Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
మిత్రులందరికీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
[Image: Ugadi-2017.jpg]
ఉగస్య ఆది: ఉగాది: - "ఉగ" అనగా నక్షత్ర గమనము - జన్మ - ఆయుష్షు అని అర్థాలు.  వీటికి 'ఆది' 'ఉగాది'. అనగా ప్రపంచము యొక్క జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయినది.

'యుగము' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది.  అదే సంవత్సరాది.

ఉగాది  - వసంతములకు గల అవినాభావ సంబంధము, మరియు సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపము.భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది.

[Image: ramma-chilakamma.gif]
 అచ్చమైన ప్రకృతి పండగ ఉగాది. ఇది తెలుగువారి తొలి పండుగ. ఈ రోజు నుంచే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందుకే కొత్త పనులను ఈరోజునే చాలా మంది ప్రారంభిస్తారు. ఈ రోజునే బ్రహ్మ దేవుడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త కల్పంలో సృష్టిని ఆరంభించాడని చెబుతారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి, సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే. ‘ఉగాది’ అన్న తెలుగు మాట ‘యుగాది’ అనే సంస్కృతపద వికృతి రూపం.
[Image: IMG-20190406-102531.jpg]
"లేత మామిడి ఆకుల తోరణాలు 
శ్రావ్యమైన సన్నాయి రాగాలు 
అందమైన ముగ్గులతో వీధి వాకిళ్లు 
కొత్తబట్టలతో పిల్లా పాపలు 
ఇవీ.. ఉగాది పండుగ సంబరాలు..."

ప్రకృతి పరంగానూ ఉగాదికి ఎంతో ప్రత్యేకత ఉంది. మోడువారిన చెట్లు చిగురిస్తూ, పూల పరిమళాలతో గుబాళిస్తూ పుడమితల్లిని పులకింపచేసే వసంతరుతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. అందుకే ఉగాది తెలుగు వారికి ఎంతో ముఖ్యమైన పండుగ. ఈ ఉగాదికి మనం విళంబినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శ్రీ వికారి నామ తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుతున్నాం. ఈ సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాసులు, బంధువులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతాం.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
Episode 1 - by Vikatakavi02 - 07-11-2018, 11:49 PM
Episode — 2 - by Vikatakavi02 - 08-11-2018, 05:33 PM
Episode — 3 - by Vikatakavi02 - 08-11-2018, 11:12 PM
Episode — 4 - by Vikatakavi02 - 09-11-2018, 06:12 AM
Episode — 5 - by Vikatakavi02 - 09-11-2018, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 07-01-2019, 11:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 15-01-2019, 11:49 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 06-04-2019, 10:46 AM



Users browsing this thread: 114 Guest(s)