10-11-2018, 11:41 PM
Episode 10
అంజలి పరధ్యానంగా, "Come in," అని తలెత్తి చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
శిరీష్ నవ్వుతూ లోపలికి అడుగుపెట్టాడు.
అంజలి తన గుండె దడని కంట్రోల్ చేసుకుంటూ, అక్కడున్న మేడమ్ ని బయటకు పంపి శిరీష్ తో, (మెల్లగా) ఇప్పుడేం చేద్దామని ఇక్కడికి వచ్చారు. (చేతులు జోడిస్తూ) దయజేసి ఇక్కడినుంచి వెళ్ళిపోండి, ప్లీజ్!" అని వేడుకుంది.
శిరీష్: Relax, ma'am, I am here on duty. Let me introduce myself. My name is R Sireesh Naidu, and I have to join here as Science teacher. Please, let me join & oblige.
అంజలి తన కుర్చీలోంచి లేచి, "WHAT?" అని అరిచింది. ఆ 'వాట్!' అనడంలో సగం ఆశ్చర్యం సగం ఆనందం తొణికిసలాడింది. ఆమె అరుపుకి ప్యూన్ హడావుడిగా లోపలికొచ్చాడు.
అంజలికి నమ్మకం కుదరక మళ్ళీ అడగడంతో శిరీష్ అధారిటీ లెటర్ని ఆమె ముందుంచాడు.
అది చదివాక అంజలి మనసు తేలికపడింది. తన సంతోషాన్ని అదిమిపెట్టి శిరీష్ ను డ్యూటీలో జాయిన్ చేసుకుంది. తర్వాత ప్యూన్ కి క్లాస్ అటెండెన్స్ రిజిస్టరు పుస్తకాన్ని తెమ్మని చెప్పి గంభీరత్వాన్ని ప్రదర్శిస్తూ శిరీష్ వైపు తిరిగి, "మిస్టర్* శిరీష్, Heartly welcome to you. మిమ్మల్ని 1st year తరగతులకు ఇంచార్జ్ గా నియమిస్తున్నాను. కానీ, మీరు తరగతులకూ అన్నింటినీ తీసుకోవసివుంటుంది. ఇంకా, మా మేథ్స్ టీచర్ లీవులో ఉన్నారు. కనుక, మీకు కుదిరినప్పుడు వాళ్ళకు... అదే 2nd year, 3rd year తరగతులకు extra క్లాసులు తీసుకోగలరు."
శిరీష్: అలాగే, మేడమ్. కానీ, ఒక చిన్న విషయం-
అంజలి: యస్! చెప్పండి.
శిరీష్: నేనో ఒంటరి పక్షిని..అదే ఒంటరి వాడిని. ఈ ఊరిలో నేను ఉండడానికి మీరు బస ఏదైనా చూపిస్తే..బాగుంటుంది. ఒకవేళ ఇంకెవరైనా ఒంటరివాళ్ళు ఈ ఊరిలో ఉంటే వాళ్ళతో రూమ్ షేర్ చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు.
అంజలి: నేను చూస్తాను.. ఆ...ప్యూన్ కు మీకోసం ఇల్లు చూడమని చెప్తాను.
శిరీష్: (కన్ను కొడుతూ) థ్యాంక్స్, మేడమ్.
అంజలి ఇక గంభీరంగా ఉండలేక చిన్నగా నవ్వింది.
శిరీష్ ప్యూన్ తెచ్చిన రిజిస్టర్ బుక్కును తీసుకుని తరగతి వైపు నడిచాడు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK