తో వెలిగించాడు. మరో జేబులోంచి తన ఫోన్ ని తీసి తన స్టేషన్ కి కాల్ చేసాడు. "హా... పాణి.... ఓ నెంబర్ చెప్తా, నోట్ చేసుకో... అదెవరిదో తెలుసుకొని అడ్రస్సు కనుక్కో... వెంటనే నాకు చెప్పు...." అంటూ ఆ ఫోన్ నెంబర్ ని ఇచ్చాడు. తర్వాత ఫోన్ ని మళ్ళా జేబులో పెట్టేస్తూ శంకర్ తో, "అది నిజంగా శ్రీదేవిగారి డ్రెస్సేనా...?" అని అడిగాడు.
"అవును... అది శ్రీదేవిదే...!"
"ఆమెకున్న అన్ని డ్రెస్సులనూ నువ్వు ఇలాగే గుర్తుపట్టగలవా...?" అంటూ గుప్పుమని పొగను వదులుతూ అడిగాడు. అంజలి ఆ పొగని భరించలేక తన కళ్ళు చిట్లిస్తూ ముఖాన్ని త్రిప్పుకుంది.
"ఏఁ... ఎందుకు—?" అంటూ విసుగ్గా అడిగాడు శంకర్.
"రేయ్...అలా మొ...లా మొహం పెట్టకుండా నేను అడిగిందానికి తిన్నగా సమాధానం చెప్పు... తిరిగి నన్ను కొషనింగ్ చెయ్యకు....!" అన్నాడు అజయ్ మళ్ళీ తన గొంతును పెంచుతూ... తనిప్పుడు ఇన్వెష్టిగేటివ్ మూడ్ లోకి మారిపోయాడు. 'ఇన్సపెక్టర్ టఫ్' ఈజ్ ఆన్ డ్యూటీ...
అజయ్ అలా తమ ముందు బూతు మాట మాట్లాడేసరికి అంజలి, సుజాత లు అవాక్కయి చిరాగ్గా అతని వంక చూశారు. అయితే, 'మిష్టర్ టఫ్' అదేమీ పట్టించుకోకుండా శంకర్ నే తీక్షణంగా చూడసాగాడు.
దాంతో, శంకర్ కూడా కాస్త తడబడుతూ, "ల్లేదు... అన్నీ గుర్తు పట్టలేను. ఈ డ్రెస్.... నా ఫెవరెట్... నిజానికి, దీన్ని నేనే కొన్నాను.... త్-తనకోసం... అందుకే—" అంటుండగా
"నీకెవరిమీదైనా అనుమానం వుందా...?" అనడిగాడు అజయ్.
"ఆ ఫోన్ చేసినవాళ్ళ మీద తప్ప... ఇంక ఎవ్వరిపైనా... లేదు...!"
అజయ్ ఆలోచిస్తూనే మరో దమ్ము లాగి వదులుతూ చప్పున అంజలి వైపు చూసి, "అన్నట్టూ...గిరీశంగారు కనపడలేదు... ఎక్కడున్నారు?" అని అడిగాడు సడెన్ గా.
"ఆయన... ఏదో డీల్ వుందని.... ఇవ్వాళ పొద్దున్నే హైద్రాబాద్ కు వెళ్ళారు... రావటానికి కనీసం రెండుమూడు రోజులు పడుతుందనన్నారు..."
ఓ క్షణం ఆగి ఇలా అడిగాడు. "అది ఏఁ డీలో మీతో ఏమైనా చెప్పారా....?"
వెంటనే, శంకర్ మంచం మీద నుంచి లేచి, "అజయ్... నా పెళ్ళాం ఎవడి దగ్గరకో వెళ్ళడానికీ గిరీశంగారి డీల్ కి సంబంధం ఏముందీ....?" అన్నాడు చిరాగ్గా.
"శంకర్...! నీకు తెలీదు... పో'లీస్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇలానే వుంటుంది. ఒక కేసును పరిష్కరించడానికి అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తుంటాం. అన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటాం. అందరినీ విచారిస్తాం. ఈ మేటర్ తేలేదాక ప్రతి ఒక్కరిపై నా దృష్టి వుంటుంది. శ్రీదేవిగారు ఎమైయ్యారో తెలిసేదాకా ఎవ్వరినీ వదిలేది లేదు. అవసరమైతే, నిన్ను కూడా విచారిస్తాను—"
"న్-నన్ను....— నేనేం చేసానని—?"
"బ్రదరూ.... ఒక విషయం చెప్పు. ఈ టూర్ కి వెళ్ళే ముందు రాత్రి నువ్వు ఓ కొత్త సిమ్ తీసుకున్నావ్... అంత అర్జంటుగా నువ్వు సిమ్ కార్డును మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ చూడు...ఈ మూడ్రోజుల్లో శ్రీదేవిగారి ఫోన్లోంచి సుమారు అరవై కాల్స్.. నీ నెంబర్ కు చేసినట్టుగా వుంది...! తను వూరెళ్ళిందని తెలిసి తను అక్కడకి చేరిందా లేదా... ఏంటీ అన్నదాని కోసమైనా నువ్వు తనకు ఫోన్ చేయలేదు. ఇక్కడ ఒక్క కాల్ నువ్వు చేసినట్టుగా లేదు. కనీసం, తీసుకున్న ఆ కొత్త నెంబర్ తో కూడా నువ్వు శ్రీదేవిగారికి ఫోన్ కి చేయలేదు....? ఏఁ....?"
అజయ్ అడిగింది విని శంకర్ మొహం ఎర్రబడింది. బదులివ్వటానికి అతనికి ఠక్కున ఏమీ తోచలేదు. తల దించుకుని నేలచూపులు చూడసాగాడు.
అజయ్ కొనసాగిస్తూ, "శంకర్.... నువ్వు కూడా శ్రీదేవిగారిని కావాలనే ఎవాయిడ్ చేశావ్. అలా ఎందుకు చేశావో నీకూ నాకూ తెలియంది కాదు," అంటూ ఓసారి అంజలి వంక చూశాడు. అంజలి కాస్త ఇబ్బందిగా మొహం పెట్టింది.
"సరే.... ఇక గిరీశంగారి గురించి ఎందుకు అడుడుతున్నానంటే.... శ్రీదేవిగారు ఇక్కడకు తిరిగొచ్చినట్టు మనకు ఈ డ్రెస్సును బట్టీ తెలుస్తోంది. ఒకవేళ తను వచ్చినప్పుడు గిరీశంగారు ఇంటిలోనే వున్నారేమోనని నా సందేహం. అంతేగానీ, ఆయనేదో చేశారని నేనడం లేదు," అని అంజలితో, "మీరోసారి గిరీశంగారికి ఫోన్ చేసి ఈ విషయాన్ని గురించి ఏదో క్యాజువల్ గా మాట్లాడుతున్నట్లు అడగండి," అనేసి మరలా శంకర్ వైపు తిరిగి, "ఇకపై మనం ప్రొసీడ్ అవ్వాలంటే, ముందు ఈ నెంబర్ ఎవరిదో తెలియాలి. దాన్ని బట్టే మనం ఏదైనా చేయగలం," అంటూ తన వాచ్ లో టైంని చూసి, "నేనిప్పుడు వెళ్తున్నాను. ఒక చిన్న పనుంది. అది చూసుకొని మళ్ళా మధ్యాహ్నం కల్లా మిమ్మల్ని కలవటానికి ట్రై చేస్తాను. ఉంటాను మరి," అని ఓసారి అందరివైపు చూసి ఆ రూంలోంచి చకచకా బయటకు నడిచాడు.

★★★

తర్వాత అంజలి తన గదిలోకి వెళ్ళి తలుపు గడియపెట్టి అజయ్ చెప్పినట్టుగా గిరీశానికి ఫోన్ చేసింది.
"హలో... ఏఁవండీ...!"
"ఆ... అంజలీ...! ఏంటీ... ఫోన్ చేశావ్?" అన్నాడు గిరీశం.
అతనిప్పుడు ధ్యవళేశ్వరంలోని దుర్గాదాస్ ఆఫీస్ గెస్ట్ రూంలో పడుకుని వున్నాడు. అంజలి ఎందుకు ఫోన్ చేసిందా అని అతనికి గుండెల్లో గుబులు మొదలైంది.
అంజలి మామూలుగా అడిగినట్లు, "ఎక్కడున్నారండీ...?" అని అడిగింది. ఆమె ఎంత వద్దనుకున్నా ఆమె గ్రొంతు సన్నగా కంపించింది. గిరీశం అది గమనించకపోలేదు.
"ఆ... పొద్దున్న చెప్పాగా... డీల్ పనిమీద హైద్రాబాద్‌ వెళ్తున్నాను.... అని.... దారిలో వున్నాను..."
"ఏఁండీ... మ్... శ్రీదేవి గానీ మీరు ఇక్కడున్నప్పుడు ఇంటికి వచ్చిందా...? అదే... మేం టూర్ వెళ్ళాకా—"
శ్రీదేవి పేరు వినపడగానే గిరీశానికి వెన్నులో వణుకుపుట్టింది. వెంటనే నుదురంతా చెమట పట్టేసింది. తడబడుతూ, "ల్...లేదే.... ఆ....అయినా... స్..శ్రీదేవిగారు పుట్టింటికి వ్-వ్వెళ్ళారని నువ్వే చెప్పావు-గా....!" అన్నాడు.
ఒకవేళ వింటోంది అజయ్ అయితే ఈపాటికే గిరీశానికి సీన్ సితారయిపోయుండేది. కానీ, అంజలి ఆతని తడబాటుపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు.
"అదే మాకూ అర్ధం కావటంలేదండీ.... శ్రీదేవి తన అమ్మగారి ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది, కానీ—ఇందాకనే తన ఫోన్ ఇంకా తను ఇక్కణ్ణుంచి వెళ్ళినప్పుడు వేసుకున్న డ్రెస్సు దొరికాయ్... ఇంకా—" అని అంజలి చెప్తూండగా గిరీశం పెద్దగా—
"హా..రి... దేవుడా....!" అని అంటూ తన గుండెలమీద చెయ్యేసుకున్నాడు.
"ఏమైందండీ.? మీకేమైనా తెలుసా..?" అంది అంజలి కంగారుగా...
"ఛ...ఛ.... ఛా...న్..నాకేం తెల్సూ...నా... బొంద....!" అంటూ కప్పిపుచ్చడానికి అన్నట్టుగా అన్నాడు గిరీశం వెంటనే.
"మరి అంత గట్టిగా అరిచారెందుకు...?" అంది అంజలి కాస్త అనుమానంగా.
"హ్... నువ్వు చెప్పింది నాకు— చాలా ఆ...ఆ..శ్చ..ర్యానికి గురిచేసిందిలే...! అవుతే, శ్రీదేవిగారు వాళ్ళమ్మగారింటి నుంచి తిరిగొచ్చి... మళ్ళీ వెళ్ళారా?" అన్నాడు గిరీశం. అతని గుండె డప్పు మాదిరి 'డమడమ' కొట్టుకుంటోంది.
"లేదండీ.... శ్రీదేవి అసలు తన అమ్మగారింటికి వెళ్ళనే లేదంట..?" అంటూ అసలు విషయాన్ని వెల్లడించింది.
"ఏంటీ...?" అన్నాడు గిరీశం వెంటనే... అతని చెయ్యి ఇంకా ఛాతీకి గట్టిగా అదిమిపెట్టి వుంది.
"శ్రీదేవిని వాళ్ళమ్మగారు అస్సలు పిలవనే లేదంటా... ఇందాకనే శంకర్ తన అత్తగారికి ఫోన్ చేస్తే ఆ విషయం తెలిసింది. మరి తను మాకు అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్ళిందో, ఏమిటో తెలీడం లేదు. అలాగే, ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ ఎటు పోయిందో కూడ అర్ధంకావటం లేదు...!"
అంతసేపూ ఏం వినాల్సి వస్తుందా అని ఊపిరి బిగపట్టి వింటున్న గిరీశం అంజలి చెప్పింది విని కాస్త రిలీఫ్ గా ఫీలయ్యాడు. ఈ రెండ్రోజులలో మొదటిసారి అతని మొహంలో సంతోషం తొణికిసలాడింది. ఓసారి గుండెలనిండా గాలిని పీల్చుకున్నాడు. ఒత్తిడంతా రివ్వున ఎగిరిపోయినట్టనిపించింది. ఆ తర్వాత అంజలితో, "అవునా....? శ్రీదేవి నిజంగా అలాంటిది అనుకోలేదే...! నేను— అదే... తను మళ్ళా ఇంటికి రావటం చూళ్ళేదు...! ఐనా.... నేను పొరుగూరిలోని పని ముగించుకుని.... మీరొచ్చేముందే ఇంటికొచ్చాను. తను అంతకుముందేమైనా వచ్చి మళ్ళా వెళ్ళిపోయిందేమో! ఆవిడగారి దగ్గరా ఇంటి మారుతాళం వుండి వుంటుందిగా....!" అన్నాడు.
"మ్.... సరేనండీ... దీని గురించి కనుక్కుందామనే ఫోన్ చేశాను. ఇక వుంటాను. హైద్రాబాద్ చేరాక ఫోన్ చేయండి...!"
"ఆ... అలాగే!" అంటూ ఫోన్ కట్చేసి ఒక్కసారి లేచి ఎగిరి గెంతేశాడు గిరీశం.
'అమ్మ శ్రీదేవీ...! నువ్వేదో పెద్ద పతివ్రతవి అనుకున్నాను.... నువ్వు కూడా లం...నే! మొగుడికి అబద్దం చెప్పి ఎవడితోనో కులకటానికి వెళ్లొచ్చావా!!! ఛ.... అనవసరంగా నీవల్ల ఇంతసేపూ ఇంత టెన్షను పడ్డాను కదే...!' అని అనుకుంటూ వెంటనే దుర్గాదాస్ కి ఫోన్ చేశాడు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
Episode 1 - by Vikatakavi02 - 07-11-2018, 11:49 PM
Episode — 2 - by Vikatakavi02 - 08-11-2018, 05:33 PM
Episode — 3 - by Vikatakavi02 - 08-11-2018, 11:12 PM
Episode — 4 - by Vikatakavi02 - 09-11-2018, 06:12 AM
Episode — 5 - by Vikatakavi02 - 09-11-2018, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 07-01-2019, 11:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 21-12-2018, 11:35 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 15-01-2019, 11:49 PM



Users browsing this thread: 43 Guest(s)