10-11-2018, 11:28 PM
Episode 9
సరిగ్గా తెల్లవారు ఝామున అయిదు-అయిదుప్పావు గంటలకి కాకినాడ వెళ్ళే బస్సు రావటంతో ఇద్దరూ ఎక్కారు. అతనితో ఈ ప్రయాణం మరి కాసేపే అన్న ఊహే ఆమెని కలవరపరుస్తున్నది. గత రాత్రి తనకు కన్నెరికంచేసి, ఇందాక తన కన్నీళ్ళను అతనిలో దాచుకున్న ఈ వ్యక్తి గురించి తనకేం తెలుసు???
ఆఖరికి శిరీష్ నిశ్శబ్దానికి తెరదించుతూ, "ఎక్కడికి వెళ్దాం అంజూ?" అన్నాడు.
అంజలి: ఆ... అసలు మీరెక్కడ ఉంటున్నారు?
శిరీష్: ఇంకెక్కడా... (కన్నుగీటుతూ) ఇకమీదట మీతోనే!
అంజలి: (షాకై) లేదు... అది కుదరదు.
అని అడ్డంగా తలూపుతూ అంది.
శిరీష్: ఏఁ.. -?
అంజలి: నేనుండే చోట అందరికీ నేను ఒంటరిదాన్నని తెలుసు. ఇప్పుడు మీరూ నాతో వస్తే... అమ్మో..! ఇంక నా పరువంతా పోతుంది.
శిరీష్: మీ పరువునీ పరువాన్నీ నిన్న రాత్రే బాగా రుచి చూసానులేండి.
అంజలి బుగ్గమీద చిటికేసాడు.
ఆమె ముఖం నెత్తురుచుక్క లేనట్టుగా తయ్యారయింది. అప్పుడే బస్ కాకినాడ టౌనులోకి అడుగుపెట్టింది.
అంజలి వెంటనే శిరీష్ వైపు తిరిగి, "ప్లీజ్ శిరీష్..! చెప్పండి... మీరెక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు, మీ ఫోన్ నెంబర్...! ఏదో ఒకటి... చెప్పండి ప్లీజ్!" అని వేడుకున్నట్లు అడిగింది.
శిరీష్: (మళ్ళీ చిటికేసి) ఇప్పుడైతే... ఇక్కడుంటున్నాను (ఆమె ఎదవైపు చూపిస్తూ), మిమ్మల్ని ప్రేమించడమే నేను ఇక చేసే పని... ఇకనుండీ మీ ఫోన్ నెంబరే నాది కూడా...!
ఈలోగా బస్ కాంప్లెక్స్ లో ఆగింది.
అంజలి అసహనంగా, "చెప్తారా ... చెప్పరా! కనీసం కాంటాక్టు నెంబర్ అయినా ఇవ్వండి" అని అడిగింది.
కానీ, నవ్వే శిరీష్ సమాధానమైంది.
ఇద్దరూ బస్ దిగారు. అంజలి బరువెక్కిన హృదయంతో శిరీష్ ని కడసారి చూసి అమలాపురం బస్ ఎక్కింది.
ఆమె కళ్ళలో మళ్లీ నీరు ఉబికింది. బస్సు బయలుదేరాక తన పక్క సీట్లో కూర్చొనివున్న వ్యక్తిని చూసి ఆమె షాకయింది. అది శిరీష్!
అంజలికి తను చేసిన తప్పేంటో అర్ధమైంది. గుడ్డిగా ఈ మనిషిని నమ్మి తన వివరాలన్నీ చెప్పింది. తన సర్వస్వాన్ని అర్పించింది. అతను మాత్రం తన గురించిన వివరాలేవీ చెప్పట్లేదు. అలాగని తనని విడిచి వెళ్ళకుండా నీడలా వెంబడిస్తున్నాడు. ఒకవేళ తనని బ్లాక్మెయిల్ చేస్తాడా? ఆ ఆలోచన రాగానే ఆమెకు ఒంట్లో వణుకుపుట్టింది. వెంటనే తన సీట్లోంచి లేచి మరో సీట్లో కూర్చుంది.
శిరీష్ కి ఆమెలో భయం అర్ధమైంది. చటుక్కున తన సీట్లోంచి లేచి అంజలి కళ్ళుమూసి తెరిచేలోగా బస్సులోంచి దిగిపోయాడు.
అంజలి, "హమ్మయ్య !" అని ఊపిరి పీల్చుకుంది. కానీ, అతన్ని మళ్ళా చూడలేనని ఒకింత బాధపడింది. బస్సు అమలాపురం చేరగానే అక్కడినుండి ఇంటికి చేరుకుని తయారై ఏం తినకుండా అన్యమనస్కంగా తన విధులకు హాజరైంది.
ఆఫీస్ రూమ్లో ఓ మేడంతో టైం-టేబుల్ గురించి మాట్లాడుతూ మధ్యమధ్యలో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఉండగా ఎవరో తలుపు తట్టి, "Good Morning, ma'am. May I come in?" అన్నారు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK